No transcript for this section.
Transcript begins at 0:00.
పదహారు వ ఏట సమస్తాన్ని వదిలిపెట్టి తాను ఉన్నటువంటి ఊరు వదిలిపెట్టి అరుణాచలం తిరువణ్ణామలై చేరుకున్నాను. తిరువణ్ణామలై చేరుకొని వారు వెళ్లి అరుణాచలాన్ని గిరిని కౌగలించుకోలే. ముందు దేవాలయంలోకి వెళ్లారు. అరుణాచలేశ్వరుడి యొక్క లింగాన్ని ఆలింగనం చేసుకున్నారు. తండ్రీ! నీ ఆజ్ఞ ప్రకారం వచ్చేసాను ఇకపై నీ ఇష్టం అన్నారు. అది శరణాగతి అక్కడ పొందారు. అంటే సాక్షాత్తు ఒక ధ్యానమూర్తి అయినటువంటి రమణుని కూడా శబలోపాసనతో ప్రారంభమైంది. కేవలం శబ్దం అరుణాచల అన్న పదం ఆయన్ని అరుణాచలానికి లాక్కొచ్చింది. వెళ్తున్నే అంటే దేవాలయాలలోకి ఎవరో నడిపించినట్టుగా వారు వెళ్లారు. నీ ఆజ్ఞ ప్రకారం వచ్చేసాను ఇకపై నీ ఇష్టం అన్న తర్వాత తనకు ఇష్టం, అయిష్టం అంటూ వదిలేశారు. దొంగతనాలు వదిలేశారు. ప్రపంచ భావన వదిలేశారు. ఏది దాని ఏది పోని తన దేహంతో మొదలు పెట్టారు. ఎట్లా ఉన్నా తాను ఆత్మగా అఖండంగా నిలు Gొన్నారు. ఆ తర్వాత వారు అరుణాచల ఆ గిరిని కొండను చూశారు. ఆ కొండలో వారికి ఈశ్వర దర్శనం అయింది. ఆ ఈశ్వర దర్శనం ఆ నిర్గుణమైనటువంటి కొండ గదా! దానికి రూపమేం లేదు. ఏదో ఆకారముంది దానికేం ప్రత్యేకమైన ప్రతిమ కాదది. అందుకనే వారు అక్కడ అక్షర మణమాల చదువుతూ. మణమాల అంటే కళ్యాణమాల. కళ్యాణమాల అంటే జీవుడికి పరమాత్మకి ఉన్నటువంటి ఒక సంబంధం. ఒక గురువుకి ఒక శిష్యుడికి ఆత్మ ప్రకారం జరిగేటువంటి బంధమే నిజమైనటువంటి కళ్యాణం. మిగతా కళ్యాణాలన్నీ ఉంటాయి పోతాయి. కొన్నాళ్ళు నడుస్తాయి. కొన్నాళ్ళు నడవవు. దారిలో అనేక యాతనలున్నాయి, బంధనాలున్నాయి. అవన్నీ ఆ అవస్థలన్నీ వ్యవస్థలో ఇమిడి ఉంటాయి కాబట్టి వాటి దోలికి వెళ్ళకుండా ఇక్కడ ఈ మణమాలలో మొట్టమొదటిగా వారు అన్న మాట ఏమిటంటే, అరుణాచలమును చూస్ స్మరించు వాడల అహము నిర్మూలింపు అరుణాచలా. ముందు నా అహం నేను, నేను రమణుడిని లేదా నేను వెంకట్రామణి, నేను ఫలానా అనే అహం వదిలిపెట్టవయ్యా! దాన్ని వదిలిస్తే తర్వాత నేను గురించి ఆలోచిస్తానన్నారు. కాబట్టి మనకు కావలసిన స్థితి ఏమిటి అంటే అహమును వదిలిపెట్టాలి. దీన్ని సత్యసాయి బాబా వారు మన స్వామి అహంకారముండరా గురువు చిక్కడు, గురువు చిక్కరా అహంకారముండదు. చాలా స్పష్టంగా very clear. నేను, నేను, నేను అన్నంత కాలం గురువు నీ దగ్గరకు రాడు. వచ్చినా వాడు నీకర్థం కాడు. కానీ నువ్వు అహాన్ని నెమ్మదిగా వదిలిపెడుతున్నటువంటి వేళ గురువు తనంతట తాను నీ జీవితంలో ప్రవేశించి నీతో పాటు ఉంటాడు. ఆ గురువు చిక్కిన తర్వాత ఇంక మనమేమున్నాం. మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోతాం. ఆయన ఆవరణలోకి వెళ్ళిపోతాం. చూడండి మనం ఇంటి దగ్గర ఉన్నంత సేపు ఇంటి భావంతో ఉంటాం. మనం స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మన మనసు మన అధీనం కాదు, వారి అధీనంలో ఉంటుంది. వారి అధీనంలో ఉంటుంది గనుకనే అక్కడ మదానందాన్ని పొందుతాం. కానీ మళ్ళీ బయటకు రాగానే మళ్ళీ మన అధీనంలోకి తెచ్చుకుంటాం. కాబట్టి ఈ రెండింటిని సమన్వయం చేసుకోవటానికి ప్రప్రథమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ధ్యానం. నిత్య ప్రార్థన. దీన్ని స్వామి మనకిచ్చినటువంటి ఆ తొమ్మిది భక్తి మార్గాలు సాధన మార్గాల్లో మొట్టమొదటిది నిత్య ప్రార్థన, ధ్యానం అని చెప్పారు. నిత్య ప్రార్థన ఇది సాయంకాలం చేస్తున్నాం భజనగా కానీ ధ్యానం మనం ఏం చేయటం లేదు. అంటే ధ్యానంలో ఉండటం లేదు. ధ్యానం అంటే మళ్ళీ చేయటం కాదు. ధ్యానం అంటే నీలో నీవు ఉండగలిగితే దాని పేరు ధ్యానం. నీతో నీవు ఉండగలిగితే దాని పేరు యోగం. ఈ రెండింటికీ అర్థం అంతే. మనలో మనం ఉండాలి. మనం ఆ తెల్లవారు జామున లేచినప్పుడు ఆ గురు స్మరణ చేస్తూ కాసేపు కనుక మనసుని open గా ఉంచుకున్నట్లయితే అనేక ఆలోచనలు ప్రవాహ వేగంతో వస్తాయి. మళ్ళీ అవి మరణించి వైదొలగి వెళ్ళిపోతాయి. కాసేపు అయిన తర్వాత మనసులో ఏ ఆలోచనా పుట్టటం లేదు. ఇంకొద్దిసేపు అయిన తర్వాత ఆలోచనలు మళ్ళీ పుడతాయా? పుట్టవా? ఏమైపోతుంది? అన్నటువంటి ఆలోచన రాగానే మళ్ళీ ఆలోచన మొదలు. చూశారా ఆ ఆలోచన రాని స్థితి, ఆలోచన రాహిత్యం మనకున్నప్పుడు మనలో ఉన్నటువంటి సర్వాణువులు రెండు లక్షల ముప్పై రెండు వేల యోగనాడులు, మనలో ఉన్న కోటానుకోట్ల కణాలు, మనలో ఉన్నటువంటి సర్వ ఇంద్రియాలు, సర్వ అవయవాలు అన్నీ కూడా ఒక తేజోమయమైనటువంటి ఒక భావంలో శక్తివంతమై మళ్ళీ నిత్య నైమిత్తిక కార్యక్రమాలలోకి నా శరీరాన్ని ప్రవేశపెట్టుకోవటానికి ఇంద్రియాలు పరమ పటిష్టంగా, స్పష్టంగా, గంభీరంగా, ఉదాత్తంగా, ఘనంగా, విస్తృతంగా, చాలా హాయిగా ఆ ఇంద్రియాలన్నీ కూడా పనిచేయటం మొదలు పెడతాయి. కాబట్టి ఇవాళ ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఎవరైనా నిజంగా ఏదో ఒక ఉపన్యాసం విషయం తెలియటానికి కాకుండా ఎట్లాగూ ఆ ఇంకో ఇరవై నాలుగు గంటల తర్వాత కొత్త సంవత్సరం రాబోతున్నది. కనీసం రేపు వదిలేసి విశ్రాంతి తీసుకుని జనవరి ఫస్ట్ నుంచి మనం గనక తెల్లవారు జామున ఇలాంటివన్నీ ఈ మాటలు తొట్ట తొలి మెట్టుగా అలారం పెట్టుకోండి. కరెక్ట్ గా ఐదు గంటలకి, నాలుగున్నర గంటలకి లేవండి. నాలుగున్నర నుంచి ఐదు గంటల వరకు మీ సమయంగా మీరు పెట్టుకోండి. స్త్రీలైనా, పురుషులైనా అది మీ సమయం. ఆ సమయంలో కుటుంబం లేదు, భార్య లేదు, భర్త లేదు, పిల్లలు లేరు, ఏమీ లేదు. అసలు ఏమీ లేదు. అదే పరిపూర్ణత్వం. గురువు దగ్గర గురువు ఏమీ ఉండదు ఆయన దగ్గర. కానీ ఆయన పరిపూర్ణుడు. గురువు దగ్గర అన్నీ ఉంటాయి. కానీ ఆయనకేం అక్కర్లేదు zero. చూశారా?ఈ పూర్ణ శూన్యత లో ఒక గురువుకు మాత్రమే కాదు మనం కూడా దాట సాధించుకోవాలి గనుక ఒక నియమబద్ధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కుకట్ పల్లి సమితి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారని నమ్మకంతో ఈ విషయాన్ని చెప్తున్నాను. దాని లాభాన్ని మీరు పొందండి. ఏదో విషయం గ్రహించి వెళ్ళిపోకుండా నాలుగున్నర గంటలకు లేచి ఐదు గంటల వరకు ఆ అరగంట మీరు దగ్గర పెట్టుకోండి. అరగంట ఖాళీగా ఉండదు మనస్సు. దానిలో చాలా ముందు అపపని చేస్తుంది. అక్కరలేనివన్నీ గుర్తొస్తాయి. దాని కంటే పోయి పడుకోవటం మంచిదనిపిస్తుంది. దాన్ని నిరోధించండి. దానితో-- దాన్ని ఎదుర్కోండి. ముందు పోరాటం చేయండి. [గొంగళి] పోరాటము, ఆరాటము, కామాటము ఈ మూడు లేకపోతే జీవుడు పైకి రాడు. పోరాడాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఎదుర్తుంటామో మనస్సు మన మాట వింటుంది. మనస్సు మాట మనం ఎప్పుడైతే వింటామో అది మనల్ని ఎదుర్కొంటుంది, మనల్ని పతనం చేస్తుంది గనుక ఇది తక్షతవలి భావనగా చేయండి. మరి అరగంట ఏం చేయాలి? ఏమీ చేయొద్దు. ఏమీ లేదు ఊరుకుండండి అన్నారు భవాను భవాన మహర్షి. ఏమీ లేదు ఊరికే ఉండటం అంతే. ఆ ఊరికే ఉన్నట్లయితే ఏమవుతుందంటే మనస్సు tame అయిపోతుంది. మన దారికి వస్తుంది అది. మనకి ఏది రానివ్వండి, ఎంత ఆనందం వచ్చే వొళ్ళో పడనీవండి, మనం ఏం పెద్దగా దాన్ని ఆస్వాదించం. మహా దుఃఖం ముంచెత్తుతుంది కొండ దిగి మన మీద పడింది ఏం కాదు. కొండే దిగి మన మీద పడితే మనం ఏం చేయగలం? కనగాలమా? ఏం చేయడానికి కూడా time ఉండదు. కాబట్టి ఈ స్థిమితమైనటువంటి మనస్సు-- అందుకనే స్వామి దీన్ని చాలా poetic గా ఒకసారి ఒక మాట మాట్లాడాడు. మీరందరూ కూడా ఎలా ఉండాలి అంటే మహాసముద్ర మధ్యంలో ఉన్నటువంటి గండశీల వలే ఉండండి అన్నారు. ఎంత అందమైన మాట