Skip to content
Transcript తెలుగు
[ back ground music] యువత! యువత! సనాతన భావం! సనూతన రూపం! యువత! యువత! రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. యువత సనాతన భావం సనూతన రూపం కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ధర్మము అనే అంశంపై శ్రీ బి ఎస్ ఆర్ మూర్తి గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో చివరి భాగాన్ని మీరు వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ పూర్ణచంద్ర రావు, శ్రీ గణేష్, శ్రీ సాయి ప్రసాద్. కాబట్టి ధర్మ మార్గం మనకు ముందు పరచుకొని ఉంది సహజ మార్గం దేశంలో. మిగతా అధర్మం అంటే ఇక్కడ సమాజం ఉంది కుటుంబం ఉంది అన్నీ కలిసి ఉన్నాయి ఇక్కడ. మిగతా దేశాల్లో అన్నీ విడివిడిగా ఉన్నాయి వ్యక్తి వేరు సమాజం వేరు. ఇక్కడ వ్యక్తే సమాజం. సమాజం వలన వ్యక్తి, వ్యక్తి వలన సమాజం పరస్పరం ఆధార ఆధేయంగా ఉన్నాయి కాబట్టి ధర్మ మార్గం ఖచ్చితంగా మనం ఆచరించవలసిందే. పాతకాలం నుంచి స్ఫూర్తిని పొందవలసిందే. అనేకమైనటువంటి విషయాలను ఎప్పుడూ అర్థం చేసుకోవలసిందే, అధ్యయనం చేయవలసిందే, ఆచరించవలసిందే, అనుభవాన్ని పొందవలసిందే, అనుభూతి చెందించుకోవలసిందే, తప్పదు. మనిషి ఆచరించాల్సిన పురుషార్థాలు అని చెప్తారు కదా అందులో ధర్మం మొదలుగా వస్తుంది. అంటే ధర్మం అంటే ఇంతవరకు విన్న మన కార్యక్రమంలో ఒక మార్గం అని చెప్పుకోవచ్చు, అందరికీ సాధారణంగా అర్థం అయ్యేలా. అంటే మనిషి ఆచరించాల్సిన ఒక నిశ్చితమైన మార్గం. అయితే సత్యాన్ని ధర్మాన్ని పోల్చుకున్నప్పుడు సత్యానికి ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఏంటంటే త్రికాల బాధ్యం సత్యం అంటాం. అంటే మూడు కాలంలో దానికి మార్పు అనేది ఉండదు. కానీ ఇప్పటివరకి మీరు మాట్లాడుతున్న మాటలు వింటున్నప్పుడు కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది ధర్మం. తర్వాత ఇంతకుముందు అనుకున్నట్లుగా ధర్మం ఆచరించాలి అంటే చుట్టూ వాతావరణం ఉండాలి. మరి రోజు రాముడు ఒక కార్యం చేయగలిగాడు అంటే తన చుట్టూ ఉన్న తన అన్నదమ్ములు అన్నింటికీ సహకరించారు, చెప్పిన మాటలు విన్నారు. కానీ నేటి సమాజంలో చూసుకుంటే ఒకడు ధర్మాన్ని ఆచరించే వాడు అయినప్పటికీ లేదురా మనం ఇలా చేయకూడదు అని చెప్పినా వాణ్ని చులకనగా చూసేవాళ్ళు ఉంటారు. అది సాధారణం. అయితే దాన్ని చూసి మనిషి ఆగిపోతే, అంటే వాడికి ధర్మం తెలుసు కానీ ఎదుటి వాడు ఏమనుకుంటాడో, నేను ఇప్పుడు అందరికీ మంచి పేరు తెచ్చుకోలేనేమో అని దాన్ని ఆచరించకుండా పోతే అది వ్యర్థం. నిజానికి అవతార పురుషుడు ఆదర్శ పురుషుడు ఆచరించినవన్నీ కూడా వాళ్ళందరికీ అప్పుడు అన్నీ supportive గా లేవు. సత్య హరిశ్చంద్రుడు ఒక్కడే ఎందుకు సత్యానికి మారుపేరు అయ్యాడు అంటే మిగతా వాళ్ళు ఆచరించనప్పటికీ తనొక్కడు దాన్ని ఆచరించి చూపించగలిగాడు కాబట్టి పేరు తీసుకుని రాగలిగాడు. అండ్ అది ఆచరిస్తున్నప్పుడు అప్పుడే మనం దాని ఫలితాన్ని చూడలేం. ఉమ్ ధర్మం ఆచరిస్తున్నప్పుడే ధర్మరాజు అని పేరు పెట్టారు. ధర్మాన్ని ఆచరించి దాన్ని సాధించినప్పుడు ధర్మరాజు వీరుడని పేరు చెప్తాం. అదొకటి మనం గమనించాలి. ఉమ్ నేటి యువత అనుకుంటారు ధర్మము న్యాయము. అసలు ధర్మము న్యాయము అంటే ఒకటేనా? నేను చేసేది న్యాయమా? ధర్మమా? అసలు ధర్మం అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటి? అన్న పరిస్థితిలో ఉంటారు. ఇదొక సందేహం మన ఈనాటి యువతకు చెప్పాల్సింది. ఉమ్ సో దీనిపైన కాస్త... రావు గారు మీరేమంటారు? యువత విషయం దగ్గరికి వచ్చేసరికి ఉమ్ యువత యవ్వనం అనేది చాలా ముఖ్యమైన phase మన జీవితంలో. చాలా ముఖ్యమైంది. ఎందుకంటే బాలురుగా ఉన్నప్పుడు మూర్తి గారు చెప్పినట్టు ధర్మానికి లోబడి ప్రవర్తిస్తాం మనం. ఎందుకు తండ్రి చెప్తారు ధర్మం ఏమిటో. గురువులు చెప్తారు. ధర్మానికి లోబడి ప్రవర్తిస్తాం మనం. మనకి దా-దాని అవగాహన ఉండకపోవచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, లేకపోవచ్చు కానీ ధర్మం అనేది మన మీద అది పెట్టబడింది గనుక దాని లోబడి ప్రవర్తిస్తాం. పెద్దవారు ఏం చేస్తారు, పెద్దవారు ధర్మాన్ని అర్థం చేసుకుని అర్థం చేసుకొని తమ ధర్మంగా చేసుకుని వాళ్ళు ప్రవర్తిస్తారు. ఉమ్ యువత అనేది రెండిటికి మధ్య