Skip to content
Transcript తెలుగు
[సంగీతం] సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనవందానం వందే సాయి మహేశ్వరం తురియాతీత పదస్థితం సకరుణం జ్ఞానాగ్ని శీలస్థితం మజ్జన్మాంతర పుణ్యపాక వశ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్ఫురతాన్మే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ "యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం" అంటాడు యోగేశ్వర కృష్ణుడు. అంటే ధర్మగ్లాని జరిగినప్పుడు మానవుడు తాను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని, ధర్మాన్ని, స్వధర్మాన్ని విడిచిపెట్టి అపమార్గంలో వెళుతున్నప్పుడు, జాతి తన పురా వైభవాన్ని కోల్పోతున్నప్పుడు, సనాతన ధర్మం వెనుకడుగు వేసినట్లుగా కనిపిస్తున్నప్పుడు, అనేకమైనటువంటి మత విద్వేషాలు ప్రజ్వరిల్లుతున్నప్పుడు, వ్యక్తుల పట్ల పరస్పర ద్వేష భావాలు మాత్రమే మిగిలి పగలు, వగలు రగిలి రగిలి, పొగిలి పొగిలి ఉండే సందర్భంలో భగవంతుడు తనను తానే సృష్టించుకుంటాడు. ఇది శ్రీ కృష్ణ పరమాత్మ మనకిచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి అవతార రహస్యం. అయితే శ్రీరామచంద్రుడు అవతార రహస్యాలు ముందు చెప్పలా. శ్రీ మహావిష్ణువుగా ఉండగానే "నేను భూలోకానికి వస్తాను, శ్రీరామచంద్ర నామంతో వస్తాను, వచ్చి దశరథుడు ఇంట ఒక కుమారుడిగా పుట్టి దశకంధరుడి యొక్క పది తలలు నేలమీద పడేట్లుగా చేసి పునః ధర్మాన్ని రక్షించి దశయుగాల వరకు శ్రీరామ నామం వినిపించేట్లుగా ఒక ఉదాత్త వైఖరితో ఉన్న మర్యాద పురుషోత్తముడు అయినటువంటి మానవ జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాను" అన్నాడు. అది శ్రీరామ ప్రమాణం. కృష్ణుడు ప్రమాణమే చేయలే. మాయావరణంలో పుట్టి యోగ మాయను దేవికి దగ్గర-దేవకి దగ్గర వదిలిపెట్టి లోక మాయను తీసుకుని వ్రజభూమికి వెళ్లి తన అవతార కార్యక్రమాన్ని మహాభారత సంగ్రామం సమసి ఆపై యాదవ కులం అంతా నశించిపోయే దాకా ఆయన తన అవతార ప్రస్థానాన్ని కొనసాగించాడు. ఇది పురాణ వైభవంలో నుంచి గతించిన ఇతిహాసాలలో నుంచి మనకు తెలిసినటువంటి విషయం. [దగ్గిన శబ్దం] మరి ఆధునిక కాలంలో, కలికాలంలో అవతార మూర్తులు వస్తారా? వస్తే వాళ్ళు ఎట్లా వస్తారు? అవతారాలకు యొక్క లక్షణాలు ఏమిటి? ఇవన్నీ విచారణ చేసినప్పుడు అనేక అవతారాలు వస్తాయి. కళావతారాలని, అర్చావతారాలని, ఆవేశావతారాలని, ప్రభవావతారాలని, ప్రసవావతారాలని, అనుప్రవేశ అవతారాలని, కారణావతారాలని రకరకాలుగా వస్తాయి. అయితే ఇవన్నీ కూడా ఒక ప్రాదేశికమైనటువంటి స్థితిలో అంటే confined to a region అంతవరకు మాత్రమే ఉంటాయి. కాల, కార్య, కారణ, కర్తవ్య నిమిత్తమై వస్తాయి. పని ముగించుకుంటే వెళ్లిపోతాయి. ఇట్లా