No transcript for this section.
[ఉపోద్ఘాత సంగీతం] యువత [ఉపోద్ఘాత సంగీతం] యువత [ఉపోద్ఘాత సంగీతం] సనాతన భావం [ఉపోద్ఘాత సంగీతం] సనూతన రూపం [ఉపోద్ఘాత సంగీతం] యువత [ఉపోద్ఘాత సంగీతం] యువత రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం! యువత సనాతన భావం సనూతన రూపం కార్యక్రమానికి సాయి ప్రసాద్ గణేష్ మీకు మరోమారు ప్రేమపూర్వకమైన స్వాగతం పలుకుతున్నారు. ఒక విశాలమైన వృక్షం పచ్చగా జీవించటానికి అది భూమిపై చక్కగా నిలిచి ఎదగడానికి దానికి వేళ్ళు ఎంత ఆధారమో, ఎంత అవసరమో ఒక సమాజానికి అందులోని మనిషి సత్యమైన జీవితాన్ని గడపటానికి మోక్షమార్గం వైపు పయనించడానికి ధర్మం అనే విలువ అంతే అవసరం అంతే ఆధారం. ధర్మము అనాది అయినది. అయితే ఈ ధర్మము అనేక రకాలు. ఈ ధర్మాన్ని రక్షించిన వాణ్ని అంటే ఆచరించిన వాణ్ని ఆ ధర్మమే తిరిగి రక్షిస్తుంది. మానవతా విలువలలో ఒకటైన నేటి యువత అర్థం చేసుకుని ఆచరించవలసిన ముఖ్యమైన విలువ ధర్మము. అదే ఈనాటి మన కార్యక్రమంలోని చర్చాంశము. ముందుగా ఈనాటి మన కార్యక్రమంలోని అతిథులను మన రేడియో సాయి సోదరుడు శ్రీ గణేష్ మీకు పరిచయం చేస్తారు. శ్రోతలందరికీ సాయిరాం! ఈనాటి ఈ కార్యక్రమానికి అతిథులైన వారు రేడియో సాయి శ్రోతలందరికీ సుపరిచితులు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.ఎస్.ఆర్.మూర్తి గారు. సాయిరాం మూర్తి గారు. సాయిరాం. మనతో పాటుగా స్వామి పూర్వ విద్యార్థి ప్రస్తుతం రాజమండ్రి శ్రీ సత్యసాయి గురుకులంలో తమ సేవలనందిస్తున్నటువంటి పూర్ణచంద్రరావు గారు కూడా మనతో పాటు ఉన్నారు. సాయిరాం ఆ పూర్ణచంద్రరావు గారు. సాయిరాం గణేష్, సాయిరాం సాయిప్రసాద్. సాయిరాం సార్. ఈ కార్యక్రమానికి మీ ఇద్దరికీ స్వాగతం. సాయిరాం మూర్తి గారు ముందుగా మా శ్రోతలందరికీ ఈ ధర్మం అంటే ఏంటో ఒక చిన్న ఉపోద్ఘాతం ఇస్తారా? వేదోఖిలో ధర్మమూలం ఇది సనాతన వాణి. అంటే సమస్త వేదాలకు మూలం ఏమిటంటే ధర్మం. ధర్మానికి ఒక స్వరూపం, ఒక స్వభావం, ఒక శక్తి, ఒక అపరిమితమైనటువంటి వృత్తం ఉన్నది కాబట్టి ఈ ధర్మాన్ని మానవతా విలువలలో సత్యసాయి భగవానుడు సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనబడేటువంటి Cardinal principles అంటాం. దాన్లో చేర్చారు స్వామి. ధర్మానికి కూడా మూలం సత్యం కాబట్టి అది మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది. అయితే ధర్మం రెండో స్థానంలో ఉందని కాదు. సత్యంతో సమానమైనది ధర్మం. నిజానికి ఐదు సమాన స్థాయిలో ఆచరింపబడాలి. సమస్త వేదాలలో, ఉపనిషత్తులలో, పద్దెనిమిది పురాణాలలో, అలాగే భగవద్గీతలో ధర్మానికి పెద్దపీట వేశారు. ధర్మం అంటే ఒక భావన. ధర్మం అంటే ఆచరించడానికి అనువైనటువంటి, అనుసరించడానికి మూలమైనటువంటి ఒక స్వభావ శక్తి అది. అందుకనే ఈ ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించి చూపించడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడై ఈ లోకంలోకి రావలసి వచ్చింది. ఈ ధర్మం అనేక రకాలు. వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం, దేశ ధర్మం, ప్రకృతి ధర్మం. అలాగే ఏకాంతంలో ఒక వ్యక్తి ధర్మం, యష్టి ధర్మం, సృష్టి ధర్మం అనేక రకాలుగా అనేక పాయలుగా ఇది చీలి ఉన్నది కాబట్టి వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ జ్ఞానవంతుడైనటువంటి మనిషి దానిని ఆధారం చేసుకుని జీవించాలి గనుక ధర్మమే చున్నతమైనటువంటి స్థానంలో సంచారం చేయిస్తూ ఉంటుంది. మీరు పురాణగతంగా ఏ కథ విన్నా మహాత్ములంతా ధర్మాన్ని ఆచరించారు. మనందరికీ తెలుసు "ధర్మో రక్షతి రక్షితః" అని. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని. ధర్మాన్ని రక్షించటం ఏంటి? మనకంటే బలహీనమైనదా? దానికంటే మనం బలమైన వాళ్ళమా? అలాగే "యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతాబ్" ధర్మానికి హాని, గ్లాని జరిగినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటానన్నాడు యోగేశ్వర కృష్ణుడు. అక్కడ కూడా విచిత్రం ఏమిటంటే ధర్మానికి గ్లాని, హాని జరిగితే ధర్మం కూడా చెడిపోతుందా అని ప్రశ్న వేసుకున్నట్లయితే ఊ. ధర్మం నిప్పు, అగ్ని స్వరూపం. అది కాలాద్యవచ్ఛిన్నం. దానిని ఎవరూ మార్చలేరు. అది అందరినీ మార్చగలదు, నడిపించగలదు స-సక్రమమైనటువంటి మార్గంలో. కానీ ఈ ధర్మం ఆచరించవలసినటువంటి మానవుడు గనుక ధర్మాచరణకు లోనై కాబడనట్లయితే, దూరమైనట్లయితే మళ్ళీ మానవుణ్ణి ధర్మ మార్గంలో పెట్టడానికి భగవంతుడు ఒక రూపం తీసుకుని వస్తాడు. అందువల్ల ఆ ధర్మ రక్షణ కోసం నేను వస్తానన్నాడు. కాబట్టి ధర్మ రక్షణ అంటే ధర్మాచరణే. అంటే విహిత కర్మలు ఉంటాయి, మనం చేయవలసిన కర్తవ్యాలు మనకుంటాయి. అది వ్యక్తిపరంగా ఇందాక అనుకున్నట్టుగా కుటుంబపరంగా, సమాజపరంగా అంతేకాదు ఈ దేశం, దేశం అంటే ఒక ఆత్మ.దేశం అంటే ఒక జాతి దాని సంస్కృతి దాని సంస్కారం దాని వైభవం దాని గమనం దాని గతిశీలం దాని ధృతి దాని అధృతి దాని వేగం ఆ వేగం అది ఎన్నింటినో ఇముడ్చుకొని ఉంటుంది. ధర్మం మారదు విలువలు మారుతూ ఉంటాయి విలువలు నిజానికి మారవు అవసరాలు మారుతుంటాయి. కాబట్టి అవసరాలన్నీ గనుక ధర్మమూలమైనట్లయితే మానవజాతి పరిపుష్టమై చాలా సమన్వతమైనటువంటి స్థాయిలో సంచారం చేస్తుంది గనుక మానవుడు తాను నడవవలసిన బాట నుంచి వైదొలగిన వేళ పరమాత్మ వచ్చి మళ్ళీ ధర్మమార్గంలో మనల్ని ప్రవేశపెట్టి ఇదిగో ఈ పాతలో ఈ ధర్మమార్గంలో నువ్వెళ్ళు నువ్వెళ్ళవలసినటువంటి దారి ఇది నువ్వు వెళుతూ ఉన్నట్లయితే నీ వెనుక అనేకమంది వస్తారు అని ఒక సన్మార్గ ఉపదేశనం జరుగుతుంది కాబట్టి ఈ ధర్మ స్వరూపాన్ని మనం చాలా చక్కగా విచారణ ఇంకా తీవ్రంగా చేయవలసి ఉన్నది ఇది. మీరేమంటారు పూర్ణచంద్రరావు గారు? ధర్మం అనే పదం చాలా ఆ పవిత్రమైనది దీనికి అనేక అర్థ-- అనేక అర్థాలని అనేక విధమైన ఇంటర్ప్రెటేషన్స్ ని ఉమ్ పెద్దలు ఇస్తూ ఉంటారు ఉమ్ వేదాలు వేద పరంగాను శాస్త్ర పరంగాను ఇవన్నీ వింటున్నప్పుడు ఒక్కొక్కసారి యువకుల్ల-- యువకులైన మనకి కొంత దానిమీద దూరం పుడుతుందా అదంటే అదేదో పెద్ద పదము మన వల్ల అయ్యేది కాదు మన లెవెల్ ది కాదు అనేటువంటి భావన మనకు కలుగుతుంది ఉమ్ కానీ ఈ విషయంలో స్వామి మనకి చాలా చక్కని ఆ క్లారిటీ అంటారు చూడండి అది ఇచ్చారు. ఒకసారి ఆ ఇన్స్టిట్యూట్ లో ఉమ్ థర్స్డే మోరల్ క్లాస్ లో మేము ధర్మం మీద ఒక రకమైన డిస్కషన్ జరిగింది ప్రెజెంటేషన్ లాగా ప్రెజెంటేషన్ లా జరిగింది టీచర్లు ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు ఉహు ఆ అది అయిన తర్వాత స్వామికి ఆ విషయం తెలిసి స్వామి కబురు పంపించారు ఏమి ఏమనంటే మీరు ధర్మము ధర్మము అని చాలా భయపడిపోకండి మనిషి పాటించవలసిన ధర్మం ఒక్కటే అది ఆత్మ ధర్మము ఉమ్ ఆత్మ ధర్మమే నిజమైన ధర్మము ఉమ్ అని చెప్పారు ఉమ్ అంటే అక్కడికి మేము ఆత్మ ధర్మం అంటే ఏంటి అని చెప్పి ఇంకొంచెం ఇంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి ఉమ్ కానీ అదీ దాని అర్థం నాకు తోచింది ఏంటంటే జీవజంతువులన్నీ ప్రకృతిలో జీవజంతువులన్నీ వాటి సహజ ధర్మాన్ని ప్రకృతి ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాయి ఉమ్ నిప్పు కాలుతుంది నీరు