చూడండి. గండశీల అక్కడే ఉంది. తుఫాన్లు వస్తున్నాయి, అలలు వస్తున్నాయి, కెరటాలు వస్తున్నాయి, తాకుతున్నాయి, వీడికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ గండశీల అక్కడే ఉంది. సముద్రం అక్కడే ఉంది. ఈ సంసారం, ఈ జగత్తు అటువంటిదే. కనుక మీరు మీలో మీరు ఉండేటువంటి ఒక ప్రయత్నం చేయండి. దానికి పేరు పెద్దగా ధ్యానం అని అలాంటి గంభీరమైన పదాలు పెట్టుకోవక్కర్లా. హాయిగా ఉండండి. అనగానే ప్రశ్నలు వస్తాయి. చాపేసి కూర్చోవాలా? ఆ లేకపోతే ఏదైనా ఒక సోఫాలో కూర్చోవచ్చా? ఇలా కుర్చీలో కూర్చోవచ్చా? నీకు ఎట్లా సుఖముంటుందో, దేనివల్ల నీకింకొక మరొక ఆలోచన ఉండదో, ఇది అనుకూలంగా ఉన్నదని నీకు ఏది అనిపిస్తదో అట్లా హాయిగా కూర్చో. నీకు కావలసినట్లుగా నువ్వు ఆ పదిహేను నిమిషాలు ఉండు. అది నిజమైనటువంటి ధ్యానం. ఈ ధ్యానం మనకు తెలియకుండానే మన లోపలికి జ్ఞానం వైపు మనల్ని నడిపిస్తాయి. ఈ ధ్యానము, ఈ జ్ఞానము సాధనా మార్గంలో కొద్ది రోజులు అయిపోయిన తర్వాత అది యోగాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. యోగము అంటే కూడి ఉండుట అని అర్థం. తత్సంధర్యంలో. ఎవరితో కూడి ఉండుట? నీతో నీవు కూడి ఉండుట. నేను పరమాత్మతో కూడి ఉన్నా, రమణ మహర్షితో కూడి ఉన్నా, సత్య సాయి భగవానుడితో నేను కూడి ఉన్నా ఎంత కాలం కూడి ఉంటాను? ఉండను కదా! స్వామి ఆయన పని తీరాయెడంటే ఆయన తన పని మీద మనం వెళ్తాం. అక్కడే విడిపోవలసిందే. కానీ ఆ భగవంతుణ్ణి, ఆ గురువుని నీ హృదయంలో నిలబెట్టుకుని ఆయనతో నీవు కూడి ఉన్నట్లయితే భగవత్ భావనతో స్వామి నా యందున్నారు అనేటువంటి భావన మనకు కలుగుతున్నట్లయితే అది పరమాత్మ, ఆత్మల యొక్క సంగమ స్థలిగా, ఆ హృదయమే ఒక ఆరామ స్థలిగా ఏర్పడుతుంది గనుక ఇది ధ్యానం ద్వారా అంటే మనలో మనం ఉండటం ద్వారా, మనతో మనం కూడి ఉండటం ద్వారా, పరమేశ్వరునితో కూడి ఉండగలిగినటువంటి ఒక అద్భుతమైన స్థాయిని మనం పొందగలుగుతాం. అప్పుడు మనం బయటకు వచ్చి ఆ అరగంట అవగాహన బయటికి రండి. ఈ అరగంట అయిన తర్వాత మామూలుగా మంచి గాఢమైన నిద్ర పోయాం. గాఢమైనటువంటి నిద్ర పోయి నిద్ర లేచాం. లేస్తూనే మనం ఏమంటున్నామంటే "ఇంత హాయి అయిన నిద్ర పోయే నాళ్ళు ఎప్పుడో" అంటున్నాం. నీకెలా తెలుసు? నువ్వు ప్రపంచంలో ఉన్నావ్, సంపాదించావ్, కీర్తి పొందావ్, అనేకమైన విషయాలు తెలుస్తున్నాయి, తెలుసుకుంటున్నావ్ కానీ ఎక్కడైనా హాయిగా ఉన్నానని చెప్పడం లేదు. నేను సుఖంగా ఉన్నానని చెప్తున్నాం. కానీ ఒక దీర్ఘమైనటువంటి నిద్రలో నుంచి, గాఢ నిద్రలో నుంచి లేచినప్పుడు మాత్రం నేను హాయిగా ఉన్నాను అంటున్నావ్. కారణం ఏమిటంటే నువ్వు అక్కడ ఏమీ చేయలేదు గనుక, మనసుకు పనే లేదు గనుక, మనసు ఏదీ చేయలేదు గనుక మనం హాయిగా ఉండగలిగాం. ఇప్పుడు మనస్సు అనేకమైన పనులు చేస్తాయి. ఇక్కడికి రావటం ఒక తంటా, ఇక్కడి నుంచి వెళ్ళటం ఒక తంటా, ఇది ఎప్పుడు అయిపోతుందో అన్నది ఒక తంటా, ఏమవుతుందో అన్నీ తంటాలే. కాబట్టి దీని వలన మనకి హాయి లేదు, సుఖం లేదు. సుఖం ఎక్కడ ఉన్నదంటే మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ మనం చేయవలసిన ధర్మం మనం చేయాలి. ఇది చేసిన తర్వాత తర్వాత చూద్దాం. కానీ ఇప్పుడు మిగతావేం లేవు. ఇప్పుడు అనటమే, వినటమే రెండే పనులు ఉన్నాయి ఇక్కడ. అనేవాడివేమో అనే పని, వినేవాడికి విని పని. అంతే కదా! ఈ రెండూ కలిస్తే దీని పేరు యోగము. కాబట్టి ధ్యానము అక్కడే ఉంది, జ్ఞానము అక్కడే ఉంది, యోగము అక్కడే ఉంది. ఈ మూడింటితో ఇంద్రియాలను గూడా పటిష్టమై, శక్తివంతమైనప్పుడు ప్రపంచం విసిరే ఏ సవాలికైనా మన దగ్గర దాన్ని ఎదుర్కో గలిగిన దీక్ష శక్తి మనకు ఏర్పడుతుంది. అంతేతప్ప తాయుత్తలు కట్టుకుంటే, మెడలో మాలలు వేసుకుంటే దీనిలో