No transcript for this section.
Transcript begins at 0:00.
త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాజ్ఞ శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవిసత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్పురతాం మే. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఈ పరమ పవిత్రమైనటువంటి కాలంలో కాలే స్థలే జలే అన్నారు మహాస్వామి వారు. కాలం పరమ పవిత్రమైనటువంటిది మనం ముహూర్తాలు దుర్ముహూర్తాలు రాహుకాలాలు మనం పెట్టుకున్నాం కానీ కాలం ఒక అనంత ప్రవాహం ఈ అనంత కాల ప్రవాహంలో ఆందోళనాయుక్తమైనటువంటి ఈ ప్రపంచంలో నడక మానేసి పరుగు ప్రారంభించినటువంటి ఈ కాల వేగంలో గమనంలో మనకి ఏం కావాలో తెలియక దేన్ని అందుకోవాలో అందుకోలేక సమయమంతా మనల్ని ముందుకు నెట్టేస్తూ ఉంటే కాసేపు కూర్చొని భగవత్ చింతన ఎలా చేయాలి? భగవత్ తత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ సర్వ జగత్తుని నడిపించేటువంటి ఒక జగన్నాయకుడు ఉన్నాడని అది చైతన్యవంతంగా ఉన్నదని ఆ చైతన్యమే అనేక రూపాలు తీసుకుని ఈ జగత్తులోకి వచ్చిందని మనం గనుక విచారణ చేసుకున్నట్లయితే కేవలం కష్టంలో మాత్రమే కాక దుఃఖంలో మాత్రమే కాక సుఖంలో ఆనందంలో నిత్యమూ పరమాత్మను గురించినటువంటి ఒక భావన మన మనసుకు మనం అలవాటు చేసుకున్నట్లయితే అది మనల్ని సర్వదా సర్వదా సర్వదా శతదా బహుదా రక్షిస్తుంది కనుక ఈ పరమేశ్వర ఉపాసన ప్రధానంగా సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఈ ధర్మ ప్రవాహంలో అనేకమైన పారిశ్రావాలు మనకున్నాయి ముప్పై ముక్కోటి దేవతలు వాటి అంశాలు వాటి తత్వాలు విచారణ చేయాలి అంటే ఒక మనిషి జీవితం చాలదు కానీ అందులో చాలా ప్రధానమైనటువంటి కొందరు దేవతా మూర్తుల గురించి మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. తెలిసినా తెలియకపోయినా ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు గడిపిన వాళ్ళకి అరవై వినాయక చతుర్థులు చూసి ఉంటారు. తొలి ఐదు తెలియకపోయినా యాభై ఏదైతే బొమ్మ కొనుక్కు రావటం బొమ్మ పెట్టటం తొమ్మిది రోజులు పూజ చేయటం అవన్నీ తెలుసు. యాభై ఐదు ఏళ్లుగా లేదా అరవై ఏళ్లుగా మన పెద్దలు మనకి వినాయకుడి కథ వినిపిస్తూనే ఉన్నారు కాబట్టి కథలో మార్పు లేదు. మన కథలో మార్పులు ఉన్నాయి గాని వినాయకుడి కథలో మార్పు లేదు అది చిత్రం చిత్రం. మన కథలో చాలా మార్పులు ఉంటాయి ఎంత రాసినా తరగనంతగా ఉంది కానీ ఆయన కథ మూడున్నర పేజీల్లో ముగుస్తుంది కదా కానీ దానితో ఆగకుండా ఈ గానాపత్యంలో అంటే గణపతి కి సంబంధించిన విషయంలో అనేకమైన తాత్విక అంశాలు అనేకమైన వైజ్ఞానిక అంశాలు ఇటు భూగోళాన్ని అటు ఖగోళాన్ని సమన్వయం చేసేటువంటి రీతిలో చాలా విషయాలు ఉన్నాయి. ప్రధానంగా విష్ణు పురాణంలో గాని శివ పురాణంలో గాని ఆయా దేవతలకు సంబంధించిన విశేషాలు ఉంటాయి. వేదాలలో దేవతలకు సంబంధించినవి ఏం లేవు. వేదాలలో రాముడు లేడు కా-కారణం వేదమే రాముడు గనుక. వేదాలలో కృష్ణుడు లేడు కారణం స-నేను సామవేదాన్ని అని ఆయనే చెప్పుకున్నాడు గనుక. కానీ అథర్వణ వేదంలో గణపతిని గురించి ఉన్నది. వేదంలో ఉండటం ఒక పారిశ్రావం అయితే పురాణాల్లో ఉండటం మహత్తరమైన విషయం. వేదవ్యాసులవారు రాసిన పద్దెనిమిది పురాణాలలో ప్రధానంగా పద్మ పురాణం నిండా గణేషుడి ప్రస్తావన ఉంది మనకి. అంటే ఇటు పురాణాలని అటు వైదిక వాంగ్మయాన్ని అంటే వేదాలని అనేకమైనటువంటి చింతనా భూమికలలో ఈ గణేశ ప్రసక్తి మనకు వస్తుంది గనుక. అనూచానంగా సాంప్రదాయకంగా మనం గణపతి పూజ గణపతి నవరాత్రులు చేసుకుంటూ కాలం గడుపుతూ వస్తూ ఉన్నాం. ఇంతకీ ఈ గణపతి అవతారం ఈ గణపతి బొమ్మ గణపతి మూర్తి మనకు ఏం బోధిస్తున్నది? మన నిత్య జీవితంలో ఆయన జీవితంలో నుంచి మనం సంపాదించుకోవలసిన కొన్ని ప్రాథమిక మహా పరిసత్యాలు ఏమిటి? దాన్ని ఇవాళ మన కడుపున పుట్టినటువంటి బిడ్డలకు మన తర్వాత తరానికి అందించాలి అంటే ముందు మనకు తెలిసి ఉండాలి. మనకు తెలిస్తే మన బిడ్డకో స్నేహితునికో స్నేహితురాలికో చెప్పగలుగుతాం. కాబట్టి ఆ దిశగా భారతీయమైనటువంటి అధ్యాత్మ శాస్త్రాన్ని సుమారు డెబ్బై రెండు సంవత్సరాలు ఒక పరమాద్భుతమైన బౌద్ధగా ఎనభై ఆరు సంవత్సరాల అవనీ సంచారం చేసినటువంటి సత్యసాయి భగవానుడి యొక్క దివ్య మహా ప్రాంగణంలో ప్రశాంతి నిలయంలో ఈ ప్రపంచం మొత్తాన్ని తాను ఆకర్షించి భారతీయమైనటువంటి వాంగ్మయ స్వరూపాన్ని పండగల ద్వారా ఉత్సవాల ద్వారా వేడుకల ద్వారా ప్రసంగాల ద్వారా ఉపన్యాసాల ద్వారా ప్రవచనాల ద్వారా ప్రసక్తి ద్వారా ముఖే ముఖే మాట్లాడుతూ ఎన్నెన్ని విషయాలు చాలా మౌలికమైన మార్మికమైన విషయాలని బాబా వారు ఈ ప్రపంచానికి అందించారు. అయితేఅందరూ అందుకునే వాళ్ళు ఉంటారు కొందరు అక్కడికి వెళ్ళినా బాబా గారిని చూసి వెనక్కి వచ్చే వాళ్ళు ఉంటారు. ఆయన కట్టించిన building చూసి ఎంత బాగుందో అనుకొని వచ్చే వాళ్ళు ఉంటారు కానీ ఆయన ఏం చెప్పారు అనేది ఆలోచన చేయాలి. ఈ నేపథ్యంలో ఈవేళ అటు వైదిక పరంగా వేద పరంగా పురాణ గతంగా మనకు తెలిసిన కథని అక్కడక్కడ అనుకుంటూ గణపతి రూపాన్ని గణపతి నామాన్ని గణపతి తత్వాన్ని గణపతి భావాన్ని అంటే నామ రూప భావ తత్వాత్మకమైన ఒక చింతనా భూమిక లో గనక మనం కాసేపు మాట్లాడుకోగలిగినట్లయితే బహుశా వచ్చే వినాయక చవితి నాటికి ఈ మాటలన్నీ గుర్తుంటాయి అనుకుంటున్నా. ఏదో కాసేపు ఉపన్యాసం కాలక్షేపం అనుకున్నట్లయితే ఈ గడప దాటగానే మనం మర్చిపోతాం. కానీ తత్వాన్ని ఎరగాలి అనేటువంటి కాంక్ష మన యందు గనుక ఉన్నట్లయితే మన మనసులలో ఈ మాటలన్ని కూడా నిలకడ చెంది ఉంటాయి. గణేషుడి ఉత్పత్తి చూడండి ఆయన ఈ కాలం మహా స్వరూపం అన్నాం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే శ్రవణ మాసం దాన్ని మనం శ్రావణ మాసం అన్నాం శ్రవణ మాసం అంతా కూడా లక్ష్మీదేవి మాసం. అదైపోయింది భాద్రపద మాసం వచ్చింది నిజానికిది ప్రదానికి మనం దీర్ఘం పెట్టుకుంటూ వెళ్ళాం శ్రవణాన్ని శ్రావణం చేశాం భద్రపదాన్ని భాద్రపదం చేసుకున్నాం ఇది భద్రపదమైనటువంటి మాసం ఇది. ఇది రమాదేవి నుంచి నెమ్మదిగా శివ కుటుంబం వైపు సాగినటువంటి కాలమిది శివ కుటుంబంలో మొట్ట మొదటి కథా కాలం ఎప్పుడు అంటే ఇదిగో ఈ భాద్రపద మాసం అంతా వినాయకునికి సంబంధించిన మాసం. ఇది కాగానే దసరా వస్తాయి అది అమ్మవారి మాసం అదైపోతుంది కార్తీక మాసం వస్తుంది అయ్యవారి మాసం శివ కుటుంబం అయిపోయింది ముందు అమ్మవారు అయిపోయింది శివ కుటుంబం అయిపోయింది మరి మహావిష్ణువు సంగతి అంటే దామోదరుడి సంగతి ఏమిటి అని అందుకని మనకి సంక్రాంతి వచ్చేస్తుంది. కాబట్టి కాలం భారతదేశంలో ఎంత పుణ్యతమమైన కాలమో జాగ్రత్తగా గమనించండి. భగవత్ చింతన లేని భగవత్ పరిచయం లేని భగవత్ భావన లేని కాలం మనకి లేదు. ఇన్ని పండగలు ఎందుకు అన్న వాడికి భారతదేశంలో జన్మ ఎత్తడమే మహా పండగ. ఆ మహా పండగలో ప్రతి రోజూ పండగ చేసుకోవటానికి ఇటువంటి దేవతా మూర్తులు మనకోసం కదిలి ఈ భూగోళంలోకి వచ్చారు కాబట్టి వారందరినీ కూడా మనం సాదరంగా ఆహ్వానిస్తూ ఈ భాద్రపద మాసం రాగానే మనం సవితి నాడు తెల్లవారుజామున గనక లేచి ఉన్నట్లయితే ఒకప్పుడు లేచేవాళ్ళం ఇప్పుడు లేవటం లేదు ఇది సత్యం కాలం