No transcript for this section.
Transcript begins at 13:20.
సాయిరాం to all of you. మీ అందరికీ "అహం సత్యబోధకః" నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్షలు, శుభ అభివందనాలు, అభినందనాలు. సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అనుగ్రహ విశేషంతో అనాహతంగా సాగిపోతున్నటువంటి సత్సంగ ప్రవాహం, ఈ కార్యక్రమ ప్రవాహం ఇంకా కొన్నేళ్ళు ఇలాగే సాగాలని, సాగుతుందని, దాని వెనుక స్వామి యొక్క కరుణ అపారంగా, విశేషంగా ఉన్నదని నేను భావన చేస్తూ, ఈ కార్యక్రమంలో ఇంతకుముందు పాల్గొన్నటువంటి అనేకమందికి నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది platform కాదు, ఇది సాయి form. ఇక్కడ ఏది జరిగినా సత్య సంకల్పంతోనే జరుగుతుంది. స్వామి అనుగ్రహిస్తే తప్ప, స్వామి ఆశ్వాసిస్తే తప్ప, స్వామి ఆదేశిస్తే తప్ప, ఆకైన కదలని ఈ మహా సృష్టిలో, అనంత మహాకాల చక్రంలో మనందరం కూడా కలియుగాన సాక్షాత్ సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి స్వామి ఈ జగత్తులోకి వచ్చి సనాతన ధర్మానికి గొడుగు బట్టి, పెద్ద పీట వేసి నిత్య నైమిత్తిక జీవితాన్ని ఒక అధ్యాత్మ జీవితంగా ఎలా మార్చుకోవాలో మనకి ఉపదేశ, సందేశ, ఆదేశాలతో కొన్ని దశాబ్దాలుగా మనతో, మనలో ఉండి మనను నడిపిస్తున్నందుకు ప్రప్రథమంగా ముందుగా స్వామికి శత శతానిక నమస్కృతులు. సౌందర్య సార సర్వస్వం, మందస్మిత మనోహరం, వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం. తుర్యాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం, మజ్జన్మాంతర పుణ్యపాక విషప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం. ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్ఫురతాన్మే. పరమ మహేశ్వర స్వరూపుడు, సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, ఈనాటి ఈ కార్యక్రమంలో స్వామి అనేకమైనటువంటి పారుశ్వాలను తడుముకుంటూ, అనేకమైనటువంటి తత్వానుసంధాన స్ఫూర్తిని తలచుకుంటూ, జీవితాన్ని తదనుగుణంగా మలచుకుంటూ, పరమేశ్వర స్వరూపమైన స్వామిని కొలుచుకుంటూ, నియతితో, యతితో, నిబద్ధతతో, నిష్ఠతో నిలకడ చెందేటువంటి ఒకానొక స్థితిని కల్పించినటువంటి స్వామిని మరొక్కసారి పునః స్మరించుకుంటూ మనసా, వాచా, శిరసా స్వామిని ఆవాహన చేసుకుంటూ, స్వామి యొక్క దివ్య అవతార వైభవాన్ని, లీలా వైభవాన్ని కాసేపు మాట్లాడుకుందాం. "యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం" అర్జునుడితో ఈ మాట అంటున్నప్పుడు "భారత" అనేటువంటి ఒక శబ్దాన్ని, పదాన్ని ప్రయోగించాడు. అర్జున అనలే, ధనుంజయ అనలే, కౌంతేయ అనలే, ఇంకేదీ అనలే. "భారత" అంటే భగవంతుని యందు రతి కలిగినటువంటి వాడు భారతీయుడు అవుతున్నాడు గనుక. వేద ప్రామాణికమైనటువంటి ఒక విషయం ఏమిటంటే, ఆసేతు సీతాచలంలో ఎవరైతే జన్మ తీసుకుని వస్తారో వాళ్ళు నిజానికి ముక్తులయ్యే వస్తారు. అందునా ఆంధ్రదేశాన జన్మ ఎత్తినట్లయితే, అంటే తెలుగునాట. తెలుగువాడిగా జన్మ గనుక ఎత్తినట్లయితే వాడు ముక్తుడే కాదు, జీవన్ముక్తుడిగా జీవన యాత్ర సాగిస్తాడు అని ఇది ప్రమాణం. ఓంకార స్వరలీనమై, నిగమ నాదోపాసనాధీనమై, కైంకర్య ప్రతిపాద్యమై, భువన రక్షాదక్షమై, తాండవాహంకార స్థిరచంద్రయ శకల శైత్య ప్రాప్త శాంతత్వమై, శంఖా సంకులితమైన నీవునికి ఆశాసిద్ధి కల్పించుతన్. ఆంధ్రదేశం తెలుగునాడన్నా, ఒకనాడు దీనికి త్రిలింగ దేశం అని పేరు. ఈ త్రిలింగ దేశంలో మూడు ప్రధానమైనటువంటి శైవ క్షేత్రాలున్నాయి. ఆ శైవ క్షేత్రాలలో నుంచి నిరంతరము అనాహత నాదంగా వినిపించేటువంటి ఓంకార నాదమే ఈ గాలిలో మిళితమై ఉన్నది గనుక మనము శ్వాసించేటువంటి ఈ గాలి సమస్తము కూడా ఓంకార నాదమయంగా ఉన్నది. ఎప్పుడైతే ఒక పామరుడైనా, పండితుడైనా, జ్ఞాని అయినా, అజ్ఞాని అయినా, ధనికుడైనా, పేదవాడైనా, చదువుకున్న వాడైనా, చదువులేనివాడైనా ఎవరైనా సరే మానవ జన్మ ఎత్తి ఆంధ్రదేశంలో గనుక పుట్టినట్లయితే వాడికి తెలియకుండానే ఓంకార నాదాన్ని ఆశ్వాసిస్తాడని, శ్వాసిస్తాడని, పూరకం చేస్తాడని, కుంభకం చేస్తాడని, రేచకం చేస్తాడని, మళ్ళీ దానిలోనే స్వరలీనమై ఉంటాడని, అది ఓంకార నాదమయంగా ఉంటుందని ఒక ప్రధానమైనటువంటి ప్రమాణం ఉన్నది. నిజానికి అవతార మూర్తులందరు- అందరూ కూడావింధ్య పర్వతాలకు అవతలే పుట్టారు. శ్రీరాముడు అయోధ్యలో, శ్రీకృష్ణుడు మధురలో. ఇలా మనకి చరిత్ర తెలుసు, పురాణం తెలుసు. మరి కలియుగం ఆరంభమై ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా చెప్పుకుంటున్నాం. అందులో జ్ఞానులు పుట్టారు, సంతలు పుట్టారు, జ్ఞానార్థులు పుట్టారు, జిజ్ఞాసువులు పుట్టారు, భక్తులు పుట్టారు, దేశకులు పుట్టారు. ఎంతోమంది సమాజాన్ని ప్రభావితం చేస్తూ, ధర్మగ్లాని జరిగినప్పుడల్లా ఈ భారతీయుల కోసం ఒక అవతారం వస్తూనే ఉంటుంది. అట్లా అన్ని అవతారాల కంటే భిన్నంగా, నిజానికి రామకృష్ణాది అవతారాల కంటే కూడా భిన్నంగా ఒక సంపూర్ణ మహా పరిపూర్ణ అవతారిగా కలియుగాన అటు కర్ణాటక, ఇటు తమిళనాడు, ఇటు ఆంధ్రదేశం. ఈ మూడు త్రికూట స్థానంగా ఉన్నటువంటి పుట్టపర్తిలో నవంబరు ఇరవై మూడు, పంతొమ్మిది వందల ఇరవై ఆరున భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారుగా ఒక అవతారం వచ్చింది. ఆ అవతారం ఎందుకొచ్చింది ఎవరికీ తెలియదు. ఎందుకంటే, శ్రీరాముడు తన అవతార ప్రకటన శ్రీ మహావిష్ణువుగా ఉండగా చేశాడు వైకుంఠంలో. [గొంతు సవరించుకుంటూ] ఇది కూడా పౌరాణికమైనటువంటి ప్రమాణం. నారదాది మునులంతా కూడా మహావిష్ణువు దగ్గరికి వెళ్లి, త్రేతాయుగంలో రావణ బ్రహ్మ సకల విద్యాపారంగుతుడైనవాడు, సౌందర్యంలో జయంత వసంత కంతులను మించినవాడు, వీణావాదనలో యాజ్ఞవల్కుణ్ణి దాటినవాడు, వ్యాకరణ పండితుడు, శివుణ్ణి బొందితో కైలాసానికి వెళ్లి దర్శనం చేసినవాడు, నవగ్రహాలని అష్టదిక్పాలకుల్ని కైవసం చేసుకున్నవాడు. "షష్టిర్ యోజన విస్తీర్ణం శతయోజన సమున్నతం అష్టద్వార పురీ లంకాం సప్త ప్రాకార శోభితం త్రికోణ కందకం చైవ నవకోటి శివాలయం చాతుర్లక్ష్యం చ వీధీనాం రావణేన సురక్షితం" అని సముద్ర మధ్యంలో లంకా నగరంలో స్వర్ణమయమైనటువంటి లంకా నగరంలో ఏకకాలంలో శివాలయాలలో అభిషేకము, అర్చనలు చేసుకున్నటువంటి మహా భక్తుడు, వీర శైవుడు రావణుడున్నాడు. పౌలస్త్య బ్రహ్మ అతడు. కానీ ఇన్ని సద్గుణాలు ఉన్నప్పటికీ ఒకే ఒకటి హరుడి యొక్క నామమే వినపడాలి అంటే హరనామము. హరి అనబడేటువంటి విష్ణువు యొక్క నామం వినపడటానికి వీలు లేదు, విష్ణు పరమైనటువంటి యజ్ఞ యాగాదులు జరగటానికి వీలు లేదు, తపస్సులు సాగటానికి వీలు లేదు అని శైవ వైష్ణవ మతాల మధ్య ఒక అఘాతాన్ని, అగాధాన్ని సృష్టిస్తున్నాడు. సమాజము, ప్రపంచమంతా అతలాకుతలమైపోతున్నది. ఎదురు చెప్పేవాడు లేకుండా అయిపోయినాడు. నీవు ఒక అవతారాన్ని తాల్చి రావాలి అన్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక ప్రమాణం చేశాడు. "తప్పకుండా వస్తాను. ఎలా వస్తాను అంటే శ్రీరామచంద్ర నామంతో వస్తాను. దశరథుడు ఇంట పుడతాను. దశకంధరుడి కుత్తుకలు ఉత్తరిస్తాను. దశ యుగాల వరకూ నా నామం వినపడేటువంటి వీతిలో మానవ జీవితాన్ని గడుపుతాను. విధి ఎట్లా నడిపిస్తే అట్లా నడిపించేట్లుగా మానవుడికి ధర్మ ప్రతిపాదన చేస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతానని" ప్రమాణం చేశాడు. ఇది రాముడి పరం. శ్రీ కృష్ణ పరమాత్మ ఈ ప్రమాణాలు ఎక్కడా చేయలేదు. కానీ ద్వాపర యుగంలో మహాభారత సంగ్రామ ఆరంభ వేళలో సంగ్రామ రంగంలో మధ్యలో అర్జునుడితో చెప్తూ ఈ మాట అన్నాడు. ఇందాక చెప్పిన శ్లోకం. ధర్మానికి ఎప్పుడు గ్లాని జరుగుతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకొని వస్తాను. కనుక శ్రీకృష్ణావతారము అది ప్రభావావతారంగా వచ్చింది. ఎట్లా అంటే యోగ మాయతో అవతరించి దేవకీ వసుదేవుల దగ్గర తన యోగ మాయను దాచిపెట్టి, లోక మాయను తీసుకుని పుట్టిన కొన్ని క్షణాలలోనే పుట్టిన చోటు నుంచి యమునాను దాటి బ్రజ భూమికి వెళ్లటం వృత్తాంతం అంతా మనకు తెలుసు. ఇటువంటి కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే ధర్మానికి గ్లాని జరిగినప్పుడే నేను వస్తాను అన్నాడది ప్రమాణమయ్యింది. ధర్మానికి గ్లాని జరుగుతుందా? అగ్నికి చెద పుడుతుందా? అంటే మానవుడు తాను ఆచరించవలసినటువంటి ధర్మాన్ని ఆచరించలేనప్పుడు, ధర్మాన్నుంచి దూరమైనప్పుడు, అది వ్యక్తి ధర్మమో, సమాజ ధర్మమో, అనేక ధర్మాలు అనేక పారిశ్వాలు ఉంటాయి. వాటి నుంచి దూరంగా వైదొలగినప్పుడు పరమాత్మ ఒక దేహాన్ని తీసుకొని వస్తాడు. పంచభౌతిక దేహాన్ని. తీసుకొని వచ్చి మళ్ళీ ధర్మోద్ధరణ చేసి, అధర్మాన్ని అణచి, అధర్మ ప్రవర్తన చేస్తున్నటువంటి వారిని శిక్షించి మళ్ళీ ధర్మ సంస్థాపన చేసి వెళ్తాడు. అది కూడా ఆయనే ప్రమాణం వెంటనే చేశాడు. "పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" ప్రతి యుగంలోనూ నేను వస్తాను అని ప్రమాణం చేశాడు. ఆయన తర్వాత అవతారాలు పెద్దగా రాలేదు. వచ్చినా చిన్న చిన్న అవతారాలు వచ్చినాయి. హంసావతారాలు, హర్షావతారాలు, కళావతారాలు, ఆవేశావతారాలు, ప్రవేశావతారాలు, ప్రభావావతారాలు, అనుప్రవేశావతారాలు.