No transcript for this section.
Transcript begins at 0:43.
విశ్వాసం ఉన్న తర్వాత నన్ను సమగ్రంగా దర్శనం చెయ్. పూర్తిగా దర్శనం చెయ్. పూర్తిగా దర్శనం చేసిన తర్వాత, భేదం లేని దర్శనం చెయ్. మా గురువుగారు ఇంకో గురువు గారి కంటే ఎక్కువ తక్కువ అని పెట్టుకోకు. నీ గురువు గురువే. సర్వోన్నతమైనటువంటి గురువు. ఆ గురువు నీకు లభించాడు. ఇంకా మళ్ళీ ఇంకో గురువుతో నీకు పని లేదు. కాబట్టి ఆ గురువుతో సమ్యక్ దర్శనం చెయ్. ఈ సమ్యక్ దర్శనం చేసిన తర్వాత, ఈ రెండు సమగ్రమైనటువంటి విచారణ ఉండాలి, సమన్వయం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఈ మూడు అయిన తర్వాత ఏర్పడేటువంటి ఒక భావనే దాని పేరే అసలైనటువంటి యోగము. ఆ అసలైనటువంటి యోగాన్ని మీరు పొందండి. ఈ వేళ యోగా అనగానే కీళ్ల నొప్పులకి, కాళ్ల నొప్పులకి మనం దాన్ని దింపేసాం. కాదు కానీ కాదు. దానికి దీనికి సంబంధం లేదు తెలుసా? యోగము అంటే పరమాత్మ భావనతో కూడి ఉండటం. మనతో మనం కూడి ఉండటమే యోగం. కాబట్టి భోజన సమయంలో అందరూ చక్కగా మాకు మా తొలి గురువైనటువంటి రఘురాదాస్ గారు, నా నాలుగవ ఏట వారు చెప్పిన మాట ఇప్పటికీ నేను పాటిస్తా. అది ఏమిటి అంటే అన్నం తినేటప్పుడు చాలా తక్కువ తినమనేవారు ఆయన. చాలా-- మీరు పెద్దవాళ్ళు అయ్యేటప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఇప్పటి నుంచే చాలా తక్కువ తినటం నేర్చుకోండి. మీకు నాలుగు పిడికిళ్ల అన్నం చాలు. కావాల్సింది ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోండి. దేనిని పడేయకండి. కానీ తింటున్నంత సేపు కూడా పైకి అనకపోయినా మానసికంగా భగవన్నామ స్మరణ చేసుకోండి. హరే రామ హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. లేదా వాసుదేవా, లేదా సాయిరామా. ఆటి ఏది చూస్తే భగవన్నామం చేస్తూ గనుక భోంచేస్తే, ఈ వేళ చెప్పబడే భయంకరమైన రోగాలు శరీరంలోకి రావటానికి భయపడతరు. మన శరీరానికి రోగాలని ఆహ్వానం చేస్తున్నాం. ఎట్లా? అన్నం తింటూ TV చూస్తున్నాం. కదా? ఆ TV లో ఏమున్నాయి? ఒక్క మంచి లేదు. రక్తపాతాలు చూస్తున్నాం. ఎవడో వెంబడిస్తున్న హంచలు చూస్తున్నాం. మనం తినే అన్నం జీర్ణకోశంలోకి ఎట్లా వెళుతుంది? విషపూరితమై ప్రవేశిస్తున్నది గనుక అధ్యాత్మ మార్గంలో ఉన్నటువంటి వాడు నిజంగా సాధన చేయాలి అనుకున్నట్లయితే you stop watching TV. లేదా కాసేపు ప్రపంచంలో విషయాలు తెలియాలి కదా? పొద్దున ఒకసారి, సాయంకాలం ఒకసారి. ఆ న్యూస్ వాళ్ళు చెప్పేదంతా మనకక్కర్లా. details అక్కర్లా. ప్రపంచంలో ఏమన్నా మార్పులు జరుగుతున్నాయా, మా