Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయీశ్వరం ఆలంబెన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారువిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ భారతీయ గురుతత్వ విచార ధారలో ఇప్పటికీ ఈరోజు కట్టకడపటి రోజు శంకర భగవత్పాదులు భగవాన్ రమణులు రామకృష్ణ గురుదేవులు శారదా మాయి వివేకానంద స్వామి మాతృశ్రీ జిల్లెళ్ళ మూర్తి అమ్మ బహుముఖీనమైనటువంటి అధ్యాత్మ గురువులుగా మార్గోపదేశం చేసేటువంటి మహిత స్వరూపులుగా మనం విచారణ చేస్తూ వచ్చాము. ఈరోజు సర్వదేవతా అతీత స్వరూపులు అవనిపై నడిచిన ఒక బ్రహ్మ పదార్థము సర్వ ప్రపంచాన్ని ప్రేమ సేవ అన్న రెండు భావనలలో ఇముడ్చి మానవ జీవిత పరమార్ధాన్ని మానవజాతికి మహోత్కృష్ట సందేశంగా అందించినటువంటి పరిపూర్ణ ప్రేమావతారి దివ్యావతారి మహిమా స్వరూపులు అయినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి గురించి మాట్లాడుకుందాం. పరిచయం లేని వాళ్ళకి ఆయన సత్యసాయిబాబా. కాస్త పరిచయం ఉన్నవాళ్ళకి సత్యసాయి. ఆయన పరదైవమని ఎరిగిన వారికి స్వామి. ప్రసంగంలో స్వామి అన్న రెండక్షరాలు ఎక్కడ వినపడినా అది కేవలం భగవాన్ సత్యసాయికి చెందినది మాత్రమే. విషయంలోకి వెళ్లే ముందు ఇవాళ వచ్చిన ఉమేష్ చంద్ర గారి గురించి నేను రెండు మాటలు చెప్పాలని అనుకున్నాను. దేశంలో ఆయన చెప్పారు కానీ చాలా క్లుప్తంగా చెప్పారు. మెడికల్ ప్రొఫెషన్ కి ఆదరణ లేని రోజులు, మెడికల్ ప్రొఫెషన్ కి అమెరికాలోనే ఆదరణ ఉన్న రోజుల్లో ఎప్పుడెప్పుడు రెక్కలు కట్టుకొని దేశం వెళ్లిపోదామా అని ఎదురు చూస్తున్న ఒక యువకుడు ఆయన టైంలో. ఒక గురువు ఒక దైవం తన సంక్షేమాన్ని కోరి తన భవిష్యత్తును ఊహించి దర్శించి నువ్వు వెళ్ళవద్దు అనగానే వెళ్ళటం-వెళ్ళకుండా ఉండటం ఎంత గొప్ప విషయం మామూలు విషయమా? డబ్బు కావాలా దైవం కావాలా అంటే డబ్బుంటే దైవాన్ని కూడా కొనుక్కోవచ్చనే రోజులివి. అటువంటి సమయంలో అది మహత్తరమైన త్యాగమే. దానివల్ల దేశం చాలా లాభపడింది. ఒక డాక్టర్ గా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి ఇవాళ అనేకమంది కార్డియాలజిస్టులు దేశంలో ఆంధ్రదేశంలో చాలామంది ఉన్నారు. కానీ రకమైన ప్రచారాన్ని కోరుకోకుండా చాలా నిశ్శబ్ద మహాస్థితిలో తన కర్తవ్యాన్ని తాను మహాఋషి వలె ఆయన కొనసాగించిన తీరు నాకు బాగా తెలుసు. ఎప్పుడైనా ఎవరైనా ఒక పేషెంట్ ను గురించిన ఒక రిఫరెన్స్ ఉమేష్ చంద్ర గారు ఫలానా పేషెంట్ వస్తాడు కాస్త మీరు పంపించండి నేను చూసుకుంటాను. చూసుకోవటం అంటే రోగాన్ని కొనసాగించటం కాదు రోగాన్ని శరీరం నుంచి బయటకు పంపి అతనికి ఒక ఆహ్లాదకరమైన జీవితాన్ని ఇచ్చినటువంటి ఉమేష్ చంద్ర గారికి వారి కుటుంబానికి సత్యసాయి భగవానుడి ఆశీస్సులు పని చేయక ముందే లభించినాయి. ఇప్పుడు మరింతగా లభించాలని వారి వంశం స్వామి చెప్పారు ఎవరు నా సేవలో ఉంటారో వారి తరంతో పాటుగా ఇరవై ఒక్క తరాలను