No transcript for this section.
Transcript begins at 0:00.
సౌందర్య సార సర్వస్వం నంద స్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక విషత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్ఫురతాం ని పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ స్వామి తొంబై ఆరవ జయంతి అని వేళ పెడుతున్నాం. నిజానికి తొంబై ఆరవ ఆగమన దినోత్సవంగా భావన చేసినట్లయితే స్వామి తమ శరీరానికి సత్యం అని పేరు పెట్టారని, తాము నడిచిన దారంతా ధర్మ మార్గం అని దాన్నన్ని-- అందరికీ నేర్పారని, సత్య ధర్మాలు అయిన తర్వాత ఎల్ల సృష్టిని శాంతి కాంతులు వెలార్చి, ఎల్ల సృష్టి అంటే వంద సంవత్సరాల క్రితం అంటే స్వామి ఈ భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యపు పాలనలో ఉండగా దాస్యంలో మగ్గిపోతున్నటువంటి వేళ, అలాగే అనంతపురం జిల్లా కరవు ప్రాంతమై కరవు పీడితమై అధ్యాత్మ అంగడి సరుకు అయిపోతున్నటువంటి వేళ, మత ప్రభావం తీవ్రంగా ఉన్నటువంటి వేళ, మానవుడి ఆకలి అనేటువంటి ఒక బలహీనతని అలుసుగా తీసుకుని మతాంతరీకరణం జరుగుతున్నటువంటి ఒక దుర్భర దుస్సహ విషాద సన్నివేశంలో సత్యసాయి భగవానుని యొక్క అవతరణ జరిగింది. ఇది. మోక్షం సంగతి స్వామి ఏనాడూ మాట్లాడలే, నేను వచ్చింది అసలు transform చేయటానికి వచ్చానన్నారు. మార్పు రావాలి, ఎక్కడ మార్పు రావాలి? వ్యక్తిలో మార్పు రావాలి. వ్యక్తిలో నుంచి వ్యవస్థలో మార్పు వస్తుంది, వ్యవస్థలో నుంచి సృష్టిలో మార్పు వస్తుంది. దీనికన్నింటికీ కావాల్సింది దైవ బలమే అని ధృడంగా విశ్వసించి తమ దివ్యత్వాన్ని తాము ప్రకటించి ప్రజ్ఞానుల వేట నేను సాయిబాబాను అని ప్రకటించి అదే సంవత్సరం అక్టోబర్ ఇరవై వ తారీఖున అవతార ప్రకటన చేసి మౌలికంగా తాను ఎందుకు వచ్చారో చెప్తూ ఆ మూడింటిని మనకి ప్రకటన చేశారు. మూడు ఎందుకు చేశారు? దీని వెనుక ఏమున్నది? మనందరికీ తెలుసు వేదోద్ధరణ, ధర్మోద్ధరణ, దీనజనోద్ధరణ. ఇవి మౌలికంగా. వేదోద్ధరణ అంటే విద్యను ఉద్ధరించాలి. వేదాలలో చెప్పబడినటువంటి అనేక అంశాలు మనకు గనక స్పష్టంగా అర్థమైతే సనాతనమైనటువంటి ఒక ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మబద్ధమైనటువంటి జీవితం ద్వారా గనక ఈ విద్యను మనం గనక అధ్యయనం చేసినట్లయితే మానవుడిలో వ్యక్తిత్వ వికాసం పరిపూర్ణంగా సహస్ర దళాలతో వికాసమానం చెందుతుంది గనుక మౌలికంగా ఎక్కడ మార్పు చెందాలంటే విద్యా వ్యవస్థలో మార్పు చెందాలి. ఇందాకే అనుకున్నాం బ్రిటిష్ కాలంలో మెకాలే అనేటువంటి ఒక ఆంగ్లేయుడు భారతీయమైన విద్యా విధానాన్ని గనక దెబ్బతీయగలిగినట్లయితే బానిసలుగా భారత జాతి ఉంటుందని పాపం విశ్వసించి ఇవా-- ఇంగ్లీషును ప్రవేశపెట్టి ఆయన చేసిన అనేకమైన పొరపాట్ల వల్ల మనం చాలా వెనక్కి ఎళ్లిపోయినాం. మూలాలు మర్చిపోయినాం, శతక వాఙ్మయం మర్చిపోయినాం, moral philosophy ని మర్చిపోయినాం. ఆ ఆదర్శవంతమైన జీవితం అంటే అదేదో ప్రత్యేకంగా ఎవరో ఒకరిద్దరికి చెందిందనుకున్నాం. మానవ జన్మ ఎత్తిన ప్రతి వాడు ఆదర్శవంతంగా జీవించవలసిందే. దీనికి ఏ రకమైన exception లేదు. ఎందుకని అంటే ఆదర్శమే మానవుణ్ణి నడిపిస్తుంది. మానవుడు ఆదర్శాన్ని ఆచరించలేడు. ఆదర్శాన్ని లోపల అనుకున్నట్లయితే అది ఆచరణ అవుతుంది. ఈ ఆదర్శము ఆచరణ రెండూ కలిపితే ఒక ధృడమైనటువంటి ఒక భావన కలుగుతుంది. ఎప్పుడైతే విషయాలన్నీ మనకు స్పష్టంగా అర్థమవుతాయో లోపల ambiguity ఉండదు. Clash of thoughts ఉండదు. ఆలోచనల మధ్య పరస్పర విరుద్ధమైనటువంటి భావజాలాలు ఉండవు. ఒక ఏకోన్ముఖంగా దేన్ని నమ్మామో అది సత్యవ్రత దీక్షగా ధర్మ కంకణ బద్ధమైనటువంటి ఒక మనో ధర్మాన్ని మనం పాటిస్తూ వీటన్నింటినీ గనక మనం అర్థం చేసుకుంటూ ధర్మ మార్గంలోనే వెళ్ళినట్లయితే ఏమి మిగులుతుంది అంటే ఆ మిగిలిన దాని పేరే శాంతి. ఆ శాంతి ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఇవ్వలేడు. నిజానికి భగవంతుడు కూడా ఇవ్వలేడు స్వామి చెప్పిన మాట. భగవంతుడు శాంతిని ఎట్లా ఇస్తాడు? నీ మనసంతా అశాంతితో, దురాలోచనలతో, దుష్ప్రవర్తనతో, దుర్భావనలతో నిండి ఉన్నప్పుడు శాంతికి చోటు ఎక్కడ? కనుక నువ్వు నిన్ను నీవు పునర్నిర్మాణం చేసుకో. You redefine yourself. ఎందుకని? ఇవన్నీ కూడా ఇన్ని అవసరమా? ఇంత అవసరమా? ఈ ప్రపంచంలో ఉన్న స-సంపదంతా నా దగ్గర ఉంటే ఎట్లా? ఈ ప్రపంచంలో ఉన్న విజ్ఞానమంతా నేను ఒక్కడినే సొంతం చేసుకొని తద్వారా నేను degrees పొంది తద్వారా నేను కీర్తిని సంపాదిస్తే మళ్ళీ నేను ఈ ప్రపంచానికి గనక అది ఇవ్వకపోయినట్లయితే నా జీవితం వృధా కాదా? నేను అధర్మ వర్తనం చేసినట్లు కాదా? నేను సత్యం నుంచి దూరమైనట్లు కాదా? అనేటువంటి భావన మనందరిలో కల్పించి మీరు చేయవలసింది ఒక్కటే. మీ దగ్గర ఫుడ్డు, బ్లడ్డు, దుడ్డు ఈ, ఈ మూడు మాటలు స్వామివే. ఆహారం ఉంది, రెండు పూటలా తినవలసిన పని లేదు. నిజానికి అవసరం లేదు. అవసరం ఉన్నవాడికి, తినటానికి అవకాశమే లేని వాడికి...నువ్వు పది ముద్దలు తింటే రెండు ముద్దలు వాడి కోసం పక్కన పెట్టు. ఒక్క గింజ, ఒక్క మెతుకు కూడా వృధా చేయటానికి వీల్లేదు అది food. అన్నం బహు కురువీట ఎంతో అన్నాన్ని సృష్టించాలి. సృష్టించిన అన్నాన్ని పంచిపెట్టాలి. పంచిపెట్టబడిన దానిలో నుంచి మనోనిర్మాణం జరుగుతుంది. ఎందుకని? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలన్నీ కూడా ఈ అన్నంలో నుంచే ఏర్పడతాయి గనుక మనం తినేటువంటి తిండి అదంతా కూడా పరమేశ్వరార్పితం చేసి మనం చేయాలి. అందుకనే స్వామి "అహం వైశ్వానరో భుక్త్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్" అని బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః మనకు తెలుసు. ఇవన్నీ చేస్తూ ఎందుకై చేయమన్నారంటే పదార్థ దోషం అన్నం నుంచి తొలగిస్తే ప్రాణము నిశ్చలంగా ఉంటుంది. ఆ ప్రాణం నిశ్చలమైనప్పుడు సుమనస్సు ఏర్పడుతుంది, మంచి మనస్సు. మంచి మనస్సులో నుంచి మంచి జ్ఞానం ఏర్పడుతుంది. మంచి జ్ఞానం ద్వారా మనిషి ఆనందమయుడు అవుతాడు. చూడండి అన్నం మెతుకులో అంత బలం ఉంది. కాబట్టి స్వామి మనకు నేర్పినటువంటి ఆ విధానం ఏమిటంటే శాంతి ఒకడు తెచ్చి ఇచ్చేది కాదు. మీరు పరిగెత్తకండి. అశాంతి మీ లోపల ఉన్నది, దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయండి మిగిలేది శాంతి. చీకట్లో ఉన్నాం, చీకటీ నువ్వెళ్ళిపో అంటే వెళ్ళిపోదు. ఒక చిన్న