Skip to content
Transcript తెలుగు
అటువంటి సమయంలో సంత దేశమైనటువంటి మహారాష్ట్రలో ఆనాడు మూడు సాంప్రదాయాలు ఉన్నాయి ఒకటి నాథ సాంప్రదాయము రెండవది మారుతి సాంప్రదాయము మూడవది విఠోబా సాంప్రదాయం. మూడు సాంప్రదాయాలు బలీయంగా ఉన్నటువంటి వేళ హిందూ ముస్లింల మధ్య సమన్వయం లేని సమయంలో షిరిడి బాబా అవతారమెత్తారు. షిరిడి అనేది శబ్దం కాదు అసలు మరాఠీ భాషలో శిలాది అంటే చెరుకుతోట అని అర్థం. చెరుకు తోట మధ్యలో ఒక వేప చెట్టు ఉంది. వేప చెట్టు ఉంటే షిరిడి బాబా అనబడేటువంటి మన స్వామి ప్రప్రథమ పూర్ణ దత్తావతారం అయినటువంటి బాబా వారు అక్కడికే వెళ్లారు. వెళ్లి, వెళ్లి ఆరోజు సాయంకాలం ఖండోబా దేవాలయంలో పడుకోవాలి అని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ ఉన్న మహల్ సాపతి "ఇక్కడ నువ్వు పడుకోవటానికి వీలు లేదు కారణం ఏంటంటే నీవు ముస్లిం వేషంలో ఉన్నటువంటి హిందువుగా ఉన్నావు తప్ప నువ్వు హిందువో ముస్లిమో మాకు తెలియట్లేదు మా గుడిలో పడుకోకూడదు" అన్నాడు. ఏం మాట్లాడకుండా సంయమనంతో సహనంతో బాబా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయినారు. కానీ మళ్ళీ తాను ఏర్పరచుకున్న నిర్ణయించుకున్నటువంటి కార్య క్షేత్రానికే మళ్ళీ ఒక పెళ్లివారి గుంపుతో వెళ్ళినప్పుడు అదే మహల్ సాపతి ఆయన్ని "ఆవో సాయి" అని పిలిచాడు. కనుక పేరు ఎవరు పెట్టారు అంటే ఆయనే ఆయన చేత పెట్టించుకున్నారు. అక్కడ నుంచి ఆయన షిరిడి గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళింది లేదు షిరిడి సచ్చరిత్ర అంతా కూడా రెండు మతాల మధ్య ఒక సమన్వయ ధారగా ఒక పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్వరూపంగా భక్తి ఆవేశాలకి జ్ఞాన యోగానికి పరిపూర్ణమైనటువంటి సంకేతంగా సాగింది షిరిడి బాబా అవతారం. అయితే షిరిడి బాబా గురుతత్వ విచారణ గనక చేసినట్లయితే ఆయన ఏం బోధ చేశారు? తన భక్తుడికి కష్టం వస్తే తాను కన్నీరు కార్చాడు. తన భక్తుడు నిప్పుల్లో పడితే దాంట్లో తన చెయ్యి పెట్టాడు. అంటే కర్మ యోగాన్ని జ్ఞాన యోగాన్ని సమన్వయం చేసి భక్తులను రక్షించటం అనేటువంటి ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నది షిరిడి బాబా అవతార లక్ష్యం. అంతే కాదు మామూలుగా గురువైనా ఏం చేస్తాడు జ్ఞానబోధ చేస్తాడు. జ్ఞానబోధలో నుంచి మానవుణ్ణి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాడు. మానవుడు మానవుడిగా జీవించగలిగిన అనేక మార్గాలను ఉపదేశనం చేస్తాడు. కానీ షిరిడి బాబా ధర్మ ప్రచారం చేయలేదు. అలాగే ఆత్మబోధ చేయలేదు. మరి ఏం చేశారు? అజ్ఞానం అంటే ఏమిటో తెలియజెప్పారు. అది విశిష్టమైనటువంటి అవతార లక్ష్యం. అంటే శాస్త్రము చేత, కవిత్వము చేత, పాండిత్యము తే-- చేత, ప్రతిభ చేత, కీర్తి చేత ఎవరు ఉన్మత్తులై ఉన్నారో, ఎవరు గర్వించి ఉన్నారో, నా అంతటి వాడు లేడని అనుకుంటున్నారో అటువంటి వారందరినీ తాను దగ్గరకు