No transcript for this section.
Transcript begins at 0:00.
వచ్చినప్పుడు మనం పిల్లల చేత వినాయకుడికి అలంకారం చేయించాలి మనమంతా అలంకారం చేసి వాళ్ళని ఊరికి వాళ్ళని అలంకార ప్రాయంగా కూర్చోబెట్టకూడదు వాళ్ళకి నేర్పాలి నేర్పితే ఆ కుడుము తీసుకెళ్లి ఆ వినాయకుడి చేతిలో పెట్టటం మనం వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వాలి. పడిపోతుందేమో అంటారు పడితే కింద పడితే మళ్ళీ తీసి పెడతాడు అంతే కదా ఏమవుతుంది కానీ మనం ఆ risk తీసుకోం. వాడికి కోపం వస్తుంది పాప అని ఏమనుకోడు అసలు. ఇక్కడ బాంబే లో సత్యసాయిబాబా వారు ధర్మక్షేత్రంలో ఉన్నారు అక్కడికి వెళ్లారు ఒకసారి. వెళితే వారు పై అంతస్తులో ఉన్నారు వారిని దర్శనం చేసుకోవడానికి పక్క మెట్ల మీద నుంచి చాలా మంది వెళుతున్నారు. కింద ఒకాయన కూర్చుని ఉన్నారు స్వామితో వచ్చినటువంటి అటు ట్రూప్ లో ఉన్నటువంటి ఆయనే. ఈయనకి ఏం పని లేదు ఆయనకేమో పెద్ద పని ఉంది అందర్నీ కలవాలి మాట్లాడాలి వాళ్ళకి ఎవరెవరికి ఏం చెప్పాలో చెప్పాలి. ఈయన ఏమీ తోచక ఉన్న గది దగ్గర ఉన్నటువంటి curtain ఇలా తొలగించాడు బయట ఏముందో చూద్దాం అని. ఒక భయంకరమైన దృశ్యం ఆయన కళ్ళ ముందు ఆవిష్కరించబడింది. ఏమిటి అంటే ఒక చెత్త కుండీలో నాలుగైదు కుక్కలతో పాటుగా ఇద్దరు మగ పిల్లలు పోటీ పడుతున్నారు ఎంగిలి అన్నం కోసం. అది ఆ దృశ్యం ఈయన భరించలేక సాక్షాత్తు భగవత్ రూపమైనటువంటి స్వామి పైన ఉన్నారు ఈ దృశ్యం ఏమిటి ఈ దౌర్భాగ్యం ఏమిటి ఈ పిల్లలు ఏం పాపం చేశారు వాళ్ళు చక్కగా ఆరోగ్యవంతంగా ఉన్నారు కానీ అన్నం కోసం కుక్కలతో పోట్లాడుతున్నారు బాబా వారు కిందకు వచ్చినప్పుడు ఆయన్ని ప్రశ్న వెయ్యాలి అని అనుకున్నాడు. ఇంతలో ఒంటిగంట అయింది స్వామి పై నుంచి కిందకి దిగి వచ్చారు. ఈయన ఇంకా మాగన్నుగా నిద్రలోకి వెళుతున్నారు ఒంటిగంట అయింది కదా. స్వామి ఆయన భుజం తట్టి భోజనానికి లే అన్నారు. ఆయన అన్నారు భోజన సంగతి తర్వాత ఇప్పుడు ఈ దృశ్యం చూసి, ఆయన ఇంకా మాట్లాడనివ్వలే స్వామి అందుకుంటూ "ఏది ఆ దృశ్యమేనా? ఆ చెత్త కుండీలో ఇద్దరు పిల్లలు కుక్కలు పోట్లాడుకుంటూ-పోట్లాడుకుంటున్నారే దాని గురించేనా?" "దాని గురించి నీకేం తెలుసు? ఆ ఇద్దరు పిల్లలు క్రితం జన్మలో ఒక జమీందారు బిడ్డలు వాళ్ళు. బంగారు పళ్ళెంలో అన్నం వడ్డించబడి వాళ్ళ చేతిలో దాసీలు తెచ్చి పెడితే table మీద పెడితే తిన్నంత తిని మిగిలిందంతా నేల మీద విసిరేశారు. ఆనాడు పారేసిన మెతుకులు ఇవాళ ఏరుకుంటున్నారు" అన్నారు. అది. అంటే