No transcript for this section.
Transcript begins at 0:00.
మనోహరం వందారు జన మందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం స కరుణం జ్ఞానాగ్ని శీలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబెన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్పురతాం ని పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ మీ అందరికీ విజయదశమి పూర్ణాహుతి అంత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పూర్ణాహుతి అయిన తర్వాత స్వామి సన్నిధిలో గత వారం రోజులుగా ప్రశాంతినయంలో గడిపి దశమి నాడు స్వామి ప్రేమైకవరమైనటువంటి సాయికుల్వంత్ హాల్లో ఒక గంటన్నర సేపు కవితా వైభవంతో స్వామిని కీర్తించి కైంకర్యం చేసి వచ్చినటువంటి శరీరం ఇది. అది [చప్పట్లు] సుమారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ భోన విజయంగా కాక కవన విజయం చేశాం అంటే కవితా స్వరూపంగా స్వామిని ఆరాధన చేస్తూ దిగ్గంతులైనటువంటి శతావధానులు తొమ్మిది మంది ఒక పక్కన వారంతా స్వామిని కీర్తిస్తూ వెళతారు స్వామి తత్వాన్ని మధ్యలో సమన్వయం చేస్తూ మేము మాట్లాడాలి కాబట్టి నామ రూప భావ తత్వానుసంధానం దిశగా గంటా నలభై నిమిషాలు సాగినటువంటిది అది ఒక స్వామి అనుగ్రహం అది radiosai.org లో already upload అయిపోయింది. ఒక్కొక్కరు రాయలసీమ ప్రాంత కవులు వాళ్ళు డెబ్భైల్లోకి వచ్చారు కానీ ఇంతవరకు ప్రశాంతినదయానికి రాలే. కానీ ఇప్పటికైనా రాగలిగినందుకు వాళ్ళు పరమానందం పొంది original గా పద్యాలు రాసుకొని వచ్చారు ఏదో పోతన పద్యం ఇంకో పద్యం ఆ పద్యం కాకుండా వచ్చి ఆ స్వామి ఈ ప్రపంచానికి దివ్య మానవ దేహాన్ని ధరించి వచ్చి ఎంత సేవ చేశారు ప్రపంచానికి ఆధ్యాత్మిక పరమైన దిశానిర్దేశం ఎట్లా చేశారు సనాతనమైనటువంటి వైదిక వాంగ్మయాన్ని ఎంత సులభతరం చేశారు ఈ ప్రపంచం మొత్తానికి ఒక అభయ వరదానం ఎట్లా చేశారు అని చాలా multi dimensional గా అనేక రీతుల సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అనేటువంటి భావనతో సాగింది ఆ మర్నాడు పూర్ణాహుతి జరిగింది. ఆ పూర్ణాహుతిలో పందొమ్మిది వందల అరవై మూ-- అరవై రెండు మొట్ట మొదటి యజ్ఞం స్వామి చేసినప్పుడు ఒక యాజ్ఞకుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇన్నేళ్లుగా ఇన్నాళ్లుగా స్వామితో కలిసి ఉన్న కారణంగా పండిత సత్కారం చేశారు వేద పండిత సత్కారం చేశారు గురు సత్కారం చేశారు నన్ను అడిగారు ఎలా జరిగింది అని స్వామి దేహంలో ఉన్నప్పటికంటే ఇంకా పరమాద్భుతంగా జరిగింది అని సత్యం చెప్పాను. కారణం కుల్వంత్ హాల్ నిండిపోగా హాల్లో ఎంతమంది ఉన్నారో బయట అంతమంది ఉన్నారు సుమారు ఇరవై ఏడు వేల మంది స్వామి భక్తులు అట్లా కూర్చుండి పోయారు ప్రతిరోజు ఏదో ఒక అద్భుత కార్యక్రమం అది ఆ స్వామి యొక్క ఆగమనం చేత స్వామి ఈ ప్రపంచానికి కేవలము వేదాంత పరమైన మాటలు మాత్రమే కాకుండా మనిషి జన్మ ఎత్తినందుకు దేహాన్ని తీసుకుని వచ్చినందుకు తన ప్రజ్ఞ ద్వారా సంపద ద్వారా జ్ఞానం ద్వారా ఈ ప్రపంచానికి ఎట్లా సేవ చేయవచ్చు అని మనందరికీ కూడా నేర్పారు ఆ నేపథ్యంలోనే ఇందాక శర్మ గారు చెప్పారు ఇది పదో సత్సంగానికి వచ్చేసాము అని మనం అనుకుంటాం ఆయన ఏమనుకున్నారో తెలియదుగా మనం పన్నెండు నెలలు చెబుదామనుకుంటాం ఎక్కడైనా break రావచ్చుగా మా-- నాకు కుదరకపోవచ్చు మీకు కుదరకపోవచ్చు కానీ ఎక్కడ వచ్చే నెల program ఈ వేళ decide