ఆకర్షించారు. అందులో నానా జీవితాన్ని గనక తీసుకున్నట్లయితే ఆయన సంస్కృత భాషలో చాలా గట్టివాడుగా భగవద్గీతను అటు నుంచి ఇటు పూర్తిగా అధ్యయనం చేసిన వాడిగా తాను ప్రకటించుకున్నటువంటి నానాకి పాదసేవనము అనేటువంటిది ఇచ్చాడు. ప్రతిరోజూ రాత్రిపూట షిరిడి బాబా దివ్య పాదాలు ఒత్తేటువంటి కార్యక్రమం ఎవరికీ సేవ అంటే ఇదిగో నానాకిస్తే నానా ఒకరోజు రాత్రి ఇట్లాగే ఒత్తుతూ కాళ్లొత్తుతూ సేవ చేస్తున్నానని అనుకుంటూ భగవద్గీతలో తనకు తెలిసిన కొన్ని శ్లోకాలు పునశ్చరణ చేసుకుంటూ లోలోపల అనుకుంటూ ఉంటే ఎన్నడూ నోరు తెరవని బాబా, ఎన్నడూ ఇంటర్ఫియర్ కాని బాబా ఆరోజున అడిగారు "నానా ఏం చదువుతున్నావు?" అని. బాబా-- నానా సమాధానం ఏమిటంటే "బాబా! నీకు తెలియదులే నాకు తెలిసిందేదో చదువుకుంటున్నాను" అన్నాడు. "కాదు, కాదు మరొక్కసారి చెప్పు ఏం చదువుతున్నావు?" అన్నాడు. "అది సంస్కృతంలో ఉన్నదిలే అది భగవద్గీత నీకు అర్థం కాదులే బాబా పడుకోండి" అన్నాడు. "కాదు, కాదు నువ్వు మరొక్కసారి చదువు శ్లోకం ఏమిటి చదువు" అన్నారు. "తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా" "ఇది బాబా" అన్నాడు. "అంటే ఏమిటి నానా?" అన్నారు. "తద్విద్ధి ప్రణిపాతేన, పాతేన అంటే పడుకొని ప్రణిపాతేన సర్వాంగీణమైనటువంటి సాష్టాంగ దండ ప్రమా-- ప్రణామం గనక చేస్తే అది తద్విద్ధి ప్రణిపాతేన సా-- సంతోషం మరి పాతేన అన్నా ఒకటే ప్రణిపాతేన అన్నా ఒకటే కదా మరి కృష్ణుడు అలా ఎందుకు రాశాడు నానా?" అని అడిగారు. "బాబా! కృష్ణుడు అలా రాశాడు ఇలా నేను చదువుకున్నాను నాకు అంతవరకు తెలుసు" అన్నాడు. "సరే పోనీ పరిప్రశ్నేన అంటే ఏమిటి?" "అంటే ఏం లేదు బాబా ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారే అలా మీరు అడగటం నేను సమాధానం చెప్పటం" చూశారా అహంకారం. "నేను అడగటం మీరు చెప్పటం కాదు మీరు అడగటం నేను చెప్పటం ఇదే ప్రశ్నేనా?" అంటే "మరి మళ్ళీ యోగేశ్వర కృష్ణుడు అర్థం లేకుండానే పా-- ప్రశ్నని పరిప్రశ్న అన్నాడా?" అని అంటే "ఏం బాబా! ఇవ్వాళ ఇలా విసిగిస్తున్నారు? నన్ను భగవద్గీతను చదువుకొనివ్వటం లేదే, అవును ఇవన్నీ మీకెప్పుడు వచ్చినయి, ఎప్పుడు తెలిసినయి, ఇవాళే ఎందుకు అడుగుతున్నారు?" అంటే "లేదు, లేదు పరిప్రశ్నేన అంటే ఏమిటో తెలుసుకోవాలి కదా మనం" అన్నారు. అంటే ప్రశ్నేన అంటే ఒక సమాధానాన్ని ఒక వ్యక్తి వేసి గురువు నుంచి వ్యక్తి గనక సమాధానాన్ని పొందితే అది ప్రశ్న. పరిప్రశ్న అంటే ఒక ఉదాత్తమైనటువంటి వ్యక్తి ఉదాత్తుడైనటువంటి గురువుని గనక ప్రశ్నించినట్లయితే గురుముఖతః వచ్చేటువంటి సమాధానము విశ్వజనీనమై, సార్వకాలికమై, సప్రమాణికమై, సర్వాధారభూతమై, మార్గోపదేశనమై, ఉపనిషత్ సమానమై ఏదైతే ఉంటుందో అది పరిప్రశ్న. అంటే వేయదగిన ప్రశ్న పొందదగిన సమాధానం ఏదైతే ఉన్నదో దాని పేరు పరిప్రశ్న. "సరే పోనీ దాన్ని అక్కడ పెట్టు సేవయా అంటే ఏమిటి?" అని అడిగారు.