Skip to content
Transcript తెలుగు
సాయిరాం! మీ అందరికీ సత్య సాయి భగవానుడి శతవర్ష జయంతి సంబరాలలో, మహోత్సవంలో మీరు కూడా "అహం సత్యబోధకః" అనేటువంటి శీర్షికను ఇంతకాలం సాగిస్తూ అనేకమైనటువంటి విషయాలు, భిన్నభిన్నమైనటువంటి వ్యక్తుల యొక్క భావ సంపదని అందుకుంటూ, అందిస్తూ, నడుస్తున్నటువంటి చరిత్రలో, ఇవాళ శ్రీ సాయి రమణీయం అనేటువంటి ఒక పేరు మీద శీర్షికన అనేకమైనటువంటి కార్యక్రమాలు, అనేకమైన ఆ-ఉపన్యాసాలనుండి, ప్రవచనాలనుండి అవన్నీ కూడా సాగించటానికి నిర్ణయం తీసుకున్నందుకు మీకు బహుధా స్వామి యొక్క దయ సంపూర్ణంగా లభించు గాక అని మనసారా కోరుకుంటూ, 2000 సంవత్సరంలో శ్రీ సాయి రమణీయం అనేటువంటి ఒక గ్రంథాన్ని నేను రాయటం జరిగింది. అంటే, నిజానికి అది రాసింది కాదు. ఇలాగే చెప్పిన సత్సంగాలన్నీ కూడా ఆనాటి శ్రోతలందరూ కూడా దాన్ని transcribe చేసి ఒక book form లో తీసుకురావటం, అది విశేషంగా అంతర్జాతీయంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఆనందాన్ని కలిగించటం ఒక ఎత్తయితే, స్వామి దేహంలో ఉండగా, అంటే ఇరవై ఏడేళ్ల నాటి మాట, గ్రంథాన్ని అందుకోవటం స్వామి, అందుకుని దానిని ఆశీర్వదించటం, గ్రంథాన్ని స్వామికి ఇచ్చినప్పుడు, "ఈ వెదురు శరీరాన్ని నవవీణమును చేసి, మౌనము భాష యెన్న శ్రీ చరణులకు, మౌనము భూష యెన్న రమణులకు, మౌనంగా వినిపిస్తున్నాను వినమ్రంగా" అని చెప్పినప్పుడు, స్వామి అప్పటికప్పుడే వరండాలో చిన్న పదాలకి అద్భుతమైన translation English లోకి చేశారు. అక్కడున్న ఒక foreign devotee వైపు తిరిగి, "Look! Just look at this how Mr. Murthy has offered this book to Swami. He says the body is like a bamboo shoots. If associated with the lord, it will become a flute. Silence is an ornament, silence is a language and he is offering this with utmost humility, surrender and devotion." This was the tran-- sudden translation by భగవాన్. పుస్తకం, అది పుస్తకం కాదు, అదొక గ్రంథం. చాలా పెద్ద గ్రంథం అది. పైకి సాయి రమణీయం అంటే, సాయి రమణ మహర్షులు చెప్పినటువంటి అనేకమైన జీవన పరిసత్యాలన్నింటినీ కూడా నెమరువేసుకుంటూ, సత్సంగ ప్రవాహంగా సాగినటువంటి గ్రంథరాజమే అది. స్వామి గ్రంథాన్ని తమ శరీరాన్ని వదిలిపెట్టే వరకు కూడా తాము ఉన్నటువంటి మందిరంలో, ఎజుమందిరంలో దగ్గర పెట్టుకున్నారు. అది ఒక విశేషం అయితే, దానికి రెండు అర్థాలున్నాయి. అరుణాచలానికి, కంచికి స్వామి వారే నన్ను పంపించారు. మానవ జన్మ ఎత్తినందుకు కంచి వెళ్లి మహాస్వామిని దర్శనం చేసుకోవాలి, అక్కడే దగ్గరగా ఉన్న అరుణాచలానికి కూడా వెళ్ళాలి అనటం, 1966 నుంచి ఇంకా ఇదిగో శరీరం ఉన్నంతవరకూ కంచి పీఠంతో అనుబంధం సాగుతూనే ఉంది, సాగుతూ ఉంటుంది. అలాగే అరుణాచలానికి నేను నా World Bank project ద్వారా వెళ్ళటం, నూట ఎనభై ఎనిమిది రోజులు వరుసగా అరుణాచలంలో ఉండటం, మొన్న మొన్న 2022 నాటికి అరుణాచల గిరి ప్రదక్షిణాలు వందకు పైగా పూర్తి చేసుకోవటం, ఇదంతా స్వామి యొక్క దివ్య అనుగ్రహానికి సంకేతం. అది ఒక అత్యద్భుతమైనటువంటి వరదానం. ఇక మన శీర్షికకు వచ్చినప్పుడు, పుస్తకంలో ఉన్న విశేషాలు నేనేమీ చెప్పబోవటం లేదు. ఎందుకంటే already చెప్పబడినయి. చెప్పబడినవే మళ్ళీ చెప్పక్కర్లేదు. గ్రంథం అయిపోయిందది. ఎన్నో ముద్రణలుగా సాగింది. అయితే, మీరు పెట్టుకున్నటువంటి శీర్షిక ఏదైతే ఉన్నదో, దానిని ఏకోన్ముఖంగా ఆలోచన చేస్తే, మన స్వామి రమణీయం. అది దాని అర్థం. రమణీయం అంటే కంటికి, మనస్సుకి, హృదయానికి అన్ని స్థాయిలలోనూ ఆనందం కలిగించేటువంటిది అని అర్థం. అందులో సాయి, అంటే మనకు తల్లి, తండ్రి, గురువు, దైవమైనటువంటి స్వామి, నా దృష్టిలో ఒక రమణీయం. ఎందుకంటే, పరమేశ్వరుడు రస స్వరూపుడు. ఒకనాడు రాముడయినాడు, తర్వాత కృష్ణుడయినాడు, తర్వాత సత్యసాయి భగవానుడయినాడు. అదే పరబ్రహ్మ స్వరూపం, చిచ్ఛక్తి అంటాం, ఫినామినా అంటాం. అదంతా కూడా జగద్గురు స్వరూపమైనటువంటి మహాస్వామి, జయేంద్ర స్వామి, శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి, నాల్గవ తరంలో వచ్చినటువంటి సత్య చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వామి, నాలుగు రూపాలుగా కనిపిస్తున్నటువంటి ఒక ఏకతత్వమే కంచి మహాస్వామి, కంచి పీఠం, కామాక్షి అమ్మవారి యొక్క పునాస్వరూపాలివి. 'పురా' అంటే పాత, 'పునా' అంటే కొత్త. అది. పునః వస్తూనే ఉంటారు. జగద్గురువులుగా వస్తారు, జగత్తును రక్షిస్తూ ఉంటారు. అంతేకాదు, కంచికి పుట్టపర్తికి ఒక అవినాభావ సంబంధం ఉంది. అది ఈనాటిది కాదు. పెద్దస్వామి వారి దగ్గర నుంచి ఇప్పటివరకు కూడాఏకోహం బహుష్యామ్ అని ఒక మాట ఉంది. ఒకటే అనేక రూపాలుగా వస్తుంది అని. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని ఒకటుంది. అంతా ఒక్కటే, అంతా బ్రహ్మమే. సర్వం ఖలిదం బ్రహ్మ అనే రెండో మాట. ఇట్లా భారతీయమైనటువంటి ఒక ఆధ్యాత్మిక అనుశీలనాన్ని మనం గమనించినట్లయితే మానవుడు మానవుడిగా జీవించగలిగిన ఒక ఉదాత్తమైన స్థాయిని కల్పించటానికి వేదోక్తమైనటువంటి అనేక విషయాలు అన్నింటినీ కూడా జన సామాన్యానికి అర్థమయ్యే రీతిలో చెప్పటానికి, భారతీయ ఆత్మ అంతా కూడా సనాతన ధర్మంలో ఇమిడి ఉన్నదని, సనాతన ధర్మం గనక కుంటుబడినట్లయితే అంటే మనం ఆచరించకపోయినట్లయితే, కేవలం విని వదిలిపెట్టినట్లయితే మన జీవితాలు పరిపూర్ణం కాదని అనేకమైనటువంటి బోధలు చేసినటువంటి మహా చైత్య పురుషులు వీరందరూ కూడా. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడి నుంచి ప్రణామాలు సమర్పించుకుంటూ సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ సాయి రమణీయంలోకి వెళ్దాం. దాన్ని స్వామి ఎలా నడిపిస్తారో మనము ఎదురు చూద్దాం. ఒక అవతార మూర్తి అవనీ సంచారానికి వచ్చి కేవలం వంద సంవత్సరాలు, అందులో వారు నడిచింది ఎనభై ఆరేళ్ళు. కానీ ఒక జాతిని మాత్రమే గాక సర్వ జాతులనీ, సర్వ దేశాలని, సర్వ భాషల యందు తమ మనస్సును నిలిపి భాషా ఆధారంగా నడిచినటువంటి సమస్త జీవకోటికి కూడా సత్యసాయి భగవానుడి సందేశ, ఉపదేశ, ఆదేశాలు ఇస్తూ మానవుణ్ణి మహోన్నతమైన స్థాయికి చేరే అనేక మార్గాలు బోధించినటువంటి ఒక రసాత్మక భావనా జరి సత్యసాయి భగవానుడి యొక్క లోక సంచారం. నేపథ్యంలో, ఈవేళ అనేకం మాట్లాడుకోవటానికి ఉన్నాయి గనుక స్వామి యొక్క సరస్వతీ ప్రవాహంగా నేను భావన చేస్తూ, అవతార మూర్తి అంటే ఇతఃపూర్వం, ఇంతకు ముందు చేయనటువంటి ఒక మహత్ కార్యాన్ని స్వామి చేశారు. అది ఏమిటి? అని ప్రశ్న. మనకి పద్నాలుగవ ఏట నుండి స్వామి చరిత్ర అందరికీ తెలుసు. కొత్తగా చెప్పుకునేదంటే ఏమీ లేదు. మనమందరం దాంట్లోనే ఇమిడిపోయి ఉన్నాం. స్వామి మనందరి జీవితాలలో కిక్కిరిసి ఉన్నారు ఇది. మనం ఇమిడి ఉన్నాం, ఆయన కిక్కిరిసి ఉన్నారు. అటూ ఇటూ చూపు మరల్లకుండా, భావాలలో తేడా లేకుండా ఒక ఉదాత్తమైన స్థాయిలో మన మనస్సులందరినీ సంచారం చేయిస్తూ వేద విహితమైనటువంటి అనేకమైన కర్మకాండలని, యోగ జ్ఞాన కాండలని, భక్తి ప్రవాహాన్ని సమ్మిళితం చేసినటువంటి ఏకైక అద్వైత మూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. అయితే శ్రీరామచంద్రుడు, వశిష్ఠ మహాముని లేదా మహర్షి, వారు నిజానికి బ్రహ్మర్షి. వాళ్ళు కూర్చొని శ్రీరామచంద్రుడికి వశిష్ఠుల వారికి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ ముప్పై మూడు వేల శ్లోకాలు అయినప్పుడు అది మనకు వశిష్ఠ గీతగా, అదే యోగ వశిష్ఠంగా మనకి అందుబాటులోకి వచ్చింది. ఏది ఎట్లా ఉన్నా సుమారుగా ఒక వెయ్యి పేజీలు రాయగలిగిన ముప్పై మూడు వేల శ్లోకాలు, దానిలో కథలు, ఉపకథలు, వర్ణనలు అన్నీ గనక పెట్టినట్లయితే