Skip to content
Transcript తెలుగు
నారాయణ గురువు పాల్ బ్రింటన్ పరమహంస యోగానంద వచ్చారు అరుణాచలానికి. భగవాన్ సన్నిధానంలో కూర్చున్నారు మాటలు లేవు. అక్కడే కావ్యకంఠ అసిష్ట గణపతి ముందు నుంచుని ఉన్నారు. పరమహంస యోగానంద ని తట్టిలేపి ఎవరిని చూడాలని వచ్చారో వారే మీ ఎదురుగా కోటి సూర్యుల వెలుగుతో వెలిగిపోతుంటే వారిని చూడకుండా ఏమి ధ్యానాలు చేసుకుంటారండి ఇక్కడ అన్నారు కావ్యకంఠులు. పరమహంస యోగానంద ఒక్కటే మాట అన్నారు కొన్ని వేల లక్షల ధ్యానాలలో దేనిని దర్శించాలని నేను చేశానో ఉన్నానో దర్శనం నాకు ఇక్కడ అయి నన్ను నేను దర్శించుకున్నటువంటి వేళ వారితో నాకేమి పని అన్నారు పరమహంస యోగానంద. సంభాషణ అవుతుండగానే రమణులు అన్నారు వారిని వారు చూసుకోవటానికి ఇక్కడ ఇంత దూరం వచ్చారు. వారిని చూసుకోనివ్వండి మధ్యలో మనదే ఎందుకు అన్నారు. చూశారా వీరితో నాకేమి పని అన్నప్పుడు మామూలు వాడికి అహం జ్రుంభిస్తుంది. మరి నాకోసం కాకపోతే ఇక్కడిదాకా ఎందుకు రావాలి అని. అలాగే శివానందులు రుషికేష్ నుంచి వచ్చారు. సాక్షాత్తు దక్షిణామూర్తి పరబ్రహ్మ స్వరూపము సాక్షాత్తు ఇక్కడ ఉన్నట్లయితే వారే రమణ మహర్షి అని. సందర్భంలో కావ్యకంఠులు ఒక గురువు యొక్క స్థితిని గురుతత్వాన్ని భారతీయ గురుతత్వంలో రమణుల తత్వాన్ని ఒకేఒక అందమైన శ్లోకంలో చెప్పారు. గురువు ఎవరు అంటే ఏదో ఉదాహరణ ఇచ్చేవాడు, తాయెత్తు ఇచ్చేవాడు, మంత్రం ఇచ్చేవాడు, మార్గం చూపేవాడు, సందేశం ఇచ్చేవాడు, నడిపించేవాడు పోనీ మోక్షం ఇచ్చేవాడు ఇటువంటివన్నీ ఉన్నా. శాంతిర్నితాంతమహితా పరమాశశక్తిహి వైరాగ్యమద్భుతతమం కరుణాతు సాంద్ర జ్ఞానం నిరన్న కుహనం మధురంచ వృత్తం ఋణాం నిదర్శనమయం రమణో మహర్షి. అపారమైన నితాంతమైనటువంటి శాంతము ఎక్కడ మూర్తీభవించి ఉన్నదో అక్కడ గనక ఎవరి ఆవరణంలో మన మనస్సు అణగి చిత్తవృత్తి నిరోధనం జరిగి యోగ భూమిక లోకి తనంతట తానుగా ప్రస్థానం చేస్తుందో దానికి కారణభూతులైనటువంటి వాడు గురువుని మొట్టమొదటిది. ముఖమండల దర్శనంలో నుంచి అనేకమైనటువంటి సందేహాలకు సమాధానాలు దొరికి పరిష్కార మార్గం దొరికి కర్మ భక్తి యోగ జ్ఞానాలు దాటుతూ పరిపూర్ణమైన ఆనంద తారక స్థితిలోకి వెళ్ళటానికి ఎవరి ముఖమండలము కారణం అవుతున్నదో అది ఇక్కడ ఉన్నది. వైరాగ్యం అద్భుత తమం. వైరాగ్యం ఎట్లా ఉండాలి అంటే అన్నీ ఉండి ఇవేవీ నావి కాదనుకోవటం వైరాగ్యమే తప్ప, ఉందమన్ని పోగా కలిగిన విషాదంలో నుంచి పుట్టేటువంటి భావన వైరాగ్యం కాదు. నిజానికి వైరాగ్యమే నిజమైన అచ్చమైన స్వచ్ఛమైనటువంటి ఒక వైభోగ స్థాయి. అది ఎక్కడ ఉన్నదంటే ఇదిగో వైరాగ్యంలో ఉన్నది. అలాగే కరుణాతు సాంద్ర కరుణాపూర్ణ సుధాబ్ధి కరుణ అంటే నేను అనుకున్నామే దయ జాలి సానుభూతి ఇవన్నీ అహంకారానికి నీడలు జాడలు. కరుణ ఎవరి దగ్గర ఉన్నది అయ్యా జ్ఞాని దగ్గర, స్వామి దగ్గర, పరదైవతం దగ్గర ఉన్నది గనుక అటువంటి వారు మాత్రమే కరుణామూర్తులుగా ఉంటారు గనుక కరుణాతు సాంద్ర. జ్ఞానం నిరన్న కుహనం అజ్ఞానాన్ని మటుమాయం చేయగలిగినటువంటి జ్ఞాన ధీ శక్తి ఎవరికి ఉన్నదో, జ్ఞానైక స్థితి ఎవరికి ఉన్నదో వాడు గురువు అవుతున్నాడు. ఇన్ని ఉండి కూడా మధురించ వృత్తం. క్యారెక్టర్ కాండక్ట్ ఇట్ షుడ్ బి స్వీట్, ఇట్ షుడ్ బి మెలిఫ్లియస్, ఇట్ షుడ్ బి బ్యూటిఫుల్. సెన్సేషన్ క్రియేట్ చేయకూడదు. ఇట్ షుడ్ టచ్ ది ఇన్నర్ కార్డ్ అండ్ లీవ్ ఇట్ ఎట్ దట్. చిన్న స్పందనలో నుంచి పరమాద్భుతమైన అధ్యాత్మ భావ శిఖరంలోకి మానవుడు ప్రయాణం చేయగలగాలి, చేయించగలగాలి. ఇన్ని గుణాలు ఒకచోట ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడా అంటే ఋణాం నిదర్శనమయం రమణో మహర్షిహి. రమణ మహర్షి దీనికి గొప్ప ఉదాహరణ అని కావ్యకంఠుల యొక్క అత్యద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. ఇది పండితుల స్థాయి. పశువుల పసరాల స్థాయి దాటిపోయింది. ఒకరోజు ఒక