No transcript for this section.
Transcript begins at 0:00.
[సంగీతం] సౌందర్య సార సర్వస్వం నంద స్మిత మనోహరం వందారు జన మందారం వందే సాయి మహేశ్వరం తురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శిలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహేనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్పర్ధతే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఈరోజు భగవాన్ శ్రీ సత్య సాయి అంటే మన స్వామి అవతరించినటువంటి రోజు అవతరించినటువంటి రోజు అంటే పుట్టినరోజు అని కాదు తన అవతారాన్ని ప్రకటన చేసినటువంటి రోజు గనుక advent is different from incarnation అందువల్ల ఆ రెండిటికీ తేడా లేకుండా చాలా విషయాలు వింటున్నాం కాబట్టి advent అంటే రావడం అది November 23, 1926. ఈ October 20 avatar declaration. ఈ రెండు కాలాల మధ్య May 23, 1940లో నేను సాయిబాబాని మురళవిందులో ప్రకటన చేశాను. ఈ మూడు కూడా సత్యసాయి భగవానుడు ఈ లోకానికి పరదైవతంగా ఆవిష్కృతం కావడానికి జరిగిన మూడు సందర్భాలు. ఒకటి జన్మ ఎత్తడం రెండవది నేను సాయిబాబాను అని ప్రకటించడం మూడవది తన అవతార లక్ష్యము తాను నిర్దేశించుకున్న ప్రణాళిక తాను ఎందుకు వచ్చారో అది ప్రపంచానికి విస్పష్టంగా చెప్పటం. ఈ మూడు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి గనుక ఆ advent అంటే వారు రావడం incarnation అంటే వారు రావడం దాన్నే మనం advent అంటాం. రెండవది declaration it's a declaration of the avatar మరి avatar అనేదానికి etymology లో ఏదైనా meaning ఉందా అంటే descent అని వాడారు అంతే. అంతకంటే వాళ్ళకి ఎక్కువ పేరు దొరకలే ఎందుకంటే ఈ avatar అనేటువంటి ఒక పదం సంస్కృత పదం descent అంటే కిందికి దిగి రావడం descent దీంట్లో రెండు descent లు ఉంటాయి ఒక-ఒక descent ఏమిటంటే ఇది నాకు నచ్చలేదు అని చెప్పే ఒక descent English లో ఉన్న తిరకాసు అంతా ఇదే descent కాదు ఇది descent descent అంటే దిగి రావడం. మానవుడికి ascent పరమాత్మకి descent ఇది కృత త్రేతా ద్వాపర ఇప్పుడు ఈ కలియుగంలో కూడా ఇదే జరిగింది మరి ఈ descent అనేటువంటి అవతారం వచ్చింది అంటే అది ఏమిటి అని ఈ అవతారానికి మూలం ఏమన్నా ఉన్నదా? ఒట్టి వ్యక్తేనా? లేదా మనందరికీ తెలిసినటువంటి కరచరణాది అవయవాలతో ఉన్నటువంటి ఒక పురుషోత్తముడా? ఏమిటి అని గనక ఆలోచించినట్లయితే దీనికి మూలం ఏమిటంటే దాని పేరు చిచ్ఛక్తి అని పేరు. అంటే ఒక అవతారం ఎక్కడినుంచన్నా దిగి రావాలి అంటే ఆయన ఎక్కడో ఉండి ఉండాలి కదా. ఏ రూపంలోనో ఈ రూపం కానీ మరొక రూపంలో ఉండి ఉండాలి కదా. ఆ రూపం మనం పట్టుకోలేం. ఈ రూపాన్నే పట్టుకోవడం చాలా కష్టం అర్థం చేసుకోవటం. మరి ఆ రూపమేమిటి సత్య సాయి భగవానుని యొక్క మూలం ఏమిటని మనం కూడా ఎప్పుడన్నా ఆలోచించినట్లయితే ఏదో శివుడంటాం, రావుడంటాం, కృష్ణుడంటాం కాదు కాదు ఆయన దత్తాత్రేయుడు అని అంటాం మనమే దాన్ని ఒక assertion లో వెళ్తాం. అలా కాకుండా ఈ అవతారానికి మూలమైనటువంటి విషయం ఏమిటి అంటే అది చిచ్ఛక్తి. దానికి వైదాంతిక భాషలో పరమాత్మ అని పెట్టారు. మరి పరమాత్మను ఎందుకు పెట్టాలి. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ అంటే ఒక ఆత్మ సామాన్యమైనటువంటి మానవ దేహంలో కనుక ఉండి ఆ దేహాన్ని నడిపిస్తే అది జీవాత్మ. ఆత్మ సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నది. ప్రపంచంలో చీమలో, దోమలో, శివకేశవులలో ఏమున్నదంటే ఆత్మే ఉన్నది. ఆత్మ అంటే ప్రాణమని, మనస్సని, చైతన్యమని, current అని, liquid అని, fluid అని, flow అని ఇవన్నీ అనేక భాష-భాషల్లో అనేక పదాలున్నాయి. కానీ వీటన్నింటినీ దాటి శ్రీకృష్ణ పరమాత్మ ఏ రకంగానైతే భగవద్గీతలో ఒక ప్రమాణం చేశాడో, ఎక్కడ? అవతారం సుమారుగా పూర్తయ్యేటువంటి సమయం. ఎంచుకున్న స్థలం రణ-రణరంగం. అక్కడ "యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం" అన్నాడు. నన్ను ఎవరూ సృష్టించరు నా-నన్ను నేనే సృష్టించుకుంటాను అన్నాడు. కాబట్టి ఆ నన్ను నేనే అనేటువంటిది స్వామి విషయంలో ఏమిటి అని గనక అంటే అది చిచ్ఛక్తి. దాన్ని cosmic energy అంటాం. దానిలో నుంచి వచ్చి descent అయి అంటే అవతరించి ఈ ప్రపంచంలో జన జగత్తులతో కూడి ఉండి ఈ జగత్తుని మరమ్మత్తు చేసి, ఎందుకని అప్పటికే ధర్మగ్లాని జరిగింది గనుక, మానవుడు ధర్మాచరణకి దూరమై పోతున్నాడు గనుక, కేవలం లౌకిక భౌతిక వాంఛలతో, లాలసతో జీవితాన్ని చెల్లగొట్టుకుంటున్నాడు గనుక రాముడిది కథ పు-పురాణం అయిపోయింది.