చాలా పెద్ద సంపుటి అది. అయితే దాన్ని వశిష్ఠులవారు రాయలే, రాముడు రాయలే. లోకంలోకి అది వచ్చింది. ఎవరో రాశారు, దానికి చరిత్ర లేదు. అంటే సాక్షాత్తు పరబ్రహ్మ మూర్తి అయినటువంటి స్వామి అంటే మన రామచంద్రుడు యోగ వశిష్ఠాన్ని రాయనే లేదు. శ్రీకృష్ణ భగవానుడు ఏమీ రచన చేయలే. మహాభారత సంగ్రామ వేళ అర్జునుడిని ఒక ఉపాధిగా పెట్టుకొని, ఎదురుగా పెట్టుకొని కలియుగ మానవులందరికీ కూడా కర్మ, భక్తి, జ్ఞానం అనే మూడు యోగాలని కూడా ఒక మహా త్రివేణిగా పారించి అనేకమైనటువంటి తాత్విక విషయాలని ప్రధానంగా చెప్పి భగవద్గీతని ఆలాపన చేశాడు. అందరూ ఆలాపన అంటే పాట అనుకుంటారు, అది ట్రాన్స్మిట్ చేశాడు. అది గీత అంటే పాడుకునేది, గానము అని మామూలు అర్థంలోకి దింపేశారు దాన్ని. దాని అర్థం అది కాదు. అది ఆంతరంగికమైన ఒక భావనా స్ఫురణ ఏదైతే ఉన్నదో దానిని ఒక శిష్యుడికి, ఒక అంతేవాసికి, ఒక సాధకుడికి భగవంతుడు రకమైనటువంటి అపేక్ష లేకుండా ప్రవాహ వేగంతో ప్రసారం చేసినటువంటి ఒక దివ్య భూమిక అది. మరి కృష్ణుడు ఏమీ రాయలేదు, రాముడు అసలే రాయలేదు. కానీ తర్వాత వచ్చినటువంటి, శంభోర్ మూర్తి శరతి భవనే శంకరాచార్య రూపా, శంకర భగవత్పాదులు ప్రపంచంలోకి శివుడే శంకరుడిగా వచ్చి వారు ఒక వాఙ్మయ స్వరూపాన్ని భారత జాతికి అందించారు. ఎందుకివ్వాలి? వాఙ్మయం ఎందుకివ్వాలి అంటే పామరుడు, పండితుడు, జ్ఞాని, అజ్ఞాని, భక్తుడు, శక్తుడు వీళ్ళందరూ కూడా ఉపాసన చేయాలి. భగవంతునికి కైంకర్యం చేయాలి. భగవంతుడి యొక్క దివ్య గుణ గాన వైభవాన్ని ప్రపంచానికి అందిస్తూ ఉండాలి. పాడుకోవటంలో, ఆడుకోవటంలో, మాట్లాడుకోవటంలో అనేక రీతుల, నానా రీతుల భగవత్ తత్వాన్ని ప్రపంచానికి చెప్పాలి. అందుకై శంకర భగవత్పాదుల స్తోత్రాలు, భాష్యాలు, ప్రకరణాలు, నతులు, నుతులు, గీతికలు, గీతాలు అన్నీ కూడా అందించి ఇది భారతీయ వాఙ్మయం. మూల మూలలలో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా క్రోడీకరించికేవలం ముప్పై రెండు సంవత్సరాల వారి భూ సంచారంలో మహాత్ముడు చేయలేని పనిని ఆయన చేసేశారు. అందుకనే శంకర భగవత్పాదులు నాలుగు ఆమ్రాయపీఠాలు తదనంతర కాలంలో పెట్టినా, వారికంటే ముందు ఉన్నటువంటి అర్వాచీనమైన, ప్రాచీనమైన రెండూ కలిసినటువంటి సనాతన సనూతన వేదిక కంచి కామకోటి పీఠం. కంచి కామకోటి పీఠానికి మనకు తెలిసినంత వరకు ఇప్పటికీ డెబ్బై ఒక్క మంది జగద్గురువులు వచ్చారు. అరవై ఎనిమిది పెద్ద స్వామి వారు అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కంచిలో వచ్చి స్వాత-- భారతదేశ స్వాతంత్ర అనంతర స్వర్ణ కాలంలో అధ్యాత్మను కూడా జనపరం చేశారు. జనానికి ఇదిగో అధ్యాత్మ ఉంది, కేవలం భౌతికవాదం మాత్రమే కాదు అని చెప్తూ దాని యందు అనేకమైనటువంటి విషయాలను సూత్రీకరించి సూత్రాలన్నింటికీ భాష్యం చెప్పి కాళీ నరకన శంకరుల తర్వాత ఆసేతు సీతాచలము పర్యటించినటువంటి వారు మహాస్వామి వారు. అది సదాచారము, సంపన్నత, శాస్త్రగతమైన విషయాలు వీటన్నింటినీ కూడా ఒకచోట గుదిగుచ్చి "వేదో నిత్యం అధీయతామ్" అని ఒకటి. "వేదో ఖిలో ధర్మమూలం" అని రెండోది ప్రపంచానికి చాటి చెప్పి, మీరు వృత్తిలో ఉన్నా ఉండండి భక్తిపరమైన ప్రవృత్తిని మాత్రం అలవాటు చేసుకోండి. వృత్తి నుంచి మీ ప్రవృత్తిని పవిత్రీకరించుకొని అక్కడి నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళాలి అని చెప్పినటువంటి శుద్ధ సత్వమూర్తి, నడిచే దేవుడు అనిపించుకున్నటువంటి వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. అయితే కాలంలో వచ్చిన మార్పులు, సమాజ అవసరాలు, విలువలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అదే కంచి కామకోటి పీఠంలో జయేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చి జన జాగరణ, జన చైకితన్య అనేటువంటి రెండు నినాదాలు తలకెత్తుకుని అధో జగత్ సహోదరులందరికీ కూడా ఒక భరోసా ఇచ్చి భగవన్నామాన్ని మించినటువంటి మరొకటి లేదు అని చెప్పి, కానీ మీరు కార్యదక్షులుగా ఉండాలి, పని చేయాలి, ఒళ్ళు వంచి పని చేయాలి, మనసు పెట్టి పని చేయాలి, జ్ఞానంతో, వివేకంతో, విచక్షణతో పని చేయాలి అప్పుడే మీ జీవితానికి సార్థకత అని శంకర నేత్రాలయాలు ఏర్పాటు చేసి కుల మత మార్పుడులన్నింటినీ కూడా ఆపి సనాతన ధర్మానికి కొత్త రూపాన్ని, కొత్త dynamicsని, కొత్త dimensionsని ఇచ్చినటువంటి మహోదార మూర్తి జయేంద్ర సరస్వతి స్వామి వారు. తర్వాత పన్నెండున్నర, పదమూడు సంవత్సరాల మధ్యలోనే త్రియాశ్రమ స్వీకారం చేసి పదమూడేళ్ళ బాలుడిగా ఋగ్వేదాన్ని ఔపోషణం చేసి తమ గురువైన జయేంద్ర స్వామి, పరమ గురువులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వాళ్ళ ఇద్దరినీ కలుపుకొని అంటే సమ్మిళితమైనటువంటి ఒక మూర్తిమత్వం. దానిలో నుంచి అధునాతనమైనటువంటి సమకాలీన ప్రపంచానికి ఎటువంటి విద్యనివ్వాలి, ఎటువంటి బోధ చేయాలి, మానవుడిలో పరిణామ దశను ఎట్లా నిర్ణయించాలి, దానికి మనమేం చేయాలి అని నిరంతరము శ్రమిస్తూ శిల్ప కళలో జగద్గురువు సాధించనంత నైపుణ్యాన్ని, లోలోతుల్ని గ్రహించి ఇటు శిల్పాన్ని, అటు కళలని అన్నింటినీ పోషిస్తూ సాగుతున్నటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు అనేకమైనటువంటి దేవాలయాలను జీర్ణోద్ధరణం చేయండి, శిథిలమైన వాటిని రక్షించండి, కొత్త వాటి కోసం మీ ధనాన్ని ఆహ్ ఖర్చు పెట్టవలసిన పని లేదు, వినియోగించక్కర్లేదు అని ఒక సహేతుకమైనటువంటి ఒక దృష్టితో మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. ఇక మొన్న కొత్తగా వచ్చారు వారు సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. వారు కూడా అనేక శాస్త్రాలలో, వేదాలలో అలాగే భాష్యాలలో, షడ్ దర్శనాలలో పరిపూర్ణత సాధించుకున్నటువంటి యువ జగద్గురువు వారు. నలుగురి గురించి ఎందుకు ప్రస్తావన చేశానంటే, నలుగురికీ స్వామితో సంబంధం ఉంది. అందువల్ల చెప్పాను ఇదంతా కూడా. ఏమిటి అంటే స్వామిది ఎనభై ఐదవ జయంతి నాడు జయేంద్ర సరస్వతి స్వామి వారు స్వయంగా పుట్టపర్తికి వచ్చారు. నేను ఎప్పుడు శంకర విజయేంద్ర స్వామి వారిని కలిసినా స్వామి ప్రస్తావన లేకుండా ప్రసంగం సాగదు, ముఖాముఖి సాగనే సాగదు. వారికి స్వామి చేసినటువంటి అనేక పనులు వారి హృదయానికి రంజన కలిగించింది అని మీకు చెప్తూ, ఇవ్వాళ భిన్న భిన్నమైనటువంటి భావాలతో, భిన్నమైన మార్గాలలో, భిన్నమైన ఆలోచనలతో, రుచులతో జీవితాన్ని చీలికలు, పేలికలు చేసుకుంటున్నటువంటి మానవ జాతిని అంతా ఒకటే కాకపోతే "ఏకం సత్ విప్రా బహుధా వదంతి" అంతే కదా! Truth is one, it is told differently by the wise. ఎవరెవరి అనుకూలాన్ని బట్టి, శక్తిని బట్టి, సామర్ధ్యాన్ని బట్టి, అవగాహనను బట్టి అలాగే వారి వారి దర్శనాన్ని బట్టి ఒకే విషయాన్ని అనేక రీతుల్లో చెప్తారు గనుక జగరాజ స్వామి వారు అన్నట్లుగా ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. అందరూ కలిస్తే సత్య సాయి భగవానుడిగా నేను అనుభవపూర్వకంగా నేను భావన చేస్తూ సాయి రమణీయంలో రాముడు చెయ్యని, కృష్ణుడు చెయ్యనిఒక పనిని స్వామి సరస్వతీ స్వరూపంగా ఆవిష్కరణ చేశారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే జనజగత్తులతో మమేకమైనటువంటి స్వామి ఇంత వాఙ్మయ మహా సృష్టి ఎలా చేశారు? ఎప్పుడు చేశారు? వారికి తీరిక ఎక్కడుంది? అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు కొద్దిగా స్వామి బాల్యంలోకి మనం కూడా తొంగి చూడాలి. ఏమిటి బాల్యం అంటే, పద్నాలుగు సంవత్సరాల తర్వాత చరిత్ర మనకు తెలుసు. కానీ పద్నాలుగు సంవత్సరాలు వచ్చేనాటికి స్వామి చరిత్ర అక్కడక్కడ కొంత తెలుసు. ముందు వేళ రమణీయమైనటువంటి సాయి యొక్క దివ్యత్వం ఎలా పరిమళించిందో