No transcript for this section.
Transcript begins at 0:00.
[నాదస్వర సంగీతం] అంటే ముని మహర్షి కూర్చుంటే ఏమవుతుందో ఈ ప్రపంచం కొన్ని దశాబ్దాలు అనుభవించింది. ఇక అక్కడికి వచ్చినటువంటి వారిలో కేరళ దేశస్థులు అయినటువంటి నారాయణ గురువు వచ్చారు. నారాయణ గురువు నాస్తికులు. ఈ సమాజాన్ని మించి దైవం లేదు అని నమ్మినటువంటి వాడు. దాన్ని ప్రచారం చేసిన వాడు కానీ చాలా మర్యాదగా, చాలా సాపేక్షంగా, చాలా విమర్శనాత్మకంగా, "దైవం ఎక్కడుందో చూపించండి. ఈ కనిపిస్తున్న దైవం కాదా?" భాష వేరు గాని భావం మాత్రం ఒకటే. [దగ్గిన ముఖం] ఆ సందర్భంలోనే వారు వచ్చారు నారాయణ గురువు వచ్చారు. భగవాన్ దర్శనం చేసుకున్నారు. వారు ఐదు రోజులు ఉన్నారు అక్కడ. సహజ స్థితిలో వారెవరితో మాట్లాడలేదు. వీరితో కూడా మాట్లాడలేదు. శిష్యులంతా కూడా "ఈ మాట్లాడని మహర్షి దగ్గర మనం ఎందుకు వెళ్దాం?" అన్నారు. శిష్యులకి ఆవేశం వచ్చింది. ఆవేశం వస్తే గురువు కాదు. గురువు "కాస్త ఆగండి" అని ఒక తెల్ల కాగితం తీసుకుని ఐదు స్తోత్రాలు భగవాన్ రమణ మహర్షి గురించి రాసి రమణ మహర్షి దగ్గర పెట్టి ఒక నమస్కారం చేసి కేరళ దేశానికి వెళ్లిపోయినారు. వెళ్ళిన తర్వాత వారికి అనారోగ్యం కలిగింది. అనారోగ్యం కలిగి ఆ అటు ఇటుగా ఉన్నారు. ఆ సమయంలో భగవాన్ వారి జీవితంలో ఎవరి పట్ల చేయని పని ఆ రోజున చేశారు. అదేమిటంటే కుంకుమని విభూతిని రెండు పొట్లాలు తెప్పించి కుంజుస్వామి అనేటువంటి ఒక భక్తుడి చేతికిచ్చి "నారాయణ గురువు ప్రకృతిని పరమాత్మగా దర్శించిన మహా చైత్య పురుషుడు. ఆతడికి ఈ కుంకుమని విభూతిని అందించి రమ్మన"న్నారు. ఇతను వెళ్ళాడు. వెళితే నారాయణ గురువు అప్పటిదాకా పెద్దగా స్పృహలో లేని నారాయణ గురువు ఏమన్నారో తెలుసునా? "మాట్లాడితేనేమి మాట్లాడకపోతేనేమి గురువు యొక్క అనుగ్రహం ఈ రూపంలో వచ్చిందా? కుంకుమ అంటే చైతన్యము విభూతి అంటే వైరాగ్యము. వైరాగ్య విభూతులు రెండు చైతన్యం కలిపి భగవాన్ అనుగ్రహించిన ఈ ప్రసాదాన్ని నేను స్వీకరిస్తున్నాను" అన్నారు. ఎవరు? దేవుడే లేడన్నటువంటి నారాయణ గురువు. అది. అలాగే ఇవాళ స్వామి రామదాస్ శ్రీరామ నామంతో జీవితం మొత్తం కూడా గడిపాడాయన. మాములుగా మనం త్యాగరాజస్వామి వారిని తలుచుకుంటాం రామనామ జపంలో ఆయన్ని మించినవారు లేరు అని. కానీ చరిత్రని అధ్యయనం గనుక చేసినట్లయితే రామదాసు అంటే స్వామి రామదాస్ మన భద్రాచలం రామదాస్ కాదు. ఈ స్వామి రామదాసు కీర్తనలు పాడలేదు గాని రామ నామ జపాన్ని అజపం చేశాడు. ఎన్ని కోట్లు చేశాడో తెలియదు. రోమ రోమంలో అణు అణువులో కణ కణంలో రాముణ్ణి రామ నామాన్ని నింపుకున్నాడు. ఈ కారణంగా ఆయనకి శ్రీరామచంద్రమూర్తి యొక్క మూర్తి అంటే విగ్రహం బొమ్మ గుండెల్లో నిలబడిపోయింది. తత్వంలోకి వెళ్లలేకపోతున్నాడు. ఆ సమయంలో ఆయన అరుణాచలానికి చేరుకున్నారు. చేరుకుంటే "బొమ్మను దాటితే కనపడేదంతా బ్రహ్మమే కదా" అన్నారు భగవాన్. అరుణాచలం మీద కొద్ది రోజులు కూర్చొని రామనామ జపాన్ని చేస్తే అంతకు ముందు రామనామం జపం చేస్తే రాముడు కనిపించేవాడు ఇప్పుడు రామతత్వం కనిపించడం మొదలు పెట్టింది. రామతత్వం