అగ్గిపుల్ల గీచి అట్లా పట్టుకుంటే అంతటా ఆవరించిన చీకటి ఎటు వెళ్ళిపోయిందో. అది నిజానికి అక్కడ లేదు, అది వెళ్ళలేదు. ఏమైంది అంటే అది ఒక అవస్థ. చీకటి ఒక అవస్థ, వెలుగు ఒక అవస్థ. అలాగే అశాంతి ఒక అవస్థ, శాంతి ఒక అవస్థ. ఈ అశాంతి ఎందుకు అని ఏర్పడుతుంది అంటే మితిమీరిన ఆశలు. మనవి ఈ చిన్న బాతు రెక్కలు, రెండు చిన్న రెక్కలు పెట్టాడు. బాతు ఎంతవరకు ఎగరగలదు? గరుడ పక్షి గగనగగనాంతరాల వరకు ఎళ్ళగలదు. దానితో పోల్చుకొని గనక మనం ఉన్నట్లయితే ఈ బాతు రెక్కలు అంటే ఆశలన్నీ కూడా ఆశయాలేమో లేవు, ఆదరిసారులు లేవు. ఆస్తేమో మూరెడు, ఆశలేమో బారెడు. కనుక ఇవి, ఇవి ఏమి ట్యాలీ ఇవాళ భాషలో, ట్యాలీ కావట్లేదు. ఇవి ఎక్కడ ఒక fine achievement జరగటం లేదు. దానికో alignment లేదు. అది అదే, ఇది ఇదే రెండు కలిపే ప్రయత్నం చేస్తున్నాం. అశాంతి కాక ఏమవుతుంది? నేను రెండు వందల ఏళ్ళు ఇక్కడ ఉండాలి అనుకోవటం, అనుకోవటంతోనే అశాంతి ప్రారంభమవుతుంది. ప్రపంచంలో ఉన్న సంపద మొత్తం నా ఇంట్లో ఉండాలి అనుకోవటంతోనే అశాంతి. మన అర్హతను మించినటువంటి ఆశలు పెంచుకున్నట్లయితే దాని నుంచి అశాంతి. ఏదో కోరుకుంటాం ఇలా జరగాలి, ఇప్పుడే జరగాలి, ఇట్లా జరగాలని అన్నీ మనం నిర్ణయించుకుంటాం. జీవితం ఎప్పుడూ అట్లా ఉండదు. అనుకోనిది జరగటమే జీవితం. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం కాదు. That is only an accident or incident. అది ప్రతిరోజూ జరిగేది కాదు. జీవితం ఒకసారి ఏర్పడ్డ తర్వాత ముగిసేదాకా కథ నడుస్తూ ఉంటుంది. దానిలో అనుకోనివి జరగటమే ఎక్కువ ఉంటాయి. అనుకున్నవి జరిగేవి five percent కూడా ఉండవు. కనుక ఈ five percent ఆనందాన్నిస్తుంది, తొంభై ఐదు percent మనకు అశాంతిని ఇస్తుంది. కానీ మనమేం చేస్తాం అంటే శాంతి కావాలి అని I want peace అని వెళ్తాం. ఓ గురువు దగ్గరికో, ఓ మహాత్ముడి దగ్గరికో, ఓ మంచివాడి దగ్గరికో కాస్త శాంతిని ఇవ్వండి, చాలా అశాంతిగా ఉంది జీవితం. అల్లా కలుగజేయడం ఎలా ఉందంటే ఆయన మాత్రమే ఎక్కడినుంచో తెచ్చిస్తాడు. దానికి స్వామి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి నిర్వచనం ఏమిటంటే లేదా ఒక ప్రయోగం ఏమిటంటే ముందు I కొట్టేయండి. Want, desire కొట్టేసేయండి. ఆ రెండూ పోతే మిగిలే, మిగిలే దాని పేరే peace. Peace ప్రత్యేకం లేదు. అశాంతి పోతే మిగిలేది శాంతి. కాబట్టి ఈ శాంతి అశాంతులు అనేటువంటి రెండు స్థితులు ఎక్కడ ఉన్నాయి అంటే మన యందే ఉన్నాయి. కాబట్టి మనం శాంతిగా బతకాలి అంటే కోరికలు తగ్గించుకోవాలి. ఏ వయస్సుకు తగిన ఆ కోరిక అంతవరకు ఉంచుకోవటంలోది ప్రకృతి ధర్మం. కానీ వయస్సు దాటినా, వయస్సు మీరినా ఇంకా వయస్సు రాకపోయినా ప్రాకృతమైనటువంటి ధర్మంలో గనక, ఆలోచనలో గనక మనం వెళ్ళిపోయినట్లయితే అగ్నిలో పడినటువంటి మిడత వలే మాడిపోతాం. అక్కడ ఏమీ మిగలకుండా అయిపోతాం. ఆ అగ్నిలో చిక్కిన శలభం అంటాడండి అంటే శలభం అంటే మిడత. అది పాపం వెలుగు అనుకొని వెళ్తుంది, అది మంట అని తెలీదు దానికి. ఏదో వెతుక్కుంటూ వెళ్తుంది, దాంట్లో పడిపోతుంది. మనం కూడా అంతే. ఏ పని చేసినా అంతయున్ ఈశ్వర ప్రీతికే. ఇదొక మంచి పదం. ఈశ్వరుడికి సంతోషం కలుగుగాక. ఎవరా ఈశ్వరుడు? ఎక్కడో స్వర్గంలోనో, కైలాసంలోనో, వైకుంఠంలోనో ఉన్నవాడు కాదు. అంతరంగంలో ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆనందం కలుగుగాక. ఆయన కోసమే నేను ఈ కర్మకాండం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇది మా స్వామికి సంతోషం కలిగించు గాక. స్వామి ఒకరోజు అన్నారు, "లోకం ఇవాళ మెచ్చుతుంది, మర్నాడు అదే గిచ్చుతుంది. లోకేశ్వరుడు మెచ్చుకుంటే అది శాశ్వతంబంగారు" అన్నారు. సత్యం. ఇవాళ నేను అన్నా, మీరు విన్నా, మనందరం కలిసి స్వామి birthday celebrations ఆనందంతో చేస్తూ ఉన్నా, ఇదంతా ఎవరికోసం అంటే స్వామికి ఆనందం కలిగించాలి. ఆ స్వామి అంటే మన యందున్నటువంటి పరమాత్మ. కాబట్టి ఇటువంటి ఈ దివ్య భావనలో గనక మనం చక్కగా అర్థం చేసుకోగలిగినట్లయితే శాంతి it is never outside, it is always inside. బయట ఉన్నది మళ్ళీ స్వామి మాటే, ఒక interview లో చెప్పిన మాట. బయటన్నీ pieces ఉంటాయి. P A E C E S ముక్కలు ముక్కలు ఉంటాయి. అవన్నీ నువ్వు పోగు చేయటంలోనే నీ జీవితకాలం పోతుంది. కానీ ఒక్కటిగా ఉన్నటువంటి, ఏకంగా ఉన్నటువంటి ఆత్మ నీ యందు అది శాంతిగా ఉన్నది. ఎందుకంటే దేహానికి ఆహారం కావాలి, మనస్సుకి సంతోషం కావాలి, ఆత్మకు ఆ రెండూ అక్కర్లేదు. ఎందుకంటే అది కదిలించేదే తప్ప కదిలేది కాదు. కదిలేదానికి అనేకం కావాలి.ఈ ప్రపంచమంతా కావాలి ఆత్మ ప్రపంచమే ఆత్మ అయి ఉన్నది గనుక ఆత్మ అనుగ్రహం ఆత్మ అయి ఉన్నది గనుక సర్వ దేవతలు ఆత్మ అయి ఉన్నది గనుక అనేకమైనటువంటి రూపాలు ఉన్నటువంటి ఈ శాంతిని మనం అతి తక్కువ ఆలోచనలతో అతి తక్కువ కోరికలతో అంటే minimum కోరికలు ఉంటాయి కదా ఆహార, ఆ విహార, మైథునాలని చెప్పారు. అటువంటివి ఆ ప్రకృతి సంబంధమైనటువంటి అవసరాలకు మాత్రమే పరిమితం చేసుకొని భగవంతుడు మనకు ఎటువంటి జీవితాన్ని ఇస్తాడో, ఆ జీవితాన్ని ఎలా మనం చక్కగా నడిపించుకోవాలో అలా నడిపించుకోగలిగినట్లయితే దాన్ని మించినటువంటి వైఖరి లేనేలేదు. కనుక మనం ఎవరి దగ్గరికి శాంతి కోసం వెళ్ళక్కర్లేదు. వెళ్ళినా హెచ్చరిక ఏమిటంటే వారు కూడా ఇవ్వలేరు. వాళ్ళు ఇంక మార్గం చూపిస్తారు. అలా వెళ్లి శాంతి దొరుకుతుంది, ఇలా వెళ్లి శాంతి దొరుకుతుంది, ఈ పని చేయి శాంతి దొరుకుతుంది. దొరుకుతుందో దొరకదో. ఆ చెప్తున్న ఆయనకి అసలు శాంతి ఉన్నదా అని ప్రశ్నిస్తే అది కూడా ఒక ఆ జవాబు లేని ప్రశ్న గనుక శాంతి peace is always within. ఆ within లో ఏమున్నది అంటే ఆత్మే ఉన్నది. మనం-- అందుకే స్వామి ఆ దివ్యాత్మ స్వరూపులారా అని పిలిచినటువంటి కారణం అదే కాబట్టి మనము దివ్యాత్మ స్వరూపులుగా భావించినప్పుడు ఆ మనకేం అక్కర్లేదు. స్వామి ఏదైనా నాకిది కావాలి అని కోరుకున్నారా? చాలా ఆయన దగ్గర చేరినయి. ఈ చేరినవన్నీ నావే అనుకున్నారా? అనుకోలా. ఎలా అనుకోగల్-- అనుకోకుండా ఉండగలిగారు? మనకు నాలుగు వస్తువులు కూడితే అప్పటిదాకా బజారులో ఉన్నటువంటి ఒక TV అనుకుందాం. వాడి దగ్గర ఏదో showroom లో shop లో ఉంది మనం వెళ్ళాం, డబ్బు ఇచ్చాం. డబ్బు ఇచ్చి వాడు బిల్ చేయగానే ఇది నాది అంటున్నాం అప్పటి వరకు ఇది నీది కాదుగా. నీది ఎప్పుడైంది అంటే బంధం