No transcript for this section.
Transcript begins at 0:00.
తెలుగులోనే మాట్లాడారంటే, మాతృభాషకు ఒక మూర్తి ఒక స్వరూపం గనక గౌరవం ఇస్తే ఆ భాష నిలబడుతుంది గనక. అవతరించెనేడు ఆంధ్రదేశమందు జగతిన్ ఉద్ధరింప సత్యసాయి. ఆతడు ఉపన్యసింప యావత్ ప్రపంచాన దేవభాషయై తెలుగునేను. తెలుగు మనం మాట్లాడుతున్నాం మనదేదో మన భాష మన భాష అంటాం. స్వామి మాట్లాడినందువలన అది సంస్కృత సమానమైన దేవభాష అయింది. [కప్లులు] కారణం ఏంటంటే ఆయన దైవం గనక. మనం మాట్లాడితే తెలుగయింది స్వామి మాట్లాడితే అది దేవభాష అయింది, చూసారా? కాబట్టి వీటి అన్నింటినీ మనం తీవ్రంగా అధ్యయనం చేయాలి. ఉరికే పై పైన కాస్త ఎక్కువ గంట మందిరానికి వెళ్దాం, ఈవేళ మన ఇంటికి ఏం పని లేదు అమ్మయ్య అటు వెళ్దాం అట్లా కాదు. దీనిని తపస్సుగా, దీక్షగా. దీనికి ఒక నలభై ఆరు సంవత్సరాలు, యాభై సంవత్సరాల క్రితం బెంగుళూరులో ఒక private house లో స్వామి ఇటువంటి నీలకమల చైర్ లో కూర్చొని ఒక ప్రకటన చేశారు. "ఈవేళ ఈ యువకులుగా కనిపిస్తున్న మీరందరూ యాభై ఏళ్ల తర్వాత వృద్ధులైపోతారు. ఈవేళ ఇంత proximity లో ఉన్నటువంటి అవకాశం మీకు అప్పుడు ఉండకపోవచ్చు. మీరు కూడా ఎక్కడన్నా మందిరానికి వెళ్లాలి అంటే వెళ్లలేని పరిస్థితులు వస్తాయి. కానీ దానికి నేను ఒక చిన్న అనుగ్రహాన్ని ఇస్తున్నాను." స్వామి మాటలివి. అవి ఏమిటి అంటే "మీరు ఎక్కడన్నా ఉండండి, మీ ఇంటికి పది నిమిషాలలో, ఐదు నిమిషాలలో చేరుకునేలాగా సాయి మందిరాలు కొన్ని కోకొల్లలు ఏర్పడతాయి." [కప్లు] అంటే ఆనాడు ఇరవై ఏళ్ల వయస్సు నా గనక ఉండి ఉంటే, నేను ఆ రోజున అక్కడ ఉన్నట్లయితే నాకు యాభై ఏళ్ల తర్వాత అన్నారంటే అమ్మయ్య నేను కచ్చితంగా యాభై ఏళ్లు ఇంకా బతుకుతా అంతే కదా. twenty plus fifty అనుగ్రహం ఇచ్చారు. బతికిన తర్వాత ఏం చేయాలి? నేను నాకేదో భజన పాడాలని ఉంది, వినాలని ఉంది వెళ్లలేను. మనవడేమో నేను రానంటాడు. మనం రాలేం time లేదు అంటుంది. భార్యేమో ఏదో వెళ్లి వచ్చారు కదండీ, ఏదో చాలిండి పడుకోండి అంటుంది. కోడలేమో ఆ పడుకునే బదులు పాలు packet తెచ్చు కదా అంటుంది. ఇవన్నీ మనం పడుతున్న యాతనలే ఈ ప్రపంచంలో కదా. అందుకని మీరు ఎక్కడ ఉన్నా ఐదు నిమిషాలలో సాయి నామం వినపడేట్టుగా ఈ ప్రపంచం మారుతుంది అన్నారు. మారిందా లేదా? మారింది. [కప్లు] ఈవేళ మనం మనకి మొన్నటివరకండి Central Trust building అంతే కదా. ఆ లోపల చేశాం కొన్ని వందల సత్సంఘాలు ఇక్కడ చేశాం. ఎన్నో తెల్లవారుతున్నా మవురై రాత్రి పన్నెండు దాకా సాగినయి. ఆ తపస్సు యొక్క ఫలితమే ఇవాళ అది చాలదు. [కప్లు] అది మాత్రమే కాదు రేపు అవసరమైతే కలుపు తీస్తే అక్కడ కూడా కూర్చుంటారు. రెండూ కలపండి ఇటు అటు అంతటా నేనున్నానని సర్వవ్యాపకమైనటువంటి ఒక దివ్యానుగ్రహాన్ని అనుగ్రహించిన కారణంగానే, భానుజీరావు గారి లాంటి ఒక సద్భక్తుడి నుంచి స్వామి ఆయనకి ఆయన కుటుంబానికి ఈ అవకాశం ఇచ్చారు. అంతే. ఆయన దానం ఇచ్చింది లేదు స్వామి పుచ్చుకున్నది లేదు. ఆ కుటుంబం ఎలా అంటే స్వామి చెప్పారు. "ఎవరు స్వామికై భగవంతుడిపై సేవ చేస్తారో ఆ ఒక్క తరాన్ని మాత్రమే కాకుండా రాబోయేవారి ఇరవై యొక్క తరాలను నేను కాచుకుంటాను" అన్నారు. [కప్లు] ఈవేళ మనందరం కూడా భానుజీరావు గారి ఆ ఇరవై యొక్క తరాలు రక్షింపబడాలని అనుకుంటూ స్వామి అనేక కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ నెమ్మదిగా. ప్రపంచంలో అనేక సంస్థలున్నాయని చెప్పాను. అవి ఏం చేస్తాయి? అంటే మేమేదో గది కట్టబోతున్నాం, మీరు డబ్బు కట్టండి. మీరు వస్తున్నారు చందా కట్టండి. అందులో హుండీ పెట్టాం కొద్దిగా డబ్బులు వేయండి. ఇవి. ఏమీ లేకుండా నాటి నుంచి నేటి వరకు కడదాకా కూడా ప్రతి నిత్యమూ వేద ఘోష, వేద Paarayanmu, వేదోద్ఘాటన జరిగేటువంటి ఏకైక ప్రదేశము ప్రశాంతిలోయం. గుర్తుపెట్టుకోండి. [కప్లు] time watches సిగ్గుపడాలి. అంత ప్రారంభం అవుతాయి. ఆనాడు ఎవరు ఊహించారు? రేడియో సాయి ఒకటి వస్తుందని ఎవరన్నా ఊహించారా? అసలు రేడియో ఏమిటి? సాయి ఏమిటి? ఇదేదో గమ్మత్తుగా ఉంది. ఏదో సాయి రేడియోనా? రేడియో సాయో? ఎవరికీ తెలియలే. స్వామి చెప్పారు. ఆ రోజులలో ప్రారంభమైతే world space వాళ్ళు స్వామి దగ్గరికి వచ్చి మేము ఇస్తాం అంటే ఇస్తే world space మొత్తం పోయింది. ఆ పోయిన time లో వాళ్ళు ఏమన్నారంటే "ఒక్క స్వామి organization ది మాత్రం మేము ఎవ్వరికీ ఇవ్వం" అన్నారు. అది నిలబడింది. అది ఈవేళ ప్రపంచానికి ప్రశాంతివయాన్ని, స్వామిని మూల మూలలకి తీసుకువెళ్లగలిగినటువంటి స్థాయిలో స్వామి సంకల్పం నుంచి ఎంత చిన్న studio. దాన్ని ఎవరు manage చేశారు? స్వామి పిల్లలు manage చేశారు. laser play స్వామి పిల్లలు చేశారు. వేదం మీద భాష్యం, వేదం పై స్వామి పిల్లలు చేశారు. ఈవేళ ప్రపంచంలో CEOలుగా అనేకమైన కీలక పదవుల్లో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒకనాడు స్వామి విద్యా విధానంలో బతికిన వాళ్ళే, అక్కడ నేర్చుకున్న వాళ్ళే, స్వామి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళే. ఇంతకంటే ఏం కావాలి? స్వామి దైవం అని చెప్పడానికి కేవలం మానవుడే అంటే మా గురువుగారు ఒకాయన "నాకు బాబా గారింటే పెద్ద నమ్మకం లేదోయ్. బీదా నువ్వెళ్ళేచ్చావ్ నాకు సంతోషమే మంచి పనేం చేసావ్. నాకు ఇంకా నమ్మకమే కలగలేదంటే" అన్న వారం రోజులకే ఆయన అనంతపూర్ వెళ్ళాలనిపించింది. వెళ్లి కృష్ణదేవరాయ University లో ఏదో ఉపన్యాసం ఇస్తే ఓ శిష్యుడు "గురువుగారు మిమ్మల్ని ఒకసారి నా పుటపట్ సంగతి చెప్పద్దని నా ఇంటికి పోతాను, కారు arrange చేయాలి" అన్నాడు. "కాదు మీరు చూడండి masterlu చూడండి భూలోకే స్వర్గం అది మీరు రండి" అంటే ఆ శిష్యుడి మీద ప్రేమతో ఆయన వెళ్ళాడు. వెళ్లి అక్కడ కూర్చున్నారో లేదో స్వామి దర్శనం ఇవ్వటానికి వచ్చారు. దర్శనం ఇవ్వటానికి ఆయన మహాకవి, మామూలు కవి కాదు. భారతంని English లో రాశారు. సంస్కృతంలో MA చేశారు. తెలుగులో అయితే తిరుగే లేదు. ఆయన ఆ దర్శనం ఇవ్వటానికి వస్తున్న సమయంలో ఒక చిన్న పద్యం రాసుకున్నారు. ఏం రాశారో తెలుసా పద్యం? అరయ సత్యసాయి వరదేవుడైనచో ఆయన మానవీయతకు అంజలి. అరయ సత్యసాయి మరమాత్రుడైనచో ఆయన దివ్య గరిమకు అంజలి. అర్థం అంటే ఏం లేదు. ఈయన నిజంగా దేవుడే గనక అయితే...