చుట్టూ ఏదైనా జరుగుతున్నదా తెలుసుకోవాలి. ఆ స్పృహ అవసరం కాబట్టి అంతవరకే దాన్ని వాడండి. పుస్తకాన్ని మీ స్నేహితుడిని చేసుకోండి. పుస్తకాన్ని మీ గురువుని చేసుకోండి. ఆయన ఎప్పుడూ మీతో ఉంటాడు. ఎక్కడ ఏ పేజీ తెరిచినా ఎక్కడోకడ మీకు ఒక బోధ దొరుకుతుంది గనుక స్వాధ్యాయంగా దీన్ని స్వీకరించండి. ఆ తర్వాత భోజనానంతరం, పిల్లలు దేశంలో ఉన్నట్లయితే, ఈ దేశంలో ఉన్నా నాతో ఉండేది ఎక్కడో వీళ్ళు ఎక్కడో ఉన్నారు. వాళ్ళ దారిన వాళ్ళు, వదిలేద్దాం కనీసం మనం అనుకున్నట్లయితే భార్యాభర్త స్నేహితుల్లా జీవించండి. అయిపోయింది. ఆ కాలమంతా గడిచిన కాలమంతా అయిపోయింది. దాని ఫలితాలు ఆనందము, దుఃఖము కలిగిందేదో కలిగింది. ఆ స్నేహము అంటే దాన్ని రమణులు చెప్తారు. "అద్యధాయా స్వతస్సా స్వం సరళ చింతనం విరళ తత్పరం" అంటారు ఉపదేశ సారంలో. ఒక యజ్ఞకుండంలో, హోమగుండంలో నేతి ధార ఎట్లాగైతే తగకుండా పడుతున్నదో, మీ ఆలోచనలు కూడా పరమాత్మ యందు అరాహతరాగంగా ఉండాలి. ఎక్కడా ఆటంకంగా ఉంచుకోండి. పరస్పరము మీరు మాటలు మాట్లాడుకోండి. ఆత్మోన్నతి కోసం కొంత ప్రయత్నం చేయండి. తద్వారా మానసిక బాంధవ్యం పెరుగుతుంది. ఆ బాంధవ్యంలో నుంచి ఒక పవిత్రత ఏర్పడుతుంది. ఆ పవిత్రతంలో నుంచి ఒక విశాల భావన ఏర్పడుతుంది. దానిలో నుంచి జీవుడు ముక్త స్థాయికి చేరుకుంటాడు గనుక అధ్యాత్మ సఫల మార్గాన్ని మనం ఎట్లా చేయాలి? దీన్నంతటినీ, ఇన్ని మార్గాలనీ కలిపి సత్యసాయి భగవానుడు మనకి రెండే రెండు మార్గాలుగా దాన్ని కుదించారు. ఆ రెండే రెండు మార్గాలు ఈ వేళ చాలా అవసరం. రమణులు ఎట్లాగైతే ఏమీ లేదు ఊరక ఉండండి అనారో, శంకర భగవత్పాదులు ఎట్లాగైతే చండాలు వస్తు, ద్విజ వస్తు అంటూ మనిషాపంచకం మనకి చెప్పారో, నాకు చండాలుడైనా, బ్రాహ్మణుడైనా ఎవరైనా సరే పరమేశ్వర భావన యందు నా మనస్సు నిమగ్నం కనుక చేయించగలిగితే వాడికి నేను నమస్కరిస్తున్నాను అన్న శంకర భగవత్పాదులు. ఈ వేళ మనం కూడా కుల, మత, జాతి, వర్గ, వర్ణాలకి అతీతంగా మన జీవిత యాత్ర చేయాలి. ఒక్క కులము, ఒక్క జాతి నడవదు. సమస్త జాతుల యొక్క కలయిక ఒక సమాజంగా ఏర్పడుతున్నది గనుక, పరస్పరము ప్రేమభావంతో జీవించాలి గనుక కులమతాతీతమైనటువంటి, అవి లేవు అన-- లేకుండా ఉండవు, ఉంటాయి. వాటితో పాటు మనం ఉండగలిగిన ఒక నేర్పరితనాన్ని, ఒక సంయమాన్ని, ఒక ఆ మానసికమైన విశుద్ధ భావనా సీమని మనం ఏర్పరచుకుంటూ అందరితో ఆ సహజీవనం చేయగలిగినటువంటి ఒక స్థాయిని, అది ఇచ్చేటువంటి సౌందర్యాన్ని అనుభవించగలిగినట్లుగా మన జీవయాత్ర సాగాలి. ఇది చాలా ప్రధానమైనటువంటిది. ప్రపంచాన్ని మనం మనసుతో చూడటం మొదలుపెడితే స్పర్ధకి దారితీస్తుంది. మనసు divide చేస్తుంది. హృదయం కలుపుతుంది. హృదయాంతర్గతమైనటువంటి భావనలో నుంచి మీరందరూ నావారే, నేను మీ అందరికీ చెందినవాడిని అన్న భావన రాగానే సర్వం ఖల్విదం బ్రహ్మ. సమస్తము ఏకమవుతున్నది. ఈ ఏకాత్మ భావనలోకి మనం వెళ్ళాలని అనేకమంది గురువులు అనే...