ఏర్పడగానే నాది అయింది. కాబట్టి ఈ నాది, నేను అన్న రెండు భావాలు గనుక పరిమిత స్థాయిలో గనుక మనం operate చేయగలిగినట్లయితే అవి లేకుండా జీవితాన్ని జడమయం చేసుకోమని ఏ వేదాంతం చెప్పలా. జీవితం చైతన్యవంతంగా ఉండాలి, అన్నీ కావాలి కానీ పరిమితికి లోబడి ఉండాలి. తక్కువ ఉండాలి, ఆనందంగా ఉండాలి. అలాగే మనం మాట్లాడే మాట, మనం చేసే పని, మనం ఆలోచించే రీతి తర్వాత మనం చెప్పేటువంటి విధానం, ఇదంతా కూడా ప్రపంచానికి ఆనందం కలిగించాలి. నీవే ఆనంద స్వరూపుడివి కానప్పుడు నువ్వు ఆనందాన్ని ఇవ్వలేవు. నీవే శాంతి స్వభావం ఉన్నటువంటి వ్యక్తివి కాకపోయినట్లయితే శాంతిని ఈ ప్రపంచానికి ఏ రకంగాను ఇవ్వలేవు గనుక, ఏనకేన ప్రకారేణ ఏష కశ్యాపి దేజినః సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వర పూజనం. ఈశ్వరుడు మన ఎందున్నాడన్నటువంటి భావనలో ఉంటే మనం ఈశ్వరుడి వలె ప్రవర్తించాలి. ఈశ్వరుడే మనల్ని నడిపిస్తున్నాడు అన్నప్పుడు జరుగుతున్నవన్నీ ఈశ్వర లీలలుగా, ఈశ్వర సంకల్పాలుగా, ఈశ్వర కార్యకలాపాలుగా అది కష్టం కానివ్వండి, నష్టం కానివ్వండి, ఆనందం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, సంతోషం కానివ్వండి ఇవన్నీ కూడా ఈశ్వర స్పర్శలో, ఈశ్వర లీలలో, ఈశ్వర క్రీడి కలాపంలో ఒక-ఒకచోట లాస్యమై మరొకచోట తాండవమై, ప్రణవమై, ప్రళయమై మనల్ని ముంచెత్తుతూ ఉంటుంది గనుక లోపల ఉన్నటువంటి శాంతిని పరిమితమైన కోరికల ద్వారా నియంత్రించుకున్నటువంటి ఇంద్రియ నిగ్రహం ద్వారా సమాజం పట్ల ఒక బాధ్యతను నిర్వర్తించేటువంటి రీతిలో మనకున్నటువంటి విజ్ఞానాన్ని, మనకున్నటువంటి జ్ఞాన సంపదని ఈ ప్రపంచానికి నిరపేక్షంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే స్వామి చెప్పారు దాచుకున్నావా మొత్తం పాచిపోతుంది. ప్రయోజనం ఏమిటి? నీకు చెందదు, వాడికి చెందదు. కాబట్టి నీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని శంకర భగవత్పాదులు చెప్పినట్లు, ప్రౌఢం ప్రౌఢని జామో భూతి కలిత దైతేంద్ర జామో లో గురుహు సచ్చిష బోధయా తత్ సత్యం అశ్రితా వన్. నీకు ఉన్నటువంటి దాన్ని ఒక శిష్యుడను, నీ దగ్గరికి వచ్చినటువంటి ఆధ్యాత్మిక సాధకుడను వీటన్నింటినీ కూడా వాళ్లకు అపజెప్పగలిగినట్లయితే నిన్ను నీవు ఎప్పుడూ empty చేసుకుంటూ ఉండాలి. దానివలన శాంతి మాత్రమే పెరుగుతుంది, అశాంతి పేరుకుని పోదు. అశాంతి వలన మానవుడు దుర్బలుడు అవుతాడు. అశాంతి వలన ఇంద్రియాలన్నీ బలహీనమైపోతాయి. అశాంతి వలన ఆలోచనా రీతులు దెబ్బతింటాయి. అశాంతి వలన ఏం చేస్తున్నామో తెలియని ఒక స్థితిలో మనం పడిపోతాం. శాంతి ఏర్పడినప్పుడు ప్రసన్నమై, ప్రశాంతమై, హాయియై అందరికీ ఆనందం కలిగించేటువంటి రీతిలో సంతోషం జనయేత్ ప్రాజ్ఞః. అక్కడ ప్రజ్ఞ స్వరూపం ఏంటంటే శాంతి. స్వామిని చూడండి. స్వామిని మనం చూశాము అనగానే శాంతి వస్తుంది. ఎలా వస్తుంది? మనం ఆయన దగ్గరికి వెళ్లి శాంతిని కాస్త ఇవ్వండంటే ఇచ్చారా? ఇవ్వలే. ఆ disposition, ఆ స్వామి యొక్క రూపం, స్వామి యొక్క సౌందర్యం, స్వామి యొక్క ఆ స్థితి, వారి ఉనికి, స్వామి యొక్క వ్యక్తిత్వం, స్వామి యొక్క దివ్యత్వం, స్వామి యొక్క మమత్వం, స్వామి యొక్క