కృష్ణుడి భాగవతమంతా పురాణం అయిపోయింది. ఈవేళ కలియుగంలో ప్రశ్నించి సమాధానం పొందే అలవాటు ఉన్నది ఈ జాతికి. కాబట్టి ఇక్కడ కావలసినది ప్రదర్శనా కావాలి, నిదర్శనా కావాలి. ప్రదర్శన నిదర్శన రెండూ లేకుండా దర్శనమే లేదు. ఈ మూడూ లేకుండా సుదర్శనం అసలే లేదు. కాబట్టి ఈ నాలుగింటిని కూడా ఏకకాలంలో అనుసంధానం చేసి స్వామి తమ పధ్నాలుగవ ఏట ఈ అక్టోబరు ఇరవయ్యవ తారీఖున ఎట్లాగైతే తన అవతార ప్రకటన చేశారో దానికి ముందు ఉన్నటువంటి నేపథ్యాన్ని గమనించినట్లయితే రామకృష్ణాది అవతారాలు వచ్చినప్పుడు ప్రకృతిలో సంభవించిన అనేకానేక అద్భుత పరిణామాలు ఏవైతే ఉన్నాయో స్వామి విషయంలో కూడా అదే జరిగినాయి. ఏం జరిగినాయి? శ్రీరాముడు వచ్చినప్పుడు ఏమైంది? ఆయన ఎలా వచ్చారు? అంటే దశరథ మహారాజు ఒక్క కొడుకు ఉంటే చాలు పునః నరకం నుంచి తప్పించబడటానికి అనుకున్నాడు. తాను తన శంఖము, చక్రము, గద, తాను పరివార సమేతంగా వచ్చిన అవతారము శ్రీరామ అవతారం. వారే భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు. కాబట్టి తన అంశా స్వరూపాలుగా తెచ్చుకున్నటువంటి ఒక పూర్ణావతారము రామావతారం. రాముడు పుట్టినప్పుడు ఏమైంది? అమరేంద్రాశకు పూర్ణచంద్రుడు ఉదతుండైనట్లు నారాయణాంశమున పుట్టె. మదాంధ రావణ శిరస్సంహాత సంచేదన క్రమణోద్దాముడు రాముడు. ఆ గరితకున్ కౌసల్యకున్ ఇది భాస్కర రామాయణంలో రాముడి యొక్క వర్ణన. అసలు రావణ వధ కోసమే వచ్చాడాయన. రావణ వధ ఒక్కటి జరిగితే అధర్మం అణచివేయబడుతుంది. ధర్మం ఉత్థానం చెందుతుంది. పునరుత్థానమై మళ్ళీ ఈ జగత్తుకు ధర్మమార్గం మళ్ళీ ఒక మహాత్ముడు వచ్చేదాకా దాన్ని నడిపిస్తుంది గనుక శ్రీరామచంద్రుడు ఆ పునర్వసు నక్షత్రంలో మూడవ పాదంలో ఆయన కర్కాటక లగ్నంలో ఈ ప్రపంచంలోకి ప్రవేశించిన సమయంలో అడవిలో ఉన్నటువంటి పూలన్నీ, మొగ్గలన్నీ కూడా పుష్పించినయ్. నదులన్నీ కూడా ఆనందంతో తాండవులు చేసి ప్రవహించినయ్. సముద్రాలు అల్లకల్లోలం చెందలా ఉత్తుంగ తరంగాలను మిన్నంటునట్టుగా ఉన్నాయి. ఈ వర్ణనలన్నీ మనకున్నయ్. అంటే ఏమిటి? ఈ పుడమి ఒక పరమాత్మని ఆహ్వానించే విధానం అంత గొప్పది అని. అట్లా శ్రీరాముడు వచ్చాడు. ఇక శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు ఏమైంది అని. అది అష్టమి, అమావాస్య, కారు చీకటి, కాల మేఘాలు నిరంతరము వర్షిస్తున్నటువంటి ఒక వర్షధార. దానిలో ఎక్కడ జన్మ ఎత్తారో చెరసాలలో ఆయన అక్కడ ఉండదలచుకోలేదు. ఉరికే కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై అక్కడో జన్మ ఎత్తి తన శరీరాన్ని, శాలంకృతమైనటువంటి శరీరాన్ని సర్వాభరణాలనే కూడా ఆ తన నుంచి విడదీసి యోగమాయని తన జనని అయినటువంటి దేవకికి ఇచ్చి లోకమాయతో వసుదేవుడితో కలిసి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మనందరికీ తెలుసు భాగవతం, ప్రకృతి ఎట్లా సహకరించింది. యమునా నది పాయలు చీలింది. వసుదేవుడి పైన బుట్ట ఉంటే ఆ బుట్టలో బాలకృష్ణుడు ఉంటే ఆదిశేషువు పడగ విప్పి గొడుగు అయి తీసుకొని వెళ్ళాడు. అంటే ప్రకృతి పరమాత్మని ఆహ్వానించుకుంటుంది. ఎందుకంటే అధర్మాన్ని భరించలేక భూమాత తల్లడిల్లి పోతున్నటువంటి వేళ. ఈ అవతార మూర్తుల రాకలన్నీ కూడా ఇట్లాగే చాలా ఆ పరమానందదాయకమైనటువంటి ఆనంద రసతుందమైనటువంటి భావనాస్థితిని కల్పిస్తూ ప్రకృతి తన రామణీయకతని, తన ఉల్లాసాన్ని, తన ఉత్సాహాన్ని, తన ఉద్వేగాన్ని, ఆనందభరితమైనటువంటి హృదయాన్ని ఆవిష్కరించుకుంటూ ఆ పరమాత్మకి దారి చూపుతుంది లేదా ఆ దారిలో అది వెళుతుంది. సరే అట్లాగే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు వచ్చినప్పుడు కూడా ఇటువంటివే జరిగినయ్ అని వాటిని చూసినవారు జీవించి ఉన్నంత కాలము వాటిని చెప్పుకున్నారని, జనాంతికంగా చెప్పుకున్నారని మనందరికీ తెలుసు అది మన సత్యం శివం సుందరం నిండా ప్రథమ భాగంలో అవన్నీ వ్రాయబడ్డాయి. అంటే ఇంట్లో ఉన్నటువంటి వీణలు మోగినయ్ అని, తంబూరాలు మీటబడినయ్ అని, నాగులు అటు ఇటు కదిలినయ్ అని, పొత్తిళ్ళలో ఉన్న స్వామికి నాగుపాముే పొత్తిళ్ళలో ఉన్నది అని ఇవన్నీ కూడా మనం విన్నప్పుడు ఆశ్చర్యము లేదు, అది అసంగతము కాదు. అలాగే జరుగుతుంది. పరమాత్మ అణుప్రవేశం చేసినప్పుడు లేదా ప్రభవించినప్పుడు ఒక పరిపూర్ణతని ప్రకృతి సంతరించుకొని మహదానందమైనటువంటి స్థాయిలో ఉంటుంది. అట్లా వచ్చినటువంటి అవతారం సత్యసాయి భగవానుడి యొక్క అవతారం. మనం ఎన్ని అవతారాలు ఎంతెంత మంది వచ్చినా అనేక అవతారాలున్నాయ్. అందులో ప్రధానంగా ఎవరిని గురించి చెప్పాలన్నా రామకృష్ణ అవతారాల రెండింటిని మనం పోల్చుకుంటూ చెప్తాం. ఎందుకంటే భారతీయమైనటువంటి సమస్త నాడుల యందు ఇంకిపోయినటువంటి జీవన గాథలు ఇద్దరివి. ఒకటి రాముడు, రెండవది కృష్ణుడు, ఇవాళ మూడవది సత్యసాయి. ఈ మూడు ఏమిటి ఒక్కసారి చూసుకున్నట్లయితే శ్రీరామచంద్రుడు ప్రతిజ్ఞలు చేయలే, అవతార ప్రకటన చేయలే, నేను ఇలా ఉండబోతున్నాను అని చెప్పలే. కానీ శ్రీమహావిష్ణువుగా ఉన్నప్పుడు నారదాది మహర్షులందరూ వెళ్లి, "రామా! మత ఘర్షణ వలన శైవులు, వైష్ణవులు ఇబ్బందులు పడుతున్నారు. అందునా రావణ బ్రహ్మ, పౌరుష బ్రహ్మ అయినటువంటి రావణుడు శైవం తప్ప వైష్ణవం లేదన్నాడు. దాంతో సమాజం రెండుగా చీలిపోయింది. ఇది నువ్వు రావలసినటువంటి సమయం. ఇది నిజమైనటువంటి, ఆసన్నమైనటువంటి సమయం కాబట్టి నువ్వు ఒక అవతారం తీసుకొని భూలోకానికి రా" అన్నప్పుడు ఇది వాల్మీకి ప్రమాణం సుమా!