No transcript for this section.
సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఒక పరమాత్మని మానవ దేహంలో మానుష రూపంలో మనం చూసాం మనం మాట్లాడాం మనం తాకం మనం సంభాషించాం మనం అనుభవించాం ఒక అనుభూతిని చెందాం విభూతి స్థాయికి వెళ్ళటమే మిగిలి ఉన్నది గనుక పరమాత్మ విభూతి స్థాయికి ఒక సాధనా క్షేత్రాన్ని ఒక ధర్మ క్షేత్రాన్ని ఒక కురుక్షేత్రాన్ని మానవుడి మనస్సు యందు ప్రవేశపెట్టి స్వామి ఒకటే చెప్పారు కురుక్షేత్రం అంటే హర్యానాలో ఉన్నటువంటి యుద్ధం సాగిన ప్రదేశం కాదు బంగారు నీ హృదయమే కురుక్షేత్రము కురుక్షేత్రము అంటే చేయవలసిన ఏ పని చేయవలసి ఉన్నదో ఆ ప్రదేశం నిర్ణయించబడినటువంటి ప్రదేశం. ఒకవైపు నూరుగురు కౌరవులు నూరు దుర్గుణాలు ఉంటాయి అట్లాగే పంచ పాండవులు అనబడేటువంటి ఐదు సద్గుణాలు ఉంటాయి మధ్యలో యోగీశ్వర కృష్ణుడు ఉంటాడు కృష్ణుడి పని అంతరంగంలో ఏమిటంటే నూరుగురు కౌరవుల్ని సంహారం చేయాలి ఈ ఐదు మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరమాత్మ రక్షిస్తాడు ఈ ఐదు ఆ ఒకటితో కూడితే జీవ ప్రజ్ఞ దైవ ప్రజ్ఞ కలుస్తుంది. మీరందరూ గురుతత్వంలో ఒక్కొక్క గురువు చిన్ముద్ర వేస్తాడని అంటారే ఏమిటి ఆ చిన్ముద్ర? ఈ నాలుగు వేళ్ళు ఒకే ప్లేన్ లో ఉన్నాయి. ఈ చూపుడు వేలు గనక బొటన వేలుతో కలిస్తే ఈ బొటనవేలు ఒక్కటే ఎడంగా ఉంది పెడగా ఉంది పరం గా ఉంది దూరంగా ఉంది ఇది పరమాత్మ. ఈ పరమాత్మకి జీవాత్మ కూడి ఉన్నట్లయితే సత్వ రజస్ తమో గుణాలు మూడు ఒక టేపర్ అయినట్లుగా ఉంటాయి అవి ఒక ప్లేన్ లోకి వస్తాయి. ఆ మూడు ఒకటి అయినటువంటి వేళ ఈ జీవ ప్రజ్ఞ దైవ ప్రజ్ఞతో గనక కూడి ఉంటే దాని పేరు చిన్ముద్ర తప్ప చిన్ముద్ర అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళి ఇది కాదనుకోవటం కాదు ఉన్నదంతా నేనే నేనే అంతటా ఉన్నాను అన్నటువంటి ఒక అద్వైత అద్వితీయ రమణీయ మనోజ్ఞ భూమిక లోకి మానవుడు సంచారం చేయవలసి ఉన్నది అని మామూలుగా చక్కగా హాయిగా మనకు అర్థం అయ్యేటువంటి రీతిలో ఒక శుభగశ్యతో బోధాకృతిగా సత్యసాయి భగవానుడు తమ ఉపన్యాస పరంపర కొనసాగించారు. ఆ ఉపన్యాసాలు కాలక్షేపానికి చేసినవి కాదు. They are not for entertainment, they are for enlightenment. మానవుడిలో దాగి ఉన్నటువంటి ఆ దివ్యాత్మ బయటకు రావాలి కనుకనే స్వామి అనేకమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసి జాతి కుల మత వర్గ వర్ణ ప్రదేశ దేశములు దాటి అన్ని దేశాల వాళ్ళని తన దగ్గరకు తీసుకోగలిగారు. పంచమ పురుషార్థం అయినటువంటి ప్రేమ ఏ వేదం దేని గురించి చెప్పిందో ఆ మాములుగా చతుర్విధ పురుషార్థాలు చెప్తాం. ధర్మం, అర్థం, కామం, మోక్షం. సత్యసాయి భగవానుడు అన్నారు ఐదు పురుషార్థాలు ఉన్నాయి. ఆ ఐదవ పురుషార్థమే ప్రేమ. ప్రేమ ఎక్కడ ఉంటుందో ధర్మం అక్కడ ఉంటుంది. ధర్మం ఎక్కడ ఉంటుందో ప్రేమ అక్కడ ఉంటుంది. ప్రేమతో కూడిన సంపద ఎక్కడ ఉన్నదో ఆ సంపద నిలబడుతుంది. సంపదతో కూడిన ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ చారిటీ ఉంటుంది వ్యానిటీ ఉండదు. అలాగే ప్రాపంచికమైన కామనలు ఈ ప్రేమ రెండు ఉన్నట్లయితే అది కర్మయోగంగా సాగుతాయి. ఇక చివరగా మోక్షము అంటే ఏం లేదు అది మరణానంతర సుఖం కాదు మోక్షము అంటే మోహ క్షయమే మోక్షం. ఇది నాకు అక్కరలేదు ఇక చాలు అన్నటువంటి స్థితే మోక్ష స్థితి తప్ప మరణానంతరం ఈ జీవుడు ఎక్కడికి పోతున్నాడు? ఇంకెక్కడి ఇంకో లోకంలోకి వెళుతున్నాడు అంటే దేహమా ఇక్కడే వదిలి పెడుతున్నాడు. తాను సంపాదించిన సంపాదన ఇక్కడే వదిలి పెడుతున్నాడు. మరి ఏమి తీసుకొని వెళుతున్నాడు? అసలు వెళ్ళటం లేదు. వాడు ఇక్కడే ఉన్నాడు పరమాత్మ కూడా ఈ దేహంలో తీసుకొని వస్తే ఆయన ఇక్కడే ఉన్నాడు అందరూ ఇహమేవా ఇక్కడే ఇప్పుడే అంతటా అన్నిటా ఉన్నటువంటి సర్వవ్యాపక స్థితి జీవుడికి కూడా ఏర్పడుతుంది అనేటువంటి ఒక ప్రబోధాన్ని పరిపూర్ణమైనటువంటి బోధగా చేసినటువంటి బోధాకృతి సత్యసాయి భగవానుడు. అంతేకాదు రామావతారంలో త్రేతాయుగంలో రాముడికి దేవాలయాలు లేవు. ద్వాపర యుగంలో కృష్ణుడికి దేవాలయాలు లేవు. ఇందాక అనుకున్నట్లుగా సాక్షాత్ ప్రప్రథమ పూర్ణ దత్తావతారం అయినటువంటి షిరిడి బాబాకు కూడా స్వామివారు చెప్పేదాకా మందిరాలు లేవు. కానీ సత్యసాయి భగవానుడు దేహంలో ఉండగానే తాము ఇక్కడ సంచారం చేస్తుండగానే భాషాతీతమైనటువంటి భావావస్థతిలో సంస్థితమైనటువంటి ఒక సమయంలోనే ఒక ఊరికి సుమారు ఐదారు మందిరాలు సత్యసాయి భజన మందిరాలు, సత్యసాయి సేవా మందిరాలు, సత్యసాయి ధర్మ మందిరాలు, సత్యసాయి ఆధ్యాత్మిక మందిరాలు ఎన్ని లెక్కకు మిక్కిలిగా వేలకు వేలుగా సర్వ ప్రపంచం కేవలం ప్రాదేశికంగా హిమాలయం నుంచి కన్యాకుమారి వరకు ఆగినవి కావు అన్నీ దాటి దాటి అనేక ద్వీపాలలో చిన్న చిన్న ద్వీపాలలో కూడా ఈనాడు మానస సరోవర యాత్రకు వెళితే అక్కడ స్వామి ఫోటోలు కొన్ని వందలు మనకు అక్కడ కనిపిస్తాయి. చైనా బోర్డర్లో స్వామి యొక్క ఫోటోలకి మాల వేసి నమస్కారం చేస్తున్నారు. కారణం ఏమిటి? దేవుడనా? పరిపూర్ణ మానవుడనే? పూర్ణ అవతారమనే? తాము చూశామనే? తాము అనుభవించామనే? ఎక్కడైనా ఉన్నదా అంటే, అనుభవించటానికి దగ్గరకు రానక్కరలేదు. దూరాత్ దూరాత్ అంతికేచ అని కదా, పరమేశ్వరుడు దూరం అనుకుంటే