No transcript for this section.
ఈ అన్నమయ కోశంలో నుంచి దానికంటే సూక్ష్మమైనటువంటి ప్రాణమయ కోశం ఏర్పడుతుంది energy ఏర్పడుతుంది. ప్రాణమయ కోశం నుంచి దానికంటే సూక్ష్మమైన మనోమయ కోశం ఏర్పడుతుంది. మనోమయ కోశం నుంచి దానికంటే అతి సూక్ష్మమైన విజ్ఞానమయ కోశం ఏర్పడుతుంది. దాని నుంచి పరిపూర్ణము, పరమము, చరమము, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆనందమయ కోశం ఏర్పడుతుంది. ఈ పంచ కోశములు కూడా మానవ దేశంలో ఉంటాయి. దీనికి ఆధారం ఏది అంటే అన్నపు మెతుకు ఆహారం అవుతున్నది. అందుకనే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసన చేశారు మన పూర్వీకులు. ధర్మ క్షేత్రానికి సత్య సాయిబాబా వారు వెళ్లారు. అక్కడ విడిది చేశారు. వారితో పాటు కారుణ్యానంద కూడా వెళ్లారు. వారితో పాటు ఉండేవారు. ఆ గొడుగు పట్టుకొని కాషాయంలో ఉన్న మహాత్ముడు ఆయన. అయితే బాబా వారిని దర్శనం చేయటానికి చాలామంది పెద్దలందరూ రావటంతో స్వామి పైన ఉండిపోయినారు. కారుణ్యానంద కింద ఉండిపోయినారు. ఖాళీగా ఉన్నారాయన. ఆ తాను ఉన్నటువంటి గది కిటికీ తెరలు అటు ఇటు తీశాడు. తీయగానే ఆయన కంటి ముందు ఒక భయంకర దృశ్యం కనిపించింది బయట. ఒక చెత్త కుండీలో విసిరి పారేసినటువంటి ఎంగిలి విస్తరాకులు, అన్నం, తిండి పదార్థాలు. దానికోసమై పోట్లాడుకుంటున్నటువంటి కుక్కలు. వాటితో తలబడుతున్నటువంటి ఇద్దరు పిల్లలు. ఈ దృశ్యం చూడగానే ఆయన గుండె చలించిపోయింది. ఒక్కసారి curtain వేసేశారు. బాబా వారు పైనుంచి కిందకు రాగానే మొట్ట మొదటి ప్రశ్న ఏ, అడగాలి ఎందుకిలా జరుగుతున్నది? అనుకున్నారు మళ్ళీ ధ్యానంలో ఉండిపోయారు ఆయన. ఆ ధ్యానంలో స్వామి తలుపులలో ఆయన స్వాత్మానంద స్థితిలో ఆయన ఉన్నారు. ఇంతలోకే మధ్యాహ్నం ఒంటిగంట అయిపోయింది బాబా వారు కిందకి దిగి వచ్చారు. కిందకి దిగి వచ్చి ఒంటిగంట అయితుంటే కారుణ్యానంద భుజం మీద అలా చేయి పెట్టి తట్టారు. ఒక్కసారి ఆయన ఉలిక్కిపడి లేచి ఆశ్చర్యం దేనికి పొందాడంటే, బాబా ఎలా వచ్చారు తలుపు వేసి ఉంది కదా అని. అదే అన్నాడు ఆయన. ఏం ప్రశ్న వేయాలో అది వేయలే. బాబా నేను తలుపు bolt పెట్టించానే మీరు ఎలా వచ్చారు అన్నాడు. నేను రావాలి అంటే bolt అడ్డమా అన్నారు న-నవ్వుతూ. పదా పదా భోజనానికి time అయ్యింది ఒంటిగంట అయిపోయింది. లే ఇంకా ఇక్కడ ఉన్నావా అంటుంటే, బాబా ఒక్క విషయం మిమ్మల్ని అడగాలి ఒక్క నిమిషం ఉండండి. మీరే దానికి పరిష్కారం చెప్పాలి. అని అంటుండగా, ఏది? ఆ కుండీ, ఆ కుక్కలు, ఆ పిల్లలు వాళ్ళ సంగతేనా అన్నారు బాబా. అనగానే ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయినాడు. సాక్షాత్తు సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి స్వామి ఒక చద్విలాసంతో కూర్చుని ఒక వైభవం ఉండి-ఉండి కొన్ని వేల మంది భోజనానికి సిద్ధమవుతున్నటువంటి ఒక ప్రదేశంలో ఇద్దరు పిల్లలకి అన్నం దొరకని ఈ స్థితి ఏమిటి? ఎందుకిలా జరిగింది? భగవంతుడు సాక్షాత్తు అక్కడున్నాడు ఇది ప్రశ్న ఆయనకు లోపల ఉన్నది. బాబా సమాధానం చెప్పారు. ఏది ఆ ఇద్దరు పిల్లల గురించేనా నీ విచారణ? వారు పూర్వ జన్మలో జమీందారు బిడ్డలు. వారు అనుకున్న సమయానికి బంగాళాపు పళ్ళాలలో అన్నం వడ్డించబడితే అతిశయించి అహంకారం చేత ఆ plate లు కిందకు విసిరేశారు. ఏం లేదు పారేసుకున్న మెతుకులు ఇప్పుడు ఏరుకుంటున్నారు. అది అంటే అన్నం బహుకుర్వీత అంటే మన ఇంట్లో బాగా అన్నం ఉండటం కాదు మనతో పాటు రోజుకి కనీసం ఒక్క కడుపైనా నింపగలగాలి. అవన్నీ పాతకాలం ఇప్పుడు ఇంట్లో వాళ్ళకే