మారిపోయింది. ఒకప్పుడు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూలో ఒక eighty to ninety percent గ్రామ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే అనుకుంటున్నాను నేను. గ్రామ ప్రాంతం నుంచి వచ్చినా కాకపోయినా పట్టణంలో ఉన్నా ఆ సవితి నాడు తెల్లవారు జామున గనక లేచి ఆకాశంలోకి చూసినట్లయితే ఆకాశంలో ముప్పై రెండు నక్షత్రాలు ఒక చిన్న ఏనుగు ఆకారంలో గుంపుగా కనిపిస్తాయి. ఈ ఆ గుంపుగా కనిపించినప్పుడు ఆకాశంలో ఏనుగు ఉన్నదే ఏనుగులా ఉన్న ఈ నక్షత్ర సముదాయం ఏమిటి అని ఆనాడు నాలుగు వందల ఇరవై ఏడు AD ఎన్ని వేల సంవత్సరాల క్రితమో వరాహమిహిరుడు అనేటువంటి ఒక మహా శాస్త్రవేత్త ఆయన ఇక్కడ కూర్చొని ఆయన దగ్గర kaleidoscope లేదు ఏదో పెట్టి చూట్టానికి ఏమి కొట్టం లేదు ఆయన దగ్గర ఉన్నది ఏమిటంటే జ్ఞాన దృష్టి ఆ జ్ఞాన దృష్టితో ఆకాశంలోకి చూసినప్పుడు ఈ ముప్పై రెండు నక్షత్రాల సముదాయం ఒక ఏనుగు గుంపు వలే కనిపించింది. నెమ్మది నెమ్మదిగా అంతా కలిపి ఒక ఏనుగు అయినట్టుగా ఒక ఆకారం తేలినప్పుడు ఏనుగుకి పేరు హస్తి అని పేరు హస్తి అంటే ఏనుగు. ఈ ఏనుగుగా ఉన్నది కాబట్టి ఈ మాసానికి ఏం పేరు పెడదాము అని ఆయన ఆలోచించాడు అప్పటికి మాసాలకు పేర్లు లేవు. ఇది ఏనుగు ఎలా నడుస్తుంది అంటే భద్రంగా నడుస్తుంది. అడవిలో ఉన్నటువంటి అన్ని జంతువులు చాలా పెద్దవి ఆ అన్ని జంతువులలోకి పెద్దది ఏనుగు. అది ఎంత భద్రంగా తను అడుగు వేస్తుందంటే తను ఆ అడవిలో వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడో ఇరవై ఒక్క అడుగుల ఎత్తును ఉంటుంది ఏనుగు. తన ముందు నుంచి ఒక కుందేలు పిల్ల గెంతుతూ గనక వెళుతూ ఉన్నట్లయితే తన కాలు కింద పడుతుందేమో అని కాలు ఎత్తి ఆగిపోతుంది చూశారా. తన కాలు కింద పడేది మరణించకూడదు కాబట్టి దాని పదము ఏమిటి అంటే భద్రపదం. మానవుడు జీవితంలో తను తాను వేసే ప్రతి అడుగుని కూడా భద్రతమంగా వేయాలి. గబగబా పరిగెత్తటం తాపత్రయ పడటం తాదాత్మ్యం చెందటం భావోద్వేగానికి లోను కావటం అను అనాలోచిత నిర్ణయాలు చేయటం ఇలా కాకుండా ఆచి తూచి జాగ్రత్తగా భద్రంగా పదం వేయాలి అనటానికి సంకేతంగా మనకి ఆ హస్తి కనిపిస్తుంది ఏనుగు కనిపిస్తుంది. ఇక ఏనుగు వర్ణన మనం చేసుకున్నట్లయితే తెలుసుకున్నట్లయితే ఇది ఈ భాద్రపద మాసంలో ఖగోళాన్ని కాసేపు పక్కన పెట్టి భూగోళంలోకి ఎలాగో వచ్చాం గనుక ఇరవై యొక్క మూలికా మాత్రమైనటువంటి మొక్కలున్నాయి అడవుల్లో ఉన్నాయి ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు అడవులు కూడా లేవు. ఈ ఇరవై యొక్క వాటిలలో ఈ మూలికలలో.ఔషధీ గుణాలు ఉన్నాయి. మానవ దేహం మనందరి దేహం ఇరవై ఒక్క తత్వాలతో కూడి ఉన్నది. ఈ ఇరవై యొక్క తత్వాలకి ఒక ధాతు పుష్టి ఒక శక్తి ఒక ఇచ్ఛా క్రియా జ్ఞాన అనబడేటువంటి మూడు శక్తులు బుద్ధి సిద్ధి అనబడేటువంటి ఒక అంతరంగిక జ్ఞాన కోణం, ఇవన్నీ ఏర్పడాలి అంటే ఈ ఇరవై యొక్క ధాతువులతో ఉన్నటువంటి ఈ ఔషధీ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏరుకొని తెచ్చుకోవాలి. అవి ఎప్పుడు పుడతాయి? ఏ కాలంలో పుడతాయి? భూమి గర్భాలయాన్ని చించుకొని బయటకు ఎప్పుడు వచ్చి ఈ ప్రపంచంలోకి నీ సేవకి సిద్ధంగా ఉన్నానని మానవ జాతిని పలకరిస్తాయి అంటే అదిగో భద్రపద మాసంలోనే. శ్రావణ లేదా శ్రవణ భద్రపద మాసాలు ఏమిటి అంటే అచ్చ తెలుగులో బురద బురద అని అర్థం అంతేకా వర్షం పడుతుంది నేలంతా పదును ఎక్కుతుంది చదును అయిపోతుంది బురద బురద ఏర్పడి దానిలో నుంచి మొక్కలు బయటికి వస్తాయి. వస్తూనే విత్తనాన్ని చీల్చుకొని విస్ఫోటనం