Skip to content
Transcript తెలుగు
[背後音樂] యువత యువత సనాతన భావం సనుతన రూపం యువత యువత రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. యువత సనాతన భావం సనుతన రూపం కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ధర్మము అనే అంశంపై శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో రెండవ భాగాన్ని మీరు వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ పూర్ణచంద్ర రావు, శ్రీ గణేష్, శ్రీ సాయి ప్రసాద్. [背後音樂] మళ్లీ ఒకసారి రామాయణంలోకి వెళితే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అని కదా రాముడిని కన్నాడు దశరథుడు పుత్రకామేష్టితో. దశరథుడు మరణించేసరికి రాముడు లేడక్కడ. రాముడు లేడు అంటే లక్ష్మణుడు లేడు. భరత శత్రుఘ్నులు మేనమామల దగ్గర ఉన్నారు. మరి దశరథుడి అంత్యక్రియలు ఎవరు చేశారు? తర్వాత ఎవరో చేశారు రాముడు కాక. మరి రాముడు ఎవరికి చేశాడు అని? తన సేవలో రెండు రెక్కలు పోగొట్టుకున్న జటాయువుకి అగ్నిసంస్కారం చేసి, "ఈ జటాయువు నా తండ్రికి స్నేహితుడు గనుక, నా స్నేహితు-, నా తండ్రి స్నేహితుడు నాకు తండ్రితో సమానం గనుక అగ్నిసంస్కారం చేశాను" అన్నాడు రాముడు. ఇది ధర్మం. అందుకే రామో విగ్రహవాన్ ధర్మః అది. అంటే పురాణ వాంగ్మయాన్ని కూడా మనం ధర్మ స్వరూపంగా తీసుకోవాలి. కోణంలో మనం అర్థం చేసుకోవాలి. మన దృష్టిలో జటాయువు వట్టిపిట్ట, పక్షి అంతే కదా. దశరథుడు రాముడి తండ్రి. ఎంత దురదృష్టవంతుడు అనుకుంటాం. రాముడు వచ్చింది అయోధ్యను ఏలడానికి కాదు, అరణ్యాన్ని ఏలడానికి. అందుకనే పధ్నాలుగు సంవత్సరాలు ధర్మ ప్రవర్తనను చేశారు గనుకనే రామరాజ్యం అనేది రాముడు పాలించిన పదకొండు వేల ఏళ్ళు కాదు. పధ్నాలుగు సంవత్సరాలు రాముడు అరణ్యవాసం లో ఉన్నప్పుడు వీళ్ళంతా వచ్చి రాముడి దగ్గరికి "నువ్వు లేకపోతే మేము బతకలేం" అంటే "నేను ఊళ్ళో ఉన్నా మీకు రోజు కనిపించను కదా, నా తండ్రి ఆజ్ఞను నన్ను పాలించండి, నా ధర్మాన్ని. మీకొక పౌర ధర్మం ఉంది. ధర్మం ఏమిటంటే యువరాజు దేశంలో లేనప్పుడు తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకు మీరందరూ కొడుకులై, కూతుళ్ళై కాపాడండి" అని అంటే రాముడి మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల మగ పిల్లవాడు పుడితే రామా అని ఆడపిల్ల పుడితే రామా అని అంటే సీత అను స్త్రీ శబ్దం అది. అందువల్ల పధ్నాలుగు సంవత్సరాలు అయోధ్య నగరంలో పుట్టినటువంటి ప్రతి పిల్లవాడికి, పిల్లకి రామా, రామా, రామా అన్నందువలన అది రామ రాజ్యం అయింది. రామనామ మహిమ చేత ముక్కారు పంటలు పండిని. అంటే ఎప్పుడైతే మానవుడు ధర్మాచరణ చేస్తూ పరమాత్మని ఆశ్రయిస్తాడో, ప్రకృతిని పూజిస్తాడో, సమతుల్యాన్ని సాధిస్తాడో ప్రకృతి వాడి పరమవుతుంది. దుర్భిక్షం ఎరగనటువంటి రామరాజ్య నిర్మాణం జరుగుతుంది. కనుకనే మళ్ళీ రామో విగ్రహవాన్ ధర్మః అది. చాలా చక్కగా చెప్పారు సార్. మీరు అన్నట్టు ధర్మం అనేది అది నశించేది కాదు, మారేది కాదు. ధర్మం అనేది ఒక సనాతనమైన వాహిని. రెండవది భారతదేశంలో పుట్టిన మన అదృష్టం వల్ల ధర్మం అంటే ఏమిటి, ఎలా పాటించాలి, ఏం చేయాలి అనే విషయంలో మనం తడువుకోవక్కర్లేదు. వేదశాస్త్ర పురాణాల్లో ధర్మం గురించి విపులంగా విశదీకరించబడింది. మనకి అనేక ఆదర్శాలు ఉన్నాయి. ఆచరించి చూపించిన వ్యక్తులున్నారు, ఈనాటి దాకా ఉన్నారు. అవును. అయినా కానీ మరొక అవతారం రావాల్సి వచ్చింది. ధర్మగ్లాని అంటే ఏమిటో, ధర్మానికి కాదు గ్లాని మనం మన ధర్మాచరణలో గ్లాని జరిగింది. గ్లాని, ఉమ్. మా-ఈ విషయంలో స్వామి ఒకసారి