No transcript for this section.
Transcript begins at 0:00.
దాన్ని గడుపుతున్నాం. అననుకూలం కూడా అనుకూలమే అంతే కదా. ఒక్కొక్కసారి అననుకూలం కూడా మనకు తెలియని శక్తిని ఇస్తుంది. చేయలేని ఈ పని మనం ఈ కష్టాన్ని ఎదుర్కో లేము అని ఒక కష్టం రాగానే ఎదుర్కో గలిగిన శక్తి కూడా మన యందే ఉన్నది. అది ఎవరో బయట-- బయట వాడు ఉపశమనం చెప్తాడు, "ఏదో ఇలాంటివి వస్తుంటాయండి, ఏదో తట్టుకోండి" అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన ఇక చివరి దశలో, ఆయన hospital కి వెళ్లారు. Intravenous injection ఏదో ఎక్కిస్తున్నారు. ఆయన అన్నారు, doctor వచ్చాడు. ఈయన పెద్దవారు అయ్యారు కదా, "మీరేం భయపడకండి, ఏమీ జరగదు. మీకేం-- మీరేం భయపడకండి, మీరేం బాధపడకండి" అని చెబుతున్నాడు పాపం మంచి మాటే. ఆ అతన్ని చెప్పనిచ్చో మాటన్నారు, "భయపడకండి అని చెబుతున్న నీ విషయం పక్కన పెట్టవయ్యా, భయము నాది. నేను ఏం భయపడుతున్నానో నీకేం తెలుసు? బాధ నాది, వద్దని చెప్తున్నావు గానీ ఆ బాధ నాదే. ఆ రెండూ కాక ఏదన్నా మందించి ఇక్కడి నుంచి వెళ్లిపో, నీ పని నువ్వు చేయ్" అన్నాడాయన. అది. కాబట్టి బాధ, భయము, ఆందోళన మన మనస్సు సంకల్పించుకుంటుంది. అవి కలగకుండా ఉండవు, అవన్నీ వద్దు అని చెప్పడానికి లేదు. రానివ్వండి, పిలవక్కర్లా, వస్తాయి. ఎవడో చెప్తాడు, కష్టాలను invite చేయండని. మనకిది ఉన్నవే కదా, మళ్ళీ invite-- invitation కూడా ఎందుకు? ఆ ఉన్న కష్టాన్ని మనం ఎదుర్కొనే ధైర్యాన్ని పరమేశ్వరుడు మనకిస్తాడు గనుక. ఈ కాళ అనేటువంటి అమ్మవారిని మనం కాళీ స్వరూపిణిగా, కాళిక అంటే కాలనాళిక అని అర్థం. Time capsule. మనందరం కూడా ఎన్నాళ్ళు ఉంటామని కాదు, ఉన్నన్నాళ్ళు ఏం చేశామన్నది ప్రశ్న. ఈ సమయాన్ని మనం ఎట్లా గడుపుతున్నామనేది ప్రశ్న. మనం ఎవరికైనా ఉపయోగపడ్డామా ప్రశ్న. మనం ఇక్కడి నుంచి దేహం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత కాలం అనేటువంటి ఇసుక ఎడారి మీద మన పదముద్రలు ఎక్కడన్నా ఉన్నాయా? మనం కూడా ఇదిగో ఈ మంచి పని చేశాం అని అనిపించుకునేది ఏదన్నా చేశామా? ఈ ప్రశ్నలు వేసుకో అని చెప్తున్నది అమ్మవారైనటువంటి కాళం. కాళము అంటే కాలం. అయితే ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి విషయాలున్నాయి. మనమంతా బాగా ఉండాలనే అనుకుంటాం. మర్యాదగా ఉండాలి, మంచిగా ఉండాలి ఇందులో చెడు వ్యసనం ఉన్నవాడు కూడా దాని నుంచి ఎప్పుడో బయట పడతానని కోరుకుంటాడు పాపం. వాడికి అదేమీ ఇష్టం ఉండదు. కానీ బయట పడలేడు. బయట పడకపోవడానికి శత్రువులున్నారు ఈ ప్రపంచంలో మనకి. అంటే మనల్ని నచ్చని వాడు, మనమంటే మెచ్చని వాడు వాడు శత్రువు కాదు. శివానందలహరిలో శంకర భగవత్పాదులు చెప్తారు, ఈశ్వరుని ఉపాసన చేస్తూ "ఓ ఆదికిరాతకా! ఎందుకయ్యా నువ్వు ఆ వేషం-- భిల్లుడి వేషం ఎందుకు వేసుకున్నావ్? వేటగాడిగా ఎందుకని ఆ ధనుర్బాణాలు పట్టుకొని అరణ్యంలో అటూ ఇటూ పరిగెత్తుతున్నావేమి? నువ్వు పరిగెత్తుతున్నావ్, నీ అలికిడికి పాపం చిన్న జంతువులు పరిగెత్తుతున్నాయి భయంతో. చివరికి నువ్వు బాణం తీసి దాన్ని కొట్టి చంపుతున్నావ్. ఆ పని చేసే బదులు, అమాయక జీవుల్ని చంపే బదులు, నాలో ఆరు మృగాలు తిరుగుతూ ఉన్నాయి. ఆ ఆరు మృగాల వైపు నీ బాణం ఎక్కుపెట్టి ఒక్కొక్క దాన్ని సంహారం చేయకూడదా శివా" అంటారు. ఆ ఆరు శత్రువులు అరిషడ్వర్గాలు. షడూర్మములతో, షడ్వికారములతో, షడ్వర్గములతో ఈ పంచభౌతిక దేహం ఏర్పడింది. ఈ ఐదు వర్గాలు ఏమిటంటే కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు మనకవన్నీ తెలుసు. మరి వాటిని ఎట్లా జయించాలి? జీవితం ద్వారా జయించాలి. మన బోలెడు కోరికలున్నాయి. ఓ వంద గ్రాముల కోరిక మనదగ్గర, వంద కిలోల కోరిక ఉంది. దాన్ని ఒక్క గ్రాము కోరికగా మార్చుకోండి, ఒక్క