పిల్లవాడు పాము కాటుకి మరణించాడు అరుణ-రమణాశ్రమంలో. సమయంలో భగవాన్ అక్కడ లేరు. తల్లి పెద్దగా కేకలు పెడుతున్నది రమణ రమణ రమణ అని అరుస్తున్నది. ఎవరు తనని ఇట్లా పిలవరు ఇంత అర్థనాదం ఎవరు చేస్తున్నారు అని భగవాన్ పరుగు పరుగున దగ్గరకు వచ్చారు. నిన్నెవరు పిలిచారయ్యా నా కొడుకు పేరు రమణ అన్నది. పోనీలేనే వచ్చా కదా ఇంతకీ ఏమైంది అన్నారు. పోయినాడు అన్నది. అట్లానా అన్నారు. కేవలము తమ దివ్య అనుగ్రహాన్ని మృత కళేబరం మీద సారించారు. పిల్లవాడు కళ్ళు నులుముకుంటూ లేచాడు. లేచి భగవాన్ ఎదురుగా కనపడగానే నమస్కరించగానే ఏమిరా ఏం చేస్తున్నావు అన్నారు. ఏం తెలియనట్లే మంచి నిద్ర పట్టింది అన్నాడు. బయటకు రా అన్నారు. అయిపోయింది. అయిపోగానే పక్కన ఉన్నటువంటి ఒకడు అడిగాడు భగవాన్ ఎంత అద్భుతం చూశాం ఈవేళ. ఇట్లా ఎవరికైనా ప్రమాదం గనుక జరిగినట్లయితే మీ అనుగ్రహాన్ని ఇట్లా వర్షిస్తూ ఉంటే మంచిది కదా అని అనగానే అప్పుడు రమణాశ్రమం మార్చురీ అవుతుందయ్యా. [నవ్వు] ఎవరి దారిన వారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు తల్లి రోదన ఎవరినో కదిలించింది. కర్త ఎవడో ఇట్లా చేయమని అన్నట్టున్నాడు. వాడెవడో సాగించాడు అన్నారు. ఎక్కడ రాముడు, కృష్ణుడు, దేవుడు, భీముడు ఏమీ లేవు. కర్త ఒక్కమాట. కర్త అనేటువంటి శబ్దం బ్రహ్మసూత్రాలలో ఉన్నటువంటి నివిడీకృతమైనటువంటి ఒక అంతర్గత మార్మిక రహస్య స్థావరం అది స్థాయి అది.కర్త అనగలిగి ఉన్నదంతా కర్తే, కర్త మనం కాదు కర్మ చేసే వాళ్ళం మనం. కర్త ఎవడో ఉన్నాడు వాడెవడు? "ఏతద్ అధిష్టాతః" ఎవడో యజమానుడైన అష్టమ తనువు వాడు అన్నారు విశ్వనాథవారు. ఎనిమిదో వాడు ఎవడంటే వాడి పేరు ఆత్మాను, దైవమను నీకిష్టమైనట్లయితే. అలాగే భగవాన్ని మహా పండితుడు అడిగాడు "According to you what is the definition of god?" భగవంతుడు అంటే మీ దృష్టిలో ఎవరు? అంటే, "భగవంతుడా It is a great force and a feeling" అన్నారు. అండ్ "The force and the feeling are within at times without" అన్నారు. at times without ప్రకృతి. వ్యక్తి అభివ్యక్తమైతే ప్రకృతి. పరమేశ్వరుడి యొక్క దివ్య శక్తి సంకల్పం పరమేశ్వరుడు ఉన్నాడన్న అంటున్నావయ్యా, కర్త అంటున్నావ్ వాడెవడో బ్రహ్మం అంటున్నావ్. వాడు ఉన్నాడు అనటానికి నిదర్శనం ఏమిటంటే భగవాన్ని అడిగారు. భగవాన్ మీరు దైవాన్ని చూశారా? చూశానన్నారు. మాకు చూపించగలరా? అన్నారు. నువ్వు చూడగలిగితే నేను చూపిస్తానన్నారు. వీడు చూడలేడు ఎందుకంటే కనిపించేవాడు మన దృష్టిలో భగవంతుడు కాదు, కనపడని వాడిని పట్టుకోలేము. కాబట్టి ఏతావాతా మనం భగవంతుణ్ణి చూడం, అది జరిగేది. ఉన్నవాడు భగవంతుడు అనుకోగలగటమే ఉత్తమ స్థితి అందుకే ప్రతిమ లో నుంచి బొమ్మలో నుంచి బ్రహ్మ లోకి వెళ్ళాలి అని ఉపనిషత్ వాక్యం. అలాగే కాయకంఠులు ఒక మహా పండిత స్థాయికి చెందితే సూరి నాగమ్మ ఆంధ్రదేశపు ఒక ఆడపడుచు. ఆమె బాల వితంతువు అయితే. ఎనిమిదేళ్ళకి పెళ్ళవగానే ఆమె భర్త పోయినాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ అన్నగారు డి.ఎస్.శాస్త్రి అని తన చెల్లెల్ని అరుణాచలంలో ఉండమని చెప్పాడు. నువ్వు అక్కడ ఉండు అన్నాడాయన. అక్కడ ఉన్నది ఆమె. చాలా కాలం ఉన్నది. ఉంటే ఆమె చేసే పని ఏమిటంటే భగవాన్ ఎవరితోనైనా మాట్లాడుతుంటే చక్కగా నోట్బుక్ లో రాసేది సంభాషణలు. సరే మామూలుగా ఆశ్రమాల్లో చిన్న ప్రమాదం ఉంది. ప్రమాదం ఏమిటంటే మనం ఆశ్రమంలో inner circle లోకి వెళుతున్నప్పుడల్లా అక్కడున్న వాళ్ళు మనల్ని బయటికి నెడుతూ ఉంటారు. మనల్ని లోపలికి రానివ్వరు. అది ప్రతి ఆశ్రమానికి ఉన్న ఒక దుర్లక్షణం అది. లోపలికి-- ఎందుకని? వాళ్ళకి భయం. place లో మనం వెళ్ళిపోతామేమో అని. మనకసలు అది అక్కర్లేదు. మనం లోపలికి ఎందుకు వెళుతున్నాం అంటే మూలంలోకి, స్థితిలోకి వెళ్లి హాయిగా ఉందామని. అక్కడికి వెళ్లి మళ్ళీ ఇంకేవో కార్యకలాపాలు చేయాలని ఎవడికీ ఉండదు. కానీ లోపల ఉన్నటువంటి వాడు అతి సన్నిహితంగా ఉన్న వాడికి నిరంతరము భయం ఏమిటంటే నాకంటే అధికుడు అక్కడొస్తే మనం ఇక్కడ ఉండవేమో, పోతావేమో. అదే జరిగింది. ఒకరోజున ఆమెని పిలిచారు. భగవాన్ భక్తులతో మాట్లాడే ఏవీనూ వ్రాయటానికి వీల్లేదు అన్నారు. ఆమె అవుదల దాల్చింది, శిరస్సు వంచింది. భగవాన్ కి నమస్కరించుకుంది. భగవాన్! నీ మాటల నుంచి నేను దూరమవుతున్నానా? నే చేసుకున్న పుణ్యం ఇంతటితో అయిపోయిందా? నాకింక యోగ్యత లేదా? అనుకుంటూ నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయింది. ఆమె ఆశ్రమానికి బయట గదిలో ఉంటే భగవాన్ మాట్లాడిందే తక్కువ కానీ మాట్లాడ-- అసలు మాట్లాడలేదనేది ఏం లేదు, మాట్లాడారు. భగవాన్ ఇక్కడ భక్తుడు వేసిన ప్రశ్న, ఇక్కడ భగవాన్ ఇస్తున్నటువంటి సమాధానం సుమారుగా ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న సూరి నాగమ్మ చెవిలో పడ్డాయి, పడేవి. అవన్నీ రాస్తే అవే సూరి నాగమ్మ లేఖలుగా భగవాన్ యొక్క దివ్య తత్వ విచారణకి ఆధారభూతమైనవిగా వీళ్ళ ప్రామాణికంగా నిలిచినాయి. కాబట్టి భగవంతుడికి మనం చాలా దగ్గరగా ఉన్నామనే వాడు చాలా దూరంగా ఉంటాడు. ఎందుకంటే వాడు భగవంతుణ్ణి మామూలు మనిషిలా చూస్తాడు. భగవంతుడికి అతి దూరంగా ఉన్నటువంటి వాడు భగవత్ తత్వాన్ని అనుభవిస్తాడు. ఆయన పాలు తాగారా, గడ్డం గీసుకున్నారా, భోంచేశారా ఆయనకి సంబంధం లేదు. జ్ఞాని స్థాయిలో దగ్గరగా ఉన్నా అటువంటి స్థాయిలో ఉండాలి తప్ప దైవంలో మానవ-మానవ స్థితిని చూడకుండా మానవ ఆకారంలో ఉన్న దివ్యత్వాన్ని అనుభవించటం గురువు యొక్క అనుగ్రహం గనక ఉంటే దొరుకుతుంది అని మనకి లెక్క. ఒకసారి రమణాశ్రమం మీద దొంగలు దాడి చేశారు. దొంగలు దాడి చేసినప్పుడు ఆశ్రమంలో ఉన్న వాళ్ళందర్నీ రాత్రిపూట కొట్టారు. సరే మరనాడు అందరూ లేచారు. అక్కడ ఏం-ఏముంటుంది దోచుకు వెళ్ళటానికి? ఏం లేవు. ఉన్నవేవో కేసరి, ఉప్పు, పప్పు పట్టుకొని వెళ్ళిపోయారు. అందరూ వచ్చి భగవాన్ దగ్గరికి అంటే గురువుకి చమత్కారం కూడా ఒక కళ. చమత్కారంలో గంభీరమైన సన్నివేశాన్ని ఆహ్లాదపరుస్తాడాయన. భగవాన్, రాత్రి చూడండి మమ్మల్ని ఇలా దొంగలు దెబ్బలు కొట్టారు, దెబ్బలు వేశారు. రాత్రికేదో రక్షణ పెట్టుకోవాలి అంటే, నాక్కూడా బడిత పూజ అయిందయ్యా. నన్ను వాళ్ళేం వదిలిపెట్టలేదు. కాకపోతే తగినట్టు మీకు బాధ ఉన్నది ఎవరినో కొట్టినట్టుగా ఉంది నాకు అన్నారు. దేహాత్మ భావన దాటిన జ్ఞాని యొక్క లక్షణం. నన్నెవరూ కొట్టలేదు, నన్నెవరూ కొట్టలేరు అనలేదు. నన్నూ కొట్టారన్నారాయన. అది ఒక మానవీయమైనటువంటి స్థితి. ఇందులో hypocrisy ఉండటానికి వీల్లేదు. మనం మన-మనంగా, స్వచ్ఛంగా, అచ్చంగా మనకేం తెలుసో తెలిసినట్లే ఉండాలి. మనకేం తెలియదో ఖచ్చితంగా తెలియనట్లు ఉండాలి. తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాని పేరే సాధన. సాధనా స్థితిలో భగవాన్ చరిత్ర చాలా అఖండము, అనంతమైనటువంటి చరిత్ర కాబట్టి భగవాన్ గురుతత్వంలో ఏమి బోధించటానికి వచ్చారు అని. కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు మూడు భిన్నం కాదని, కర్మలేని భక్తి, భక్తిలేని కర్మ రెండూ జ్ఞానంతో చేయకపోయినట్లయితే పనులు పూర్తి కావని, మూడు స్థితులలో సంచారం చేయవలసి ఉన్నదని, భగవద్గీతా సారాన్ని రమణ గీతగా కేవలం నలభై మూడు శ్లోకాలకు కుదించి, నలభై మూడు గనక పూర్ణంగా అధ్యయనం చేసినట్లయితే.