transition or transformation అనొచ్చు కూడా. మనం లోబడి ప్రవర్తించే వాళ్ళము వయసులో ఉమ్ మనంతట మనంగా దాన్ని accept చేసి కొన్నిటిని దాంట్లో నచ్చకపోతే reject కూడా చేసి ఉమ్ మనదిగా చేసుకుని నేను కేవలం భారతీయుడిగా పుట్టాను గనుక భారత ధర్మాన్ని ఆచరిస్తున్నాను లేకపోతే ఫలానా వాడిగా పుట్టాను గనుక ఫలానా ధర్మం ఆచరిస్తున్నాను అని ఒక రకమైన లోబడి కాకుండా ధర్మాన్ని మన ఆయుధంగా గ్రహించి ధారైతి ఇతి ధర్మః అంటారు. మనం ధరించాలి ధర్మాన్ని మన చొక్కా, చొక్కా మనల్ని ధరించట్లా. ఉమ్ విధంగా ధరించి ప్రవర్తించే దానికి కావలసిన transition stage యువత. ఉమ్ సో ఈనాడు మనం ధర్మం యువత గురించి మాట్లాడుతున్నప్పుడు transition ఎట్లా చేయాలి? ఎందుకంటే we cannot throw the baby out with bath water. కొన్ని నచ్చకపోవచ్చు దేశకాల పరిస్థితుల వల్ల మనం చిన్నప్పుడు చేసేవి కొన్ని as we are growing up పెద్దవాళ్ళు అయ్యేకొలది కొన్ని వాటిని మనం carry on చేయకపోవచ్చు చిన్నప్పటి ధర్మాలు.అవి తీసేసి మన దాంట్లోని సూక్ష్మం గ్రహించి ధర్మం అసలు ధర్మం ఏమిటో తొక్క తీసి పండు తిన్నట్టు ధర్మాన్ని మనదిగా చేసుకుని జీర్ణించుకోవాలి. అది యువత చేయాల్సిన first duty Duty అంటే ఇక్కడ మీరు విధంగా చెప్తున్నారు కాబట్టి నాకొక point తట్టింది జీసస్ చెప్పినట్టు "Do unto others what you want others to do unto you" Exactly ఇది చాలా simple way మనం ఇతరులతో ఎలా behave చేయాలంటే అవతల వాళ్ళు మనతో ఎలా behave చేస్తే మనకు నచ్చుతుందో మనం అవతల వాళ్ళతో behave చేస్తే అలా బాగుంటుంది. మీరు చెప్పిన point కి straight answer ఉన్నదని నా అభిప్రాయం. అవును ఖచ్చితంగా ఎందుకంటే ధర్మం అనేది ఒక సిద్ధాంతం కాదు ఇది ధర్మం అని చెప్పం మనం ధర్మం అనేది a process ఉమ్ ఏది చేయాలి అని కాదు చేయటమే ధర్మం ఏదైనా చేయటం ఏదైనా ఒక విధంగా ప్రవర్తించడం ధర్మం. చదువుకోండి అంటారు విద్యార్థులకు చదువుకోవడం ధర్మం ఏది చదువుకుంటారని కాదు ఏదో mathematics చదివేవాడు ధర్మం చేస్తున్నాడు ఉమ్ ఇంకోటి ఇంకో subject చదివేవాడు అధర్ముడు అని కాదు అందులో బయటికి చదువుకోవడం ధర్మం చదువుకోవడం ధర్మం college కి వెళ్తే కొన్ని చెత్త subjects ఈనాడు మనకు నచ్చని subjects కూడా వాళ్ళు చదువుతున్నారు మనకిష్టం లేని కొన్ని చాలా objectionable materials మీద కూడా వాళ్ళు research చేస్తున్నారు అది ఏది చేస్తున్నారని కాదు విద్యార్థిగా చదువుకోవాలి వాడు చదువుకోవటం ధర్మం అయితే అక్కడ ధర్మాన్ని మంచిది ఏంటంటే మనకు ఉపయోగపడేది దేశానికి ఉపయోగపడేది సమిష్టికి ఉపయోగపడేది అనే సద్ధర్మాన్ని పాటించాలి చెడ్డ ధర్మాన్ని కాదు అది second level responsibility first level responsibility ఏంటి ఏదో ఒకటి మన duty గా గ్రహించి దాన్ని చేయాలి అందుకనే ధర్మం అనేది ఒక process not a particular philosophy or not a particular principle రెండో విషయం ఏంటంటే ధ్రువైతి ధర్మః అంటారు ధ్రువ్యతి ఇతి ధర్మః నాకు సంస్కృతం అంత తెలియదు but ఎక్కడో విన్న మాట చెప్తున్నాను నేను అంటే ఏంటంటే ధర్మం ఏం చేస్తుంది అంటే మనకి determinism అంటారు english లో అయితే నువ్వు ఇది చేస్తే నీకు మంచి ఫలితం దొరుకుతుంది definitiveness ఇస్తుందన్నమాట ధర్మం లేనివాడు ఒక last case అంటారు చూడండి అట్లా జీవితంలో ఏం చేయాలి ఏది goal ఏది మనం చేయదగింది ఏదైనా situation వస్తే దాంట్లో ఏం చేయాలి ఏం చేయకూడదు అని కూడా తెలియకుండా ప్రవర్తిస్తాడు సమయంలో తనలో ఉండే impulses ని బట్టి ప్రవర్తిస్తాడు కానీ ధ్రువయతి ఇతి ధర్మః అంటే ఏంటంటే ధర్మము ఒక determination చేస్తుంది పరిస్థితుల్లో నువ్వు ఇట్లా చేస్తే నీకు ఇట్లాంటి ఫలితం వస్తుంది అని ఉమ్ అది తెలుసుకోవంటే కానీ మనం ధర్మం చేయలేము ధర్మం అనేది ఎవరికో వాళ్ళు చేయాల్సింది కాదు ధర్మం బాగా తెలుసుకోవాలి అందుకే మీరు చెప్పిన ఉదాహరణ యుధిష్ఠిరుడు భారతం అంతా మీరు చదవండి భారతంలో యుధిష్ఠిరుడికి ప్రతిక్షణం question చేసుకుంటాడు నేను చేస్తున్నది right wrong ఎందుకంటే ఆయన ప్రకారం ఆయనకి ధర్మం తెలియదు ఉమ్ పూర్వకాలం ఏంటి ధర్మం ఎక్కడి నుంచి గ్రహించాలి మనం ఎలా తెలుసుకోవాలి అంటే చదువుకున్న వాళ్ళు ఋషులు వాళ్ళు వేదశాస్త్రాల