తడుస్తుంది కుక్క కరుస్తుంది ఆవు పాలిస్తుంది ఆ ధర్మానికి వ్యతిరేకంగా సహజ ధర్మానికి ప్రతి ప్రకృతి ధర్మానికి వెళ్ళలేవు ఉమ్ అయితే మానవుల్లో భగవంతుడు ఫ్రీ విల్ అనేది సృష్టించాడు స్వేచ్ఛ అది యువకులకు చాలా బాగా తెలుసు [నవ్వు] We use and misuse free will ఉమ్ రెండు రకాలుగానే చేస్తూ ఉంటాం ఉమ్ సో ఆ ఫ్రీ విల్ మనిషికి ఇవ్వటం వల్ల ఆ మనిషికి తన రక్షణ గురించి తనే తాను ఫ్రీ విల్ ఉందని చెప్పేసి మనం కొండ మీద నుంచి దూకేసి నిప్పుల్లో నడిచేస్తే మనకి కాలుతుంది మనకే నష్టం కలుగుతుంది నష్టం కలుగుతుంది అవును అలాగే మన ఇష్టమొచ్చినట్టు చేస్తుంటే ఎదుటివారికి నష్టం కలుగొచ్చు ఉమ్ అందువల్లనే మనకి ఆ ఫ్రీ విల్ ఇవ్వటం వల్ల దాంతో పాటు ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనంతట మనం ఒక ధర్మాన్ని మనకి నిర్ణయించుకుని ఉమ్ మనకి మంచి జరగాలి సొసైటీకి మంచి జరగాలి అన్ని విధాలుగానూ ఒక రకమైన బ్యాలెన్స్ బ్యాలెన్స్ sustainability ఉండేలాగా ఉమ్ చిన్న-- మనం పుట్టినప్పటి నుంచి పోయేదాకా మనం చేసే పనులన్నింటిలో ఒక రకమైన కన్సిస్టెన్సీ ఒక రకమైన మంచితనము ఉపయోగకరమైన పనులన్నీ చేసేటట్టు మానవునికి ఆ స్వేచ్ఛ ఉంది తనంతట తాను ఒక ధర్మం నిర్ణయించుకుని ఆ ధర్మాన్ని అనుసరించి తన జీవితాన్ని నడుపుకుని ప్రూవ్ చేసుకోవాలన్నమాట ఉమ్ చూడండి నాకున్న నాకు భగవంతుడిచ్చిన తెలివితేటల వల్ల ఉమ్ భగవంతుడిచ్చిన శక్తి యుక్తుల వల్ల నేను ఒక ధర్మాన్ని నేను నిర్ణయించుకుని దాన్ని పాటించి చూపించి దేశానికి శ్రేయస్సు ప్రపంచానికి శ్రేయస్సు కలిగించాలనేది ఉమ్ అది ఏ ధర్మం అనేది స్వామి ఎప్పుడూ చెప్పలా మీరు ఈ ధర్మం పాటించండి ఈ ధర్మం పాటించండి అని మీ చాయిస్ మీకు ఏ ధర్మం కావాలంటే ఆ ధర్మం పాటించండి కానీ ఒక ధర్మాన్ని నిర్ణయించుకుని దానికి ఆ కట్టుబడి ఉండటం కట్టుబడి ఉండటం స్వామి అంటారు పట్టిన పట్టు ఏదో పట్టనే పట్టితివి అన్నట్టు ఒకదానికి నిలబడి ఉండటం అనేది ఒక మానవతా విలువ ఉమ్ అది గొప్ప మానవులే చేయగలరు ఉమ్ అది అందరూ చేయలేరు ఎందుకంటే స్వామి చెప్తూనే ఉంటారు వెతుకుచున్నాను నేను వెతుకుచునే ఉన్నాను నిజ మానవ ధర్మపురుని ఉమ్ ఈరోజు స్వామి కూడా స్వామి కూడా ఎవరూ కనిపించలేదు అట్లాంటి మానవుడు కానీ ఆ ప్రయత్నం ఆ ప్రయత్నంలో ఉండటం మానవ లక్షణం రావు గారు ఇక్కడ రెండు విషయాలున్నాయి చాలా చక్కగా చెప్పారు మీది క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఒక నాస్టాల్జిక్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అయితే ముందు మనం ఈ ధర్మం అనే విషయాన్ని ఒక ఫిజికల్ లెవెల్ లో కాసేపు మెటా ఫిజికల్ లెవెల్ లో కాసేపు స్పిరిట్యుయల్ లెవెల్ లో కాసేపు యువత ఆత్మ ధర్మం అనంగానే దానికి అంతుబట్టదు ఇది కూడా మనది కాదు ఇదేదో తల నేర్చిన వాళ్ళు పెద్దవాళ్ళ మాట అని. ధర్మానికి సత్య సాయి భగవానుడు మీకు క్లాస్ రూమ్ లో ఎలా చెప్పారో మా బట్టు వాళ్ళకి ఇంటర్వ్యూ రూమ్ లో చెప్పింది చెప్తాం షేర్ చేసుకుందాం. Right action at right time is dharma అన్నారు స్వామి. దానికే పశుపక్షాదులకు రీసను సీజను రెండు ఉన్నాయి మనిషికి కూడా ఉన్నాయి గానీ దాన్ని వయొలేట్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తాడు. ధర్మాన్ని ఆచరించటం పట్ల ఆసక్తి ఎప్పుడో గాని కలగదుఈ అధర్మం కూడా చేస్తే అసలు ఏమవుతుందో చూద్దాం అని ఒక తుంటరితనం మనిషిలో ఉంటుంది. దానివల్ల వాడు ముప్పు కొనితెచ్చుకుంటాడు అని రావణబ్రహ్మ గురించి చెప్తూ. వేద విద్యా పారంగతుడైన వాడు, నవగ్రహాలని అష్టదిక్కులని