అయిపోతుంది-- అయిపోయింది మళ్ళీ అంటే స్వామికి మనం సమర్పణ చేయాలి నిజాయితీగా ఉండాలి దీని ద్వారా డబ్బు దీని ద్వారా కీర్తి దీని ద్వారా ఇంకేదో లాభం కోరుకొని ఈ పని చేయకూడదు పరమేశ్వరుడు మనకో జన్మ ఇచ్చాడు ఒక వాక్కు ఇచ్చాడు ఒక ప్రజ్ఞ ఇచ్చాడు ఏనకేనా ప్రకారేణేష్య కశ్యాపి దేహినా సంతోషం జనయేత్త ప్రాజ్ఞ్యః తదైవ ఈశ్వర పూజనం నిజానికి ఈశ్వర పూజ ఏమిటి అంటే ఇది ఎవరో కవి రాసిన శ్లోకం కాదిది వేద ప్రామాణికమైన మాట ఏమిటంటే పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి ఒక ప్రజ్ఞ ద్వారా ఈ లోకం మొత్తానికి సంతోషము అన్నా ఆనందం అన్నా సంస్కృతంలో నిజానికి ఒకటే ఆనందం కలిగించాలి ఆ ఆనందం ఒక రసానుభూతిని ఇవ్వాలి మన ఆలోచనలు పరమాత్మ దివ్య పద సన్నిధికి చేర్చాలి.కేవల భౌతిక ఆకారం మాత్రమే కాక అంతరంగికమైన మహా దివ్య శక్తి స్వరూపంగా సత్య సాయి భగవానుడు ఈ లోకంలోకి వచ్చారు. కేవల మానవుని మాత్రుడు కాదు ఆయన. కేవలం ఒక మృణ్మయ శరీరాన్ని తీసుకుని వచ్చింది కాదు. అందుకే నేను అనుకున్న కొన్ని మాటలు ఇంకా పుట్టపర్తి లో ఉన్నట్లే ఉంది తప్ప కుకట్ పల్లి వచ్చినట్టుగా లేదు నాకు. అరయ ప్రశాంతి లయంబు జీవహంసల దీపి పరమహంస పరమాత్మ సాయి. మృణ్మయ శరీర ధారియై చిన్మయ రూపుడవై చెన్నార చెన్న చిత్రస్వామి. ఆ చెన్నార అందగిస్తూ ఉంటుంది చెన్న అంటే అందము అని. అది రోజురోజుకి పెరిగేదే కానీ ఆ తేజస్సు తరిగేది కాదు. మరి దీనికి కారణం ఏమిటి అంటే పరిమళించును ప్రతి పురమెల్ల ప్రజ్ఞాన తావితో చిత్రము చిత్రావతి సలిలము. ఆ చిత్రావతి నదిలో ఉన్న నీళ్లు ఎంత మహత్యమో తెలియదు గాని భగవంతున్నే రప్పించుకున్నాయి దగ్గరికి. ఆ భగవంతుని పాదాలకు నిత్యాభిషేకం చేసుకునే. కాశీలో గంగ ఎట్లాగైతే విశ్వనాథుడిని, గోదావరి పక్కన షిరిడి సాయినాథుడిని, పెన్నా నది పక్కన శ్రీరంగనాథుడిని, సరయు నది పక్కన శ్రీరామచంద్రుడిని, యమునా నది పక్కన శ్రీకృష్ణ పరమాత్మని, అట్లా ఏ రకంగానైతే ఒక్కొక్క నది పక్కన అన్నింటికంటే విజయవాడ లో కృష్ణా తీరం పక్కనే జగజ్జనని అయినటువంటి అమ్మవారు దుర్గాదేవి. అంటే నదికి, దైవతానికి, సంస్కృతికి, సంస్కారానికి, ఆస్తిక భావనకి, జన్మ సంస్కారాలకి మూలము ఏది అంటే నదీ ప్రవాహం అవుతున్నది. ఇన్ని నదులు ఉన్నటువంటి దేశం ఇంకొకటి లేదు. అది విచిత్రం. ఇవన్నీ జీవ నదులు perennial rivers అంటాం. మిగతావి ఒక్కొక్క ఈజిప్ట్ లాంటి చోట ఒక నైలు నది ఉంది ఇంకో చోట ఇంకో నది ఉంది. కానీ వాటికి ఏ రకమైన పురాణ నేపథ్యం లేదు. కానీ ఇక్కడ ఈ దేశంలో ఉన్న ప్రతి నది పక్కన మహాఋషులు తపస్సు చేశారు. తత్వవేత్తలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, శాస్త్రజ్ఞులు వచ్చారు, కవి పుంగవులు వచ్చారు, పండితులు వచ్చారు, డొక్క ఆడని వారు వచ్చారు, డొక్క ఆడించగలిగిన వారు వచ్చారు. అది ఈ జాతి చేసుకున్న వైభవం. ఈ పురా వైభవంలో చిత్రావతి నది తీరంలో ఔపదేయంబునకు సత్య నామంబిచ్చి నలతకెల్ల ధర్మ Neeratini Neerapi ఎల్ల సృష్టిని శాంతి కాంతుల వెలార్చి వచ్చమా స్వామి మల్హారమై విచ్చమా స్వామి కలహారమై. మల్హారము అంటే శుద్ధ చైతన్యం. కలహారము అంటే వేయి దళాలతో వికసించినటువంటి ఒక మహాద్భుత సహస్రదళ పద్మమది. పరిపూర్ణ వికాసమానం చెందినటువంటి సర్వ దేవతలకి సర్వదేవ భావనలకి అతీతమైనటువంటి ఒక తేజస్సు మళ్లీ ఒక రూపం తీసుకుని ఈ జగత్తు లోకి వచ్చి మానవుడిని సత్య మార్గం వైపు, ధర్మ మార్గం వైపు, నిరంతర చింతనా శీలమైన భావన వైపు నడిపించే దిశగా సత్య సాయి అవతారం ఈ జగత్తు లోకి వచ్చింది. కనుకనే ఆయన బంగారం కాబట్టే మనల్ని బంగారం అని పిలిచారు. ఆయన శుద్ధాత్మ కాబట్టే మనల్ని దివ్యాత్మ అన్నారు. ఆయన ప్రేమ స్వరూపులు కాబట్టే ప్రేమ స్వరూపులారా అని సంబోధించారు. కాబట్టి స్వామి ఎవరు అంటే స్వామి బింబం అయితే మనం ప్రతిబింబం. నేనే పుష్పము నీవే సౌరభము తండ్రి లోక లోకాంతర ప్రాణముల్ పలు శ్రీ దళములై విరియగా రంగ సుధా భక్తి నినా నడుమ యుగాంతర స్థిర మహా నిర్మాణ సూత్రముగా నేనే నీవై వెలిగిపోయెదను తంత్రీ నాద రమ్యాకృతిని. మనం పువ్వు కనపడుతూ ఉన్నాం కనిపించని పరిమళం స్వామి. మనం వీణగా కనిపిస్తున్నాం వినిపించని కనిపించని నాదం అంతర్లీనంగా నిస్వరణంగా ఉన్నటువంటి నాదం. మరి ఈ అభేద ద్వితీయ అద్వయ రమణీయమైనటువంటి భావన ఎప్పుడు ఏర్పడింది? నిన్న మొన్న అంటే అనేక జన్మలు. ఒక్క జన్మలో వచ్చింది కాదు ఇది. కాళిదాసు అన్నట్లు జననాంతర సహృద అని ఆ స్వామితో మనం రాముడి కాలంలోనూ ఉన్నాం, కృష్ణుడిగా వచ్చినప్పుడు ఉన్నాం, షిరిడి సాయినాథుడుగా ఉండగా కూడా వచ్చాం. కనుకనే సత్య సాయి భగవానుడి ఆవరణలోకి వెళ్లగలిగాం. అంటే మనకి స్వామికి ఉన్న సంబంధం ఏదో పుట్టపర్తికి హైదరాబాద్ కి ఉన్న సంబంధం కాదది. జన్మ జన్మాంతరేషు అంటారు. ఆ అనుబంధాన్ని ఆ పవిత్రతని మరొక్కసారి పునః మనం నెమరు వేసుకుంటూ, ఇవాళ కలియుగానికి అధిష్టాత అయినటువంటి శ్రీ లలితా దేవి యొక్క ఆవిర్భావాన్ని ఆమె ఈ కలియుగాన్ని ఎందుకు నడిపించాలని నిర్ణయించుకున్నది చెప్పుకొని దశ మహావిద్యల గురించి కాసేపు మాట్లాడుకుందాం ఇవాళ. అమ్మవారు మొన్న మొన్నటి వరకు ఆవిడ అవతారాలు ఎత్తలే. బ్రహ్మకి అవతారాలు లేవు. శివుడికి పూర్ణావతారాలు అస్సలు లేవు. ఎప్పుడైనా వస్తే హనుమంతుడిగా రుద్రాంశగా వచ్చాడు. శంకర భగవత్పాదులుగా శంభోర్ మూర్తి శరతి భువనై శంకరాచార్య రూపా ఆది శంకరుల వలె వచ్చారు. అప్పుడప్పుడు వచ్చారాయన. కానీశ్రీ మహావిష్ణువు అవతారాలు ఎత్తాలి అది ఆయన పని అట్లా ఇరవై ఒక్క అవతారాలు ఎత్తాలి ఆ ఇరవై ఒక్క అవతారాలలో ఇరవై అవతారాలు అయిపోయినాయి. అయిపోతే ఈ కలియుగం ప్రారంభమై కేవలం ఐదు వేల నాలుగు వందల సంవత్సరాలు అయిన కారణంగా ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఇంకా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలు అయితే తప్ప విష్ణుమూర్తికి అవతారం ఎత్తే అవకాశం లేదు అప్పుడు వస్తే ఆయన కల్కి అవతారంగా వస్తాడు అది కాబట్టి దాంట్లో కూడా మనం ఉంటామేమో తెలీదు లేము ఉండమని మనం ఎందుకు అనుకోవాలి ఇప్పుడు అనుకున్నామా? కాబట్టి ఏం కోరుకోవాలి అంటే ఆ కల్కి అవతారం వచ్చే దాకా కూడా మేము ఉండాలి అని కోరుకోవాలి మేము ఉండాలి అంటే నేను ఉండదు మనం ఉంటాం చూశారా? దేహాలు పోతాయి దేహాలు మారిపోతూ ఉంటాయి కానీ మనం ఉంటాం అన్ని వేళలా అన్ని కాలాలలో ఉన్నటువంటి ఆ నేను అఖండమై చిద్ఘనమై పూర్ణమై ధవళమై సత్యమై నిత్యమై శాశ్వతమై భవ్యమై దివ్యమై వెలుగొందే అటువంటి ఆత్మ స్వరూపులం కాబట్టి మనం కల్కి అవతారాన్ని కూడా ఖచ్చితంగా చూస్తాము. అమ్మో మళ్ళీ ఇటువంటి జన్మ మాకు అక్కరలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే పైకి అంటాం గానీ ఇక్కడ చాలా ఎక్కువ రోజులు ఉండాలని మనందరికీ ఉంటుంది కదా? టైం అయిపోతోంది అన్నప్పుడల్లా ఏమిటి స్వామి ఇంకో పదేళ్ళు పెంచు అని అడుగుతూ ఉంటాం ఎందుకని