జరిగి ఒక చిన్న మొలకగా ప్రకృతిలోకి భూమాత గర్భంలో నుంచి తొంగి చూస్తున్నప్పుడు మొక్కకి రెండు దళాలు ఉంటాయి అటు ఇటు. ఆ రెండు దళాలు బయటకు వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా వడలి జారిపోతాయి. ఆ రెండు ఏమిటంటే ప్రాపంచికంగా తెచ్చుకున్నటువంటి సంచిత ప్రారబ్ధ కర్మలు అనేటువంటివి రెండు వచ్చి ఈ రెండు నేను వదులుచుకుంటున్నాను మళ్ళీ ఒక పరమోన్నతమైన జీవితం నేను గడుపుతానని చెప్తూ వస్తాయి మొక్కలు. ఒకప్పుడు వినాయక చవితి వస్తుంది అనంగా పొలం గట్ల వెంట teacher తండ్రో మన కంటే కాస్త వయసులో పెద్దవాడైన అన్నగారో వెంబడి పెట్టుకెళ్ళి చేతికి మన బోటి వాళ్ళకు ఒక సంచి ఇచ్చి ఆ మొక్కలన్నీ కూడా మనకి పరిచయం చేసి ఈ మొక్క దీనికి ఉపయోగం ఈ మొక్క దీనికి ఉపయోగం అంటూ సంచిలో వేయిస్తూ చివరగా గరికలు కూడా మనతో పీకించి దానిలో వేసి మనకి ఇంటికి తీసుకొని ఇచ్చేవారు. ఇవాళ కాలం మారిపోయింది. వాడు ఏం అమ్ముతున్నాడో మనకు తెలియదు ఏం కొంటున్నామో మనకు తెలియదు. ఎంత తంతుగా మారిపోయింది అంటే ఆయన-ఆయన మీద ఏవో మొక్కలు ఆకులు ఏవి లేకపోతే మన pocket దొడ్లో ఉన్నవి తీసేసేస్తే సరిపోతుంది అనుకున్నాం. అందుకనే ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. అంతే కదా. మనం ఏ విత్తనం నాటితే ఆ ఫలితం మనకు అట్లా వస్తుంది. దేవి పూజ అంటే దైవ పూజ చేసేటప్పుడు నిజంగా ఇటువంటి మొక్కలు మనకు ఏడాది time ఉన్నది. ఆ మొక్కలు ఏమిటో ఇరవై ఒక్క మొక్కలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మనం వర్ణించుకోక్కర్లే పుస్తకాల నిండా ఉన్నాయి. ఆ మొక్కలన్నీ వచ్చే ఏడాది నాటికైనా కనీసం eighty percent మొక్కలు గనక మనం సంపాదించగలిగి వినాయకుడికి పూజ చేయగలిగితే, ఇవాళ ఒక ప్రమాణం ఏమిటంటే ఇరవై యొక్క ఔషధీ వృక్షాలతో మొక్కలతో వినాయకుడికి పూజ చేస్తే ఆ వ్యక్తి నెండు నూరేళ్ళు hundred years బతుకుతాడు. వాడికి sugar రాదు diabetes రాదు cancer అసలు రాదు. ఎందుకంటే cancer రాకుండా చేయగలిగిన వృక్షాలన్నీ మొక్కలన్నీ దాంట్లో ఉన్నాయి. మనం అవేం చేయటం లేదు. కాబట్టి ఆకులు అలములు పిందెలు ఆయన మీద వేసి అపరిపక్వమైనవి వేసి మనం పూజ ముగిస్తున్నాం. అది ఒక తంతు చేసుకున్నాం. అలా చేసుకోకుండా రేపు ఈ ఏడాదంతా చక్కగా ఇవన్నీ రాసుకోండి. దేనికేదో మీ అంతా మీరంతా చదువుకున్న వారు గనుక చదువులేని వాళ్ళకి చెప్పి వెళ్ళిపోవచ్చు అట్లా కాదు మీరు దానిని లక్ష్యం పెట్టుకోండి. ఇవాళ కడుపున పుట్టిన బిడ్డలంతా మనంతటి వాళ్ళయినారు ఎవరి పనిలో వాళ్ళున్నారు. వాళ్ళకి చూసుకునే time లేదనుకుంటే మరి మనవోళ్ళు మనవరాళ్ళు ఉన్నారుగా. వాళ్ళకి బోధ చేయొచ్చు వాళ్ళకి చెప్పొచ్చు కదా. వాళ్ళ కోసమైనా మనం గనక కనీసం ఈ బతికినన్నాళ్ళు పూజ అలా చేయగలిగితే అట్లాగే చేయాలి, చేయలేకపోతే హాయిగా చేయకుండా ఉండటమే ఉత్తమం అది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుందాం. ఈ ఇరవై యొక్క మొక్కలలో చూడండి. పెనుగాలులు వీస్తాయి, భయంకరమైన తుఫాన్లు వస్తాయి, వర్షాలు వస్తాయి, మూడు వందల ఏళ్ళుగా ఉన్నటువంటి వటవృక్షాలు తెల్లవారేప్పటికి నేల కూలిపోయి ఉంటాయి. వాన విడిచిన తర్వాత చూడండి గరిక మొక్క గంభీరంగా నిలబడి ఉంటుంది. ఎందుకంటే అది లోపల deep గా తనను తాను ఆవిష్కరించుకొని ఉంటుంది గనుక మనం కూడా ఆ గరిక ఇప్పుడు ఇరవై యొక్క మొక్కలలో ఏమీ దొరకలేదు అనుకుందాం. మనం ఎక్కడో ఆస్ట్రేలియాలోనో అండమాన్ లోనో ఎక్కడో బతుకుతున్నాం అనుకుందాం. ఇక్కడ ఇవేమీ ఉండవు. లేని ప్రదేశంలో ఎక్కడి నుంచి తవ్వాలంటే