ఏం బాబా ఇదిగో మీకు చేస్తున్నది సేవయా ఇదే సేవ అన్నాడు. నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చేశాను అనుకున్నావే అది సేవ కాదు అది చాకిరీ. చాకిరీ చేస్తే కాస్త కూలి డబ్బులు దొరుకుతాయి సేవ చేస్తే నన్ను పొందుతావు గ్రహించావా? అందుకే యోగేశ్వర కృష్ణుడు శ్లోకాన్ని ప్రపంచానికి అందించాడు. భగవద్గీత ని శబ్దంగా కాక, అర్థంగా కాక, శబ్ద సమన్వయంగా కాక, నీకు తోచిన రీతి కాక, అర్థము కాక, అన్వర్ధము గాక, సమర్ధవంతమైన అంతరార్థాన్ని, తత్వాన్ని గనుక నీవు గ్రహించినట్లయితే కర్మ యోగము భక్తి యోగము రెండు కావు అవి రెండు స్థితులు. అలాగే కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞాన యోగం కంటే భిన్నం కావు. మూడు, మూడు స్థితులుగా ఉన్నాయి కనుకనే పద్దెనిమిది అధ్యాయాలలో తొలి ఆరు అధ్యాయాలు కర్మ యోగంగా మళ్ళీ ఆరు అధ్యాయాలు భక్తి యోగంగా చివరి ఆరు అధ్యాయాలు జ్ఞాన యోగంగా ఉన్నాయి గనుక ఇది ఒక త్రిపుటి. కర్మ లేని భక్తి, కర్మ భక్తులు లేని జ్ఞానము, జ్ఞానము లేని భక్తి కర్మలు, పరిపూర్ణమైనటువంటి శూన్య స్థితి గనుక మానవుడు అన్నివేళలా ఏది చేసిన భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, physical, metaphysical, spiritual అనేటువంటి మూడు స్థాయిలలో తన జీవితాన్ని, తన ఆలోచనని, మానవ సంబంధాలని, సామాజిక బంధాలని, ఇంతందుకు తన జన్మని సమన్వయ ధోరణిలో సాగించాలి కనుక ఇదే పరిపూర్ణమైనది, ఇదే అసలు విద్య, ఇది అచ్చ విద్య, ఇది అచ్చ తెలివి, ఇది బ్రహ్మవిద్య, ఇది ఆత్మవిద్య అని బోధించినది షిరిడి బాబా. అందుకనే ఆయన ఎవరికి దర్శనం ఇచ్చిన శివ, మారుతి దర్శనాలు ఇచ్చారు. శివుడు గానో మారుతి గానో అవి రెండు సాంప్రదాయాలు. ఇక మూడవది నాథ సాంప్రదాయం మహారాష్ట్ర దేశానికి మాత్రమే చెందింది గనుక షిరిడి బాబాను మాత్రమే షిరిడి సాయినాథుడు అని పిలుస్తాం. దత్త సాంప్రదాయంలో ఉన్నారు గనుక సాయినాథ్ మహారాజ్ అంటాం. మహరాజ్ అంటే డబ్బున్న గురువు అని కాదు. షడ్వర్గములకు, షడూర్మములకు, షడ్వికారములకు అతీతమైనటువంటి అన్ని సంపదలకు మూలమైనటువంటి విభూతి ఏదైతే ఉన్నదో అది అధిష్టానమైనది, పూర్ణమైనది, అధికమైనది, ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది, అసలు నిజమైనటువంటి సంపద ఏది అంటే విభూతి అంటే irreversible process అంటాం science లో. అంటే మళ్ళీ మరలిరాని పాలలో నుంచి నెయ్యి తేవచ్చు. పాలు, పెరుగు, వెన్న, మీగడ, చిలకటం, మజ్జిగ కావటం, వెన్న రావటం, నవనీతం పుట్టటం. కానీ నవనీతంలో నుంచి మాత్రం ఒక్క చుక్క పాలు బయటకు రావు. అట్లాగే మానవుడు తన జీవితాన్ని, మానవత్వాన్ని, దానవత్వాన్ని, దీనత్వాన్ని అధిగమించి దివ్యత్వాన్ని గనుక తాను అనుభవించగలిగినట్లయితే అటువంటి వాడి జీవితము మాత్రమే విభూతిమయము. అక్కడ షిరిడి బాబా అవతారం పరిపూర్ణమైంది. అప్పుడే షిరిడి బాబా ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి పరమ మార్మికమైనటువంటి మహా పరిసత్యాన్ని ఆవిష్కరించారు. మళ్ళీ ఎనిమిది సంవత్సరాలకి ఆంధ్రదేశంలో నేను వస్తాను అని. అదే నవంబరు ఇరవై మూడు, పంతొమ్మిది వందల ఇరవై ఆరు సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అవతరణం జరిగినటువంటి పరమ పుణ్యకాలమది. సమయంలోనే పాండిచ్చేరిలో అరవిందుల వారు ధ్యాన నిద్రా ముద్రాంకితమైనటువంటి స్థితిలో ఉండగా ధారణ పూర్ణమై ధ్యానంలోకి ప్రవేశిస్తున్నారు. ధ్యానంలో వారు చేసినటువంటి ప్రప్రథమ దర్శనము ఏమిటి అంటే నవంబరు ఇరవై నాలుగు పొద్దున పాండిచ్చేరిలో ప్రకటించారు ఒక్కమాట. కృష్ణావతారము ప్రపంచంలోకి వచ్చి సర్వజగన్మోహనంగా సర్వ ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకోవలసి ఉన్నదో తేజోమయ బ్రహ్మ విభూతి ఇప్పుడు అవతరించింది అని ఒక ప్రకటన చేశారు. అవతారం, ప్రకటన సత్యసాయి భగవానుని గురించిన అవతారం. ఎందుకంటే యోగులు మార్మికంగా, నర్మగర్భంగా, కాస్త గుప్తంగా అంత మరింత open గా చెప్పరు గనుక వాటన్నింటిని మనం చక్కగా correlate చేయాలి, సమన్వయం చేయాలి, మన అనుభవాన్ని జోడించాలి, పరమాత్మ నడిచిన తీర్థయాత్రను గమనించాలి, మనవైనటువంటి మన intellect తో మన మేధతో కొంతవరకు దానిని గ్రహించగలగాలి. కానీ పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం చేత పరిపూర్ణమైనటువంటి అవగాహనా స్థితిలో మూర్తి యొక్క పూర్ణత్వాన్ని మనం అనుభవించవలసి ఉన్నది. కనుకనే సత్యసాయి భగవానుడు సర్వదేవతా అతీత స్వరూపులైనారు. ఎట్లా అయినారంటే సత్య యుగన్నాటి సత్యము, త్రేతాయుగన్నాటి ధర్మము, ద్వాపర నాటి శాంతి ప్రేమలు, కలియుగంలో పారాడవలసిన అహింసా ప్రవృత్తి ఇదంతా ఐదు కలిపితే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు ఒక మూర్తిమంతమైనట్లయితే, ఒక ఆకారమైనట్లయితే, ఒక స్వరూపమైనట్లయితే, ఒక మానుషాకారమైనట్లయితే, ఒక మహిమా స్వరూపమైనట్లయితే అది భగవాన్ శ్రీ సత్యసాయిగా ప్రపంచంలోకి ఆవిష్కరణ జరిగిపోయింది. అయితే అనేక పేర్లున్నాయి ఇందాక ఆవో సాయి అన్నారే. ఆవో సాయి అనటంలో చాలాకాలం షిరిడి బాబా దేశానికి చెందినవారు కాదని, ఆయన భాషంతా అరబిక్, పర్షియన్ భాషలలో సాగుతుందని, అది ఇటు మరాఠీ లేదు, అటు సంస్కృతం లేదు, భారతీయ భాషలు లేవు. ద్వారకామాయి లోపల రాత్రిపూట వారు ఏకాంతంలో పచార్లు చేసుకుంటూ తనలో తాను మాట్లాడుకున్నటువంటి మాటలు దేశంలో ఉన్న భాషకు చెందనివి అని అన్నప్పుడు చరిత్రకారులు గాని, భక్తులు గాని ఎవ్వరూ దాని జోలికి పోలేదు. ఆయనది భాష అయితే ఏమి ఆయన దేవుడు అని నమ్మారు అక్కడ వదిలిపెట్టారు. కానీకాలగమనంలో అవతారమూర్తి అయినా గుట్టు విప్పాలి, విషయం చెప్పాలి, సమన్-సమన్వయం చేయాలి, సంఘర్షణకు తావులేని రీతిలో మానవ జీవితం కొనసాగేలా చూడాలి గనుక పర్వత కాలంలో వచ్చిన ఉపన్యాసాలలో సత్యసాయి భగవానుడు ఒక మాట చెప్పారు. ఏమని అంటే సాయి అన్న పదము పరిపూర్ణ వైదికమైనటువంటి మాట. వైదికము అంటే వేద పరమైన మాట. అతి ప్రాచీనమైనటువంటి మాట. అది అర్వాచీనంగా ఇవ్వాళ కొత్తగా విన పడుతున్నది గనుక పరమేశ్వరుడు మహా మంత్రా రత్నవ గ్రంథంలో "సర్వభ్యః సర్వ సర్వభ్యః" అన్నప్పుడు పరమేశ్వరుడి యొక్క ఏకాక్షర నామము ఏది అంటే సహ అంతే. తర్వాత ఆయన శివుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఇంకోటి కావచ్చు పరబ్రహ్మము యొక్క సంకేతము రూపంగా గనుక చూస్తే దాని పేరు సహ. ప్రణవంగా శబ్దంగా గనక అయితే అది ఓం. అకార, ఉకార, మకారములతో కూడి ఉన్నది. కనుక సహ ఎవరితో కూడి ఉన్నది? ఆయి అంటే అమ్మ. అయ్యవారు, అమ్మవారు కలిసి ఉన్నారు. అదే అర్ధనారీశ్వర తత్వాన్ని మనం మొదట్లో విచారణ చేశాం. కాబట్టి సాయి అంటే అర్ధనారీశ్వర తత్వంతో ఉన్నటువంటి ఒక మహేశ్వర శక్తి దత్త భూమిక లోకి వచ్చి ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటుంది గనుక పరిపూర్ణమైనటువంటి దత్తావతారమే షిరిడి బాబా అని ప్రమాణీకరించింది ఎవరో కాదు భగవాన్ సత్యసాయి. నిజానికి అది నా పూర్వ శరీరమని, షిరిడి నా పాత మందిరమని, నేను అప్పుడే వచ్చానని స్వామి చెప్పేదాకా ఆంధ్రదేశంలో షిరిడి బాబాకి మందిరాలు లేవు. చిన్న ఎనిమిది అంగుళాల బస్ట్ సైజు ఫోటోలు మూడు ఉండేవి. చిన్న బొమ్మలు. మూడు ఏవి ఎక్కడ ఉన్నాయి అంటే మొట్టమొదటిది చీరాల, రెండవది గుంటూరు, మూడవది తెనాలి, అంతే. మూడు చోట్ల తప్ప షిరిడి బాబాని గురించిన విచారణ ఆంధ్రదేశంలో జరగలే. కానీ ఎప్పుడైతే ఇది నా పూర్వ శరీరం అని స్వామి అన్నారో, అన్న తర్వాత తదనుగుణంగా అనేకమైనటువంటి నిదర్శనలు అనేకమందికి interviews ఇచ్చినప్పుడు ప్రదర్శన పూర్వకంగా వాటికి సమాధానం చెప్పారు. తర్వాత ఆంధ్రదేశంలో రామాలయం లేని గ్రామాలన్నీ కూడా సాయి రామాలయాలు ఉండేట్టుగా మారిపోయిన వైనం మనం చూశాం. ఇవ్వేళ సాయిరాముడి గుడి లేనటువంటి ప్రదేశం ఆంధ్రదేశంలో లేదు. మళ్ళీ కోదండరాముడు వెనక్కి వెళ్ళాడేమో, ఎక్కడున్నాడో కాస్త వెతుక్కోవాలి గానీ షిరిడి సాయిబాబా మందిరాలు కొన్ని వేలు, వందలు పుంఖానుపుంఖంగా వచ్చి, అవన్నీ కూడా షడైశ్వర్య సంపన్నమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి విభూతి స్థాయికి శక్తి క్షేత్రాలుగా పరమాత్మ యొక్క పిలుపు మనం ఒక్కసారి పిలిచినట్లయితే ఓయీ అనగానే సాయి అనగానే ఓయీ అని ప్రతిధ్వనించేటువంటి ధర్మ క్షేత్రాలుగా షిరిడి బాబా మందిరాలన్నీ ఏర్పడ్డాయి. ఇది చరిత్ర గతిలో మనం చూసినటువంటి ఒక దివ్య పరిణామం. ఆచరణీయం, ఆహ్వానించదగినటువంటి ఉదాత్త వైఖరి. సమయంలోనే పంతొమ్మిది వందల నలభై ఏడు దేశానికి స్వాతంత్రం వస్తే, అంటే అవతారం రావటానికి కారణాలు పౌరాణికంగా మనం విన్నాం. రాముడు ఎందుకు వచ్చాడు అన్నప్పుడు మిధిలా నగరంలో రాజర్షి అయిన జనకుడు, దశరథ మహారాజు రాజ యోగంలో ఉన్నటువంటి వాడు అయోధ్యలో, లంకానగరంలో తమోగుణంలో ఉన్న రావణబ్రహ్మ ఏకకాలంలో సమన్వయం