శ్రీ, మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ అవతారాల వలె కాసేపు ఉంటాయి. పని కాగానే మళ్ళీ ఆహ్ పునః తమ పూర్వస్థితికి వెళ్ళిపోతాయి. అయితే ఒక పూర్ణమా-అవతారాన్ని తీసుకొని వస్తే తప్ప, సనాతన ధర్మాన్ని మళ్ళీ జయకేతనం ఎగరవేసేట్లుగా నడిపిస్తే తప్ప, [దగ్గిన శబ్దం] మానవుడిలో మృగ్యమైపోతున్నటువంటి ప్రేమ, దయ, జాలి, సానుభూతి, మానవీయ భావాలు ఇవన్నీ కూడా వెనకంజ వేస్తున్నటువంటి వేళ ఒక అవతారం యొక్క అవసరం భూమండలానికి వచ్చింది. అది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైనటువంటి అవతారం కాదు. అటువంటి అవతారం ఎప్పుడు వచ్చింది, దాని నేపథ్యం ఏమిటి విచారించినట్లయితే ఇంకా భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి సమయంలో సుమారుగా స్వాతంత్య్రం రావటానికి ఇరవై ఒక్క సంవత్సరాల ముందే ఒక అవతారం ప్రపంచంలోకి వచ్చింది. ఆనాటి సాంఘిక నేపథ్యం ఏమిటంటే మతం అంగడిసరుకు అయిపోయింది. నెమ్మదిగా హైందవ జాతి సనాతనమైనటువంటి భావం ఉన్నటువంటి ధర్మము వెనక్కి వెళ్ళిపోతున్నది. అది సందర్భం. అంతేకాదు కొన్ని ప్రాంతాలు క్షామంతో నిరంతరము కూడా కునారిల్లి పోతున్నటువంటి సమయం అది. మరి ఇక్కడ "అభ్యుత్థానం అధర్మస్య" అంటే ఇక్కడ జరుగుతున్న అధర్మం ఏమిటంటే మతపరంగా, కులపరంగా, ఒక జాతిపరంగా, పరాయి పాలన కారణంగా విద్యా విధానం అంతా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి వేళ, వైదిక విద్య నశించిపోతున్నటువంటి వేళ ఒక అవతార మూర్తి జగత్తులోకి రావటం మనకు తెలుసు. అది కేవలం తొంభై ఏడు సంవత్సరాల క్రితం జగత్తులో జరిగింది అది. దీనిని జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అవతారము "ఔపదేయంబునకు సత్యనామంబు ఇచ్చి నడతకెల్ల ధర్మ నిరతి నెరపి ఎల్ల సృష్టిని శాంతికంతుల వెలార్చి వచ్చెమా స్వామి మల్హారమై, విచ్చెమా స్వామి కలహారమై" బంగారమై వచ్చారు. ఇక్కడ బంగారం అంటే రుక్మము అని ఒక మాట. రుక్మం అన్నా బంగారం అన్నా ఒకటే.కానీ రుక్మము శుద్ధ చైతన్యానికి గుర్తు బంగారం. శుద్ధ చైతన్యమే ఒక మానవ దేహం తీసుకుని వచ్చి అవతారం తన దేహానికి సత్యం అని పేరు పెట్టుకుని తాను నడిచిన, నడిపించినటువంటి మార్గమంతా ధర్మ మార్గం చేసి తన ఉనికి చేత, అస్తిత్వం చేత, భావన చేత, వ్యక్తిత్వం చేత, తత్వం చేత, బోధ చేత, ప్రతిబోధ చేత, ప్రచారం చేత, ప్రసాలము చేత సనాతనమైన వైదిక ధర్మాన్ని మళ్లీ పునఃప్రతిష్టించిన అటువంటి ఒక మహా పరిపూర్ణ అవతారమే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. అంటే మన స్వామి. అక్టోబర్ ఇరవై కంటే ముందు మే ఇరవై మూడు పంతొమ్మిది వందల నలభైలో నేను సాయిబాబా varu అని ప్రకటించిన తర్వాత అనతికాలంలోనే సుమారుగా ఐదు నెలలు దాటకుండానే తాను ఎందుకు వచ్చారో చెప్పారు. శ్రీకృష్ణుడు ఎందుకు వచ్చాడో చివర్లో చెప్పాడు. రాముడు ఇందాక అన్నట్లుగా ముందు చెప్పాడు. ఇక్కడికి రాకముందే చెప్పి వచ్చాడాయన. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చినా చెప్పలా యుద్ధం జరిగే సమయంలో చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అటు రాముడు వచ్చిన వచ్చి రామో విగ్రహం ధర్మః అనిపించుకున్న. ఇటు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చిన సధర్మే నిధనం సేహ పరధర్మో భయావహః అని నిర్ద్వందంగా ప్రకటించిన. ఇదిగో అసలు మతము ధర్మము భిన్నమైనవని, మతము మనిషి మతిలో నుంచి పుడుతుందని, ధర్మము సర్వకాలికమైనదని, విశ్వజనీనమైనదని, పురాకృతమైనదని, కాలాజ్యవిచ్ఛిన్నమైనదని అనేక విధాలుగా సనాతనమైనటువంటి ఒక ధర్మాన్ని పునః ప్రతిష్ఠింప చేయటానికి నేను జగత్తులోకి వచ్చాను. వేదోద్ధరణ చేయటానికి వచ్చాను, ధర్మోద్ధరణ చేయటానికి వచ్చాను. చూడండి రామకృష్ణావతారాలు రెండూ కూడా ధర్మాన్నే ఆలంబనం చేసుకుని దేహం తీసుకుని వచ్చినాయి. సత్య సాయి భగవానుడు కేవలం లౌకిక ధర్మం మాత్రమే కాకుండా ఒక వైదిక ధర్మాన్ని అంటే సనాతనమైనటువంటి ధర్మాన్ని మళ్లీ జాతి మత వర్గ వర్ణాలకు అతీతమైనటువంటి దేశ ప్రదేశ ఖండ ఖండాంతరాలను దాటించి సనాతన ధర్మాన్ని మానవ ధర్మంగా మానవీయ కోణంలో ఆవిష్కరించడానికి వచ్చినటువంటి పరమ కారుణ్యమూర్తి భగవాన్ శ్రీ సత్య సాయి. అంటే ఒక అవతార మూర్తి జగత్తులోకి కాలాన్ని ఎంచుకుంటాడు, ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటాడు, ఒక నేపథ్యాన్ని ఆసరా చేసుకుని వస్తాడు. వచ్చి తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని జగత్తైతే అధో జగత్తుకు వెళుతున్నదో, విలువలైతే పతనమైపోతున్నాయో, విలువలైతే జారి మారి కూలిపోతున్నాయో వాటిని మళ్లీ నెలబెట్టి ధర్మసంస్థాపనని ఆచరణాత్మకం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి అవతార మూర్తి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా. వీరు శివ అవతారమా? విష్ణు అవతారమా? దత్తాత్రేయుల అవతారమా? ఇది పండితులు, కవులు మాట్లాడుకునే మాట. అది ఒక సంపూర్ణమైనటువంటి ఒక దివ్యత్వం ఒక పరిపూర్ణమైన మానవ దేహంలో ఇమిడిపోతే ఎట్లా ఉంటుందో చెప్పటానికి వచ్చినటువంటి అవతారమే సత్యసాయిబాబా వారు. అంటే దేవుడు ఎక్కడున్నాడు అని మనందరికీ ఒక వెదుకులాట ఉంది. మనమందరం ఆకాశంలోకి చెయ్యి చూపిస్తాం. ఆకాశంలో దేవుడు లేడు, అంతటా ఉన్నాడు. ఆకాశంలో ఉన్నాడు, పంచభూతాలలో ఉన్నాడు, ఇందుగలదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు కదా భాగవత ప్రమాణం. అట్లాగే పరమాత్మ ఎక్కడ వస్తాడో, ఎందుకు వస్తాడో, రూపంలో వస్తాడో, భిన్నమైన రూపంలో ఎందుకు వస్తాడో, వచ్చి జగత్-జగత్తుని ఎలా ఆకర్షిస్తాడో, ఆకర్షించి