గ్రాము. అంటే ఏది నిజంగా కావాలో, ఏది నిజంగా అత్యవసరమో, దేనివలన ముందు మనకు ఆనందం కలుగుతుందో, మనకు కలిగిన ఆనందం ద్వారా మిగతా వారందరికీ ఎట్లా ఆనందం కలుగుతున్నదో అటువంటి ఒక్కటి, ఒక్క కామాన్ని పెంచుకోండి, ఉంచుకోండి. మరి ఆ కామము ఎలా ఉండాలి? ప్రాపంచికమైనదా, వస్తువుల యందా అంటే భగవంతుని నామ రూప భావముల యందు కామం పెంచుకోండి. భగవంత్-- అందుకనే భగవద్రతి అన్నారు. భగవంతుడి యొక్క నామం మనకిష్టం. మనకి సాయిరాం అనగానే హాయిరాం అన్నట్టుంటుంది. అవునా? ఆయన అక్కడే ఉన్నట్టు, మనల్ని కాపాడినట్టు ఎన్నో భావాలు కలుగుతాయి. ఆ నామంలో ఉన్నటువంటి మహిమ. మనకి స్వామి పటం ఎక్కడా కనపట్టం లేదు. sudden గా ఏదో దేశం వెళ్తాం. వెళ్ళగానే అక్కడ హోటల్లో check in చేయబోతున్నాం. check in చేయబోతుండంగా పైన స్వామి చిన్న photo ఇట్టా ఉంటుంది. అని అమ్మ స్వామి నాకంటే ముందు వచ్చి ఉన్నారని మనం ఆనందపడతాం. అంటే నామం, రూపం. రెండవది బొమ్మ లేదు, ఏమీ లేదు. కానీ భావం. పరమేశ్వరుడు నా యందు అన్ని వేళలా ఉన్నాడన్న భావన కలగ్గానే స్వామి లేనిదెక్కడ? మొదట్లో మొదట 2011 ఏప్రిల్ 24న ఈ ప్రపంచం తల్లడిల్లిపోయింది. స్వామి కనపడరు అన్నప్పుడు ఏమైపోతుంది ఈ ప్రపంచం అని. కానీ ఇవాళ ఏమంటున్నాం, మనమే ఏం చెప్తున్నామంటే ఇంకోడిని ఊరడిస్తున్నాం. స్వామి ఎక్కడికెళ్లారయ్యా, ఇక్కడ లేరా అంటున్నాం. అవునా కాదా? ఆయనకి అసలు వెళ్ళటానికి చోటు ఎక్కడని నేనన్నా. మనకి చాలా చోట్లున్నాయి, అనేక ప్రదేశాలకు వెళ్ళొచ్చు. ఆయనకి వెళ్ళటానికి చోటే లేదంటే వెళ్ళటానికి చోటు లేదు, కారణం ఆయన అన్ని చోట్లా ఉన్నారు గనుకే వెళ్ళటం అనే పని లేదు ఆయనకి. అనేటువంటి భావన మనకో బలాన్నిస్తుంది గనుక. ఈ ఆరుగురు కామము, క్రోధము రెండవది కోపం. కోపం ఎందుకు వస్తుంది అంటే అహంకారంలో నుంచే కోపం పుడుతుంది. The byproduct of అహంకార. నేను ఎవరికో ఏదో పని చెప్తాను, అతను చేయలేదు కోపం వస్తుంది. కదా?మనం చేయమన్నట్టుగా చేయలేదు కోపం వచ్చేసింది. చెప్పిన time లో చేయమని చెప్పాం వాడు చేయలేదు కోపం వస్తుంది. కోపం రావడానికి అన్ని కారణాలే కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం చేయలేకేగా వాడికి అప్పజెప్పాము పని కాస్త వాడు చేసేదాకా ఆగుదాం. ఒకడు తొందరగా బల్బు పెడతాడు ఒకడు కాస్త పావుగంట ఆలోచిస్తాడు అక్కడిదాకా వెళ్లి కుడివైపు తిప్పాలా ఎడమవైపు తిప్పాలా ఆలోచనలో పడతాడు మొత్తానికి బల్బు అయితే పెట్టే దాకా మన సహనం గనక లేకపోతే క్రోధం రాక ఏమవుతుంది? క్రోధ అంటే anger is a sign of inferiority complex మనలో ఉన్న ఆత్మ న్యూనతా భావంలో నుంచి అది బయటకు వస్తుంది. నా ఉదాహరణకు మన ఇంట్లోనే పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి తొంభై వచ్చేసాయి వాళ్ళని పెద్దవాళ్ళు అందాం. ఆ తొంభై వచ్చిన వాడి మాట తప్పని వీళ్ళు వింటారు కానీ ఆయన అనుకున్న time లో వినరు అది ఆయనకి కోపం వస్తుంది. వాడు సరిగ్గా suitcase briefcase పట్టుకొని ఏదో cell phone చెవిలో పెట్టుకొని urgent వస్తున్నా వస్తున్నా అని వాడు పరిగెత్తుతుంటాడు. నాకు ఆ మందు పట్టురా మందు పట్టురా అని ఈయన అరుస్తుంటాడు. ఆ రెండు tally కావు క్రోధం వచ్చేస్తుంది అంతే కదా అప్పుడు వెనక్కి వచ్చి పోనీ ఆయనకి చెబుదామా అంటే అవతల వాడు పిలుస్తున్నాడు. ఇక్కడికి వద్దామా అంటే వీలు లేదు కానీ కనుక ఏం చేస్తాడంటే సాయంకాలం వచ్చి ఆ క్రోధంతోనే వాడు అక్కడి నుంచి వెళ్తాడు. కనుక సంయమనము సహనము రెండు ఉంటే కోపం రాదు అంతే కదా. మనం కారు ఎక్కుతాం ఇక్కడికి రావాలి traffic మన చేతుల్లో లేదు ముందు ఎవడు వస్తాడో ఎవరు అడ్డం వస్తారో మనకు తెలియదు. ఈ హైదరాబాద్ పాడైపోయింది traffic traffic పరిటంలో మనం కూడా ఉన్నాం కదా. ప్రతి వాళ్ళు