అన్నట్టు ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు తక్కువ లేరు కానీ ధర్మం ఆచరించే వాళ్ళే తక్కువ అయ్యారు. ఉమ్ ఉమ్. సత్యం వధ, ధర్మం చరా అంటారు కానీ ఈరోజు ధర్మం వధ, సత్యం చరా అవుతోంది. ఉమ్. ధర్మాన్ని ఆచరించాల్సి, ఆచరించటంలోనే గ్లాని జరుగుతుంది. ఉమ్. అంతేగాని ధర్మం అంటే ఏమిటో తెలియక కాదు. ఉమ్ ఉమ్. ధర్మం అంటే ఏమిటో అందరికీ తెలుసు, చెప్పేవారున్నారు. ఉమ్. మనకి ఆధారాలున్నాయి. ఉమ్. శాస్త్రాలున్నాయి. ఎందుకు అలా అవుతోంది? ఎందుకు కష్టం అవుతుంది ధర్మం ఆచరించటం. స్వామి చ-దుర్యోధనుడిని quote చేస్తూ అన్నారు "జానామి ధర్మం చిమే ప్రవృత్తి: జానామి అధర్మం చిమే నివృత్తి:" ఈరోజు మన పని ఎలా ఉందంటే మనకు తెలుసు ధర్మం అంటే ఏమిటో ఉమ్. కానీ ఆచరించలేకపోతున్నాం. దుర్యోధనుడికి మంచిదేదో తెలుసు, చెడ్డదేదో తెలుసు కానీ ఆచరించలేకపోయాడు. ఆచరించలేకపోయాడు. ఉమ్. ఈనాడు మన dilemma కూడా అదే. యువత dilemma కూడా ఉమ్. తెలియక కాదు. వారికి అనేక విధంగా అన్ని languages లోనూ, పోనీ సంస్కృతమో తెలియదనుకుంటే English లో కూడా ఉమ్. మహామూలు అందరూ English లో పుస్తకాలు కూడా రాశారు. మనకు అన్ని విధాలుగా ధర్మం అంటే ఏంటో చెప్తున్నారు. ఉమ్. తెలియక కాదు, తెలిసి ఆచరించలేకపోతున్నాం. కారణం ఏమిటి? ఉదాహరణ మూర్తి గారు చెప్పినట్టు ఉమ్ ఉమ్. రామాయణంలో నుంచి తీసుకుందాం. ఉమ్. మనం రావణుడు అధర్మం అంటాం. రావణుడు రాక్షసుడు. అతని నుంచి పెద్ద ధర్మం మనం expect చేయలేం.కానీ అక్కడ ధర్మ ఘిలానీ ఎక్కడ జరిగింది సీత సహధర్మచారిణి రాముని సహధర్మచారిణి సీత ధర్మం రాముని మాట వినటం అంతే కానీ ఇంకో వేరే విధంగా సాధువులను పోషించటం అదంతా కాదు మొట్ట మొదటిది రాముడి మాట వినటం. రామాజ్ఞను ఉల్లంఘించింద రోజు తన ధర్మం తప్పగానే మొత్తం ధర్మం అంతా disturb అయిపోయింది. అంటే ప్రకృతి ధర్మం ఎప్పుడైతే అది ఉల్లంఘించబడుతుందో automatic గా ప్రపంచంలో ధర్మం అనేది ప్రకృతి అనే కాదు ప్రకృతి ధర్మం ప్రకృతి ధర్మం అది అది sir చెప్పిన ప్రకృతి ధర్మం ఉల్లంఘిస్తే ప్రపంచానికి భూకంపాలు అవన్నీ జరుగుతాయి. తన వ్యక్తి ధర్మం కూడా తన వ్యక్తి ధర్మం పత్నిగా పతి మాట వినటం మొట్ట మొదటి ధర్మం. ధర్మం రాముడు తండ్రి ఆజ్ఞ కోసం ఎంతో sacrifice చేశారు అట్లాగే సీత రాముని మాట వినటానికి ఎంతైనా చేయాలి కానీ రోజు రాముడి మాట ఉల్లంఘించి లక్ష్మణ రేఖ దాటింది. ఉమ్ అంతే మొత్తం అంతా అందరికీ disturbance వచ్చేసింది. ఉమ్ రోజు society లో జరిగేది ఏంటి ఒక విద్యార్థిని పిలిచి నాయనా ధర్మంగా ఉండు ఇది ధర్మం అని చెప్తున్నాం చుట్టుపక్కల ఎవరు ధర్మం ఆచరించరు ఏం చేయాలి అతను యువత ఏం చేయాలి. ఎటు చూసినా అధర్మమే మధ్యలో నాకు ధర్మం ఆచరించాలని ఉంది నేను ఎలా ఆచరించగలను. ఉమ్ సో ధర్మం అనేది ఒక్కళ్ళ వల్ల అవ్వదు. ఉమ్ ఇప్పుడు సత్యం అనేది అడవికి పోయి తెలుసుకోవచ్చు తపస్సు చేసి ధర్మం అనేది కేవలం సమిష్టిలో మాత్రమే పాటించగలం. సో ఒకళ్ళనొకళ్ళు అందరూ కలిసి ధర్మం అనేది ఒక్కళ్ళ వల్ల అయ్యేది కాదు. అందుకే భగవంతుడు వచ్చాడు. ఉమ్ individually అందరూ మంచి వాళ్ళే ఉమ్ కాకపోతే అందరూ కలిసి పని చేయడంలో జ్ఞానం జరుగుతుంది. అందుకే అవతారంలో స్వామి సమిష్టిగా అందరినీ సేవ చేయమని అందరినీ కలిపి ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఉంటూ కూడా ఎట్లాగా రకరకాల మనుషులు కలిసి ఉంటూ ప్రశాంతి నిలయంలో చూస్తే అన్ని కులమత దేశజాతుల వాళ్ళందరూ ఉంటారు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. విద్యార్థులు ఉన్నారు