దగ్గరగా ఉంటాడు, దగ్గర ఉన్నాడంటే దూరంగా ఉంటాడు. ఆ భావనలోనే సర్వాంతరాత్మ అయినటువంటి సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి సందేశము, దివ్యమైనటువంటి ప్రేమ, ఆ అవతారంలో ఉన్నటువంటి గాఢత, ఆ స్వచ్ఛత, ఆ ట్రాన్స్పరెన్సీ, ఏదైతే ఉన్నదో ఆ పవిత్రత, శీలము, ఇవన్నీ కూడా ఒక సమైక్య ధారగా సర్వ ప్రపంచాన్ని మనల్ని కలిపి ఉంచే స్థాయికి వెళ్ళింది. ఇవాళ మన బోటి వాడు ఈ దేశం దాటి ఇంకో దేశంలోకి వెళితే మనకు కావలసిన ఒక కార్డు, ఒక్క visiting card ఉంటే చాలు. ఆ visiting card మీద ఏమి అక్కర్లేదు సాయిరామ్ అనే మూడు అక్షరాలు గనక ఉంటే మనం ఒక్క second లో వాళ్ళకి బంధువులం అయిపోతాం. మన అసలు బంధువుల కంటే పూర్ణంగా ఆదరిస్తారు వాళ్ళు. మనల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు, ఆదరిస్తారు, ప్రేమిస్తారు, మన కష్టాన్ని తీరుస్తారు, మనకు ఏం కావాలో చేస్తారు, అన్నీ చేస్తారు. మూడు అక్షరాల మహిమ అది. ఇది ఒక స్థాయి అయితే రామావతార, కృష్ణావతారాల తర్వాత ఏర్పడినటువంటి వాటికి దేనికి కూడానిజానికి ఛందో గాయత్రి లేదు. ఒక్క సత్య సాయి భగవానునికి తప్ప. సత్య సాయి భగవానుడు పందొమ్మిది వందల డెభై ఏడు డిసెంబరు ఇరవై నాలుగవ తారీఖున white field లో ఒక సాయం సంధ్యలో గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని కాసేపు ఉపన్యాసం చెప్పు అని అన్నప్పుడు, ఆయన ఏం చెప్పాలని అక్కడి దాకా వెళ్లారో కానీ, ఆయన నోటి నుంచి వెలువడినటువంటిదే సత్య సాయి గాయత్రి. "ఓం సాయీశ్వరాయ విద్మహే సత్య దేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్" అనగానే ఒక్కసారి ఆయన ఉలిక్కిపడి స్వామి దగ్గరకు వెళ్లి స్వామి పొరపాటు అయింది నన్ను క్షమించాలి అన్నారు. ఏమైంది అంతా బానే చెప్పావు కదా అంటే, ఏదో చెప్పాలని వెళ్లిన నా చేత మీరు ఈ గాయత్రి చాలా inarticulate గా అంటే ఒక అసంకల్పితంగా చెప్పించారు కానీ ప్రతి ఛందో గాయత్రికి కూడా చేసిన వాడు ఋషిని నన్ను చేసేశారు ఈ ఒక్క గాయత్రితో. అధిష్ఠాన పరదైవతమైన మీరు నా పక్కనే కూర్చునే ఉన్నారే కానీ గాయత్రి లో సత్య శబ్దం లేకుండా "తన్నః సత్యః ప్రచోదయాత్" అనవలసింది స్వామి. ఎందుకో "తన్నః సర్వః" అన్నాను. కాస్త మారుస్తాను అంటే, లేదు లేదు నీవన్నదే సత్యం. ఎందుకంటే పరమేశ్వరుడు సర్వుడు, పరమేశ్వరుడు శర్వుడు. "సర్వ సర్వభ్యః సర్వ సర్వభ్యః" సర్వమూ ఎరిగిన వాడు, సదయుడైన వాడు, పూర్ణుడైన వడు, నిత్యుడైన వాడు, నాశమెరుగని వాడు, వినాశము కోరని వాడు, సమృద్ధికి మూలమైన వాడు, తాను సాక్షాత్తు అనిత్యుడు, అశాశ్వతుడు అయ్యుండి