ఏమిటి? "జానాతి రామ తవ నామ రుచిమ్ మహేశో జానాతి దోర్బల పరాక్రమమిశచాపో జానత్యమోఘపటుబాణగతిప్పయోధిహి" శ్రీరాముడి యొక్క శక్తి ఎవరు చెప్పగలరు అంటే శ్రీరామ నామం తెలిసినటువంటి వాడు ఒక్కడే. ఆతడు మహేశ్వరుడు. సదాశివుడు రోజూ చేసే జపం నారాయణ మంత్రం. నారాయణుడు చేసేటువంటి మంత్రం శివ పంచాక్షరి. కనుక నారాయణలో ఉన్నటువంటి 'ర', నమశ్శివాయలో ఉన్న 'మ' రెండు కలిపితే 'రా'మైంది గనుక ఆ రామనామము శివకేశవులకు ఒక అద్వైత విభూతి గనుక "జానాతి రామ తవ నామ రుచిమ్ మహేశో" మహేశ్వరుడికి తెలుసు. "జానాతి గౌతమసతీ చరణ ప్రభావం" రాముడి యొక్క పాదముల ప్రభావం ఎవరికి తెలుసంటే ఒక్క గౌతమీ సతి. ఎవరు? అహల్యకు తెలుసు. అలాగే శ్రీరామచంద్రుడి యొక్క భుజబలం ఎవరికి తెలుసంటే శివధనుస్సును అడగండి అది చెప్తుంది. శ్రీరామ బాణం గురించి ఎవరికి తెలుసంటే సముద్రాన్ని అడగండి అని శంకర భగవత్పాదులు మనకిచ్చినటువంటి మహత్పూర్ణమైన సందేశం అది శ్రీరామ కరుణామృతంలో. అందుకని ఇక్కడ బొమ్మను దాటాలి బ్రహ్మాన్ని పట్టుకోవాలి. మనమంతా బొమ్మలమే. మట్టి బొమ్మలంగా వచ్చాం. అవతార మూర్తులు కూడా మృణ్మయ శరీరాన్నే తీసుకొని వచ్చారు. మనలాగే గర్భాలయాలు ప్రవేశించారు. పాకారు, పాడారు, ఆడారు, కూడారు, వీడారు ఒకరోజున. కానీ చైతన్యంగా నిలకడ చెందారు. ఎప్పటి రమణులు, ఇవాళ నూట నలభైయవ జన్మదినం వారు ఉన్నట్లయితే ఆ సందర్భంలో రమణ వైభవాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది రమణానుగ్రహంగా నేను భావన చేస్తున్నా. మనం అనుకుంటే జరిగేవి కావు. కనుక వారి birthday celebration ఎలా ఉండాలంటే వారి తత్వాన్ని తెలుసుకోవాలి. వారి జీవిత సంఘటనని, సందర్భాలని పునః పునః నెమరువేసుకోవాలి. దాని నుంచి ఒక చైతన్య స్ఫూర్తిని, ఆధ్యాత్మిక వివేచనాన్ని మనం పొందాలి గనుక అనేకమైన సందర్భాలలో ప్రపంచం మొత్తానికి తెలిసిన సూరి నాగమ్మ...ఆవిడ సూర్యనాగమ్మ లేఖలు చాలా ప్రశస్తంగా ఉంటాయి కానీ ఆమెన్ విద్య లేదు బాల్యవివాహం భర్త పోయినాడు అతి చిన్న వయస్సు ఆమె అన్నగారు తీసుకొచ్చి అరుణాచలంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు భగవాన్ దగ్గర ఉండు నీకు మనశ్శాంతి కలుగుతుందని ఆ సూర్యనాగమ్మే తర్వాత సూర్యనాగమ్మ లేఖలను రాసింది. ఆ లేఖల సంగతి ఎట్లా ఉన్నా జరిగింది ఏమిటి అంటే ఆమె చరమాంకంలో ఆమెకు cancer వచ్చింది భగవాన్ ఉన్నంతకాలం ఆమె భగవాన్ ని దర్శించడానికి వచ్చిన వారితో భగవాన్ ఏం మాట్లాడారో chronicle చేసేది రాసేది ఆశ్రమ వాసులు అన్నారు ఇలా రాయటానికి వీల్లేదు అన్నారు ఆమె ఏం మాట్లాడలే బయటకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి తను ఉన్నటువంటి ఇంట్లో కూర్చొని ఈ సమయంలో ఎవరో ఒకరు వచ్చి ఉంటారు వాళ్ళు ఇదేదో ప్రశ్న వేసి ఉంటారు భగవాన్ ఇలా జవాబు చెప్పి ఉంటారు ఇవి ఊహలు ఆమె రాసుకుంటూ వెళితే అవన్నీ ఎంత నిజం అంటే ఆమె అక్కడ లేదు గాని ఇక్కడ జరుగుతున్నవన్నీ ఆమెకు వినపడేవి కనపడేవి కానీ ఆమె దాన్ని claim చేయలే రాసుకుంటూ వెళ్ళింది అటువంటి ఆమె భగవాన్ birthday కి మాత్రం కౌపీనాలు తీసుకొని వచ్చేది బట్టలు పట్టడం అంటే ఆయన కట్టుకునేదే కౌపీనం. ఓ నాలుగైదు జతలు పట్టుకొచ్చేది. 1950 ఇక భగవాన్ దేహం వదిలి పెడతారు అనంగా పెద్ద queue కట్టి ఉంది ఆమె queue దాటకుండా అందరితో పాటు నుంచుంది. నుంచొని భగవాన్ దగ్గరికి వెళ్లి "ఇదిగో చివరిసారిగా బట్టలు తీసుకొచ్చాను భగవాన్" అన్నది. భగవాన్ అన్నారు "దేనికి చివర? దేనికి మొదలు? ఏది చివర? ఇది పోతుంది కానీ మొలకెత్తదా? మళ్ళీ రాదా? అది వస్తూనే ఉంటుంది. నీవు తెచ్చినవి ఈ దేహానికి అవసరం లేదు. నీవు వెంట తీసుకొని వెళ్లిపో" అన్నారు. అంటే ఒక జ్ఞాని వైరాగ్య స్థితిలో నిశ్చలంగా ఎలా ఉంటాడు అనటానికి ఇవి కొన్ని ఉదాహరణలు. సరే పాల్ బ్రంటన్ "a search in secret India" అని గుప్త భారతంలో ఉన్నటువంటి ఏమిటి ఈ దేశం ఏమిటి? ఇన్ని దండయాత్రలు జరిగినాయి. హైందవ మతం మీద ఇన్ని దాడులు జరిగినాయి. ధర్మం మీద దాడి దాడి జరిగింది. మహా ప్రవక్తలు పుట్టారు. మహాపురుషులు పుట్టారు. రాజాధిరాజులు పుట్టారు. అసలు దైవం ఎప్పుడైనా ఒక మానవ దేహం తీసుకోవాలి అనుకుంటే ఆ దేవీదేవతలు అందరూ ఎంచుకున్న ఏకైక ఖండం ఏదంటే భరత ఖండం. ఇంకెక్కడా దేవుళ్ళు రాలే, అవతార మూర్తులు రాలే, ఈ ఒక్క దేశంలోనే వచ్చారు. అయినా ఈ దేశానికి ఇంత దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడింది? కానీ దీని వెనుక ఉన్న బలం ఏమిటి తెలుసుకోవాలని ఆయన వచ్చాడు. వచ్చి చాలా చూశాడు. పాములాడించే వాళ్ళని చూశాడు, గారడీలు చేసే వాళ్ళని చూశాడు, అందర్నీ చూశాడు. కడగా కంచి మహాస్వామి వారి దగ్గరికి వచ్చాడు. చంద్రశేఖర ఇంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి. వారినే మనం మహాస్వామి అని నడిచే దేవుడని అని అందరూ అంటారు గానీ నా దృష్టిలో ఆయన నడిచే దేవుడు కాదు, నడిపించిన దేవుడు. దేవుడు ఎలాగూ నడుస్తూనే ఉంటాడు. నడిపించేవాడు కావాలి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈ పాల్ బ్రంటన్ వచ్చి కొద్ది రోజులు ఆయన దగ్గర ఉన్నారు. ఏవో ప్రశ్నలు వేయటం మొదలు పెట్టాడు, ఈయన జవాబు చెప్పటం మొదలు పెట్టారు. వినమ్రంగా పాల్ బ్రంటన్ మహాస్వామి వారితో ఏమన్నారంటే "నాకు ఇక్కడ చాలా నచ్చింది. మనసుకు హాయి ఉంది. ఇంకా పెద్దగా తెలుసుకోవాలని నాకేం అనిపించటం లేదు. దీనిని మించి ఇంకా తెలుసుకోవలసిన విషయము లేదు. కనుక నన్ను మీ దగ్గర ఉండనివ్వండి" అని అడిగాడు. అడిగితే "కాదు. ఇక్కడ నుంచి మీరు తిరువణ్ణామలై గనుక వెళ్ళినట్లయితే అక్కడ రమణ మహర్షి అని ఉంటారు. వారి దగ్గరకు వెళితే మీరు ఏ పని మీద వచ్చారో దానికి సమాధానం అక్కడ దొరుకుతుంది" అన్నారు. అయితే దానినే తర్వాత కాలంలో "a search in secret India" అంటే స్వామి సత్య సాయిబాబా వారు చాలా అందమైన మాట వాడారు. "It is not a search in secret India, It is a search in sec-sacred India. Not secret, It is a sacred India" పరమ పవిత్రమైనటువంటి భారతావని అన్నారు. పాల్ బ్రంటన్ అక్కడికి వెళ్ళటం, పాల్ బ్రంటన్ నే భగవాన్ ను అనేక ప్రశ్నలు వేయటం, భగవాన్ తో వాళ్ళిద్దరూ సాగించిన సంభాషణలన్నీ కూడా లోకోత్తరమైనటువంటివి, అహాన్ని