మనకి ఇది ఇష్టం గనుక. ఇది ఎందుకు ఇష్టం అయింది అంటే అసలు ఉన్నదంతా ఇక్కడే ఉన్నది గనుక అక్కడ ఏం లేదు అక్కడ శూన్యం ఉంది ఆ శూన్యం పూర్ణమై భూలోకమై ఏర్పడింది గనుక ఇక్కడ కథలున్నాయి వ్యధలున్నాయి ఆనంద భాష్పాలున్నాయి కన్నీళ్ళున్నాయి మానవమానాలున్నాయి జనన మరణాలున్నాయి జయాపజయాలున్నాయి ఇక్కడ లేనిదంటూ లేదు ఈ లోకమే అందుకనే దేవతలు ఒకసారి వాళ్ళకి అమృతస్య పుత్రాః అని పేరు ఉంది అంటే వాళ్ళు అమృతం తాగుతారు అని పురాణాలు చెప్తున్నాయి అమృతం తాగితే ఏమవుతుందంటే ఆకలి వేయదట ఇక వంట పనే లేదు. దాహం వేయదట ట్యాప్ నీళ్ళు వస్తుందా లేదా అక్కర్లేదు. అసలు శరీరంలో మార్పే ఉండదట కాబట్టి ఒక చొక్కా అలాగో గుట్టుచుకుంటే చాలు కాబట్టి అక్కడ ఏ మార్పు లేనటువంటి శిలా సదృశమైనటువంటి స్తబ్ధమైన జీవితం. వాళ్ళు ఆ పైనుంచి మనందరినీ చూశారట. ఒక్కొక్క మనిషిని వాళ్ళు చూసి క్రితం సంవత్సరం ఉన్న కారు ఈ సంవత్సరం లేదు క్రితం సంవత్సరం ఉన్నట్టుగా వీడు అట్లా లేడు బాలుడేమో కౌమారం కెళ్తున్నాడు కౌమారం యవ్వనం కెళ్తుంది యవ్వనం చక్కగా మధ్య వయసుకు వస్తుంది మధ్య వయసుకు వచ్చాక గాంభీర్యం వస్తుంది మర్యాద వస్తుంది అనేకమైనటువంటి ఉదాత్తమైనటువంటి పరిణామాలు జరుగుతూ జరుగుతూ వృద్ధాప్యం వైపు చక్కగా అది చాలా మర్యాద పూర్వకమైన వృద్ధాప్యం వైపు వెళుతూ జీవితం పండటం చూస్తున్నారు వాళ్ళు. అంటే మొగ్గ పువ్వు అవుతోంది పువ్వు కాయ అవుతోంది కాయ పండు అవుతోంది పండు ఎండితున్నది ఎండి అప్పుడు రాలుతున్నది రాలి అక్కడ ఆగిపోవటంలా మళ్ళీ పుడుతున్నది చూశారా? మామిడి టెంక నేలలో పడగానే మళ్ళీ చెట్టే పుడుతూ ఉన్నది కాబట్టి నిరంతరమైనటువంటి అనంత కాల ప్రవాహంలో జీవుడు పునః పునః వస్తున్నాడే కానీ జీవుని యందున్న దైవం మాత్రం ఇక్కడే ఉంటున్నాడు. కనుకనే విశ్వనాథ సత్యనారాయణ గారు లోకమును వీడి రసము లేదు అన్నారు ఆ రసము అన్ని రకాల నవరసాలు ఇక్కడే ఉన్నాయి వీటన్నింటి మధ్య మనల్ని మనం నిలబెట్టుకోవలసినటువంటి ఒక బాధ్యత ఒక అవకాశం జీవితం అంటే ఒక అవకాశం జీవితం అంటే ఒక ఔచిత్యం రెండు. ఈ అవకాశం మనకు పరమేశ్వరుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు? అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దం అందు అన్ని యుగాలు మొదలాయే యోగం అందు అన్ని జన్మల చివరాయే నరజన్మ అరయా నారాయణాన్విషితము. ఇంతకు ముందు వచ్చినటువంటి అనేక జన్మల్లో దేవుడి గురించి మనం ఆలోచించలేదట. చీమా దేవుడి గురించి ఆలోచించదు మనము కానీ ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు దైవాన్ని గురించి ఆలోచించవు మానవుడు మాత్రం దైవాన్ని గురించి ఆలోచిస్తాడు. వాడి ఆలోచనలు రెండు పాయలుగా సాగుతాయి దేవుడు ఉన్నాడు అని ఇటువైపు కూర్చుంటాడు దేవుడు లేడు అని అక్కడ కూర్చుంటారు కానీ విచిత్రం ఏమిటంటే ఇద్దరూ కలిసి దైవాన్ని గురించి ఆలోచిస్తారు అంతే. విజయవాడలో నా చిన్నప్పుడు విన్న మాట ఓ యాభై ఏళ్ళ క్రితం కమ్యూనిస్టు మహాసభలు అద్భుతంగా జరిగినాయి. వాళ్ళు ఇవాళ మనం ఎట్లాగైతే సప్తాహం చేసుకొని ఆనందంగా ఉన్నామో దేవుడు లేడు లేడు లేడంటూ వాళ్ళు ఏడు రోజులు చక్కగా గడిపారు. గడిపి తిరిగి ప్రయాణమై ట్రైన్ ఎక్కారు. ఆ ఎదురుగా ఈ సభలు చూడని ఆయన వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వింటూ ఎలా జరిగినాయి ఈ సభలు అన్నాడు భగవంతుని దయవల్ల అద్భుతంగా జరిగినాయి అన్నాడు. అది కమ్యూనిస్ట్ మహాసభలు దైవం వల్ల అంటే అది కూడా ఆయనే నడిపిస్తాడు. విద్యావిద్యలు రెండూ కూడా పరమేశ్వరుడే అవిద్య పరమాత్మే అవిద్య అస్పష్టత దానిలో నుంచి మళ్ళీ ఒక జ్ఞానము కొటమరించాలి కాబట్టి ఒక నిశ్-మహానిశ్శబ్దంలో నుంచి చిన్న శబ్దం పుడుతున్నది మహానిశ్శబ్దంలో చిన్న గుండుసూది అలా పడేయగానే శబ్దోత్పత్తి జరుగుతున్నది కాబట్టి శబ్దానికి పుట్టిల్లు ఏది అంటే నిశ్శబ్దం అవుతున్నది. మనం ఈ జన్మ ఎత్తాం యోగించి ఎత్తాం కదా? యోగించి అంటే కూడి అని ఎవరితో కూడి?ముందు అందరము కూడి ఇక్కడ మనందరము ఎవరితో కూడి అంటే అదిగో ఆయనతో కూడి అనమాట స్వామితో కూడి యోగించి ఉన్నాం గనుక ఈ యుగాలన్నీ కూడా యోగంలో నుంచే ప్రారంభమైనై తర్వాత అన్ని యుగాలు మొదలాయ యోగమందు అన్ని జన్మల చివరాయే నరజన్మ మానవ దేహం తీసుకొని వచ్చాం కరచరణాది అవయవాలున్నాయి కర్మేంద్రియాలున్నాయి ఐదు జ్ఞానేంద్రియాలున్నాయి ఏదో ఒక అసిష్టాతమైన మనస్సున్నది దాన్ని నడిపించగల బుద్ధి ఉన్నది దానిని ఇంకా ప్రమాణంగా చేయగలిగిన అహంకారం ఉన్నది వాటి మధ్యలో జన్మాంతరంగా తెచ్చుకున్న చిత్తము ఉన్నది కడగా ఆత్మ కూడా ఇక్కడే ఉన్నది. ఇవి బయట లేవు అన్నీ మన యందే ఉన్నాయి. ఆ మన యందే ఉన్నటువంటి ఆత్మకి శక్తి అని పేరు ఆ శక్తి ఇందాక అన్నట్లుగా విష్ణుమూర్తి కలియుగం వచ్చేసింది రాబోతున్నది మరి ఎవరు అవతారమెత్తుతారు ఈ కలియుగానికి అని అంటే విష్ణుమూర్తి అన్నాడు "నాకు ఇంకా చాలా టైం ఉంది ఇప్పుడేం వెళ్ళను" అన్నాడు ఆయన. టైం వస్తేగాని ఆయన కూడా రాడు. సరే లలితా దేవి ఏమన్నదంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి దుర్గా సరస్వతి లక్ష్మి ఈ ముగ్గురికి నేను అమ్మను కాబట్టి అమ్మలకన్నా అమ్మను కాబట్టి నేను ఈ ప్రపంచాన్ని నడిపిస్తాను కలియుగం మొత్తాన్ని అని అన్నది. అన్నప్పుడు అమ్మా కోటి సూర్య మండల మధ్యస్థ అయిన కోటి సూర్య మండలాల మధ్యలో నువ్వు ఉన్నావని చెప్తున్నది ప్రమాణం ఒక సూర్యమండలం నుంచే కిరణం మా మీద పడితే తట్టుకోలేకపోతున్నాం ఈ కోటి సూర్యమండలంలో నుంచి నువ్వొస్తే ఈ ప్రపంచం ఉంటుందా? భస్మం అయిపోదా? ఎట్లాగమ్మా? అని అడిగితే "నేను వస్తూ ఉన్నప్పుడు ఇట్లా వస్తానా శ్రీ లలితాదేవిగా నేను వస్తాను భువనేశ్వరిగా వస్తాను" అని ఆమె లలితా అనేటువంటి పదంలోనే లాలిత్యం ఉన్నది. ఆ లాలిత్యంలో ఒక మార్ధవం ఉన్నది. ఆ మార్ధవంలో సరళత్వం ఉన్నది. ఆ సరళత్వంలో దివ్యమైన ప్రేమ ఉన్నది. ఇవన్నీ కలబోసుకున్నట్లయితే అది అమ్మ అది జగజ్జనని అంటే అది అర్థం. అంటే ఒక మనిషి సంస్కారగతమైన జీవితం గడపవలసినటువంటి మనిషి ఎన్నెన్ని సంపాదించుకుంటేనో కాని వాడికి ఆ సంస్కారం రాదు గనుక, అవన్నీ ఎవరు ఇవ్వగలరు అంటే ఇవ్వగలిగినటువంటిది ఒక్క అమ్మే తప్ప అయ్య కాదు. అయ్య ఏం చేస్తాడంటే దాన్ని disciplined గా నడుపుతాడు అంటే బెత్తం పట్టుకుంటాడు. ఆయన బెత్తం పట్టుకున్నప్పుడల్లా ఆవిడ ఏడుస్తుంది నా కొడుకుని కొట్టొద్దు, నా కూతుర్ని కొట్టొద్దు అని అంతే కదా. తండ్రి ఎప్పుడూ ఏడుస్తూ కొట్టలా, కొట్టి వాడు ఏడవలేదనుకోని ఇంకా కొట్టాడు కదా అది. కాబట్టి ఈ జగజ్జనని కరుణాపూర్ణ సుధాబ్ధి అయినటువంటిది కరుణా వరుణాలయమైనటువంటిది ఆ మాతృఛాయలో ఉన్న లాలనా పాలనా ఆలనా ఆలంబన ఆధారము అన్నీ తానే అయినది గనుక ఆ తల్లే తొలి అవుతున్నది. మొట్టమొదటి భావన మనం ఈ జన్మ తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉన్నాం తొమ్మిది నెలల తర్వాత