No transcript for this section.
Transcript begins at 0:00.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జన మందారం వందే సాయి మహేశ్వరం తురియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని జయస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక విషత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్ఫురతాంబులు పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ స్వామి తొంబై ఆరవ జన్మదిన మహోత్సవ సంరంభ వేళ అనేకమైనటువంటి విషయాలను మనం ముచ్చటించుకుంటూ ఈ రోజున ప్రేమ అంటే ఏమిటి? దానిని స్వామి ఈ ప్రపంచానికి ఎలా పరిచయం చేశారు? ప్రేమ స్వరూపులుగా సాధారణమైన వ్యక్తి నుంచి అసాధారణమైనటువంటి వ్యక్తుల వరకు కూడా ఎలా తీర్చిదిద్దారు? ఇది కాస్త విచారణ చేద్దాం. మానవ జీవితం మూడు విధాలుగా సాగుతుంది. అంటే మూడు ప్రభావాలు మానవ జీవితాన్ని నడిపిస్తాయి. ఒకటి రాగబంధం [గొంతు సవరించిన శబ్దం] రెండవది అనురాగ బంధం మూడవది ప్రేమ బంధం. నిజానికి ఈ మూడు దగ్గర, దగ్గరగా ఒకటిగానే అనిపిస్తున్నా వైవిధ్యం చాలా ఎక్కువ ఉన్నది. వైరుధ్యం లేదు. ఆ వైవిధ్యం ఏమిటో కాస్త విచారణ చేద్దాం. ముందుగా రాగబంధము అంటే రక్తసంబంధం అని అర్థం. రాగము, రక్తము ఇవన్నీ ఎక్కడైతే విషయాలుగా ఉన్నాయో సాధకుడికి మమకారము, అహంకారము, అపేక్ష, లాలస, భోగము ఇవన్నీ కూడా పెనవేసుకుని దానిలో అంతర్భాగంగా ఉంటాయి. కారణం రక్తసంబంధంలో నుంచి ఏర్పడినటువంటి అంటే తరువుతో ఏర్పడిన బాంధవ్యాలు అన్నీ కూడా తరువు తెల్లవారే వరకు కూడా అవి నడుస్తూనే ఉంటాయి. కాలంలో మార్పులు రానివ్వండి స్థితిగతుల్లో మార్పులు రానివ్వండి మానసిక ప్రవర్తనలో గాని, జీవన విధానంలో గాని, జీవన వైవిధ్యంలో గాని, జీవన శైలి లో గాని, దృక్పథంలో గాని ఎన్ని అంతరాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ ఇది నాది, వీరు నా వారు అన్నటువంటి భావన అంటే అత్యంత సహజంగా ఏర్పడేటువంటి ఒక బంధం ఏమిటంటే అది రాగబంధం. కాలం మారినా, తరాలు మారినా, అంతరాలు దూరమైనా ఏం కానివ్వండి ప్రాపంచికమైనటువంటి ఎన్నెన్ని అవరోధాలు కలిగిన రాగబంధమే మనిషిని, మనిషిని నిలబెడుతుంది. అది కుటుంబ వ్యవస్థకు పునాది. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఆ-అట్లాగే రక్తసంబంధీకులు అయినటువంటి వారు జ్ఞాతులు అంటాం. వీళ్ళందరినీ గనుక మనం కలుపుకున్నట్లయితే వారితో ఉండేటువంటి బాంధవ్యం ఆయా దేశకాల పరిస్థితులను బట్టి మారవచ్చునేమో కానీ మౌలికమైన, ప్రాథమికమైనటువంటి ఒక విషయం అంతర్వాహినిగా నడుస్తూనే ఉంటుంది. దాన్ని ఎవరూ చెరపలేరు. ఏ బంధం అయినా మారిపోవచ్చు గాని రాగబంధం మారేది కాదు. అది తీరేది కాదు. మా పెరగని బంధం ఏదైనా ఉంటే అది రాగబంధం. కానీ అది కేవల భౌతిక స్థాయిలో సంచారం చేస్తుంది. [హారన్ శబ్దం] ఈ రాగబంధంలో మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి, మన ఆలోచనలు, మన అవసరాలు, మన అవకాశాలు, ఆకాంక్షలు, అపేక్షలు ఇవన్నీ కూడా నిజానికి ఆదర్శాన్ని ఆ మన దాకా రానివ్వవు. ఆశయాలని గట్టిగా నిలబెట్టలేవు. కాబట్టి పైకి గంభీరంగా చాలా బలీయంగా కనిపించేటువంటి రాగబంధంలో డొల్లతనం ఎక్కువ. ఎందుకంటే మనిషి ఎరగకుండా, ఎరగకుండా, విస్తృతం కాకుండా, తనను తాను అనేక క్షేత్రాలను దర్శనం చేయకుండా చేసేటువంటి బంధము రాగబంధం. కాబట్టి ఇది మారేది కాదు. మళ్ళీ అనుకుంటే తీరేది కాదు. ఇక రెండవది అనురాగ బంధం. అనురాగం రాగం యొక్క ఆ దాన్ని విస్తృతమైనటువంటి ఒక భావనే అనురాగం అని పేరు పెట్టుకున్నాం. ఈ అనురాగం అంటే ఉదాహరణకి మన స్నేహితులు లేదా మన పరిచయస్తులు లేదా మనకు తెలిసినవారు లేదా మనల్ని ఎరిగిన వారు. వీళ్ళందరూ కూడా మన పట్ల ఒక అభిమానాన్ని, ఒక గౌరవాన్ని, ఒక అపేక్షని వీటన్నింటినీ కూడా పెంచుకొని ఈ అనురాగ బంధంతో ముడిపడి ఉంటారు. ఈ జీవులన్నీ ముడిపడి ఉంటాయి. ఎందుకని ఉంటాయి అంటే అనురాగ బంధం కారణంగా మానవ జీవితం నడుస్తుంది. అది కేవల లౌకిక సంబంధమైనటువంటి బంధం. ఎందుకని? ఇవాళ విడదీయరాని మిత్రులని, విడదీయలేని మైత్రి అంటే స్నేహం అని భావించిన అనేక సందర్భాలలో స్నేహితులుగా ఉన్నవారు ఎడమొహం, పెడమొహం అవుతారు. కారణం ఏమిటి అంటే వ్యక్తులలో ఏర్పడేటువంటి స్థితిగతులలో మార్పులు. జీవితంలో వాళ్లకు ఉన్నటువంటి ప్రాముఖ్యతా క్రమాన్ని బట్టి ఈ అనురాగ బంధాలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. అవన్నీ చాలా Transient గా impermanent గా ఉంటాయి. ఉదాహరణకి మనం అనేక ప్రదేశాల్లో ఉద్యోగము, వ్యాపారము చేస్తాం లేదా నివాసం ఏర్పరచుకుంటాం. అక్కడ నివసించి ఉన్నంత కాలము అనురాగ బంధం నడిపిస్తుంది.