సనాతన ధర్మాన్ని నెలబెట్టేటువంటి మహాయజ్ఞానికి పూనుకుంటాడో, అది పిన్నవయసులో పద్నాలుగు ఏళ్లు రాకుండా నా భక్తులు నా కోసం ఎదురుచూస్తున్నారు నేను వెళ్ళాలి అని కుటుంబాన్ని, తల్లిని, తండ్రిని, బంధువులని, సోదరులని అందరినీ వదిలిపెట్టి తాను ఉన్న ఊరు ఇంటినే వదిలిపెట్టి అవతలకు వెళ్లి తాను ఎక్కడ నిల్చున్నారో అక్కడ ఒక పరమాద్భుతమైన ప్రశాంతినగరే నిర్మాణం చేశారు. అంటే ప్రపంచంలో అనేక బిల్డింగులున్నాయి, అనేక మందిరాలున్నాయి, అనేక దేవీదేవతలకి ఆలయాలున్నాయి. కానీ ఒక ప్రశాంతికి మాత్రం ఎక్కడా దేవాలయం లేదు. దాన్ని సత్యసాయి భగవానుడు ప్రశాంతి నిలయము అంటే ప్రశాంతి యొక్క ఆలయం అది. It is a temple of peace. దానికి తాను అధిష్టాతయై, పరదైవతమై, క్షేత్రమై, క్షేత్ర పాలకమై, సమస్తమైనటువంటి ఒక ఆగమ శాస్త్ర విధివిధాన నిర్మాణాయకంగా, షోడశాకర్షణ శక్తి నిలయంగా ప్రశాంత నిలయాన్ని తీర్చిదిద్ది తాను అక్కడే ఉండి ఎక్కడికి కదలకుండా సమస్త ప్రపంచాన్ని కూడా అనేకమైనటువంటి భావాలతో ఆర్షమైనటువంటి, వైదికమైనటువంటి, భారతీయమైనటువంటి, సనాతనమైనటువంటి అనేకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా సమన్వయం చేసి క్రోడీకరించి అన్నింటినీ కూడా దాటి మానవుడు మానవుడిగా జీవించగలిగితే దాని పేరు అధ్యాత్మ అని ప్రకటన చేసి మానవుడు మానవుడిగా జీవించడమే మానవ జన్మకు పరమార్థమని, అదే జీవన సాఫల్యమని, మానవుడు దేవుడు కావటమంటూ లేదని, మానవుడు దేవుడేనని, దేవుడంటూ ప్రత్యేకంగా లేడని మనం చేసే భావలలో, ఆలోచనలో, తలుపులో, చేష్టలో, చేతలో, చూపులో అన్నిటా అంతటా పరమాత్మ ఉన్నాడని సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నటువంటి ఒక వేద వాక్యానికి అనుగుణంగా స్వామి తన ప్రస్థానాన్ని తన అవనీ సంచారాన్ని పరిపూర్ణమైనటువంటి మానవీయ స్థితిలో సాగించఅందువల్లనే అనేకమైనటువంటి సాంఘిక దురాచారాలని, వాటిని కూలద్రోస్తూ సాంఘికమైనటువంటి మర్యాదలను పునఃప్రతిష్ఠ చేస్తూ మానవుడికి మానవుడికి ఉండవలసిన పరస్పరమైనటువంటి భావ సంబంధాన్ని అవినాభావ సంబంధం చేసి ప్రేమైక స్వరూపులుగా అందరినీ దర్శించి అందరినీ ఆత్మ స్వరూపులుగా ఆవిష్కరించి మీరు కేవలము శరీరాన్ని ధరించినటువంటి ఆకార మానవులు మాత్రమే కాదని ఆచార మానవులుగా ఉండమని ఆచారము సదాచారమని సమ్యక్ సంకీర్తనామయమని సద్భావనామయమని సత్సాంగత్య పరిమళంతో విరాజిల్లేటువంటి ఒక దివ్య మానవీయ సంబంధమని ప్రకటన చేసినటువంటి స్వామి ఒక అపురూపమైనటువంటి అవతారం. అవతార ప్రకటన [గొంతు సవరించుకుంటూ] చేసి ఇప్పటికీ ఎన్ని దశాబ్దాలు గడిచిపోయినయో లెక్కలేదు. దశాబ్దాల కాలంలో అంటే ఇప్పటికి తొంబై ఏడు సంవత్సరాలు స్వామి దేహంలో ఉంటే అంటే దేహం వదిలేసి పదకొండు ఏళ్ళు అయింది గనుక ఎనభై ఆరు సంవత్సరాల్లో [గొంతు సవరించుకున్నా శబ్దం] పందొమ్మిది వందల నలభై నుంచి పందొమ్మిది వందల ఎనభై ఆరు వరకు అంటే సుమారు నలభై ఆరు సంవత్సరాలు పరిపూర్ణమైనటువంటి మానవ జీవితాన్ని ఇక్కడ గడిపి జీవితంలో నుంచి ఒక దివ్యత్వాన్ని ఆవిష్కరించి మానవుడు ఎలా జీవించాలి అని చెప్తూ స్వాధ్యాయము స్వీయ దర్శనము అలాగే సమాజంతో కూడి ఉండేటువంటి జీవితము సమాజాన్ని సంస్కరించలేకపోయినా సమాజాన్ని చక్కగా నడిపించగలిగినటువంటి నేతృత్వ స్థాయి అట్లాగే ఏదైనా పంచగలిగినటువంటి దాతృత్వ స్థాయి అంటే నేతృత్వం ఉండాలి దాతృత్వం ఉండాలి ఇక Leadership ఉండాలి Charity ఉండాలి వీటన్నింటినీ కూడా సమన్వయం చేసి భారతీయమైనటువంటి ఒక ఆత్మని ఆవిష్కరించినటువంటి పరమాత్మ పరబ్రహ్మమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి. కోటానుకోట్ల భక్తులను ఒక్కరిని అడిగినా స్వామిని గురించి ఎవరి అనుభవాలు వారివి ఎవరి కథలు వారివి ఎవరి అనుభూతి వారిది కానీ అనుభూతి కలగని వాడు అంటూ ఒక్కడు కూడా లేడు ఇది ఒక విచిత్రం. ఏదో స్వామి దగ్గరికి వెళ్ళాం మాకు ఏం జరగలేదు అన్నవాడు లేడు ఏదో ఒకటి జరిగిందని ఏదో రకంగా లాభపడ్డామని ఎక్కడో ఒక చోట సమున్నతమైన స్థితి కలిగిందని మనసు హాయిగా ఉన్నదని కష్టాలు తీరినయని ఆనందం కలిగిందని అనేక కోణాల్లో స్వామి యొక్క దివ్యత్వాన్ని ఇన్నేళ్లుగా వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు కాబట్టి సత్యసాయి అవతారం ఒక ప్రత్యేకమైనటువంటి అవతారం అది కేవలము ప్రబోధ ప్రచారాలకు మాత్రమే పరిమితం కాకుండా వైదిక ధర్మాన్ని వాంగ్మయ స్వరూపంలో పదిహేను వాహినులుగా రచించి పురా సంస్కృతిని పురా వాంగ్మయాన్ని మళ్ళీ ఈనాటి సమాజానికి అందించారు ఇది ఒక ఎత్తు. రెండవది విద్యాలయాలు వైద్యాలయాలు అవన్నీ మనం ఎప్పుడూ మాట్లాడుకునేవి అదే అలాగే దాహార్తిని తీర్చటానికి Water Projects చేసినప్పుడు ప్రపంచం అంతా ఒక్కసారి విస్తుపోయింది. ఇది ఎన్ని గవర్నమెంట్లు కలిసినా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కలిసినా చేయలేని పని ఎక్కడా రకమైన పొరపచ్చం లేకుండా అంటే Dispute లేకుండా చాలా సులభంగా తాను సంకల్పించుకున్న సమయానికంటే వారం రోజుల ముందే దానిని నిర్మాణం చేయటం ఇది ఒక అపూర్వ సన్నివేశం. అలాగే పతితులు పావనులు ఇద్దరూ ఆయన దగ్గర శరణు తీరారు. పాలకుడు పాలితుడు స్వామి దగ్గర శరణు తీరారు. పండితుడు పామరుడు స్వామి దగ్గర శరణు తీరారు. ఏమీ తెలియని అక్షర జ్ఞానమే లేనివాడు అతులితమైనటువంటి ఆనంద తారక స్థితిని స్వామి దగ్గరే అందుకున్నాడు. [గొంతు సవరించుకున్నా శబ్దం] ఒక గాయత్రి ఒక భాగవతం ఒక రామాయణం ఒక ఉపనిషత్తు శంకర భగవత్పాద కృతమైనటువంటి భజగోవిందం ఇవన్నీ స్వామి నోట విన్నప్పుడు స్వామి గళంలో నుంచి మనం మంగళగీతగా