మన గురించి కూడా ఏంటి ఇప్పుడే బయలుదేరాలా ఈయన అని కాబట్టి సంయమనం సహనం కావాలి. ఏది కూడా జిల్లెళ్ళమూడి అమ్మ గొప్ప మాట చెప్పింది గుర్తుపెట్టుకోండి ఇది "సర్వం తరుణాధీనం నాన్న నీ చేతిలో ఏం లేదురా" అంది చూశారా తరుణము అంటే సమయం సమయం ఒట్టి సమయం కాదు సరైన సమయం తగిన సమయం యోగ్యమైన సమయం అది వస్తేనే ఆ పని జరుగుతుంది "సర్వం తరుణాధీనం" అది ఆ మనం అంటాం తరుణ వయస్సు అంటాం అంటే సరైన వయస్సు అని అర్థం. ఆ సరైన వయస్సు ఏమిటి అని అంటే పరమేశ్వరుడి యందు మన చిత్తము లగ్నం కావాలి కనుక క్రోధాన్ని తగ్గించుకోవాలి. మోహం మనకి ఆ అనేక బాంధవ్యాలు ఉన్నాయి బాంధవ్యాల వలన బంధనాలు ఏర్పడుతున్నాయి అంతేనా కొత్త కొత్త బంధనాలు ఏర్పడుతున్నాయి స్వామి దీన్ని చాలా చమత్కారంగా చెప్పారు ఒక చిన్న చిన్న బిందువుగా మొదలవుతుంది మనిషి జీవితం. తర్వాత వాడికి రెండు కాళ్ళు ఉంటాయి పెళ్లి చేసుకుంటాడు నాలుగు కాళ్ళు అయిపోతాయి. పెళ్లి చేసుకోవడానికి ముందు వాడికి రెండే కాళ్ళు తర్వాత నాలుగు కాళ్ళు అట్లా రెండు into రెండు అవుతాయి. పిల్లలు పుడతారు ఆరు అవుతాయి మనవరు మనవరాళ్ళు పుడతారు ఎనిమిది అవుతాయి. ఏముంది జీవితం అంతా octopus అయిపోవడం లేదా ఎటు వెళ్ళినా ఎక్కడో ఒక సంఖ్యలో ఒక బంధం ఉంటుంది. దాని పరిమితమైనటువంటి ప్రేమ గట్టు తెరే తెగి ప్రవహించనటువంటి మమతానుబంధాలు ఉండాలి మమత ఉండాలి ప్రేమ ఉండాలి ఆనందం ఉండాలి దాంట్లో నుంచి వస్తాయి కానీ దానికి ఓ పరిమితి ఏర్పరచుకోండి. మోహ పరవశులు కాకండి ఎందుకంటే ఈ బంధన బాంధవ్యంలో నుంచి ఏర్పడిన బంధన నెమ్మదిగా అది మోహమై వ్యామోహమై వ్యసనమై మళ్ళీ మనం వెనక్కి తిరిగి మన స్వస్థానంలోకి రావటానికి వీలు లేని ఒక దుస్సర పరిస్థితి ఏర్పడుతుంది గనుక దాన్ని ఆ రకంగా జయించండి. ఇక ఇంద్రియాలు ఉన్నాయి చిన్నప్పుడు ఇంద్రియాలు అవేం పొరపాటు చేయవు దానికేం తెలియదు ఇంకా అప్పుడే మొలకెత్తినాయి నెమ్మది నెమ్మదిగా వయస్సును బట్టి ఆ పరిణామం చెందుతూ ఇంద్రియాలు పెరుగుతూ వస్తూ ఉంటాయి. చూడండి కాలగమనంలో మనకి వయస్సు వస్తున్న కొద్దీ ఇంద్రియాలు కూడా వాట్-వాటంతట అవే తమ కార్యకలాపాలు నెమ్మదిగా నిర్దేశించుకుంటాయి. పరిగెత్తాలి అనుకుంటే పరిగెత్తలేము కదా ఆ పరిగెత్తలేనితనం ఎందుకు అంటే అది సహజంగా ఏర్పడింది. ఇది వరకు నలభై అడుగుల దూరంలో hoarding అలా కూర్చుని చదివే వాళ్ళం కదా కానీ నెమ్మది నెమ్మదిగా కాలగమనంలో ముప్పై అడుగులకు వస్తుంది ముప్పై నుంచి ఇరవైకి వస్తుంది ఇరవైకి రాగానే కళ్ళద్దాలు కోసం doctor గారి దగ్గరికి వెళ్తాం అంతేనా ఆయన అంటాడు ఏదో long sight లేండి అన్నాడు. అంటే నేనే అడిగాను ఒకసారి ఆ long ఎంతండి అని అడిగాను పది అడుగులు దాటి పది అడుగుల లోపు వస్తువు గనక కనిపించకపోతే అది long పది దాటి కనబడుతున్నది అంటే కళ్ళు బాగున్నట్టే అని ఒక సూత్రం చెప్పాడు. అట్లా ఇంద్రియాలు నెమ్మది నెమ్మదిగా చెవులున్నాయి వినవలసిన time లో వినం చూశారా అప్పుడు time లేదు బాగా time ఉన్నప్పుడూ వినపడటం లేదు. అందుకే స్వామిని అడిగారు how to define life జీవితాన్ని ఎట్లా నిర్వచించాలి స్వామి అంటే ఏం లేదు బంగారు దొరికింది నచ్చదు నచ్చింది దొరకదు అదే జీవితం కాబట్టి ఉన్నదాంతో హాయిగా ఉండు అది. కాబట్టి ఇక్కడ ఇంద్రియాలను జయించటం అంటూ లేదు జయించబడిన ఇంద్రియాలతో ఎట్లా జీవించాలి ఇది ప్రశ్న. జయించబడతాయి ఇంద్రియాలు automatic గా అవి నెమ్మదిగా తగ్గుతూ తగ్గుతూ వస్తాయి ఇది దీని పేరు మదము అన్నాడు. ఇంద్రియ నిగ్రహం గనుక మనం నేర్చుకున్నట్లయితే దాని పేరు దమము అయింది చూశారా అన్నీ అక్కడే ఉన్నాయి విరుగుడు అంతా అక్కడే ఉంది ఉన్నాయి అని గమనించుకోవాలి. ఇక మాత్సర్యం jealousy మనం ఎవరితోనో చాలా ధనవంతులతో పోల్చుకుంటే ధనవంతులం కాలేం ఏమీ లేని కడు బీదవాడితో పోల్చుకుంటే మనం అది కాలేం.మనం మనమే we are unique మళ్ళీ పునః చెప్పుకోవాల్సింది మనం మనమే మనకి ఎంతవరకు ప్రాప్తి ఉందో అంతవరకే దాన్ని ఎవరు కూడా తొలగించగలిగిన వాళ్ళు లేరు. మనకి అది రావలసి ఉంటే ఖచ్చితంగా వస్తుంది అది మనకి destiny లో లేదు అని అనుకుంటే నువ్వు ఎంత ప్రయత్నించినా రాదు. కౌన మహర్షి అదే కదా చెప్పారు. కర్త జీవుడి ప్రారబ్ధాన్ని బట్టి ఆడిస్తూ ఉంటాడు ఒక విషయం ఖచ్చితంగా జరగాలి అని నీవు ఎంత ప్రయత్నించినా అది జరగదు జరగకూడదని ఎంత నిరోధించినా అది జరగక మానదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మౌనం వహించుట ఉత్తమము అన్నారు అది వాచా మౌనం కాదు మానసిక మౌనాన్ని alright ఇదిగో ఇప్పటికి ఇది ఇలా ఉంది చాలు we are happy అని మన అంతట మనం అనుకోగలిగితే అది ఆనందాన్ని ఇస్తుంది గనుక ఇదంతా కూడా ఈ మాత్సర్యం మనం వదిలిపెట్టాలి. ఇవాళ జగత్తుకి జగత్తులో మాత్సర్యం కూడా ఒక కారణం ఒక దేశం ఇంకో దేశం పట్ల ప్రేమ లేదు చూశారా? ఒకప్పుడు ఉంది ఒక దేశానికి కష్టం వస్తే ఈ దేశం ఆలోచించేది దేశం అంటే ఆ దేశ ప్రజల గురించి ఆలోచించేది ఇవాళ మాత్సర్యం అది దూసుకుపోతుంది అంటాడు అది దూసుకుని ఎక్కడికి పోతుంది అది అక్కడే ఉంటుంది ఎక్కడికి పోవటం లేదు అది పెరిగిపోతుంది సంపద పెరిగిపోతుంది కానీ ఆలోచించవలసింది భారతీయమైనటువంటి ఆత్మలో మనమందరం కూడా ఆత్మ వికాసం పొందకపోతే మాత్రం ఆలోచించుకోవాలి. భౌతిక వికాసం జరిగిపోతున్నది మనందరికీ ఇవాళ కావలసినంత ఉంది లోటు ఏం లేదు కావలసినంత అంటే relative అంతే కదా అదంతా మన దగ్గర ఉన్నది కాబట్టి లేనిదానికై తాపత్రయ పడకుండా ఉన్నదానితో సంతృప్తిగా హాయిగా ఉండగలిగినట్లయితే అది మాత్సర్యం నుంచి మనల్ని బయట పడేస్తుంది గనుక ఈ అరిషడ్వర్గాలు జీవుడికి జన్మతః ఆ ఆరు వాడు వెంబడి వస్తాయి గనుక ఈ ఆరింటిని ఎట్లా జయించాలి అంటే దానిని శ్రవణము మననము నిధిధ్యాసనము అర్చన ఆరాధన వేడుక జాతర ఊరేగింపు సత్సంగము సత్సాంగత్యము సదాచారము సమ్యక్ సంకీర్తన సమస్తమైనటువంటి సజ్జన సాంగత్యము ఇవన్నీ గనుక మనం ఏర్పరచుకున్నట్లయితే మన నుంచి అరిషడ్వర్గాలు నెమ్మదిగా వైదొలుగుతాయి అది slow process చాలా నెమ్మదిగా జరుగుతాయి అరిషడ్వర్గాలు ఇవాళ మాట్లాడుకున్నాం రేపు పొద్దున కెల్లా జయించామనటానికి లేదు సందర్భాలు ఏర్పడతాయి ఆ సందర్భాలు ఏర్పడినప్పుడు మనం ఎట్లా ఉన్నాం అనేది మనకే సమాధానం దొరుకుతుంది కాబట్టి ఈ ఆరు వర్గాలని అరిషడ్వర్గాలని జయించడానికి బగళాముఖి అనబడేటువంటి ఒక అమ్మవారు ఉన్నది అమ్మవారి యొక్క దశ రూపాలలో ఒక రూపం అది. ఆ దశ రూపిణిలో బగళాముఖి అనబడేటువంటి ఆ స్వరూపం వేరి గనుక ఆ ముఖంలో నుంచి ప్రచండమైన కానీ ప్రసన్నమైన పారమార్థికమైన ఆర్థికమైన శాంతమైన కరుణా స్వరూపమైన కానీ అన్నింటినీ మించి ఆంతరంగిక శక్తివంతమైన అంటే ఇచ్ఛా క్రియా జ్ఞాన అనబడేటువంటి మూడు శక్తులు ఒక చోట కూర్చొని మనిషికి ఆ అరిషడ్వర్గాలని జయించేటువంటి ఒక సన్నివేశాన్ని ఏర్పరు-ఏర్పరుస్తాయి గనుక దశ రూపిణిలో రెండవది బగళాముఖి. ఆ బగళాముఖి దశ రూపిణి వామాచారం వైపు మనం వెళ్ళటం లేదు. ఇవన్నీ కూడా జీవితానికి మనం సమన్వయం చేసుకోవాలి గనుక ఇవన్నీ మీకు గుర్తుండవేమో అని ఒక చిన్న కాగితం మీద బాల వికాస్ గురువు కోసం రాసుకొచ్చాను. రాసుకొని బాల వికాస్ గురువుకి ఇస్తాను. అవన్నీ తర్వాత నెమ్మదిగా పిల్లలకు చక్కగా చెప్పండి. మా వామాచారంలోకెళ్తే మనమంతా కూడా వెనక్కి వెళ్లిపోతాం. తర్వాత ఈ శత్రు జయం చేశాం. చేసిన తర్వాత చిన్న మస్త. ఆ బొమ్మలు మీకు కొంత గుర్తుంటే ఒక చేతిలో ఒక మనిషి తలకాయ పట్టుకొని అమ్మవారు నుంచొని ఉంటుంది. ఆ బొమ్మలు అలా ఎవరు వేశారో గానీ తలకాయలు నరికేది తల్లి ఎలా అవుతుంది? కదా? తల్లి తల నరుకుతుందా? తెగి