మనం ఆ ప్రదేశం మారినా, దేశం మారినా, కాలం మారినా, అంతస్తులు మారినా లేదు అవసరాలే తీరినా ఈ అనురాగ బంధం నెమ్మదిగా పల్చబడిపోతుంది. ఒకరికొకరు తెలియనట్లుగా తెలిసి తెలియనట్లుగా తెలిసినా ఏమీ పట్టనట్లుగా చాలా fragile అంటాం అంటే పెలుసుగా ఉంటుంది ఆ అనురాగ బంధం. రాగ బంధాన్ని దాటినటువంటి అనురాగ బంధం శాశ్వతమైనది కాదు. అనురాగంలోనే అపేక్షలున్నాయి అనురాగంలోనే మమతలున్నాయి అనురాగంలోనే మమకారాలున్నాయి దానిలోనే బంధనలున్నాయి బాంధవ్యాలున్నాయి. ఇవన్నీ కూడా మనం విచారణ చేసినట్లయితే రాగ బంధాన్ని దాటి అంటే రాగ బంధం కుటుంబానికి పరిమితమైతే అనురాగ బంధం సమాజగతమైన అటువంటిది. ఇక్కడ కూడా మానవునికి తృప్తి ఉండదు ఎందుకంటే అనేక మంది కాల ప్రవాహంలో కలుస్తుంటారు విడిపోతుంటారు. అందులో కొందరిని మనం చాలా అపేక్షగా వీరు మా వారు అని అనుకుంటాం కానీ అవతల వారు మన గురించి అలా అనుకోకపోవచ్చు. లేదు వీడు నాకు అక్కరలేదు వీడితో నాకు సంబంధమే లేదనుకున్న వాడే మనకు అక్కరకు రావచ్చు. కాబట్టి ఇదంతా కూడా అవసరాలతో కూడి ఉన్నదే అనురాగమైనటువంటి బంధం కాబట్టి ఇది పుత్ర పితృ సంబంధం కాదు. తల్లిదండ్రులు బిడ్డలకు ఉన్న సంబంధం కాదు అది రాగ బంధం. ఇక్కడ కేవలము పై పైన అంటే superficial గా కనిపించేటువంటి బంధమే అనురాగ బంధం. దీనిలో మనకు నచ్చిన వాడో నచ్చినవారో దూరం అయితే ఆ విషాదాన్ని భరించలేం. కావాలనుకున్నవారు మనం కోరుకున్న వారు దగ్గర కాకపోతే ఆ విషాదాన్ని భరించలేం. కనుక దీనిలో ఏమీ దాగి ఉన్నది ఎక్కువ భాగం అంటే దుఃఖమే దాగి ఉన్నది. కాలం విడదీస్తుంది, అవసరాలు విడదీస్తాయి, అనురాగ బంధాలు కూడా దాని-దాని అంతట అవే మార్పు చెందుతూ వాటి వాటి స్థానాల్లో రూపాంతరీకరణం చెందుతూ జరిగిపోతూ ఉంటాయి. మరి మూడవది ఏమిటి అని రాగ అనురాగాలు కాకుండా ఇంకేదైనా ఉన్నదా అంటే ఆ ఉన్నదాని పేరు ప్రేమ. ఇంతకీ ఈ ప్రేమ అంటే ఏమిటి? ఈ ప్రేమ అంటే ఎటిమాలజీ లో శబ్దోత్పత్తి అంటాం. ఈ పదం దేనిలో నుంచి పుట్టుకొచ్చింది ప్రేమ అంటే భ్రమ అనేటువంటి పదం లో నుంచి పుట్టింది ప్రేమ. భ్రమ అంటే ఏమిటి? భ్రమ కాన్నిది భ్రమ. భ్రమ అంటే ఇందాక చెప్పిన ఏది transient గా ఉందో, ఏది deceptive గా ఉందో, ఏది illusionary గా ఉన్నదో, ఏది ఊహాత్మకంగా ఉన్నదో, ఏది భ్రాంతిగా ఉన్నదో అదంతా భ్రమ అయితే perfect knowledge ఏ విషయంలోనైనా అది మానవ సంబంధాలు కావచ్చు ఆ ప్రవృత్తులు కావచ్చు దేనిలోనైనా ఒక deeper knowledge ఒక అధికారం దాని మీద తిరుగులేని ఒక బంధం ఏదైతే ఉంటుందో దాని పేరు భ్రమ. ఆ భ్రమ ప్రేమగా మారింది. కాబట్టి ఈ ప్రేమ ఈ చలంచలితమైనటువంటిది ఈ ప్రపంచం నిత్యము మారిపోతూ ఉంటుంది, అవసరాలను బట్టి ప్రపంచం నడుస్తుంది కదా మరి ఈ ప్రేమ ఈ భ్రమ, భ్రమ అంటే ప్రేమే రెండూ ఒకటే. ఈ ప్రేమ అంటే అసలు ఏమిటి అంటే ఈ వేళ ప్రేమకి కావ్యాల్లో ఒక అర్థం ఉంది, ప్రబంధాల్లో ఒక అర్థం ఉంది, పౌరాణిక గాథలలో మరొక అర్థం ఉంది. అవన్నీ కూడా కాల్పనిక జగత్తుకు సంబంధించినవి. They are all utopian thoughts. అలాగే మన ఊహకి అతీతమైన మనం ఆ ఊహ ద్వారా పొందేటువంటి ఒక ఆనందానికి సంబంధించిన దానిని ప్రేమ అని పేరు పెట్టుకున్నాం. నిజానికి అది కానే కాదు. ఒక వైదాంతికమైనటువంటి భావనకు చెందినటువంటి పదమే ప్రేమ. వేదాంతం అంటే వదులుకోవటం కాదు అన్నింటినీ కలుపుకోవటం. వేదాంతం అంటే వైరాగ్యం కాదు. వేదాంతం అంటే రాగంలోనే అనురాగంలోనే విరాగాన్ని అనుభవించడమే ప్రేమ. అన్నీ ఉంటాయి వస్తువులన్నీ ఉంటాయి భార్య, భర్త, పిల్లలు, పెద్దలు, స్నేహితులు, ప్రపంచము, ఉద్యోగము, వ్యాపారము, సంపద అన్నీ ఉంటాయి కానీ వీటన్నింటినీ దాటి దీని supra mental consciousness అంటాం. ఒక అతిమానసికమైనటువంటి స్థితిలో గనుక మనం ఉండగలిగినట్లయితే ఆ స్థాయిలో మనం అనుభవించేటువంటి ప్రాపంచిక బంధానికే ప్రేమ అని పేరు. ఇప్పుడు చాలాసార్లు మనం అనుకున్నాం దయ, జాలి, సానుభూతి జీవుడి పరమైతే కరుణ ఒక్కటే భగవంతుడి పరమైనది. అందుకనే శంకర భగవత్పాదులను మనం కరుణాలయం అని పిలుస్తాం. కాబట్టి ఈ కరుణ ఎట్లాగైతే భగవంతునికి చెందిందో నిజానికి ప్రేమ కూడా భగవంతునికి చెందిందే. ఎందుకని రాగము మనం ఇందాక అనుకున్న రక్త సంబంధం, అనురాగము ప్రాపంచిక బంధం మరి ప్రేమ బంధం ఏమిటండి ఏమిటి అంటే ఈ జీవుడి యొక్క