Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తురియాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శీలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక ప్రశస్త ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం అలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్పురతాంవే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ "అహం సత్యబోధకః" అనేటువంటి ఒక మకుటంతో సాగిన, సాగుతున్న, సాగబోతున్న సత్సంగ ప్రవాహానికి మరొక్కసారి స్వాగతం పలుకుతూ, ఇవాళ కోటేశ్వరరావు గారు మాట్లాడిన ప్రతి అక్షరాన్ని, వారి హృదయంలో నుంచి వెల్లువికినటువంటి అనేక మార్గదర్శక సూత్రాలని జాగ్రత్తగా గమనించినప్పుడు దీనిని అందరం కూడా స్వామి యొక్క దివ్య సందేశంగా మనం భావన చేయాలి. ఆచరణాత్మకమైనవి, సులభమైనవి, సరళమైనవి, తరళమైనవి, ధవళమైనవి అంటే అత్యంత స్వచ్ఛమైన శుద్ధ చైతన్యంలో నుంచి మాట వచ్చినప్పుడు మాటకు పెనుబలం ఉంటుంది. పైపైన పెదవుల మీద నుంచి వచ్చేది పిలుసుగా మారిపోయి విరిగిపోతుంది. కోటేశ్వరరావు గారు ఏం చెప్పాలో, ఏం చెప్తే మనమందరం కూడా స్వామికి దగ్గరవుతామో, ఇంకా మనం ఏం చేయటం లేదో, చేస్తున్నది ఇంకా చాలదేమో అనేటువంటి అనేకమైనటువంటి పారిశ్రామాలను తడిమి తడిమి organization స్వామి అభిన్న అద్వయ అద్వితీయ రమణీయమైనటువంటి స్వరూపాలు రెండుగా కనిపించే ఒకటి. భౌతికమైన రూపంలో చైతన్యం ఉండదు కానీ భౌతికంగా ఉన్న ప్రతి అణువు నందు కూడా చైతన్యం ఆవహించి, ఆవరించి, ఆవేశించి, అభివ్యక్తమై ఉంటుంది కాబట్టి స్వామి వేరు, సంస్థ వేరు కాదు. స్వామిని పరదైవతంగా భావించి ఎక్కడో ఉన్నారని, ఆయన్ని పట్టుకోవాలని, ఆయన ఇంకా మనకు అర్థం కాలేదని అనుకోక్కర్లేదు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మయయా బహిర్ముద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. అద్వయమైనటువంటి స్థితిలోకి వెళ్ళటం కోసమే మనం మానవ జన్మ ఎత్తాం. ద్వైతంలో ఉన్నాం. నేను, నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి, నా లేకుండా మనం ఏది అభివ్యక్తి చేయలేము. కానీ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే భౌతిక ప్రపంచంలో నా మీద ఆధారపడి ఉన్నది. కానీ కేవల physical స్థాయిలో పరమాత్మని అర్థం చేసుకోలేము. ఆయన రూపం, ఆయన లావణ్యం, ఆయన చేసే పనులు, చేసే సూచనలు అనేకమైన అద్భుతాడంయాలు కంటికి కనిపిస్తాయి. కానీ metaphysical state లో మన మేధాశక్తిని సమన్వయం చేసి అనుసంధానం చేసినప్పుడు మనకున్నటువంటి పరిమితమైనటువంటి intellectual quotient తో సూర్యమండలాన్ని దర్శనం చేద్దామని ఆశ పుడుతుంది. అట్లా కాకుండా సూర్యమండలాన్ని ఎందుకు గమనించాలి? అది ఇచ్చే వేడిమి, పోడిమి, తాళిమి, వెలుగు, రాత్రిపూట చంద్రుడిచ్చే వెన్నెల, ప్రకృతి, పంచభూతాత్మకమైన ప్రపంచం మనందరినీ ఎలా లాలిస్తున్నదో, ఆలిస్తున్నదో, పాలిస్తున్నదో, అదలిస్తున్నదో, మందలిస్తున్నదో, నడిపిస్తున్నదో దాన్ని గమనించినప్పుడు ప్రాతః స్మరామి మనసా. మనసా ప్రాతః ఎప్పుడూ కూడా స్మరామి. స్మరిస్తూ ఉండాలి. నిత్య స్మరణలలో నుంచి మనకు ఆంతరంగికమైనటువంటి ఒక సంస్కార ధార వెల్లుగుతుంది. సంస్కారం culture కాదు, బయట నుంచి వచ్చేది కాదు. అది ఒక జీవధాతువు. సమాజం నుంచి, తల్లిదండ్రుల నుంచి, సహ అధ్యాపకుల నుంచి లేదా సహాధ్యాయుల నుంచి, సహా ప్రపంచం నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా చాలా ఉన్నాయి. అన్నింటినీ గమనించినప్పుడు ఒక ప్రశ్న మనం ఎదుర్కొంటూ ఉంటాం. అనేక ప్రదేశాలకు వెళుతూ ఉంటాం. ఇందాక వారు అన్నట్లు కోటేశ్వరరావు గారు చెప్పినట్లు రమణాశ్రమానికి వెళ్తాను, స్వామి గురించి మాట్లాడుతాను. వాళ్లంతా అత్యంత శ్రద్ధగా వింటారు. అరవింద ఆశ్రమానికి పిలుస్తారు, వెళ్తాను. ఎందుకు పిలుస్తారు అంటే స్వామితో చిన్నప్పటి నుంచి ఉన్నాడనేటువంటి ఒక గౌరవంతో పిలుస్తారు. మరి అక్కడికి వెళ్లి నేను ఏం చేయాలి? నా తల్లి, తండ్రి, గురువు, దైవమైన స్వామిని గురించి మాట్లాడాలి. మాట్లాడినప్పుడు అక్కడున్నటువంటి రమణాశ్రమ భక్తులందరికీ కూడా స్వామి యొక్క దివ్య లీలా వైభవం అర్థమవుతుంది. నెమ్మదిగా ఆలోచన చేస్తారు. మనం ఇక్కడ నేను ఎవరన్న ప్రశ్నలో ఆగిపోకుండా, నేను ఏం చేయాలి అన్నటువంటి ప్రశ్నలోకి మనిషి వస్తాడు. నేను ఎవరన్న ప్రశ్న జ్ఞానానికి సంబంధించింది. నేను ఏం చేయాలి అన్నది భౌతిక, అతిభౌతికమైన స్థాయికి చెందింది. అరవింద ఆశ్రమానికి వెళ్తాం. వెళితే వాళ్ళు కూడా ఇలాగే, ఆహ్ నాకు ఎవరు topic ఇవ్వరు గానీ నేను స్వామిని గురించే మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడుతానంటే అరవింద యోగి తన ధ్యాన యోగం సమాధి స్థితుల ద్వారాఈ భారతదేశానికి 1947 August 15 అంటే ఆయన birthday కూడా అదే గనుక, రోజునే రావాలని సంకల్పం చేశారో, అది వచ్చినందుకు ఆయన ఎంత ఆనందపడ్డారో. అది నాకు విశేషం కాదు. విశేషం ఏమిటంటే 1926 November 22వ తారీఖున ధ్యాన ముద్రాంకితమైనటువంటి అరవింద మహాయోగి దేనిని కోరుకున్నాడంటే, దేనిని సంకల్పించాడంటే, దేనికై తపించాడంటే శ్రీకృష్ణ చైతన్యం మళ్ళీ భూమికి రావాలి అని కోరుకున్నాడు. వడోదరా చెరసాలలో. అది రోజు దిగి రాబోతున్నది అని ప్రకటించినటువంటి ప్రప్రథమ మహాయోగి. ఎవరు శ్రీకృష్ణ చైతన్యం అంటే 1926 November 23న ప్రభవించినటువంటి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారే. మన స్వామి. అంటే స్వామి కృష్ణ చైతన్యమే దిగుతున్నదని చెప్పగలిగిన వాడెవడు? దైవా భూత్వా దైవం యజేత్. దివ్యత్వానికి అంచులదాకా వెళ్ళినవాడు దైవాన్ని గురించి మాట్లాడగలడు. మిగతా వాళ్ళంతా దైవం యొక్క గుణాలు చెప్తారు, దైవంతో అనుభవాలు చెప్తారు, దైవం ఇచ్చిన వరాలు చెప్తారు, దైవం అనుగ్రహించిన కరుణ గురించి చెప్తారు, కానీ దైవం ఏమిటో చెప్పలేరు. ఎందుకంటే అనుభవం లేదు గనుక. కానీ అరవింద యోగం అంటే అనుభవం కూడా కేవలె ధ్యానంలో వచ్చినటువంటి ఒక స్పురణ, ఒక ప్రేరణ, ఒక ఆంతరంగికమైన ఒక దివ్య స్పర్శ. దానిలో నుంచి బాబా వారు ఇలా కృష్ణ చైతన్యం దిగి వచ్చింది అని చెప్పారు. ఇది చెప్పినప్పుడు అరవింద భక్తులందరూ కూడా ఒక్కసారి ఆశ్చర్యపోయినారు. అంటే ఏమిటి, భగవంతుడి యొక్క అవతరణ ప్రకృతి చెప్తుంది. శ్రీరాముడు ఉదయించినప్పుడు అమరేంద్రాసకు పూర్ణచంద్రుడు ఉదితుండైనట్లు నారాయణాంశమున పుట్టే మదాంధ రావణ శిరస్సంఘాత సంచేదన క్రమనోద్దాముడు రాముడు. దరిద్రకున్ కౌసల్యకున్ అంటుంది భాస్కర రామాయణం. అంటే రాముడు వచ్చినప్పుడు ప్రకృతి ఎలా ఉన్నది, పూలన్నీ ఎలా వికసించినయి, మలయ పవనాలు ఎలా వీచినయి, ఋషులంతా తర్పణ ఎలా ఇచ్చారు, ఆకాశం మేఘావృతం కాకుండా ఎలా నిశ్చలంగా, నిర్మలంగా పరచుకొని తెరుచుకొని ఉన్నది. అంటే ప్రకృతి పరమాత్మ యొక్క ఆగమనాన్ని సూచిస్తుంది. పరవశించిపోతుంది. మానవ మాత్రులమైనటువంటి మనకి పరమాత్మ యొక్క ఆగమనం తెలియదు. చెప్పినా అర్థం కాదు. కానీ నోరులేని అంటే వాయి లేని, మాట్లాడే అవకాశమే లేని ఒక ప్రకృతి మాత్రం స్పర్శను అనుభవిస్తుంది. కుడమి తల్లి [బ్యాక్ గ్రౌండ్ sound] అవమానం చేస్తుంది. ఇవన్నీ కూడా గమనించుకొని చెప్పినప్పుడు అరవింద ఆశ్రమంలో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న, స్థూలంగా సత్య సాయి భగవానుడు ప్రపంచానికి ఇచ్చిన మహత్తర సందేశం ఏమిటి అని నన్ను అడిగారు. అడిగి మళ్ళీ ఉప ప్రశ్న వెంటనే వేశారు. వారి దృష్టిలో అధ్యాత్మ అంటే ఏమిటి అని. సమాధానం ఏమిటంటే, మహత్తర సందేశం ఏమిటంటే, ఏనకేన ప్రకారేణ యస్య కశ్శాపి దేహినాః సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వర పూజనం. నీకున్నటువంటి ప్రజ్ఞ ద్వారా నీ చుట్టూ ఉన్నవారికి ఆనందాన్ని కలిగించగలిగినట్లయితే అది మాత్రమే ఈశ్వర పూజ, అది మాత్రమే శివ పూజ. అంటే ఎలా, ప్రజ్ఞ ద్వారా ఏం చేయాలి? సేవ చేయాలి. సేవ బినా నిర్వాణ నహి. సేవ అండ్ వేరు, చాకిరీ వేరు. చాకిరీ అంటే ఉద్యోగం లాంటిది, చేస్తే ఏవో కూలి-కూలి డబ్బులు వస్తాయి. సేవ అంటే నిజానికి బహిరంగంగా చేసే విన్యాసాలు కావు. సేవ అంటే భావన. భావన ఎక్కడ పుడుతున్నది? మలినము లేని అంటే మాలిన్యము లేని కళంకరహితమైనటువంటి మనస్సులో నుంచి ఒక సంకల్పం ఉద్భవించినప్పుడు అది వ్యక్తి శ్రేయస్సుని దాటి, సమాజ శ్రేయస్సుని దాటి, సర్వ ప్రపంచము, సర్వ సృష్టి యొక్క ప్రయోజనంగా మారుతుంది గనుక అటువంటి సంకల్పాలు జరగాలి. దానికి ఒక్కటే మార్గం సేవ బినా నిర్వాణ నహి. దీనిని మించి మీకు మోక్షమే లేదు. నిర్వాణము అంటే నిర్వాణ నిక్వాణ అని అదొక నిస్వర నిస్వనమైనటువంటి ఒక అత్యద్భుతమైన