పోగొట్టేవి, నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఒక ఆత్మస్ఫురణ కలిగించేటువంటి, దివ్యమైనటువంటి సంకేతాలు అవన్నీ. అది పాల్ బ్రంటన్. అలాగే అనేకమైన పామరులు వచ్చారు, పండితులు వచ్చారు. అనేక మంది వారి దగ్గరకు వస్తే ఇదంతా మనుషుల కథ అయితే ఒకే ఒక్క సందర్భం వారి జీవితంలో ఆ ఇందాక చెప్పినట్టుగా "ఏమీ లేదు ఊరకుండండి" అన్నారే అది మహా మంత్రం గనుక అయినట్లయితే అట్లా కాకుండా మామూలు సాధారణమైన దీక్షా గురువు వలె వారు కూడా జీవితంలో ఒక్కసారి ఒక మంత్రదీక్ష ఇచ్చారు. ఆ మంత్రదీక్ష ఏమిటి అంటే ఒక దళిత స్త్రీ చాలా ఇబ్బందులు, ప్రాపంచికమైన ఇబ్బందులు, సంసారగతమైన ఇబ్బందులు, భర్త వలన సంపాదన లేక, దారిద్య్రం వలన అనేక ఇబ్బందులు ఉ-ఉంటే ఈ రమణ మహర్షి దగ్గరికి వెళితే అన్నీ సర్దుకుంటాయి అని ఎవరో చెప్పారని విని ఆమె వచ్చి ఆ కాలంలో ఆనాటి సామాజిక పరిస్థితుల్లో ధైర్యం చేయలేక గేటు దగ్గరే ఆగిపోయింది. అదే సమయంలో భగవాన్ ఆ చెట్టు కింద గేటుకు ఎదురుగ్గా నుంచున్నారు. నుంచొని బిగ్గరగా ఒక మాట అన్నారు. ఏమనంటే "ఓం నమో నారాయణాయ" అనుకో అన్నీ సర్దుకుంటాయి అని లోపలికి వెళ్లిపోయారు. ఒక నెల అయిపోయింది. ఆమె వచ్చింది. అన్నీ పళ్ళు పూలు తీసుకొని వచ్చింది. కష్టాల నుంచి కాస్త బయటపడింది అన్నమాట. అదే సమయంలో మళ్ళీ భగవాన్ అక్కడే నుంచుని ఉన్నారు. నుంచొని ఆమె మళ్ళీ ఇదంతా నీ వల్ల ఇదేంది? నీ కారణం వల్ల ఇదేంది? అని చెప్-చెప్పక ముందే ఒకే ఒక్క మాట అన్నారు.అన్నీ సర్దుకుంటాయి కాస్త కాలానికి కూడా మనం తాడు వదిలిపెట్టాలి కష్టం రాగానే అది సమసిపోవాలని మాసిపోవాలని కాలిపోవాలని కూలిపోవాలని మనం అనుకోకూడదు కాలం అన్నింటికీ సమాధానం ఇస్తుంది సంతోషమా అన్నారు అంతే అంతే తప్ప నా అనుగ్రహం నీ మీద బ్రహ్మాండంగా కురిసింది నా వల్లనే కష్టాలు పోయాయి ఇవన్నీ ఏం చెప్పలేదు ఇవన్నీ చెప్పే గురువు కాదు ఆయన అట్లాగే ఒకసారి వారు ఇట్లాగే ఒక సాయంకాలం పూట కూర్చుని ఉంటే వారి పాదాల మీదిగా ఇరవై ఒక్క అడుగులు ఉన్నటువంటి ఒక రాజ సర్పం పాకి వెళ్తున్నది కూర్చున్న వాళ్ళందరూ భయభ్రాంతులైపోయినారు భగవాన్ అది ఎక్కడ కాటేస్తుందో లేదు అది ఎటు తిరుగుతుందో ఎవరి మధ్యలోకి వస్తుందో అని బీసుపై కూర్చున్నారు అతని దారిన అది వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత భగవాన్ ని ఒక ప్రశ్న వేశారు ఇరవై ఒక్క అడుగుల రాజ సర్పం గోధుమ వన్నె త్రాచు మీ మీదగా పాక్కుంటూ వెళ్ళింది మీకేం అనిపించింది అని అడిగారు మామూలుగా అయితే నాకేం అనిపించలేదు అవన్నీ జరుగుతూ ఉంటాయి అని దాన్ని తేలికగా కొట్టకు కొట్టివేయకుండా it was cold and moist అన్నారు చల్లగా ఉంది కొద్దిగా చెమ్మగా ఉంది అంతే అన్నారు cold and moist అంటే ఎంత దేహాతీతమైన భావనో చూడండి అలాగే ఒకరోజు అరుణాచలం మీద వారు వెళ్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ వారు ఎప్పుడూ కూడా పాదరక్షలు ధరించలేదు కాళ్ళకి చెప్పులు లేవు మిగతా భక్తులందరికీ చెప్పులు ఉన్నాయి అరుణాచలం అంటేనే మండే ఎండలు దానిమీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు కాళ్ళు బొబ్బలు ఎక్కిపోతున్నాయి భగవాన్ చక చక నడిచి వెళ్ళిపోతున్నారు ఇంతలో ఒక శిష్యుడు ఈ యాతన తట్టుకోలేక భగవాన్ మేము నడవలేకపోతున్నాం ఈ ఎండ బారి నుంచి మమ్మల్ని కాపాడండని ఒక ఏక వేశాడు అక్కడే నుంచొని మీరు రోజూ చదువుకుంటుంటారు కదా సూర్య మంత్రాన్ని సూర్యుడు రాకముందు చదువుతారు సూర్యుడు వెళ్ళాక చదువుతారు ఎందుకప్పా సూర్యుడు వచ్చిన సమయంలో చదువుకోండి అని ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళకి సూర్య మంత్రం వచ్చు చదువుకున్నారు వారు వేసిన ప్రతి అడుగు కింద ఎట్లా ఉన్నది అంటే హిమాలయ పర్వతాలలో ఉన్నంతటి చల్లదనం ఏర్పడింది అంటే మంత్రాలకి ఇన్ని మహిమలు ఉన్నాయి అని చెప్పాలని చెప్పి చెప్పక చెప్పిన సందర్భం ఇది ఇలాగే కొద్దిగా parallel గా సత్య సాయిబాబా వారిని ఒక ప్రశ్న వేశారు మంత్రాలకు నిజంగా చింతకాయలు రాలుతాయా స్వామి అని ఒకాయన అడిగాడు మంత్రాలకు చింతకాయలు రాయ-రాలటమా చింతకాయలు పట్టుటానికి మంత్రాలు ఎందుకు బంగారు గులకరాయి పెట్టు కొట్టు కాయ కింద పడుతుందన్నారు అది అంటే మనం వేసే ప్రశ్నలు అలా ఉండకూడదు మంత్రాలకి చింతకాయలు అంటే చింత అనే కాయ రాలుతుందా లేదా అని అర్థం మంత్రాలకి చింతలు తీరుతాయి అది నిజమైనటువంటి గురువు గనుక ఆ మంత్రోపదేశం చేస్తే కానీ ఈయన అటువంటివి ఏం చేయలే ఈ రెండే రెండు సందర్భాలు నిజానికి ఒకే సందర్భం ఇక ఈ కారుణ్యము ఈ ఆత్మ అంతా కూడా ఈ మనుషులు వీళ్ళ జీవితాలతోనే ముడిపడి ఉన్నదా అంటే లేనే లేదు ఆయన ఆశ్రమానికి గోవు ఒక్కటన్నా ఉండాలి అని ఒకాయన ఏం చేశాడంటే ఒక ఆవును తీసుకొని వచ్చి భగవాన్ కి సమర్పించాడు మీరు ఆశ్రమం చాలా పాలు ఇస్తుంది దేశీ ఆవు ఆ రోజుల్లో మన ఆశ్రమానికి సరిపోతుంది అని ఇస్తే భగవాన్ అన్నారు మంచిదేనప్పా నేను గడ్డి ఎక్కడ దాను పలుపు తాడు ఎక్కడ గొన్నూ నేనే అన్నీ తెచ్చుకొని నేను వస్తే మళ్ళీ దాన్ని నాకు కట్టబెడతావ్ నాకు ఇది వద్దన్నారు ఆయన కాదు మీకు మీ కోసం కాదు ఆశ్రమానికి అన్నాడు ఇచ్చాడు వెళ్ళాడు ఆ ఆవుని వాడు భగవాన్ ను ముందు తిరస్కరించిన కారణంగా తీసుకుని వెళ్ళిపోయినాడు అది సగం దూరం వెళ్ళి చెయ్యి విడిపించుకొని మళ్ళీ ఆశ్రమానికి వచ్చేసింది వచ్చి భగవాన్ దగ్గర నుంచుండి పోయిందది ఆ గోవుకి భగవాన్ పెట్టినటువంటి పేరు లక్ష్మి ఇవాళ రమణాశ్రమంలో ఉన్నటువంటి గో సంతతికి మూలమైనటువంటి మొట్టమొదటి గోవు గోవు లక్ష్మి ఆ గోవు లక్ష్మి ఎందరు ఉన్నా ఒక తండ్రి దగ్గరకు ఒక ఆడబిడ్డ ఆడపిల్ల ఎట్లా వచ్చి నిర్భయంగా తండ్రి పక్కన నుంచుంటుందో అట్లా నుంచొని మన బోటి వాళ్ళందరితో పాపా ఆయన మాట్లాడుతుంటేనో కూర్చునుంటేనో వచ్చి నాలుకతో వీపు గీకేది అది అది ఆకురాయంత పదునుగా ఉండేది రక్తం కారేంతగా ఎర్రబడిపోయేది కానీ ఏమీ కదలకుండా అలా ఉండిపోయేవారాయన భగవాన్ నన్ను పక్కకి తీసుకెళ్ళండి అని అనొచ్చు కదా అంటే అక్కర్లేదు వారు దేనికోసమో వచ్చారు వారి పని మీద వారిని ఉండనివ్వండి అన్నారు కాబట్టి ఆ గోవు చరమదశలో అంటే చరమదశకు ముందు ఓ సందర్భం జరిగింది అంటే జ్ఞాని ఈ ప్రపంచంలో ఎలా ఉంటాడు అనటానికి సర్వాత్మన ఆత్మను ఎలా