పూర్ణావతారాలు అంతవరకు వచ్చినాయి. మహా పరిపూర్ణ అవతారాలు రాలేదు అప్పటికి. ఇంతలోకే యుద్ధం అయిపోయింది. పాండవుల మహాప్రస్థానం అయిపోయింది. కలియుగం బలును తెల్లవారింది. కలియుగ ఆరంభ వేళకి శ్రీ మహావిష్ణువు ఎత్తి రావలసిన ఇరవై ఒక్క అవతారాలు పరిపూర్ణం అయిపోయినాయి. శివుడు అవతారమూర్తిగా రాడు, వచ్చినా అంశగా వస్తాడు. బ్రహ్మకి అవతార కార్యక్రమమే లేదు. మరి ఎవరు? కలియుగంలో ఎవరు రావాలి అనంటే కోటి సూర్యమండలం అచ్చిష్ట అయినటువంటి మహా త్రిపురసుందరి దేవి నేను కలియుగానికి అధిష్టాతగా వస్తాను అంటే అమ్మా కోటి సూర్యమండల మధ్యంలో ఉన్న నువ్వు అవతారిగా గనక వస్తే జగత్తు మాడిపోదా? మసి నుసి అయిపోదా? అని అంటే, వస్తే ఇట్లా వస్తానా? నేను శ్రీ లలితా అనేటువంటి పేరుతో వస్తాను. వచ్చి పురుష రూపంలో దత్తావతారంగా కూడా నన్ను నేను విభజించుకొని వస్తాను అన్నది. అంటే కలియుగానికి స్త్రీ శక్తి స్వరూపం అంతా లలితాదేవి అయినట్లయితే పురుష రూపం అంతా కూడా దత్తాత్రేయుల యొక్క అవతారం అయినది. మరి ఈ దత్తాత్రేయులు ఎక్కడ రావాలి, ఎక్కడ రావాలి అని అనుకున్నప్పుడు శ్రీ లలితాదేవి తనను తాను దత్తుడిగా నిర్ణయించుకొని, అభిమంత్రించుకొని ఆంధ్రదేశంలో విఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడిగా వచ్చింది. అయితే అది చాలా తాత్కాలికమైనటువంటి అవతారం. స్వల్ప కాలమే ఉంది. కానీ దత్త అవతారానికి అది ఆరంభం, అది తొలి అడుగు, తొలి రూపం అది. తర్వాత అనేక మంది నృసింహ సరస్వతి తదాదిగా గలిగినటువంటి వాళ్ళంతా వచ్చారు. కానీ మానవ జాతితో ఒక సంబంధం పెట్టుకొని సమాజంతో మమేకం కావలసి ఉన్న సందర్భంలో సంత దేశమైనటువంటి మహారాష్ట్ర దేశంలో ఒక గ్రామంలో ఒక స్వామి అవతరించారు. [గొంతు సవరించుకుంటున్నారు] అది సంపూర్ణంగా శివావతారం. తల్లిదండ్రుల యొక్క లేదా ఒక దంపతుల యొక్క తపఃఫలంగా శివుడే ఒక రూపం తీసుకుని వచ్చాడు. వస్తే ఆయనకు పేరు లేదు, అవధూతగానే వచ్చాడు. ఈ పిల్లవాడు పుట్టినటువంటి మరుక్షణమే తల్లిదండ్రులకి, తల్లిదండ్రులలో ప్రధానంగా తండ్రికి వైరాగ్యం ఆవరించి ఆయన బిడ్డని, భార్యని అక్కడే వదిలి తపోవనం వైపు వెళ్ళిపోయినాడు. ఎప్పుడైతే భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి ఆనాటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా భర్త ఎట్లాగైతే వదిలిపెట్టి వెళ్ళాడో భర్తను అనుసరించి భార్య కూడా ఆయన వెనక వెళ్ళిపోయింది. [గొంతు సవరించుకుంటున్నారు] మరి ఈ పిల్లవాడు ఏం కావాలి? అవతరణ జరిగిపోయింది. అప్పుడు ఒక సాధువు ఈ బిడ్డను తీసుకుని పెంచి పెద్దవాడిని చేస్తున్న సమయంలో ఆ సమయము దాటింది గనుక వేద విద్యా ప్రమాణం ప్రకారంగా తల్లి తండ్రిని చూపిస్తే, తండ్రి గురువుని చూపిస్తే గురువు దైవాన్ని చూపిస్తాడని ఇది భారతీయ ప్రమాణం. కాబట్టి ఈ గురువు దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆయన్ని వదిలిపెట్టినప్పుడు అది వేద విద్య, సర్వ విద్యా ప్రపూర్ణమైనటువంటి ఒక ఆత్మ ఆ దేహంలో ఉన్నప్పుడు ఆయనకు కొంత వయస్సు వచ్చినప్పుడు ఆ గురువుని వెంకూశ అని పేరు పెట్టుకున్నాడు ఆయన. జన్మ తానే తెచ్చుకున్నాడు. తల్లిదండ్రులని తానే ఎంచుకున్నాడు. గురువుని తానే ఎంచుకున్నాడు. ఆ గురువుని తన వెంబడి పెట్టుకొని నెమ్మదిగా మహారాష్ట్ర దేశంలో చెరుకు తోటల మధ్యలో నుంచి ఓ గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామమే ఇవాళ మనం పిలుచుకునేటువంటి షిరిడి. షిరిడి అది నిజానికి. ఆ షిరిడి అనేటువంటిది మరాఠీలో శిలాధి అని అర్థం. శిలాధి అంటే చెరుకుతోట అని అర్థం. ఆ చెరుకు తోట మధ్యలో ఒక వేప చెట్టు ఉంది. వేప చెట్టుని కాస్త ఆశ్రయించాడు. కానీ రాత్రిపూట పడుకోవటానికి ఒక ఖండోబా దేవాలయంలోకి వెళ్లి అక్కడ తలదాచుకుందామని వెళ్ళాడు. ఆ ఆలయ పూజారి, మహల్ సాపతి ఈయన వాలకాన్ని చూసి, ఈయన రూపరేఖలు చూసి "నువ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో" అన్నాడు. అనగానే వినయంగా అక్కడి నుంచి తప్పుకున్నాడు. మళ్ళీ కొన్నేళ్ళకి ఒక పెళ్లి బృందంతో వచ్చి షిరిడి గ్రామ ప్రవేశం చేస్తున్నప్పుడు ఇదే మహల్ సాపతి ఆయన్ని ఎవరో చెప్పినట్టుగా "ఆవో సాయి" అని పిలిచాడు. అప్పటివరకు ఈ సాయి నామం ప్రపంచంలో ఎక్కడా వినపడలేదు. ఈ నామంతో ఎవరూ రాలేదు. [గొంతు సవరించుకున్నారు] అలా వచ్చినటువంటి వారు షిరిడి స్వామి. వారున్నటువంటి కాలంలో రెండు మతాల మధ్య ఆ ప్రదేశంలో సంఘర్షణ ఉండేది. భారతదేశంలో చారిత్రాత్మకంగా, రాజకీయ, సాంఘిక నేపథ్యంలో హిందూ ముస్లింల మధ్య ఏదైతే ఘర్షణ ఉందో అది ఆనాటికీ ఉన్నది. కానీ ఆయన రెండు మతాలని సమన్వయం చేసేట్లుగా ద్వారకామాయి అనేటువంటి ఒక మసీదుని ఆశ్రయించి ఆ మసీదులో ఉండిపోయినాడు ఆయన. ద్వారకామాయి అంటే దానికి అర్థం ఏంటంటే తలుపులు లేనిది అని. తలుపులు లేనిది, తలపులు లేనిది హృదయం కాబట్టి హృదయ స్థానంలో ఒక జ్యోతిని వెలిగించి తన శక్తుల చేత..తాను అక్కడ ఉండి సాయి నామంతో ప్రవర్ధమానమై ప్రఖ్యాతిని చెందాడు ప్రాదేశికంగా. ఆయన శ్రద్ధ, సబూరి అంటే శ్రద్ధ ఉండాలి అంటే "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" ఇది భగవద్గీత. సహనం ఉండాలి, స్వధర్మాన్ని పాటించాలి "స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః" అంతే కదా! ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించాలి, ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించాలి, ఎవరి భావాన్ని అనుసరించి వాళ్ళు వెళ్ళాలి, అవన్నీ కూడా సమాజంలో ఒక నీతితో ఉండాలి, నియమంతో ఉండాలి, నిబద్ధతతో ఉండాలి గనుక అటువంటి ఒక మోరల్ ఫిలాసఫీని ప్రపంచానికి demonstrate చేసినటువంటి వారు శిరిడి స్వామి. 1918 విజయదశమి నాడు వారు దేహాన్ని వదిలిపెట్టే కొన్ని క్షణాల ముందు మళ్ళీ తాను ఆంధ్రదేశంలో జన్మ ఎత్తి వస్తానని చెప్పి వారు అవతార పరిసమాప్తం చేసుకున్నారు. ఆ సమయంలో ఉన్నటువంటి వారు కొంతమంది అంటే శిరిడి స్వామిని దర్శనం చేసిన వాళ్ళు కేవలం ఎనిమిది సంవత్సరాల విరామ కాలమే కాబట్టి వాళ్ళు ఎదురుచూస్తూ ఉన్నారు మళ్ళీ స్వామి ఎక్కడ వస్తారు, ఎలా వస్తారు అని. అలా వచ్చినటువంటి స్వామి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. "ఔపదేయంబునకు సత్యనామంబిచ్చి నడతకల్ల ధర్మ నిరతి నెరపి ఎల్ల సృష్టిని శాంతికాంతులు వెలార్చి వచ్చమా స్వామి మల్హారమై, విచ్చమా స్వామి కల్హారమై" మల్హారం అంటే బంగారం. శుద్ధ చైతన్యమే ఒక స్వరూపం వచ్చింది. ఆయన తన దేహానికి ఒక పేరు పెట్టుకున్నారు. దాని పేరు సత్య. ధర్మాన్ని నాలుగు చరగుల కేవలం భారతదేశము, ఆంధ్ర రాష్ట్రము పరిమితం కాకుండా మహా సృష్టిని ధర్మబద్ధం చేశారు. ధర్మం వైపు నడిపించారు. ధర్మం వైపు నడిపిస్తున్నందు-- నడిపిస్తూనే శాంతి కాంతులు కూడా శాంతి, ప్రేమ మనం చెప్పుకునేవన్నీ కూడా ప్రపంచానికి చాటి చెప్పి వీటికి మినహా ప్రపంచంలో నిజమైన సంపద లేదని, ఆ శుద్ధ చైతన్యమే ఒక దేహంగా వచ్చిందని, సాకారమై, సగుణమై ప్రభావితమై--టువంటి ఒక రూపాన్ని తీసుకువచ్చినటువంటి స్వామి ఇవాళ నిరాకార నిర్గుణ పరబ్రహ్మమూర్తియై సర్వ ప్రపంచాన్ని ఆవహించి ఉన్నారు. అది విచ్చకల్హారమై సహస్ర దళాలతో, చూడండి శ్రీరామచంద్రుడు అయోధ్యలో పుట్టి లంకానగరం దాకా సీతాన్వేషణ అనేటువంటి ఒక నెపంతో ధర్మసంస్థాపన చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ వింధ్య పర్వతాలు దాటి రాకుండా మధురా, బృందావనం, హస్తినాపురం ప్రాంతాలలో మాత్రమే సంచారం చేసి అధర్మాన్ని అణచివేసి నూరు విధాలుగా అధర్మం విస్తరించి ఉన్నప్పుడు ఆ అధర్మము నూరు, ధర్మము ఐదు. ఈ రెండింటి మధ్య యోగీశ్వర కృష్ణుడై మహాభారత సంగ్రామాన్ని నడిపించి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి పాండవులకు రాజ్యం అప్పజెప్పి మళ్ళీ మహా పరినిర్వాణానికి ముందు కలియుగానికి కావలసినటువంటి కర్మ, భక్తి, జ్ఞాన, యోగాలుగా త్రివేణి సంగమంగా ఉన్నటువంటి ఒక భగవద్గీతని ఉపదేశనంగా అర్జునుడికి ఉపదేశించి అంటే అర్జునుడి ద్వారా కలియుగ మానవుడికి ఈ మూడు యోగాలు కలిపినట్లయితే అది నియమమైనటువంటి మానవ జీవితం అని అదే పరిపూర్ణ జీవితం అని ప్రకటించి ఆయన అవతార పరిసమాప్తి చేశాడు. అందులో చివర ఒక శ్లోకం ఉంది. "యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ" సర్వ సన్నద్ధమైనటువంటి ఒక శిష్యుడు. వాడు సిద్ధుడు, సిద్ధుడు, సర్వ సన్నద్ధుడు. యోగీశ్వర స్థాయికి చెందినటువంటి ఒక గురువు. ఈ ఇద్దరూ గనుక కలిసినట్లయితే సమాజంలో ఒక ధర్మబద్ధమైనటువంటి ఒక నీతి, నీతిని ఆశ్రయించి నడిచేటువంటి ఒక జాతి, ఆ జాతి వలన ధర్మానికి ఒక గతి, ఆ గతి వలన ఒక సుగతి ఏర్పడుతుందని ప్రమాణం చేసి ఈ ప్రపంచం నుంచి ఆయన నిష్క్రమించారు. అయితే ఈ ప్రస్థానంలో, భారతీయ ఆధ్యాత్మిక ప్రస్థానంలో శ్రీకృష్ణ పరమాత్మకి సత్యసాయి భగవానుడికి మధ్య ఉన్నటువంటి కాలం ఒక పవిత్రమైనటువంటి