No transcript for this section.
Transcript begins at 0:00.
నందస్మిత మనోహరమ్ వందాం Janamandalam వే సయ్యం శ్రేష్ఠ పురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శిఖస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాప విషయ ప్రాప్తం సద్గురుం సత్యసాయి శరణం ఆలవ్యేన విహీనం వ్యోమాఖం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం సద్బ్రహ్మ స్వరూపాణి బ్రహ్మమహేశ్వర స్వరూపిణి సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి ప్రీయ స్వీకరణార్థం ప్రణామ సంప్రదింపులు సమర్పిస్తూ ఇవాళ సిరిసిల్ల గ్రామం ఒకప్పుడు ఇవాళ సిరిసిల్ల రావటం నాకు మొదటిసారి కానీ ఈ గ్రామాలన్నీ తెలంగాణా ప్రాంతంలో చాలా వెనుకబడినవి అండి ఏమీ development లేదు అని చదువుకున్న నాకు ఒకటి వాడికి ఏదీ వెనుకబడి లేదు చాలా develop అయి ఉన్నది చిన్నప్పుడెప్పుడో సిరిసిల్ల అనే handloom ఆ పరీక్షక ఆ objective లో మార్కులు గడ మార్కులు తెచ్చిపెట్టిన గ్రామం సిరిసిల్ల ఏది ప్రశస్తి అంటే ఆంధ్రదేశంలో మంగళగిరి నెల్లూరు దగ్గర వెంకటగిరి తెలంగాణా ప్రాంతంలో మాత్రం సిరిసిల్ల పేరు ఒకటే వెలగింది అటువంటి ఆ సిరిసిల్లకి రావటం దానికి కారణం స్వామి ఆదేశం సత్యసాయి భగవానుడి యొక్క అనుగ్రహం వలన వారి సంకల్పం వలన మా సోదరి సుధాకరి వలన సుధాకరితో పాటు డాక్టర్ గారి యొక్క స్వామి యందున్నటువంటి భక్తి కారణంగా నా బుట్టు వాడికి అయితే రాశారు కదా మీ అందరినీ కలవగలిగాను ఇది ప్రారంభం మామూలుగా internet లో VSR Murti అంటే నా పేరు కలయని east coast naval director గా ఉన్నాడు అని ఇక్కడ ఉన్నారు అది వాళ్ళు చూసి నేనే అనుకుంటారు కానీ నేను కాదు నా వృత్తి వేరు నేను I am a scientist by profession ఇక మిగతా వాళ్ళకి ఏమి రాసుకున్నా నాకు ఏమి ఇష్టం అంటే చిరగాల స్వామి ప్రియ భక్తులు అనంగానే అంటే నా ఒళ్ళు ఆనందంతో [చప్పట్లు] వాళ్ళని మించి నాకు భారత రత్న వచ్చినా స్వామి అనుగ్రహం గనక లేకపోతే ఆ భారత రత్న నాకెంతటి విలువైనది కాదు అంటే ప్రభుత్వం ప్రదਾਨ చేసినటువంటి degree మాకు doctor ఏముంది అని అందరికీ ఉన్నట్టు నాక్కూడా కొన్ని degrees ఉన్నాయి వాటన్నింటికంటే శాశ్వతమైనటువంటిది అంటే అఖండ భారతావనిలో ఒకే ఒక్క వ్యక్తి ఆ బిరుదు బిరుదు అనుగ్రహణము ఆశీర్వచనము పొందారు పొందిన వాడిని నేను ఎవరి నుంచి పొందానంటే సాక్షాత్తు సర్వదేవతాతీత స్వరూపుడైనటువంటి స్వామి నాకు ఇంకా పద్దెనిమిది ఏళ్ళు రాకుండా నువ్వు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తవి అవుతావు అన్నారు అధ్యాత్మ అంటే నేను మంచి సన్యాసిని కావాలి లేదా నేను మంచి scientist ని కావాలి చెట్టు ఉంటే ఈ రెండూ కలిపారంటే స్వామి అవును mathematics ఒక science physics ఒక science chemistry ఒక science అసలు ఈ ప్రకృతి అంతా కూడా science ఏ స్వామి ఆధ్యాత్మిక science ఎక్కడ ఉన్నదంటే కేవలం భారతదేశంలో మాత్రమే ఉన్నది గనుక ఆ శాస్త్రవేత్తవు నువ్వు అవుతావు అన్నారు అయినాము కార్యరూపం దొరకలేదు గానీ స్వామి మాట ఎప్పుడూ వృధా పోదు గనుక ఈవేళ మీరందరూ ఎప్పుడు పిలిచినా ఎవరు introduction ఇచ్చినా స్వామి చిరగాల ప్రియ భక్తుడు అని మాత్రమే నన్ను చెప్పండి మిగతావన్నీ ప్రాపంచికమైనవి ఆ degree చెల్లని కాగితం అయిపోయినాయి కదా నా గురించి ఏదో రాశారు ఏదో చెప్పారంటే అవన్నీ కాలచక్రంలో కలిసిపోతుంటాయి ఇవాళ ఇది కొత్త ఇది నాకు మొదటిది అనుకోవాలి కాబట్టి ఇటువంటి ఒక సంస్కారాన్ని ఒక భావ సంపదని అనుగ్రహించినటువంటి మా తల్లి మనందరికీ తల్లులున్నారు తల్లులు లేని వాళ్ళు ఎవరు లేరు తల్లి లేకపోతే రాలేదు ఎక్కడికి కానీ వాళ్ళంతా కూడా biological mothers ఇంకా ప్రకృతి సంబంధమైన తల్లులు వారు ఆత్మ పరమైనటువంటి తల్లి ఎవరంటే నాకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అట్లాగే ఆత్మ పరమైనటువంటి తండ్రి ఎవరంటే మణియ్య గారు ఆత్మ వేదమైనటువంటి గురువు ఎవరంటే ఆయనే మరి దేవీ దేవతలంతా ఉన్నారు ముప్పై ముక్కోటి దేవతలు అందరిట్లో మనకి ఇరవై ఒక్క మంది విష్ణు అవతారాలు ఉన్నాయి సూర్యుడున్నాడు ఇంకా దత్తాత్రేయుడున్నాడు ఏం పేరు పెట్టండి అనేకమైనటువంటి దేవీ దేవతల సమూహం అంతా కూడా ఈ భారతదేశంలో ఉన్నప్పుడు నిజానికి నీ గురువు ఎవరు నీ దైవము ఎవరు అంటే తల్లి తండ్రి ఈ జాతి నేర్పినటువంటి అంటే ఒక రాముడున్నాడని ఆ రాముడు అయోధ్యని కేంద్రంగా పాలించాడని పదకొండు వేల సంవత్సరాలు రామరాజ్యాన్ని నడిపించాడని వినటమే గానీ ఈ కంటితో చూడలేదు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడని వచ్చాడని ఆయన భాగవతం నిండా కర్మ యోగాన్ని భాగవతం నిండా భక్తి యోగాన్ని భగవద్గీత నిండా జ్ఞాన యోగాన్ని నింపి ఒకే కృష్ణుడు మూడు పాయలుగా ఒక యుగాన్ని సవరించాడని విన్నామే గానీ చూసిన వాళ్ళం కాదు కానీ కృతయుగం అంతా కూడా అది అస్థిగతం అంట అస్థి అస్థి అంటే ఎముక ఆ రోజుల్లో రాజ్యాలు లేవు నగరాలు లేవు గ్రామాలు లేవు ఉన్న చోటంతా కూడా భూమండలం మీద ఒకటిపై మూడో వంతు నేల మిగతాదంతా అరణ్యాలు నదులు సముద్రాలు అంతే మరి వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఆ సముద్రం పక్కన లేదా ఆ నది పక్కన అరణ్యం మధ్యలో కూర్చొని వచ్చి ఏం చేశారంటే ఈవేళ మనకున్నట్టుగా వృత్తులు లేవు వాళ్ళకి ఒకే పని మీద వచ్చారు ఈ గురువుఇదేదో చూశారు. ఎంత చూశారంటే అరణ్యాలు మొత్తాన్ని చూడగలిగారు, నదులు చూడగలిగారు, open గా ఉన్నటువంటి ఆకాశం చూడగలిగారు. చూసి అబ్బో! ఇంతేనా ఈ భూమండలం అంటే అని అనుకొని మళ్లీ వాళ్ళు ధ్యాన యోగ స్థితిలో పరమాత్మునితో అనుసంధానమైనారు పోయారు. కనుక ఎ-ఎంతగా అనుసంధానమైనారంటే శరీరం మీద ఉన్నటువంటి చర్మం పల్చనై లోపల ఉన్నటువంటి అస్థిపంజరం క-కనిపించేంతగా తీగలు ధ్యానం చేశారు. ఆ కారణంగా కృతయుగానికి అస్థిగతం అని పేరు. ఇక త్రేతాయుగం వచ్చింది త్రేతాయుగం అంటే అది మాంసగతం. మాంసమే ప్రధానంగా సాగినటువంటి ఒక నాటకత. ఆ అది ఎన్నాళ్ళున్నా సరే అది ఎట్లా సాగింది. ఇక ద్వాపర యుగం వచ్చేటప్పటికీ అది రక్తగతం. మహాభారతంలో ద్రౌపదికి జరిగిన అవమానానికి భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమిటంటే దుశ్శాసనుడి రొమ్ము చీల్చి ఆ రక్తంతో నీ కుళ్ళు చక్కగా కడిగి నీ పరాభవ వాసనని చల్లారిస్తాను అన్నట్లుగానే యుద్ధాలు జరిగినయి ఇంట్లో, ఊళ్ళో అన్నిచోట్లా యుద్ధమే. ద్వాపర యుగం ప్రారంభమే యుద్ధం అంతమే యుద్ధం. కాబట్టి స్పర్ధతో మనసుతో కూడినటువంటిది అంతా కూడా ఉంటే దానిని మరమ్మతు చేయడానికి వచ్చినటువంటి వాడు భగవాన్ కృష్ణ పరమాత్మ. ఒకే కృష్ణుడు ఒకే నామంతో మూడు భాగాలుగా వచ్చాడు. ఎలా వచ్చాడు? కృతయుగం అంతా అస్థిగతం అనుకున్నాం అది సత్యయుగం. త్రేతాయుగం అంతా మాంసగతం అనుకున్నాం అది ధర్మయుగం. ఎందుకని రాముడు నడిపించాడు. ఇక్ష్వాకు వంశంలో తొంభై తొమ్మిది మంది రాజులున్నా ఈ రాముడు అరవై నాలుగు మంది రాజులు. ఆయన తర్వాత ముప్పై ఐదు మంది రాజ్యం ఏలారు. కానీ ధర్మాన్ని గురించి కొంచెం చెప్పండి అంటే రామో విగ్రహ్వాన్ ధర్మః. రాముడి కథ చెప్తే ధర్మం అర్థం అయిపోతుంది. కాబట్టి త్రేతాయుగం అంతా ధర్మయుగమైంది. ద్వాపర యుగం అంతా ఈ కలహాలతో, పౌరుషాలతో, పగలతో, ఒగలతో, యుద్ధాలతో, స్పర్ధలతో సాగి అది రక్తగతమైనప్పుడు ఒక చైతన్యం, ఒక పాయ కృష్ణ పరమాత్మగా వస్తే రెండవ పాయ వేదవ్యాసుల వారిగా వస్తే మూడవ పాయ ద్రౌపదిగా వచ్చింది. ద్రౌపది అసలు పేరు కృష్ణ. వేదవ్యాసుల వారి పేరు కృష్ణ. కానీ ఆయన భీములో పుట్టాడు గనుక ద్వైపాయనుడయినాడు. వేదాలు రచించాడు గనుక వేదవ్యాసుడయినాడు. ఒకే విషయాన్ని విస్తృతంగా