భావన. అంటే నా ఉనికి వలన, నా అస్తిత్వం వలన, నా వ్యక్తి వలన-వ్యక్తిత్వం వలన, నా చదువు వలన, నా వలన ప్రపంచానికి ఏదైనా మంచి జరగాలి అనే సంకల్పంలో నుంచి అన్నీ ఏర్పడతాయి. అని ఇవన్నీ చెప్పినప్పుడు, కాదు అధ్యాత్మ గురించి కూడా చెప్పండి, స్వామి వారు ఏం చెప్పారంటే, ఒకటే స్వామి తమ దివ్యత్వాన్ని యుక్త వయస్సులో గంభీరమైన అధ్యాత్మ చెప్పారు. శరీరానికి ముదిమి వయస్సు వచ్చినప్పుడు సరళీకృతం చేశారు. అదే అధ్యాత్మని. ఆత్మారామం రాసిన స్వామి వేరు. అది ఆయన వయఃపరిపాకము ఇంకా కాళీ అవుతున్నది. నెమ్మదిగా ప్రపంచం ఆయన్ని అర్థం చేసుకుంటున్న సమయంలో ఆత్మారామం రాశారు. అలాగే వాహినులని వయస్సులో రాశారు. మరి పెద్దవారవుతున్నప్పుడు ఏం చేశారు? అంటే సరళం చేశారు. అధ్యాత్మని చాలా తేలికగా, తేలిక మాటల్లో చెప్పేశారు. ఉదాహరణకి బ్రహ్మము అంటే ఏమిటి అని అడిగితే పండితుడైన వాడు పదిహేను రోజులు ఉపన్యాసాలు ఇస్తాడు. అనుభవం కోసం వాడు కూడా పారాడుతున్నాడన్నమాట. కానీ స్వామి అనుభవమే స్వామి, అనుభూతే స్వామి. ఆయన ఏం చెప్పారు, దేనిని కనులు చూడలేవో కానీ దేనివలన కనులు చూడగలుగుతున్నాయో అదే బ్రహ్మము. అంటే నడుస్తున్న మనం కాదని నడిపిస్తున్న ఒక అతీంద్రియమైన, ఆంతరంగికమైన, ఒక నిస్వనమైన, నిశ్శబ్దమైన, మౌన భూమికలో సంచారం చేసే ఒకానొక శక్తి ప్రవాహమేఅది బ్రహ్మము. ఇది ఎవరు ఇంతవరకు భూమండలం మీద వేదాలను పుక్కిట పట్టిన వాళ్ళు కూడా చెప్పలా. పరమాత్మ వేద స్వరూపుడైనటువంటి స్వామి దాన్ని చెప్పారు. ఇక అధ్యాత్మకొస్తే స్వామి యుక్త వయస్సులో వారి వయస్సు చిన్నదిగా ఉన్న వయస్సులో దిగ్గంతులైన పండితులందరూ కూడా వచ్చారు. గుంటూరు, ఏలూరు ఇటు East Godavari, అటు నెల్లూరు అటు నుంచి వచ్చారు తెలుగువారు. వచ్చి వాళ్ళకొక భావం ఉండేది. ఏమిటా భావం అంటే బాబాగారు మనలాగ ఏం చదువుకోలేదు కదా! మనకాయన ఏం చెప్తారు అని. ఇది అజ్ఞానంలో తొలి భూమిక. వాళ్ళు వెళ్లారు. అక్కడికి వెళుతూనే వాళ్ళకు కలిగిన అనుభూతి ఏమిటంటే దైవమంటూ ఉంటే మేము రాముణ్ణి చూడలా, కృష్ణుణ్ణి చూడలా విన్నాం రామాయణం ద్వారా రాముణ్ణి, భారత, భాగవత, భగవద్గీతల ద్వారా కృష్ణుణ్ణి విన్నాం. కానీ వాళ్ళ ఇద్దరినీ దాటి ఒక మానవీయమైనటువంటి భావనలో జన జగత్తులతో సంచారం చేస్తున్నటువంటి ఇది అతిమానుషమైనటువంటి నవయువ యతీశ్వరుడని భావన చేశారు. ఇది ఆశ్చర్యకరం! ఒక్కరోజులో వాళ్ళల్లో మార్పు వచ్చింది. అయితే వాళ్ళు బాగా చదువుకున్నారు, గట్టిగా చదువుకున్నారు. వాళ్ళు స్వామి ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు అధ్యాత్మ అంటే ఏమిటి? మతం అంటే అందరికీ తెలుసున్నది. మానవుడి ఆలోచనలో నుంచి పుట్టింది మతం. మరి అధ్యాత్మ ఏమిటి అని అడిగితే అద్భుతమైన సమాధానం ఇచ్చారు. అదేమిటంటే ప్రవృత్తి లో నుంచి నివృత్తిలోకి రావటమే అధ్యాత్మ అన్నాడు. ఒక్క line అది. వాళ్ళందరికీ అది అర్థమైపోయింది. ఎందుకని they are already poised to understand. మధనం చేశారు, శాస్త్రాధ్యయనం చేశారు కానీ శబ్దార్థం దగ్గర ఆగిపోయినారు, వ్యాఖ్యానం దగ్గర ఆగిపోయినారు. ప్రచార బుద్ధితో చదివారు. కానీ పరమాత్మ సత్యసాయి భగవానుడు ఎంత అందంగా ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలోకి రావాలి. మనందరం ఉన్నాం. ఇప్పుడు ప్రవృత్తి అంటే ఏమిటి? నివృత్తి అంటే ఏమిటి? తల్లి గర్భాలయంలో మనం ప్రవేశించినప్పుడు అనేకానేక జన్మలు ఎత్తి వస్తున్నటువంటి మనం ఒక జన్మలో అంటే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే కదా! అంటే ఇప్పటికే ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నామని, ఇది కూడా మరొక జన్మ అని, ఏమీ తెలియకుండానే తల్లి పీల్చిన గాలిని మన గాలిగా, తల్లి తిన్న ఆహారాన్ని మన ఆహారంగా భావించి తల్లి గర్భాలయంలో ఉన్నటువంటి మనం ఒక ప్రవృత్తితో వస్తాం. ప్రవృత్తులన్నీ ఎక్కడివి అంటే మనోవృత్తులు కావు అవి చింత వృత్తులు. అనేక జన్మల నుంచి పోగుచేసుకుని వస్తున్న సంచితాలు అన్నీ అక్కడున్నాయి. అది ప్రవృత్తి. రోషం, క్రోధం, పగ అట్లాగే ప్రేమ, అట్లాగే వాత్సల్యం, దయారసం ఇవన్నీ కూడా positive, negative రెండింటితో కూడి ఉన్నటువంటిది ప్ర-ప్రవృత్తి. మనము ఎంత తపస్సు చేసినా, నా ఓడు, నా ఓడు తపస్సుకు కూర్చుంటాడు. నాలుగొందల ఏళ్ళు తపస్సు చేస్తాడు. మనం వింటూ ఉంటాం. సరే ఆయన రావాలి గనుక time వచ్చినప్పుడు వస్తాడు. వచ్చినప్పుడు "నీకు ఏం కావాలి" అని అడుగుతాడు పరమాత్మ. అది పెద్ద వల, మాయాజాలం. నాలుగొందల ఏళ్ళనాడు కోరికతో పీఠం మీద కూర్చున్నాడో, చెట్టు కింద కూర్చున్నాడో నాలుగొందల ఏళ్ళ తర్వాత కూడా అదే కోరిక భగవంతుణ్ణి కోరుతాడు. తపస్సు చేసినట్ల చేయనట్ల. అంటే ప్రవృత్తి నశించలేదు అని అర్థం. సో, మనందరికీ ప్రవృత్తి ఉంటుంది. అహం, గర్వం, దంభం, ప్రగల్భం, వాచాలత్వం, ఆహ్ అక్కర్లేనివి చెప్పడం, అక్కర్లేనివి ఎక్కువ వినటం, ఇవన్నీ కూడా ప్రవృత్తిలో భాగాలు. వీటన్నింటినీ మనల్ని మనం క్షాళన చేసుకుంటూ that is called self evaluation and self audit. ఇప్పుడే కోటేశ్వర రావు గారు ప్రస్తావన చేశారు. అంటే మనల్ని మనం audit చేయగలం. ఇంకొకరు audit చేస్తే ఒప్పుకోదు మన మనస్సు. మనమంతా పరిణితి చెందిన వాళ్ళం కాదు. కాబట్టి ప్రవృత్తి నుంచి నివృత్తిలోకి వెళ్ళాలి. నిర్వృత్తి కాదు. నిర్వృత్తి అంటే పని లేకపోయే-లేకపోవడం. నివృత్తి అంటే ఒక అత్యద్భుతమైనటువంటి స్థాయి. తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్ళటమే దాని పని. తీసుకెళ్లటమే దాని పని. వెళ్ళిన తర్వాత ఓహో! నివృత్తి మార్గంలో ఉన్నాం అంటాం. నివృత్తి అయిందని చెప్పేవాళ్ళు లేడు. సంశయమే మనకు నివృత్తి కాదు. సంశయాలు-- దేహం ఉన్నంత కాలం సందేహాలు, తప్పు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రవృత్తి నుంచి మీరు నివృత్తి మార్గంలోకి రండి. ఇదిగో మీరు స్వామి చెప్పారు కదా, మీరు పండితులు. అయినా మీకు అహంకారం ఉంది. ఇవన్నీ మనమంటాం. ఆయన పరదైవత్వం కదా! తల్లిదండ్రం ఉంటుంది. అన్నింటినీ క్షమిస్తారు, మన్నిస్తారు. కానీ సత్యసాయి భగవానుడి కఠిన గురువు మర్చిపోకండి. ఎంత కఠిన గురువు అంటే దయా, కరుణ ఎంత ప్రవాహంగా కురిపించగలరో చిన్న తప్పు చేస్తే, మాట వినకపోతే, చెప్పిన దానిని ఆచరించకపోతే అసలు రూపాన్నే మనం చూడలేం. ఎదురుగ్గానే ఉంచుంటారు, మాట్లాడతారు. అట్లా ఒకరోజు, రెండు రోజులు కాదు పధ్నాలుగు ఏళ్ళు అట్లా మనకి punishment ఇవ్వటం కాదు that is a correction process. ఎక్కడ శిక్షలేం లేవిక్కడ. కానీ correction process నడవకపోతే మన ప్రవృత్తి దగ్గరే మనం ఆగిపోతాం. ఏదో మారుదామనుకున్నాం గానీ ఏం చేయనండి ఇలా పుట్టాను, ఏదో పోయేదాకా ఇలా ఉంటాను. ఇది escape route. ఒక కృతయుగం నాటి ఒక సత్యం, త్రేతాయుగం నాటి ధర్మం, ద్వాపర యుగం నాటి శాంతి ప్రేమలు కలిసి ఇదిగో ఇవాళ కలియుగానికి కావలసిన అహింసా ప్రవృత్తి. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసల యొక్క సమ్యక్ సమాహార స్వరూపం ఏదైనా ఉంటే అది భగవాన్ సత్యసాయి. మనకు గురువై, స్వామై మనకు వచ్చినప్పుడు మనల్ని మనం గనక ప్రవృత్తి మార్గంలోనే ఆగు-- ఆహ్ నిలబెట్టినట్లయితే, ముందుకు సాగనట్లయితే, నివృత్తినే తాకనట్లయితే, తడమనట్లయితే, స్పృశించనట్లయితే, అనుభవించనట్లయితే, అనుభూతి చెందనట్లయితే ఇక విభూతికి దారి ఎక్కడ?కాబట్టి మనకి నివృత్తి మార్గం వైపు వెళ్లాలి అంటే సత్సంగము, సత్సాంగత్యము, సదాచారము, సమ్యక్ సంకీర్తన ఇవన్నీ కూడా ఉండాలి. వీటన్నింటితో పాటు శరణాగతి ఉండాలి, సమర్పణ ఉండాలి, వినయం ఉండాలి. ప్రవృత్తి నుంచి నివృత్తిలోకి అలా వెళ్లగలిగితే మనం అధ్యాత్మంలో ఉన్నట్లు లెక్క. ఒక పదిహేనేళ్లు గడిచిపోయింది. తరం మారింది. కొత్త భక్తులు వచ్చారు. వాళ్ళు పండితులే. వాళ్ళు కూడా enquiry కి వచ్చారు, enquiry లో ఉన్నారు. ఏమిటడిగారంటే, "స్వామి! అనేక పర్యాయాలు మీరు కూడా అధ్యాత్మలో ఉండండి, అధ్యాత్మ అంతా చెప్తూ ఉన్నారు. కానీ మాకు అధ్యాత్మ అంటే తెలియట్లే స్వామి" అని అడిగినప్పుడు చెప్పారు. ఈసారి ప్రవృత్తి నివృత్తి పదాలు రాలే. "ప్రభావంలో నుంచి స్వభావంలోకి వెళితే దాని పేరు అధ్యాత్మ" అన్నారు. ఇప్పుడు మనందరం ఉన్నాం. మనం అంటే మరి ఇప్పుడు సర్వం సమస్త ప్రపంచం ప్రభావానికి లోనయ్యే బతుకుతుంది. దీని జీవన యాత్ర అంతా ప్రభావమే. We are influenced by all the external forces and factors. ఒక చెట్టు ఉంటుంది. ఆయువుగా నించొని ఉంటుంది అది. మనం అంటాం, గాలి కదల-- రావటం లేదు, ఆకు కదలటం లేదు, గాలే లేదని మనం పదం వాడుతూ ఉంటాం. మరి ఆకు ఎందుకు కదలదు, కదలాలి కదా అంటే కదలదు. అది కదలాలి అంటే ఏదో ప్రభావానికి లోను కావాలి. ప్రభావానికి లోను కావాలి? గాలికి లోను కావాలి. గాలి ప్రభావం. గాలి వీచగానే జడలు విరబోసుకున్నట్టుగా ఊగుతాయి చెట్లు. చెట్లు తమంతట తాము ఊగవు. ఇది కేనోపనిషత్తు యొక్క సారం స్వామి చెప్పింది. ఇది ప్రభావం అంటే. ప్రభావం అంటే influenced by others habits అవి కాదు. చాలా అల్పము, స్వల్పము. అది కాదు. ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలో మనం అనేక ప్రభావాలకి లోనవుతాం. కానీ మరి ఎక్కడికి వెళ్ళాలి ప్రభావంలోనికి, ఆహ్ దానికి లోబడకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? లేదా దీని higher state ఏమిటి? ఉన్న స్థితి, ఉన్నత స్థితి, ఉత్కృష్ట స్థితి, ఉదాత్త స్థితి కడగా యదార్థ స్థితి. ఇదే కదా మనం-- యదార్థ స్థితికి వెళ్ళటమే మనం ప్రభావం నుంచి స్వభావంలోకి రావడం. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ఇది కూడా భగవద్గీతలో చెప్పబడింది. అంటే మనకి స్వధర్మాలున్నాయి. స్వధర్మం ఏమిటి అంటే నిన్ను నీవు ఎరగటమే స్వధర్మం. నేను, నాది అన్న అహంకార మమకారాలనే రెండు పొరలు గనక మనం ఛేదించకపోయినట్లయితే మనం ప్రభావంలో ఉండిపోతాం. డబ్బు ప్రభావం, అదొక అహంకారం. అంటే ధన ప్రవాహం వల్ల అదొక అహంకారం. విద్యాహంకారం, దానాహంకారం అనేక అహంకారం అనేక రూపాలుగా వస్తుంది. అది మన ప్రవృత్తిగా మనకు అర్థం అవుతున్నప్పుడు, నేను కోపిష్టిగా ఉన్నాను, నాలో దయ, దాక్షిణ్యం లేకుండా ఉన్నాయి, నేనొక రాతి శిలవలె ఉన్నాను, బండవలె ఉన్నాను కానీ నేను కూడా ఒక మార్దవాన్ని, లాలిత్యాన్ని పొందాలి కదా, అందరూ ఎంత హాయిగా ఉన్నారు అని అనుకున్నప్పుడు సంకల్పంలో నుంచి నెమ్మదిగా తన స్వభావం వైపు వెళ్తాడు. స్వభావం ఏమిటి? నేనెవరు? అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. నేను అనగానే ఇదిగో ఇక్కడ నా పేరు, నా స్థితి, నా experience, నేను రాసిన పుస్తకాలు, నేను మాట్లాడిన-- ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మన తర్వాత వచ్చినవే. మనతో వచ్చిన ఒకే ఒక్క ప్రశ్న నేనెవరు? అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దం అందు, అన్ని యుగాలు మొదలాయ యోగం అందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయా నారాయణాన్వేషితమ్ము. నారాయణుణ్ణి అన్వేషించడానికి ఇదిగో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మహోత్కృష్టమైనటువంటి మానవ జన్మ ఎత్తినటువంటి మనం నారాయణుణ్ణి వెతుక్కోవాలి అందుకని నీకీ జన్మ ఇవ్వబడిందని స్వామి చెప్తూ, మళ్ళీ నారాయణుడు ఎక్కడున్నాడు? ఆకాశంలోనా? నీళ్ళల్లోనా? భూమిలోనా? గాలిలోనా? నిప్పులోనా? ఎక్కడున్నాడు? ఆయన లేనిదెక్కడ? God exists everywhere మామూలు statement. Whatever exists is God ఇది సత్యసాయి భావన. అసలు స్వామి విశ్లేషణ మనకి అర్థమయ్యేట్లుగా ఒక శంకర భగవత్పాదులు చెప్పినటువంటి ఒక మోహముద్గర దక్షిణామూర్తి స్తోత్రాన్ని సంక్షిప్త స్వరూపం చేశారు. ఎట్లా? భగవంతుడు అన్నిచోట్లా ఉన్నాడు. అది అందరూ చెప్తారుగా. అది కూడా చెప్తే స్వామి ఎట్లా అవుతారు? స్వామి ఏమన్నారంటే, అసలు ఏది కనబడుతున్నదో అదే బ్రహ్మము, అదే పరమాత్మ. ఇంకా మీకు అర్థం కావాలంటే దేవుడనగా వేరు దేశమున లేడు. తాను చేయు పనుల యందు తగిలి యుండు. నువ్వు మంచి పని చేశావు వాడు భగవంతుడు. మరి తాను చేయు పనుల యందు అంటే చెడ్డ పనిలో కూడా భగవంతుడు ఉన్నాడా అని ఒకడు ప్రశ్నిస్తాడు. ప్రశ్నించనివ్వండి, ప్రశ్నించాలి. ఉపనిషత్తులు మనకిచ్చిన హక్కు ప్రశ్న వేయమంది. సమాధాన పడవద్దు, సమాధానం పొందండి. తద్వారా మీ ప్రయాణాన్ని వేగవంతం చేయండి, ఆవేగవంతం చేయండి. దానికి ఒక ధృతిని, ఆధృతిని కల్పించండి అని ఉపనిషత్తులు మనకి హక్కు ఇచ్చినాయి. అయితే చెడ్డ తలపు రాగానే అధ్యాత్మ మార్గంలో ఉన్నటువంటి వాడికి ఆలోచన పుట్టగానే వాడికి అనిపిస్తుంది, ఇది మంచిది కాదు, ఇది నేను మాట్లాడకూడదు, పని నేను చేయకూడదు, ఇంకొకడికి కలనైనా, తలపులలోనైనా రకమైన హాని సంకల్పించకూడదనే భావన కలుగుతుందే అది స్వభావానికి దాడి తీస్తుంది గనుక స్వభావంలోకి రావటమే అధ్యాత్మ. అంతేతప్ప ఇరవై ఏడు వేల పుస్తకాలు చదివాను, తొంభై వేల ఉపన్యాసాలు ఇచ్చాను, ఇంకేవో చేశాను, నేను స్వామిని ఎన్నిసార్లు చూ-- ఇదంతా కూడా మా మార్గ దర్శనం కోసం మార్గం మీద నడవటానికి ఏర్పడినటువంటి సుగమమైన మార్గమే తప్ప అది అంచం కాదు. కాబట్టి పదాలు వాళ్లకు అర్థమైపోయినాయి. ప్రభావం నుంచి స్వభావంలోకి రావటం. మళ్ళీ ఆహ్ మూడో తరం అంటే ఇప్పుడున్న తరం అనుకుందాం పోనీ. మున్న మున్నటి దాకానేగా స్వామి దేహంలోనే ఉన్నారుగా.వాళ్ళు ఏం అడిగారంటే అధ్యాత్మ అంటే మాకు clear గా చెప్పండి స్వామి ప్రవృత్తి నివృత్తి మాకు అర్థం కాదు ప్రభావం స్వభావం మాకు అర్థం కాదు అని ఎవరు అడిగారు ప్రశ్నంటే యువతరం అడిగింది స్వామిని. కేవలం ఆయన విద్యార్థులు కాదు విద్యార్థులుగా బయట చదువుకుంటున్న పిల్లలు కూడా స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఇది అడిగారు అడిగితే ఆయన ఏమన్నారంటే దేశ కాల పరిస్థితులను గమనించి సమాజం పోతున్న పోకడలను గమనించి కడగా ఒక సందేశం ఇచ్చారు మానవుడు కనీసం మానవుడుగా జీవించగలిగితే అదే అధ్యాత్మ అన్నారు. అంటే అది ఒక పరివేదన పరమాత్మ యొక్క పరివేదన పరివేదన అంటే anguish ఏమిటి రాముడు వచ్చాడు కృష్ణుడు వచ్చాడు ఇంకొకడు వచ్చాడు ఏమి మార్పు లేదే మనిషి ఇంకా దిగజారిపోతున్నాడే అనంటే మీలో దానవత్వం ఉంది అది ప్రథము పక్కనే దీనత్వం ఉంది మూడవది మానవత్వం ఉంది నాలుగవది దైవత్వం ఉంది. ముందుగా నీలో ఉన్న దానవుడు ఏది అరిషడ్వర్గాలను జయించండి. అరిషడ్వర-వర్గాలలో కొట్టేయండి రాసుకోండి పరమాత్మ వైపు నడవండి అరిషడ్వర్గాలను చేసుకోండి. అది అయిన తర్వాత మీలో ఉన్నటువంటి దంభాన్ని తగ్గించుకోండి నేను ఇంతటి వాడిని అంతటి వాడిని అని వినకండి చెప్పకండి మీ పనిలో మీరు కర్మానుబంధి మనుష్యులుగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి పరమాత్మ ఫలితం ఇస్తాడో అది ఇస్తాడు. ఒకవేళ ఇవ్వలేదా? ఇవ్వలేదంటే మన మంచి కోసమే. కల్పవృక్షం చూడండి మామూలుగా ప్రవచనాలు చెప్పేవారు మాములు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారంటే కల్పవృక్షం కింద నుంచొని దండం పెట్టి కోరి కోరితే రాలు వస్తుంది ఆకు పండు అంటారు. అది రాలొద్దు రాలిస్తే అది కల్పవృక్షం కాదు కల్పన వృక్షం అది. కల్పవృక్షం అంటే నీ అర్హతను బట్టి నీ అవసరాన్ని బట్టి నీ యోగ్యతను బట్టి నీ నైతిక ధైర్ ధార్మిక ఆధ్యాత్మిక స్థాయిలను బట్టి నీ అవసరాన్ని బట్టి ప్రాప్తిని బట్టి అది అనుగ్రహిస్తుందే తప్ప నువ్వెళ్ళి అడిగావు గనుక అది ఇవ్వదు. అట్లాగే దానవత్వాన్ని మనం ఇట్లా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత దీనత్వం ఉంది ఒక కోటీశ్వరుడు తన కంటే అధికుడైన వాడి దగ్గర అప్పు కోసమో అవసరం కోసమో చేయి చాపుతాడు. చేయకూడదు. We should not stretch our hand before anybody మరి ఎందుకని ఎట్లా? బతకాలి కదా! ఎప్పుడో అవసరం అవుతుందో పది రూపాయలు అడగాలి కదా అంటే స్వామి అన్నారు "పరమాత్మ దానికి అవి డబ్బు నీకు అవసరమైనప్పుడు ఆయనే తెచ్చి నీకు ఏర్పాటు చేస్తాడు. ఇంతలో నీలో ఉన్న దీనత్వాన్ని పరిదీనత్వాన్ని ఎందుకు ప్రకటిస్తావ్? దాన్ని నశింపజేయి భగవంతుడు ఒకడున్నాడు." మనకో సామెత ఉంది కదా నారు పోసిన వాడు నీరు పోయాడా అని. ఊరికే చదువుకోవటమేనా ఆచరించండి. భగవంతుడున్నాడు ఆయన చూసుకుంటాడు అనుకోండి ఆయనే చూసుకుంటాడు. అనన్యాశ్చింతయంతో మాం యే జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ఇది నిజానికి నేను స్వామిని దర్శించింది నెలే జూన్ తొమ్మిది పంతొమ్మిది వందల అరవై రెండు. అరవై ఎనిమిది నాటికి నేను స్వామి ప్రయాణం స్వామితో నా సా-మోదలైంది. కాబట్టి అరవై రెండు జూన్ తొమ్మిదో తారీఖున మధ్యాహ్నం నాలుగు గంటలకి ఒక్క శ్లోకం మీద స్వామి గంటన్నర మాట్లాడారు. అది. యోగక్షేమాలు చూసుకునేవాడు ఒకడు ఉన్నాడు అంటే మనం చేస్తాం రైల్వే స్టేషన్ కి వెళ్తాం మన చేతిలో రెండు suit cases లు ఉన్నాయి మేము మోయలేము train ఎక్కాలి ఏం చేస్తాం? అక్కడున్న Porter కి అతనికి అప్పచెప్పేసి మనం ఠీవిగా నడిచి compartment లోకి వెళ్ళిపోతాం. మనల్ని చూసేవాడు ఒకడు ఉన్నాడు అన్నప్పుడు ఉండే ధైర్యం మనకు ఎవ్వరూ లేరు అన్నప్పుడు ఉన్న అధైర్యం ముందు అది చాలా గొప్పది. ఉన్నాడు దేవుడున్నాడు ఇదే కదా స్వామి మనకిచ్చిన పంచాక్షరి. దేవుడున్నాడు అనుకోండి వాడు రాముడా భీముడా