మంత్రసాని బొడ్డు కోసి మనల్ని పక్కన పడుకోబెట్టింది. కానీ పక్కకు ఒత్తిగిల్లినా ఒత్తిగిల్లలేకపోయినా ఈ తనువు ఏర్పడిన తర్వాత జీవుడు పొందిన ప్రథమ స్పర్శ ఏది అంటే దాని పేరు మాతృస్పర్శ. కనుకనే అన్ని బంధాలలోకి అతి పవిత్రమైన, గంభీరమైన, ఉదాత్తమైన, ఉన్నతమైన, ఉత్కృష్టమైన కానీ నిత్య సత్య శాశ్వతమైనటువంటి స్పర్శ ఏది అంటే మాతృ స్పర్శే. మిగతా స్పర్శలన్నీ తర్వాత వస్తాయి పిల్లలు మనకి పుడతారు వాళ్ళని మనం తాకుతాం వివాహం చేసుకుంటాం ఆ స్పర్శ వేరు. మిత్రులతో ఉంటాం ఆ స్పర్శ వేరు. కానీ మాతృ స్పర్శలో స్వార్థం లేదు. మాతృ స్పర్శలో ఉన్నటువంటిదంతా సంపూర్ణమైనటువంటి మహత్తర త్యాగభూమిక ఉన్నది. అందువల్లనే మనం తల్లి అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథిదేవోభవ, ఆచార్య దేవోభవ. వేదం ఎంత స్పష్టంగా ఈ నలుగురిని మీరు చూసుకోండి చాలు. జన్మ తలువుకి కారణమైన తల్లిని గౌరవించండి. ఆ తల్లిని దైవంగా భావించండి. దీనిని పోషించి పరిపోషించి దీనికి ఒక సంస్కారాన్ని క్రమశిక్షణని దీనికి ఒక ఉదాత్తమైనటువంటి రేఖని సృష్టించిన తండ్రిని దైవంగా భావించండి. మీ చుట్టం కాక అతిథి వస్తాడు. వాడు చుట్టం కాదు అతిథి. వాడెవరో తెలీదు మనకి. రాగానే తెలియని వాడు రాగానే ఈ తెలియని వాడు ఎందుకు వచ్చాడన్న ప్రశ్న కాక తెలియని వాడు కనుకనే వచ్చాడు ఎందుకు వచ్చాడో కనుక్కొని అన్నం పెట్టండి. అతిథి దేవోభవ. దైవంగా భావించి. చివరికి ఆచార్య దేవోభవ. ఎవరైతే అధ్యాత్మ భావాన్ని బోధిస్తూ ఆచరిస్తూ ఆచరించదగిన దానిని మాత్రమే బోధిస్తూ బోధించిన ప్రతి దానిని ఆచరిస్తూ ఉన్నటువంటి వాడు ఆచార్య సత్తముడవుతాడు గనుక ఈ అఖండ భారతావనిలో అవతారమూర్తులు ఎంతమంది వచ్చారో ఆచార్య మూర్తులు కూడా అంతే మంది వచ్చారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క dynamics ఒక్క dimension అది ఇట్లా ఉన్నది, ఇది ఇట్లా ఉన్నది అనటానికి వీల్లేదు. అది అట్లాగూ ఉంటుంది, ఇట్లాగూ ఉంటుంది కదా. మనకి కావలసింది ఏమిటయ్యా అంటే మనం ఈ శక్తిని మనలో ఉన్నటువంటి మాతృ శక్తిని ఆ ఎట్లా పెంపొందించుకోవాలి? ఈ దశ స్వరూపిణిగా వచ్చినటువంటి అమ్మవారు లలితాదేవిగా వచ్చింది భువనేశ్వరీ అన్నాం. అసలు ఈమెమహావిద్యల అని ఉన్నాయి. మహావిద్య అంటే ఏం లేదు ఆత్మవిద్య అని అర్థం. శ్రీవిద్య అని అర్థం. బ్రహ్మవిద్య అని అర్థం. ఈ మహావిద్యలు దశ స్వరూపాలుగా ఉన్నాయి. Ten dynamics లో ఉన్నాయి. ఈ పది ఇంటికి స్వరూపం కావాలి. స్వరూపం లేకపోతే మనం పని చేయలేం. శరీరం ఆజ్యం ఖలు కర్మ సాధనం శరీరం ఆజ్యం ఖలు ధర్మ సాధనం. ఈ రెండు చాలు మనం కూడా ఏదైనా పని చేయాలంటే శరీరం ఉంటే చేయగలుగుతాం. శరీరంలో అవయవాలన్నీ చక్కగా పనిచేస్తూ ఉంటే పనులు బాగా చేయగలుగుతాం. అందులో ఏది లోపించినా ఆ పనిలో మన ప్రావీణ్యం తగ్గిపోతుంది గనుక. దీనిని ఈ దశ మహావిద్యలు అని పెద్ద పేరు పెట్టలే. ఎందుకు పెట్టలేదు అంటే దశ మహావిద్యలకి ఇవాళ ప్రపంచంలో రెండు రకాల ఆచారాలు ఏర్పడి ఆ రెండో ఆచారమేమో అని ఎవరూ రారేమో భయపడి దానికి దశ రూపిణి అని అమ్మవారికి పేరు పెట్టాం. అంటే దశ మహావిద్యలు ఈ దేశంలో వామాచారాన్ని తాంత్రిక ఆచారాన్ని చాలా ప్రశస్తంగా పొందినాయి. అంటే ఆ మామూలు అక్షరంగా అర్థం కావాలి అనంటే నిమ్మకాయలు కోసి మిరపకాయలు కాల్చి దేవుడిని దగ్గరకు తీసుకునేది వామాచారం. దాని జోలికి మనం వెళ్ళకూడదు. అమ్మవారు నిమ్మకాయ కీను మనం కొన్న