నేను కాచుకుంటాను అన్నారు. అలాగే ఉమేష్ చంద్ర గారి వంశం రాబోయే ఇరవై ఒక్క తరాలు స్వామి ఆవరణంలో స్వామి దివ్య ఆశీస్సులతో నిలిచి పోవాలని కోరుకుంటూ పని స్వామి ఎలాగూ చేస్తారని అనుకుంటూ ఉమేష్ చంద్ర గారికి చాలా ప్రేమపూర్వకమైనటువంటి సాదర పూర్వకమైనటువంటి ఒక చల్లని ఆహ్వానాన్ని పలుకుతూ సాయంకాలం స్వామి స్మరణంలో హాయిగా గడుపుదాం. స్వామి చల్లని చిరునవ్వు తల్లి దీవెనయై తనరారునో స్వామి మెల్లని గమనం మున ఆగామి సంచితములు నెమ్మనగును స్వామి దర్శన స్పర్శన సంభాషణం ములు స్వస్థానత్రయ ప్రస్థాన యానమగునో స్వామి తి అని పిలుపుతో అంగాంగం ముపుల కాంకుర ప్రకరమౌనో అట్టి నా స్వామి రూపు సౌందర్య లహరి అట్టి నా స్వామి తలపు శివానంద లహరి అట్టి నా స్వామి పిలుపు అమదానంద లహరి అట్టి నా స్వామితో చలిమి జన్మ జన్మాల కలిమి ఎన్ని జన్మలు ఎన్ని అవతారాలలో మనం జన్మ ఎత్తి వచ్చామో తెలియదు కానీపరాస్వరూపుడు అయినటువంటి ఒక మహేశ్వరుడికి సమకాలీనుడుగా మన జీవయాత్ర సాగించాం. ఇది ఒక పరమాద్భుత సన్నివేశం. మానవుడికి సహజంగా కంటికి కనపడేవాడు దేవుడు కావటం అంత తేలికైన విషయం కాదు. ఎవడు కనపడడో, ఎవడిని కనిపెట్టలేమో, ఎవడిని అందుకోలేమో వాడు దేవుడు అని భావన. అటువంటిది పరమేశ్వరుడితో కూడి మనం అనేక సంవత్సరాలు అనేక దశాబ్దాలు జీవించాం. ఈయన ఎట్లా పరమేశ్వరుడు అయినారు? ఈయన తత్వం ఏమిటి? సత్య సాయి భగవానుడి యొక్క అవతార పరమార్థం ఏమిటి? దాని వైభవం ఏమిటి? స్వామి యొక్క దివ్య శక్తి ఏమిటి? ఇది తత్వ విచారణలో ఒక భాగం గనుక స్థలీపులక న్యాయంగా కృతయుగంలో గనుక విచారణ చేసినట్లయితే దేవుడు ప్రత్యేకంగా లేడు. త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల ద్వారా మాత్రమే పరమాత్మని అవనీ సంచారానికి రప్పించగలిగింది జాతి. ద్వాపర యుగంలో కేవలము అర్చన, ఆరాధనాది అనేక క్రతువుల ద్వారా మరొక పరమాత్మని జగత్తులోకి తెచ్చుకున్నది జాతి. కృతయుగంలో పరమాత్మ ప్రత్యేకంగా లేడు కనుక అది సత్య యుగమని, మూడు వేదములు ఆధారం చేసుకొని వేదాలు నాలుగు కదా అంటే అది వేదత్రయి. త్రయి విద్య అంటే వేద విద్య. [గొంతు సవరించిన శబ్దం] నిజానికి మూడే సామ, రుక్, యజుహు. నాల్గవది మూడింట్లో చెప్పబడగా మిగిలిపోయినవన్నీ కలిపితే అది అధర్వణ వేదం కనుక మూడు వేదాల కిందే మనం లెక్క పెట్టుకోవాలి. కనుకనే సత్య సాయి భగవానుడి కంటే ముందు త్రేతాయుగంలో అంటే వేదమే రామావతారమై వచ్చింది. అందుకనే వేదం ఏమి చెప్పింది, దానికి మూలం ఏమిటి అంటే ధర్మమే మూలం. ధర్మాన్ని మించి మరొకటి లేదు. కనుకనే శ్రీరామచంద్రుని మనం "రామో విగ్రహ్వాన్ ధర్మః" అన్నాం. ద్వాపర యుగం వచ్చిన తర్వాత అతి విచిత్రంగా సామాజిక నేపథ్యం మారింది. రాజుల ప్రవర్తన మారింది. వాళ్ళ తీరుతెన్నులు మారినాయి. హింసా ప్రవృత్తి విజృంభించి శాంతి ప్రేమలు నశించేటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ రెండు ప్రమాణాలు చేసి వచ్చాడు. "పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం, ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే". మంచి వాడిని కాపాడుకోవాలి, చెడ్డ వాడిని శిక్షించాలి. అది నా కర్తవ్యం. అందువలన నన్ను నేను అన్ని యుగాలలో సృష్టించుకుంటూ ఉంటాను అన్నాడు. అంతే కాదు, ఎప్పుడు సృష్టించుకుంటాడో కూడా చెప్పాడు. "యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం". ధర్మానికి హాని, గ్లాని జరిగినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను అని. ధర్మము అగ్ని కదా, నిప్పు కదా, దానికి చెద పడుతుందా? ధర్మానికి హాని లేదు, గ్లాని లేదు. కానీ ధర్మాన్ని ఆచరించవలసినటువంటి మనిషి గనుక ధర్మం నుంచి, స్వధర్మం నుంచి, ఆత్మ ధర్మం నుంచి వైదొలగినట్లయితే మళ్ళీ పరమేశ్వరుడు సృష్టి యందు ఉన్నటువంటి విశేషమైనటువంటి కరుణా, అనుగ్రహము అనబడే రెండు తీసుకుని ప్రపంచంలోకి వచ్చి మళ్ళీ మానవుడిని ధర్మ మార్గంలో ప్రవేశపెడతాడు కనుక, అందుకై పెట్టాలి కనుక నేను నన్ను నేను సృష్టించుకుంటాను. నా తల్లిదండ్రులను నేను నిర్ణయించుకుంటాను. నేను పుట్టవలసిన ప్రదేశాన్ని నేను ఎంచుకుంటాను. నిజానికి పరమాత్మ స్వరూపానికి పుట్టుక లేదు. దానికి మరణము లేదు. కేవలము దేహము మార్పు చేసుకుంటూ అనేక విలువలని, అనేకమైనటువంటి ధర్మాలని, సనాతనమైనటువంటి ఒక వైదిక ఆర్ష భారతీయ సంస్కృతిని మళ్ళీ సనూతనమైనటువంటి వ్యాఖ్యానం చేయడానికి అనేక మంది అవతారమూర్తులుగా జగత్తులోకి వస్తారు. కనుక ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అట్లా వచ్చాడు. కృతయుగంలో దేవుడు ప్రత్యేకంగా లేడు. త్రేతాయుగం అంతా దేవుడు ఒక్కడే, రాముడు. ద్వాపర యుగం అంతా మరొక పూర్ణ పురుషుడు, ఆయన శ్రీకృష్ణుడు. ఇదిగో కలియుగం రానే వచ్చింది. ఇది ఎట్లా వచ్చింది అంటే దేవుడు లేడంటూ ప్రారంభమైన యుగం ఇది. దేవుడు ప్రారంభం-లేడు అంటూ ప్రారంభమైన యుగానికి ఎవరు మళ్ళీ అవతారమూర్తిగా రావాలి? ఇది ప్రశ్న. సమస్య జీవుడిది కాదు, దేవుడికి సమస్య ఏర్పడింది. ఎందుకంటే సృష్టికి మూలమైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. సృష్టి స్థితి లయ కారకులలో బ్రహ్మకి అవతారాలు లేవు. శివుడు అప్పుడప్పుడు అవతారం ఎత్తి వచ్చాడు తప్ప ఆయనకి పూర్ణావతారాలు లేవు. మరి మధ్యలో ఉన్నటువంటి స్థితిమంతుడైనటువంటి నారాయణుడు ఒక్కడే ఇరవై రెండు అవతారాలు ఎత్తాలి, అది ఒక ప్రణాళిక. ఇరవై రెండు అవతారాలలో ఇప్పటికీ ఇరవై ఒక్క అవతారాలు పూర్ణమైపోయినాయి. ఇరవై రెండవది కలియుగ అంతంలో వస్తుంది. నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలలో మనం గడిపింది కేవలం ఐదు వేల మూడు వందల సంవత్సరాలు మాత్రమే. కల్కి అవతారం రావాలి అంటే ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు గడవాలి. కనుక లోగా ప్రళయం రావటం అంటూ ఉండదు. కానీ ప్రళయానికి బీజం వేసుకుంటూ ఇప్పటి నుంచి అది ప్రారంభమవుతుంది గనుక తొలినాళ్లలోనే కలి యొక్క ప్రభావాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ "నాస్తి నాస్తి కలౌ నాస్తి హరినామ వినా గతిఃహి". కలియుగంలో హరినామస్మరణ చేసుకున్నట్లయితే ఉపద్రవాలు తగ్గుతాయని శాస్త్ర ప్రామాణికమైనటువంటి ఒక మాట అలా ఉంచితే, అసలు ఎవరో ఒక అవతారమూర్తి కలియుగానికి అధిష్టాన పరదయుక్తమై రావాలి. నారాయణుడు అన్నాడు, "ఇరవై ఒక్క అవతారాలు ఎత్తాను, నాకు ఇవ్వబడినవి నేను పూర్తి చేశాను."అందులో ప్రధానంగా పది దశావతారాలు అయిపోయినాయి శివుడు అవతారమెత్తి రాడు బ్రహ్మకి అవతారాలు లేవు కనుక అవతారమే లేని యుగంగా ఉంటుందా అని అనుకున్నప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూల శక్తి అయినటువంటి కోటి సూర్య మండల మధ్యస్థ అయినటువంటి మహా త్రిపురసుందరి దేవి నేను కలియుగాన్ని నడిపిస్తాను అన్నది. ఒక సూర్యుడు వస్తేనే తట్టుకోలేని జాతి అనంత కోటి సూర్య మండల మధ్యస్థంగా ఉన్న త్రిపురసుందరి దేవి గనుక ఇక్కడికి వస్తే ఎలా నడిపిస్తుంది అని ఎవరో మనసులో అనుకుంటుండగానే అమ్మవారు అన్నది త్రిపురసుందరి దేవి నైన నేనే నాలో ఉన్నటువంటి సారల్యాన్ని లాలిత్యాన్ని మార్దవాన్ని సంపూర్ణ సత్వగుణాన్ని ఒక రూపంగా ఒక ఆకృతిగా ఒక భావనగా ఒక నామంగా ఒక గుణంగా ఒక విశేషణంగా లలితా అనబడేటువంటి పేరుతో వచ్చి సర్వ జగత్తుకి అధిష్టాన పరదైవతమై నేను నడిపిస్తాను అన్నది అమ్మవారు. కానీ ఎంత స్త్రీ శక్తి స్వరూపంగా వచ్చినప్పటికీ కూడా ఆలోచన పురుషుడిది అయితే ఆలోచన పురుషుడిది అయినట్లయితే ఆచరణ స్త్రీది. ఆచరణ స్త్రీ పురుషుడిది గనుక అయితే ఆలోచన స్త్రీది కావాలి. అందుకనే కలియుగ మానవుడు అర్ధనారీశ్వర తత్వంతో వచ్చాడు. ప్రతి పురుషుడిలో ఒక తెలియనటువంటి ఒక స్త్రీత్వం ఉన్నది అలాగే ప్రతి స్త్రీలో తెలియని పురుషత్వం ఉన్నది. స్త్రీలో ఉన్నటువంటి పురుషత్వమే ప్రపంచానికి రాజో రాణో కాగలిగింది. అలాగే పురుషుడిలో ఉన్న స్త్రీత్వమే తాను కన్న బిడ్డల పట్ల అమిత వాత్సల్యాన్ని ఆర్ద్రతని కరుణని ప్రదర్శించగలిగింది. కాబట్టి అర్ధనారీశ్వర తత్వం ఎక్కడ ఉన్నది అంటే ఎక్కడో కైలాసంలో లేదు మానవ దేహంలో ఉన్నటువంటి జీవుడి యందే రెండు పార్శ్వములు ఉన్నాయి గనుక స్త్రీ వలె పురుషుడు పురుషుడు వలె స్త్రీ పరస్పరము రోదిస్తూ పరస్పరము ఆకర్షించబడుతూ పరస్పరము సమన్వయమైనటువంటి ఒక దివ్య జీవన విధానానికి శ్రీకారం చుట్టి తమ జీవితాన్ని తాము గడుపుతూ ఉంటారు. అయితే క్రమంలో ప్రయాణంలో అనేక ఇక్కట్లు వాళ్ళు ఎదుర్కోవలసి వస్తుంది కారణం మార్గం చెప్పేవారు లేరు గనుక. కనుక మహా త్రిపురసుందరి దేవి లలితా దేవిగా తనను తాను నిర్మాణం చేసుకున్నప్పుడు ఆమె అన్నది నేను పుంభావంగా నాలో ఉన్న పురుష భావమే దత్తుడై జగత్తు లోకి వచ్చి సర్వ కలియుగము దత్తమయం చేసుకొని నేను ప్రపంచాన్ని నడిపిస్తాను