శాసించినవాడు, వీణావాదనలో యాజ్ఞవల్కుణ్ణి దాటినవాడు, సాక్షాత్తు పరమశివుడి యొక్క ఆత్మ లింగాన్ని తెచ్చినవాడు, బొందుతో కైలాసానికి వెళ్ళినవాడు, సౌందర్యంలో జయంత వసంత కంతుల్ని మించినవాడు అంటే మన్మథుణ్ణి దాటినవాడు. సీతమ్మవారిని ఎందుకు తీసుకువచ్చాడు? ఇంత అధర్మానికి ఎందుకు పాల్పడ్డాడు? అధర్మం అని తెలీదా వేదం చదివిన వాడికి? వేద పోషణ చేశాడు వాడు. పరమ వీర శైవాచార పరుడు. శివుడు తప్ప అన్యం లేదని భావించినటువంటి పరమ శక్డు వాడు. అయినా సీతమ్మవారిని ఎందుకు తెచ్చాడు అంటే అధర్మంలో గనుక అధర్మం ఒక్కొక్కసారి నెగెటివ్ ఎనర్జీ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. పాజిటివ్ ఎనర్జీ లో అట్రాక్షన్ ఉండదు. ఒక స్వాంతన ఉంటుంది. నెగెటివ్ ఎనర్జీ మనం ఒక్కోసారి ఏమవుతుందో చూద్దాం అంటామే అట్లా చేశాడు. ఆ జరిగినందువల్ల ఏమైంది అంటే ధర్మాన్ని అతిక్రమించాడు గనుక ప్రకృతి వాడితో సహకరించలేదు. ఇవ్వేళ కూడా మనం చూస్తున్నాం. సునామీలు, భూకంపాలు ఇవన్నీ man made problems. యువత ప్రధానంగా గ్రహించవలసింది ఏంటంటే సూర్య చంద్ర తారకలు, ఖగోళం, అక్కడి నుంచి మొదలై ఇక్కడ భూగోళం దాకా చూసినట్లయితే మనిషి తప్ప ప్రతి జీవి దానిలో ఆ వరవడిలో చాలా హాయిగా ఉన్నాడు. ఒక్క మానవుడు తప్ప. కనుకనే మానవుడికి ధర్మ ప్రబోధము, ధర్మ ప్రచారము, ధర్మ ప్రసారము చేయవలసి వచ్చింది. ముందు ధర్మం అంటే ఏంటో చెప్పాల్సి వచ్చింది. తర్వాత ధర్మాన్ని ఆచరించిన వాళ్ళ కథలు పదే పదే పదే చెప్పి చెప్పి చెప్పినా, అదేదో గాంధీగారు చేశాడు, అదేదో సచ్చారి చంద్రుడు చేశాడు, మనం ఎక్కడ చేయగలమండి? వాళ్ళు దేవుళ్ళు గనుక చేశారు అని ఒక escape route ని యువత ఎంచుకోకూడదు. స్ఫూర్తిని పొందాలి. ఆ పట్టిన పట్టు పట్టనే పట్టితివి అనేది స్వామి ధర్మం విషయంలో చెప్పలే. వారు చెప్పింది ఏంటంటే, నీకు ఒక faith మతానికి సంబంధించి, ఒక మార్గానికి సంబంధించి లేదా ఒక గురువుకి సంబంధించి, ఒక విషయానికి సంబంధించి, నీ మనసు దానియందు లగ్నమై అది పరిపూర్ణ ఫలాలు ఇస్తున్నప్పుడు దాన్నే పట్టుకో. చెట్టుకి అనేక కొమ్మలు ఉంటాయి. పట్టిందే కొమ్మ. మనం ఒకటే పట్టగలం. maximum రెండు పట్టగలం. మూడోది మన చేతుల్లో లేదు. కాబట్టి ఈ మతాన్ని, ధర్మాన్ని మనం గనక separate చేసుకోగలిగినట్లయితే, ధర్మం అనేది మతం కంటే చాలా కొన్ని వేల రెట్లు గొప్పది. ఆ ధర్మ శబ్దంలోనే ఏమున్నది అంటే ఇది మాత్రమే ఆచరించదగినది, ఇట్లాగే ఉండవలసినది. అది నిర్దిష్టమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ ఒక వ్యక్తిని గనక మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు మనందరం నలుగురం ఉన్నాం. మన professions వేరు. వృత్తి, ప్రవృత్తి, నివృత్తి. మూడింట్లలో ధర్మమే నడిపించాలి. నేను ప్రవృత్తి మార్గంలో మానసికంగా నేను చాలా advanced గా ఉన్నాను, నా intentions very great అంటాం. కానీ నా actions చాలా చెడ్డగా ఉన్నాయి. ప్రపంచానికి నా intentions తెలీవు, నా actions తెలుస్తాయి. తర్వాత ఈ రెండూ ఇట్లా ఉంచి నా వృత్తి వేరండి, అసలు నేను సత్య సాయిబాబా వారికి నన్ను మించిన భక్తుడు లేడు అని అంటూ తనను తాను మోసం చేసుకుంటూ నివృత్తి మార్గంలో ఉన్నాను అనుకుంటాడు. కాబట్టి వృత్తి, ప్రవృత్తి, నివృత్తిని ఒక వ్యక్తి ఒక సాధనగా గనక తీసుకున్నట్లయితే అతన్ని మతం గాని, కులం గాని, అతనికి ఉన్నటువంటి intellectual quotient గాని, emotional quotient గాని నడిపించలేదు. మరి ఏది నడిపిస్తుంది? spiritual quotient నడిపిస్తుంది. అందుకనే మళ్ళీ మనం