అతి బాల్యంలోనే దివ్య దీధిచి అంటే ఒక కాంతి ఎలా పుట్టపర్తి ప్రాంతంలో చిన్న వెలుగుచుక్కగా ప్రారంభమై వెలుగై, పెను వెలుగై, ఆవలి గట్టున ఉన్నటువంటి మహా వెలుగై విరాజిల్లుతూ ఉన్నదో ఆలోచించినప్పుడు అది ఒక అద్భుతమైనటువంటి క్రీడ, అది ఒక లీల, అది ఒక ఖేలా, అది ఒక హేలా అది. అది ఒక దివ్యమైనటువంటి ఆట పరమాత్మకి. ఆయన ఆంధ్రదేశాన్ని ఎంచుకున్నందుకు, పద్నాలుగవ ఏట వారు పుట్టపర్తిలో జన్మ ఎత్తినందుకు, ఎత్తి తమ చుట్టూ ఉన్నటువంటి బాలురతో, స్నేహితులతో అలాగే సమాజంలో పెద్దలుగా ఉన్నటువంటి వయసు వచ్చిన వారి యొక్క దుర్లక్షణాలని, దుర్వ్యసనాలని, దుర్భావనలని, దుర్భాషలని సంస్కరిస్తూ అనేకమైనటువంటి నాటికలు నటించి, రచించి, నటించి సమాజాన్ని ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేశారు. చెప్పినట్లు చేస్తారా? చెప్పినట్లు వింటారా? ఇటువంటివన్నీ కూడా. దేవుడు ఎక్కడున్నాడు? ఇట్లా ఒక పక్కన మాట్లాడుతూ మరొక నాటిక ప్రక్రియ ద్వారా సమాజాన్ని ఉద్దీపనం చేసినటువంటి, ప్రచోదితం చేసినటువంటి సరస్వతమూర్తి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. ఇది ఒక్కటే కాదు, అదే సమయంలో తర్వాత కాలంలో సినిమాలలో నటించినటువంటి ఋషేంద్రమణి అనేటువంటి ఒక మంచి నటి, ఆవిడ నాట్యకర్త కూడా. ఒకసారి ఆమె పుట్టపర్తికి వచ్చింది. అప్పుడు స్వామి వయస్సు బహుశా పదకొండేళ్ళు, పన్నెండేళ్ళు అయి ఉండొచ్చు. ఆమెకి ఒక ప్రత్యేకమైన శక్తి ఉండేది. ఒక యుక్తి ఉండేది. ఒక నేర్పు ఉండేది. నేర్పు ఏమిటంటే నాట్యం చేస్తూ చేస్తూ రంగస్థలం మీద ఎక్కడో ఒకచోట విసిరివేయబడినటువంటి చిన్న సూదిని అంటే కంటికి కనపడనంత సూక్ష్మమైనటువంటి సూదిని రంగం మీద వదిలేసినట్లయితే ఆమె నాట్యం చేస్తూ చేస్తూ నెమ్మదిగా శరీరాన్ని తన భంగిమలను మార్చుకుంటూ పతాక స్థాయిలో వంగి తన నాలుకతో మళ్ళీ సూదిని పైకెత్తి నాట్యం ప్రారంభించేది. అది భారతదేశంలో ఎవరికీ తెలియని మహావిద్య అది. సమయంలో అటువంటి ఒక సంఘటనని స్వామి చూశారు. అప్పుడు స్వామి చిన్నవారు audience లో ఉన్నారు. ఆనందపడ్డారు. ఇటువంటిది ఒకటి ఉంది ఇక్కడ ఉందని, అందరికీ తెలుస్తున్నది, ఇవి ఎవరో మహాత్మురాలు అని అనుకున్నారు ఆయన. నాట్యకర్తగా చూడలే, నటిగా చూడలే, ఒక గొప్ప శక్తిగా చూశారు. చూసి, నేను ఒక dance చేస్తాను అన్నారు స్వామి. నేను కూడా నాట్యం చేస్తానని. స్వామి బాల్యంలో చాలా, పెద్దవారైనప్పుడు కూడా పెద్ద శరీరం ఏం కాదది. చాలా సన్నగా ఉండేవారు. వేదిక మీదకి, రంగస్థలం మీదకెక్కి ఆమెను కాసేపు పక్కన ఉండమని చెప్పి స్వామి నాట్యం చేశారు. మన ఋషేంద్రమణి ఎట్లా చేసిందో దానిలో ఉన్నటువంటి లోపాలన్నీ సవరిస్తూ ఉదాత్తమైనటువంటి నృత్యం చేస్తూ చేస్తూ ఆమె నాలుకతో తీస్తే స్వామి ఏం చేశారు? కంటితో, కంటివా, కన్ను చూపు దానివైపు పెట్టి రెండు కళ్ళలోకి నాలుగు సూదులు ఏకకాలంలో ఆకర్షించారు. ఇది అతిమానుషమైనటువంటి ఒక అద్భుత విద్యా ప్రదర్శన. అంతేకాదు, ఇందాక చెప్పినట్టుగా నాటికలు రాశారు, చిన్న చిన్న పద్యాలు రాశారు, ప్రబోధం చేశారు, పాండురంగ భజనలు చేశారు, భగవంతుడు ఉన్నాడని చెప్పారు. అంటే ముందు తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని తాను ప్రభావితం చేస్తూ వెళుతూ వెళుతూ వెళుతూ ఉంటే నెమ్మదిగా కాలం తనను తాను పరచుకుంటూ, విశాల పరచుకుంటూ విశాలమైనటువంటి ఒక దృక్పథంతో వాఙ్మయ సృష్టి చేశారు స్వామి. అందుకనే ప్రపంచంలో అత్యున్నత స్థాయికి చెందిన కళాకారులందరూ కూడా తదనంతర కాలంలో స్వామి దగ్గర ప్రదర్శనలిచ్చారు. ఒక ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి యువ గాయకులందరూ కూడా స్వామి దగ్గర పాడారు. అలాగే వేద విద్యలో అప్పుడే వేద విద్య నేర్చుకుంటున్నటువంటి వారి దగ్గర నుంచి వేదంలో పండిన వారందరూ కూడా స్వామి దగ్గరకు వచ్చారు. వచ్చే స్వామితో కూడి ఉన్నారు. అలాగే మహా కవులందరూ కూడా, అప్పటికే మహా కవులు అనిపించుకున్న వారందరూ కూడా స్వామి దగ్గరకు వచ్చి అసలు కవిత్వం అంటే ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుని ఒక వేలూరి శివరామశాస్త్రి గారి వంటివారు, ప్రధానంగా ఆయన చాలా గొప్ప తత్వవేత్త. అలాంటి వారందరూ ఇక్కడికి వచ్చారు. వచ్చి వాఙ్మయ సృష్టిలో వాళ్ళు కృషి చేసి, అసలు వాఙ్మయం అంటే ఏమిటి? పరంగా కవిత్వం అంతా రాయాలి? రకంగా సరస్వతిని ఉపాసన చేయాలని అక్కడ నేర్చుకుని మళ్ళీ తిరిగి వచ్చి సాహిత్యంలో నుంచి రాహిత్యం వైపు నడిచి అంటే మోక్షం వైపు నడిచే ఒక మార్గాన్ని ఆహ్ ఒక ఉపాసనా మార్గంగా ఎంచుకుని స్వామిని, పూర్వకాలంలో వచ్చిన అవతారాలని, సమాజాన్ని సమ్మిళితం చేసి వాఙ్మయ మహా సృష్టి చేసిన వారందరూ కూడా పుట్టపర్తికి చేరుకున్నారు.చూడండి వ్యక్తి దగ్గరకు, శక్తి దగ్గరకు ప్రపంచంలో ఉన్న, కేవలం భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి గాయకులు, వా-వాద్యకారులు, విద్యావేత్తలు వీళ్ళందరూ ఎలా స్వామి దగ్గరకు వచ్చారు అంటే, అక్కడి అప్పటి దాకా అక్కడి దాకా నడిచి వచ్చిన దారి వేరు. అప్పటి దాకా నేర్చుకున్న, సముపార్జించిన జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. సత్యసాయి భగవానుడి దగ్గరకు వచ్చినప్పుడు పరమ చరమమైనటువంటి కొస మెరుపు పొందాలి గనుక వారందరూ కూడా స్వామి దగ్గరికి రావటం ఒక చారిత్రక, యాథార్థిక మహా పరిసజ్జం ఇది. ఇలా అయితే స్వామి ఏం చేశారు? ఎందుకు చేశారు? అసలు ఇంత రాయటానికి, ఇంత చెప్పటానికి వారికి సమయం ఎక్కడుంది? రోజుకి అందరికీ ఉన్నట్లే ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి కదా, ఆయన ఎలా చేయగలిగారు అంటే "కాలాయ నమః, కాలాతీతాయ నమః" అని ఒకటి ఉంది. అంటే పరమేశ్వరుడు, పరాశక్తి, It is beyond the time and space. It indulges in such activities which even a human cannot even comprehend. But they not only comprehend, but they execute. And they demonstrate the very divinity of the Lord. పరాశక్తి యొక్క శక్తిని మనకి పరిచయం చేసేటువంటి దిశగా స్వామి యొక్క బాల్యము, ఆశాంతము అలాగే గడిచింది. తర్వాత స్వామి దివ్యోపన్యాసాలు ఏది ప్రారంభించిన ఎప్పుడు చెప్పిన ఒక పద్యం ఉంటుంది. పద్యంలో భారతదేశం పట్ల అపారమైన గౌరవము, ప్రేమ, దేశభక్తి చిప్పిల్లుతూ ఉంటాయి. They-they simply ooze out అంటామే అవి. అది రకంగా అదొక వాఙ్మయ సృష్టి. ఇప్పుడు మా బోటి వాళ్ళు, పన్నెండవ ఏట వెళ్ళిన వాళ్ళు స్వామి దగ్గర inspiration పొందారు అంటే, "ఓహో! పద్యం ఇలా చెప్పాలన్నమాట, ఇలా రాయాలన్నమాట, ఇలా అనాలన్నమాట" అని భావగర్భితమైనటువంటి, అంటే impregnated with entire భావ. దానిలో emotion ఉంటుంది, sentiment ఉంటుంది, attachment ఉంటుంది, దాని యందు అనురక్తి ఉంటుంది. అందుకనే శంకర భగవత్పాదులు కూడా ఒక చోట అంటారు, మహా సౌందర్యవతి అయిన భార్య ఉన్నా, మేరు పర్వతమంత సంపదలు ఉన్నా, "మనస్యేన లగ్నం గురోరంగ్రి పద్మం తతః కిం? తతః కిం? తతః కిం?" అంటారు. ఉన్నా, అంతటి సంపద ఉన్నా, భార్య ఉన్నా, అవకాశాలు ఉన్నా, ఆకాశాన్ని పరుచుకున్న వెన్నెల వంటి కీర్తి ఉన్నా, నీ మనస్సు గురుపాద పద్మముల యందు లగ్నంగాన కాకపోయినట్లయితే ఏం ప్రయోజనము అని ప్రశ్న. ప్రయోజనం లేదు అనేది జవాబు. దానికి అనుగుణంగా స్వామి కళాకారులని, కవులని అందరినీ కూడా సమాదరించి పోషించారు. వారు ఏదన్నా చిన్న గ్రంథం రాస్తే దానికి డబ్బు ఇచ్చి ప్రోత్సహించేవారు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించినప్పుడు స్వామి నాకు శారదా స్వరూపంగా, సరస్వతీ ప్రవాహంగా, వాణీ నిస్వనంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అనిపించడమే కాదు అదొక అనుభవం. ఎందుకంటే