లేనప్పుడు మాత్రమే రాముడు వచ్చాడు. రాముడి కంటే ముందు అరవై మూడు ఇక్ష్వాకు రాజులు వచ్చినా ఒక్కడూ దేవుడు కాలే. ఉత్తములైన రాజులే తప్ప వాళ్ళు పరమాత్మలు కాలేకపోయినారు. ఎందుకనంటే అరవై నాలుగవ వాడు పరమాత్మే రాజుగా వచ్చినటువంటి ఒక దివ్య విభూతి, అది ఒక పతాక స్థాయి గనుక ధర్మోద్ధరణ కోసం ఆయన ఎట్లా వచ్చాడో అట్లాగే "పరిత్రాణాయ సాధునాం" అనే మాటకి అనుగుణంగా శ్రీకృష్ణుడు ఎట్లా వచ్చాడో సత్యసాయి భగవానుడి అవతరణకు ముందు కాలాన్ని రెండు నిమిషాలు మనం పరామర్శ చేయాలి. పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశం ఒక స్వాతంత్రాన్ని పొందినా ఇంకా బానిసత్వ ఛాయలు పోని కారణంగా, ఇంకా దేశంలో అనేకమైనటువంటి హైందవేతర మతాలన్నీ కూడా వేళ్ళూనుకొని ఉన్న కారణంగా, రెండు వందల సంవత్సరాలలో ఆకలిని అమ్మిన కారణంగా, చదువుని అమ్మిన కారణంగా, జాతిని మతపరమైనటువంటి భావనలో నుంచి ఒక ఉదాత్త స్థాయి నుంచి పరమ నీచమైన స్థాయికి దిగజారుతున్నటువంటి వేళ అనంతపురం అనేటువంటి ఒక్క జిల్లాలో అనేకమంది దేవతా విగ్రహాలు, దేవతా పటాలు బయట పారేసి అన్నం పెట్టని మాకి దేవుడు అక్కరలేదన్నటువంటి పుట్టపర్తిని స్వామి తన కార్యక్షేత్రంగా ఎన్నుకున్నారు. ఎక్కడో అన్నీ సమృద్ధంగా ఉన్న చోట వస్తాడా పరమాత్మ? ఏం నాయనా ఇంత చిన్న వయసులో రేపు రాజు కాగలిగిన వాడివే అరణ్యానికి ఎలా వెళ్ల-వెళ్లగలవయ్యా అని కౌసల్య అడిగితే రాముడు అన్నాడు, అమ్మా అరణ్యాన్ని చుట్టానికి వచ్చిన వాడినే కానీ అయోధ్యను ఏలటానికి వచ్చిన వాడిని కాదు. నేను కష్టపడుతున్నానని నీకు అనిపిస్తున్నదేమో గానీ ఎందరి కష్టాలను నేను తీర్చటానికి వచ్చాను తప్ప నా కష్టమూ లేదు, సుఖమూ లేదు. అందుకే సత్యసాయి భగవానుడు తన అరవయ్యవ సంవత్సరం శరీరానికి వచ్చినప్పుడు పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఒక మాట చెప్పారు. నేను యోగిని కాను, నేను భోగిని కాను, నేను అవధూతను గాను. నేను నేనైన నేను. సర్వకాల జవసత్వమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి ఆత్మ శక్తిని నేను అని సత్యసాయిబాబా వారు ప్రకటించారు. కారణంగా స్వామి అక్కడికి అవతారం తాల్చి వచ్చినటువంటి వేళ పరిస్థితులు ఏమీ బాగా లేవు. కులం చేత, మతం చేత, డబ్బు చేత, అహంకారం చేత, వర్గ వైషమ్యాల చేత రక్తం ఏరులై పారే పరిస్థితి ఉండి ఒక్క నీటి బొట్టు కూడా నోచుకోనటువంటి, ఒక గింజ అయినా నోచుకోనటువంటి ప్రదేశంలో ఇల్లు తక్కువ, పుట్టలు ఎక్కువ, మనుషులు తక్కువ, పాములు ఎక్కువ అటువంటి ప్రదేశాన్ని స్వామి ఎంచుకొని తన అవతార కార్యక్రమాన్ని అక్కడ శ్రీకారం చుట్టారు. పంతొమ్మిది వందల నలభై మే ఇరవై మూడవ తారీఖున ఆయన సాయిబాబా అని declare చేశారు.