గీతాచార్యుడు అయినటువంటి యోగేశ్వర కృష్ణుడి యొక్క జ్ఞాన యోగ స్థితి నీకు అర్థమవుతుంది అని మన కోసం ఆయన పేర్చి దాన్ని అందించారు. అలాగే మురుగనార్ అనబడేటువంటి ఒక మహాకవి తమిళ భాష అన్నా తమిళ వాఙ్మయం అన్నా తమిళ లిపి అన్నా తమిళ అనే మూడు అక్షరాలు చెవిర పడగానే పరవశం అయిపోయేటువంటి వాడు భగవాన్ దగ్గరకు వచ్చాడు. వచ్చి అన్ని నెమ్మది నెమ్మది నెమ్మదిగా పోగొట్టుకున్నాడు చివరికి మిగిలాడు. ఒక్కసారి అనుభూతి సారము అని ఒక పుస్తకాన్ని రాశాడు ఆయన. తీసుకెళ్లి భగవాన్ కి ఇచ్చాడు. భగవాన్ దీంట్లో ఏదన్నా తప్పులుంటే కాస్త పరిష్కారం చేసి ఇవ్వండి అని. సరే చూశారు. ఇది అనుభూతి సారం కాదప్ప ఇది ఉపదేశ సారము అన్నారు. ఉపదేశ సారమే ఇవాళ పారాయణార్హమైంది. కర్తు రాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అంటూ కర్తతో ప్రారంభించి చిట్టచివర దాకా ఒక్కొక్క సోపానాన్ని సాధకుడు ఎట్లా ఎక్కుతూ వెళ్ళాలి. పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి అన్న శంకర భగవత్పాదుల ప్రామాణికమైనటువంటి వాక్యానికి అలాగే గీతా సారానికి ఒక fine tuning లాగా ఉపదేశ సారాన్ని ముప్పై శ్లోకాలలో భారతీయ భారత జాతికి అందించారు భగవాన్ రమణ మహర్షి. దానిలో లేని విచారణ లేదు. పూజలు వద్దు, జపాలు వద్దు, భజనలు వద్దు, ధ్యానాలు వద్దు అని చెప్పలేదు. కానీ పూజ కంటే జపం, జపం కంటే తపం, తపం కంటే ధ్యానం, ధ్యానం కంటే ఆత్మనిష్ఠ, ఆత్మనిష్ఠ కంటే ఆత్మవిచారం, ఆత్మవిచారం కంటే నేనెవర్న్న ప్రశ్నకి సమాధానం పొందటమే తురీయమైనటువంటి స్థాయి అని ఒక జ్ఞానాధిక్యమైనటువంటి స్థితిలో జాతికి ఒక ప్రబోధం చేశారు భగవాన్. రాజేంద్ర ప్రసాద్, జమునాలాల్ బజాజ్ వంటి దేశభక్తులు ఆయన దగ్గరకు వెళ్లి, భారత జాతి ఇంకా దాస్యం నుంచి బయట పడదా? దీనికి మేమేం చేయాలి? అని అడిగినప్పుడు ఎవరు కావాలని సంకెళ్ళు వేసుకున్నారో, ఎవరు స్థితిని ప్రారబ్ధవశాత్తు కొంతకాలం అనుభవించవలసి ఉన్నదో వారే వాటిని విడదీసుకోగలరు, విప్పదీయగలరు. మనం మౌనంగా ఉండటమే మంచిది అన్నారు. మనం అనుకుంటాం జాతిని జాగృతం చేసి, జాతిని ఒక తాటి మీద నడిపి అది ఉద్వేగం. ఉద్వేగభరితమైనటువంటి భావాలు జాతికి ఎప్పుడూ మంచివి కావు. ఒక సరళమైన, తార్కికమైన, విజ్ఞతతో కూడిన, జ్ఞాన పుంజితమైనటువంటి ఒక భావన ఎక్కడ ఉన్నదో అది చాలా పరమ పవిత్రంగా, పరమ శక్తివంతంగా ఉంటుంది గనుక ఎక్కడ శక్తి దాగి ఉన్నది అంటే మౌనంలోనే మహిత శక్తి దాగి ఉన్నది. కనుక భగవాన్ మాట్లాడలేదన్నది కాదు, అవసరమైనవే మాట్లాడారు, అక్కరకొచ్చేవి మాట్లాడారు, ఎప్పుడు ఏం మాట్లాడాలో అంతే మాట్లాడారు. ఏది మాట్లాడినా చిట్టచివరికి నేనెవర్న్న ప్రశ్న దగ్గరకు వెళ్లి ఆగమన్నారు. అక్కడే నిలకడ చెందాలి. మీవెవర్న్న ప్రశ్నకి నేను పుస్తకం రాయగలను. ఎవడి మీదో రెండొందల పేజీలు రాయగలను. నన్ను పిలిచి మీ గురించి కాస్త నాలుగు మాటలు చెప్పండి అంటే నాకేం తెలియదు. కారణం ఏంటంటే నన్ను గురించి ఎవడో తెలుసుకుంటున్నాడు, నేను ఇంకెవరినో గురించో తెలుసుకుంటున్నాను కానీ నన్ను మాత్రం నేను ఎన్నడూ గమనించుకోలేదు. సర్వ ప్రపంచానికి దీపావళి పండుగనాడు ఒక కారు నిండా స్వీట్ ప్యాకెట్లు పెట్టి అందరికీ ఒక్కొక్క ఇంటికి వెళ్లి పంచిపెట్టి వస్తాం. అంతా ఖాళీ అయిపోతుంది. మరి ఇవాళ ఏం చేశావు అంటే అందరినీ కలిసి వచ్చాను అన్నా. భగవాన్ అన్నారు, నిన్ను నువ్వు ఎప్పుడన్నా కలుసుకున్నావా? సమయం లేదు. మనల్ని మనం కలుసుకునే సమయమే బ్రాహ్మీ ముహూర్తం. ముహూర్తంలో ప్రపంచానికి మనం అక్కర్లేదు. మనకు కూడా ప్రపంచం అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు లేవలేదు, అదృష్టవశాత్తు మనం లేచి ఉన్నాం. లేచి ఉన్న సమయంలో ఏం చేయాలి? యోగ భూమికలో నిలకడ చెందాలి. ధ్యానైక స్థితిలో ఉండాలి. ధారణ స్థితిలో అనేకమైన జన్మ జన్మాంతరమైన వాసనలన్నీ కొట్టుకొని వస్తుండగా సాక్షిభూత స్థితిలో దానిని చూట్టం నేర్చుకోవాలి. ప్రాపంచికమైన గోడ మీద రాసినటువంటి మోరల్ ఫిలాసఫీ ఒక ఎత్తైనట్లయితే నిన్ను నీవు తరచి చూసుకొని, సెల్ఫ్ ఆడిట్ చేసుకుని, సెల్ఫ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకున్నట్లయితే నేను వేళ నా బ్రతుకును నేను ఎట్లా బతికాను తెలుసుకోగలిగితే నేను జ్ఞానిని. ఇవాళ ఏదో అయిపోయింది రేపు చూద్దాం కుదరనే