ఆత్మ పరమాత్మతో అనుసంధానమైనప్పుడు కలిగేటువంటి ఒక హృదయ స్పందన పేరు ప్రేమ. ఈవేళ నాటకాల్లో, చలనచిత్రాలలో, అనేక మాధ్యమాల్లో వినిపించే అనిపించే మాట ఆ ప్రేమ ప్రేమ కానే కాదు. అంటే జీవుడికి పరమాత్మకి ఉన్నటువంటి బంధమే ప్రేమ బంధం. ఆ బంధం ఎవరూ విడదీయరానిది అది సామూహికమైంది కాదు. ఒక వెయ్యి మంది హృదయాలు ఎక్కడో కలిసి ఉన్నాయి అంటే ఉండవు. ఎట్లాగంటే జీవులు ఎవరికి వారే unique విశిష్టంగా ఉంటారు కాబట్టి వారి కర్మ, భక్తి, జ్ఞాన, యోగాల వలన పూర్వ పురాస్మృతులు అంటే పూర్వజన్మలలో ఏర్పడిన కొన్ని జ్ఞాపకాల వలన అనేకమైనటువంటి సంస్కారాల వలన, తల్లిదండ్రుల వలన, సహాధ్యాయుల వలన, అధ్యాపకుల వలన.ఈ ప్రపంచం వలన మనం పొందేటువంటి ఒక సంస్కారధార ఏదైతే ఉన్నదో అది నెమ్మదిగా భగవత్ తత్వం వైపు నడిచినప్పుడు ఇదే ప్రేమగా మారుతుంది. మనం చూడండి భక్తి జ్ఞానము రెండూ ఒకటే అని ఉంటాం. నిజం. ఎందుకని? The devotion and జ్ఞాన are one and the same అని కదా మనం అనుకుంటాం. ఈ రెండింటితో పాటు అసలు ఈ రెండూ ఎలా కలుగుతాయి? అనేది విచారణ చేసి దాంతో పాటు ఏముందో ఒక నిమిషం మాట్లాడుదాం. ఒక నాస్తికుడు అంటే భగవంతుని యొక్క ఉనికిని విశ్వసించని వాడు ప్రశ్నించేవాడు. లేడు అంటూ మొదలుపెట్టేవాడు. ఒక బాగా చదువుకున్నటువంటి ఎరుక కలిగినటువంటి వ్యక్తిని గనక కలిసినట్లయితే ఈ నాస్తికుడు నెమ్మదిగా ఆస్తికుడు అవుతాడు. అంటే భగవంతుడు ఉన్నాడు లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అని ఆలోచన పెరుగుతుంది. ఆ నాస్తికుడు ఆస్తికుడై ఆస్తికుడు నెమ్మది నెమ్మదిగా జిజ్ఞాసి అవుతాడు. ఇది ఏమిటో తెలుసుకోవాలి అన్నటువంటి ఒక తీవ్రమైన కాంక్ష కలిగి ఉంటాడు. కలిగిన తర్వాత ఒకదానికి బద్ధుడై ఉంటాడు నిబద్ధతతో కూడి ఉంటాడు ఆ క్షణంలో దానికి భక్తి అని పేరు పెడతాం. భక్తి కలిగింది గనుక వాడు భక్తుడు అవుతాడు. ఈ భక్తుడు కేవల పంచభౌతికమైన శరీరానికి ప్రాపంచిక అవసరాలకు మాత్రమే కాక దీనిని దాటినటువంటి స్థాయిలో సంచారం చేసే స్థితికి వచ్చినప్పుడు ఆతను జ్ఞాని అవుతాడు. అంటే మహాత్ముల యొక్క దర్శనం చేత నాస్తికుడు ఆస్తికుడై ఆస్తికుడు భక్తుడై భక్తుడు జ్ఞాని అవుతాడు. జ్ఞాని దగ్గర ఆగిపోయినట్లయితే ప్రయోజనం లేదు. ఆ జ్ఞాని ఆనందమయుడు కావాలి. ఆ జ్ఞాని ప్రేమమయుడు కావాలి. జ్ఞాని అంటే స్వామి అని అర్థం. స్వామి అంటే జ్ఞాని అని కూడా అర్థం. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రశ్నించుకుంటూ సందేహాలు తీర్చుకుంటూ స్వాధ్యాయం చేసుకుంటూ సత్సంగలు వింటూ అంటూ అనేకమైనటువంటి సదాచారాలు పాటిస్తూ సమ్యక్ సంకీర్తన చేస్తూ తనను తాను పునర్నిర్మాణం చేసుకొని ఇన్ని దశలు దాటి జ్ఞాని అయినప్పుడు ఆ జ్ఞాని యొక్క మనోస్థితి ఎలా ఉంటుందంటే అందరి యందు ఉన్నది ఒక్కటే అది బ్రహ్మము. సర్వం ఖల్విదం బ్రహ్మ. దీనిని మించి మరొక వస్తువు లేదు అని ఒక ఆలోచనకు వస్తాడు. ఆయన జ్ఞాని అవుతాడు. జ్ఞాని అయినప్పుడు ఈ ప్రపంచాన్ని ఏక వస్తువుగా చూస్తాడు. జ్ఞాని కాకముందు చెట్టు వేరు, ఆకు వేరు, కొమ్మ వేరు, రెమ్మ వేరు, కాయ వేరు, పండు వేరు అన్నవాడు ఇదంతా కలిపితే కదా చెట్టయ్యింది అంటాడు. చూసారా? కాబట్టి ఈ జ్ఞాని ఒక సర్వ సంవృద్ధమైనటువంటి భావనతో అన్నింటినీ చక్కగా గ్రహించి ఒక సమభావంతో సమతాభావంతో దివ్యతా నవ్యతా భావంతో ఎప్పుడైతే మనస్సుని నిర్మాణం చేసుకుంటాడో అతనికి మిగిలేది అతని యందు ఉండేది కేవలము ఆనందం మాత్రమే. మరి ఆనంద స్వరూపుడైన ఈ జ్ఞాని లేదా జ్ఞాన స్వరూపుడైనటువంటి ఆనంద విహారి ఈ ప్రపంచంలో ఎలా ఉంటాడు అంటే ప్రేమమయుడై ఉంటాడు. అంతే. ప్రేమ తప్ప అన్నీ ఉండదు. పశుపక్షాదుల యందు క్రిమికీటకాదుల యందు కాలము నందు ప్రకృతి యందు దీనికే సత్యసాయి భగవానుడు ఒక పద్యం చెప్పారు. చుక్కలన్నియు బ్రహ్మ సూర్యుండు బ్రహ్మ తల్లి అన్నను బ్రహ్మ తండ్రి బ్రహ్మ. కాలమంతయు బ్రహ్మ. పుట్టించునది బ్రహ్మ పోషించునది బ్రహ్మ గిట్టించునది బ్రహ్మ గృహిణి బ్రహ్మ. శక్తి అంతా కూడా బ్రహ్మమే అని చెప్తూ సర్వమును తెలియు ఈ సభయే బ్రహ్మ సత్యమును తెలుపు ఈ సాయు బ్రహ్మ అన్నారు. అంటే పరాప్రకృతితో కూడినటువంటి ఈశ్వరుడు కూడా పంచభౌతిక దేహాన్ని తీసుకొని వచ్చినప్పుడు తాను కూడా పరబ్రహ్మమైనప్పటికీ కూడా బ్రహ్మము స్థాయిలో సంచారం చేస్తాడు. ఈ బ్రహ్మము అన్నా జ్ఞాని అన్నా స్వామి అన్నా ప్రేమైక మూర్తి అన్నా ఏ పేరు పెట్టినా దాని యందున్న అంతర్వాహిని ఏమిటంటే ప్రేమయే. అందువల్లనే డెబ్బై