No transcript for this section.
Transcript begins at 0:00.
ఆశీర్వదించలే ఇంకేది అనలే పుస్తకం చేతిలో తీసుకున్నది "నీకు కాకపోతే ఎవరికి వస్తుంది నాన్న" అంది ఆ source of inspiration ఏంటంటే ఇంకా ఎంతమంది పో-- పాల్గొన్నారు నీకు ఎన్ని marks వచ్చినాయి నీ తర్వాత వాడికి నీకు ఎంత ఈ ప్రశ్నలు లేవు "నీకు కాకపోతే ఎవరికి వస్తుంది నాన్న" అన్నది అంటే అది మొదలు అర్థం చేసుకోగలిగితే చేసుకోకపోతే ఏంది నేను పుస్తకం ఇచ్చాను అవి మాట అన్నది అంతే కాదు ఆ source ఎక్కడ నుంచి అంటే మాతృమూర్తి లో నుంచి రావాలి మన పిల్లలు dullards ఉంటారు వాళ్ళకి పాపం ఎక్కువ చదువు రాదు ఎంత teacher ఏమో అక్కడ కొడుతున్నాడు నాయన ఏమో తిడుతున్నాడు friends ఏమో అవహేళన చేస్తున్నారు వాడు ముప్పై ఆరు దాటలా చూశారా అప్పుడు చూడండి వీళ్ళందరిలోకి ఒక తల్లి దగ్గర తీసుకుంటుంది తీసుకుని "నీకు ఏం కావాలో చెప్పు నాయనా నీకు రాకపోవడం ఏంటి రా నీకు కావాలంటే నా దగ్గర" ఆమెకు చదువు లేదు చూశారా ఆ syllabus ఆమెకు తెలియదు నా దగ్గర కూర్చొని నేను చెప్తాను అంటుంది ఆ ధైర్యము స్థైర్యము ఒక ఆధారం చూపించగలిగినటువంటి ఆ మాతృమూర్తి కాబట్టి అది అబ్దుల్ కలాం ది కూడా మనం ఇక్కడ స్మరించుకోవాలి కలాం గారి father పోయినప్పుడు జవహర్ లాల్ నెహ్రూ ఆయనకు ఒక flight arrangement చేశారు ఆ హోమీ జ బాబా not నెహ్రూ ఇస్తే ఆయన విమానం తీసుకొని రామేశ్వరం వెళ్లారు దఫన్ కార్యక్రమాలు అయిపోయినాయి బంధువులంతా ఉన్నారు పెద్ద family కలాం కూడా ఉన్నాడు అందరితో పాటు తల్లి ఆ గడప దగ్గర గడప కౌగల కూర్చుంది ఆమె ఏమన్నది అంటే "కలాం! నీ బాబా అంటే father ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు ఆయన ఆయన ప్రయాణంలో ఆయన ఉన్నాడు నువ్వు ఈ దేశం నిన్ను నమ్మి నీకు కలిగిన ఓ కష్టానికి నీ తండ్రిని చూడటానికి ఒక విమానమే ఇచ్చి పంపించింది కనుక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకుండా అదే విమానంలో నువ్వు ఇప్పటికిప్పుడు బయలుదేరి దేశ సేవలో నీ కార్యక్రమాన్ని నీ సమయాన్ని గడుపు ఇక్కడ నువ్వు చేసేది ఏం లేదు" అన్నది మాతృమూర్తి అంటే అట్లా ఉండాలి మామూలుగా నువ్వు లేకపోతే ఎట్లా విమానం వెనక్కి పంపించు పది రోజులు ఇక్కడ ఉండి ఏం చేస్తాడు ఆయన చేయటానికి చాలామంది ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్ళిపో అన్నది అది మాతృమూర్తి అట్లా నిష్కరిషగా ఉండాలి పిల్లలకి ధైర్యాన్ని ఇవ్వాలి నింపాలి వెన్నుతట్టి నడపాలి ఇవాళ ప్రాపంచికంగా కూడా ఒక క్షణం ఆలోచిస్తే the amount of separations in the newly wed కొత్తగా పెళ్లి చేసుకుంటారు లక్షలు ఖర్చు పెట్టి ఐదు నిమిషాల్లో విడిపోతున్నారు దానికి కారణాలు వాళ్ళ మీద నెపం వేస్తున్నాం కానీ నా observation లో నేను గమనించిన దాంట్లో నేను విన్న కొన్ని వేల కథలలో దానికి కారణం వాళ్ళు కారు తల్లిదండ్రులు కారణం అవుతున్నారు అందుకనే మన ఇంటికి వచ్చినటువంటి బిడ్డని ఇంకొకరు కన్న బిడ్డని మన బిడ్డగా చూడగలిగిన స్థాయికి మనం ఎదగాలి ఎందుకంటే మన బిడ్డ కూడా ఇంకో ఇంటికి వెళ్ళింది ఇక్కడ ఈమెను చూస్తే అక్కడ ఆమెను వాళ్ళు చూస్తారు అంతే equation ఇవాళ ఈ దేశం ఒక వైవాహిక బంధానికి పరమ పవిత్రమైన పీట వేసింది వివాహ వ్యవస్థ చాలా గొప్పది భార్యాభర్తలు అర్ధనారీశ్వర తత్వంతో జీవించమని చెప్పిన ఏకైక జాతి భరత జాతి అటువంటి జాతి ఈవేళ పెళ్లైన వారం రోజులకి పది రోజులకి పెళ్లి పీటల మీదే separation అయిపోతూ ఉంటే ఈ జాతి ఏమైపోతున్నది ఈ మాటలన్నీ ఊరికే కథా కాలక్షేపానికేనా సామాజిక బాధ్యత మనం పెంపొందించుకోవడానికి అవకాశం లేదా అంటే ఇక్కడ ఈ భవనమంతా కూడా అమ్మవారే అధీనంలో ఉన్నది కాబట్టి మనం వివాహ వ్యవస్థను