No transcript for this section.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియతీత పదస్థితాంస కరుణం జ్ఞానాగ్ని శిరస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశః ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబెన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్పురతాంయ్ పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య చరణారవిందాలకు అనేకానేక నమస్కృతులు సమర్పిస్తూ ఎక్కడ పదిహేను పదహారు సంవత్సరాలుగా దివ్యనామ సంకీర్తనం జరిగిందో సత్య సాయి గాయత్రి ఉపాసనా బలంగా సాగిందో ఎక్కడ భారతీయ అధ్యాత్మను గురించిన తత్వ విచారణ పరిపూర్ణంగా సాగిందో ఆ ప్రదేశంలో కూర్చొని భారతీయ గురు స్వరూపాల యొక్క తత్వాన్ని విచారణ చేయటం ఒక మహా యోగంగా భావన చేయాలి. గురు అనుగ్రహం గనక లేకపోతే ఇది సంభవం కాదు. అందుకనే ప్రాపంచిక కార్యక్రమ కలాపాలకై పిలిచే వచ్చే పిలుపులన్నీ కూడా చివరలో దుఃఖానికి దారితీస్తాయి. భగవత్ తత్వ విచారణ గురించినటువంటి ఏ కార్యక్రమమైనా జీవుడికి మహదానందాన్ని కలిగిస్తుంది. ఆ పరంపరగా ఈ భారతీయ గురు కోటికి మరొక్కసారి మనందరం మనసా, వచసా, శిరసా నమస్కరిస్తూ వందనం చేస్తూ వారు అనుగ్రహించినటువంటి జ్ఞాన ధారని అందరం పంచుకునే దిశగా ఈ కార్యక్రమం ఏర్పాటు కావటం గురువుల యొక్క అనుగ్రహం. ఇది ఈ సమయంలో చాలా అవసరం. మతం పేరిట, అన్నం పేరిట, భూమి పేరిట ప్రతి ఒక్క విషయంలో మానవుడు విడిపోతూ ఉన్నటువంటి ఒక దురదృష్టకర సన్నివేశంలో గురువుల పేర కూడా విడిపోతున్నటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో గురువులందరూ ఒక్కటే. సత్య సాయి బాబా వారు ఒక మాట అన్నారు "All gurus are one" గురు స్థానానికి ఇలా స్థాయికి వెళ్ళిన వారంతా ఒక్కటే. But all are not gurus అందరూ గురువులు కాలేరు. దాని వెనుక మహత్తర త్యాగం ఉండాలి, ప్రపంచం పట్ల అభ్యాసమైనటువంటి ఒక ప్రేమ ఉండాలి, దయ ఉండాలి, సానుభూతి ఉండాలి, కరుణ ఉండాలి, స్పష్టత ఉండాలి, స్పుర ఉండాలి, స్పర్శ ఉండాలి. ఇన్ని ఉంటే తప్ప గురు స్థానానికి వెళ్ళలేరు. ఏదీ అక్కరలేని వాడు, ఏదీ కోరని వాడే గురువు. ఇది కావాలి అది కావాలి అన్నవాడు గురు స్థానానికి చెందడు, చెందకూడదు. అటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిలో ఈ భారతీయ గురుతత్వాన్ని మనం ఒక్కసారి పునః సమీక్ష చేసుకొని వారి మహత్ పూర్ణమైనటువంటి శక్తిని ఒక్కసారి ఆవాహన చేసుకొని వారి యందు ఉన్నటువంటి భక్తి పారమ్యాన్ని మనం అన్నివేళలా ప్రదర్శిస్తూ, అనుభవిస్తూ ఒక దివ్య నివాళిని ఘటిస్తూ స్ఫూర్తిని పొందుతూ ఉండాలి, ఎప్పుడూ పొందుతూ ఉండాలి. భగవన్నామం ఎప్పుడు చేయాలి అని అడుగుతుంటారు, ఎప్పుడూ చేయాలి. ఎప్పుడన్నా ప్రాపంచిక కార్యకలాపాలు వెనకొస్తే కాసేపు ఆ పని పూర్తి చేసేదాకా విరామం ఉన్నదేమో