ఎరిగి సంచారం చేస్తాడు అనటానికి గోశాల కట్టారు అప్పటికి నాలుగైదు గోవులు ఏర్పడ్డాయి గృహప్రవేశం చేయాలి కదా ముహూర్తం పెట్టారు భగవాన్ కి అవేం లేవు ముహూర్తాలు అవేం లేవు వెళ్ళలేదు ఆయన పనిలో ఆయన ఉన్నారు ఇది అంటే ఈ గోవు లోపలికి వెళ్ళటం లేదు ఎంత చేసినా లోపలికి అడుగు పెట్టటం లేదు ఏం చెప్పినా వినే గోవు ఆరోజు హఠం వేసింది ఆశ్రమ వాసులకు అర్థంకాలే భగవాన్ దగ్గరికి వెళ్ళి గోవు లోపలికి రావటం లేదు అని అడిగారు లోపలికి వెళ్ళే ప్రయత్నం వారి వారి ఇష్టానికి గనక వదిలిపెడితే వారే లోపలికి వెళ్తారు మనం తాడేసి లాగినా లోపలికి వెళ్తారా మీ అందరూ లోపలికి రావాలి అని ఎంత ప్రయత్నించినా మీరు రాగలుగుతున్నారా అని ఒక ప్రశ్న వేశారు మనం కూడా లోపలికి వెళ్ళం బయటకు వెళ్ళటమే మనకిష్టం కాసేపు కూడా మనం ప్రాపంచికమైన విషయాలకు దూరంగా ఉండలేని ఒక దౌర్బల్యం ఇవాళ మనకు ఆవహించింది.కనుక కొన్ని క్షణాలు పరమాత్మ భావనకి దగ్గరగా ఉండగలిగినట్లయితే ఈ సమయమంతా గడుస్తుంది గనుక వారు ఏం చేశారంటే గోవు దగ్గరికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. అదే సమయంలో గోవు కూడా భగవాన్ ని పిలుచుకోవటానికి అన్నట్లు వచ్చింది. అప్పుడు అన్నారు "ఇల్లు నీది, నీకోసం కట్టబడింది. లక్ష్మి! నీ ఇంట నీవు ప్రవేశించు" అన్నారు. అప్పుడు గోవు లోపలికి ప్రవేశించింది. అంటే పశువుగా కనిపిస్తున్న పశుపతి తత్వం దాని యందున్నది. మనం మానవులుగా కనిపిస్తున్న మనలో residual animal instincts మాత్రం పోవటం లేదు. అధ్యాత్మ జీవితం ఎందుకు? దేనికై ఇదంతా కావాలి అంటే మనల్ని మనం విడిపించుకోవాలి. ఇనప సంకెళ్ళు, వెండి సంకెళ్ళు, బంగారు సంకెళ్ళు వేసుకుంటూ ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అంటూ మనల్ని మనం పెంచుకుంటున్నాం అనుకుంటూనే మనల్ని మనం ఈ లోకంలో తుంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. వీటన్నింటినీ కూడా భగవాన్, ఆ గోవు లక్ష్మి నిజానికి ఓ అవతారమూర్తికి ఎట్లాగైతే ఒక end అనేది ఉన్నదో గోవుకు కూడా మరణ సమయం ఆసన్నమైంది. రొప్పుతున్నది, మరణయాతన పడుతున్నది, చూసే వాళ్ళకి బాధగా ఉంది. భగవాన్ ఎక్కడో అరుణాచలం పైన కూర్చుని ఉన్నారు. కానీ భగవంతుడు నిర్దయుడు కాదు, దయామయుడు. ఆయన ఆ క్షణాలు వారికి తెలుసు. ఆ సర్వజ్ఞత్వము సర్వజ్ఞత్వముతో నుంచి వచ్చింది గనుక వారు వచ్చి నేల మీద చతికిల పడిపోయారు. చతికిల పడిపోయి గోవు యొక్క తలని తన ఒళ్ళో పెట్టుకున్నారు. "అమ్మా! నేను వచ్చాను. నాకోసమే కదా ఇంత యాతన పడుతున్నావ్. ఇదిగో! నీకోసం నేను వచ్చాను." నేను అన్న పదం వాడింది ఒక్క గోవు విషయంలోనే వాడ్-వాడారు. ఆ నేను అంటే తనలో ఉన్నటువంటి ఆ ఆత్మని గోవు లక్ష్మి యందు కూడా అదే ఆత్మని దర్శనం చేశారు గనుక సమైక్యము, సాయుజ్యము రెండూ ఏకకాలంలో జరిగినాయి. కనుకనే దాని రెండు కళ్ళు చక్కగా భగవాన్ మూసి ఉద్ధారణ ఇచ్చారు అని మనకి ఆ వాంగ్మయం చెప్తూ ఉంది. ఇది మాత్రమే కాదు, కోతులు చాలా ఎక్కువగా ఉండేవి ఆ రోజుల్లో. మన బోటి వాళ్ళంతా దేవుడు అనగానే ముందొక కొబ్బరికాయ కొడతాం కదా. కొబ్బరికాయ ఎందుకు కొడతాం