కుదరదు. పూట ఇహమేవా నౌ అండ్ హియర్. ఇప్పుడే ఇక్కడే దీన్ని మనం తెలుసుకోవాలి. మనలో ఏది లేదో, మనకు ఏం కావలసి ఉన్నద-ఉన్నదో దాన్ని రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇటువంటి కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని నాయనా అని అనిపించుకున్న వాడు ఖరగ్ పూర్ కు వెళ్లారు ఆయన. ఆయన శరీరం వదిలిపెట్టారు. భగవాన్ రమణ మహర్షి దగ్గరకు ఒక తంతి వచ్చింది, టెలిగ్రామ్. దాన్ని చూశారు. నాయన వంటి వాడు మళ్ళీ పుడతాడా? అని కాగితం పక్కన పడేశారు. పక్కన ఉన్న వాళ్ళంతా అడిగారు, కందస్వామికి మీ తల్లి అడగమ్మకి ఇచ్చినట్లుగా కావ్యకంఠులకు కూడా ఉద్ధారణ మీరు ఇచ్చారా? అని అడిగారు. వాసనలు బలవత్తరంగా ఉన్నప్పుడు గురువు నిస్సహాయుడు అన్నారు. అది. అద్భుతమైన మాట. వాసనలు బలవత్తరంగా ఉన్నట్లయితే పరమాత్మతో మనం కూడి ఉన్నా పరమాత్మ ఉద్ధారణ ఇవ్వడు. ఎందుకంటే జీవుడు తన వాసనలను తానే స్వీయ సాధనలో, స్వాధ్యాయంలో, సద్గోష్ఠిలో, సదాచారంలో, సమ్యక్ సంకీర్తనలో, సత్సంగంలో, సత్సాంగత్యంలో దానిని వదుల్చుకుంటూ పరిపూర్ణమైనటువంటి భావనా స్థితిలోకి తాను చేరవలసి ఉన్నది గనుక ఇక్కడ గురువు ఒక క్యాటలిస్టు మాత్రమే. అందుకనే పాలున్నాయి, బ్రహ్మాండమైన పాలు, బాగా మరగ కాచాం, పెరుగు కావాలి ఏం చేస్తాం? పెరుగు తెచ్చి దాంట్లో పోస్తామా? ఒక చిన్న తోడు చుక్క పెడతాం. పెట్టి దాంట్లో తిప్పగానే మన ప్రమేయం లేకుండా తెల్లవారేప్పటికి పెరుగు తయారవుతున్నది. గురువు యొక్క స్థితి కూడా అంతే.గురువు ఒక చలిమంట లాంటివాడు. మంట లోపలికి వేలు పెడదామని ప్రయత్నిస్తే అన్నీ కాల్చినట్టే అది కూడా కాల్చుతుంది. మరీ దూరంగా వైదొలగితే గురువు ఆవరణం నుంచి వైదొలుగుతాం. Electro Magnetic Field నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆకర్షణావలయం నుంచి పతనం చెందుతాం గనుక నిరంతరము ఒక భావనా భూమికలో, గురు తలపులో, గురు స్మరణంలో, గురు స్మృతిలో, గురు భావనలో మనం మనస్సును నిలకడ చెందించు ఉండాలి. దాన్నే శంకర భగవత్పాదులు "యోగరతోవా భోగరతోవా సంగరతోవా విషయరతోవా యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా" యస్య బ్రహ్మణి నువ్వు యోగంలో ఉండు, భోగంలో ఉండు, ప్రపంచంలో ఉండు ఎక్కడైనా ఉండు అనుసంధానం కావలసింది ఆత్మానుసంధానం బ్రహ్మతో చేయాలి, బ్రహ్మముతో చేయాలి. ఆంధ్రదేశాన్ని స్త్రీవాదంతో ఒక ఊపు ఊపినటువంటి చలం చింతా దీక్షితులు అనబడేటువంటి స్నేహితుని కారణంగా అరుణాచలం చేరుకున్నప్పుడు అరుణాచలం లో చలం పెట్టిన ఒక condition "నేను ఈయనకు నమస్కరించను. నమస్కరించమని మాత్రం నాకు చెప్పకు. ఎందుకంటే నేను ఎవరికీ నమస్కరించలేదు, పైగా ఇటువంటి వాళ్ళకి నేను నమస్కరించను" అన్నాడు. దీక్షితులు మాటన్నాడు "సముద్రం దాకా నిన్ను తీసుకెళ్లటమే నా పని. నువ్వు సముద్ర స్నానం చేస్తావా? సముద్రమే వచ్చి నిన్ను తడుపుతుందా? నాకేం తెలుసు? అక్కడి దాకా తీసుకెళ్తున్నా. నా పని అయిపోయింది" అన్నారు. భగవాన్ అరుణాచలం నుంచి కిందకి దిగి వస్తున్నారు. అందరూ బారులు తీర్చి ఉంచుతున్నారు. చలం చింతా దీక్షితులతో మాటన్నాడు. "భగవాన్ భగవాన్ అంటున్నావు కదా! నా మనసు ఎరిగిన వాడు గనుకైతే నా వైపు చూడాలి. నాతో మాట్లాడాలని మాత్రం అనుకోలే. ఎందుకంటే ఆయన ఎవరితోనూ మాట్లాడటం లేదు కాబట్టి. నావైపు చూడాలి అనుకున్నాను. "అవేం పెట్టుకోకోయ్. అలా ఉండు హాయిగా. ఆయనే మాట్లాడతారు" అన్నాడీయన. ఆయన నెమ్మదిగా చలాన్ని దాటి నాలుగు అడుగులు ముందుకు వేశారు. "తెలిపోయిందిగా ఈయన దేవుడు కాదని" అన్నాడు చలం. అదే సమయంలో భగవాన్ ఇలా వెనక్కి తిరిగి చలాన్ని చూశారు. చలం క్షణాన్ని వర్ణిస్తాడు. "జన్మ జన్మాంతరంగా పాతాళ దగ్ధంగా ఉన్నటువంటి నా మూల వాసనలన్నీ సమూలంగా ఆవిరైపోయి, నాలో ఉన్న సర్వ మనోవికారాలు నశించి, చిత్తవృత్తులు దగ్ధమై, ఏకకాలంలో