కూడా నిత్య సత్య శాశ్వత పరబ్రహ్మంగా ఈ ప్రపంచానికి వెలుగు అందుతూ ఉంటాడు గనుక, నీవన్న సర్వ శబ్దమే దీనికి ప్రామాణికము. బాబా చదువుతూ ఉండగా బీజాక్షరాలు లెక్కబెడితే ఛందో గాయత్రి లో మామూలుగా నూట ఎనమిది బీజాక్షరాలు ఉంటాయి. ఈ సత్య సాయి గాయత్రి లో నూట తొమ్మిది బీజాక్షరాలు ఉన్నాయి స్వామి. ఇది చిన్న పొరపాటు అంటే స్వామి కరుణాపూర్ణ సుధాబ్ధి గనుక ఒక మాటన్నారు. మిగతా గాయత్రులన్నీ ఒక కామ్యాన్ని, ఒక ఆలోచనని, ఒక సంకల్పాన్ని, ఒక అవసరాన్ని, ఒక లక్ష్యాన్ని, ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని గనుక చేస్తే అనతి కాలంలో అతి తక్కువ కాలంలో ఒక ఫలితం కలుగుతుంది. కానీ సత్య సాయి గాయత్రి లో ఉన్న నూట తొమ్మిదవ బీజాక్షరము నేను ఇప్పుడే అనుగ్రహించాను కనుక మీవన్నీ కూడా గాయత్రి-- సత్య సాయి గాయత్రి చదువుతూ ఉండగానే మీకవి సిద్ధించేటువంటి సత్య సాయి అనుగ్రహము దానిలో ఉన్నది అని పరమాద్భుతమైనటువంటి విశ్లేషణ చేశారు. అంటే ఒక పరమాత్మ దేహిగా, దేహంగా ఉండగానే వారి పట్ల ఒక గాయత్రి ఏర్పడటం భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అనుపమానమైన, అపూర్వమైనటువంటి మహత్తర సన్నివేశం ఇది. అంతేకాదు మానవుడు మానవుడిగా జీవించటం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రజ్ఞ ఉన్నది. ఆ ప్రజ్ఞను ఏం చేయాలి? commercialize చేద్దామా? కీర్తి కోసం చేద్దామా? కేవలం మన కుటుంబ సభ్యుల ఆనందం కోసమే దాన్ని వాడుకుందామంటే స్వామి అటువంటి వారికి స్వామి దానిలో scheme లో లేరు. నీకున్నటువంటి ప్రజ్ఞ సర్వ ప్రపంచానికి ఉపయోగపడాలి. ఏనకేన కృపాయై నయశ కశ్యాపి దేహినః సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వర పూజనం. అన్నటువంటి ఒక వేద ప్రామాణికమైన మాట. నేను ఎందుకు వచ్చాను? నేను వచ్చి ఏం చేయాలి? నేను చేస్తున్నది నా చుట్టూ ఉన్నవారికి ఆనందం కలుగుతున్నదా లేదా అని ఒక ప్రశ్న వేసుకొని తన ప్రజ్ఞాభూమిక లో నుంచి తన చుట్టూ ఉన్న వారందరికీ గనక ఆనందం కలిగించగలిగినట్లయితే తదేవ తత్తేవ అది మాత్రమే ఈశ్వర పూజ. అదే శివపూజ. అంతేగాని ఒక విగ్రహం మరొక విగ్రహాన్ని లక్ష్యం కోసం, concentration కోసం, contemplation కోసం, practice కోసం, conviction కోసం, belief కోసం, వాటికోసం వాడుకునేటువంటి ఒక స్థాయియే తప్ప పరమ చరమ స్థాయి అంటే మన ఉనికి చేత, మన వ్యక్తిత్వం చేత, మన తలపు చేత, మన స్మృతి చేత, మన స్పర్శ చేత మరొక వ్యక్తికి గనక ఆనందం కలిగించగలిగినట్లయితే అది సంపూర్ణమైనటువంటి ఆ-పారమార్థికమైనటువంటి, సమర్థవంతమైనటువంటి జీవితంగా అది