ఒక్క మెతుకును మనం సృష్టించలేం. ఇవాళ మనకు తెలియదు పారేస్తున్న క్షణం తెలియదు, పాపం చేస్తున్న క్షణం తెలియదు కానీ పరిణామం తప్పదు. ఇటువంటి బుద్ధి సిద్ధిని ఇచ్చేటువంటి వినాయకుడు మహోత్కృష్టమైనటువంటి గణనాయకుడు ఆయన. ప్రథమ వందనం ఆయనకే. శివపార్వతులు గాని, లక్ష్మీనారాయణులు గాని, బ్రహ్మ బ్రాహ్మీలు గాని, బ్రాహ్మి అంటే సరస్వతి. వాళ్ళు గాని, ఏ కార్యక్రమం వాళ్ళ మనసులో సంకల్పం జరగాలన్నా వాళ్ళు ఎవరిని తలుచుకొని చేస్తారో తెలుసునా? గణేషుడ్ని మాత్రమే తలుచుకుంటారు. ఆ క్షణాన గణేషుడు వాళ్ళ కుమారుడు కాదు ప్రమథ గణాలకి కూడా ప్రథమ గణపతి ఆయన. ప్రథమ వందనం ఆయనకే. అందుకనే ఈ సంస్కృతి వైభవంలో మన పండగల్లో కూడా మొట్టమొదటి పండగ ఏదవుతున్నది అంటే వినాయక చవితితో ప్రారంభం అవుతున్నది. కాబట్టి వీటన్నింటినీ చూసి చివరికి వైరాగ్యం కాసేపు మాట్లాడుకోవాలి కదా. వైరాగ్యమే అసలు వైభవం కదా. వైభవాలన్నీ పోతాయి కదా. ఉంటాయి పోతాయి. గోడకి రంగు వేసిం-ఉన్నంత కాలం గోడ బాగుంటుంది. అదే రంగు ఉంటుందా? మళ్ళీ పదేళ్ళు అయ్యాక మళ్ళీ రంగు మార్చాలి. వైభవాలు కూడా అంతే. ప్రాపంచికమైన సంపదలు కూడా అంతే. అమర్లమైనటువంటి కీర్తి, నిర్మలమైనటువంటి బుద్ధి, ప్రపంచహితం కోసం వాడబడేటువంటి ప్రజ్ఞ ఎవరి యందు ఉంటాయో వాళ్ళు త్రిదశులై ఉంటారు. అంటే వారికి వార్ధక్యం లేదు. వాళ్ళకి జరా మరణాలు లేవు. శరీరం వదిలిపెట్టి వాళ్ళు వెళ్లిపోవచ్చు కాక కానీ నిత్య స్మృతిగా మహా స్మృతిగా కా-కలకాలం కూడా ప్రజల హృదయాలలో ప్రజల నాలుకల మీద వారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా మనకి పురస్మరణ అవుతూ ఉంటాయి. అటువంటి వినాయకుడ్ని ఇవాళ మనం చూశాం. వినాయక చవితి నాడు ప్రారంభించేటువంటి నాడు వినాయక ప్రతిష్ఠ చేసి అందరూ చందాలు వేసుకుని ఆయనకు ఒక పెద్ద బొమ్మ కొనుక్కొచ్చి దానికి ఆహ్వానం పలుకుతూ దానికి రా-ఇవ్వవలసినంత మర్యాదని గౌరవాన్ని ఇస్తూ దాన్ని తీసుకు వచ్చి ప్రతిష్ఠ చేశాం. తొమ్మిది రోజులు కూడా దానికి చేయవలసిన వైభవమైన పూజ చేశాం. మంత్ర యుక్తంగా చేశాం. పురోహితుడ్ని పెట్టాం. పలహారాలు పంచిపెట్టాం. నైవేద్యాలు పెట్టాం. చేయవలసినవన్నీ చేశాం. నవరాత్రులు అయిపోయిన తర్వాత నిమజ్జనం రోజు వచ్చింది కదా. నిమజ్జన, మజ్జనము అంటే స్నానము అని అర్థం. నిమజ్జనము అంటే ఇక స్నానమే అక్కరలేని పరిస్థితి. అది శివాత్మకమైన శరీరానికి స్నానం కావాలి. జడాత్మకమైనటువంటి కట్టెకి ఆఖరు స్నానము అంటాం. ఆ ఆఖరు స్నానమే దాని పేరే నిమజ్జనం అంటే నీళ్ళల్లో కలపటం అని అర్థం కాదు. మంగళ స్నానం చేయించాలి. ఇవాళ నిమజ్జన కార్యక్రమంలో మంగళ కార్యక్రమము మంగళ స్నానము ఎక్కడన్నా ఉన్నదా? మనం భరించలేని దుర్గంధభూరితమైనటువంటి హుస్సేన్ సాగర్ లో ఇవ్-ఇవాల్టి వరకు ఆయన పాదాలు మొక్కిన వాళ్ళం, ఇవాళ ఆయన పాదాలు తొక్కుతూ ఆయన మీదుగా వెళుతూ నీళ్ళల్లో పారేసి వస్తున్నాం. ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని, ఒక అద్భుతమైనటువంటి మహత్తరమైన సందేశాన్ని తన ఉనికి ద్వారా, అస్తిత్వం ద్వారా, వ్యక్తిత్వం ద్వారా, బ్రహ్మజ్ఞానం ద్వారా, శివ పుత్రుడుగా ఈ ప్రపంచానికి యోగానందాన్ని కలిగించినటువంటి ఒక పరమాత్మ సన్నిభుడైనటువంటి ఒక గణేషుడికి మనం పలకవలసిన వీడ్కోలు అదేనా?అని ప్రశ్న వేసినప్పుడు ఆ నిమజ్జనం నాడు టీవీ నేను పెట్టలేదు ఎందుకంటే ఆ దృశ్యాలు చూడటం అనవసరం waste మన ఇంట్లో ఉన్న వినాయకుడిని మనం చక్కగా జాగ్రత్తగా ప్రవాహం ఉంటే ఉంటుంది బాగుంటే బాగుంటుంది ఏదీ లేదంటే మనం కుండీల్లో మన కళ్ళ ముందే ఆయన నెమ్మదిగా కరిగిపోతూ ఉంటే అది ఎక్కడికి పోదు ఆయన అక్కడే ఉన్నాడనే భావన కలుగుతుంది ఇవన్నీ కూడా మనం కూడా ఎన్నాళ్ళు ఉంటాం ఇక్కడ ఎవడు బతికాడు నూట యాభై అన్నాడు శ్రీ శ్రీ ఎవడు బతికినా వంద ఆ వంద తర్వాత బతికినా వాడి ప్రయోజనం ఏం ఉండదు he is just like a vegetable మా తాత ఉన్నాడు అని చెప్పుకోవటానికి ఉన్నాడు అంతే ఉండాలి గనుక ఉన్నాడు గనుక ఉన్నాడు అని కానీ ఏదో ఒకరోజున పాంచభౌతిక దేహాన్ని ధరించిన ప్రతి ఒక్కడు అవతార మూర్తులతో సహా రాముడు కృష్ణుడు షిరిడి బాబా సత్యసాయి ఎవరైనా సరే వారి పాంచభౌతిక దేహాన్ని వదిలి పెట్టవలసిందే ఇది ఒక అనివార్యమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి ఘట్టం దీన్ని భగవాన్ రమణ మహర్షి "మరణం అంటే ఏమిటి మార్పే కదా" అన్నారంతే ఒకే ఒక్క మాట ఆలోచన చేస్తూ వెళితే ఏం మారుతున్నది ఇవాళ పొద్దున ఒక dress వేసుకున్నాం సాయంకాలం ఈ dress వేసుకున్నాం మళ్ళీ రేపు ఇదే వేసుకుంటున్నామా లేదే తలవారగానే దీన్ని పక్కన పడేస్తున్నాం మళ్ళీ ఇంకో dress వేసుకుంటున్నాం వాసాంసి జీర్ణాని యధా విహాయా శరీరము మారుతూ ఉన్నది శరియతి ఇతి శరీరః దహయతి ఇతి దేహః అంటే దహింపబడుతుంది గనుక దేహం అని నిరంతరము పరిణామం మార్పు చెందుతూ ఉంటుంది గనుక అది శరీరం అని దానికి అనేక పేర్లు ఉన్నాయి ఖడగ వేద భూమికలో ఉపనిషద్ భావనలో సనాతన ధర్మంలో నీ దేహం ఏమిటి అంటే ఎముకలు మాంసము రక్తము చర్మముతో కూడినటువంటి ఒక బొమ్మ కాదని దేహో దేవాలయ ప్రొక్తో జీవ దైవ సనాతనః జీవుడు దేవుడు సనాతనుడై ఉన్నాడు సనాతనుడై ఉన్నటువంటి వాడు సనూతనుడై పుడుతున్నాడు అంతే కదా తాతగారు పోయిన ఆరు నెలలకు గనక ఇంట్లో మనవడు పుడితే పాపం వెళ్ళిపోయిన తాతగారిని హాయిగా ఉంచకుండా వాడు వచ్చేశాడు మళ్ళీ అంటున్నాం మనం అవునా ఆయన హాయిగా అన్నీ వదులుకొని వెళ్ళాడు మళ్ళీ తాతగారే వచ్చేశారు ఇంట్లోకి అంటున్నాం అంటే మనకి ఆ వదిలిపెట్టేటువంటి భావన మనకి లేదు తగ్గించుకోవాలి ఎప్పటికైనా మనం కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి ఎన్నాళ్ళు ఉంటామని కాక ఉన్నన్నాళ్ళు మనం ఏం చేశామో ఆలోచించుకోవాలి మనకి గృహస్థాశ్రమ ధర్మాలు మనకున్నాయి వాటిని నిర్దుష్టంగా చేయాలి దానితో పాటుగా సమాజ ధర్మాలు మనకున్నాయి సమాజానికి సేవ చేయాలి సమాజ సేవ పరమేశ్వర పూజ కంటే వెయ్యి రెట్లు ఘనమైనటువంటిది అందుకనే సేవా యోగం అనేటువంటి ఒక ప్రాతిపదికన సమస్త ప్రపంచాన్ని కూడా జాతి మత వర్గ వర్ణాలు లేకుండా కులమత భేదాలు లేకుండా సత్యసాయిబాబా వారు వారు ఎక్కడ జన్మ ఎత్తారో అక్కడే అదే కుర్చీలో కూర్చొని నూట ఎనభై ఎనిమిది దేశాల దేశాధినేతల నుంచి పామరుడైన సామాన్యుడి వరకు ఆయన ప్రశాంతి నిలయం వైపు తన వైపు ఆకర్షించుకోగలిగారు దీనికి కారణం ఏమిటంటే సర్వ సమతా భావన సమ దర్శనము సమన్వయం ఎక్కడ సంఘర్షణ లేని రీతి ఎక్కడ భావోద్వేగం లేని రీతి దేనిని అతిగా చెప్పిన విధంగా కాకుండా మితంగా హితంగా సర్వజన సమ్మతంగా సర్వజన మన మనోజ్ఞ పులకిత పుంభ్రణంగా సర్వజనులకి ఆనందం కలిగించేలాగా భారతీయమైనటువంటి వైదిక వాంగ్మయాన్ని ఎల్లలు దాటించినటువంటి సర్వదేవతా అతీత స్వరూపులైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో మనం ఇక్కడ నేను అడుగు పెట్టగానే ఏమిటి ఆ township నేను హైదరాబాద్ లో ఉన్నానా ఇంక ఎక్కడికన్నా వచ్చానా అని అనుకున్నా townships ఏర్పడాలి ఏర్పడ్డాయి ఇది ఒక అద్భుతమైన సమాజం ఇది ఒక అద్భుతమైనటువంటి సాంఘిక జీవనం దీనిలో పరస్పరమైనటువంటి భేదభావం లేకుండా ఒక సమన్వయ రీతిలో ఇక్కడ north Indian south Indian Christian Hindu అనేటువంటి భావనలన్నీ దాటి మనదంతా కూడా ఒక జాతి అది మానవజాతి అని మనందరికీ ఒక భాష ఉందని అది హృదయ భాష అని ఇప్పుడు అమ్మ అని పిలవాలి అంటే మనం అమ్మ అని రెండక్షరాలు వాడుతాం హిందీ వాడు మా అంటాడు ఇంకోడు వాడి వాడి భాషలో అమ్మా అనే పిలుస్తాడు గాని అమ్మను అయ్యా అని పిలవడు అయ్యా ను అమ్మ అని పిలవడు కాబట్టి భాషని భావాన్ని కూడా దాటి ఒక ఉదాత్తమైనటువంటి శైలిలో