నేను దేవుణ్ణి చూడలేదు, ఇదిగో ఈయన్ని చూస్తున్నా. ఈయన నిజంగా దేవుడే గనుకైతే, దేవుడికి మానవత్వం ఉందో లేదో నాకు తెలియదు. ఈయనలో ఉన్న ఆ మానవత్వానికే నేను నమస్కరిస్తున్నా. గనుక ఈయన దేవుడేనన్నారు. ఒకటి, అరే సత్య సాయి నరమాత్రుడు అయినచో లేదు మనలాంటి వంటే మామూలు మనిషి అని అనుకుందామంటే, మనం అందరం కలిసినా చేయలేని పని ఆయన ఒక్కరు చేశారు. కాబట్టి అరే సత్య సాయి నరమాత్రుడు అయినచో ఆయన దివ్య విర్మకు అంజలి. అటైనా ఇటైనా నేను వారికి నమస్కరించవలసిందే అని శిరస్సు వంచి నమస్కరించారు. అంటే వస్తువు ఒకటే చూడటంలో తేడా, దృష్టిలో భేదం. అందుకే స్వామి చెప్పారు "సృష్టిలో ఏ లోపము లేదు, మానవుడి దృష్టిలోనే లోపం ఉన్నది". వీడు నాకిష్టము, ఇది నాకిష్టము, ఈ శాస్త్రం ఇష్టము, ఇది మాత్రమే ఈ ప్రపంచానికి పనికొస్తుంది కాదు. సర్వ శాస్త్రముల యొక్క మూలాలు అన్నీ వేదంలో ఉన్నాయి గనుక, ఆ వేదాలలో నుంచి ఉపనిషత్తులు వచ్చినాయి గనుక, ఉపనిషత్తులలో నుంచి యోగవాసిష్ఠం వచ్చింది గనుక, యోగవాసిష్ఠం నుంచి భగవద్గీత పుట్టింది గనుక, భగవద్గీత కేవల యోగ శాస్త్రంగా వచ్చింది. అది పాడుకునే పాట కాదు, అధ్యయనం చేయవలసిన తీవ్రమైనటువంటి మహాగ్రంథం అది. వాటిని కూడా స్వామి గీతా వాహిని రాశారు. మనమంతా అది చదవాలి. కాబట్టి స్వామి కాలంలో గాయత్రి వచ్చింది, వాహినిలు వచ్చినయ్, నీళ్లు వచ్చినయ్. అందం-- కాళ్లు లేని వారికి కళ్ళు, కళ్ళు లేనివారికి కళ్ళు అన్నీ ఏవిరావలో వచ్చినయ్. అంతా బాగా ఉంది, అద్భుతమైంది, ఆశ్చర్యమైంది, పరమాద్భుతమైంది, ఆనందం అయిపోయింది. ఇంతలో సమయం అయిపోయింది. మరి ఈవేళ చాలా కాలం, మా వరకు నాకు ఇప్పటికీ నలభై ఆరు సంవత్సరాలు ఈ జూన్ తో పూర్తయిపోయింది. ఏది? స్వామి వైభవాన్ని గురించి మాట్లాడుతూ, మాట్లాడుతూ లెక్క వేసుకుంటూ వెళితే నలభై ఆరు ఏళ్లు అయిపోయింది. ఇంకా వైభవం చెప్పాలా? ఇంకా వైభవం ఏంటో, ఇంకెక్కడన్నా ఏదన్నా ఉంది వెతకాలంటే మనస్సు ఏమ Nndంటే, వైభవం చెప్పుకున్నారు, అందరూ చూశారు, ప్రపంచ దేశాలే అంగీకరించినయి, ప్రపంచంలో ఉన్న అందరూ కూడా స్వామిని మించిన పరదైవతం లేదని నిర్ధారణకు వచ్చారు. మరి ఈవేళ ఏం చె-- ఏం చేయాలి? స్వామి దేహంలో లేరు. దేహంలో లేరు గనుక లేరా? దేహంలో మాత్రమే ఉంటేనే ఉన్నట్లా? అంటే నా భావన కూడా ఒకటి. భావన ఏంటంటే, when he was in form, he was formless to me. When he is formless now, he is form to me. అంతే. [సభలో చప్పట్లు] రూపం అరూపం అవుతుంది, అరూపం స్వరూపం అవుతుంది, మళ్ళీ అలా మారుతూ ఉంటుంది. కాబట్టి అది ఉండేదే. ఆ ఉండేటువంటి ఆ పరమాద్భుత శక్తి-- వేమూరి శివరామశాస్త్రి గారు ప్రశాంత నిలయానికి వెళ్ళినప్పుడు, ఆయన ఎవరో ఈ, ఈ తరానికి తెలీదు. చాలా తత్వవేత్త, మహానుభావుడు. ఆయనంతటి వాడు ప్రశాంత నిలయానికి వెళ్ళాడంటే ఇక్కడ ఏదో ఉందని మన బోటి వాళ్ళంతా వాకిలి దగ్గరికి వెళ్లి "ఇంతకీ మీరెందుకు వచ్చారు? అన్నీ మీరు బాగా రాశారు కదా, రెండు వందల గ్రంథాలు రాశారు, మీరెందుకు వచ్చారు?" అంటే "నేను స్వామి దగ్గరికి వద్దామని వచ్చాను" పప్పా అని చెప్పేవారు. కానీ వీళ్ళ question ఏమిటంటే ఈయన దేవుడు అని ఆయన చెప్పాలి. చెప్తే అవునని వీళ్ళు వెళ్ళాలి. నాకు తెలీదు కదా. మనందరం మనం కనుక్కోలేం. అంటే ఆయన్ని ఏమడిగారంటే straight గానే అడుగుతున్నాం అండి "ఎవరీ సత్య సాయిబాబా వారు?" అని అడిగారు. "అదే తెలుసుకుందామనే ప్రయత్నంలో ఉన్నాను, ఇంకా నాకు అంతుబట్టడం లేదన్నారు". మళ్ళీ ఇంకా కొద్ది రోజులయ్యాక ఇదే ప్రశ్న. రెండో సమాధానం ఏమన్నారంటే "ఇప్పుడిప్పుడే నెమ్మదిగా బొమ్మ కనబడుతున్నది నాకు" అన్నారు. బొమ్మ కనబడుతున్నది అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ప్రశ్నకి ఆయన ఏమన్నారంటే "సమస్తమైనటువంటి వేదరాశి ఒక రూపం తీసుకుంటే అది భగవాన్ శ్రీ సత్య సాయి. ఇది భూమండలం మీద నడుస్తున్నటువంటి ఒక బ్రహ్మ పదార్థం. వారు, వాడు, వారు, ఆయన, అతను పదాలు లేవు. అది అనటం మొదలుపెట్టారు. ఏది తత్ అయితే ఉన్నదో ఆ అది అంటే తత్. ఆ తత్ త్వం అసి. అదే నేనై ఉన్నాను, అదే మీరై ఉన్నారని చెప్పడానికి వచ్చానని చెప్తూ "మీరు ఇన్ని వేస్తున్నారు కదా, నా వరకు నాకు స్వామి పండితులకు పరీక్ష. నాబోటి పామరుడికి, ఎవరు రెండు వందల గ్రంథాలు రాశానని అంటున్నాడు. నాబోటి పామరుడికి స్వామి ఒక నిత్య పరీక్ష. నేను గ్రంథాలు బోలెడు రాశాను, పద్యాలు రాశాను అన్నీ ఏర్పడ్డాయి. ఆలోచించాను ఏం రాశాను? ఇవన్నీ ఎందుకు రాశాను? నే రాశానా? అని నాలుగు వేదాలు పుక్కిట పెట్టాను. నాలుగు వేదాలు వెళ్ళగా వెళ్ళగా ఆలోచన చేయగా అవి రెండు వేదాలుగా మిగిలిపోయినయి. ఆ రెండు వేదాలు రెండు అక్షరాలుగా మిగిలిపోయినయి. ఆ రెండక్షరముల యొక్క వేద స్వరూపమే సాయి అనే రెండు నామాలు. మిగుల వర్ణములెల్ల తెల్ల చూర్ణముల్" అన్నారు. వర్ణం అంటే అక్షరం. "నేను రాసిన మిగతా అక్షరాలన్నీ వాకిట్లో శ్రీమూర్తి వేసినటువంటి బ-- రంగవల్లి ముగ్గు ఎట్లాగైతే గాలి కొట్టగానే గాలిలో కలిసిపోతాయో, నే రాసిన పుస్తకాలు, అక్షరాలు అలా వెళ్ళిపోయి కానీ ఏం మిగిలింది అంటే నా హృదయ పీఠం మీద, ఈ పలక మీద సాయి అనే రెండు వేదాక్షరాలు మిగిలిపోయాయి" అన్నారు. అది స్వామిని అర్థం చేసుకోవలసిన కీలు అది. [సభలో చప్పట్లు] ఇదంతా అయిపోయింది. సరే స్వామి అవతారం 2011 ఏప్రిల్ 24 Gregory calendar మనకి dates బాగా గుర్తుంటాయి కదా. సరే అయిపోయింది. ఈవేళ అసలు విషయానికి రావాలి. నాగేశ్వరరావు గారు అడిగినప్పుడు ఆ సాయి తత్వబోధ అని చెప్పొచ్చు. నా మనసు-- ఆయన అడిగిన నేను పెద్ద ఏమి time తీసుకోలే, few seconds ఏమో, అది కూడా లేదు. ఆయన అడిగారు, చెప్పాలి కదా. అప్పుడు అవతారోద్యమం అని మాట్లాడుదాము అని చెప్పాను. ఉద్యమము అనంగానే మనకివ్వళ ఉద్యమం అంటే రాళ్ళు వేసుకోవటం, కొట్టుకోవటం కదా. ఒకరినొకరు పొడుచుకోవటం, చంపుకోవటం, దోపిడి, దహనకాండ ఇది. ఉద్యమము అంటే ఉద్యమించటం, ఉత్సాహంతో పనిచేయటం.శక్తి మీద పని చేయటం, శక్తినంతా కూడగట్టుకొని పని చేయటం శక్తి చాలకపోతే అందరి శక్తిని కలుపుకొని అందరము కలిసి చేయటం దాని పేరు ఉద్యమం. అందుకనే సత్యసాయి అవతార ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2011 నాడే దానికి బీజమై అది ప్రారంభమై పదకొండు సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ నూతన మందిరంలో ఆ ఉద్యమానికి, ఆ ప్రణాళికకి, ఆ వైభవానికి, రాబోయే తరానికి ఇది ఒక role model గా ఇవాళ ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నది. ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే భగవాన్ శ్రీ సత్య సాయి. ఈ ఉద్యమాన్ని, ఈ అవసరాన్ని గుర్తించినవారు ఎవరంటే భగవాన్ శ్రీ సత్య సాయి. ఇంకా మా వాళ్ళు రేప్ వెళ్ళాలే, ఎల్లుండి వెళ్ళాలే, ప్రశాంతి నిలయంలో ఏముంది, ఇక్కడే అన్నీ ఉన్నాయి, అసలు ఇక్కడా అక్కడా లేదు, ఇంకెక్కడో ఉంది అని పెడదారులు పెట్టేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఉద్యమ స్ఫూర్తిని మనం ఇవాళ నింపాలి. ఈ ప్రపంచానికి అందించాలి మనం. ఎవరము అంటే ఎవరైతే మనందరం స్వామి దగ్గరికి వెళ్ళామో, ఎవరైతే లబ్ధి పొందామో, ఆనందాన్ని పొందామో, అవగాహన పెంచుకున్నామో, విజ్ఞాన రేఖలను విస్తరించుకున్నామో, ఎవరు ఒక వ్యక్తిత్వంతో బతుకుతున్నామో, ఎవరి కుటుంబాలు, సంసారాలు, వంశాలన్నీ భద్రతమంగా, గౌరవప్రదంగా సమాజంలో తలెత్తి శిరస్సు ఎత్తి నడుస్తున్నాయో వాళ్ళందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. [చప్పట్లు] కేవలం భక్తి మాత్రమే కాదు, భక్తితో శక్తి ఉండాలి, శక్తితో పాటు యుక్తి ఉండాలి, యుక్తితో పాటు యోగము ఉండాలి. అందుకనే భక్తి, శక్తి, యుక్తి, యోగము. భగవద్గీత చూడండి శ్రీ కృష్ణ పరమాత్మ డెభై ఎనిమిది, డెభై ఆరు స-- ప్రదేశాలలో యోగ అనే శబ్దం వాడతాడు. యోగ అంటే aerobics కాదు, యోగ అంటే టీవీల్లో చూపించేది కాదు. యోగ అంటే సమన్వయం, సంఘర్షణ లేని సమన్వయం. మనతో మనకి, మన మనసుతో మనకి స్పర్ధ ఉండకూడదు. clarity ఉండాలి, conviction ఉండాలి, compassion ఉండాలి, celebration ఉండాలి, cherish చేయాలి. ఇవన్నీ కూడా కలిపితే ఉద్యమంలో ఒక భాగం అది యోగం కాబట్టి యోగః చిత్త వృత్తి నిరోధః అది ఆ philosophical గా, biological గా, metabolic గా, intellectual గా చేసే యోగం. ఈ భగవద్గీతలో చెప్పబడిన యోగము ఏమిటి అంటే కూడి ఉండటమే. ఎవరితో అంటే మన ఆత్మతో మనం కూడి ఉండటం, మనం ఆ-- అది నేర్చుకున్నప్పుడు పరమాత్మతో కూడి ఉండటం తెలియదు. ఇది జరగనప్పుడు అది జరగదు, అది జరిగినప్పుడు ఇది జరిగితెరుగుతుంది. కాబట్టి చాలా విశ్లేషణాత్మకమైన విధానంలో వెళ్ళాలి. అలాగే రెండవది, రెండవ పదం వాడాడాయన. దాని పేరు యుక్త, యుక్త అంటే దానితో సమన్వయమై సాగాలి. యుక్తాహార విహారశ్చ తగిన ఆహారము, తగిన చోటికి వెళ్ళటము, తగిన ఆచారము. అంటే స్వామిని ఒకసారి అడిగారు, "స్వామి నిరంతరమైన సాధన ఎలా చేయాలి?" అని అడిగారు. "ఓ prescribe చేయండి ఒక బోర్డు మీద రాయండి, అది మేము follow అవుతాను." స్వా-స్వామి చమత్కారంగా చెప్పిన మాట ఏమిటో తెలుసా? "నీకు ఏది సాధ్యమో అదే సాధన" అన్నారు. ఏది అసాధ్యమో సాధన కాదుగా. ఏది సాధ్యమో ఆ సాధన వైపు వెళ్ళాలి. సాధన అంటే క్రమశిక్షణ, సాధన అంటే ఒక అద్భుతమైన dedication, determination. ఇవన్నీ మన ఆంతరంగికమైన శక్తి స్వరూపాలు. వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళితే ఈ అవతార ఉద్యమాన్ని ఇవాళ పొద్దున దిగినప్పటి నుంచి ఇప్పటివరకు అనాహతగా సత్సంగం సాగుతూనే ఉంది అనేక రూపాల్లో. ఆ రూపాల్లో సాగుతున్నప్పుడు ఒక్కసారి మనస్సు వెనక్కి తిరిగినప్పుడు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ఆంధ్రదేశంలో మరెవరూ చేయని విధంగా ఒక జిల్లా ఆశాంతము కూడా ఇంచ్ ఇంచ్ వదిలిపెట్టకుండా, ఏ గ్రామము వదిలిపెట్టకుండా సత్యసాయి యొక్క వైభవాన్ని, తత్వాన్ని పూర్తిగా గ్రామగ్రామంలో, మూలమూలల్లో, వ్యక్తీ వ్యక్తులతో తీసుకువెళ్ళినటువంటి ఒకే ఒక్క జిల్లా విశాఖ జిల్లా. [చప్పట్లు] పేర్లు చెప్తాను. వాళ్ళు దెబ్బతించి పోయి ఉండొచ్చు గాక కానీ వాళ్ళ contribution మనం మర్చిపోకూడదు. ముకుందరావు గారు, తర్వాత ఇగ నాగేశ్వరరావు, నాగేశ్వరరావు గారు అప్పుడు young ఏ. ఆయన పల్లెలో ఉండేవారు, ఆయన కొంత వచ్చారు. అలాగే ఆ ముకుందరావు గారు ప్రధానంగా, ఎం.