చాలా పటిష్టం చేయాలి youth ని address చేయాలి మనం youth తో మాట్లాడాలి విడిపోవడానికి కారణాలు పెద్ద అక్కర్లా చిన్నవి చాలు కలిసి ఉండటానికే కారణాలు కావాలి ఆ కలిసి ఉండే కారణాలన్నీ కూడా ఈ జాతి ఎప్పుడో పొంది ఉన్నాయి చూడండి ఈ దేశం కానీ ఏ దేశంలోనైనా అరవయ్యవ వివాహం చేసుకొని వాడు ఉత్సవం చేస్తాడు అరవయ్యవ వివాహం కదా అంటే అరవయ్యో పెళ్లి sixtieth marriage ఇక్కడ sixtieth marriage day చేసుకుంటాం వాడికి day లేదు marriage ఏ ఉంది మనకి అరవై సంవత్సరాల వైవాహిక వార్షికోత్సవం అంటే మనం పెళ్లి చేసుకొని అరవై ఏళ్ళు అయింది అరవై ఏళ్ళు మనం కలిసి ఉన్నాం దానికి ఉత్సవం అక్కడ అట్లా కాదు అరవయ్యో పెళ్ళికి ఉత్సవం చేస్తున్నాడు ఆ సంస్కృతి వేరు ఈ సంస్కృతి వేరు ఈ దానివైపు మనం వెళ్ళకూడదు అని చెప్తూ ఈ భువనేశ్వరీ మంత్రాన్ని అందుకే ఇవాళ ఈ జగత్ భారతదేశం ఇంత high గా ఇంకా ఇంకా పడిపోకుండా పతనం అవుతున్నది కానీ పతనం కాకుండా అంచులకి చేరకుండా మీరంతా చేస్తున్న శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఒక తపఃశక్తిగా నేను భావన చేస్తున్నా ఇంకా అది నిలబడింది అంటే ఇవే కారణాలు ఇట్లా అనేకమైనటువంటివి కాబట్టి తర్వాత ఈ దసరాలో సరస్వతీ లక్ష్మీ అన్నాం కదా మనకి మామూలుగా శారదరీర దేందు వినసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సిథతామర సా అమర వాహిని శుభాకార తనుప్పు నెన్ను మదిగానగ ఎన్నడు తలంతు భారతీ అని సరస్వతీ దేవిని మనం హాయిగా సం-- తెలుగులో సంస్కృతంలో పిలుచుకుంటాం కానీ దశ మహావిద్యలలో అమ్మవారు తంత్ర సరస్వతితంత్రలక్ష్మి తంత్రపార్వతి అంటే తాంత్రికమైనటువంటి సరస్వతీదేవి ఆ తాంత్రికమైనటువంటి సరస్వతీదేవి మనకు కావాలి మామూలుగా తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ భూనితిన్ అంటే అది పుస్తకానికి తాంత్రికమైనటువంటి సరస్వతీదేవి ఎవరు అంటే మన శరీరం అంతా మంత్రాత్మకం మాటలన్నీ మంత్రాలు ఇది యంత్రాత్మకం కదులుతూ ఉంటుంది గనుక కళ్ళు కాళ్ళు కీళ్ళు అన్నీ ఉన్నాయి గనుక యంత్రాత్మకం మంత్రాత్మకం యంత్రాత్మకం ఇది నడవటానికి ఏదో ఒక principle లోపల ఉంది దాన్ని cardinal energy principle శక్తివంతమైన పాయ ఏదో మన యందున్నది అది ఏమిటి అంటే యంత్రలక్ష్మి తంత్రలక్ష్మి తంత్రపార్వతి కాబట్టి మంత్ర తంత్ర యంత్రాత్మకమైనటువంటి మన కేవలం మనం దేహం అంటే అద్దంలో చూసుకుని మురిసిపోయే దేహం కాదిది ఇది ఒక ఆధ్యాత్మిక దివ్య భావనా భూమిక దివ్యదేహాన్ని ధరించి మనం ఇక్కడికి వచ్చాం ఆ లోపల జరుగుతున్నటువంటి ఆంతరంగికమైనటువంటి ఆ భావనా శక్తిని అంతా కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే సరస్వతీదేవి తాంత్రిక శక్తి గనుక అంటే తంత్రము అంటే రహస్యము ఆ రహస్యం గనుక తెలిస్తే వాక్కుకి అర్థం తెలుస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది దీని పుట్టుక ఏమిటి అని ఆలోచిస్తే వేదాలు ఉపనిషత్తులు చెప్పిన వాక్కు అగ్ని స్వరూపము అన్నది మూలాధారంలో ఒక చిన్న ఆలోచనగా ప్రారంభమై నెమ్మదిగా చక్రాలు దాటుతూ దాటుతూ కంఠస్థానం దగ్గరకు వచ్చేప్పటికి యోగాగ్నిలో రగిలి రగిలి పొగిలి పొగిలి అది నెమ్మదిగా ఒక భాషని ఒక భావాన్ని ఒక సంగీతాత్మకమైన లయని ఒక శృతిని ఒక అర్థాన్ని ఒక యదార్థాన్ని ఇదంతా కూడా split second అంటాం చూడండి ఆ secondలో వెయ్యోవంతులో ఆ భావం ఏర్పడుతుంది అప్పుడది మాటై బయటికి వస్తుంది అందుకే స్వామి ఆ శివరాత్రి ఇంకొక రెండు మూడు రోజులు ముందనంగా ఉపన్యాసం కాకుండా విడిగా చెప్పిన మాట ఏమిటంటే శివరాత్రి నాడు సంవత్సరానికి ఒక రాత్రి లింగోద్భవ కాలంలో స్వామి దేహంలో నుంచి వెలువడేటువంటి శివ లింగాన్ని చూసి ఈ లోకం ఆశ్చర్యపోతున్నదే సత్యసాయి భగవానుడి దేహం