చెప్పాడు కాబట్టి ఆయన పద్దెనిమిదవ వ్యాసుడయినాడు. అలాగే వేము పడ్డ తోటలో కూర్చొని భాగవతం రాశాడు గనుక ఆయన బాదరాయణుడయినాడు. ఇట్లా అనేక పేర్లున్నా ఆయన అసలు పేరు ఏమిటంటే కృష్ణ. ఒక కృష్ణ ఏమో జగద్గురువు. ఒక కృష్ణ ఏమో వంశ వేసుకుంటూ వంశంలో గురుకులంలో చేసుకున్నాడు. ఆయన వ్యాస పూర్ణిమ పది-పద్దెనిమిది పురాణాలు ప్రపంచానికి ఇచ్చాడు. ఐదు వందల యాభై ఐదు బ్రహ్మసూత్రాలు ఉన్నాయి అని లోకానికి చెప్పాడు. కాబట్టి మనం చెప్పుకునే విష్ణు సహస్రనామాన్ని ఆయన రాశాడు. ఆర్ధాయ ప్రతిబోధిత భాగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథిత పురాణ మునినా మధ్యే మహాభారతం. అది ఎవరంటే గ్రంథ రచన చేశారు ఎవరు వ్యాసులవారు. అంటే భాగవతం కృష్ణుడు రాయలేదు. భాగవతం కృష్ణుడు రాయలేదు. హారతం కృష్ణుడు రాయలేదు. ఎవరు రాశారు అంటే వ్యాసులవారు రాశారు. కాబట్టి ఇదంతా ఒక చైతన్య ప్రవాహంగా వస్తే ఒక ద్వాపర యుగాన్ని మొత్తం నడిపించడానికి కారణమైనటువంటిది కురుక్షేత్ర సింహాసనానికి దారి తీసింది ఎవరంటే స్త్రీమూర్తి అయినటువంటి ద్రౌపది. కనుక కృష్ణుడు మూడు పాయలుగా వచ్చాడు. చైతన్యం మూడు పాయలుగా వచ్చింది. నిజానికి మైకు నడుస్తుందేమో నాకు తెలియదు. అందుకే డైరెక్ట్ గా మీకు వినపడదు. మీకు వినపడుతుంది. ఆ మీరు నిశ్శబ్దం కాబట్టి. కాబట్టి ద్వాపర యుగంలో ఏం కావాలి అంటే ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, రాజ్యాలున్నాయి, రాజభోగాలున్నాయి. కానీ శాంతి లేదు. ఇవాళ మనలాగే. అలాగే పరస్పరమైన ప్రేమలు లేవు. రామాయణ కాలంలో ఒక రాముడు తన అన్నదమ్ములని సొంత బిడ్డలుగా చూసుకున్నాడు. తల్లిదండ్రులని దైవ స్వరూపంగా చూసుకున్నాడు. తన అక్క అయినటువంటి శాంతని పరమ ధర్మ స్వరూపిణిగా చూసుకున్నాడు. అంటే ధర్మాన్ని గనుక మనం ఆచరించాలి అంటే రాముడి జీవితం చదివితే చాలు. రామాయణం చదివితే చాలు. అక్కడ అది ఏర్పడింది. మరి ఈ కాలానికి ద్వాపర యుగానికి ఏం కావాలి అంటే శాంతి కావాలి, ప్రేమ కావాలి. ప్రేమ లేకపోతే ఎంత సంపద ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత కీర్తి ఉన్నా, ఎంత సౌందర్యం ఉన్నా అది కుండుసున్నా. కాబట్టి శాంతి, ప్రేమ ఈ రెండింటినీ కూడా ప్రపంచానికి పరిచయం చేసిన వాడు కృష్ణ పరమాత్మ. అయితే కలియుగం వచ్చింది. మనం చెప్పుకునే మూడు పోయినయి. అస్థిగతం అయిపోయింది, మాంసగతం అయిపోయింది, తర్వాత ఇదిగో రక్తగతం అయిపోయింది. కలియుగం వచ్చేటప్పటికీ మానవుడిలో ఉండవలసినటువంటి మానవత్వం నశించి దానవత్వం, దీనత్వాలు ఈ రెండు విజృంభించి రాక్షస ప్రవృత్తులు ప్రబలినప్పుడు హింసా ప్రవృత్తులు పెనవేసుకుని ఉన్నప్పుడు ఈ కాలానికి కావలసినటువంటిది అహింస. అది ఎట్లా? అనేక యుగాలుగా ఇవన్నీ జరుగుతూ వచ్చాయే. ఇది నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ కృతయుగం ఉన్నది. కలియుగం ఉండాలి. అందులో ఐదు వేల ఏడు వందల అరవై ఏడు సంవత్సరాలు మాత్రమే ప్రథమ కాలంలో ఉన్నాం. మరి దీనిని ఎవరు నడిపించాలి? ఎవరు దీనిని సన్మార్గంలో పెట్టాలి అంటే కృతయుగం నాటి సత్యం, త్రేతాయుగం నాటి ధర్మం, ద్వాపర యుగం నాటి శాంతి ప్రేమలుకలియుగానికి కావలసిన అహింస ఈ ఐదు నాలుగు యుగాల ఈ ధర్మం ఐదు కలిసి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఒక్క మూర్తిమంతమైనటువంటి పరిపూర్ణ మహా అవతారం ఏంటంటే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా [చప్పట్లు] ఎంత మితిమీరి కనిపిస్తున్నారాయన కానీ నాలుగు యుగాల ఒక మహా సంస్కారం నాలుగు యుగాల తలకి తాగినటువంటి జ్ఞాన యోగ పరిమళంతో ఆ అవతారం వచ్చింది ఇటువంటి కలియుగంలో మానవుడు ధర్మస్వరూపుడిగా ఎలా జీవించాలి ఇవన్నీ కూడా మనకి నేర్పటానికి స్వామి వచ్చారు అయితే ఈ స్వామి ఎవరు? మనందరికీ తెలుసు మనకేం తెలుసు పుట్టపర్తిలో జన్మించారు పుట్టపర్తిలో ఉన్నారు పుట్టపర్తిలో దేహం వదిలేశారు దేహం వదిలేశాక చైతన్యం అక్కడే ఉన్నది ఇవన్నీ మనకు తెలిసినవే కానీ మూలంలో తనిఖీ చేసినట్లయితే మనకి మూడు త్రిమూర్తులు ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వర. బ్రహ్మకి అవతారమే లేదు ఆయనకు అవతారం ఎత్తవలసిన పని లేదు ఆయన డ్యూటీ కూడా అది కాదు ఇక విష్ణువు ఉన్నారు ఆయన ఇరవై ఒక్క అవతారాలు రావాలి భాగవతం పురాణం ప్రకారం. ఇరవై అవతారాలు వచ్చేటప్పటికీ యుగాలు అయిపోయాయి కలియుగం వచ్చేసింది. కలి-కలియుగంలో విష్ణువు మరొక అవతారం తీసుకుని రావాలి అంటే ఇంకా నాలుగు లక్షల ఇరవై సంవత్సరాల పైన అయితే తప్ప ఆ అవతారం రాదు. మరి ఎవరు రావాలి? ఈ కలియుగానికి ఎవరు తలపాడాలి అంటే కోటి సూర్యమండలం వచ్చేస్తే అయినటువంటి మహాత్ముడు ఉందని దేవి ఏమన్నదంటే కలియుగానికి అధిష్టాతంగా నేను వస్తాను నేను ఆ ఈ యుగాన్ని నడిపిస్తాను అన్నది. అమ్మా! ఒక సూర్య మండలంలో నుంచే లక్షా ఇరవై వేల మైళ్ళ దూరంలో ఉన్న సూర్య భు-భుగళం నుంచి ఒక కిరణం నేల మీదకు భూమండలం మీద పడ్డప్పుడు మేము సల్లడిల్లిపోతున్నాము కోటి సూర్యమండలం వచ్చేస్తేన నీవు వెనుకొస్తే ఈ భూమి నిలబడుతుందా అని దేవీ దేవతలందరూ అడిగినప్పుడు వస్తే రావాల్సి వచ్చినప్పుడు ఇలా వస్తానా ఎలా వస్తానంటే పరమ శాంత స్వరూపమైన పరమ శక్తివంతమైన పరమ యోగ్యమైనటువంటి మూలాధారమైనటువంటి శ్రీ లలితా దేవిగా వస్తాను అని నిర్ణయించుకుంది. అయితే చూడండి ఈ ప్రకృతి శివుడు అనగానే అర్ధనారీశ్వర తత్వం చెప్తాం శివుడు పార్వతి కలిసి ఉన్నారు అని నిజానికి మనం కూడా అలాగే కలిసి ఉన్నాం ప్రతి పురుషుడిలో ఒక స్త్రీ ఉంది ప్రతి స్త్రీలో ఒక పురుషుడున్నాడు. కనుకనే స్త్రీ రాజ్యమేలగలిగింది యుద్ధం చేయగలిగింది ఆ ఇల్లు నడపగలుగుతున్నది ఎన్ని ఉన్నా అద్భుతంగా చాకచక్యంతో తీసుకు వెళ్తున్నది అది ఆమెలో దాగిన పురుషత్వం మరి పురుషుడున్నాడు పిల్లల్ని కంటున్నాడు ముద్దాడుతున్నాడు గదిలకు తీసుకుంటున్నాడు బాధ్యతలు నెరవేరుస్తున్నాడు ఇది ఒక సంకల్ప మాత్రమైనటువంటి జీవుడు కూడా అర్ధనారీశ్వర తత్వంతోనే ఉన్నాడు. ఇది ఈ ప్రస్తావన వచ్చింది గనుక లలితాదేవి ఏమన్నదంటే నాలో ఒక భాగం శ్రీ లలితగా వస్తుంది మరొక భాగం శ్రీ దత్తుడిగా వస్తుంది ఆ దత్తుడే ఈ ప్రపంచంలోకి వస్తాడు మరి ఈ దత్తుడు అంటే ఎవరు? దత్తుడు అంటే జగత్తునే దత్తం చేసుకునేవాడు దత్తుడు అంటే ఈ జగత్తంతా నాది నాకంటే భిన్నంగా ఈ జగత్తు లేదని ఒక మాట రెండవది తనను తాను ఈ జగత్తుకి అంకితం చేసుకునేవాడు దత్తుడు అంతే దత్తుడు అంటే మన ఆ మూడు బొమ్మల బొమ్మ కాదు దత్తము అంటే అడాప్ట్ చేసుకోవడం మనల్ని మనం ఈ ప్రపంచానికి ఇచ్చేసుకోవడం మన దగ్గరే కులించుకో పోయి ఇవన్నీ నా దగ్గరే ఉండాలి అనుకోకుండా అది సంపద గాని జ్ఞానం కానీ విజ్ఞానం గాని ప్రజ్ఞానం గాని సుజ్ఞానం గాని ఏది ఉన్నదో ప్రపంచానికి వితరణ చేసేటువంటి స్థాయిలో మీరంతా నడుస్తారు గనుక శ్రీ దత్త స్వరూపంగా ఒకవైపు లలితా దేవిగా రెండవ వైపు నేను వస్తాను అని ప్రకటించింది. అలా ప్రకటించడంతో కలియుగం ఆరంభమైంది ఆరంభమైనటువంటి వేలకొన్ని యుగాలు ఎట్లా గడిచినా నెమ్మది నెమ్మదిగా ఈ దత్త అవతారం అనేది ఈ జగత్తులోకి ఒకటి రావాలి రావాల్సి ఉన్నది అది ఆ చైతన్యంలో జరిగినటువంటి ఒక సంకల్పం ఆ సంకల్పంలో వచ్చినటువంటి ప్ర-ప్రథమ దత్త అవతారం ఏది అంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ నామంతో ప్రథముని దత్తావతారం వచ్చింది. తర్వాత అక్కనకోట మహారాజని నృసింహ సరస్వతి అని అనేకమైనటువంటి అంశావతారాలు వచ్చినాయి మరి ఈ అవతారాల్లో మనం పూర్ణావతారం అంటున్నాం అనేక అవతారాలకు పేర్లు పెట్టాం అంటే అర్ధావతారము ఒక అంశగా కళావతారము విహితావతారం అని అనేక రకాలుగా వస్తే ఒక కారణమైనటువంటి అవతారము వస్తుంది అట్లా వచ్చినటువంటి ఈ శ్రీపాద శ్రీవల్లభుడు తర్వాత అందరూ వస్తే సంత దేశమైనటువంటి మహారాష్ట్ర దేశంలో శ్రీ శివ రామ కృష్ణ ఖండోబా విఠోబ నాథ అనేటువంటి అనేక సాంప్రదాయాలతో ఉన్నప్పుడు హైందవులు ముస్లిమ్స్ దక్షణ పడుతున్నప్పుడు దానిని సముద్ధరించటానికి ఈ శివ రామ కృష్ణ మారుతి విఠోబ నాథ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సమన్వయం చేసి ముస్లింలు హిందువులు ఒక్కటే అనంతమైనటువంటి మానవజాతి ఒక్క జాతి ఇది ఒక్క కులము ఇది ఒక భాషతో ఉంటుంది అని చెప్పటానికి వచ్చిన ప్రప్రథమ పరిపూర్ణ దత్త అవతారము షిరిడి మహా స్వామి వారలా వచ్చారు అయితే వారు జీవించిన కాలంలో తొలి ముప్పై తొమ్మిది సంవత్సరాలు తాను ఏమిటో ఈ ప్రపంచానికి చెప్పలేదు ఆయన జ్ఞాని అజ్ఞాని ఉన్నత్తుడా అవధూత.