కాలం. ఆ కాలంలో కొన్ని పరిణామాలు చే-- చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి, కొంతకాలం గడిచిన తర్వాత బుద్ధుడు ప్రవేశించాడు ఈ దేశంలో. ఆయన సత్యాన్వేషణే చేశాడు. సత్యాన్ని బోధించలా, ఆయన సత్యాన్ని అన్వేషిస్తూ వెళ్ళాడు. రమణిని, రాజ్యాన్ని, బిడ్డని వదిలిపెట్టేశాడు. పరిత్యాగి అయినాడు, విరాగి అయినాడు. కానీ అది ఎక్కడో సమాజంలో ఎక్కడున్నదో ఆయనకు తెలియలేదు కాబట్టి "బుద్ధం శరణం గచ్ఛామి" అంటే బుద్ధుని ఆశ్రయించాడు ఆయన. "సంఘం శరణం గచ్ఛామి" సంఘాన్ని ఆశ్రయించి వెళ్తున్నానన్నాడు. కాబట్టి దేనినో ఆశ్రయించి అన్వేషించినటువంటి బుద్ధుడి వెనక కొన్ని వేల మంది నడిచారు, ప్రభావితులైనారు. ఒక రాజకుమారుడు సన్యసించి ప్రపంచంలోకి వచ్చి సత్యాన్ని అన్వేషిస్తున్నాడే, ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాడే అనేటువంటి ఒక విషయాన్ని గమనించినటువంటి ఆసక్తి కలిగిన వాళ్ళంతా ఆయన చుట్టూ చేరితే ఆయన అన్వేషణ కూడా చాలా తీవ్రంగా సాగింది. దానిలోఅనేకమైనటువంటి ధ్యాన స్థితులలో ఒక ధ్యానాన్ని ఆయన ఆశ్రయించి ధ్యానం ద్వారా భగవంతుణ్ణి కనిపెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ ధ్యానం ఎంత తీవ్రంగా చేశాడంటే శరీరం మీద ఉన్నటువంటి పల్చటి చర్మమంతా కూడా పలచబారిపోయి లోపల ఉన్న అస్థిపంజరం కనిపించేంతగా జానైక స్థితిలో ఉన్నాడు. కానీ అప్పటికి ఆయన చుట్టూ ఉన్నటువంటి శిష్యులు పన్నెండు మంది మాత్రమే మిగిలారు. గురువుగారు ఏం చెప్తారో అని ఎదురు చూస్తున్నారు. బుద్ధుడు ధర్మాన్ని సత్యము ధ్యానం ద్వారా సాధించుకోవాలి. ఆ ఎరుక absolute consciousness అది ఏమిటో తెలుసుకోవాలన్నటువంటి ఆ తీవ్ర కాంక్షలో ఆయన ఉండిపోతే, ఆయనకు ఒక విషయం అర్థమైంది. భగవంతుడు ఇచ్చినటువంటి శరీరాన్ని దివ్య శరీరాన్ని శరీరం ఆజం ఖలు కర్మ సాధనం శరీరం ఆజం ఖలు ధర్మ సాధనం. ధర్మబద్ధమైన కర్మలు చేయాలంటే శరీరం కావాలి కదా! ఈ శరీరాన్ని నేను ఇంత కష్టపెట్టినా నాకు సత్యం గోచరించటం లేదు. కనుక ఈ ధ్యానము, ధారణ, సమాధి ఇవి కాదు. సంఘం వైపే నేను వెళ్ళాలి. కనుక శరీరాన్ని యాతన పెట్టిన వలన సత్యం పెట్టినందువలన సత్యం మనకి గోచరం కాదు అని ఒక enlightenment జరిగింది. అది ప్రబుద్ధమానమైనటువంటి స్థితి. ఆ ప్రబుద్ధమానమైన స్థితిలో ఆయన కళ్ళు తెరిచాడు. తెరిస్తే పన్నెండు మంది శిష్యులు కూర్చుని ఉన్నారు. వాళ్ళతో ఒక మాటన్నాడు. [గొంతు సవరించిన శబ్దం] చాలా కష్టపడ్డాను. మీరందరూ నా వెనక ఉన్నారు. ఇదిగో మీరు మిగిలారు. నేను గ్రహించిన సత్యం ఒకటే. భగవంతుడు మనను దాటి వేరే చోట లేడు. సర్వం ఖల్విదం బ్రహ్మ ఉన్నదంతా బ్రహ్మమే. కనుక బ్రహ్మము నాలోనే ఉన్నాడు. సత్యము నాలోనే ఉన్నది అని ఇది నేను గ్రహించాను అని చెప్పాడు. ఆయన అవతారం అయిపోయింది. ఈ పన్నెండు మంది శిష్యులు దానిని సరిగా అర్థం చేసుకోక మనలో దేవుడున్నాడు గనుక మనమే దేవుళ్ళము అనుకున్నారు. అనుకొని బౌద్ధ మత ప్రచారం జరిగింది. బౌద్ధం ధర్మం కాదు, అది మతం. ఆ మత ప్రచారంలో సనాతనమైన, వైదికమైన, ఆర్యష్మైన భారతీయ ధర్మం వెనకబడిపోయింది. దేవుడు లేడన్న వాదన వచ్చింది. దేవుడు ప్రత్యేకంగా లేడని కాదు, అసలు లేనే లేడనే వాదన వచ్చింది. దేవాలయాలు మూతపడిపోయినాయి. దేవుళ్ళకి ఏ రకమైన ధూపదీప నైవేద్యా లు లేవు. దేవాలయాలకు వెళ్ళేవారు లేరు. సనాతన ధర్మం పలచబడిపోయి, బలహీనమైపోయినటువంటి స్థితి ఏర్పడినప్పుడు మళ్ళీ ధర్మగ్లాని జరిగినప్పుడు శంభోర్ మూర్తిశ్చరతి భూనే శంకరాచార్య రూపా అని శంకర భగవత్పాదులు ఈ జగత్తులోకి వచ్చారు. ఆదిశంకరులు. శృతి స్మృతి పురాణాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అని మనం ఈవేళ వారిని జగద్గురువుగా భావిస్తూ ఉన్నాం. అందుకనే సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం హస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని భారతీయ గురు పరంపరకి మనం నమస్కరిస్తాం. ఇక్కడ ఆగినట్లయితే శంకర భగవత్పాదులు తాము జీవించినటువంటి ముప్పై రెండు సంవత్సరాల కాలంలో బౌద్ధమతంతో సంఘర్షణ లేకుండా సమన్వయమైనటువంటి ఒక రీతిలో నాస్తికవాదాన్ని ఆస్తికవాదంగా మార్చాడు. భగవంతుడు ఉన్నాడు. ఉంటే ఇదిగో ఇట్లా ఉన్నాడు. సగుణంగానూ ఉన్నాడు, నిర్గుణంగానూ ఉన్నాడు. కానీ ఆయన్ని ఉపాసన చేయాలంటే ఇదిగో మార్గాలు అని స్తోత్రాలు, భాష్యాలు, ప్రకరణాలు, వ్యాఖ్యానాలు అన్నీ రాసి మళ్ళీ పునరుజ్జీవనం చేశారు ఆయన. Renaissance అంటాం. అది చేసి మళ్ళీ భారతీయులు అందరికీ కూడా భగవంతుడున్నాడు, అర్చా రూపంలో ఉన్నాడు, అభిషేక రూపంలో ఉన్నాడు, విగ్రహ రూపంలో ఉన్నాడు, నిగ్రహ రూపంలో ఉన్నాడు. దేవాలయాలు అన్నీ కూడా విజ్ఞాన పీఠాలుగా భావన చేయండి, దేవాలయానికి వెళ్ళండని ఆయన మనకి దారి చూపించేశారు. చూపించి భగవద్గీతకు వ్యాఖ్యానం చేశారు. గీతా వ్యాఖ్య చేశారు. భాష్యం చెప్పారు. దానివలన ఒక సంపూర్ణమైన ఆధ్యాత్మికమైన వాఙ్మయం మనకు ఏర్పడింది. అయితే శంకరులు ఉన్నది కేవలం ముప్పై రెండు సంవత్సరాలే. ఆ తర్వాత ఈ దక్షిణాపథం ఒక స్వర్ణయుగాన్ని అనుభవించింది. ఆ కాలంలో శంకరుల తర్వాత భారతీయమైనటువంటి ఒక ఆత్మ విచార మార్గంలోకి జీవుణ్ణి తీసుకుని వెళ్ళాలి అని స్మరణ మాత్రముననే పరముక్తి ఫలదా కరుణామృత జలధి అరుణాచలం నిధి అని చెప్తూ అరుణాచలంలో భగవాన్ రమణ మహర్షి ఈ ఆత్మ అనేది ఎక్కడో లేదు. కృష్ణుడు ఆత్మ గురించి చెప్పాడు. ఆత్మ ఎలా ఉంటుందో చెప్పాడు. దాని స్వభావం చెప్పాడు. దాని గుణం చెప్పాడు. కానీ ఆత్మ మానవ దేహంలో ఎక్కడ ఉన్నది అంతవరకు ఎవరూ చెప్పలేదు గనుక హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృది విశ మనసా స్వం చిన్వతా మజ్జతావా పవనచరణ రోధాత్ ఆత్మ నిష్ఠో భవత్వం. నీ యందు నిత్యమూ నేను నేను నేను అని అఖండమై చిద్ఘనమై అనంతమై అవ్యయమై అద్వితమై నిరతిశయమై వెలుగుతున్నటువంటి ఆ నేను అనేటువంటి ప్రథమ తలపై ఆత్మగా భావన చేయమని మనకి ఉపదేశనం చేసిన ఆ సమయంలోనే పాండిచ్చేరిలో దర్శనం చేసినటువంటి ఒక యోగిగా అరవింద యోగి కంచిలో మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు సంప్రదాయాన్ని, శాస్త్రాన్ని, వేదాన్ని పరిరక్షించి ఒక హైందవం అనేటువంటిది సనాతన ధర్మం యొక్క ఆచరణ రూపమేనని మనకి చెప్తూHinduism కాదది దేనిలో నుంచి అది పుట్టలేదు అన్నీ దానిలో నుంచే పుట్టాయి అదే సనాతన ధర్మం అని వారు అట్లా అనేకమైనటువంటి విషయాలన్నీ వచ్చినప్పుడు దానిలో ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి అవతారమూర్తుల యొక్క స్ఫూర్తిని నాలుగు యుగాల యొక్క ఒక ధర్మాన్ని అంటే కృతయుగం నాటి సత్యాన్ని త్రేతాయుగం నాటి ధర్మాన్ని ద్వాపర యుగం నాటి శాంతి ప్రేరణను కలియుగానికి కావలసిన అహింసని ఈ నాలుగు యుగాల ధర్మాలని సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలని ఒక రూపంలో తీసుకుని వచ్చి దానికి ఒక ఆకారాన్నిచ్చి సహకారం చేసి సానంద స్వరూపమై ఎనభై ఆరు సంవత్సరాలు అవనీ సంచారం చేసి నడయాడినటువంటి ఒక పరమాద్భుత అవతార వైభవమే భగవాన్ శ్రీ సత్య సాయి అటువంటి సత్యసాయి భగవానుడు మన బోటి వారంతా స్వామిని సత్యసాయిని స్వామి అని పిలుస్తాం స్వామి అంటే జ్ఞాని అని జ్ఞాని అంటే శుద్ధ జ్ఞానైక రూపమే ఇక్కడ ఒక చిన్న విశేషం ఏమిటంటే సాక్షాత్తు నారాయణ మూర్తి అయినటువంటి రామచంద్రుడికి ఇద్దరు గురువులున్నారు లోక గురువైన విశ్వామిత్రుడు ఒక బ్రహ్మర్షి జ్ఞాన గురువు అయినటువంటి వశిష్టుడు రెండవ బ్రహ్మర్షి అంటే ఇద్దరు బ్రహ్మర్షులు ఒక అవతారానికి గురువులు శ్రీకృష్ణ పరమాత్మకి ఆయన బాల్యంలో సాందీపుడు గురువు శి-శిరిడి బాబా కి వెంకూశ గురువు సత్యసాయి భగవానుడికి గురువే లేడు గురువే లేని అవతారం ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్నదా అంటే అది ఒక్క సత్యసాయి భగవానుడు మాత్రమే ఎందుకని అంటే తల్లి అదే తండ్రి అదే గురువు అదే దైవము అదే ఈ నాలుగు ఒక చోట ఉండటం అత్యంత విశేషం అందుకనే రెండు వందల గ్రంథాలు రాసినటువంటి వేలూరు శివరామ శాస్త్రి గారు పుట్టపర్తి చేరుకున్నప్పుడు వారిని అనేక మంది కలిసి "మీ వంటి మహాత్ముని ఇక్కడికి వచ్చారు మాకు బాబా వారు అర్థం కావట్లేదు చెప్పండి" అని అంటే "నాకు అర్థం కాలేదయ్యా అది తెలుసుకుందామని ఇక్కడికి వచ్చి ఉన్నాను" అన్నారు తొలినాళ్లలో ఆయన ప్రతిరోజూ ఈ ప్రశ్న ఎదుర్కుంటున్నారు తర్వాత వాళ్ళు ఏమడిగారంటే "అయ్యా! మీరు ఏమిటి రామకృష్ణ పరమహంస వంటి వారా? రమణ మహర్షి వంటి వారా? ఎవరు వీరు?" అని అడిగారు అప్పుడు ఆయన స్థిమితంగా కూర్చొని "సత్యసాయిబాబా వారు రామకృష్ణ పరమహంస వంటి వారూ కాదు రమణ మహర్షి వంటి వారూ కాదు సత్యసాయిబాబా వారు సత్యసాయిబాబా వారే" అది ఇలపై నడుస్తున్నటువంటి ఒక బ్రహ్మ పదార్థం చూడండి ఎప్పుడైతే సగుణంగా వారే అన్న తర్వాత అది లోకి వచ్చేశారో అది అంటే that that అది అనేటువంటి అంటే స్వామి స్త్రీయా? పురుషుడా? బాలుడా? వృద్ధుడా? ఏమిటి? దైవమా? మానవుడా? తెలీదు ఏమి ఎవరికీ తెలీదు అటువంటి సందర్భంలో