మిరపకాయ కీ దొరికితే ఇంత శ్రమ ఎందుకు? అక్కర్లా. కష్టం రాని జీవితం ఉంటుందా? రాముడికి కష్టం రాలేదా? కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? ఎటువంటి వాడు ఆయన? పరమాత్మ పాండవులతో పాటు యాతన పడ్డాడు. పాండవులను వాళ్ళు ఎట్లా అన్నారో కృష్ణుణ్ణి కూడా అలాగే అన్నారు కౌరవులు. కానీ అన్నింటినీ ఆయన వహించారు, భరించారు. భరించి ధర్మ సంస్థాపన కోసం నిలబడ్డాడు. అట్లాగే ఈ అమ్మవారు దశ రూపిణిగా వచ్చింది. దశ మహావిద్యలు అనబడేటువంటి ఒక ఆ వాఙ్మయ స్వరూపిణిగా ఈ దేశంలో కొలవబడింది. కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని అంటే భగవాన్ రమణులు అంటే వెంకట్రామన్ అనేటువంటి ఒక బాలకుడికి నీ పేరిది కాదు నువ్వు భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పేరు పెట్టినటువంటి వాడు కావ్యకంఠ గణపతి ముని. ఆ గణపతి ముని ఈ దశ మహావిద్యల మీద వామాచారం కాదిది ఇది దక్షిణాచారం. అంటే ఇవాళ ఆ దురదృష్టం ఏంటంటే ఇంగ్లీష్ చదువుకున్నప్పుడేమో మాస్టర్లు తెలుగులో తర్జుమా చేసి చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడాలి అంటే ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి చెప్పాలి. కాబట్టి negative energy positive energy అనమాట. అనంగానే అర్థమైపోయింది కదా. వామాచారం దక్షిణాచారం అంటే తెలియదు. కాబట్టి పూర్ణమైనటువంటి ప్రజ్ఞా భూమిక మనకి కావాలి. మనమందరం కూడా దశ రూపిణి స్వరూపిణిలం మనం. ఒక స్త్రీ యందు సగం పురుషుడు ఉన్నాడు. ఒక పురుషుడు యందు సగం స్త్రీ ఉన్నది. కనుకనే ఆత్మ అనాత్మల యొక్క ఈ సమ్మేళనమే ఈ సృష్టి గనుక ఈ సృష్టి ಯಾವತ್ತು కూడా అర్ధనారీశ్వర తత్వంతో విరాజిల్లుతూ ఉన్నది గనుక. ఈనాడు సమకాలీనంగా మన గురువైనటువంటి సత్యసాయి భగవానుడు కూడా శివశక్త్యాత్మక స్వరూపుడు అది. శివత్వము ఆయన యందే ఉన్నది అమ్మవారు కూడా ఆయన యందే ఉన్నది. మామూలుగా మిగతా చోట్ల ఆలోచించే వాడు ఒకడైతే దాన్ని translate చేసి ఒక action లోకి తీసుకెళ్లే వాడు రెండో వాడు ఉండాలి. సత్య సాయిబాబా వారి విషయంలో ఆలోచించేది ఆయనే ఆచరించేది ఆయనే ఆచరింపజేసేది ఆయనే ఆచరించడానికి అవకాశమిచ్చేది కూడా ఆయనే అది అర్ధనారీశ్వర తత్వం. కాబట్టి పూర్ణమైనటువంటి ఈ దశ రూపిణి మాతృ వందనం చేయబోతున్నాం మనం. అమ్మవారికి నమస్కరించ బోతున్నాం. మరి ఎందుకు చేస్తున్నాం? ఇవాళ ఎందుకు చేస్తున్నాం అంటే నిన్నటిదాకా చేసింది అదేగా. నవరాత్రులు కదా నవ అంటే తొమ్మిది అని అర్థం. అది మామూలు అర్థం. నవ అంటే ప్రతిరాత్రి కొత్త రాత్రి. ప్రతిరాత్రి పౌర్ణమి రాత్రి. ప్రతిరాత్రి జ్ఞాన వరదానం చేసేటువంటి రాత్రి. ప్రతిరాత్రి మనల్ని జాగరూకతతో నిలబెట్టేటువంటి రాత్రి. మిగతా రాత్రులంతా మనం నిద్రపోతాం నవరాత్రులలో యోగ నిద్ర పోతాం అంతే తేడా. ఆ యోగ నిద్రా ముద్రాంకితమైనటువంటి శరీర ధారులుగా అమ్మవారిని అనేక రీతుల మనం కొలవవలసి ఉన్నది గనుక మనలో ఉన్నటువంటి ఒక energy ఒక శక్తి తొమ్మిది పాయలుగా తొమ్మిది dynamics లో తొమ్మిది అంతస్తులలో తొమ్మిది స్థాయిలలో ఆచరణాత్మక దివ్య ಜೀವನ విధానంగా పరచుకొని తెరచుకొని మన యందు ఉన్నది గనుక ఆ దశ రూపిణి స్వరూపిణి అయినటువంటి అమ్మకి మళ్ళీ మరొక్కసారి మనం నమస్కరిస్తూ మొట్టమొదటగా ఆమెని కాళ అన్నారు. కాళ. కాళ అంటే పాము అని అర్థం ఒకటి. ఆ అర్థం మనకిక్కడ పనికిరాదు. కాళ అంటే కాలము అని ఒక అర్థం. కాలము మనందరం కూడా కాలానికి లోబడి వచ్చాం. కాలాధీనులమై వచ్చాం చూశారా? ప్రతి వాళ్ళ దగ్గర జేబులో ఒక చీటి పెట్టి పంపించాడు పైవాడు. బ్రహ్మగారు మన బొమ్మ గీశారు. ఆ పైనుంచి భూమండలం మీదికి విసిరేశాడు. ఆయనకి అది ఏ address ఆయనకి తెలియదు బొమ్మ గీటం వరకే ఆయన పని. మన కర్మ మన అనుభవము మన ప్రాప్తి మన యోగాన్ని బట్టి అది ఒక్కొక్క పోస్టు డబ్బాలోకి వెళ్ళింది.