మాత్రమే ఈశ్వర పూజగా భావన చేయాలి. అంతే కాదు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి స్వామి దగ్గరకు దర్శనం కోసమై తహతహలాడిన వారందరికీ స్వామి దర్శనాన్ని ఇచ్చారు. అటూ ఇటూ అయిన వాళ్ళకి ఆయన దర్శనమూ దొరకలేదు, ఆయన పేరు మీద సేవలోనూ యోగం దొరకలేదు. కానీ దొరకని వారి గురించి చింత లేదు. అది మన పని కాదు. ఈ అనంత మహా కాల ప్రవాహంలో ఏ జీవుడు ఎక్కడో, ఎవరు ఎప్పుడో, ఎవరికి ఎవరెవరో అన్నటువంటి ఒక పూర్ణ వైరాగ్య భావనలో నిలకడ చెందినట్లయితే, ఈ వైరాగ్యానికి ఒక్కటే సమాధానం మనకి పరమాత్మ, పరమాత్మకి మనం. అందుకనే స్వామి ఒకానొక దివ్యోపన్యాసంలో ఒక మాటన్నారు. భక్తులు లేక భగవంతుడు లేడు. అట్లే భగవంతుడు లేక భక్తుడు కూడా లేడు. మన ఇద్దరిది అన్యోన్యమైనటువంటి ఒక బాంధవ్యం. ఇది తరతరాలది, ఇది యుగయుగాలది. ఎప్పుడు ప్రారంభమైందో నాకు ఎరుక, మీకు ఎరుక లేదు. మీరు తెలుసుకోవాల్సిన పని లేదు. చేయవలసినదల్లా నాతో ఉండటమే. నా గురించి ఆలోచించటమే. అంటే ఆ నా కేవలం సత్యసాయి అన్న భావనలో స్వామి చెప్పలేదు. ఆ నా, నేను అన్నటువంటి ఆ పదాలు ఆత్మకి సంకేతంగా స్వామి ఒక దివ్య బోధాకృతిగా సహించారు. మహిమ చేశారు, ఆనందం ఇచ్చారు, దగ్గరకు తీశారు, కాసేపు దూరం పెట్టారు, కాసేపు శిక్షించారు, అనేకసార్లు రక్షించారు. కానీ ఆయన మనను వదలలేదు. అట్లే మనము ఆయనను వదలలేదు. ఇది పరిపూర్ణమైనటువంటి అద్వైత స్థితి. ఈ స్థితిలో సత్యసాయి భగవానుడు. చూడండి కాశీ అనగానే విశ్వనాథుడు అనగానే ఆ దైవతానికి పక్కన గంగ ఉన్నది. శ్రీరంగనాథుడు అనగానే కావేరి ఉన్నది.శిరిడి సాయి అనగానే గోదావరి నది, రాముడు అనగానే సరయు నది ఉన్నది, కృష్ణుడు అనగానే యమునా నది ఉన్నది. అలాగే శ్రీరంగడు అన్-- అనగానే పెన్నా నది ఉన్నది. దుర్గాదేవి అనగానే శ్రీకృష్ణ-- కృష్ణానది ఉన్నది. సత్యసాయి భగవానుడు పరదైవం కనుకనే ఆయన ఎంచుకున్న క్షేత్రం కూడా చిత్రావతి పక్కనే ఉన్నది. ఇటువంటి సమగ్రమైనటువంటి దివ్య విచారణా భాగంలో పందొమ్మిది వందల, ఆ, రెండు వేల పదకొండు ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖున సత్యసాయి భగవానుడి అవనీ సంచారం పూర్ణమై అవతార పరిసమాప్తి అక్కడికే అయింది. అవతార పరిసమాప్తి అయింది. స్వామి సమాప్తం కాలే. మళ్ళీ మరొక దేహాన్ని తీసుకుని మళ్ళీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని మళ్ళీ అనేక గమ్యాలను నిర్దేశించు, ఈ అఖండమైనటువంటి సర్వ సృష్టిని కూడా అధ్యాత్మ మార్గం వైపు నడిపించడానికి, ఆత్మోన్నత స్థాయిని కల్పించడానికి మళ్ళీ భగవానుడు ఒక యుగంలో రాముడి వలె, మరొక యుగంలో