ఎస్. ప్రకాష్ రావు గారు, ఆయన ఉన్నారు. ప్రకి-- ఇప్పుడు పుడుపర్తిలో ఉన్నారు. మేమందరం కూడా ఇక్కడ ప్రారంభమై నెమ్మదిగా అరకు వైదిగా వెళ్లి గిరిజన ప్రాంతాలన్నీ తాకుతూ అన్నీ తిరిగి తిరిగి తిరిగి మన అనకాపల్లి bus stand పక్కన దాన్ని, ఆ యజ్ఞాన్ని పూర్తి చేశాం. ఏం చేశాము ఈ ఏడు రోజులు అంటే మేము వినోద విహారాలకు వెళ్ళలే. అది యుక్తమైన విహారంగా భావన చేసి స్వామి యొక్క అవతార వైభవాన్ని మూలమూలలకి చెప్పాలి. చదువుకున్న వాళ్ళకి, చదువులేని వాళ్ళకి, స్వామి అంటే ఏదో తెలియని వాళ్ళకి అది ఒక్క కారులో ప్రయాణం చేసి అవి చేశాం. తర్వాత మనకి Vizag Steel Plant. Steel Plant లో ఎన్ని వందల సత్సంగాలు అయినాయో నాకు తెలియదు. నేను ఇవాళ ఇక్కడికి వస్తున్నానని తెలిసినప్పుడు ఇవాళ organization నుంచి వెళ్ళిపోయిన మనోహర్ గారు. వాళ్ళతో మాట్లాడి, "మూర్తి గారు వస్తున్నారు Steel Plant లో వారికి వసతి ఏర్పరచండి." అని వీళ్ళతో మాట్లాడి, నాకు తెలియదు ఆయన నాకు message పెట్టేదాకా. "Now you are going to stay only in our గుట్టు నగరం. That is a-- పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం." అని నాకు చెప్పారు నిన్న phone లో. కాబట్టి Steel Plant లో మందిరం ఎలా కట్టబడింది? ప్రతి మందిరానికి ఒక కథ ఉంది. దీనికి ఎలా ఉందో వాటికి-- ఆ కథలు కథలు చాలా ఉన్నాయి. అంటే స్వామి ఏం చేశారంటే గుడులు కట్టలా. కేవలము అవి నా దృష్టిలో అవి సాయి మందిరాలు మాత్రమే కాదు. దానిలో స్వామి అన్నట్టుగా, "కసాయిలోనూ సాయి ఉన్నాడు, సాయములోనూ సాయి ఉన్నాడు, సాయంలోనూ సాయి ఉన్నాడు. సాయి లేని చోట ఎక్కడో చెప్పవయ్యా" అని అడిగారు. అది.అన్నిటా ఉన్న నేను అక్కడ ఉన్నప్పుడు ఇది కేవలం మందిరాలు కావు, ఈ గుణ మందిరాలు కావాలి అన్నాడు. స్వామి అధ్యాత్మలో మూడు ప్రధానమైన అంశాలున్నాయి. నేను ఎంత భక్తుడినని నేను ప్రకటించుకున్నా, నా-నా అంతటి భక్తుడు లేడని అతిశయించినా, నాకున్న knowledge ఇంకెవరికీ లేదని దంభాచారం పలికినా, నాకు character గనక లేకపోతే స్వామి నుంచి వేయి మైళ్ళ దూరం విసిరివేయబడతాను. నన్ను దగ్గరకు రానివ్వరు. అందుకనే character is at most in Sai organization. ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళిపోయినారంటే those who lost their individual character, they also lost Swami. దానికి నిలబెట్టుకున్న వాళ్ళని స్వామి పట్టుకున్నారు. అంటే స్వామికి వాళ్ళ మీద దయ లేదా అంటే, దయ ఉందా? నేను మీ చేతికి పది రూపాయలు ఇచ్చిన ఎలా దాచుకోవాలో కూడా జేబు ఉండాలిగా. దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలియాలిగా. పది ఇలా అరచేతిలో పెడితే గాలికి కొట్టుకుపోతుంది. అలా కాకూడదు. అనుగ్రహాన్ని పొందామంటే కనురెప్ప వాలేదాకా దాన్ని నిలబెట్టుకోవాలి. దానికి ఇందాక చెప్పిన ఈ సాధనా మార్గాల ద్వారా. కాబట్టి స్వామి ఉద్యమం ఇవాళ ప్రారంభమైంది. స్వామి అనుగ్రహం మనయందు ఎప్పుడూ ఉన్నది. వాటన్నింటినీ కూడా గనక మనం గమనించినట్లయితే ఇవాళ ఏం చేయాలి? ఇందాక నాగేశ్వరరావు గారు అటు చూశారు ఖాళీ ఉంది, ఇటు చూశారు ఖాళీ ఉంది. ఆయన గుండె గుభేలుమంది. ఎందుకంటే ఏమిటి ఇది మనం స్వామి మందిరం కట్టుకున్నాం, పట్టుమని పది మంది లేరు. ఆ రెండడుగుల దూరం ఉంది. అంటే మనకు సమాధానం ఏం లేదులెండి కరోనా భయం వల్ల అని అనొచ్చు కదా. కరోనా పోయినా ఇంకా రెండడుగుల దూరం అంటే ఇప్పుడు రెండు మిల్లీమీటర్లు కూడా దూరం లేనంతగా జనం వచ్చారు. [చప్పట్లు] ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? వీళ్ళని ఎవరు రప్పించారు? అంటే స్వామి యొక్క అనంత మహా శక్తి రప్పించింది. స్వామి యందున్న భక్తి, స్వామి యందున్న అపారమైన ప్రేమ, గౌరవం. స్వామి ప్రపంచం మొత్తాన్ని ప్రేమించారు గనుకనే ప్రపంచం యావత్తు ఒక్క స్వామిని ప్రేమించింది. మనం ప్రేమిస్తే ప్రేమ మనకు వస్తుంది. మనం ద్వేషిస్తే ద్వేషమే వస్తుంది. బంగారాన్ని స్వర్ణకారుడి చేతికిచ్చి కోసి చేయండి అంటే కోస్తే బంగారం నుంచి బొగ్గు రాదు, బంగారమే వస్తుంది. సాయి ఆవరణలోకి వచ్చిన ప్రతి జీవిని తడిమితే, తాకితే, మాట్లాడితే, వాళ్ళతో కలిసి నడిస్తే ఏమి రాదుతుంది అంటే జ్ఞాన పలాభం రాదుతుంది. స్వామి మనకు అందించినటువంటి ప్రేమ కుసుమాలే రాదుతాయి తప్ప అన్యం కావటానికి వీలు లేదు. అటువంటివి గనక ఉన్నట్లయితే స్వామి వాటిని check out చేస్తారు ఇంగ్లీషులో. ఎక్కువ కాలం ఇక్కడ ఉండనివ్వరు. ఇక్కడికి మనం వచ్చింది ఎందుకంటే ప్రపంచాన్ని మార్చటానికి మనం రాలే. స్వామి ఏం చెప్పారు? "ఈ ప్రపంచాన్ని మార్చటానికి రాలే, మార్పు ఎలా చెందాలో చెప్పటానికి వచ్చాను." Transformation is important. దానికి transmission కావాలి. Transmission జరగాలంటే transport జరగాలి. Transport జరగాలంటే translate జరగాలి. ప్రతి దానికి ఒక ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియలన్నీ అధ్యాత్మతో ముడిపడి ఉన్నాయి కాబట్టి అందరం కూడా ఇవాళ స్వామి అవతార ఉద్యమాన్ని మళ్ళీ ఒక తరం నా కళ్ళ ముందు వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఇటు అటు కూడా ఈ చిన్న పిల్లలందరూ కూడా leadership తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. భజన చేస్తే ఉద్యోగం వస్తుంది అని భజన చేస్తే ఉద్యోగమే వస్తుంది కానీ స్వామి రాడు. కదా. భజన చేసి ఆ ఉద్యోగం వస్తే స్వామిని విడవకుండా గనక ఉంటే ఉద్యోగంలో promotionలు వస్తాయి. స్వామి ఎటు తీసుకెళ్లాలి అటు తీసుకెళతారు. కాబట్టి ఈ యువశక్తి అంతా కూడా ఇవాళ ఉద్యమ భాగస్వాములై మళ్ళీ ఆనాడు, ఎన్నాళ్ళో అయిపోయింది అది జరిగి ఇరవై ఏళ్ళ పైన మాట. మళ్ళీ ఈవేళ దాని ఆవశ్యకత ఏర్పడింది. వీధి వీధిలో, పల్లె పల్లెలో మీకు తెలుసో తెలియదో నేను అనేక దేశాలు వెళ్తా. అనేక ప్రదేశాలకు కూడా వెళ్తా. కానీ ఒక వైజాగ్ లో ఒక గంట ఉపన్యాసం ఇచ్చి మరనాడు పొద్దున flight లో వెళ్ళటానికి ఇక్కడ అవకాశం ఉండదు. ఏముంటుందంటే ఒక రోజు, రెండు రోజులు అవుతుంది. వెంటనే నాయుడు గారు phone చేస్తారు మా దగ్గర, మీరు రావటం లేదా? ఒక రోజు stay చేయండి అయిపోతుంది. అది మూడో రోజు అవుతుంది. మూడో రోజు అది నాలుగో రోజు కూడా కావొచ్చు. ఏమవుతుందో తెలియదు. అంతేకాదు అది విశేషం కాదు. ఒకే రోజున తొమ్మిది సత్సంఘాలు కూడా ఇక్కడే జరిగినయి. ఎక్కడా జరగలేదు. [చప్పట్లు] అక్కయ్యపాలెం తో మొదలై, సీతమ్మధార మీదుగా, డావా గార్డెన్ మీదుగా, విశాలాక్షి నగర్ మీదుగా, ఏంటా పేర్లు? మధురవాడ మీదుగా అట్లా అట్లా వెళ్లి అది ఎటు వెళుతుందో మనకి తెలియదు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే పది రోజులు జరగవు, మూడు రోజుల్లోనే జరుగుతాయి. మూడు తొమ్మిదులు ఇరవై ఏడు. ఇరవై ఏడు సత్సంఘాలు మాట్లాడాలంటే అది ఒక వ్యక్తికి సాధ్యమేనా? అసంభవం. మరి అయినయినా అంటే అది సంభవం ఎందుకైందంటే మాట్లాడేది ఆయన గనుక. [చప్పట్లు] ఆయన కూడా మాకు ఎలా ఈ mic కావాలో ఆయనకు కూడా ఒక mic కావాలి కదా. ఆ mic లో ఆయన మాట్లాడుతుంటారు, నేను వింటాను, ఇలా మాట్లాడతాను, ఇది అందరికీ వినిపిస్తుంది. [చప్పట్లు] కాబట్టి there is nothing to fear. దీనిలో మన తెలివితేటలు, మన శ్రద్ధలు, మనకున్న knowledge ఇవన్నీ అహంకార పూరితమైన ఆలోచనలే తప్ప మరొకటి కాదు. రెండవది మనకి స్వామితో ఎంత సన్నిహిత సంబంధం ఉండనివ్వండి మనం పదే పదే దాని గురించి ప్రపంచంలో మాట్లాడకూడదు. ఇక్కడున్న వీళ్ళందరికీ తెలుసు. ఇన్ని వేల సత్సంఘాలలో నేను ఇంతవరకు ఒక miracle చెప్పలేదు. ఇంతవరకు చెప్పలా. స్వామి ఎంత దగ్గరో, స్వామికి నేనెంత దగ్గరో ఎన్నడూ చెప్పలే. ఎందుకంటే it has nothing to do with the world. That is between you and Swami. అయిపోయింది. దాని నుంచి నేను ఏ శక్తిని పొందాను, ముందు నన్ను నేను ఎలా బాగుచేసుకున్నాను, నా కుటుంబంలో నా భాగస్వామి అయిన భార్యని నాకు కావలసినట్టుగా మలచుకొని స్వామి యొక్క తత్వాన్ని ముందు ఆమెకు బోధించి నా పాత్రని క్రియ చేసుకొని నేను నా భార్య, నేను నా భర్త-- నా అంటే నాని కాదు, భర్తడు. నేను, నా భార్య, నా బిడ్డ అది నా చిన్న ప్రపంచం. ఆ ప్రపంచాన్ని సాయి మార్గంలోకి నేను తెచ్చుకున్నందువలన మా ఇంట్లో పరిపూర్ణమైనటువంటి శాంతి ఏర్పడుతుంది. లేకపోతే స్త్రీ భర్తకి అబద్ధం చెప్పి బయటికి రావాలి కదా.మగవాడు భార్యను మధ్య పెట్టి భజనకి రావాలి, పిల్ల మధ్య పెట్టి ఇక్కడికి రావాలి. అది సాయి తత్వంలో లేనే లేదు. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహత్ మనః. ఈ మూడు that is called unity, purity and divinity. అంతకుమించి ఏం లేదు. ఆలోచన, మాట, చేత ఒకటి గనుకైతే శాంతిగా పేరు ఉన్నది. ఇటువంటి అనేకమైనటువంటి భావాలన్నీ కూడా ఈ ప్రపంచానికి అందించడమే కాదు, ఖండ ఖండాంతరాలలో South Africa లో ఈ దేశంలో ఉన్నదానికంటే ఎక్కువ విద్యాలయాలు ఉన్నాయి, schools ఉన్నాయి primary level లో. నేను వాళ్ళని అడిగాను, మీరు బాబాని చూశారా అని అడిగాను. మేము చూడలేదు అన్నారు. మరి స్వామిని చూడలేదు, లేదా స్వామి literature చదివారు లేదా పుస్తకం చదివారు. ఆహ్ మీరు ప్రారంభించారు, మీరందరూ పిల్లలకి, డబ్బున్న వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా, డబ్బు లేని వాళ్ళకి విద్య నేర్పుతున్నారు. స్వామికి-- మనకంటే చాలా బాగా భజన పాడతారు, మనకంటే బాగా హారతి పడతారు, మనకంటే చాలా disciplined గా పని చేస్తారు. అన్నీ ఉన్నాయి. ఎలా చేస్తున్నారు అంటే, మాకు స్వామిని చూసే అవకాశం మాకు లేదు. మాకంత డబ్బు లేదు గనుక ఆ దేశం రాలేకపోయాం. రెండవది, అసలు వచ్చి ఏమీ చేయకుండా ఉండేకంటే, రాకుండా అన్నీ చేయగలిగిన అనుగ్రహాన్ని మాకు స్వామి ఇచ్చినప్పుడు ఇంకా ఏం కావాలి ఏంటండీ? వాళ్ళని మనం వెనకబడిన దేశం వెనకబడిన దేశం ఆఫ్రికన్ దేశం అని హేళన చేస్తాం. మనకి వేదాలు తెలుసు, ధర్మ శాస్త్రాలు తెలుసు, ప్రవచనాలు హోరెత్తించగలం, మనకున్న knowledge ఎవరికీ లేదు. అన్నీ నిజమే కానీ నిస్సహాయలం, అలసత్వం ఒక మనం ఏమీ చేయలేని స్థితికి మనల్ని మనం నెట్టుకుంటాం. మనకు కూడా అప్పుడప్పుడు స్వామి నిజంగా దేవుడే అనే ప్రశ్నే వస్తుంది. దేవుడు అవునో కాదో అంటాం. అక్కడే ఆయన ముందు చీటీలు పడేస్తాం. కదా? మనం ఆయనతో జూదం ఆడతాం. జూదం ఆడి నా కడుపులో నొప్పిగా ఉంది, సాయంకాలం తగ్గుతుందా తగ్గదా? ఏం చేయాలి అని. తగ్గించాలా? తగ్గిస్తే దేవుడని నమ్ముతాం. సరే ఇవ్వాళ కడుపులో నొప్పి తగ్గకపోస్తే మళ్ళీ ఇంకో చీటీ. ఈ దౌర్భాగ్యం నుంచి మనం బయటపడాలి. కాల స్వరూపమైనటువంటి స్వామితో జూదం ఆడకూడదు. మరి ఏం చేయాలి? సమర్పణ చేయాలి. శరణాగతి పొందాలి, వినయంగా ఉండాలి. ఈ మూడు ఉంటే స్వామి మన కైవసం. స్వామి మనల్ని దగ్గర పెట్టుకుంటారు. సమర్పణ చేయాలి. ఏమి-ఏమి సమర్పణ చేయాలి? అంగ సమర్పణ చేయాలి. అంగ సమర్పణ అంటే కాలోచయ కోశాయన్ దగ్గర పడేయటం అంటే చేతిలో బలముంటే సేవ చేయాలి. కాళ్ళలో బలముంటే నడవటం మాని పరిగెత్తాలి. కళ్ళల్లో బలముంటే చూడగలిగినంత చూప్పు మీద వెళ్ళాలి. అన్నీ సర్వాంగములు సమన్వయం చేసుకొని చేయగలిగితే సేవ చేయాలి. అహంకార మమకారాలు లేని ప్రేమ పూర్వకమైనటువంటి సేవలో ఉంటే, ఆ Left All Serve All symbolic అప్పుడు మనం స్వరూపం అవుతాం, మనం ప్రతీకలం అవుతాం. It is not a slogan. అది ఒక ఆధ్యాత్మికమైనటువంటి దివ్యమైనటువంటి సూచన. వీటన్నింటినీ కూడా మనం గమనించుకుంటూ గనుక వెళ్లినట్లయితే దాని పేరే ఉద్యమము. విప్లవం అంటే విధ్వంసం కాదు, అది పరిణామం. పరిణామం అంటే స్వామి కొరకు ఉన్న transformation. నేను పదేళ్ళ నాడు ఎలా ఉన్నానో ఇవాళ్టికి అలాగే ఉంది. నిన్న ఎలా ఉన్నానో ఈ పూట అట్లాగే ఉంది. ఏ మార్పు లేకుండా నేను వెనక ఉన్నట్లయితే నాకు ఈ కట్టబడిన ఈ గోడలకి ఏం తేడా లేదు. కానీ నేను చైతన్యంతో పుట్టా. నేను దానవత్వ దీనత్వాలు దాటి దివ్యత్వం వైపు నడిచాను. నేను మానవత్వాన్ని ఆకళింపు చేసుకున్నా. ఆ నేను నేను నా గురించి కాదు. అంటే మనం, మనం వీటన్నింటినీ కూడా