శ్రీరామచంద్రుడు ఒక్కమాట చెప్పాడు. అంటే శ్రీరామచంద్రుడు కాదు ఆయన ఇంక శ్రీ మహావిష్ణువే. "తప్పకుండా వస్తున్నాను, సమయం ఆసన్నమైనది. దశరథుని ఇంట కుమారుడిగా జన్మిస్తా. దశకంధరుడి పది తలలు-- అంటే కుత్తుకలు ఉత్తరిస్తా. దశయుగాల వరకు నిలబడేటట్లుగా శ్రీరామచంద్ర నామంతో నేను వస్తున్నా" అంటే రాబోతున్న అవతారానికి, తాను ఎత్తబోతున్న decent కి ఆయన పేరు-- ఆ దేహానికి ఏం పేరు పెట్టుకున్నారంటే శ్రీరామ, రామచంద్ర పేరు పెట్టుకున్నారు. ఇక మరి అట్లాగే అదే మహావిష్ణువు కృష్ణుడిగా వచ్చాడుగా, "వస్తూ వస్తూ అప్పుడే వాళ్ళ అమ్మతో, దేవలతో చెరసాలలో చెప్పొచ్చు కదా?" అంటే ఆయన చెప్పలా. వస్తూ వస్తూనే లీలా కాండ, మహిమా కాండ అన్నీ సాగించటం ఆయన నిర్ణయించుకున్నాడు గనుక, పరమేశ్వరుడి యొక్క శక్తిని నిదర్శన పూర్వకంగా లీలా వైభవంతో సాగించాలని అనుకున్నాడు గనుక చెప్పటం కాదు చేయటమే నిర్ణయించుకున్నాడు ఆయన. అందులో మొట్టమొదటిది ఇందాక చెప్పుకున్న యమునా పాయలుగా చేరటం, ఆదిశేషువు గొడుగు పట్టటం, యా ఉదృతి తగ్గటం, చీకట్లోనే పరమాత్మ వెలుగు వైపు నడుపు-- నడవటం తాను నడిపించటం. ఇది ఒక పరమాద్భుతమైనటువంటి సన్నివేశం. మరి ఆయన ఏమనుకున్నారంటే ముందే ఎందుకు చెప్పాలి? చేసిందంతా అయిపోయిన తర్వాత చెప్తే బాగుండు అనుకొని రాముడేమో రాకకు ముందు చెప్పాడు, కృష్ణ పరమాత్మేమో వెళ్లిపోవటానికి ముందు చెప్పాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడికి భగవద్గీతను ఉపదేశిస్తున్నప్పుడు లేదా చెప్తున్నప్పుడు, ప్రబోధాత్మకం చేస్తున్నప్పుడు "परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे॥" ఇదేంది ఇందాక చెప్పిన "यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्॥" కాబట్టి శ్రీరామచంద్రుడు ఏమనుకున్నాడంటే, లోకానికి ఏం చెప్పాడంటే, "అయ్యా! నువ్వు నారాయణమూర్తివి." అని ఆయన చుట్టూ ఉన్నటువంటి మహర్షులందరూ చెప్పినా "కాదు, కాదు. నేను మానవుడిగా ఉండాలని వచ్చాను. దశరథ రాజు కుమారుడిగా ఉండాలని వచ్చాను. కనుక మీరందరూ ఏదన్నా అనుకోండి, నేను కేవలం మానవుడి వలె సుఖదుఃఖాలని, ద్వంద్వాలను, జయాపజయాలను అన్నింటిని అధిగమిస్తూ ఒక మానవుడు తన జీవితాన్ని ఒక ఉదాత్త వేఖలో ఎలా ప్రస్థానం చేయలో నేను చేయ-- అది చెప్పటానికి వచ్చాను." అని శ్రీరాముడు తనను గురించి తాను ఆ భగవత్ తత్త్వం నుంచి ఆయన బయటపడి తన మానవీయమైనటువంటి కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించి ఇవేళ ఆదర్శ పురుషుడయినాడు రాముడు. కృష్ణ పరమాత్మ అట్లా చేయలా. ఆయన ఏమన్నాడంటే, "అసలు పరమాత్మ అంటూ ఉంటే అది నేనే." అంటే అన్నీ నేనే. ఆ నేనే అంటే దేహ-దేహభరితమైనటువంటి, దేహ సంబంధి అయినటువంటి కృష్ణుడు కాడు. ఆ నేను అంటే ఆత్మకు పర్యాయపదం. అందుకనే ఆయన ఆత్మబోధ చేశాడు. భీష్ముని దగ్గ-దగ్గర నుంచొని విష్ణు సహస్ర నామాన్ని విన్నాడు. అంటే విన్నాడు, అన్నాడు, కన్నాడు అన్నీ చేశాడు. ఎట్లా చేశాడంటే నిరపేక్షంగా చేశాడు. రాముడు యుద్ధం చేశాడు, కృష్ణుడు యుద్ధం చేయలా-- చేయించాడు. మామూలుగా ఒక పూచిక పుల్లను పెట్టి ఈ అవతారాలు తమ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటాయి. మనమనుకుంటాం మనమందరం ఆయనతో ఉన్నందువల్ల అనేక పనులు చేశామని మనం అనుకుంటాం. కానీ కాదు. ఆ శక్తిని మన యందు నిక్షిప్తం చేస్తారు. ఆ నిక్షిప్తం ఎప్పుడైతే చేస్తారో వారు చేయవలసిన పనులే మనం చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. దానికి మనం భగవంతుడి అనుగ్రహం అంటాం. అది మంచిదే, వినయం అట్లా ఉండాలి. కానీ జరిగేది ఏమిటంటే అనుప్రవేశం జరుగుతుంది. అవి po-possess అంటాం చూడండి, ఆవేశింపబడతాయి. ఆవేశింపబడినప్పుడు అన్నీ వారు ఎలా చేయదలచుకున్నారో అలాగే జరుగుతాయి. ఇది రెండవది. కాబట్టి ఒకటేమో మాయామానుష వేషం రాముడు. మాయావరణానికి లోబడి సంచారం చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ మాయామానుషం కాదు, అది లీలా మానుషం. మా-మానుష తప్పించి లీల, అంతా అద్భుతమే. లీలే, లీలే, లీలే చేశాడాయన. మూడవది సత్యసాయి భగవానుడు ఆ రెండింటికంటే భిన్నంగా తాను అవతారం తాల్చి వచ్చిన తర్వాత, అంటే descent అయిపోయిన తర్వాత కొంతకాలం తన చుట్టూ ఉన్నటువంటి సమాజంతో పెనవేసుకొని అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు ప్రపంచంలో జరుగుతున్న వాటికి సంక్షిప్త స్వరూపంగా భావించి [గొంతు సవరించుకుంటూ] మానవుణ్ణి మార్చాలి. ఏం మారిస్తే ప్రయోజనం-- ఏం మార్చడం ఉంటే చంపటం. మనిషిని చంపినందువలన సంహార క్రీడల నుంచి ఏమీ రావు. ఉన్న వాటినే సరిదిద్దుతూ గనక తీసుకెళ్లినట్లయితే ఒక సభ్య సమాజము, సత్య సమాజము ఏర్పడుతుందని భావించి స్వామి తన తొలి ఆ పదహారు ఏళ్ళు వచ్చే వరకు కూడా మాయావరణంలో ఉన్నారు. అంటే రాముడి వలె ఉన్నారు. ఈశ్వరమ్మ కొడుకుగా ఉన్నారు. అంతే. ఈశ్వరమ్మ కొడుకుగా ఉన్నారు, పుట్టపర్తి సత్యనారాయణ రాజుగా ఉన్నారు. ఇదంతా మాయా మానుష వేషం ఇది. ఆ తర్వాత ఇందాక చెప్పిన ఈ అక్టోబర్ ఇరవై Avatar Declaration Day అని మనం ఏదైతే జరుపుతున్నామో, ఆ రోజున ధర్మోద్ధరణ, దీనజనోద్ధరణ ప్రధానమైనటువంటి అంశాలుగా స్వామి అవతార ప్రకటన చేశారు. ధర్మాన్ని ఉద్ధరించాలి, దీనావస్థలో ఉన్నవారిని ఉద్ధరించాలి. వీటన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ ఆ లీలా కాండని ప్రారంభించటానికి ఒక సమయాన్ని ఎంచుకొని శ్రీరాముడిలో ఉన్న మాయా మానుషాన్ని, శ్రీకృష్ణ పరమాత్మలో ఉన్నటువంటి లీలా వైభవాన్ని కలిపి సత్యసాయి భగవానుడి అవతారం ఎటువంటిది అని మనల్ని ఎవరన్నా అడిగితే...