ఇంకో వేరే businessman అందరు అన్ని రకాల వాళ్ళు కలిసి కూడా ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ cooperate చేస్తూ ఒకళ్ళొకళ్ళు అడ్డు రాకుండా కూడా ధర్మం ఆచరించే వచ్చు అనేది ఒకటి నెరపించారు. రెండవది ఏంటంటే ప్రపంచంలో బయట కూడా అన్ని చోట్ల పదం విరివిగా వాడబడుతుంది change "change is the order of the day if you don't change, change will change you" అంటారు. ఉమ్ సో మారిపోతుంది ఉమ్ ప్రపంచం క్షణక్షణం మారిపోతుంది. ఇది వరకుటి కంటే ఇప్పుడు pace మారిపోయే pace కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఉమ్ ఇప్పుడు నేను విద్యార్థిగా మొదలు పెట్టి నుంచి ఈరోజు దాకా చూసుకుంటే ఒకప్పుడు tv లు లేవు ఈరోజు tv లు వచ్చాయి ఒకప్పుడు computers లేవు ఈరోజు computer లు వచ్చాయి ఒకప్పుడు cell phones లేవు ఈరోజు cell phones వచ్చాయి. ధర్మం మారిపోతుంది దాన్ని దానికి తగ్గట్టుగా మనం technology మారే కొలది మన ఉమ్ ధర్మాన్ని కూడా disturbance వస్తోంది those are all disruptive technologies అంటారు change కూడా change management ఎట్లా చేయాలి అది కూడా యువతకు ఒక ఉమ్ ఒక పెద్ద dilemma again దాని గురించి రామాయణంలో స్వామి చెప్తారు. ఏంటంటే వాలి వాలిని రాముడు బాణం వేసి కొట్టినప్పుడు ఆయన చివరి క్షణాల్లో రాముడిని అనేక ప్రశ్నలు అడుగుతారు. నన్ను ఎందుకు కొట్టావు చెట్టు చాటు నుంచి ఎలా కొట్టావు అంటే నువ్వు జంతువి నేను మనిషిని నేను రాజుని కాబట్టి అట్లా చేయొచ్చు చేయొచ్చు అసలు నీకు ఎవరు అధికారం ఇచ్చారు అంటే నేను భరతుని representative ని అది నా రాజధర్మం అలా రకరకాలుగా questions అడుగుతాడు. ఉమ్ ఒక question అడిగినప్పుడు రాముడు silent గా ఉండిపోతాడు. ఉమ్ ఏమిటంటే నువ్వు మానవుడివి నేను జంతువుని అంటున్నావ్ మనుధర్మం మానవులకు వర్తిస్తుంది నేను జంతువుని సో నాకు పరాయి భార్య అనే ధర్మాలు ఉండవు. ఉమ్ నీ ధర్మం నా మీద ఎందుకు వాడావు నీది higher ధర్మం మానవుడిగా ఉమ్ నేను కోతిని నాది lower ధర్మం నీ ధర్మం నా మీద ఎందుకు వాడావు అని అడుగుతాడు. ఉమ్ అడిగినప్పుడు రాముడు సమాధానం చెప్పడు రామాయణంలో ఉమ్ కానీ స్వామిని విషయం ఒక విద్యార్థి అడిగినప్పుడు స్వామి చక్కటి సమాధానం చెప్పారు. ఉమ్ ఏమిటంటే అన్ని ప్రశ్నలు అడుగుతుందే కోతి అంత ధర్మం గురించి నిశితంగా అంత questions అడుగుతోందే ధర్మం తెలియకుండానే అలా అడుగుతుందా అంటే కోతి అయినా పుట్టుకతో కోతి అయినా దానికి ధర్మాలన్నీ తెలుసు. ఉమ్ ఎవరైతే ధర్మం తెలిసి కూడా ఆచరించరో అదే అధర్మం తెలియక చేసేది తెలియక తప్పులు చేస్తే అధర్మం కాదు. ఉమ్ తెలిసి కూడా ఆచరించని వాడు ఈనాడు ఏం జరుగుతోందంటే మనిషి చాలా develop అయ్యాడు జ్ఞానం చాలా develop అయింది మనిషికి ధర్మం higher ధర్మం తెలుసు. ఉమ్ మాములు lower ధర్మం కంటే higher ధర్మం తెలుసు. అయినా తన convenience గురించి తన స్వార్థం గురించి lower ధర్మాలు ఆచరిస్తూ ఉన్నాడు. ఉమ్ ఇప్పుడు మనం పాత కాలపు కథల్లో నుంచి వాటిలో నుంచి తెలుసుకునేది ఆనాటి ధర్మాలు. ఈనాడు రాజధర్మం అనే question పెద్ద ఉండదు ఎందుకంటే ఈరోజు క్షత్రియ జాతులు ఉండవు ఉమ్ బ్రాహ్మిణ జాతుల్లో కూడా అట్లాంటివన్నీ చాలా తేడాలు వచ్చాయి I mean ఆరోజు దేశకాల పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు. ఉమ్ అట్లాగే కుల ధర్మాలు మారాయి మత ధర్మాలు మారాయి ఆనాడు మతాలు వేరు ఈనాడు మతాలు వేరు. ఆనాడు ఒకే ఒక మతం ఉండే-ఉండేదేమో ఈనాడు పలు రకాల మతాలున్నాయి మనం సహజీవనం చేయాలి. సో చాలా change వచ్చింది. ఈనాడు మనం పాటించాల్సింది పాతకాలపు ఉదాహరణలు తీసుకుని పాత ధర్మాలు కాదు కొత్త తరానికి కొత్త పరిస్థితుల్లో change management చేస్తూ విధమైన ధర్మం మనం ఆచరించాలి అనేది యువతకి ఒక ఇది ఒక పెద్ద dilemma అక్కడే స్వామి మనకి చూపించిన ఆదర్శాలు ఉపయోగపడతాయి. రావు గారు పాత ధర్మం కొత్త ధర్మం అని రెండు లేవనే మనం అంగీకరిస్తాం. ధర్మం నుంచి స్ఫూర్తి తీసుకోవాలి లేకపోతే రామాయణ భారత భాగవతాలు redundant అయిపోతాయి. అవే ఆచారాలు వద్దు గానీ ధర్మాన్ని యొక్క స్ఫూర్తి ఇవాళ మనకి చాలా అవసరం.To redefine ourselves. అసలు define చేయటానికి మనం ఉంటేగా redefine కాబట్టి ఇక్కడ స్వామి ధర్మం విషయంలో ఒక మాట చెప్పారు. మనందరికీ నోటపట్టని మాటే "చెప్పుట సులభము చేయుట కష్టము" ధర్మ ప్రబోధం వేరువేరుగా సాగుతున్నది. త్రేతాయుగం నాటి శ్రీరామ ధర్మంలో ఇవాళ నా తండ్రి మాట యువకుడిగా నేను అనుకోండి, నా తండ్రి మాట వినకుండా ఉండేకంటే వినటం రామధర్మాన్ని నేను స్వీకరించినట్టేగా. నా భార్య ఒక అందమైన భార్యో, కురూపి అయిన భార్యో నాకంటూ ఒక భార్య ఉన్నప్పుడు పరాయి వాడి భార్యని నేను కోరుకొనేటువంటి నికృష్ట స్థితి నుంచి నన్ను నేను బయట పడేసుకోవచ్చు కదా. స్నేహ ధర్మంలో సుగ్రీవుడి మైత్రికి ఒక అండగా నిలబడ్డారు శ్రీరామచంద్రుడు. ఎందుకు silent గా ఉన్నాడు? Silent దానికి కూడా ఆయన answer ఇవ్వాలి కదా. ఎందుకంటే మనుధర్మ శాస్త్రం మానవ రూపంలో ఉన్న నారాయణుడికి చెందదు. పరమాత్మకు ధర్మ-- పరమాత్మే ధర్మం. ఆయన ఒట్టి మానవుడే గనక అయి ఉన్నట్లయితే మనుధర్మాన్ని పాటించి ఉండేవాడు. అందువలననే వాల్మీకి రామాయణంలో రాముడు silent అయినాడు అక్కడ. కారణం అక్కడ రాముడుగా కనిపిస్తున్న నారాయణుడు. నారాయణుడికి ధర్మం పూర్తిగా తెలుసు. కనుక జాతి ఇందాక మనం అనుకున్నాం జాతి ధర్మంలో గతించిన కాలం నుంచి మనం స్ఫూర్తిని తీసుకోవాలి. గతం లేకపోతే ఇవాళ వర్తమానం పుట్టలే. వర్తమానం గనక మనం redefine చేసుకోకపోతే రేపు భవిష్యత్తు రాదు. ఇవాళ మనం యువకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం గనుక, రాజధర్మం అక్కర్లేదు గాని రాజులు పాలించిన ధర్మం హరిశ్చంద్రుడు. ఒక సత్యం, ఇవాళ ఒక అబద్ధం ఆడటానికి లేదా ఒక సమస్య నుంచి బయట పడటానికి ఎన్నో అబద్ధ- ఎన్నో అబద్ధాలు అల్లి అల్లి అల్లి మానసికంగా అలిసిపోతున్నాడు. "సత్యం బ్రుయాత్ ప్రియం బ్రుయాత్ బ్రుయాత్ సత్యం అప్రియం" ఎంత అద్భుతమైన వాక్యం! సత్యం గనక చెప్పేస్తే ఒకవేళ నేను తప్పు చేశాను, మీ యెడల నేను తప్పు చేశాను. అయ్యా! నేను పొరపాటు చేశాను ఇకపై ఎప్పుడూ చేయను. దీని వలన మీకు కష్టం కలిగించాను అందుకు నన్ను క్షమించండి. అనటంలో ఏది అడ్డం వస్తున్నది? అహం అడ్డం వస్తున్నది. అహం ఒక్కటే కాదు సుమా, అహంకారం అడ్డం వస్తున్నది. రెండింటితో పాటు ధర్మ అతిక్రమణ కూడా అడ్డం వస్తున్నది. కాబట్టి ధర్మాన్ని ఆచరించే వాడు తప్పుని అంగీకరిస్తాడు, ఒప్పుని ఆశ్రయిస్తాడు, సత్యాన్ని పాటిస్తాడు. అక్కడ జాతి, యుగము, తరం అంటూ లేదు. కాకపోతే ఆచరించిన వాళ్ళ సంఖ్యలో తేడా ఉంటుంది. అది నా అభిప్రాయంగా నేను భావన చేస్తూ పాతది ఇవాళ పనికిరాదనే మాట మనం వదిలేద్దాం. ఎందుకనంటే పాతది నిన్న లేకపోతే నేడు లేదు, నేడు లేకపోతే రేపు రాదు. ఇవాళ మనం రాముడు గురించి, కృష్ణుడు గురించి, స్వామి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళు ధర్మానికి నిలబడ్డారు. ధర్మ స్వరూపంగా వాళ్ళు జీవితంలో demonstrate చేశారు. ఇవాళ మన అవసరాలు మారినయి. తదనుగుణంగా విలువలు