పక్కన పెట్టండి దేవుడు ఉన్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి పరిదీనత్వాన్ని మనం వదిలిపెట్టాలి. మనం ఎవ్వరి ముందు చేయి చాపకూడదు. ఇది ప్రప్రథమ ఆధ్యాత్మిక సూత్రం ఇది. మనలో ఉన్న అహంకారాన్ని పోగొట్టుకోవాలి ఇది సూత్రం. మనం ఎంతటి వాళ్ళమో కాదు ఎంతటి వాళ్ళమో కాదు అట్లా అని self esteem ని పోగొట్టుకోమన్నలా స్వామి అధికుడని అనుకోవద్దు అల్పుడని అనుకోవద్దు superiority complex వద్దు inferiority అసలే వద్దు అన్నారు. ఆత్మన్యూనతా భావం మనల్ని అడుగులు వేయనివ్వదు. అహంకారంతో కూడిన భావన మనల్ని ఎటు తీసుకెళ్తుందో తెలియదు గాలివాటు జీవితం అయిపోతుంది. చూడండి ఒక వైదికమైన వేద విద్యని విజ్ఞానాన్ని స్వామి అచ్చ తెలుగులో అత్యంత సరళంగా practical గా pragmatic గా prudent గా diligent గా ఎన్ని రకాలుగా ఆవిష్కరించారో చూడండి. వీటిని గమనించుకున్నప్పుడు అది రెండవదైన దీనత్వాన్ని వదిలిపెట్టాలి. కష్టం వచ్చింది దాన్ని కర్మ నిష్ఠగా భావించమన్నారు. ఎవరు చెప్పారు? కర్మ నిష్ఠ-క-కష్టం వస్తే నాకు పూజ చేయమన్న వాడు ఒకడు గొడుగు పట్టమన్న వాడు ఒకడు ఊరేగింపు చేయమన్న వాడు ఒకడు వీళ్ళున్నారు తప్ప కర్మ వల్ల వచ్చింది అది ఒక నిష్ఠగా భావించు దాని అంతట అదే పోతుంది. They are all passing clouds ఇవన్నీ మనకు తెలుసు కానీ స్వామి బాగా చెప్పారు అనే ఆయన్ని మనం అభినందిస్తామే తప్ప ఆయన్ని మనం ప్రశంసిస్తామే తప్ప ఆయనకు మనం certificate ఇస్తామే తప్ప అవును స్వామి చెప్పారు కదా కష్టం కదిలిపోయే మేఘమే కదా. ఏదో మనం అనుకున్నది జరగలేదు అంటే మన మంచికే జరిగిందేమో అది జరగలేదేమో మనకు కావలసిందే జరుగుతుందేమో let us wait. అదే అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. తొలినాళ్ళలో అరవైలు డెబ్భైలు స్వామి మార్నింగ్ దర్శనానికి బయటకు వచ్చినప్పుడు అందరూ స్వామి స్వామిని కాగితాలు పట్టుకొని మోకాళ్ళ మీద నుంచున-నుంచున్నప్పుడు కొందరి దగ్గర మాత్రమే తీసుకుని మిగతా వాళ్ళకి స్వామి ఇచ్చినటువంటి ఒక మాట wait wait wait అంటూ వెళ్ళిపోయారు.ఈ wait అంటే ఎవరు wait చేయాలి ఎంతకాలం wait చేయాలి అని ప్రశ్నలు పడతాయి. అదే రోజు సాయంకాలం నాలుగు గంటల ఐదున్నరకి ఇసుక ఉన్నటువంటి రోజుల్లో వస్తూ వస్తూ "అసలు wait చేయటంలోనే weightage ఉన్నది గుర్తుపెట్టుకోండి" అంటూ వెళ్లిపోయారు. అంటే నీ కర్మ యొక్క తీవ్రతను తగ్గించడానికి పరమాత్మ అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తాడు మనతో. wait చేస్తూ ఉంటాం wait చేసినంత సేపు స్వామి ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తాం కదా. ఇవన్నీ కూడా indirect గా భగవంతుడు మనకి మనల్ని చిసురు చేసే శిల్పాకృతిని చేసేటువంటి ఒక భావన. కాబట్టి దీనత్వాన్ని వదిలిపెట్టాలి, దానవత్వాన్ని నశింపజేసుకోవాలి. జప, తప, ధ్యానాదుల ద్వారా. ఇవన్నీ అవుతాయా యుగంలో అంటే, యుగం కాదన్నది. మనకున్నటువంటి సమయంలో అందరికీ ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి. నువ్వివన్నీ చేయాలంటే దీనికి ఒక time specify చేస్కో. earmark చెయ్. You carve out yourself. నీ inner self ను బయటకు తెచ్చుకో. నాకు ధ్యానంలో ఉండటానికి time లేదు, ఆ-స్-సేవకు వెళ్ళటానికి time లేదు, భజనకి ఇవాళ వెళ్లలేకపోతున్నా, వెళ్లలేక-- వెళ్లి తీరాలి అని నిర్ణయించుకుంటే మనస్సు మిమ్మల్ని తీసుకుని వెళుతుంది అని స్వామి చెప్తూ, రెండింటిని దాటి, గడులు దాటితే మూడవ గది ఉంది అది మానవత్వం. ఎందుకని ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలలో మహోత్కృష్టమైనటువంటిది మానవ జన్మ. ఇది last. అంటే జన్మ మళ్ళీ ఇది మళ్ళీ పిల్లి అయి పుడతాన, కుక్క అయి పుడతాన ఇవన్నీ అడుగుతుంటారు. పుట్టము ఇది స్వామి ఖచ్చితంగా చెప్పారు. ఎలా అంటే నువ్వు పాము కావు ఎందుకంటే నువ్వు మానవ జన్మ ఎత్తినప్పుడే నువ్వు పాములో already బతికేశావు. దానవుడిగా బతికేశావు మళ్ళీ నువ్వు దానవుడు కావటం ఏంటి? ఆ-స్థాయి phase అయిపోయింది. ఇప్పుడు ఏముండాలంటే మానవత్వాన్ని దాటి నేను దివ్యత్వం వైపు ఎలా వెళ్ళాలి? అసలు మానవత్వం అంటే ఏమిటి? దయ, కరుణ, జాలి, వాత్సల్యము, ప్రేమ, అకలంకమైనటువంటి ప్రేమ, అమలిన ప్రేమ, విమలమైన ప్రేమ, దివ్య ప్రేమ ఇవన్నీ ఒక్క భగవానుడు ముప్పై తొమ్మిది కోట్ల భక్తులకి ప్రపంచంలో ఇవ్వగలిగినప్పుడు ఒక వ్యక్తిగా మనం మరొక వ్యక్తికి ఇవ్వలేమా? ఎక్కడ fail అయిపోతున్నాం మనం? ఇది ఆలోచించుకోమన్నారు స్వామి. మానవత్వం అంటే దానం, ధర్మం ఇది కాదు. డబ్బు donate చేయడం కాదు. వివేక చూడామణిలోనే శంకర భగవత్పాదులు చెప్పారు "నువ్వు అనేక సత్కర్మలు చేసినా నీకు మోక్షం రాదు." మరి ఏమొస్తుంది? దీనికంటే ఉన్నతమైన మరో జన్మ రావచ్చు. ఫలితాలు, కర్మానుభవాలు అనుభవించడానికి కూడా జన్మ ఎత్తాలి. అంటే ఒక వైదాంతికమైనటువంటి, ప్రాచీనమైనటువంటి ఒక వాఙ్మయ భాండాగారాన్ని, అరువాచీనమైనటువంటి ఒక సంప్రదాయంతో, సనాతనమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక భావనని, సనూతనమైనటువంటి రీతిలో ఆవిష్కరించి మానవుడు ఎలా బతకాలో చెప్పారు. మానవుడు మానవుడిగా జీవించగలిగితే అదే అధ్యాత్మ. దీనిని మనం అర్థం చేసుకున్నట్లయితే స్వామి దగ్గరికి వెళ్తాం. ఇది అరవింద ఆశ్రమానికి సంబంధించిన ఒక సందర్భం. ఇంకో చోటికి ఎక్కడికో వెళ్తాం. మన వారణాసిలో ఇద్దరు foreigners స్వామికో మందిరం కట్టారు, శవ కట్టారు. వాళ్ళు నన్ను టీవీలో చూసినందువల్ల వారణాసిలో కూడా నన్ను గుర్తించి స్వామి గురించి మాట్లాడటానికి నన్ను పిలిచారు. నేను వెళ్ళా. వాళ్ళు వాళ్ళకొక మాతాజీ ఎవరో ఉన్నారు. ఆవిడ ఎక్కడో ఈజిప్ట్ లోనో ఎక్కడో ఉంటారు. ఉంటే వాళ్ళేమన్నారంటే "మీరు వచ్చారని చెప్పాము మా మాతాజీకి, మీరు వచ్చి మాట్లాడాలని ఆమె కూడా కోరుకున్నారు" అంటే మాతాజీ ఎవరంటే సత్య సాయి భగవానుడి యొక్క శిష్యురాలే, భక్తురాలే. శిష్యురాలియో, భక్తురాలే. ఆమె తనదైనటువంటి రీతిలో స్వామి చెప్పిన అనేక మాటలను ప్రపంచానికి అందిస్తూ సేవ చేస్తున్నది. అనేక దేశాలలో, ఇండియాలో కూడా వారణాసిలో కట్టింది. వారణాసిలో అనేకమైనటువంటి విధ్వంసాలు మధ్య జరిగినయి. ఒక్క సత్య సాయి భగవానుడి మందిరం తప్ప. ఎందుకనంటే సర్వ సమ్మతమైనటువంటి మతాతీతమైన ఒక భావన శిల్పాన్ని ప్రపంచానికి, గమనించండి ఒక డెబ్భై ఏళ్ళ క్రితం సర్వధర్మ స్థూపాన్ని గానీ, మన emblem గానీ అవి ఎవరైనా గీయగలుగుతారా? ముస్లిమ్స్, జోరాస్ట్రియన్స్, హిందూస్, క్రిస్టియన్సు అందరూ ఒక్కటే అని డెబ్భై ఏళ్ళ క్రితం చెప్పినటువంటిది ఒక్క సత్య సాయి భగవానుడే. మిగతా వాళ్ళు ఒక ముస్లిం ముస్లింగా ఉన్నాడు, క్రిస్టియన్ క్రిస్టియన్‌గా ఉన్నాడు, ఇంకోడు ఇంకోడిగా ఉన్నాడు. అందుకనే స్వామిని వేదమూర్తి అని ఊరికే ఒక title మనం ఇచ్చేయకూడదు. ఆయన వేదమూర్తి ఎందుకైనారంటే సామగాన లోలత్వం వలన సామవేద స్వరూపం. అత్యద్భుతమైనటువంటి వచో విన్నాణం, మాట్లాడేటువంటి అపారమైన శక్తివంతమైనటువంటి ఉపన్యాసాల ద్వారా స్వామి రెండవదైనటువంటి భావనలోకి స్వామి తీసుకువెళ్లారు. ఇక అది ఋగ్వేదం. యజుర్వేదం మనం చేసే వేళ సేవ, సేవలు అనేక సేవలు ఒకటా రెండా? అన్ని caseలు వేళ స్వామి కొచ్చి కూర్చున్నాయి. అంటే వీటన్నింటికీ సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము మూడు కలిపితే ఋక్సామాకృతి యజ్ఞమూర్తి స్వామి. పని చేయిస్తారు ఊరికే ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోరు. దానిలో నుంచి ఒక పని అప్పజెప్తారు. పని timelyగా చేయాలి, punctualగా చేయాలి, perfectగా చేయాలి, అందరికీ ఆనందం కలిగించేట్లుగా చేయాలి, అహంకారం ఉండకూడదు, నేను చేశాను అనకూడదు, నా చేత చేయబడ్డాయి అని కూడా అనకూడదు, నా ద్వారా స్వామి చేశారు అనకూడదు. ఏం చేస్తే జానాలి? అంతయున్ సాయి ప్రీతికే. స్వామి ప్రీతి కోసమే ఇవన్నీ నా శరీరం ద్వారా అయిపోయినయి కావోలు, అలా జరిగిపోయినయి అనుకున్నవాడు నిర్లిప్తుడు, నిర్మముడు. ఇటువంటి భావనలన్నీ కూడా స్వామి ఎంత అందంగా మనకి చెప్పారని గమనించినప్పుడు ఎవరు స్వామి? అంటే ఇందాక చెప్పిన మతాలన్నీ కూడామరి స్వామి కూడా ఏదో ఒక హిందూ మతం, ఇంకో మతం లేదు ఒక సాయి మతం సృష్టించి పెట్టొచ్చు కదా. అందుకనే ఇంతకు ముందు ఉన్న దేనిని నేను ఖండించటం లేదు, సంఘర్షణ స్కీమ్‌లో లేదు, సమన్వయమే ప్రధానమైన శక్తి. కనుక సత్య సాయి భగవానుడు సనాతనమైనటువంటి సారథి. సనాతన సారథి అంటే సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన, భారతీయమైనటువంటి ఒక ధర్మానికి సారథ్యం వహించారు. ఆయన మటాధిపతి కాదు, పీఠాధిపతి