ఒక మహాకవి నండూరి రామకృష్ణమాచార్యుల వారిని, ఆయన స్వామి అంటే పెద్దగా విశ్వాసం లేని ఆయన, వారి ముదిమి వయస్సులో ప్రశాంత నలయానికి యాదృచ్ఛికంగా రావటం, రావలసి వెళ్ళటం, వెళ్ళినప్పుడు స్వామిని దర్శనం చేయటం, అప్పుడు ఆయన రెండు పద్యాలు జగత్తుకిచ్చి వెళ్లారు. ఏమిటవి అంటే, "అవతరించె నేడు ఆంధ్రదేశము నందు జగతిన్ ఉద్ధరింప సత్యసాయి" "ఆతడుపనియసింప యావత్ప్రపంచాన దేవభాషయై తెలుగు నేడు" అని. అమరులైనటువంటి దేవీదేవతలందరూ కూడా సంస్కృతంలో, అమృత భాషలో, అమర భాషలో మాట్లాడుకుంటారు కానీ, సత్యసాయి భగవానుడు వచ్చి మాట్లాడిన తర్వాత తెలుగు భాష అమర భాష అయిపోయింది అన్నారు. అంటే ఆయన ఎవరంటే పరదైవతమే అని. అలాగే నేను ఈయనకి దండం పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు అసలు. పైగా పెద్దగా నమ్మకం కూడా లేదు. కానీ ఆయన మూర్తిమత్వాన్ని చూసినప్పుడు ఒకటి అనిపించింది. అరే సత్యసాయి వరదేవుడైనచో ఆయన మానవీయతకు అంజలింపు, అరే సత్యసాయి నరమాత్రుడైనచో ఆయన దివ్య గరిమకు అంజలింపు, నేను నమస్కారం పెట్టకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే దేవుడు అనుకుందామా, ఆయనలో మానవత్వం పరిపూర్ణంగా కనిపిస్తున్నది. లేదు కేవలం ఒట్టి మనిషే అనుకుందామా, ఎవరూ ఊహించలేని దివ్యత్వం పరిఢవిల్లుతున్నది, విరాజమానం అవుతున్నది. కనుక విధంగానైనా నేను ముందు ఆయనకి నమస్కారం చేస్తున్నాను అని ఆయన రాశారు. అలాగే వెంపరాಲ సూర్యనారాయణ శాస్త్రి గారిని ఆయన [గొంతు సవరించుకుంది] అసలు మనం సత్యసాయి దగ్గరికి ఎందుకు వెళ్లాలండి? మనం ఏదో పద్యాలు రాసుకుంటాం, చదువుకుంటాం, ఆయనకి ఆయనకేం చదువు లేదని విన్నాం అని దారి పొడుగూతా విమర్శిస్తూ వచ్చినటువంటి ఆయన ప్రశాంతి నిలయంలోకి enter కాగానే, అంటే రోజుల్లో ప్రవేశం అవుతుండగానే స్వామి ఆయనకి దర్శనం ఇచ్చారు దగ్గరగా. ఆయనకి ఆశ్చర్యం కలిగి ఒక మాట రాశారు. కలి మహాత్మ్యము వార్ధి పొంగినట్లుగా, అంటే కలి మహాత్మ్య వేళ సముద్రం పొంగినట్లుగా అనేక అనాచార, అస్పష్టతలు, అవిద్యలు, అహంకారాలు, అభిజాత్యలు ఇవన్నీ కూడా సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి వేళ మరి ప్రపంచానికి దిక్కు ఎవరు అని నాకు నేను ప్రశ్న వేసుకున్నట్లయితే యువ యతీశ్వరుడైన ఒక్క సత్యసాయే నాకు కనిపిస్తున్నారు అన్నారు. ఏది వీళ్ళంతా నమ్మకం లేని వాళ్ళు. నమ్మకం కలిగిన వాళ్ళ సంగతి పక్కన పెడదాం. నమ్మకం లేని వాళ్ళకే నమ్మకం కలిగించాలి.నమ్మకం ఉన్న వాళ్ళ నమ్మకాన్ని ఆయన నిలబెట్టాలి. నిలబడిన నమ్మకం అంతా భక్తి కావాలి. ఎందుకంటే ఒక మహాత్ముడి దర్శనం చేత స్వామి దర్శనానికి ఒక నాస్తికుడు వెళితే కొద్ది కాలంలోనే వాడు ఆస్తికుడు అవుతాడు. ఆస్తికుడైనటువంటి వాడు తర్వాత కాలంలో భక్తుడవుతాడు. భక్తుడైనటువంటి వాడు విజ్ఞాని అవుతాడు. విజ్ఞాని అయిన తర్వాత సుజ్ఞానం ఏమిటో వెతుక్కుంటాడు. సుజ్ఞానాన్ని ప్రజ్ఞానంతో సమన్వయం చేస్తాడు. తడగా అతడు జ్ఞాని అవుతాడు. ఇక జ్ఞాని అయిన తర్వాత త్వమేవాహం సంశయః నీకు నాకు తేడా లేదు. స్వామి చెప్పారు you are me, I am you అని. కాబట్టి ఇటువంటి పరిణామశీలమైనటువంటి, గతిశీలమైనటువంటి ఒక మహాద్భుతమైనటువంటి వైఖరి ఏదైతే ఉన్నదో. వైఖరి అంటే the way, the pattern, the mode ఇట్లా. ఏమిటి అది అంటే మానవుడు అల్పుడు కాదు, ప్రతి మానవుడి యందు మాధవుడు ఉన్నాడు. తెలుసుకోనంత కాలం మూఢుడుగా ఉంటాడు. మూఢత్వము, జడత్వము రెండు వదిలిపెట్టి తెలుసుకున్న తర్వాత మనిషి మనీషియై, మనీషి ఋషియై, ఋషి బ్రహ్మర్షియై, బ్రహ్మర్షి మహర్షియై జీవితాన్ని పరిపూర్ణ సార్థకత వైతు నడిపించుకొని ఇటు భౌతికవాదాన్ని అటు ఆధ్యాత్మిక వాదాన్ని రెండింటిని సమన్వయం చేసుకుంటూ వెళతాడు అని ప్రకటన చేసి సత్యసాయి భగవానుడు అందరినీ అక్కున చేర్చుకున్నటువంటి దివ్య మాతృ స్వరూపమే సత్యసాయిబాబా వారు. అంటే మన స్వామి. ఇది సాహిత్యం ద్వారా ఎలా చేశారు చూడండి. ఐదు వందల యాభై ఐదు బ్రహ్మ సూత్రాలున్న బ్రహ్మసూత్రానికి భాష్యం చెప్పారు. ఏడు వందల శ్లోకాలు ఉన్నటువంటి భగవద్గీతకి గీతా వాహిని రాశారు. ఉపనిషత్తులకు వాహిని రాశారు. సూత్ర వాహిని ఇట్లా అనేకమైనటువంటి ప్రశ్నోత్తర వాహిని అంటే ఏమి ఉపనిషత్తులుగా ఉండిపోయినాయో, ఏమి వేదాలుగా ఉండిపోయినాయో వాటన్నింటినీ కూడా జన సామాన్యంలోకి సరళమైన, సుందరమైన, అచ్చమైన తెలుగు భాషలో ప్రసంగం చేసి భాషకు ఒక దివ్యత్వాన్ని అలది, అద్ది అలాగే ప్రపంచానికి ఇదిగో భారతీయ వాంగ్మయం ఇట్లా ఉంటుంది. దీనిలో నుంచి పరిణామ దశ రావాలి. అందరూ స్వామి మార్పు కోసం, మార్పు కోసం మార్పు చిన్న విషయం పరిణామం జరగాలి. Change is a small word before transformation. ఒక చిన్న గొంగళి పురుగు సీతాకోకచిలుక అవటం ప్రకృతిలో చూస్తాం. ఒక చిన్న మొగ్గ సౌరభాలు వెదజల్లేటువంటి పొయలు, సవగులు, రంగులు, పువ్వును బయటకు పెట్టేటువంటి పుష్పాలుగా వికాసమానం చెందుతాయి. శంభుద్యాన వసంత సంగిని హృదారామయ ఖజీర్ణచ్ఛదా, సరసా భక్తి లతాచ్ఛదా విలసితా పుణ్య ప్రవాళ శ్రితాః, దీశ్యంతే గుణ కోరక జప వశ పుష్పాక్ష సద్వాసనా, జ్ఞానానంద సుధామరందల హరి సంవిత్ ఫలాభ్యున్నతి. సంవిత్ అనేటువంటి అంటే విద్య తెలుసుకుంటే ఇక మరొక విద్య లేకుండా పోయిందో, అన్ని విద్యలకు మూలమైన ఆది మూలమైనటువంటి మహావిద్య ఏదైతే ఉన్నదో మహావిద్యకి ఆత్మవిద్య అని పేరు పెట్టారో అదే పోతన గారి భాషలో చావు లేని చదువు అన్నారో ఇంటలెక్ట్ ని అచ్చ తెలివి అనే ఆత్మజ్ఞానాన్ని ఎలా జాతి అందుకున్నదో ఇటువంటి ఉదాత్తమైనటువంటి భావనలన్నీ కూడా స్వామి తమ రచనలలో, తమ భావనలలో, తమ దివ్యోపన్యాసాలలో జన జాగృతం చేసినటువంటి సరస్వతీ స్వరూపమే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. అందుకనే ఇదిగో ఇందాక వారు అన్నట్టు పన్నెండవ ఏట వెళ్లిన పదహారు, పదిహేడు ఏళ్లు వచ్చేప్పటికీ అనేకమైనటువంటి అనుభవాలు అవి ఇక్కడ చెప్పుకునేవి కాదు. తర్వాత ఎప్పుడో ప్రవాహం ఒకటుంది కదా అప్పుడు చెప్పుకుందాం. స్వామి చల్లని చిరునవ్వు తల్లి దీవెనయై తనరారూను, స్వామి మెల్లని గమనమున ఆగామి సంచితములు నెమ్మనగును, స్వామి దర్శన స్పర్శన సంభాషణములు ప్రస్థానత్రయ స్వస్థాన యాన వ్యాజమగును, స్వామి తీయని పిలుపుతో అంగాంగము పులకాంకుర ప్రకరమవునో అట్టి నా స్వామి రూపు సౌందర్య లహరి, అట్టి నా స్వామి తలపు శివానంద లహరి, అట్టి నా స్వామి పిలుపు అమందానంద లహరి, అట్టి నా స్వామితో చెలిమి జన్మ జన్మాల కలిమి. మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం అంటాం. అది జన్మాంతరమైనటువంటి ఉండాలి. కాళిదాసు చెప్పినట్లుగా భావ స్థిరాణి జననాంతర సౌహృదాని. అనేకమైన సంస్కారాలు, సంస్కృతులు, జన్మకర్మలు, జన్మల వలన ఏర్పడిన కర్మలు, కర్మల వలన ఏర్పడిన జన్మలు వీటన్నింటిని మనం గనక అర్థం చేసుకోగలిగినట్లయితే స్వామి తెలుగులో ఎందుకు ప్రసంగించారు? వాహిని స్వరూపంగా ఇవన్నీ ఎందుకు చేశారని ఆలోచించినప్పుడు నృత్యకారులు, వాద్యకారులు, క్రీడాకారులు, గాన కళాశీలులు అలాగే పెయింటింగ్ వేసేటువంటి చిత్రకారులు సకల కళలు అరవైనాలుగు కళలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఏకోన్ముఖం చేసి మనస్సుని మధురమైనటువంటి భక్తి రసాయనంలో ముంచి ఎత్తి మళ్ళీ నిలబెట్టి నడిపించి పరిగెత్తించి ఎట్లా stop not in the goal is reached అని ఒక మాట ఉంది కదా దానిని ప్రాక్టికల్ గా వివేకానందుడు ప్రపంచానికి ఉపనిషత్తులని వినిపించాడో స్వామి వినిపించకుండా వినిపిస్తూ, కనిపిస్తూ, చేయిస్తూ నడిపించారు స్వామి. చేయించటం ప్రధానం. ప్రపంచంలో వారి స్పర్శలోకి వచ్చిన వారందరూ కూడా పరిణామ స్ఫూర్తిని పొందారు. అంతకుముందు అహంకారాలు, అస్పష్టతలు, ఆభిజాత్యాలు, ప్రగల్భాలు ఉన్నటువంటి వాడు విన-వినమ్రంగా ఉంటున్నాడు. అప్పటికే వినమ్రంగా ఉన్నటువంటి వాడు వినయశీలుడు అవుతున్నాడు. వినయశీలిగా ఉన్నటువంటి వాడు పరోపకారం వైపు నెమ్మదిగా చూపు మరల్చాడు.