నుంచి చదువుకొని ఇది ధర్మం అని చెప్పేవాళ్ళు అంత వేదశాస్త్రాలు అది చదవటానికి కుదరని వాళ్ళు పెద్దలను అడిగి తెలుసుకునే వాళ్ళు ఉమ్ అది కూడా కుదరని వాళ్ళు ఒకళ్ళని ఆదర్శ పురుషులను చూసి ఆదర్శ వాళ్ళని బట్టి ఆచరించేవాళ్ళు ఈరోజు మనం చేసేది అదే అసలు ఆధారము లేని వాళ్ళు పని స్వామి చెప్పినట్టు ఇది మంచా చెడా నేను ఇది చేస్తే మంచి ఫలితం జరుగుతుందా చెడు ఫలితం జరుగుతుందని ఆలోచించుకుని ఒక్క criteria తీసుకుని మనం చేసుకుంటే చాలు ఎందుకంటే మనకు పూర్వాధారాలు లేకపోవచ్చు దీనికి so అదేమిటంటే ఇది చేస్తే ఇది మంచిది ఇది చేస్తే ఇది చెడు అని మనకు ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఒకే కత్తి ఒకడు murderer చేతిలో అది ఒక ఆయుధం అవుతుంది doctor చేతిలో అది ఒక పనిముట్టు అవుతుంది పనిముట్టు అవుతుంది [నవ్వు] దాని వల్ల ఆరోగ్యం వస్తుంది so చేసే పని వల్ల పరిస్థితుల్లో మనకు మంచి జరుగుతుందా పని చేయాలనేది కాదు పని పరిస్థితుల్లో చేస్తే మనం sir చెప్పినట్టు Right action, right time Right time, right place, right thing Right time, in the In the right manner also ఉమ్ That is also important అవును Right time, right place, right action in the right manner చేస్తే మనకి right ఫలితం వస్తుంది అనేది determine చేసి చెప్పేదే ధర్మం కన్విన్స్ అయితే అది ఎట్లాగా అది మనం ఒకళ్ళ నుంచి తీసుకోవచ్చు ఉమ్ పూర్వకాలపు examples నుంచి తీసుకోవచ్చు అయితే అది ఎంతవరకు మనకి apply అవుతుందనేది మనం discretion ఉపయోగించాలి ఖచ్చితంగాను ఎందుకంటే ధర్మం చేసిన తర్వాత మా నాన్న చెప్పాడు నేను చేశాను అంటే నిన్ను court ఒప్పుకోదు [నవ్వు] ఎవరైనా ఫలానా వాడు చేసింది నేను చేశాను అది ధర్మము లేదా ఫలానా పుస్తకంలో రాసి ఉంది నేను చేశాను అంటే మిమ్మల్ని ఎవరైనా క్షమిస్తారా అది మీదవ్వాలి ఆత్మధర్మం అంటే ఏంటంటే దాన్ని నేను గ్రహించాను ఇది నా మాట పుస్తకంలో మాట కాదు ఇది నా action ఒకళ్ళు చెప్పించేసింది action కాదు అనేది తనదంటూ చేసేసుకోవాలన్నమాట అది చేసేసుకునే వయసు యువత దానికి కావాల్సింది education ఎందుకు స్వామి అవతారంలో దాదాపు చూడండి ఒక మనిషి నిజంగా వందేళ్ళు బతికే మనిషి అయితే one fourth of his life education మీద గడుపుతున్నాడు twenty five years almost education మీద గడుపుతున్నారు అవును మిగతా జంతువు ఎవ ఎక్కడ మనం అది చూడం ఉమ్ పుట్టిన జంతువులు టక్కున లేస్తాయి next year కల్లా వాటి పని వాటివి చేసుకుంటాయి పాతికేళ్ళు మనిషిని ఒక బాలుడి కింద ఒక విద్యార్థి కింద ఉంచి మనం వాడికి పదే పదే అన్ని రకాలు చదివిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే complete గా ధర్మం తెలుసుకుంటే గాని నువ్వు బయటకు అడుగు పెట్టొద్దు education యొక్క importance స్వామి ఇంత education కి importance ఇచ్చింది అంటే ధర్మార్థ కామ మోక్షాలని మీరు చతుర్విధ పురుషార్థాలు చెప్తే first ధర్మము first పాదం first quarter of our life ఉమ్ We are only exploring ధర్మ so అది చిన్న వయసులో కూడా కుదరదు కనీసం ఒక college level university level education పూర్తి చేసిన తర్వాతే మనం yes ఇది చదివిన దాంట్లో ఇది right ఇది wrong ఇది నాకు apply అవుతుంది ఇది అవ్వదు అని మనం decide చేసుకుని దాన్ని మనకు ఆపాదించుకుని ఇంకా బయటకు వెళ్ళి మాకు school లో చెప్పారు కానీ నేను చేస్తున్నాను అనకూడదు ఇది నా మాట ఉమ్అది తనకు సరైనది కాదా లేదా అనేది తనకు తెలుస్తుంది. తెలుస్తుంది తన responsibility తీసుకోవాలి he should become cause of his own actions he should take responsibility for his own actions. నేను ఫలానా వాళ్ళు చెప్పిన దాన్ని లేకపోతే ఫలానా వాడిని కాబట్టి ఇట్లా చేశాను అని excuses ఇవ్వకూడదు అన్నమాట. level దాకా తీసుకొచ్చే స్వామి యూనివర్సిటీ నుంచి పిల్లల్ని బయటకు వదులుతారు. so ధర్మం అనేది ఒక process అది process చేయాలి చేయాలి అని చెప్పి మన అందరిలోనూ ఉత్సాహం కలిగించాలి. మీరు ధర్మం ఎట్లా మీరు ఆడుకోవాలి ఆడుకోవాలి అని చెప్తాం ఏం ఆడుకోవాలో చెప్పం ఆడుకోవటం health కి మంచిది ఆడండి అని చెప్తాం. అట్లాగే మీరు ధర్మం ఆచరించాలి ఆచరించాలి ఆచరించాలి