అని. దత్తుడు అంటే ఎవరో ఒక సిద్ధుడు అని వాడు ఎవడో ఒక కల్ట్ అని ఒక భావన ప్రబలి ఉన్నటువంటి సమయంలో కంచి పరమాచార్య మహాస్వామి వారు ఒక మాట అన్నారు దత్తుడు అంటే సిద్ధుడు అని కాదు దత్తుడు అంటే ప్రపంచానికి దత్తమైన వాడు ప్రపంచాన్ని దత్తత తీసుకున్న వాడు. అంటే ప్రపంచంలో ఉంటూ సాలోక్య సామీప్య సాన్నిధ్యములతో ఉంటూ సాయుజ్య వరదానం చేయాలి కనుక ఇదంతా దత్తమయమై ఉంటుంది శ్రీకరమై ఉంటుంది అనేటువంటి ఒక భావన మనకు ఏర్పడింది. అయితే భారతీయ చరిత్ర గురుతత్వ విచారణలో చరిత్ర చాలా ప్రధానం ఎందుకంటే గతించిన కాలం తెలియకపోతే వర్తమానం విలువ తెలియదు. స్వామి కంటే ముందు వచ్చిన అవతారాలను గనుక ఒక్కసారి స్పర్శించుకోకపోతే స్వామి ఎవరో అర్థం కాదు ఎందుకంటే స్వామి కంటే ముందు అవతారాలు వస్తాయి స్వామి తర్వాత అవతారాలు వస్తాయి. కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క కోణాల్లో ఒక్కొక్క dynamics లో ఒక్కొక్క dimension లో ఆవిష్కరించుకుంటూ వస్తాయి కనుక విచారణలో ఒక భాగంగా దత్త సంప్రదాయమైనటువంటి కలియుగం ఆరంభంలో నెమ్మదిగా అనేకమంది అవతార పురుషులు వచ్చారు ఎలా వచ్చారంటే అంశావతారాలుగా, అర్చావతారాలుగా, కళావతారాలుగా, అనుప్రవేశావతారాలుగా, ఆవేశావతారాలుగా, సిద్ధావతారాలుగా, శుద్ధ్యావతారాలుగా, బుద్ధ్యావతారాలుగా అనేకమైనటువంటి అవతారాలు. కానీ ఇవి ఏవీ ప్రాదేశికమైనవే తప్ప సమగ్రమైనవి కాదు ఆయా దేశ కాల జాతి పరిస్థితులకు అనుగుణంగా అక్కడక్కడ తాము నెలకొని సర్వ జగత్తుని కూడా సన్మార్గంలో నడిపించడానికి వచ్చినటువంటి అంశావతారాలుగా వచ్చినాయి. అంశావతారం జగత్తును నడిపించడానికి చాలదు ఒక ప్రదేశం వరకు సరిపోతుంది మరి సర్వ సృష్టికి సర్వ ప్రపంచానికి సమస్త విశ్వానికి ఎవరో ఒక అధిష్టానమైన పరదైవం కావాలి గురు స్వరూపంగా కావాలి. పరదైవం అంటే మనకు అక్కరలేని మనం అందుకోలేని స్థాయి కాకుండా మనం అందుకోగలిగిన అనుభవించగలిగినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి స్థాయిలో ఉండే ఒక గురువు కావాలి గనుక గురువు తల్లిగా తండ్రిగా గురువుగా దైవంగా అన్నీ తానుగా ఎప్పుడో ఒక రోజున రావాలి. రావాలి అంటే అనుకోగానే వస్తాయా? యోగం సంభవించాలి కాలం పండాలి కాలంలో జరుగుతున్న అనేకమైనటువంటి విషయాలకు ఒక బలీయమైనటువంటి స్థితి స్థానము ఏర్పడాలి తదనుగుణమైనటువంటి రీతిలో మాత్రమే అవతార మూర్తులంతా కూడా జగత్తు లోకి వస్తారు. అలా వస్తూ వస్తూ ఉండగా ద్వాపర యుగం అయిపోయి కలియుగం ప్రారంభమై కలి ప్రవేశమై కలియుగపు ఛాయలన్నీ కూడా వెన్నాడుతున్నటువంటి వేళ అఖండ భారతావనిని ఒకానొకమైనటువంటి మతం ఒక విధానం నిరీశ్వర వాదంలోకి నెట్టేసింది. దేవుడే ఉన్నాడు దేవుడు మాత్రమే మరొకడు లేడన్న భారత జాతి దేవుడు లేడన్నటువంటి పరిపూర్ణ నాస్తిక నిరీశ్వర వాదంలోకి వెళ్ళిపోయి భారతదేశం ఆసేతు సీతాచలము యాభై రెండు ముక్కలుగా విడిపోయింది.