కృష్ణుడి వలె ఎట్లా వచ్చారో, నిన్న మొన్నటి వరకు సత్యసాయి వలె మన మధ్యలో ఎలా నడిచారో అట్లాగే మరొక సాయి అవతారంగా స్వామే చెప్పినట్లుగా కర్ణాటక దేశంలో మాండ్య దగ్గర స్వామి గుణపర్తి లో ప్రేమ సాయిగా అవతారమెత్తుతారు. ఈ మూడింటి తర్వాత నారాయణుడికి ఇరవై రెండు అవతారాలు ఎట్లాగైతే పరిమితమో సాయిత్రయీ ఈ మూడు వేద ప్రామాణికంగా వస్తాయి గనుక షిరిడి సాయి, సత్య సాయి, ప్రేమ సాయి. ప్రేమ సాయి తర్వాత మరొక నాల్గవ సాయి అవతారం లేదని అదే సాయిత్రయీ అని స్వామి స్పష్టంగా చెప్పారు. అంతే కాదు సత్యసాయి భగవానుడి యొక్క అవతారంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి జీవితము దాని తర్వాత ఇరవై ఒక్క తరాలు ప్రభావితమై ఉండి తీరుతాయి. వారి అనుగ్రహం ఈ ఇరవై ఒక్క తరాలను నడిపిస్తుం-- ఉంటుంది గనుక స్వామి శరీరం వదిలిపెట్టారు, ఆ కథ అక్కడికి అయిపోయింది అని కాదు. ఇది పుట్-పుట్టపర్తి దివ్య క్షేత్రం అవుతుందా, పుణ్యక్షేత్రం అవుతుందా ప్రశ్న కాదు. వారి ఉనికి చేత వారు జన్మతీసుకున్న మరుక్షణమే అది దివ్య క్షేత్రము, పుణ్య క్షేత్రము, ఆధ్యాత్మిక క్షేత్రము, ధర్మ క్షేత్రము అయింది గనుక మళ్ళీ కావటమంటూ లేదు. స్వామి కంటే ముందు వచ్చిన అవతారాలన్నీ దేవుడు ఎలా కావాలో మానవుడికి బోధ చేస్తే స్వామి బోధ ఒక్కటే. మానవుడు దేవుడు కావటమేమిటి మానవుడు దేవుడే. జీవుడు దేవుడే ఇది బ్రహ్మసూత్రంలో ఉన్నమాట. కాబట్టి జీవుడు ప్రత్యేకం దేవుడు కానక్కర్ల. జీవుడు జీవుడిగా జీవించటం గనక మొదలు పెట్టినట్లయితే వాడు దివ్య స్థానానికి వెళతాడు, ఆ స్థాయిని అందుకుంటాడు గనుక ఇవాళ సత్యసాయి భగవానుని మహా పరినిర్వాణ అనంతర కార్యక్రమాలలో మన కార్యక్రమాలు బలోపేతం కావాలి. సేవ ఇంకా గణనీయం కావాలి, ఇంకా విస్తృతం కావాలి. సత్యసాయి యొక్క దివ్య సందేశం అణువణువునా ప్రతి చోటికి దాన్ని తీసుకుని వెళ్ళాలి. ప్రచారం కోసం కాదు స్వామి అనుగ్రహ ప్రసారం కోసం. ఈ భోగి పండుగనాడు, ఈ రెండువేల పన్నెండున భారతీయ గురుతత్వ ప్రవాహంలో సత్యసాయి భగవానుని గురువుగా, తండ్రిగా, తల్లిగా, పరదైవంగా ఈ నాలుగు కలిపినటువంటి పరమాత్మగా ఒక బ్రహ్మీభూతమైనటువంటి ఒక బ్రహ్ం-బ్రహ్మీస్థితిగా మనం గనక అనుభవించగలిగినట్లయితే బ్రహ్మ సూత్రాలలో ఉన్నటువంటి ఒక స్-- ఒక శ్లోకానికి, ఒక సూత్రానికి "సర్వం ఖల్విదం బ్రహ్మ" అన్నటువంటి ఒక ఉపనిషత్ వాక్యానికి సత్యసాయి భగవానుని మాటలలోనే చెప్పుకుందాం. [పాట] చుక్కలన్నియు బ్రహ్మ సూర్యుండు బ్రహ్మ చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ తల్లి అన్నను బ్రహ్మ తండ్రి అన్నను