రెండు సంవత్సరాలు సత్యసాయి భగవానుడు మన గురించి మనను ఉద్దేశించి చేసిన అనేకమైనటువంటి ప్రసంగలలో సంబోధనలలో ప్రేమాత్మ స్వరూపులారా అని ప్రేమి-- మనల్ని పిలిచారు, పలకరించారు. అంటే ఏమిటి? మీరు ఆత్మ స్వరూపులే కానీ ప్రేమాత్మ స్వరూపులు కూడా. ఎందుకని ప్రేమాత్మస్-- మీరు నా భక్తులారా అనలేదు నా శిష్యులారా అనలే. ప్రేమాత్మ స్వరూపులారా అంటే ఒక దివ్య ప్రేమతో కూడి ఉన్న ప్రేములు ఇవి. ఇవి ప్రేమాత్మ స్వామిది దివ్యాత్మ అంతే. ఈ ప్రేమాత్మ ప్రేమ వరకు వెళితే తప్ప దివ్యాత్మ మనకు అర్థం కాదు. అంటే సమతా నమతా మమతా దివ్యతా అనబడేటువంటి నాలుగు చరగులు దాటి సీమను దాటి మనోభూమికను దాటి అంతరంగంలో నెలకొంది చెందినటువంటి ప్రేమ స్వరూపమైనటువంటి ఆత్మను గనుక మనం నిరంతరము గ్రహించకపోయినట్లయితే అర్థం చేసుకోకపోయినట్లయితే దాని ఉనికిని తెలుసుకోకపోయినట్లయితే మానవ జన్మ కేవలము యాంతికం అయిపోతుంది. దీనిలో ఇది యంత్రమే. మిషన్ స్విచ్ ఆన్ చేయగానే ఫ్యాన్ తిరిగినట్లు స్విచ్ ఆఫ్ చేయగానే ఫ్యాన్ ఆగిపోయినట్లు అవుతుంది తప్ప ఎందుకు తిరుగుతున్నది, ఎవరికై తిరుగుతున్నది, ఎట్లా తిరుగుతున్నది, ఎన్నాళ్ళు తిరుగుతుంది ఇవన్నీ ప్రశ్నలు. అందుకనే మన ఉపనిషత్ వాంగ్మయం అంతా కూడా ప్రశ్నించమని, శోధించమని, సాధించమని, సాధన చేయమని, సాధ్యమైనదే సాధనగా మార్చుకోమని అనేక రీతిన మనకి ప్రబోధం చేస్తూ వచ్చినాయి. కనుక ఇవాళ ప్రేమ అనేటువంటిది కేవలము ఇద్దరు వ్యక్తుల మధ్యనోఒక సమూహం మధ్యలో ఏర్పడినటువంటి ఒక భావన కాదు, అది కేవలం పైకి కనిపించేటువంటి బంధము కాదు, బంధన కాదు, మోహము కాదు, వ్యామోహము కాదు, వ్యసనము కాదు. మరి ఏమిటి అంటే, ఏ రకమైనటువంటి అపేక్ష లేని, ఏ రకమైనటువంటి కోరిక లేని, ఏ రకమైన expectation లేని, ఏ రకమైన anticipation లేని, నిస్వార్థమైన, అవ్యాజమైన, నిరంతరమైనటువంటి ఒక దివ్య భావనకే ప్రేమ అని పేరు. గనుక ఆ ప్రేమని మనం చక్కగా అర్థం చేసుకున్నట్లయితే మన జీవితాలు వేలంతా ప్రశాంత నిలయం అయిపోవాలి. ప్రపంచం అంతా అంటే వచ్చేదంతా సత్య యుగం ఏంటి? సత్య యుగం దానంతట రాదు. దానంతట అది ప్రశాంత నిలయం అయిపోదు. ఈ సమయంలో, ఈ కాలంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రేమాత్మ స్వరూపుడు, దివ్యాత్మ స్వరూపుడు కాగలిగితే అప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ప్రశాంతి నిలయంగా మారుతుంది. ఈ ప్రశాంతి నిలయంగా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని, అంటే ముందు మన కుటుంబాన్ని, మన చుట్టూ ఉన్న సంఘాన్ని, మనం ఉన్నటువంటి దేశాన్ని, ప్రదేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి రీతిలో ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అలవర్చు చేసుకోవాలి. ఆధ్యాత్మికాలు గాని దానం, వ్రతం, పుణ్యం ఇవన్నీ కావు. ఇవన్నీ rituals. వీటి అన్నింటినీ దాటి, అంటే వదులుకొని కాదు దాటి ఎవరైతే వెళతారో, ఎవరు అధిమానసిక క్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటారో, అణుక్షేత్రం నుంచి ఆత్మ క్షేత్రంలోకి ఒక ప్రస్థానం చేస్తారో, ఎవరు అన్నిటా అంతటా బ్రహ్మమును కంటూ చూస్తూ ఉంటారో, వీ-వీరందరూ కూడా ప్రేమమయులు అయినట్లయితే అరిషడ్వర్గాలను జయిస్తూ, అరిషడ్వర్గాలను దాటుకుంటూ, మోహ వ్యామోహ వ్యసనాలను వదులుకుంటూ, అనేకమైన negativitiesని, దుర్గుణాలని, దురాచారాలని మనసు నుంచి దూరంగా విసరివేసే పారద్రోలు గనుక ఉన్నట్లయితే నెమ్మదిగా మన యందు ప్రేమ పొటమరిస్తుంది. ఆ ప్రేమ పుట్టినప్పుడు మన యందు ఉన్నటువంటి ఆ ప్రేమ భావమే సర్వ జీవుల యందు ప్రకాశమానమై మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. మనల్ని మనం ప్రేమించుకోవటం ఎలాగూ చేస్తాం. మనకు కావలసిన వాళ్ళని ప్రేమించడంలో అడ్డూ ఆపు ఉండదు. గట్టెరగని అటువంటి మమకారంతో యాతన పడతాం. కాబట్టి గట్టెరిగిన, ఒడ్డెరిగిన, పరిమితులు తెలిసిన అపరిమిత, అప్రమేయ, అచ్యుత, అనంత ఆనంద భావం ఏది అంటే అది ప్రేమ అయినప్పుడు ఆ ప్రేమని మనం ఎక్కడ పట్టుకోగలము? ఎక్కడ దానిని గ్రహించగలము అంటే సత్య సాయి భగవానుడి జన్మదిన సంబరంబుల వేళ ఆ విషయాన్నే మనం మాట్లాడుకున్నప్పుడు, చూడండి ఈ నూట ఎనభై ఎనిమిది దేశాలలో ఉన్న ప్రజలు ఒక జాతికి చెందినవారు ఒకే జాతికి చెందినవారు కారు. కనుక జాతి, మత, వర్గ, వర్ణములను దాటి సమస్తమైనటువంటి మానవ జాతిని సంఘటితం చేసి మీరు శ్రేయో మార్గాన్ని వదిలిపెట్టి ప్రేయో మార్గంలోకి-- శ్రేయో మార్గాలను వదిలిపెట్టి ప్రేయో మార్గంలో జీ-జీవిస్తున్న మీరందరూ కూడా ప్రేయో మార్గాన్ని వదిలిపెట్టి శ్రేయో మార్గంలోకి రండి. ప్రేయస్సు అంటే స్వార్థం. శ్రేయస్సు అంటే సంక్షేమం, ఉదారత, ఔదార్యం, క్షమ, సహనం, దయ, కరుణ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి శ్రేయో మార్గం వైపు ప్రస్థానం చేయండి, ప్రయాణించండి. దానివలన మీరు ముందు ఆనంద స్వరూపులు అవుతారు. కోరికలు ఎప్పుడైతే తగ్గుతాయో ఆలోచనలు కూడా తగ్గుతాయి. ఆలోచనలు ఎప్పుడైతే తగ్గుతాయో అవసరాలు తగ్గుతాయి. అవసరాలు ఎప్పుడైతే తగ్గుతాయో మనస్సు పరిశుభ్రమవుతుంది. అది వినిర్మల, విశ్యల, విమలమైనటువంటి ఒక కాంతితో, వెలుగులతో నిండి ఉంటుంది గనుక అటువంటి మనోనిర్మాణం చేసుకుంటూ బుద్ధి, చిత్, అహంకారాలు మూడింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఒక సమతుల్యమైనటువంటి స్థాయిలో మనం తరచుగా వాడే మూడు పదాలున్నాయి. Equanimity, equilibrium and equilibrium. ఇవి చాలా ఆధ్యాత్మిక సాధనలు అవి. ఇంగ్లీష్ పదాలైనా అద్భుతమైనటువంటి పదాలు. సమత్వం ఉండాలి, మమత్వం ఉండాలి. మమత్వం అంటే మమకారం. గట్టెరగని మమకారం ఉండాలి. పరిమితి పరిధి తెలిసినటువంటి సంబంధాలు ఉండాలి. వీటన్నింటినీ గనుక గమనించుకున్నట్లయితే మానవుడు తనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చీకటి కోణాలను పోగొట్టుకుని కాంతురలి, వెలుగురలి ప్రజ్ఞా భూమికలోకి స్వీకరించి జీవితాన్ని పునర్నిర్మాణం చేసుకుంటాడు. కానీ మన అద్దంలో మన బొమ్మని మనం ఎలా చూసుకుని ఆనందపడుతున్నామో, మనలో ప్రేమ పొటమరించిందా, పుట్టిందా లేదా అని ఎక్కడ కనుక్కోవాలి అంటే అద్దం వంటి గురువు దగ్గరకు వెళ్ళాలి. గురువు ఎదురుగా, అంటే అద్దం ముందు నుంచుంటే మనకు మనం బాగా కనిపిస్తాం. అద్దం బాగా లేదు, అద్దం మీద అనేక మాలిన్యాలు ఉన్నాయంటే మనం బిం- ప్రతిబింబమై దాని యందు కనిపించదు. కాబట్టి ఇక్కడ బింబము పరమాత్మ అయితే, ప్రతిబింబము జీవాత్మ అయినట్లయితే, బింబము భగవాన్ శ్రీ సత్య సాయి అయితే మనందరం కూడా జీవాత్మలం, అంతే. నాయకుడు ఒక్కడే. వైష్ణవ సాంప్రదాయంలో నాయకుడు ఒక్కడే. ఆయ-ఆయన పరమాత్మ. మిగతా స్త్రీలు, పురుషులు, మానవ జన్మ ఎత్తిన ప్రతి వాళ్ళు నాయికలే. నాయకుడు ఒక్కడు, నాయికలు అందరూ. కాబట్టి అందరూ కలిసి ఆ ఒక్కదాని వైపు గనుక వెళ్లగలిగినట్లయితే ఏక చింతన వలన, ఏకాత్మ భావన వలన, అనన్య చింతన వలన, నిస్వార్థమైనటువంటి త్యాగము వలన, సమస్తమైనటువంటి సర్వభావనా సంక్రాంత స్థితిలో గనుక మన మనస్సును ప్రవేశపెట్టుకుని ఉండగలిగినట్లయితే ఏ మనిషి నుంచి మనకు ఏదీ అక్కరలేని స్థితి ఏర్పడుతుంది. పరమాత్మ నుంచి మనకు కేవలం ప్రేమ మాత్రమే మన యందు ప్రవాహ వేగంతో వచ్చి మనల్ని పవిత్రమూ, పునీతమూ చేస్తాయి కాబట్టి సత్య సాయి భగవానుడు ఈ వేళ ప్రప-ఆయ-సాధారణమైనటువంటి ఒక జన్మ ఎత్తినట్లు కనిపించినామన వలె అనిపించిన ఇన్ని దేశాలు ఇన్ని కోట్ల మంది ఆయనను దేవుడు అని ఎలా భావించినయి? దేవుడిని చూసిన వాడే లేడు కానీ చూడబడిన ఈ ఒక్క సత్య సాయిని "ఈయన పరదైవతమే, ఈయన పరబ్రహ్మమే, ఈయన తప్ప అన్య దైవం లేదు" అంతేకాదు ఈయన దైవం అనేది చిన్న మాట సర్వ దైవతాలకి అతీతమైన తేజో రూపమే స్వామి అనే భావన అందరి యందు without any exception ఎలా కలిగింది అంటే, దీనికి ఒక కారణం ఉండి ఉండాలి కదా. అందరూ ఒకే రీతి స్వామిని భగవంతుడు అని ఎలా accept చేశారు? ఎవరో ఒకరు కాదనచ్చు కదా? అవును అనుకొని కాదనుకోవచ్చుగా కానీ నిలకడ ఎలా చెందారు అంటే పవిత్రమైనటువంటి హృదయం కాబట్టి ఈ హృదయాలన్నీ ఒక అత్యంత పవిత్రమైన హృదయం వైపు వెళ్ళినాయి. అంతేకాదు ఇది action reaction principle ప్రకారం సత్య సాయి భగవానుడు తాను సృష్టించిన ఈ జగత్తుని ప్రేమించారు. ఆయనకి ఈ ప్రపంచం తో రక్తసంబంధం లేదు అంటే రాగం లేదు. అలాగే ఆయన చుట్టూ చేరినవారు, ఆయనకు దగ్గరైనవారు లేదు దగ్గర తీసుకున్నవారు వేరే ఎవరితోనూ ఆయనకు అనురాగ బంధం లేదు. కానీ ఆయన దగ్గరకు వెళ్ళినా వెళ్ళకపోయినా, ఆయన్ను మెచ్చినా ఆయన్ను విమర్శించినా, ఆయన అర్థం కాకపోయినా అందరి యందు సమభావంతో ఉన్నారు గనుక, అందరినీ తన దివ్య ప్రేమతో లాలించి, ఆలించి, అదలించి, పాలించారు గనుక అంటే ప్రపంచం మొత్తాన్ని ఆయన ప్రేమించారు గనుక ప్రపంచం మొత్తం కలిసి ఆయన ఒక్కర్నే ప్రేమించింది. అందువల్ల స్వామి ప్రేమమూర్తి అయ్యారు ఇది. కాబట్టి మనము దేవుడు అంటే ఆయన అయిపోలేడు. ఆయన దేవుడు అనే భావం మన ఎందుకు కలగటానికి ఇందాక చెప్పిన