Skip to content
Transcript తెలుగు
అవస్థకి అతీతంగా ఉన్నటువంటిది అమ్మవారి యొక్క స్థితి గనుక కానీ మూడు అవస్థలకు ఆమె మూలం కనుక నిద్రావస్థలో జాగ్రత్ అవస్థలో జీవుడు ఏం చేయాలి? విచారణ గనుక చేసినట్లయితే జీవితాన్ని నడపకూడదు, జీవితాన్ని గడపకూడదు, జీవితాన్ని జీవించాలి అంతే. మనం ఎందుకు వచ్చామయ్యా అంటే we have to live our life. Our life అంటే ఏమిటి? ఇప్పుడు మనం బతుకుతున్నటువంటి బతుకంతా కొంతకాలం ఒకరి కోసం తర్వాత మరొకరి కోసం ఆపై మరొకరి కోసం ఆపై ఇంకొకరి కోసం అంటే ఎవరికోసమో తప్ప మనకంటూ ఏం లేదు. అధ్యాత్మ జీవితం మాత్రమే మనది మనం జీవించవలసిన జీవితం. జీవితాన్ని ఒక గురు స్వరూపం దగ్గరికి గనుక వెళ్ళినట్లైతే ఎలా జీవించాలో, సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలో, ఉన్న కొద్ది సమయంలోనే ఎన్ని పనులు చేయవచ్చునో, ఎక్కడా energy level down కాకుండా, ఎక్కడా అలసట లేకుండా ఎలా చేయగలుగుతున్నాడు జీవుడు అంటే చేస్తున్నది వాడు కాదు గనుక. ఒక్కటి గనుక మనం గమనించుకున్నట్లయితే మీరందరూ అక్కడికి వెళ్ళటానికి గల కారణం ఏమిటంటే fine tuning లో నుంచి ఇక వారు అందుకోవలసింది చాలా కొద్ది దూరంలో ఉన్నారు వాళ్ళు. మాట్లాడి మాట్లాడక, చూసి చూడక, అని అనక, చూపించక చూపించి అనేక మార్గాల్లో గురువులు అనేక బోధలు చేస్తూ ఉన్నత స్థితి నుంచి మహోన్నత స్థితికి, మహోన్నత స్థితి నుంచి ఏమీ లేని స్థితికి నడిపిస్తారు గనుక అది జిలేలమ్మూడి అమ్మ యొక్క పూర్ణ తత్వంగా మనం భావన చేయాలి. అలాగే ఆ-ఆమె ఎన్నడూ ఎవరికీ జ్యోతిష్యాలు చెప్పలే. ఎవరన్నా వచ్చి ఇది నువ్వు ఆశీర్వదించాలి అన్నప్పుడు అనుకున్నట్లే జరుగుతాయిలేరా అనేది అటు ఇటు కాకుండా. ఎవరనుకున్నట్లు? పరమాత్మ అనుకున్నట్లు జరుగుతుందని తర్వాత చెప్పేది. అమ్మా నీ దయవల్ల ఇది జరిగింది అన్నప్పుడు నేను ఎవరిని అనుకోవటానికి నువ్వు బాగా అనుకున్నావు రా అయిపోయేది అని. మధ్యనే భగవాన్ సత్య సాయి బాబా వారు కూడా అంటే మహాత్ముల యొక్క ఆలోచనా ధోరణి ఎలా ఉంటుందంటే, ఒకాయన వచ్చి స్వామి మీ దర్శనం చేసుకున్న తర్వాత అన్ని కష్టాలు తొలగిపోయి అసలు మళ్ళీ నేను ఇంత ఆనందాన్ని అనుభవించగలనా అని మాత్రం అనుకున్నాను కేవలం మీ దయవల్లనే జరిగింది మీ అనుగ్రహమే స్వామి అంటే, ఏం లేదు! స్వామి అనుగ్రహం స్వామి అనుగ్రహం అంటున్నావే! నీ కర్మ పరిపాకం చెంది అది పోయే క్షణం వచ్చి ఫలించే క్షణాన నువ్వు మా దగ్గరికి రావటం జరిగింది. దీన్ని coincidence అనుకోకు దీన్ని providenceయే అనుకో అన్నారంతే. అది. ఇందులోని నా ప్రమేయం ఏం లేదన్నారు. నేను నేనైనా నేనంటే అది. మూడు అవస్థలలో నేను ఉంటాయి. నేను ఎట్లా ఉన్నది అంటే జాగ్రత్ అవస్థలో నేను నాకు పదవి ఉంది, నాకొక tag ఉంది, నాకు ముందు ఒక శ్రీ ఉంది, చివరలో ఒక శ్రీ ఉంది, PhD లు ఉన్నాయి అన్నీ నేను acquire చేసుకున్నవి. అవన్నీ నేను కన్నుమూయగానే ఇంట్లో వాళ్ళే dustbin లో పారేస్తారు certificate లు వాళ్ళకక్కర్లా. మన కడుపు నింపుకోవటానికి ఇవన్నీ ఏర్పడ్డాయి తప్ప గుండె నిండు-నిండుగా ఉంచుకోవటానికి, హృదయాన్ని పండించుకోవటానికి లౌకిక విద్యలు అక్కరకు రావు. నండూరి రామకృష్ణమాచార్య గారని ఒక