ఇటువంటి మీటరులో మనకు బోధిస్తూ వచ్చారు గనుక ఆ పరస్పరమైనటువంటి విశుద్ధమైనటువంటి భావనలో మనం చల్లగా సాగాలి. ఇది చాలా ప్రధానమైనటువంటిది. నిరాడంబరమైన జీవితాన్ని గడపాలి. తక్కువ కోరికలు మనం దగ్గర పెట్టుకుంటే మనకి బరువు చాలా తక్కువ. ఇవాళ ప్రపంచంలో ఇది వస్తు ప్రపంచం. అసలు ప్రపంచం ఒక వస్తువు. ఆ ప్రపంచం అనే వస్తువులో అనేక వస్తువులు ఏర్పడ్డాయి. అన్ని వస్తువులు మనకు అక్కర్లేదు. మనకు కావలసినవి మనం పెట్టుకోవాలి. జీవితాన్ని సుఖంగా, హాయిగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా గడుపుకోవటానికి ఇవన్నీ అధ్యాత్మ మార్గాలు. అలాగే ఇవాళ ఈ జాతి ప్రధానంగా సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి ఈ భారతీయమైనటువంటి ఆత్మ దేవుడు లేడు అన్నటువంటి వాదన ఇక్కడ నిలబడు-- నిలబడలేదు. దానికి భావే లేదు. ఏదో కొంతమంది అరుస్తున్నా, గందరగోళం కలుస్తున్నా దేవుడున్నాడు అన్న పంచాక్షరి ఉన్నది గనుకనే అప్పుడప్పుడు అయినా, లేను నిత్యమైనా, రాగలిగితే ఎక్కువసార్లైనా దేవాలయ దర్శనం చేయండి. ఆ దేవాలయంలో అమ్మవారా, అయ్యవారా, అమ్మవారంటే నాకిష్టం అంటే అయ్యవారు ఇష్టం లేదా? అక్కడ కూడా మళ్ళీ భేదభావం ఉండాలా? కాదే. పరమేశ్వరుడి యొక్క అనంతమైన మహా శక్తి ఒక్కొక్క చోట నిక్షిప్తమై ఉంటుంది గనుక చూడండి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కొక్కట్ పల్లి సమితి అనుకోలేదు ఇట్లా అవుతుంది అని అనుకోలేదు. కానీ స్వామి సంకల్పం అనేకమైనటువంటి సత్సంఘాలను దేవాలయాలలోనే పెట్టించారు. ప్రతి దేవాలయంలోనూ పరమాన్భుతంగా స్థాపించారు. ఏదో కొద్ది నాలుగైదు మాత్రం బయట జరిగినాయి తప్ప అంటే దేవాలయాలలోకి మరబోటి వాళ్ళు కూడా రావాలి. సామూహికంగా రావాలి. వచ్చి ఇట్లా సత్సంగం చేయాలి. సత్సంగం వినాలి. దేవీదేవతల దర్శనం చేయాలి. కానీ ఇందాక అన్నట్లుగా మళ్ళీ ఆ పూజ అనేటువంటి బంధన చక్రంలో ఇరుక్కుపోకూడదు. వెళ్ళాలి, దర్శనం చేయాలి, నమస్కరించుకోవాలి. ఆ మహాశక్తి ముందు తలవంచాలి, వినయంగా ఉండాలి. మళ్ళీ మన అధ్యాత్మ కార్యక్రమాన్ని, ఆత్మ విచార మార్గాన్ని రెండు సమన్వయం చేసుకొని వెళ్ళాలి గనుక ఈ ఆదిభౌతిక ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలో నిత్య జీవితాన్ని మనం ఇట్లా సుసంపన్నం చేసుకోవాలి. స్వామి అందుకే మనకి నారాయణ స్మరణని భజనగా చేశారు. వీటన్నింటినీ సమన్వయ చేస్తూ ప్రేమా, సేవా అనేటువంటి రెండు భావాలు మన మనసులో కల్పవృక్షం లాగా నాటారు స్వామి. ప్రేమ లేకుండా సేవకు వెళ్ళకండి. ప్రేమించగలిగిన స్థాయి ఉంటేనే సేవకు వెళ్ళండి. ప్రేమ్-- ప్రేమ లేకుండా సేవకు వెళ్ళామంటే అది ఒట్టి చాకిరీయే తప్ప ప్రయోజనం లేదు. ఆ చాకిరీలో కూలి డబ్బులు వస్తాయి తప్ప ఆనందం లభించదు. ఏదో ఒక బ్రహ్మాండంగా చేశామని పేరు వస్తుంది తప్ప ఆనందం లభించదు. కాబట్టి నిజమైనటువంటి ఒక ఆనందం, నిరతిసేవమైనటువంటి ఆనందం కావాలి అంటే ప్రేమతో కూడిన సేవ చేయాలి. ఆ సేవని vanity గా కాకుండా charity తో చేయాలి. ఉదాత్తమైన భావనతో చేయాలి. మనం మొయ్యగలిగినంత చేయాలి. కానీ చేస్తూనే ఉండాలి. మనం చేస్తూ ఉంటే పరమాత్మ ఇస్తూ ఉంటాడు. పరమాత్మ ఇస్తున్నంత కాలం మనం చేస్తూ ఉండాలి. మనం చేస్తున్నంత సేపు ఆయన పని అన్నీ సమకూరుస్తాడు. ఏ సమయానికి ఏది ఎంత ఎప్పుడు ఎట్లా ఎవరికి దాన్ని అందించాలో అది పరమేశ్వరుడి పని. అంతే తప్ప మనం మన esteem నుంచి పడిపోకూడదు. అలాగే మన భక్తి మార్గంలో కూడా పరమేశ్వర భావనతో వినయంగా కూడి ఉండాలి. విష్ణు సహస్ర నామాన్ని భీష్ముడు పాడుతున్నప్పుడు, అంటున్నప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమైన కృష్ణుడు చేతులు కట్టుకొని తలవంచుకొని విన్నాడు విష్ణు సహస్ర నామాన్ని. వేయి నామాలు ఆయన గురించే. ఈయనలో విష్ణువుని చూశాడే. చూసి విష్ణు సహస్ర నామం చదవటం మొదలు పెట్టాడు. కృష్ణుడు అకర్తృత్వ భావంతో తనకు కాదన్నట్టుగానే మనం ఎట్లా enjoy చేశామో ఆయన కూడా enjoy చేశారు. కాబట్టి పరమేశ్వరుడికి భిన్నమైన రెండు మనస్సులు లేవు. జీవుడికి రెండు మనస్సులు ఉన్నాయి. ఒకటి కావాలి, రెండవది వద్దు. ఈ కావాలి, వద్దు, వద్దు అసలు. మరి ఏం కావాలి అంటే స్థిమితంగా, తటస్థంగా, neutral గా, సాక్షిభూతంగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ దాన్ని భక్తి భావాలతో చేస్తూ, దాన్ని విచక్షణతో ఆ కర్తవ్యాన్ని చేస్తూ మనం గనుక వెళ్ళినట్లయితే అది నిజమైనటువంటి అధ్యాత్మ. అంతే తప్ప మీరు ఇది చేయండి, అది చేయండి, కుడి చేత్తో దీపం వెలిగించొచ్చా, ఎడం చేత్తో దీపం వెలిగించొచ్చా అంటే కుడిచేయి పనిచేయనప్పుడు ఏం చేస్తారు? ఎడం చెయ్యి వాడతారు. ఎడం చెయ్యి పనిచేయకపోతే కుడిచేయి వాడతారు. కానీ వెలిగించడం ప్రధానం. కాబట్టి వెలిగించలేని రోజు వస్తే మానసికమైనటువంటి పూజ. శంకర భగవత్పాదులు మానసిక పూజ చెప్పారు. మానసిక పూజ చాలా సులువుగా ఉంది కదా అని పదహారేళ్ళ వాడు ఆ పని చేయకూడదు. పూజలన్నీ చేయాలి. చేయలేని రోజు ఏర్పడినప్పుడు మానసికమైనటువంటి పూజ. ఇక్కడ కూర్చున్నాం అని ఇవాళ గనక దుర్గ అమ్మవారి గుడిలో కూర్చున్నామంటే ఇక్కడ అరాచలము ఇక్కడే ఉంది, పుట్టపర్తి ఇక్కడే ఉంది, షిరిడి ఇక్కడే ఉంది, తిరుపతి ఇక్కడే ఉంది, కాశీ ఇక్కడే ఉందని మనం అనుకోవాలి. ఈ అనుకోవటంలోనే అంతా ఉన్నది కాబట్టి ఈ అనుకుంటూ అనుకుంటూ మనం ఎక్కడ ఉన్నామో మనకు హృదయం ఉంది అనేది తెలుసుకున్నాం కాబట్టి ఆ దాన్ని ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా దాన్ని మార్చుకున్నట్లయితే ఇంతవరకు మన మాట విన్న మన మనస్సు ఖచ్చితంగా హృదయం వైపు ప్రయాణించుతుంది. ఆ ప్రయాణం చేసినప్పుడు ఆ హృదయానికి దగ్గరైనప్పుడు, చేరుతున్నప్పుడు అది పడేటువంటి ఆనందం మామూలు ఆనందం కాదు. వస్తువుని పొందాం, సుఖాన్ని సంపాదిస్తాం, కాసేపు సంతోషిస్తాం ఆ ఆనందాన్ని. కాబట్టి ఆ నిత్యమైనటువంటి ఆనందానుభూతిని మనం పొందాలి అంటే మనం ఈ వస్తు ప్రపంచాన్నికాస్త దూరంగా వైదొలగాలి. అవన్నీ కావాలి ప్రపంచంలో ఉన్నవి. చాలా వరకు కావాలి. ఉంచుకుందాం. కానీ వాటి కోసమే పరిశ్రమించకూడదు. మనం ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో తపస్సులు చేసి, ఎన్నెన్నో ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ అనేక జన్మల చివర ఈ వేళ మనం ఆ జ్ఞానం అంటే ఏమిటి? ఆధ్యాత్మికం అంటే ఏమిటి? సాధనా మార్గం అంటే ఏమిటి? మాట్లాడుకుంటున్నాం అంటే ఇది ఇవేళ కలిగింది కాదు అనేక జన్మల తపః సాఫల్యంగా ఇది మనకు ఏర్పడింది గనుక సాధనా మార్గాలు సూటి అయినటువంటి మార్గం ఇవాళ సమకాలీనంగా ఏమో ఇరవై ఏళ్ల తర్వాత ఏమవుతుందో తెలియదు. ఇవాళ సేవా మార్గమే నిష్కామ కర్మయోగం. స్వామి దానికి సేవ అంటే పంచిపెట్టు అని ఆయన ఎక్కడా చెప్పలేదు. నిష్కామ కర్మయోగమే సేవ. చూడండి, అన్ని చోట్ల అన్నదానం ఉంటుంది పుట్టపర్తిలో అన్న సేవ అని పేరు పెట్టారు. ఎంత అందమైన పేరో చూడండి. అన్న వితరణ, అన్నదానం మనం వింటాం. అన్న సేవ అనేది ఎక్కడా వినం. స్వామి ప్రారంభించారు లాస్ట్ గురుపూర్ణిమకి, అద్భుతంగా సాగుతున్నది. కాబట్టి మనం కూడా ఎంతో అన్న సేవ చేయాలి. అన్నం ద్వారా సేవ చేయాలి. మన దగ్గర ఉన్న కొద్దిగా డబ్బు ద్వారా సేవ చేయాలి. జ్ఞాన విజ్ఞానాల ద్వారా సేవ చేయాలి. జ్ఞానాన్ని పంచటం ద్వారా సేవ చేయాలి. మళ్ళీ దీనికి శరాబు ఖరీదులు కట్టకూడదు. దీని నుంచి మనకు ప్రత్యేకతలు ఏమీ ఉండకూడదు. మనం మనంగా ఉండాలి. మనం కూడా కన్నుమూసే దాకా