మహా యోగ నిర్వాణ స్థితిలోకి ఒక్క భగవాన్ చూపు తీసుకువెళ్లిందే! ఎందుకు దీన్ని పోగొట్టుకున్నాను? జాతిని నేను రకంగా ఉద్ధరించాలనుకున్నాను? దారి తెలియనటువంటి, దారి తప్పినటువంటి ఒక జీవుడికి ఉద్ధారణ మార్గాన్ని ఒక్క చూపుతో అనుగ్రహించారే! నువ్వు నిజంగా భగవాన్ వి" అని రాసుకుంటాడు. అలాగే అరుణాచలం లో ఇట్లాగే ఒక సాయంకాలం, సంధ్యా సమయం, ఇదంతా సత్సంగ వేళ, పరమ పవిత్రమైనటువంటి వేళ. అందరూ కూర్చుని ఉన్నారు. ఆయన couch మీద కూర్చున్నారు. ఒక Modern Young Lady Chennai నుంచి వచ్చింది. పెద్దాయన పక్కన చోటు చూసుకుని కూర్చుంది. మొదటి రోజు చాలా అసహనంగా, చికాకుగా ఉంది. రెండో రోజు మరింత అసహనంగా ఉన్నది. మూడో రోజున పెద్దాయనను పలకరించింది. "ఏం మాట్లాడ్డే! మీరు ఉన్నారన్నటువంటి సంస్కారం కూడా లేదా ఈయనకి. మీకేం కావాలి అని అడగనే అడగడే. ఎందుకండీ ఆయన దగ్గర కూర్చున్నారు? పైగా కౌపీనం తప్ప ఒంటిమీద ఏం లేదు. ఈయన మహా ఆహ్ పరదైవం అని మీరు ఎట్లా భావిస్తున్నారు?" అని ఒక ప్రశ్న వేసింది. ఈయన సమాధానం చెప్పలే. ఆరోజు సాయంకాలం ఈమె కంటే ఆయన తండ్రి వయసు వాడు గనుక "బాబా" అంటే తండ్రి, "మీ Cottage దాకా వచ్చి మిమ్మల్ని దింపాలని నాకున్నది" అనగానే "అలాగే" అన్నారీయన. "Cottage దగ్గర దింపాక వెళ్లిపోదామని అనుకున్నాను గానీ రేపొక్కరోజు చూస్తా" అన్నది. "చూడు" అన్నారు. ఏం చూడదలుచుకున్నదో తెలియదు. మరనాడు భగవాన్ మాట్లాడలే. పెద్దాయనతో ఈమె అడిగింది. ఏమనంటే "ఈయనని దేవుడు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావ్? మీరంతా ఎందుకు అనుకుంటున్నారు?" అని. Any human is mostly inhuman. At the most half human. He is, it is totally humane. That is why it is a divine. అందుకని ఇక్కడ కూర్చున్నాం అన్నారు. అంటే సహజంగా మానవుడిలో మానవత్వము, దానత్వము, దీనత్వము, దివ్యత్వము నాలుగు భాగాలుగా ఉంటుంది. నాలుగోది పట్టుకోలేం, మూడు గాఢంగా ఉంటాయి. నాలుగోది Subtle గా ఉంటుంది. కానీ ఈయన కూర్చున్న ఆయన పరిపూర్ణమైనటువంటి మానవతా పరిమళమే సాకారమై కూర్చున్నది గనుక ఈయన భగవాన్. అందుకే దేవుడు అన్నారు. అడిగింది The First Feminist of India చంద్రలేఖ. సమాధానం ఇచ్చింది హరీంద్రనాథ్ చటోపాధ్యాయ. అలాగే రోజుల్లో భగవాన్ దగ్గరికి అనేక మంది Foreigners వస్తూ ఉండేవారు. ఒక Foreign country లో specially England అటువంటి చలి ప్రదేశాల నుంచి అరుణాచలానికి వస్తే అక్కడ తట్టుకోవటం చాలా కష్టం. వాళ్ళ యందున్నటువంటి అమిత అభిమానంతో, జాలితో "అయ్యో పాపం కష్టపడుతున్నారే!" అని భగవాన్ ని ఒకరోజు అడిగారు. ఇక్కడ ఏముందని 1920 ప్రాంతం గమనించండి. ఏమునుంటుంది అక్కడ? ఒట్టి కొండ, రాళ్ళు తప్ప ఏం లేవు. ఏముందని ఇక్కడికి వస్తున్నారు? వీళ్ళెవరు? అని అడిగారు. అడిగితే "వారంతా అసలు ఇక్కడి వారే. ఒక జన్మలో అక్కడ ఏముందో చూద్దామని తహతహలాడుతూ జీవితాలు వదిలిపెట్టారు గనుక మళ్ళీ తమ స్వస్థానానికి వారు చేరుకున్నారే కానీ వారికి ఇదేమీ కొత్త కాదు. అందుకే ఇక్కడికి రాగలిగారు" అన్నారు. మనం గురువు దగ్గరికి గానీ, పుణ్యక్షేత్రానికి గానీ, ప్రదేశానికి గానీ, ఒక సత్సంగానికి గానీ వెళ్లగలుగుతున్నాము అంటే మనకి ఇక్కడ ఏదో రాసిపెట్టి ఉన్నదన్నమాట. లేకపోతే ఇక్కడికి రాము. ఎందుకొస్తాం?