మహాకవి. వారు నాకొక ఉత్తరం రాస్తూ నాయనా డిగ్రీలు జగద్వంచనకే గాని ఆత్మవంచనకు కాదు. లోకము ఎగసెక్కను చేయకుండుటకు degree ఒక కవచము అంతే అన్నారాయన. మనకి వాళ్ళు అట్లా కాదు. అందుకే మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి గురించి విశ్వనాథ్ గారు ఒక మాట అన్నారు. degree లేని పాండిత్యం వన్నెకురాని పాడు కాలాన పుట్టి అన్నాడాయన. అది. degree ఉంటే మీకో గుర్తింపు లేకపోతే లేదు అట్లా అయింది degree అక్కర్లేదన్నారు. కావలసింది ఏమిటి ఒకే degree. degree నేను ఆత్మను అన్నటువంటి ఆత్మనిష్ఠ. దానిని మించిన PhDలు, భారతరత్నలు మరొకటి మరొకటి లేవు. అమ్మ ద-దీన్నే బోధించేది. అలాగే ఒకసారి రమణాశ్రమం మీద ఎట్లాగైతే దొంగల దోపిడీ జరిగిందో, attempt జరిగిందో జిలేలమ్మూడి ఆశ్రమం మీద కూడా జరిగింది. జరిగితే చిన్న గ్రామం చుట్టుపక్కల ఏడాది కరువు ఏర్పడింది. కరువు ఏర్పడింది రోజు అర్ధరాత్రి దొంగలొచ్చి దోపిడీ ప్రయత్నం చేశారు. అమ్మ దగ్గర బోలెడు బంగారం ఉంటుంది అసలా పట్టుచీర కట్టుకు కూర్చుంటుంది కదా. చీరే ఇంత ఖరీదైనది కట్టిందంటే బోలెడు బంగారం ఉంటుందని పాపం వచ్చి అక్కడంతా ఉన్నవేవో కాస్త ఎత్తుకుపోయినారు. కాస్త ఉన్నది కాస్త పోయింది. మర్నాడు పొద్దున్నే అందరూ వచ్చి పోలీస్ complaint ఇస్తే పది మందిని పట్టుకుంటాం. వాళ్ళు ఇక్కడే ఉంటారమ్మా నువ్వొక్క మాట అనమంటే ఆమె ఏమన్నదో తెలుసా? ఉన్నవాళ్ళని దాచిపెట్టుకున్నానురా లేనివాడు తీసుకెళ్ళాడు అది వాడిది. వాడి కోసం మనం కాపలా వేశాం అంతే. ఏం వాడిది వాడిది కాసేపు వాళ్ళను అనుభవించని మనదేం పోయిందన్నదమ్మ. చూశారా? మనమలా అనగలమా? ముందు వాణ్ని arrest చేయండి, వాణ్ని జైల్లో పెట్టండి, వాణ్ని చంపండి, వాణ్ని కాల్చండి. ఇదంతా రజోగుణ, తమోగుణానికి సంకేతం. సత్వగుణ ప్రధానమైనటువంటి దేవీ సమానమైనటువంటి అమ్మ వాడి కడుపు కూడా నిండాలి కదా. వాడికి గనుక నిజంగా మనం అన్నం పెట్టి ఉంటే ప్రమాదం జరిగేది కాదేమో అన్నదమ్మ. అంటే లోపం తన మీద వేసుకున్న తప్ప దోచుకు వెళ్ళిన వాడి మీద వేయలేదు. అందుకనే చూడండి తల్లి తన బిడ్డ ఎంత ఘోరమైన తప్పు చేసినా కడుపులో పెట్టుకు దాచుకుంటుంది. మరో కంటికి తెలియనివ్వదు. అసలు తన మనసులోకే ఆలోచన రానివ్వదు. ఎందుకంటే తన కూతురో తన కొడుకో ఇటువంటి పని చేశాడు అన్నప్పుడు తలచుకుంటేనే తల్లికి వేదన, యాతన గనుక తనకే ఇంత యాతన కలిగి-కలిగితే వాడితో పాటు మనకి కూడా పరువు ప్రతిష్టలు ఉంటాయి, పోతాయి గనుక లోపలే గంభీరంగా పెట్టుకొని వాడి మానాన్ని, వాడి గౌరవాన్ని, వాడి జీవితాన్నికనురెప్ప కనుగుడ్డును ఎట్లా కాపాడుతుందో అట్లాగే తల్లి కాపాడటం మనం చూస్తాం. మరి మామూలు సాధారణమైనటువంటి ఒక తల్లికే ఇంత ఉదాత్త భావన ఉంటే జగజ్జనని అయినటువంటి అమ్మ అనేకమంది తప్పులని కాచింది. అమ్మని ప్రతి యుగంలోనూ మా-ఆనాడు ఉన్న సమాజంలో ఉన్నటువంటి మానవుడి యొక్క ఒక దౌర్భాగ్య స్థితి ఏమిటంటే కనపడని వాడే దేవుడు కనపడేవాడు దేవుడు కాదు అది. కనపడనివాడిని వీడు చూడలేడు కనపడుతున్నవాణ్ణి అవును అనుకోలేడు కాబట్టి చివరికి equation ఏమిటంటే వాడు ఎన్నటికీ దైవాన్ని చూడలేడు జీవితం తెలవారిపోతుంది. జిల్లెళ్ళమూడి అమ్మ గృహస్థ జీవితంలో ఉంటూ అందరినీ తన-తనకు బిడ్డలున్నారు బిడ్డలు లేని తల్లి కాదు గొడ్రాలు కాదు ఆమె ఆమె కడుపున చక్కగా బంగారు బిడ్డలు పుట్టారు అయినప్పటికీ కూడా ప్రేమని అందరితో పాటు వారికి పంచింది తప్ప వారియందు ప్రత్యేకమైన వాత్సల్యం గానీ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి గానీ ఎన్నడూ లేదది. నేను మొన్న వెళ్ళాను జిల్లెళ్ళమూడి ఒక రెండు నెలల క్రితం, చాలా ఆశ్చర్యం కలుగుతుంది జాతి ఇవాళ చాలామంది నేర్చుకోవలసిన ఒక గొప్ప పాఠం ఏమిటో చెప్తాను. జిల్లెళ్ళమూడి అమ్మ జ్యేష్ఠ కుమారుడు రవీంద్ర రావు అని ఉన్నారు ఆయన SBI లో పనిచేసి retire అయ్యారు. ఉత్సవాలు తత్వచింతన సదస్సుకు ఆయన కూడా జిల్లెళ్ళమూడి వచ్చారు వచ్చింది ఎవరు సాక్షాత్తు అమ్మ కొడుకు direct son. ఆయన అందరికంటే చివర కూర్చున్నారు కార్యకర్త ఎవరు organize చేస్తున్నారో వారు వెనక ఆయన పేరు పెట్టి పిలిచి ఇదిగో వీనికి దండ వేయండి అంటే వేశారు, వేసిన మరుక్షణం మళ్ళీ వెళ్ళి తన కుర్చీలో తను కూర్చున్నాడు. అంటే glory of mother glory of mother కి he is totally indifferent అది greatness. మా అమ్మ గురించి చెప్తూ నేను వేదిక మీద లేకుండా ఎక్కడి వాళ్ళు వచ్చి కూర్చున్నారు అనుకోలేదు ఒక సాధారణమైనటువంటి ఒక భక్తుడి వలె ఒక అమ్మ బిడ్డ వలె అందరితో పాటు సమానంగా కూర్చున్నాడు. ఇది ఎవరు నేర్పారు రవీంద్ర రావు అనబడేటువంటి వ్యక్తికి అమ్మ ఇచ్చినటువంటి సంస్కారం. అందుకనే తన జీవితకాలంలో కూడా తాను ఎన్నడూ అందరికంటే అధికురాలిని అని ఎన్నడూ అనుకోలేదు అందువల్లనే ఆమె పూజనీయురాలైంది. సర్వ ప్రపంచంలో నువ్వు సారే-రాజరాజేశ్వరివి నువ్వు లలితా దేవివి అంటే మీరు ఏమన్నా అనుకోండిగా నేను మీ అమ్మను అనేది. అంత ఒక్కటే మాట. అమ్మ యొక్క లక్షణం ఏమిటంటే కడుపు నింపటం మనసు నింపటం హృదయం పండించటం సన్మార్గంలో పెట్టటం మనకు ఉన్నటువంటి దాన్ని పెంచటం పంచటం కాబట్టి తైత్తిరీయ ఉపనిషత్తు యొక్క సహకార స్వరూపమే జిల్లెళ్ళమూడి అమ్మగా మనం దాన్ని ఆ-ఆ స్థితిలో విచారణ చేయాలి. అక్కడ ఏమున్నది ఏం లేదు కాదు అక్కడ లేనిదంటూ ఏం లేదు. చాలా ఆశ్చర్యకరం ఏమిటంటే ఆమె ఇంటి పేరు బ్రహ్మాండం. చూశారా బ్రహ్మాండవు బ్రహ్మాండ భాండోదరి అని అమ్మవారికి పేరు. ఈమె బ్రహ్మాండ భాండోదరి మాత్రమే కాదు బ్రహ్మాండంలో ఉన్నటువంటి సర్వజీవులకి కూడా జ్ఞాన వర్దానం చేసినటువంటి మహా మహితమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్త్రీమూర్తి ఆమె. ఒక బంగారు రంగు మామూలుగా స్త్రీ సౌందర్యం కామాతురుడికి ఆతృత కలిగిస్తుంది రామాతురుడికి ఆనందం కలిగిస్తుంది. అమ్మ అందం లోక లోకాంతర ప్రాణాలను ఒక్కసారి తాకి అమ్మ ఒళ్ళో ఒక నిమిషం పడుకుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. అది ఐదేళ్ళ వాడికి అనిపించవచ్చు తొంభై ఐదు ఏళ్ళ వాడికి అనిపించవచ్చు ఇది ఆశ్చర్యం. అమ్మ శరీర వర్ణం మామూలు స్త్రీలకు ఉండేటువంటి తెల్లగా ఉన్నారు ఎర్రగా ఉన్నారు ఇది కాదు వర్ణమే అతి విచిత్రమైనటువంటి రంగు. ఏమిటి మనం అమ్మవారిని గురించి హిరణ్యగా-హిరణ్య వర్ణంలో ఉంటా అంటామే బంగారు మేలిమి బంగారపు రంగు ఏదైతే ఉన్నదో ఆమె శరీరం అట్లా మిలమిల మెరిసిపోతూ ఉండేది. పరమ పవిత్రంగా తేజోమయంగా తేజస్సును మనం చూడటం చాలా కష్టం మామూలుగా వెళ్ళి ఏదో కదాచి చూద్దామన్నా ఒక్కసారి దివ్య తేజస్సు దగ్గర మాత్రం ఒక్క క్షణం ఆగిపోవలసిందే. పలకరించిందా జన్మ జన్మాంతరాలుగా ఉన్న అనేక వాసనలు నశించవలసిందే. కాసపు దగ్గర తీసుకున్నదా లోక ప్రాణాలన్నీ కూడా ఒక్కసారి కదలవలసిందే అవి ఊగి ఊగి ఆగవలసిందే. అమ్మ అన్నం పెట్టిందా పామరుడు పండితుడవుతాడు పండితుడు మహాకవి అవుతాడు మహాకవి మహా జ్ఞాని అవుతాడు మహా జ్ఞాని అంతర్ముఖుడు అవుతాడు అంతర్ముఖుడైన వాడు జీవన్ముక్తుడవుతాడు జీవన్ముక్తుడైన వాడు ప్రపంచానికి మార్గోపదేశం చేస్తాడు. అది అమ్మ చేతి ముద్దలో ఉన్నటువంటి మహిమ దానిని పొందినవారు చాలామంది ఉన్నారు. ఆమె కొద్దిమందికో ఇచ్చింది అది ఎవరి priority కాదు she choose some people ఇందాక కొన్ని పేర్లు చెప్పాను. అయితే కృతజ్ఞతాభావంతో మనం ఎవరు మనకి ఆకలి వేళ అన్నం పెట్టారో, అవసరం వేళ నిలబడ్డారో, ఓదార్పు సమయంలో మన దగ్గర ఉండి మన కన్నీరు తుడిచారో, కన్నుమూసే వరకు కృతజ్ఞతాభావంతో ఉండాలంటారు భగవాన్ సత్య సాయి. మూడు గనక లేకపోయినట్లయితే వాడు పుడితే ఏమి గిడితే ఏమి అన్నారు బాబా. కృతజ్ఞత అది-అది చాలా ఉదాత్తమైనటువంటి గుణం కానీ ప్రపంచంలో ఇవాళ లేనిది అదే. ఎవడన్నా నాలుగు మెట్లు ఎక్కి పైకి వస్తే మీరు ఎలా పైకి వచ్చారో చెప్పండి అంటే నా అంతట నేనే వచ్చేసాను అంటాడు. మన అంతట మనం పెద్దవాళ్ళం అయినామా? మన అంతట మనం పరిగెత్తామా? మన అంతట మనం చదువుకున్నామా? నువ్వు PhD తెచ్చుకున్నా పలకంతో చిన్ననాడు పలక మీద ఓం నమః శివాయ అని రాసిన లోకగురువుని నువ్వు మర్చిపోతే ఎట్లా? ప్రథమ వందనం ఆయనకి ఇవ్వమంటుంది అమ్మ.అలాగే ఆమె దగ్గరికి పామరులు, పండితులు, జ్ఞానులు, తపస్సులు, జిజ్ఞానస్సులు, ముముక్షులు, అవధూతలు ఎందరెందరో వచ్చినా వారందరూ ఆమెలో అమ్మని దర్శనం చేసుకున్నారు. ఒకటి రెండు సంఘటనలు చెప్తాను. వి. నరసింగరావు అని రోజుల్లో జడ్జి తర్వాత వీణాదేవి కథలు మీరు విని ఉంటారు, చదివి ఉంటారు. వాళ్ళిద్దరూ దంపతులు అమ్మ దర్శనానికి వచ్చారు. నేను రోజుల్లో జిల్లా ఎల్లేమూడిలో ఉన్నా, చిన్నవాడిని చాలా. ఆయన తొందరగా కారులోనే వచ్చారు త్వరగా అక్కడి నుంచి బయల్దేరి వెళ్లి బస్సు పట్టుకొని ఎక్కడికో వెళ్ళాలి ఇంకో, ఇంకో కార్యక్రమానికి. అలా వెళ్ళబోతున్న వారికి లోపలుండి అమ్మ కబురు పెట్టింది "ఇప్పుడు వెళ్లొద్దు అని చెప్పు" అన్నది. అమ్మ అట్లాగే అంటుంది "అమ్మ దగ్గర ఉండాలని మాకు ఇష్టమే, మమ్మల్ని వదలటం ఆమెకు ఇష్టం లేదు, వేరే పని మీద మేము వెళ్ళాలి అని చెప్పండి అమ్మకి నేను బయల్దేరుతున్నాను" అన్నాడు. లోపలికి వెళ్లి "అమ్మ బయల్దేరి వెళ్లారు" అంటే "ఎక్కడికి వెళ్తారురా? ఎప్పుడొస్తారు?" అంది. "ఎలా వెళ్తారు జడ్జి గారి కారు అది, start చేస్తే స్వస్థానానికి ఎక్కడికెళ్ళాలో చేరాలి. బయటకు వెళ్తుండగా మొదటి tyre puncture అయిపోయింది. అది అక్కడ అయిపోయింది గనుక అరగంటలో మళ్ళీ తయారు చేసుకొని వెళ్లిపోయినారు. కాస్త ఏడు మైళ్ళ దూరంలో గనుక అయి ఉన్నట్లయితే రాత్రి ఆయన అక్కడే ఉండేవారు. అంటే దూర దర్శనము అనేటువంటి ఒక అత్యద్భుతమైన సిద్ధిని మళ్ళీ తన