కానీ నిరంతరము కూడా అనాహతంగా సాగుతూ ఉండవలసినటువంటి ఒక విచార ధార ఇది. ఈ ధారకు ఆలంబనమైనటువంటి మహత్పూర్వ పురుషులందరూ శంకర భగవత్పాదులు, భగవాన్ రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ గురుదేవులు, వివేకానంద స్వామి, శారదా దేవి వీళ్లంతా ఒక పుంజీభూతమైనటువంటి, రాశిభూతమైనటువంటి మహా కారుణ్యానికి నిలువెత్తు దర్పణాలు వీరంతా. ఆ కోవలోనే దానికేమీ భిన్నం కాని ఒక పరమ శక్తి ఆంధ్రదేశంలో పందొమ్మిది వందల ఇరవై మూడులో అవతరించింది. ఆమె బాల్యాన్ని గనక గమనించినట్లయితే మూడు సంవత్సరాలలోనే ఆమెలో ఉన్నటువంటి జగజ్జనని ప్రస్పుటమైంది. తదనంతర కాలంలో ఒక గృహిణిగా తాను పుట్టిన ప్రదేశం నుంచి తాను మెట్టిన ప్రదేశానికి చేరుకున్న తర్వాత ఆమె అనసూయ దేవి అనేటువంటి పేరుతో శరీరధారణ చేసి ఈ జగత్తులోకి వచ్చి తాను మెట్టిన ప్రదేశం జల్లెళ్ళమూడిని ఒక మహా పవిత్ర పుణ్య దివ్య క్షేత్రం చేసిందది. ఎలా చేసింది? ఎలా చేయగలిగింది? చాలా చిన్న కుగ్రామం. ఆ ఊరికి ఆమె భర్త కేవలం ఒక కరణంగా. సంసారం ఉన్నది. సంసారం ఉంటే ఆత్మోన్నతికి అడ్డా అంటే సూత పురాణంలో ముక్తి ఖండంలో ఒక శ్లోకం ఉంది. బ్రహ్మచారి గృహస్తశ్చ వానప్రస్తశ్చ భిక్షుకః అతివర్ణాశ్రమీ Chae ఇతి క్రమాత్ శ్రేష్ఠా విచక్షణ. బ్రహ్మచారి, బ్రహ్మచారి కంటే గృహస్తు, గృహస్తు కంటే భిక్షకుడు, భిక్షకుడు కంటే వానప్రస్తుడు, ఈ నలుగురి కంటే కూడా అతివర్ణాశ్రమి ఉత్తమోత్తముడైనటువంటి వాడు వాడు గురువు నామ్ గురువు అని.ఈ అతివర్ణాశ్రమం అంటే ఏమిటి? అమ్మ జీవిత సంఘటనలన్నీ చెప్పుకుంటే కానీ అతివర్ణాశ్రమం అర్థం కాదు. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ స్థితులను దాటి సర్వే సర్వత్రా కేవలం తనను మాత్రమే చూసుకోగలిగినటువంటి ఒక స్థాయి. అది అతివర్ణాశ్రమం. తన ఇంట్లోనే తాను అతిథిగా ఉండగలడు లేదా ఉండగలడు. తనకేమీ అక్కరలేదు ఎవరికోసమో ఎప్పుడో ఏదో ఇవ్వాలన్నటువంటి ఒక తపన, ఒక ఆతృత. ఇది జగజ్జనని యొక్క లక్షణం. భగవాన్ రమణ మహర్షులు ఈ జగత్తులోకి శరీరధారణ చేసి వచ్చిన నలభై నాలుగు సంవత్సరాలకి జిల్లెళ్ళమూడి అమ్మ ఈ అవనీ సంచారానికి వచ్చింది. తిరుపతి వెంకటేశ్వరస్వామి, షిరిడీ సాయిబాబా, పుట్టపర్తి సత్యసాయిబాబా అని వారు ఉన్న క్షేత్రాలతో వారి పేరు కలిపి చెప్పడమే గానీ అమ్మ అంటే జిల్లెళ్ళమూడికి అమ్మ అని కాదు జిల్లెళ్ళమూడిలో ఉన్న అమ్మ. అమ్మ అంటే అమ్మే, స్వామి అంటే స్వామి. వెంకటేశ్వరస్వామి ఒక, ఒకచోటే ఉంటాడు ఒకచోటే మిగతాదంతా కూడా నకళ్ళు ఉంటాయి అది. అసలు అమ్మ అనేటువంటి శబ్దానికి అంతా తానే, అన్నీ తానే. ఆ అంతా తానే, అన్నీ తానో ఆనందాన్ని అనుభవిస్తుంది గనుక అం-అ అది అమ్మ. అమ్మ ఎవరికన్నా ఒక ఆటోగ్రాఫ్ గనక ఇస్తే, ఎవరికన్నా bless చేస్తే సంతకం పెడితే అమ్మ అని మామూలుగా మా కింద మా ఊర్లో తిచ్చేది కాదు