కష్టం అనే దానికి అమ్మను చూడండి. జిల్లెల్లముడి ఇవాళ ఉన్న దివ్య క్షేత్రానికి అమ్మ పెట్టినటువంటి పేరు అందరి ఇల్లు అని అచ్చ తెలుగులో పెట్టింది. దానికేదో ఆనందాలయో, మనసూయాలయో, రాజరాజేశ్వర్యాలయో ఏంటి అందరి ఇల్లు. ఆ అందరి ఇల్లులో ఎవరు వస్తారో, ఎవరు మన పక్కన కూర్చుంటారో అందరికీ ఆహ్వానమే. జీవితంలో నిన్న ఎట్లాగైతే తిరువన్నామలై వెళ్లాలని మనమంతా అనుకున్నామో, జీవితంలో ఒక్కసారి జిల్లెల్లముడి వెళ్లి అమ్మ ప్రసాదం తిని రావాలి. కారణం ఒక్కటే అది కేవలం అన్నపు ముద్ద కాదు అది జ్ఞానాన్నం. ఆ జ్ఞానాన్నాన్ని అందుకున్న వారిలో శ్రీశైలానికి వెళ్లే దారిలో సున్నిపెంట అని ఒక ఊరు ఉంది. అక్కడ పూర్ణానంద స్వామి వారు ఉన్నారు. ఆయన ఆ దర్శనానికి వెళ్లారు. వెళ్తే ఆమె ఏమన్నదో తెలుసా? పూర్ణానంద స్వామి అని పేరు పెట్టుకున్నావు గానీ నువ్వు సాక్షాత్తు శివుడివి రా అన్నది. అది నేనే శివుణ్ణి చూస్తున్నాను అన్నది. ఇది సత్యం. మనం చాలా విస్తృతంగా లోలోతులకు వెళ్లి అధ్యయనం చేయాలి. ఎందుకని ఈ మహాత్ములంతా అమ్మ దగ్గరకు వెళ్లారు. రఘువరదాసు గారు అనబడేటువంటి అవధూతోంద్ర సరస్వతీ స్వామి వారు వెళ్లారట. ఆయన ఎక్కడో సుమారుగా ఒక ఏడు, ఎనిమిది kilometer ల దూరంలో వారు ప్రయాణమై వస్తున్నారు అనే విషయం ఎవరికీ తెలియదు ఆ రోజుల్లో. వర్తమానాలు లేవు, SMS లు లేవు, cell phone లు లేవు అసలు మామూలు అక్కడ phone ఏ లేదు. అటువంటి పరిస్థితిలో ఆ గదిలో కూర్చున్నటువంటి అమ్మ రామనామ సంకీర్తనంతో సర్వ దేహంలోనూ రాముణ్ణి నింపుకున్న రఘువరదాసు గారు వస్తున్నారు తగిన ఏర్పాట్లు చేయండి అన్నది. ఆయన్ని ఎవరూ రానివ్వటం లేదు ఆయన దారిలో ఆయన పాడుకుంటూ వస్తే మిరపచాలంలో ఉన్నటువంటి కుల, మత, వర్గాలు దాటినటువంటి వాళ్ళు కోతలకు కావలసిన కొడవళ్ళు విసిరేసి నామ సంకీర్తనంలో ఆయన వెనకబడి ఇక్కడిదాకా వస్తున్నారు అందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి అనేది. వారు వచ్చేవారు ఒక గంటలో. అది.అంటే ఒక జీవన్ముక్త స్థాయిలో ఉన్నటువంటి ఇటువంటి అవతారమూర్తులంతా కూడా తమకు ఉన్నటువంటి సిద్ధుల అన్నింటినీ కూడా మరొకరిని ఉద్ధారణ ఇవ్వటం కోసం మార్గం చూపించటం కోసం దాన్ని వాడుతారు తప్ప తమ కోసం వారు వాడుకోరు. అలాగే ఇవాళ షిరిడి సంస్థానంలో షిరిడి సాంప్రదాయంలో ఎక్కిరాల భరద్వాజ ఒక మహా గురువుగా కీర్తింపబడుతున్నటువంటి ఆయన అమ్మ దగ్గర పెరిగాడు. అమ్మ ఆలయంలో ఉన్నాడు. అమ్మని అనుసరించాడు. అమ్మని దర్శనం చేశాడు. అమ్మతోనే ఉండేవాడు. వెతుకుతూ వెతుకుతూ ఉండేవాడు. ఇటువంటి ఆనంద రేఖ ఎక్కడినుండి ఒక ఎక్కిరాల భరద్వాజ అక్కడికి ఎలా వెళ్లగలిగారు అంటే ఆ ఒకటే అన్నది "మీరు రాలేరురా నేను పిలుచుకుంటాను" అనేది. "కావలసిన వారిని నేను రప్పించుకోగలను నాకు ఆ శక్తి ఉన్నది" అన్నది. "అమ్మా మరి నీకు కావలసిన వాళ్ళు అక్కర్లేని వాళ్ళు ఉన్నారా? ఇద్దరు ఉన్నారా?" అని అడిగాడు పోయేవేళ వాడు. "నాకు అక్కర్లేని వాళ్ళు ఎవరూ లేరురా నేను అక్కర్లేని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు వచ్చి భోంచేసి పోతారు" అంది. అది, అది సమాధానం. "ఏం చదువుకుంది ఇంతకీ అమ్మ మన దగ్గర ఉన్న degree లు ఏవీ, ఏమీ లేవు" అలాగే స్త్రీమూర్తులంతా "అమ్మా ఏదన్నా ఉపదేశం ఇవ్వు, మంత్రం చెప్పు మేము హాయిగా చేసుకుంటాం" అంటే సాక్షాత్తు ఒక భర్తను పొంది విష్ణు స్వరూపమైన భర్తను పక్కన పెట్టుకొని ఆయనని కాదనుకొని ఎవరిని పూజిస్తారు. కావలసిన వేళకు అన్నం పెట్టుకోండి. నమస్కారం చేసుకోండి. విష్ణుమూర్తికి