కాదు, యోగి కాదు, భోగి కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు. మరి ఎవరు? "సర్వము తానైన నేను, నేనైన నేను" అది ఆత్మ స్వరూపం. ఒక పరమాత్మ ఒక దేహాన్ని ఆశ్రయించి ఇప్పుడు సత్య సాయి భగవానుడికనిపించింది అంతే. అనుకోగలిగినట్లయితే, అట్లా ఆలోచించగలిగినట్లయితే మన అధ్యయన మండలిలో స్వామిని అనేకమైన పార్శ్వాల్లో మనం దర్శనం చేయాలి. చూట్టం వేరు, చూసేవాళ్ళు వెయ్యి మంది చూసుంటారు, వెయ్యి సార్లు చూసుంటారు. దర్శనం ఒక్కసారే అవుతుంది. అది అంతరంగికమైనది, భౌతికం కాదు. కాబట్టి ఇది అయిన తర్వాత ఈయన సనాతన సారథి ఎలా అయినారు అని ఒకాయన ప్రశ్న వేశారు. ఎందుకు వేశారు? తెలియకే వేశారు. సమాధానం ఏమిటంటే వేదాల్లో ఏం చెప్పబడింది మనందరికీ తెలుసు కదా? "వసుధైవ కుటుంబకం" అని ఒక-ఒక పదం. "వసుధైవ కుటుంబకం" అంటే సమస్త ప్రకృతి కూడా ఒకే కుటుంబం అని చెప్పింది. దీన్ని సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు! లేరు! లేరు! ఎవరున్నారు? కుల్వంత హాల్లో, ఇవాళ కుల్వంత హాల్లో, రోజుల్లో ఇసుక రోజుల్లో, రోజుల్లో వరండాలో, రోజుల్లో చెట్ల కింద అనుకోండి మన పక్కనున్న వాడు ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, పార్సీ కావచ్చు, మనకంటే చాలా డబ్బున్నవాడు కావచ్చు, మనకంటే అసలు ఏమీ లేని వాడు కావచ్చు, పండితుడు కావచ్చు, పామరుడు కావచ్చు వీళ్లందరినీ కూడా ఒకచోట ఒక గుడుగు కింద తీసుకొచ్చి కుటుంబమంతా ప్రపంచమంతా ఇక్కడ ఉన్నది. "వసుధైవ కుటుంబకం" అనేటువంటి ఒక వేద వాక్యానికి సప్రమాణికమైనటువంటి భూమిక ఏదంటే ప్రపంచం మొత్తం మీద కేవలం ప్రశాంతిలయం మాత్రమే. ప్రశాంతిలయంతో పాటు మన మందిరాలు కూడా. ఎందుకంటే localized గా కూడా స్వామి యొక్క ఆలోచన రీతి ఇలా మనకి ఆవిష్కరిస్తూ ఉన్నది. కాబట్టి స్వామి భౌతిక, ఆదిభౌతిక, intellectual అన్నేయింతర్వాత అధ్యాత్మలోకి వచ్చినప్పుడు, అధ్యాత్మలో నుంచి వేలూరి శివరామశాస్త్రి గారిని తలుచుకుందాం. ఆయన రెండు వందల పైగా గ్రంథాలు రాశాడు. అరవింద యోగి follower ఆయన మన గోకాక్లా గ-గారి లాగా. అయితే ఆయనకి ఒక ఆంధ్రో ఉద్యమంలో ఆయన పుస్తకాలన్నీ library తగలబెట్టేశారు, కాల్చేశారు. ఆయన ఒక నిర్వేదంతో mental aberration తో ప్రశాంతిలయానికే చేరుకున్నారు ఆయన. పండిచ్చేరి వెళ్ళలా. ఎందుకని? ఇక్కడ అర్చా మూర్తిగా స్వామి కనిపిస్తున్నారు. అడిగి సమాధానం పొందాలని వచ్చారు. స్వామి రాగానే ఏం మాట్లాడలే, కొద్ది రోజులు ఉండనిచ్చారు. నెమ్మది నెమ్మదిగా మనస్సు ప్రసన్నము, ప్రశాంతం అవుతున్నది. ఒక హాయిని పొందుతున్న సమయంలో మన బోటి వాడికి ఎవరికో తెలిసింది. ఇక్కడ వేలూరి శివరామశాస్త్రి గారు వచ్చి ఉన్నారట, మహానుభావుడు, చాలా గొప్పవాడు. అసలు మనకి స్వామి ఏం అర్థం కావటం లేదు. వస్తున్నారు, దర్శనం ఇస్తున్నారు, వెళ్లిపోతున్నారు, మన కోరికలు తీరుస్తున్నారు, రోగాలు పోగొడుతున్నారు అన్నీ చేస్తున్నారు కానీ పూర్తిగా అర్థం కావటం లేదు అన్నప్పుడు ఆయన తలుపు తట్టారు. తడితే ఆయన తలుపు తీసినప్పుడు "అయ్యా! మేము స్వామి భక్తులం, స్వామి కోసమే వస్తాం. పది పన్నెండు రోజులు కష్టపడి ఇక్కడే ఉంటాం. కానీ ఒక్కటీ మీరు బాగా చదువుకున్న వారు కదా, మాకు స్వామి అంటే అర్థం కావటం లేదు చెప్పండి" అన్నారు. "నేను కూడా అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను, ఇంకా నాకు అర్థం కాలేదు" అన్నారు. మళ్ళీ కొద్ది నిమిషాల తర్వాత ఇంకొక group వచ్చి మళ్ళీ వాళ్ళు ఇదే ప్రశ్న సమాధానం పొందటానికి అడిగారు. వాళ్ళు ఎలా అడిగారంటే వచ్చినకి lead ఇచ్చారు. "సత్య సాయిబాబా వారు రమణ మహర్షి వంటి వారా? రామకృష్ణ పరమహంస వంటి వారా చెప్పండి" అని. "పెతుకుతున్నాను" అన్నారాయన. మూడోసారి ప్రశ్నకి ఆయన ఇచ్చిన జవాబు ఏమిటంటే "సత్య సాయిబాబా వారు రమణ మహర్షి కాదు, రామకృష్ణ పరమహంస కాదు. సత్య సాయిబాబా వారు సత్య సాయిబాబా వారే." అది "ఐ హేవ్ సత్య సాయి బాబా" అని దాటాడు ఆయన. దాటి "అది భూమిపై నడవటానికి వచ్చినటువంటి ఒక పరబ్రహ్మ మూర్తి అది. అది ఒక బ్రహ్మ పదార్థం." మూడో స్థాయికి వెళ్ళిపోయినాడు. పండితులకి అది నిత్య పరీక్ష. పామరుడికి మాత్రం శ్రీరామ రక్ష. ఇది అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. ఇట్లా ఒక విశ్లేషణాత్మకమైనటువంటి స్థాయిలో గనక మనం వెళుతూ ఉన్నట్లయితే, మూడవ అధ్యాత్మ స్థాయిలో మనం స్వామిని చక్కగా interpret చేయాలి, ముందు perceive చేయాలి, interpret చేయాలి, experience చేయాలి, explore చేయొద్దని చెప్పారు. explore చేస్తే మీకు నేను అందనని చెప్పేశారు, అది clear. అది నాకు కూడా చెప్పారు. 1982లో నేను మా సాయి రమణీయంలో రాసేశా record. "నీవు పదే పదే పుట్టపర్తికి రావద్దు. నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. నీ లోపల ఉంటాను. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. స్వామిని హృదయంలో పెట్టుకొని నీ పని నువ్వు చెయ్. examine చేయకు, explore చేయకు కానీ experience చెయ్." చూశారా? experience అనుభూతి. మీ తావన్నీ అనుభవాలే. ఏదో స్వామి నాకు అది పోగొట్టారు, ఇది పోగొట్టారు చిన్న చిన్న విషయాలవి. ఎవరి పరంగా? మన పరంగా చాలా గొప్ప విషయాలు. స్వామి సర్వశక్తిమంతులు. ఇంకొక మాట, ఇవాళ reveal చేయవలసిన మాట ఏంటంటే కంచి మహాస్వామి వారిని ఒక ప్రశ్న వేశారు.ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తుల మీద నేను కొన్ని వందల వ్యాసాలు రాశాను అనేకమైన ఉపన్యాసాలు ఇచ్చాను స్వామి ఇది academic అయినా నిజంగా అటువంటి వారు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా అని అడిగారాయనని. ఏమీ ఆలోచించకుండా ఒక్క second లో చెప్పారు ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తుల యొక్క త్రివేణి సంగమ స్వరూపమే సత్య సాయిబాబా వారు, వారు పుటపర్తి లో ఉంటారు వెళ్ళండి అన్నారు. అంటే ఏమిటి ఇక్కడ super speciality hospital వస్తుంది అంటారు అక్కడ ఏమీ ఉండదప్పుడు. ఫలానా time కి వస్తుంది అంటారు అవన్నీ అయిపోతాయి. ఎట్లా అయిపోతాయి? ఎలా అవుతున్నాయి మన కళ్ళ ముందు మనం చూశాం కదా ఇదిగో water project ఇలా అయిపోతుంది, అయిపోతుంది అని. దానిలో అదేదో వంద రూపాయలో పదివేలో లక్ష రూపాయలో అయ్యేది కాదు కోట్లు కోటానుకోట్లు అవి ఎటు నుంచి వస్తాయో పనులు ఎలా జరుగుతాయో ఇదొకటి. ఇవన్నీ కూడా మనం గమనించుకున్నప్పుడు స్వామి మనకి ఇంకో సందే-సందేశం కూడా ఇచ్చారు దాన్ని వేళ మనం స్మరిద్దాం. అంతరంగము కన్నా జాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమ గురువు గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే దీన్ని మించి ఇంకా సందేశం కావాలండి. గురువు అంటే విద్యా గురువు, బోధ గురువు, బాధ గురువు, లోక గురువు, విద్యా గురువు, నిషిద్ధ గురువు, మంత్ర గురువు, తంత్ర గురువు, దీక్షా గురువు ఇటువంటి వాళ్ళున్నారు కానీ గురువు ఎక్కడ ఉన్నాడంటే అంతరంగము కన్నా జాపకుడు లేడు. నీకు నిరంతరం ఆయన బోధిస్తూనే ఉన్నాడు నువ్వు వినటం లేదు అంతే. పని చేయద్దు అంటున్నాడు మనం చేసేస్తున్నాం. ఇది చెయ్యి అంటున్నావ్- అంటున్నాడు లోపల్నుంచి మనం చేయట్ల మరి గురువు మాట వినకపోతే ఎట్లా చేయాలి కదా కాబట్టి అంతరంగము కన్నా జాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమ గురువు. ఎన్ని సుఖాలు ఎన్ని దుఃఖాలు ఎన్ని ఆనందాలు ఎన్ని జయాలు ఎన్ని అపజయాలు ఎన్ని అవమానాలు ఎన్ని అనుమానాలు ఎన్నిన్ని జననాలు ఎన్ని మరణాలు ఇవన్నీ చూశాం కదా మరి చూస్తే కాలం స్వామి చెప్పారు కాలం ఏదో కాలక్షేపం చేస్తున్నాను స్వామి కాలం అలా జరిగిపోతున్నది అన్న వాడికి ఆయన ఇచ్చింది ఏంటంటే కాలాన్ని నువ్వు వెళ్లబుచ్చలేవు నిన్నే కాలం వెళ్లబుచ్చుతుంది జాగ్రత్త. వెళ్లబుచ్చుతుందేమో మన time అయిపోతున్నదేమో అని అనుకుంటూ జాగ్రత్తగా ఉండు కానీ పోతామేమో అనుకోకు అది నీకు చెప్పి రాదు అది జరగక మానదు ఇది నిత్య సత్యం ఏమిటంటే మరణమే. మరణం అంటే it's not end it's only a comma అదొక చిన్న మార్పు. దేహ స్థితి పోగా ఇంకో కొత్త దేహం వాసాంసి జీర్ణాని యధా విహాయ అట్లా. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత స్వామి మనకి ఇచ్చినటువంటి మరొక అత్యద్భుత సందేశం ఏమిటి అంటే మానవుడు మానవుడిగా జీవించండి అదే అధ్యాత్మ అన్నారు కదా అంటే మనం మానవులుగా కూడా లేమా? మనలో ఇందాక మానవత్వ దీనవత్త దానవత్త అని అనుకున్నాం కదా వాటితో పాటుగా మనలో ఉన్నటువంటి అనేక పారిశ్రాలో అత్యంత ప్రధానమైనటువంటిది ఏంటంటే ఒకటి నేనే అన్న అహంకారం ఇదంతా నాదే అన్న మమకారం ఇవి జీవ లక్షణాలు. రెండు జీవ లక్షణాలని ఒక పరమాత్మ యొక్క సాంగత్యం ద్వారా వారి బోధన ద్వారా వారు ఇచ్చే సందేశ ఉపదేశ ఆదేశాల ద్వారా మనల్ని మనం గ్రహించుకుంటూ దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఇది అయిన తర్వాత ఇవాళ స్వామి ఏం చేశారో మళ్ళీ మనం చెప్పుకో మనందరికీ తెలుసు, ఎంత చెప్పారో మనందరికీ తెలుసు, ఇవాళ స్వామి శత జయంతి సందర్భం కా-కూడా కాబట్టి కాలంలో నాకు నేను వేసుకున్నటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే స్వామి ఏం చేస్త-చేశారో చెప్తూ వెళ్ళాం మిగతా వాళ్ళంతా కూడా ఏం చేశారో చెప్తూ వెళ్ళాం చెప్తూనే ఉన్నాం ఓపిక ఉన్నంత వరకు చెప్తూనే ఉంటాం కానీ నేను ఏం చేశాను ప్రపంచానికి? నా నుంచి ఏదైనా వెళ్లిందా? నిస్వార్థమైనటువంటి సేవా యోగని నేను ఎప్పుడైనా అనుభవించానా అని ప్రశ్నించుకున్నప్పుడు అసలు జరిగినదంతా పరమాత్మ వల్లనే జరిగింది అన్నప్పుడు అది సేవా యోగం. నేను పరమాత్మకి సేవ చేశానని కాదు పరమాత్మ మనకు చేసిన సేవ చాలా గొప్పది. ఎందుకంటే మిగతా వాళ్ళ సంగతి నేను compare చేయను కానీ మానవుడికి సర్వోత్తమమైన సేవ చేసినటువంటి పరమాత్మ ఎవరంటే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారే. చిన్న విషయం చెప్తాను పన్నెండు రెండు రెండువేల ఇరవై మూడు నేను వైజాగ్ లో ఉన్నా ఇలా స్వామి పని మీదే స్వామి పని అంటే మన పని స్వామి సత్సంగాలకు వెళ్ళాను కంచి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు అక్కడ విడిది చేసి ఉన్నారు. ఏవో ప్రసంగ విశాఖపట్నం రాత్రి పదకొండు గంటల time లో ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మీరు బాబా వారి చాలా దగ్గరగా ఉన్నారు కదా సృష్టిలు భక్తులు అటువంటి వాళ్ళ దగ్గరగా ఉన్నారు కదా మాక్కుడా మా గురువులకి అయిన జయేంద్ర స్వామి వారికి మా పరమ గురువులైనటువంటి చ-చంద్ర శేఖరేంద్ర స్వామి వారికి బాబా గారంటే చాలా గౌరవం అందుకనే పందొమ్మిది వందల స్వామి eighty fifth birthday కి జయేంద్ర స్వామి వారు పుటపర్తి తరలి వెళ్లారు. మాక్కుడా చాలా గౌరవం చిన్నప్పటి నుంచి మాకు అవే చెప్పారు అన్నారు మళ్ళీ ఇంకో విషయంలోకి వెళ్లారు. విషయం అయిన తర్వాత ఎక్కడ ఉంటున్నారు అని అడిగారు. నేను ఇక్కడే మా central trust board building ఉంది దాంట్లో నేను ఒక room లో ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్ళను ఎంత దూరం అని అడిగారు. నడిచి వెళితే పది నిమిషాలు car లో వెళితే రెండు మూడు నిమిషాలు అన్నా. మళ్ళీ topic మారింది కాసేపైన తర్వాత మళ్ళీ స్వామి సంగతులు వచ్చినాయి. వస్తే నేను అన్నాను మీరు నన్ను అడుగుతున్నారు కదా నేను ఎక్కడ ఉన్నానో సగం మందిరమే ఉంది స్వామిది.సగం మా బట్టు వాళ్ళు ఉండటానికి ఏర్పాటు చేశారు. మీరు రాకూడదా? అని అడిగారు. జగద్గురువుని అలా అడగకూడదు. వారిని వాళ్ళని ఆహ్వానించే రీతులు వేరు. ఆయన ఏమన్నారో తెలుసా? "మేము రేపు వస్తున్నాం" అన్నారు. ఆహ్వానం లేదు, బట్టలు పెట్టడం లేదు, పళ్ళు తీసుకెళ్లటం లేదు, పూలమాలలు లేవు. వచ్చేశారు. వచ్చి స్వామిది మందిరం చూసిన వాళ్ళకి తెలిసిన ఒక డయాస్ ఉంటుంది. దాని మీద స్వామి ఫోటో, ఆహ్ చైరు, దాని గొడుగు, ఇటువైపు షిరిడి బాబా, ముందు వినాయకుడు అన్నీ ఉంటాయి. మన వాళ్ళు ఏమన్నారంటే "దీనికి ఒక కర్టెన్ వేసేద్దాం అండి." వేసేస్తే స్వామి కనపడకుండా ఆయన పని ఆయన చేసుకుని వెళ్తారు, మరి ఆయన ఏమన్నా అనుకుంటారేమో అని పాపం అనుకున్నారు. నేను అన్నాను "అలా అనుకోరు." వారే అడిగారు. అడగ్గానే నేను ఆహ్వానించాను, వారు వస్తున్నారు కదా అన్నా. కర్టెన్ లేదు, ఏం లేదు. వారన్నారు "బాబా వారిని వారు ఎక్కడ ఉండాలో వారిని అక్కడే ఉంచండి. మేము కింద కూర్చొని మాట్లాడి వెళ్తాం." ఇరవై ఎనిమిదిన్నర నిమిషాలు మనకి ఎవరికీ తెలియని రహస్యాలు స్వామి గురించి మాట్లాడారు. ఆహ్వానం లేదు వచ్చేశారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే సత్య సాయిబాబా వారు స్వయంభువు. అంటే ఆయన ఒక నిర్ణయం తీసుకుని ప్రపంచానికి వైదిక ధర్మాన్ని నేర్పటానికి, మానవ జీవితాన్ని ఎలా భద్రతమంగా నడపాలో చెప్పటానికి వచ్చినటువంటి స్వయంభువు. నేను ఆర్టికల్ రాశాను దాని మీద. తర్వాత ఇవన్నీ మా రత్నాకర్ గారికి ఇచ్చినప్పుడు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఏమిటి మన ఏమో ఆహ్వానం లేదు, ఎలా జరిగింది ఇదంటే స్వామి సంకల్పం. కంచికి, పుటపర్తికి ఉన్న సంబంధం అటువంటిది. పెద్ద స్వామి వారి దగ్గర నుంచి స్వామి వారి వరకు. కాబట్టి మనం ఇవాళ వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే వందేళ్ళు, నూటొక్క ఏళ్ళు ఇది కాదు ప్రమాణం. ఏం స్వామి hundred year birthday తర్వాత ఇంకేం ఉండదా? మనం కూడా ఏం పని చేయమంటే? యుగాంతము వరకు సత్య సాయి నామం వినపడుతుంది. ప్రత్యక్ష కళ్యాణ భువే సునామ్నే ప్రత్యర్థ పియూష దుహే స్వధామ్నే ప్రత్యక్షర స్వాదు రసైక సిమ్నే భూమ్నే. ఇది భూమ్నా అంటే పరమాత్మ. పరమాత్మ ఎవరంటే సత్య సాయి భగవానుడు. సునామము సాయిరామ్ అనేటువంటి పదం సత్య సాయి నామం యుగాంతం వరకు ఉంటుంది మనం ఒక జన్మ ఎత్తి వచ్చినందుకు. స్వామి టైంలో మనకు జన్మ ఇచ్చినందుకు, ఆయన దగ్గరికి తీసుకున్నందుకు మనం వెళ్ళామని స్వామి ఫోల్డులోకి, ఫోల్డు లేదు అనంత బహువులు ప్రపంచాన్ని విస్తృతంగా ఇట్లా నడ-- అదిమి పట్టుకున్నటువంటి స్వామి దాంట్లో ఫోల్డ్ ఏమిటి? పదం ఏమిటి? అల్పమైన పదం. స్వామి ఫోల్డ్ కాదు స్వామి సర్వవ్యాపి, సర్వాత్మకుడు, సర్వజన ప్రియుడు, సకలజన మనోల్లాస పులకిత కుంభరమైనటువంటి భావనా భూమిక ఆయనది. జాతి లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు. వాడి అర్హత ఒక్కటే. సేవ చేస్తాడా లేదా? ప్రేమ ద్వారా తనను తాను రిఫామ్ చేసుకుంటాడా లేదా? Change is constant. ఇక్కడ అది క్షణానికి అది change మార్పు అప్పుడే తాత్కాలికం. Transient and impermanent. స్వామి change తేవటానికి వచ్చారని ఎవరో చెప్తుంటే, ఆయన change తేవటానికి రాలా. permanent గా ఉండే transformation పరిణామ గతిశీలమైనటువంటి ఒక భావనా భూమికను మనకు పరిచయం చేయడానికి స్వామి వచ్చారు. అని గమనించుకున్నట్లయితే స్వామి యొక్క విరాట్ మూర్తిత్వం మనకు అర్థమవుతుంది. అంతేకాదు తాను పరమాత్మ, పరబ్రహ్మమూర్తి అయినప్పటికీ కూడా జనజగత్తులతో మమేకమై ప్రతిరోజూ చివరికి వీల్ చైరు ఏర్పాటైన సమయంలో కూడా ఏనాడైనా దర్శనం మారిందా? సూర్యోదయం ఎప్పుడన్నా అటూ ఇటూ అయిందా? చంద్రోదయం కాకుండా జరిగిందా? భక్తులకు స్వామి దర్శనం ఇవ్వకుండా ఎప్పుడన్నా ఉన్నారా? ఎక్కడ ఉండనివ్వండి. నడయాడినటువంటి పరమాత్మ మన దగ్గరికి వచ్చి మన కష్టం విని, మన కన్నీరు తుడిచి, ఇవన్నీ ఎందుకు చేశారంటే, ఇవాళ మనం స్వామి నుంచి ఏమి పొందాము, పొందామని మనం ప్రపంచానికి చెప్తున్నామో, ప్రపంచం మనల్ని ఎట్లా గౌరవిస్తున్నదో అటువంటి అనన్యమైనటువంటి కారుణ్య రేఖలు మన నుంచి కూడా శతాబ్ది సమయంలో ప్రారంభం కావాలి. కన్నీరు తుడవాలి. కలిగిన ప్రతి వాడు నలిగిన వాడిని కాచుకోవాలి. సత్యవాక్కుగా ఉండాలి. అలాగే ధర్మాను ప్రకారం జీవితాన్ని గడపాలి. పరమాత్మ ఇస్తాడన్న నమ్మకంతో ఉండాలి. పరమాత్మ కాబట్టి చేశాడు, నేను చేయలేనంటే, ఆయన హాస్పిటల్ కట్టారు, మనం దుప్పటి కొని ఇవ్వగలం కదా. నెలకిన్ని మందులు ఇవ్వగలం కదా. మన పరిధిలో మనం చేయగలం కదా. దీనన్నింటికీ సత్య సాయి organization ఏర్పడింది కదా. మనం అక్కడికి వెళ్లి నేను ఇది చేయదలుచుకున్నానంటే కాదనేవాడెవడు? కొత్త వాళ్ళంతా రావాలి. యువకులంతా రావాలి. ఎందుకు రావాలంటే నేను పసిప్రాయంలో వెళ్లినందువలన నేను పొందిన లాభం అంతా ఇంతా కాదు. స్వామికి చాలా దగ్గర అనేది ఒక ఆనందానుభూతి, అది వేరే. అది దానివల్ల పక్కవాడికి ఉపయోగం లేదు. అక్కడికి వెళ్లి నేను ఏమి నేర్చుకొని నా జీవితాన్ని నడుపుతున్నాను, దుఃఖం కలిగింది, దుఃఖంలో కునుకుపోతామా? ఆనందం పర-- వచ్చి ఒళ్ళో పడిపోయింది, ఉబ్బిపోతామా? మనం అనుకున్నది జరగలేదు, కుంగిపోతామా? మనల్ని ఎవరో పొ-పొగిడారు, పొంగిపోతామా? ఎవరో ఆశ చూపించారు, లొంగిపోతామా? ప్రపంచ ఆకర్షణ ముందు వంగిపోతామా? ఇవి ఏవీ కాకుండా నిర్మల నిశ్చల నికేతన నిరంజన నిభృతంగా ఎక్కడ మనం ఉంటామో, పరమాత్మ ఇవన్నీ నీవల్ల జరుగుతున్నాయి అని అన్నప్పుడు అది అనుభూతి వేరు. ఆనందం వేరు. అన్నీ స్వామి, ఈవెన్ మనకు జరగనిది కూడా స్వామి యొక్క అనుగ్రహంగానే భావించాలి. అని నేను భావన చేస్తూ ఇంకా అనేకమైనటువంటి విషయాలన్నీ ఉన్నాయి. సమయాన్ని కూడా చూడాలి. సమయం ఉంటే ఇంకొక ఐదు నిమిషాలు మాట్లాడతాను. లేదు అనుకుంటే... సర్ మాట్లాడండి సర్. సర్ మాట్లాడండి సర్. పన్నెండుం బావ్-పన్నెండుం బావ్ దాకా మాట్లాడండి. ఓకే. అంటే మాకు పది నిమిషాలు ఉంది. Right.