బ్రాహ్మణుడా? అబ్రాహ్మణుడా? పండితుడా? అపండితుడా? ఎప్పుడూ మీమాంసే. కానీ ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయిన తర్వాత ప్రపంచానికి బహిర్గతమైనారు. బయట పెట్టారాయనని. ఎలా పెట్టారంటే, వెళ్ళటం అంటే మొదటిసారి వెళ్ళినప్పుడు మహల్ సాపతి అనే ఒక పూజారి ఖండోబా ఆలయంలో ఆయన పడుకొని ఉంటే, "నువ్విక్కడ పడుకోవటానికి వీల్లేదు. వెళ్ళిపో" అన్నాడు. షిరిడీ నుంచి వెళ్ళగొట్టాడాయనని. మళ్ళీ ఒక పెళ్లి బృందంతో వచ్చినప్పుడు అదే మహల్ సాపతి "ఆవో సాయి" అని పిలిచాడు. అప్పటిదాకా ఆయనకి పేరు లేదు. "ఆవో సాయి" అని పిలిచినప్పుడు ఆయన లోపలికి రావటం. మనం ఇక్కడ సిర్ది, షిరిడీ అనేక రకాలుగా అంటున్నాం. నిజానికి దాని పేరు శిలాది అంటే చెరుకుతోట అని అర్థం మరాఠీలో. ఆ శిలాదిలో మధ్యలో ఒక వేప చెట్టు ఉంది. ఈ సమస్త ప్రపంచము ఒక నందనవనము, బృందావనము, మధుర మధురం అయినటువంటి ఒక చెరుకుతోట అయినట్లయితే దీనిలోనే ఒక చేదుగా ఉండేటువంటి జీవన వృక్షం ఉంటుంది. అందుకనే సదా నింబవృక్షస్య మూలాదివాసాః అని మనం అంటాం. నింబవృక్షం అంటే వేప చెట్టు. దాని వృక్ష, ఆ చెడుని తగ్గిస్తూ దాని మీద అధికారాన్ని పెట్టి అణగదొక్కి జ్ఞాన బాంతులు వెలాచ్చన ఆయనకి షిరిడీ మహాస్వామి రావటం జరిగింది. ఆ జరిగిన తర్వాత ఆ కథంతా నాకు సంచరిత్రంతా చెప్తుంది. దాని లోతుకు వెళ్ళక్కర్లా. అయితే పంతొమ్మిది వందల పద్దెనిమిది విజయదశమి నాడే షిరిడీ బాబా తన దగ్గర ఉన్నటువంటి ఒక ఏడు, ఎనిమిది మంది భక్తులతో మాత్రమే అంటే అంతర్గతంగా చాలా దగ్గరగా ఉన్నవారితో వారు ఏం చెప్పారంటే "సరిగ్గా ఎనిమిది సంవత్సరాలకి ఆంధ్రదేశంలో మళ్ళీ నేను తిరిగి వస్తాను" అని చెప్పారు. పంతొమ్మిది వందల పద్దెనిమిది నుంచి ఈ ఎనిమిది సంవత్సరాలు లెక్కవేడితే పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబరు ఇరవై ఒకటవ తారీఖున పుట్టపర్తి గ్రామంలో సత్యసాయి భగవానుడిగా షిరిడీ మహాస్వామి మళ్ళీ అవతరించారు. ఇది ఒక చారిత్రకమైనటువంటి అంశం. అయిన తర్వాత మరి ఈయన ఆ చాలా షిరిడీ బాబా అవతారమే అనడానికో, దైవత్వమే అని అనుకోవటానికో నిదర్శనం ఎవరన్నా చెప్పరాదు. ఆయన ఎందుకంటే చెప్పుకునే దేవుడ్ని ఆయన. దీనికి ఈ వచ్చినది ఈ చైతన్యం అని చెప్పటానికి దీనికి ఒక ఉదాహరణ. వచ్చినప్పుడు మాత్రం. పాండిచ్చేరిలో అరబిందో మహా యోగి ఏం చేశారంటే ధ్యానంలో ఉన్నారు. ఆయనకి రెండు కోరికలున్నాయ్. ఒక కోరిక భారతదేశం యొక్క స్వాతంత్రం అనేటువంటిది నా జన్మదినమైనటువంటి ఆగస్టు పదిహేనున రావాలి అని డిమాండ్ చేసి ధ్యానం చేశాడు. మనందరికీ తెలుసు, మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ఆ కల నెరవేరింది. రెండవది, ఏ కృష్ణ చైతన్యం శాశ్వతమని నేను నమ్మానో, ఏ కృష్ణ చైతన్యం ఈ ధర్మం మీద, సత్యం మీద, శాంతిని గురించి, ప్రేమ గురించి మళ్ళీ ప్రపంచానికి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదీ ఏది దిగి రావాలో అది కృష్ణ చైతన్యం దిగి వచ్చేదాకా నేను ప్రాణంతో ఉండాలి, అది నేను వినాలి అని అనుకున్నప్పుడు నవంబరు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఆరు అంటే, ఆ స్వామి పుట్టిన ఇరవై నాలుగు స్వామి పుట్టిన మరునాడే ఆయన పాండిచ్చేరి నుంచి ఒకటి ప్రకటన చేశారు. ఏ ధ్యానంలో ఏ కృష్ణ చైతన్యం ఈ జగత్తులోకి రావాలని నేను ఇంతగా తపించానో, తపన పడ్డానో ఆ కృష్ణ చైతన్యం భూమి మీదికి వచ్చింది అని ప్రకటించారు. ఎవరు? అరబిందో మహా యోగి. కనుక ఐదు, నాలుగు యుగాల యొక్క ఐదు అంశాలు సత్య, ధర్మ, శాంతి, ప్రేమ ఈ అంశాలు ఒకటి. రెండవది కృష్ణ చైతన్యమే మళ్ళీ ఈ జగత్తులోకి శ్రీ సత్య సాయి భగవానుడిగా వచ్చింది. ఇది నేపథ్యం తెలిస్తే తప్ప స్వామి ఇన్ని పనులు ఎలా చేయగలిగారు, ఎక్కడైనా యుద్ధం చేశారా, ఎక్కడైనా స్పర్ధ కలిగించారా, ఎక్కడైనా మూడు వేల ఎనిమిది వందలు ఉపన్యాసాలు చేశారు. దానిలో ఒక్క పొరపాటు మాట పొరపాటు గురించి తక్కువ చేస్తూ ఎప్పుడన్నా మాట్లాడారంటే అది దైవత్వం కాబట్టి మాట్లాడారు. మనిషి దైవం, దైవం కాదు కాబట్టి తనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని తాను ఇంకా గమనించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా మానవ స్పర్శతో, జీవన స్పర్శతోనే జీవుడి పరిధిలోనే ఉంటాడు. గనుక మనం మనంగా ఉండిపోయినాం. కానీ భగవాన్ సత్య సాయిబాబా తాము వచ్చినటువంటి కార్యక్రమాన్ని తన ప్రధానమైనటువంటి ప్రపంచానికి విశదపరిచి మే ఇరవైవ తారీఖు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే పంతొమ్మిది వందల నలభైలో నేను సాయిబాబాను అని ప్రకటించడం, మళ్ళీ అక్టోబరు ఇరవై అదే సంవత్సరం పంతొమ్మిది వందల నలభైలో తన అవతార కార్యక్రమాన్ని ప్రకటించడం, శరీరానికి ఇరవై ఏడు, ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చేసరికి ప్రశాంతి నిలయం నిర్మాణం చేయడం ఇవన్నీ చెక్క చెదర జరిగిపోయినాయి. ఎందుకంటే త్రేతాయుగన్నానికి పదకొండు వేల సంవత్సరాలు కలియుగానికి లేవు. ద్వాపర యుగానికి ఉన్న తొమ్మిది వేల సంవత్సరాలు దీనికి లేవు. దీనికి ఎన్నున్నాయి? మనిషి యొక్క ఆయు ప్రమాణం వందేళ్ళు మాత్రమే. తగ్గించుకుంటూ వచ్చాం. ఈ వందేళ్లలో మనిషి ఎంతవరకు చేయగలడంటే తన శక్తి యుక్తులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు చేయగలడు. కానీ దైవమే మానవ రూపంలో గనుక వస్తే మన, మనలాంటి ఒక దేహం తీసుకొని గనుక వస్తే ఏం చేయాలో, ఏం చేయగలడో, ఏం చేస్తే ఈ ప్రపంచానికి క్షేమం కలుగుతుందో, దేని వలన మానవుడి యొక్క యోగం నెలకొంది చెందుతుందో, మానవుడిలో ఉన్నటువంటి మానవ, దానవ, దీన, దివ్య అనుభూతులన్నీ కూడా చక్కగా బయటకు వస్తాయో, దానవత్వం నశిస్తుందో, దీనత్వం సమసిపోతుందో, మానవత్వం పరిమళిస్తుందో, మాధవత్వం ఆవిష్కృతమవుతుందో ఇవన్నీ కూడా స్వామి తమఈ అవధి సంచారంలో కేవలం ఎనభై ఆరు సంవత్సరాల కాలంలో మాత్రమే వీటన్నింటినీ పూర్ణం చేశారు. ఇక్కడ కొద్దిగా మనం స్వామి గురించి చెప్పుకోవాలి. ఎందుకని రామావతార, కృష్ణావతారాల కంటే ఇది భిన్నము అంటే, రాముడు ఇందాక చెప్పినట్టుగా అరవై నాలుగు ఏళ్ళ రాజు. తొంభై తొమ్మిది మంది ఇక్ష్వాకురాజులు ఉంటే ఆయన అరవై నాలుగు. అంటే స్వామి శ్రీరామచంద్రుడు వచ్చేసరికి రాజ్యం ఏర్పడింది. మంత్రులు ఏర్పడ్డారు. హితపురోహితులున్నారు. వశిష్టులు, విశ్వామీత్రుడు వంటి గురువులున్నారు. కోశాగారం నిండిపోయి ఉంది. పాలించటానికి రాజ్యము, పాలితులైనటువంటి వాళ్ళకి, ఆహ్ పాలితులకి పాలకుడు, అయోధ్య ప్రజలు ఏర్పడ్డారు. అంటే ఒక వ్యవస్థీకృతమైనటువంటి వ్యవస్థ ఏర్పడిన స్థితిలో రామచంద్రుడు వచ్చారు. యుగం మారింది. ద్వాపర యుగం వచ్చింది. రాముడు కాగలిగిన, రాజుగా ఉండగలిగిన, రాజ్యం ఏలగలిగిన, అన్ని అవకాశాలు వచ్చినా కేవలం రాజులను నియమించడమో తయారు చేయడమే