నమస్కారం చేసుకున్నట్లే. నిన్ను రక్షించటానికి నిన్ను జీవితాంతం మోయటానికి సిద్ధపడ్డ నీ భర్త కంటే విష్ణువు ఇంకెక్కడున్నాడో చెప్పు నాకు అని తప్పించుకుంది. అంతేతప్ప "నీ భర్తను వదిలేసి నామ నామ స్మరణ చేస్తూ నా దగ్గర కూర్చో" అని ఎన్నడూ అమ్మ చెప్పలే. She is so practical, so pragmatic, so prudent. అది అద్భుతం. అలాగే అమ్మ దగ్గరికి అమ్మ కూడా అన్ని క్షేత్రాలకు వెళ్ళింది, సంచారం చేసింది. మామూలుగా శంకర భగవత్పాదులకు ఒక తల్లి ఉంది. రమణ మహర్షికి ఒక తల్లి ఉంది. నిన్న మనం-- రామకృష్ణ గురుదేవులకు కూడా ఉంది. వీళ్ళందరికీ అంటే మనతో సహా ఈ శరీరానికి ఒక తల్లి ఉన్నది. అలాగే అమ్మకు కూడా ఒక తల్లి ఉన్నా అమ్మ జగజ్జనని అయింది. ఎందుకయింది, ఎట్లా అయింది అంటే ఆశ్చర్యపోతాం. రమణ మహర్షి తమ భుజం మీద వచ్చిన సార్కోమా వ్యాధిని "నేను రప్పించానా? వారిని ఎక్కడో ఉండనివ్వండి" అని ఆ పుండుని వారు అని ఎట్లా సంబోధించారో, అమ్మ చరమదశలో ఎనభై నాలుగు nineteen eighty four ప్రాంతంలో గుంటూరు తీసుకెళ్లారు. తీసుకెళ్తే scanning చేశారు ఆ రోజుల్లో. చేసి డాక్టర్లు ఏం చెప్పారంటే "అమ్మా చాలా cancerous growth తో ఉన్న కొన్ని గడ్డలు ఉన్నాయి, అవి తీసేస్తే మంచిదమ్మా. కొన్నాళ్ళు హాయిగా నువ్వు ఉంటావు" అన్నారు. ఆమె అన్న సమాధానం ఏమిటో తెలుసా? "ఒరేయ్ ఇంతమంది బిడ్డల్ని మోసిన నేను ఆ నాలుగైదు గడ్డల్ని మోయలేగా ఉండనివ్వండి వాటిని" అన్నది. అది జిల్లెళ్ళ మూర్తి అమ్మ అంటే. వాళ్ళు అలా ఎలా చూడగలుగుతారు? ఈ lateral thinking ఈ ఉదాత్తమైన స్థాయి వాళ్ళకి ఎలా వస్తుంది? "అమ్మో నాకు cancer వచ్చిందిగా" అని అనలేదు. "ఉండనివ్వండి" అంది. "వాడితే మనకేం పని" అన్నది. అలాగే ఏదైనా ప్రపంచంలో అనేకమైనటువంటి బాధలు కలిగినప్పుడు ఆ బాధలకు విరుగుడుగా గనక ఆమె దగ్గరకు వెళ్లినట్లయితే ఆమె పూర్ణాద్వైతాన్ని బోధించేది. పూర్ణాద్వైతాన్ని మిగతా గురు స్వరూపాల వలె గంభీరమైన మాటల్లో చెప్పలే. ఆమె ఏమన్నదంటే "అద్వైతం అద్వైతం అద్వైతం అని మీరు అనుకుంటున్నారు కదా, అసలు అద్వైతం ఏమిటో నేను చెప్తానురా" అంది. "ఏంటి?" అంటే "ఏ అత్తగారు తన కోడల్ని కూతురుగా చూడగలగో ఆ చూడగలిగిన స్థాయి, ఏ కోడలైతే తన అత్తగారిని తన తల్లిలాగా భావించగలదో అది పూర్ణాద్వైతం" అన్నది. ఎంత practical అసంభవం. ఎందుకంటే ఇది పిల్లి ఎలుక చెలగాటమేగా. ఈ చెలగాటంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఎవరు రాలుతారు అన్నదే ప్రశ్న తప్ప ఇద్దరూ గెలవటం లేదు, ఇద్దరూ ఓడటం లేదు. ఎవరో అధికులుంటారు. కానీ అమ్మ చెప్పిన అద్వైతం అది. ఆ పూర్ణ అద్వైత స్థితిలో రెండవ భావన లేకుండా ఉండగలగాలి. అది చాలా ప్రధానమైనటువంటిది. అలాగే అమ్మకి ఆమె శరీరానికి యాభై సంవత్సరాల వయస్సు వచ్చింది. వచ్చినప్పుడు ఆమెని భక్తులు అప్పటికి భక్తులంతా ఏర్పడ్డారు. ఆమె ఒక్క మాట చెప్పింది. "నాకు భక్తులు లేరు, నాకు శిష్యులు లేరు, ఉన్నవాళ్ళందరూ నాకు బిడ్డలే" అన్నది. అందువల్ల ఆమె మాతృమూర్తి, మాతృశ్రీ, విశ్వజనని కాగలిగటానికి కారణం ఏంటంటే "ఫలానా వాడు నా శిష్యుడు, ఫలానా వాడు నాకు భక్తుడు" అనటం ఒక ఎత్తు "అందరూ నా బిడ్డలే" అనుకోవటం ఒక ఉదాత్త స్థాయి గనుక ఈ యాభై ఏడో ఏడు వచ్చేసరికి అప్పటికే చుట్టూ ఉన్నటువంటి వారంతా ఆమెను అడిగారు. "అమ్మా నీకేం కావాలి?" అని అడిగారు. అంటే "నీవు ఏం చేయమంటావు? నీ birthday కి ఏం చేయమంటావు?" అని. "ఏమీ లేదురా ఒక లక్ష మంది ఒకచోట కూర్చొని భోంచేస్తే బాగుండును" అంది. లక్ష మంది ఈ ఊళ్ళోనే గలవారు. ఆ ఊరు చిన్న కుగ్రామం అది. "అమ్మీ ఏమిటిట్లా? లక్ష మంది మనం పెడదామని మనం సిద్ధపడ్డా లక్ష మంది ఇక్కడికి రాక ఎవరు వస్తారు?" అని అందరూ అనుకున్నారు. ఆ రోజు రాణే వచ్చింది. ఆ రోజున ఆమె జన్మదినం నాడు fiftieth birthday నాడు జిల్లెళ్ళమూడిలో పొలాలలో వేశారు తాటాకులతో పందిళ్ళు వేస్తే ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల మంది ఏకకాలంలో భోంచేశారు.