ఆ విడిపోయి దేనికి అదిగా ఎవరికీ వారుగా self styled gurus అంటామే! అలాగే self styled demi gods and gods ప్రతి వాడు నేను దైవం అన్నాడు. ప్రతి వాడు నేనే గురువును అన్నాడు. నన్ను మించి గురువు లేడు, దైవం లేదన్నాడు. పండగలు, పబ్బాలు వెనక్కి వెళ్ళిపోయినయి. ఆర్షమైన, సనాతనమైన, ప్రాచీనమైన ఒక లక్షా ఇరవై రెండు వేల సంవత్సరాల భారతీయ సంస్కృతి ఎక్కడో ఒక చోట తిరగబడింది. విరిగిపోయింది అది. అటువంటి సమయంలో భారతదేశాన్ని మళ్ళీ ఒక ఆధ్యాత్మిక భూమికగా మార్చటానికి ఎవరు రావాలి? అన్నప్పుడు అందులో శివుడు పూర్ణావతారంగా రాలేదని అనుకున్న కారణంగా శంకర భగవత్పాదులు "శంభోర్మూర్తిహి చరతి భువనే శంకరాచార్య రూపా" ఆదిశంకరులు జగత్తులోకొచ్చి అద్వైత సిద్ధిని ప్రచారం చేసి మళ్ళీ సనాతనమైనటువంటి వేద వాంగ్మయాన్ని సరళీకృతమైనటువంటి స్తోత్రాలుగా, ప్రకరణ గ్రంథాలుగా, అనేకమైనటువంటి విశ్లేషణలుగా, వేద వాదాలుగా, వాద వేదాలుగా, ఉపనిషత్ భాష్యాలుగా, అనేక రీతులలో వాంగ్మయ సృష్టి చేసి మళ్ళీ మానవుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేశారు. కాలినడకన ప్రపంచం అంతా కూడా, భారతదేశం అంతా కూడా తిరిగి మళ్ళీ ధర్మ సంస్థాపన చేసి మానవుడి యొక్క బుద్ధి యందు పరమేశ్వరుడి యొక్క భక్తిని బీజంగా నాటి, పారంభ్యం వైపు అంచులు చూపించి మళ్ళీ జ్ఞానైక స్థితి వైపు, ఆత్మ విచార ధార వైపు శంకర భగవత్పాదులు నడిపించారు. బౌద్ధం తగ్గింది, అద్వైతం వెలిగింది కానీ కాలగమనంలో మళ్ళీ కొన్ని, ఐదు వేల సంవత్సరాలలో మొదటి పదిహేనేళ్ళు, పదిహేను వందల ఏళ్ళు తర్వాత పదిహేను వందల ఏళ్ళు అయిపోగా మిగిలినటువంటి కాలంలో ఒక చిన్న విరామం ఏర్పడింది. విరామమంతా సహజంగా ఉన్నటువంటి భారతీయ సంస్కృతి నెమ్మదిగా వికాసమానం చెంది, అన్ని వైపులా పెరిగి పాకుతున్నటువంటి వేళ ప్రపంచంలోకి భగవాన్ రమణ మహర్షులు వచ్చారు. వచ్చి కర్మ భక్తి యోగాలను దాటి జ్ఞాన యోగంలోకి గనక మానవుడు వెళ్ళక పోయినట్లయితే, వెళ్ళలేక పోయినట్లయితే కర్మ యోగంలోనే నేను పూర్ణం అవుతాను అంటే కుదరదు గనక కర్మయోగి, భక్తియోగి కావాలి. కర్మ భక్తులు రెండు యోగించిన వాడు యోగంలో ఉండాలి. మూడు యోగించిన వాడు జ్ఞాన యోగంలోకి వెళ్ళాలి. జ్ఞాన యోగంలోకి వెళితే తప్ప వాడు ప్రేమమయుడు కాడు అని చెప్పటానికి భగవాన్ రమణ మహర్షి వచ్చారు. వారు వచ్చినప్పుడు శంకర భగవత్పాదులు, బుద్ధుడు తదాదిగా కలిగినటువంటి అవతారాల స్ఫూర్తికి ఒక కొనసాగింపుగా వారు ఒక ప్రశ్న వేయమన్నారు. దాంట్లో ఏముంది? దీంట్లో ఏముంది? ఇదేమిటి? అదేమిటి? అన్న విచారణ కాస్త ఆపి, వాటికి సమాధానాలు శాస్త్రపరంగా ఉన్నాయి గనుక వేసుకోవలసిన అసలు ప్రశ్న ఇప్పుడు వేసుకోండి. అది Who am I? నేను ఎవరు? నేను ఎందుకు వచ్చాను? ఒక doctorనో, ఒక engineerనో, ఒక teacherనో, ఒక lawyerనో ఒక వృత్తిని పట్టుకొని అది నేను అవుతున్నానా? కాదే. జీవితంలో ఇరవై, ఇరవై ఐదేళ్ళు గడిచిన