ఒక్కసారి భగవద్గీతలో కలా వెనక్కి వెళ్ళినట్లయితే అర్జునుడికి చెప్పాడు, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఎంత అద్భుతమైన శబ్దాలవి. స్వధర్మే నిధనం శ్రేయః. నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్. నువ్వు చేయవలసిన వేళ ఆ పని చెయ్. నీవు చేయగలిగినంత రీతిలో నువ్వు చెయ్. అది ధర్మం. దానికి స్వామి వచ్చిన విషయం చెప్తూ, ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకడు ఏమీ చేయలేడు. వాడికి శక్తే లేదు. వాడంటాడు నేను అన్ని పనులు చేయగలను అంటాడు. వాడు దొంగ. చేయడు వాడు. రెండో వాడు ఉంటాడు సర్వ సమర్ధుడు. అన్ని పనులు చేయగలడు. కానీ ఏ పనీ చేయడు. వాడు గజదొంగ. అంటే వీళ్ళిద్దరూ దొంగ, గజదొంగ ప్రవృత్తి రీత్యా వాళ్ళు ఏం చేశారంటే, ఏ ధర్మాన్ని కనీసం మనో ధర్మాన్ని కూడా ఆశ్రయించలే. కాబట్టి భౌతికమైనటువంటి స్థాయిలో మన వృత్తులు, మన జీవన గమనాలు, మన ఆలోచనలు, సమాజంతో మనకున్న సంబంధాలు, మానవీయమైనటువంటి కోణంలో గనక జాగ్రత్తగా చూసినట్లయితే పరమ ఉత్కృష్టమైనటువంటి ధర్మమే మన మధ్య ఒక లలిత మర్యాదను నిలబెడుతుంది. అది చాలా అవసరం. దాన్ని respectable distance అని ఇంగ్లీషు వాడు వాడేశాడు. ఈ లలిత మర్యాద, స్వామిని చూడండి మర్యాద పురుషోత్తముడు ఆయన. ఆయన కదలిక, ఆయన మెదలిక, ఆయన చలనం, నేత్రావధానం, ఆయన సంజ్ఞ, దానిలో కూడా ఒక beauty, దానిలో కూడా ఒక కమ్మదనం, ఒక మెత్తదనం, నెమ్మది నెమ్మదితనం, ఒక సంయమనం, ఒక సమన్వయం, ఇవన్నీ ఒక్కచోట ఆ ధర్మ స్వరూపం కాబట్టి ఎట్లా స్వామి ఇంత demonstrate చేయగలిగారు అంటే because he is the embodiment of ధర్మ. ఆయన ఎక్కడ ఏ time లో ఏది చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోయినారు. వ్యక్తుల కోసం ఆగలేదు, కాలం కోసం ఆగలేదు. తాను ఎవరి మీద ఆధారపడలేదు. అందరికీ తాను ఆధారం అయ్యే స్థాయిలో సంచారం చేయటానికి వ్యక్తిగా స్వామి ఆ ధర్మాన్ని ఆచరించారు. స్వామి ఓ అరవై ఏట నేను సాయిబాబాను అని చెప్పుంటే ఈ ప్రపంచానికి ఉపయోగం ఉండుండేది కాదు. చెప్పవలసిన time లో చెప్పారు స్వామి. కనుక ఆయనకు సుదీర్ఘమైన కాలం ఈ ప్రపంచాన్ని ధార్మిక మార్గంలో నడిపించటానికి అవకాశం కలిగింది. ఇక కుటుంబ వ్యవస్థకు వస్తే రామచంద్రుణ్ణి మించిన వాడు లేడు.ఉండవలసిన రీతిలో కొడుకుగా ఉన్నాడు, భర్తగా ఉన్నాడు, సోదరుడిగా ఉన్నాడు, స్నేహితుడుగా ఉన్నాడు. ఇటు పురుజనులకి, హరిజనులకి, అటు గిరిజనులకి ఆప్తుడయినాడు. నరులకి వానరులకి సన్నిహితుడయినాడు. ఎట్లయినాడు? ధర్మాన్ని ఆచరించాడు. అందుకనే రామబాణ విశిష్టతను గురించి చెప్తూ రాముడు ఒక చోట చెప్తాడు, "నా దగ్గర ఉన్నది బాణం ఒకటే." ఒకే బాణం అంటే ఆయన దగ్గర ఒక్క బాణం ఉండి దాంతో యుద్ధం చేశాడని కాదు. ఒకే అంటే లక్ష్యం ఒకటే. ఆ దా-బాణానికి రెండు పదనులున్నాయి. ఒక పదను ఏమిటంటే అధర్మ మార్గంలో వెళుతున్న వారిని శిక్షించక తప్పదు, ధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళని రక్షించక తప్పదు. ఇది అంటే కుటుంబాన్ని దాటి, రాముడు రాజ్యాన్ని దాటి సమాజగతమైనాడు. తర్వాత ప్రపంచం, ప్రతి జాతికి ఒక ఆత్మ, ప్రతి జాతికి ఒక ధర్మం ఉంది. ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా ఈ భారతీయ ఆత్మ అధ్యాత్మ. ఇది నిరంతరము నాస్తికుడు అన్నవాడు కూడా ఒకరోజున హేతువు ద్వారా వచ్చి భగవంతుడికి దగ్గరవుతాడు. ఆస్తికుడైన వాడు నమ్మి, భక్తుడు నమ్మి విశ్వాసంతో జీవితం గడుపుతాడు. హేతువాది ప్రశ్నించి పరమాత్మ వైపు వెళ్తాడు. కానీ వాళ్ళ గమ్యం, లక్ష్యం గమ్యం ఒకటే కాబట్టి ఈ ధర్మం అనేటువంటిది చాలా విస్తృతమైనటువంటి విషయం. ఇది వ్యక్తి ధర్మం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత. రెండవది మన సంగీతం మనకు గనక తెలిసినట్లయితే మనోధర్మ సంగీతం అని ఒకటుంది. సాహిత్యం అదే, సప్తస్వరాలు అవే, notations అవే, పాడవలసిన రీతి అంతే. టెక్నికల్ గా ఇలాగే పాడాలి అంతా సెట్ అయిపోయింది. కానీ సమర్ధుడైనటువంటి గాయకుడు మనో ధర్మాన్ని ఆశ్రయించినప్పుడు ఇటు సంగీతం, అటు సాహిత్యం ఆకాశం వరకు తీసుకెళ్తుంది మనల్ని. కాబట్టి మనోధర్మం అనేది మనస్సు, నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన మనస్సు, ఏది అక్కరలేని మనస్సు, భగవంతునితో కూడిన మనస్సు. ఆ మనోధర్మాన్ని ఆ సంగీతంలో ఎట్లా రాగరంజితం చేస్తుందో, ఈ ప్రపంచంలో కూడా నిష్ఠతో ఉన్నటువంటి వాడు ప్రపంచాన్ని పరమాద్భుతంగా నడిపిస్తాడు. ధర్మం యొక్క విస్తృత స్వరూపం ఇది. జాతి, ప్రతి జాతికి భారత జాతికి ఒక సంస్కృతి ఉన్నదని, సంస్కారం ఉన్నదని, ఒక నాగరికత ఉన్నదని, ఇది నిన్న మొన్న కొత్తగా వచ్చింది కాదని, సనాతనమైనది కానీ అది సనూతనమైనది. ఎంత పాతదో అది అంత కొత్తది. అందుకనే స్వామిని అడిగారు కుప్పం వైరాగి శాస్త్రి గారు, "god అనేదానికి చెప్తున్నారు స్వామి మానవ శబ్దం దానికి అర్థం ఏమన్నా ఉందా?" అని అడిగారు. "ఎందుకు లేదు? మా అంటే కాదు, నవ అంటే కొత్త." వైరాగి శాస్త్రి నువ్వేం కొత్తవాడివి కాదు, చాలా పాత వాడివి. అంటూ ఆ సమన్వయం అంటే ధర్మం అనేక రీతులుగా మనకు అనిపిస్తుంది. ధర్మం మారిపోయింది, ధర్మం నశించిపోయింది. ధర్మం నశించదు, నశించేది ధర్మం కాదు. అంటూ ఈ విచారణ మనం కాస్త ముందుకు తీసుకెళ్దాం. మరి ఈ ధర్మం అనే పదం వాడినప్పుడు మనమంతా స్వామి చెప్పిన ఉపన్యాసాలు విన్నాం కాబట్టి, ఆ స్వామి రాసిన వాహినీలు చదివి ఉన్నాం కాబట్టి, ఏదో కొద్దోగొప్పో ఈ ధర్మం గురించి కనీసం ఆ పదాలన్నా తెలుసుకునే అవకాశం దొరికింది మనకి. పరధర్మం కానివ్వండి, ఆత్మధర్మం కానివ్వండి, స్వధర్మం కానివ్వండి. మరి నిత్య జీవితంలో మామూలు ప్రజానికనికి ఈ ధర్మం అనేది ఎట్లా తెలుస్తుంది? మనకి ఆ సందేహం రావచ్చు. మానవుడు కొన్ని stages గుండా మనం జీవితాన్ని, జీవిత ప్రయాణం సలుపుతాం మనం. మనం బాల్యంలో ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు, గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు, మరి ఈ మన base అంతా ఈ ఆత్మ ధర్మం అనేది ఉంటూ ఆ particular stage లో ఆ ధర్మాన్ని ఎట్లా నిర్వర్తిస్తాం అనేది చాలా ముఖ్యమైన అంశం అని నేను అనుకుంటున్నాను. అవును దినేష్. మరి ఈ ధర్మం గురించి ఏమీ తెలియని వాళ్ళు వాళ్ళు నిత్య జీవితంలో సరైన దారిలో వెళుతున్నారా లేదా అని తెలుసుకోవడమే ఒక ధర్మం అది. అది ఎలా చేస్తాం? ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. తర్వాత రావు గారు కూడా దాన్ని supplement చేస్తారని నాకు తెలుసు. కౌశికుడు అనేటువంటి ఆయన తపస్సు చేశాడు. భారతంలో కథ ఇది. యోకుడు చాలా గొప్ప తపస్సు చేశాడు. చేశాడు కానీ ఎవరైనా సరే తపస్సులో ఒక స్థాయికి వెళ్ళినా మామూలు భౌతిక స్థాయికి రావాలి, వచ్చాడు. తపస్సులో ఉన్నన్నాళ్ళు పెద్ద ఆకలి అలాంటివేం దప్పికలు లేవు. బయటకు రాగానే ఆకలి, దప్పిక, అవసరాలు మొదలయ్యాయి. తపస్సులో నుంచి బయటకు రాబోతున్న సమయంలో ఆయన పైన చుట్టు మీద ఒక కాకి ఆయన మీద రెట్ట వేసింది. పైకి చూశాడు, కోపంతో చూశాడు. మాడి మలమల మాడి కింద పడిపోయి మరణించింది అది. కానీ ఆయన ఏం పట్టించుకోలే. ఓ ఊళ్ళోకి వెళ్ళాడు. భిక్షాటన చేయాలి