బిడ్డల బాగోగుల కోసం ఆమె వాడినటువంటి సన్నివేశం. అవన్నీ అట్లా చాలా జరిగినాయి. చాలా జరిగితే అందులో మళ్ళీ ఒక ప్రాతఃస్మరణీయమైన సంఘటన. లలితా సహస్రం మీద ఇవాళ market లో కొన్ని వేల లక్షల పుస్తకాలు ఎవడైనా సరే రెండు మాటలు చెప్పగలిగిన వాడు వ్యాఖ్యానం రాస్తున్నాడు. లలితా సహస్రం యొక్క అమ్మవారి నామం తెలుసుకోవాలి అంటే మల్లాప్రగడ రంగారావు గారు రాసిన భారతి వ్యాఖ్య మాత్రమే చదవాలి. అది చాలా ఉత్కృష్టమైనటువంటి వ్యాఖ్యానం. ఒక్కసారి జిల్లా ఎల్లేమూడిలో time లో "అమ్మా! నిన్ను మేము లలితాదేవిగా ఉపాసన చేసుకుంటున్నాం కాబట్టి నువ్వు ఎవరినన్నా పిలిపించి ఇక్కడ లలితా సహస్రం గురించి కాసేపు మాట్లాడించాలి అమ్మకు పది, పదిహేను రోజులు లేదా ముప్పై రోజులు" అంటే ఆమె ఏం మాట్లాడలే. ఒక రెండు నిమిషాల్లో ఆమె ఏమన్నదంటే "బందరు నుంచి రంగారావు ఎలాగూ బయలుదేరాడు, పని రంగారావుకు అప్పచెప్పండి" అంది. ఆయనకి అసలు ఈ, లలితా సహస్రానికి భాష్యం రాస్తానని ఆయనకి తెలీదు. రాగానే అమ్మ "రంగారావు నువ్వు చక్కగా వ్యాఖ్యానం రాయి" అన్నది. ఆమె కొడుకే మల్లాప్రగడ శ్రీనివాస నారాయణ మూర్తి. ఇవాళ మీరు tv లో చూస్తూ ఉంటారు ఆయన కొడుకు. అంటే పరమేశ్వరుడు ఒక్కొక్క వ్యక్తిని ఎంచుకుంటాడు. లలితా సహస్రానికి ఐదు వందల పేజీలు, ఎనిమిది వందల పేజీల వ్యాఖ్యానాలు ఉన్నాయి. సౌభాగ్య రత్నాకరమని భాస్కరాచార్యుల వారిది ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు. మామూలు మానవుడు, మామూలు సాధకుడు, ఒక సాధారణ గృహిణి శబ్దానికి, పదానికి అర్థం ఏమిటి అని గనక తెలుసుకోవాలంటే అవి సమాధానం ఇవ్వవు. భారతి వ్యాఖ్య మాత్రమే ఇస్తుంది. మరి లలితా వ్యాఖ్య లేకపోతే జిల్లా ఎల్లేమూడి అమ్మ వ్యాఖ్యను పెట్టాలి కదా, భారతి వ్యాఖ్యను ఎందుకు పెట్టారు ఆయన అంటే భారతి అంటే సరస్వతి. స-రసస్వతి సరస్వతి. రసముతో కూడి ఉన్న రసోవై సహ అనేటువంటి ఒక నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వానికి సంకేతం లలితాదేవి గనక అయినట్లయితే, ఆమె గనక వాగ్ రూపిణిగా ఉన్నట్లయితే ఆమె భగవంతుని యందు, వెలుగు నందు రతి అంటే ఒక రమ్యత, ఒక ఆసక్తి, ఒక తీవ్ర కాంక్ష ఎవరికైతే ఉన్నదో దాని పేరు భారతి అని పేరు. గనక భారతి వ్యాఖ్య అంటే అమ్మవారి మీద ఉన్నటువంటి ఒక సమగ్ర, సమ్యక్ వ్యాఖ్యానం అది. అది ఎలా సంభవించింది అంటే క్షణాన ఆయన అక్కడికి రావాలని ప్రేరణ కలగటం, రావటం ఇదంతా ఏకకాలంలో జరగటం అమ్మ యొక్క సర్వజ్ఞత్వానికి మనం గుర్తుగా చెప్పుకోవాలి. తర్వాత అమ్మ భక్తులుగా, అమ్మ బిడ్డలుగా అనేక దేశాలలో కొన్ని వేల లక్షల మంది ఉన్నప్పటికీ కూడా అవన్నీ personal level లో ఉన్నటువంటి అనుభవాలుగా కొన్ని కోకొల్లలు అవన్నీనే చెప్పొచ్చు, సమయం మనకు లేదు. మనకున్నటువంటిది జగజ్జనని, సర్వజ్ఞ అయినటువంటి అమ్మ ప్రపంచానికి అన్నం వండుకోమని, అన్నం పెట్టుకోమని, అది మీ చేత్తోనే పెట్టుకోమని కానీ ఎప్పుడైనా పెట్టుకుంటూనే ఉండమని, అది మాత్రమే నీకు పరమ చరమమైనటువంటి ముక్తిధామానికి చేరుస్తుందని ప్రపంచానికి ఒక తైత్తిరీయ ఉపనిషద్ భావనగా ప్రపంచానికి వచ్చినటువంటి పరమ కారుణ్యమూర్తి. ఇంకో సంఘటన, ఒక రోజున బయట కూర్చొని ఉందాం మామూలు ఇటువంటి