అంటే ఓ చమత్కారం ఉంది. సగం ఎలాగూ మనకు వస్తుంది గనుక. గుడివాడు ఇవ్వను అన్నాడనుకోండి, అరటి పండు తీసుకెళ్తాం. వాడు తుంచలేడు గనుక. కదా. కనుక వెళితే ఈ కొబ్బరి చిప్ప తీసుకుని వాడు వెళ్ళేలోగా కోతులు పట్టుకుపోయాయి. వాటికేం తిండి ఉండేది కాదు. భగవాన్ దగ్గరికి ఒక complaint ఇవ్వటానికి వచ్చారు అందరూ కలిసి. "భగవాన్! ఈ కోతుల బెడద చాలా ఎక్కువగా ఉంది. వీటన్నింటినీ కూడా ఎక్కడన్నా పట్టించి కోతులు ఆడించేవాణ్ణి, కోతుల్ని పట్టేవాణ్ణి పిలిపించి అన్నింటినీ పట్టించేద్దాం. ఎవరికీ ఇబ్బంది ఉండదు." అంటే అప్పుడు ఆయన దయాపూరితమైన స్వరంతో నెమ్మదిగా ఒక్క మాట అన్నారు. వారు ఉండే ప్రదేశానికి మనం వచ్చాం. మనం ఇవాళ వచ్చి మన అహంకారం చేత మన అనుకూలతల కోసం, మన సుఖం కోసం వాటిని బయటకు పంపాలి అంటే మనం వెళ్ళిపోవటానికి నగరాలున్నాయి, పట్టణాలున్నాయి. వారు ఎక్కడికి వెళతారు? నిజంగా భగవాన్ రమణ మహర్షి జీవితంలో రెండు మాటలు వాడలేదండి. ఒకటి వారు వాడారు. అంతేతప్ప వాడు వాడలేదు. అది వాడలేదు. ఎవరైనా వారే. ఇది ఆత్మని దర్శించిన వాడి యొక్క భావం. మనం అది వచ్చింది, ఇది వెళ్ళింది అని ఈ అది, వాడు, వీడు అనే పదాలు చాలా స్వేచ్ఛగా వాడుతాం. ఇది అవతల వాడి ఆత్మగౌరవానికి విఘాతం కలిగించే విషయాలు. ఎవరినైనా మర్యాదపూర్వకంగా ఆమె అనొచ్చు, ఆతడు అనొచ్చు. అంతేగాని వాడు, అది అనకూడదు. సరే, ఇవన్నీ వారు పాటించారు జీవితకాలంలో. వారి వైభవంలో వెలిగిపోయినటువంటి కాంతి రేఖలు ఉన్నాయి అంటే ఇవే. ఇవాళ మనం నేర్చుకోవాల్సినవి ఇవే. ఇవాళ ఏదో ధ్యానంలో కూర్చొని, యోగంలో కూర్చొని సహస్రారం దాకా వెళ్లి అక్కడేదో ఉందనుకొని దాన్ని పట్టుకొని దానికింత యాతన పడక్కర్లా. మనలో ఉన్నటువంటి మానవీయమైన దివ్య భావనని గనుక మనం గమనించుకోగలిగితే, మానవుడు మానవుడిగా జీవించగలిగితే అది నిజమైనటువంటి అధ్యాత్మ. కానీ మానవుడికి ఈ చి-ఈ చిన్న విషయం, ఇంత simple principle తెలియక ఇది కానీ ఏదో అది అయిపోవాలని, అయితే కొందరి గురువులైపోవాలని కొందరికి ఆశ అయితే కొందరికి దేవుడైపోవాలి అని ఆశ ఉంటుంది. దేవుడు కావటం లేదు. మానవుడు దేవుడే. మాధవత్వము, మానవత్వము కలబోసుకుని ఉన్నటువంటి ఈ మహోత్కృష్టమైన, ఉన్నతమైనటువంటి ఈ మానవ జన్మని అవతారమూర్తి అయినటువంటి భగవాన్ రమణులు తమ జీవితకాలంలో అందరి పట్ల-- ఒక్కసారి బరోడా మహారాణి ఆయన దగ్గరికి ఒక తెల్ల నెమలిని తీసుకొని వచ్చింది. వచ్చి "భగవాన్! ఈ తెల్ల నెమలి ఆశ్రమానికి అందం ఇస్తుంది. మీరు దాన్ని చూస్తూ చక్కగా ఆనందించవచ్చు. నేను అక్కడి నుంచి తెచ్చాను." అన్నది. భగవాన్ ఏం మాట్లాడలేదు. కారణం ఏమిటంటే అది అందరికీ ఆనందం ఇస్తుంది, ఆయన ఒక్కరికే కాదుగా. అది ఉండిపోయింది. ఉండిపోతే దానికి ఆయన పెట్టుకున్న పేరు మాధవ అని పిలిచేవారు. మాధవ అని ఓ చిన్న పిలుపు పిలవగానే ఎక్కడ ఉన్నా తెల్ల ఆ నెమలి వచ్చి వారి దగ్గర వాలిపోయేది. ఆనందంగా పురివిప్పి కాస్త నాట్యమాడి వెళ్లిపోయేది. మేఘంతో సంబంధం లేదు. సరే, అటువంటి ఒకానొక సందర్భంలో అరుణాచలంలో పెద్ద వర్షం ఏర్పడింది. ఆ వర్షం కారణంగా పైన కొబ్బరి చెట్టు