ఈ జీవయాత్ర ముగిసే దాకా మన జీవితాన్ని నిత్య పవిత్ర భూమికగా మార్చుకోవాలి. ఎందుకంటే అన్నమాచార్యులవారు అన్నా మరొకరు అన్నా "నీ శరీరమే మహాద్భుతమైనయో హోమగుండం" అన్నాడాయన. ఆ యజ్ఞశాలలో పశువులను కట్టినట్టు కట్టాడు మనస్ అనే పశువును లోపల. దానిలో నువ్వు బలి ఇచ్చేసేయ్. ఆ బలి అంటే సమర్పణ అని అర్థం చంపుకోడానికి కాదు. సమర్పించాలి, శరణాగతిని పొందాలి, వినయాన్ని సంపాదించుకోవాలి. ఈ మూడు ముప్పేటగా ఎవరి యందు వెలకడి చెంది ఉంటుందో అది ఒక ప్రాప్తమైన ఆధ్యాత్మిక భావన గనుక ఆ విధంగా మనకు ఉన్నటువంటి ప్రతి రోజునీ ఒక సంవత్సర కాలం ఎట్లాగైతే మనం అనుకుని ప్రవచనాలు, సత్సంఘాలు చేసుకోగలిగామో, ఒక సంవత్సర కాలం ఈ సంవత్సరం అంతా 2019 అంతా కూడా మనం ఈ ఆధ్యాత్మిక సాధనా మార్గం ద్వారా ఏమేం విన్నామో, ఇగో కొకట్ పల్లి సమితి ఇంకో మంచి పని చేసింది YouTube లో పెడుతున్న కారణంగా రా-వచ్చిన వాళ్ళు ఎంతమంది అని కాదు రాని వాళ్ళ కోసం చాలా ఉపయోగపడుతున్నాయి. అవన్నీ నాకు చాలా అనేక కంట్రీస్ నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. అంటే వాళ్ళకి చేరుతున్నది. ఇవాళ మాధ్యమం మనకు ఏర్పడింది గనుక అందరూ ఈ మార్గంలోకి వెళ్ళాలని ఏ గురు స్మరణతో మన జీవితాలు ప్రారంభం అవుతాయో, ఏ భగవంతునితో కూడి మనం జీవించామో ఆ జీవితానికి ఒక సంపూర్ణమైన సాఫల్యం మనకు లభించాలి అని నేను కోరుకుంటూ చివరిగా కడగా ఒక్కమాట. పిల్లల్ని కూడా ఇవాళ మనవళ్ళు మనవరాళ్ళు కాదు. వాళ్ళకి English లైన్ బుక్స్ అన్నీ కొని కా-కాసెట్లు అన్నీ కొని ఇక్కడినుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం అక్కడేదో తప్పు అయినట్టుగా. అట్లా కాకుండా భారత భాగవత రామాయణాదులు దానిలో ఉన్న రాముడి కథ, కృష్ణుడి కథ, జీవుడి యథ, సీతమ్మవారి కష్టాలు అంటే అవన్నీ మన జీవితానికి ప్రతిబింబాలు గనుక మళ్ళీ పక్కలో వేసుకుని రాముడి కథ చెప్పాలి. మామూలుది రాముడి కథ చెప్తే వాడికి మనం కొన్ని కోట్లు ఆస్తి ఇచ్చినట్లు లెక్క. మామూలుగా మనవరాళ్ళను పక్కన పెట్టుకుని అమ్మవారి గురించి మాట్లాడితే వాళ్ళకి సౌశీల్యాన్ని ఇచ్చినటువంటి, సౌభాగ్యాన్ని అనుగ్రహించినటువంటిది. మనం చేయాల్సింది కేవలం ఆస్తి ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కాదు. అదేముంది దొంగ ఆస్తి అప్పజెప్పి వెళ్తాడు కదా. మనమైనా దొంగ కూడా సంపాదించింది ఎందుకు సంపాదిస్తున్నావ్, దొంగతనం ఎందుకు చేశావ్ అంటే నా పిల్లల భవిష్యత్తు కోసం అంటున్నాడు. మనం ఆ దొంగతనం నుంచి బయటపడి దొరతనంలో నుంచి మనం వెళ్ళాలి. ఆ దొరతనంలో