ఏమీ లేని రోజుల్లో ఇవాళ ఆ వంట పాత్రలు గాని cooking mechanism గాని ఈ modern appliances గాని ఏమీ రోజుల్లో, లేని రోజుల్లో ఈ లక్షా ముప్పై ఎనిమిది వేల మందికి అన్నం తినటం అమ్మ యొక్క దివ్య సంకల్పానికి గుర్తు. మరి అది ఏమి ఆనందం ఇచ్చింది ఆమెకి అంటే, ఒకటే చెప్పేది నేను ఏం చేయాలి? వ్రతం చేయాలా? దానం చేయాలా? చందా ఇవ్వాలా? అంటే, "ఏం లేదురా! నీ చేత్తో నువ్వు ఇంకోరికి అన్నం పెట్టుకో" అనేది. నీ చేత్తో నువ్వు. ఆ నీ చేత్తో నువ్వు అన్నం వండి పెట్టుకో అది మాత్రమే నీకు ఆనంద-ఆనందాన్ని ఇస్తుంది. అదే నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం. అంటే జిల్లెళ్ళ మూర్తి అమ్మ ఈ మధ్య "తత్వ చింతనా సభస్సు" అని జరిగింది. అమ్మ తత్వాన్ని గురించి ఒక చింతన, ఒక బయట, ఒక విచారణ చేయాలి అని. అమ్మతో ఉన్నవారు, అమ్మను చూసినవారు, అమ్మను చూడకపోయినా అనేకమైనటువంటి విషయాలు తెలిసినవారు అక్కడ చేరి అమ్మ తత్వం అసలు ఏమిటి? అని. అమ్మ తత్వం ఒకటే, దాని పేరు అమ్మ తత్వమే. ఇంకో తత్వం ఏముంటుంది? అమ్మ తత్వంలో నాన్న తత్వం ఉండదు కదా. అమ్మ తత్వమే. ఆ అమ్మ తత్వంలో ఏమున్నది అంటే, అవ్యాజమైనటువంటి ఒక వాత్సల్య రేఖ. ఆ అవ్యాజ వాత్సల్య రేఖలో ఆమె ఎవరెవరినో ఎంచుకొని పంచిన మనిషి కాదు ఆమె. సర్వ ప్రపంచానికి ఆకలి లేని రోజు, ఆకలి తీరే రోజు రావాలన్నది. ఆకలి ఉండి తీరుతుంది కానీ, తీర్చగలిగితే రోజు రావాలి. ఆ ప్రయత్నంలో మీరంతా ఉండండి. అని అమ్మ అంటే 1985 ఆమె శరీరం వదిలిపెడితే, సుమారు ఇన్ని నెలలు ఒక ఇరవై ఏడు ఏళ్ల తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు నేను నలభై నాలుగు ఏళ్ల కిల్ల. 1967 తర్వాత మొన్న వెళ్ళే, 2011 లో. అమ్మ శరీరంలో ఉండగా ఏ పవిత్రత, ఏ నిశ్చలత, ఏ ప్రేమ, ఏ సహజమైన మానవ సంబంధం ఆనాడు ఆమె ఉండగా ఉన్నాయో, ఇవాళ pristine అట్లాగే ఉన్నాయి మార్పు లేదు. ఇది ఆశ్చర్యం. ఏ రకమైనటువంటి western impact లేనటువంటి ఒక దివ్య ప్రదేశంగా జిల్లెళ్ళమూడి నిలిచిపోయింది. అంతే కాదు జిల్లెళ్ళమూడి అమ్మ ఇంకొక మాట అనేది. "అమ్మా! నువ్వు ఎప్పుడు తింటావు? ఏం తింటావు? ఆకలి లేదా?" అంటే, "అసలు ఈ కలిలో నాకు ఆకలి లేదు" అన్నది. చాలా గమ్మత్తుగా మాట్లాడేది. ఆ శ్లేష, ఆ pun చాలా పరమాద్భుతంగా అది ఒక ఉదాత్త స్థాయిలో అద్వైత బోధనకి దారి తీసేట్లుగా అమ్మ దగ్గర ఆనందం ఉండేది. అలాగే ఆ రోజుల్లో scientists లు ఆమె దగ్గరికి చేరుకున్నారు. కళాకారులు చేరుకున్నారు. మేధావులు చేరుకున్నారు. జర్మనీ అలాగే అమెరికా దేశం నుంచి అనేక మంది భక్తులు ఆమె దగ్గరికి వచ్చారు. మరి వారు ఏమి ఆనందం పొందారు అంటే, The universal motherhood మేము ఇక్కడ అనుభవించాం అని చెప్పారు. ఆ universal motherhood కి అర్థం ఏమిటి అంటే, అందరినీ ప్రేమించగలగటమే. అందరికీ అన్నం పెట్టగలగటమే. అందరి భౌతిక ఆకలితో పాటు అధ్యాత్మ తుపాసను తీర్చగలగటమే. కేవలం అన్నం పెట్టడం అంటే అమ్మెదో నాలుగు ముద్దలు పెట్టడం కాదు. అది ఒక్కొక్కరికీ జ్ఞానాన్నంగా వరదానమై ఇవాళ ప్రసిద్ధులైనటువంటి వారందరూ కూడా తమ చిన్నతనంలో ఏదో ఒకనాడు జిల్లెళ్ళమూడిలో అమ్మ దగ్గరకు వెళ్ళిన వారే తప్ప మరొకరు కాదు. ప్రముఖులందరినీ పిలుస్తున్నాం అని అన్నప్పుడు నేను వారితో అన్న మాట అదే. వీళ్ళంతా ఇవాళ ప్రముఖులేమోగానీ ప్రముఖమైన అమ్మ దగ్గరకు వెళ్ళిన తర్వాతే వాళ్ళ జీవయాత్ర ప్రారంభమైంది అని. అమ్మ అనుగ్రహం ఉండబట్టే ఇవాళ ఆ మానవీయమైనటువంటి అనేకానేక లక్షణాలు ఇంకా ఈ ప్రపంచంలో ఉండగలుగుతున్నాయి. అది జిల్లెళ్ళమూడి యొక్క అమ్మ యొక్క మహత్ తత్వంగా మనం భావన చేయాలి. అలాగే అమ్మ అనేది. "కులం అంటే ఏంటమ్మా? ఈ కులం పేరు మీద అందరూ కొట్టుకుంటున్నారు. ఎట్లా దీన్ని ఆపాలి?" అంటే, "శుక్ల శోణితాలకు గనక ఏదన్నా కులం ఉంటే అదిరా అసలు కులం" అన్నది. శుక్ల శోణితాలకు కులం లేదు. మానవ శరీరంలో అతి సహజంగా ఏర్పడేటువంటి ఒకానొక స్థితికి మనం పేరు పెట్టుకొని తద్వారా మనం యుద్ధాలు చేసుకొని పరమ పవిత్రంగా, శాంతిమయంగా సాగవలసినటువంటి జీవితాన్ని మనం చిన్నాభిన్నం చేసుకోవటం లేదా? అని అమ్మ ప్రశ్న. అంతే కాదు, మరణ అనంతరం లేదా మరణం అంటే ఏమిటి అన్నదానికి రమణ మహర్షి భాష్యం, రమణ మహర్షి అనుభవం ఒక ఎత్తయితే, అమ్మ జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్పాలి, తెలియని వారికి. తాను కని తన కళ్ళకు తె పెరిగినటువంటి తన కూతురే మరణించినప్పుడు లేదా దేహాన్ని వదిలిపెట్టినప్పుడు మామూలుగా తల్లి స్థానంలో ఎవరైనా చాలా రోదిస్తారు. అమ్మ ఒక్క మాట అన్నది. "హైమను నేనే తెచ్చుకున్నాను, నేనే పంపుకున్నాను. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం లేదు" అన్నది. అని ఆ సమాధి తాను స్వయంగా తన కూతురు యొక్క దేహాన్ని సమాధిగతం చేసి ఇక్కడ నుంచి అత్యద్భుత అనుగ్రహ తరంగాలు ఈ ప్రపంచాన్ని నడిపిస్తాయి. ఏం కావాలని మీరు అనుకుంటున్నారో ఐహిక, ఆముష్మిక, కైవల్య ఆనందాలు ఈ హిమాలయంలో నుంచి ఈ క్షణం నుంచి ప్రారంభమవుతాయన్నది. అంటే రామకృష్ణ గురుదేవులు నిన్న సాయంకాలం మనం అనుకున్నట్లుగా ఎట్లాగైతే తన తపశ్శక్తి అంతా వివేకానంద స్వామికి ధారపోశారో, అమ్మ తాను ఈ జగత్తులోకి ఒక దేహాన్ని తీసుకుని వచ్చినందుకు తన శరీరంలో నుంచి ఒక భాగాన్ని తుంచి దానిని పెంచిపోషించి, లయించి, తన చిచ్ఛక్తిని మొత్తం కూడా దాని యందు ప్రతిష్ఠాపన చేసింది. కనుకనే ఇవాళ జిల్లెళ్ళమూడిలో హిమాలయము అంటే శక్తి క్షేత్రంగా అది ఏర్పడిపోయింది. ఆ శక్తి క్షేత్రంలో ఏమున్నది? ఆధ్యాత్మిక శక్తి ఉన్నది. నిరంతరము భగవన్నామస్మరణ అక్కడ జరుగుతూనే ఉంటుంది. అనేకానేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ, ఏ రకమైన publicity లేకుండా, పరమ ప్రశాంతంగా, పరమ ప్రసన్నంగా అక్కడికా ఆవరణలో అడుగు పెడుతుండగానే మనందరం అన్నయ్యలమూ, అక్కయ్యలమూ అయిపోతాం. అది ఆ ప్రేమ. దానిలో కృతఘ్నత లేదు. ఎవరో అలా అన్నారు కనుక అనుకోండి అని కాదు. brother sister relation English కాదు అది. అన్నయ్య, అక్కయ్య అనేటువంటి ఆత్మీయమైనటువంటి పిలుపుతో మనందరినీ కూడా అమ్మ దగ్గరికి, ఆ ఉడి దగ్గరకు చేర్చేటువంటి ఒక దివ్యమైనటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంటుంది. అమ్మతత్వము, అమ్మతత్వము అని అను-- అన్నప్పుడు ఏ తత్వంలో, ఏ aspect లో అమ్మ వచ్చింది అని. ఏదో ఒక aspect. ఇప్పుడు "సంభోగమూర్తిశ్చరితు భువనే శంకరాచార్య రూపా" అన్నాం. శంకరాచార్యులవారు అంటే ఇదిగో సాక్షాత్తు శివ స్వరూపం అన్నాం. లేదా మేధా దక్షిణామూర్తి స్వరూపం అన్నాం. రమణ మహర్షిని గనక తీసుకున్నట్లయితే "కవ్య కంట వాశిష్ట గణపతి