అందరూ రాగలుగుతారా? రాలేరు. కొందరే ఎలా రాగలిగారు? ఇక్కడ ఏదో ఉన్నది. ఏమున్నది ఇక్కడ? తపస్సు ఉన్నది, వాఙ్మయ తపస్సు ఉన్నది, యజ్ఞం ఉన్నది, పరమేశ్వరుడి గురించినటువంటి కొన్ని దశాబ్దాలుగా సాగుతున్నటువంటి ఒక మహా నిరంతర యాగం ఉన్నది. అది అనాహతంగా ఉన్నది, అఖండంగా ఉన్నది. అటువంటి భగవాన్ ఎవరైనా సరే పాంచభౌతిక దేహాన్ని తీసుకుని వచ్చినప్పుడు దేహాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టే సమయానికి ముందు సుమారుగా forty eight, nineteen forty eight ప్రాంతంలో వారికి సార్కోమా అనేటువంటి cancer భుజం మీద ఏర్పడినప్పుడు చూసే వాళ్ళకి చాలా బాధ కలిగేది. "భగవాన్! చూస్తుంటేనే మాకు బాధగా ఉందే, మా అందరి కష్టాలు తీర్చిన మీరు ఒక్కసారి సంకల్పించుకొని పుండుని మాయం చేసుకొని మీరు ఆనందంగా ఉండవచ్చు కదా, మాకు ఆనందాన్ని ఇవ్వవచ్చు కదా?" అనంటే భగవాన్ ఒక మాటన్నారు: "నిజమే! సంకల్పించటానికి మనస్సు కావాలి కదా. మీ అందరి దగ్గర మీ మీ మనస్సులున్నాయి, మీకు బోలెడు సంకల్పాలున్నాయి. ఇక్కడ మనస్సే లేదే, దేనితో సంకల్పించను. కాబట్టి మీరు అందరూ వచ్చినప్పుడు ఒక్కరినీ మీరు రవరమ్మని నేను పిలవలేదు, వచ్చిన ఒక్కరినీ ఇక్కడి నుంచి వెళ్ళమని అనలేదు. వారు అలాగే వచ్చారు, వారిని అట్లాగే ఉండనివ్వండి." ఏది? cancer ని 'వారు' సంబోధన చూడండి. అలాగే చమత్కారంగా ఒకటి రెండు సన్నివేశాలలో శాంతమ్మ అని ఒక వంట ఆమె. రోజు భగవాన్ చేతులు కడుక్కుంటుంటే పట్టుకుంది. దగ్గరికి వెళ్ళి, "భగవాన్! ప్రతిరోజూ నేను ముప్పై రెండు సంవత్సరాలయింది రమణాశ్రమంలోకి వచ్చి. ప్రతిరోజూ లోపలికి వచ్చిన ప్రతి వాళ్ళు 'ఇవాళ భగవాన్ అది చెప్పారు, ఇది చెప్పారు, ఇది చేశారు, అది చేశారు' అని తలచుకొని, తలచుకొని ఆనందంతో ఊగిపోతూ ఉంటారే, నా జీవితమంతా వంట చేయటం, వడ్డించడమేనా భగవాన్?" అని అడిగితే చేతులు తుడుచుకుంటూ భగవాన్ అన్న మాట మన బోటి వాళ్ళకి హెచ్చరిక. "శాంతమ్మ! నువ్వు అలా అనుకుంటున్నావా? పాపం భగవాన్ ఏం చెప్పారో, ఎవరితో ఏమన్నారో, ఎవరెవరికి ఏమేమిచ్చారో అన్న ఆలోచనలతో నీ మనసంతా నా మీదుంటే, నా చుట్టూ ఉన్నవారంతా 'ఇవాళ శాంతమ్మ ఏం కూర చేసిందో, సాంబార్ ఎలా పెట్టిందో, ఏ-ఏ రకంగా ఉన్నదో' అని వారి మనసంతా వంట మీదున్నది. నిజంగా నీవే అదృష్టవంతురాలివి." చమత్కారం చూసారా? అయిపోయింది. పరమ చరమ ఘట్టం వచ్చేసరికి మాధవ అనేటువంటి వా-పరిచారకుడు దగ్గరకు వచ్చాడు. క్యూ కట్టి ఉంది. ఇంకా భగవాన్ ఉండరు అని తెలిసిపోయింది. ప్రార్థన చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నారు. వారు దివ్య జ్యోతి వలె వెలిగిపోతున్నటువంటి సన్నివేశంలో ఇంకొక్క రెండు నిమిషాలలో తమ దేహాన్ని వదిలిపెట్టే సమయం ఆసన్నమైనప్పుడు జ్ఞాని స్థితి చూడండి. ఎక్కడో కాంపౌండ్ వాల్ దగ్గర, గేటు దగ్గర ఉన్నటువంటి మాధవ స్వామిని ఇటువంటి పరిస్థితి ఇంకా రెండు, మూడు నిమిషాల టైమే ఉంది. చెయ్యెత్తి ఇట్లా పిలిచారు. అతనికి తనను తాకి పిలిచినట్టు అనిపించి పరుగు పరుగున భగవాన్ కి అవసరం ఏమిటో అనుకుంటూ వచ్చాడు. "రేపటి నుంచి దుప్పటి మార్చవలసిన అవసరం లేదు." అనగానే "భగవాన్ అయితే అందరూ అంటున్నట్లుగా మీరు ఉండటం లేదా?" అన్నారు. "నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఇక్కడే ఉంటాను. నేను ఆత్మ. వెళ్ళేది దేహమే." రమణ మహర్షి యొక్క దేహము సమాధి గతమై ఉండవచ్చు గాక, రమణ మహర్షి యొక్క దివ్య శక్తి, ధీశక్తి, జ్ఞాన శక్తి, అఖండ చిద్ఘనమైనటువంటి పరమాత్మ శక్తి ప్రపంచాన్ని అరుణాచలం నుంచి అన్నివేళలా అది నడిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే భగవాన్ రమణులు తమ దేహాన్ని వదిలిపెట్టినప్పుడు nineteen fifty April fourteenth, రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకి పరమాచార్య ఒక్క మాటన్నారు: "ఈ క్షణం నుంచి యాభై సంవత్సరాల తర్వాత" అంటే nineteen fifty plus fifty years, రెండు వేల సంవత్సరం నుంచి "సమస్త ప్రపంచము కూడా రమణుల యొక్క తత్వ విచారణలో జీవితాలు కొనసాగిస్తాయి" అని పరమాచార్య యొక్క శాసనమది. నిజానికి రమణ మహర్షి యొక్క తత్వ విచారణ సత్య సాయి Organization లో ప్రారంభమైనటువంటి తొలి ఘట్టము రెండు వేల సంవత్సరంలోనే అదే శ్రీ సాయి రమణీయమై వచ్చింది. All gurus are one but all are not gurus. గురుతత్వంలోకి వెళ్ళాలి, గురుబోధలోకి వెళ్ళాలి. వాళ్ళ జీవితాలను అధ్యయనం