పడబోతుంటే పట్టుకొని మళ్ళీ అతికించే ప్రయత్నం చేస్తుంది. ఒక western country లో operation theatre లోకి ఓ పిల్లవాడు accident అయి వాడు వెళ్ళాడు లోపలికి. వెళ్తూ ఉంటే ఆ రోజుల్లో వాళ్ళ ఊహ చూడండి ఇది ఇప్పటి కథ కాదు ఓ రెండు వందల ఏళ్ళనాటి కథ. ఆ పిల్లవాడికి గుండె తీసి గుండె పెట్టాలి. ఏదైనా ఇవ్వగలరు గానీ గుండె రక్తదానం వరకు చేయగలరు గానీ గుండె దానం చేయమంటే ఎవరు చేస్తారు? బయట తల్లి కూర్చుని ఉంది. కూర్చుని ఉంటే తల్లి దగ్గరకు వచ్చి అమ్మా మరి ఒకే ఒక్క chance ఉంది ఎవరైనా నీ కొడుకు వెనుక దయతో గుండెకాయ ఇస్తే దాన్ని మేము అతికిస్తాం పెడతాం అంతవరకు చేయగలం కాబట్టి నువ్వు ఓ పని చెయ్ ఓ గుండెకాయ సంపాదించు అన్నది. అన్నాడు doctor. నా కొడుకు కోసం గుండెని సంపాదించడమేంటి నా గుండె తీసుకెళ్ళమన్నది తల్లి. చూశారా? వాళ్ళు తీసుకున్నారు ఆ పళ్ళెంలో పెట్టారు ఇంకా శ్వాస అడుగుతున్నది గుండె కొట్టుకుంటున్నది. కొట్టుకుంటుంటే తల్లి ఏమన్నదో తెలుసునా? చిరంజీవిగా ఉండి నీ జీవితం పదిమందికి ఉపయోగపడేట్లుగా చెయ్యి నాయనా అని అడిగింది. అది. ఆ క్షణంలో ఆ తల్లి గుండె మళ్ళీ పిల్లవాడికి అతికించారు. ఈ తల్లి దాతృత్వం వల్ల దయ వల్ల ఏమైంది అంటే విచిత్రంగా పిల్లవాడి ఆగిపోయిన గుండె పళ్ళెంలో ఉంది కదా అది మళ్ళీ కొట్టుకోవడం మొదలు పెట్టింది.దాన్ని తెచ్చి తల్లికి తగిలించారు డాక్టర్లు అంటే ఇస్తే వస్తుంది మనందరం అనుకుంటాం తిరుపతి ఏడుకొండలు ఎక్కి వెళ్లి ఆయన దగ్గర నుంచొని ఒక అబద్ధం చెప్తాం ఏమిటో తెలుసా నువ్ ఇస్తే నీకు కొద్దిగా ఇస్తా అని కదా అంటే నువ్వే ఇవ్వాలి ఇచ్చిన దాంట్లో కొద్దిగా గిల్లి నీకు ఇస్తా అని ఆయన అసలు ఏం అనడు ఇస్తా అని అనడు ఇవ్వను అనడు అది వస్తాయి వచ్చిన తర్వాత ఇవ్వాలి అన్న స్పృహ లేదు కదా వాడికి ఈసారి నడిచి వెళ్ళు కార్ ఏసుకొని డబ్బులు వచ్చినాయి కదా కార్ ఏసుకొని వెళ్తాడు ఏవండీ పాపం ఆవిడ ఉంటుంది ఇల్లాలు ఇల్లాలు ఎప్పుడూ మంచిది ఆ రోజు వస్తే ఇస్తా అన్నారు అవి ఉండి లేదు అని అనుకున్నంత రాలేదు అవి వచ్చినప్పుడు చూద్దాం అంటాడు వెళ్ళిపోతాడు చూశారా కాబట్టి ఇవ్వటం అంత తేలికైన విషయం కాదు కానీ ఇవ్వటం నేర్చుకోవాలి అధ్యాత్మంలో ఇస్తేనే వస్తుంది అంతే భూమిలో పది గింజలు విత్తనాలు చల్లితే పది పుట్ల ధాన్యం వస్తుంది అంతే కదా ఇస్తే భూమాత ఇస్తుంది కాబట్టి ఆ చిన్న మస్త అంటే determination పట్టుదల ఉండాలి ఏ కార్యం సాధించాలి అన్న డబ్బుతో అన్ని సాధించగలమా సాధించలేం కేవలం దైహిక శ్రమతో చేయగలమా చేయలేము లేదు నేను చాలా మేధావిని ఐన్‌స్టీన్ తర్వాత నేనే అని అంటే దాంతో ఏమైనా చేయగలమా అది చేయలేం కాబట్టి దేహం పనికిరాదు అంటే పని పరిమితం ఉంది intellect కి పరిమితి ఉంది శక్తికి పరిమితి ఉంది మరి ఏం లోపించిందయ్యా అంటే పట్టుదల లోపించింది determination ఎలాగైనా నేను చేయాలి ఎట్లాగైనా ఇది చేయాలి ఏ రకంగానైనా ఈ పని జరగాలి అనే పట్టుదల ఉంటే ఇదిగో మన కూకట్ పల్లి సత్సంగం గారు పది దాకా వచ్చాయని ఆనందంగా ఉంది కదా అది పట్టుదల ఆ పట్టుదల ఎవరి యందీ అనేవాడికి ఉండాలి వినే వాడికి కూడా ఉండాలి రాకపోతే అది జరగదు కాబట్టి ఆ చిన్న మస్త ఏం చెప్తుందంటే జన్మతః వచ్చినటువంటి నీ intellect ని పక్కకి పెట్టు ఇట్లా పట్టుకో నీ శక్తి చాలదు ప్రపంచం యొక్క సర్వశక్తుడిని నీ దగ్గరికి తీసుకో సమాజంలో నుంచి ఒక్కసారి అయ్యా నేను ఈ పని తలపెట్టాను నా వల్ల కావటం లేదు మీరు ఏదన్నా సహాయం చేయండి తప్పేం లేదు నాకు సహాయం చేయండి అంటే వాడు వామనుడు అయిపోతాడు వీళ్ళ అందరి కోసం కొద్దిగా సహాయం చేయండి అంటే వాడు త్రివిక్రముడు అవుతాడు అంతే కదా విష్ణుమూర్తి నాకు మూడు అడుగులు నేల అన్నందుకు ఆయన వామనుడు అయిపోయినాడు ఆ మూడు అడుగులు బలి