ముని మీరు స్కందులా?" అని ప్రశ్నించారు. సరే గణపతి మునే గణపతి అవతారం అని చెప్పుకుంటారు. అందుకే భగవాన్ ఆయన్ని నాయనా అని పిలిచారని అనుకున్నాం. అలాగే త్రేతాయుగం నాటి రాముడు, ద్వాపర కృష్ణుడు కలిసినట్లయితే మేము అన్న రామకృష్ణ గురుదేవులు ఉన్నారు. అంటే, ఏ కాలంలోనైనా ఒక అంశావతారంగా పూర్ణమైనటువంటి, మూలమైనటువంటి ఆ చిచ్ఛక్తి ఈ జగత్తులోకి ఒక సహకారాన్ని ధరించి వస్తుంది. అటువంటప్పుడు ఈ అమ్మకి మూలతత్వం ఏమిటి అని. ఎందుకంటే, కేవలం మానవీయమైనటువంటి మానవ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఇది మహాశక్తి అని తెలుసుకున్నప్పుడు ఎవరు ఈమె అని గనక చిన్న ప్రశ్న వేసుకుని కాస్త తార్కికంగా, శాస్త్రీయపరంగా, శాస్త్రపరంగా ఇంతకు ముందే ఏర్పడిన అనేకమైనటువంటి పౌరాణికమైన విషయాలను అన్నింటినీ గనక క్రోడీకరించుకొని సమన్వయం గనక చేసుకున్నట్లయితే జిల్లెళ్ళమూడి అమ్మ రాజరాజేశ్వరి అనబడేటువంటి మహా త్రిపురసుందరి దేవి యొక్క మానవాంశ, మానవ దేహధారణ చేసి వచ్చిందట. ఆమె వేషం వేసుకున్నటువంటి గురువు కాదు. వేషం వేసుకున్న అమ్మ కాదు. అసలు వేషం తొలగించుకున్నటువంటి అమ్మ జిల్లెళ్ళమూడి అమ్మ. వేషం అక్కరలేని అమ్మ. మామూలు సహజంగా ఉండేది. ఎవరైనా ఇవాళ చిన్న గురువుగారు, ఈ photo తర్వాత కాలంలో వచ్చింది. ఇక్కడ మన ముందున్నది. ఆమె సింహాసనం ఏమిటి అంటే మంచమే సింహాసనం. ఆ మంచం మీద కూర్చుని సర్వ ప్రపంచాన్ని శాసించింది. కాబట్టి, ఆ చుట్టూ ఏర్పడే పారసరినేలియా ఏదైతే ఉన్నదో ఆమె కాలంలో అవేమీ జరగలేదు. కాకపోతే ఆమె అనేక అవతారాలు, అనేక దర్శనాలు అనేకమంది జిజ్ఞాసువులకి, తపస్వులకి ఇచ్చింది గనుక ఆమెను సహజంగా రాజరాజేశ్వరి ఆ.. స్వరూపంగా భావన చేస్తాం. రాజరాజేశ్వరి కానివ్వండి, మరొకరు కానివ్వండి మనం చూడని లలితాదేవినే మనం tv లో చూస్తూ ఉంటాం. అమ్మా, అమ్మా, అమ్మా అని చెప్తూ ఉంటారు. వీడు అమ్మని చూడలే ఇంతవరకు. అసలు ఉన్న అమ్మకే అమ్మ అని పెట్టడు వాడు. ఆ.. అసలు ఆ అమ్మ ఎవరంటే ఈ అమ్మని వదిలిపెట్టి, ఈ అమ్మ ఏమన్నదంటే, "ఒరేయ్! మీ కోసం నేను వచ్చానా? నాకోసం మీరు వచ్చారా? మన ఇద్దరం ఇక్కడ కాసేపు ఉండటానికి వచ్చామురా" అంది. అది. మన ఇద్దరం ఇక్కడ ఉండటానికి వచ్చాం. ఏ తల్లి అయినా, ఏ బిడ్డ అయినా బాంధవ్యం అలాగే కొనసాగాలి. అందుకనే విచారణ చేసినట్లయితే, ఓ పద్యం రాశారు ఒకాయన. "ఐంద్రీ మహావిద్యయను పేరయే తల్లి వేదవీధులలోన వెలుగుచుండు. ఏ దేవి సతము విద్యాదేవ కులపతి గుండెలో వెలుగులు కూర్చుచుండు. పది రెండు వర్ణముల్ వెదకించి ఏ మాత ఋషులకిచ్ఛా శక్తినిచ్చుచుండు. తపో మహనీయ వాక్కులందు యే సవిత్రి నివాసనొసగుచుండు. యే జగజ్జనని కవీంద్ర హృదయ పాలనము చేయుచుండు. ఆ పరమశక్తి అవతరించెను మనిధేహమునంబు చూడరావో ఈ జిల్లెళ్ళమూడిలోన". ఐదు అంశాలున్నాయి. ఐంద్రీ మహావిద్య, ఐంద్రీ మహావిద్య సహకారం గనక తీసుకుంటే ఆమె పేరు జగజ్జనునిన జిల్లెళ్ళమూడి అమ్మ. అలాగే, పరిపూర్ణమైనటువంటి జ్ఞానానికి మూలము ఎవరు అని విచారణ చేసినట్లయితే ఆమె అమ్మ. సౌందర్యలహరిలో ముప్పై రెండవ శ్లోకం ఉంది. వాళ్ళు రాత్రికొక్కసారి చూడండి. అది చాలా ప్రధానమైన శ్లోకం ముప్పై రెండో శ్లోకం. కానీ, ఆ ముప్పై రెండవ శ్లోకాన్ని అదే సౌందర్యలహరిలో పదో శ్లోకంతో సమన్వయం చేయాలి. శంకర భగవత్పాదులు అమిత కవితావేశంలో ఒక మాటంటారు, "అమ్మా! నీవు సర్వ రూపధారిణివి, సర్వ నామధారిణివి, సర్వజ్ఞవు, సర్వాంతరాత్మవు, ద్వాదశాంత స్థానంలో చంద్రకళా స్థానము నీ స్వస్థానం అయినప్పటికీ కూడా మా యందున్నటువంటి దయచేత కరుణగా కరగి ఒక బిందువై బ్రహ్మ రంధ్రము ద్వారా ఈ శరీరంలో ప్రవేశించి సర్వ అంగములను, సర్వ అణువులను కూడా నీ మయం చేశావు గదా, నీకు అవసరం లేకపోయినా నీవు మూలాధారంలోకి వచ్చావు గదా తల్లీ" అని శంకర భగవత్పాదుల పదవ శ్లోకం.