అలాగే అదే సంవత్సరం పందొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవయ్యవ తారీఖున స్వామి తన దివ్య కార్యక్రమాన్ని ప్రపంచానికి చెప్పారు. ఏం చేయబోతున్నాను చెప్పారు. కృష్ణుడు చెప్పినట్లే "పరిత్రాణాయ సాధూనాం" చెప్పినట్లే వీరు కూడా "ధర్మోద్ధరణ, వేదోద్ధరణ, దీనజనోద్ధరణ" నా కర్తవ్యమే. ఇది నా అవతారంలో ప్రధానమైనటువంటిది. ఒక్కరు నాతో కలిసి వచ్చినా, ఒక్కరూ నాతో కలిసి రాకపోయినా రెండు గడ్డిపోచలను అడ్డం పెట్టుకుని నా అవతార కార్యక్రమం కొనసాగిస్తాను. అది సర్వ ప్రపంచానికి ఒక ధర్మాన్ని చాటుతాను. మానవుడు మానవుడిగా జీవించనటువంటి అధ్యాత్మ ప్రయోజన శూన్యమైనటువంటిది. కేవలం శాస్త్రాలలో, శ్లోకాలలో ఉండిపోయినటువంటి ఒక అద్వైత సిద్ధాంతం గనుక ప్రపంచంలోకి ఒక ఆచరణాత్మక దివ్య విధానంగా ప్రేమతో కూడి గనుక అది ప్రవహించకపోయినట్లయితే శాస్త్రాలన్నీ నిరర్థకమే అంటూ సత్య సాయి భగవానుడు అవతార మూర్తి కూడా చేయనటువంటి అనేక వాహిని స్వరూపంగా వాంగ్మయాన్ని మళ్ళీ ఈనాటి కాలానికి మనకు అర్థమయ్యేటువంటి రీతిలో రామకథా రస వాహినితో మొదలై అనేక వాహిని స్వరూపాలు సూక్త వాహిని, జ్ఞాన వాహిని, ప్రేమ వాహిని, ధర్మ వాహిని ఇవన్నీ కూడా స్వయంగా రాశారు. ఎవరి చేతో రాయించల. స్వయంగా కూర్చొని రాసి తొలినాళ్ళలో అలాగే మహా చైతన్య ప్రభువు ప్రపంచానికి ఒక భజన సాంప్రదాయాన్ని ఇచ్చినటువంటి వేళ నెమ్మది నెమ్మదిగా భజనలకి మానవుడు దూరమైనటువంటి వేళ "మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం" అంటూ తొట్ట తొలి భజనకి శ్రీకారం చుట్టినప్పుడు స్వామి చుట్టూ ఉన్నటువంటి వారు కేవలం తొమ్మిది మంది మాత్రమే. అప్పటికప్పుడు దానికి ఒక స్వరం కట్టి, ఒక పాట కట్టి, అందరికీ నేర్పి, భజన సాంప్రదాయంలో రాగ, భావ, తాళ, లయాత్మకంగా ఎట్లా ఉన్నదో మీ జీవితాలను భౌతిక, ఆధి భౌతిక, ఆధ్యాత్మిక స్థితులలో సమన్వయం చేసుకుంటూ పరిపూర్ణం చేసుకోండి, పరితృప్తం చేసుకోండి, పరిపుష్టం చేసుకోండి, సర్వజన హితంగా ఉంచండి. పరోపకారాయ. శరీరం ఎందుకు ఉన్నది అంటే పరోపకారం కోసమే. పరోపకారం అంటే డబ్బు విదలచటం కాదు, చందా ఇవ్వటం కాదు. పరా పరమేశ్వరుడికి ఉపా దగ్గరగా కరా. పని చేసినా పరమేశ్వరుడి దగ్గరకు వెళ్లగలిగేటువంటి స్థాయి ఏదైతే ఉన్నదో అది మాత్రమే పరోపకారము కాబట్టి, అది మాత్రమే పుణ్యం కాబట్టి దానిని ప్రపంచానికి ఒక ఘోషగా, ఒక భావనగా, ఒక బోధగా, ఒక ఉపదేశంగా, ఒక సందేశంగా, ఒక ఆదేశంగా, ఒక సాప్రమాణికమైనటువంటి భావన రీతిలో పరమేశ్వరుడు అనుగ్రహించాడు. అలా సాగుతూ ఉండగా పందొమ్మిది వందల నలభైకి, పందొమ్మిది వందల యాభైకి, పదేళ్లే తేడా. పదేళ్లు అయిందో లేదో "నా సంకల్పం ఈరోజు నుంచి ప్రారంభం" అన్నారు. పందొమ్మిది వందల యాభై రాగానే ప్రశాంతి నిలయం నిర్మాణం పూర్తి చేసేశారు స్వామి. అంటే ఒక ధర్మ పతాకాన్ని ఎగరవేశారు. తాను-తనకొక స్థానాన్ని తన చుట్టూ చేరవలసిన వారందరినీ చేర్చుకుని, "కేవలము మీ ఇంట్లో, మీ వంటలో భజన చేస్తే కుదరదు. ప్రపంచమంతా కాలుష్యమయం అయిపోయింది. భావ కాలుష్యం ఎక్కువగా ఉన్నది. పరస్పర ద్వేషాలున్నాయి. అందరూ నిద్రలో, మత్తులో జోగుతూ ఉన్నారు గనుక నగర సంకీర్తన ప్రారంభించండి. మీరు ఎప్పుడైతే సుప్రభాతాం చితనవ ప్రభాత వేళ పరమేశ్వరుడి యొక్క నామ సంకీర్తనం చేస్తూ వీధుల కుండా మీరు వెళతారో నిద్రలో ఉన్నవారంతా సిగ్గుపడన్నా లేచొచ్చి మీతో పదము, పాదము కలుపుతారు గనుక నగర సంకీర్తన చేయండి" అన్నారు. చూడండి! సన్యాస దీక్ష నేను అడిగితే మరొకడు వెంటనే ఇవ్వడు. "దీక్ష క్రమ సన్యాస దీక్ష" అన్నారు. క్రమంగా జరగాలి. ఎన్నో వదిలిపెడితే తప్ప అసలుది పట్టుకోలేం. అన్నీ పట్టుకున్నా అసలుది పట్టుకోకపోయినట్లయితే మానవ జీవితం వృధా. కనుకనే స్వామి భజన, నగర సంకీర్తన ఇట్లా చేస్తూ చేస్తూ ఆరు కాండలుగా తమ జీవితాన్ని కొనసాగించారు. ఆరు కాండలు ఒక్కొక్కటి పదహారు కళలుగా కొనసాగించారు. కనుకనే ఆరు ఇంటు పదహారు తొంభై ఆరు. అనంగానే కాదు ఎనభై ఆరేగా? అనే ప్రశ్న ఉంది. చివరి సమాధానం చెప్తాను. ఆరు ఇంటు పదహారు తొంభై ఆరు. తొలి పదహారేళ్లు పరమాత్మ తన అవతార కార్యక్రమాన్ని గుప్తంగా ఉంచినటువంటి సమయం. భారతీయ అధ్యాత్మ చరిత్రలో అతి చిన్న వయస్సులో అవతార కార్యక్రమం ప్రకటించినటువంటి వారు శంకర భగవత్పాదులైతే చాలా సుదీర్ఘమైనటువంటి జీవన అనంతరం తన అవతార కార్యక్రమాన్ని ప్రకటించినటువంటి వారు షిరిడి బాబా. వారు మూడవ ఏట నాలుగు వేదాలని నాట్యం ఆడించుకున్నటువంటి వారు శంకర భగవత్పా-పాదులు. షిరిడి బాబా తమ శరీరానికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు వచ్చే వరకు ఆయన ఎవరో హిందువో తెలియదు, ముస్లిమో తెలియదు. ఫకీరో తెలియదు, పామరుడో తెలియదు, పండితుడో తెలియదు, జ్ఞానో తెలియదు, ఉన్మత్తుడో తెలియదు. తనలో తాను ఆనంద స్థితిలో ఉండే ఆత్మానందుడో తెలియదు. ఎవ్వరికీ ఏమీ తెలియని రీతిలో ముప్పై తొమ్మిది సంవత్సరాలు మహా గుప్తంగా సాగినటువంటి అవతారం షిరిడి బాబా. సత్య సాయిబాబా వారి అవతారం అటువంటిది కాదు. మళ్ళీ పదహారేళ్ళ తొలి షోడశి వికాసమానం చెందటానికి ముందే పధ్నాలుగు సంవత్సరాలు, నైన్టీన్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఫోర్టీన్. అది నైన్టీన్ ఫోర్టీ. అప్పుడే డిక్లేర్ చేశారు. కాబట్టి పధ్నాలుగవ ఏట తన కార్యక్రమాన్ని ప్రపంచానికి చాటారు. అక్కడ నుంచి ప్రారంభమైంది సుమారు డెబ్బై రెండు సంవత్సరాల బ్రిటిష్ క్యాలెండర్ ప్రకారం సాగినటువంటి అవతార కార్యక్రమం.
SSSMC · audio

Talk on Sri Sathya Sai - Part 02

Home

Talk on Sri Sathya Sai - Part 02

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 23:39

More in this series

Talks on Sri Sathya Sai

4 episodes · 1 hr 35 min

  1. 27 min 1

    Talk on Sri Sathya Sai - Part 01

  2. 23 min 2

    Talk on Sri Sathya Sai - Part 02

    Now playing
  3. 22 min 3

    Talk on Sri Sathya Sai - Part 03

  4. 21 min 4

    Talk on Sri Sathya Sai - Part 04