మీద ఉన్నటువంటి ఒక చిన్న గుడ్డు కింద పడి అప్పటికప్పుడు పగిలి దానిలో నుంచి బిడ్డ బయటకు వచ్చింది. దాన్ని భగవాన్ చూశారు. చూసి ఒక్కసారి వానలోకి, వర్షంలోకి వెళ్లిపోయినారు. వెళ్లి తన అరచేతినిఇసుకలోకి దోపి నెమ్మదిగా ఆ పిట్టని పిల్లను బయటకు తీసి ఇసుకని జల్లించి లోపలికి తీసుకొచ్చి ఒక చిన్న కాటన్ తో చిన్న bed తయారు చేసి ఒక ఒత్తి చేసి పాల చుక్క దాని నోట్లో వేస్తూ గుడ్లో పెట్టించారు. ఇదంతా మన బోటి వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అందరి కళ్ళ ముందు జరిగిందే ఇది. ఒక అతనికి భగవాన్ ని చూస్తే చాలా బాధేసింది. జ్ఞాని, ఆత్మానుభవాన్ని పొందిన వాడు, మహాపురుషుడు ఏమిటి? అని అనుకోని ఆయన దగ్గరికి వెళ్లి భగవాన్ ఏమి అనుకోవద్దు మీకు కూడా ఈ పిల్ల ఈ గుడ్డు పగిలి పుట్టిన పిల్ల పట్ల ఇంత వ్యామోహం ఏర్పడుతున్నదా? మళ్ళీ జర భ-- జడభరతుడి స్థితి వస్తుందేమో అని వీడి వాంగ్మయ ప్రకారం వీడి తెలివితేటలతో పాపం ఆయనకు సలహా ఇచ్చాడు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, "చూడు దీనికి రెక్కలు వస్తాయి. ప్రాణిగా ఈ జగత్తులోకి వచ్చింది. ఎంతకాలం వారు ఇక్కడ ఉండవలసి ఉంట- ఉండాలో వారు ఉంటారు. రెక్కలు వచ్చిన తర్వాత వారిని ఉండమన్నా ఉండరు. వారే ఎగిరి వారి స్వస్థానానికి వారు వెళ్ళిపోతారు. ఇదిగో మీ అందరినీ కూడా గూట్లో పెట్టాలి అని నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నా, అవుతున్నదా? మేము ఎంతగా మిమ్మల్ని లోపలికి తీయాలని అనుకున్నామో మీరు అంతగా విడిపించుకుని బయటకు బలవత్తరంగా బయటికి వెళ్ళిపోతున్నారు. మనమే మన పరిస్థితే ఇట్లా ఉన్నప్పుడు ఇక వారి సంగతి ఏమున్నది?" అని close చేశారు. అంటే జీవ కారుణ్యానికి ఇవన్నీ కూడా చాలా ప్రధానమైన అంశాలు. అలాగే ఇవ్వాళ అరుణాచలం ఎట్లా ఉన్నా, భగవాన్ అరుణాచల సంచారం చేసేటప్పుడు పైన పునులు తిరుగుతూ ఉండేవి. పైన పెద్ద పెద్ద కొలనులు ఉండేవి, నీటి చెలమలు ఉండేవి. ఒకసారి పది, పదిహేను మంది భక్తులతో వెన్నెలలో అరుణాచలం మీద భగవాన్ నడిచి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే ఒక పులి గాండ్రించటం లేదు నెమ్మదిగా వచ్చి నీళ్లు తాగటానికని వచ్చింది. దానిని చూస్తూనే శిష్యుల ప్రాణాలు పైనే ఎగిరిపోయినాయి. వాళ్ళు ఏమన్నారంటే భగవాన్ "పులి, పులి, పులి" అని అరుస్తూ ఉంటే వారు "మౌనం వహించండి. వారు వారి దాహం ఆధ్యాత్మిక దాహం తీర్చుకోవటానికి వచ్చిన సత్పురుషులు. వారు ఎలా వచ్చారో అలాగే వెళతారు. వారు అంత సాత్వికంగా ఉన్నప్పుడు మనం ఇంత గగ్గోలు పెట్టవలసిన అవసరం ఉన్నదా? వారి నిశ్శబ్దాన్ని మనం భేదించటం న్యాయమేనా? మీరు మౌనం వహించండి" అన్నారు. పులి నీళ్లు తాగింది వెనక్కి వెళ్ళిపోయింది. అంటే మనకి తాడును చూస్తే పాము అన్న భయం ఉంటుంది. పామును చూస్తే పాము అన్న భయం ఉంటుంది. భయం లేనివాడు జీవుడు, భయం తెలియనివాడు దేవుడు. [నవ్వు]
YouTube · audio
Sri Ramana Maharshi Vybhavam Part II
Sri Ramana Maharshi Vybhavam Part II
Source: P V S on YouTube
0:00 / 27:34
More in this series