నుంచి వెలువడే ప్రతి మాట శివ లింగం కాదా అన్నారాయన అది [చప్పట్లు] ఒక్కొక్క మాట విష్ణు లింగమై బయటకు రావటం లేదా దానిని గమనించని ఆ లింగమా మీకు కావలసింది ఇది చూస్తే మోక్షం వస్తుంది సత్యమే కానీ ఇక్కడ ఉన్న మోహం ఎక్కడికి పోవాలి మాటలు వినాలి వాక్కు అగ్ని స్వరూపం కాబట్టి ఆ వాక్కు తంత్ర సరస్వతి తంత్రలక్ష్మి ఉంది ఇవాళ ఒకప్పుడు సంపద గోసంపద భూసంపద రెండే ప్రధానం ఇవాళ సంపద అనేక స్వరూపాలు వచ్చినాయి ఈ మధ్య నేను RIC వరంగల్ కి వెళ్ళినప్పుడు ఒక lecture ఇవ్వటానికి ఒకాయన వచ్చారు ఆ lecture ఏమిటంటే బిట్టు coin అనే దాని మీద కాయను బిట్టు బిట్టుగా అయిపోయింది అది ఏమిటో తెలియదు అది abstract గంట తర్వాత కూడా అతనితో నేను అన్నాను ఇది నాకు అర్థమైంది ఒకటే ఒక utopian thought మా ఏది జరగటానికి అవకాశం లేదో దానిలో నుంచి సంపదని ఊహాజనితంగా సృష్టిస్తున్నారు దీనికి scientific base లేదని తర్వాత మాట్లాడితే ఆ just I play it to the galleries they will be interested to know how to generate money అని అంటే చూడండి మనం అంటాం ఫలానా వాడి దగ్గర యాభై వేల కోట్లు ఉన్నాయి అని అని అంటాం వింటాం వాడి దగ్గర యాభై వేల కోట్లు liquid cash ఉండదు మన మన దగ్గర ఉన్నట్టే యాభై రూపాయలో వంద రూపాయలో ఉంటాయి అవన్నీ account book లో ఉంటాయి they are all notional బ్యాంకుల్లో కూడా అంతే notional money అది సంపద కాదు అది circulate అవుతూ ఉండాలి అయినా అందుకే స్వామి అన్నారు ఫుడ్డు దుడ్డు బ్లడ్డు మూడు తిప్పుతూ ఉండాలి లేకపోతే పోతారని చెప్పారు ఫుడ్డు అందరికీ పంచి పెట్టండి దుడ్డు మీ దగ్గర ఉన్న డబ్బులో కొంత దానం చేయండి లేదు సేవకు వినియోగించండి బ్లడ్డు రక్తదానం చేయండి ఇంకోడు బతుకుతాడు కాబట్టి ఫుడ్డు బ్లడ్డు దుడ్డు దుడ్డు అంటే డబ్బు కాబట్టి ఇక్కడ ప్రతి దానిని కూడా సమకాలీనమైనటువంటి భావానికి మనం సమన్వయం చేసుకుంటూ ఆ తంత్ర పార్వతి తంత్ర సరస్వతి పేరు ఏమిటంటే మాతంగి మన భజనల్లో కూడా మాతంగి ఆ అని వస్తుంది ఆ మాతంగే తంత్ర సరస్వతి తరువాత తంత్రలక్ష్మి ఎవరు అంటే కమల కమలాలయ అమ్మవారే కదా నుంచున్నటువంటి లక్ష్మి కుదరదు మనకి కూర్చొనే ఉండాలి ఎందుకంటే అసలు లక్ష్మీదేవికి కూర్చునే శక్తే లేదు ఆవిడ ఈ జేబు నుంచి ఆ జేబు ఆ జేబు నుంచి ఆ జేబు అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది ఆమె ఒకచోట స్థిమితంగా కూర్చోవాలి ఒక ఒక youngster నన్ను ఒక ప్రశ్న వేశారు రెండు బొమ్మలు చూస్తాను సార్ ఒక బొమ్మలో లక్ష్మీదేవి ఏమో పద్మంలో కూర్చుంటుంది సరస్వతీదేవి ఏమో రాయి మీద కూర్చుంటుంది ఏమిటి తేడా అని అడిగాడు ఆమె కూడా సరస్వతీదేవి కూడా పద్మంలో కూర్చోవచ్చు కదా అంటే నాయనా లక్ష్మీదేవి చరాస్తి అంటే అది నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది చేతులు మారుతూ ఉంటుంది కాబట్టి ఆవిడ ఎక్కువ సేపు ఉంటే ఆ పద్మం తట్టుకోలేదు కాసేపు ఉండటానికి వీలుగా అది ఎంచుకున్నది సరస్వతి ఒకసారి మనకు వచ్చిన తర్వాత ఆవిడ ఎక్కడికి పోదు స్థిమితంగా ఉంటుంది కాబట్టి [చప్పట్లు] ఇది స్థిరాస్తి.స్థిరాస్తి సరస్వతీదేవి చరాస్తి లక్ష్మీదేవి అందునా నుంచున్నది ఏంటంటే పరిగెత్తి పారిపోతుంది కాబట్టి అమ్మా నువ్వు పరిగెత్తకు కాసేపు మా ఇంట్లో ఉండు అని అడగాలి అందుకని లక్ష్మీదేవి బొమ్మ చమత్కారం అంటే నుంచుంటే తప్పు కూర్చుంటే మంచి అని కాదు ఒక దాని వెనుక ఉన్న భావం ఏమిటంటే ఆవిడ తంత్ర లక్ష్మి ఆ తంత్ర లక్ష్మి తర్వాత తంత్ర పార్వతి ఉన్నది పార్వతి అంటే మనలో ఉన్నటువంటి ఇచ్ఛ, క్రియా, జ్ఞాన అనబడేటువంటి మూడు శక్తులు కూడా లేకపోతే కోరిక ఉండాలి ఇచ్ఛ ఉండాలి తర్వాత క్రియ చేయాలి తర్వాత జ్ఞాన విచారణ ఉండాలి విజ్ఞాన, సుజ్ఞాన, ప్రజ్ఞానాలు దాటి అసలు జ్ఞానం ఉండాలి మనం ఇదే సత్సంగమే ఉదాహరణ తీసుకుంటే ఇచ్ఛ ఉండాలి అది శక్తిమంతమై ఉండాలి నేను ఎట్లాగైనా వెళ్ళాలి అని నాకు ఉండాలి ఎలాగైనా చేరుకోవాలని వినేవారికి ఉండాలి అది ఇచ్ఛాశక్తి రెండవది క్రియాశక్తి మబ్బులు పట్టినాయి వర్షం వస్తుందేమో వెళ్ళకపోతే తర్వాత ఎలాగూ YouTube లో చూడొచ్చు ఇవన్నీ ఉన్నాయి కదా వర్షం వస్తుంది రానివ్వండి తడుస్తాము ఏం తడుస్తాము బట్టలు తడుస్తాయి మనకి వార్డ్ రోబ్ నిండా ఉన్నవే ఇవి కదా ఇది అక్కడ పడేసి ఇంకోటి కట్టుకుంటాం అనే స్ఫూర్తి ఉండదు తడుస్తాము అని వెళ్ళం ఎండ అని వెళ్ళం జీవితంలో అవకాశాలు పోగొట్టుకుంటాం చూడండి కాబట్టి క్రియాశక్తి చాలా important తర్వాత జ్ఞాన శక్తి కావాలి ఏ పని చేసినా ఏ ఆలోచన చేసినా ఏ సంబంధ బాంధవ్యాలు ఏర్పడినా దానిలో వివేకము విచక్షణ రెండు ఉండాలి అందుకనే సత్యసాయి భగవానుడు ప్రశాంతినలయంలో స్వామి స్త్రీలంతా ఒకవైపు పురుషులంతా ఒకవైపు మీరు భార్యాభర్తలే అవుగాక ఇక్కడ మాత్రం ఇట్లాగే కూర్చోవాలి అని ఒక నియమం ఎందుకు పెట్టారో తెలుసునా ఆయన విడగొట్టటం కోసం పెట్టలా ఎవరి సాధన వాళ్లది ఎవరి ఆలోచన అయినా భగవంతుని యందు మాత్రమే ఉండే రీతి అది ఒకటి తర్వాత సంఘంలో ఒక respectable distance పురుషుడికి స్త్రీకి మధ్య ఉండాలి అది ఆయన నేర్పిన నియమం వాళ్ళు ఎవరు కానివ్వండి నువ్వు కట్టుకున్న నీ భార్య తప్ప ప్రపంచంలో ఉన్న సమస్త స్త్రీమూర్తులు నీకు తల్లులే ఎంత గొప్ప భావనా చూడండి నువ్వు కట్టుకున్న భార్య తప్ప అది మినహాయించారు మరి వీళ్ళందరినీ తల్లిగా భావించగలిగితే అసలు ఈ ప్రపంచం ఎట్లా ఉంటుంది అనాచారం ఎక్కడి నుంచి ఏర్పడి అది లేదు కనుకనే ఇవాళ అనాచారం ఏర్పడుతున్నది కాబట్టి ఈ తంత్ర పార్వతి పేరు త్రిపురసుందరి ఇందాక ఇచ్ఛ, క్రియా, జ్ఞాన ఆ శక్తులు ఎక్కడ ఉన్నాయి ఎందుకు ఆ పేరు పెట్టారు అంటే త్రిపురములై యందు ఉన్నాయి జాగ్రదవస్థలో ఉంది సుషుప్తిలో ఉంది నిద్రావస్థలో ఉంది అలాగే స్థూల శరీరంలో ఉంది సూక్ష్మ శరీరంలో ఉంది మహా కారణ శరీరంలో ఉంది కాబట్టి శక్తి గనక లేకపోతే మనం లేము కాబట్టి దశ రూపిణి అనబడేటువంటి దాంట్లో చివరికి భైరవి ఆమె ఆమె పేరు భైరవి ఉపాసన ఉపాసన అంటే మంత్రాలు తంత్రాలు అవి అనుకోకండి దగ్గరగా ఉండటమే ఉప భగవత్ భావనకి ఆసన దగ్గరగా కూర్చొని గనక ఉన్నట్లయితే సుఖాసీనులమై స్థిమితంగా ఓ గంట సేపు ఇక్కడ ఉంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి కాబట్టి క్షమము ఉండాలి ఇందాక చెప్పుకున్నాం దమము ఎట్లా ఉండాలో క్షమము కూడా అట్లాగే ఉండాలి సహనము మనకి శ్రీరామ రక్ష చూడండి అలా జరిగి ఉండకపోతే ఆరోజు ఆ కళింగ యుద్ధం జరిగేది కాదు కదా అలా జరిగి ఉండకపోతే అశోకుడు ఇంకో సామ్రాజ్యం జయించేవాడు కదా నవంబర్ ఎనిమిది అలా అయి ఉండకపోతే మన పాత నోట్లు మన ఇంట్లోనే ఉండేవి కదా అంతే కదా అంటే చరిత్రలో if అనేదానికి space లేదు అది అలా జరగాలి జరిగిపోతుంది ఆ if అనేది గనక తీసేస్తే చరిత్రే లేదు. కైక దశరథుడిని, "రాముడిని అరణ్యవాసానికి పంపు నా కొడుకుకి పట్టాభిషేకం చేయించు" అని అడక్కపోతే రాముడు లేడు రామాయణము లేదు అంతే కదా ఐదు ఊళ్ళు ఇస్తే చాలు మా దారిన మేము పోతాం అని తమ్ముళ్లే అడుగుతుంటే దాయాదులు అడిగితే "సూది మొన మోపింది కూడా నీకు ఇవ్వను" అని వాడు అన్నప్పుడు మహాభారత యుద్ధమే జరిగింది కాబట్టి దుర్యోధనుడు ఇచ్చి ఉంటే రాయబారమే లేదు ఇచ్చి ఉంటే భగవద్గీతే లేదు ఏ తర్వాతేం లేదు కాబట్టి చరిత్రలో మనం ఎప్పుడూ కూడా నేను ఒకసారి స్వామి స్వయంగా ఒక అనంతపూర్ భక్తుడితో ఉన్న మాట నాకు గుర్తుకొస్తున్నది, "స్వామీ! నీ దివ్యలీలలు అనుభవించటానికి నాకు నలభై ఏళ్ళు వచ్చేదాకా అవకాశమే రాలేదు నేను ఇరవై ఏళ్ళ క్రితమే వచ్చి ఉంటే ఇంకా ఎంత అనుభవించేవాడినో కదా" అంటే "అప్పుడు వచ్చి ఉన్నట్లయితే" అనే మాట పక్కన పెట్టేసి వచ్చి ఉంటే ఏమయ్యేదో తెలియదు ఇప్పుడు వచ్చావుగా అయిపోయిందేదో అయిపోయింది ఇప్పుడు జరుగుతున్నదిగా ఆ ఇవాళ వచ్చి ఉన్నట్లయితే వచ్చావుగా అది ఇది చరిత్ర అయిపోయింది కాబట్టి ప్రతి దానికి క్షమము ఉండాలి తరువాత ధూమావతి అని ఒకటుంది ధూమావతి ఇది దక్షిణాచారంలో ఇమడదు ఆ ధూమావతి అంటే ఇవాళ మనకు తేలిగ్గా అర్థం చేసుకునేట్లుగా మనం అమ్మవారి దగ్గర అగరుబత్తి వెలిగిస్తాం చూడండి అది ధూమావతి అగరుబత్తి వెలిగిస్తాం మన పక్కనే friend scientist వచ్చాడు వాడు అప్పుడే PhD పట్టుకొని వచ్చాడు "ఏంటో ఇల్లంతా పొగ పెట్టావు" అంటాడు మనం పొగ పెట్టాం అని అనుకోలే అమ్మవారికి ధూపం వేసాం అని మనం అనుకున్నాం వాడు అంటాడు "దీంట్లో carbon monoxide ఉంది carbon dioxide ఉంది you are sure to die ఆ ఈ అగరుబత్తులు మానేసేయ్" నువ్వేం చేస్తావ్ నీకు ఆ feeling రావాలి అంటే నువ్వు చక్కగా దీని మీద వస్తున్నాయి కదా multimedia అదో screen పెట్టుకో అది కొట్టేసేయ్ అగరుబత్తి వెలిగినట్టు ధూపం వ్యాపించినట్టు అవుతుందా?కాదు గనుక ధూమావతి దక్షిణాచారంలోనూ వామాచారంలో పరిమితంగా వాడాలి. రెండు అగరుబత్తులే వెలిగించుకోవాలి. అప్పుడు ఏ జబ్బు రాదు lungs ఏమీ పాడైపోవు ఇల్లు హాయిగా ఉంటుంది. కాబట్టి ధూమావతి అనేటువంటి ధూమము అంటే రెండవ అర్థం అజ్ఞానము అని అర్థం. ధూమ కామ రహిత ధ్యాన ధారణాతీత చారణమై అంటాం. ఎవరిని? ఒక అవధూతని. ధూమము అంటే ఈ ప్రపంచము దాని చుట్టూ ఏర్పడిన అజ్ఞానము, అవివేకము, అవిద్య, అనాచారము, అహంకారము, దంభము, గర్వము, ప్రగల్భము ఇవన్నీ కూడా ధూమమే కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగించు తల్లి. ఆమె కూడా ఒక మాతృ రూపిణి. చూడండి తల్లి ఒక తల్లి పిల్లవాడిని కొట్టదు అంటే నేను ఒప్పుకోను. కొడుతుంది. ఎందుకు కొడుతుంది? కొట్టే తల్లి ఉంటుంది, తట్టి లేపే తల్లి ఉంటుంది, ఎప్పుడు తట్టాలో ఎప్పుడు కొట్టాలో తెలిసింది తల్లి అవుతుంది. చూశారా? అనవసరంగా ఊరికే రోజూ వాడిని దెబ్బలు కొడితే వాడు ఉండడు, ఇంట్లో ఉండడు. అట్లాగే కొట్టకపోతే వాడు బాగుపడడు. వాడు దొంగ అయిన తర్వాత జైలుకు వెళ్తూ ఉన్నప్పుడు తల్లి ఏడుస్తుంటే వాడన్నాడు మనకు కథ తెలుసు "తోటకూర నాడే నాకు చెప్పున్నట్లయితే నేను ఈ పని చేసేవాడిని కాదు. దొంగతనం తప్పు పోలీసులు పట్టుకెళతారు. వాళ్ళు దెబ్బలు కొరడాది ఆ రోజుల్లో కొరడా దెబ్బలు కొడతారు. నువ్వు పొరపాటు చేయకూడదు లేదు అంటే లేకుండా ఉండు అని నువ్వు చెప్పుంటే నాకు ఈ గతి పట్టేది కాదు కదా" అన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ ధూమావతి అంటే అజ్ఞానం మన యందు ప్రవేశించకుండా ఉండేట్లుగా చూడాలి. తర్వాత చిట్టచివరిది తార. తార అంటే వాక్కు. వాక్కు చాలా బలమైనది, చాలా శక్తివంతమైనది. అన్ని విద్యలలో ఈ దశ మహా రూపిణి మాతృవందనంలో మనం వాక్కుకి నమస్కరించాలి. చూడండి వాక్కు లేకపోతే ఏం communicate చేయలేం. ఓ పద్యం పాడుకోలేం, ఓ శ్లోకం చేయలేం, ఓ స్తుతి చేయలేం, ఒక నృత్యం చేయలేం. గేయం, గీత, నామ సహస్రం అంటాం కదా మనకేమో మాట రాదు. కాబట్టి వాక్కు ఎట్లా అంటే వాక్కు అగ్ని స్వరూపము అది తారక స్వరూపం కాబట్టి ఆచంద్ర తారార్కము అని ఒక మాట ఉన్నది కదా. ఆచంద్ర చంద్రుడు ఉన్నంత వరకు అంటే చంద్రుడు ఎక్కడికి పోతాడు? ఉంటాడు. తారార్కము తార అర్కము అర్కుడు అంటే సూర్యుడు. సూర్య చంద్రుడు నక్షత్రాలు ఉన్నంత వరకు నీ మాట నిలబడాలి. అది సత్య వాక్కు కావాలి, అది ధర్మ వాక్కు కావాలి, అది నిరతితో ఉండాలి, నెయ్యముతో ఉండాలి, ఆనందంతో ఉండాలి, అనుభవంతో ఉండాలి, అనుభూతితో ఉండాలి, సాక్షాత్కరింపబడి