విన్నప్పుడు స్వామి కలల్లో నుంచి వాంగ్మయంగా జాలువారినప్పుడు స్వామి చేయనిదంటూ ఏదైనా ఉన్నదా? అని ఒక ప్రశ్న కలుగుతుంది. ఇక చేయవలసినదంటూ ఏమీ మిగలలేదు అన్నీ చేశారు. ఇవేళ అవతార ప్రకటన దినాన్ని మనం ఎలా జరుపుకోవాలి? కాలానికి కాలం వెళ్ళిపోతుంది వెనక్కి మనం ముందుకు వెళ్ళిపోతుంటాం కాలం నెట్టుకుంటూ వెళ్తుంది ఎక్కడా మనల్ని నిలవనివ్వదు నిలువరించను నిలువరించదు దాని దారిన అది వెళుతుంటుంది దాని వెంబడి మనం వెళుతూ ఉంటాం ఇదిగో మనం కూడా [గొంతు సవరించుకున్నా శబ్దం] స్వామిని చూసి స్వామిని దర్శించి స్వామితో మాట్లాడి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితాన్ని పవిత్రీకరించుకున్నటువంటి మన బోటి వారందరం కూడా ఇవాళ ఒక కర్తవ్య దీక్షకి పునుకోవాలి అది ఏమిటి అంటే [గొంతు సవరించుకున్నా శబ్దం] రామావతారంలో శ్రీరాముడు ధర్మాన్ని పాటించాడో కృతయుగంలో దివ్యమైనటువంటి దివ్యత్వాన్ని మానవ దేహంలో ఉన్న జీవులు ఋషులు మహాత్ములు జిజ్ఞాసువులు ఎలా అనుభవించారో ద్వాపర యుగంలో శాంతి ప్రేమలు పరిపూర్ణంగా పరిఢవిల్లినయో వెల్లివిరిసినయో విస్తృతమైనయో దానికోసమై శ్రీకృష్ణ పరమాత్మ తన జీవితాన్ని మధుర విషాద గాథగా మార్చుకున్నాడో ఇవన్నీ గమనించినప్పుడు సత్యసాయి భగవానుడు కూడా అన్ని అనుమానాలని అవమానాలని దాటుకుంటూ తాము నిర్దేశించుకున్నటువంటి వా- ఒక లక్ష్యాన్ని చేధించుకుంటూ గమ్యం వైపు నడిపిస్తూ ఎట్లాగైతే ఒక ప్రశాంతికి ఒక ఆలయం ఎలా కట్టారోఅలాగే సేవాకృతులుగా ఉండటానికి సేవా Organisation పెట్టారు. ఇది ప్రపంచంలో ఒక uniqueness అంట అండి. ఒక విశిష్టత. గొడుగు కింద Organisation కింద అనేకమైనటువంటి సాంఘిక కార్యక్రమాలు, అనేకమైనటువంటి సమాజ సేవలు, అనేకమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి, అవన్నీ మనకు తెలుసు. వీటన్నింటి వెనుక మనం ఇవాళ ఇంకాస్త ముందుకి, ఇంకాస్త కేవలం ఉడతాభక్తిగా కాకుండా హనుమంతుని వలె మనం విజృంభించాలి. శ్రీరామ కార్యంలో హనుమ తన-తన-తను, తన మన, ప్రాణాలన్నింటినీ కూడా పణం పెట్టి శ్రీరామ కార్యం ఎంత నిస్వార్థంగా నెరవేర్చాడో, ఇవాళ స్వామి భక్తులమైనటువంటి మనందరం కూడా మన తనువుని, మన మనస్సుని, మన ధనాన్ని, మన ప్రాణాన్ని స్వామికి కైంకర్యం చేయవలసినటువంటి ఒక పరిస్థితి ఇవాళ మనకున్నది. రాబోయే కొద్ది సంవత్సరాలలో స్వామికి ఆహ్ వారి పుట్టుకకు ఒక శతజయంతి, వారి అవతార ఆవిర్భావానికి ఒక శతజయంతి జరుగుతున్నది. అది ఒక పండగగా, వేడుకగా మాత్రమే కాకుండా ఒక మానవీయమైనటువంటి కోణాన్ని పునః ఆవిష్కరిస్తూ అనేకమైనటువంటి జాతులన్నీ కూడా inclusiveness అంటాం. అన్నీ కలుపుకుపోయేటువంటి ఒక మహా సముద్ర స్థితిలో మనం కూడా ఒక నది వలె దాని యందు సంగమించాలి. అది మాత్రమే కాదు, ఇవాళ ప్రపంచం నిండా సంపద ఉన్నది, విజ్ఞానం ఉన్నది. కానీ సంపద ఉన్నది, దాతృత్వం లేదు. విజ్ఞానం ఉన్నది, జ్ఞానం తక్కువైపోయింది. విజ్ఞానం వేరు, జ్ఞానం వేరు. జ్ఞానం అంటే మనల్ని మనం ఎరుగు-ఎరుక జ్ఞానం. ప్రపంచం మొత్తాన్ని గురించి తెలుసుకునేది విజ్ఞానం. మన విజ్ఞాన పరిధిని దాటి జ్ఞాన పరిధిలోకి వెళ్లి, నేను ఎందుకు వచ్చాను ప్రపంచంలోకి? నేను జీవితాన్ని సక్రమంగానే గడుపుతున్నానా? నేను చేస్తున్నదంతా బాగున్నదా? నా వలన సమాజానికి ఏదైనా కొంతైనా మంచి జరిగిందా? హితముగా ఉన్నదా? అని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ, ప్రశ్నించుకుంటూ, "అథాతో బ్రహ్మ జిజ్ఞాస" అన్నటువంటి తొట్టతడి బ్రహ్మసూత్రాన్ని ఆలంబనం చేసుకొని, రేపు ఏమిటి? తర్వాత ఏమిటి? అనే ప్రశ్న వేసుకుంటూ ఇది రోజుకారోజు మన సేవా కార్యక్రమాలని ప్రేమ అనేటువంటి ఒక దివ్య ప్రేమని, రాగ అనురాగాలను దాటు-దాటినటువంటి ఒక ప్రేమని స్వామి మనకు పరిచయం చేశారు. దివ్య ప్రేమని అది కేవలం స్వామికి మనకు ఉన్న మధ్య ఉన్నది మాత్రమే కాకూడదు. అక్కడే ఆగిపోకూడదు. స్వామితో మనకు ఎటువంటి దివ్య ప్రేమ ఉన్నదో అటువంటి ప్రేమే ప్రపంచం పట్ల, సకల జీవుల పట్ల ఉండాలి. అందుకనే స్వామి Love all అంటే అన్-- ప్రపంచంలో ఉన్న మానవులను కాదు, సమస్త జీవరాశిని ప్రేమించమన్నారు. Serve all అంటే సమస్త జీవులను కూడా సేవ చేయండి. సేవ ద్వారా ప్రేమ, ప్రేమ ద్వారా సేవ. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి సంపదల నుంచి కొంత భాగమైన మరొకరికి ఇచ్చి వాళ్ళను ఆదుకునే స్థితికి వెళ్లి అట్లాగే నలిగిన వాళ్ళందరినీ కూడా కలిగిన వాళ్ళు కాపాడుకోవాలి. చదువుకోవటానికి అవకాశమే లేని తెలివిగల వాళ్ళందరినీ కూడా, పిల్లల్ని కూడా మన వాళ్ళ తెలివితేటలు రాణించేట్లుగా విద్యాబుద్ధులు చెప్పాలి, దోహదం చేయాలి. నైతిక విలువలతో కూడినటువంటి ఒక విద్యా ప్రమాణాన్ని స్వామి మనకు పరిచయం చేశారు. అది కేవలం న-నైతిక విలువలు మాత్రమే కాదు, మానవీయ కోణంతో ఉన్నటువంటి విద్యా విధానాన్ని మనకు స్వామి అనుగ్రహించారు. స్వామి ఏమి చేశారో మనందరికీ తెలుసు. ఇవాళ ఏం చేయాలో కాసేపు మాట్లాడుకుంటూ రాబోయేటువంటి కాలమంతా కూడా సత్య సాయి యుగం వైపు మనమందరం నడవాలి. సత్య సాయి యుగం అంటూ ప్రత్యేకంగా లేదు. ఉన్నదంతా అది కృత చేయబడిన యుగం. చేయబడిన యుగానికి పేరు సత్య యుగం అని పేరు. సత్య యుగమే ఇవాళ సత్య సాయి యుగం అనే పాయింట్ నుంచి ప్రారంభమై అంటే బిందువు నుంచి ప్రారంభమై ocean అంటే సింధువు దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడో ఒక మ-చోట మొదలు పెట్టాలి. చూడండి తెల్ల కాగితం తీసుకుంటాం. దాని మీద పెన్ పెట్టుకుంటాం. ఎక్కడో ఒకచోట ప్రారంభించి తొలి అక్షరం రాస్తాం. అది అయ్యేదాకా