అని ఉత్సాహపరచి ధర్మం వాళ్ళు ఉత్సాహం వచ్చిన వాడికి అనుకుంటాడు అయితే ధర్మం ఆచరించాలి అని తనకు తానే ఆలోచిస్తాడు తనకు తానే ఆలోచిస్తాడు అందుకే స్వామి చెప్తారు you should know thyself ఆత్మ ధర్మం ఏంటంటే నువ్వు ఎవరో నీకు తెలియకుండా నువ్వు ధర్మం ఆచరించినా అది పరధర్మం ఉమ్ ఎందుకంటే every soul is born with a purpose మనం ప్రపంచంలోకి ఒక particular purpose వల్ల భగవంతుడు పంపించాడు. purpose fulfill చేయడమే నీ ధర్మం అది కాకుండా నువ్వు ఎన్ని చేసినా అది ధర్మం కాదు. నువ్వు ఎంత బాగా ప్రవర్తించినా, రకమైన వినయాలు, విధేయతలు చూపించినా, అందుకే ఇంకో విషయం ఉదాహరణకి రాముడు పితృవ్యాఖ్య పరిపాలన చేశాడు అది ఆయనకి తోచింది. ఎప్పుడు చేశాడో తెలుసా? రాముడు రామాయణంలో ఒక chapter ఉంది దాంట్లో ఈయన రాముడు అడవికి వచ్చేసిన తర్వాత భరతుడు ఋషులందరినీ తీసుకొస్తాడు. ఉమ్ పది, పదిహేను మంది ఋషులను తీసుకొస్తాడు. తీసుకొచ్చి రాముడికి చెప్పిస్తాడు. ప్రతి ఋషి తనకి సంబంధించిన శాస్త్రం ప్రకారం "రామా! నువ్వు తిరిగి రావటమే నీ ధర్మం" ఉదాహరణకు ఒక ఋషి అంటాడు. "తండ్రి పోయాడు కదా, పోయిన వాడి వాక్కుకి ఇంకా value లేదు. నువ్వు వెనక్కి రావచ్చు. నా శాస్త్రం ప్రకారం ఇది correct" అంటాడు. ఉహు ఇంకొకాయన ఇంకో రకంగా చెప్తాడు, ఇంకొకాయన ఇంకొక రకం-- ఇప్పుడు దశరథుడు రాజు కాదు, భరతుడు రాజు. భరతుడు చెప్పిన మాటే నువ్వు వినాలి అని ఒకాయన అంటాడు. అలా రకరకాలుగా ఆయనకి prove చేస్తారు శాస్త్ర ప్రకారం నువ్వు వెనక్కి రావడం ధర్మం అని. ఉమ్ కానీ రాముడు అంటాడు, "నా conscience చెప్తోంది. నా తండ్రి మాట నేను వింటాను. ఇది నా ధర్మం, మీరు చెప్పే ధర్మం కాదు. మీ ధర్మం మీద నాకు interest లేదు. నా ధర్మం కనుక నేను చేస్తున్నాను." అని రాముడు తను proceed అవుతాడు అడవికి. ఉమ్ అదేవిధంగా యువత కూడా phase లో ఎప్పుడైతే మనకి చాలా energy ఉంటుంది enthusiasm ఉంటుంది, ప్రతిదీ question చేస్తాము. time లో మనం correct గా question చేసుకొని నేను ఎందుకు వచ్చాను? నేను ఎందుకు పుట్టాను ప్రపంచంలో? నా purpose ఏంటి? నా ఆత్మ ధర్మం నేను fulfill చేస్తే కానీ నా జీవితం waste కదా. అందుకే స్వామి కూడా ఎప్పుడూ ఫలానాది ఆచరించండి ఫలా-- విద్యార్థులుగా కూడా మనకి ఫలానా రకంగా ఉండు, ఫలానా రకంగా ఉండండి అని కూడా చెప్పలేదు. అది discipline. ఏందంటే ఇంకొకళ్ళకి చెడు జరగకుండా ఒక రకమైన పరిధిలో ఉండటం. అది కాదు discipline is not ధర్మం. ఉమ్ ధర్మం అనేది final గా మన ఆత్మని మనం తెలుసుకుని, మన purpose మనం తెలుసుకుని దాని ప్రకారం నడుచుకుంటేం నడుచుకుంటేనే అదే ధర్మం. అంటే ఇక్కడ ఇవాళ యువత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేపథ్యంలో ఇప్పటివరకు సాగిన చర్చలో adolescent innocence ఉంటుంది. It is tolerable. Adolescent ignorance ఉంటుంది. Definitely tolerable. Adolescent arrogance ఉంటుంది. అది intolerable. Innocence వేరు, ignorance వేరు, arrogance వేరు. Adolescent innocence లో ఉన్నవాణ్ణి ధర్మ మార్గంలోకి తీసుకెళ్లటం చాలా తేలిక. ఉమ్ "అసలు ధర్మం, సత్యం నాకివేం వద్దండి. ఏదో చదువుకుంటాను, ఉద్యోగం చేస్తాను." అని ignorance లో ఉంటాడు. వాడికి వాణ్ని awake చేయటం enlighten చేయటం తేలిక. ఉమ్ నిర్ద్వందంగా దీన్ని brush చేసేస్తాడు ఒకడు. Out of arrogance. వాణ్ని ధర్మ మార్గంలోకి తీసుకురావటం కొంచెం- బాగా కష్టం చాలా కష్టం. కష్టమే అని వదిలిపోయి innocence వాణ్ణి అక్కర చేశాం, దగ్గర తీసుకున్నాం. Ignorance వాణ్ణి క్షమించి దగ్గర తీసుకున్నాం పోనీ ప్రేమతో. Arrogance వాణ్ణి కూడా మనం దగ్గర తీసుకున్నట్లయితే మనం ఆయుధం వాడాలో అది important. How to convert అది కదా ప్రశ్న. How to bring the youth on to the path of ధర్మ. దానికి sentimental, intellectual, emotional quotients మూడు దాటి spiritual quotient లో గనక వాణ్ణి త్యాగలిగితే మూడు ఏది innocence, ignorance, arrogance పోయి, ఇవాళ స్వామి students ని మనం ప్రపంచంలో ఆదర్శ విద్యార్థులుగా చెప్పుకుంటాం. ప్రపంచం కూడా చెప్పుకుంటుంది. "ఊ! సత్యసాయి స్కూల్లో చదివారు అంటే he must be a perfect man" అని. అది