ఆ పరోపకారములు అంటే పర ఉపకర ఇతరులకు ఉపయోగపడేటటుగా చేసే పనులు చేయటమే పరోపకారం. అంటే దానికి సేవ. దాని తర్వాత సాక్షాత్కారము అనేటువంటి ఒక విజ్ఞాన, సుజ్ఞాన, ప్రజ్ఞాన భావములలో అది ఏమిటి అని విచారణ చేసినట్లయితే జ్ఞానము నన్ను నేను ప్రపంచము నేను ఒకటే. నేను ప్రపంచమే కాదు నేను, ప్రపంచము, దేవుడు మూడు ఒకటే. "ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే" అనేటువంటి ఒక ప్రామాణిక వాక్యానికి భాష్యం చెప్పి, రచన చేసి, వాంగ్మయాన్ని సృష్టించి, ప్రపంచానికి మహోపకారం చేసినటువంటి సరస్వతీ స్వరూపం స్వామి. అలాగే ద్వైత భావంలో నేను స్వామి, నేను స్వామి, స్వామి నేను అనుకునే మనం నెమ్మది నెమ్మదిగా స్వామికి నాకు ఏమిటి తేడా అని ఒక ప్రశ్న వేసుకుని, తేడా ఉంది మనం ఏం చేసినా స్వీయమైన ఆనందం కోసం, స్వీయ తృప్తి కోసం, లాభం కోసం ఒక పరితృప్తి కోసం మనం పనులు చేస్తాం. పరమేశ్వరుడికి ఏం లేవు జాతి, మత, వర్గ, వర్ణాలు ఏమీ లేవు. ఇది ఒక మానవజాతి. కేవల మానవ జాతేనా పశు, పక్షాదులతో సహా సమస్త జీవకోటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో సర్వోత్కృష్టమైనటువంటి మానవ జన్మ గనుక మనం ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం. కానీ నోరు లేని, వాయి లేని, అభివ్యక్తం చేయలేని ఒక సాయి గీత మానవుడి కంటే ఉదాత్తంగా ప్రవర్తించడం మనం చూశాం. అది స్వామి సన్నిధిలో. తన మరణ సమయంలో శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో స్వామి ఎంత ఆర్తిగా ప్రార్థన చేసుకున్నదో మనకు తెలియదు. కొడైకెనాల్లో ఉన్నటువంటి స్వామి ఒక్క సాయి గీత కోసం వచ్చారు. వచ్చి "నేనున్నాను, నేనున్నాను" అంటూ ముక్తిని ఇచ్చారు. ఇదంతా చరిత్ర కాల్పనిక గాథలు కాదు ఇవి. మన కంటితో మనం చూశాం. స్వామి ఎక్కడికైనా బయలుదేరి ప్రశాంతిలయం నుంచి బయటికి వెళ్తుంటే వెంటనే లోపలి నుంచి బయటికి వచ్చి తన తొండాన్ని స్వామి బోనెట్టు మీద ఆపేసేది. అంటే వెళ్లద్దు అని. నువ్వు వెళితే నేను ఎలా బతకగలను అని. నువ్వు లేకుండా ఇ-ఇక్కడ నాకు ఏం పని అని. మనం అనుకోగలిగామా? మనకి దుఃఖం వస్తే ఏడ్చాం, మనకు సంతోషం కలిగితే గర్వపడ్డాం, ఆనందం కలిగితే మనమే అనుభవించాం ఎవరికీ పంచలేదు. పూర్ణ స్వార్థ స్థితిలో జీవించేటువంటి మన బోటి వాళ్ళము ఇలా ఉంటే జీవి సాయి గీత ఏం చేసింది? కడుపారా, మనసారా, హృదయం నిండా పరమాత్మను నింపుకొని కన్నీటి ధారలు కురిపించింది తన അവസാന క్షణాల్లో. పరమాత్మ తప్ప తనకి ఏమీ తిండి లేదు, ఇంకోటి ప్రపంచంలో బతకాలని లేదు. మరి ఏమున్నదంటే తను ప్రాణం వదిలే సమయంలో స్వామి నా దగ్గరకు ఉండాలి, దగ్గరకు రావాలి అంటే మరి ఎక్కడ కొడైకెనాల్లో ఉన్న స్వామి ఎలా వచ్చారంటే మనకు తెలుసు కదా "సిరికిన్ చెప్పడు శంఖ చక్రయుగమున్ చేదువై సంధింపడు, పరివారమున్ జీరడు, అభ్రగపతిన్ బన్నింపడు, ఆకర్ణికాంతర ధమిల్లము చక్కనత్తడు, వివాదప్రోద్ధిత స్త్రీకు చూపని చలాంచలమైన వీడుడు" ఎందుకని అంటే "వజప్రాణావరోత్సాహి" అయి. ఏనుగును రక్షించడమే ఆయనకు ఉత్సాహం. పరమాత్మను చూడాలనేది మన తపన, మ-మన ఆర్తి. మన హృదయ భావనలో ఒక కమ్మని ఆర్ద్రత. ఇవన్నీ కూడా జీవ, దైవ ప్రజ్ఞలు రెండు. జీవ భావము, దైవ భావము ఏకమైనప్పుడు కలిగేటువంటి ఒక సాలోక్య, సామీప్య, సాన్నిధ్య, సాయుజ్య మహాస్థితుల్ని స్వామి ఒక ఏనుగుకి అనుగ్రహించారు. స్వామి దాన్ని ఏనుగుగా చూడలా పరమాత్మ స్వరూపంగా చూశారు. అంతెందుకు మన బోటి వాళ్ళందరినీ కూడా ఎలా చూశారు ఆయన? దివ్యాత్మ స్వరూపులుగా చూశారు. అవతారమైనా మానవుణ్ణి "నువ్వు దివ్యాత్మ స్వరూపుడివి" అని అన్నదా? సుబ్బారావు, అప్పారావు ఇట్లా పేరు పెట్టి పిలిచింది అంతే. దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమాత్మ స్వరూపులారా రెండు సంబోధనల వలన మనకి ఒక స్ఫురణ ఏం కలిగించారంటే మీరు కేవలం మానవులు మాత్రమే కాదు. కేవలము మీ డిగ్రీల వలన, మీ సంపద వలన, మీ కీర్తి వలన, మీ ప్రతిభ వలన, మీ ప్రజ్ఞ వలన, మీ ఉపజ్ఞ వలన ఏర్పడినవారు కారు. మీ లోపలికి వెళ్లి చూసుకోండి. చూడగలిగితే మీరు దివ్యాత్మలు. దివ్యాత్మలుగా మానసిక భావంలో ఉండండి. సమాజంలో, కుటుంబంతో, సన్నిహితులతో, హృతులతో, ప్రపంచంతో, ప్రధానంగా దేశంతో మీరు ప్రేమాత్మ స్వరూపులుగా ఉండండి. ఇవన్నీ వాంగ్మయ స్వరూపమే. ఒక్కొక్క మాటకి ప్రమాణం ఎక్కడ ఉన్నది అంటే మన శాస్త్రాల సారమే. అవన్నీ సంస్కృతంలో ఉంటే వాటిని స్వామి చక్కగా తెలుగులో మనకి బోధన చేసి రమణీయమైనటువంటి సాయిగా మనకి దర్శనం ఇచ్చారు. అయితే ఇంకా అనేకమైన విషయాలున్నాయి. అందులో కొన్ని లోకానికి ఇంకా తెలియని విషయాలు ఇవాళ చెప్తున్నాను. ఒకటి ముఖ్యంగా, ఇందాక ఋషేంద్రమణి సంగతి చెప్పాను. ఇది చరిత్ర బద్ధమైనటువంటి ఒక సత్యం. శ్రీపాద పినాకపాణి గారు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉండటం ఆయన వృత్తి. ప్రవృత్తి ఏమిటంటే సంగీత శోధన, సంగీత ఆరాధన, సంగీత సమర్చన. అంటే అందరికీ సంగీతం పంచి పెట్టాలి. ప్రతి దానికి ఒక స్ట్రక్చర్ ఇవ్వాలి. డెబ్బై రెండు మేళకర్త రాగాలకి ఎటువంటి కట్టు కట్టాలి, ఉదాత్త అనుదాత్త స్థాయిల సంగీతాన్ని ఎలా పాడాలి, ఏది పాడితే జనరంజకము, మనోరంజకము, హృదయానందము కలిగిస్తుంది అని శోధన చేసినటువంటి వారు కర్నూలులో ఉండేవారు. ఆయన తొలినాళ్లలో స్వామి దగ్గరకు చాలా తరచుగా, ప్రధానంగా శని, ఆదివారాల్లో వచ్చి సంగీతం మీద అనేక చర్చలు చేసి స్వామితో ఆయన సమయం గడిపేవారు.ఆయన అనుకున్నారు కర్నూలు పుట్టపర్తి దగ్గరే కదా any time నేను వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేకపోయినా స్వామి బాగా తెలుసు అప్పుడు ఇంతమంది ఇంత జన ప్రవాహం లేదు నేను ఎన్ని ఎన్ని సార్లైనా వెళ్లొచ్చు అని అనుకున్నారు అనుకున్న రోజున స్వామి పాఠం చర్చ అవగానే పినాకపాణి ఇకపై మనం కలుసుకునే అవకాశం లేదు అని చెప్పారు. ఆయన ఆశ్చర్యపోయినాడు స్వామి నాకు కారు ఉంది ఏమీ ఇబ్బంది లేదు మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ వినటం చాలా సంతోషకరమైనది కదా అని అంటే లేదు లేదు అదంటే అన్నారు. మళ్ళీ ఆయన స్వామిని దర్శనం చేయలే ఆయన వంద సంవత్సరాలు జీవించినటువంటి చాలా చాలా గొప్ప సంగీత విద్వాంసుడు ఆయన సంగీత విద్వాంసుడు చిన్నమాట సంగీతాన్ని ప్రపంచానికి అందించి శిష్య ప్రశిష్యులను తయారుచేసి దాన్నంతా కూడా దైవీకరం చేసి శాస్త్ర శాస్త్రీయమైనటువంటి విధానంలో సంగీతాన్ని ఎలా అర్చన చేయాలి ఎలా పాడాలి. దేనివలన మన అనాహత నాదం వైపు వెళ్ళాలి నాదమూలాలు ఎట్లా కట్టుకోవాలి ఇవన్నీ చేసినటువంటి మహాఋషి ఆయన శంకర భగవత్పాదులు చెప్పినటువంటి సదాశివోక్తాని సపాదలక్షలయావధానాని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమే కమ్మన్యామహేమన్యతమం లయానాం ఒక లక్షా ఇరవై ఐదు వేల లయ యోగాలు ఉంటే అందులో నాదానుసంధాన యోగమే సర్వోత్తమమైనదని రెండువేల సంవత్సరాల నాడు ప్రకటిస్తే అవును నిజమే అని నిరూపించినటువంటి వారు పినాకపాణి గారు అటువంటి పినాకపాణి గారికి సంగీతంలో అనేక మెలకువలు అనేకమైనటువంటి గమకాలు అనేకమైనటువంటి పద విభజనలు వాటన్నింటిలో సస్వర సుస్వర వేద సం-సంహితమైనటువంటి ఒక నాద భూమికిని ఏర్పాటు చేసినవారు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు అంటే ఇటు సంగీతం అటు నాట్యం ఇటు రచన చూడండి పోతనగారు శ్రీ కైవల్యపదం కావాలి అని కవిత్వం రాశాడు అదే నాకు మోక్షం కావాలి అనుకున్నాడు ఆయన