అయ్యా అది లీలా మాయా మానుష వేషం అని చెప్పాలి. లీలా ఉంది, మాయా మానుష ఉంది మనతో మామూలు మన స్థాయికి వచ్చి దిగి వచ్చి మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు. అలాగే మన మనసుకి మన బుద్ధికి చిత్తానికి అహంకారానికి మన సాధనకి తపస్సుకి స్వాధ్యాయానికి అతీతంగా అసలు ఎప్పటికీ చేతికి అందనంత స్థాయిలో సంచారం చేసిన ఆ అవనీ సంచార వైభవాన్ని కూడా స్వామి ప్రకటించారు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ శక్తులని ఏకం చేయాలి గనుక దానికి వారు ఎంచుకున్నటువంటి మార్గం మొదటిది చమత్కారం. చమత్కారం తర్వాత సంస్కారం. సంస్కారం తర్వాత పరోపకారం. ఆపై ఆత్మ విచార మార్గంలో సాక్షాత్కారం. కాబట్టి చమత్కారం లేకపోతే కలియుగంలో మానవుడు ఆకర్షింపబడడు. చమత్కారం అన్నా లీల అన్నా ఒకటి. లీల అంటే లీనం చేసుకొని లీనం చేసుకున్న తర్వాత లయం చేసుకుంటే దాని పేరు లీల. మనం లీల అంటే మహిమ అనుకుంటాం కానీ కాదు. లీల వేరు. లీ లిమయతే గమయతే ఇతి లింగాః అంటాం. ఆయనే అంతే ఈశ్వరుడు కూడా లీమయతే మనల్ని ఆ శివలింగం అయిపి నడిపిస్తాడు. అంటే గమయతే వెళ్ళిన తర్వాత దానిలో మనల్ని ఐక్యం చేసుకుంటాడు. ఇక్కడ కూడా అంతే ముందు లీలగా ఒక మహిమా స్వరూపంగా అనేకమైనటువంటి మానవాతీతమైన ఇంద్రియాతీతమైన అద్భుత శక్తుల ప్రదర్శన అయిపోయిన తర్వాత ఆ వ్యక్తిని ఆ జీవుడిని తనలో లయం చేసుకుంటాడు. కనుక ఇది లీలా మాయా మానుష వేషం. మళ్ళీ అత్యంత సాధారణమైనటువంటి స్థితిలో లోక నిష్ఠని వ్యవహార నిష్ఠని అద్భుతంగా సవ్యసాచి అయి నడిపిస్తాడు. మరి గురువు దైవమో పరమాత్మో చిచ్ఛక్తో ఏది కానివ్వండి ఈ లోకంలో లోకంతో లోకులతో లోక సంబంధ కార్యాలు చక్కబెట్టకపోయినట్లయితే మరి అవతారం మనకు అర్థం కాదు గనుక. వారు నిర్మించిన భవనాలు చేయించిన ప్రాజెక్టులు అవన్నీ మనకా కథ అదే. దాన్ని ఎందుకని అంటే ఆ లీలా వైభవంలో ప్రదర్శన మాత్రమే కాదు నిదర్శన కావాలి. రాముడు రాజు డబ్బుంది కృష్ణుడు రాజుల్ని చేశాడు కాబట్టి ఆయనకి అంటే కంఫర్టబుల్ బ్యాక్గ్రౌండ్ అది. స్వామిది కాదు. పుట్టపర్తి గ్రామంలో జన్మించినప్పుడు ఇల్లు లేవు పుట్టలు తప్ప మనుషులు లేరు పాములు తప్ప అయినప్పటికీ ప్రపంచం అంతా కూడా ఆయనను అనుమానించినా అవమానించినా రెండింటినీ దాటుకుంటూ తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నటువంటి మహా పరిపూర్ణ అవతారమే భగవాన్ శ్రీ సత్య సాయి. మరి శ్రీరాముడు తనకు తానే పేరు పెట్టుకున్నాడు కదా కృష్ణుడికి ఎవరు పేరు పెట్టారు అని అక్కడికి కూడా రావాలి మనం. కృష్ణుడు చెరసాలలో పుట్టినప్పుడు దేవకీ దేవి అప్పుడే కన్న తన బిడ్డతో మాట్లాడింది. ఏం మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది అంటే, నాయనా! సర్వ ఆభరణాలతో అతిమానవీయంగా జన్మ ఎత్తుచావు. ఇప్పటివరకు పుట్టిన వాళ్ళు మాములు బిడ్డలు శిశువుల వలే వచ్చారు. నువ్వేమిటి? ఇంత ఈ తేజస్సు ఏమిటి? ఈ ఆభరణాలు ఏమిటి? ఇది గనుక నీ మేనమామ చూస్తే నిన్ను మృచుకుగా భావిస్తాడు గనుక మామూలుగా నాకు కనిపించమని అడిగింది. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు. "ఆమె పేరు పెట్టలేదు, వసుదేవుడు పేరు పెట్టలేదు తనకు తాను" ఆయన చెరసాలలో పెట్టుకున్న పేరు ఏమిటంటే వామనావతార ఘట్టంలో కృతయుగంలో నేను వృష్ణి గర్భుడు అనేటువంటి వాడిని ఆ కుటుంబంలో పుట్టాను. అప్పుడు నాకు వృష్ణి గర్భుడు అని పేరు అందరూ పలకలే-పలకలేరు గనుక మాధవా అని పిలిచేవారు. మాధవ అంటే మా ధవుడు మా అంటే భూమి. భూమి ధవుడు గనుక మూడు అడుగుల నేల తీసుకున్నాను గనుక నన్ను మాధవా అని పిలిచేవారు. ఆ తర్వాత నన్ను నారాయణ అని పిలిచారు. ఈ జన్మలో నేను కృష్ణ పరమాత్మగా కృష్ణుడిగా నన్ను పిలుస్తారు. కర్షతి ఇతి కృష్ణః కృషతి ఇతి కృష్ణః అని చెప్తూ కర్షతి అంటే ఆకర్షణ ప్రధానం లీల వల్ల మహిమ వల్ల. అలాగే కర్షతి వ్యవసాయం అంటే నిరంతరమైనటువంటి ఒక పని చేయడమే ఆయన పని. రెస్ట్ లెస్ గా పని చేస్తారంటామే, ఇవాళ వర్క్ హాలిక్ అంటున్నాం అటువంటిది. కాబట్టి అందువల్ల వస్తాను అందువల్ల నన్ను కృష్ణుడు అని పిలుస్తారు అని అన్నాడు. అంతే కాదు ఈ కృష్ణ శబ్దం దీనిలో ఏమున్నది అంటే కర్షతి, కరుణ, మహిమ, లీల పదహారు కళలు ఒక చోట ఉంటాయి గనుక ఆ పదహారు కళలని ఈ ప్రపంచాన్ని వరం మత్తి చేయటంతోనే వాడుకుంటాను నేను ఒక కృష్ణుడిని అని చెప్పాడాయన. కాబట్టి చెరసాలలో తన పేరు తాను బహిర్గతం చేసుకున్నాడు కృష్ణుడు. రాముడు ముందే పెట్టుకున్నాడు. సత్య సాయి భగవానుడు సత్యనారాయణ రాజు సత్య సాయి ఎలా అయినాడు? ఔపదేయమ్మునకు సత్య నామం బిచ్చి నరత కళ్ళ ధర్మ Neerati నెరపి ఎల్ల సృష్టిని శాంతి కాంతుల వెలార్చి వచ్చె మా స్వామి మల్హారమై విచ్చె మా స్వామి కల్హారమై ఇది. ఎప్పుడో ఓ ముప్పై ఏళ్ల క్రితం ఒక ఆశువుగా వచ్చినటువంటి ఒక విషయం ఇది ఓ సత్సంగంలో. ఔపదేయం అంటే ఉపాధి శరీరం. దానికొక పేరు ఉండాలిగా ఐడెంటిఫికేషన్ కాబట్టి సత్యం అని పేరు పెట్టుకున్నది స్వామి. ఔపధేయమ్మునకు సత్య నామం బిచ్చినడకకెల్ల ధర్మ నిరతి నెరపి తాను ఏ మార్గంలో నడిచారో అది ధర్మమార్గమైంది. ఆయన ధర్మమార్గంలో నడవటం కాదు, ఆయన నడిచిన మార్గమే ధర్మమార్గమైపోయింది. ఎల్ల సృష్టిని శాంతి కాంతుల వెలార్చి, శాంతిని కాంతిని క్రాంతిని వెలార్చి అద్భుతంగా ప్రకటన చేసి, వచ్చమా స్వామి మల్హారమై, మల్హారం అంటే బంగారం. అంతేనా? అంటే, విచ్చమా స్వామి కలహారమై సహస్రదళాల పద్మమై పరిపూర్ణమైనటువంటి ఒక శోభతో ఒక విభూతి యోగంతో ఆవిష్కరించుకున్నారు స్వామి అని మన భావన. ఇది సత్యం. కనుక దీనిలో ఏమి విడువున్నాయంటే, పేరులో సత్యం ఉన్నది, స్వామి నడిచిన దారి ధర్మమైంది సత్య