శ్రద్ధగా సమన్వయం చేసుకోగలిగినట్లయితే, ఆ సమన్వయ స్థితిని మనం ముందు home లో ఇంట్లో ప్రారంభిస్తే ఆ ఇల్లు ప్రశాంతతమయం అవుతుంది. ఎచటనున్న వాడు సాయి అని ఎన్ని విధంబుల వెదకి చూచినన్. పత్రిని లేను పత్తిని లేను సర్వ హృదయముల నిండి ఉండును సత్యము తల్పగా వచ్చెను నాడు సాయిలై నేడు సత్య సాయిలై. అది రెండు అవతారాలు. ఎక్కడ ఉన్నాడంటే మనలో ఉన్నాడు. మనం మంచిదే మనం అంటాం స్వామి మా హృదయంలో ఉన్నారు చాలా బాగుంది. మరి స్వామి నా హృదయంలో ఉంటే నేను మరి స్వామి లాగే ఉండాలి కదా. మరి ఎందుకు ఉండటం లేదు? ఉండాలి కదా. మనందరికీ ఉంగరాలు ఇచ్చారన్నారు, మరి ఆయన ఉంగరం పెట్టుకోలేదు. కదా? కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చారన్నారు, మరి ఆయనకి కళ్ళజోడు లేదు. చేతికి వాచీ లేదు, తర్వాత కాళ్ళకి చెప్పులు లేవు, ఏమీ లేవు. అన్నీ ఉన్న ఆయన ఏమీ లేనట్లు ఉన్నారు, ఏమీ లేని మనం అన్నీ ఉన్నట్లుగా ఉన్నాం. చూడండి. ఇది దీనిని చాలా తార్కికంగా ఆలోచించాలి. ఏదో స్వామి దేవుడు ఊరేగింపు, జాతర, ఉత్సవం, భోజనాలు, హడావుడి ఆ ఈ గందరగోళం పడిపోవటం కాదు. స్థిమితంగా ఆలోచించాలి. ప్రధానంగా ఈ వేళ యువత నా కళ్ళ ముందు నా ముందు కూర్చున్న ఈ యువతకి నేను చెప్పేది ఒకటే. ఈ ఉద్యమంలో మీరు enroll కాండి. మనకి స్వామి ఒక పరిధి గీశారు, ఒక frame కట్టారు. ఎందుకంటే అటూ ఇటూ మనస్సులు చెదరకుండా, ఆలోచనలు అటూ ఇటూ పోకుండా, నాకు ఇష్టమైన రీతి నేను ప్రవర్తిస్తానని అనకుండా సత్యసాయి సేవా Organization పెట్టారు. సేవకి Organization ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా? Organization పెట్టి సేవ చేసేవాళ్ళున్నారు. అది అది men's club కాదు women's club కాదు, దాని పేరు Lions Club. దాంట్లో ఉన్న వాళ్ళంతా సింహాల వలే ఉంటారు. కదా? సింహాల ప్రవృత్తిని బట్టి ఉంటారు. కాబట్టి మరి వాళ్ళు ఏం చేయాలి? ఆ lions అంతా అంటే సమాజంలో దుర్బలుల మీద దాడి చేయకుండా lions ఉండాలి. Rotait కాకుండా Rotarians ఉండాలి. మనకి అవన్నీ అక్కర్లేదు. సత్యాన్ని ఆశ్రయించి, సత్యాన్ని శ్వాసించి, సత్యమే భావనగా జీవించగలిగిన మహోద్యమంలో గనక మనం ఉండగలిగినట్లయితే, స్వామి చెప్పారు, నీకు వంద రూపాయలు గనక నువ్వు సంపాదిస్తే దానిలో నీ లాభం అది gross profit అయితే, దానిలో నీ savings గనక ఒక 3% గనక అయితే అంటే మూడు రూపాయలు అయితే దానిలో only 10% of the three rupees నువ్వు ఖర్చు పెట్టమన్నారు.నీకు వచ్చిందల్లా తెచ్చి ఇక్కడ పెట్టమనలా ఎందుకని అంటే మనకి నేర్పడానికి చెప్పారు. ఆయన సంకల్పిస్తే ఎవరు ఇచ్చారని అన్ని బిల్డింగులు అక్కడి నుంచి వచ్చినాయి ఎవరు ఇచ్చారని ఈ దివ్య భోజనం ఏర్పడింది చెప్పండి? ఏర్పడతాయి అది మన నమ్మకం. ఇది నమ్మకమే కాదు నిదర్శన పూర్వకంగా కాబట్టి సత్య సాయి మహోత్సవంలో ఇదిగో ఈ ఆ వర్షాకాలం అయిపోయిన తర్వాత మనకి అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు everybody is a tight అంటేనా అందరము చాలా బిజీ పోయి ఉంటాం విపరీతమైన programs ఉంటాయి. స్వామి birthday అయిపోయిన ఒక వారం రోజులు అన్నీ సర్దుకున్న తర్వాత నవంబర్ చివరి నుంచో డిసెంబర్ మొదటి వారం నుంచో ఆ నెలలో గనుక మనం plan చేసినట్లయితే ఈ ఉత్సవాన్ని వాడ వాడలా వీధి వీధిలా ఇంటింటా ఇవాళ ప్రతి ఇంటికి ఒక programs ఉన్నాయి కదా ప్రతి ఇంటికి స్వామిని తీసుకెళ్ళే ఒక program చేద్దాం. స్వామి యొక్క తత్వాన్ని నాలుగు పేజీల్లో ఇంటింటికి [చప్పట్లు] వాళ్ళు మాకు అక్కర్లేదండి మేము ఫలానా దాంట్లో మేము ఇంకో దాంట్లో ఆ సంస్థలో మేము మీ దగ్గరికి డబ్బు కోసం రాలేదు మీ డబ్బు మాకు వద్దు మీరు స్వామి అంటే ఏమిటో ముందు తెలుసుకోండి. ఇది ఒక వేద విజ్ఞానానికి ఇది స్వరూపం సనాతనమైనటువంటి ఒక సారథి ఈ ప్రపంచంలో ఎనభై ఆరు సంవత్సరాలు నిద్ర లేకుండా మనకోసం నిలబడినటువంటి ఒక చైతన్య స్వరూపాన్ని మీకు తెలియజెప్పటానికి వచ్చాం. ఇదిగో ఇదిగో అని గనుక నాలుగు పేజీల చిన్న పుస్తకం వాళ్ళ చేతిలో పెట్టి అది ప్రచారం కాదు మనం చేయబోయేది ప్రసారం we are not going to campaign for Swami no need everybody knows సత్య సాయి in the world. ఇవాళ మనం చేయవలసింది మేము స్వామిని ఇలా అనుభవించాము ఇలా ఆనందించాం మా జీవితాలు ఇలా బాగున్నాయి మీరు కూడా రండి కాసు ఖర్చు లేదు స్వామి చెప్పిన మాటే మీ బాధలు మీ ఆకలి అన్నీ మూటగట్టి ప్రశాంతంలో పడేయండి. ఇక్కడి నుంచి ప్రేమని, ఆరాధన, భావాన్ని మీ ఇళ్ళకి తీసుకొని వెళ్ళి ఆనందంగా జీవించండి కాసు ఖర్చు లేదన్నారు. ఇవాళ మళ్ళీ మనం అవన్నీ కూడా ఒకసారి స్మరించుకోవాలి ఉజ్జమం ఉంటే మనమందరం జెండాలు పట్టుకొని స్వామి ఫోటోలు పట్టుకొని ఆ stamp దాన్నుంచి మనం బయట పడాలి vanity వదిలిపెట్టాలి నెమ్మదిగా charity లోకి వెళ్ళాలి. వెళ్ళి పునః మళ్ళీ స్వామి యొక్క అవతార వైభవాన్ని ఇవాళ రాముడి కళ్యాణం చేస్తున్నాం, కృష్ణాష్టమి చేస్తున్నాం, గోకులాష్టమి చేస్తున్నాం సరే సత్య సాయి అవతార declare చేసిండే, ఈశ్వరమ్మాడే, స్వామి ఆరాధనడే ఏదో మనం తూర్పుచు చేస్తున్నాం. స-కానీ ఈ అవతార వైభవ ఉత్సవానికి ఇవాళ ఏ date అయితే ఉందో దీనిని కూడా మనం ప్రధానమైన అంశంగా తీసుకొని ప్రతి సంవత్సరము ఇలా june ఇవాళ ఏ తారీఖు అయితే ఉన్నదో ఆ తారీఖు కి మనందరము కూడా వైజాగ్ లో కలవాలి. [చప్పట్లు] ప్రతి ఏడాది నా నుంచి నేను నా diary లో రాసుకుంటా నేను ఈ భూమండలం మీద ఉన్నంత కాలం నాకు శక్తి లేదు అనేది ఆ ప్రశ్నే లేదు నేను చేయగలను అంటే శక్తి ఉంటుంది నేను చేయలేను అంటే శక్తి పోతుంది శక్తి పోయి ఎవరు కూడా నేను చేయలేను అనడు. చేయలేను అన్నందువల్ల ఉన్న శక్తి నేను చేయను అనేవాడి దగ్గర శక్తి ఎందుకు ఉంటుంది? అంతే