కుర్చీ ఒకటి వేసుకొని. రోజుల్లో ఇవి లేవుగా ఇనుప కుర్చీ ఒకటి వేసుకొని బయట ఉడుక కూర్చుంది. మామూలుగా పట్టుచీరలోనే ఉండేది ఆమె. అప్పుడే మురుగు కాలువలో పడి అక్కడ drainage ఉండదు. మురుగు కాలువలో పడ్డ ఒక కుక్క దాని మూతికి ఏదో దెబ్బ తగిలింది, పాపం. తెలియక పడిపోయింది దానికేమి ఉన్నదో తెలీదు గాని మూతి దెబ్బ తగిలి రక్తం కారుతున్నది. అది అలా కుంటుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తున్నది. ఒక్కసారి కుర్చీలో నుంచి లేచి దాని దగ్గరికి వెళ్లి తన పట్టుచీర చెంగు తీసి దాని మూతంతా తుడిచి "నేనున్నానురా నీకు" అని. మామూలుగా అయితే కుక్కను పట్టుకోండి, స్నానం చేయించండి, dispensary కి పట్టుకెళ్ళండి, దానికి ఏదైనా injection ఇవ్వండి. time లేదు she knows. అలాగే ఎవరెవరికి ఉద్ధారణ సమయం ఏర్పడిందో సమయం అమ్మకి స్పష్టంగా తెలిసేది. దానికి సంకేతాలు ఇచ్చేది. అలాగే అద్వైత బోధన ప్రపంచానికి అందించడం కోసం అనేకమైన వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆంధ్రదేశమంతా తిరిగింది అమ్మ. బ్రహ్మాశ్రమానికి వెళ్ళింది.శ్రీశైలం వెళ్ళింది, కంచి వెళ్ళింది. ఇవన్నీ ఎందుకు వెళ్ళింది అంటే జయేంద్రస్వామి వారు ఒకసారి ఒక మాట అన్నారు. ఈమె స్త్రీ స్వరూపంగా ఉన్నటువంటి ఒక యోగినిగా లోపలికి పరిచయం చేశారు. లోపల ఉన్న జయేంద్రస్వామి వారు అప్పుడు యుక్త వయసులో ఉన్నారు అమ్మ వెళ్ళినప్పుడు. అమ్మని దర్శనానికి జిల్లాెల్లమూడి నుంచి అమ్మ వచ్చింది అని అంటే, అమ్మని కోసం అమ్మ వచ్చిందేమో గానీ మా బోటి వారమంతా ఈమె దర్శనం కోసం ఎదురు చూస్తున్నాం అన్నారాయన. జయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క వ్యాఖ్య ఇది. అంటే జిల్లాెల్లమూడి అమ్మని-- అంటే ఒక దేవో భుక్వా దేవం యజేత్ అని ఒక మాట ఉంది. దేవుడైన వాడే దేవుణ్ణి గుర్తించగలడు. స్థాయికి వెళ్ళిన వాడు మాత్రమే ఇంకొకణ్ణి గుర్తించగలడు. లేకపోతే మామూలు అమ్మ, కరణం గారి భార్య, ఇద్దరు పిల్లలకో, ముగ్గురు పిల్లలకో తల్లి, ఏదో అక్కడ కూర్చుంది చిన్న ఊళ్ళో కూర్చుంది, పది మంది వచ్చారు, పసుపు కుంకుమ పంచిపెట్టింది ఇలా కూడా చెప్పచ్చు. కదా. ఇలాగే చెప్పినట్లయితే ఆమె విశ్వజనని అయ్యుండేది కాదు. విశ్వజనని కావడానికి కారణం ఆమె కంటే లౌకిక రీతిలో బాగా చదువుకున్నటువంటి వారందరూ కూడా ఆమె దగ్గరికి వెళ్లి ఉపదేశనం పొందారు. మార్గోపదేశనం సాధించుకున్నారు. అలాగే అమ్మ పేరు మీద అమ్మ చేసేటువంటి, చెప్పినటువంటి పనులకి అనుగుణంగా అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి. అందుకనే నిన్న మనం మా సోదరుడు అనిల్ కుమార్ గారు చెప్పారే తాను కూడా దర్శనం చేసుకున్నానని, అమ్మ దగ్గరికి వెళ్ళానని, బాబా గురించి మాట్లాడారని, బాబా అన్నా, అమ్మ అన్నా ఒకటేనంటే, అసలు అమ్మ nineteen twenty six లో వచ్చింది ఆమె. నా twenty three. twenty six సత్య సాయి బాబా వారు. మూడేళ్ళ gap. తర్వాత వచ్చారు. స్వామి canteen ప్రారంభించినప్పుడు ఒక మాటన్నారు. రకంగా అయితే జిల్లాెల్లమూడి అమ్మ నిత్యమూ అన్నసంతర్పణ జరగాలి, అందరికీ అన్నం అందాలని కోరుకున్నదో అది ఇక్కడ సాగుతుంది అన్నారు బాబా. ఇవాళ పుట్టపర్తి canteen, canteen లో భోజనం అంటే అది స్వామి చేత్తో మనం తీసుకునే ప్రసాదం కింద లెక్క. దానికంటే అది అన్యం కాదు. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత రాజాధిరాజైనా అక్కడికి వెళ్లి అన్నం తిని రావటం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అక్కడ పుట్టపర్తి యాత్రలో. అలాగే మహాత్ములు వడ్డించేది కేవలం అన్నంగా మనం భావన చేయటానికి వీల్లేదు. ఒక్కొక్క సాధకుడు ఒక్కొక్క స్థాయిలో అమ్మని అనుభవిస్తూ వెళ్ళాడు. జిజ్ఞాసువులందరూ కూడా ఆమెని ఎట్లాగంటే ఒక తాత్విక చింతన కోసం ఆమె దగ్గరికి వెళ్లారు. ముముక్షు స్థాయికి వెళ్ళిన వారంతా పట్టు జారిపోకుండా ఉండటం కోసం, అనుగ్రహం కోసం వెళ్లారు. అతి చిన్న పిల్లలు అక్కడికి ఎందుకు వెళ్లారంటే అమ్మ యొక్క వాత్సల్యాన్ని, కారణం లేని, ప్రత్యేకమైనటువంటి, reasonable అనటువంటి, అపారమైనటువంటి వాత్సల్యాంబుధిలో తేలియాడటానికి, మునిగి ఉండటానికి అక్కడికి అందరూ వెళ్లారు. కానీ ఆవరణ ప్రవేశం చేసినవారు, అనుభవాన్ని పొందినవారు, అనుభూతి చెందినవారు, చెందించుకున్న వారందరూ కూడా పరమ తృప్తంగా, పరమ ఆనందంగా తమ జీవితాలను గడపటం మనం ఇప్పటికీ చూస్తాం. ఏదన్నా ఉపదేశం చెయ్యమ్మా, ఏదన్నా బోధ చెయ్యి అంటే సక్రమంగా జీవితాన్ని నడుపుకోరా దాన్ని మించినటువంటి ఉపదేశం ఏమున్నది అని. ఎన్ని ఉపదేశాలు చేసినా మంచి మార్గంలో ఉండాలనే కదా. నువ్వు మంచి మార్గంలోనే ఉన్నావు అనుకో దాన్ని మించిన ఉపదేశం ఏముంది. అని backward integration అని వాడతామే, అంటే ఇది చేస్తే అది వస్తుందని కాక, అట్లా ఉంటే ఇది తెలిసినట్లు అనేది. అట్లా ఉండటం important. ఉండటం అనేది సంస్థితంగా ఉండాలి, మౌనంగా ఉండాలి, చాలా నిగ్రహంగా ఉండాలి, నియంత్రణతో ఉండాలి, నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, నిర్మమంగా ఉండాలి. రకమైన భావనకు, భావానికి లోటు లేకుండా, చోటివ్వకుండా, దేనికి లొంగనిటువంటి ఒక అచల అమృత అద్వైత మహనీయ స్థితిలో సాధకుడు నిలకడ చెంది ఉంటాడో వాడి యందు ఇటువంటి స్త్రీమూర్తుల యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఒక గార్గి, ఒక మైత్రేయి, ఒక అనసూయ, ఇటువంటి వారందరూ కూడా జ్ఞానం వరకు పరిమితమైనటువంటి మహా స్త్రీమూర్తులు. మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. యాజ్ఞవల్క్యుడితో తలపడింది గార్గి. సమాధానం పొందేదాకా సమా-ప్రశ్న వేస్తూ వెళ్ళింది. అమ్మ జ్ఞాన స్వరూపిణి, జ్ఞానము అంతర్లీనం చేసింది, బాహ్య రకమైనటువంటి జీవితాన్ని పరమ పవిత్రీకరణం చేసుకోమని మాత్రం చెప్పింది. పరమ పవిత్రీకరణం కేవలము దేహాన్ని clean చేసుకొని దానికి ఒక అలంకారం చేసుకుంటే అది మాత్రం శుభ్రం కాదు. అది కేవలం పాత్ర యొక్క బయట జరిగిన శుద్ధి. అంతరంగ శుద్ధి ఏది అంటే అనంతము, నిరంతరము కూడా లోలోతుగా సాగేటువంటి భగవన్నామ సంకీర్తన, నామస్మరణము, భగవత్ చిత్తన, తత్వ భావన, రూప విశేషణ, గుణ సంకీర్తన, ఇవన్నీ కలబోసుకున్నట్లయితే అది భక్తి పారాయణ్యంలో పరమ చరమమైనటువంటి స్థాయి. స్థాయికి వెళ్ళాలి జీవుడు. వెళ్ళకపోయినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉపదేశ మార్గంలో మనల్ని మహోన్నత స్థాయికి