ఉండాలి, ఆదరంతో ఉండాలి. స్వామి చెప్పారు ఒకసారి రెండే రెండు powerful syllables ఉన్నాయి తెలుగులో అవి ఒక మనిషిని హృదయానికి దగ్గరగా తీసుకొస్తాయి, అదే మనిషిని దూరంగా విసిరివేస్తాయి జాగ్రత్త అన్నారు స్వామి. అవి ఏమిటో తెలుసునా? రెండే రెండు రా ఒకటి రెండవది పో. చూశారా రా పో. రా అనగానే మనం ఎవరో వచ్చారు రండి రా చిన్న వాడైతే రా అంటాం పెద్ద వాడైతే రండి అంటాం. అనగానే మనం వెళ్ళగానే మనకి మనల్ని ముందు ఆహ్వానించారు అని వాడు మన హృదయానికి దగ్గరగా వస్తాడు. చిల్ల వాడు ఇంకా పాపం పిలవలే అమ్మా అని అనబోతున్నాడు తలుపులు వేస్తున్నాం విరగ్గొట్టి అరిచి వాడిని వెళ్ళిపో మనుమని కసురుకొని పో అంటున్నాం. వాడు ఆ వీధిలోకి వచ్చే ముందే అమ్మో ఈ అమ్మ ఇంటికి మాత్రం వెళ్లకూడదు అని తప్పించు వాడే వెళ్ళిపోతాడు. కాబట్టి రా అంటే హృదయానికి దగ్గరవుతున్నాం పో అంటే హృదయానికి దూరం అయిపోతున్నాం. వాక్కు కూడా అందుకనే శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు రమణిని రాజ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు సుగ్రీవుడు మంత్రి అయినటువంటి హనుమాన్ ఆయన దగ్గరకు వస్తే లక్ష్మణ స్వామి ఆయన్ని అనుమానించాడు. మాయా రూపంలో వచ్చిన రాక్షసుడే ఇతను లేకపోతే కోతేమిటి మనిషిలా నడిచి రావటం ఏమిటి? అన్నగారు జాగ్రత్త ఈ అడవి నిండా ఇటువంటి వాళ్ళు ఉంటారని, బహురూపధారులు ఉంటారని, వాళ్ళు రూపం మార్చుకోగలిగిన ఆ రాక్షసులని విన్నాను. నాకెందుకో ఇతను అట్లా కనిపిస్తున్నాడు అన్నాడు. రాముడు ఇందాక చెప్పిన దశ మహావిద్యలను స్వరూపం ఏంటంటే శ్రీరామచంద్రుడే. అందుకే శంకర భగవత్పాదులు ఆయన్ని శ్రీరామో లలితాంబికే అన్నారు. నాకేదో ఆ ధనుర్ధారి అయినటువంటి ఆ రాముడి కంటే ఆయన్ని చూస్తూ ఉన్నప్పుడు నాకు లలితాదేవి కనిపిస్తున్నది అంటాడు. కారణం ఆయన పూర్ణాద్వైత మూర్తి గనుక. భేదం లేదు ఆయనకు రూప భేదం లేదు. అక్కడ హనుమన్ గురించి చెప్తూ ఆంజనేయ శ్రీరామచంద్రుడు అంటాడు "లక్ష్మణా ఏమైంది నీ మనస్సుకి? నీకు అట్లా అనిపిస్తున్నదా? ఇతడు రణ పండితుడు, ఇతడు వ్యాకరణ పండితుడు. ఇంత మధుర మధురమైనటువంటి ఈ వాగ్ధార, ఈ వాగ్జ్యోతి, ఈ వాక్ప్రవాహం ఎక్కడి నుంచి వస్తున్నది? శుద్ధ చైతన్యంలో నుంచి వస్తున్నదని నీకు అనిపించడం లేదా? నా సుగ్రీవుడు నా స్వామి అయినటువంటి" స్వామి అంటే రాజు, యజమాని. "నా స్వామి అయినటువంటి సుగ్రీవుడు నీలాగానే భార్యని, రాజ్యాన్ని పోగొట్టుకొని బయట ఉన్నాడు. నీదు నువ్వు అట్లాగే రాజ్యాన్ని, రమణిని పోగొట్టుకొని ఇక్కడ చేరుకున్నావు. మీ ఇద్దరి దుఃఖం ఒకటే. మీ ఇద్దరి దుఃఖానికి ఉపశమనం కలగాలంటే మా స్వామిని కూడా అంటే మా రాజుని కూడా శాసించగలిగిన అసలు స్వామివి నువ్వు వచ్చావు ఇక్కడికి. రా రామచంద్రా" అని పిలుస్తాడు. ఈ మాటలన్నీ ఆయన అన్న మాటలన్నీ రాముడు మళ్ళీ అంటాడు వాల్మీకి రామాయణంలో. అని నాకు ఈ హనుమ ఆప్తుడి వలె గోచరిస్తున్నాడు. ఎడారిలో వెళుతున్నప్పుడు ఎండమావిని దాటిన నీటి చలం వలె కనిపిస్తున్నాడు. ఒక అశావహమైనటువంటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు నా చేతికి అందినటువంటి ఆధారంగా కనిపిస్తున్నాడు. ఈ హనుమన్ నేను నమ్ముతున్నాను అన్నాడు. చూశారా?