కదా అది పోతుంది. పోయి మనం మూల పడుకుంటాం, మంచం మీద పడుకుంటాం, ఏదో రాబోయే మృత్యువు గురించి జరిగిపోయిన వైభవాన్ని గురించి తలచుకొని మురిసిపోతూ దుఃఖిస్తూ ఏడుస్తూ ఆ అక్కర్లేని మనుషులతో సంబంధాలు పెంచుకుంటూ జీవితం వృధా చేసుకోకూడదు. దానికి యువకులందరూ కూడా కంచి పరమాచార్య ఒక్క మాట చెప్పారు ఈ సందర్భంలో గుర్తొస్తున్నది. మీరు ఏ దానమైనా అడగండి మీ అవసరాలను బట్టి అడగండి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మీ కోసం మీరు ఎవరి దగ్గరైనా చెయ్యి చాపితే ఇంత వాళ్ళు మీరు వామనుడై పోతారు. ఇంకొకని కోసం గనుక మీరు చెయ్యి చాపితే ఈ వామనుడైతే విక్రముడు అవుతాడు. కనుక ఏం అడగాలి అంటే మాకు కాస్త కాలదానము చేయమని అడగండి. ఆ కాలం దేనికంటే మా మందిరంలో ఏం జరుగుతున్నదో చూడండి, భజనలు ఎలా ఉంటాయో చూడండి, మేం చెప్పే బాల వికాస్ పాఠాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి, స్వామి ఏం చెప్పారో వినండి. దానికి ప్రధాన ప్రముఖ ఈ పదాలేం లేవు మాట్లాడే ప్రతి వాడు ప్రముఖుడు కా-కావలసింది ఇవాళ సుముఖులు కావాలి అంతే. మరి మేము వస్తాను నా willingness itself is battle is half won. నేను వస్తాను నేను చేస్తాను అన్నవాడిని మనం include చేసుకుందాం దగ్గరికి చేసుకుందాం. మనకి మిత్రులు ఒక్కొక్కళ్ళకి కనీసం ఇవాళ మీ వయసులో ఉన్న వాళ్ళకి ఒక twenty five మంది పరిచయస్తులు ఉంటారు అందులో five bosom friends ఉంటారు. ఆ నలుగురు బయట ఉన్నారు మీరు ఒక్కళ్ళే ఇక్కడ ఉన్నారు. ఆ నలుగురితో పాటు సినిమాకు వెళ్ళండి కానీ నలుగురిని తీసుకొని మందిరానికి రండి. అది చేయండి, ఇది చేయండి అంతే కదా స్వామి ఉపునిషత్ మంత్రంలో ఉందని కదా ఇష్టార్థ మోక్షార్థ అని ఉంది. ఇష్టార్థం ప్రాపంచికం మోక్షార్థ ప్రపంచానికి అతీతం. స్వామి చెప్పనిది లేదు ఇవాళ కొత్తగా మనం ఏదో ప్రయత్నం చేసి syllabus చేసి చెప్పక్కర్ల చెప్పినవన్నీ గుర్తు చేసుకుంటే ఇవన్నీ ఏర్పడతాయి కాబట్టి ఈ june ఇరవై ఆరు అనేటువంటి ఈ దీనిని అవతారోజ్జవ నామ సంవత్సరంగా మనం ప్రారంభించి [చప్పట్లు] ప్రపంచం మొత్తానికి మీరు ఆదర్శప్రాయంగా ఉండాలనేది నా కోరిక. ఆనాడు నాతో వచ్చిన వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు కారు ముకుందరావు గారికి మోకాళ్ళు పనిచేయని రోజులవి. పోటు వేసుకుంటూ వచ్చారు ఆయన మీరెందుకు మేమున్నాం అని అంటే అట్లాగే మన స్వామి గారు. ఆ ఒక్కళ్ళు కాదు ఇక్కడున్న అందరి పేర్లు నాకు తెలుసు ఆ పేర్లల్లో ఉన్న వాళ్ళందరూ చాలా అత్యంత నిజాయితీతో ఏది రాని ఏది పోని ప్రపంచం అంతా స్వామి దగ్గర బోలెడు టన్నుల టన్నుల డబ్బు ఉన్నది అన్నప్పుడు దాన్ని ధీటుగా ఎదుర్కొని స్వామి యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి మనందరము కృషి చేశాం. అది దాటాం అంటే ఆనందం దాటాం, ఆశ్చర్యం దాటాం, అద్భుతం దాటాం, ఆనందాన్ని దాటాం, అవమానాన్ని దాటాం, అనుమానాన్ని దాటాం, దుఃఖాన్ని దాటాం, పదకొండు ఏళ్ళు అయిపోయింది దుఃఖపడ్డాం మనందరం ఏమవుతుంది తర్వాత అని. నన్ను ప్రతి ఎక్కడికి వెళ్ళినా ఎవరు అడిగినా నన్ను వేసే ఒకే ఒక్క ప్రశ్నప్రశాంత్ నిలయం ఎలా ఉన్నది అని అడుగుతారు. చాలా బాగున్నది అంటే వాళ్ళకి సంతోషం కలుగుతుంది. ఏమడుగుతారంటే బాబాగారు ఉన్నప్పుడు ఉన్నట్లుందా అంటారు. రెండో ప్రశ్న. నా జవాబు ఒక్కటే స్వామి ఉన్నప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగా జరుగుతున్నాయి ఇదే నిజం. [కప్స్ కొట్టడం] ఎందుకంటే ఉన్నప్పటికంటే అంటే మూట మోయటానికి ఆయన ఉన్నారుగా అనుకున్నాం. తప్పు చేస్తే క్షమించడానికి ఆయన ఉన్నారుగా అనుకున్నాం. ఇవాళ తప్పే చేయకూడదు మూట మోయటానికి ఎవరు లేరు మన మూట మనమే మోయాలి. అవసరమైతే పక్క వాడికి కూడా సహాయం చేయాలి. మన శక్తి యుక్తులన్నీ చేసి స్వామి ఇచ్చినటువంటి అపురూప ఆత్మ భావ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవటానికి సత్యసాయి వారసులుగా మనమందరం కూడా కృషి చేయాలి. మనకి మూలం ఎన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్ననివ్వండి, ఎన్ని రామాలయాలు ఉన్న- రామాలయం లేని గ్రామం ఉందా? ఎన్ని హనుమంతుడి గుళ్ళు ఉన్ననివ్వండి, ఎన్ని ప్రార్ధనా మందిరాలు ఉన్ననివ్వండి అన్నింటికంటే ఎన్ని సత్యసాయి మందిరాలు ఉన్ననివ్వండి మూలము ఏది అంటే ప్రశాంతి నిలయమే మూలం. మనం అక్కడే తొలి పాలు తాగింది అక్కడ, తొలి అడుగు వేసింది అక్కడ, నడక నేర్చింది అక్కడ, బతుకు నేర్చింది అక్కడ, వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్నది అక్కడ, ఒక వ్యక్తిగా బతకగలేటానికి అవకాశం ఇచ్చింది ప్రశాంతి నిలయం కాబట్టి అక్కడ స్వామి లేరు కాబట్టి అంటారు. అవమానకరం. స్వామి లేరేమిటి ఆ ఉన్నది ప్రశాంతి నిలయమే స్వామి యొక్క స్వరూపం ఇవ్వాళ. ఇవ్వాళ ఇదంతా స్వామి స్వరూపం మీరంతా మీ పేర్లు వేరు కావచ్చు, మీ వృత్తులు వేరు కావచ్చు, మీ వయస్సులు వేరు కావచ్చు, మీరు ఎన్నుకున్న మార్గాలు వేరు కావచ్చు ఉన్నదంతా ఏమిటంటే సర్వము కూడా సాయి స్వరూపమే అనేటువంటి భావనతో మనం ఉండాలి. దీనిని ఒక ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని వెళ్ళాలి. నేను ప్రశాంత్ నిలయానికి వెళితే అక్కడ ఉన్న పెద్దలతో నేను ఈ విషయం కూడా నేను మాట్లాడతాను. కానీ దానికి leadership ఎవరు అంటే ముందు మీరు ప్రారంభించాలి. దీన్ని మీరు కంకణ దీక్ష, కంకణ బద్ధులు కండి. మనం ఇంజనీర్ కావాలి అంటే ఇంజనీర్ అయిపోయాం. distinction అంటే distinction అయ్యాం. Civil's లో number one అంటే number one అయ్యాం. పాటలలో maintain అంటే అన్నీ అయ్యాం. మరి భక్తులలో నేను అగ్రగణ్యుడిని అండి మా విశాఖ జిల్లా ఇలా కావాలని మీరు కోరుకుంటే అది కాక