నుంచి శక్తులు రావు. పైగా ఉన్నవన్నీ పోతాయి. కాబట్టి మన అంతర్గతమైనటువంటి శక్తి అంతా కూడా మన యందే. అందుకనే శక్తిని కూడగట్టుకునికూడా తీసుకొని అనే మాటలు ఉన్నాయి అన్ని మనమే లోపల నుంచి అంతర్గత శక్తిని బహిర్గతం చేయాలి ప్రాపంచికమైనటువంటి జీవితాన్ని గడపాలి ఆ తరువాత పూజ చేయాలా వద్దా చేయాలి చేయద్దు అనేవాళ్ళు ఆ ఆ సరైనటువంటి మార్గం మనకు చెప్పేవాళ్ళు కాదు పూజలో ఉండాలి కానీ తక్కువ సమయాన్ని పూజకు వెచ్చించాలి చిన్నప్పుడు అది అలవాటు అయ్యే దాకా ఎక్కువ సమయం కావాలి మనకు బాగా అలవాటు అయింది కదా అని మరింత ఎక్కువ చేస్తే టైం అంతా వృధా అయిపోతుంది కాబట్టి ఒక పదిహేను నిమిషాలు ఒక్క పది నిమిషాలు ఆ ప్రతిమ ముందు కూర్చొని జిల్లెళ్ళ మూర్తి అమ్మ ఒక మాట చెప్పారు విగ్రహారాధన అవసరమా ఎందుకని విగ్రహాలను ఆరాధించాలి అంటే విగ్రహారాధన విగ్రహాలన్నీ కూడా మనో విగ్రహ నిత్య నాయక అని కావాలి చూసారా మన మనస్సు విగ్రహింపబడాలి అంటే మనకంటే శక్తివంతమైనటువంటి ఒక బొమ్మ మన యందు మన ముందు ఉండాలి అది లేకపోతే మనం విర్రవీగుతాం అన్ని మన వల్లే జరుగుతున్నాయి అనుకుంటాం మన అంతట తెలివితేటలు ఉన్నవాళ్ళు లేదనుకుంటాం మా మాటి కోటి రాకూడదు అనుకుంటాం అన్ని మనమే చేయగలం అనుకుంటాం ఎప్పుడైతే ఒక శక్తివంతమైనటువంటి అది పసుపు ముద్ద కావచ్చు బెల్లంతో చేసినటువంటి వినాయకుడు కావచ్చు తమలపాకులో దాన్ని పెట్టగానే ఆయన వినాయకుడు వచ్చినట్టు మనం భావన చెందుతాం అవునా కాదా నమస్కరిస్తాం బెల్లంకి నమస్కరించడం ఏంటి పసుపుకి నమస్కరించడం ఏంటి వాటికి నమస్కరించడం వల్ల దానిని దేవీ దేవతలుగా భావన చేసి ఆవాహన చేశాం కనుక నమస్కరిస్తున్నాం కాబట్టి మనకు ఉన్నటువంటి సమయంలో పదిహేను నిమిషాలు మాత్రమే చక్కగా పూజకి వినియోగం చేయాలి దీనికంటే ముందు మరొక విషయం కూడా. నాలుగు గంటలకు లేస్తే చాలా లాభాలున్నాయి అన్నారు కదా మూడుకే లేచి ఏడు గంటల దాకా కూర్చుంటే ఏమవుతుంది అంటే స్వామి దానికి పరిష్కారం అందించి చెప్పారు నీవు ధ్యానిగా ఉండదలచుకున్నట్లయితే ఇరవై ఎనిమిది నిమిషాలు నలభై నాలుగు సెకన్లు మాత్రమే ధ్యానానికి వినియోగించు అన్నారు దానికి ఒక లెక్క ఉంది ఆ లెక్క ఇప్పుడు అక్కర్లేదు అంటే ఆ రకంగా అది చాలా maximum ఎవరికి ప్రాథమిక స్థాయిలో ఉన్నవారికి ధ్యానిగా మారిన తర్వాత ఎంతసేపు ఉండాలి అంటే స్వామి చెప్పారు ఎవరైతే తమ మనస్సుని గరిష్టంగా maximum పదకొండు సెకన్లు నిలబెట్టి ఉంచగలరో వారు ఎక్కడ ఉన్నా నేను సశరీరంగా దర్శనమిస్తాను అన్నారు స్వామి అంటే చాలా అత్యంత కష్టమైనటువంటి విషయం యోగ మార్గంలో ఉన్నటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి సూత్రాన్ని సత్య సాయి బాబా వారు ప్రపంచానికి చెప్పారు అంటే పదకొండు సెకన్లలో మా మనస్సు మనల్ని దేహాతితమైన స్థాయికి తీసుకొని వెళ్ళాలి వెళుతుందా అంటే వెళ్లి తీరుతుంది సాధన చేయగలిగితే నిజంగా గనుక ఆధ్యాత్మిక మార్గంలోకి సాధనా మార్గాన్ని మనం పట్టుకున్నట్లయితే పదకొండు సెకన్లలో మన మనస్సు అక్కడ ఉంటే పదిహేను నిమిషాలు పూజకి ఎందుకని పదిహేను నిమిషాలు ఇచ్చారంటే కాస్త అలంకారం చేయాలి దానికొంత ఉపచారం చేయాలి భగవంతునిగా ఆవాహన చేశాం కనుక కొన్ని నియమాలు ఉన్నాయి కనుక ఆ క్రతువు తంతు కింద పదిహేను నిమిషాలు గడిచిపోవాలి ఇది అయిన తర్వాత స్వాధ్యాయం చేయాలి స్వాధ్యాయం అంటే తర్క వ్యాకరణ మీమాంస న్యాయాల మీద అధికారం కాదు మనకి భగవద్గీత పరమ ఉన్నతమైనటువంటి గ్రంధం కారణం అది నారాయణేన స్వయం వ్యాసేన గ్రథిత పురాణ మరుణా మధ్యే మహాభారతం అది సాక్షాత్తు భగవంతుని యొక్క దివ్యవాణి కనుక ప్రతిరోజు ఒక్క శ్లోకాన్ని ఒకే ఒక్క శ్లోకం రెండోది చదవద్దు ఒక్కటి అర్థం చేసుకున్నట్లయితే