మాత్రమే తన పరమావధిగా, యుగధర్మంగా పెట్టుకున్న కృష్ణ పరమాత్మ ఎన్నడూ రాజు కాలేదు. కానీ రాజులందరూ ఆయన వశంలో ఉన్నారు. అంటే డబ్బున్నది, జనంన్నారు, మంత్రులున్నారు, అద్భుతమైన వ్యవస్థ ఉన్నది. కలియుగంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబరు ఇరవై మూడు నాటికి స్వామి ఎంచుకున్న ప్రదేశం ఏమిటి? అది అయోధ్య కాదు, అది బృందావనము కాదు. అయోధ్యలో సరయు నది ఉంది. నది ఉంటే నాగరికత ఉంది. కృష్ణుడి సమయంలో యమునా నది ఉంది. గనక నాగరికత ఉంది. ఇక్కడ సముద్రమూ లేదు. నదీ లేదు. అసలు నీళ్ళే లేవు భూగర్భంలో. ఆకాశం నుంచి చుక్క నీరు నేల మీద పడదు. క్షేత్రాలన్నీ ఊసరవెల్లి క్షేత్రాలు. అక్కడ ఏమీ పంట పండదు. మే దింగ ఆహ్ తినటానికి ఒక మెతుకు లేదు. ఇళ్ళు తక్కువ, పుట్టలు ఎక్కువ, మనుషులు మరీ తక్కువ, పాములు ఎక్కువ. అటువంటి ప్రదేశాన్ని సత్యసాయి భగవానుడు ఎంచుకొని పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వచ్చినప్పుడు, ఆ తర్వాత మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే అప్పుడు మతం అంగడి సరుకు అయిపోయింది. అంటే బజారులో వెళ్ళి మా మతం మార్పిడి అయితే డబ్బు వచ్చేస్తుంది. అనేటువంటి దుర్భరమైన స్థితిలో ఉన్నప్పుడు స్వామి ఈ అవతారం దాల్చి, ఈ శిక్షిస్తే ఈ యుగం నడవదు. వీళ్ళందర్నీ మంచి మార్గంలో పెట్టాలి. ప్రతి మనిషి దివ్య స్వరూపుడే. నిజానికి ప్రతి మనిషి దైవతమే. కానీ వాడు గ్రహించలేకపోతున్నాడు. ఈ గ్రహించటానికి మార్గం ఏమిటని స్వామి మీరు అలా చేయండి, ఇలా చేయండి అని బోధ చేయకుండా తాను పుట్టినటువంటి పుట్టపర్తి గ్రామాన్ని ఒక రోల్ మోడల్ గా ఒక నిర్మాణం చేసుకొని, ఇవాళ మనం ఆహ్ ఫలానా వాడు దత్తంత తీసుకున్నాడు అని పేపర్లో చదువుతాం. వాడు దత్తంత తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. కానీ స్వామి చెప్పకుండా దత్తంత తీసుకున్నారు. తీసుకుని ఆ పుట్టపర్తి గ్రామాన్ని ఎలా వికాసమానం చేశారో, ఇందాక చెప్పినటువంటి ఆనాటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రపంచ పటంలో ఆధ్యాత్మికమైనటువంటి కేంద్ర బిందువుగా దాన్ని ఒక పుట్టపర్తి కుగ్రామాన్ని ఇట్లా ఎలా తయారు చేశారో చూసినప్పుడు, దైవం మానవ రూపంలో వచ్చినప్పుడు ఏం చేయాలో ఏం చేయగలడో నిరూపించారు. ఇది ఒకటి. రెండవది వేదాలన్నీ కూడా మనకు చెప్పినాయి. వసుదైవ కుటుంబకం. ఇవాళ మనం ఫలానా ఇళ్ళకు ప్రహరీ గోడలు కట్టి ఈ ఆస్తి నాది అంటున్నాం. ఈ గ్రామం నాది అంటున్నాం. ఈ రాష్ట్రం నాదే అంటున్నాం. ఈ దేశం మాదే అంటున్నాం. కానీ వేదాలు ఇది చెప్పలేదు. ఈ సమస్త ప్రపంచం కూడా వసుదైవ కుటుంబకం. కనిపిస్తున్న ఈ సృష్టి అంతా ఒకే కుటుంబం. ఆ గొడుగు కింద అన్ని జాతులు ఉండాలి, అన్ని వర్ణాలు ఉండాలి, అన్ని వర్గాలు ఉండాలి, అన్ని రకాల మనుషులు ఉంటారు. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, దాతలు, దాత గ్రహీతలు, దాన గ్రహీతలు అందరూ ఉంటారు. కానీ అందరూ కూడా కలిసి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ స్థితి వసుధైవ కుటుంబకం. అంతేతప్ప ఐరోపా దేశం వేరు, అమెరికా వేరు, ఇండియా వేరు అని వేదం చెప్పలేదు. సమస్త సృష్టి ఒకే కుటుంబం అని చెప్పినప్పుడు, ఏదో వేదాల్లో చెప్పారులే, అది అయ్యేదా పోయేదా అంటే మరి సత్యసాయి భగవానుడి యొక్క అవతారం వచ్చేదాకా ఇప్పుడు రాముడున్నాడు. ఆయన అయోధ్య నుంచి అరణ్యవాసం చేస్తూ చేస్తూ సీతమ్మవారిని రావణుడు తీసుకొని వెళ్ళిన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం మీదుగా శ్రీలంకకి ఆయన వెళ్లారు. ఇది మనకు తెలిసినటువంటి జియోగ్రాఫికల్ పాత్ అంటాం. భౌగోళికమైనటువంటి ఒక మార్గంలో రాముడు ఆహ్ అయోధ్య నుంచి శ్రీలంక దాకా వెళ్ళాడు. మరి కృష్ణుడి సంగతి ఏమిటి? ఆయన విజయ ప్రదేశాలు దాటి ఎక్కడికీ రాలేదు. మనకు తెలీదు. బృందావనం, మధుర, యమునా నది, హస్తినాపురం, అవతార స్థలాలు. ద్వారక. అక్కడికక్కడే తిరిగాడు. కానీ కృష్ణుడి యొక్క ఆ చైతన్యం, ఆ గురుతత్వాన్ని అఖండ భారతమాత అని గ్రహించింది గనుక ఇంకా మనం కృష్ణాష్టమి చేస్తున్నాం. ఇంకా దళారంభం చేస్తున్నాం. మరి ఇటువంటి ఏ నేపథ్యమూ లేకుండా పుట్టలు, మనుషులు లేని ప్రదేశంలో, పంట పడని ప్రదేశంలో, బీడు ప్రాంతంలో, వర్షాధారమైనటువంటి ఒక భూమి మీద అవతరించినటువంటి సత్యసాయి భగవానుడు కేవలం ఇదంతా కూడా ఆహ్ క్షేత్రం చేయటం మాత్రమే కాదు, మానవుని యొక్క హృదయం కొమ్మదని, దానియందు దయ, జాలి, సానుభూతి, కరుణ, ప్రేమ ఇవన్నీ ఉండాలి అని, ఉన్నాయని, వీటన్నింటినీ వెలికి తీయాలని నిర్ణయించుకొని స్వామి పద్నాలుగు ఏట ఏ అవతార పరమార్ధాన్ని డిక్లేర్ చేశారో, ప్రకటన చేశారో, అవతార లక్ష్యాన్ని చెప్పారో, చూడండి రాముడి అవతార లక్ష్యం ఏం చెప్పలా. ఒకే ఒక్కమాట చెప్పారు. శ్రీమహావిష్ణువుగా ఉన్నప్పుడు దేవీదేవతలందరూ కూడా వెళ్లి, భూలోకం నుంచి కొంతమంది వెళ్లి, "అయ్యా! రావణాసురుడు శైవమే గొప్పదంటున్నాడు. వైష్ణవులనందరినీ ఇబ్బంది పెడుతున్నాడు."మత కలహం పెరిగింది మరి నువ్వు రావాలన్నప్పుడు నేను రామచంద్ర నామంతో వస్తాను దశరథుడి ఇంట పుడతాను దశకంధరుడు అంటే రావణ పునః యొక్క పది తలలు కుత్తుకలు ఉత్తరిస్తాను దశ యుగాల వరకు నా నామం వినబడేట్టుగా శ్రీరామచంద్ర నామంతో జన్మ ఎత్తి వస్తాను అని ప్రకటించాడు. ఎప్పుడు అవతారం రాకముందు ఇక కృష్ణుడు వచ్చాడు, వచ్చి ఆయన ఏమి అవతార declaration చేయలేదు. ఆయన ఏం చేశాడు కొంతకాలం అయిపోయిన తర్వాత మహాభారత యుద్ధం జరుగుతున్నటువంటి ఒకానొక సమయంలో యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి అహం ధర్మానికి గ్లాని జరిగినప్పుడల్లా నన్ను నేను సృష్టించుకుంటూ ఇక్కడ వస్తూ ఉంటానని అప్పుడు చెప్పాడు అంతే కాదు వచ్చి ఏం చేస్తాను, చేస్తానని చెప్పాడు పరిత్రాణాయ సాధూరాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కాబట్టి కృష్ణ పరమాత్మ రాముడేమో అవతారం రాకముందే చెప్పాడు కృష్ణుడేమో ఇంక కొద్ది రోజుల్లో అవతారం పరిసమాప్తం అయ్యేటువంటి సమయంలో తన అవతార ప్రకటన చేశాడు. వీటన్నింటికీ భిన్నంగా సత్యసాయి భగవానుడు తన పద్నాలుగవ ఏట అతి యవ్వన ప్రారంభంలో బౌమానంలోకి వచ్చాడే ఇంకా యవ్వనంలోకి వెళ్ళలా ఆ బౌమాన దశలో తాను ఏం చేయాలి వేదోద్ధరణ, దీనజనోద్ధరణ, ధర్మోద్ధరణ ఒక జాతిని ఉత్తరించేటువంటి దిశగా ఇలా నా కార్యక్రమం సాగుతుంది అని ప్రకటించారు. ఆయన ఎప్పుడూ నేను దేవుడిని అని ప్రకటించలేదు మనం ఆయన్ని దైవదంగా భావించాము. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి సత్యసాయి భగవానుడి యొక్క అవతారం చాలా అపురూపమైనటువంటి అవతారం భిన్నమైన అవతారం. రాముడు కృష్ణుడు వచ్చారు. వాళ్ల కాలంలో వాళ్లు చేయగలిగిది చేశారు వాళ్లు చేయవలసింది చేశారు. రావణాసురుడికి రాముడు వచ్చాడు ఆ పని పూర్తి చేశాడు. కౌరవ వినాశనం చేయాలి మళ్ళీ శాంతి ప్రేమలు ఈ ప్రపంచానికి నేర్పాలి కృష్ణుడు వచ్చాడు మహాభారత సంగ్రామం అయిపోయింది. ఇక తర్వాత వచ్చే యుగం ఏమిటో ఆయనకు తెలుసు గనుక అందరూ సందేహంగా అనేకమైన జవాబులను వెతుక్కుంటూ ఉంటారు గనుక మొదటి ఆరు కాండలు ఆరు అధ్యాయాలు కూడా కర్మయోగంగా మధ్యలో ఉన్న ఆరు కూడా భక్తియోగంగా చివరి ఆరు జ్ఞానయోగంగా కర్మ, భక్తి, జ్ఞాన అనబడేటువంటి ఈ మూడు యోగాలు కూడా యోగ త్రివేణిగా పారించి దానినే భగవద్గీతగా మనకు అందించారు. ఇక్కడ ఆ తర్వాత చోట లేనేలేదు అయిపోయింది కాబట్టి యుగానికి ముందొకరు యుగానికి తర్వాత ఒకరు కానీ సత్యసాయి భగవానుడు తమ పద్నాలుగవ ఏట ఈ ప్రకటన చేసిన మరుక్షణమే తన కార్యక్రమానికి స్వీకారం చెప్పారు. ఏమిటి అది? మానవుల్ని ఉత్తరించాలి మానవులలో ఉన్న