గరిక అన్నిచోట్లా ఉంటుంది. ఆ గరిక ప్ర-- చాలా ప్రధానమైన ప్రభావంతమైనటువంటి ఆ మంగళప్రదమైనటువంటిది. దీనికి కారణాలు రెండు మూడు ఉన్నాయి. రామాయణ కాలంలో సీతమ్మవారు చిత్రకూటంలో శ్రీరామచంద్రుడితో కూర్చొని అరణ్యవాసంలో అనేకమైనటువంటి విషయాలు ముచ్చటించుకున్నటువంటి వేళ కాకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు అమ్మవారు మెడలో వేసుకున్నటువంటి ఒక ఆభరణాన్ని అది కెంపు రంగుల్లో-రంగులో ఉన్న కారణంగా మాంసపు ముక్కగా భ్రమించి కాకాసురుడు అమ్మవారి వక్ష స్థలాన్ని దాటబోతున్న సమయంలో సీతమ్మవారు గరికను అభిమంత్రించి అంటే ఒక మంత్రం చదివి గరికని వాడి మీద ప్రయోగించింది. కాకాసురుడు మరణించాడు. తర్వాత కాలంలో చివరి అరణ్యవాసంలో చివరి సంవత్సరం రావణ బ్రహ్మ సంబంధించినటువంటి అశోకవనంలో ఉన్నప్పుడు ప్రతిరోజూ రావణ బ్రహ్మ వచ్చి శ్రీరాముని నింద చేస్తూ ఉన్నప్పుడు ఆమె వహించింది...భరించింది సహించింది కానీ లోకోత్తర పురుషుడు జగదేక పురుషుడైనటువంటి రామచంద్రుడిని గురించి పైగా తన భర్తను గురించి ఒక పరాయి వాడు నింద వేస్తున్నప్పుడు నిందాలాపన చేస్తున్నప్పుడు దుర్భాషలాడుతున్నప్పుడు అమ్మవారు అక్కడ ఉన్న ఒక గరికను తీసి "రావణా! నీ వాచాలుత్వాన్ని కట్టిపెట్టు ఈ క్షణంలో గనుక ఈ గరికను నేను అభిమంత్రించి నీ మీద వదిలిన ట్లయితే నీ పది తలలు తెగి నేల మీద పడతాయి. నీ జీవితంలో ఇది ఆఖరి రోజవుతుంది. కానీ ఆ పని నేను ఇప్పుడు చెయ్యను. ఆ పని ఎవరి చేతుల్లో జరగాలి అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి రామచంద్రుడిగా వచ్చినటువంటి ఆ రాముడి చేతిలో జరగాలి. కనుక నీ మర్యాదను దక్కించుకొని నువ్వు తిరిగి అంతఃపురానికి వెళ్లిపో." అన్నటువంటి ఒక స్త్రీ శక్తికి గరిక సంకేతం. ఇక మూడవది మనకి తల్లిదండులు కాలగర్భంలో కలిసిపోయినప్పుడు వారికి శ్రాద్ధ కర్మలు చేసినప్పుడు మనము కొనుక్కున్న వజ్రాల ఉంగరం తీసి పక్కన పెట్టాలి. బంగార పుంగరం తీసి పక్కన పెట్టాలి. దర్భని మాత్రమే ధరించాలి. ఆ దర్భ దీక్షకి మనలో ఉన్నటువంటి అంతరంగ శుద్ధికి మనలో ఉన్నటువంటి అనంత మహా శక్తికి సమృద్ధమైన సం సుసంపన్నమైనటువంటి భక్తికి మన యందున్నటువంటి శరణాగతికి మన యందు మనకి పితృదేవతల యందున్నటువంటి ప్రేమకి అది ఒక సంకేతం కాబట్టి దర్భను ధరించాలి. తర్పణం వదలాలి దర్భ వాడాలి. చూశారా ఇది అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది గణేషుడికి. కాబట్టి ఈ ఇరవై యొక్క మొక్కలలో చాలా ప్రధానమైనటువంటి పత్రి ఏది అంటే గరిక. గరికని అన్నీ తీసుకురండి గరిక దొరకలేదు అని అనుకోకండి అన్ని చోట్ల దొరికేది గరికే. ముందు దాన్ని సంపాదించుకోండి. ఎండిన గరికైనా తప్పులేదు. సరే అదంత శాస్త్రం. దాని జోలికి చాందసత్వం, మూర్ఖత్వం, మూఢత్వంలోకి మనం వెళ్ళకూడదు. మనకి ఏ అవకాశం ఉన్నదో ఎంత అవకాశం ఉన్నదో మనం ఎంతవరకు సాధ్యంగా చేయగలమో అవి మాత్రమే మనం మాట్లాడుకోవాలి. చేసే ప్రయత్నం చేయాలి గనుక దానిని దృష్టిలో పెట్టుకోండి. ఇక రెండవది. ఇక మళ్ళీ ఒక క్షణం ఈ వినాయకోత్పత్తిలోకి గనుక వెళ్లినట్లయితే వినాయకుడు ఎక్కడి నుంచి పుట్టాడు? ఎలా పుట్టాడు? అమ్మవారి నలుగులో నుంచి పుట్టాడు. అంతే కదా. ఒంటి నలుగులో నుంచి పుట్టాడు. నలుగు అంటే మట్టి అంతే. మట్టిలో నుంచి ఆయన పుట్టాడు. అమ్మవారు ఏం చేసింది? ఊపిరి పోసింది. ఊపిరి ఊదింది. ఊపిరి ఊది జగద్రక్షణి అయినటువంటి అమ్మవారు కూడా తన కడుపున పుట్టినటువంటి బిడ్డకు ఒక బాధ్యత ఇచ్చింది. పుట్టి పుట్టగానే ఎవరు వచ్చినా లోపలికి రానివ్వద్దు