మార్చుకున్నాం. కానీ ధర్మాన్ని మనం మార్చలేకపోయాం. ఎందుకంటే అది ఎవరి వల్ల కాదు గనుక. కనుక వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, ప్రాదేశిక, దేశ, అంతర్జాతీయమైనటువంటి సమస్త జాతులనీ నడిపించేటువంటి ఒకే ఒక ధర్మం అదే మానవతా. మానవతకి స్వామి పెద్ద పత్రం పెట్టారు. మానవీయమైన విలువలను సత్య ధర్మ శాంతి ప్రేమలుగా దాన్ని క్రోడీకరించి ఇదిగో ధర్మాన్ని మీరు ఆచరిస్తూ వెళ్ళండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీరు చేయవలసిన పని చేయకుండా ఇంకెవరైనా చేయలేదని ఒకసారి ఇక్కడే స్వామి రోజుల్లో పలకరించేవారు వరసల్లో కూడా. ఒకతను చెప్పడం మొదలు పెట్టాడు, "స్వామి ఫలానా వాడు అదిగో అక్కడున్నాడు నన్ను యాతన పెడుతున్నాడు అది ఇది" స్వామి అంతా విన్నారు. విని, ఇప్పటికి నాకు గుర్తు. ఒకే ఒక్క మాట అన్నారు "అతను బాధ పెడుతున్నాడు, అతను పెడుతున్నాడు అని చెప్తున్నావే, ఆలోచించు నీ స్వభావమే నిన్ను బాధ పెడుతున్నదేమో" అని వెళ్ళిపోయారు. ఆలోచిస్తే ఆలోచిస్తే మనల్ని బాధ పెట్టేది మనమే, ఇంకొకడు కాదు. మన ధర్మ మార్గంలో ఉన్నంత కాలం మనం ధర్మాన్ని ఆచరించినంత కాలం అంటే ఒక్కొక్కడు ఎవరికి వాళ్ళుగా సాధన అనేది సమష్టిగా చేయటానికి ముందు వ్యక్తిత్వం ప్రారంభం కావాలి. నన్ను నేను సరిదిద్దుకోకుండా నేను సమాజాన్ని మార్చలేను. లేదు సమాజానికి నేను బరువు కాలేను, ఒక పరువు కాలేను. బరువుగా మిగిలిపోతా. కాబట్టి ధర్మం ఒక మల్టీ డైమెన్షనల్ aspect లో మనం గనక మాట్లాడుకున్నట్లయితే ఈనాటి అతి వాస్తవిక దృష్టితో ఇవ్వాళ యువత ప్రతి దేని విషయాన్నైనా విశ్లేషించగలిగినటువంటి ఒక intellect ఉన్నది. కాకపోతే intellect కి పదును కావాలి, splendour కావాలి. అది పాతకాలం నుంచి మనం తీసుకుందాం. ఇది నా అభిప్రాయం. ఇక్కడ కొన్ని మంచి విషయాలు మనకి ఆహ్ పైకి వస్తున్నాయి కాబట్టి- బయటికి వస్తున్నాయి. ఆ. ఊ. విషయాన్ని మనం కొంచెం లోతుగా తెలుసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఖచ్చితంగా. మనం యుగయుగాలు గడుస్తున్న కొద్దీ మనం ధర్మం ఎట్లాగా అభివృద్ధి చెందుతుంది అని ఒక positive direction లో గాని మనం ఆలోచించగలిగితే, రాముడు ఉన్నప్పుడు ఒక రాజ్యం మొత్తం మీద ధర్మం నిలబడేది. ఊ. అదే కృష్ణుడి యుగం వచ్చినప్పుడు ఒక కుటుంబం పాండవులలో ఒక స్థిరమైన ధర్మం పాటించ-పాటించబడడం జరిగింది. కానీ కలియుగం వచ్చే సమయానికి స్వామి అన్నట్టు ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉన్నాయి. కానీ అది మనుషులుగా మనం ఎట్లా గుర్తిస్తాం అది? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం ఎట్లా ఉందంటే ఒక మంచి మనిషి మనం అనుకుంటే మంచి మనిషి మంచివాడు అని మనం అనుకుంటే అతని చుట్టూ ఉన్న పరిస్థితులు అతన్ని ధర్మం ఆచరించనివ్వకుండా చేసేవే ఎక్కువగా కనిపిస్తున్నాయి గాని దానికి అనుకూలమైన పరిస్థితులు చాలా తక్కువగా కనిపిస్తున్నాయని నా అభిప్రాయం. ఊ. ఎందుకంటే polarity between positive and negative negativity వైపు ఎక్కువ సమాజాన్ని తీసుకువెళుతుందని నా ఉద్దేశం. దీని గురించి ఏమంటారు? మనం దాన్నిస్వామి ఎంతో అద్భుతంగా మనకి విద్యాలయాలు గాని, వైద్యాలయాలు గాని సృష్టించి He set role models. అవును ఒక particular environment మన చుట్టూ తయారు చేసి role models ని మీరు కూడా అభివృద్ధి పరుచుకోవాలి అని స్వామి ఒక example ఇచ్చి, విద్యని ఇలా అభ్యసించాలి అని చెప్పి ఒక గురుకుల విధానంలో పిల్లలకు విద్యను అభ్యసించి, విద్యార్థిగా ఉన్నప్పుడు కేవలం విద్యనే