గౌరవాన్ని స్వామి కల్పించారు. ఎలా కల్పించారు అంటే, ఆయన ఉపదేశాలు చెయ్యలే. నేను ఒక IAS officer తో మాట్లాడుతూ "స్వామి మీకు రకంగా training ఇచ్చేవాళ్ళు? ఎలా బోధ చేసేవాళ్ళు? కూర్చోబెట్టి చేయి do's and don'ts చెప్పారా?" అంటే, he is a very seasoned man, very elderly man. ఆయన అన్నారు, "స్వామి ఒక్కనాడు మాకు ఇట్లా చేయండి అని ఎన్నడూ చెప్పలే. స్వామి ఏం చేస్తున్నారో మేము గమనించేవాళ్ళం. ఆయన్ని చూస్తూ punctuality నేర్చుకున్నాం, discipline నేర్చుకున్నాం, dress code నేర్చుకున్నాం. అలాగే అక్షరాలు పొందిగ్గా రాయటం నేర్చుకున్నాం. సమయానికి సమయానికి పని చెయ్యాలో అది నేర్చుకున్నాం." ఇవన్నీ ఏంటే, ఒక గురువుని, గురువు అనండి, భగవంతుడు అనండి, ఆయన్ని చూస్తూ నేర్చుకునేవి ఎక్కువ. అది spiritual intelligence. spiritual quotient గనక మనం ఇవాళ యువతకి ఇవ్వగలిగితే, మనం ఇందాక చెప్పుకున్న రామాయణ, భారత, భాగవతాలు గాని ఇంకోళ్ళు గాని అవన్నీ they supplement. But core ఏమిటంటే your own spiritual awakening. దానికి ఇదిగో ఇటువంటి సత్యసాయి organizations లాంటివి, ఇటువంటి చర్చలు వీటి ద్వారా మనలో ఇవాళ సమాజానికి ఖచ్చితంగా adaptability ఉంది. ఉమ్ శాస్త్రము redundant కాదు. సర్వ కాలాలకి చెందుతుంది. కాప్తే ఆచారాలు చెల్లవు.ఆచారం వేరు సాంప్రదాయం వేరు స్ఫూర్తి వేరు త్రేతాయుగంలో జరిగినట్టే ఇవాళ మనం కట్టుబట్టు ఉండాలంటే ఉండదు మన మన కళ్ళ ముందే ఇరవై ఏళ్లలో గణనీయమైన మార్పులు వచ్చాయి ఇంకో ఐదేళ్లలో ఏముంటామో మనకు తెలియదు material పదార్థ విజ్ఞానం మారిపోయింది ప్రపంచ అవసరాలు మారినాయి జీవన విధానం మారింది కానీ అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక అంతర్ వాహిని ధర్మ ప్రవాహం ఏదైతే ఉందో అది మారలేదు మాతృదేవోభవ అక్కడే ఉంది మన అమ్మకి నమస్కారం రోజు ఆమెకి దండం పెట్టకపోవచ్చు చేతులు జోడించి కానీ అమ్మని అగౌరవపరచం పితృదేవోభవ తండ్రి పట్ల మన కృతజ్ఞతలు ఎప్పుడూ ఉన్నాయి మా నాన్న ఎంత కష్టపడి నన్ను పైకి తెచ్చాడని అంటున్నాం నేను ఇంత పైకి వచ్చాను మా నాన్న ఏం చేయలేదు అని నేను ఎక్కడా వినలే కదా కాబట్టి పితృదేవోభవ ఉంది గురువుగారు elementary school పలక మీద ఓం నమశ్శివాయ రాయించిన వాడి దగ్గర నుంచి నా PhD వచ్చేదాకా నాకు guide చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పేరుపేరునా నేను గుర్తు పెట్టుకుని ఆచార్య దేవోభవ కృతజ్ఞతా స్వరూపంగా ఉంటున్నాను అసలు ఆచార్య వేషంలో ఎవరున్నా వారికి నమస్కరిస్తున్నాం మన ఇంటికి ఎవరొచ్చినా అతిథి దేవోభవ ధర్మం కాకేముంది ధర్మ మూలాలు అన్నీ కదలకుండా స్పష్టంగా దేశంలో ఉన్నాయి దేశం యొక్క బలమంతా అది బలహీనత కాదు కాబట్టి యువత నెమ్మదిగా దీనివైపు ఒకసారి దృష్టి సారించినట్లయితే నేర్చుకోవలసినది మొత్తం ఇక్కడే ఉంది ఆచరించడానికి కావలసిన అన్ని అననుకూల పరిస్థితులు కూడా దేశంలోనే ఉన్నాయి. అదేమిటండీ స్వామి ఉన్నప్పుడు కూడా ఇంత అనాచారం అని ఒకాయనను ఒక interview అడిగారు సాక్షాత్తు సర్వదేవతా అతీత స్వరూపం స్వామి అండి కానీ చూడండి ఆయన చుట్టూ కూడా ఎన్ని ఉన్నాయో ప్రపంచంలో కష్టము ఆగటం లేదంటే ఇవన్నీ అననుకూలాలు ఉన్నాయి గనుక ఆయన రావలసిన పని వచ్చింది అన్నీ బాగుంటే ఆయన రావలసిన పని ఏముందన్న జవాబు అంతే కదా కాబట్టి అననుకూల పరిస్థితులే ఉంటాయి కాలగమనంలో ఇది అనివార్యం మార్పు ఎప్పుడు వస్తుందో progress ఎక్కడ ఉందో problems అక్కడ ఉంటాయి problems ఎక్కడ ఉన్నాయో diligence తో మనం దాన్ని మనకు భగవంతుడు man is endowed with the power of discretion విచక్షణాధికారం ఇచ్చాడు ఇందాక రావు గారు చెప్పిన ధ్రువానితిర్మతిర్మమ ధ్రువ అంటే conviction conviction అంటే మనీష మనీష అంటే ధృడ చిత్తం నిశ్చయం ఇది ఇంతే ఇది నేను సాధించగలను ఏం మనం engineer కావాలంటే కాలే teacher కావాలంటే కాలే నేను ఫలానా చోట చదువుకోవాలంటే చదువుకోలా మరి ఇవన్నీ అయినప్పుడు నేను మనిషిగా జీవించాలి అనే సంకల్పం ఎవరు చేయాలి ఎవడో మన కోసం చేయడు కాబట్టి యువత ప్రధానంగా సత్యసాయి భగవానుడి యొక్క దివ్య ప్రబోధాలు చదవాలని స్వామి జీవితాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలని ఇవాళ రాముడి కథ తెలుసు గాని రాముడు