No transcript for this section.
Transcript begins at 0:00.
[వెల్లడి కాంత music] గురువున్న యెవ్వరో ఎరుక పరచే సాయి గుప్త సత్యమునే గురుతు చేసే సాయి చీమలో బ్రహ్మలో జీవరాసులలో దేవుడే కలడని తెలియజేసే సాయి అద్భుతం ఇది ఒక ఒక expression అవునమ్మా గురువుగా దైవంగా అంతేగా చీమలో బ్రహ్మలో ఆ అంటే అన్ని విధాల మనకి అన్ని అన్ని ఆ philosophy లు ఆ ధర్మానికి సంబంధించి వి-అ-అద్వైతం అనొచ్చు విశిష్టాద్వైతం ద్వైతం అన్నీ కలగలిసిన ఒక అద్భుతం మ్ సమస్త మార్గాలకే అది convergent point లో నుంచి పుట్టింది గొప్ప గొప్పగా ఉంది గురువు గారు అదే చాలా గురువు గారు అమ్మా బాబా వారి ఈ సమక్షంలో మ్ కులాలకి మతాలకి అతీతంగా అందరూ వచ్చేవారు అంటారు ఆ అన్యదేశస్తులు కూడా వచ్చేవారు కదా ఆ ఈ అంశం గురించి కొంత చెప్పగలుగుతారా ఎందుకంటే షిరిడి సాయిబాబా వారి సమయంలో మత సామరస్యం అవసరం అప్పటి కా సమయానికి అవును సత్యసాయిబాబా వారి సమక్షంలో ఏ విధంగా ఉండేది గురువు గారు ఎందుకంటే హైందవ ధర్మానికి సంబంధించిన ఆ scriptures ని కానీ ఆ అంశాలని ఎక్కువ ప్రస్తావించేవారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను. నిజానికి ముందే మనం ఒక మాట అనుకున్నాం ఏమిటంటే వేదం వసుధైక కుటుంబ నిర్మాణం చేయమని అడిగింది అది. అంటే universal family మ్ ఇవాళ universal family అంటే నాలుగు మతాల వాళ్ళని నాలుగు కులాల వారిని ఒక గదిలో పెట్టి మేము వసుధైక కుటుంబం అంటే అది కాదు. మనస్సుని తలపులని భావాలని దాటి సర్వమత సమన్వయం చేసుకుంటూ సమస్తమైన మతాలను గౌరవిస్తూ ఒకే మార్గంలో పయనించగలిగినట్లయితే ఆ పయనించటానికి కలిగిన మార్గం ఏమిటని గనక అర్థం చేసుకున్నట్లయితే బాబా గారి సందర్భంలో వారి సన్ని-మన-వారి సన్నిధిలో కులం అనే మాట నేను వినలేదు మ్ ఇన్నేళ్లలో room లోనూ వినలేదు room బయట వినలేదు. మ్ మతం గురించిన ప్రస్తావన ఆయన చేయలే అస్సలు చేయలే. పైగా ఏమన్నారంటే "మతాన్ది ఏమున్నదీ ఒక మనిషి మ-మతిలో నుంచి పుట్టేదే మతం కదా" మ్ "ఏముంది దాంట్లో" అన్నారు. అలాగే ఇంకొక revelation ఏమిటంటే దీనికి అనుబంధంగా మనం దేవుడు దేవుడు దేవుడు అని ఆకాశంలోకి చూపిస్తాం కదా ఆయన ఏమన్నారు అన్-అంటే "దేవుడనగా వేరు దేశమున లేడు" మ్ "తాను చేయు పనుల యందు తగిలి ఉండు" ఆహా! simple అర్థమైపోయింది మ్ మనం దేవుడు అనంగానే ఒక ప్రత్యేక సింహాసనము వింజామరలు గంధర్వగోళం ఇదంతా ఉంది. ఆయన అసలు కులమతాతీతమైనటువంటి భావనలో వారి సన్నిధిలో అరవై రెండు నుంచి అంటే నలభై మంది వారి చుట్టూ ఉండగా చూసిన నేను నాలుగు లక్షల మంది వారి ఆ మంది మధ్యలో వారుండగా కూడా చూశా. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అసలు no elation no deflation he was just like that untouched. హే తర్వాత మతాలు అంటారా? మతం చెడ్డది కాదన్నారాయన. మతం అంటే మార్గమే దాన్ని అక్కడికి వదిలేయండి. మానవతను మించినటువంటి మమత మమతను మించిన మాధుర్యం మాధుర్యాన్ని మించిన రుచి రుచిని మించినటువంటి శుచి శుచిని మించినటువంటి బతుకు ఉందా అని ప్రశ్నించారు. అబ్బా! గురువు గారు అమ్మా ఎంత గొప్పగా చెప్పారండి ఆ క్రమం మనం అర్థం చేసుకోగలిగితే మ్ వీళ్లందరూ ఇప్పుడు ఉదాహరణకి అబ్దుల్ కలాం గారున్నారు can you call him a ముస్లిం అమ్మా? మ్ can you call him a హిందూ? లేదు. బాబా గారు ఏం చేశారంటే ఆయన వచ్చిన ప్రకటన ఒకటి చేశారు పధ్నాలుగవ ఏట మ్ "నేను ఎందుకు వచ్చాను" అని పధ్నారేళ్ల ఒక బాలుడు "వేదోద్ధరణ ధర్మోద్ధరణ దీనజనోద్ధరణ" ఇదే ఈ అవతారానికి లేదా నేను వచ్చిన మూడు పనులు నేను చేయటానికి వచ్చాను అన్నారు. అవతారం మనమందాం ఆయన అల్లా పాపం. కాబట్టి వేదోద్ధరణ అనంగానే ఆ చతుర్వేదాలను ఉద్ధరించటం మాత్రమే కాదు ఆధునికమైనటువంటి విద్యకి human values తో కలిపి గనక చెప్తే అదే ఈ కాలానికి వేదం అన్నారాయన. వేదాలు మంత్ర స-సమ్మ-సమ్మతాలివి మంత్రాన్ని దాటుదాం మాటగా మార్చుకుందాం దాన్ని జీవితంలో translate చేద్దాం మ్ అయిపోయింది మ్ కాబట్టి ఆ వేదోద్ధరణలో భాగంగా ఏమున్నాయి మనకి భజన సాంప్రదాయం ఉంది మ్ భక్తి సామ్రాజ్యం ఉంది వీటన్నింటికీ ఏం చేశారంటే రోజు శ్రీ సూక్తము పురుష సూక్తము నిలా సూక్తము భూ సూక్తము అంటే సూక్తాలన్నీ కూడా ప్రశాంతి నిలయంలో ఆనాటి నుంచే వారు ప్రారంభించారు మ్ తర్వాత భజనలున్నాయి భజనలున్నాయంటే ఆ అల్లా తుముహు ఈశ్వరు తుముహు అని పాడించారు ఆయన మ్ ప్రపంచం accept చేసింది. ఎందుకు accept చేసిందంటే పరమత సహనానికి ఒక పరాకాష్ట సత్యసాయి భగవానుడు. మ్ అసలు ఆయన దాని గురించి పట్టించుకోలే. కోర్బీ అని ఒక professor from మహారాష్ట్ర వచ్చి ఆయన దగ్గర పనిచేశారు he is a ముస్లిం. చేస్తే ఆయన అన్నారు "బాబా నేను మీ దగ్గర కూడా జీతం తీసుకోవటం న్యాయం కాదు ఎంతో ప్రపంచానికి సేవ జరుగుతోంది నన్ను వదిలిపెట్టండి నా-నే జీతం తీసుకోను" అన్నారు. బాబా ఏమన్నారో తెలుసా? జీతం అనబడేటువంటిది నేను ఇవ్వాలి.