కాలం ఆగదే. అట్లాగే మనం కూడా మన సేవలు ఎక్కడో మొదలు పెట్టాలి, ఎప్పుడో మొదలు పెట్టాలి. పెట్టాము అంటే చివరి దాకా అంటే కడదాకా వాటిని సాగించాలి. దానికి కావలసినటువంటి శక్తిని, యుక్తిని స్వామి మనకు అనుగ్రహించాలి. అలాగే భారతీయ ఆత్మలో ఉన్నటువంటి సంగీత, సాహిత్య, వాఙ్మయ స్వరూపాలన్నింటినీ పురాతన సంస్కృతిని మరొక్కసారి నెమరువేసుకుంటూ అర్చ్యతన భవిష్యత్తులో అంటే in the nearest future అంటాం. దానిలోకి జాతిని ముఖ్యంగా యువకులు బాధ్యతను ఎక్కువగా తీసుకుని దాన్ని ముందుకు నడిపించే దిశగా మనందరం కూడా కలిసికట్టుగా సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై అనేటువంటి అద్భుత వాక్యానికి అనుగుణంగాను అలాగే అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అనేటువంటి ఉపనిషత్ వాక్యాలని ఆధారం చేసుకొని Love all Serve all అనేటువంటి సేవా యోగాన్ని ఆలంబనం చేసుకొని మన జీవితాలన్నీ కూడా ధన్యవంతమగు గాక. మనం మాత్రమే కాదు మన కడుపున పుట్టిన బిడ్డలు, బిడ్డలకు పుట్టినటువంటి బిడ్డలు, వీళ్ళందరూ కూడా సత్యసాయి ప్రతిపాదించినటువంటి సనాతన ధర్మాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకు వెళ్లాలని స్వామి అటువంటి అవకాశాన్ని మనలో ప్రతి ఒక్కరికీ అనుగ్రహిస్తారని, అనుగ్రహాన్ని వరదానంగా స్వీకరించి ఆలంబనం చేసుకొని తద్వారా మన జీవితాలని మనం కూడా ఒక నది ఎక్కడో పుట్టి తన దారి తాను వెళుతూ వెళుతూ ప్రవహిస్తూ తనను తాను శుభ్రపరుచుకుంటూ తాను వెళుతున్న దారినంతా శుభ్రపరుస్తూ ఎట్లాగైతే సాగర సంగమం చేసి జీవితాన్ని ధన్యం చేసుకుంటున్నదో అట్లాగే మనం కూడా గర్భాలయంలోనో జన్మ ఎత్తి ప్రపంచంలో అడుగుపెట్టి అనేక వృత్తులు, వ్యావృత్తులు అన్నీ కూడా చేసుకొని, చేసుకుంటూనే మళ్ళీ స్వామి యొక్క మార్గంలో ఆదర్శాలతో, ఆశలతో, ఆశయాలతో మన జీవితాలను కూడా నిర్-నిర్భరం గా ముందుకు సాగిస్తూ పరమాత్మ అనేటువంటి సాగరుడిలో మనం కూడా సంగమించాలని, దానికి రోజు నాంది పునః కావాలని పునరంకితమయ్యేటువంటి ఒక పవిత్రమైనటువంటి రోజుగా దీన్ని నేను భావన చేస్తూ మనందరికీ కూడా స్వామి అనుగ్రహం ఎల్లవేళలా మహా అమృత వృష్టిగా మనపై కురియు గాక అని స్వామిని పునః పునః ప్రార్థిస్తూ సాయిరాం. [అంతు లేని సంగీతం] కలియుగ అవతారి పరమ ప్రేమమూర్తి సకల జనోద్ధారి శ్రీ సత్య సాయి.
YouTube · audio

Divya Avatara Prakatana — Part 2

Home

Divya Avatara Prakatana — Part 2

Source: SATHYA PEETHAM on YouTube

0:00 / 25:24

More in this series

Divya Avatara Prakatana

2 episodes · 1 hr 14 min

  1. 49 min 1

    Divya Avatara Prakatana — Part 1

  2. 25 min 2

    Divya Avatara Prakatana — Part 2

    Now playing