దీనత్వము, దానవత్వము నశించేట్టుగా చేయాలి. చేయాలి అంటే చూడండి స్వామి చమత్కారము, సంస్కారము, పరోపకారము, ఆపై సాక్షాత్కారం ఇది ఒక వరుస ఆయన చెప్పింది. అంటే చమత్కారం గనక లేకపోతే మనం దైవము అని నమ్మం మనం అక్కడికి వెళ్ళం. ఈ మందిరానికి వస్తే మనం అనుకున్న పనులు అయిపోతాయి, ఈ మందిరానికి వస్తే మనకు రోగం చలోతుంది, ఈ మందిరానికి వస్తే రుణబాధలు పోతాయి, ఈ మందిరానికి వస్తే శాంతి కలుగుతుంది అందుకే ఈ మందిరానికి వస్తాం అంతేనా? అలాగే భగవంతుడు కూడా మనకు ఏదో చూపిస్తే తప్ప ఏదో అనుభవాన్ని ఇస్తే తప్ప మనం కూడా ఆయన భగవంతుడు అనే నమ్మం. కనుక ఈ పధ్నాలుగు ఏళ్ళ తర్వాత స్వామి అవతార కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు స్వామి దేహానికి పదహారు ఏళ్ళు వచ్చేసరికి నెమ్మదిగా ఒక ఉదృతి ప్రారంభమైంది. అయిన తర్వాత సుమారుగా రెండు ఇంటూ పదహారు అంటే మొదటి పదహారు, రెండో పదహారు, మూడో పదహారు నలభై ఎనిమిది ఏళ్ళు ఆ శరీరానికి వచ్చేప్పటికీ మహిమా స్వరూపంగా ఈ ప్రపంచంలో స్వామిని అందరూ కూడా అనుభవించారు. అంటే ఆయన ఏదైనా సృష్టించగలరు, ఏదైనా చేయగలరు, ఆయన ఏది అంటే అది అయిపోతుంది, ఆయన చూపు మీద పడితే రోగాలు పోతాయి, ఇవన్నీ కూడా ముప్పై రెండు సంవత్సరాలు స్వామిని మహిమా స్వరూపంగా అమిత తత్వంగా భావించారు. మరి ఆ శరీరానికి యాభై సంవత్సరాలు వచ్చేప్పటికీ ఈ జనము, ఈ జగత్తు ఎలా అర్థం చేసుకున్నది అంటే ఈయన కేవలము ఒక మతానికి కోసం వచ్చినటువంటి వ్యక్తి కాదు. వీరు సర్వ ధర్మాలని కూడా ఏకం చేసి అన్నింటినీ ఒక చోట కూర్చడానికి వచ్చారని పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో ఉన్నటువంటి సర్వధర్మ స్థూప నిర్మాణం అప్పుడు చేశారు. అప్పుడు స్వామి రెండేళ్ల ముందు ఒక మాట చెప్పారు. ఒకానొక రోజున ఆకాశంలో నుంచి ఇక్కడ పుట్టపర్తి మీద కృష్ణవర్షం కురుస్తుంది అన్నారు. నీళ్లే కురవు మొక్కలే లేవు, పూలే లేవు ఎక్కడినుంచి పడతాయి అనుకున్న వాళ్ళకి సర్వధర్మ స్థూప నిర్మాణననాడు జరిగినటువంటి ఒక అద్భుతం ఏంటంటే ఆకాశం నుంచి హెలికాప్టర్ల నుంచి కొన్ని టన్నుల పూలు స్వామి మీదే పడ్డాయి. ఇది ఒక అద్భుతం. కాబట్టి ఇది అయిపోయింది అరవై ఏళ్ళు, యాభై ఏళ్ళు అయిపోయింది. అప్పుడు నెమ్మదిగా స్వామి ఆలోచన చేశారు ఇంకా ఏం చేయాలి? అంటే ఒకానొకప్పుడు మనం ఈ దేశంలో విద్య నేర్చుకున్నాం. గురువుల దగ్గరికి పోయినాం. ఇవాళ బాల వికాస్ లాగా. గురుకులం చదివిన తర్వాత మనమందరం అనేకమైనటువంటి విద్యలు నేర్చుకున్నాం. కానీ పందొమ్మిది వందల యాభైవ సంవత్సరం వచ్చేనాటికి ఆ ప-- స్వామికి యాభై ఏళ్ళు వచ్చేసరికి ఈ దేశంలో చదువు అమ్మకానికి వచ్చేసింది. చదువుకోవటమే గాని చదువుకోవటం కొలిది. అటువంటి సమయంలో ఎటువంటి విద్య ఒక డిగ్రీ, డిగ్రీతో గుమస్తా ఉద్యోగం దాంతో ఒక సంసారం దాంతో ఏదో ఒక భద్రత ఆ తర్వాత పెన్షన్ మళ్ళీ ఒక తారుmarring కలిసుకోవడం ఇదేనా? మానవతా--ఒక విద్యా విధానం మానవుడిలో ఉన్నటువంటి మానవత్వాన్ని బయటకు తీసే పద్ధతి ఏమిటి? ఎక్కడ ఉన్నది అని ఆలోచన చేసి స్వామి వేదాలు ఉపనిషత్తులలో దాగి ఉన్నటువంటి అనేకమైనటువంటి రహస్యాలన్నింటినీ కూడా ఆధునిక మానవుడు అందుకునేటువంటి భాషలో అందరికీ అర్థమయ్యేటువంటి విధిలో ఒక విద్యా విధానాన్ని రూపకల్పన చేసి దానిని ఈ ప్రపంచానికి ఇచ్చారు. ఈ విద్య అయిపోయిన తర్వాత దానితో పాటుగా చెడిపోయిన ఒక వ్యవస్థ ఉంది. అది వైద్య వ్యవస్థ. ఆ వైద్య వ్యవస్థలో ఏమైంది అంటే ఒకప్పుడు ఒక డాక్టర్ అంటే దైవమే. వైద్యో నారాయణో హరిహి అంటే వైద్యుడైనటువంటి వాడు ప్రతి వాడు భగవంతునితో సమానం, హరితో సమానం అని అనిపించుకున్న ఈ జాతి నెమ్మది నెమ్మదిగా వైద్యుడు అంటే మన ఆస్తి దోచుకునే వాడు, ప్రేమ లేనివాడు, కరుణ లేనివాడు, జాలి లేనివాడు అనేటువంటి ఒక విపరీతమైన ధోరణి వచ్చినప్పుడు వైద్య రంగాన్ని సముద్ధరించడానికి సత్యసాయి భగవానుడు చక్కగా దృష్టి సారించి ఇవాళ మనం చెప్పుకునేటువంటి సూపర్ స్పెషాలిటీ అనండి, జనరల్ హాస్పిటల్ అనండి, ఇవన్నీ కూడా వైద్య విధానానికి కూడా ఒక క్రొత్త రూపాన్ని ఇచ్చారు. వైద్యని, వైద్యాన్ని కూడా సేవగా చేయగలిగినటువంటి ఒక శక్తి, దానికి నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. ఇక్కడ ఈ మందిరంలో కూర్చొని మనం మాట్లాడుతున్నామో ఆ డాక్టర్ గారు నారాయణ స్వరూపమే. అది నేను చెప్పేది కాదు. ఈ ప్రాంతం అంతా చెప్తుంది. ఈ ఊరు అంతా చెప్తుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళనందరినీ కూడా తయారు చేశారు స్వామి. స్వార్థం, నిస్వార్థం తర్వాత పరిపూర్ణమైన కరుణ, దయ, మానవ భావం తనకున్నటువంటి వైద్య శాస్త్ర పరిచయం ఇదంతా మానవుడి కోసమే తప్ప మనకోసం కాదు అన్నటువంటి భావంతో వైద్య విధానం చేశారు. ఇదంతా జరుగుతూ, జరుగుతూ ఉండగా స్వామికి అరవై ఏళ్ళు వచ్చాయి. అరవై ఏళ్ళు వచ్చేసరికి ఈ పూర్ణచంద్ర ఆడిటోరియం అంతా కిటకిటలాడుతూ ఉంది. ఆ కిటకిటలాడుతున్నటువంటి సందర్భంలో అందరూ ఏమనుకున్నారంటే స్వామి ఒక గంట మాట్లాడతారు అనుకున్నారు. కానీ స్వామి మాట్లాడిన అతి చిన్న స్పీచ్ ఏదంటే ఆ రోజు. ఎందుకంటే "నిజమే మీరంతా దేవుణ్ణి దేవుడు అడుగుతూ వచ్చారు. చాలా, చాలా సంతోషం. దేవుడంటూ ప్రత్యేకంగా ఎక్కడో బయట లేడు. అంతటా ఉన్నది దైవత్వమే. అసలు మీరే దైవం" అంటూ నెమ్మదిగా చెప్తూ "ఒక ఆలోచన కలుగుతూ ఉన్నది మీ అందరినీ చూస్తే. రోజూ పొద్దున, సాయంత్రం ఇక్కడికి వచ్చినవారు స్వామికి ఉత్తరాలు ఇస్తారు. సుమారుగా ఒక వంద ఉత్తరాలు చేతికి వస్తాయి. ఆ ఉత్తరాలన్నీ నేను చదువుతాను. చదివినప్పుడు, చదివి పక్కన పెడతాను. వాళ్ళేదో అనుభవాలైపోయినాయి అంటూ ఉంటారు. జరుగుతూ ఉంటాయి. వాటిని పక్కన పెట్టండి. కానీ ఏ ఒక్క ఉత్తరంలోనూ ఏ తల్లి గానీ, ఏ తండ్రి గానీ నా ఆడపిల్లకు పెళ్లి కావాలని, నా కొడుకుకి వీసా వచ్చి దేశం నుంచి వెళ్లిపోవాలని, రుణ బాధల్లో ఉన్నానని తీర్చమని, కష్టాల్లో ఉన్నానని కాచుకోమని ఇవి ఏడిగారు తప్ప, నా కడుపున పుట్టినటువంటి బిడ్డ ఒక ఉత్తమ మానవుడు కావాలని కోరుకుంటూ స్వామికి ఇంతవరకు ఒక్క ఉత్తరం రాలేదు. వెతుకుచున్నాను, వెతుకుచున్నాను, వెతుకుచునే ఉన్నాను. ఒక్క మానవునికై, ఒక్క నిజ మానవునికై కంటికి ఒకడు కానరాడే ఒక్కడు లేడన్నారు. మనమేమో ఐ యామ్ సాయి డెవోటీ, ఐ యామ్ వెరీ క్లోస్ టు హిం అని మనం చేస్తున్నాం. ఆయన ఆ మాట అనలే. హీ ఈజ్ క్లోస్ టు మీ అని ఎవరికీ కూడా ఆయన చెప్పలే. ఇది కేవలం మనం అనుకుంటూ వెళ్ళాం అంతే." అయితే ఆ స్పీచ్ అయిపోయిన తర్వాత ఆ రోజునే స్వామి ఒక ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చారు. ఈ తరానికి అది తెలియని వారి కోసం చెప్పాలి. ఏంటంటే సాధు ప్రవర్తన కావాలి, ఆలోచనలు సక్రమంగా సాగాలి, ఈ ప్రపంచంలో సమాజం ఆహ్ గౌరవంతో, మర్యాదతో కూడినటువంటి ఒక సంస్కరింపబడిన సమాజ నిర్మాణం జరగాలి అంటే ప్రాథమికంగా రెండు పనులు జరగాలి. ఒకటి మాంసం వదిలిపెట్టాలి, మద్యము వదిలిపెట్టాలి. ఈ రెండు గనక వదిలిపెడితే ఒక ఏడాదిలోగా అందరిలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. దాని వలన ఆలోచనలు, మనస్సు ఒక మత్తుకు లోనైనప్పుడు మత్తుకు లోబడిన మనసే మాట్లాడుతుంది. మత్తుకు లోబడినటువంటి ప్రవర్తనలే మన యందు ఉంటాయి. అలాగే మాంసాహారం తిన్నందువలన, అది ఈ దేశానికి అర్థం లేదు. వెస్ట్రన్ కంట్రీస్, ఫారిన్ కంట్రీస్ లో ఇక్కడ తిండి లేదు గనుక వాళ్ళది తింటారు. ఇక్కడ తినడానికి అనేకం ఉన్నాయి. కనుక మీరు సాత్విక ప్రవృత్తి కోసమే కావాలి అనుకుంటే మద్య మాంసాలు రెండు వదిలిపెట్టండి అని ఆ రోజు స్వామి ప్రపంచానికి సూచించారు. ఇవాళ ఆ సూచనని ఫారినెర్స్ విన్నారు, భారతీయులు విన్నారు, మన తెలుగు ప్రాంతం వారు విన్నారు, అందరూ విన్నారు. కానీ ఏ విదేశాల నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా రెండింటినీ మౌలిక సూత్రాలుగా భావించి మద్య మాంసాలు రెండు వదిలిపెట్టారు. భారతదేశంలో దానిని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇవాళ. ఇవాళ ఈ సమాజాన్ని, మన ఆలోచనని, మన కుటుంబాలని, మన ఆర్థిక వ్యవస్థని, మన యందు భగవంతుని యందు భక్తి లేకుండా చేయడానికి విపరీతమైన ఆలోచనా ధోరణి కలగడానికి చదువు చదువు పెరిగి పెరిగి ఏమైపోతుంది అంటే చదువు లేని వాడు వాడు గాధనకాయ అన్నాడు. బాగా చదువుకున్న వాడు కాదు కాదు దీనిని కీకరకాయ అనే కనిపెట్టాను అని చెప్తున్నాడు. వాటికి మనం ఒప్పీహించే చేస్తున్నాం. ఇది దురదృష్టం. కాబట్టి మద్య మాంసాలు రెండు వదిలిపెట్టినట్లయితే సాధు ప్రవృత్తి అనేది వస్తుంది అని చెప్పినప్పుడు అవకాశమే లేని మాంసం లేకుండా చలి దేశాలు నడవలేవు. వాళ్ళకి కనబడుతున్నంత తిండి వాళ్ళకి లేదు. అలాగే వాతావరణ కాలుష్యం వలన వాతావరణ ప్రభావం వలన వాతావరణంమైనస్ డిగ్రీలు ఉంటాయి వాళ్ళు తొద్దిగా మద్యం తీసుకుంటారు. ఈ దేశం ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు ఎండే ఉండే ఈ దేశంలో నిజానికి మద్యం అవసరమే లేదు. కానీ ఇవ్వేళ అది లేకుండా మనిషిని బతకలేదు అని అంటున్నాడు. ఇక సాధు ప్రవృత్తి ఎక్కడి నుంచి వస్తుంది? సత్వగుణం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకొకరిని మీరు ప్రేమించే వ్యవస్థ ఎలా ఏర్పడుతుంది? కానీ ఇది జరగలేదంటే ఇంకా జరగవలసి ఉన్నది. జరగవలసి ఉన్నదానికంటే పెరిగిపోతున్నది కాబట్టి ఈ వృత్తి నుంచి ప్రవృత్తి, ప్రవృత్తి నుంచి వృత్తికి ఈ మార్గంలోకి వెళ్ళాలి అని సత్య సాయి భగవానుడు ఈ ప్రపంచానికి బోధ చేశారు. సరే అది అరవై ఏళ్ళు అయిపోయింది. అరవై ఏళ్ళ తర్వాత ఏం చేయాలి? ఒక్కొక్క-- అన్నీ ఒకసారి ప్రారంభించరా. ఒకటి ఒకటిగా ఒకటి ఒకటిగా ప్రారంభం చేస్తూ స్వామి నెమ్మది నెమ్మదిగా ప్రపంచం మొత్తం మీదకి ఇందాక చెప్పిన రాముడి కాలంలో యోగవాసిష్టం, కృష్ణుడి కాలంలో భారతం, భాగవతం, భగవద్గీత, విష్ణు సహస్రనామం ఇవన్నీ ఏర్పడ్డాయి. రాముడి కాలంలో ఆదిత్య హృదయం పుట్టింది. యుగయుగాలుగా మాట్లాడుతున్నాం. కానీ ఇవ్వేళ అవి ఏమిటో ఎవరో వచ్చి చెప్తే తప్ప తెలియని పరిస్థితి ఏర్పడింది. చెప్తున్నవాడు తెలియకుండా చెప్తున్నాడు, వింటున్నవాడు ఏదో వింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అది కాకుండా భారతీయమైనటువంటి ఒక వాఙ్మయాన్ని ఒక వేదవ్యాసుడు ఏ పనైతే చేశారో తాను దైవత్వం అయినప్పటికీ కూడా ఈ ప్రపంచంలోకి వచ్చి మళ్ళీ రామాయణం రాశారు. మనకు అర్థమయ్యే రీతిలో. దాని పేరు రామకథా రసవాహిని. అలాగే భాగవతం రాశారు భాగవత వాహిని, ఉపనిషత్తులు రాశారు గీతా వాహిని, పదిహేడు వాహినులు రాశారు. అందులో నిజంగా మేము స్వామి డెవోటీస్ అనుకున్న వాళ్ళు ఇవన్నీ చదివారా? అంటే చదివి ఉండకపోవచ్చు. చదివితే చాలా మంచిది. అది మన స్టడీ సర్కిల్స్ కానీ, బాల వికాస్ గురువులు కానీ ఇవన్నీ చెప్పాలి. ముందు వాళ్ళను చేరనిచ్చేయాలి. ఇవన్నీ ఇంత వాఙ్మయాన్ని ఇచ్చినటువంటి అవతారం లేదు. ఎందుకంటే రాముడిని యోగవాశిష్టం రాయలేరు. రాముడు రామాయణం రాయలేడు. కృష్ణుడు భాగవత, భారత, భగవద్గీతాలు రాయలేడు. రాసిన వారు వేరే ఉన్నారు. కానీ సత్య సాయి భగవాన్ మనకి ఇన్ని వాహినులు, ఇన్ని ఉపన్యాసాలు, ఇంత వాఙ్మయాన్ని మనకిచ్చి మీరు సమాజంలోకి చె-- చొప్పుంచండి. [పాట] అంతరంగము కన్న అధ్యాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమగురువు గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే. చూడండి ఆ గురువు ఈ గురువు చేతిలో కాసు, చె-చెవిలో మంత్రం అన్నట్టుగా ఎవడు పడితే వాడిని గురువుగా భావించి వెంబడి వెళ్ళిపోతున్నారే. నేను చెప్తున్నాను బంగారువు జాగ్రత్తగా వినండి. రాబోయే కాలంలో ఇది యాభై ఏళ్ళ నాడు చెప్పారు. రాబోయే కాలంలో మీ దగ్గర విద్యాపహారుడే గాని మీ చిత్తాపహారుడు అయినా దొరక-- ఒక్క గురువు కూడా మీకు దొరకడు అని చెప్పారు. ఇవ్వేళ అదే అవుతున్నది. చూడండి గురువులంతా మనకంటే బాగా డబ్బున్న వాళ్ళు అయిపోతున్నారు. కదా. అంటే విద్యాపహారులు. మరి మన చిత్తాన్ని హరించే వాడు ఎవరు కావాలి? తన చేతిలోకి తీసుకుని సంస్కరించే వాడు ఎవరు కావాలంటే సద్గురువు అయినటువంటి వాడి దగ్గరకు వెళ్ళాలి. కాబట్టి ఈ విద్యా వైద్య విధానాలు అయిపోయిన తర్వాత అనంతపురం జిల్లాే కాదు, మహబూబ్ నగర్ జిల్లాే కాదు ఆంధ్రదేశంలో ఈస్ట్ గోదావరిలో మన పట్టిసీమ ప్రాంతంలో పక్కనే గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ కూడా చుక్క నీరు లేని వాళ్ళున్నారు. విశాఖపట్నంలో కొండ ప్రాంతంలో నీళ్ళు లేని వారున్నారు. మరి వీళ్ళందరికీ నీరు అందించాలి అంటే గవర్నమెంట్ దగ్గర ఒక డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు కావాలి. గవర్నమెంట్ కి కావాలి. సత్య సాయి భగవానుడు కేవలము తన భక్తులందరినీ దాని యందు ప్రవేశపెట్టి నిస్వార్థంగా చేయగలిగిన ఇంజనీర్లు అందరినీ పిలిచి ఒక వ్యవస్థను నిర్మాణం చేసి తద్వారా అనంతపురం జిల్లాకి, మహబూబ్ నగర్ జిల్లాకి, చెన్నైకి ఈ water అంతా కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు దీనికి ఆనాడు ముఖ్యమంత్రిగా కాంపోజిట్ స్టేట్ లో ఎన్టీ రామారావు మూడు జీవోలు ఒకే రోజున రిలీజ్ చేశారు. ఎందుకు చేశాడు ఆయన అంటే ఆయన అన్నాడు ఇవ్వానన్నాడు land. మరి ఎవరు చేస్తున్నారంటే సత్య సాయిబాబా వారు అని వీళ్ళు చెప్పగానే అయితే తప్పకుండా ఇవ్వండి. వారు సక్రమంగా ఈ ప్రా-ప్రాజెక్టు పూర్తి చేస్తారు. అంటే స్వామి గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా ఆ land కూడా తీసుకోలేదు land లో నుంచి water pipe lines తీసుకొని వెళ్లారు. అంటే భగవంతుడి యొక్క శక్తి డబ్బు యందు లేదు. లక్ష కోట్లు అవసరమే లేదు. ఈ ఉన్న దానిని చాకచక్యంగా చేయగలిగితే, నిస్వార్థంగా గనుక చేయగలిగితే ఇంటింటా నీటి చుక్కలు వస్తాయి అని నిరూపించినటువంటి ప్రప్రథమ అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. ఆయనేం బోధ-- కేవలం ఉపన్యాసం ఇవ్వలా. కేవలం ప్రవచనం చేయలా. కేవలం కశ్యప్ మంచి మాటలు చెప్పి పురాణ గాథలు మనందరికీ చె-చెవులారా, ఆ కనులారా విందారా చేసి ప-పెట్టలా. సమాజంలోకి వెళ్ళండి. ఆ గురువు ఎక్కడున్నాడు? అంతరంగం కన్నా అధ్యాపకుడు లేడు. మీ గుండెలోనే గురువు ఆ కొలువై ఉన్నాడు. వాడు చెప్తున్నాడు నువ్వు మంచి చేసినప్పుడు నాయనా మంచి చేసావ్ అంటున్నాడు. నీ తలపు ఎప్పుడైనా చెడు తలపు వస్తే నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్తున్నాడు. ఆ గురువు లోపలే ఉన్నాడు. అరే కాలమే మీకు పరమగురువు. కాలం ఎన్ని నేర్పుతుంది మనకి. మనం ఇప్పటికి ఆరు దశాబ్దాలు అరవై ఏళ్ళు దాటి మా బంటి వాళ్ళమంతా వచ్చామంటే అరవై ఏళ్ళు ఈ ప్రపంచంలో ఉంటే ఎన్ని ఉత్థాన పతనాలు చూసి ఉంటాం, ఎన్ని జయాపజయాలు చూసి ఉంటాం, ఎన్ని వైఫల్యాలు ఉండి ఉంటాయి, ఎన్నెన్ని కీర్తి కిరీటాలు ధరించాం, ఎన్నెన్ని పాఠాలు, గుణపాఠాలు నేర్చుకున్నాం. ఇవన్నీ గనక గమనించినట్లయితే మనకి నిజానికి ఈ కాలమే పరమగురువు. మరి ఏం చదవాలి? scriptures అన్నీ చదవండి, భారతం చదవండి, అవన్నీ చదవండి. కానీ నీ చుట్టూ ఉన్న సమాజాన్ని చదవండి. గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే.ఈ ప్రపంచ-- ఇది పెద్ద గ్రంథం. ఈ ప్రపంచం. ఈ ప్రపంచం ఈ సమాజాన్ని నుండి చదువుతూ చదువుతూ వెళితే ఈ సమాజానికి ఏం కావాలి? ఈ సమాజ అవసరాలు ఏమిటి? ఎవరో గవర్నమెంట్ కొంత చేస్తుంది మనం కూడా చేయాలి అనేటువంటి ఒక దయాగుణం మన యందు ప్రవేశిస్తుందని చెప్తూ, నీకు నిజమైనటువంటి స్నేహితుడు ఎవరో తెలుసునా? ఈశ్వరుడే. మనకి చాలా పాపులర్ పర్సనాలిటీలు ఉంటారు. ఓ లక్ష మందికి వాడు తెలుసు. ఆ వ్యక్తి తెలుసు. అందులో ఒక పదివేల మందికి కొద్దిగా దగ్గరగా తెలుసు. ఒక వంద మందికి ఇంకా దగ్గరగా తెలుసు. ఇంకో పది మందికి మరీ దగ్గరగా తెలుసు. ఏ ఒక్కడికో చాలా తెలుసు. కానీ, ఈ లక్ష మంది నుంచి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చేప్పటికి ఇదిగో ఈ వ్యక్తి ఏదో ఒక రోజున దేహం వదిలిపెట్టాలి కదా. ఆ సమయంలో ఎవరుంటారంటే ఆ ఒక్కడు కూడా పక్కనుండడు. పోయాడని తెలిసి వాడు వస్తాడేమో గానీ, పోతున్న వేళ వాడు ఉండడు. కనుక నీ యందు నీతో అన్ని వేళలా అన్ని కాలాలా ఉన్నటువంటి నీకు హితవు చెప్పే ఆ స్నేహితుడు ఎక్కడున్నాడంటే, ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే. కాలాద్య విచ్ఛిన్నమైనటువంటి కాలము, కార్యము, కారణము, కర్తవ్యము, దేశము, ప్రదేశము, విదేశము అనేటువంటి ఏ భావనా లేకుండా తాను తనంతట తాను తన యందు మన యందు ఒక గురువుగా, ఒక దైవతంగా, ఒక జీవంగా, ఒక మనస్సుగా, ఒక చిత్తంగా, ఒక ప్రాణంగా, ఒక చైతన్యంగా ఎవరున్నారంటే ఆతడే దేహి. స్వామి పద్దెనిమిదేళ్ళు శరీరానికి రాకుండా ఒక పద్యం చెప్పారు. దేహము పాంచభౌతికము కూలక తప్పదెప్పుడును. ఇది పంచభూతాలతో పుట్టింది, ఏదో రోజు పోతుంది. ఆ దేహియే దేవదేవుడు. నువ్వు దేవుడిని వెతుకుతున్నావు చూడు నీలో ఆత్మగా, దేహంగా ఉన్నదని అనేకమైనటువంటి విచార మార్గాన్ని చెప్తూ స్వామి ఈ ప్రపంచాన్ని సనాతన ధర్మం వైపు నెమ్మదిగా నడిపిస్తూ తీసుకుని వెళ్లారు. ఈ మధ్యలో ఇందాక అనుకున్నాం ధర్మమంతా రాముడు, కృష్ణుడు ప్రాదేశికంగా తాము ఉన్న ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ వెళ్లారు. మరి సత్యసాయి భగవానుడి యొక్క ఎనభై ఆరు సంవత్సరాల అవ-- ఈ అవనీ సంచారంలో ఒకే ఒక్కసారి ఒక్క దేశం వెళ్లారు. ఆ దేశం నైరోబి. ఆ నైరోబి అనేటువంటి దేశంలో ఇదీ అమీన్ అనేటువంటి ఒక నరరూప రాక్షసుడు ఉండేవాడు. వాడు నియంత. ఆ నియంతను చూసి పాలక్-పాలితులు అంటే ప్రజలందరూ భయభ్రాంతులయ్యేవారు. ఆ దేశంలోకి వెళ్లారు స్వామి. అతను సుమారుగా ఏడడుగులు ఉంటారు స్వామి ఐదడుగుల మూడు అంగులాలు. స్వామి, ఈశ్వరమ్మగారితో సహా స్వామి భక్తులంతా స్వామిని మీరు ఆ దేశం వెళ్లొద్దు. వాడు బ్రహ్మ రాక్షసుడు. వాడు మిమ్మల్ని ఏమైనా చేస్తాడు వెళ్లొద్దంటే, కాదు అని స్వామి వెళ్లారు. ఎందుకు వెళ్లారు? దేనికి వెళ్లారు? అంటే రాబోయేటువంటి ఒక ప్రమాదాన్ని పసిగట్టి మీ ఆస్తులు మీకున్న వస్తువులు ఇక్కడ వదిలిపెట్టి భారతదేశానికి తిరిగి వెళ్ళండి. రాబోయే కాలంలో ఇవి మీకు మిగిలేవి కాదు అని చెప్పినప్పుడు స్వామి మాట నమ్మి సుమారు తొంభై percent వెనక్కి వచ్చేశారు. వాళ్ళు ఈ భారతదేశంలో మళ్ళీ చక్కగా వాళ్ళ వ్యాపారాలు చేసుకున్నారు. కానీ మిగిలిపోయిన పది మంది మాత్రం సర్వము కోల్పోయినారు. స్వామి అక్కడి నుంచి వెనక్కి వచ్చారు. ఈ ఒక్క దేశమూ, ఈ సందర్భమూ తప్ప స్వామి ఏనాడు విదేశాలకు వెళ్ళలేదు. ప్రాదేశికమైనటువంటి భారతదేశంలోనే అక్కడక్కడా వెళుతూ ఉన్నారు. కానీ తాను పుట్టిన చోట, తాను పెరిగిన చోట, తాను ఒరిగిన చోట, తాను కదలకుండా నూట ఎనభై ఎనిమిది దేశాలని ప్రశాంతి నిలయానికి తన దగ్గరకు తెచ్చుకున్నటువంటి ఏకైక అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. [కప్తాళ్] మనక్కడికి వచ్చారు. ఆ నూట ఎనభై-- మన పక్కన కూర్చున్నవాడు అమెరికన్నో, ఆఫ్రికన్నో, Spanishనో, Germanనో తెలియదు మనకి. వాడి కులం తెలియదు, వాడి మతం తెలియదు, వాడి జాతి తెలియదు, వాడి విద్యా అర్హతలు తెలియ-- వాడి సంపద తెలియదు. ఈ ప్రపంచంలో సర్వోన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు మన పక్కన కూర్చొని ఉన్నా వాడు ఎలా ఉన్నాడంటే మనసంతా స్వామి మీద పెట్టుకొని ఉన్నాడు. అంతా స్వామి యందు లగ్నం చేసుకొని ఉన్నాడు. కాబట్టి ఈ వసుధైవ కుటుంబకం అని ఏది వేదం ఊహించిందో, ఏది భావించిందో, ఏది ఈ ప్రపంచానికి చెప్పిందో దానిని ఆ కుల్వంత్ హాల్ అనబడేటువంటి ఒక ప్రదేశం సెంటర్లో ఈ నూట ఎనభై ఎనిమిది దేశాల ప్రజలు, చైనావాడు వచ్చి జగరాజ కీర్తన పాడతాడు. ఒక ముస్లిం వచ్చి రుద్రం చదువుతాడు. ఒక పధ్నాలుగు మంది ముస్లిం యువకులు కేదార్ నాథ్ వెళ్లి ఆ శివ ప్రాంతంలో, శివమయమైనటువంటి ప్రాంతంలో వాళ్ళు ఏం చేశారంటే నాలుగు లక్షల ఇరవై రెండు వేల రుద్రం చదివారు వాళ్ళు. వాళ్ళంతా ముస్లిమ్స్. ఈ దేశంలో ఈ ప్రపంచాన్ని కులం చేత, మతం చేత, జాతి చేత, వర్ణం చేత, వర్గం చేత, భేదభావం చేత విడగొట్టుకుంటూ వెళ్ళే తరుణంలో సమస్తాన్ని ఒకటి చేసి ఇది వసుధైవ కుటుంబకం అని నిరూపించినటువంటివారు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. [కప్తాళ్] అలాగే వారు ఒక చిన్న జనరల్ హాస్పిటల్ ఉంటే ఒకరోజున సూపర్ స్పెషాలిటీ కట్టాలి అని స్వామి అనుకున్నప్పుడు కేవలం పది నెలల సమయంలో ఇవాళ ప్రశాంతి నిలయంలో ప్రపంచం మొత్తం మీద కొన్ని లక్షల ఆపరేషన్లు ఫ్రీగా చేస్తూ, దాంట్లో స్వామి చెప్పారు. డబ్బున్న వాడు కూడా వచ్చి ఫ్రీగా చేయించుకోవచ్చు అన్నారు. డబ్బు లేని వాడు ఎలాగో వస్తాడు. అని కేవలం పది నెలల్లో స్వామి మొత్తం యూనివర్-- హాస్పిటల్ కట్టగలిగారు. అలాగే దానికంటే ముందు యూనివర్సిటీ పెట్టాలి అన్నప్పుడు యూనివర్సిటీ నిబంధనలు తెలిసిన వాళ్ళంతా ఇటువంటి ఇప్పుడి సిరిసిల్లలో పెద్ద యూనివర్సిటీ పెట్టాలి. అంటే రూల్స్ ఒప్పుకోవు అనేవాళ్ళు వంద మందిలో తొంభై మంది ఉంటారు.ఆ తొంభై మంది స్వామికి చెప్పారు స్వామి పుట్టపర్తిలో యూనివర్సిటీ రాదు కావాలంటే ఒక డిగ్రీ కాలేజీ వరకు రావచ్చు ఆనాడు ఉన్న rules ప్రకారం అని అంటే స్వామి కాదు ఇక్కడ యూనివర్సిటీ వస్తుంది ఈ ప్రపంచం మొత్తానికి కూడా అసలు విద్యను నేర్పాలి. ఆ విద్య ఏదో మంత్రాలు తంత్రాలు పురాణాలు కథలు మాయలు మంత్రాలు కావు. ఏం కావాలి అంటే ఈ ప్రపంచంలో మానవుడు మానవుడిగా జీవించగలిగిన విద్య మనం నేర్పాలి. కుటుంబాలు చల్లగా హాయిగా ప్రసన్నంగా ప్రశాంతంగా తృష్టిగా కృష్టిగా సంతృష్టిగా నిరంతరమైనటువంటి ఆనందంతో గడిపేటువంటి ఆ విద్య మనం నేర్పాలి అని స్వామి యూనివర్సిటీ పెట్టాలి అనుకున్నప్పుడు ఒక పెద్దాయన స్వామి దగ్గరికి వచ్చిని స్వామి ఈ ఆలోచన మీరు విరమించుకొండి ఎందుకంటే మొదలు పెడదామని మీకు ఉన్న అవకాశాలు లేవు ఇది నాకు తెలుసు గనుక స్వామి చిరునవ్వు నవ్వి వదిలేశారు. వదిలేస్తే అప్పుడు ఒక వి.కె.