నమ్యత్వం ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే ఒక శాంతిని స్వామిని చూడగానే ఎంత ఆనందం కలిగిందండి అంటాం. నేను నీకు ఆనందం ఇస్తున్నానని ఆయన ఏం చెప్పలా. నీ ఒళ్ళో శాంతిని పెడుతున్నానని ఆయన చెప్పలా. ఆ చూడటంలో, దర్శనం చేయటంలో, మన దుఃఖంలో, మన జీవన శైలిలో ఆంతరంగికమైనటువంటి ఒక భావనా స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని మనం గనుక చక్కగా అర్థం చేసుకోగలిగినట్లయితే శాంతి మన యందే ఉన్నది. మన ప్రవర్తన ద్వారా మిగతా వారికి అశాంతి కలిగించకూడదు. ఇతరుల అశాంతిని మనం own చేసుకోకూడదు. దాన్ని వాళ్లకు కూడా శాంతిని ఇవ్వగలిగే స్థితిలో మన జీవితాన్ని సత్యము, ధర్మము అనే ఇంతకుముందు చెప్పిన దివ్య పదాలని ఆధారం చేసుకొని జీవితాన్ని గనుక మనం గడుపుతూ వెళ్లినట్లయితే అది శాంతి వైపు మాత్రమే దాన్ని తీస్తుంది. ఆ శాంతి చలనై తల్లి దివ్యనైఈ ప్రపంచం అంతా మనకి అనుగ్రహించే ఆశీర్వచనమై అన్నింటికంటే పరమేశ్వరుడి యొక్క అభయమై చూడండి ఎన్ని ఉన్నాయో ఆ శాంతిలో. ఇవన్నీ గనక మనం పొందగలిగితే తల్లి దీవెన పొందిన తోబుట్టువుల ప్రేమను పొందిన ప్రపంచం యొక్క ఆశీస్సును పొందిన ఏదో వారు ఇంకా నాలుగు కాలాలు ఉంటే బాగుండు ఎంత మంచివారు అనిపించుకోగలిగిన, ఇవన్నీ కూడా శాంతి వైపు దారి తీస్తాయి. ఇవి ఏవీ కానప్పుడు మనలోనే అశాంతి ఒక అసంతృప్తి ఏమిటి జీవితం ఇట్లా ఉంది ఎంత కష్టపడ్డాను ఏమీ మిగలలేదే, ఇవన్నీ మనం దరికి చేరనివ్వకూడదు. తెలుసుకోవలసినది అర్థం చేసుకోవలసినది అర్థం చేసుకుని జీవించవలసింది ఒక్కటే మాట చివరకు ఏమీ మిగలదు. ఏమి మిగులుతుంది అంటే నీవు చేసిన మంచి పని, నీవు చెప్పిన మంచి మాట, నీవు ఈ ప్రపంచానికి అందించినటువంటి ప్రేమ, ప్రపంచానికి నువ్విచ్చినటువంటి జ్ఞానమో విజ్ఞానమో ప్రజ్ఞానమో సిజ్ఞానమో అది ఏ పేరన్నా పెట్టండి, నీ వలన లబ్ధి పొందినటువంటి ఈ సమాజం నిన్ను ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది. నీవు శాంతిమయుడివై శాంతిప్రియుడివై శాంతిమయుడివై నీవు గనక జీవించినట్లయితే, నీ జీవితమే మరొకరికి ఆదర్శవంతమై దానిలో నుంచి అనేకమైనవి మనం తీసుకున్నట్లయితే స్వామి ఉన్నారు శాంతి. సరే ఎంత ప్రశాంతి ఎంత ప్రసన్నం ఆయన ప్రశాంతి నిలయం అని పేరు పెట్టారు. ఆ పేరు పధ్నాలుగు ఏళ్ళప్పుడు పెట్టాడు దానికి. మనకు అలవాటైపోయాయి ప్రశాంతి నిలయం వెళ్ళొచ్చాం అదేదో బిల్డింగ్ పేరు కాదు అది. ప్రశాంతికి నిలయం. ఓ పద్యంలో చెప్పారు స్వామి. ఏమనంటే మీకున్న కష్టాలు నిష్టూరాలు మీకున్న ఇబ్బందులన్నీ ఒక మూట కట్టండి. ఆ మూట కట్టి పుట్టపర్తిలో నా దగ్గర వదిలిపెట్టండి. ఇక్కడ నుంచి ఒక పెద్ద మూట తీసుకుని వెళ్ళండి. ప్రేమ అనే మూట తీసుకుని వెళ్ళిపోండి. ఆ శక్తితో మీరు మీ జీవితాన్ని గడపండి. ఇందులో కాసు ఖర్చు లేదు. నేను మీకేం ప్రబోధం చేయను కూర్చోబెట్టి ఉపన్యాసం నేను ఇవ్వను. కానీ మీరు చేయవలసింది ఒకటి. ఆ మూటనిచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోండి. చూసారా! అంటే ప్రపంచం మనకు అశాంతిని ఇస్తుంది. పరమాత్మ సన్నిధి ఆయన ఇవ్వరు శాంతి. ఆయన నుంచి శాంతి మనకు ప్రవాహ వేగంతో automatic గా మన