తర్వాత దాన్ని అందుకున్నాను. కాకముందు నేను ఎవరు? అయినప్పుడు నేను ఎవరు? దానిని వదిలిపెట్టిన తర్వాత నేను ఎవరు? అవస్థాత్రయానికి అతీతమైన పరమాత్మని నేను లోపల భావన చేసినప్పుడు, మేల్కొన్న నేనే కాసేపు అయ్యాక పడుకోబోతున్నానా? పడుకున్న నేనే మళ్ళీ కలగంటున్నానా? కలలుగంటున్న నేనే మళ్ళీ నా అంతట నేనే జాగ్రదవస్థ లోకి వస్తున్నానా? మార్పులన్నీ దేనికి చెందినవి? దేహానికే. ప్రపంచంలో ప్రాకృతమైనటువంటి శరీరంతో జాగ్రదవస్థలో పదహారు గంటలు పని చేసిన శరీరం సుమారు ఏడు గంటలు నిద్రపోయింది. మళ్ళీ జాగ్రదవస్థలోకి రావటానికి తన కారణ మహాకారణ శరీరాలను స్ప్రుశించుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఇంద్రియాలని తన అధీనంలోకి తెచ్చుకుంటూ, ప్రపంచంలోకొచ్చి మరునాడు గడుపుతున్నదే. గడుపుతున్నదంతా దేహమే కానీ నేను కాదన్నటువంటి భావన కలిగేదాకా ద్వంద్వం సాగుతుందని, నిజానికి నీ లోపల ఉన్న నీవే అసలు నీవు. The real I. బయట కనిపిస్తున్న నేను, నేను, నేను అంటున్న నేను, మేనుకు సంబంధించిన నేనే కానీ అసలు నేను మాత్రం వేరే ఉన్నాను. మరి అసలు నేను ఏం చేస్తున్నది? మేనుతో కూడిన నేను అంటే దేహాత్మ భావనంతా కూడా ప్రాపంచికమైన విషయాల వైపు, లాలస వైపు, భోగం వైపు, లక్ష్యం వైపు, గమ్యం వైపు, ద్వంద్వాల వైపు అంటే చీకటి వెలుగులు, ఎత్తు పల్లాలు, జనన మరణాలు, జయాపజయాలు, ప్రమోద ప్రమాదాలు, ఖేద మోదాలు వీటన్నింటికీ లోనైనటువంటి దేహము నేను కాదే. కానీ ఇవన్నీ జరుగుతున్నా లోపల ఎవడో ఒక్కడు ఉన్నాడే, వాడు సాక్షిభూతుడై ఉన్నాడా? ఉన్నట్లయితే వాడే పరమాత్మ, అది నేను అన్నటువంటి భావనలోకి మానవుణ్ణి జ్ఞాన మార్గంలో ప్రవేశపెట్టడానికి ఒక ఆత్మానుభవాన్ని ఆధారం చేసుకొని ఆత్మానుభవ అనంతరం యాభై నాలుగు సంవత్సరాలు అదే శరీరంలో, అదే స్థితిలో, ఏమీ అక్కరలేని స్థితిలో ఎవరెవరికి రకంగా జ్ఞానబోధ చేయాలో అటువంటి బోధ చేస్తూ ముగిసింది భగవాన్ రమణుల అవతారం. అదే సమయంలో మనం నిన్న, మొన్న విచారణ చేసుకున్నాం. రామకృష్ణ గురుదేవులు భక్తి పారమ్యంలో మహోన్నతమైన ఉన్మత్త స్థితికి అది సంకేతం. వారి అనుగ్రహాన్ని, తపస్సుని స్వీకరించిన వివేకానంద స్వామి మానవుడిలో జాగృతం కావలసినటువంటి, అంటే లోపల ఏది latent గా ఉన్నదో అది kinetic కావాలి. ఏది kinetic అయిందో అది dynamic కావాలి. కాకపోయినట్లయితే భూమిలో పాతిన విత్తనం భూమిలోనే నశించిపోయినట్లయితే అది బయటకు వచ్చేదెప్పుడు? చెట్టయ్యేదెప్పుడు? వృక్షమయ్యేదెప్పుడు? మళ్ళీ పునరావృత్తి సహితమైనటువంటి సృష్టి కార్యక్రమం అంతా సాగేదెట్లు అని మన లోపల దాగి ఉన్నటువంటి చిరు దివ్య ఆత్మని మేల్కొల్పినటువంటి మహాస్వామి వివేకము చేత ఆనందమైఆ ఆనందవనన్ స్వామి అయినటువంటి వివేకానంద స్వామి ఒకవైపు జాతి నడుస్తున్నంత సేపు అవతారమూర్తులు వస్తూ ఉంటారు. వివేకానందస్వామి, రామకృష్ణ గురుదేవులు, అరవింద ఘోష్ భారతదేశానికి