అంటే హనుమంతుడు రాముడిని ఎలా జయించాడు అంటే వచో విలాసం తో వాక్ వైదుష్యంతో మంచి మాటతో ఆప్త వాక్యంతో వాత్సల్య పూరితమైనటువంటి మాటతో దాని యందు సంస్కారము సంస్కృతి దాని యందు ఛందస్సు అన్ని కూడా కూడి ఉన్నాయి రాముడు అంటాడు ఆ మాటలో దోషం ఉన్నదా శృతి లయలలో ఎక్కడన్నా గతి తప్పిన దా ఎంత ఛందోబద్ధంగా మాట్లాడుతున్నాడు హనుమ అంటాడు ఆ రాముడి ఆనందాన్ని మనం చదివితే మనం కూడా హనుమంతుడిలా మాట్లాడగలిగితే అని మనకు అనిపిస్తుంది మనం మాటలను చాలా తేలికగా వాడేస్తాం వాడకూడదు మన నించి నెగిటివ్ గా ఎవరిని కూడా తలపు ద్వారా కూడా కీడు శంకిoచ కూడదు కీడు తలపెట్టకూడదు ఇక్కడున్నాం ఎక్కడో ఉన్న వాని గురించి కీడు తలపెడితే వాడికి కీడు జరుగుతుంది వాడికి కీడు జరిగి కర్మ పరిపాక కర్మ నుంచి బయట పడతాడు ఆ మహా పాతకం మన కంటుకుంటుంది కాబట్టి సమస్త లోకాః సుఖినో భవంతు అని స్వామి ఎందుకు నేర్పారు మనకి ఆ మాటలో ఛందస్సు ఉన్నది వ్యాకరణం ఉన్నది ఒక మంగళాచరణం ఉన్నది ఆశీర్వచనం ఉన్నది ఒక విశాలమైనటువంటి హృద్భావన ఉన్నది దైవీ గుణం ఉన్నది దైవీ సంపద ఉన్నది ఇవన్నీ కలిపితే సమస్త లోకాః సుఖినో భవంతు సమస్త లోకాలు ఆనందంగా ఉండుగాక అవి ఆనందంగా ఉంటే ఆ ఆనందంలో నా భాగాన్ని నేను తీసుకుంటాను అనేటువంటిది నిజానికి అమ్మవారి యొక్క ఈ energy flow లోపల ఏదైతే ఉన్నదో అదే దశ రూపిణి లేదా దశ మహావిద్యలు దశ మహవిద్యలు అనే పేరు పెట్టలేదు గాని దాంట్లో ఉన్నటువంటి సారము అంతఃసారము దాని యందు ఉన్నటువంటి రసాత్మక భావన వైఖరి అంతా ఇదేనని చెప్తూ మీరంతా మొన్నటి వరకు కూడా కుమార కుమారి పూజ చేసుకొని ఉంటారు చేసుకున్ చేసుకున్న వాళ్లకు అక్కర్లేదు మీ కోసం అది కూడా ఈ కైతాల్లిచ్చి వెళ్ళిపోతాను నేను అబ్ధి అంటే తొలి సంవత్సరం మనం పుట్టినప్పుడు మొదటి సంవత్సరం తీరేదాకా పన్నెండు నెలలు అయ్యే దాకా మనం ఇంకా పుట్టినట్టు లెక్క కాదు పుట్టాం వచ్చాం అంతే ఏం తెలియదు మనకి కాబట్టి ఈ బాల పూజకి కుమారి పూజకి ఒక సంవత్సరం ఉన్నటువంటి బాలిక పనికిరాదు ఎందుకంటే దానికి ఏ రకమైన స్ఫురణ లేదు గనుక ఇక రెండు మూడు నాలుగు నుంచి మనం లెక్కపెట్టుకుంటూ వెళితే రెండవ సంవత్సరం అంటే మొదటి రోజు రెండు సంవత్సరాల పిల్లకి చేయాలి పిల్లను కూర్చోబెట్టి అలంకారం చేసి ఉయ్యాలలో కూడా పడుకోబెట్టొచ్చు కూర్చోబెట్టొచ్చు ఆమె పేరు కుమారిక కుమారిత్వాన్ని పొందింది మూడవ సంవత్సరం ఆ అమ్మాయి పేరు అమ్మాయి తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు ఆమె పేరు త్రిమూర్తి నాలుగవ సంవత్సరం కళ్యాణి ఐదవ సంవత్సరం రోహిణి ఆరవ సంవత్సరం కాళిక వచ్చింది దశమహావిద్యలు ఏడు చండిక అప్పటికి చండిక అవుతుంది అనమాట ఏడేళ్లు ఆడపిల్లకి రాగానే ఇంట్లో చండిక అవుతుంది అవుతుందా కాదా అప్పటిదాకా గాని చండిక అప్పుడు గాని తెలీదు మనకి ఎనిమిదికి వచ్చేప్పటికి శాంభవి అవుతున్నది శాంభవి అంటే పట్టుదల వస్తుంది తను అనుకున్న రీతిలో ఆ పనులు జరిగేట్టు చేస్తుంది శాంభవి అంటే అది మనం అనుకున్న రీతిలో ఆమె నడపదు ఆమె అనుకున్న రీతిలో నడుపుతుంది అది ఎనిమిదో యేట తొమ్మిదవ యేటకు వచ్చేప్పటికి దుర్గ దుర్గ అంటే ఇక అతిక్రమించటానికి వీలులేనిది అని అప్పటికి తొమ్మిదవ సంవత్సరము ఎనిమిదవ రోజు reverse ఒక రోజు తగ్గుతుంది పది సుభద్ర అయి తొమ్మిదేళ్లు అయిపోతే ఆ కుమారి ఎవరు అంటే తల్లి మన తల్లే కుమారిగా ఈ తొమ్మిది రోజులు కూడా మన ఇంట్లో ప్రవేశించి ఆ కుమారిక పూజ గనక చేసుకున్నట్లయితే ఏమిటి దాని వెనుక పూజ చేస్తే అని కాదు భావన చేయగలిగితే చాలు పూజలు ఎక్కడ చేయగలం అవన్నీ చేయలేం మనం కానీ భావన చేయండి మన ఇంటి ఆడపిల్ల పుట్టింది అనంగానే ఇంతవరకు నాకు తెలిసి మా ఇంట్లో దుర్గ పుట్టింది అన్నవాడు లేడు ఒక్కడు లేడు ఉన్నాడా లేడు మా ఇంట్లో సాక్షాత్తు సరస్వతీదేవి పుట్టింది అన్నవాళ్ళు లేరు మా ఇంట్లో లక్ష్మి పుట్టింది అంటున్నాడు వాడికి అసలు ఆ రావటమే డబ్బు డబ్బు డబ్బు ఎక్కడ మా ఇంట్లో శారదాదేవి పుట్టింది అని అన్నవాళ్ళు లేడే లేదు ఈ ప్రపంచాన్ని రక్షించగలిగిన దుర్గ శక్తి పుట్టింది అనలేదే కానీ ఆ ఎప్పుడు పుట్టింది అంటే మంగళవారం మహాలక్ష్మి శుక్రవారం శుభ్రలక్ష్మి మనమే పేర్లు పెట్టేసి అష్టలక్ష్ముల్లో ఉన్న