కదా! వెళ్ళేప్పటికి ఆ ఇల్లాలు మూడు సార్లు పిలిచాడు ఎక్కడా ఉలుకు పలుకు లేదు. ఇల్లాలు ఇంట్లో పని చేస్తున్నది. ఏం పని చేస్తున్నది అంటే పొలానికి వెళ్లి వచ్చినటువంటి తన భర్తకు పాద సంసేవనం చేస్తున్నది. అందువల్ల రాలే. కాసేపు అయిన తర్వాత ఆయన నిద్రపోయారు. ఆ time లో ఈయన ఇంకా భిక్షకి ఇంకో చోటుకి వెళ్ళలే, అక్కడే అడుగుతున్నాడు ఆయన. ఆవిడ వచ్చింది బయటకి. కోపంగా చూడబోయాడు. "నేను చాలా సార్లు పిలిచాను మిమ్మల్ని" అన్నాడు. "మీ కోపానికి ఆహుతి కావటానికి నేను కాకిని కాదు కదా" అంది. ఊ.. ఆశ్చర్యపోయినాడు. ఈవిడకి ఎలా తెలుసు ఆ కాకి మరణం, తాను కోపంతో చూడటం. కోపం తగ్గించుకోండి. శాంతం వహించండి. తపస్సు అంటే తమస్సు పోగొట్టుకోవటం. మీరు లోకోత్తరమైన పనులు చేయవలసినటువంటి స్థాయిలో ఉండవలసినటువంటి వారు. మీరు కోపాన్ని జయించకపోతే ఇంకా తపస్సు చేసినట్లేట్లా? మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూనే ఉంటాను అని అన్నది ఆయనకు అర్థమైపోయింది. అర్థమైపోయి, "కాస్త మార్గం చెప్పమ్మా" అని అడిగాడు. "ఫలానా చోట ధర్మవ్యాధుడు అని ఉంటాడు. వెళ్లి ఆయన దగ్గర ఉపదేశనం పొందు. నీకు మంచి కలుగుతుంది" అని ఆశీర్వదించి పంపింది.ఈయన అడుగుతూ వెళుతున్నాడు ధర్మవ్యాధుడు ఎక్కడ ఎక్కడ ఎక్కడ అని అడుగు ఓ అక్కడ అక్కడ అని వాళ్ళు చెప్తున్నారు. తీరా చూస్తే ధర్మవ్యాధుడు మాంసం కోస్తూ ముక్కలు కత్తిరిస్తూ అమ్ముతున్నాడు. ఇతను ఎట్లా అవుతాడు తపస్సు చేయాలి, వేషభాషలు ఉండాలి, దానికి ఒక పండిత భాష ఉండాలి. ఈ మాంసం అమ్మేటువంటి మాంస విక్రేతడ ధర్మం చెప్పేది అని ఆలోచనలో పడ్డాడు. రండి రండి ఈ వృత్తికినూ నేను చేస్తున్న నా ప్రవృత్తికి ఏం సంబంధం లేదు. ఇది కుటుంబాన్ని పోషించాలి కదా. ఇంటి ఇల్లాలి మీదనో మరొకరి మీదనో ఆగ్రహించినట్లుగా ఇక్కడ ఆగ్రహిస్తే ఎట్లా మనస్సును శాంత పరచుకోండి అంటూ ధర్మవ్యాధుడి దగ్గరకు తీశాడు. అంటే ఈ కథ మనకు ఏం చెప్తున్నది అంటే ప్రపంచం బహు క్లిష్టం. అది చాలా మల్టీప్లెక్స్ లా ఉంటుందంట ఆమె అట్లా ఉంటుంది. అండ్ multi furious multi lateral multi dimensional దీనిలో ఎవరి పాత్ర వాళ్ళు నిర్వర్తించాలి. విద్యార్థి చదువే చదవాలి, ఉపాధ్యాయుడు పాఠమే చెప్పాలి, వైద్యుడు వైద్యమే చేయాలి. ఇవేళ ఈ ధర్మం అపమార్గం పట్టడానికి కారణం ఏంటంటే ప్రతి వాడు తాను చేయవలసిన పని కాక మిగతా పనులు చేస్తున్నారు. ఉమ్ కనుక తాను రాణించకపోగా తాను సమాజానికి ఉపయోగపడని వస్తువుగా మారుతున్నాడు. చూడండి శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో "నీకు రథసారథిగా ఉంటాన"న్నాడు అర్జునుడితో. రథసారథి అంటే కేవలం గుర్రాలు నడపటం, రధం తోలటం మాత్రమే కాదు. ప్రతిరోజూ రాత్రిపూట శ్రీకృష్ణ పరమాత్మ అలసి సొలసిన పాండవులు నిద్ర పోతున్న వేళ రథ చక్రాలకు ఉన్నటువంటి రక్తపు చారికలన్నీ కూడా స్వయంగా కడిగి, గుర్రపు Giట్టలలో దాగినటువంటి ఇనుప మేకులు ఉంటాయి. ఈ అస్త్రాలు శస్త్రాలు వేసినప్పుడు వాటిలలో ఇరుక్కుపోయి ఉంటాయి. అవన్నీ clean చేసి వాటికి మాలిష్ చేసి తన శరీరం అంతా కూడా ధూళి ధూసరితం అయి ఉంది. ఆయన కూడా యుద్ధంలో ముందు కూర్చున్నది ఆయనే కదా. ఉమ్ దుమ్ము పడ్డా ఏది పడ్డా ముందు ఆయన మీద పడాలి. ఆయన మీద [నవ్వు] దానిని కూడా లెక్క చేయకుండా తెలతల వారేటువంటి వేళ వరకు అంటే పాండవులు నిద్ర లేచే దాకా ఈ రధాన్ని, ఈ గుర్రాలని సిద్ధపరిచాడు. ఆ తర్వాత ఏం చేశాడు పడుకున్నాడా లేదా కాదు కానీ తన కర్తవ్యాన్ని "నేను సారథిగా ఉంటాను" అని ఒప్పుకున్నందుకు ఆ తన ధర్మాన్ని నిర్వర్తించాడు. ఉమ్ చాలా demonstrative గా. చూడండి మళ్ళీ ఒకసారి రామాయణంలోకి వెళితే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అని కదా రాముడిని కన్నాడు దశరథుడు పుత్రకామేష్టితో. దశరథుడు మరణించే సరికి రాముడు లేడు అక్కడ. రాముడు లేడు. రాముడు లేడు అంటే లక్ష్మణుడు లేడు. భరత శత్రుఘ్నులు మేనమామల దగ్గర ఉన్నారు. మరి ఈ దశరథుడి అంత్యక్రియలు ఎవరు చేశారు? తరువాత ఎవరో చేశారు రాముడు కాక. మరి రాముడు ఎవరికి చేశాడు అని? తన సేవలో రెండు రెక్కలు పోగొట్టుకున్న జటాయువుకి అగ్నిసంస్కారం చేసి "ఈ జటాయువు నా తండ్రికి స్నేహితుడు గనుక, నా స్నేహితు-- నా తండ్రి స్నేహితుడు నాకు తండ్రితో సమానం గనుక ఈ అగ్నిసంస్కారం చేశాను" అన్నాడు రాముడు. ఇది ధర్మం. అందుకే రామో విగ్రహవాన్ ధర్మః అది. అంటే పురాణ వాఙ్మయాన్ని కూడా మనం ధర్మ స్వరూపంగా తీసుకోవాలి. ఆ కోణంలో మనం అర్థం చేసుకోవాలి. మన దృష్టిలో జటాయువు వట్టి పిట్ట, ఓ పక్షి అంతే కదా. దశరథుడు ఆ రాముడి తండ్రి. ఎంత దురదృష్టవంతుడు అనుకుంటాం. రాముడు వచ్చింది అయోధ్యను ఏలడానికి కాదు, అరణ్యాన్ని ఏలడానికి. అందుకనే పధ్నాలుగు సంవత్సరాలు ధర్మ ప్రవర్తనను చేశారు గనుకనే రామరాజ్యం అనేది రాముడు పాలించిన పదకొండు వేల ఏళ్ళు కాదు. పధ్నాలుగు సంవత్సరాలు రాముడు అరణ్యవాసం లో ఉన్నప్పుడు వీళ్ళంతా వచ్చి రాముడి దగ్గరికి "నువ్వు లేకపోతే మేము బతకలేం" అంటే "నేను ఊళ్ళో ఉన్నా మీకు రోజు కనిపించను కదా. నా తండ్రి ఆజ్ఞను నన్ను పాలించండి, నా ధర్మాన్ని. మీకు ఒక పౌర ధర్మం ఉంది. ఆ ధర్మం ఏమిటంటే యువరాజు దేశంలో లేనప్పుడు తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకు మీరందరూ కొడుకులై, కూతుళ్ళై కాపాడండి" అని అంటే రాముడి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ వల్ల మగ పిల్లవాడు పుడితే రామా అని ఆడపిల్ల పుడితే రామా అని అంటే సీత అను స్త్రీ శబ్దం అది. అందువల్ల పధ్నాలుగు సంవత్సరాలు అయోధ్య నగరంలో పుట్టినటువంటి ప్రతి పిల్లవాడికి, పిల్లకి రామా, రామా, రామా అన్నందువలన అది రామ రాజ్యం అయింది. రామనామ మహిమ చేత ముక్కారు పంటలు పండిని. అంటే ఎప్పుడైతే మానవుడు ధర్మాచరణ చేస్తూ పరమాత్మని ఆశ్రయిస్తాడో, ప్రకృతిని పూజిస్తాడో, సమతుల్యాన్ని సాధిస్తాడో ప్రకృతి వాడి పరమవుతుంది. దుర్భిక్షం ఎరగనటువంటి రామరాజ్య నిర్మాణం జరుగుతుంది. కనుకనే మళ్ళీ రామో విగ్రహవాన్ ధర్మః అది. చాలా చక్కగా చెప్పారు సార్. మీరు అన్నట్టు ధర్మం అనేది అది నశించేది కాదు, మారేది కాదు. ధర్మం అనేది ఒక సనాతనమైన వాహిని. రెండవది భారతదేశంలో పుట్టిన మన అదృష్టం వల్ల ధర్మం అంటే ఏమిటి, ఎలా పాటించాలి, ఏం చేయాలి అనే విషయంలో మనం తడుక్కో అక్కర్లేదు. వేదశాస్త్ర పురాణాల్లో ధర్మం గురించి విపులంగా విశదీకరించబడింది. మనకి అనేక ఆదర్శాలు ఉన్నాయి. ఆచరించి చూపించిన వ్యక్తులు ఉన్నారు. ఈనాటి దాకా ఉన్నారు. [backgroud music] ఇంతవరకు మీరు ఈనాటి మన యువత కార్యక్రమంలో ధర్మము అనే అంశంపై శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో మొదటి భాగాన్ని విన్నారు. వచ్చే వారం తరువాయి భాగాన్ని వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ పూర్ణచంద్ర రావు, శ్రీ గణేష్, శ్రీ సాయిప్రసాద్. సాయిరాం. [outtro music]
SSSMC · audio
Panel Discussion for youth on Human Values moderated - 06
Panel Discussion for youth on Human Values moderated - 06
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 30:44
More in this series