అభ్యసించాలి అనే ఒక దృష్టిని మనకి అభివృద్ధి పరిచారు స్వామి. అలాగే వైద్యాలయాలు, వైద్యుడు చేయవలసింది వ్యాపారం కాదు కేవలం వైద్యం. ప్రేమతో వైద్యం చేయాలి అని ఒక ఆదర్శాన్ని నిరూపించారు స్వామి. అట్లాగ వివిధ కోణాల్లో స్వామి ఒక environment సృష్టించారు. కానీ దీన్ని మనం project చేసుకునేది అయితే ప్రపంచంలోని దాన్ని ఎలా అభివృద్ధి పరుచుకోవాలి? positive-- negative ని positive గా ఎలా మార్చుకోవాలి? దీనికి నా సమాధానం ఒకటుంది. నీ జీవితం ఎవరో సృష్టించరు. నువ్వు ఎట్లా ఆలోచిస్తే నీ జీవితం అట్లా రూపుదిద్దుకుంటుంది. ఆలోచనా విధానంలో గనక సమూలమైన మార్పులు రాగలిగితే, ఇందాక గణేష్ అన్నట్లుగా చుట్టూ వాతావరణం బాగాలేదు అని. పద్మం బురదలోనే పుడుతుంది. ధైర్యం పిరికితనంలో నుంచే వస్తుంది. వెలుగు చీకటి గర్భం చీల్చుకొని బయటకు వస్తుంది. నిరాశ ఒక అసహాయతలో నుంచి వస్తుంది. మూలాల్లోకి మీరు వెళ్లినట్లయితే negativity లో నుంచే positivity వస్తుంది. positivity లో నుంచి positivity ఎలాగో వస్తుంది but నిలబడే అటువంటి positivity ఎక్కడ అంటే దాని మూలాలు అన్నీ negative యే. ఉమ్ కాబట్టి ఇది negative ఉండకూడదు అని కాదు, ఉండి తీరుతుంది. సృష్టి ధర్మం అది. Negative energy is supposed to be there and it will be there, it should be there. రామాయణంలో సీత మహా పతివ్రత కదా! ఉమ్ గొప్ప మహాలక్ష్మి స్వరూపం. పెంచిన తండ్రి జానక స్వరూపుడు అయినటువంటి జనక మహారాజు. కానీ ఆమెకు ఎటువంటి వాళ్ళు దొరికారు? ఒక పక్క కైక, ఒక పక్క మంధర, మరొకవైపు శూర్పణఖ. అంటే ఆమె అందం గాని, ఆమె చందం గాని, ఆమె ఐశ్వర్యం గాని, ఆమె జ్ఞానం గాని ఎక్కడ ఆమెకు అక్కరకు వచ్చిన సమయం లేదు పాత్రల ద్వారా. కానీ వీటన్నింటి మధ్య సీత సీతగా అగ్ని స్వరూపంగా నిలబడింది. ఎక్కడ? తాను ఎక్కడ ఉండటానికి వీలు లేదో అటువంటి రావణుడి ఇంట తాను తానుగా నిలబడింది. ఇది స్వధర్మే నిధనం శ్రేయః. అలాగే రావణుడు అసురుడు కాదు. రావణుడు బ్రాహ్మణుడు. పౌలస్త్య బ్రహ్మ వాడు. వేద వేదాంగాలను పుక్కిట పట్టినవాడు. వాస్తు శాస్త్ర ప్రకారం లంకానగర నిర్మాణం చేసిన వాడు. కానీ ఇందాకని ధర్మ అతిక్రమణ చేశాడు అది. ఉమ్ ధర్మాతిక్రమణ ఎందుకు చేశాడు? దాని interpretation వేరే. కానీ పైకి కనిపించేవాడు action, intention కాదు. ఉమ్ Action ఏది? అమ్మవారిని తేవటం తప్పు. అంటే He paid for it. వాడు ఒక్కడేనా? జాతి జాతి suffer అయింది. కాబట్టి వ్యక్తి, అందుకనే సంస్కరింప నేల సంఘమంతటి నీవు, సజ్జనుండవగుము స్వార్థముడిగి, ఒక్క నీచుడప్పుడు ఉర్విలో తగ్గును అని పెద్దల మాట. అంటే సంస్కారం ఎక్కడి నుంచి రావాలి? ఇవాళ యువత సత్యసాయి భగవానుడి ఆదర్శాలలో నుంచి కాసేపు మాట్లాడుకున్నట్లయితే వ్యక్తి నిర్మాణం పటిష్టంగా జరగాలి. అందుకే నిన్నో మొన్నో ఎక్కడో మనం అనుకుంటూ నిన్న రాత్రి సత్యసాయి భగవానుడి అవతారం మోక్షం ఇవ్వటానికి వచ్చింది కాదు, అది ఇవ్వదు. దాని పని అది కాదని చెప్పేశారాయన. మరి ఏమిస్తుంది? transformation ఇస్తుంది. నిన్నటికంటే ఈరోజు నేను బాగా బతికాను అనిపించుకునేట్టు బతకాలి. ఉమ్ రేపంటూ ఉంటే ఇవాళ కంటే ఇంకా ఖచ్చితంగా బాగా బతుకుతా. ఎట్లా బతుకుతాను నేను? నాకు నా చుట్టూ శాస్త్రాలున్నాయి, మనుషులున్నారు, ఆదర్శనీయమైనటువంటి అద్భుతమైన వ్యక్తులున్నారు. అన్నిటినీ మించి ఒక అవతార మూర్తితో నేను కలిసి జీవించాను. ఆయన ఇవాళ దేహంలో లేకపోయినా స్ఫూర్తి, ఆయన మాటలు ప్రపంచం మొత్తం మీద through technology it is available అనుకున్నప్పుడు నేను