అన్ని పేర్లు ఆమెకు అప్పజెప్పి ఆమె ద్వారా మనకి ఆ లక్ష్మి అంటే శ్రీ విద్యుత్ కలితాజవజ్జవ మహాజిమూత పాపాంబుధారా వేగంబునన్ మన్మనోజ్య సముదీర్ణత్వంబు కొల్పోయితిం దేవా ఏ కరుణా శరత్ సమయం ఇంతే చాలు చిద్భావనా సేవన్ తామరతంబరై మలియదన్ శ్రీ కాళహస్తీశ్వరా శరత్కాలంలో నేను ఏం పోగొట్టుకున్నానో తెలుసుకున్నా ఏం రాబట్టుకున్నానో గుర్తుంది కానీ ఏం పోగొట్టుకున్నానో కూడా తెలుసుకున్నా ఏమిటో తెలుసునా నువ్వు నాకు మనస్సు అనేటువంటి ఒక అందమైన పుష్పాన్ని ఇచ్చి పంపావు అది వికాసమానం చెందకుండా అక్కడే నశించిపోయింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే డబ్బు డబ్బు డబ్బు అంటూ ఈ ప్రపంచంలో నేను పడిపోయాను కానీ ఇప్పుడు నాకు అర్థమైపోయింది ఏం కావాలో తెలుసా జ్ఞానలక్ష్మి జాగ్రత్ పరిణామం ఇమ్ము అన్ని అష్టలక్ష్ములు అయిపోయినాయి జ్ఞానలక్ష్మి లేదు అది ఉంటే నాకు ఎవ్వరి అవసరం లేదు జ్ఞానలక్ష్మి అయిన తర్వాత ప్రవచనాలతో పని ఏముంది సత్సంఘాలతో పని ఏముంది.సత్సాంగత్యంతో పని ఏముంది జ్ఞానలక్ష్మి వచ్చేసిందిగా. అయిగో ఆ జ్ఞానలక్ష్మిని సంపాదించడానికి ఈ తంత్రలక్ష్మిని, తంత్రసరస్వతిని, తంత్రపార్వతిని మనం ఉపాసన చేస్తూ దశరూపిణిగా కుమార్ిక స్వరూపిణిగా అమ్మవారిని మనం ఉపాసన చేసుకోవాలి. ఇవాళ ప్రశాంతి నిలయంలో సత్యసాయి భగవానుడిని తంత్రసరస్వతిగా కవన రూపంలో ఆయనని ఆవిష్కరించుకొని ఆ పరమాద్భుతమైనటువంటి ఒక ఆనందం, ఒక ఉత్సాహం, ఒక శక్తి వినువడించినటువంటి అదే సమయంలో, చూడండి నిన్న పొద్దున బండి దిగాను. బండి దిగగానే దిల్సుఖ్ నగర్ సమితి వాళ్ళు కట్టుకున్నటువంటి మందిరానికి వార్షికోత్సవం. ఆ మందిరానికి పదకొండు గంటలకల్లా చేరుకున్నాను. అది అయిపోయింది. ఇంటికి వచ్చేప్పటికి నాలుగయింది. ఐదు గంటల కల్లా సఫిల్గూడా కి వెళ్ళాను. సఫిల్గూడా కి వెళ్ళిన తర్వాత మనం అనుకున్న ప్రకారం ఇదిగో కుక్కట్ పల్లికి రావటంతో ఎక్కడ పూర్ణాహుతి అవుతున్నది అని అంటే కుక్కట్ పల్లి సమితి లో నేను ఈ దశరూపిణి ద్వారా ఈ నవరాత్రులన్నీ జరుపుకున్న భావనతో పూర్ణాహుతి ఇక్కడ జరిగింది [చప్పట్లు] అనేటువంటి ఆనందాన్ని పంచుకుంటూ ఈ జ్ఞానము, ఇదంతా కూడా, మీరందరూ కూడా బాగా చదువుకున్నవారు, చక్కని కుటుంబాల్లో ఉన్నారు, స్వామితో కూడి ఉన్నారు, స్వామి భావనతో కలిసి ఉన్నారు. పరాస్వరూపమైనటువంటి ఈశ్వరుడు ఒక మానవ దేహాన్ని తీసుకుని వచ్చి మనకిచ్చిన ఇన్ని అవకాశాలు, ఇన్ని యోగాలు, ఇన్ని ఇన్ని సత్సంకల్పాలు, ఇవన్నీ కూడా మనం కడదాకా వీటిని ఇట్లాగే నిలబెట్టుకుంటూ ఈ సమాజానికి మనం ఏ రకంగా సేవ చేయగలం, ఏ రకంగా ఈ దివ్యమైనటువంటి ప్రేమను మనం ఎట్లా పంచగలం అనేటువంటి రీతిలో మన జీవితాలన్నీ కూడా చల్లగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా, హాయిగా సాగుగాక. నన్ను ప్రశాంతి నిలయంలో నిన్న కూడా ఉండమన్నారు. రేపు వెళ్ళురు గానిలెండి ఇవాళ కూడా ఉండండి అంటే నేను చెప్పాను దిల్సుఖ్ నగర్ మందిరం కి వెళ్ళకపోతే, వెళ్ళటం అనేది సేవ. సఫిల్ గూడా కి వస్తానని చెప్పి వెళ్లటం సేవ. కాబట్టి నేను చేసుకునే సేవ అక్కడ కూడా చేసుకోవాలి నేను బయలుదేరి వస్తున్నాను అని బయలుదేరి వచ్చాం. ఆ రావటంలో భావన ప్రధానం కాబట్టి ఇవాళ మీ అందరికీ కూడా అమ్మ దయ సంపూర్ణంగా ఉండాలని జగజ్జనని అయినటువంటి భువనేశ్వరీ దేవి మాతృ రూపేణ సంస్థితా. ఆ మాతృ రూపంలో మన జీవితాలన్నీ కూడా మహాద్భుతమైనటువంటి యాగ యోగ ప్రవాహమై పల్లవించు గాక, ప్రవహించు గాక అని మరొక్కసారి మంగళాశాసనం చేస్తూ సాయిరాం.
YouTube · audio
Dasa Roopini(Matru Vandanam) — Part 3
Dasa Roopini(Matru Vandanam) — Part 3
Source: SathyaSai Seva Sadan on YouTube
0:00 / 33:11
More in this series