అం-అ. ఈ నలభై నాలుగు ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి అమ్మ అనేకమైనటువంటి మహాశక్తులను ప్రదర్శించింది మహిమలు చేయలే. శక్తులు ఎలా ప్రదర్శించింది అంటే, ఇవాళ ఏ కృత్తాళం పీఠం అని మనం చెప్పుకుంటున్నామో, కృత్తాళం పీఠానికి మూలమైనటువంటి మౌనస్వామి వారు అరుణాచలేశ్వర దర్శనం చేసుకున్నారు, రమణ మహర్షిని దర్శనం చేసినవారు, జీవితాంతం మౌనంగా ఉన్నటువంటి వారు, మామూలు వారు కాదు. అటువంటి మౌనస్వామి ఒక ప్రదేశంలో సంచారానికి వెళ్ళినప్పుడు ఈ అమ్మకి అంటే అప్పటికి ఇంకా అమ్మ కాలే అనసూయ ఆరేళ్ళ పిల్ల. ఆ సందర్భం వాళ్ళిద్దరూ కలవటం జరిగింది. జరిగితే మౌనస్వామి "ఇక్కడ ఒక ఫలానా చక్రం వేసి ఉన్నది" అని మాత్రం కాగితం మీద రాశారు. ఆ ఊరు వెళ్ళిన మొట్టమొదటిసారి ఈ అనసూయాదేవి తొట్టతొలిసారి అక్కడ ప్రవేశించినప్పుడు మౌనస్వామి వారి ఈ మాట అనగానే ఆరేళ్ళ ఈ పిల్ల ఏమన్నదో తెలుసునా? "అక్కడ ఉన్నది మీరు అనుకుంటున్న ఆ చక్రం కాదు, ఫలానా చక్రం ఉన్నది" అన్నది. "కాదమ్మా! నీకంటేనే చాలా పెద్దవాడిని, నాకు తెలుసు ఇదే చక్రం ఉన్నది" అంటే "తవ్వి చూసుకోండి" అన్నది. చూస్తే అక్కడ ఈ అమ్మ ఏం చెప్పిందో ఆ చక్రమే ఉంది అది. అలాగే ఒకడు అతి బాల్యంలో బుజారా వేసుకుని ఎత్తుకున్న బయట తిప్పటానికి వెళితే ఆమె చేతికున్నటువంటి గాజులు దొంగతనం చేయాలి అని అనుకున్నప్పుడు వాడి మనసు గ్రహించి అమ్మ ఏమన్నదంటే "నన్ను అడిగితే నేను ఇవ్వనా, ఇవి నీకోసమే నాకెందుకు ఇవ్వి" అన్నది. అంటే ఇవన్నీ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనటానికి ఈ మహాత్ముల యొక్క జీవితాలు. మేము ఫలానా అని ప్రకటించిన తర్వాత జగత్ ఎలాగో తెలుసుకుంటుంది. కానీ దానికంటే ముందు ఎట్లా ఉన్నది కూడా విచారణ చేయవలసి ఉన్నది గనుక ఈ రెండు మూడు విషయాల ప్రస్తావన. అయితే జిల్లెళ్ళమూడి అమ్మ జీవితంలో చాలా సంఘటనలు ఉన్నాయి. అది ఒక మహోర్ధతి అంటే ఒక మహాసముద్రం. ఆ మహాసముద్రంలో అనేక అలలు, అనేక కెరటాలు, అనేక తుఫానులు. కానీ దేనికి చలించనటువంటి ఒక మహాధి శక్తితో అమ్మ అక్కడ సంచారం చేసింది. ఈరోజున పాశ్చాత్య దేశాల నుంచి అనేకమంది వస్తున్నారని మనం అనుకుంటున్నామే, రమణ మహర్షికి వలెనే జిల్లెళ్ళమూడికి కూడా ఆ రోజుల్లోనే foreigners వచ్చారు. ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎందుకు వచ్చారు? మనం ఎందుకు వెళ్ళం? మనందరికీ అమ్మలు ఉన్నారు కదా [గొంతు సవరించుకుంది], ఈ అమ్మలకు మించి ఆ అమ్మ దగ్గర ఏముంది అని. ఇక్కడ లేనిదేదీ అక్కడ మాత్రం ఉంది. ఏమున్నది అంటే తనువును పంచి ఇచ్చిన తల్లికి ఒక ప్రేమ ఉంటుంది. అది రాగ అనురాగ బంధాలకు సంబంధించిన ప్రేమ. జిల్లెళ్ళమూడి అమ్మ సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరి పట్ల ప్రదర్శించింది భగవాన్ సత్యసాయి ఉపదేశించినటువంటి, ఈ ప్రపంచానికి అందించినటువంటి దివ్య ప్రేమ. ఆ దివ్య ప్రేమలో అన్ని కులాల వాళ్ళున్నారు పొందిన వాళ్ళల్లో, అన్ని మతాల వాళ్ళున్నారు, అన్ని జాతుల వాళ్ళున్నారు. డబ్బున్న వాడు లేడు, లేని వాడు లేడు. అసలు ఆమె నుంచి ఆనందం పొందని వాడు లేడు. ఇటువంటి ఒక పరిస్థితిలో జిల్లెళ్ళమూడి అనేటువంటి కుగ్రామంలో ఆమెతో మొట్టమొదట రోజు చెప్పిన శంకర భగవత్పాదుల్ని మనం చూడలే, మనం ఎవరం చూడలే, రమణ మహర్షిని చూడలే, రామకృష్ణ గురుదేవుల్ని చూడలే, వివేకానంద స్వామిని చూడలే, సరదాదేవిని చూడలే. కానీ మౌనస్వామి గారు వచ్చిన వాళ్ళల్లో కొంతమంది నేను స్వయంగా అమ్మను చూసిన వాడిని.పందొమ్మిది వందల అరవై ఏడులో మొట్టమొదటిసారి నేను జిల్లెళ్ళ అమ్మడి దర్శనం చేశాను. పందొమ్మిది వందల అరవై రెండులో మొట్టమొదటిసారి భగవాన్ సత్యసాయిబాబా వారిని దర్శనం చేశాను. పందొమ్మిది వందల అరవై రెండు జూన్ తొమ్మిదో తారీఖున స్వామి దర్శనాన్ని నేను పుట్టిపర్తి లో నా అంతట నేను వెతుక్కుంటూ వెళ్లి నేను పొందినటువంటి సౌభాగ్యం అది. ఆ తర్వాత పందొమ్మిది వందల అరవై ఏడులో, ఐదేళ్ల తర్వాత అమ్మని దర్శనం చేశాను. వెళ్ళిన రోజు ఏం జరిగింది కాస్త విచారణ చేసినట్లయితే, చాలా చిన్నగా ఆవిడని బయట పందిళ్ళు వేసి ఉన్నాయి, ఆమె ఎక్కడో గదిలో మూల ఒక మంచం వేసుకుని ఆ మంచం మీద కూర్చుంటుంది అని పేపర్ లో చదివాను తప్ప ఆమెను ఇంకా చూడని సందర్భం అది. నేను అక్కడికి చేరుకోగానే ఓ పెద్దాయన "నేను పిలుస్తాను అప్పుడు లోపలికి రావాలి ఇక్కడే కూర్చో" అన్నాడు. ఇక్కడే కూర్చో నేను పిలుస్తాను అన్నటువంటి అదే సమయంలో లోపల నుంచి అమ్మ ఒక మాట అన్నది. ఆమె ఉన్న room కి బయటకు చూట్టానికి కిటికీలు ఏం లేవు. నేనేవరో ఆమెకు తెలియదు. అది నా ఊహ. ఎప్పుడైతే ఆయన నన్ను అక్కడ కూర్చోమని అన్నారో వెంటనే అమ్మ కంఠం లోపలి నుంచి వినిపించింది. "వాడిని నేనే పిలుచుకున్నాను లోపలికి తీసుకురా" అన్నది. [చప్పట్లు] ఇది పరమార్థం అయినటువంటి ఘట్టం. వెళ్ళగానే చాలా చక్కగా కూర్చోబెట్టి అనేకైన విషయాలు అందరితో పాటు చెప్తూ చెప్తూ వింటూ ఉండగా, అక్కడొక అరటిపండు తీసింది. తీసి చక్కెర కేళి పండు. తోలు ఒలిచి ఒలుస్తూ అన్న మాటలు ఏంటంటే, "పైది తీస్తే కానీ లోపలిది అర్థం కాదు. లోపల ఏముందో తెలియదు. లోపల ఏముందో తెలుసుకుంటే ప్రయోజనం లేదు. తింటే గాని అనుభవం కాదు. అందుకే నీకు పెడుతున్నానురా" అన్నది. అది. ఎంత తాత్వికమైన దృష్టి చూడండి. ఏదో మనం గురువు దగ్గరికి వెళ్తాం ఆ పండు ఈ పండు పెడతాం ఇస్తాం దండం పెట్టుకుంటాం వచ్చేస్తాం. గురువు కూడా సరే అని అంటాడు తీసుకుంటాడు. కానీ ఆ ఒక అరటిపండు తినిపించటంలో ఆ అమ్మదనాన్ని, కమ్మదనాన్ని, పూర్ణత్వాన్ని, ఒక దివ్య మాతృత్వాన్ని ఒక అనుభవ పరిధిలోకి నన్ను తీసుకుని వచ్చింది. అలాగే తదనంతర కాలంలో, ఆ రోజే అనేక సంఘటనలు