నిలబడటం అంటే మనల్ని మనం పవిత్రీకరించుకోవాలి. ఇది చాలా ప్రధానమైన అంశం. అలాగే జీవితాన్ని ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కొకట్ పల్లి సమితి దీన్ని ఒక దీక్షగా ప్రతి ఇంట దీన్ని ప్రవేశ పెట్టగలిగినట్లయితే ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని మనం సులువుగా ఆచరించడానికి వీలుంది. ఇందుట్లో కష్టం లేదు. మీరెవరో హఠ యోగం చేయండి, ఇంకో యోగం చేయమని చెప్పలే. మనస్సుని స్పష్టంగా ఉంచుకోండి. మనస్సుని ఓపెన్ గా ఉంచుకోండి. అసూయాద్వేషాలు మనకక్కర్లేదు. ఇందులో ఎవరు ఎవరికీ పోటీ కాదు. ప్రతి వాడికి తన కర్తవ్యం ఉన్నది. ఆ కర్తవ్యాన్ని స్పష్టంగా నిర్వర్తించాలి. స్వామిని గురించినటువంటి విషయాల్లో మాత్రం మనం వారితో ఉన్నటువంటి personal relations ఏమున్నాయో మనం బయటకు చెప్పాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే అవి ఈ ప్రపంచానికి అక్కరలేని మాటలు. ఏం కావాలి అంటే స్వామి చెప్పారు. స్వామి మనకి ఏ బోధ చేశారు? అనేకమైన విషయాల్లో మనకు ఎటువంటి నిర్వచనాలు ఇచ్చారు? ఎట్లా పరిష్కార మార్గాలు ఇచ్చారు? ఉపనిషత్తులను వాణిని స్వరూపంగా అద్భుతమైన సాహిత్యం ఉంది. ఆ సాహిత్యాన్ని మనం ప్రపంచానికి చెప్పాలి. అటువంటి యోగాన్ని సర్వేశ్వరుడైన స్వామి మనకు పరిపూర్ణంగా అనుగ్రహించు గాక అని నేను మనసా, వచసా, శరసా కోరుకుంటూ నిజానికి నా ప్రవృత్తికి భిన్నంగా నేను ఎక్కడా గుడిగోపురాలలో ఉపన్యాసాలు ఇవ్వను. ఎందుకంటే అక్కడ ఏకాంతం అయినటువంటి స్థితి లభించదు. వచ్చేవాడు ఉంటాడు, పోయేవాడు ఉంటాడు, ఎవడి పని మీద వాళ్ళు వస్తుంటారు, కొబ్బరికాయ కొట్టేవాడు ఒకడు, పూజారి తీసేవాడు ఒకడు ఈ పని ఇది అక్కర్లేదు. కానీ మరి కొకట్ పల్లిగనుక నేను కూడా దానిలో ఆ ప్రమేయం ఎందుకు ఉండాలి అని ఏ గుడికి రమ్మన్నా ఆ గుడికి వచ్చాను. ఆ గుళ్ళలోనే మనం చేశాం. ఇక అనేకమైనటువంటి హౌసింగ్ కాంప్లెక్స్ లో మాట్లాడాం. అనేక ఇళ్ళలోకెళ్ళి మాట్లాడాం. మనం ఎక్కడ మాట్లాడాం అని కాదు, ఏమి మాట్లాడాం అనేదే ప్రధానం. దాన్ని ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి అనేకమైనటువంటి విషయాలని ఈ ప్రపంచానికి ఆ నిరపేక్షంగా ఇట్లాగే నిరంతరము అందిస్తూ ఉండాలని, మనందరం కూడా ఏ గురువుని నమ్మామో, ఏ గురువుని భగవంతునిగా ఆరాధించామో, ఏ ఫలవదా ఆరాధనలో మన జీవితాలు ఐదు, నలభై దశాబ్దాలు సాగిపోయినయో అటువంటి పరమాత్మ సాయి యొక్క అనుగ్రహం ఈ ప్రపంచానికి అన్ని వేళలా పరిపూర్ణంగా లభించు గాక అని మరొక విన్నపం చేసుకుంటూ, రాత్రి పడుకోపోయేటప్పుడు నిద్ర