స్వాతంత్రం రావాలని అది మూడు కోరికలు కోరుకున్నాడు ఆయన. ఒకటి నా జన్మదినం నాడే భారతదేశం దాస్య విముక్తి పొందాలి. ఆ-ఆగస్టు పదిహేనవ తారీఖున అది ఆయన సాధించారు. నేను శరీరంలో ఉండగానే కృష్ణ దర్శనాన్ని పొందాలి రెండవది. బరోడా జైల్లో ఉన్నప్పుడు కారాగారంలో గోడ మీద శ్రీకృష్ణ పరమాత్మని సాకారంగా సజీవంగా దర్శనం చేసినటువంటి వారు అరవింద యోగి. అంతేకాదు, నా ధారణ పూర్ణమై ధ్యానంలో ప్రవేశించేటువంటి సమయంలో యుగానికి కావలసినటువంటి ఒక అవతారమూర్తి రావాలి అని ధ్యానించినటువంటి మహాయోగి అరవిందులు వారు. ఇట్లా భారతదేశమంతా ఆధ్యాత్మిక స్వర్ణభూమికగా ఒక స్వర్ణయోగంగా సాగుతున్నటువంటి వేళ, భారతదేశానికి దత్త సంప్రదాయంలో పూర్ణావతారాలు రావాలి. పూర్ణావతారాల కంటే ముందు అంశావతారాలు రావాలి. అందులో దత్తావతారము ప్ర-ప్రధానమైనటువంటిది, శిఖరాయమానమైనది, ఆధారభూతమైనది, అది దర్శనీయమైనది గనుక ఆంధ్రదేశం ఎంత అదృష్టవంతమైనది అంటే తొట్ట తొలి దత్త అవతారం పిఠాపురం లో వచ్చింది. అదే శ్రీపాద శ్రీవల్లభుడు. ఇక్కడ ప్రారంభమై అక్ నెమ్మదిగా మక్కల్ దాటి కురువపురం దగ్గర ముప్పై మూడు సంవత్సరాలు శరీరంలో ఉండి ఎవరికీ కనపడకుండా కానీ ముప్పై మూడు సంవత్సరాల తర్వాత అందరూ చూస్తుండగానే ఆకాశయానం వైపు సశరీరంగా సాగిపోయినటువంటి పరమాద్భుత మూర్తి శ్రీపాద శ్రీవల్లభుడు. తర్వాత శ్రీపాద శ్రీవల్లభుడు తర్వాత నృసింహ సరస్వతి. దత్తావతారాలకు ఒక ప్రత్యేకమైన విశేషణం ఉన్నది. వారు ఉన్నటువంటి చోట ఇరవై నాలుగు మంది శక్తులని ఇరవై నాలుగు వ్యక్తుల యందు గుప్తంగా వారు దాచి ఉంచుతారు. ఇరవై నాలుగు మంది వారి చుట్టూ ఉంటారు. ఇరవై నాలుగు మంది ఆంధ్రదేశం వరకు మూడు వేల ఆరు వందల యోగులకి శక్తిని వరదానం చేస్తుంది. ఆంధ్రదేశం నుంచి మూడు వేల ఆరు వందల మంది ఆసేతు సీతాచలము సుమారు ముప్పై ఆరు వేల మంది యోగులని ప్రపంచానికి అనుగ్రహిస్తుంది అది. అంటే దత్త యుగంలో, కలియుగంలో ప్రధానంగా క్షణాన మనం లెక్కబెట్టుకున్నా ఒక యోగి ఉంటాడు. అటువంటి వాళ్ళు ముప్పై ఆరు వేల మంది యోగులు ప్రపంచాన్ని, భారతదేశాన్ని నడిపిస్తారు. దీన్ని ఎవరు నడిపిస్తున్నారు? నడిపించగలవాడు ఒక్కడు కనిపిస్తున్నాడా? కంటికి లేడు. కానీ ఇది పరమాద్భుతంగా నడవటానికి కారణం ముప్పై ఆరు వేల మంది యోగుల యొక్క మహా తపస్సు తప్ప అన్యం కాదు.
SSSMC · audio

Talk on Sri Sathya Sai - Part 01

Home

Talk on Sri Sathya Sai - Part 01

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 27:25

More in this series

Talks on Sri Sathya Sai

4 episodes · 1 hr 35 min

  1. 27 min 1

    Talk on Sri Sathya Sai - Part 01

    Now playing
  2. 23 min 2

    Talk on Sri Sathya Sai - Part 02

  3. 22 min 3

    Talk on Sri Sathya Sai - Part 03

  4. 21 min 4

    Talk on Sri Sathya Sai - Part 04