ఎట్లా ఉన్నాడో మనకు తెలియదు మనకి కళా మాధ్యమాల ద్వారా తెలుసు తప్ప ఇంకో రకంగా తెలియదు కృష్ణుడి విషయము అంతే కానీ సత్యసాయి భగవానుడు సద్రూపంగా మనకు కనిపించి మన కళ్ళ ముందు open గా ఆయన జీవించారు మరి దాని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి క్రమశిక్షణ చిత్తశుద్ధి లవాలు సర్వాలు మనకు చెప్పారు గాని మనం చేసినా చేయకపోయినా ఆయన మాత్రం పని చేశారు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు ఐదు ఆయన మౌలికమైన cardinal principles ఆయన జీవితంలో ఖచ్చితంగా పాటించారు ఎంత స్పష్టత అంటే ఆయనకు మాత్రం ఏముందండీ ఆయన రాజ్యం ఉందా కోశాగారాలు ఉన్నాయా మంత్రులు ఉన్నారా ఎవ్వడు లేడా అన్నీ నిలబెట్టారు అన్ని సమన్వయం చేశారు దీనికి కారణం ఏమిటంటే యువకుడుగా యువశక్తితో స్వామి ప్రారంభించినటువంటి సంకల్పమే spiritual intelligence spiritual quotient ద్వారా ప్రపంచాన్ని సమీకృతం చేయగలిగారు కాబట్టి యువత స్వామిని ఆదర్శంగా తీసుకోవాలి అని నా సూచన నా భావన. చివరగా నాకు ఇంకొక విషయం నాకు చెప్పాలని ఉంది ఎందుకంటే పెద్దలు- చెప్పండి ధర్మం గురించి చాలా చక్కగా వివరించారు మనం కష్టపడి నేర్చుకున్నది కొన్ని విషయాలు ఇక్కడ స్వామి దగ్గర ఎందుకంటే బయట యువతకు choice ఉంది వాళ్ళు కావాలంటే follow అవ్వచ్చు follow అవ్వలేరు ఇక్కడ మనం స్వామి దగ్గర చదువుకున్నప్పుడు స్వామి దగ్గర పనిచేసేటప్పుడు ఒక విధమైన మనకి ఒక responsibility ఉండేది ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి ఎట్లా ఆచరించాలని ఉమ్ సో కొంచెం struggle అయ్యి కొన్ని hard lessons ద్వారా కూడా నేర్చుకున్న విషయాలు ఉన్నాయి అవును అవును కష్టం ఏంటో struggle ఏంటో మనకు తెలుసు. విషయంలో ఒకసారి నేను చాలా troubled గా ఉన్నప్పుడు మనసులో కొన్ని పాటించగలిగి పాటించలేకపోయినప్పుడు కొన్ని విషయాలు అప్పుడు జరిగిన ఒక incident నేను చెప్తాను స్వామి teacher అందరినీ address చేయడానికి భజన మందిరంలోకి వచ్చారు వస్తూనే మీరు ఏం చెప్తున్నారు పిల్లలకి అని చెప్పారు స్వామి love for god, fear of sin, morality in society morality in society ధర్మము, పాపభయము సంఘ నీతి సంఘ నీతి, పాపభయము, దైవ ప్రీతి దైవ ప్రీతి స్వామి వెంటనే అన్నారు దైవ ప్రీతి ఒక్కటి నేర్పండి దైవ ప్రీతి నేర్పితే సంఘ నీతి అదే వస్తుంది దైవ ప్రీతి లేనిదే మీరు నీతి follow అవ్వలేరు కష్టం చాలా కష్టం కృష్ణుడు కూడా అదే మాట అంటాడు అర్జునుడితో భగవద్గీతలో నీ అంతట నువ్వు నీ ఇంద్రియాలను control చేసుకోవాలన్నా నీ అంతట నువ్వు ధర్మాన్ని పాటించాలన్నా- కుదరదు [నవ్వు] చాలా బాధపడతావు కష్టం కుదరదు అది భగవద్గీత దయ ఉంటేనే కలుగుతుంది ఉమ్ ఎందుకంటే ఇది ఒక game game కి umpire god manager god captain god మనం ఒక players players కూడా కాదు మనం ఒక బంతులం అక్కడ సో ఆయనే అన్ని చేస్తున్నారు గనుక ఉమ్ ఆయన దయ లేనిదే ఆయన command ఆయన ఆజ్ఞ లేనిదే మనం ఏదీ చేయలేము. సో అదే విధంగా మనం ధర్మం పాటించాలన్నా నీతి పాటించాలన్నా నియమాలు పాటించాలన్నా మొట్టమొదట కావలసింది దైవ ప్రేమ దైవ ప్రేమతో ఏది చేసినా ధర్మమే అవుతుంది. అందుకే అనుకుంటా కృష్ణుడు చెప్తాడు "సర్వ ధర్మాన్ పరిత్యజ్య మా me com శరణం వ్రజ"నన్ను అన్ని ధర్మాలు వదిలేసి కూడా నన్ను మాత్రమే ఆశ్రయించిన వాడికి వాడు చేసినవన్నీ ధర్మాలే. ఇప్పుడు రాముడు ధర్మపాలన చేశాడంటే రాముడు ఒక ధర్మాన్ని ఆచరించలేదు, రాముడు ఆచరించినదే ధర్మమైంది. అలాగే స్వామి చెప్పింది సత్యం, స్వామి ఆచరించింది ధర్మం. అలాగే మనం భగవంతుని మీద ప్రేమతో, భగవద్భక్తితో ఏమి చేస్తే అదే ధర్మం. ఉదాహరణ, ఎక్కడైతే తండ్రి మాట పాటించాలి తండ్రిని గౌరవించాలి అని చెప్పారో అదే దైవ ప్రేమతో ప్రహ్లాదుడు తండ్రిని ధిక్కరించినా కూడా ప్రహ్లాదుడు మంచివాడయ్యాడు, గొప్పవాడయ్యాడు, మోక్షం దొరికింది. సో దేవుడు భక్తి, దేవుడి దయ ఉన్నరోజు-- ఉన్నప్పుడు ధర్మాలున్నాయి చూడండి. సంఘ ధర్మాలు, కుటుంబ ధర్మాలు, దేశ ధర్మాలు, దేశకాల పరిస్థితులుగా-- అనుగుణంగా మనం పాటించటము, ఇవన్నీ కూడా redundant అయిపోతాయి. అదే మనకు భారతంలో చూసిన విషయం కూడా, వ్యాసుడు భారతం రాసినప్పుడు మీరు అసలు భారతం చదివితే అక్కడ దైవ ప్రసక్తి చాలా తక్కువ వస్తుంది. ఎక్కడా ఉండదు. కృష్ణుడు భగవంతుడు అన్న మాట కూడా ఆయన స్పష్టంగా రాయడు. అందరూ ధర్మ సంకటాల్లో ఎట్లా పడ్డారో, ధర్మ సంకటాల నుంచి బయటికి ఎట్లా వచ్చారో అట్లా నిరీశ్వరంగా దాన్ని ఒక రకంగా describe చేస్తారు ఆయన. అది చేసినంత-- అప్పుడు ఆయనకి satisfaction కలగలా. అంటే దేవుళ్ళు ఏందే ధర్మాన్ని అందరూ ఆచరించడానికి ప్రయత్నించారు, అందరూ fail అయ్యారు. అక్కడ ఎవరూ ఎవరికీ కూడా నిజంగా సుఖం, సంతోషం, జయం కలగలేదు. భారతంలో అందరూ suffer అయ్యారు. అవును అందుకనే ఆయన భాగవతం రాశాడు. భాగవతంలో రాక్షసులవనివ్వండి, మానవులవనివ్వండి, జంతువులవనివ్వండి అందరూ భగవత్ ప్రేమకులు. [నవ్వు] భగవంతుణ్ణి ప్రేమించారు, భగవంతుణ్ణి ధ్యానించారు automatic గా వాళ్ళు చేసినవన్నీ ధర్మాలైపోయాయి. అందుకే స్వామి ఈనాడు అవతారంలో దైవభక్తికి, భజనకి, వీటికి చాలా importance ఇచ్చారు. Importance ఇచ్చారు. అవును మన విషయంలో కూడా, ఏమిటి తల్లిదండ్రుల గురించి మీరు worry అవుతారు ఇక్కడ కూర్చుని, మీరు ఏం చేయగలరు తల్లిదండ్రులకి? "నన్ను నమ్ముకోండి, నేను మీ తల్లిదండ్రులని నేను చూసుకుంటాను" అన్నారు స్వామి. ఊహూ అది మనం అలాగా మన వేరే ధర్మం మనకంటూ ఒక ధర్మం అక్కర్లేదు. మనం స్వామిని నమ్ముకుని స్వామి మీద భక్తితో, స్వామి సేవ, ఇది స్వామి పని అని ఏది చేసినా అదే ధర్మం అయిపోతుంది. అందుకని ఆహ్ దైవ ప్రీతి చాలా ముఖ్యం. ధర్మం కంటే ముందు ముఖ్యమైంది దైవ ప్రీతి. అది లేనిదే ధర్మం ఆచరించలేము, కష్టము. అది ఉన్నప్పుడు మనం ఏం చేసినా ధర్మం అవుతుంది అని నా అభిప్రాయం. ఇక్కడొక చిన్న విషయం, రావు గారు మన చర్చా గోష్టి కాబట్టి మీరు చెప్పిన దానికి ఒక different dynamics వరకు add చేద్దామని అనిపించింది. మహావిష్ణువు, ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు triangle. హిరణ్యకశిపుడికి విష్ణువు లేడు, హరి లేడు. ప్రహ్లాదుడికి హరి తప్ప మరొకడు లేడు. ఘర్షణ, అది ఇంట్లో ఘర్షణ. వీళ్ళ మధ్యలో నలిగిపోయింది లీలావతి. కొడుకుని side చేయలేదు, భర్తని కాదనుకోలేదు. ఇద్దరూ కావాలి, ఆమె పక్కన పెడితే కథ అంతా అయిపోయింది. నరసింహ స్వామి అయి వచ్చాడాయన. వచ్చిన తర్వాత భాగవతాన్ని జాగ్రత్తగా చదివినట్లయితే "హరి లేడు లేడు లేడు" అన్నటువంటి హిరణ్యకశిపుడు నరసింహ స్వామి యొక్క ఉగ్ర రూపంలో కూడా భయంకర దారుణ రామణీయకంగా తన్ను దర్శించాడు. భగవత్ తత్వాన్ని దర్శించాడు. గదిలోకి గదిలో చీల్చుకున్న వెలుగుకు ఒక్కసారి వెనక్కి వెళ్లిపోయినాడు. పంజా విసిరాడు. విసిరి ఏం చేశాడు? హిరణ్యకశిపుడ్ని ఒక తండ్రి వలె, తల్లి వలె ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. వాడి కలుష రక్తం అంతా ఆయన తాగాడు. పేగులన్నీ మెళ్ళో మాలలుగా వేసుకున్నాడు. హిరణ్యకశిపుడికి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని సాయుజ్యం ఇచ్చాడు. ప్రహ్లాదుడికి మోక్షం ఇవ్వలేదు. హరి ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడన్న వాడు తీరా హరి వచ్చేప్పటికీ స్తంభం వెనక్కి భయపడి వెళ్ళిపోయినాడు ప్రహ్లాదుడు. అప్పుడు ప్రహ్లాదుడికి ఏం చెప్పాడంటే, "నువ్వు రాజ్యం ఏలుకో" అన్నాడు. దేవుడు లేడన్న హిరణ్యకశిపుడికి యోగం ఇచ్చాడు, దేవుడున్నాడన్న ప్రహ్లాదుడికి భోగం ఇచ్చాడు. భోగం ఎంతవరకు సాగిందంటే ఇంకా సాగుతూనే ఉంది. యుగం మారింది, వామనావతారం అయిపోయింది. బలి చక్రవర్తిని పాతాళంలోకి మూడో పాదం నెట్టాడు. వెళ్లి ఏమన్నాడంటే, "మీ మనవడితో సహా కూర్చొని మీరిద్దరూ హరినామ సంకీర్తనం చేస్తూ ఉండండి." మనవడెవరు? బలి చక్రవర్తి. తాత ఎవడు? హిరణ్యకశిపుడు. కూర్చున్నటువంటి వాడు మీరు అలా సంకీర్తనం చేస్తూ ఉండండి, మళ్ళీ బలి చక్రవర్తికి ఇంద్ర పదవి వచ్చేదాకా మీ పని అదే. చూశారా? అంటూ ఏమన్నాడంటే, "మీరు నాకు దానం ఇచ్చినటువంటి కారణంగా, కృతజ్ఞతాపూర్వకంగా నేను చక్ర స్వరూపంగా మీకు కాపలా కాస్తూ ఉంటా" అన్నాడు. అది వినయ వినమ-- వినమిత గాత్రుడైనటువంటి పరమాత్మ. కోణం అక్కడ పెడితే అదంతటికీ తాగలే. వామనావతార-- ప్రహ్లాదుడి వరకు అంటే ప్రహ్లాదుడికి మోక్షం ఇవ్వలేదు అని చెప్పటం ఒకటి. రెండోది, ఇంకా ఆయనకి చాలా time ఉంది. వామనావతార ఘట్టంలో బలి చక్రవర్తి భార్య బంగారు