చేయాలి. మనం రమణ మహర్షి అయిపోకూడదు, కాకూడదు. ఆయన ఆయనే, మనం మనమే. మార్గాన్ని ఎంచుకొని జన్మని ఎత్తినందుకు షడూర్మములతో, షడ్వికారములతో, షడ్వర్గములతో, కాల, కార్య, కారణ, కర్తవ్య నిమిత్తమై వచ్చినటువంటి జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి జ్ఞాన శిఖరాగ్ర స్థాయికి తీసుకు వెళ్ళవలసినటువంటి అవసరం మనకున్నది. జ్ఞాన పిపాసులైనటువంటి వారంతా కూడా అరుణాచలాన్ని దర్శనం చేయండి. ఎందుకు చేయాలో చెప్తాను. సాక్షాత్తు సర్వదేవతా అతీత స్వరూపమైనటువంటి సత్య సాయి భగవానుడే 1940 మే 23న నేను సాయిబాబాను అని ప్రకటించి 1940 అక్టోబర్ 20వ తారీఖున తన అవతార కార్యక్రమాన్ని జగత్తుకి ప్రకటన చేసిన తర్వాత రెండు సంవత్సరాలకి అంటే 1942 ప్రాంతంలో తిరువణ్ణామలైకి స్వామి వెళ్లారు. స్వామి వెళ్ళినప్పుడు స్వామి, రమణులు కేవలం పదిహేను నిమిషాలు మాట్లాడుకున్నారు. పదిహేను నిమిషాలలో ఏం మాట్లాడుకున్నారు మనకక్కర్లేదు. ఇద్దరు మహా యోగులు, ఇద్దరు మహా పూర్ణ పురుషులు ఒక కాలంలో సంభవించటం అది స్వర్ణయుగం. ఎట్లాగంటే దక్షిణాదిన దక్షిణేశ్వరంలో ఒకపక్కన రామకృష్ణ గురుదేవులు.శృంగేరి లో చంద్రశేఖర భారతి స్వామి వారు, కంచిలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, పాండిచ్చేరి లో అరవింద యోగి, ది మదర్, తిరువణ్ణామలై లో రమణ మహర్షి. ఏకకాలంలో అవని సంచారం చేసినటువంటి ఒక సువర్ణ ఆధ్యాత్మిక ఘట్టం భారతదేశం అనుభవించింది. అనేక కోణాలు ఒక సుదర్శన చక్రానికి ఎన్ని పళ్ళు ఉన్నాయో, ఒక్కొక్క గురువు యొక్క తత్వం ఒక్కొక్కటి. గురువుని ఇంకో గురువుతో పోల్చకూడదు. అందుకే ది మదర్ పాండిచ్చేరి లో ఒక మాట అన్నది. A-a "A real spiritual seeker is not expected to pronounce on the other. At the most they may study them and draw inspiration from their way of living" అంతే. వాళ్ళ జీవన విధానంలో నుంచే స్ఫూర్తిని పొందాలి. కానీ, నీ గురువు యందు మాత్రమే నీ మనస్సుని లగ్నం చేసి ఉంచాలి. గురువు సాకారమై, స్వరూపమై, నీతో సాలోక్య, సామీప్య, సాన్నిధ్యములు అనుగ్రహించి, నిన్ను సన్మార్గంలో పెట్టి, అధ్యాత్మ శిఖర స్థాయికి చేర్చేటువంటి ఒక ప్రయత్నము, అనుగ్రహము, వర్షించాడో గురువులో సర్వ దేవతలని, సర్వ గురువురని, సర్వ జీవురని, సర్వ ప్రాణులని, సర్వ శక్తులని, సర్వ బ్రహ్మమును ఏకకాలంలో అనుభవించగలిగినట్లయితే, అది ఉదాత్త అద్వైత రమణీయ స్థితి కాబట్టి, పూర్ణాద్వైత బోధనలో దక్షిణామూర్తి కేవలం మౌనం వ్యాఖ్య చేస్తే, శంకరులు మౌనాన్ని వీడి అంతా వాంగ్మయమైనట్లయితే, అంటే మౌనం వీడి మాటగా మారి శంకరులైతే, మాటా మౌనము ఘనీభవించిన రమణులైతే, అన్నింటినీ మానవతా పరిమళంతో సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు అనబడేటువంటి ఒకే ఒక్క క్షమా గుణాన్ని ప్రపంచానికి ప్రబోధం చేసిన సర్వదేవతా అతీత స్వరూపులైనటువంటి సత్య సాయి భగవానుని యొక్క దివ్య శ్రీ చరణారవిందాలకు నమస్కరిస్తూ, శ్రీ రమణ స్మరణంతోనే సర్వాంగములు పులకాంకుర ప్రఖరం కావాలని, మన అధ్యాత్మ సాధన తీవ్రతరము, గాఢము, అచ్ఛము, నిత్యము, సత్యము, శాశ్వతము, అఖండము, అనవరతము, నిరంజనము, నికేతనము, నిరుపమానమై కొనసాగుగాక అని అనంత కోటి గురు స్వరూపాలకి ప్రణమిల్లుతూ సాయిరాం. సాయిరాం
SSSMC · audio

Talk on Sri Ramana Maharshi Philosophy - 03

Home

Talk on Sri Ramana Maharshi Philosophy - 03

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 32:37

More in this series

Talks on Sri Ramana Maharshi Philosophy

3 episodes · 1 hr 25 min

  1. 24 min 1

    Talk on Sri Ramana Maharshi Philosophy - 01

  2. 28 min 2

    Talk on Sri Ramana Maharshi Philosophy - 02

  3. 32 min 3

    Talk on Sri Ramana Maharshi Philosophy - 03

    Now playing