చక్రవర్తి దగ్గర తీసుకున్న తర్వాత ప్రపంచానికి ఇచ్చిన మరుక్షణమే ఆయన త్రివిక్రమ స్వరూపం అయినాడు మూడు భువనాలని ఆక్రమించాడు కన్నెత్తి చూడటానికి కూడా వీలు లేనంత సూర్యమండలం దాకా ఆయన శిరస్సు వెళ్ళింది భాగవతం చెప్తున్నది వామనావతార ఘట్టంలో కాబట్టి మన కోసం అడగటం ఆపెయ్యాలి అక్కర్లేదు ఉన్నదాంట్లోనే జీవితం గడపాలి ఇది ఒక ఆధ్యాత్మిక నియమం రెండవది ఓ మంచి పని చేయాలి తప్పులేదు మీరు పది రూపాయలు ఇవ్వండి నా దగ్గర తొంభై ఉన్నాయి ఒక పది ఇవ్వండి ఆ తొంభై పది కలిపి ఇంకొకడికి అప్పచెప్పండి సేవా కార్యక్రమాలు అట్లా చేయాలి మీరేవో కొంతమంది ఉంటారు నేను చూశా మీరు అవి ఏమీ శ్రమ పడకండి ఎంత అవుతుంది చెప్పండి అన్నాడు ఒకాయన అది లక్ష రూపాయలు నేను ఇస్తాను అన్నాడు స్వామి అన్నారు మాకు అక్కర్లేదు అన్నారు నీ లక్ష మాకు అక్కర్లా లక్ష మంది ఒక్కొక్క రూపాయి ఇస్తే చాలు అది ఆధ్యాత్మిక ఆర్థిక నియమం అది దాని వలన ప్రతి వ్యక్తికి కూడా ఒక అవకాశం వస్తుంది లక్ష రూపాయలు ఇస్తే పని తేలిక అవుతుంది కానీ దానిలో మన పట్టుదల ఏముంది మన శ్రమ ఏముంది ఎవడో డబ్బు ఇచ్చాడు మనం ఖర్చు పెట్టాం అలా కాకూడదని చిన్న మస్త మస్త అంటే mind చిన్న అంటే fragmented broken into pieces ఒక piece పక్కన పెట్టుకోండి ఒక్కొక్క పనిని ఒక పట్టుదలగా సాధించండి ఏ ఇంజనీరు కావాలి అంటే అయినామా లేదా doctorate తీసుకోవాలి అంటే తీసుకున్నామా లేదా నేను ఫలానా కావాలి ఇల్లు కట్టుకోవాలి ఇలా కట్టుకోవాలి ఇలా తర్వాత ఇంకోటి కట్టాలి దాని తర్వాత అంటుంటే అన్నీ చేయగలుగుతున్నాం కదా మరి అవన్నీ చేయగలిగినప్పుడు నా పట్టుదల వలన ఈ ప్రపంచానికి సంతోషం కలగాలి నా వల్ల ఆనందం కలగాలి నా జీవితం ఆ దుర్గా శక్తి నా యందు ప్రవేశించాలి అని అనుకోవాలో అనుకోవాలి అది పట్టుదల గనక ఉంటే సాధించలేనిది లేదు ఆ సాధన గాని మనం కావాలని కోరుకునేది గాని అది జగత్తుకు ఉపయోగపడేట్లుగా ఉండాలి అని దశ మహావిద్యలలో అమ్మవారు చిన్న మస్త అనేటువంటి స్వరూపంలో మనకు బోధిస్తూ ఉన్నది తర్వాత ఏ పని చేసినా. వాడు హత్య చేశాడు హత్య సరే సహజంగా పోలీసులు ఆ కేసు కోర్టుకి అప్పజెప్పారు హత్య చేసిన వాడు ఒక lawyer ని పెట్టుకున్నాడు హత్య చేయబడ్డ వాడు ఆ family ఇంకో lawyer ని పెట్టుకున్నారు ఇద్దరూ lawyers అక్కడికి వెళ్లారు వాళ్ళు వాదించాలి కదా వాదించాలి అంటే ఇద్దరీ ప్రయత్నం ఏమిటంటే వాడు హత్య చేశాడు అని prove చేయాలి ఒకాయన అసలు వాడు ఏ పాపము ఎరగడు అని prove చేయాలి రెండో ఆయన మరి జడ్జి గారు ఎట్లా అదో హత్య అయితే జరిగింది వాడు అక్కడ పడిపోయి ఉన్నాడు వాడు వెళ్ళిపోయి కూడా పది రోజులు అయిపోయింది మరి దీనిని ఎట్లా అని అంటే గెలుపు కోసమే మనం ఆరాట పోరాట కామాటము అన్నాడు గజేంద్రమోక్షంలో పోతనామాత్యుల వారు అంటారు జీవుడు ఆరాట పడతాడు ఆ ఆరాటం దేనివలన అంటే కామాటం లో నుంచి పుడుతుంది కామాటం అంటే కోరిక వాడికి ఏం కోరిక కలిగింది జలవిహారం చేయాలనిఆ జలవిహారంలో తన గజ సంపదని ప్రపంచానికి చూపించాలని తన సైన్యం ఇంత గొప్పగా ఉన్నదని ఆ అనేకమైనటువంటి exhibition అంటాం చూడండి vanity దాంట్లో మడుగులో దిగాడు. దిగితే మొసలి పట్టుకుంది మొసలి పట్టుకుంటే అయిన వాళ్ళందరూ దూరంగా జరిగిపోయారు భయం వల్ల ఎందుకని అది రక్తపు మడుగుగా మారిపోతున్నది. ఆ వెనక్కి వెళ్లి పోతూ ఉంటే వాడు ఇంకా పట్టుదలగా మొదలు పెట్టాడు ఎలాగైనా సాధించాలి విజయం అని. బహుదూరంగా ఉంది అప్పుడు ఏం చేసాడంటే పట్టుదల వీళ్ళందరినీ నిలబెట్టుకోవటంలో లేదు ఆ పరమేశ్వరుడు అనే వాడు ఒకడు ఉన్నాడు అని అందరూ చెప్తుంటే ఇంతవరకు విన్నాను నేను ఆలోచించలేదు. కలడందరూ దీనులై యెడ అని చెప్తూ కలడు కలండని వాడు కలడో లేడో ఉన్నాడు ఉన్నాడు అనేవాడు అసలు ఉన్నాడో లేడో అని అనుకుంటూ ఈ ఆలోచనలో