అన్నది. నీ తండ్రితో సహా అనలే. శివుడితో సహా అనలే. ఎవరు వచ్చినా రాకుండా చూడమన్నది. ఆజ్ఞని పాలించటమే తనయుడి యొక్క లక్షణం కాబట్టి ఇంతలోకే కథా గమనంలో శివుడు రావటం, "నా ఇంట్లోకి నన్ను పోనివ్వకుండా నువ్వు ఎవరివి అసలు? ఎవరు నువ్? ఇక్కడ కూర్చున్నావ్" అని ఆయన్ని అడగటం ఆ కథంతా వదిలేద్దాం. శిరస్సు ఖండనం చేశాడు. ఊపిరి పోసింది అమ్మ అయితే ఊపిరి తీసిన వాడు తండ్రి అయినాడు. ఇది విచిత్రమైనటువంటి సన్నివేశం. కానీ భగవంతుని యొక్క ప్రతి చేష్ట వెనుక, ప్రతి భావన వెనుక, ప్రతి చర్య వెనుక కాల, కార్య, కారణ, కర్తవ్యాలు నాలుగు ఉంటాయి. కాలానికి లోబడి ఉంటుంది. కార్యం ఉంటుంది ఓ పని ఉంటుంది. అది లోకోత్తరం కావాలి. అది బాధ్యత కర్తవ్యంగా చేయాలి. వీటన్నింటికీ కూడా కారణ కర్తవ్య నిమిత్తమై వచ్చాడు గనుక ఈ నాలుగు అంశాలతో కారణాల వలన ఆ శిరోఖండనం జరిగింది. గజాసురుడు ఏం కోరుకున్నాడంటే సమున్నతమైనటువంటి బుద్ధి ఉండేటువంటి చోట నా శిరస్సును పెట్టమన్నాడు. శివుడు ఎంత దయామయుడో చూడండి. తన వాకిట కాపలా కాస్తున్నటువంటి ఈ పిల్లవాడు "అయ్యో! నా సంకల్పంలో నుంచి పుట్టాడు" అని అమ్మవారు చెప్పగానే శివుడు ఆ పిల్లవాడిని తన బిడ్డగా భావించాడు. తన భక్తుడ్ని ఎక్కడ శిరస్థానీయమైన భావన ఎక్కడ అంటే తన కట్టెదుట ఉన్న తన బిడ్డ ముండానికి దాన్ని తగిలించాడు. అది కరుణాపూర్ణ సుధాబ్ధి అయినటువంటి పరమాత్మ యొక్క ఆలోచనలు అట్లా ఉంటాయి. ఇంకో శరీరాన్ని సృష్టించలే. అమ్మ దేనిని సృష్టించిందో అయ్య దానిమీద ఈ తలను పెట్టాడు. అటువంటి ఆ తల గురించి ఇవాళ మాట్లాడుకుం-- అప్పుడు ఆయన వినాయకుడు అయినాడు. ఇవాళ మీరు పేపర్లలో గాని అంటే ప్రింట్ మీడియా గాని, ఎలక్ట్రానిక్ మీడియా గాని YouTube గాని iTube గాని ఇంకో ట్యూబ్ గాని అక్కడ వినాయకుడు అంటే దొంగల ముఠాకి వినాయకుడు అని పేరు పెట్టుకున్నారు. కదా. దొంగల ముఠా-ముఠాలు ఎవరంటే మనం ఎన్నుకున్న నాయకులు అనమాట. వాళ్ళు వినాయకుడికి ప్రతీకగా చెప్తున్నారు. వినాయకుడు అంటే రెండర్థాలున్నాయి. విశిష్టమైనటువంటి నాయకత్వాన్ని ఇవ్వగలిగిన వాడు వినాయకుడు. ఇది ఒక అర్థం. రెండవది నాయకుడే లేనివాడు అంటే తనను-తనను శాసించగలిగిన వాడు గాని, తనను నడిపించగలిగిన వాడు గాని, తనకంటూ ఒక యజమాని గాని లేనటువంటి ఒక పాత్ర ఏదైనా ఉన్నదా అంటే అది వినాయకుడు. గనుక వినాయక శబ్దానికి అర్థం నాయకుడే లేనివాడు అని అర్థం. అటువంటి ఆ వినాయకుడికి ఇదిగో ఆ మనం బొమ్మ కొనుక్కొచ్చాం మొన్నటిదాకా. తొమ్మిది రోజులు నవరాత్రులు ధామ్ ధూమ్ అని చేసాం. చాలా అద్భుతంగా చేసాం. ఆయనకి...మనలాగా కళ్ళు మనలాగా శరీరం symmetrical గా లేదు. ఎట్లా ఉన్నది అంటే ఉండవలసినది ఏది ఉండవలసిన పరిమాణంలో లేవు భిన్నంగా ఉన్నాయి. పెద్ద పొట్ట పెద్ద తల పెద్ద చెవులు చిన్న కళ్ళు అన్ని విరుద్ధమే పొట్టి కాళ్ళు చూశారా? మరి ఏంటి ఇట్లా ఉన్నది ఈ ఆకారం? ఆయనకు కూడా ఒక సుందర రూపం ఇవ్వచ్చు కదా అంటే సుందర రూపం వేరు సౌందర్యం వేరు అందం ఇంద్రియాలను రెచ్చగొడుతుంది సౌందర్యం ఇంద్రియాలను క్షమింపజేస్తుంది. అందుకనే శంకర భగవత్పాదులు అందం మీద లహరి రాయలే సౌందర్య లహరి రాశారు సౌందర్యం మీద రాశారు. జగజ్జననిని మనం చూసినప్పుడు ఆమెను చూడగానే మనకు సౌందర్యం కనిపిస్తుంది. ప్రాపంచికమైనది చూసినప్పుడు అందం చాలా అందంగా ఉన్నారు అంటాం. మగ గాని స్త్రీ గాని ఎవరైనా. సౌందర్యవంతంగా ఉన్నారని మనం ఎవరిని అనం ఒక్క అమ్మని తప్ప. ఇక్కడ భౌతికంగా మనకు జన్మనిచ్చిన తల్లిని మించిన ఆ తల్లి కురూపిగా అయినా ఆమెకి ఏ రకమైనటువంటి ఆ భౌతిక సౌందర్యం లేకపోయినా తల్లిని చూడగానే సౌందర్యమే గుర్తొస్తుంది అందం గుర్తురాదు. కాబట్టి ఒక స్త్రీ ధర్మంగా మనం విచారణ చేసినప్పటికీ వినాయకుడి యొక్క శరీరం అంతా disproportionate గా ఉంటుంది. దీనికి అనేక కారణాలున్నాయి. ఇప్పుడు మనం ఉన్నాం మన కళ్ళు చక్కగా సరళ రేఖ scale పెట్టి కొలిస్తే ఖచ్చితంగా ఇటు నుంచి ఇటు ఈ రెండు కను కులుకులు రెండు గనక దారం గడితే perfect గా ఉంటాయి సందేహం లేదు ఎగుడు దిగుడు లేవు. ఈయనవి వినాయకుడివి అట్లా లేవు రెండు అటు ఇటుగా ఉన్నాయి ఒక particular angle లో ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే తాను నడిచి వెళుతూ ఉన్నప్పుడు తన వెనక తన పక్కన తన ముందు ఏ జంతువులు నడుస్తున్నాయో ఏవి పారాడుతూ తారాడుతూ ఉన్నాయో వాటన్నింటినీ సూక్ష్మమైన బుద్ధి చేత గమనించగలిగినటువంటి మహా శక్తివంతమైనటువంటి కనులు కలగా కనుక ఆ రెండు కనులు అట్లా పెట్టాడు భగవంతుడు. అలాగే మనం భజన చేస్తాం చామర కర్ణ గజానన అని పాడుతూ ఉంటాం. ఆ చామర అంటే విస్తృతమైన పెద్దదైన అని. పెద్ద చెవులున్నాయి మనకు పెద్ద చెవులు ఉంటే వాడికి డొప్ప చెవులు ఉన్నాయి అంటాం మనం. కానీ వినాయకుడికి పెద్ద చెవులు ఎందుకు ఉన్నాయి అంటే ఆయన నిరంతరము కూడా లోక మంగళ కార్యకలాపమైన మంత్రాలు మాత్రమే వింటూ ఉంటాడు. ఏనుగు కూడా ఆ చామర వర్ణం కర్ణము ఉంది గనుక సింహం ఎటు నుంచి వస్తున్నది దాని అడుగుజాడలు ఎట్లా ఉన్నాయి దాని పద ధ్వని ఎట్లా ఉంది ఏ జంతువు అడవి జంతువు ఎటునుంచి వస్తున్నది అని ఒక చెవిన తీసుకుంటుంది. మనిషి ఏం చేస్తాడు అంటే ఈ చెవిన వింటాడు ఆ చెవిన వదిలిపెడతాడు. ఈ complex కి entry gate exit gate ఉన్నట్టుగా మనకు కూడా ఒక ఇది ఒక entry gate అయితే ఇది exit gate ఇది తెరిచి ఉంటుంది అది తెరిచి ఉంటుంది వచ్చినవి వస్తుంటాయి పోయేవి పోతుంటాయి మిగిలేది ఏమీ ఉండదు. పైన ఏముందంటే ఏమీ లేవు అంటాం ఖాళీ. కానీ ఏనుగు మాత్రం దేనిని గ్రహించిందో దానిని దాని చిప్పులో దాచుకుంటుంది record చేసుకుంటుంది. ఎంత అద్భుతమైన recording ఉంటుందంటే ఆ దృశ్యం ఆ శబ్దం ఆ రూపం ఆనాటి ఆ జంతువుల కదలికలు మెదలికలు అన్నీ కూడా record చేసుకుని ఉంటుంది. తనను తాను రక్షించుకునేటువంటి ప్రయత్నంలో తనను తాను తెలుసుకునేటువంటి జ్ఞానంలో తన మార్గానంలో తనకు ఏది అడ్డు రాకుండా ఉండేటువంటి గమనంలో ఆ చామర కర్ణములు రెండింటినీ కూడా ఏనుగు వాడుకుంటుంది. ఇవన్నీ మనిషి చేసుకోవాలి అని చెప్పటానికి వినాయక స్వరూపం మనకు అట్లా కనిపిస్తూ ఉన్నది. ఇక తుండము ఉన్నది అది ప్రణవ శబ్దం ప్రణవం ఓంకార స్వరూపం ఏదైతే ఉన్నదో అకారోకార మకార యుక్తమగు ఓంకారాభిధానమ్ము. అకారము ఉకారము మకారము అనే మూడు బీజాక్షరాలు కలిపితే దాని పేరు ఓంకారం. ఓంకారమే నిశ్శబ్దం ఈ సృష్టి ఏర్పడినప్పుడు సృష్టిలో అంటే ఒక విస్ఫోటనం జరిగినప్పుడు సృష్టి పరిణామ క్రమంలో ఏర్పడిన మొట్ట మొదటి అక్షరము ఏది అంటే ఓం అనేటువంటిది అదే ప్రణవ శబ్దం అదే ప్రణవ నాదం అదే ప్రణవాక్షరం. అందుకనే ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ. తర్వాత మనకు యాభై ఆరు అక్షరాలు తెలుగులో వచ్చినయి ఇంగ్లీషులో ఇంకేవో వచ్చినాయి ఏది రానివ్వండి శబ్ద మూలం ఏమిటంటే నిశ్శబ్దంలో నుంచి వచ్చిన ఈ శబ్దమంతా ఓంకార స్వరూపం కాబట్టి ఆ తుండము ఎత్తినప్పుడు మీరు చూడండి అది ఖచ్చితంగా ఓంకారంగానే ఉంటుంది. అంతే కాదు కుంభస్థలం మీద మావటి వాడు కూర్చుని ఉంటాడు ఏనుగుకి ఒక training ఇస్తాడు అంటే ఒక్కసారి చెప్తాడు ఎక్కువ సార్లు