ఏడు వందల శ్లోకాలు పూర్తి కావాలి అంటే మనకి సుమారు రెండు సంవత్సరాల సమయం పడుతుంది ఒక్క శ్లోకం దాన్ని అర్థం చేసుకొని భౌతిక ఆదిభౌతిక ఆధ్యాత్మిక స్థాయిలో శబ్దాలు అర్థాలు వదిలేయండి అక్కడ ఛ అన్నాడు ఇక్కడ కి అన్నాడు మనకవసరం లేదు దాని విచారణ ఏమిటి దాని అంతరార్థం ఏమిటి ఇది ఎందుకిట్లా చెప్పాడు దీన్ని మనం ఎట్లా సమన్వయం చేసుకోవాలి ఆ శ్లోకం ఎవరంటే కృష్ణ స్వరూపం ఆ చదువుతున్నటువంటి సాధకుడు ఎవరంటే మనందరం అర్జునులం అన్నమాట దుర్జనుడిగా ఉన్నవాడికి అది అక్కర్లా అర్జునుడిగా ఉన్నవాడికి భగవద్గీత అవసరం కాబట్టి భగవద్గీత శ్లోకాన్ని ఒక్కటి చదవాలి మరి పూజలో స్తోత్రాలు అయిపోయినయి శ్లోకాలు అయిపోయినయి ఇది కర్మ భక్ కర్మ భక్తి జ్ఞాన యోగాల యొక్క త్రివేణి కాబట్టి కర్మ యోగం భక్తి యోగం జ్ఞాన యోగం విడివిడిగా లేవు కర్మ లేని భక్తి భక్తి లేని జ్ఞానం జ్ఞానం లేకుండా భక్తి కర్మలు రాణించవు శోభించవు కాబట్టి మనకి కర్మ అనుష్ఠానం ప్రపంచం ఉంది సంసారం ఉంది పిల్లలున్నారు దాని పట్ల ఉన్నటువంటి అనేకమైనటువంటి బంధనాలున్నాయి బాధ్యతలున్నాయి కర్తవ్యాలున్నాయి అవన్నీ చక్కగా సక్రమంగా సకాలంలో చేయాలి అంటే కర్మానుష్ఠానం చేయాలి మనమంతా కూడా కర్మ నిష్ఠలో రాటు రాటుదేలడానికి కర్మ నిష్ఠలో ముక్తి మూలం కావడానికి మానవ జన్మ మనకివ్వబడింది శరీరం ఆద్యం ఖలు కర్మ సాధనం శరీరం ఆద్యం ఖలు కర్మ సాధనం శరీరం అనేటటువంటి కర్మ సాధనం శరీరమే రోగగ్రస్త అయితే ఏం ప్రయోజనం దీనికి తేజస్సు ఓజస్సు రజస్సు అంతస్సు మహస్సు అన్నీ కావాలి ఇది మహా శక్తివంతం కావాలి అంటే ఆ పూజని దాటినటువంటి తర్వాత స్వాధ్యాయంలో ఒక శ్లోకం చదవండి సాయంత్రం వేళ ఏమాత్రం ఫ్రీ ఉన్నా అవకాశం తీసుకొని యోగ వాశిష్ఠంలో ఒక శ్లోకం చదువుకోండి.ఒకటి ఇవి ఏడు వందల శ్లోకాలు అవి ముప్పై మూడు వేల శ్లోకాలు ఒక మనిషి జీవితకాలం చాలదు. అదంతా మనస్సు యొక్క మర్మాన్ని మనసు మనల్ని ఎలా వేధిస్తుందో మనసు మనల్ని ఎట్లా దిగజారుస్తుందో అదే మనసు మనల్ని మహోన్నతమైన స్థాయికి ఎట్లా నడిపిస్తుందో చెప్తుంది కాబట్టి వశిష్ట గీత చదవాలి భగవద్గీత చదవాలి భగవద్గీత practical philosophy మనకి practical గా కావాలి ఇందాక అన్నట్లుగా మనిషి జీవయాత్ర ముగిసిన తర్వాత కథ ఎంచుకు వెళ్ళిపోయాక ఇంకా అక్కడ పైన మనకేం పనులు లేవు. పైన అనేది లేదు ఉన్నదంతా ఇక్కడే కాబట్టి ఇక్కడ మనం మన కర్మలు చక్కగా పటిష్టంగా చేయాలి పవిత్రంగా చేయాలి ధర్మబద్ధంగా చేయాలి నియమంతో చేయాలి నియతితో చేయాలి నిష్ఠతో చేయాలి చేసి ఏం చేయాలి పరమాత్మకి సమర్పించాలి. చూడండి నైవేద్యం పెడతాం మనం భోంచేస్తాం కానీ ఒక విన్నపం భగవంతుడికి విన్నవిస్తాం దాన్నుంచి ఫలితం కోసం ఎదురు చూస్తాం విన్నవించటం అయినా మరోక్షణమే దాని గురించి మర్చిపోవాలి. దాన్ని శ్రీ రామకృష్ణ గురుదేవులు empty the mind అని చెప్పారు. అంటే ఆ మనస్సు తట్ట దింపటం నేర్చుకోండి తట్ట నింపుకుంటూ ఎంతకాలం వస్తది ఇది. నీకు వొంపటం మొదలు పెడితే అది ఖాళీ అవుతుంది నింపటం మొదలు పెడితే బరువు ఎక్కువైపోయి మొయ్యలేవు. వయసు వీచ్చా మరొక దాని వీచ్చా అనేక కారణాల వల్ల కాబట్టి పరిమితమైనటువంటి కోరికలతో పరిమితమైనటువంటి ఆశలతో అత్యంత పరిమితమైనటువంటి కనీస అవసరాలతో జీవితాన్ని మనం మహా వైభోగంగా ఆవిష్కరించుకోగలుగుతాం కద కదా. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఆ స్వాధ్యాయంలో పొద్దులైంది నిజానికి ఇక్కడ అధ్యాత్మ మార్గంలో షిరిడి సాయిబాబా పరమాద్భుతమైన మాటలు మనకి ఏమనుకుంటున్నావో అవి చెప్తూ జ్ఞానేశ్వరి చదువుకోండి అని చెప్పారు ఇక భగవద్గీత లలితా సహస్ర నామాలు చేయండి అన్నారు విష్ణు సహస్ర నామాలను వదిలిపెట్టద్దు అన్నారు అన్నీ చదవమని కాదు కనీసం వినాలి ఇవాళ technology వచ్చింది మనం ఏది చదవక్కర్ల తీపలా పెట్టేస్తే అన్నీ అవే చదువుతుంటాయి వింటూ ఉంటాం. దానిలో నుంచి ఒక మహానందాన్ని ఒక శక్తిని మనం పొందగలం కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఆధునికమైన technology ని కూడా మన అధ్యాత్మ మార్గంలోకి దాన్ని వాడుకోవాలి అంతేగాని మనం మిగతా వాటివైపు మన చేతిలో ఉన్నటువంటి విషయాన్ని దానికి వినియోగించకూడదు ఇది రెండవది అంటే స్వాధ్యాయం చేయాలి. సంవత్సరంలో మనకి అనేకమైనటువంటి పండగలు వస్తాయి కైందవ జాతి చేసుకున్నటువంటి పుణ్యం సనాతన ధర్మమే అనేకమైనటువంటి రూపాలలో అనేకమైనటువంటి భావాలతో అనేక పర్వదినాలతో చూడండి గణేష్ కాలమైంది అమ్మవారి కాలమైంది అయ్యవారి కాలమైంది మార్గశిర మాసం దామోదర కాలమైంది మళ్ళీ కౌశ్య లక్ష్మి వస్తుంది అది కాగానే వసంత లక్ష్మి వస్తుంది ఇది ఎంత మహత్తరమైన దేశం ఇది. ప్రతి కాలము పుణ్యకాలమే ప్రతి క్షణము కూడా పరమాత్మతో అనుసంధానమైనటువంటి ఒక దివ్య జీవన విధానం మా మహర్షులు ఋషులు మనకి అల్పిచ్చారు వీటిని మనం గనుక పండగని పిండివంటలకి ఉత్సవాలకి కొత్త బట్టలకి పరిమితం చేయకుండా దానానికి ధర్మానికి యోగానికి త్యాగానికి సమాజ సేవకి మనం గనుక వినియోగించగలిగిన స్థాయికి వెళ్లగలిగితే అది నిజమైనటువంటి అధ్యాత్మ మన ఇంట్లో మనం పిండివంటలు చేసి తినటం కాక అది కూడా నచ్చుకొని వాడికి గనుక మనం తీసుకెళ్లి ఇవ్వగలిగినట్లైతే ఆ పండగకి పరిపూర్ణమైన పరమార్థం ఉంటుంది. బంధువులా బస్తాలు ఉంటాని పెడుతూ ఉంటారు మరి ఎవరు మనకు బంధువులు అంటే అధో జగత్ సహోదరులైనటువంటి నారాయణ స్వరూపుల్ని మనం బంధువులుగా భావిద్దాం. సత్య సాయి భగవానుడు మనందరికీ చెప్పినటువంటిది వారు తాయత్తులు ఇవ్వలేదు వారెవరికీ వెళ్ళా రక్షాబంధనాలు వేయలే చెప్పారు ఎవరికీ ఆకలి ఉన్నదో వాడికి అన్నం పెట్టండి ఎవరికీ చదువు లేదో వాడికి చదువు చెప్పండి ఎవరికీ ఆరోగ్యం లేదో వాడికి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఇటువంటి అనేకమైనటువంటి ఈ విషయాలన్నిటినీ కూడా మన సాధనా మార్గంగా మనం మార్చుకోవాలి. ఆ తర్వాత ప్రతి పర్వదినాన్ని కూడా పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈశ్వరునికి మనం సమర్పించేటువంటి దిశగా మనం దాన్ని నడిపించాలి. ఇది అయిన తర్వాత ఇది నిత్యమైన కార్యక్రమం మనకుంది ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేయాలి వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేయాలి ధర్మవ్యాధుల వలె ప్రవృత్తి వృత్తి ప్రవృత్తి నివృత్తి ఈ మార్గంలో ప్రవేశించాలి వృత్తి ఏది కానీవండి మీ ప్రవృత్తిలో నుంచి ఒక మార్పును తెచ్చుకొని భగవంతుని వైపు మనస్సుని అనుసంధానం చేసి ఈ సమాజం మొత్తంగా ప్రపంచത്തെ స్వరూపంగా భావన చేసుకోగలిగినట్లయితే దానిలో మాకు వీడు నా వాడు వాడు తన వాడు వీడు పనికొచ్చేవాడు వీడు నంచిన వాడు వీడు నచ్చని వాడు అనే మాటలేవి లేవు అందరూ ఒకటి అనేటువంటి ఆ unified part ఆ ఏకాత్మ భావన ఏదైతే ఉన్నదో దానిలో మనకు మనడానందం కలుగుతుంది గనుక ఆ సమయాన్నంతా కూడా కుటుంబం కోసం కుటుంబంలో ఉన్న సభ్యుల కోసం పరిచయస్తుల కోసం స్నేహితుల కోసం బంధువుల కోసం ఇవాళ సమాజానికి అనుకూలంగా కొన్ని మాటలు అధ్యాత్మ గురించి చెప్పుకోవాలి అధ్యాత్మలో కొద్దిగా ప్రవేశం మనకు కలగ్గానే మన బంధువులు ఎవరికీ కూడా ఈ స్థాయికి వాళ్ళు రాలేకపోతున్నారని వాళ్ళు రాలేదని మనం యాతన పడవలసిన పనిలేదు అది వాళ్ళ ప్రాప్తిని బట్టి వాళ్ళ యోగాన్ని బట్టి వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళ ధర్మ కాళత్యాన్ని బట్టి వారి ప్రారబ్ధాన్ని బట్టి వారికా ఆలోచన కలగాలే తప్ప స్వామి చెప్పారు రెండే రెండు రకాల ఉపన్యాసాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో కొన్ని ఊరేవి కొన్ని తూరేవి అన్నారు ఊ ఊరు.