ఏదో కోరికగా రచన చేసిన పని చేసిన రెండవది నన్నయ్య గారు జగద్ధితం కోసం నేను ఆంద్రీకరణ చేస్తున్నాను భారతాన్ని అన్నాడు ఆయన జగద్ధితం అంటే జగాని-జ-ప్రపంచానికి ఉపయోగపడేట్టుగా హితంగా ఉండేట్టుగా అది కోరిక ఆయనకి. తిక్కన శ్రీయన గౌరినా పరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశ్శివాయ అని కొల్చెడి భక్తజనంబు వైదికజ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము కొల్చెద ఇష్టసిద్ధికిన్ అంటే శివకేశవులు భిన్నంగా లేరు రెండూ ఒకటే అనేటువంటి హరిహరాద్వైత భావనని ప్రపంచంలోకి నేను తీసుకు వెళ్ళేట్లుగా ఇది నా ఇష్టం ఇది నా కోరిక ఇది నా భావన ఇది నా సంకల్పం అని దానికోసం తిక్కన గారు రాశారు. ఆధునిక కాలంలో విశ్వనాథ సత్యనారాయణ గారు జన్మార్జకపాయమును తప్పించుటం అంటే జన్మలు ఎత్తటమనే అపాయం తప్పించుట కోసం రాముడి కథ రాస్తున్నాను అని చెప్తూ రాముడి కథ నా ఒక్కడికే కాదు నా జన్మ అపాయంతక అంటే జన్మ లేకుండా నా ఒక్కడి కోసమే రాయలేదు యదకు పురాంధ్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి గల్గినన్ సదముల బుద్ధికీన్ బహుళ శాస్త్ర రహస్య వివేకమబ్బినన్ ఉదాత్త కల్పనల మక్కువ గల్గిన విశ్వనాథ సారథి సకలార్థదాయిని సురధ్రు రామకథం భజింపుమి. రాముడి కథ నేను ఇంత సాహిత్యం నేర్చుకున్నందుకు ఇన్ని గ్రంథాలు రచించినందుకు ఇన్నిన్ని బిరుదులు సన్మానాలు గుర్తింపులు పొందినందుకు రాముడి కథే నేను రాస్తా, రాశా. కానీ దానికి మూడు conditions ఉన్నాయి మీరు చదవాలి అంటే అలా చదవండి. పురాంధ్ర సంస్కృతి భారతీయమైన ఒక సంస్కృతిని కనుక అర్థమైతే రామాయణం చదువు. మంచి విమలమైనటువంటి మాలిన్యం లేని ఒక హృదయంతో సకల శాస్త్రాల రహస్యము వివేకము నీకు కలిగినట్లయితే రామాయణం రామకథ చదువు. అవేమీ మాకు తెలియదండి మాకు సంస్కృతం రాదు భాష రాదు ఏదో మామూలు వాళ్ళం అనుకుంటే మదికి ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన మీ మనసుకు మంచి కల్పన ఆనందాన్ని కలిగిస్తే రాముడి కథ చదువు ఎందుకంటే ఇది సురధ్రువు ఇది రామాయణ కల్పవృక్షం. తర్వాత సకలార్థదాయిని సకల అర్థాలు ఏమిటి నాలుగే. నాలుగు ధర్మాలు ధర్మ అర్థ కామ మోక్ష ఇవే కదా నాలుగింటిని ఇవ్వగలిగింది రాముడి కథ సకలార్థదాయిని రామకథం భజింపుమి అంటే ప్రతి కవి ఒకటి ఒకటి కోరుతూ కోరుతూ కవిత్వం రాసుకుంటూ వెళ్లారు. శంకర భగవత్పాదులకు కోరికలు లేవు వారే సరస్వత స్వరూపం వారే శంభోర్మూర్తిః చరతి భువనే శంకరాచార్య రూప శివుడే శంకరుడై ఆచార్య రూపంలో జగత్తులోకి వచ్చాడు అని అర్థం. మరి ఆయనకు కోరికలు లేవు కోరికలు లేని వాడు కవిత్వం రాస్తే ఎలా ఉంటుందో మనకి శంకర వాఙ్మయం అంతా చెప్తుంది. సత్యసాయి వాఙ్మయం ఏం చెప్తుంది? ఇది ప్రధానమైన ప్రశ్న. వీళ్ళందరూ ఒక శంకరులు తప్ప మిగతా వారందరూ ఏదో ఒక కోరిక కవిత్వం చెప్పారు సాహిత్యం సృష్టించారు మంచి పని చేశారు లోకహితం వారు అవన్నీ చెప్పబట్టే మనం ఇవాళ ఇవన్నీ పద్యాలు అన్నీ ధారణ చేసుకోగలిగాం. స్వామి జ్ఞాని గనుక ఒక వ్యాఖ్య చేస్తే జ్ఞానం కోసం రచన చేశామన్నారు అందరూ ఒక జ్ఞాని ఒక జ్ఞానమూర్తి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే నాలుగు మహా పదాలు ఏవైతే ఉన్నాయో సత్యము బ్రహ్మ జ్ఞానము బ్రహ్మ అనంతము బ్రహ్మ అట్లాగే బ్రహ్మ అనంతము బ్రహ్మమే జ్ఞానము.బ్రహ్మమే సత్యము అంటే Eternal truth ఏదైతే ఉన్నదో నిత్య సత్య శాశ్వతమైనటువంటి సత్యం ఉన్నదో సత్యం చెప్పటానికి నేను వచ్చాను అందువలన నేను నాకు నేనే చెప్పుకున్నా మీరు ఎన్ని రకాలుగా నన్ను వర్ణించుకోండి అవి ఏవి మీ భావాలే కానీ నా భావం ఒకటుంది అదే నిజం అదేమిటంటే అహం సత్య బోధకః సత్యం చెప్పటానికే వచ్చాను నేను ఏమిటా సత్యం మీకు తెలియని మీరు అనుభవించలేని మీకు పరిచయం లేని మీరు అందుకోలేని కానీ అందుకోవలసినటువంటి ఒక ఒక సత్యం ఏమిటి అంటే నేను కూడా పరమాత్మ లో ఒక భాగాన్ని సూర్యుడి నుంచి సూర్యకిరణాలు ఎట్లా భిన్నం కావో చంద్రుని నుంచి సుషుమ్నా కిరణాలు ఎట్లా భిన్నం కావో పరమాత్మ సాయి నుంచి వచ్చిన మీరందరూ కూడా భిన్నం కాదు You, You are me, I am You. నీవే నేను, నేనే నీవు చూడండి ఎంత ఉదాత్తమైన అద్వైత భావాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరిస్తూ పద్యాలు సుమారు ఏడు వందల డెబ్బై నాలుగు పద్యాలలో భారతీయమైనటువంటి దాన్ని అంటే భారతీయమైనటువంటి ఒక భావనా శక్తిని స్ఫురణని అందించి దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని వెతక్కండి దేవుడనగా వేరు దేశమున లేడు తాను చేయు పనుల యందు తగిలు గురువు కావాలి అంతరంగము కన్నా జాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమ గురువు గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుడే అట్లాగే You are me, I am You అంటూ నేనే పుష్పము నీవే సౌరభము తండ్రీ లోక లోకాంతర ప్రాణము అంటే లోక లోకాంతర ప్రాణాలు ఎక్కడున్నాయంటే నీవు నువ్వు గనక పువ్వైతే నేను తావిని నేనే పుష్పము నీవే సౌరభము తండ్రీ లోక లోకాంతర ప్రాణముల్ పలు రీతులుగా అనేక విధాలుగా పలు దళాలుగా వికసిస్తూ ఉంటే నువ్వు నేను కలిసి ఈదే నేనైపోయెదను తంత్రీ నాద రమ్యాకృతిన్ వీణ దానిలో ఉన్న తీగలు తీగలలో దాగిన నాదము ఎట్లాగైతే కలిసి ఉన్నాయో జీవుడిగా ఉన్న నేను దేవుడిగా నువ్వు లేదు దేవుడిగా ఉన్న నేను జీవుడిగా కనిపిస్తున్న నీవు భిన్నం కాదని ఒక అభిన్న అద్వైత రమణీయ స్థితినే దీన్ని చక్కగా అర్థం చేసుకొమని అనేక విధాలుగా బోధించినటువంటి స్వామి సాహిత్యాన్ని మనం చదవాలి Sathya Sai speaks volumes అందరి దగ్గర అవి లేని భక్తుడు లేడు కానీ చదివిన భక్తుడు కూడా లేడు ఇదే సత్యం చదవకుండా అవి showcase లో పెట్టుకున్నట్లయితే ఏమి ప్రయోజనం ఏం చెప్పారు ఒక భగవంతుడు జగత్తులోకి మానవ వేషం చేసుకొని వచ్చి వేసుకొని వచ్చి ఇదిగో ఇది ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా అంటూ చెప్తూ వెళ్ళినప్పుడు ఆత్మారామం వంటి ఒక మహోత్కృష్టమైన గ్రంథాన్ని అతి పిన్న వయసులో రచించి ఉపన్యసించి దాన్నంతా విపులీకరించి విస్తృతం చేసి అటువంటి స్వామి చిన్న వయసులో ఆత్మారామం రాసి వయసు వస్తున్న కొద్ది ఉపన్యాసాల్లో చిన్న చిన్న చిన్న కథల ద్వారా అంటే ఉప-ఉపకథల ద్వారా తాను చెప్తున్నటువంటి విషయానికి bracing అంటాం దానికి ఒక పటిష్టతని ప్రామాణ్యతను ఆపాదించి భారతీయ ఆత్మని అధ్యాత్మ శక్తిని ప్రపంచానికి చాటుతూ వెళితే చిన్న కథలు దాటిన తర్వాత ముందు పద్యాలు చిన్న కథలు తర్వాత ఉపమానాలు తర్వాత ప్రబోధాలు తర్వాత ప్రసారాలు ఎన్ని రకాలుగా భారతీయ వాంగ్మయాన్ని అందునా అచ్చ తెలుగులో ఇది మనందరం తెలుగు వాళ్ళం గర్వించదగినటువంటి విషయం తెలుగునాట వచ్చినటువంటి ఏకైక అవతార మూర్తి అటు తమిళనాడు ఇటు కర్ణాటక ఇటు ఆంధ్రదేశం వీటన్నింటికి కూడలి త్రికూట స్థానం అది పుట్టపర్తి పుట్టపర్తిలో సత్యసాయి భగవానుడు సాగించినటువంటి మహా వాంగ్మయ సాంగత్యం అనండి వీటన్నింటినీ గమనించినప్పుడు సరస్వతి శబ్ద స్వరూపంగా వచ్చింది శబ్ద స్వరూపమే తెలుగు నుడికారంతో నాకు బాగా తెలుసు బొంబాయి వచ్చారు స్వామి కమాని ఆడిటోరియంలో స్వామి ఉపన్యసిస్తున్నారు కస్తూరి గారు translate చేస్తున్నారు రోజుల్లో స్వామి తెలుగు నుడికారంలో ఒక పదం వాడారు అంటే రోజుల్లో రోజుల్లో ఇంకా అవినీతే జీవితం అయిపోయింది అది వేరే సంగతి రోజులలో అవినీతి పెచ్చరిల్లి పోతున్నటువంటి అప్పుడు లంచాలు అందరూ కూడా అశాంతం పైనుంచి కింద దాకా జాతిని నడిపిస్తున్నప్పుడు స్వామి తెలుగులో మాటన్నారు "ఇచ్చేవాడు ఉంటే చచ్చేవాడు కూడా లేచి వస్తాడు" అన్నారు ఇవి అచ్చ తెలుగు పదాలు కస్తూరి గారు దాన్ని translate చేయకపోయినారు