జరిగినవి ఒకటి రెండు చెప్తాను అదే రోజు జరిగినవి. "భోంచేశావా" అన్నది. ఆమెకు తెలుసు నేను ఇంకా చేయలేదు అని. మామూలుగా అయితే భోంచేసి రా అంటుంది. కానీ ఆ రోజు నేనెందంటే "నేను పెడతాను ఇక్కడే కూర్చో" అంది. [దగ్గిన వాకిలి] ఒక అంచం తెప్పించి దాని నిండా చక్కగా అన్నం కలిపి ఒక్కొక్క ముద్ద పెడుతూ పరమ ఆర్ద్రంగా, పరమ కరుణగా నాకు ఆమె అన్నం పెట్టింది. అది పందొమ్మిది వందల అరవై ఏడు నాటి మాట. అయిపోయిన తర్వాత "నువ్వొక్కడివే వచ్చావే, భయం వేయలేదా" అని అడిగింది. నేనేం మాట్లాడలేదు. కాసేపు అయిన తర్వాత, భోజనం అయిపోయిన తర్వాత నాకో పది రూపాయల నోటు ఇచ్చింది. ఇచ్చి "మళ్ళీ నువ్వు చీకటి పడకుండా బయలుదేరి వెళ్ళు" అన్నది. నేనప్పుడు ఒక మూడు సంవత్సరాలు ప్రకాశం జిల్లాలో higher secondary school లో student గా ఉన్న అది వయస్సు. నాలుగు గంటలు అయిందో లేదో నేను bus ఎక్కి వాపట్ల మీదుగా నేను వెళ్ళవలసిన ఇంకొల్ల అనే ఊరు చేరుకున్నా. తర్వాత కాలంలో ఒకసారి అమ్మ దగ్గర నేను ఆ గదిలో కూర్చోవడం జరిగింది. అనేక దేశాలు తిరిగి వచ్చినటువంటి ఒకాయన ఆయా దేశాలలో జరిగినటువంటి అనేక సంఘటనలు చెప్పడం మొదలుపెట్టాడు. అంటే ఏ దేశంలో ఏం జరిగింది, అందులో ప్రధానంగా ఓ సన్నివేశం వచ్చినప్పుడు, "అమ్మా సుమారుగా ఇరవై ఏడు దేశాలు కాలిడన్నాయి. అందులో భారతీయ జెండాని మోసే అర్హత, ఒక అదృష్టం, ఒక యోగం నాకు కలిగిందమ్మా" అని ఉద్వేగంతో, ఆనందంతో చెప్తున్నాడు. చెప్తూ ఉంటే అమ్మ ఒక పల్లెటూరిలో, ఒక ఇంట్లో, ఒక నులక మంచం మీద కూర్చొని బాసిం పెట్టు వేసుకున్నటువంటి ఒక అమ్మ అన్న మాట ఇప్పుడు అన్నట్లుగా ఉంటుంది. "అన్నీ చెప్తున్నావు గానీ ఆ చివర నుంచున్న ఒక Russian lady, ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందే, ఆ పడిపోయినప్పుడు మంచినీళ్ళు తెచ్చి పెట్టావు అది చెప్పవే" అంది. ఈ చెబుతున్నవాడు అవాక్కైపోయినాడు. "అమ్మాయి నువ్వు నీకెట్లా తెలుసు నువ్వు జిల్లెళ్ళమూడి దాటనే లేదు కదా" అన్నాడు. "అది ఏం లేదురా, కాస్త మనస్సును మన దగ్గర పెట్టుకుంటే దూరదర్శనము, దూర శ్రవణము చిన్న సిద్ధులవి. దాని గురించి పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు తర్వాత చెప్పు" అన్నది. అటువంటి దూరదర్శనం కానీ, దూర శ్రవణం కానీ సామాన్యమైన వాడికి ఎవరికన్నా గనక ఉపాసనా బలంతో సిద్ధి గనక కలిగినట్లయితే దాన్ని ఇవాళ వంద కోట్ల రూపాయలు వ్యాపారం చేసుకుంటాడు. అది. "దాన్లో ఏముందిలేరా" అంది. అంతే. అంటే దాంతో తనకి ప్రమేయం లేదు. అంటే సర్వవ్యాపిణి అయినటువంటి ఒక మాతృమూర్తి యొక్క దివ్యత్వాన్ని మనం అంత తేలిగ్గా గమనించలేము. ఆమె సంసారం ఉంది కదా, యోగిని ఎలా అయింది, ఆమె యోగిని కాదు. తర్వాత కాలంలో ఆమె రాజరాజేశ్వరిగా, విశ్వజననిగా, మాతృశ్రీగా అనేక పేర్లతో పిలవబడినప్పటికీ కూడా ఆమె యందు సహజంగా ఉన్నటువంటి మాతృత్వమే జిల్లెళ్ళమూడిని పుణ్యక్షేత్రం చేసింది.