బ్రహ్మ స్వర్గమన్నది బ్రహ్మ వాళ్ళభ్యమది బ్రహ్మ పుట్టించు నది బ్రహ్మ పోషించు నది బ్రహ్మ గిట్టించు నది బ్రహ్మ గృహిణి బ్రహ్మ కర్మలన్నియు బ్రహ్మ కాలమంతయు బ్రహ్మ ప్రకృతి అంతయు బ్రహ్మ ఆదిశక్తియు బ్రహ్మ సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ. [చప్పట్లు] తనను మనకంటే భిన్నంగా చూసుకోలేదు స్వామి. మీరు నేను ఒక్కటే. యు ఆర్ మీ, ఐ యామ్ యు. మీ నీకు నాకు తేడా లేదు. త్వమేవాహం న సంశయః నిస్సంశయంగా నీవే నేను, నేనే నీవు అన్నటువంటి ఒక పూర్ణాద్వైత భావనకి గురు స్థానంలో గురువు నాం గురువుగా, గురువులకే గురువుగా, జగద్గురువుగా, సద్గురువుగా, బోధ గురువుగా అనేకమైనటువంటి రీతులలో చిట్టచివరదైన పరమ చరమమైనటువంటి కారణ గురువుగా సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవనీ సంచారం భారతీయ అధ్యాత్మ చరిత్రలో ఒక మహోన్నత పతాక స్థాయి. ఆ స్థాయిలో మనం వారికి సమకాలీనులుగా ఉన్నాం. మనం చేసుకున్న అదృష్టం అది. ఎన్ని యుగాలుగా వారితో వచ్చామో, ఎన్ని తపస్సులు చేశామో, ఎన్ని యాగయోగాలు చేశామో, ఎంత ఆధ్యాత్మిక తపస్సు చేశామో, ఎంత జపం చేసుకున్నామో, ఎంత సేవ చేసుకున్నామో, ఎంత ఉదాత్త మానవ జీవితాన్ని ఇంతకు ముందు గడిపామో, పరమేశ్వరుడికి సమకాలీనంగా జన్మ ఎత్తం. దీనిని మించినటువంటి మరొక అదృష్టం లేదని భావిస్తూ భారతీయ గురు పరంపర ఈ సర్వ ప్రపంచానికి ఎ-ఎన్నటికైనా ఎప్పటికైనా ఒక మహా దిక్సూచి. కాకపోతే జీవుడు కాస్త ఒక్క జాగ్రత్తలో ఉండాలి. స్వామి మాటని ఒక హెచ్చరికగా గుర్తు పెట్టుకోవాలి. ఆల్ గురూస్ ఆర్ వన్ బట్ ఆల్ ఆర్ నాట్ గురూస్. ప్రతివాడు గురు స్థానంలోకి వెళ్ళలేడు. మహత్తర త్యాగం చేయాలి. తనను తాను దర్శించుకోవాలి. జ్ఞానాదేవత కైవల్యం. అసలు ఆత్మ దర్శనమే జ్ఞానం, జ్ఞానం కలగటమే ఆత్మ దర్శనం కాబట్టి ఈ జ్ఞానము, ఆత్మ, బ్రహ్మము అనబడేటువంటి అనేక పదాలకి అచ్చ తెలుగులో ఒక్కటే మాట దాని పేరు నేను. ఆ నేను అనేటువంటిది ప్రతిరోజూ మనం గనక నిన్న ఎట్లా గడిపాం, ఇవాళ ఎలా గడుపుతున్నాం. నిన్నటి జీవితం కంటే ఈరోజేదన్నా మెరుగుపడిందా, బాగుపడిందా, దానికంటే ఉన్నత స్థితికి వెళ్ళామా అన్నది ఎవరికి వారే స్వీయ సాధనలో, స్వీయ శోధనలో, సెల్ఫ్ అసెస్మెంట్లో, సెల్ఫ్ ఇవాల్యుయేషన్లో, సెల్ఫ్ ఆడిటింగ్లో తనని తాను గనక విశ్లేషించుకోగలిగినట్లయితే మనకు నిజానికి ఎవరూ బోధ చేయవలసిన పని లేదు.