గోకాక్ అనేటువంటి ఒక జ్ఞానపీఠి అవార్డీ కన్నడ దేశంలో ఆయన స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడ యూనివర్సిటీ పెట్టాలి అని అనుకుంటున్నాము అని స్వామి అనగానే ఆయన కూడా స్వామి అది అసాధ్యము అది రాదు ఇంకేదైనా మంచి కాలేజీలు పెట్టండి ఇంకేదైనా చేయండి యూనివర్సిటీ మాత్రం రాదన్నప్పుడు ఓ ప్రయత్నం మీరైతే చేయండి అన్నారు. స్వామి మాట మన్నించారు వెళ్లారు. అప్పుడు UCC చైర్మన్ అంటే మాధురి శర్మ ఒక ఆవిడ ఏమిటి మీరు బాగా చదువుకున్నవారు బాగా education ఉంది government rules అన్నీ తెలుసు అన్నీ తెలిసి ఇది జరగదని నా దగ్గరికి ఎందుకు వచ్చారో చెప్పండి అంటే నాది కాదమ్మా ఇది సత్య సాయిబాబా వారు అనుకుంటున్నారంటే వారికి తెలియదు గనుక అలా అనుకున్నారు మీరు రాదు అని చెప్పండి అన్నదట. కానీ ఈయన అమ్మా ఒక్కసారై ప్రయత్నం చేయండి ఇది మా ఆలోచన ఇటువంటి మంచి సంస్కారాలతో కూడిన విద్యని ఈ ప్రపంచానికి ఇవ్వాలని స్వామి అనుకుంటున్నారు అది మామూలుగా చెప్పే డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేట్ కాదు అని అంటే మధ్యందానికి ఆవిడ మెత్తబడి ఆవిడ ఒక మాట ఏమన్నదంటే నేను వస్తాను ఒకసారి మీరు సత్యసాయిబాబా గారి గురించి నేను విన్నాను ఆయన దేవుడనే మీ మాటే విన్నాను నేను ఆయన్ని కలవటానికి మీరు అవకాశం కల్పిస్తారా అని అడిగిందట. ఇది ఒక స్టెప్పు. ఆయన అన్నారు ఆయనకి దర్శనం ఇప్పించగలిగినంత శక్తి నా దగ్గర లేదు మీ దర్శనం కావాలని మీరు ప్రార్థించుకోండి అది జరిగిపోతుందని ఈయన మామూలుగానే చెప్పారు. ఆమె నేను నిజంగా ప్రార్థిస్తున్నాను నేను బాబా గారిని చూడాలని నాకుందంటే అమ్మా మీరు ఎప్పుడొస్తారో చెప్పండి అన్నారట. ఆమె ఏదో డేట్ ఇచ్చింది. ఆమె వచ్చారు వచ్చినప్పుడు స్వామితో కేవలం తొమ్మిది నిమిషాలు మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఆమె ఢిల్లీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆమె చేసిన పని ఏమిటంటే ఈ గోకాక్ గారిని మీరు రేపు పొద్దున బయలుదేరి ఢిల్లీకి రండి అన్నది. ఢిల్లీకి రాగానే కవరులో ఒక లెటర్ చేతిలో పెట్టింది. ఏమిటంటే పుట్టపర్తిలో యూనివర్సిటీ పెట్టడానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. [కప్ చేతులు కొట్టుకుంటూ] doomed to be university అంటే మీ అగ్గం ఏం లేదు యూనివర్సిటీ వంటిది అని ఇచ్చి వచ్చినప్పుడు ఆయన బెంగళూరు నుంచి స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి ఏం విశేషం అని అడిగారు. స్వామి నాకు ఒక ఉత్తరం ఇచ్చారు వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు మనం యూనివర్సిటీ పెట్టొచ్చట కానీ దాన్ని doomed యూనివర్సిటీ అని అంటారట అని అంటే స్వామి ఏమన్నారంటే అవునులే ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ doom అయిపోతున్నప్పుడు మీరు ఒకటే doomed యూనివర్సిటీ సశక్తం అయిపోతుంది అన్నారు. అదే సత్య సాయి భగవాన్ అనేటువంటి విశ్వవిద్యాలయం. అంటే మానవుడిగా వచ్చినటువంటి మానవ దేహం ధరించి వచ్చినటువంటి ఒక పరమాత్మ ఈ ప్రపంచంలో ఎన్ని పనులు చేయవచ్చో అతి స్వల్ప కాలంలో ఎయిత్ standard pass కానీ discontinue చేసినటువంటి సత్య సాయి బాబా భగవానులు ఒక యూనివర్సిటీకి ఒక ఛాన్సలర్ అయ్యారు. అలాగే ఈ విశ్వవిద్యాలయంలో అనేక మంది students ని విద్యాబుద్ధులు నేర్పినప్పుడు చాలామంది స్వామి నాకు చాలా ఆనందంగా ఉందని చెప్తే అంతే కాదు చూడండి రాబోయే రోజుల్లో మీరు ఎప్పుడైనా జీవిత కాలంలో రాష్ట్రపతి భవన్ లో మీరు అడుగు పెట్టాలి అంటే మీరు ఏదో ఒకటి సాధించి ఉండాలి అది ఇంతకుముందు ఎవరూ సాధించి ఉండి ఉండకుండా ఉండాలి మూడవది అది ప్రత్యేకంగా ఉండాలి అది ప్రపంచానికి వినియోగపడేట్టుగా ఉండాలి ఈ శ్రమనంతా గుర్తించే ఒక టీమ్ ఉండాలి ఇంతమంది ఉండే రాష్ట్రపతి భవన్ లోకి మీకు పిలుపు వచ్చినప్పుడు ఒక పద్మశ్రీయో ఒక పద్మభూషణం అంటే ఈ కాలం కాదు ఆ కాలం ఒక భారతరత్నం చేతిలో పెడతారు కదా అంటే అది తీసుకోవటానికి కూడా మీరు ఢిల్లీ వెళ్ళాలి చూస్తూ ఉండండి రాష్ట్రపతులే మీ దగ్గరికి వచ్చి మీకు degree ఇస్తారు అన్నారు. ఈ భారతదేశంలో కలాం గారితో సహా శంకర దయాళ్ శర్మ గారితో సహా ప్రణబ్ ముఖర్జీతో సహా Prime Ministers Presidents వచ్చి పిల్లలకి కాన్వకేషన్ లో degrees చేతిలో పెట్టేటది మనం చూశాం. [కప్ చేతులు కొట్టుకుంటూ] ఇది ఎక్కడైనా జరిగిందా ఎన్ని యూనివర్సిటీలు ఏ యూనివర్సిటీకి వాళ్ళు వెళ్ళిపోయి పెట్టారేమో ఒకరోజు పొద్దున కానీ ఒక శంకర దయాళ్ శర్మ లేకపోతే ఒక అబ్దుల్ కలాం గారు వీళ్ళందరూ వచ్చి స్వామి యందు మోకరిల్లి వినయంగా నిల్చున్నటువంటి సందర్భం మరి ఇటువంటి మహాత్ములంతా అయితే స్వామితో ఏం పని కలాం గారంటే scientist శర్మ గారంటే ఆయన బాగా జ్ఞాని మరి వాళ్ళిద్దరికీ ఈ స్వామితో ఏం పని అని ఈ ప్రశ్న నేను కలాం గారికి అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ప్రపంచంలో మీరు ఏమి సాధించండి ఏమి పొందండి మీకు అనేక degrees రాలండి అసలు మీ అంతటి వాళ్ళు లేరు అని అనిపించుకోండి కానీ భగవంతుని యొక్క ప్రేమని ఆశీర్వచనాన్ని పొందకపోతే అవి కేవలము గోడ మీద వేలాడే ఫ్రేములు తప్ప వాటికేం విలువ లేదన్నాడాయన. అంటే మనం పొందవలసింది లోకం మెప్పు కాదు లోకేశ్వరుని మెప్పు కాబట్టి.లోకేష్ ను పిలిచి నువ్వు చేసిన పని బాగుంది అయితే అది భారతరత్న మించినటువంటి కాబట్టి వసుధైవ కుటుంబక నిర్మాణం చేశారు. ఇప్పటివరకు ఇవన్నీ కూడా స్వామి కేవలం ఎనభై ఆరేళ్ళు ఇక్కడున్నది. ఎనభై ఆరులో త్రిపత్నామకేళ్ళు ఎవరికీ తెలియదు, విశేషాలు లేవు. ఉన్నది డెబ్బై రెండు ఏళ్ళు. మనకి డెబ్బై రెండు ఏళ్ళు వస్తున్నాయి కదా! మనం అవన్నీ ఎందుకు చేయలేకపోయాం? కనీసం ఏ ఒక్కటన్నా ఎందుకు చేయలేకపోయాం? ఒక విద్యార్థినైనా మనం ఎందుకు చదివించలేకపోయాం? ఒక ఆసుపత్రిలోనైనా ఒక బెడ్ ఎందుకు వేలేకపోయాం? ఒక రోగికి నాలుగు పళ్ళు ఎందుకు వేలేకపోయాం? చదువుకోవడానికి ఏ అవకాశం లేని వాళ్ళని దగ్గరకి తీస్కొని వాళ్ళకి చదువు ఎందుకు చెప్పించలేకపోయాం? అంటే మనం ఇంకా మానవ ప్రవృత్తి పరిధిలో ఉన్నందువలన నా కొడుకు, నా బిడ్డ, నా అల్లుడు, నా కోడలు, నేను, నా భార్య, నా కులము, నా జాతి, నా వంశము అని ఆగిపోయే కారణంగా స్వార్థం వలన మనకి విస్తారం కాదు, మనం విస్తృతం కాలేం. అందుకనే సత్యసాయి భగవానుడు ఆయన ఏం చేశాడంటే, అసలు మీరందరూ నా బిడ్డలే అంతేకాదు అసలు మీకు నాకు తేడా లేదు తెలుగు లో ఒకటే తేడా ఏమిటంటే నాలో దివ్యత్వం ఉన్నది అని నాకు తెలుసు మీలో ఉన్నప్పటికీ కూడా మీకు తెలియదు. చూడండి ఒక గురువుగారు భక్తుడు కావచ్చు, శిష్యుడు కావచ్చు, శిష్యురాలు కావచ్చు, అనుచరుడు కావచ్చు లేదా ఆయనతో పక్కన ఉండేవాడు కావచ్చు, పరిచారకుడు కావచ్చు, సేవకుడు కావచ్చు, ఇన్ని విధాలుగా కావచ్చునేమోగానీ ఆ దైవం యొక్క శక్తి లోనించి ఎవరైనా వాళ్ళందరినీ నాయనా శిష్య ఇటురా, నాయనా కుమార ఇటురా, ఆ అమ్మ తల్లి ఇటురా ఇవన్నీ మనం వింటాం. ఏ ఒక్కడైనా ఒక్క సత్యసాయి బాబా వారు తప్ప, ఒక్క స్వామి తప్ప మా అందరినీ కూడా మన పేర్ల ప్రస్తావన లేకుండా మన ఈ శరీరాలు, మనకున్నటువంటి భావాలన్నీ దాటి దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమాత్మ స్వరూపులారా అని సంబోధించిన అటువంటి ఒకేఒక అవతారం ఈ ప్రపంచంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. నాయనా బంగారం, నాయనా విఎస్ఆర్ ముఖ్టందే అదేమీ అందరూ పిలిచే పిలుపే. కానీ నువ్వు కేవలం ఈ సుభాసరావో, ఈ అప్పారావో నీ తల్లిదండ్రులు పెట్టిన పేరు మాత్రమే కాదు, నీవు ఒక దివ్యాత్మవి. దివ్యాత్మవై వచ్చావు గనుక నువ్వు ఎలా ఉండాలి? ప్రేమాత్మగా ఉండాలి. వేరే మాటమే లేదు. నేను దివ్యాత్మే కానీ ప్రేమాత్మగా ఉండననడానికి లేదు. దివ్యత్వమే ప్రేమాత్మం, ప్రేమాత్మమే దివ్యత్వం. దివ్యత్వం ఒక ఆలోచన అయితే ప్రేమ అనేటువంటిది ఒక అభినివేకి. మనం ఒక పిల్లవైనో, పిల్లనో దగ్గర తీసి ప్రేమించామంటే వాడికి మనం ప్రేమిస్తున్నామని ఎలా తెలుస్తుంది? ఒక చాక్లెట్ ఇవ్వాలి లేకపోతే ఏదో వస్తువు ఇవ్వాలి, వాడిని నవ్వించాలి, వాడి వాణి ఆనందింప చేయాలి అప్పుడు వాడెవరో మనకు అర్థం, మనకెవరో అర్థమవుతుంది, మనతో మమతానుబంధం పెరుగుతుంది. సత్యసాయి భగవానుడు చేసినటువంటి పని ఇదే. ఈ సూత్రంతోనే మా అందరినీ దివ్యాత్మ స్వరూపులారా అని పిలిచారు.
YouTube · audio
Sri Sathya Sai Premadhara July 2023 | Spiritual Satsung | Part 1
Sri Sathya Sai Premadhara July 2023 | Spiritual Satsung | Part 1
Source: Sri Sathya Sai Seva Organisations Rajanna Sircilla on YouTube
0:00 / 1:03:46
More in this series