పాత్రలో నీళ్ళు తీసుకొని వస్తే వామనుడి పాదాలు కడుగుతున్నటువంటి వేళ బలి చక్రవర్తి యొక్క కూతురు రత్నావళి "నేనంటూ ఒక మాతృమూర్తిని గనక అయితే ఇటువంటి బిడ్డని కంటా" అన్నది. ఏది? వటువు యొక్క తేజస్సును చూసి. అటువంటి వాడికి తల్లిని అవుతానన్నది. కానీ ఐదు నిమిషాల్లో [నవ్వు] మూడడుగుల నేల మూడోది ఎక్కడ అని అడుగుతున్నాడుగా. ఆలోచన అంతా మారింది. ఆలోచన మారిపోయింది. తండ్రి పాతాళానికి వెళ్ళాడు, రాజ్యం పోయింది, ఇంద్ర పదవులు పోయినాయి, అన్నీ పోయినాయి. అన్నీ పోయిన time లో రత్నావళి ఇటువంటి బిడ్డ కావాలి అన్నటువంటి ప్రేమలో నుంచి ఒక ద్వేషం పుట్టిందిఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను హింసిస్తానని చంపుతానని, వామనుడు కాలగమనంలో శ్రీకృష్ణుడై వచ్చిస్తే పూచిన తనువై పూతనై వచ్చింది. కనుకనే పూతన చనుబాలు తాగాడు పరమాత్మ. అంటే మాతృ స్థానంలో నిలబెట్టాడు. ఆమె మనస్సులో ఉన్న భావాన్ని గమనించి. శ్రీకృష్ణుడికి ఆమె చనుబాలు తాగిన కారణంగా ఆమె విముక్తం అయిపోయింది. ఎప్పుడైతే పరమాత్మ స్పర్శ కలిగిందో ఆమె శరీరాన్ని నందుడు ఖండించినప్పుడు దేహంలో నుంచి సుగంధ పరిమళాలు వచ్చినయి. ఒక అప్సరసంగనే దర్శనం ఇచ్చింది. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి దర్శనంలో మన పురాణాలు direct గా కొన్ని చెప్తాయి indirect గా అసలు విషయం చెప్తుంది. అసలు విషయాన్ని మనం పట్టుకొని, ఇవాళ కూడా సత్య సాయి భగవానుడు మనకు కనిపించిన స్వామినా? కానే కాదు. కనిపించనటువంటి అసలు తేజస్వరూపుడు తేజస్సుడైన స్వామి ఇవాళ స్వామి is a తేజస. నిన్నటి వరకు స్వామి విశ్వస్సుకుడు, స్వామి అన్నివేళలా ప్రజ్ఞుడు. మూడు పూర్ణమైనటువంటి అవతార తత్వానికి యువత దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి. If you simply say a calendar event, ఇవాళ 24th వెళ్ళిపోయారు November 23 వచ్చారు ఈశ్వరమ్మ కొడుకు మామూలు, మామూలు calendar events అవి. అసలు లోతుగా వెళ్ళాలి అధ్యయనం చేయాలి. ఎప్పుడైతే యువత మనస్సు దీనివైపు ఇట్లా ఆలోచించటం మొదలు పెడుతుందో మన పురాణాలు కూడా చాలా శాస్త్రీయమైనవి అని అర్థం అవుతాయి. ఉమ్ కాబట్టి యువత దిశగా నడవాలని నా భావన. చాలా సంతోషం. ఒక్క ధర్మం గురించి మాట్లాడుకుంటూ చాలా చాలా విషయాలు తెలుసుకున్నాం. ఒక చిన్న విషయం నాకు అనిపించింది. అంటే ఏది ఆచరించడానికైనా ఏది పాటించడానికైనా ముందు దైవ ప్రీతి ఉండాలి అని అన్నదాన్ని చూసుకుంటే, ఇక్కడ కూర్చున్న మన నలుగురినే చూసుకుంటే గనుక, సమాజంతో పోల్చుకుంటే గనుక మనం స్వామి కావాలనుకున్నాం స్వామి మార్గంలో పయనించాలనుకున్నాం కాబట్టి మనల్ని స్వామి ఇక్కడ కూర్చోబెట్టి ఇన్ని మాటలు చెప్పారు. ఇలానే వింటున్న ప్రతి శ్రోత కూడా స్వామి గురించి స్వామి మార్గంలో నడవాలనుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ మాటలు స్వామి పంపించారు. అవును అవును సో ఇన్ని మంచి విషయాలు మనకి స్వామి అందిస్తున్నారు అన్న భావనతో చర్చా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ వీటన్నింటినీ ఆచరించే శక్తి భక్తి స్వామి మనకి ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. జై సాయిరాం. సాయిరాం సాయిరాం సాయిరాం ఇంతవరకు మీరు ఈనాటి మన యువత కార్యక్రమంలో ధర్మము అనే అంశంపై శ్రీ వి.ఎస్.ఆర్. మూర్తి గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో చివరి భాగాన్ని విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ పూర్ణచంద్ర రావు, శ్రీ గణేష్, శ్రీ సాయి ప్రసాద్. సాయిరాం. [అంజిరి]
SSSMC · audio

Panel Discussion for youth on Human Values moderated - 08

Home

Panel Discussion for youth on Human Values moderated - 08

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 33:50

More in this series

Panel Discussion on Human Values for Youth

3 episodes · 1 hr 33 min

  1. 30 min 22

    Panel Discussion for youth on Human Values moderated - 06

  2. 29 min 23

    Panel Discussion for youth on Human Values moderated - 07

  3. 33 min 24

    Panel Discussion for youth on Human Values moderated - 08

    Now playing