బోధ అంతా స్వామి వాంగ్మయ స్వరూపంగా మనకు అందించారు. ఈ జీవితం ఎత్తినందుకు, ఈ జన్మ తీసుకోగలిగినందుకు, ఈ శరీరాన్ని పొందినందుకు, ఈ ఆంధ్రదేశంలో పుట్టినందుకు, పుట్టి సత్యసాయి భగవానుడి దగ్గరకు వెళ్లగలిగినందుకు, ఇదంతా కూడా పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ ప్రకారమే. అట్లాగే నడిచిందని, నడుస్తున్నదని, అట్లాగే నడవబోతున్నది, అట్లాగే ముగియబోతున్నది అన్నటువంటి అమిత విశ్వాసంతో ప్రేమ స్వరూపమైనటువంటి స్వామి యొక్క దివ్య మహా స్మృతికి మరొక్కసారి అంజలి ఘటిస్తూ, ఈ భోగి పంట మంటలన్నీ కూడా పాత ఆలోచనలు కాల్చుకునేటువంటి వేళ, అనేక సందేహాలు ఉన్నా సమసిపోయేటువంటి రోజు గనుక, ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి చుట్టూ అలజడి, అంతా అల్లకల్లోలమైనటువంటి ప్రపంచంలో సముద్ర మధ్యంలో ఉన్న నిశ్శబ్ద మహా స్థితిలో మనమందరం కూడా ఈ గదిలో, ఈ పుణ్య క్షేత్రంలో, దీన్నెప్పుడూ నేను హాల్ అనను. ఇదొక పుణ్యక్షేత్రం. ఎందుకంటే పదిహేను సంవత్సరాలు నిరంతరంగా సాయి నామం వినపడింది ఇక్కడ. సాయి తత్వ విచారణ జరిగింది. సాయి బోధలు చూశాం. అనేక సేవా కార్యక్రమాలు రూపుదిద్దుకున్నటువంటి ఈ మహా పుణ్య క్షేత్రంలో మహా మహిమాన్విత స్వరూపులైనటువంటి భగవత్పాదులు, రమణులు, గిల్ల్లమ్మూడి అమ్మ, రామకృష్ణ గురుదేవులు, శారదా అమ్మాయి, వివేకానంద స్వామి, ఇవాళ గురోర్గురు అయినటువంటి భగవాన్ సత్యసాయి. వీళ్లందరినీ కూడా మనం చక్కగా విచారణ చేసుకునేటువంటి ఈ మహద్భాగ్యాన్ని, యోగాన్ని, అవకాశాన్ని కల్పించినటువంటి స్వామికి, దానికి స్వామి ఎన్నుకున్నటువంటి పి.వి.శాస్త్రి గారికి, అలాగే పి.వి.శాస్త్రి గారికి ఒక గుండెకాయ వలె ఈ ఐదు రోజులుగా ఉన్నటువంటి చల్లా రామపణి గారికి స్వామి యొక్క దివ్య అనుగ్రహము పరిపూర్ణంగా లభించు గాక. ఇటువంటి ఉదాత్త శైలిలో అనేక వందల కార్యక్రమాలు జరుగు గాక. అనేక క్షేత్రాలు పరమ పావనమై వెలుగొందు గాక. అట్లాగే ఇంటి దగ్గర ఎన్నెన్ని ఉన్నా, వృత్తిపరమైన ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా, ఈ క్షణాలను పరమేశ్వరుడి కోసం వెచ్చించి, ఈ పరమాద్భుతమైనటువంటి ఈ ఆనంద డోలలో ఊగినటువంటి ఉత్తమ శ్రోతలైనటువంటి మీ అందరికీ మీ ఇరవై యొక్క తరాలు స్వామి ఆరక్షణలో ఉండు గాక. అట్లే ఈ దేహం ఎత్తి వచ్చినందుకు జరిగిన కాలమంతా జరిగిపోగా మిగిలిన కాలమంతా సంతత సత్య సాయిరామ నామస్మరణాంచితమైన దేహంగా వెలిగి, నిత్య సత్య శాశ్వతమైన దేహిగా వెలిగేటువంటి ఆ అనుగ్రహాన్ని స్వామి అందరికీ అనుగ్రహించు గాక అని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
SSSMC · audio
Talk on Sri Sathya Sai - Part 04
Talk on Sri Sathya Sai - Part 04
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 21:22
More in this series