ఉపనిషత్తుల సారాన్ని మామూలు మాటల్లో చెప్పేసేది. శంకరాద్వైతాన్ని మనం మాట్లాడుకుంటున్నట్టుగా చాలా సరదాగా చెప్పేది. చాలా నిగూఢంగా ఉండేది దాంట్లో. ఎవరైనా ఆమె స్త్రీమూర్తి గనక మాతృమూర్తి గనక పది, పదిహేను వేల రూపాయల ఖరీదు ఆ రోజుల్లో పట్టుచీర ధనవంతులు గనక తెచ్చి ఇస్తే, ఆమె కట్టుకుంటుందో తెలియదు, ఎవరికి ఇస్తుందో తెలియదు. ఒకరోజున ఒక సంఘటన చెప్తాను. ఇవన్నీ నా జీవితంలో జరిగినయి గనక ఇది ప్రత్యక్ష అనుభవం. అలా కూర్చుంది, అదే సమయంలో బయట లెట్రిన్స్ క్లీన్ చేసే పాకీ పిల్ల బకెట్టు, ఒక చుప్పూరు తీసుకుని వెళ్తుంది. అమ్మకి ఆ పిల్ల కనిపించే అవకాశం లేదు. ఇదంతా లోపల జరుగుతున్నది. ఇండోర్. ఈ చీర ఇవ్వగానే అమ్మగా అది తీసుకుని దగ్గర పక్కన పెట్టుకుంది. పెట్టుకున్న ఐదు నిమిషాలలో ఒక ఆమెని పిలిచి "ఫలానా! ఆ అమ్మాయి ఇలా వెళ్తుంది, దాన్ని అటు తీసుకురా" అని. "దాన్ని పని చేసుకోని అమ్మా, అది ఇక్కడికి ఎందుకు?" అన్నది ఆమె. "ఆ అది ఇక్కడికి రావలసిందే" అంటూ ఓ మాట అన్నది. "ఏం? అది లెట్రిన్స్ క్లీన్ చేస్తున్నది అని మీకేమన్నా తక్కువ చూపా? మన దేహం ఒక లెట్రిన్ కాదా? ఆలోచించుకున్నారా?" అన్నది. "లోపల ఉన్నది ఏమున్నది? లోపలికి చూడండ్రా. పిలుచుకురండి" అన్నది. పిలుచుకొస్తే, ఆ అమ్మాయికి ఒక పధ్నాలుగు, పదిహేనేళ్ళ కంటే వయస్సు ఉండదు. "ఈ పదిహేను వేల పట్టుచీర, పండు, పండు, పసుపు, కుంకుమ ఇచ్చి పెళ్లి కట్టుకోవే" అన్నది. ఇదే భాష. "నీ పెళ్లి కట్టుకోవే" అన్నది. ఊహాతీతం. అంటే ఇవ్వటంలో ఉన్నటువంటి ఔదార్యం, ఒక విశాలత్వం. పదిహేను వేల చీర కట్టుకోనివ్వటం వేరు, కట్టుకోమని ఇవ్వటం వేరు. అంత తేడా ఉంది. మనం కట్టుకున్నది ఇవ్వటం ఎవరైనా చేస్తారు. మనకి నచ్చితే నాలుగేళ్ళు కడతాం, నచ్చకపోతే నాలుగు రోజులు కట్టం, ఓ రోజు కట్టం. కానీ కట్టకుండా మాత్రం ఇవ్వం. అది. మన ఒంటిమీద పడిది మందైపోయి కాస్త నలిగాక ఇస్తాం. అంటే మాతృమూర్తి యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి. అలాగే ఒకరోజున అమ్మ చక్కగా తయారయింది. ఓ పెళ్ళికి వెళ్ళాలి ఊర్లోనే. ఇదంతా జిల్లెళ్ళమూడనే కుగ్రామంలో జరిగినవే. పెళ్ళికి రెడీ అయింది, వెళ్లి ఆశీర్వచనం ఇచ్చి రావాలి. ఇంతలోకే కబురు వచ్చింది, ఊర్లో ఎవరో పోయినారు అని. అందరూ సందిగ్ధం. అమ్మ ఎక్కడికెళ్తుంది? వాడు కావలసిన వాడు, పోయిన వాడు. నిన్నటిదాకా ఇక్కడ సేవ చేసిన వాడు. అవతల పెళ్ళికి ముహూర్తం, అమ్మ వెళితే తప్ప వాడు మంగళసూత్రం కట్టరని వాడు కూర్చున్నాడు. ఏమన్నదంటే, "వీడి కళ్యాణం ఇక్కడ అవుతోందిరా, వాడి కళ్యాణం అక్కడ అయిపోయింది. నేను ముందు అక్కడికే వెళ్లి వాడిని చూసి తర్వాత అక్కడికి వెళ్తా" అంది. శవదర్శనం చేసింది. [దగ్గు] నుంచున్నది. "నువ్వు