పడితే ప్రాణమే పోతుంది అని అప్పుడు అనుకున్నాడు. లావుక్కింతయు లేదు ధైర్యము విలువ లంబయ్యే ప్రాణంబుల టావుల్ తప్పెను మూర్చ వచ్చెన్ ఇప్పుడు స్పృహ ఉన్నా గనుక పద్యం అన్నా చదువుతున్నా తర్వాత మూర్చ వచ్చెన్ ఇక తర్వాత ఏం లేదు తనువున్ దస్సెన్ శరీరం శక్తిని కోల్పోయింది కాబట్టి నువ్వు తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపగు దీనున్ ఆ దీనుడిని రక్షించమని అడిగాడు అడిగినప్పుడు పరమేశ్వరుడు పరిగెత్తుకొని వచ్చాడు. పట్టుదల ఆ క్షణంలో గజేంద్రుడు యొక్క పట్టుదలలో రెండు చూసాం ఒకటి ప్రపంచం అనే మడుగులో ఎట్లాగైనా దిగి సుఖ సంతోషాలు పొందాలి అనే పట్టుదల ఒకటి దీనిని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదల ఒకటి రెండవది ఈ సంసార బంధంలో నుంచి చక్రబంధంలో నుంచి బయటపడి చక్రిని దర్శించుకోవాలి అనే పట్టుదల రెండు సాధించాడు. అందుకనేది గజేంద్ర మోక్షము అంటాం నిజానికి పోతనామాత్యుల వారు దానిని గజేంద్ర మోక్షణము అన్నాడు మోక్షణము అంటే మోక్షమార్గము నకారము జ్ఞాన మార్గం కాబట్టి మోక్షము నౌను మోక్షణము మార్గం అది ఇంతే తేడా దానికి పెద్ద శబ్దార్థం ఏం లేదు. కాబట్టి ఆ గజేంద్ర మోక్షణానికి ఏమిటేంటంటే ఆ పట్టుదల ఆ పట్టుదలకి భువనేశ్వరీ దేవి ఇందాక అనుకున్నాం లలితా దేవి మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం జగజ్జనానందకరీం జయాఖ్యాం యశస్వినీం యంత్ర సుయజ్ఞయోనిం జతా మితా మిత్ర కృత ప్రపంచాం భజామహే శ్రీ భువనేశ్వరీం తాం కాబట్టి పట్టుదల ఉండాలి అది ఒకటి. ఇక మనకి లక్ష్మి సరస్వతి పార్వతి ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురిని మనం ఏమంటున్నాం అంటే ముగ్గురు అమ్మలు అంటున్నాం. ఆ ముగ్గురు అమ్మలే దసరా అయింది వేళ నిజానికి ద అంటే దుర్గాదేవి స అంటే సరస్వతీదేవి రా అంటే రమాదేవి ఆ మూడు కలిపితే దసరా అయింది శరన్ నవరాత్రులు అయినాయి శరత్కాలంలో వచ్చింది గనుక శరన్ నవరాత్రులు అయినాయి. నిజానికి ఈ ముగ్గురినీ కలిపి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలకుటమ్మ చాలా పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ ఆ చాలా పెద్దమ్మ ఎవరో ఉందే ఆ అమ్మవారికి ఓ పేరు ఉంది సంస్కృత అమ్మ అంటే తెలుగు పదం ఈ దీన్ని సంస్కృతంలో చెప్పాలంటే దేవి అన్నారు కాబట్టి దేవీ నవరాత్రులు అయినాయి శరన్నవరాత్రులు అయినాయి నవరాత్రులు అయినాయి ఎన్ని చెప్పుకున్నా తొమ్మిది రోజులు అమ్మవారి గురించిన మాటలు అని అర్థం అంతే కదా కాబట్టి దేవి దేవుడు కదా దేవుడున్నాడు మహాదేవుడు దేవా అంటే ఆట అని అర్థం దేవా అంటే ఆట ఆడించేవాడు గనుక ఆయనకి దేవుడు అయినాడు. ఆ దేవుడిలో సగభాగం గనక అమ్మవారు కూడా దేవి అయింది అయన ఆడిస్తాడు అమ్మేమో లాలిస్తుంది అంతే. ఆయన తొడపాశం పెడతాడు దానికేమో వెన్ననో లేకపోతే ఇంకేదో నెమ్మదిగా నివేయా క్రీమో రాసేది ఎవరంటే తండ్రి ఎప్పుడూ నివేయా క్రీములు రాయడు తల్లే రాస్తుంది తొడపాశం మాత్రం ఆయన పెడతాడు correction process లో ఆయన ఉంటాడు ఆ correction నుంచి ఆనందం వైపు తల్లి తీసుకొని వెళుతుంది గనుక ఈ మమతా స్వరూపిణి అయినటువంటి మాతృమూర్తి యొక్క ఒక భావం మీరు ఛత్రపతి శివాజీ రాముడు వీళ్ళందరినీ తీసుకోండి అంటే రాముడి కాలం నుంచి మనకి అబ్దుల్ కలాం గారి కాలం వరకు మన కాలం వరకు తీసుకుంటే source of inspiration ఏమిటి? రాముడు అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు కౌసल्याదేవి సహజంగానే దుఃఖపడింది దుఃఖపడకుండా ఉంటే ఆవిడ తల్లి ఎలా అవుతుంది? చాలా కన్నీరు మున్నీరయింది కానీ రాముడు వస్తున్నాడు కన్నీరు తుడుచుకుంది ధీర గంభీరంగా కొడుకు ముందు నిల్చుంది ఏం చెప్పిందో తెలుసునా? రామా యతో ధర్మస్ తతో జయః నువ్వు జయం సంపాదించడమంటూ ఏం లేదు యతో ధర్మః ధర్మం నువ్వు ఎప్పుడు ఆచరిస్తావో నువ్వు ధర్మ స్వరూపుడివి అవుతావు జయం దాంట్లోనే దాగి ఉన్నది యతో ధర్మస్ తతో జయః అక్కడి నుంచి వచ్చింది. అని నిన్ను రక్షించటానికి సైన్యం లేదు పురజనులు లేరు గురువులు లేరు కానీ నిన్ను రక్షించటానికి ఒకటి ఉన్నది అదేమిటో తెలుసునా? ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని ఆచరించు అదే నిన్ను కాపాడుతుంది అంతే కాబట్టి స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః జగద్గురు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు కాబట్టి ఈ పట్టుదల దేనిలో నుంచి రావాలి అంటే మాతృమూర్తి లో నుంచి రావాలి. చూడండి అబ్రహం లింకన్ కథ మనం విన్నాం స్కూల్ కి వెళ్ళాడు చినిగిపోయిన చొక్కాతో వెళ్ళాడు అందరూ అతన్ని అవమానించారు తట్టుకోలేకపోయినాడు తల్లి దగ్గరికి వచ్చి తల్లి ఒళ్ళో దూరాడు దూరి.తల్లి ఇంకా ఏం బాధ పడుతుందో అని అమ్మా ఇవాళ నాకు ఘోర అవమానం జరిగింది చినిగిన చొక్కాతో నన్ను స్కూల్ కి ఎలా పంపావు నువ్వు రాత్రి కుడుతున్నావు నేను వేసుకుని వెళ్తున్నా కానీ మాసికలు అట్లాగే కనిపిస్తున్నాయి అందరూ నవ్వుతున్నారు హేళన చేస్తున్నారు అంటే ఆమె జోక్ కొడుతూ లింకన్ తో ఏమన్నది అంటే నాయనా నువ్వు ఏడవవలసిన రోజు నీకు చొక్కా లేదు అని కాదు చొక్కా చినిగింది అని కాదు చొక్కా లేని కోటానుకోట్ల నీ వయస్సు వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటే చొక్కా ఏ వేసుకోని వాళ్ళు ఉన్నట్లైతే వాళ్ళకి వాళ్ళని గురించిన ఆలోచన వల్ల నీకు దుఃఖం రావాలి తప్ప నీకు లేదు అనేటువంటిది నీ దుఃఖానికి కారణం కాకూడదు నువ్వు ఈ దేశానికి రాజువై ఈ దేశానికి President వై ఇటువంటి చొక్కా లేని ఒక వ్యక్తి కూడా ఈ దేశంలో ఉండకూడదు అని నిర్ణయించుకో అని చెప్పింది అబ్దుల్ మన అబ్రహం లింకన్ తల్లి రాముడు కౌసల్యాదేవి రాముడికి అదే చెప్పింది యశోదాదేవి కృష్ణ పరమాత్మ ప్రజా భూమి నుంచి వెళ్ళిపోతున్నాడు అక్రూరుడు వచ్చాడు రథం అక్కడ రెడీ గా ఉంది బలరామ కృష్ణుడు ఇద్దరు ఎక్కపోతున్నారు యశోద అన్నది కన్న కడుపుని కాకపోయినా నను కన్న తండ్రి మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తాను రా ఈ మమతానుబంధాలు నువ్వు తెంచుకోగలిగావు గానీ నేను తెంచుకోగలనా ఈ ఎడబాటు ఎట్లా అని అడిగింది తల్లి అడిగితే ఎడబాటు మానసికమైనది అమ్మ నేను నిన్ను ఎట్లా తలుచుకుంటూ ఉంటానో నువ్వు కూడా ఇక్కడ కూర్చొని మా కృష్ణుడు మా బలరాముడు బాగా ఉండాలని నువ్వు అనుకో తల్లి అంటూ ఆయన రథం ఎక్కాడు చూసారా అంటే బాగా ఉండటం బాగా లేకపోవడం మన మనసుకు సంబంధించింది కర్మానుబంది మనుష్యులోకే అట్లాగే మానవుడు మనోమయుడు కాబట్టి ఆ మనస్సుని పవిత్రీకరించుకోవాలి మనం ఆ దశ రూపిణి మహా విద్యలలో మనం ఇవాళ నేర్చుకోవలసినది మన పిల్లలకు పట్టుదల ఇవ్వాలి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సందర్భం నా వరకు మామూలుగా నేను బయట చెప్పని ఒక సందర్భం మీకు చెప్తాను. ఆ తర్వాత మా రామకృష్ణ వాళ్ళంతా edit చేసి చేయాలంటే చేసేయొచ్చు హాయిగా నేను fifth form చదువుతున్నప్పుడు వరాహమిహిరుడి బృహత్ సంహిత కావ్యం మీద ఇది fifth form బృహత్ సంహిత అనబడే ఆ నాలుక కూడా తిరగదు కానీ వ్యాసం రాస్తే దానికి ఒక national award వచ్చింది బాపట్లలో నాకు దగ్గరలో జిల్లాలో మూడు అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని అనిపించింది చాలా పుస్తకాలు ఇచ్చారు gift prize అందులో అన్ని మోసుకెళ్లలేని గనుక ఒక్క పుస్తకం తీసుకుని ఆమె దగ్గరికి వెళ్ళాను ఆమె.
YouTube · audio
Dasa Roopini(Matru Vandanam) — Part 2
Dasa Roopini(Matru Vandanam) — Part 2
Source: SathyaSai Seva Sadan on YouTube
0:00 / 33:11
More in this series