చెప్పడు. ఒక్కసారి ఇట్లా వెళ్ళు అట్లా వెళ్ళు అని navigate చేస్తాడు అంకుశం పట్టుకొని ఎట్లా వెళ్ళాలి అది ఏదన్నా దారి తప్పుతుంటే ఒక నర్వ మీద దాన్ని పెట్టి అంకుశంతో ఇట్లా నొక్కుతాడు దాన్ని కొట్టడు ఆ acupressure అని వాడు వచ్చిందే పని acupressure చేస్తాడు. చేయగానే దారి మార్చుకుంటుంది navigate చేస్తాడు. చేసినప్పుడు అది తనదైనటువంటి తన మార్గంలో తను వెళ్ళిపోతుంటుంది అటువంటి మావటి వాడు అప్పటికే ఇరవై ఒక్క అడుగులు ఎత్తున ఏనుగు దానిమీద మళ్ళీ ఒక నాలుగు ఐదు అడుగులు ఎత్తున మనిషి కూర్చుని ఉంటే వాడు పైనుంచి ఒక సూది కింద పడేస్తాడు. పడేసి దాంతో మన భాష ఏం మాట్లాడడు దానికి అర్థమయ్యే భాషలో ఒక pressure ఇస్తాడు. అది ఏం చేస్తుందో తెలుసునా? వెంటనే అయిపోతుంది. ఒక రెండు సెకన్లు కూడా దాటకుండాఅంతటి అడవిలో అంతటి గచ్చ పొదల్లో ఆ పడ్డటువంటి సూదిని తన తొండంతో తీసి పైన ఉన్న మామిడి వాడికి అందిస్తుంది అది సిద్ధి అది బుద్ధి. కానీ మనం ఏం చేశామంటే పెళ్లి చేసుకొని మనమే దుఃఖం పడాలా ఆయన కూడా పెళ్లి చేసేద్దామని బుద్ధి సిద్ధి అని ఇద్దరిని అంటగట్టాం. ఆయన బుద్ధి సిద్ధి వ్యక్తులు కారు స్త్రీలు కారు. సరళమైనటువంటి బుద్ధి సూట్ అయినటువంటి బుద్ధి గంభీరమైనటువంటి బుద్ధి సునిశితమైనటువంటి బుద్ధి. ఆ బుద్ధి దేనిలో నుంచి ఏర్పడింది అంటే సిద్ధి లోనుంచి ఏర్పడింది. ఆ సిద్ధి అంటే తనకున్నటువంటి సర్వ శక్తులని కూడా ఎవరికీ అపకారం చేయకుండా సాధ్యమైనంత ఉపకారం చేయడానికి వీలుగా ఒక ఏనుగు ఎట్లాగైతే ఉన్నదో మానవుడు కూడా అట్లాగే తన జీవితాన్ని గడపాలి. ఇక చెవులయినాయి, కళ్ళయినాయి, తొండం అయింది, దానిలో ఇంకో ప్రధానమైనటువంటిది దానికి నోరు ఉంది మనలాగానే అది కూడా శబ్దం చేస్తుంది. కానీ మనిషి చూడండి మనం ఎన్ని-- చాలా తింటాం, చాలా వస్తువులు తింటాం, తింటూనే ఉన్నాం బతికినన్ని నాళ్ళు తింటూనే ఉంటాం అది కూడా పక్కన పెట్టండి. ఎప్పుడైనా తిన్న పదార్థాన్ని తిన్నది తిన్నట్టుగా మళ్ళీ బయటకు తేగలిగామా? తేలేం. వామనం చేశాం అంటే vomiting చేసినాడయిందేమో తప్ప మామూలుగా కాదా. ఏనుగు దగ్గరికి మీరు వెలక్కాయలు తీసుకెళ్ళి వెలగ పండు దాని దగ్గర పెడితే తన శరీరంలో ఉన్నటువంటి animated heat అంటాం మనకు కూడా ఉంటుంది animated heat మనకు కూడా ఆ electromagnetic field ఉంటుంది మనకు కూడా. దానికి ఉంటుంది. దానిలో ఉన్నటువంటి గుజ్జును మాత్రమే తీసుకుని కరగించి పండును మళ్ళీ యధాతథంగా తనకు అక్కరలేని దాన్ని వదిలిపెట్టే శక్తివంతమైనది అది. మనకు అట్లా కాదు తాతగారి పడక కుర్చీ మనకు గుర్తు మనం తాతలం ముత్తాతలమైనా ఆ కుర్చీ ఇంకా ఉండాలి మన ఇంట్లో. మనం దేన్నీ వదిలిపెట్టం వస్తువును వదిలిపెట్టం. అన్నీ దాచుకునేటువంటి గుణం జీవుడికి ఉంటుంది దేనినైనా వదిలిపెట్ట గలిగినటువంటి గుణం ఆ ఏనుగుకి ఉంటుంది, హస్తికి ఉంటుంది. ఇక పొట్ట చాలా పెద్ద పొట్ట. పెద్ద పొట్టే కానీ పెట్టినంత అది తినదు. అది. దాని ముందు పెద్ద పచ్చిగడ్డి మోపులు ఒక యాభై మోపులు వేస్తే తినగలదు అది కానీ తినదు విచక్షణ ఉంది దానికి. ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, అసలు ఎందుకు తినాలి ఇవన్నీ కూడా దానికి ఆలోచనలున్నాయి. ఇంత పెద్ద జంతువుకి చిన్న తోక ఉంది. చిన్న తోక అది navigate చేయటానికి అంటే తన మార్గాన్ని తాను నడిపించుకో
YouTube · audio
Sri Ganapathi tatva vaibhavamu — Part 1
Sri Ganapathi tatva vaibhavamu — Part 1
Source: SathyaSai Seva Sadan on YouTube
0:00 / 33:11
More in this series