ధర్మాలున్నాయి, శాంతి ప్రేమలు లోకానికి నేర్పారు ఇచ్చారు మార్గం చెప్పారు. రావటం రావటమే బంగారమై అంటే శుద్ధ చైతన్యమై ఇచ్చారు. ఆయన హిరణ్యగర్భుడు గనుక అలాగే కలహారమై ఉన్నారు. సహస్రదళాలు వెయ్యి దళాలతో ఉన్నటువంటి మహాపద్మం వలె, మహాపద్మం ఎవరిది? శ్రీమహావిష్ణువుది. కనుక ఒక వైభవంతో విరాజిల్లేటువంటి సర్వవ్యాప్తి కావలసినటువంటి వైష్ణవ తత్వంతో ఉంటూ తనను తాను అర్ధనారీశ్వర తత్వంలో ఇముడ్చుకొని తాను శివుడై, రుద్రుడై, మాహేశ్వరుడై ముప్పై ఏ-- ముప్పై రెండు అంశాలతో aspects అంటాం. ఆ ముప్పై రెండు aspects కూడా స్వామి యందు ఉన్నాయి. కనుక ఎవరు ఈయన అంటే మాములుగా శివశక్తి స్వరూప అని భజన పాడతాం. శివశక్తి స్వరూపమే కాదు, శివకేశవ స్వరూపం కూడా స్వామి. వైభవంలో చూస్తే కేశవులు, వైరాగ్యంలో చూస్తే శివుడు. ఈ రెండూ కలిసి కలబోతగా వచ్చినటువంటి ఏకైక అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి. ఎట్లా? అంటే శ్రీరామచంద్రుడు శ్రీవైష్ణవ మూర్తిగా, రామచంద్రుడుగా, రామభద్రుడుగా, జగదానంద కారకుడుగా వస్తే ఆయన కార్యకలాపాల్లో ఆయనకై వచ్చిన అంశావతారము హనుమ. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి కొంతకాలం సంచారం చేశారు. శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి శివుడితో పని లేకపోయింది. మరి ఏమున్నది అంటే ఆ విభూతే అష్టసిద్ధులై అది ఎనిమిది భార్యలుగా పదహారువేల గోపకాంతలుగా అంటే పదహారు చిట్కలు పదహారు వేలుగా ఆవిష్కరింపబడి, ఇదంతా కూడా ఒక multiplication కృష్ణుడి విషయంలో. అక్కడ శివు-- ప్రమేయం లేకుండా తనను తాను నడిపించుకొని చిట్కలలన్నీ వెంబడి తెచ్చుకొని అనిమాది సిద్ధులన్నీ తన దగ్గర పెట్టుకొని లీలామయా మానవ వేషమైనటువంటి పరమాత్మగా కృష్ణుడు లీలాకాండ సాగించాడు. సత్యసాయి భగవానుడు అవతారమూర్తిగా వస్తూనే కేశవ స్థాయిలో కేశవ భావనలో తాను ఉన్నటువంటి పుటపర్తిని central point చేసుకుని అంటే కేంద్ర బిందువును చేసుకుని సమస్త ప్రపంచం వైపు వ్యాపించినటువంటి స్థితి ఎందువలన అంటే ఆయన వైష్ణవ మూర్తి గనుక, శ్రీమహావిష్ణువు గనుక. కనుకనే సమస్త సంపదలు వారి అరచేత ఉండేవి. ఏదైనా సృష్టింపగలిగినటువంటి పరమాద్భుతమైన శక్తి. ఎందుకంటే ఆ-ఆయన ఆ aspect లో చూసినప్పుడు స్వామి హరితో కూడిన శ్రీ, శ్రీతో కూడిన హరి. శ్రీ లేని హరి కాదు ఆయన. ఆ శ్రీ కేవలం భౌతిక ప్రపంచానికి సంబంధించిన శ్రీ మాత్రమే కాదు కదలని శ్రీ. అది ఆత్మజ్ఞానం. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని, జ్ఞానాన్ని, సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానాన్ని అన్నింటినీ ఏకం చేసినటువంటి పరమాత్మ భగవాన్ శ్రీ సత్యసాయి. మరి ఇక శివావతారం ఎట్లా అయిందది? అంటే సృష్టి, స్థితి, లయ. బ్రహ్మకి ఎప్పుడూ ఈ ప్రపంచంతో సంబంధం లేదు. ఆయన సృష్టి రచన చేస్తూ ఉంటాడు. సరే స్థితి కారకుడైనటువంటి శ్రీమహావిష్ణువు అవతారాలు ఎత్తుతూ వచ్చాడు. ఇక్కడ సత్యసాయి భగవానుడు శివకేశవ అవతారం కాబట్టి వారొక అద్వైత మూర్తి గనుక కేవలం శివకేశవుడు మాత్రమే కాదు సమస్త ప్రపంచంలో పుట్టినటువంటి సర్వ మతాలలో ఉన్నటువంటి సారభూతమైనటువంటి సాకారమైన సాలంకృత శరీరమే భగవాన్ శ్రీ సత్యసాయి. కనుక అన్ని మతాలు వారిని గౌరవించినాయి. ఎందుకని? వారు ఏ మతాన్ని ఉపాసిస్తున్నారో, దేని ఆదర్శ భావాలతో జీవితాలను చక్కగా తీర్చిదిద్దుకుంటున్నారో వాటన్నింటినీ కూడా స్వామి నిరూపణం చేశారు. అంటే ఇవాళ భాషలో స్వామికి inclusiveness ఉంది అంతే. దేనినైనా అంగీకరించే కరుణా సముద్రం. సముద్రం అంటే దేనినైనా తీసుకుంటుంది. ఇది కూడా అంటే సత్యసాయి భగవానుడు కూడా దేనినైనా అంగీకరించి తనలో ఇముడ్చుకోగలిగినటువంటి ఆ ధీశక్తి సదాశివ శక్తిగా భావన చేయాలి. ముప్పై రెండు అంశాలకు మూలమైనటువంటి ఆయన రుద్రాంశుడు కాదు, రుద్రమే సత్యసాయి భగవానుడు. రుద్రం అంటే మనం చదువుకునే శ్లోకాలు కాదు. రుద్రము, మహేశ్వరము అందులో ఆ ముప్పై రెండు నామాల్లో శివుడికి ఒక పేరుంది. ఈ ముప్పై రెండు aspects లో దాని పేరు సత్య. దాని పేరు సహ. ఇటువంటివన్నీ కూడా మనం చాలా లోతుగా అర్థం చేసుకుంటే కానీ స్వామి పరదైవతం ఎట్లా అయినారో మనకు తెలియదు. దేవుణ్ణి మనం చేయలేం. ఆయన దేవుడని కొంత గ్రహించగలిగాం. దేవుళ్ళని చేస్తాం మనం. కొంతమంది యొన్న అభిమానం, వ్యక్తిగతమైన పూజల వలన, వ్యక్తి పూజ వలన, భావావేశం వలన ఎవరినో దేవుడు అనేసుకుంటాం. ఈయనని మనం దేవుడు అనుకోలేం. ఆ దివ్యత్వాన్ని సమస్తమైనటువంటి మానవజాతి అనుభవించింది గనుక దైవమంటూ ఒకడు ఉంటే ఆయన ఇదిగో ఇట్లాగే గనుక ఎప్పుడైనా ఒక ఆకారం తీసుకుని వస్తేసశరీరంగా ఉంటే, సాకారంగా ఉంటే అది భగవాన్ శ్రీ సత్య సాయి అని ఒక నిరూపణ చేసుకున్నటువంటి ఒక సందర్భం. ఇది జరిగి తొంభై ఆరు సంవత్సరాలు అయిపోయింది. ఈ తొంభై ఆరు సంవత్సరాలలో తొలి పదహారు ఏళ్ళు స్వామి సత్యనారాయణ రాజుగానే ఉన్నారు. తర్వాత 2003 నుంచి 2011 వరకు దక్షిణామూర్తి వలె ఉన్నారు, మౌన వ్యాఖ్య చేశారు. సంజ్ఞాపూర్వకమైనటువంటి అనుగ్రహ విశేషంతో ఈ సర్వ జగత్తుని తమ దివ్య పాదపీఠం వైపు నడిపించారు. అంతేకాదు సనాతనమైన వైదికమైనటువంటి ఒక ఆర్ష భారతీయ ధర్మాన్ని ఎట్లా మనం అనుభవించాలో, దాని లోతులు మనం ఎలా ఎరగాలో, కేవలం rituals లో మాత్రమే మునిగిపోకుండా spiritualize