కాబట్టి ఇవన్నీ కూడా ఇందాక కోటేశ్వర రావు గారు ఒక మాట చాలా అందమైన మాట చెప్పారు. ప్రారంభించేటప్పుడు ఇది అవుతుందా అని అనుకోవద్దు ప్రారంభింప చేసేది ప్రేరణ కారణము రెండు ఆయనే కాబట్టి కర్తవ్యము ఆయనదే కాబట్టి we are nothing but tools in the hands of భగవాన్ ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మన ద్వారా నా ముందో మైక్ ఉంటుంది మైకు తనంతట తాను మాట్లాడగలదా? లేదే. నేను మైకు ముందు కూర్చున్న నా పెదవులు మాట్లాడగలవా? నా కరచరణాది అవయవాలు మాట్లాడగలవా? మాట్లాడలేవు. మరి ఏం మాట్లాడుతుంది? ఎవడు స్నేహితుండు? ఈశ్వరుండే. ఈశ్వరుడు మన యందున్నాడు. మన యందు ఎలా ఉన్నాడంటే ఆత్మగా ఉన్నాడు. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం యః మహామితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి పృథివిశ మనసాస్వం చిన్నతా మజ్జతావా పవన చరణ రోధాత్ ఆత్మ నిష్ఠో భవత్వం. నేను ఆత్మను అన్న భావనలో నెలకొల్పి చెందటమే అసలైన శిశలైన అధ్యాత్మ. దానినే అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ అక్కడి దాకా వెళ్ళి తత్త్వం అసి అదే నేనే ఉన్నాను నేను వేరుగా లేను ఇప్పటి దాకా వేరు అనుకున్న. అది అది అంటే పరమాత్మ ఇది అంటే జీవుడు. రెండు విడివిడిగా ఉన్నాయి ద్వంద్వంలో ఉన్నాయి అది ఇది అంటున్నాం కాదు తత్త్వం అసి అది నేనే అదే నేనే ఉన్నాను నేను అదే ఉన్నాను స్వామి రోజుల్లో మనకు calendars మీద print అయి వచ్చేది you are me, I am you వేళ English లో చెప్పారు అంతే. అసలు నీకు నాకు ఏం తేడా లేదన్నారు. ఎప్పుడు? స్వామి వలె జీవించగలిగితే, స్వామి వలె అంత నిరాడంబరంగా ఉండగలిగితే, అంత మర్యాద పురుషోత్తముడుగా జీవించగలిగితే, అంత పరహితంగా ఆలోచించగలిగితే, ఏది అన్నీ తన చుట్టూ పరచుకొని ఉన్నా ఏది నాదం కాదన్న detachment తో ఉండగలిగితే, వైరాగ్య విభూతిలో గనక వెలుగు ఉండగలిగితే స్వామికి మనకి తేడా లేదు. తేడా ఎక్కడ అంటే స్వామి మనందరిలో ఆత్మను చూశారు మనం స్వామిలో ఈశ్వరమ్మ కొడుకుని చూశాం అంతే. దాటాలి. అది ఒక పరబ్రహ్మ మూర్తి అది ఒక వేద స్వరూపం అది సంగీత సాహిత్యాలని అరవైనాలుగు కళల సమాహారముది. అంతే కాదు విజ్ఞానము, జ్ఞానము కనవేసుకున్నటువంటి ఒక అధ్యాత్మ స్వరూపం. అంటే నాలుగు మాటలు మాట్లాడేవాడు, నాలుగు పుస్తకాలు రాసేవాడు, నాలుగు ఉపన్యాసాలు ఇచ్చిన వాడు వాడిని మనం జ్ఞాని అని పిలుస్తున్నాం. Intellectual interpretation is only విజ్ఞాన it is not జ్ఞాన. intellect తో నువ్వు దాన్ని విశ్లేషించి చెప్పావు అంతే. నువ్వు జ్ఞానివి ఎప్పుడైనావు? జ్ఞాని అంటే ఎవడంటే నిలకడ చెందినవాడు, నిర్మముడు, నిరాడంబరంగా ఉండేవాడు, ఎల్లవేళలా పరహితాన్ని కోరేవాడు. సంపర్కంలోనూ ఎక్కడా ఎవరితో కలవకుండా తనను తాను నిలబెట్టుకుంటూ తాను కలిసినట్లుగా ఉంటూ ఇందాక చెప్పానే భూమా స్థితిలో ఉండేటువంటి వాడు మాత్రమే పరమగురువు అవుతున్నాడు పరమాత్మ అవుతున్నాడు గనుక గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే. మీరు ఎక్కడో అలౌకికమైనటువంటి విష్ణు లోకాన్ని కైలాసాన్ని కవితాత్మకంగా వర్ణించుకోండి, అనుభవించండి, దానికి గౌరవం ఇవ్వండి. కానీ యదార్థం ఏమిటంటే మనం బతుకుతున్నా, మనం జీవిస్తున్నా, మనం ప్రయాణిస్తున్నా మన అతి వాస్తవిక స్థితిలో మనం ఉండాలి. ఇది absolute reality. అక్కడికి గనక వస్తే ప్రపంచాన్ని గనక మనం చూసినట్లయితే ఇందులో అసలు మనం ఎంత? ఎంత? ఎంత అంటే సున్నా అని మనం వస్తాం. కానీ మన అదృష్టం సత్య సాయి భగవానుడితో కూడి ఉన్నటువంటి మనందరం లేదా స్వామి యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని, దివ్యత్వాన్ని అనుభవించిన వాళ్ళకి ఒకటి. మనము సున్నా కావచ్చు ఏమో కానీ మన కంటే ముందు ఒకటి నించొని ఉన్నది అది పరమాత్మ. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నన్ను మించి మరొక బ్రహ్మము లేనే లేనిది నేనే అన్నటువంటి స్వామి ఒకటిగా ఉన్నప్పుడు మనం సున్నా పక్కనే ఉంటే ten తర్వాత వంద, తర్వాత వెయ్యి సున్నాలు ఎన్ని కలిస్తే ఒకటి ఒకటికి బలం వస్తూ ఉంటుంది గనుక వీటన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ప్రపంచాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే మనం చాలా చేయాలి ప్రపంచానికి. ఎంత చేసినా నువ్వు వ్యక్తిగా కొంత చేయగలుగుతావు దాటి చేయలేవు. కాబట్టి చేస్తూ చేస్తూ ఉన్నట్లయితే నీవు కూడా క్షళనైపోతావు. చూడండి ఒక బండరాయి ఉంటుంది రజకుడు వెళ్ళి మాచిన బట్టలు ఉతుకుతూ ఉంటాడు. ఉతుకుతూ ఉంటే మురికి పోతుంది బండ పదును ఎక్కుతుంది. దానికి మెరుపు వస్తుంది, నునుపు వస్తుంది. వస్తుందా రాదా? అది కర్మయోగం. కాబట్టి వీటన్నింటినీ మనం గ్రహించుకున్నప్పుడు గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే భాగవతం లేని లోకం ఉన్నదా? భారతం లేని ఇల్లు ఉన్నదా? రామాయణం లేని మానవుడి జీవితం ఉన్నదా? భగవద్గీత లేని కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు ఇంకెక్కడన్నా ఉన్నాయా? అన్నీ వాళ్ళు మన కోసం ఇచ్చారు కదా! వీటన్నింటినీ మనం అర్థం చేసుకుంటూ గనక వెళ్ళినట్లయితే ప్రపంచం మనకు అర్థమవుతుంది. కలిగిన వాడున్నాడు వాడి పక్కనే నలిగిన వాడున్నాడు. కలిగిన వాడు వెంటనే ఆలోచన నేను, నా బిడ్డ, నా ఇల్లు అని కాక ఎవరైతే తాను కన్న బిడ్డలతో పాటు ఇతర-ఇతర తల్లి కన్న బిడ్డనైనా తన బిడ్డగా భావించగలిగితే అది నిజమైన అధ్యాత్మ. జీవితాన్ని అర్థం చేసుకున్నటువంటి విషయం. ఇక కడగా ఎవడు స్నేహితుడు? ఆయనే ప్రశ్న వేశారు. ఎవరు మీకు స్నేహితులు? ఉదాహరణ మనం ఉన్నాం మనకు రెండు లక్షల మంది తెలుసు పరిచయం మా గురించి విన్నారు. లక్ష మంది తెలుసుకున్నారు. అంటే ఏదో ఆయన ఉద్యోగం చేస్తాడు, ఇవేవో పుస్తకాలు రాశాడు ఇవేమీ తెలుసుకుంటారు. పదివేల మందికి కొద్దిగా తెలుస్తుంది.ఓ వంద మందికి బాగా దగ్గరగా తెలుస్తుంది. పది మందికి ఇంకా బగ-దగ్గర తెలుస్తుంది. నిజానికి జీవి ఇంకో జీవుడికి అర్థం కాదు. వాడి జీవితం వాడిది, వాడి మనసు వాడిది, వాడి ఆలోచనలు, వాడి ప్రవర్తులు వేరు, వాడి జీవన విధానం వేరు. మరి ఎవరయ్యా? "వీడు నా స్నేహితుడు, వాడు ఫలానా వాడు" అంటున్నావ్ ఏంటే? నీ స్నేహితులు ఎవరో తెలుసునా? పంచ ప్రాణాలుగా నీలో ఉన్నటువంటి పరమాత్మ, ఆత్మ ఒక్కటే నీ స్నేహితురాలు లేదా స్నేహితుడు. మన ప్రాణం పోయేటప్పుడు భార్య ఎక్కడో ఉంటుంది, భర్త ఎక్కడో ఉంటాడు, పిల్లలు ఎక్కడో ఉంటారు. స్నేహితులంతా వాళ్ళ, వాళ్ళ పనులలో ఉంటారు. మనం ప్రాణం విడిచేస్తాం. కానీ విడిచిపెట్టిన క్షణంలో మనతో ఉన్న మన పంచ ప్రాణాలే స్నేహితులు. పంచ ప్రాణాల యొక్క మూల స్వరూపమే ఆత్మ. ఆత్మ యొక్క విరాట్ మూర్తి స్వరూపమే పరమాత్మ. పరమాత్మే సచ్చిదానంద గురుమూర్తి అయినటువంటి సత్య సాయి భగవానుడిగా నేను అనేక సందర్భాలలో, అనేక క్షణాలలో, క్షణం విడవకుండా భావనలో ఉంటాను నేను. అలా ఉండాలి. ఈవేళ మనం చేయవలసింది ఫోరం కి వెళ్ళండి, ఎవరు మిమ్మల్ని పిలవండి, రోటరీ క్లబ్ పిలిస్తే వెళ్ళండి, స్వామి గురించి చెప్పండి. స్వామి ఏం చేశారో చెప్పాలి. చెప్పకపోతే "నా తండ్రి ఇంత గొప్పవాడు" అని చెప్పకపోతే కుమారుడు పుట్టేమి, గిట్టేమి? "నా తల్లి ఇంత గొప్పదే" అని చెప్పకపోతే కుమార్తె పుట్టేమి, గిట్టేమి? "నా గురువు ఇంతటి వాడు" అని చెప్పకపోతే శిష్యుడేమి, అంతేవాసి ఏమి? "నా పరమాత్మ ఇంతటి వాడు" అని చెప్పకపోతే జన్మ ఏమి, జన్మ ఎత్తకపోతే ఏమి? ప్రశ్న ద్వారా రాబోయేటువంటి కాలమంతా కూడా, సంవత్సర కాలం ఏదో మన ఉరికినే. పెద్ద లెక్కలు కావుగానీ మధ్య house visits మానేసిన నేను ఒక ఆలోచన చేశా. మళ్ళీ ఒక వంద ఇళ్ళకి వెళదాం, ఏదో అప్పుడంతా వందే మాట్లాడుతున్నారు, వంద తర్వాత లేనట్లుగా. నేను వంద పెట్టుకోలా. పదివేల గృహాలకు నేను వెళ్లాలని నా అంతట నేను నిర్ణయించుకున్నా. అందులో మొదట ఒక వంద గృహాలు అనుకున్నా. వంద గృహాలు అంటే వాళ్ళు పిలుస్తే కదా, నేను మీ ఇంటికి వస్తున్నాను అని వెళ్ళలేం కదా. ఆశ్చర్యం! స్వామి సంకల్పం. వంద అనుకున్నా రెండు నెలలు కాకుండానే ఎనభై నాలుగు ఇళ్ళు పూర్తయిపోయాయి. ఇది గిన్నిస్ రికార్డ్ కాదు, స్వామి యందు మనకున్నటువంటి ఒక బాధ్యత. స్వామి యొక్క వైభవాన్ని మనం ప్రపంచానికి చాటి చెప్పవలసిన ఒక ధర్మం. ఇది చెప్పకపోతే మన జీవితం అసమగ్రం, అసంపూర్ణం. అన్నింటినీ మించి కృతజ్ఞత లేని జీవితం మంచిది కాదు. అది జీవితమే