యందు ప్రవేశిస్తుంది కాబట్టి ఈ శాంతిని మనం జాగ్రత్తగా మన మనస్సుని గనక నిగ్రహించుకున్నట్లయితే మనస్సుని పరమేశ్వరునితో అనుసంధానం చేయగలిగినట్లయితే ఈ ప్రకృతి అంతా కూడా ఈశ్వర స్వరూపమే అని భావించగలిగినట్లయితే పశుపక్ష్యాదుల యందు ప్రకృతి యందు మన భావన గనక దివ్యత్వాన్ని సంతరించుకున్నట్లయితే మిగిలేదంతా శాంతి. కావలసినది స్వామి అంటారు ఇచ్చినవేవో ఇవ్వనే ఇచ్చావు. నీ సద్భక్తుడిగా ఉండేటట్టుగా నాకు అనుగ్రహం ఒకటి ఇవ్వు స్వామి. సంపదలకేమిటి వస్తుంటాయి పోతుంటాయి అని ఒక పద్యం చెప్తూ, ఇవాళ మనం స్వామిని శాంతి అడగటం కాదు శాంతి కోసం రెండు పనులు చేయాలి. సత్య మార్గం సత్యాన్వేషణలో జీవితాన్ని గడపాలి. ధర్మాచరణ చేయాలి. ఇది అన్వేషణ ఇది ఆచరణ శాంతి ఒక అనుభవం. అది ఒక దివ్యమైనటువంటి state of exaltation అంటాం. దానిలో ప్రశాంతంగా ఉంటాం. ఎందుకు ఉంటాం ప్రశాంతంగా అంటే కోరికలేం లేవు. మనల్ని బాధ పెట్టేవేం లేవు. మనల్ని అటు ఇటు అతలాకుతలం చేసేవసలు లేనే లేవు. ఏమున్నాయి అంటే భగవంతుడు నాకేమి ఇవ్వాలో అది ఇచ్చాడు. నేను ఉన్నదాంట్లో నేను హాయిగా మహారాజువలె ఉన్నాను. మహారాజు ఎవరంటే కోటీశ్వరుడు ఎవరంటే కోటి రూపాయలు సంపాదించేవాడు కాదు. తన యందు కోటి ఈశ్వరులను సంభావించిన వాడు కోటీశ్వరుడు అవుతున్నాడు. కాబట్టి ఈ మన జీవన దృక్పథం మన ఆలోచనా విధానం సత్విద్య వల్ల ఆత్మవిద్య వల్ల ఇవి ఏర్పడతాయి కాబట్టి ఈ శాంతి ఎక్కడ లభిస్తుంది అంటే అంతరంగము కన్నా జ్వాపకుడు లేడు. అరయ కాలమే మీకు పరమ గురువు. గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే. ఎవడు స్నేహితుండు ఈశ్వరుడే. నాకీ ప్రపంచం అంతా నా నుంచి దూరమైపోయినా లేదు నేనే ప్రపంచం నుంచి దూరంగా ఎక్కడో ఒక hermitage లోకి వెళ్లి ఓ కుటీరంలో నేను ఉన్నా, ప్రపంచం నన్ను వదిలినా నన్ను వదలని వాడు ఒకడున్నాడు. అతడు పరమాత్మ. అతడే నా నిజమైనటువంటి స్నేహితుడు. అనేటువంటి భావన కలిగినప్పుడు ఇక ఏ స్నేహితుల అవసరం మనకి లేదు. పరమేశ్వరుడు అనేక రూపాలలో ఆ స్నేహాన్ని మనకి పంచి పెడుతూ స్నేహం ద్వారా శాంతిని, శాంతిమయమైన జీవితంలో నుంచి ఒక విచ్చత్భుతమైన ధర్మాచరణని శాంతి ధర్మము రెండు కలిపిన Ante backward integration మళ్ళీ వెనక్కి వెళితే మళ్ళీ మనం సత్య స్వరూపులమై ఈ ప్రపంచంలో వెలుగొందుతాం కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి ఆ శాంతి స్వరూపమైనటువంటి శాంతి స్వభావమైనటువంటి శాంతి మాత్రమే ఒక సాకారమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక విగ్రహ స్ఫూర్తి ఎవరివంటే భగవాన్ శ్రీ సత్య సాయి. స్వామిని తలుచుకోగానే సంతోషం ఆనందం శాంతి ప్రసన్నత హాయి ఇవన్నీ ఎట్లా కలుగుతున్నాయి అంటే ఆయనే శాంతి మహాసముద్రం. అందుకనే చూడండి శాంతి వేదిక, ప్రశాంతి నిలయం. ఆ పేర్లు చూడండి. ఇంకేవో పేర్-ఏదో పేర్లు పెట్టొచ్చు. ఎన్ని గా-- గమ్మత్తైన పేర్లు పెట్టొచ్చు. కానీ ఆ పని చేయలేదు స్వామి. ఇక్కడ ప్రశాంతి అక్కడ శాంతి. శాంతిలో నుంచి నువ్వు ప్రశాంతిలోకి రావాలి. ఏమిటి తేడా అంటే శాంతి గ్రాస్ ప్రశాంతి సాటి. బాగా విస్తృతంగా కనిపిస్తుంది. మా stadium కూడా చాలా పెద్దది కదా! చాలా పెద్దది శాంతి. సూక్ష్మ సూక్ష్మీతరమైనది ప్రశాంతి. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం సమన్వయం చేసుకుంటూ కేవలం అక్కడున్న building లు కులువంత హాలు అవి కాదు. ఆ పేర్లు కాదు. కావలసింది సత్య సాయి భగవానుని యొక్క దివ్య సన్నిధికి వెళుతున్నాం అనే మాట మనం వాక్యం నేర్చుకోవాలి. కులువంత హాల్లో ఇలా జరిగింది కులువంత హాల్లో ఏం లేదు. స్వామి సన్నిధిలో ఉన్నదంతాసన్నిధి సన్నిధానం అది సమాధి కాదు. ఆ సన్నిధానంలో నుంచి మనకి శాంతి ఏర్పడుతుంది. ఆ సన్నిధానంలో నుంచి మనకు మంచి ఆలోచనలు పుడతాయి. ఆ సన్నిధానంలో నుంచి మానవత్వం పరిమళిస్తుంది. దానిలో నుంచి మాధవత్వపు అనేకమైన భావాలు మనల్ని ముప్పిరిగ ఉంటాయి. వీటన్నింటిలో నుంచి మనకు తెలియకుండానే ఒక శాంతి ఒక మహా పుష్పమై విరాజిల్లుతూ మన జీవితాలని ధన్యవంతం చేస్తుంది గనుక స్వామి ఈ తొంభై ఆరవ జన్మదిన వేళలో మనం జీవితాన్ని పరిమితమైన ఆలోచనలతో పరిమితమైన కోరికలతో ఇతరులకి స్వామి చెప్పిన ఆ నాలుగు మాటలు అవి కూడా దివ్య పదాలే. ఏమిటవి? Love all serve all help ever hurt never ఇంతకు మించి వేదాంతం లేదు. అసలు భారతీయమైనటువంటి వేదాంత చర్చలో ఈ నాలుగు గనక స్పష్టంగా అర్థం అయితే గ్రంథాలన్నీ మనం చదవక్కర్లేదు, అవసరం లేదు. ఉన్నది finalగా వాటి కోసమేగా మనం ఇంత యాతన పడేది. కాబట్టి వీటన్నింటిని మనం ఆచరణాత్మకం చేయాలి. ఊరికే help ever hurt never love all serve all imposition రాసినట్టు రాయకూడదు. వాటిని జీవితాదర్శంగా మార్చుకోవాలి. మన ఆశయాలన్నిటినీ కూడా ప్రతినిధించకోవాలి. దానికో role modelగా మనం స్వామిని పెట్టుకోవాలి. వారు ఒక్కరే ప్రారంభించి కోట్లను కోట్ల మంది ప్రజలను ఎలా ప్రభావితం చేశారు? ఇంతమందిని దగ్గరకు తీసుకు రాగలిగారు. ఎక్కడో ఏ దేశం వాడికో అశాంతి కలిగితే వాడు ప్రశాంతి నిలయానికి రావటం ఏంటి? విషాదంతో లోపలికి వెళ్ళిన వాడు పరమానందంతో బయటికి రావటం ఏంటి? ఈ మధ్యలో వాడి దుఃఖం అంతా ఎటు మటుమాయం అయిపోయింది? ఇవన్నీ ఆలోచించినప్పుడు స్వామి ఎవరు అంటే శాంతి యొక్క స్వరూపమే స్వామి. ఇటువంటి ఒక ఉదాత్తమైనటువంటి వైఖరిలో స్వామి పుస్తకాలు పారాయణం చేసినా, ఏదో ఆ పుస్తకం ఈ పుస్తకం పారాయణాల వలన ప్రయోజనం లేదు. ఏమిటి ఏం చేయాలి ఈ వేళ? కనీసం ఇప్పటికైనా మనం అంటే ఎందుకంటే ఇంకో నాలుగేళ్ళలో శతజయంతి వస్తుంది. వందేళ్ళు. పారాయణము మానసికమైంది వాచకమైంది. ఆచరించాలి పారాయణం కంటే ఆచరణ ప్రధానం. ఆచరణలో నుంచి శాంతి మనం పొందాలి గనుక అటువంటి శక్తిని ధీ శక్తిని యుక్తిని అనుగ్రహాన్ని యోగాన్ని ప్రాప్తిని సర్వేశ్వరుడైనటువంటి స్వామి మనందరికీ మహా అమృత వృష్టి వలే మనందరిపై వర్షించు గాక అని స్వామిని మనసా వచసా శిరసా ప్రార్థిస్తూ సాయిరాం. సత్య ధర్మ ప్రేమ నిత్యమై ఉండిన కూడ మీ తల్లి ఎంతో కులకరించు విశ్వ శాంతినిచ్చు వివిధ సౌఖ్యము హెచ్చు వినుడు భారతీయ వీర సుతుడా వినుడు.
YouTube · audio
దివ్యపద వైభవమ్ - సత్య , ధర్మ , శాంతి, ప్రేమ ! (శాంతి)
దివ్యపద వైభవమ్ - సత్య , ధర్మ , శాంతి, ప్రేమ ! (శాంతి)
Source: SATHYA PEETHAM on YouTube
0:00 / 27:33
More in this series