ఇక ముప్పై రెండవ శ్లోకంలో మూడు నాలుగును పన్నెండుగా చేసి, పన్నెండు అంశలను బీజాక్షరాలుగా చేసి శివ, ఇంద్ర, కామ, మహాకామ, కామేశ్వరి అనబడేటువంటి మూడు విభాగాలు చేసి ఈ మూడు నాలుగు అంటే నాలుగు, నాలుగు, నాలుగు మధ్యలో మళ్ళీ మూడు బీజాక్షరాలను నిక్షిప్తం చేస్తారు శంకర భగవత్పాదులు. సౌందర్యలహరి అంతా చదివినా, చదవకపోయినా, చదవలేకపోయినా లలితా సహస్ర నామ పారాయణం చేసుకునే వారందరూ కూడా ఈ ముప్పై రెండవ శ్లోకాన్ని ధారణ చేసుకోండి. అది అమ్మవారి యొక్క స్వరూప వర్ణన, అమ్మవారి యొక్క శ్రీచక్ర వర్ణన, అమ్మవారి యొక్క స్థితి వర్ణన. ఆ పన్నెండు ప్లస్ ఈ మూడు కలిపితే అది పదిహేను. ఆ పదిహేను ఎట్లా అంటే, పది రెండు వర్ణముల్ వెలకించి ఏ మా-ఆ-త ఋషులకిచ్ఛా శక్తి నిచ్చుచుండు. ఇప్పుడు ఒక పూర్ణానంద స్వామి, మరొకరు మరొకరు, రఘువరాదాస్ గారు వెళ్లి అక్కడికి వెళ్లి ఏం చేస్తారు? వాళ్లకేం పని? వాళ్లే అప్పటికి సిద్ధులు, వాళ్లే పరిపూర్ణులు, వాళ్లు ఆనందం పొందినవారు, ఆనందంలోటే ఎరిగినవారు. అయినా అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్లారు అంటే, అటువంటి వారు కూడా చేరకున్నటువంటి ప్రదేశం అది. ఎందుకని? లలితా స్వరూపిణి అయినటువంటి జిల్లెళ్ళమూడి అమ్మ ఈ పదిహేను అక్షరాల యొక్క సహకార స్వరూపంగా అక్కడ నిలకడ చెంది వాళ్లకు ఒక ఇచ్ఛా శక్తిని ఇచ్చింది. ఒక స్వామి వారికి, ఒక అవధూతకి, ఓ సాధకుడికి ఏమి ఇచ్ఛలు ఉంటాయి? ఒకే ఒక్క ఇచ్ఛ ఉంటుంది. సత్త జ్ఞాన భూమికలలో తొట్ట To the లేనటువంటి శుభేచ్ఛ మాత్రమే ఉంటుంది. ఆ శుభేచ్ఛ ఏమిటి అంటే సర్వ ప్రపంచము కూడా ఈ జన్మలోనే ఇప్పుడే ఆనంద తారక స్థితిని వాళ్ళు చేరుకోవాలి. అనేటువంటి ఒక సత్త జ్ఞాన భూమికలో తొలి పాదం అది, తొలి ఘట్టం అది, తొలి మెట్టు అది. ఆ శుభేచ్ఛ శక్తి స్వరూపంగా ఉన్నది గనుక, ఇచ్ఛా శక్తి గనుక శుభేచ్ఛ అయినట్లయితే కర్మలన్నీ కర్మ యోగాలై, విజ్ఞానం అంతా జ్ఞానమై, జ్ఞానం అంతా పరమాత్మ భావనలో, అద్వైతంలో గనుక నిలకడ చెందినట్లయితే అది పూర్ణ జ్ఞాన అద్వైత యోగంగా, అఖండ అనాహత యోగంగా ఉంటుంది గనుక దానిని ఇవ్వగలిగినది ఎవరు అని ప్రశ్నించుకుంటే, అది ఇవ్వగలిగినది ఈ అమ్మ అన్నాడు ఆయన. అలాగే తపస్సు చేసుకున్నటువంటి వాడి వాక్కు ఫలిస్తుంది. అందుకనే తపస్సు చేసిన వాడి వాక్కు వశ వాక్కు అన్నారు. వాడు వాక్కుకు వశమై ఉండడు, వాక్కే వాడికి వశమై ఉంటుంది. ఎప్పుడు ఏ మాట రావాలో, ఎప్పుడు ఏ భాష కావాలో, ఎప్పుడు ఏ భావం రావాలో, అవన్నీ ఒక ప్రవాహ వేగంతో వస్తాయి గనుక, అవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే అమ్మ దగ్గర ఉన్నాయి అని. ఏ జగజ్జననిత్రి కవీంద్ర హృదయ పాలనము చేయుచుండు. కవి యొక్క మనస్సుని గనుక పాలనం చేస్తే మంచి Poetry రాయొచ్చు. మహా కవి అయినటువంటి వాడు, అటువంటి వాడి హృదయాన్ని గనుక ఈ అమ్మవారు పాలనం గనుక చేసినట్లయితే అతని నుంచి ఎటువంటి మహా కావ్యాలు వస్తాయి అంటే, ఈ సర్వ ప్రపంచం కూడా మళ్ళీ పుట్టువే అరగనటువంటి, ఒక పూర్ణమైనటువంటి, పునరావృత్తి రహితమైనటువంటి, పునర్జన్మ లేనటువంటి స్థాయికి వెళుతుంది గనుక అటువంటి ఆ జగజ్జనని వచ్చిందయా అవతరించెను మనుజ దేహమునందు చూడరావోయి జిల్లేళ్ళమూడి లోన. చాలా అందమైనటువంటి పద్యం, అమ్మకి తగినటువంటి