గురు ఒక-ఒక ఏకలవ్యుడు ఒక ద్రోణాచార్యుడిని చూడకుండా బాణ విద్య నేర్చుకోగలిగినప్పుడు, ఒక వ్యక్తి ఇవాళ సత్యసాయి భగవానుడితో direct పరిచయం లేకపోయినా స్వామి యొక్క స్ఫూర్తిని తీసుకున్నట్లయితే వాడు ఉత్తమ మానవుడు కాగలడు. కనుకనే youth ఇవాళ దేనిని ఆశ్రయించాలి అని అంటే స్వామి బోధలు గనక ఆశ్రయించినట్లయితే అది సర్వ వేదముల సారం. సర్వ శాస్త్రాలలో ఉన్న essence స్వామి చెప్పారు. ఆయన కొత్తది ఏదీ చెప్పలేదు. స్వామి కొత్తగా చెప్పిన ఒక్క మాట నాకు కనపడలే. అండ్ పైగా ఆయన అదే అన్నారు, నేను కొత్తది చెప్పటానికి రాలేదు. ఉన్నది మళ్ళీ పునః మీకు చెప్పటానికి వచ్చాను. అని ఎప్పుడైతే ఒక అవతారమూర్తి ఇంత స్పష్టంగా చెప్తున్నారో మనం ఏం చదువాలి అంటే రెండు రకాల సాహిత్యాలు పరుచుకొని ఉంటాయి మన ముందు. మనల్ని అడుగుతుంటారు, స్వామిల గురించి బాగా తెలుసుకోవాలంటే ఏం చదవాలి సార్? ఏదైనా ఒక book చెప్పండి అని అడుగుతారు. యువతే అడుగుతుంది. నేనంటాను సాహిత్యం ఇక్కడ రెండు రకాలు స్వామి పరంగా. ఒకటి స్వామి సృష్టించిన సాహిత్యం, రెండవది స్వామి చుట్టూ సృష్టింపబడిన సాహిత్యం. స్వామి సృష్టించిన సాహిత్యం సత్యం. స్వామి చుట్టూ సృష్టింపబడిన సాహిత్యం అది వైయక్తికం, individualistic. నేను ఎట్లా చూశానో అట్లా రాశా, అంతే. నా కోణం చాలా చిన్నది. కానీ స్వామి అవతారమూర్తి. అనేకమైనటువంటి విషయాలను వాహినీ స్వరూపంగా ఇచ్చారు గనుక సత్యసాయి భగవానుడి మాటలు మనకు అర్థం కావాలి, ఆయన ప్రబోధాలు తెలుసుకోవాలి, సనాతన ధర్మ వేదికగా ఉన్నదా లేదా తెలుసుకోవాలి అంటే వాహీనులు చదవాలి. చదివితే అంతా ధర్మ విచారణే, ఇంకేం చెప్పలేదు స్వామి దాంట్లో. ధర్మమే సమయపాలన ధర్మం కాదా? ఎప్పుడైనా స్వామి ఎక్కడైనా violate చేశారా? మూడు వందల-- మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఉపన్యాసాల్లో స్వామి ఎప్పుడైనా ఒక్క పొల్లు మాట మాట్లాడారా?ఇంక ఎవరి గురించైనా మాట్లాడు, ఇవన్నీ ధర్మానికి లోబడని వాడు చేసే పనే. మనం మాట్లాడేటప్పుడు వాడు ఇట్లా వీడు ఇట్లా అంటాం comparative study చేస్తాం. స్వామి never compared anybody with anybody. ఏది సత్యమో, ఏది ధర్మమో, ఏది ప్రపంచం అందుకోవాలో దాన్ని చెప్తూ వచ్చారు గనుక వ్యక్తి transform కావాలి final గా summing up. ఏం చేయాలంటే తనలో ఉన్న గుణాలు, మనలో ఉన్న గుణాలు మనకు తెలిసినట్టు లోకానికి తెలియదు. మనల్ని మనం వాటిని identify చేసుకుంటూ వాటిని ఒక్కొక్కటి ఒకే రోజు వదిలిపెట్టలేకపోయినా నెమ్మది నెమ్మదిగా సత్సంగం చేత, సత్సంగం చేత, సదాచారం చేత, సమ్యక్ సంకీర్తన చేత, సహజీవన సౌందర్యం చేత, అందుకే స్వామి చెప్పిన ఏబిసి ఉందే avoid bad company గుర్తుపెట్టుకున్నట్లయితే ఆలోచనలన్నీ మనల్ని ధర్మమార్గం వైపే నడిపిస్తాయి. మనకు అధర్మ మార్గం ఒకటుందన్నది కూడా మనకు తెలియదు. అది తెలియని వాడు అధర్మ మార్గంలో వెళుతున్నాడని మనం దూరంగా యువత వెళ్ళిపోతున్నది అనొద్దు. యువత వెళ్ళకుండా మనం ఏం చేస్తున్నామను ప్రశ్న వేసుకున్నట్లయితే సత్యసాయి భగవానుడి ఆదర్శ జీవితాన్ని మనం తీసుకోవాలి. ఆయన ఎట్లా గడిపారు? ఒక పరమాత్మ అయ్యుండి కూడా మానవ దేహంలో ఉన్నందుకు ఎంత అద్భుతంగా జీవితాన్ని గడిపారు. సమయపాలన ఎలా చేశారు? ఎంత simple living highest thinking. ఇవన్నీ ధర్మానికి సంబంధించినటువంటి అనేక పారుశ్యాలని నా అభిప్రాయం. ఎవరికి వారం విశ్లేషించుకోవాలి మనం. విశ్లేషించుకోవాలి. ఆటో ఆటో suggestion చేసుకోవాలి. self audit చేసుకోవాలి. ప్రతిదీ కూడా మన నుంచి ప్రారంభం కావాలి. నాలో