ఎలా చేసుకోవాలో, spiritualize చేసిన ఈ భావాలకి సంక్షిప్తమైనటువంటి రెండు మార్గాలు ఒకటి బహిరంగంగా ఉండే బాహ్య మార్గం. బాహ్య మార్గము సేవ. అంతర్ మార్గం లోచూపు, లోదర్శనం అది ప్రేమ. కాబట్టి లోపల ప్రేమ ఉండాలి, బయట సేవగా కనపడాలి. బయట సేవగా ఉన్నది లోపల ఉన్న ప్రేమతో రోజూ ఆనందాన్ని అది ఆహ్ ఆస్వాదిస్తూ ఉండాలి. కాబట్టి సేవా ప్రేమ అనేటువంటి రెండు దివ్య భావనలతో ప్రపంచాన్ని డెబ్బై రెండు సంవత్సరాలు demonstrative గా నడిపించారు. ఒక్క క్షణం విరామం లేకుండా స్వామి నడిపించారు. మరి డెబ్బై రెండు ప్లస్ పధ్నాలుగు, ఎనభై ఆరు. పూర్తయిపోయింది. ఎనభై ఆరు అయ్యేప్పటికి ఈ ప్రపంచం అంతా కూడా సత్యసాయిమయం అయిపోయింది. సాయిరామ్ అనేటువంటి ఒక అద్భుత రామంతో అది ప్రతిధ్వనిస్తూ వచ్చింది. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఇవాళ avatar declaration day నాడు మనం విచారణ చేయాలి. అది అందులో మొట్టమొదటిది రాముడి కథ Valmiki రాశాడు, కృష్ణుడి కథ వ్యాసులవారు రాశారు. రాముడి కృష్ణుడి అంటే రాముడి కథ, కృష్ణుడి కథ ఈ రెండు సత్యసాయి భగవానుడు స్వయంగా రాశారు. అది సరస్వతీ స్వరూపం కాబట్టి. అలాగే సర్వోపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు వీటన్నిటికి కూడా భాష్యం స్వయంగా కూర్చొని రాశారు. ప్రధానంగా భగవద్గీత కూడా గీతా భాష్యం రాశారు. అయితే దానికి వారు పెట్టిన పేరు వాహిని. ఆ మకరంతో ఈ వాహిని స్వరూపాలన్నీ కూడా ఆవిష్కరించింది. అసలు సనాతనమైన ధర్మంలో ఏమున్నది, ఎందుకు ఇన్ని చెప్పబడ్డాయి అని మనకు వాఙ్మయాన్ని ఒక విభూతిగా అందించారు. ఇది ఏ అవతారం చేయలేదు. ఇక రెండవది, రాముడు సీతాన్వేషణకై అయోధ్య నుంచి శ్రీలంక వరకు ప్రయాణం చేశాడు. సముద్రోల్లంఘనం చేశాడు. సత్యసాయి భగవానుడు తాను పుట్టిన ప్రదేశం నుంచి కదలకుండా ఒకే ఒక్కసారి మాత్రం Uganda కు వెళ్లి వెనక్కి వచ్చేశారు. అక్కడున్న మానవ జాతిని ఒక్కసారి awake చేయటానికి, మేల్కొలపడానికి, "ఈ లాలసల్లో పడకండి, మీ ప్రాణాలు పోతాయి జాగ్రత్త పడండి" అని చెప్పడానికి ఆ ఒక్కసారి వెళ్లారు. అక్కడ ధర్మ ప్రబోధం కంటే కూడా జాగరణ, జన జాగరణ ప్రధానంగా చేశారు. ఇక ఆపై ఏనాడు ఆయన ఆహ్ పరదేశానికి వెళ్ళలేదు. అంటే స్వ-స్వీయమైన స్వదేశంలో ఉంటూ భారతీయమైనటువంటి ఒక ఆత్మని ఆవిష్కరిస్తూ సనాతన ధర్మంలో దాగినటువంటి పరమ గుహ్యమైన విషయాలను అరచి-- అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులభంగా తనదైనటువంటి మాతృభాషలోనే మాట్లాడారు ఇది. అలాగే దైవభక్తిని ఒకవైపు, దేశభక్తిని రెండోవైపు. నిజానికి శ్రీరాముడి కాలంలో ఆయన ఒక్కమాట అన్నాడు. ఏమన్నాడంటే, రావణ సంహారం అయిపోయింది, లంకానగరం అంతా కూడా దేదీప్యమానంగా వెలిగిపోతున్నది బంగారు గోడలతో. బంగారంతో సృష్టించాడు, నిర్మించాడు. షష్టి యోజన విస్తీర్ణం శతయోజన సమున్నతం అష్టద్వార పురీ లంకాం సప్త ప్రాకార సోహితం త్రికోణ ఖండకం చైవ నవకోటి శివాలయం చాతుర్లక్షంచ వీధీనాం రావణేన సురక్షితం. అంత పరమాద్భుతమైన వాస్తు శాస్త్రం ప్రకారం కట్టాడు. కానీ గుణము బలహీనమైన కారణంగా ప్రాణం పోగొట్టుకున్నాడు. అది వేరే సంగతి. అప్పుడు లక్ష్మణస్వామి రాముడితో అన్నాడు, "మనకి ఎలాగో అయోధ్య ఉంది, మనమే జయించాం కదా రావణుడిని, లంకను కూడా మనం మనమే కైవసం చేసుకొని మన రాజ్యాధికారాన్ని ప్రకటన చేద్దాము అన్న" అని అడిగాడు. "అపి స్వర్ణమయి లంక" రాముడి మాట ఇది Valmiki రామాయణంలో. అపి స్వర్ణమయి లంక, లంక స్వర్ణమయం అయినప్పటికీ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి. మన తల్లి, మనం పుట్టిన నేల ఈ రెండూ స్వర్గం కంటే చాలా గొప్పవి అని తమ్ముడిని వారించాడు. అక్కడ పుట్టింది ఈ మాతృదేశ భక్తి. సత్యసాయి భగవానుడి దివ్యోపన్యాసాల నిండా దేశభక్తి లేకుండా ఏ పద్యమూ ఆయన చెప్పలేదు. ఈ దేశం యొక్క ఔన్నత్యం, ఈ దేశానికి జ్ఞాన వరదానం చేసినటువంటి మహాపురుషుల సంస్మరణ. ఉదాహరణకి శంకర భగవత్పాదుల భజగోవిందాన్ని స్వామి చక్కగా అచ్చ తెలుగులో రాసి, స్వయంగా గానం చేసి, స్వయంగా వ్యాఖ్యానం చేశారు. ఇది మిగతా ఏ అవతారం ఇంతవరకు చేయలేదు. కాబట్టి అలాగే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వీరి గురించి స్వామి చాలా సార్లు ప్రస్తావన చేస్తూ భారతీయమైనటువంటి మహాపురుషుల యందు మనకు కూడా భక్తి కలిగేలాగా వారు మనకి దివ్యోపన్యాసాలు అనుగ్రహించారు. ఇకరామకృష్ణావతారాలకి లేదా రామకృష్ణ అవతారాలకి గాయత్రి వారి అవతార పరిసమాప్తి తర్వాత ఏర్పడింది. సత్యసాయి భగవానునికి వారు దేహంలో ఉండగా ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఏడు డిసెంబరు ఇరవై నాలుగవ తారీఖున వైట్ ఫీల్డ్ లో గండికోట సుబ్రహ్మణ్యశాస్త్రి గారి నోటివెంట వెలువడినదే సత్యసాయి గాయత్రి. ఇది ఏ అవతారము సాధించని అవతారము ప్రకటించనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక గాయత్రి. గాయత్రి అంటే మూడు శక్తులు మనకు తెలుసు గాయత్రి, సావిత్రి, సరస్వతి. ఈ మూడు మీ యందు ఉన్నాయి మీలో మీరు దానిని నిద్రాణంగా ఉన్నాయి కుండలిని లోపల్నుంచి చేయడని పెద్ద వైదాంతికమైన పదాలు చెప్పకుండా ఈ సత్యసాయి గాయత్రిని చదవాలి అని అనుకుంటుండంగానే దాని ఫలితం మీకు ఉంటుందని, దాని యందు అనేకమైనటువంటి ఆ బీజాక్షరాలు దాగి