పద్యం, అమ్మ అదైనటువంటి పద్యం. అంటే ఆ భావనా స్థితిలో కవిత్వాన్ని దాటి, భాషను దాటి, తత్వాన్ని దాటినటువంటి పూర్ణ స్థితి గనుక ఆ స్థితిలో అమ్మని అనుభవించిన వారు ఉన్నారు. ఆ అనుభవించిన వారిలో మహాత్ములంతా ఉన్నారు. వాళ్ళంతా fine tuning కోసం వెళ్తారు అక్కడికి. ఆ fine tuning కావాలి. fine tuning గనుక లేకపోతే ఎక్కడో అరకొరగా మిగిలిపోతుంది. అలాగే అనేకమైనటువంటి విషయాలని ఎవరైతే సరళంగా, సూటిగా, అర్థమయ్యేట్లుగా, గజిబిజి లేకుండా, మనస్సుని ఆందోళన పరచుకోకుండా ఎవరు చేస్తారో వారు నిజానికి ఉత్తమ స్థాయికి చెందిన గురువులు. ఎవరు విషయాన్ని complicate చేసుకుంటారో, తాము దానిని అర్థం చేసుకోకుండా, అర్థమయ్యే రీతిలో చెప్పలేరో వాళ్ళు ఇంకా విజ్ఞాన భూమికలో ఉన్నట్లే లెక్క. అందుకనే జిల్లెళ్ళమూడి అమ్మ, ఆమె చరిత్ర చదవండి. మీరు చదివితే మీకింకా చాలా మనకున్నది గంటే. ఈ గంటలో అనే తలాస్పర్శగా కేవలం అక్కడక్కడా చదవవలసిందే తప్ప, అనుకోవలసిందే తప్ప జీవిత మహోగతి అంటే మహా సముద్రం అది. ఆ సముద్రం అంతా కూడా అలలు, కెరటాలు, తుఫానులతో నిండినది. అయినా తాను ఒక ఏకాత్మ భావనలో, ఒక పరిపూర్ణమైనటువంటి సహజమైన స్థితిలో, ఒక అచ్చమైనటువంటి మాతృమూర్తి వలే ఆమె ఉండగలిగింది. అంతే కాకుండా అక్కడికి లక్ష్మణదాస్ గారిని, ముక్తివి లక్ష్మణదాస్, తర్వాత వారు సన్నేసించారు. అమ్మ దగ్గరికి వచ్చే వారు ఆయన. వచ్చి అమ్మని అడిగేవారు ఏం చేయాలి అని. మీకు భగవంతుడు ఏం చేయమని చెప్పవలసి ఉన్నదో అదే జరుగుతుంది, అందులో నువ్వు చేసేదంటూ ఏమీ ఉండదు. చూశారా? మనమంతా చాలా చేస్తున్నాం అనుకుంటాం. మంచి ఉద్యోగం చేశాం, బాగా ఉపన్యాసం ఇచ్చాం, బాగా పాటలు పాడాం, పుస్తకాలు రాశాం. నువ్వు రాయలే, నీ వల్ల కాదది. నువ్వు అనలే, నీ వల్ల కాదు అంటున్నది ఎవడు? దాన్నే విశ్వనాథులవారు అన్నది అదే, ఏతటధిష్ఠాత ఎవ్వడే యజమానుడని అష్టమ తలంబు వాడు. ఆ ఎనిమిదో శరీరం ఏదైతే ఉన్నదో వాడు, వాడు వేరే ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఎవడో ఒక కర్త లోపల ఉండి, జీవుడు ఒక్కొక్క ప్రారబ్ధాన్ని, ఒక సంస్కారాన్ని తీసుకుని వచ్చినట్లుగా ఈ సర్వ జగత్తునే కూడా నడిపించటానికి పరమేశ్వరుడే తన శక్తిని అనేక క్షేత్రాలలో నిక్షిప్తం చేస్తాడు. వాళ్ళే కళాకారులు అవుతారు, పండితులు అవుతారు, కవులవుతారు, జ్ఞానులవుతారు, విజ్ఞానమూర్తులవుతారు. సర్వ ప్రపంచానికి ఆదర్శప్రాయమైన జీవితాన్ని వాళ్ళు అందించగలుగుతారు. వాళ్ళు మనలాగే పుట్టారే, మరి ఎందుకని ఇలా ఉన్నారంటే వారి యందు అమ్మ యొక్క అనుగ్రహము లేదా అయ్య యొక్క అనుగ్రహము. ఆ పూర్ణమైనటువంటి దైవ ప్రజ్ఞ వారి యందు ఉంటుంది గనుకనే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. పుణ్య అంటే మంచి పనులు చేసిన వాడని కాదు, తనను తాను ఎరిగిన వాడు మాత్రమే పుణ్యపురుషుడు గనుక జిల్లెళ్ళమూడి అమ్మ ఒక మాట అన్నది. నేను నేనైన నేను అన్నది. నేను నేనైన నేను అంటే మనిషికి మూడు అవస్థలున్నాయి. ఇదిగో ఇప్పుడు మనం అం-ఉంటున్నటువంటి జాగ్రదవస్థ, రాత్రి పది గంటలకు నిద్రావస్థ, తెల్లవారు లేద్దామా వద్దా కల నెలకపోవడానికి సంధికాలం ఏదైతే ఉన్నదో, ఉషోదయా పూర్వమే ఏదైతే ఉన్నదో అది సుషుప్తి. ఇక్కడ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం మూడు నడుస్తున్నాయి, నడిపిస్తున్నాయి.
SSSMC · audio
Talk on Jillellamudiamma - 02
Talk on Jillellamudiamma - 02
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 31:03
More in this series