మన జీవితాలు చల్లగా ప్రసన్నంగా ప్రశాంతంగా హాయిగా సాగాలని పురాణాలలో ఏమీ లేదు వేదాలలో ఏమీ లేదు అవన్నీ పుక్కిట పురాణాలు కథా కథనంగా గనుక చదివితే ఆలోచనలు వస్తాయి గాని తాత్విక చింతనా భూమికలో గనుక పురాణాలు గనుక చదివినట్లయితే పౌరాణిక వాఙ్మయం మన లోపల ఉన్నటువంటి అనేకమైన ప్రజ్ఞా భూమికలను తట్టి లేపుతుంది మనలో అనేక శక్తులు ఉంటాయి అర్జునుడు గాండీవంని జమ్మి చెట్టు మీద పెట్టి ఆ అజ్ఞాతవాసం లోకి వెళ్ళినట్లుగా కాక గాండీవధారులమై ఉండాలి ఇవాళ నిన్నో మొన్నో ఎక్కడో టీవీ ఛానల్ లో పిలిస్తేనే చెప్పాను ఇవాళ ఈ భారతదేశం యొక్క ఆత్మ భారతదేశ సంస్కృతి భారతదేశం మనకి ఇన్నేళ్లు ఇన్నాళ్లుగా ఇన్ని యుగాలుగా మనకి నేర్పినటువంటి ఒక సంస్కార ధార ఇవన్నీ ఎవరూ మనకి చెప్పనవసరం లేదు స్త్రీమూర్తులంతా తల్లులంతా కూడా తమ తమ పూజా మందిరాలలో తమ శక్తి కొద్దీ దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దానికోసం ప్రత్యేకమైన crash course లు అక్కర్లేదని చెప్పాను ఎందుకంటే పూజ చేయండి అని ఏ స్త్రీకి ఈ దేశంలో చెప్పాలి దేవుడున్నాడు అని ఏ స్త్రీకి చెప్పాలి.బిడ్డలను ప్రేమించండి అని ఏ స్త్రీమూర్తికి చెప్పాలి? ఈ గృహ-- గృహాన్ని భద్రంగా manage చేయండి, దీన్ని నడపండి అని ఏ స్త్రీకి చెప్పాలి? చెప్పవలసి వస్తే పురుషుడికి చెప్పాలేమో తప్ప స్త్రీకి చెప్పవలసిన పని లేదు. కాబట్టి అనంతమైనటువంటి కలియుగం అంతా కూడా జగజ్జనని స్వరూపమైనటువంటి భువనేశ్వరీ దేవి యొక్క ఆధీనంలో ఉన్నది గనుక ఆమె లలితాదేవి గనుక "జగజ్జనానంద కరీం జయాఖ్యాం యశస్వినిం యంత్ర సుయజ్ఞయోనిం జతా మితా మిత్ర కృత ప్రపంచాం భజామహే శ్రీ భువనేశ్వరీం తాం" అనేటువంటి మా-మార్గంలో మన కట్టుకున్న భార్య తప్ప మిగతా స్త్రీమూర్తులందరినీ ఎవరు మానసికంగా తమ తల్లిగా భావిస్తారో వాళ్ళు దైవ సమానులు. భార్యను కూడా, భార్యలో కూడా దైవాన్ని చూసిన జాతి ఇది. రామకృష్ణ గురుదేవులు శారదాదేవిలో జగ-జగజ్జనని దర్శనం చేసుకున్నాడు ఆయన. దైహిక సంబంధమైన సంబంధాలేమీ లేవక్కడ. ఉన్నదంతా భావనాత్మక ప్రపంచం కాబట్టి బాగా చదువుకున్నటువంటి మీ అందరూ కూడా ఇటువంటి పురాణ వాఙ్మయాన్ని చక్కగా అవేమీ లేవు అనుకోకండి. ఏమున్నదో కాస్త వెతకండి. ఎందుకంటే ఏమీ తెలియని వాడికి కుండెడు పాలిచ్చి "దీన్లో నెయ్యి ఉన్నది" అంటే "లేదు" అంటాడు, సమాధానం ఇస్తాడు. ఏమీ చదువులేని ఒక గొల్ల స్త్రీ ఆమె గనుక ఇస్తే దాన్ని కాస్తుంది, తోడు పెడుతుంది, చిలుకుతుంది. ఇదిగో వెన్న అనిస్తుంది. కాచి