ఆయన ఓ పద్యం రాసుకున్నారు ఏమిటా పద్యం అంటే నాలుగు వేదాలు నేను పుక్కిట పట్టాను భారతీయమైనటువంటి సర్వ శాస్త్రాలు ఆకళింపు చేసుకున్నాను అరవింద యోగి యొక్క దర్శనాన్ని చేసుకున్నా దర్శనం అంటే ఆయన తత్వ దర్శనాన్ని చేసుకున్నాను భారతీయమైనటువంటి వైజ్ఞానిక వాణి అంతా నా కంఠంలో నిలబడిపోయింది కానీ ఈ నాలుగు వేదాలు నాకు ఇక్కడ కొంత అనుభవం కలిగినప్పుడు నాలుగు అక్షరాలుగా మిగిలిపోయినాయి ఆ అక్షరాలు ఏమిటంటే సత్య సాయి అంతే ఈ నాలుగింటిని ఇంకా చూశాను దర్శనం చేశాను మాట్లాడాను రోజూ చూస్తున్నాను వారి అతిమానుషమైన చర్యలన్నీ అవగతం చేసుకున్నాను వేద స్వరూపం అని భావించాను ఉపనిషన్మూర్తి అని సంభావన చేశాను అనేక రీతులలో రామాయణ భారత భాగవత భగవద్గీతాది గ్రంథాల యొక్క సారమే సర్వ సత్యసాయి భగవానుడి యొక్క ఉపదేశం అని గ్రహించాను కానీ చివరకు ఈ సత్య సాయి అనేటువంటి నాలుగు అక్షరాలు రెండు అక్షరాలుగా మిగిలిపోయినాయి అవి సాయి అని మిగుల వర్ణములెల్ల తెల్ల చూర్ణముల్ అన్నాడు నేను రాసిన రెండు వందల యాభై గ్రంథాలలో ఆ అక్షరాలన్నీ కూడా నా వాకిట వేసినటువంటి ముగ్గు అయిపోయింది గాలి కొట్టింది ఆ ముగ్గులు అన్నీ ఎగిరిపోయినాయి కానీ రెండు అక్షరాలు మిగిలినాయి అవి సాయి అని అంటే సత్యసాయి భగవానుడిని భౌతిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక స్థాయిలలో అంటే physical metaphysical spiritual levels లో సమన్వయం చేసుకోవాలి అంటే దానికి చాలా సాధన చేయాలి ఆ సాధనకి పరిపూర్ణమైన పవిత్రమైన మనస్సు కావాలి నియమ నిబంధనలు కావాలి అత్యంత కఠినమైన యోగిక జీవితాన్ని గడపాలి ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి అతీతంగా మనస్సును నిలబెట్టుకోవాలి ఏ ఆకర్షణలకు ఏ ప్రలోభానికి లొంగకుండా జీవితం ఎట్లా ప్రవహిస్తే దాన్ని అట్లా ఆస్వాదిస్తూ అంగీకరిస్తూ తదనుగుణంగా జీవితాన్ని మలుచుకుంటూ ముందుకు వెళితే అక్కడ సత్యసాయి భగవానుడు మనకి సంపూర్ణంగా అర్థమవుతారు స్వామిని గ్రంథాలలో పట్టుకోలేం స్వామిని తర్కంతో మీమాంసతో వ్యాకరణంతో పట్టుకోలేం మరి ఎలా పట్టుకోవాలి ఎచ్చట నున్నవాడు సాయి అని ఎన్ని విధంబుల వెదకి చూచినన్ పత్రిని లేను పత్రిని లేను సర్వ హృదయంబుల నిండి ఉంటిను సత్యము తెలుపగా వచ్చెను నాడు సాయియై నేడు సత్య సాయియై అన్నారు స్వామి అంటే షిరిడి మహాస్వామికి తనకు అభేదం చెప్తూ ఈ రెండూ ఒకటే అప్పుడు సాయిగా వచ్చాను ఇప్పుడు సత్య సాయిగా వచ్చానుఅప్పుడు రెండు మతాల మధ్య మాత్రమే సమన్వయం చేస్తే ఈ అవతార కార్యక్రమం అది కాదు. ఎందుకు? ఇది సర్వమతాలని సమన్వయం చేయాలి. సమస్తమైనటువంటి మానవకోటిని ఒకచోటికి తేవాలి. ఏ వేదం అయితే ప్రపంచమంతా ఒక కుటుంబం అని చెప్పిందో, "వసుదైవ కుటుంబకం" అని నిర్ణయం చేసిందో దానిని సాధించి చూపించాలి. నిరూపణ చేయకపోతే అది ప్రమాణం కాదు గనుక, ఇదిగో ఇక్కడ ఈ ఉన్నచోటనే సమస్త జాతులని, ఇవ్వాల మనందరికీ తెలుసు నూట ఎనభై దేశాల ప్రజలు అక్కడికి వస్తారు. ఈ దేశంలో ఉన్న రెండు వందల ఎనభై జాతులన్నీ అక్కడికి చేరుతాయి. అనేకమైన కులాలు, కులాలలో శాఖలు, ఉపశాఖలు అన్నీ మరిచిపోయి ఒకే ఒక ఏకాత్మ భావనతో నిలకడ చెంది పరబ్రహ్మ తత్వాన్ని ఉపాసన చేసుకోవటానికి వీలైనటువంటి ఒక అద్భుత ప్రదేశం ఏదంటే అది భగవాన్ పుట్టిన, మెట్టిన, అవతారం చాలించినటువంటి పుట్టపర్తి మాత్రమే. ఈ పుట్టపర్తిని ఎవరో ఈ మధ్య అడిగారు, దానికి ఏదో గొల్లపల్లి అనే పేరు ఉందండి, ఇంకేదో పేరు ఉందండి. అసలు ఏమిటి పుట్టపర్తి ఏమిటి అని అడిగితే పుట్ట apart ఐ is equal to పుట్టపర్తి అని చెప్పాం. అంటే ఐ ని పక్కన పెడితే అది పూర్ణమైన ఆధ్యాత్మిక కేంద్రం అది. అక్కడ స్వామి చేయని మహిమలు లేవు. మహిమ భగవంతుని యొక్క చాతుర్యం. స్వామి చెప్పినట్లుగా ముందుగా చమత్కారం, తర్వాత సంస్కారం, తర్వాత పరోపకారం, ఆపై సాక్షాత్కారం. సాక్షాత్కారం అక్కడికి వెళ్ళగానే రాదు. ముందు చమత్కారం చూడాలి, Miracle చూడాలి. తర్వాత మనలో సంస్కరణ జరగాలి, సంస్కరింపబడాలి. అప్పుడు పరోపకారం సేవ ద్వారా చేయాలి. పరులకు ఉపకరించేట్లుగా ఉండటమే ఆపై సాక్షాత్కారం. దేనిని సాక్షాత్కరిస్తున్నావు? నీవు కాని దాన్ని కావు, నీ మూలాన్ని నువ్వు ఆత్మసాక్షాత్కారం-- ఆత్మ సాక్షాత్తు ఆకారమై ఉన్నది. నీవు అదే. స్వామి అదే చెప్పారు కదా. దేవుడనగా వేరు దేశమున లేడు, తాను చేయు పనుల యందు తగిలి ఉండు. ఒక మాట. రెండోది దేవుడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు కాని దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఆ దేవుడు ఆత్మగా, ఈశ్వరో గురురాత్మేతి, మూర్తి భేద విభాగిని, కంటికి కనపడని ఈశ్వరుడిగా, ఎప్పటికైనా పట్టుకోవలసిన ఆత్మగా, రెండూ కలిపి ఒక గురువుగా వస్తే అదే ఈశ్వరుడి యొక్క తత్వం అని ప్రామాణికమైనటువంటి, అనేకమైనటువంటి సందర్భాలలో స్వామి తన దివ్యత్వాన్ని ప్రకటన చేస్తూ వచ్చారు. అయితే ఇదంతా Academic discussion. ఇంత నేపథ్యం ఉంటే కానీ, ఇన్ని విషయాలు తెలిస్తే కానీ సత్యసాయిని అనుభవించటం, సత్యసాయిని experience చేయటం సాధ్యం కాదు. అది కేవలం physical level లో నాకు స్వామికి ఉన్న proximity. నాకు స్వామికి ఉండేటువంటి ఆ-ఒక సంబంధం లేదా నాకు ఏర్పడేటువంటి ఒక చనువు. అది అంతిమం కాదు, అది ప్రాథమికం. అక్కడి నుంచి నేను ఒక స్థాయి పెంచుకోవాలి. పెంచుకొని స్వామి సృష్టించినటువంటి వాంగ్మయాన్ని చదవాలి. మరి రామాయణం ఇంతకుముందు వాల్మీకే రాశాడు. వాల్మీకితో పాటు ఎంతోమంది రాశారు. భారతదేశంలోనే రెండు వందల అరవై రామాయణ-రామాయణాలు ఉన్నాయి. మళ్ళీ స్వామి రామకథా రసవాహిని ఎందుకు రాశారంటే, రాముడే తన కథ రాస్తే అది రామకథా రసవాహిని. అంతకు ముందు వ్రాయబడినటువంటి రామాయణం అది వాల్మీకి రాసిన రామాయణం, అందుకే అది వాల్మీకి రామాయణం. ఇది సత్యసాయి రామాయణం కాదు, రామకథా రసవాహిని. రసో వై సహ, ఈశ్వరుడు రస స్వరూపుడు గనుక, రాముడు అదే గనుక, శంకర భగవత్పాదులు చెప్పినట్లుగా శ్రీరామో లలితాంబికే, కనుక లలితాదేవి, శ్రీరాముడు ఇద్దరుగా కనిపిస్తున్నారా నాకు రెండూ ఒకటేనన్నాడు. ఎందుకని? ఆ రాముడే ఇదిగో మళ్ళీ లలితాదేవిగా వచ్చాడని. ఇన్ని అనేకమైనటువంటి ప్రమాణాలు చెప్తూ భాగవత వాహిని గాని, ఇంకోటి గాని వాహిని స్వరూపాలన్నీ స్వామి యొక్క అంటే పరమేశ్వరుడు స్వయంగా చెప్పినటువంటి వాహినులు అవి. అంటే అదొక సరస్వతీ ప్రవాహం. అది స్వామి యొక్క ఒక పారిశ్రాం. అవన్నీ మనకి జ్ఞాన, విజ్ఞాన, సుజ్ఞాన, ప్రజ్ఞానాలు బోధించటానికి ఇవ్వబడినటువంటి mediums అంటాం వాటిని. అవి మనకి conduits. వాటి ద్వారా వెళితే స్వామి యొక్క పూర్ణ తత్త్వం అర్థం కావటానికి అవన్నీ కూడా అధ్యయనం చేయాలి. అంటే ఏ అవతారం కూడా-- చూడండి రాముడు రామాయణం రాయలే, రాముడు రా-రాముడి జీవితాన్ని వాల్మీకి రాశాడు. యోగవాశిష్టం సంవాదమైంది, వశిష్టులవారికి రాముడికి మధ్య. అది రాముడు రాయలే. భాగవతం కృష్ణుడు రాయలే. భగవద్గీత కృష్ణుడు రాయలే. యాసేన గ్రథిత పురాణమునినా, యాసుడు రాశాడది. మరి ఒక అవతారం ఇన్ని గ్రంథాలు ఎలా, ఎప్పుడు రాశారు? ఇంత సంక్షిప్త సుందరంగా ఎలా రాయగలిగారు? అంటే భగవంతుడు తనను తాను ఆవిష్కరించుకున్న సందర్భాలు అవన్నీ కూడా. మా స్వామి బాగా మాట్లాడారు అది కాదు, ఏం మాట్లాడారు important. ఎందుకు మాట్లాడారు? రెండు. దేనిని ఆశించి మాట్లాడారు? అది కేవలం ఉపన్యాసమా? అది ప్రవచనమా అంటే రెండూ కాదు. అది ఆంతరంగికమైనటువంటి భగవంతుడు తనను తాను ఆవిష్కరించుకున్నటువంటి ఒక వైనం, అదొక విన్నాణం, అదొక skill. దాని ద్వారా మనల్ని భగవంతుని దగ్గరకు చేరువ చేసేటువంటి ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మనం అధ్యయనం చేయటమే గొప్ప అనుకుంటున్నాం, గొప్ప కాదు, చేసి తీరాలి. ఇవ్వాళ మనం పారాయణం చేశామని చెప్పటం కాదు, పారాయణం చేసి తదనుగుణంగా జీవించాలి.