ఎక్కడికీ వెళ్ళలేదురా, నా దగ్గరికే తీసుకున్నాను, నా ఊర్లో ఉన్నావురా నువ్వు" అంటూ ఒక మాటంటూ కళ్యాణ మండపం ప్రవేశం చేసింది. అద్వైతానికి ఒక పరిపూర్ణమైన గుర్తు. చెప్పటం వేరు, బాబావారు అంటారు, "చెప్పుట సులభము, చేయుట కష్టము". అమ్మ చేసినట్టుగా మనం చేయగలమా? మన దగ్గర ఉన్న ఒక రెండు వేలు, పదివేలు వదిలేయండి, ఓ వెయ్యి రూపాయల చీర. ఆ చీర మన ఇంట్లో ఉన్న పనిమనిషికి నువ్వు కట్టుకొనివ్వగలవా? ఇవ్వం. ఇవ్వము, అంతే. ఇదే సత్యం. ఇస్తే వాళ్ళంతా జిల్లెళ్ళమూడి అమ్మతో సమానమే. అట్లా చేయి చేసింది గనుకనే ఆమె అమ్మ అయింది. అది. అంతే కాదు, ప్రపంచంలో మనం చాలా డబ్బు సంపాదిస్తాం. సంపాదించేవాడు అనుకోండి. వాడు వంద కోట్లకి అధిపతి. జనవరి ఫస్ట్ న వాడిని మీరు కలిసి, "ఈసారి మీరేమనుకుంటున్నారు?" "ఖచ్చితంగా రెండు వందల కోట్లు సంపాదిస్తా, అదే నా లక్ష్యం" అంటాడు. రెండు వందల కోట్ల తర్వాత నాలుగు వందల కోట్లు అంటాడు, చాలు అనడు. అలాగే మనం కూడా ఎవరికన్నా పది రూపాయలు ఇస్తే ఎంత గొప్ప పని, చాలు అంటాడా, ఇంకొక్క పది ఇప్పించండి అంటాడు. కంచంలో అన్నం పెట్టండి, అభ్యాయంగా పెట్ట-గా పెట్టండి, వడ్డించండి. రెండు నిమిషాలు అయిన తర్వాత, "అమ్మా చాలు" అంటాడు. ఆ చాలు అనబడేటువంటి ఒక పదార్థం కేవలం ఆహారం మాత్రమే. తిండి మాత్రమే. తైత్తరీయ ఉపనిషత్తు "అన్నం బహు కుర్వీత" అని ఒక మాట అన్నది. అనేక శ్లోకాలున్నాయి, వాటి అర్థం ఒకటే. అన్నాన్ని సమృద్ధంగా చెయ్యి, అన్నాన్ని సమృద్ధంగా పెంచు, అన్నాన్ని సమృద్ధంగా పంచు. ఇది. ఆ ఉపనిషత్తు యొక్క సారం. ఉపనిషత్తు గనక ఒక శాస్త్రం అయితే, ఒక బోధ అయితే, అది ఒక విషయ జ్ఞానం గనక అయినట్లయితే, అది ఎవరో ఒక మహర్షి రాసినటువంటి ఒక జీవన సూత్రం అయితే, ఇవన్నీ కలిపి ఒక బొమ్మ అయితే ఆ బొమ్మే జిల్లెళ్ళమూడి అమ్మ. కారణం ఒకటే. కడుపు నిండు-నిండిన వాడు నిండని వాడిని చూడాలి. ఈ జగత్తులో ఉన్న ఒక ధర్మం ఏమిటి అంటే, మన కడుపు నింపుకుంటూ నింపుకుంటూ ఉండటం మాత్రమే కాదు, నిండని వాడిది కూడా నింపాలి, అది ఒక సామాజికమైన ధర్మం. అలాగే అన్నమే మనం, మనం-మన మనస్సు అన్నం లోరించే పుట్టింది. చిన్న ఒక మెతుకులో నుంచి ఏ భావంతో మనం తిన్నామో, ఏ భావంతో మనం అందుకున్నామో దాని నుంచే అన్నమయ కోశం ఏర్పడుతుంది. బాబావారు ఓ కథ చెప్పారు. అరణ్యంలో ఒక దొంగ ఒక సాధువు ప్రయాణం చేస్తున్నారు.ఆ రోజుల్లో పూటి కూర్లమ్మలు ఉన్నారు. ఒక అడవి దాటుతున్నారు. ఆ అడవి దాటి గ్రామం ప్రవేశించటానికి ముందు ఈ పూట కూర్లమ్మ దగ్గరకు వెళ్లారు. ఇద్దరూ వెళ్లారు. అందులో ఒక ఆనే చాలా ముసలమ్మ, పెద్ద వయస్సు. ఆమె అన్నది, "ఇప్పుడే పోయి ఆరిపి పడుకోబోతున్నానయ్యా, మళ్లీ పొద్దున్నే ఎవరి కోసమో లేవాలి కదా! ఒక పని చేయండి, నా దగ్గర ఎంత ఉన్నదో దాంతో ఒకరికి పెట్టగలుగుతారు. రెండోది కాస్త దూరం వెళితే