ఉన్నాయని స్వామి ప్రకటన చేయటం ఆ గాయత్రి సత్యసాయి గాయత్రి మనందరం కూడా ఈవేళ పారాయణం చేసుకోవటం ఉపాసన చేయటం మనం ఎరిగినదే మనం చేస్తున్నదే. కాబట్టి మిగతా అవతారాలకంటే భిన్నంగా సంఘర్షణ లేదు స్వామి ఎవరితో యుద్ధం చేయలే, ఎవరిని రాజుని చేయలేదు, ఎవరిని బిక్కారిని చేయలే. పైగా ఒక మాట అన్నారు "మీరు అనుభవించే కష్టాలన్నీ మీ కర్మ ఫలితాలే, అవి ప్రత్యేకంగా ఎవరో ఆకాశంలో ఎవరో ఉండి మీకు ఇచ్చినవి కావు. మీ ఆలోచన, నీ కర్మ, నీవు చేస్తున్నటువంటి విషయాలు సమన్వయం లేక ప్రజాహితం కానప్పుడు దాని వలన వచ్చే కర్మ ఫలితాన్ని నీవే కష్టము అనే రూపంలో అనుభవిస్తున్నావు. నా దగ్గరకు వచ్చి స్వామి ఈ కష్టం తీసెయ్ అంటే, తీయటం నాకు కష్టం కాదు చాలా సులభం కానీ నీ మూట అక్కడే ఉంటుంది. మళ్లీ నువ్వు ఒక జన్మ ఎత్తాలి ఆ మూటతో సహా జన్మ ఎత్తుతావు. కనుక నువ్వు స్వామిని ఏమని ప్రార్థించాలంటే, కష్టం వచ్చింది స్వామి! దీన్నుంచి బయటపడేటువంటి శక్తి నివ్వు" అని అడగాలి. అడిగినట్లయితే ఆ కష్టమే నీకు కర్మ నిష్ఠగా మారిపోతుంది. కర్మ నిష్ఠలో భక్తి ఉంది, విచక్షణ ఉంది, వివేకం ఉంది, జ్ఞానం ఉంది అని స్వామి చిన్న చిన్న విషయాలని. ఏదో నేను మీ అందరికీ మోక్షం ఇస్తాను ఒక్కరికి promise చేయలే స్వామి. అసలు స్వామి అవతారం మోక్షం ఇవ్వటానికి రాలే. మనమందరం అనుకుంటాం కిమర్జనం స్వామి శ్రీ మర్జనం స్వామి అని మనం అనుకుంటాం. ఆయన అవతారం అది కాదు. ఆ ఏమిటి అవతారం యొక్క ఈ descent యొక్క central core aspect ఏమిటి అంటే man making process. మనల్ని మనుషులుగా ఉండటం లేదు కనుక దీనత్వము, దానవత్వము పక్కకు నెట్టి మానవత్వాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించుకునే దిశగా మనం గనుక జీవితాన్ని గడిపినట్లయితే దాని పేరే మాధవత్వం. మాధవుడు వేరే లేడు. దానవత్వమే మాధవత్వం రూపాయ్ బిళ్ళకి బొమ్మ-బొమ్మ బొరుసు ఎట్లా ఉన్నాయో ఆ ఆచరించినంత కాలము ఆ మానవుడిగా ఉంటాడు ధర్మాచరణుడు. మాధవుడు అంటే తనలో ఉన్నటువంటి దివ్యాత్మను తాను ఎరిగి ఉండటమే మాధవత్వం. మాధవుడు "దేవుడనగా వేరు దేశమున లేడు, తాను చేయు పనుల యందు తగిలి ఉండు" స్వామి మాటే ఇది. కాబట్టి దేవుణ్ణి నువ్వు ఎక్కడ వెతుకుతావ్ అంటే ఆయన లేని చోట ఏదన్నా ఉంటే చెప్తే అక్కడికి పోయి వెతుకుతాం. ఉన్నచోట అంతటా ఉన్నాడు గనుక ఇక వెతికేది లేదు. జీవుడు తనకున్నటువంటి మనో వృత్తులు, చిత్తవృత్తుల కారణంగా దైవాన్ని పెడగా, ప-పరంగ, దూరంగా భావించి ఆయన ఎక్కడో ఉన్నాడని అనుకుంటారు అట్లా లేరు. కనుక నిజానికి ఎక్కడ ఉన్నాడంటే నువ్వు చేసే పనులలో ఉన్నాడు అని ఒకసారి చెప్తూ డెబ్బై రెండు సంవత్సరాల సంబోధనలో అవతార ప్రకటన తర్వాత మనందరినీ స్వామి ఉద్దేశించింది శిష్యులారా అనలే, భక్తులారా అసలనలే, ఏమన్నారు? దివ్యాత్మ స్వరూపులారా అది. మనందరి యందు ఆయన చూసింది ఆత్మను చూశారు. మన ఒట్టు, పొడుగు, మన degrees లు వాటితో ఎట్టి సంబంధం ఆయనకు లేదు. అవన్నీ మనం సంపాదించుకున్నవి మనమే ఇక్కడ వదిలిపెట్టి కూడా వెళ్ళవలసినవి. ఇటువంటి వైరాగ్య విభూతిని ఇంత అందంగా ఆవిష్కరించినటువంటి వారు లేరు. రాజైన వాడు, కోశాగారం ఉన్నటువంటి వాడు ఎన్ని పనులైనా, ఎన్ని కట్టడాలైనా కట్టవచ్చు. అటువంటి అవకాశమే లేని ఒక సత్యసాయి భగవానుడు ఎయిత్th standard కూడా లోక విద్యను పూర్తి చేయని సత్యసాయి భగవానుడు ప్రపంచానికి ఆదర్శవంతమైన యూనివర్సిటీని, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని, తాను నారాయణ స్వరూపం గనుక తన కాలి బొటనవేలు కింద ఉన్నటువంటి పాతాళ గంగని బయటకు తీసుకొచ్చి అనేక క్షేత్రాల్లో దాహార్తిని తీర్చినటువంటి మహా వరదాత. ఆయన్ని ఆ మధ్యలో అపర భగీరథుడు అన్నారు. ఎంత అవమానం అండి! అపర అంటే duplicate అని అర్థం. తెలీదు తెలియక వాడే భగీరథుడు గంగను తెచ్చాడు గనుక, స్వామి నీళ్ళు ఇచ్చాడు గనుక ఈయన అపర భగీరథుడా? కాదు. తన కాలి బొటనవేలు కింద ఉన్నటువంటి ఆ భూజలం ఏదైతే ఉన్నదో దాన్ని ఒక్కసారి ఉగత్తున పొంగించారు, అందరికీ పంచిపెట్టారు నిరపేక్షంగా. కాబట్టి సత్యసాయి భగవానుని అవతారం అంటే కేవలం ఉంగరానికి, బొంగరానికి పరిమితమైన అవతారం కాదిది. రాజాధిరాజులు స్వామి యొక్క పాదపీఠం దగ్గరికి వచ్చారు. ప్రపంచంలో ఒక మేధావి అని అనిపించుకున్న ప్రతి వాడు అక్కడికి చేరుకున్నాడు. సంగీతంలో, సాహిత్యంలో, వాఙ్మయంలో, శాస్త్రంలో, సైన్స్ లో వీటన్నింటిలో ఇంతకంటే ఉత్తముడు లేడు అనిపించుకున్న ప్రతి వాడు స్వామి దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు అని? వాళ్ళు అప్పటికే ఆ సాధించేశారు కదా అంటే, ఈ సాధించినదంతా నిజమేనా?