సత్యసాయి భగవానుడి సత్యం శివం సుందరం స్వామి జీవిత చరిత్ర అంతా చదివినందువలన ముక్తి ఎట్లా వస్తుంది? స్వామి వలె జీవించగలగాలి. దానిలో ఎలా జీవించాలి స్వామి లాగా అసంభవం కదా అంటే స్వామి పెద్ద ఆసుపత్రి కట్టించారు. ఆసుపత్రిలో మనం ఒక దుప్పటి ఇవ్వచ్చు, ఓ దిండు ఇవ్వచ్చు, పళ్ళు ఇవ్వచ్చు, medicines ఇవ్వచ్చు, చాలా చాలా మనం చేయవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా స్వామి మనకి model సృష్టించి ఇచ్చారు. ఇదిగో నువ్వు సేవ చేయాలంటే ఇలా చేయి, ప్రేమగా ఉండాలంటే ఇదిగో అందరినీ నువ్వు ప్రేమించు, జాతి మత వర్గ వర్ణాలు లేని స్థితిలోకి నువ్వు రా, అహంకారాన్ని నశింపజేసుకో. ఎందుకంటే అహంకారం ఉండనా గురువు చిక్కడు, గురువు చిక్కనా అహంకారం ఉండదు. స్వామి నేను I am the greatest devotee and closest devotee of స్వామి అని నేను చెప్పుకోవచ్చు. కానీ నాలో అహం నశించకపోతే, నాలో జాడ్యాలు పోకపోతే, నేను అత్యంత సాధారణమైన మనిషిగా జీవిస్తే, ఆ గురువుని పొందినా ఒకటే పొందకపోయినా ఒకటే. ఇవ్వేళ స్వామిని కీర్తించటం కాదు, స్వామి ఎలా జీవించారు? కేవలం మానవుడు అనుకుందాం. ఒక మానవుడు చేయగలిగిన పనులేనా అవి? మరి ఎంతమంది పుట్టలేదు, ఎంతమంది గిట్టలేదు ఈ ప్రపంచంలో? రాముడు అంటారా? తొంభై తొమ్మిది మంది ఇక్ష్వాకు రాజుల్లో రాముడు అరవై నాలుగవ రాజు. అంటే రాముడు వచ్చేప్పటికి అరవై మూడు రాజు-- మంది రాజ్యం ఏలారు. కోశాగారం ఉంది, డబ్బుంది, system ఉంది, వ్యవస్థ ఉంది, ప్రజలున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆయన సిద్ధాంతం ఉన్నది, దాన్ని పాలించాడు ఆయన. కృష్ణ పరమాత్మ చుట్టూ కూడా అదే ఉంది. కానీ ఆయన రాజు కాలే, రాజుల్ని చేశాడు. సత్యసాయి భగవానుడు రాజు కాదు, రాజ్యమూ లేదు. ఎటువంటి ప్రదేశంలో పుట్టారు? చుక్క నీరు లేని ప్రదేశం, ఒక్క మెతుకు దొరకని ప్రదేశం, ధాన్యపు గింజ మొలకెత్తనటువంటి ప్రదేశం, పుట్టలు, గిట్టలు మాత్రమే ఉన్నటువంటి ప్రదేశంలో పుట్టి, సర్వ ప్రపంచానికి కూడా ఒక role model గా ఒక గ్రామ వికాసమానమైన గ్రామే-- గ్రామీకరణ ఎలా చేశారని చూసినప్పుడు అది నిజమైనటువంటి, దివ్యమైనటువంటి మహిమ. మనకు ఉంగరం గొలుసు ఇవ్వటం మహిమ కాదు. మన రోగం పోగొట్టటం మన-- భగవంతుడి శక్తి కాదు. అవి నిరూపణాలు కాదు. ఏది నిరూపణ అంటే, అహం సత్య బోధకః. మరి రాముడు వచ్చాడు, ధర్మం, రామో విగ్రహవాన్ ధర్మః. కృష్ణుడు వచ్చాడు, ఇందాక చెప్పినట్లుగా ధర్మగ్లాని జరిగినప్పుడు అందుకే నేను వచ్చాను. మరి స్వామి ఎందుకు వచ్చారు. స్వామి పుట్టపర్తి గ్రామాన్ని విశిష్టమైన ప్రపంచ స్థాయికి చెందిన గ్రామంగా తీర్చిదిద్దటానికి రాలే. ఆయన మనవోటి వారందరిలో పరివర్తన తేవటానికి వచ్చారు. మార్పు రావాలి. మార్పు రానంత కాలం ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా, ఎన్ని గ్రంథాలు రాసినా, ఎన్ని పారాయణాలు చేసినా, ఎన్ని సేవలు చేసినా, మన యందు సహజమైన ప్రేమ గనక లేకపోయినట్లయితే మనం స్వామికి దగ్గరైన వాళ్ళంగా లెక్కలేదు. మనం చెప్పొచ్చు నేను చాలా very close to స్వామి అని, you are not close. ఎప్పుడు close అవుతాం అంటే స్వామి ఏమి చెప్పారో దాన్ని జీవితంలో ఆచరించాలి. దాన్ని అనుష్ఠాన వేదాంత భూమికగా మనం మార్చుకోవాలి. మానవ జీవితంలో అనేక ఎత్తుపల్లాలు ఏర్పడుతాయి, ఖచ్చితంగా వస్తాయి. కానీ ఎత్తుపల్లాలు అన్నింటినీ కూడా సమన్వయం చేసుకొని, జీవితం ఒడ్డొరిసి ప్రవహిస్తున్నటువంటి వేగాన్ని తట్టుకొని, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి, దేవుడున్నాడు అనేటువంటి ఒక విశ్వాసంతో గనక ఉండి ధర్మం-- సత్యాన్ని అనుభవిస్తూ శాంతి ప్రేమలని ప్రపంచానికి పంచి పెడుతూ ఉండగలిగినట్లయితే అది సర్వోత్తమమైనటువంటి-- ఆ స్థాయికి వెళ్ళమని చెప్పటానికే స్వామి ఇన్ని వ్యవస్థలని, అవస్థలో కూరుకుపోయిన మానవుడి కోసం నిర్మాణం చేశారు. మనం సేవ ద్వారా అహంకారాన్ని గనక పెంచుకున్నట్లయితే ఆ సేవ చేయకుండా ఉండటమే ఉత్తమం. అందుకనే పద్దెనిమిది పురాణాల సారాన్ని మనకు అర్థం అయ్యేట్లుగా Help ever hurt never ఇది ఒక slogan కాదు. ఇది display చేసేటువంటి quote కాదు ఇది. ఇది ఏమిటి అంటే, జీవన సూత్రం, ఆధ్యాత్మిక సూత్రం. అంత తేలికగా అర్థమయ్యేది కాదిది. ఆ-- చెప్పడానికి చాలా తేలికగా అనిపిస్తుంది. కానీ ఆచరించటం ప్రారంభించినప్పుడు చాలా కష్టం. మనలో ఉన్నటువంటి negativities అన్నీ బయటకు వస్తాయి. ఎవరినీ ప్రే-- పరిపూర్ణంగా ప్రేమించలేం. నేను చేశాను అనకుండా ఉండలేము. అన్నీ నేనే చేశాను, నేను కూశాను, నేను గీశాను, నేనే రాశాను అని చెప్తూ ఉంటాం. మరి అహం ఎక్కడ పోయింది? పోనే లేదే. నేను అనే కర్తృత్వ భావన doership నాయందే ఉన్నదే. మరి ఇది భగవంతుడు చేయించాడు, దానిలో నేనున్నాను అనుకోవటం ఒక ఎత్తు. అసలు నేను ఉన్నాను గాక, అది భగవంతుడే, రాయబడింది ఆయనే, అనబడింది ఆయనే, ఉన్నదంతా బ్రహ్మమే అనేటువంటి భావనలో గనక మనం వెళ్లగలిగినట్లయితే అది నిజంగా మనం స్వామిని అనుభవించి స్వామికి దగ్గరగా వెళ్లినటువంటి ఒక విషయం కావాలి. తర్వాత ఎంత-- స్వామి చూడండి, ప్రశాంతి నిలయంలో ఇవాళ మనకు మీడియా సెంటరు, అంతకు ముందు రేడియో సాయి రూపంలో ఉంది. ఇవన్నీ అవసరమా, ఎందుకు చేశారు అంటే స్వామి చెప్పారు, సామాన్యమైనటువంటి మానవుడి దగ్గర నుంచి చాలా పెద్దవాడి వరకు సమాజ గతురల్ని, రీతులని, పోకడలని అర్థం చేసుకుంటూ ఎప్పటికప్పుడు update చేసుకుంటూ వెళ్ళాలి. మోడర్నైజ్ కావాలి, అంతేగాని వెస్టర్నైజ్ కాకూడదు. చూడండి, మోడర్నైజ్ కావాలి. నేను ఇక్కడి నుంచే నడిచి కాశీ వెళ్తానని ఇప్పుడు అనక్కర్లా. కాశీ వెళ్ళటానికి బోలెడు అవకాశాలున్నాయి. దాన్ని మనం వాడుకోవాలి. ఇవాళ ఇక్కడ June meeting లో ఇక్కడి నుంచి ఒక లక్ష మందికి తర్వాతైనా వాళ్ళు చూస్తారు.అంటే ఒక technology ఏదుందో దాన్ని మనం వాడుకోవాలి. తప్పు కాదు, పాపం కాదు. కాదు నేను అక్కడికే చెన్నయ్యే వచ్చి మీరు ఎక్కడ కూర్చోబెడితే అక్కడే మాట్లాడతానని నేను అనక్కర్లా. అంటే Technology is also a human excellence. దీన్ని ఎలా వాడుకుంటాం అనేది మన మీద ఆధారపడి ఉంది. కనుక మానవుడిలో పరివర్తన రావటానికి ఈ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఆ-రామాయణాది గ్రంథాలు, కావ్యాలు, ప్రబంధాలు, ప్రవచనాలు ఇవన్నీ కూడా ఎందుకని స్వామి కూడా తెలుగునాట పుట్టి అంటే తెలుగునాట ఒక అవతారాన్ని ఎత్తి వచ్చినందుకు తెలుగు భాషని విశ్వవ్యాప్తం చేశారు. ఆయనకి English రాక కాదు, ఇంకో భాష రాక కాదు, ఏ భాషలోనైనా వెంటనే transmit కాగలిగినటువంటి శక్తివంతమైనటువంటి స్వామి తాను మాట్లాడినప్పుడు మాత్రం తెలుగులోనే మాట్లాడారు. అవతరించ నేడు ఆంధ్రదేశము నందు జగతిన్ ఉద్ధరింప సత్యసాయి ఆతడు పణ్యసింప యావత్ ప్రపంచాన దేవభాష అయ్యే తెలుగు నేడు. దేవతలంతా సంస్కృతం మాట్లాడతారు అని విన్నాం. అమర భాష, అమృత భాష అని. మరి సత్యసాయి భగవానుడు తెలుగు భాషలో మాట్లాడినందువలన ఈ తెలుగు అమృత భాష అయింది. తెలుగు స్వామి మాట్లాడారు గనుక దే-దేవభాష అయింది. ఎందుకు ఆయన దేవుడు గనుక. కనుక ఇటువంటి వాటన్నింటినీ కూడా కేవలం ఎనభై ఆరు సంవత్సరాల అవనీ సంచారంలో స్వామి తన దివ్యత్వాన్ని ఎన్ని రకాలుగా ప్రపంచానికి చూపించవచ్చునో, బహిర్గతం చేయవచ్చునో ఇవన్నీ చేస్తూ సర్వోత్తమమైన స్థితికి మానవుడు వెళ్ళాలి. ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే స్వామి అవతార ప్రకటన చేసిన తొలినాళ్లలో ఎవరు వెళ్లారు ఆయన దగ్గరికి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానంగా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వేదపండితులు, బాగా చదువుకున్నవారు, విశ్లేషించగలిగినవారు, విద్యాధికులు, తర్వాత మంచి సాధకులు వీళ్లంతా వెళ్లారు. వెళ్లి స్వామిని ఒక ప్రశ్న వేశారు. అధ్యాత్మ అంటే ఏమిటి అసలు? స్వామి చెప్పారు "ఏమీ లేదు ప్రవృత్తి మార్గంలో నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్లేదే అధ్యాత్మ". వాళ్ళకి అది అర్థమైపోయింది. ప్రవృత్తి అంటే ప్రాపంచికమైన భావనతో ఉండి అక్కడి నుంచి నివృత్తిలోకి వెళ్లటం. ఇది కాదు అసలుదది పట్టుకోవటం. ఒక పదిహేనేళ్ల తర్వాత మళ్లీ అదే ప్రశ్న మళ్లీ ఒక group అడిగినప్పుడు ఇదే చెప్పలేదు. ప్రభావంలో నుంచి స్వభావంలోకి రాగలిగితే దాని పేరు అధ్యాత్మ అన్నారు. మనకి ప్రభావాలున్నాయి. బంధువులనండి, స్నేహితులనండి, మన చుట్టూ ఉన్న వాతావరణం అనండి, సమాజం అనండి ఆ ప్రభావానికి మనం లోనవుతాం. కాదు నువ్వు ఆత్మ అన్నటువంటి నిలకడ చెందిన భావనలోకి వెళ్లగలిగితే వెళ్లటానికి మార్గమే అధ్యాత్మ అని. స్వామికి సుమారుగా శరీరానికి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు మళ్లీ ఇదే ప్రశ్న వేశారు. వేసినప్పుడు మొదటిది చెప్పలేదు. ఏదీ ప్రవృత్తి నుంచి నివృత్తి అనలేదు. ప్రభావం నుంచి స్వభావం అనలేదు. స్వామి ఈ ప్రపంచాన్ని క్షుణ్ణంగా గమనించి ఓ మాట చెప్పారు. మానవుడు కనీసం మానవుడిగా జీవించగలిగితే దాని పేరు అధ్యాత్మ అని. అంటే మానవుడు మానవుడిగా కూడా జీవించడం మరచిపోయినటువంటి స్థాయిలో ఆ సందర్భంలో, సన్నివేశంలో స్వామి ఈ మాట మనకి చెప్పారు. అంటే ఇవాళ అధ్యాత్మ అంటే spirituality మీద గంటలు ఎచ్చరిస్తే ఉపయోగం లేదు. spirituality మీద ఒక పుస్తకం రాస్తే ఉపయోగం లేదు. spirituality ఒక జీవన విధానం కావాలి. దానికి religion అనేటువంటిది ఆ-చాలా అడ్డంకి. gate ఆ పడిపోతూ ఉంటుంది. మనల్ని ఒకచోట ఆపేస్తుంది, కట్టేస్తుంది. నువ్వు Christian వి, నువ్వు Muslim వి, నువ్వు Hindu వి, నువ్వు Zoroastrian వి అని అక్కడక్కడా cult లో ప్రవేశపెట్టేది religion అయితే culture లోకి తీసుకుని వెళ్ళేది spirituality. అదే అధ్యాత్మ. కాబట్టి ఇటువంటి అధ్యాత్మని ఎట్లా చెప్పాలి? నిష్ఠురంగా చెప్పాలా, నెమ్మదిగా చెప్పాలా, ప్రసన్నంగా చెప్పాలా అంటే యదార్థంగా చెప్పాలి. యదార్థం అనేదానికి మూల శబ్దమే సత్యము. అటువంటి సత్యాన్ని, ఇటువంటి సత్యాన్ని మానవుడు మానవుడిగా జీవించగలిగిన మార్గానికి సత్యమే మార్గము, ధర్మమే ఆచరణీయమైనటువంటి విధానము, శాంతి ప్రేమలే