స్వామి మామూలుగా అయితే మాట అందించేవారు కానీ అక్కడున్న audience తెలుగు వాళ్ళు గారు మాత్రమే కాదు బెంగాలీలు ఉన్నారు యూపీ వాళ్ళున్నారు అందుకని పోనీలే దాన్ని తర్వాత లంచాలు మంచివి కాదని చెప్తున్నాను అన్నారు అదే చెప్పారు అంటే తెలుగు సామెతలు తెలుగు నుడికారాలు దేశీయాలు పద ప్రయోగాలు ఎక్కడా కూడా స్వామి దానిని మార్చలేదు కాపాడారు తెలుగు భాషను కాపాడారు తెలుగు భాషలో రామాయణ-రామాయణాన్ని రామకథా రసవాహినిగా రాశారు భాగవత వాహిని రాశారు మనందరికీ పేర్లన్నీ తెలుసు కానీ ఒకటే ఒక పరమాత్మ ఆంధ్రదేశంలో తెలుగునాట వచ్చి ఆంధ్ర వాంగ్మయాన్ని అంటే తెలుగు వాంగ్మయాన్ని అధ్యాత్మతో ముడివేడుతూ పురా సంస్కృతికి ముడివేడుతూ గతించిన కాలాలకి వేదాలకి సమన్వయం చేస్తూ చేసినటువంటి దివ్య ఉపన్యాసాలు రోజుకు ఒక్కటి విన్నా జీవితం ధన్యమైపోతుంది మా స్వామి చాలా బాగా చెప్పారు అంటారు బాగా చెప్పడం important కాదు ఏం చెప్పారు ఎందుకు చెప్పారుఆ తర్వాత ఎలా చెప్పారు? ఇది మనం ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి రమణీయ-రమణీయార్థ ప్రతిపాదికమైనటువంటి భాషలో, తెలుగు భాషలో వారు-- స్వామి అంటారు తెలుగు భాషకి తెలుగుదేశంలో అంటే తెలుగునాట ఏమిటి అంటే ఓంకార స్వరలీనమై నిగమ నాదోపాసనాధీనమై కైంకర్య ప్రతిపాజ్యమై భువన రక్షా దీక్షమై తాండవాహంకార-- తాండవాహంకార స్థితచంద్రమైనటువంటి ఒక భావన కలగాలి అంటే తెలుగునాట మూడు వైపుల నుంచి కూడా గాలి, గాలిలో ఓంకారం మిళితమై ఉంది. అటువంటిది భాష. భాషలో సుసంపన్నమైనటువంటి యాభై ఆరు అక్షరాలున్నాయి. అవి పంచాశత్ స్వర్ణ-వర్ణమైనటువంటి అంటే బంగారు అక్షరాలవి. అంటే బంగారము అంటే చైతన్యము అని అర్థం. చైతన్యము అంటే శుద్ధ చైతన్యము అని అర్థం. శుద్ధ చైతన్యము అంటే ఆత్మ అని అర్థం. ఆత్మ అంటే పరమాత్మ అని అర్థం. కాబట్టి అనేకమైనటువంటి స్థాయిలలో చిన్న కథ చెప్పినప్పుడు చిన్న పిల్లలకు అర్థమైంది. యువతీ యువకులకు చెప్పినప్పుడు వాళ్ళకి మార్గోపదేశనం చేశారు స్వామి. ఎందుకు సంపదని, శరీరాన్ని, వయస్సుని, ఆయుష్షుని ఎందుకు వృధా చేసుకుంటారు? భగవంతుడు మీకు రెండు కళ్ళు ఇచ్చాడే, ఎందుకు ఇచ్చాడు? ప్రకృతిని చూడమని ఇచ్చాడు. రెండు కాళ్ళు ఇచ్చాడే, ఎందుకు ఇచ్చాడు? దేవాలయం వైపు యుక్తాహార విహారస్య ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మాత్రమే వెళ్ళటం కోసం అని అంటూ సందులు గొందులు తిరుగుటకా అన్నారు. సందు సందు సందర్భం లేకుండా వెళ్ళటం, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవటం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవటం ఇది మానసికమైనటువంటి ట్రైనింగ్ లేని వాడు చేసే పని గనుక మీ మనస్సుని పరమాత్మ భావన యందు లగ్నం చేయండి. వాంగ్మయం చదవండి. తర్వాత స్వామి ఉపన్యాసాలలో శంకరులు వస్తారు, రామకృష్ణ పరమహంస వస్తారు, రమణ మహర్షి వస్తారు, వివేకానందుడు వస్తారు. ఇవన్నీ కూడా ప్రస్తావన చేస్తూ చేస్తూ ఉపన్యాసం చెప్తారు. ఎందుకు చెప్పారంటే వాళ్ళందరూ మనకంటే భిన్నంగా లేరు. విషయాన్ని మనందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతి చెప్పారు. అన్ని రీతులను గమనించండి. All gurus are one but all are not gurus. మనం చూడండి ఒక false guru వైపు మనం వెళ్ళిపోతాం. మనమంటే మీరు నేను కాదు, వెళ్ళి-వెళ్ళిన వాడి సంగతి. false guru మనకెందుకు? guru అక్కడున్నాడు కదా! చూసి-చూసినందువలన మనకు వచ్చే లాభం ఏంటి? దర్శించాలి. ఊళ్లో ఒక మహాత్ముడు వస్తాడు, పెద్దాయన వస్తారు. మన చుట్టం వస్తాడు. చుట్టం దగ్గరికి చూట్టానికి వెళ్తాం. చూట్టాన్ని దర్శనం చేయం. మహాత్ముడు వస్తాడు, దర్శనం చేయాలి. ఏం దర్శనం చేస్తావ్? వెళ్లి అక్కడ ఏం చేస్తావ్? అంటే ఆయన్ని నేను కూడా చూసి వచ్చానని చెప్పడానికి చూస్తాం. కావలసింది అది కాదు. వారు వచ్చినటువంటి ఆయన పని మీద వచ్చారు, ఏం చేస్తున్నారు, మనం మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేటువంటివన్నీ కూడా స్వామి దివ్యోపన్యాసాలు. ఇంగ్లీషు రాని వాడికి, హిందీ తెలియని వాడికి అక్షర తెలుగులో ఒక భగవంతుడు మాట్లాడినటువంటి volumes అన్నీ కూడా చదవాలి. అవి మనకోసమే చెప్పారు. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం వల్ల అవన్నీ మనకు దక్కినాయి. పోతనగారి గుంత ఎలా ఉంటుందో మనకు తెలీదు. నన్నయ్యగారు ఎలా మాట్లాడేవారో తెలీదు. వ్యాసుల వారి కంఠధ్వని మనకు తెలీదు. కానీ సత్యసాయి భగవానుడి యొక్క కంఠధ్వనిలో స-సాంస్కృతికమైన సంగీతము, సాహిత్యము సమ్మిళితమైన, సనూతనమైన, ఆధునికమైన, సమకాలీనమైన, సంపూర్ణమైన, సమగ్రమైన, సమ్యక్ భావనా స్వరూపంగా స్వామి వాంగ్మయాన్ని రమణీయంగా ప్రతిపాదన చేశారు. ఒక రోజా, రెండు రోజుల-- డెబ్బై రెండు సంవత్సరాలు. పద్నాలుగవ ఏట నుంచి డెబ్బై రెండు వరకు. ఒక చిన్న సంఘటన కూడా మీకు చెప్తాను. సంఘటన ఏంటంటే అరవై ఒకటవ బర్త్డే నేను స్వామి దగ్గర ఉన్నాను, వెళ్ళాను. స్వామి-- అది సాయంకాలం పూట. నేను అక్కడే ఉన్నాను. స్వామి అన్నారు, "నువ్వు కూడా లోనికి రా" అన్నారు. లోనికంటే పూర్ణచంద్ర ఆడిటోరియంలోకి. అక్కడ ఏమో ఏం జరుగుతున్నదో నాకు తెలీదు. కానీ స్వామి పిలిచారు, వెళ్ళాం. స్వామి వచ్చి వారి సింహాసనంలో వారు కూర్చున్నారు. కుడి పక్కనే నన్ను కూర్చోమన్నారు. పక్కనే కుర్చీ పక్కనే కింద కూర్చున్నాను. నా ఎడమ పక్కన సినిమా నటుడు కాంతారావు అని ఉండేవారు. ఆయన-ఆయన కూర్చున్నారు. స్వామి కూర్చున్నారు. ఇంతలోగా కర్టెన్ పక్కకి తొలిగింది. శంకర వాంగ్మయం, శంకరుల జీవిత చరిత్రని స్వామి స్వయంగా నాటకం రాశారు. దేనిలో రాశారు? సంస్కృత భాషలో రాశారు. దానికి direction చేశారు స్వామి. కనుక స్వామి ప్రదర్శన ఎలా ఉందో చూద్దామని వచ్చారు. నేను ఇక్కడ అప్పటికి వయసు చిన్నది కాబట్టి స్వామి మాట్లాడుతూ మాట్లాడుతూ, "అదిగో నటుడు బాగా చేస్తున్నాడా? శంకరాచార్యులవారు కరెక్టుగా సంస్కృతం పలుకుతున్నారా? రచనంతా-- అది నేను చేశానని చెప్పలే చివరి వరకు ఎవరికీ తెలీదు. రచన బాగుందా? దీనిలో ఏమైనా లోపాలున్నాయా? చెప్పవలసింది అంతా చెప్పటం జరిగిందా?" అని చెప్తూ ఉన్నారు. ఇంతలోకే నేనేం మాట్లాడలేదు. మౌనంగా స్వామే మాట్లాడుతున్నారు, మనం వినాలి. అక్కడేం మాట్లాడేది కాదు. అది ప్రదర్శన అవుతున్నది. సరే ఈయన సినిమా యాక్టర్ కాంతారావు ఆయన ఏమన్నారంటే, "స్వామి ఇది తెలుగులో కూడా రాస్తే బాగుంటుంది కదా" అని అన్నారు. స్వామి నవ్వుతూ "శంకరాచార్యుల వారి సమయంలో తెలుగు లేదు, ప్రచారంలో లేదు. అప్పుడున్న సంస్కృత భాషలోనే మనం చెప్పాలి. పిల్లలకు ముందు సంస్కృతాన్ని నేర్పాలి. వాళ్ళు సంస్కృతాన్ని నేర్చుకో, వ్యాకరణం నేర్చుకుంటే వాళ్ళకిష్టం ఉండదు. వాడి చేత శంకరుడి వేషం వేయించి వాడితోనే సంస్కృతం మాట్లాడిస్తే నెమ్మదిగా వాడు సంస్కృతం వైపు నడిపిస్తాడు, ఆహ్ జీవితాన్ని. సంస్కృతం లేకపోతే సంస్కృతి లేదు. సంస్కృతి లేకపోతే సంస్కారం లేదు. సంస్కారం లేకపోతే భావం లేదు. భావం లేకపోతే భాష లేదు. భాష లేకపోతే మనిషే లేడు. ఎందుకంటే ఒక మనిషిOnly human being is endowed with the power of discretion and reasoning. He alone can speak. మిగతా మాట్లాడగలిగినవి మిగతా సృష్టిలో ఎనభై మూడు లక్షల తొంబై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది జీవరాశులలో మాట్లాడగలిగినది కేవలం మానవుడే. దీనిని వృధా చేసుకోకుండా మధురమైనటువంటి భావనా స్థితిలో స్వామిని తలుచుకుంటూ వాంగ్మయాన్ని చదువుకుంటూ వెళ్ళాలి అని చెప్తూ చెప్తూ స్వామి ఇంకో పని చేశారు. పని ఏంటంటే summer showers అవుతున్నటువంటి అంటే బెంగళూరులో white field లో