ఇదంతా మా వల్లనే జరిగిందా? దీనికి కారణాలు ఏమున్నాయి? అని తెలుసుకొని ఇది భగవంతుడు చేయించిన పని, భగవంతుని చేతిలో మనం పనిముట్టైనాం అనేటువంటి భావనని తెలుసుకోవటానికి సత్యసాయి భగవానుడి దగ్గరికి వచ్చారు. ఒక girl student ని, ఆ అమ్మాయి వివాహమై స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి ఆ అమ్మాయిని ఒక ప్రశ్న వేశారు. "నీకు వివాహం అయింది కదా, ఎవరన్నా వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతారు, ఏమని సమాధానం ఇస్తావు?" అని అడిగారు. ఆమె ఏమన్నదంటే, "స్వామి! నేను ఉద్యోగం గనుక చేసేట్లైతే ఏ ఉద్యోగం చేస్తున్నాను అని చెప్తాను. ఒకవేళ ఉద్యోగం ఏం చేయకపోయినట్లైతే house wife ని అని చెప్తాను" అని అన్నది. స్వామి వెంటనే "కాదు కాదు, నువ్వు ఆ ఇంటి గృహలక్ష్మి, నేను మా ఇంటికి గృహలక్ష్మిని అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు నీ భర్తకి ఇప్పటికే wife అయిపోయినావు. నీ ఇంటికి నువ్వు లక్ష్మీదేవి వలే ఉండాలి. కనుక నీవు గృహలక్ష్మివి" అని ఇటువంటి ఉదాత్తమైనటువంటి భావనలన్నింటినీ కూడా చాలా చక్కగా, చాలా స్పష్టంగా అది ఒక అద్భుతమైన correction process at mind level. అది స్వామి చాలా సునాయాసంగా సాధించి మానవుడు ఎలా బతకాలో నేర్పారు. జీవితాన్ని దాటి స్వామి చెప్పలే, నేను మోక్షం ఇవ్వటానికి వచ్చానని అసలు చెప్పలే. మన కష్టాన్ని మనం అనుభవించమన్నారు. ఎందుకీ మూటలు మోసుకుంటూ వెళ్తారన్నారు. కాబట్టి ఇదొక పరిపూర్ణమైనటువంటి అవతారంగా నేను భావన చేస్తూ, ఈ Avatar Declaration Day నాడు వేడుక చేద్దామా? కేవలం ఇది కూడా ఒక పండుగ జరిపేద్దామా? కాసేపు ఏదో చిన్న package లాగా ఒక program పెట్టుకొని Avatar Declaration Day celebrated very well అని comma పెట్టి by the grace of Swami అని రాసేసుకుందామా? అంటే చేయవలసిందే. అది మాత్రమే కాదు, అది చేస్తూనే దానిలో ఉద్వేగకరం కానటువంటి, అనుద్వేగకరమైనటువంటి, భావావేశం లేని భక్తి ఆవేశం మాత్రమే ఉండేటువంటి ఒక commitment తో సత్యసాయి భగవానుడు ఈ ప్రపంచానికి ఏ ఆలోచనని, ఆదర్శాన్ని నిరపేక్షంగా నేర్పారో, వాటిని ఇవ్వాళ మనం విటెల్ లాంప్ అంటాం. మన చేతిలో కంచు కాగడా. ఆ భావాన్ని మనం ఒక దీక్షా కంకణ బద్ధులమై మనం ఈ ప్రపంచంలోకి సత్యసాయి భగవానుడి యొక్క దివ్య సందేశాన్ని వాడవాడలా ఇంచి ఇంచీకి దాన్ని తీసుకుని వెళ్ళవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే స్వామి చెప్పినట్లు "చెప్పుట సులభము, చేయుటే కష్టం". చెప్తూ ఉన్నాం, చేసేది ఎప్పుడు అని. చేయాలి, ప్రారంభం చేయాలి. ఆ ప్రారంభం చేసి చేస్తూ వెళుతూ వెళుతూ ఉంటే ఆ మార్గంలో ఒక నది చూడండి ఎక్కడ పుడుతుందో. తన దారిని ఎత్తు పల్లాలు దాటుకుంటూ ముళ్ళ కంచరని, రాళ్ళని, రెప్పలని దాటుకొని ఇసుక పర్రాలలో ప్రవేశించి తనను తాను క్షాళనం చేసుకొని సముద్రంలో ఎట్లాగైతే సంగమిస్తుందో, మనం కూడా నదీ సదృశమైనటువంటి, నదీ ప్రవాహ సదృశమైనటువంటి మన జీవితాన్ని కూడా అధ్యాత్మ మార్గంలో ఎన్ని అవరోధాలు కలగని, ఎన్ని ఆటంకాలు ఏర్పడని, ఎన్నెన్ని ఆ-- అసంబద్ధమైనవి జరగని వాటన్నింటినీ అధిగమించి భగవంతుని యందు ఉన్నటువంటి ప్రేమతో, ధీ శక్తితో మన జీవితాన్ని గనుక మనం క్షాళన చేసుకుంటూ వెళ్ళినట్లయితే మన వెనక వచ్చేటువంటి తరాలు కూడా అదే మార్గంలో వెళతాయి. ముందు వేసినటువంటి ఆ దారి పరచినటువంటి సత్యసాయి భగవానుడి యొక్క దివ్య మహా స్మృతికి మనము నిరంతరము ప్రాంజలి ఘటిస్తూ ఆ దాని నుంచి ఒక ఆవేశాన్ని, ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనంతట మనమే పొందుతూ మన జీవితాలని ప్రసన్నము, ప్రశాంతము చేసుకొని మన ద్వారా ఈ సమాజానికి చేయగలిగినంత చేసేటువంటి రీతిలో మనం కూడా మన జీవితాలని ధన్యవంతం చేసుకోవాలని, అందుకై మనం ఇవ్వాళ సత్యసాయి messengers గా, ఈ messenger అంటే చూడండి శ్రీరామచంద్రుడికి హనుమంతుడు ఏమైనాడు? చాలామంది శ్రీరాముడి దాసుడు హనుమ అంటే, "నేను దాసుడ్ని కాదు" అన్నాడు. "నువ్వు శ్రీరాముడికి భక్తుడివి, నీ యంతర భక్తులు లేరయ్యా" అన్నారు. "అసలు నేను భక్తుడ్నే కాదు" అన్నాడు. "మరి ఎవరు నువ్వు?" అంటే "శ్రీరామ దూతని" అన్నాడాయన. శ్రీరామ దూతం శిరసా నమామి. మనమివ్వళ రామదూతగానే మనం, శ్రీరామదూతగా మనం అనుభవిస్తాం. అంగీకరిస్తుంది మనస్సు. ఎందుకనంటే దాసుడిగా అవటం వైయక్తికం. వ్యక్తిగతంగానే దాసుడ్ని అయిపోవచ్చు, surrender అయిపోవచ్చు స్వామికి. ప్రపంచానికి దానికి సంబంధం లేదు. కానీ దూతని అయినప్పుడు ఆయన లీలా వైభవాన్ని, స్వామితో నడిచిన దారిని, ఎదుర్కొన్న సంఘటనలని, సన్-సన్నివేశాలని, సందర్భాలని పునః పునః పునః పునః చేసుకుంటూ శ్రవణ, మనన, నిధిధ్యాసనం అనేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి యోగ ప్రక్రియలో మనం చక్కగా గనుక నడవగలిగినట్లయితే, జాతికి మనం దిక్సూచి కాగలిగినట్లయితే, మార్గోపదేశనం చేయగలిగినట్లయితే, కేవల ఆకార మానవులుగా కాక ఆచార మానవులుగా మనల్ని మనం నిర్మాణం చేసుకోగలిగినట్లయితే సత్యసాయి యొక్క ఈ వైభవం దశదిశలా వ్యాపించి ప్రపంచం మొత్తము ఒక్కరోజున ప్రశాంత నిదయమై వెలుగుతుందని నేను నమ్ముతూ ఈ అక్టోబర్ ఇరవై, ఈ తొంభై ఆరవ జన్మదిన సంబరంలో ఈ అవతార ప్రకటన సంఘటన మనందరి యందు ఒక ప్రచోదితమైనటువంటి ఒక భావనా శక్తిని, ఆత్మ శక్తిని నిరుపమానమైనటువంటి స్థాయిలో అది ఉద్దీపనం చేస్తుందని, చేయాలని, చేసేట్లుగా మనల్ని అనుగ్రహించమని సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి, తేజో రూపమైనటువంటి సత్యసాయి భగవానునికి విన్నవించుకుంటూ మనందరికీ కూడా మనకి మనం మంగళాశాసనం చేసుకుంటూ స్వామి అందరినీ అందరి హృదయాలలో నిలిచి జాతిని నడిపించు గాక అని మరొక్కసారి మంగళాశాసనం చేస్తూ సాయిరాం.
YouTube · audio
Divya Avatara Prakatana — Part 1
Divya Avatara Prakatana — Part 1
Source: SATHYA PEETHAM on YouTube
0:00 / 49:17
More in this series