మానవుడి యొక్క ప్రవృత్తి, నివృత్తి మార్గాలు అని చెప్పటానికి నేను వచ్చాను అని స్వామి నిర్ద్వందంగా "అహం సత్యబోధకః". ఆ సత్య అనేటువంటిది శివుడి యొక్క ముప్పై రెండు aspects లో ఒకటి. సత్య అనేది శివుడి యొక్క పేరు. మాహేశ్వరా ఒక పేరు. రుద్ర అది గణం. మహారుద్ర, శివ, సదాశివ. ఈ శివుడు, రుద్రుడు వీళ్లంతా గణాలు. అసలు శివుడు ఎవరంటే సదాశివుడు. సదాశివోక్తాని సపాదలక్ష లయావధానాని వసన్తి లోకే నాదానుసంధాన సమాధిమేకం మన్యామహేం అన్యతమం లయానాం. లక్షా ఇరవై ఐదు వేల లయావధానాలున్నాయి. వాటిల్లో నాదానుసంధాన యోగమే అత్యున్నతమైనదని చెప్తూ నాదము సంగీతం కాదు, నాదము నాదమే. ఎక్కడ పుడుతున్నది అంటే అనాహతంగా పుడుతున్నది గనుక మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారాలు దాటి అక్కడికి వెళ్లటానికి, మార్గోపదేశనం చేయటానికి వచ్చినటువంటి ఒక ఉదాత్త వైఖరి. ఆ వైఖరి ఏది అంటే భగవాన్ శ్రీ సత్యసాయి. మరి వైఖరి అని ఎందుకన్నామంటే ఏ విషయం చెప్పాలన్నా నాలుగు స్థాయిలున్నాయి. పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరి. పరా చూడవలసిన దానిని, పశ్యంతి చూసి, మధ్యమా అనుభవించి, వైఖరి చెప్పాలి. ఎందుకని తాను అదే గనుకతానేదో ఈ ప్రపంచానికి చెప్పాలి గనుక మళ్ళీ మనవంటి ఒక మానవ దేహాన్ని తీసుకుని వచ్చి ఒక కాల నిర్ణయం ప్రకారంగా తాను ఎందుకు వచ్చారో ఏం చేయాలనుకున్నారో చేసి మనందరికీ మార్గోపదేశనం చేసి ఇదిగో ఉదాత్త మానవులుగా జీవించండి ఉత్తమ మానవులుగా జీవించండి ప్రేమతో జీవించుకోండి ప్రేమగా బతకండి సేవ చేసుకోండి తద్వారా అహంకార మమకారాలు తగ్గించుకోండి మమతని పెంచుకోండి మమకారాన్ని తగ్గించుకోండి ఎందుకంటే అహం మమత్వ శిధిలాయమణి అహం పోవాలి మమత్వం పో మమత్వం అంటే నాది మమత అంటే బ-బంధం మమకారం అంటే వదిలిపెట్టలేనిది విడిచిపెట్టలేనిది వదులుకోలేనిది గనుక ఈ అహంకార మమకారాలు రెండు వదులుచుకోవటానికి మీరు సత్య మార్గంలో ప్రవేశించండి ఇదిగో నా జీవితమే ఒక ఉదాహరణ మీరందరూ కూడా నా message ప్రపంచానికి తీసుకు వెళ్ళటానికి మీరు దూతలుగా నాకు అవసరం లేదు ఏం చేయాలంటే నా message ఏమిటో దాన్ని మీరు జీవించటం మొదలు పెట్టండి చాలు నాకు మీరు దూతలుగా వెళ్లి స్వామి ఇట్లా స్వామి ఎట్లా అని నేను ఎన్ని దేశాలు నూట అరవై ఎనిమిది దేశాలు వెళ్లినా నేను నేనుగానే గనక మిగిలిపోయినట్లయితే ఏం ప్రయోజనం లేదు ఊరికే వాక్చాతుర్యంతో నెగ్గుకొచ్చాం అంతే అదేనా కాదు కదా నాలో ఏ పరిణామం జరిగింది పుట్టపర్తి లేకపోతే సత్యసాయి భగవానుడి గురించి విశేషం విన్నప్పుడు ఆయన పటాన్ని ఎవరో మనకి చేతికి ఇచ్చినప్పుడు విభూతి మహిమను మనకు చెప్పినప్పుడు దానిని జీవితంలో అనుభవించటం నెమ్మది నెమ్మదిగా ప్రారంభించినప్పుడు జీవితంలో ఏర్పడే అనేక ఘర్షణలు అనేక సంఘటనలు అనేక వైరుధ్యాలు అనేక వైవిధ్యాలు వీటన్నింటినీ ఎదుర్కుంటున్నప్పుడు ఈ సత్యసాయి భగవానుడు బోధించినటువంటి బోధ నాకు ఊతమై నిలబడిందా? చేతనై నిలబెట్టిందా? అని ప్రశ్న వేసుకుంటూ నన్ను నేను నిలబెట్టుకోగలిగినటువంటి స్థాయిలో సత్యసాయి భగవానుడి యొక్క దివ్యాత్మను నేను గనక గ్రహించగలిగినట్లయితే అప్పుడు నేను నిజంగా స్వామిని అర్థం చేసుకున్నట్లు లెక్క నేను ఎన్ని పనులు చేశానని కాదు ప్రధానం కాదు ఏ భావంతో చేశాను ఆ చేస్తున్నప్పుడు ఎవరిని హృదయంలో పెట్టుకొని చేశాను ఎవరికోసమై చేశాను ఎవరిని సంతృప్తి పరచడం కోసా చేశాను అని ప్రశ్నలు వేసుకున్నట్లయితే ఏది చేసినా సత్య బోధకుడైనటువంటి స్వామికి ఆనందం కలిగించే దిశగా మన జీవితాలు నడవాలి ఎందుకంటే మనకి ప్రవృత్తులున్నాయి నివృత్తులు లేవు మన అనేక visions లేవు divisions తప్పకుండా ఉన్నాయి fusions లేవు confusion తప్పటం లేదు మరి వీటన్నింటినీ ఎలా అధిగమించాలి అంటే స్వామి జీవితాన్ని చాలా దగ్గరగా పరిశీలించాలి అధ్యయనం చేయాలి ఊరికే చప్పట్లు కొట్టి వెనక్కి రావటం కాదు లేదు ప్రచార సభల్లో పాల్గొనటం కాదు భజన ఎందుకు చేయాలి సాహిత్యం ఎందుకు చదవాలి ప్రశాంతి నిలయానికి ఎందుకు వెళ్ళాలి ప్రశాంతి నిలయానికి వెళ్లి మనం అంటాం recharge చేసుకొని వచ్చామండి అందుకని వెళ్ళామని recharge స్వామి ఒకసారి అన్నారు ఎవరితోనో కాదు ఇవాళ మొట్టమొదటిసారి నా జీవితంలో చెప్తున్నాను నా చదువు పూర్తయ్యి ఉద్యోగానికి వెళ్తున్న సమయంలో ప్రశాంతి నిలయంలో స్వామి నాకిచ్చిన మహత్తర సందేశం ఒకటుంది నీవు పదే పదే పుట్టపర్తికి రావలసిన పని లేదు నీవు ఎక్కడ ఉన్నావో నేను అక్కడ నీతో ఉంటాను నేను ఉన్నాను అన్న భావనతో నువ్వు జాగ్రత్తగా ఉండు స్వామి లేని ప్రదేశం అంటూ లేదు కానీ అవసరమైనప్పుడు అవకాశం ఉన్నప్పుడు వీలు చూసుకొని కాదు వీలు చేసుకొని పుట్టపర్తికి రా రావొద్దన్నది స్వామి పదే పదే రావొద్దు కానీ వీలు చేసుకొని రా ఎందు-- భగవంతుని యొక్క ఆవరణ నుంచి మనం గనక దూరమైనట్లయితే మనలో అంత ఎడబాటు ఏర్పడుతుంది ఆ ఎడబాటు నెమ్మదిగా అగాధం అవుతుంది ఆ gulf పెరగకూడదు కనుక మనం నిత్యానుసంధాన స్ఫూర్తికై మనం పుట్టపర్తికి వెళ్ళాలి వెళ్లి ఒక పరమాత్మ అవతరించిన ప్రదేశం అది ఇప్పుడు తిరుమల కొండ ఉంది ఎన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాలు లేవు మన ఊర్లోనే నాలుగు ఉన్నాయి కానీ అవి తిరుపతిలు కావేయే పుట్టపర్తి సత్యసాయి భగవానుని మందిరాలు ఎన్ని లేవు కానీ అది పుట్టపర్తి కాదే అందువల్ల మనం పుట్టపర్తికి వెళ్ళాలి ఆ పుట్టపర్తి అవతారమూర్తి ప్రభవించినటువంటి దివ్య ప్రదేశం మిగతావన్నీ branches స్వామి యొక్క దివ్య వైభవం అంతా కూడా vibrations అవి అక్కడ ఉంటాయి అవి మనం ఏదో పట్టుకొని వచ్చేవి కాదు recharge ఎలా అవుతుందంటే ఆవరణలోనే ఉంటే ఇనుప చిన్న రజను ఆ-ఆకర్షణ వలయంలోకి magnetic field లోకి వెళ్ళగానే ఎలాగైతే ఆ field లో magnetic power మనల్ని ఆకర్షించి మనల్ని magnets గా తయారు చేస్తుందో అందుకై ప్రశాంతి నిలయానికి మాత్రమే వెళ్ళాలి మన-మన మిగతా మందిరాలకు భజనకి వెళ్ళాలి చూసి రావాలి సేవా కార్యక్రమాలు చేయటానికి పుట్టపర్తిలో చేయాలి ఇక్కడ చేయాలి పుట్టపర్తిలో జరిగేటువంటి కార్యక్రమాలలో సేవ చేసేటువంటి భాగ్యం మనం కోరుకోవాలి అక్కడ అత్యంత సులభంగా దొరికేది కాదు దానికై స్వామి అన్నారు మీరు డబ్బు కోసం ఏడుస్తున్నారు భార్య పోతే భర్త భార్య కోసం ఏడుస్తున్నాడు భర్త పోతే భార్య ఏడుస్తున్నది బిడ్డలు పోతే తల్లిదండ్రులు ఏడుస్తున్నారు అందరూ ఏడుస్తూనే ఉన్నారు కానీ భగవంతునికై కన్నీరు కార్చిన వారు ఒక్కరు ఉన్నారా చూపించమని అడిగారు లేరు ఇది-ఇది answer అలాగే స్వామి అరవై సంవత్సరాలు శరీరానికి వచ్చినప్పుడు ఒక మాట మహా పరి నిర్వేదంతో ఓ మాట చెప్పారురోజు నాకు ఉత్తరాలు ఇస్తారు. ఆ ఉత్తరాలన్నీ నేను చదువుతాను. అందులో నా పిల్లవాడికో, పిల్లకో భవిష్యత్తు బాగుండాలని, చదువు బాగా రావాలని, పెళ్లి కావాలని, విదేశాలకు వెళ్లాలని, నా భర్తకు రోగం పోవాలని, రుణబాధ తీరాలని, ఇవే ఉన్నాయి తప్ప ఏ ఒక్క తల్లి నుంచి గాని తండ్రి నుంచి గాని ఈ ఉత్తరం రాలేదు. ఏమిటా ఉత్తరం అంటే, "స్వామి! నా కడుపున పుట్టిన బిడ్డ ఉత్తమ మానవుడు అయ్యేట్టుగా చూడమని" ఒక్కళ్ళు ఇంతవరకు రాయలేదన్నారు. ఇవాళ మనం మన పిల్లలకి వారసత్వాన్ని ఇస్తున్నాం. వారసత్వం అంటే ఏమిటి? ఆస్తి ఇస్తున్నాం. అది కాదు ఇవ్వవలసింది. సత్యం ఏమిటో మనం కూడా బోధించాలి. మనం జీవిస్తేనే బోధించగలం. బోధించడానిక-కట్ అండ్ పేస్ట్ టెక్నాలజీతో వాడు ఇలా అన్నాడు, వీడు ఇలా అన్నాడు దాని వల్ల ప్రయోజనం లేదు. మన జీవితానుభవాన్ని రంగరించి మన కడుపున పుట్టినటువంటి బిడ్డను ఉత్తమ మానవుడిగా తీర్చిదిద్దే దిశలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ భగవంతుడున్నాడు, స్వామి ఉన్నాడనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో బిడ్డని మనం తీర్చిదిద్దాలి. దానికి అందుకే స్వామి చిన్నప్పుడే వాళ్ళకి వేదం నేర్పండి. ధారణా శక్తి పెరుగుతుంది. ఉపనిషత్తులు చెప్పండి. వాళ్ళకు ఉచ్చారణ వస్తుంది. రామాయణం చెప్పండి. చదివి వినిపించండి. కథ చెప్పండి. వాడు రాముడి గుణాలన్నీ కూడా లోపలికే ఆవాహన చేసుకుంటాడు. కృష్ణుడి యొక్క దీ శక్తి, లీలా మానుషమైన శక్తి, భగవద్గీత ద్వారా జ్ఞాన శక్తి, ఇవన్నీ కూడా మనం పంచిపెట్టవలసి ఉన్నది. చివరికి కడగా శంకరులు బోధించిన అద్వైతమే ప్రపంచానికి అక్కరకు వస్తుందని చెప్పండి. విభజించే దేనివైపు మీరు వెళ్ళకండి. నిరంతరము మానవుడిగా పుట్టినందుకు భగవంతుణ్ణి భజించండి. భజించటం అంటే స్మరణ. భజ అంటే ఆ-భజన కాదు. భజ వేరు, భజన వేరు. భజన చేసేది. భజ అంటే స్మరణ. అది నిరంతర స్మరణ కావాలి. Inadvertent గా కూడా జరగాలి. పనికి, పనికి మధ్యమున్న విరామ కాలంలో భగవన్నామస్మరణ చేసుకోవాలి. నామం చేసుకోవాలి, జపం చేసుకోవాలి అన్నీ అవే. జపం అంటే ఏముంది? నామాన్ని అనుకుంటూ ఉంటే జపం ఏర్పడుతుంది. మంచి మాటలు అనుకుంటూ ఉంటే మాటలు మంత్రాలు అయిపోతాయి. మననాత్రాయతే ఇతి మంత్రః ఇటువంటి అనేక కొన్ని వేల, వేల విషయాలు