స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి రచన భజగోవిందం శంకర భగవత్పాదుల రచన. అదే మోహముద్గర అంటాం అదే భజగోవిందం. భజగోవిందం మొత్తాన్ని తెలుగులో translate చేశారు స్వామి. అంతేకాదు దానికి స్వరపరిచారు. అంతేకాదు స్వయంగా పాడారు, పాడించారు. మనం ఎవరో పాడితే వింటున్నాం. మనం పాడింది లేదు, మనం రాసింది లేదు, మనం చేసింది లేదు. వీటన్నింటికీ కష్టమైపోతున్నది మరి ఇంత మహా సామ్రాజ్యాన్ని సృష్టించిన స్వామి అందరికీ ఉన్నట్టే ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి ఆయనకి ఇరవై ఏడో గంట లేదు. అనేక మందిని ప్రతిరోజూ కలుస్తూ వాళ్ళ వాళ్ళ ఆర్తి దుఃఖాన్ని తీరుస్తూ తీరుస్తూ వెళుతూ ఉంటే స్వామి ఎప్పుడు ఇవన్నీ రాశారంటే చేయాలి అనుకుంటే ఇరవై నాలుగు గంటలు మనం చేయాలి. ఎందుకంటే జాగ్రత్ అవస్థలో కళ్ళు, కాళ్ళు, కీళ్ళు పనిచేస్తున్నప్పుడే చేయకపోతే అవన్నీ పనిచేయననాడు ఏం చేయగలము? కళ్ళు కనపడకపోతే సృష్టిని ఎలా చూడగలం? చెవులు వీణుల విందుగా సంగీతాన్ని, మాధుర్యాన్ని పరమాత్మ గురించినటువంటి విషయాలను తెలుసుకోకపోతే చెవులు ఉండి ఏమి ప్రయోజనం? వినపడననాడు శంఖాన్ని ఊదినా వినపడదే. పళ్ళు రాలిపోతే ముదిమ వయసులో శంకర అని కూడా అనలేదే శంకర అంటామే. దంతమ్ముల్ పడనప్పుడే తనువు నందారూఢి యున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే కురులు వెల్లవెల్ల కానప్పుడే చింతింపన్ బలెని పదాబ్జములన్ శ్రీ కాళహస్తీశ్వరా! అంటే యవ్వన దశ మళ్ళీ రాదు. దేనికి? యోగానికి రాదు. భోగానికి పరిమితమైతే యోగము లేదు భోగము వలన రోగము వస్తుంది తప్ప యోగం రాదని అతిమానుషమైనటువంటి అనేకమైనటువంటి ఇంద్రియాలను సంకల్పం చేసుకొని మనస్సును నియంత్రించుకొని చిత్తైకాగ్ర స్థితిని సాధించుకొని వాంగ్మయాన్ని అధ్యయనం చేసి ప్రధానంగా తెలుగు భాషను నేర్చుకొని ఎందుకంటే తెలుగు భాషలో ఒక పద్యాన్ని చదివితే ధారణ పెరుగుతుంది. ధారణ పెరిగితే మంచి మంచి విషయాలు గుర్తుంటాయి. ధారణ పెరిగితే మంచి విషయాలు నలుగురికి చెప్పగలుగుతాం అని స్వామి చెప్తూ రోజున అదే అల్లసాని పద్దన ఒక పద్యం రాశాడు కదా అటా అని ఆగారు స్వామి. నేనున్నాను స్వామి పక్కన. అంటే ఆయన hint ఇచ్చారు. పద్యం ఎక్కడ ఆయనకు తెలియదని కాదు, గుర్తు లేదని కాదు. అటదని కాంచ భూమి సురుడంబర చుంబి శిరః సరజ్జరీ పటల ముహుర్ముహుర్నట దభంగ తరంగ మృదంగ నిశ్శబనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము కటక చరత్కరేణు కరకంపిత శాలము శీత శైలము. ఎలా అల్లసాని పద్దన హిమాలయాలకు వెళ్ళి ఇవన్నీ రాశాడా? తాను ఉన్నచోట ఎక్కడో విజయనగరం హంపీ దగ్గర కూర్చున్నాడు. అంటే కవి క్రాంతదర్శి అవుతాడు. కవిత్వము అబద్ధాన్ని అందంగా చెప్తుంది. అధ్యాత్మ సత్యాన్ని నిష్కర్షగా చెప్తుంది. ఎన్ని మాటలు ఎన్ని మాటలు! మాటలన్నీ రతనాల మూటలుగా నేను భావన చేసి స్వామిని సరస్వతీ స్వరూపంగా వారి వారి కొన్ని పద్యాలు మనము ధారావాహికలో నవంబరు చివరిదాకా నాకు విరామం లేదు గనుక, విశ్రాంతి లేదు గనుక డిసెంబరులో ఏదో ఒక రోజు నిర్ణయించుకొని, నియమం ఉంది సోమవారం తప్ప అని. సోమవారం వదిలేస్తాం. మిగతా ఏదో ఒక రోజులో date నిర్ణయించుకొని స్వామి సరస్వతీ స్వరూపంగా పద్యాలు ఏమి చెప్పారు, ఎలా చెప్పారు, వాటిలలో ఏం బోధ చేశారు, అసలు తానేమిటో ఎలా చెప్పారు, తాను ఎందుకు వచ్చారో చెప్పారు, తన మూలాలు చెప్పారు. వాటన్నింటినీ కూడా మనం ఆహ్ వాటిని వినాలి, చక్కగా అర్థం చేసుకోవాలి. ఆహ్ ఒక-ఒక link లో స్వామి ఎదురుగా స్వామి పద్యాలను విశ్లేషిస్తూ చేసినటువంటి ఒక link నేను చేసింది ఎవరి దగ్గర ఉంది నా దగ్గర లేదు. అది బహుశా నేను సంపాదించి మీకు ఈ-ఈ శీర్షికలో భాగంగా దాన్ని పంపించే ఏర్పాటు చేస్తాను. నా దగ్గర ఏం ఉండవు నావి. దాన్ని ఒక వారం మీరు చక్కగా దాన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే స్వామి చెప్తారు, ప్రపంచంలో ప్రతి వాడు ముప్పై పేజీల పుస్తకం రాసిన వాడు copyright అంటున్నాడు. పోతనగారికి copyright ఉందా? వాల్మీకికి ఉందా? వ్యాసుడికి ఉందా? వాళ్ళేమైనా డబ్బు సంపాదించారా? అన్నప్పుడు నేను కూడా రచన అయినా, మాట అయినా right to copy. You can always copy it. ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ వాళ్ళు చెప్పినవే. వాళ్ళు ఎందుకు చెప్పారంటే ఇలా చెప్పుకోండి, మనస్సుని స్వాదువుగా చేసుకోండి, మనస్సుని పరిపాకం చేసుకోండి, మనస్సులో రాగద్వేషాలు ఉంటాయి, అక్కర్లేని కోరికలు, ఆలోచనలు పుడుతూ ఉంటాయి, లోభ మోహాలు ఉంటాయి, పరిగ్రహం ఉంటుంది దాన్ని అపరిగ్రహం చేయండి. ఎందుకంటే Don't accept any gift. ఇది స్వామి devotees మధ్యలో రోజుల్లో. Every gift will lead to a rift అన్నారు. అది. వాడు ఇచ్చాడు నేను ఇవ్వాలి, నేను ఇచ్చాను వాడు ఇవ్వాలి. ఇదొక అంతులేని కథ. కాబట్టి వాంగ్మయం ద్వారా స్వామి నీతిబోధ, జాతిబోధ, పుణ్యబోధ, పవిత్రబోధ, వాంగ్మయబోధ, అధ్యాత్మబోధ లోలోతులకు వెళ్ళి లోనారసి. అనేకంగా లోపలికి వెళ్ళి మనందరినీ వె-వెతకండి. సముద్రం ఒడ్డున నుంచుని నువ్వు ఎన్ని గంటలు నుంచున్నా నత్తగుల్లలు మాత్రమే బయటికి వస్తాయి. నీకు ఒక్క ముత్యం కావాలి అంటే మొలలోతుకి మొలచుట్టూ కూడా ఇటుకలు కట్టుకొని నీళ్ళల్లో దిగాలి.నీ బరువు plus ఇటుకల బరువు వల్ల నువ్వు లోపలికి దిగుతావు. లేకపోతే తేలిపోతావు. దిగిని-దిగిన మరుక్షణం వాడు ఏం చేస్తాడంటే, మొలక చుట్టూ కట్టుకున్నటువంటి ఒక్కొక్క ఇటుకని వదిలేస్తాడు. బరువుని తేలిక చేసుకుని అలుముచ్చల్ని, చిప్పల్ని బయటికి తీస్తాడు. ఒక వందో తీస్తాడు. నాలుగో, ఐదో ముత్యాలు దొరుకుతాయి. కాబట్టి ఎంత కఠోర శ్రమ చేస్తేనో, ఎంత ఆలోచన చేస్తేనో, మేధాశక్తికి ఎంతగా పదును పెడితేనో మనకి ఒక్క ముత్యమైనా దొరకదు. అటువంటిది రత్నాకరుడైనటువంటి, కరుణాసాగరుడైనటువంటి, అనంతకోటి స్వరూపాల నిక్కమైన అక్షరూపమైనటువంటి ఒక సత్య సాయి భగవానుడు అనుగ్రహించిన మహా వాంగ్-వాఙ్మయ మధనంలోకి మనందరం కూడా ఆసక్తితో, అనురక్తితో, భక్తితో, ప్రేమతో, గౌరవంతో అన్నింటికంటే సత్యాన్ని తెలుసుకునేటువంటి ఆత్మాన్వేషణలో మనందరం కూడా సాయి రమణీయం అనేటువంటి భావనా చరి స్వామి అనుగ్రహించిన ఒక అపురూప వరంగా భావిస్తూ అన్ని సత్సంగాల కంటే భిన్నంగా, అనేక ఆలోచనా రీతుల కంటే భిన్నంగా శీర్షికన నడవబోతున్నటువంటి ప్రయోగాత్మకమైన, యాదార్థికమైన కార్యక్రమానికి స్వామి యొక్క దివ్య అనుగ్రహం, ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని, వారి కరుణ మహామృత వృష్టి వలె కురియాలని అందు మనందరము కూడా తప్తమై అంటే నీళ్ళల్లో తప్తం ఎలా అవుత-తప్తం అగ్నిలో కావాలి. అంటే జ్ఞానాగ్నిలో మనల్ని దగ్ధం చేసుకుంటూ మన భారతీయమైనటువంటి మూలాలని వెతుక్కుంటూ లోలోపలికి వెళ్ళాలని అటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు మనకు అనుగ్రహించాలని నేను మనసా, వచసా, శిరసా స్వామిని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సాయిరాం!
YouTube · audio

Satsang on sai ramaneeyam on 25102025

Home

Satsang on sai ramaneeyam on 25102025

Source: Aham Sathya Bodhaka on YouTube

0:00 / 1:13:32

More in this series

Aham Sathya Bodhaka — anniversaries & satsangs

4 episodes · 5 hr 53 min

  1. 1 hr 21 min 1

    ASB 4th Anniversary Satsang on 29062024

  2. 33 min 2

    Asb 700 Days Interactive Session With Devotees

  3. 1 hr 11 min 3

    ASB 5th Anniversary Celebrations & Sri S Koteswara Rao garu satsang

  4. 1 hr 9 min 4

    Satsang on sai ramaneeyam on 25102025

    Now playing