కర్మ, భక్తి, జ్ఞాన, యోగ ఇవన్నీ కూడా దాటి మనకు తెలియకుండానే ఈ పదాలు తెలియవు కానీ సేవ చేశాం అది కార్మిక భూమి. అలాగే అనేక విషయాలు అర్థం చేసుకున్నాం అది జ్ఞా-జ్ఞాన భూమి. ఇదంతా కాదు పరమేశ్వరుడు నా యందు ఉన్నాడు అనేది జ్ఞాన భూమిక. ఈ రెండూ నేను పరమాత్మ ఒక్కటే <|diarize|>"త్వమేవ వాహం న సంశయః" absolutely there is no difference between me and పరమాత్మ అనేటువంటి భావన కలగటమే యోగం. కాబట్టి కర్మ, భక్తి, యోగ, జ్ఞాన ఈ నాలుగింటి యందు కూడా స్వామి ఎనభై ఆరు సంవత్సరాల అవనీ సంచారంలో తొలి పధ్నాలుగు ఏళ్ళు పక్కనబెడితే డెభై రెండు సంవత్సరాలు జనజగత్తులతో కూడి ఉన్నారు. కూడి ఉండి అక్కడ పామరుడా, పండితుడా, జ్ఞానయా, అజ్ఞానయా, బ్రాహ్మణుడా, అబ్రాహ్మణుడా, కులమా, మతమా, జాత్యా, వర్గమా, వర్ణమా ఇవేవీ లేకుండా అందరినీ అప్పున చేర్చుకొని అందరికీ కూడా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ ఈ నాలుగు cardinal principles ఇవి మీరు దగ్గర పెట్టుకోండి. దీని ద్వారా మీరు సాధించబోయేటువంటి end result ఏమిటంటే ఈ నాలుగు మీరు సాధిస్తే అంటే మీరు సత్యాన్నంటే ఏమిటో తెలుసుకుంటే, ధర్మ మార్గంలో నడిస్తే, శాంతిమయులై గనక ఉంటే, ప్రేమాత్మ స్వరూపులు గనక అయినట్లయితే జరగబోయేది ఏమిటో చెప్పారా? You will help ever and you will hurt never అది. ఆ నాలుగు ఈ రెండు కలపాలి సమన్వయం చేయాలి. ఆ నాలుగు నాలుగు అదొక subject ఇదొక subject కాదు. అది అయినప్పుడు ఈ help ever hurt never మధ్య యోగం ఒకటున్నది. ఆ యోగమే Love all serve all సరిపోయింది కదా. అంటే సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు సాధించాలి. సాధించినప్పుడు మన మనస్సులో కలిగేటువంటి పరిణామం transformation. స్వామి మోక్షం ఇవ్వటానికి వచ్చిన అవతారం కాదు transformation అది క్రమపరిణామం. పొద్దున్నే ఇవాళ పొద్దున నిద్ర లేవగానే dry clean అయిపోయిన జానులం కాము కొంత time పడుతుంది. స్వామి ప్రశాంతి నిలయం అనేకు ముందు అంటే పుట్టపర్తి అనే కుగ్రామాన్ని అధ్యాత్మ క్షేత్రం ఆయన అనుకుంటే ఆరు నెలల్లో చేసేవారు, చేయలే. ప్రకృతికి వదిలేశారు క్రమపరిణామంగా, నెమ్మదిగా ఒక దాని వెంట ఒక దాని వెంట humble గా principle గా ఆ absolute humanity తో స్వామి దానిని ప్రారంభించినట్లే మనం సత్యం, సత్యము అంటే నేను దేహముగా కనిపిస్తున్న ఈ నేను సత్యము కాదు. ఇది పోతుంది స్వామి చెప్పారుగా "దేహము పంచభౌతికము కూరక తప్పదెప్పుడున్ దేహిని రామయ్యుండు గణతిప్పగా దేహియే దేవదేవుడు" అన్నారు. ఆ దేహి అంటే ఆత్మ. నేను ఆత్మ స్వరూపుడినని ఎరుక కలగాలి అది సత్యం. ఎరుక కలిగిన తర్వాత నేను మనం చెప్పుకున్న అనేక ధర్మాలను పాటిస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి. కాలానికి, విధికి లోబడి నడుచుకోవాలి. తలవంచి ఉండాలి. ప్రకృతితో సహజీవనం చేయాలి. పక్కన ఉన్నటువంటి వ్యక్తితో, జీవులతో, క్రిమికీటకాదులతో ఒక మంచి అపేక్షా భావంతో చక్కగా ఉండాలి. కాబట్టి అన్ని ధర్మాలు పాటిస్తూ ధర్మ వ్రతం చేయాలి. నిత్యమూ ధర్మ వ్రతమే. దీని తర్వాత మనస్సును శాంతిమయం చేసుకోవాలి. అక్కరలేని ఆలోచనలు, తీరని కోరికలు మనల్ని ముంచెత్తి మనల్ని ఏనాడూ కాళ్ళకి, చేతులకి సంకెళ్ళు వేసేటువంటి కోరికలతో శాంతి రాదు. అన్నీ తెంచుకోగలిగినట్లయితే శాంతి ఏర్పడి ద-- ఈ మూడింటి వలన ఒక ప్రేమ కలిగినప్పుడు అప్పుడు మాత్రమే Love all. అప్పుడు మాత్రమే అందరినీ ప్రేమించగలం. అందరినీ ప్రేమించిన తర్వాత నేను ప్రేమించాను అనటానికి గుర్తేమిటి అంటే service చేయాలి, సేవ చేయాలి. సేవ అంటే కష్టంలో ఉన్నవాడిని ఆదుకోవటం. కన్నీరు చిందుస్తున్న వాడి కన్నీరు తుడగగలగటం. నేనున్నాననేటువంటి ఒక వాత్సల్య పూరితమైనటువంటి ఒక అభయం ఇవ్వటం. చేయి చేయి కలపటం. అందరి కోసం ఒక్కడై, ఒక్కడు అందరి కోసమై ఉండే team work అంటే ఇవాళ team work కాదు ఇవాళ జరుగుతున్నది team లో అందరూ కలిసి లోక విరుద్ధమైన ఆలోచనలు చేస్తున్నారు. team అంటే ఈ ప్రపంచానికి మనం నలుగురం కలిసి ఏం చేయాలి? ఈ నలుగురితో పాటుగా కనబడని ఒక అంతఃశక్తి భగవంతుడై ఉన్నాడు. దానిని కూడా మనం కలుపుకోవాలి. అసలు నిజానికి మనం దాంతో కూడి ఉండాలన్నప్పుడు then we serve to people. అంటే సత్య, ధర్మ, శాంతి, ప్రేమలుఎక్కడికి దారి తీస్తున్నాయి అంటే ప్రేమ వైపు దారి తీస్తున్నాయి. ఆ ప్రేమ వైపు దారి తీసి మనల్ని ఏం చేస్తున్నాయి అంటే ప్రేమ గురించి మాట్లాడటం కాదు service