స్వామి సత్య బోధకుడిగా ఈ ప్రపంచానికి అందించి మానవుడిలో ఉన్నటువంటి అనేక దుర్గుణాలు అన్నింటినీ కూడా పక్కకు నెట్టి, వాడిలో ఉన్నటువంటి కొన ఊపిరితో ఉన్నటువంటి కొంత మంచితనం ఉంటే దానికి ఊపిరి పోసి, ఊది, ఊది జ్వాజ్వల్యం చేసి, ప్రజ్వలనం చేసి, సర్వోత్తమమైన మానవుడిగా తీర్చిదిద్దేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు మానవజాతికి. కనుకనే ఇవాళ స్వామి విద్యార్థులు అక్కడికి వెళ్ళి ఆ పిల్లల్ని చూసినప్పుడు-- ఆ అవకాశం లేకపోతే ఇప్పుడు నా బోటి వాడిని నేను స్వామి స్కూల్లో చదవలేదు. కానీ నన్ను ఏ దేశంలో ఎవరైనా "Are you a student of Sathya Sai?" అని అడుగుతారు. మరి నిజం చెప్పాలి కదా? "I am not a direct student of Sathya Sai but I belong to his school of thought" అని answer ఇస్తుంటా. విద్యార్థిగానే ఉండక్కర్లా. విద్యార్థిగా ఉండి సక్రమంగా లేకపోతే అది నిరుపయోగం. విద్యార్థి కాకపోయినా స్వామిని గురించి విని, కని, చదివి, అనుభవించి, అనుభూతి చెంది నిరంతరము ఇది పరమాత్మ స్వరూపమే. కాకపోతే మానవ దేహం తీసుకుని వచ్చి ఎంతమంది రాలేదు, ఎంతమంది ఇక్కడి నుంచి వెళ్ళలేదు, ఏ ఒక్కడైనా ఈ ప్రపంచాన్ని గురించి పట్టించుకున్నాడా అంటే పట్టించుకున్న వాడే లేడు. అందుకనే లలితాదేవి ఒక పార్శ్వంలో దత్త స్వరూపం అన్నప్పుడు ఇందాక చెప్పిన శ్రీపాద శ్రీవల్లభుడు, అక్కలకోట మహారాజు, నృసింహ సరస్వతి, షిరిడి బాబా కోవలో దత్త స్వరూపంగా స్వామి గనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఆయన నిజానికి దత్తము చేసుకున్నారు. దేనిని? జగత్తుని, జనులని. అందరినీ తనవారిని చేసుకున్నారు. తన వారితోనే ఉన్నారు. తనవారు అనుకున్నటువంటి బంధువులతో వారెక్కడా లేరు. కనిపించిన ప్రతి ఒక్కరినీ తనవారిని చేసుకున్నారు. జన జగత్తులతో లీలావిలాసంగా, మధుర మనోహరంగా, సర్వజన మనోల్లాస పులకిత పుంభితంగా, పరిపూర్ణంగా, సంపూర్ణమైన ఆనంద మహాసముద్రంగా స-సత్యసాయి భగవానుడు ఈ ప్రపంచానికి చెయ్యనిదంటూ లేదు, చెప్పనిదంటూ ఏమీ లేదు. చెప్పవలసినవన్నీ చెప్పారు, చేయవలసినవన్నీ చేశారు. ఇవాళ మనమేం చేయాలన్న ప్రశ్న దగ్గర మనం ఆగాలి. మన జీవితాలు ఇక్కడ ప్రారంభం కావాలి. నా స్వామి ఏమి చేశారో ఆ బాటలోనే నేను సేవా కార్యక్రమాలలో ఉంటా. నా స్వామి ఏవి బోధించారో తదనుగుణంగా నా జీవితాన్ని నేను సాగిస్తా. నా స్వామి నాకు ఏమి చేయకూడదని చెప్పారో దానిని ఎన్నడూ నేను దానిని ముట్టను. ఎవరినీ ద్వేషించద్దు అని స్వామి చెప్పినప్పుడు ద్వేషిస్తున్నది ఎవరినీ? నాలో, నీలో, అంతటా, అన్నిటా నిండి ఉన్నటువంటి ఆత్మే అని అనుకున్నప్పుడు ఎవరిని నిందిస్తున్నాం అంటే అహంకార ప్రవృత్తి చేత, అసూయ చేత, మాత్సర్యం చేత, అరిషడ్వర్గాల ప్రభావిత్- ప్రభావం చేత మనం మరొక మనిషిని అంచనా వేస్తాం, అవమానపరుస్తాం, మనం కించపరుస్తాం. ఇవన్నీ దుర్గుణాలన్నీ వదులుచుకోవాలి అంటే సత్యసాయి భగవానుని యొక్క organization మాత్రమే శరణ్యమని నేను ఉ- నూటికి నూరు పాళ్ళు కాదు, నూటికి వెయ్యి పాళ్ళు ఉంటే ఆ వెయ్యి పాళ్ళు నమ్మి, ఈ organization అందరూ కూడా సంస్థలు పెడతారు, ట్రస్టులు పెడతారు. కానీ ఒక సేవకి organized సేవ చేయటమే సేవా organization. Organized అంటే మనసేకం, మత్స్యసేకం, కర్మణ్యేకం మహాత్మనా. ఏమంటున్నామో, ఏమి ఆలోచించామో అది అనాలి, ఏమన్నామో అది చేయాలి. ఈ మూడు కలిపితే వాడు మహాత్ముడు అవుతున్నాడు. మహాత్ముడు అంటే గొప్పవాడు కాదు.All great men are not necessarily to be good but all good men are great అన్నారు స్వామి. మంచివాడే సర్వోత్తముడు. సర్వోత్తముడుగా కనిపించే ప్రతి వాడు మంచివాడు కాకపోవచ్చు కాబట్టి విచక్షణ ద్వారా, వివేకం ద్వారా, విజ్ఞానం ద్వారా, ప్రజ్ఞానం ద్వారా మనల్ని మనం విశ్లేషించుకుంటూ జీవితాన్ని ధన్యవంతం చేసుకోవాలి. ఇవాళ మనం చేయవలసిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి. ఇగో ఒక ఏడాదిలో మనం స్వామి ఈ అవని సంచారానికి వచ్చి వందేళ్లు కావస్తున్న సందర్భంలో శతజయంతి సందర్భంలో ప్రతి ఒక్క వ్యక్తి, భక్తుడని నేననను, ప్రతి ఒక్క వ్యక్తి కంకణధారి కావాలి. ఏ కంకణం? ఏం కట్టాలి? నాకు ఆస్తులు పెరగాలి, నాకు degrees రావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి కాదు. స్వామి! నువ్వు కావాలి. నువ్వే కావాలి. నువ్వే నా వాడివి అయిన తర్వాత నాకు ఇంకా మిగతా వాటితో నిమిత్తం లేదు. నీవే నా వాడివి అయిన తర్వాత సర్వ సంపదలు నా వెనక నడిచేస్తాయి. సర్వ వాఙ్మయం నా వెనక నడిచేస్తుంది. సర్వ వేదాలు నాకు కావలసినప్పుడల్లా స్పురణకు వస్తాయి. ఉపనిషత్ వాక్యాలు నాకు మనసుకు తాకి బహిర్గతమవుతాయి. నేను కేవలం ఒక ఉపాధి మాత్రమే. ఈ ఉపాధి ద్వారా నీవు ప్రవేశించి, నాలో ఆవేశించి, నా జీవితాన్ని నువ్వు నడుపు. ఇది నాకు కావలసింది. నీవే తప్ప ఇతఃపరం విరుగా. దాన్నే త్వమేవ శరణం మమ. నీవు తప్ప శరణం లేదు. నేను సమర్పిద్దాం అంటే నాదంటూ ఏం లేదు. నన్ను నేను సమర్పించుకోవటమే. మళ్ళీ ఈ ద్వైతంలో నుంచి నన్ను నీవు రెండుగా లేను స్వామి. నేనే పుష్పము, నీవే సౌరభము తండ్రీ! లోక లోకాంతర ప్రాణముల్ పలు శ్రేణులు దళములై విరియగా. అంటే నువ్వు పుష్పాన్నివి, నేను తావిని. లేదా నేను పుష్పాన్ని, కనిపిస్తున్న పుష్పాన్ని, కనపడని పరిమళాన్నివి నువ్వు. నేను ఒక బంగారాన్ని, దానికున్న శక్తి, దానికున్న విలువ అదే నువ్వు. కాబట్టి కనిపిస్తున్న ఈ భౌతికమైనటువంటి ప్రతి వస్తువు వెనక, ప్రతి వస్తువు లోపల నాతో సహా అన్నిటా అంతటా నిండి ఉన్న నివిడీకృతమై ఉన్నటువంటి ఏ దివ్య సత్యసాయి మహా శక్తి ఉన్నదో అది నా యందు ప్రవేశించు గాక. నేను ఈ ప్రపంచానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి సాధనా మార్గంగా ఉండు గాక. నేను నేర్చిన లౌకిక విద్యలన్నీ అధ్యాత్మ వైపు నడిపించు గాక. నేను చేసినటువంటి అనేకమైన కార్యక్రమాలన్నీ నీకు నైవేద్యమై పోవు గాక. ఇవన్నీ మనం శాసనం చేసుకోవాలి. అలాగే మనకున్నటువంటి ప్రజ్ఞ, మనకున్నటువంటి సంపద, మనకున్నటువంటి అనేక శక్తులు, ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులు వీటన్నింటినీ కూడా పరమేశ్వర ప్రీత్యర్థం వాడాలి. మరి ఈ పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? సాయయే ఉన్నాడు. మరి సాయి ఎక్కడున్నారు? ఇందాకే చెప్పారు సర్వ హృదయంబుల నిండి ఉండునను సత్యము తెలుపగా ఈ కనిపిస్తున్న ప్రపంచమంతా కూడా పరమేశ్వరుడి యొక్క విభూతిగా భావన చేసినట్లయితే ఒక ఆకుని ముట్టుకున్నా, ఒక చిన్న పక్షిని చూసినా, మానవుణ్ణి చూసినా, ఏ వస్తువును చూసినా దాని యందు భగవంతుని యొక్క దర్శనం నాక్ గనక కలిగినట్లయితే ఆనాడు నేను నిజమైన సత్యసాయి భక్తుడిగా అప్పుడు నేను, భక్తి అంటే ఏమిటి? భ అంటే ప్రకాశం, కతి అంటే కూడి ఉండటం. నేను ప్రకా-- నేను వేరు, ప్రకాశం వేరు అంటున్నాం. స్వామే అన్నారు, మీరు నేను ఒకటేనని నేను చెప్తూ చెప్తూ ఉన్నాను, కాదు స్వామి మీరు వేరు, మేము వేరు అంటున్నారు. ఇది కుదరదు. మీరు నేను ఒకటే. త్వమేవాహం న సంశయః. సందేహమే లేదు. నువ్వు నేను ఒకటే. ఆ నువ్వుగా కనబడుతున్న దాంట్లో కూడా నేను ఉన్నాను, నేనుగా కనబడుతున్న నాలో కూడా నువ్వు ఉన్నావు. కనుక ఈ రెండూ లేవు. మాట్లాడుకోవటానికి వీలైన రెండు పదాలే తప్ప ఉన్నది ఒక్కటే. అఖండమై, చిద్ఘనమై, అవ్యయమై, అచ్యుతమై, నిరతిశయమై, పరిపూర్ణమై, శాశ్వతమై, దివ్యమై, నవ్యమై, భవ్యమై ఉన్నటువంటి ఆ ఆత్మ నీవు అనుకున్నటువంటి భావనతో నువ్వు ఉండగలిగితే అది నిజమైన ఆత్మసాక్షాత్కారంగా భావన చేయమని పరమేశ్వరుడైనటువంటి స్వామి మనకు ఎన్ని విధాల బోధించారో వాటన్నింటినీ మనం గమనించుకుంటూ ఉన్నట్లయితే అది నిజమైనటువంటి సాధన. సత్యబోధ అంటే ఇదే. సతతము ఉండేది సత్యం. అందుకనే చూడండి ధర్మము మారదు. విలువలు, అవసరాలు మారతాయి. మరి సత్యము అంటే ఏమిటి? సతతము ఉండేది సత్యం. సత్ అనేటువంటి ఒక, ఇవాళ మనం Big Bang Theory లో శూన్యంలో నుంచి పుట్టింది అని చెప్తున్నాం. ఆ శూన్యం పేరే సత్యం. కనిపిస్తున్న సత్యసాయి భగవానుడు శూన్యం. కనిపించని శూన్యంగా ఉన్న సత్యసాయి భగవానుడు స్ పూర్ణం. కాబట్టి శూన్య పూర్ణాలు రెండూ ఏకంగా ఉన్నటువంటిది గనుక దాని పేరు సత్యము. అది ఏదో 1926 లో వచ్చి, ఆ 1900, 2011 లో వెళ్ళిపోయింది కాదు. ఉండటానికి వచ్చింది. మనల్ని ఉంచటానికి వచ్చింది. నిలబెట్టడానికి వచ్చింది. నిలబెట్టి మన గతిని, మన ప్రవర్తనని, మనలో వస్తున్న పరిణామ సహమైన జీవన విధానాన్ని చూసి మీ ఆనందమే నా ఆహారం అన్నటువంటి స్వామికి ఆహారం ఇవ్వాలి తప్ప మనం తినబోయేది బెంగుళూరులో ఆ స్వామి కూర్చొని ఉండగా, ఆ ఇదిగో ఈ ప్రవచనం అయిపోయిన తర్వాత స్వామికి బ్రహ్మార్పణం చెప్తాం కదా, ప్లేటు 20 ప్లేట్లో అవన్నీ తీసుకొచ్చారు. పెట్టి బ్రహ్మార్పణం అని స్వామికి చూపిస్తున్నారు. స్వామి అప్పుడు చెప్పారు, చూపులన్నీ నాకు, మేపులన్నీ మీకు. ఇందులో నాకేమి సంబంధం లేదు. మీరు చేసే కర్మలు బ్రహ్మము, అర్పణము బ్రహ్మము, హవిస్సులు బ్రహ్మము. మీరు చేసే ప్రతి కర్మలు బ్రహ్మమయం కావాలి. నేను కోరుకునేది అది. అది బ్రహ్మార్పణం. అంటే అర్పణము బ్రహ్మ.అవి సులుభమా తిప్పి చదవాలి మనం కాబట్టి స్వామి చెప్పనిదంటూ లేదు ఇంత విశ్లేషణాత్మకంగా స్వామి మనకు బోధించారు మనం ఈ రాబోయేటువంటి శతజయంతి ఉరికే అదొక event ఆ event లో మనం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వేలాది మందిని ప్రభావితం చేసే దిశగా మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి ఆ అహం సత్య బోధకః మీరందరూ కూడా ఆ వాహినిలన్నీ చదివారు పద్నాలుగు వాహినులు ఇప్పటికి అన్నారు అది నాకు చాలా ఆనందం కలిగించింది ఎందుకంటే చదవని వాహినులు చదవకుండా మన show-- showcase లో పెట్టుకుంటే ప్రయోజనం లేదు underline చేసుకోవాలి చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడాలి అధ్యయనం చేయాలి తద్వారా స్వామి ఏం బోధించారో గ్రహించాలి తత్వాన్ని గ్రహించాలి గ్రహించి మన జీవితానికి apply చేయాలి అదే అనుష్ఠాన వేదాంతం అంటే అది. ప్రవచన వేదాంతము ప్రబోధ వేదాంతము కాదు ప్రబోధంలో నుంచి ప్రచారంలో నుంచి ప్రసారంలోకి మనం వెళ్ళాలి ఇవాళ ప్రసారం అంటే you have to transmit through your own divine personality ఇప్పటివరకు human personality గా ఉన్నాం ఈ human personality ని humane చేయాలి e కలపాలి H U M A N human అదే మనమంతా మంచివాళ్ళమే చెడ్డవాళ్ళమేం కాదు భజన చేస్తాం ఆ మందిరానికి వెళ్తాం అందరం సాయిరాం అనుకుంటాం హాయిగా ఉంటాం అంతా బాగుంది కానీ దానికి e కలపాలి e కలిపితే value addition అవుతుంది ఆ humane స్థాయికి వెళితే it becomes divine ఆ divinity మనలో వచ్చే-- రావాలి అంటే మనకు ముందు purity ఉండి తీరాలి purity ఉండాలంటే ఏదో ఇవాళ ఈ ఉపన్యాసం వినటానికి ఎంతమంది వచ్చారని అడుగుతారు నాకు సంబంధం లేదు ఒక్కళ్ళు విన్నా చాలు ఒక్కళ్ళు వినకపోయినా చాలు అన్నట్లుగా unattached గా ఉండాలి detached attachment తో ఉండాలి మనకి ఇవ్వబడిన కర్తవ్యం ఏమిటి అంటే మనం భగవంతుని యొక్క విశేషాలని భగవంతుని యొక్క గుణ గానాన్ని భగవంతుని యొక్క శక్తిని మనదైనటువంటి రీతిలో మనకున్న శక్తి మేరకు ప్రపంచానికి ఇస్తూ వెళ్ళాలి చెప్తూ వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో దానికొక రూపాయికి అమ్ముకోకూడదు ఒక సన్మానానికి లొంగకూడదు దేనికి కూడా తలవంచకూడదు ధీరోదాత్తమైన గంభీర శూర ధీర వీర గంభీరమైన స్థాయిలో నా భక్తులు ఉండాలని కోరుకున్నారు స్వామి. ధీరులుగా ఉండాలి వీరులుగా ఉండాలి బెంబేలు పడకూడదు ప్రపంచం ఇది సవాళ్లు విసురుతుంది జీవితం ఇది అనేక కష్టాలు తోస్తుంది మన వైపు ఏదుంటే ఏమి నావ ఎక్కాం నావికుడు స్వామి జీవన ప్రవాహం ఉన్నది దానిలో ఎక్కి కూర్చున్నాం నడిపించే స్వామి ఉన్నారు నిరంతర ఆంతరంగికంగా సత్యబోధన చేస్తున్నటువంటి స్వామి ఉన్నారు లోక లోకాంతర ప్రాణాలలో ప్రతిక్షణము మెదిలి మెరిసేటువంటి స్వామి ఉన్నారు ఇవన్నీ కూడా మనం అనుభవించాలి చెప్పుకోవటానికి మాత్రమే కాక చేయటానికి ఊతమిచ్చేటువంటి స్థాయిలో మనందరం కూడా ఎక్కడికక్కడ ఏ-ఏ ప్రదేశంలో మనం ఉన్నామో ఆ ప్రదేశాన్ని పునఃప్రతిష్ట చేసుకోవాలి అట్లాగే మన చుట్టూ ఇప్పటివరకు స్వామి అంటే ఏమిటో ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది మనం నమ్మాలి. నమ్మం మనం అదృష్టం భగవంతుడు అనుకున్నాం మనకు అనుభవాలు ఉన్నాయి మరి అనుభవమే లేని వాడి దగ్గరకు మనం వెళ్ళాలి ప్రచారం చేయొద్దు మన జీవిత విధానం ద్వారా వాడు మన దగ్గరకు రావాలి మనల్ని చూసి ఎలా ఉండగలుగుతున్నారు కష్టమే లేదా మీకు మీకు ఏది ఇబ్బంది కాదా ఇది అసాధ్యం అని మీకు అనిపించదా ఎలా ఉండగలుగుతున్నారంటే వివేకానంద స్వామిని గుర్తు చేసుకోవాలి. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఒక journalist అడిగాడు "you look like a monk" నువ్వొక సన్యాసిలా కనిపిస్తున్నావ్ కాషాయం కట్టుకొని ఈ దేశానికి వచ్చావ్ ఈ parliament of religions తో మాట్లాడటం అంటే మామూలు విషయమా? వయస్సు చిన్నది నువ్వు ఎలా వచ్చావ్? నీ నమ్మకం ఏమిటి? అని అడిగితే నక్షత్రాలను నలిపివేయగల ఖగోళాలను పిండి చేయగలగిన మా రామకృష్ణ గురుదేవుల శక్తితో వచ్చానని చెప్పాడాయన. ఇవాళ మనం ఎక్కడికెళ్ళినా మీరు ఇలా ఎలా ఉండగలిగారు అది స్వామి దయ. ఇలా ఎందుకని ఇన్ని పనులు ఎలా చేయగలరు స్వామి దయ. ఇంత హాయిగా ఎలా స్వామి దయ. మీకేం కష్టాలు ఏం లేవండి వస్తుంటాయి పోతుంటాయి. మరి మీకేం చింత లేదా చింతింది మా స్వామి మా చెంత ఉండగా. ఇట్లా మన మనస్సుని నిరంతరము train చేసుకోవాలి Soak చేయాలి ఉరికే అలా తడి ఒక శిల మీద వర్షం కురిసింది వర్షం వెలిసింది సూర్యుడు వచ్చాడు బండరాయి మీద పడ్డారా నీరంతా ఇంకిపోయింది. అలా కాకుండా ఒక మడ్డి-- మట్టి బెడ్డ వలే ఉండాలి మనం నీళ్లు మనలో పడగానే మనం కరిగి నీరై సముద్రం అయిపోవాలి అటువంటి స్థాయికి మన మనస్సులని మన సంస్కారాలని మనకి జాతి మన తల్లిదండ్రులు మనకి భారతీయమైనటువంటి ఒక ఆత్మ ఒక వాంగ్మయం మహాపురుషులు చైత్యపురుషులు ఎందరెందరో కొన్ని వేల మంది ఋషులు వీళ్ళందరూ మనకిచ్చినటువంటి ఆధ్యాత్మిక సంపదను నిజమైన సంపదగా భావిస్తూ మతాన్ని దాటి అధ్యాత్మ వైపు వెళ్లి సత్యం అంటే ఏమిటో గ్రహించి ఆ సత్యమే మళ్ళీ ఒక రూపం తీసుకుని సత్యసాయి భగవానుడిగా వచ్చింది అని అచంచలమైనటువంటి విశ్వాసంతో మనం ఉండగలిగితే జీవితాన్ని గనక మనం అలా సాగించగలిగినట్లయితే ఏనాడు కూడా స్వామి నువ్వు దేవుడివైతే ఇది చెయ్యి అని అడగొద్దు ఆయన దేవుడే నీకు జరిగినా జరక్కపోయినా అది నీ కర్మ విశేషమే తప్ప ఎట్టి ప్రమేయము లేదు స్వామి చెప్పారు కష్ట నిష్టూరాలతో నాకెట్టి ప్రమేయము లేదు మీది మీరు అనుభవించవలసి ఉండ-- ఉంది అంటే స్వామి మరి మాది మేమే అనుభవిస్తే మీరెందుకు అన్న వాడికి చెప్పారు స్వామి ఉన్నాడు అన్నప్పుడు మీరు కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు నష్టాన్ని పూడ్చుకుంటారు సుఖాన్ని జాగ్రత్తగా అనుభవిస్తారు ఆనందాన్ని అదుపులో పెట్టుకుంటారు ఆ స్వామి అనే కట్టుకొయ్య లేకపోతే మీరు ఎటైపోతారో ఏమైపోతారో.అందుకని భగవంతుడు అనే వాడు ఉండాలి. అందుకని భగవత్ శక్తి కావాలి. భగవంతుని ఉనికి, అస్తిత్వము, వ్యక్తిత్వము మనల్ని నడిపించాలని స్వామి ప్రబోధం చేస్తూ, "మీరందరూ నన్ను దేవుడు అంటున్నారు. నేను అట్లాగే అది అంగీకరిస్తూనే, మీరు కూడా దేవుళ్లే. కానీ మీరు ఎలా ఉండాలి అంటే దివ్యాత్మ స్వరూపులై ఉండండి. ప్రేమాత్మ స్వరూపులై ఉండండి. ఉరికే మీకు తల్లిదండ్రులు పెట్టిన నామకరణంతో ఆ నామమే శాశ్వతం కాదు. శాశ్వతమైనది మీలో ఉన్న దివ్యాత్మ. ప్రపంచంలో నడిచినంత కాలము మీరు ప్రేమాత్మలై ఉండాలి. ప్రేతాత్మలై ఉండకండి" అని చెప్తూ అనేకమైనటువంటి ఆ విధాల ఒకే సత్యాన్ని "ఏకం సత్ విప్రా బహుధా వదంతి" ఒకే సత్యాన్ని ఆ చాలా చదువుకున్న వాళ్ళు అనేక రకాలుగా చెప్తారని. కానీ సత్యమే తనను ఆవిష్కరించుకున్న ఈ సందర్భం అతి నిరుపమానమైన సందర్భం. దానిలో మనం కూడా సత్య సాయి భగవానుడి ఆవరణంలోకి వెళ్లగలిగాం. వెళ్లగలిగి నిలబడి ఆయన భగవంతుడని నమ్మగలిగాం. నమ్మగలిగి ఆయన్ని ఆదర్శం చేసుకోగలిగాం. తదనుగుణంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం మన కనురెప్ప వాలే వరకు కూడా ఇలాగే సాగాలని, ఇట్లా "అహం సత్యబోధకః" అనేటువంటి ఈ పవిత్రమైనటువంటి మహాయజ్ఞాన్ని నాలుగు సంవత్సరాలుగా ఎక్కడా ఎడతెరిపి లేకుండా మా బోటి వాళ్లకు అప్పుడప్పుడూ ఒక అవకాశం ఇచ్చి "మీరు కాసేపు మాట్లాడండి" అని మమ్మల్ని పిలిచినప్పుడు అది సత్య సాయి భగవానుడు ఇచ్చిన పిలుపుగా, సత్య సాయి భగవానుడు ఆదేశించినట్లుగా, ఏం చెప్పాలో ఆయనే చెప్పుకుంటారు అన్నట్లుగా వచ్చి ఇక్కడ కూర్చుంటాం. జరుగుతుంటుంది. మీరు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా శ్రద్ధాళువునై విన్నాను. పరమ ఆనందం కలిగింది. ఇట్లా ప్రతి సంస్థ, ప్రతి వ్యక్తి ఆ అవస్థకు లోను కాకుండా వ్యవస్థ నిర్మాణం చేయాలని, సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాలని, నిలబెట్టుకోవటం అంటే మనం ఆచరించడమేనని, మనం ఆచరిస్తే మన బిడ్డలు ఆచరిస్తారని, మన పౌత్రులు మనము-మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా ఆచరిస్తారు, దీన్ని వారసత్వ సంపదగా ఇవ్వాలని ఆ నేను భావన చేస్తూ, ఇవాళ ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఒక విశేషమైనటువంటి యోగాన్ని నేను ఆ అమదానందంగా, ఆనందంగా అనుభవిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత సేపు సత్య సాయి భగవానుడి గురించిన విశేషాలు మనందరం కలిసి పంచుకునే ఒక యోగాన్ని కల్పించినటువంటి స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సాయి రామ్.
YouTube · audio
ASB 4th Anniversary Satsang on 29062024
ASB 4th Anniversary Satsang on 29062024
Source: Aham Sathya Bodhaka on YouTube
0:00 / 1:35:02
More in this series