వచ్చేవి పరమేశ్వరుని సంకెళ్ళించేది. ఊరుకు వచ్చేవి మన knowledge లో నుంచి పుట్టేది. మన knowledge లో నుంచి పుట్టేవి నిలకడ చెందవు. పరమేశ్వర భావనలో నుంచి ఒక అమృత ప్రవాహంగా వచ్చినప్పుడు అది అమృత వాక్య నిలపడి చెందుతుంది గనుక మనం అవతల వాడు ఎంతవరకు వచ్చాడు అనే ఆలోచన మనం వదిలిపెట్టి, మనం ఎంతదాకా వచ్చాం అన్న ఆలోచన పూర్తిగా వదిలిపెట్టి, మన పని మనం అట్లా తలవంచుకొని వినయంగా హాయిగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఏదో ఒక రోజున మాకి ఆ పరమ చరమమైనటువంటి ఆనందం మాకి లభిస్తుంది గనుక ఆ ఆనంద మార్గమైతే కుటుంబ బాధ్యతలు చేయాలి, సామాజిక బాధ్యతలు నిర్వర్తించాలి, అందరి పట్ల ప్రేమని, ఆదరణని, ఆదరాన్ని మనం చూపించాలి. అందరినీ మన వాళ్ళుగా మైత్రి భజతాన్ అంటారు కంచి మహాస్వామి వారు. ఆ స్నేహాన్ని మనం పునః పునః దాని యందు ఏ రకమైన కల్మషం లేకుండా, ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా మనం గనక గడపగలిగినట్లైతే అది ఒక ఉన్నతమైనటువంటి భావన. కాబట్టి అధ్యాత్మ సాధనా మార్గంలో స్వాధ్యాయం పెద్ద పీట. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, యోగవాసిష్ఠం, భగవద్గీత ఇవన్నీ చదవాలి అంటే మనిషి జీవితం ఎంత సమయం? దాని కోసమే వెచ్చించాలి. కొద్దికొద్దిగా గనక మనం వెచ్చించుకుంటూ వెళ్ళినట్లయితే ఇవన్నీ కూడా సాధ్యమే. ఇక ఆ తర్వాత మరొక మానవీయమైనటువంటి కోణంలో మనం చేయాలి. మనకున్నటువంటి ఆ పన్నెండు గంటల్లో ఎనిమిది గంటల సమయం మనకి నేను క్రితం సారి కూడా ఒక మాట చెప్పాను. technology మన ఇంట్లో ఉండనివ్వండి, tv ఉండనివ్వండి కానీ దాని-దానితో మాత్రం మమేకం కాకండి. ఎందుకంటే అది మనకి ఏ రకంగానూ ఉపయోగించేది కాదు. అది ఏమీ రోజుల్లో జీవుడు చాలా happy గా ఉన్నాడు. చాలా ఆనందంగా ఉన్నాడు. చక్కగా ఒక పోతన గారి భాగవతంలో పద్యం చదువుకునేవాడు. ఒక జాషువా గారి పద్యం చదువుకునేవాడు. ఆనందంగా ఆ మాటలన్నీ నెమరు వేసుకుంటూ ఒక ధారాన్ని చూడండి. పండితులు కొద్ది మంది ఉండేవారు, మామర్లు ఎక్కువ ఉండేవారు. మామర్లు అందరికీ కూడా భాగవత పద్యాలు పట్టుకొచ్చు. ఇవాళ మామర్లు తగ్గారు, పండితులు పెరిగారు. కానీ ఏ పండితునికి భాగవతం పూర్తిగా తెలియదు. భగవద్గీత పూర్తిగా తెలియదు. వాడికి ఏదోకటి తెలుసు ఆ మార్గంలో తాను ముందుకు వెళ్తూ ఉంటాడు. అట్లా కాకుండా మానసికమైనటువంటి ఒక discipline మనకి చాలా అవసరం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ tv అనే దాన్ని చాలా తక్కువ చూడాలి. cell phone అనే దాన్ని చాలా తక్కువ మాట్లాడాలి. connectivity ఏదైనా అనర్థదాయకం కాబట్టి మనం ఎవరితో connect అయి ఉండాలి? దీనికి స్వామి ఏనాడో చెప్పారు. ఇంటర్నెట్టు ఇంటర్నెట్టు అంటున్నారు, ఇన్నర్ మెట్టులోకి ఎప్పుడెళ్తారు అని అడిగారు. మనకి ఇన్నర్ మెట్టులో ఉన్నది ఉందని, మనతో మనం కూడి ఉండాలని, మన లోకానికి మనం వెళ్ళాలని స్పురించే ఏమీ రోజుల్లో ఇంకా ఇంటర్నెట్ ప్రపంచమంతా వ్యాప్తి చెందని రోజుల్లో వారు నాశనం చేశారు. కాబట్టి మనం సాధ్యమైనంత తక్కువ సమయాన్ని ప్రపంచంతో గడపడం ఆహ్ నేర్చుకోవాలి. ఎక్కువ సమయం దానికి ఇవ్వకూడదు. ఏ పని మీద వెళ్ళామో ఆ పని చేసుకోవాలి, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఇక మూడు సాధనా మార్గాలలో చాలా ప్రమాదమైనటువంటి ఒకటి gossip. అది మన సమయాన్ని చాలా చెల్లగొట్టేస్తుంది. ఇవాళ దానికి చాలా అందమైన పేరు social media అని పేరు పెట్టేశారు. వాడు ఎవడో ఉంటాడు, ఎందుకు ఏం చెప్తాడో తెలియదు, అవన్నీ మనం వింటాం. ఊరికే యాతన పడిపోతాం, tension పడిపోతాం జరిగేదేదో. అంతే కదా! కాబట్టి దాని నుంచి కూడా దూరంగా gossip నుంచి దూరంగా ఉండాలి. రెండవది ఏ వ్యక్తిని కూడా ఎదురుగా పొగడనూ అక్కర్లేదు, అతని వెనక తెగడనూ అక్కర్లేదు. అతని గురించి evaluate చేయటం మన పని కాదు. మన పని మనల్ని మనం evaluate చేసుకోవాలి. నేను ఎక్కడ ఉన్నాను? మానవ జన్మ ఇచ్చినందుకు పరమేశ్వరుడు నాకు ఇంతటి చక్కటి జీవితాన్ని ఇచ్చినందుకు ఏ లోటు లేనటువంటి వడ్డించిన విస్తరలాంటి జీవితాన్ని ఇచ్చినందుకు నేను ఏం చేయగలుగుతున్నాను? ప్రశ్నించుకున్నట్లయితే ముఖ్యంగా అనేవాడు వాడు. ఆ అనేవాడు అంటున్నదంతా సాధనగా అనుకోవాలి. వాడు బోధించటానికి రాడు. తన సాధనా మార్గంలో, సాధనా మార్గంలో అనేకమైనటువంటి విషయాలు మనసు నుండా, హృదయం నుండా మలుచుకుని ఉన్నప్పుడు దానిని మళ్ళీ ప్రపంచానికి తాను పొందినటువంటి అనుభూతిని జగత్తుకి నిస్వార్థంగా ఇవ్వటంలో కర్తవ్యంగా పెట్టుకోవాలి. మళ్ళీ దీని నుంచి కీర్తి, దీని నుంచి ఫలము ఇవేం రాకూడదు. వచ్చినాయంటే అది కలుషితం అయిపోతుంది గనుక ఆ పవిత్రతను మనం maintain చేసుకోవాలి. వాక్ సిద్ధి ఉండాలి, వాక్ శుద్ధి కూడా ఉండాలి. ఈ రెండూ శుద్ధి, సిద్ధి ఎలా ఏర్పడతాయి అంటే మన బుద్ధిని బట్టి ఏర్పడతాయి, అంతే. కాబట్టి బుద్ధి, సిద్ధి, శుద్ధి ఈ మూడు కూడా గుర్తు పెట్టుకోవాలి. అట్లాగే ఈ మూడు అధ్యాత్మ మార్గంలో gossip వదిలిపెట్టాలి. ఎవరినీ విమర్శించకూడదు. మన సమయాన్ని అతి తక్కువ మాట్లాడాలి. అవసరమైనప్పుడు మాట్లాడాలి. ఈ అవసరం అయిపోయిన తర్వాత మాట్లాడవలసిన పనిలేదు. మిగతా మళ్ళీ మాట్లాడే సమయం వచ్చేదాకా మనం మాట్లాడకుండా ఉండగలగాలి. అది సాధన. నిజమైనటువంటి సాధన. మౌనం వహించటం అంటే వాచా మౌనం కాదు, మానసిక మౌనాన్ని వహించాలి. మనస్సును నిశ్శబ్దం చేసుకోవాలి. ఆ మనస్సుని సంస్థితం చేయాలి. అది అటు అది కావాలంటుంది, ఇది కావాలంటుంది. అది కోరటమే దాని లక్షణం కాబట్టి దానికి అది కోరుతున్న కొద్ది మనం దానికి ఇవ్వకుండా ఉండటం నేర్చుకోవాలి. దాంతో మన మనస్సు మన అధీనమై ఉంటుంది. ఇక కార్యకలాపాలు అయిపోయినయి. ఒకప్పుడు కుటుంబ వ్యవస్థలో భార్య, భర్త, పిల్లలు ఖచ్చితంగా కలిసి భోంచేసేవారు. కలిసి భోంచేసేటప్పుడు బాధ్యత గల గృహస్తుడు ఓ రాముడి కథో, కృష్ణుడి కథో, భాగవతంలో ఉన్నటువంటి ఒక భక్తుడి కథో చెప్తూ ఆ భోజన కార్యక్రమం పూర్తయ్యేది. ఇవాళ అలా జరగటం లేదు. అసలు భార్య, భర్త, పిల్లలు, కుటుంబం కలిసి భోంచేయటం అంటే ఆహ్ చాలా హృదయ విదేయకంగా మారిపోయింది. దాని నుంచి మనం బయటపడాలి. It's all in our hands. మన చేతుల్లో ఉంది. నేను వచ్చేప్పటికి late అవుతుంది, నువ్వు అన్నం తినేసేయ్. ఆయన ఆయన వెళ్ళిపోతాడు. నేను బజారు వెళ్ళిపోతున్నాను, అన్నీ అక్కడే పెట్టాను, మీరు తినేసేయ్. వెళ్ళిపోతాడు. అది గడ్డితో సమానం. ఏం తినాలి అంటే ప్రేమని తినాలి, అభిమానాన్ని తినాలి, వాత్సల్యాన్ని తినాలి, మానవ సంబంధాన్ని తినాలి, పరమేశ్వర భావనతో మనసు పునీతం కావాలి. ప్రతి అణువు మనం తినేటువంటి ప్రతి అన్నం మెతుకులో నుంచి ప్రాణమయ కోశం ఏర్పడుతున్నది. మనస్సు దాని ద్వారా ఏర్పడుతున్నది. విజ్ఞానమయం, ఆనందమయం ఆ మెతుకులో నుంచి అన్నీ పుడుతున్నాయి. ఆ మెతుకు కేవలం పొట్ట నింపుకోవడానికి, దేహాన్ని నిలబెట్టుకోవడానికి లేదా పెంచి పురస్కరించుకోవడానికే కాక అది పవిత్రమైనటువంటి విడికి-విడికిడితో కూడినటువంటి అన్నం అని భావించినట్లయితే అన్నం-
YouTube · audio
How to indulge in spiritual saadhna — Part 2
How to indulge in spiritual saadhna — Part 2
Source: SathyaSai Seva Sadan on YouTube
0:00 / 31:49
More in this series