No transcript for this section.
Transcript begins at 0:00.
అపౌరుషేయాలు అంటారే అంటే ఏంటి? అని అడిగారు. అంటే ఉప్పా వారు అన్నారు, బైరాపి శాస్త్రి గారు. అపౌరుషేయాలు అయినా తర్వాత వ్యాసులవారు వచ్చి అంతా చేసేశారే స్వామి! అంటే రాయకుండా పుస్తకాలు వస్తాయా స్వామి? అని ఒక మాట. వాళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంటే, రాయకుండా కూడా వస్తాయి, మాట్లాడితే కూడా వస్తాయి. మూర్తి మాట్లాడతాడు పుస్తకాలు వస్తాయి అన్నాడు. అప్పటికీ నేను మాట్లాడతానని నాకు తెలియదు, అవి పుస్తకాలు అవుతాయని తెలియదు. దీనికి ఈ ఆ-అందమైనటువంటి ఆశీర్వచనానికి ఒక సోదాహరణ కావాలి ప్రపంచంలో చెప్పుకోవటం కాదు కదా. నా ఎదురుగా కూర్చున్నటువంటి Secretariat Staff మీరిద్దరు, విజయలక్ష్మి గారు, మరి స్నేహితురాలు. భజగోవిందం Secretariat లో మాట్లాడుతుంటే మన్ను డింగలో కొంగులు కప్పుకొని వాళ్ళ వాళ్ళ Departments నుంచి వచ్చి మధ్యాహ్నం between one and two ఒక భక్తస్-- ఆహ్ Tape Recorder పట్టుకొని వచ్చి అవన్నీ Record చేసి Transcribe చేసి కడగా ఆంధ్రప్రదేశ్ Secretariat Employees కాకుండా భక్తులుగా వారు తెచ్చినటువంటి గ్రంథమే భజగోవిందం. [చప్పట్లు] వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఇక్కడ, ప్రదేశ్ గా కూర్చుని ఉన్నారు. అంటే ఒక మంచి పని జరగటానికి కాలే స్థలే జలే అన్నారు పరమాచార్య. కాలం గొప్పదిగా ఉండాలి, స్థలం గొప్పదిగా ప్రాంగణం గొప్పదిగా ఉండాలి, తీర్థం ప్రజలు అది జలం కాబట్టి మనమందరం కూడా భాగవతోత్తములుగా మనం భావన చేసుకున్నట్లయితే ఇటువంటివన్నీ జరుగుతాయని నేను భావన చేస్తూ ఈవేళ ఈ ధర్మశాస్త్రాన్ని, విజ్ఞానేశ్వరాన్ని నేను తీసుకుంటున్నందుకు, లేదా నాకు ఇవ్వబడినందుకు నాకు ఒక ఆనందం, ఒక ఆనంద రేఖ విలాసిగా ఒక్క క్షణం తాకి నన్ను వీడిపోయిందని, ఆ సందర్భమంతా ఇందాక రామబ్రహ్మం గారు చాలా విషయాలు చెప్పారు కదా, నా దృష్టిలో ఒక్కటే. చెప్పేవాళ్ళని చెప్పనివ్వండి, మనం కూడా విందాం. కానీ నా భావన ఏంటంటే ఎవరు గతంలోనే జీవిస్తూ ఉంటారో వారు మృతప్రాయులు. ఎవరైతే వర్తమానంలో ఎప్పుడూ నర్తిస్తూ వర్తిస్తూ ఉంటారో వారు మళ్ళీ భవిష్యత్తును అందుకోవటానికి అర్హత కలిగిన వాళ్ళుగా భావన చేస్తూ ఇటువంటి నూతనమైనటువంటి ఒక సందర్భాన్ని ఇంత అందంగా, రమణీయంగా, ఆత్మీయంగా, ఆదరంగా, సాదరంగా, సప్రమాణికంగా సాగిస్తున్నటువంటి ఈ సభకి మరొక్కసారి నమస్కరిస్తూ VSR Foundation ని నాకు దాంట్లో లెక్కలు తెలియవు, Account తెలియదు, ఎంత డబ్బుందో తెలియదు. కానీ ఏం చేయాలి అని అనగానే మా జె.వి.రావు గారు, వాళ్ళ అబ్బాయి శ్రవణ్ కుమార్ ఆ ఇద్దరూ కూడా సారథ్యాన్ని వహించి దానికి తగినటువంటి ఆ ఏర్పాట్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగే ఇవాళ ఎట్లాగూ సందర్భం మాకు దొరికింది అని ఒక దాన్ని ఏమంటామంటే బయట వాళ్లయితే విన్నపాలు, మా వాళ్లయితే ఊరికే వివరించటాలు. VSR Foundation June నెలలో దాని Foundation Day జరుపుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక వేదానికి సంబంధించిన, వేదము అంటే కేవలం నాలుగు వేదాలని మాత్రమే కాదు. ఒక సంస్కృతి వేదం, ఒక భావన వేదం, ఒక ఉదాత్త స్థితి వేదం. తీరవలసినటువంటి ఆత్మని ఆ ఎరుకలోకి వెళ్ళటానికి మనం ఎంచుకునే మార్గమే వేదమార్గంగా నేను భావన చేస్తూ ఈ సంవత్సరం నేను అంటే VSR Foundation ఇద్దరు మహావ్యక్తులని ఆ రకంగా సన్మానించుకోవాలి అని ఈ క్షణ నా మనసులో కలిగిన తీర్మానాన్ని మీ ముందు చెప్తూ, వారు ఎవరు అంటే ఒకరు వేటవరం రామబ్రహ్మం గారు, రెండోవారు రంగ రామానుజాచార్యులు గారు. మళ్ళీ వాళ్ళు June లో మా సభకు వస్తారు. వచ్చి VSR Foundation నుంచి ఆ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా సభాముఖంగా వారిని కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాకామలను తెలియజేస్తూ పరమేశ్వరుడి యొక్క దివ్య విభూతి ఇటువంటి కార్యక్రమాలుగా ఉంటుంది అని నేను మరొక్కసారి భావన చేస్తూ మీకు, మీ రాబోయే ఇరవై ఒక్క తరాలకు అనంతకోటి గురుస్వరూపాల దివ్య మహాశీస్సు ఒక మహామృత వృష్టిగా కురిసి నడిపించు గాక అని మంగళాశాసనం చేస్తూ Say Down. [చప్పట్లు]
YouTube · audio
Spiritual Scientist Addressing Part II
Spiritual Scientist Addressing Part II
Source: P V S on YouTube
0:00 / 4:44
More in this series