ఇంకో అమ్మాయి ఉంది, అక్కడికెళ్లి మీరు తిని రండి." అన్నది. వాళ్లకు కావాల్సింది కడుపు నింపుకోవటం, ఆ రాత్రివేళ. సరేనన్నారు. ఎవరి దారి వాళ్లది. చీలిపోయింది. ఈ ముసలమ్మ దగ్గరికి ఒకడు, ఆ పడుచు అమ్మాయి దగ్గరికి ఇంకొకడు భోజనానికి వెళ్లారు రాత్రిపూట. ఈ ముసలమ్మ అన్నం వండుతూ ఏమనుకున్నది అంటే, 'శరీరం విశ్రమించాలి అని నేను అనుకున్నప్పటికీ పరమాత్మ నీకు నా మీద ఎంత దయ తండ్రీ! ఇది చేసి పడుకో అంటున్నావే, ఆ చిట్టచివరి క్షణం వరకు నాకు ఈ సేవ ఇవ్వు." అంటూ పరమేశ్వర భావనతో వడ్డన చేసింది. ఆ వడ్డన చేస్తే, ఈ తిన్నవాడు ఎవరంటే దొంగ. ఆ పడుచు పిల్ల దగ్గరికి కాషాయం కట్టుకున్న మహాత్ముడు అనబడే వాడు వెళ్లాడు. ఆ పిల్ల అనుకుంది, 'ఏమి సన్యాసి వీడు. ఓ ఇటువంటి వాళ్లని ఇబ్బంది పెట్టవచ్చునా? అయినా ఏమి ఆకలిని ఆపుకోలేడా? ఏంది వదిలిపెట్టినట్లు? ఇలాంటి వాళ్లు వస్తే ఎంత, పోతే... చే ఆకపడుతూ అన్నం వండింది. అయినా పెట్టింది. వాడు వచ్చి తిన్నాడు. తిన్న తర్వాత ఏమవుతుంది? సహజంగా రాత్రిపూట పడుకోవాలి. ఆ పడుకున్నటువంటి వేళ ఈ దొంగకి ఒక ఆలోచన కలిగింది. 'తొంభై ఏళ్ల ఒక గుడ్డి ముసలి అవ్వ నేను దొంగనో దొరనో అని తెలియకుండా ఆ వంట వండినంత సేపు భగవన్నామం చేస్తూ భగవంతుని గురించి ఆలోచిస్తూ నాకు అన్నం పెట్టిందే, తెల్లవారగానే నేను దొంగతనం మానేస్తున్నా.' అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ సన్యాసిగా ఉన్నటువంటి కాషాయం కట్టిన వాడు ఆ పడుచు పిల్ల పెట్టినటువంటి అన్నం తిని, 'ఎంత హాయిగా ఉంది! అకారణంగా సన్యాసం తీసుకున్నాను. ఇటువంటి భార్య గనక నాకున్నట్లయితే, ఏ వేళకు వచ్చినా, ఎప్పుడైనా నాకు కావలసినవన్నీ వండి పెట్టేది కదా! తెల్లవారేప్పటికి నేను సన్యాసం వదిలి పెడుతున్నాను.' అన్నాడు. ఈ భావదోషం ఎక్కడ ఏర్పడింది? తాము తిన్న అన్నంలో నుంచి. ఆ అన్నం ఎవరు పెట్టారు? ఎవరు వండారో వారు పెట్టారు. కాబట్టి మనం కూడా ఒక ధర్మబద్ధమైన ఒక సూత్ర నిర్మాణం చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ మనం భోజనం చేయకూడదు. మనం అంటాం, 'అహంకారం అండి, ఇక్కడ తినరు.' అని. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. ఎక్కడ తినాలో అక్కడ తినాలి. యుక్తాహార విహారస్య అంటే శరీరానికి కావలసిన, వయస్సుకు తగిన అని ఒక అర్థం. తిన తగినది అని ఒక చోట ఒక అర్థం. తినవలసిన చోట మాత్రమే తినటం అది విహారం. యుక్తాహారము, యుక్త విహారం కూడా చేయాలి. ఆ యుక్త విహారంలో గనక ఈ ఆహారం దొరికినట్లయితే అది పరిపూర్ణమైనటువంటి ఒక సిద్ధి కలుగుతుంది గనుక ఆ అన్నపు మెతుకులలో నుంచి అన్నమయ కోశం ఏర్పడుతుంది.
SSSMC · audio
Talk on Jillellamudiamma - 01
Talk on Jillellamudiamma - 01
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 27:47
More in this series