చేతులు నెయ్యి చేతులు మనకప్పజెప్తుంది. అంటే ముందే లేదు అనుకోకుండా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో మన శక్తిని బట్టి, యుక్తిని బట్టి సమాజ శక్తిని మన శక్తిగా మనం మార్చుకుంటూ ఉన్నట్లయితే ఈ సహజీవన సౌందర్యం, ఈ సాంఘిక జీవనం ఒక పరిణామ సహంగా మారాలని, మారుతుందని అట్లాగే ఇవాళ ఇక్కడికి సత్యసాయి సేవా Organization కుకట్ పల్లి దీనిని ఒక మహా యజ్ఞంగా వాళ్ళు తలపెట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి సమయాన్ని, వాళ్ళకున్నటువంటి ఆహ్ వ్యాపారాలని, వృత్తులని కాసేపు పక్కనబెట్టి మనం దీన్ని చేయకపోతే ఎట్లా అని యువకులు అంటే మన తర్వాత తరం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నాకు పరమ ఆనందం కలుగుతున్నది. కనుకనే నేను వాళ్ళను అడుగుతాను "మళ్ళీ వచ్చేయ్ నాలె ఎప్పుడు" అని. నేను date ఇస్తాను. ఆ మళ్ళీ అక్టోబర్ లో ఏ date అనేది నేను చెప్తాను. ఎందుకనంటే ఈ రకంగా మనం వెళ్ళాలి తప్ప పెద్ద పెద్ద పెండాల్స్ పెట్టుకొని లక్షల మంది జనాన్ని పిలిచి వాళ్ళందరితో మనం చెప్పేది వాడు వినక, వాడికేం కావాలో మనకు తెలియక తడవడే కంటే పది మంది కూర్చున్న పది మంది హాయిగా మాట్లాడుకోగలిగితే, విషయాలు అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు మీరంతా కూడా You will become messengers of this entire episode. You keep telling your friends. You keep telling your kids. You can teach them the way. ఈ భాష కాకపోవచ్చు. మీదైనటువంటి భాషలో, మీకు తోచిన భాషలో వాళ్ళని convincing గా గాని చెప్పినట్లయితే భారతీయ సంస్కృతి నెలకొలి చెందుతుందని, ఇటువంటి అనేకమైన సందర్భాలు మనకి భగవంతుడు సర్వదా కల్పించాలని, పరమేశ్వరుడు అయినటువంటి స్వామితో చాలా ఏళ్ళు కలిసి ఉన్న కారణంగా స్వామిని చాలా తరచుగా quote చేస్తూ ఉంటాం. నాకు రాముడన్నా ఇష్టమే, కృష్ణుడన్నా ఇష్టమే. సర్వ దైవతలు వాళ్ళని చూడలేదు. నువ్వు ఏ దైవాన్నన్నా చూశావంటే దైవ స్వరూపమైనటువంటి స్వామిని నేను చూశా. దర్శనం చేసుకున్నా. ఆయనని తాకే, ఆయనతో మాట్లాడా. ఆయనతో చాలా విలువైన కాలాన్ని గడిపాను గనుక ఆహ్ ఏదైనా ఎక్కువ మాటలన్నీ కూడా బాబా వారి పరంగానే వస్తాయి గనుక అవన్నీ కూడా శృతి స్మృతులకు సంబంధించినవి, శాస్త్ర బద్ధమైనవి, వేదాత్మకమైనటువంటివి, పరిపూర్ణమైనటువంటివి, భాగవత తత్వాన్ని జగత్తుకు బోధించేటువంటి ఉపనిషత్ వాక్య నిర్మాణం కాబట్టి వాటిని పునః పునః స్మరించుకుంటూ ఈ కాలమంతా దివ్యకాలం కావాలని, ఏ స్వామి చిత్రపటము, ఏ స్వామి భావన, ఏ భగవంతుని యొక్క నామస్మరణ ఏ ఇంటి యందు జరుగుతూ ఉంటుందో ఆ ఇంటిని ఆ తరానికి మాత్రమే కాక వారి రాబోయే ఇరవై ఒక్క తరాలను నేను కాచుకుంటాను అని బాబా వారి ప్రమాణం ఈ ప్రపంచానికి ఉంది. [వ C] ఇవాళ మనం చేసే పని, చేసే చిన్న పూజ, చిన్న భావన, చిన్న కార్యక్రమం ఇది మన ఇరవై ఒక్క తరాలకి ఆరక్షణ అవుతుంది. జాగ్రత్తగా గమనించినట్లయితే ఆకాశమంత పందిరి వేసి అంటే అది vanity కదా! ఆకాశమంత పందిరి కాదు, ఆకాశం వంటి పందిరి వేయాలి. అది గొడుగు. అంతే కదా? భూదేవి అంత విస్తరి అంటాం. భూదేవి అంత విస్తరిలో మనం ఒక్కళ్ళమే భోంచేయటంలా. ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు ఈ భూమాత గర్భాలయంలో నుంచి వచ్చి ఆ గర్భం మీద, ఆ ఒడిలో ఆడుకుంటూ మనం పిడికెడు తిన్నాం, బుట్టడు తిన్నాం, తట్టడు తిన్నాం. కానీ అది మెతుకు, అది కూడా తింటున్నది. కాబట్టి మనతో ఎవరున్నారు సహచరులు అంటే మానవజాతి కానీ మిగతా జాతులన్నీ మనతో కూడి ఉన్నాయి. అందుకనే ఈ ప్రపంచంలో ప్రాణికోటికి కూడా మనం సహాయపడేటువంటి ఒక మనోనిర్మాణం చేసుకొని మన జీవితాన్ని భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక అంటే physical, metaphysical and spiritual ఈ మూడు స్థాయిల్లో కూడా ఒక ఉదాత్త వైఖరిని అందుకోవాలని ఆ ఇరవై ఒక్క తరాలకి ఇవాళ మామిడి టెంక మనం ఇక్కడ పాతి వెళ్ళిపోతున్నాం. తినటానికి మనం ఉండం. మన మనవడు తింటాడు. ఆ చెట్టు కొట్టెయ్ అంటాడు. మా తాత పెట్టాడు నేను కొట్టను అంటాడు. వాడి తాత పెట్టాడనే గౌరవం ఒకటి. మామిడి చెట్టుని ఎందుకు కొట్టాలి? పళ్ళు ఇస్తోంది, ఫలితాలు ఇస్తోంది. దాన్ని తప్పించి గోడ కట్టండంటానే తప్ప దాన్ని కొట్టి గోడ కట్టండి అనం. అట్లాగే వైదిక వాఙ్మయానికి నమస్కరిస్తూ, వేదమూర్తులైనటువంటి అనంతకోటి గురు స్వరూపాలకు నమస్కరిస్తూ, మహర్షుల దర్శనాలకి నమస్కరిస్తూ, తల్లి, తండ్రి, గురువు, దైవం ఒక్కటైనటువంటి నా పరంగత్ సత్యసాయి భగవానుడి దివ్య మహా స్మృతికి మరొక్కసారి ప్రాంజలి ఘటిస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పునః పునః మనం మళ్ళీ మళ్ళీ కలుసుకునేటువంటి ఒక యోగాన్ని, ప్రాప్తిని పరమేశ్వరుడు కల్పించు గాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం. [వ C]
YouTube · audio
Sri Ganapathi tatva vaibhavamu — Part 3
Sri Ganapathi tatva vaibhavamu — Part 3
Source: SathyaSai Seva Sadan on YouTube
0:00 / 18:36
More in this series