కాదు. అన్నం పెట్టినటువంటి ఒక తల్లిని తలుచుకోవాలి. తల్లి ఎవరైనా కావచ్చు, కన్నతల్లే కావచ్చు, పర్లే. కరుణసుబ్బమ్మ గారి గురించి foreigners స్వామి sixty eighth birthday కి పైకి వెళ్తుంటే స్వామి అడిగారు. కరుణసుబ్బమ్మ నగర్ అని తెలుగులో బోర్డు తగిలిస్తే foreign journalist అడిగాడు, అదేమిటి అని అడిగాడు. స్వామి చెప్పేశారు, తెలుగులోనే చెప్పారు. ఆయన English లో అడిగాడు. ఏమిటంటే, ఈశ్వరమ్మ కన్నతల్లి, సుబ్బమ్మ కనుగొన్న తల్లి. ఎంత అందమైన మాటలండి! ఎంత అద్భుతం, మధురమైన మాట. కానీ యదార్థం. ఈశ్వరమ్మ కన్నది కానీ ఈయన భగవంతుడని కనుగొన్నది ఈశ్వరమ్మ కాదు, కరుణం సుబ్బమ్మ. ఇటువంటివన్నీ కూడా మనం చక్కగా నిత్యము మననం చేసుకుంటూ ఎవరికి తోచినది ఇటువాలు ఇవాళ మనకి forum ఏర్పడింది. అద్భుతమైనటువంటి forum. దీనికి నా అభినందనలు అని మాత్రమే కాకుండా, వారు నన్ను ఎప్పుడు పిలిస్తే నేను రాగలిగాను. ఈ, కాలం నుంచి, ఈరోజు నుంచి కాస్త ముందుగా చెప్తే ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్తూ స్వామిల గురించి చెప్పుకునేది చాలా తక్కువ. ఇవాళ, time లో, time, we are కాలబద్ధులం కాబట్టి. సందర్భాలు పెరిగినప్పుడు ఇవన్నీ కూడా మన ముందుకు వస్తాయి. పురాణ వాంగ్మయం అంతా కూడా స్వామిమయం. ఉపనిషత్తులన్నీ, ఆయన ఉపనిషన్మూర్తి ఆయన. మూడు వేదాల యొక్క స్వరూపం స్వామి. వీటన్నింటికీ under current ఏమిటంటే మానవీయమైన భావన, స్పందన. నువ్వు మానవ జన్మ ఎత్తావు, దీన్ని స-సార్థకం చేసుకో. మళ్లీ, మళ్లీ వస్తుందో రాదో, మళ్లీ ఇటువంటి జన్మ వస్తుందో రాదో నిదానానికి ఆలోచించండి. 2011 ఏప్రిల్ ఇరవై నాలుగు ముందు మనం అదృష్టవంతులం. తర్వాత పుట్టిన వాళ్ళు దురదృష్టవంతులు కారు కానీ వాళ్ళకి ఆధారం లేదు. CDలు లేకపోతే technology లేకపోతే ఏదో నాబోటు వాడు చెప్పే నాలుగు మాటలు తప్ప వాళ్ళకి ఆధారం ఎక్కడుంది? అని ఒకానొక time లో అనుకున్నప్పుడు ఇది కూడా అక్కర్లేదేమో ఎందుకంటే స్వామిని సారోక్య, సామీప్య, సాన్నిధ్యాలలో మనం అనుభవించాం నిజమే. కానీ అసలు స్వామిని చూడకుండా మూడింటినీ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు మనకంటే అదృష్టవంతులని నిర్ణయానికి నేను వచ్చాను. వాళ్ళు స్వామిని చూడలే, కానీ స్వామి సేవలో ఉంటారు. వాళ్ళు స్వామివేమీ చదవలే, చదవక్కర్లేదండి. ఆయన్ని ఎలా స్వామి చేసినవన్నీ మేము CDలలో చూశాం, మేం చేస్తాం. సంస్థాగతమైనటువంటి వాళ్ళందరూ చెప్పే మంచి మాటలు, మార్గదర్శక సూత్రాలు follow అవుతున్నటువంటి అనేకమంది యువకుల్ని, యువతులను నేను కలిసినప్పుడు ఇవాళ సగర్వంగా, సమర్థవంతంగా, సప్రమాణికంగా, సంపూర్ణంగా చెప్పగలిగిన ఒకే ఒక్కమాట సత్యసాయి భగవానుని యొక్క దివ్య నామము, అవతార వైభవము ఎవరో వెలిగిస్తే వెలిగించేది కాదు, దీనికి ప్రచారం చేస్తున్నాం అనే భ్రమలో మనం ఉండొద్దు. ప్రచార భాగంలో మనం దీన్ని ఉపాసనా మార్గంగా మార్చుకొని రాబోయేటువంటి మన తర్వాత తరానికి స్వామి యొక్క దివ్యమైనటువంటి దివ్యత్వాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, వాళ్ళ జీవితానికి పనికొచ్చేటువంటి రీతిలో దాన్నే అనుష్ఠాన వేదాంత భూమిక. అనుష్ఠాన వేదాంత భూమిక వివేకానందుడిది కాదు, ఉపనిషత్తులది అది. స్వామి చేసిందంతా అనుష్ఠాన వేదాంతమే. చివరిగా రెండు మాటలు చెప్పి ముగిస్తాను. ఒకటి, భగవద్గీతలో నీకు ఆరు వందల తొంభై తొమ్మిది శ్లోకాలు రావ-రాలేకపోయినా, రాకపోయినా ఏమీ నష్టం లేదు. కానీ చిట్టచివరి శ్లోకం మాత్రం ఒక్కటి ధారణ చేయండి."యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్నతిర్మమ" ఎక్కడ యోగీశ్వర స్థాయిలో ఉన్నటువంటి ఒక గురువు సర్వ సన్నద్ధుడు సిద్ధుడు శుద్ధుడు అయిన అర్జునుడు వంటి ఒక సాధకుడు ఇద్దరూ కలుస్తారో మాట్లాడుకుంటారో దాని వలన సమాజానికి విజయం లభిస్తుంది. ఇది నిశ్చయము నిశ్చితము అనే భావన ప్రమాణంగా ముగింపు చెప్పాడు. ఇలా యోగీశ్వర స్థాయిని దాటినటువంటి స్వామి "త్రియాతీత పదస్థితాం" అంటాం త్రియాతీతాన్ని దాటారు ఆయన. అటువంటి పరమాత్మ మనల్ని స్థాయికి దిగి వచ్చి మనతో కలిసి మమేకమై వారి అవతారాన్ని కొద్దిసేపు ఆపి పరిసమాప్తమైనది ఆపి మళ్ళీ పునః ఏదో రూపంలో ఎప్పుడో అవసరమైనప్పుడు వచ్చే లోగా మనం స్వామితో ఉన్నందుకు మనం కూడా equip అయినందుకు అవుతున్నందుకు మనం సమాజానికి మనం సేవ చేయాలి. అది సమాజ సేవలో పునీతులమైనవా కాదు మన ప్రయత్నం మనం చేయాలి. అది జీవ ప్రజ్ఞ దానికి పరమాత్మ యొక్క దైవ ప్రజ్ఞ ఎప్పుడూ ఉంటుంది. స్వామి అనుగ్రహం నాకు ఉందో లేదో అనుకోవద్దు, గురువు అనుగ్రహం ఉందో లేదో అనుకోవద్దు. గురువు యొక్క అనుగ్రహం ఉండనే ఉంటుంది కానీ ఎప్పుడూ జీవ ప్రజ్ఞ మనం పని చేస్తే ఆయన చూస్తారు. మనం పని చేయకపోతే ఆయన చూడడు కదా! కాబట్టి మనం పని చేయాలి. పని చేయాలో సంస్థ అన్నీ చెప్పింది. సంస్థ ఇవాళ ఎంత refine అయింది redefine అయింది, ఇవాళ అవసరాలు ఏమిటి? మనం ఎవ్వరం ప్రచారం అనే మాట వాడొద్దండి. ప్రచారము ప్రబోధము పరిమితమైనవి. ప్రసారము కావాలి. translator transporter దాటి transmitter స్థాయికి వెళ్ళాలి. As Swami transmitted his dignity among all hundred and eighty eight countries encompassing the caste, colour and creed, we too should encompass. We too should raise higher and higher, go deeper and deeper. From without to-- we must have a journey into within అని నేను భావన చేస్తూ అనేక అమృత భావనకు మూలమైనటువంటి స్వామికి నమస్కరిస్తూ స్వామికి ప్రణమిల్లుతూ పన్నెండు సంవత్సరాల వయస్సులో ఇందాక చెప్పినటువంటి "అనన్యాశ్చింతయన్తో మా" నాకు ఇచ్చిన ప్రప్రథమ శ్లోకం నాకది మంత్రోపదేశంగా నేను భావన చేస్తూ అలాగే కడదాకా కనురెప్ప వాలేదాకా స్వామి సేవలో నిరంతరము కొనసాగాలని ఆ-ఆకాంక్షిస్తూ లక్ష్మీనారాయణ గారికి వారి team కి వారి ఇద్దరితో పాటు ఇందాక ఒక number తొంభై అని విన్నాను at any time. తొంభై విన్నారా? తొమ్మిది మంది విన్నారా? తొమ్మిది లక్షల మంది విన్నారా? అక్కర్లేదు. ఎందుకంటే ఇవాళ technology వచ్చింది. one to one మాట్లాడిన ఒక కోటి మంది విను-- వాళ్ళు వినే అవకాశం ఉన్నది. అలాగే అమృతమైనటువంటి వాణి పరమాద్భుతమైనటువంటి ఒక అవతారమూర్తి యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రపంచానికి అందించే దిశగా శత జయంతి ఉత్సవాల్లో మన కార్యక్రమాలని, మన శక్తిని, మన ప్రజ్ఞని, మన తనువుని, మన ధనాన్ని, మన మనస్సుని, మన సంకల్పాన్ని, మన ఆలోచనలని, మన ఆదర్శాన్ని అన్నింటినీ కూడా అధ్యాత్మ మార్గం వైపు మళ్ళించే దిశగా స్వామి మనందరిపై తమ కరుణని పరమాద్భుతంగా మహా వృష్టిగా కురిపించాలని నేను స్వామిని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకామనలు తెలియజేస్తూ ఇన్నేళ్లుగా ఇన్నాళ్లుగా విన్నటువంటి మాటలన్నీ ఆచరణాత్మకం కాకపోతే బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి. బూడి-- పన్నీరు బూడిదలో పోయటానికి పుట్టలేదు అది పరిమళాన్ని వెదజల్లటానికి వచ్చింది. అని ఇటువంటి మౌలిక సూత్రాలన్నీ గ్రహించుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని అలాగే కోటేశ్వర రావు గారు ఇవాళ ప్రసంగంలో ఇచ్చిన అది ఆధ్యాత్మిక పరం, సంస్థాపరం. రెండింటిని కూడా చాలా చక్కగా చెప్పారు. కోటేశ్వర రావు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ forum వేదిక ఇలాగే నిత్యమూ కొనసాగాలని numbers లెక్క ఉరికే number వేసుకోండి మీ లెక్కకి కాని ఇది ఒక అనంత అనాహత నాదంగా ప్రవర్తిల్లాలని, లక్ష్మీనారాయణ గారికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆయుష్షుని, అవకాశాన్ని అన్నీ కూడా సర్వేశ్వరుడైనటువంటి స్వామి అనుగ్రహించు గాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం.
YouTube · audio

ASB 5th Anniversary Celebrations & Sri S Koteswara Rao garu satsang

Home

ASB 5th Anniversary Celebrations & Sri S Koteswara Rao garu satsang

Source: Aham Sathya Bodhaka on YouTube

0:00 / 2:31:39

More in this series

Aham Sathya Bodhaka — anniversaries & satsangs

4 episodes · 5 hr 53 min

  1. 1 hr 21 min 1

    ASB 4th Anniversary Satsang on 29062024

  2. 33 min 2

    Asb 700 Days Interactive Session With Devotees

  3. 1 hr 11 min 3

    ASB 5th Anniversary Celebrations & Sri S Koteswara Rao garu satsang

    Now playing
  4. 1 hr 9 min 4

    Satsang on sai ramaneeyam on 25102025