ఆ post డబ్బా తల్లి గర్భాలయం కాబట్టి తల్లికి కూడా తెలియదు ఏ ఉత్తరం వచ్చి దాంట్లో పడుతుందో post డబ్బాకి ఏందో తెలుసా? దాంట్లో DD లు ఉంటాయి, మరణ వార్తలు ఉంటాయి, శుభ వార్తలు ఉంటాయి, దాని పక్కనే wedding invitation ఉంటుంది. ఈ ప్రపంచంలో జరిగే సమస్త కార్యకలాపాలని ఒక post డబ్బా ఎట్లా స్వీకరిస్తున్నదో తల్లి కూడా తనకు తెలియకుండానే జీవుడికి తన గర్భాలయంలో ఆశ్రయాన్ని ఇస్తున్నది. కాబట్టి గర్భాలయం ఇది విశ్వ గర్భం ఇది అమ్మవారిది కాబట్టి విశ్వ గర్భంలోకి అవన్నీ కూడా ప్రవేశించినప్పుడు ఆ చీటీతో వాడు ప్రవేశిస్తాడు అంటే మనం అన్నమాట. మనకి అన్ని లెక్కలు తెలుసు mathematics లో మనం genius mathematics లో ఐదు, ఆరు PHDs ఉన్నాయి మనకి కానీ మనకి మనం ఎప్పుడు పుట్టామో మనకు తెలియదు చూశారా? ఎవరో అక్కడ కూర్చుని వీడు ఫలానా time కి ఘడియల్లో ఘడియల్లో ఫలానా నక్షత్రంలో వీడు ఇలా పుట్టాడని ఎవడో ఒక కాగితం రాసి ఇస్తే అవునా అని నమ్మేసాం. రాసిన వాడు తలరాత రాసిన బ్రహ్మ కాదు ఇక్కడ చేసిన పురోహిత బ్రహ్మ రాసి ఇచ్చాడు. లేకపోతే ఇంట్లో ఉన్న పెద్ద వాడు ఏదో లెక్కేసి ఇగో మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ఇరవై ఎనిమిది సెకన్లకి వాడు జన్మ ఎత్తాడు అని రాస్తారు అది మనం ప్రమాణంగా తీసుకుని ఆ కాగితాలు పట్టుకుని జ్యోతిష్యుల చుట్టూ తిరుగుతాం చూశారా? పాపం వాడు దాన్నే ఆధారం చేసుకుని చెప్పేది చెప్తూ ఉంటాడు. కాబట్టి పుట్టుక ఏదో మనకు తెలియదు కాలం తెలియదు. అతి విచిత్రం ఏంటంటే పరమ గుహ్యమైన అంటే రహస్యం ఒకటి ఎప్పుడు వెళ్తామో కూడా తెలియదు చూశారా? పుట్టుక ఆయన దగ్గర పెట్టుకున్నాడు మనం ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్లాలో ఆయన దగ్గర పెట్టుకున్నాడు కానీ ఒక చీటీ మాత్రం జేబులో పెట్టాడు అంటే నువ్వు రాక తప్పదు వచ్చావు కదా పోక కూడా తప్పదు ఇది వైరాట్యం. కాబట్టి ఎప్పుడు అని అడిగాం అనుకోండి ఆయనేం మాట్లాడడు ఏం తెలియనట్టు ఉంటాడు. ఆ ఎట్లా ఉంది చెప్పండి నేను ఏమో డెభై చూస్తానా తొంభై చూస్తాను అంటే చూస్తాను అని చెప్పేవాడే ఉండకపోవచ్చు కదా. నువ్వు చూస్తావయ్యా అన్నవాడు ఆయనే మన కంటే ముందే వెళ్లిపోవచ్చు. కాబట్టి మనుష్య జన్మ అంతా కూడా కాలాధీనమై ఉన్నది. లేకపోతే తెల్లవారితే పట్టాభిషేకం చేసుకోవలసిన రాముడు పట్టు బట్టలు కట్టుకున్న కట్టుకోబోతున్న రాముడు నార వస్త్రాలు ధరించడం ఏంటి? పద్నాలుగు ఏళ్ళు అరణ్యవాసం చేయడం ఏంటి? అరణ్యవాసం లో చివరి పదకొండు నెలలు అమ్మవారిని ఎవడో ఎత్తుకుపోవడం ఏంటి? ఏమిటి ఇది కాలం కాకపోతే. కాబట్టి మనం మనం అంటాం నా time బాగా లేదు అని time బాగానే time బాగానే ఉంది అది ఎట్లా ఉండాలో అట్లా ఉంది మన time బాగాలేదు. మనం బాగా లేని time లో మనం ఉన్నాం అన్నమాట అంటే మనకి అననుకూలమైన.
YouTube · audio
Dasa Roopini(Matru Vandanam) — Part 1
Dasa Roopini(Matru Vandanam) — Part 1
Source: SathyaSai Seva Sadan on YouTube
0:00 / 33:11
More in this series