లేవగానే మిగతా శ్లోకాలు ఎట్లా ఉన్నా మనకి నోటికి వచ్చినా రాకపోయినా మనకి ఎన్ని కోరికలు ఉన్నా రెండే రెండు కోరుకుంటూ నిద్ర లేద్దాం. ఆ రెండోది కోరుకుంటూ మళ్ళీ పడుకుందాం. అది సమస్త లోకాః సుఖినో భవంతు. ఇదే మహా మంత్రం. ఈ సమస్త ప్రపంచం హాయిగా ఉండాలి. అది హాయిగా ఉంటే మన బాగు మనది. మనక్కూడా తప్పుతున్నాయి. నేను ఒక్కడినే బాగుండాలి అంటే, నీవు ఈ ప్రపంచంలో ఒక భాగమే గాని, నీవు ప్రపంచం కాదు. కనుక సమస్త లోకాః సుఖినో భవంతు అని ప్రార్థన చేస్తూ మన జీవితాలు ప్రారంభం కావాలి ప్రతిదినం. అలాగే ఆ నాలుగున్నరకి లేచేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. కార్తీక మాసం అంటే లేచామా లేదా? కార్తీక మాసం అంటే లేస్తున్నామా లేదా? మరి ఈ రెండు మాసాలే పుణ్యకాలం మిగతావి కాదా అంటే, అన్ని కాలాలు కాలమే పరబ్రహ్మ స్వరూపం. కాలాత్యవిచ్ఛిన్నమైనటువంటి ఆత్మ స్వరూపులుగా నిలబెట్టేటువంటి మన అందరి జీవితాలు, ఇవాళ నిజానికి ఒక పరమాత్మతో ఒక అధ్యాత్మ మార్గంలో మనమందరం ఉన్నామంటే, ఇవాళ మన-మనతో ఉన్న ఈ ఒక్క తరం మాత్రమే కాకుండా మన రాబోయేటువంటి ఇరవై ఒక్క తరాలకి ఈ దివ్యమైనటువంటి అనుగ్రహం వాళ్ళకి లభిస్తుంది. వాళ్ళకి ఆస్తులు ఎంత ఇచ్చామని కాదు, ఇవ్వవలసినది ఒక అస్తిత్వ భావన, ఒక ఆస్తిక భావన. ఆస్తులు ఎలాగో ఇస్తాం, ఆస్తిక భావన, పరమేశ్వరుడు ఉన్నాడనే భావన మన పిల్లలకి మన తరవాత తరానికి మన స్నేహితులకి అందించగలిగితే అది సర్వోత్తమమైనటువంటి సేవ. యేన కేన ప్రకారేణ యస్య కశ్యాపి దేహినా సంతోషం జనయేత్ ప్రజ్ఞః తదేవ ఈశ్వర పూజనం. నేను ఎందుకు వచ్చాను? వచ్చి ఏం చేశాను? ఏం చేస్తున్నాను? ఎందుకై చేస్తున్నాను? ఎవరికోసమై చేస్తున్నాను? ఎట్లా చేస్తున్నాను? అన్నటువంటి ఈ విచార భారంలో నుంచి పరమేశ్వరుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ ప్రజ్ఞ ద్వారా ఈ సమస్త లోకానికి, నీ చుట్టూ ఉన్నటువంటి వారికి ఆనందాన్ని గనుక ఇవ్వగలిగితే అదే నిజమైనటువంటి శివపూజగా వేద ప్రమాణీతమైన మరొక మాటని గుర్తు చేస్తూ, గుర్తు చేసుకుంటూ మనందరికీ సత్య సాయి భగవానుడి యొక్క అట్లాగే అమితకోటి గురు స్వరూపాల యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మహామృత వృష్టి వలె మాపై కురియు గాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం. [అందరూ కలిసి చప్పట్లు]
YouTube · audio
How to indulge in spiritual saadhna — Part 3
How to indulge in spiritual saadhna — Part 3
Source: SathyaSai Seva Sadan on YouTube
0:00 / 22:33
More in this series