ఏమవుతుంది. అవుతుందో కాదో అయితే కాదు. [కప్స్ కొట్టడం] స్వామి చేస్తారా లేదంటే? స్వామి చెయ్యరు. స్వామి చెయ్యరు చూస్తారు. యజ్ఞం చేశారా స్వామి ఎప్పుడన్నా? యజ్ఞం చేయించారు. ఇవన్నీ building స్వామి ఎప్పుడన్నా కూర్చో- కూర్చొని కట్టించారా? చేయిస్తారు అది భగవంతుని లక్షణం. కాబట్టి మనం కూడా చేయించబడటానికి ఒక instrument కావాలి. ఇవాళ దీంట్లో doctors ఉండుంటారు surgeons వారు ఉండుంటారు. వాళ్ళు surgeon- surgery చేయటానికి theatre లోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు scalpel ఎక్కడుంది, cutter ఎక్కడుంది, సూది ఎక్కడుంది అవన్నీ వెతుక్కుంటారా? కానీ అన్నీ sterilize చేయబడినటువంటివన్నీ కూడా ఒక పళ్ళెంలో ఒక ఆవిడ పట్టుకొని ఉంటుంది పక్కన. ఆయన లక్ష్యమంతా operation మీద ఉంటుంది. ఇలా చెయ్యి పెడతాడు చేతికందిన కత్తితో ఆయన పని పూర్తి చేస్తాడు. మనం కూడా sterilized instruments గా సాయి ఉద్యమంలో ఉండాలి. [కప్స్ కొట్టడం] ఆ దేనిని స్వామి ఎక్కుతారో తెలియదు, ఏ చా-ఏ చాకును బయటకు తీస్తారో తెలియదు, ఏ సూదిగా మనం వాడుకోబడతామో తెలియదు. కానీ అన్ని సూదులు డాక్టర్ గారికి అక్కర్లా. దానికి అర్హత, ప్రాప్తి, యోగ్యత, గురు అనుగ్రహము, తీవ్ర సాధన, సంకల్ప దీక్ష ఇవన్నీ గనక ఉన్నట్లయితే స్వామి చేతిలో మనం నిజమైన instru-- ఆ మాటలు పై పైన విన్నప్పుడు నాకు బాధ కలుగుతుంది. He just made me his own instrument అని వాడుతూ ఉంటాం. అలా వాడకూడదు. instrument అంటే ఇవాళ ఆయన మనల్ని తాకొచ్చు, తాకకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజున ఆ పళ్ళెంలో మనం ఉండాలని కోరుకోవాలి. sterilize అయి ఉండాలి. ఎప్పుడు స్వామి చెయ్యి మన మీద పడుతుందా, ఆ నీడ మన మీద పడుతుందా అని అనుకున్నప్పుడు స్వామి చెయ్యి మన మీద పడి తీరుతుంది. ఆ ఉద్యమంలో స్వామి అవతార వైభవంలో, అవతారోద్యమంలో మన పాత్ర మనం నిర్వహించేటువంటి, నిర్వర్తించేటువంటి ఒక విషయం మనకు ఏర్పడుతుంది గనుక సత్యసాయి భగవానుణ్ణి ఓ గంటలో అరగంటలో మాట్లాడుకునేవి కాదు. నేను నిజానికి స్టీల్ ప్లాంట్ లో సప్తాహాలు చేశాం ఏడు రోజులు. అలాగే ఇక్కడ భగవత్ సప్తాహం. దాంట్లో నేను కుర్చీలో కూర్చుంటే మా స్వామి గారు ఒక photo తీశారు నన్ను. ఆ photo ప్రపంచ వ్యాప్తి పొందినటువంటి photo అది ఒక్కటే. మిగతా నాకేం photos లేవు. నన్ను ఎవరో నిన్న కూడా అడిగారు, మీ photos పంపండి నా దగ్గర లేవని చెప్పా. నిజానికి లేవు ఏం చేయను. కాబట్టి ఇవన్నీ కూడా స్వామి ఆ సమయానికి ఏం కావాలో చేస్తారు. ఎవరిని దగ్గర చేసుకోవాలో చేస్తారు. అవకాశాలు ఇస్తారు. Nobody is denied an opportunity. ఒక్కరికే ఇవ్వరు. మనము సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన పిలుపు రాగానే దూకాలి. ఆ దూకటమే ఉద్యమించటమంటే. కాబట్టి ఉద్యమం అనే పదానికి అర్థం మనం మార్చాలి. అవతార మహోద్యమం అనేటువంటిది ఇవాళ స్వామి ఏమి చెప్పారు, వారి జీవిత కాలంలో ఏం చేశారు, ఈ ప్రపంచం ఎంతగా లాభపడింది, ఇవన్నీ చెప్పి మనం ఆనంద పడాలి. ఇక్కడ ఇంకో చిన్న విశేషం. చిన్మయానంద ఉన్నారు కదా, అందరికీ తెలుసు కదా Chinmaya Mission. ఒకాయనతో నేను అన్నాను Chinmaya Mission లో చిన్మయానంద స్వామి మొట్టమొదట స్వామి దగ్గరికి వెళ్లారు అని అంటే, "Impossible sir! ఆయన ఎక్కడ, సత్యసాయిబాబా గారు ఎక్కడ?" అని అన్నారు నాతో. అరే ఇంత అన్నానే మరి ఎట్లా అని అనుకుంటున్నా. నాకు ఎ-ఎందుకు వచ్చారో అవన్నీ ఇప్పుడు నేను చెప్పను. కానీ సత్యసాయి ఆ భగవాన్ తో ఉన్నటువంటి చిన్మయానంద యవ్వనంలో ఉన్నటువంటి photos వచ్చినాయి. వస్తే నిన్ననే నాకు forward చేస్తే, నన్ను మనసారా క్షమించండి. మా గురువు గారికే బాబా గారు గురువుగారని నాకు తెలియకుండా నాకు డెభై ఏళ్ళు వచ్చినాయన్నాడు ఆయన. అంటే ప్రపంచంలో ఎంతమందిని దగ్గరకు తీశారో. వాళ్ళందరినీ దగ్గరకు తీసి చక్కగా polish పెట్టి సన్మార్గంలో పెట్టి ఎంత శ్రమపడి ఉంటారండీ. మనం Civil's కి రాత్రింబవళ్ళు కష్టపడతాం, engineer అవటానికి కష్టపడతాం, ఎవడో ఉపన్యాసం ఇవ్వటానికి వస్తే వాడు మూడు రోజులగా కసరత్తు చేస్తాడు. ఇరవై కాపీలు ముందల చుట్టి పడేస్తుంటాడు. ఏం చెప్పాలో తెలియదు. కానీ ఇవన్నీ సునాయాసంగా ఎలా జరుగుతున్నాయి అంటే స్వామి అనుగ్రహం ఉంటే గ్రహాలు మనల్ని ఏమీ చేయవు ఒకటి. స్వామి అనుగ్రహం ఉంటే ఇట్లా ఎన్ని గంటలైనా మాట్లాడొచ్చు. ఇది mic అయినా శ్రమ ఉందంటారా? ఏం లేదు. ఉంది అది హాయిగా. దానిలాగానే నేను కూడా కూర్చున్నా. నేను కూర్చొని ఆయన చెప్పింది ఊరికే అలా transmit చేస్తున్నా. Again I repeat ఇందులో కర్తృత్వం వారు లేవు. Doership పదిరి పెట్టాలి. అన్ని శాస్త్రాలు మధించి ప్రయోజనం లేదు, దాని నుంచి ముక్తి రాదు. శాస్త్రాలన్నీ మహా జనారణ్యాలు. దానిలోకి వెళితే కీకారణ్యం నుంచి వెనక్కి రాలేం. కానీ దాని అర్థం తెలుసుకొని చిన్న జీవితాన్ని గనక అటు యోగం ద్వారా, జ్ఞానం ద్వారా, భక్తి ద్వారా, కర్మ యోగం ద్వారా చేయగలిగినట్లయితే అది అపురూపమైనటువంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన. వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ నాకు ఎవరు time చెప్పలేదు మీ ఇష్టం అన్నారు. కాబట్టి నా ఇష్టానికి కూడా మనమందరం కాల కార్య కారణ బద్ధులమై ఉంటాం. కాల బద్ధులమై ఉండాలి గనుక అసలు మా ఆ-
YouTube · audio
శ్రీ వి.ఎస్.ఆర్. ,ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పార్ట్-2 Visakhapatnam
శ్రీ వి.ఎస్.ఆర్. ,ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పార్ట్-2 Visakhapatnam
Source: SAI BROTHERS on YouTube
0:00 / 43:42
More in this series