చెయ్యని చెప్తున్నాయి. సేవ చేయండి, నిలవాలి, సర్వాలయింది. ఇన్ని ఏర్పడినప్పుడు మాత్రమే we help ever and we hurt never సరిపోయింది. ఇదే స్థూలంగా సత్య సాయి భగవానుడి యొక్క అవతారానికి ఒక పారమార్థికమైనటువంటి విషయం. దీన్ని, దీని మధ్యలో జరిగే మన అనుభవాలు, స్వామితో మనకు ఉండేటువంటి బంధం, స్వామిని గురించిన మన ఆలోచనలు, స్వామిని గురించిన మన అంచనాలు, స్వామిని గురించిన మన అపేక్షలు, స్వామి యందు ఉన్నటువంటి భక్తి, స్వామి యందు ఉన్న గౌరవం ఇవన్నీ కూడా తర్వాత ఏర్పడతాయి. కాబట్టి ఇవన్నీ పొందుతూ మనం ఏం చేయాలి? ప్రపంచం మొత్తం ప్రశాంతీలయం ఎప్పుడవుతుంది? ఇప్పుడే అయిపోతుంది, రేప్ అయిపోతుంది చాలా మంది చెప్పారు. 2020 కి భారతదేశం గురుస్థానంలోకి వెళుతుంది అన్నప్పుడు ఇరవై ఏళ్ల క్రితం నేను అన్న మాట అంటే ఇప్పుడు గురుస్థానంలో లేదా? అని ప్రశ్న వేశారు. అవును ఎందుకంటే భారతదేశం ఈ సృష్టి ఉన్నంత కాలం అది గురుస్థానమే. అది వెళ్ళటమంటూ లేదు గురుస్థానంలోనే ఉంటుంది. ఉండి మిగతా జాతులని, మిగతా దేశాల్ని అద్భుతంగా నడిపిస్తూ ఉంటుంది గనుక ఇవాళ ప్రపంచం మొత్తాన్ని మనం ప్రశాంతీలయం చేయట-- చేయాలి అంటే ఏం చేయాలంటే ముందు నీ ఒంటిలో ప్ర-- శాంతి ఉండాలి. నీ ఇంటిని ప్రశాంతీలయంగా మార్చుకోవాలి, ఆనందధామంగా మార్చుకోవాలి. ఏ అనవసరమైనటువంటి విషయాలైనటువంటి ఒక అద్భుత సౌందర్యవంతమైన భవంతిగా మీ పూరిగుడిస అయినప్పటికీ కూడా దాన్ని అలాగే మార్చుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రపంచం అంతా కూడా ప్రశాంతీలయం అయినట్లయితే అంటే మనమందరం గనక అలా జీవించినట్లయితే నెమ్మది నెమ్మదిగా సత్య యుగం అప్పుడు ప్రారంభం అవుతుంది. సత్య యుగం 2021 వెళ్ళిపోయి 2022 రావటం లాంటిది కాదు. ఇది చాలా కొన్ని యుగాలు, నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాల సమయం ఇంకా ఉన్నది కలియుగానికి. దాని ఆయు ప్రమాణం అంతా. ఐదు వేల ఐదు వందలు ఏళ్లే అయింది. కలియుగే ప్రథమ పాదే అని చెప్తాం మొదటి పాదం ఇది, ఇంకా మూడు పాదాలున్నాయి. మూడు పాదాలంటే మూడున్నర లక్షల పైన నాలుగు లక్షలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా శాస్త్రపరమైన విషయాలను పక్కనబెట్టి ఒక అవతారమూర్తి అయినటువంటి సత్య సాయి భగవానుడు ఈ నరయాడినటువంటి ఈ దేశంలో మనం పుట్టాం, స్వామితో మాట్లాడాం, స్వామిని దర్శించుకున్నాం, స్వామిని తాకాం, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాం. స్వామి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి విషయాలను అర్థం చేసుకుని జీవితాన్ని సౌందర్య విలసితంగా, ప్రసన్నమయంగా, హాయిగా దాన్ని తీర్చిదిద్దుకున్నటువంటి మనం ఇవాళ స్వామి తొంభై ఆరు ninety sixth birthday అనేటువంటిది. ఆయనకి birthday, ఆయనకి departure day లేవు. అది ఆద్యంత రహితమైనటువంటి పరమాత్మ. ఆయన ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం గనుక మనకి తొంభై ఆరు ఏళ్లు తెలుస్తున్నాయి. కాబట్టి దీని ప్రత్యేకత ఒకటే, మనల్ని నిరంతర సాధకుల్ని చేయటానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ principles అన్నీ మనం గనక అర్థం చేసుకున్నట్లయితే స్వామి పేరు మీద స్వామి పరంగా, స్వామి గతంగా చేపట్టే అన్ని కార్యక్రమాల్లో ఈ నాలుగు ప్లస్ రెండు ప్లస్ రెండు అంటే సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు నాలుగు. love and service రెండు, ఆరు help and not hurting anybody అంతే కదా. అందరికీ సహాయం చేయటం, అందరికీ సేవ చేయటం అవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ మనం కలుపుకున్నట్లయితే ఇది పరమాద్భుతమైనటువంటి అష్టదళ పద్మమైనటువంటి ఒక సాధనా పుష్పంగా మనం స్వీకరించాలి. తదనుగుణంగా ఎవరికి వారు తమ తమ లోపాలు ఎరిగి దిద్దుకుంటూ సరిదిద్దుకుంటూ తీర్చిదిద్దుకుంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తూ మనతో పాటు మన తర్వాత తరాన్ని, మనతో ఉన్న తరాన్ని ప్రభావితం చేస్తూ మనకు ముందున్న తరం నుంచి స్ఫూర్తిని పొందుతూ స్వామి యొక్క తొంభై ఆరవ జన్మదినోత్సవం మనకి ఒక దీక్షా కంకణ బద్ధమైనటువంటి ఒక వ్రత దీక్షకు అంకురార్పణ జరగాలని, మూల స్థానమైనటువంటి ప్రశాంతి నిలయంలో మనందరం కూడా చక్కని సేవ చేయాలని, అక్కడికి వెళితే అక్కడ కలిగేటువంటి ఆ ఆవరణ ప్రభావం చేత మలవిక్షేపాలు రెండూ నశించిపోయి మనం పరిపూర్ణమైనటువంటి మానవులుగా జీవించేటువంటి ఒక సదవకాశాన్ని మనం పొందగలుగుతాం. ఆ అవకాశాన్ని ఆధారం చేసుకుని మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ మన జీవితాలని ఎవరికీ కూడా హాని కలిగించని రీతిలో అదే hurt never అంటే అదే. help ever దానిలో సేవ ఉన్నది, ప్రేమ ఉన్నది. మిగతా ఇందాక చెప్పిన నాలుగు ఉన్నాయి. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ మన జీవితాలు ఫలప్రదం కావాలి, సఫలం కావాలి. మనకి awards ఇస్తుంటారు, జీవన సాఫల్య పురస్కారము అని. అంటే ఎక్కడో ఏదో ఓ మంచి పని చేశాం, అది అందరికీ మెచ్చింది, నచ్చింది. వాళ్ళు మనకు శాలువా తప్పారు. అది కాదు. ఎప్పుడు సఫల జీవితం అంటే ఈ జన్మ ఎత్తినందుకు నా శరీరము, నా మనస్సు, నా బుద్ధి, నా జ్ఞానము, నాకున్న సంపద, నాకున్న కాలము ప్రపంచం కోసం నేను ఎంత వినియోగించాను? దాని వల్ల కలిగిన లాభాలేమిటని గనక ప్రశ్నించుకోగలిగినట్లయితే, దానిలో గనక తృప్తిగా మనం సమాధానం పొందగలిగితే అది నిజమైన సఫల జీవితం. ఆ సఫల జీవితాన్ని పరమేశ్వరుడైనటువంటి స్వామి మనకు అనుగ్రహించాలని, అలాగే స్వామి ఈ జన్మదిన స్ఫూర్తి మనందరినీ కూడా ఉత్తేజపూరితంగా, అనుద్వేగకరంగా, ప్రశాంతంగా ముందుకు నడిపించాలని, ఈ ప్రపంచం అంతా నిజానికి ప్రశాంతీలయం కావటంలో మనం మన పాత్రను చక్కగా నిర్వర్తించాలని నేను భావన చేస్తూ స్వామి birthday అంటే స్వామిని-- ఆయనకి birthday లేదన్నాం కానీ స్వామి birthday అంటున్నాం. ఎందుకంటున్నాం అంటే అది ప్రతి క్షణమూ స్వామి birthday కావాలి.ప్రతిరోజూ మన ఇంట్లో పండగ కావాలి మన ఒంట్లో కొత్త కొత్త ఆలోచనలు కలగాలి అవి సమాజహితంగా ఉండాలి అది పరమేశ్వర ప్రీతి కోసం జరగాలి అవి మనకు ఆనందాన్ని సంతృప్తిని సంతోషాన్ని భద్రతని అన్నింటిని కూడా కల్పించాలి. ఆ విధంగా స్వామి మనకు ఉపదేశించిన సందేశించిన ఆదేశించిన నిర్మించినటువంటి ఒక అధ్యాత్మ మార్గంలో గనుక మనమందరం నడవగలిగినట్లైతే అప్పుడు మాత్రమే ఈ ప్రకృతి ఈ పరమా-- ఈ సృష్టి అంతా కూడా ప్రశాంత నిలయంగా రూపాంతరీకరణం చెందుతుందని భావిస్తూ స్వామి సంకల్పం వసుధైక కుటుంబకం అది స్వామి సాధించేశారు. స్వామి సమస్త ప్రపంచాన్ని ప్రశాంతి నిలయంలో ఒక చోట కూర్చోబెట్టారు. ఒక్క గొడుగు తెరిచి దాని కిందకు తీసుకుని వచ్చారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. అన్ని దేశాల నుంచి వచ్చేశారు, వచ్చేశారు కాదు వాళ్ళని స్వామి తిప్పించారు రప్పించారు కూర్చోబెట్టారు. మౌలికమైన భారతీయ తాత్విక సిద్ధాంతాన్ని సమస్త ప్రపంచానికి తానున్న చోట నుంచి కదలకుండా ప్రసారం చేసి ప్రభావితం చేసినటువంటి ఆచార్య సత్తముడు సత్యాచార్యులు ఎవరు అంటే భగవాన్ శ్రీ సత్య సాయి. కాబట్టి అటువంటి స్వామితో మనం జీవితం గడిపాం అటువంటి స్వామిని మనం చూశాం స్వామిని చాలా దగ్గరగా ఎంతో సన్నిహితంగా స్వామి ఏం చెప్పారో ఏం చేశారో ఎలా క్రమబద్ధమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక రోజువారి విధానాన్ని చూశాం. చాలా తెల తెల వారటానికి ముందే లేచి ఆ సర్వ సన్నద్ధమై ప్రకృతిలో ఒక భగవంతుడు గనుక మానవ శరీరం తీసుకుని జగత్తులోకి వచ్చి మానవ జాతికి ఏం నేర్పాలని అనుకుంటాడో అవన్నీ స్వామి చేశారు. ఇవాళ మనం కూడా ప్రణాళికాబద్ధమైన క్రమబద్ధీకరణమైనటువంటి సులభ సాధ్యమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఆశయాత్మకమైనటువంటి అనుసరణీయమైనటువంటి ఒక దివ్య జీవన విధానాన్ని మనం సాధించుకొని నిర్మించుకొని తద్వారా మనం అందరికీ కూడా ఉపయోగపడే రీతిలో మన జీవితాన్ని పునః సమీక్షించుకోవాలి నిర్మాణం చేసుకోవాలి తద్వారా జీవించాలి నలుగురికి మార్గోపదేశం చేయగలిగిన స్థాయిలో జీవించాలి. ఇవన్నీ అనుగ్రహించగలిగినటువంటి సర్వదేవతాతీత స్వరూపుడైనటువంటి స్వామికి మనసా వచసా శిరసా ప్రణమిల్లుతూ ఈ సమస్త ప్రపంచము కూడా ప్రశాంత నిలయమై భాసిల్లు గాక. సర్వజీవ హృదయాలు ప్రఫుల్లమై మనోల్లాస పులకిత పుంభితమై ఆనంద సర్వస్వమై నిత్యము కూడా తత్వానుసంధాన స్ఫూర్తితో వెలుగును గాక అని మంగళాశాసనం చేస్తూ స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సాయిరాం. సత్య ధర్మ ప్రేమ నిత్యమై ఉండిన కూడ మీ తల్లి ఎంతో పులకరించు విశ్వ శాంతినిచ్చు వివిధ సౌఖ్యము హెచ్చు వినుడు భారతీయ వీర సుతుడా వినుడు.
YouTube · audio
దివ్యపద వైభవమ్ - సత్య , ధర్మ , శాంతి, ప్రేమ ! (ప్రేమ)
దివ్యపద వైభవమ్ - సత్య , ధర్మ , శాంతి, ప్రేమ ! (ప్రేమ)
Source: SATHYA PEETHAM on YouTube
0:00 / 40:31
More in this series