ఉన్న లోపాన్ని నేను గమనించినట్లు ఒకవేళ మీరు గమనించినా లోపం నాలో ఉన్నా నేను ఒప్పుకోను. కారణం నాకు అహంకారం ఉంది గనుక. కానీ నాలో ఉన్న అహం అహాన్ని నాలో ఉన్న లోపాన్ని నేను గమనించడంలో నాకు ఎవరు permission ఇవ్వక్కర్లే. కనీసం పని గనుక చేయగలిగితే ధర్మ మార్గం మనకు విస్పష్టంగా ఒక అద్భుతమైన పాలపుంత లాగా కనిపిస్తుంది. దానికి సత్యసాయి భగవానుడు ఒక నిర్దిష్టమైనటువంటి మార్గాన్ని ధర్మాన్ని ఉపదేశనం చేస్తూ వారి జీవితమంతా డెబ్బై రెండు సంవత్సరాలు బౌద్ధ స్వామి బోధ. బోధ అంతా ఆయన చెప్పినదానికి, జీవించిన దానికి ఎక్కడా తేడా లేదు. ఆయన కూడా యువకుడు గానే గా ప్రారంభించింది జీవితం. ఆయన అన్న డెభై ఏళ్ళు వచ్చిన తర్వాత చెప్పారా? అరవై ఏళ్ళు వచ్చాక? పద్నాలుగు ఏళ్ళ నుంచి మొదలు పెట్టారు. మరి ఇవాళ యువకుడు అనబడేటువంటి వాడు స్వామి అయితే ఇంకా బాలుడుగానే మనం యువత గురించి మాట్లాడుతున్నాం. పద్నాలుగు, పదిహేను సంవత్సరాలు వచ్చేప్పటికి మనిషి ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి. జాతి ధర్మం తెలుసుకోవాలి. మనంతా వంశ గౌరవం నిలబెట్టమని మన బిడ్డల్ని కాళ్ళ వెళ్ళబడుతుంటాం. వంశం నిలబెట్టరా, కాపాడురా అంటుంటాం. వాడు జడు మార్గంలో వెళుతున్నప్పుడు. ఇక్కడ వంశమూ, కులమూ కాదు. వ్యక్తిగా వాడు బాగుపడాలి. అందుకనే స్వామి sixty eighth birthday అప్పుడు ఒక మాట చెప్పారే. మీకు నాకు రోజూ చాలా ఉత్తరాలు వస్తాయి. ఉత్తరాలన్నీ చదువుతాను. మా బిడ్డలకు బాగా కళ్యాణం జరగాలని, మా బిడ్డలు విదేశాలకు వెళ్లాలని, మంచి స్థితిలోకి రావాలని కోరుకున్నారే తప్ప ఒక్క తండ్రి నుంచి గానీ, తల్లి నుంచి గానీ నా కడుపున పుట్టిన వాడు ఉత్తమ మానవుడు కావాలని కోరుకుంటూ ఇంతవరకు ఒక్క ఉత్తరం నాకు రాలేదన్నారు. అప్పటికి స్వామి దేహానికి అరవై ఏళ్ళు వచ్చేసినాయి. కాబట్టి ధర్మ మార్గం మనకు ముందు పరచుకొని ఉంది. సహజ మార్గం దేశంలో. మిగతా అధర్మం అంటే ఇక్కడ సమాజం ఉంది, కుటుంబం ఉంది, అన్నీ కలిసి ఉన్నాయి ఇక్కడ. మిగతా దేశాల్లో అన్నీ విడివిడిగా ఉన్నాయి. వ్యక్తి వేరు, సమాజం వేరు. ఇక్కడ వ్యక్తే సమాజం. సమాజం వలన వ్యక్తి, వ్యక్తి వలన సమాజం పరస్పరం ఆధార ఆధేయంగా ఉన్నాయి కాబట్టి ధర్మ మార్గము ఖచ్చితంగా మనం ఆచరించవలసిందే. పాతకాలం నుంచి స్ఫూర్తిని పొందవలసిందే. అనేకమైనటువంటి విషయాలను ఎప్పుడూ అర్థం చేసుకోవలసిందే, అధ్యయనం చేయవలసిందే, ఆచరించవలసిందే, అనుభవాన్ని పొందవలసిందే, అనుభూతి చెందించుకోవలసిందే, తప్పదు. [背景音乐] ఇంతవరకు మీరు ఈనాటి మన యువత కార్యక్రమంలో ధర్మము అనే అంశంపై శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో రెండవ భాగాన్ని విన్నారు. వచ్చే వారం తరువాయి భాగాన్ని వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ పూర్ణచంద్రరావు, శ్రీ గణేష్, శ్రీ సాయిప్రసాద్. సాయిరాం. [outro jingle]
SSSMC · audio

Panel Discussion for youth on Human Values moderated - 07

Home

Panel Discussion for youth on Human Values moderated - 07

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 29:08

More in this series

Panel Discussion on Human Values for Youth

3 episodes · 1 hr 33 min

  1. 30 min 22

    Panel Discussion for youth on Human Values moderated - 06

  2. 29 min 23

    Panel Discussion for youth on Human Values moderated - 07

    Now playing
  3. 33 min 24

    Panel Discussion for youth on Human Values moderated - 08