తీసుకు వెళతారు కనుక జిల్లాెల్లమూడి అమ్మ అనబడేటువంటి తత్త్వం అమ్మ తత్వానికి, మాతృత్వానికి, వాత్సల్యానికి, అవ్యాజమైనటువంటి కరుణకి, ఆనంద తారక స్థితికి, అభేద అద్వైత స్థితికి, పూర్ణ అద్వైత స్థితి-స్థితికి, పరిపూర్ణమైనటువంటి మానవతావాదానికి, ఉపనిషత్తుల యొక్క భాష్యానికి ఒక నిలువెత్తు స్వరూపంగా అమ్మ జగత్తులో నిలబడిపోయింది. కనుకనే ఒక జిల్లాెల్లమూడి అమ్మ అటువంటివారు. నిన్న శారదాదేవి. మామూలు వ్యక్తులా వీళ్ళు. ఇవాళ స్త్రీలంతా-- నేను మొన్న ఒక program, youth program ఏదో చేయమంటే చేస్తేఈనాటి యువత మీకు ఎవరు role model అంటే ఒక Mother Teresa తప్ప ఎవరి పేరు వాళ్లకు గుర్తు లేదు, తెలియదు వాళ్ళకి. జిల్లెళ్ళమూడి అమ్మ ఎందుకు ఆదర్శం కాలేకపోయింది? ఎందుకు చేసుకోలేకపోయినాం? రాజమండ్రి దగ్గర దొక్కా సీతమ్మ ఎందుకని కాకపోయింది? కొన్ని వేల లక్షల మందికి ఆవిడ అన్నం పెట్టిందే ఏమైపోయింది చరిత్రలో? వీళ్ళకి స్థానం లేదా? నిన్న మనం వివేకానంద స్వామి జయంతి చేసుకున్నాం. యల్లాప్రగడ సుబ్బారావుని మర్చిపోయినామే? ఎవరు యల్లాప్రగడ సుబ్బారావు? పెన్సిలిన్ కనిపెట్టాడు. అనేకమైనటువంటి basic drugs అన్నీ కూడా ఆయన కనిపెట్టి ప్రపంచానికి ప్రాణవరదానం చేశాడు. ఎవరికైనా తెలుసునా? అది నిన్ననే యల్లాప్రగడ సుబ్బారావు from కాకినాడ. Actual గా భీమవరం ఆయన. తర్వాత కాకినాడ, తర్వాత literally కప్పినే అదంతా ఒక చరిత్ర. కానీ స్థూలంగా ఆంధ్రదేశం నుంచి ఇంత గొప్ప వాళ్ళు ప్రపంచానికి వెళ్లారు. చరిత్ర ఎవరికి ఉన్నది వాళ్ళంటే, చరిత్ర లేని వాళ్ళు చరిత్రను సృష్టించుకుంటూ రాసుకుంటున్నారు. చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చరిత్రలో నుంచి నెమ్మదిగా జారిపోతున్నారు. అది. అలా జరగకూడదు. కనుక కాస్తూ కూస్తూ చదువుకున్న మన బోటి వాళ్ళ బాధ్యత ఏమిటి అంటే జిల్లెళ్ళమూడి అమ్మకు వాళ్ళ ప్రచారం అక్కర్లే, మనం ఆమెను అమ్మని చేయక్కర్లే, ఆమెను తీసుకెళ్లి ఇంకో దేవి దేవతని చేయక్కర్లే. ఆమె ఏం చెప్పింది? గృహిణిగా ఉంటూ జీవితాన్ని ఎట్లా సాగించింది? ఎన్నన్ని కష్టాలు ఎట్లా నిబ్బరంగా ఎదుర్కొన్నది? కష్టాలు వచ్చిన వారందరినీ ఎట్లా ఆదుకున్నది? ఎట్లా ఆదరణ చూపించింది? మానవుని స్థాయిలో ఎట్లా సంచారం చేసింది? మనం చేయలేమా పని? చేయం. అది మన పని కాదూ, జిల్లెళ్ళమూడి అమ్మ పని అనుకుంటాం. ఎందుకని ఆమెను దేవతని చేసేశాం already. కాబట్టి ఆమెని మన నుంచి దూరం చేసుకున్నాం. అమ్మ దూరంగా కావటానికి వచ్చిన తల్లి కాదు. దగ్గరకు తీసుకోవటానికి, దగ్గరగా ఉండటానికి వచ్చింది గనుకనే నా దృష్టిలో జిల్లెళ్ళమూడి అమ్మ ఉపనిషన్మూర్తి.
SSSMC · audio

Talk on Jillellamudiamma - 03

Home

Talk on Jillellamudiamma - 03

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 26:20

More in this series

Talks on Jillellamudiamma

4 episodes · 1 hr 48 min

  1. 27 min 1

    Talk on Jillellamudiamma - 01

  2. 31 min 2

    Talk on Jillellamudiamma - 02

  3. 26 min 3

    Talk on Jillellamudiamma - 03

    Now playing
  4. 23 min 4

    Talk on Jillellamudiamma - 04