అది నా ధర్మం, లౌకిక ధర్మం. జీతం నీ ఒక్కడికి కాదు, నీ కోసం కాదు, నీ కుటుంబం ఎలా బతుకుతుంది కనుక జీతం ఇవ్వాలి. ఉమ్ కనుక నీ కుటుంబ ధర్మాన్ని నువ్వు పాటించకపోతే నేను కారణం అవుతా కనుక నువ్వు జీతం తీసుకోమన్నారు. ఉమ్ Very practical. అంతే కదా! ఇప్పుడు మనందరం monthly salary అనుకుందాం. ఉమ్ ఎవరి కోసం? అంతా మన కోసం కాదుగా. అసలు దాంట్లో మనదే ఉండదు. అవును ఆ కుటుంబం భద్రంగా, హాయిగా బతకాలని- అవును ప్రశాంతంగా ఉండాలని కదా! ఇది ఆయన practical చేశారు. ఉమ్ అంటే అది practical philosophy మనం అనుష్ఠాన వేదాంతం అని ఓ మాట వాడుతుంటాం కదా. ఆ దాన్నే ఆయన ఆచరించారు. అందువల్ల కులము, మతము ఈ జాజ్యం అక్కర్లేదమ్మా. ఉమ్ Chinese boys, youngsters వచ్చి- అవును చాకరాజ స్వామి కృతులు పాడారు. అవును, ఇది మాకు- తెలుసుగా. ఉమ్ అది. పాడారు. ఇది ఇవ్వాళ పాడి ఉండొచ్చు. కాని అది వారు ఉన్న time లోనే ఆ training అలా ఇచ్చారు. ఉమ్ తర్వాత వేదాలు అన్నీ కూడా ఎనిమిది సంవత్సరాలు రాకుండానే వాళ్ళ-- మన పిల్లలకందరికీ కూడా నేర్పారు. ఇంకొకటి. అంటే revolutionary aspect చెప్తున్నా. గాయత్రీ మంత్రం ఆడవాళ్ళు చదవకూడదు. ఇది నేను ఒక interaction లో నాతోనే చెప్పిన మాట ఇవ్వాళ ప్రపంచానికి చెప్తున్నా. గాయత్రీ మంత్రం ఆడవాళ్ళు చదవకూడదని మనకంటే ముందు వచ్చిన పెద్దలు చాలామంది పండితులు "అలా చేయకూడదండి. దాన్ని వాళ్ళు అలా చేయకూడదు. వాళ్ళకి చాలా కష్టం. వేదం వాళ్ళు నేర్చుకోకూడదు" ఇవన్నీ చెప్పారు. స్వామి అన్నారు "మరి వేదాన్ని వేదమాత అని ఎందుకు అంటున్నారు?" ఉమ్ "వేదపురుషుడు అనేది ఆ-- ఓ చోట ఆగచ్చు కదా. వేదమాత అని ఎందుకు అంటున్నారు?" అంటే అక్కడ మాత అంటే నువ్వు చెప్పుకునే biological mother కాదు. మాత అంటే మూలము అని అర్థం. ఉమ్ నీ మూలం ఏమిటంటే నీ తల్లి నీ మూలం. అవును నీ ఆయువు నీ తల్లి. నీలో ఉన్న సంస్కారం నీ తల్లి. అదొక percentage. కాబట్టి వేదమాత అంటే వేదం మూలము గ్రహించమని అర్థం. ఉమ్ వేదపురుష అంటే అభివ్యక్తమైంది, manifest అయింది. ఉమ్ వేదం ఈ రూపంలో ఒక మంత్రంగా, గానంగా. సామవేదం అంతా గానం కదా. అవును ఋగ్వేదం అంతా మాట కదా. యజుర్వేదం అంతా కర్మకాండ కదా. మరి ఈ మూడు ఆట, మాట, పాట. మూడు. ఈ మూడు లేకుండా ఎట్లా ఉన్నాయి? ఉమ్ ప్రపంచం మూడింటితో నడవగలిగేదా? ఉమ్ అని ఇట్లా ఆయన చేసి ఆ Even Muslims, Zoroastrians వాళ్ళు అగ్ని పూజ చేస్తారు. వాళ్ళకి అగ్నియే దైవం. అది కాదా అంటే అవును. మనం మన పూజల్లో కూడా, మన కైంకర్యంలో కూడా హారతి ఇవ్వకుండా లేదుగా. అవును జ్యోతి ప్రగ-- ప్రకాశనం చేయకుండా లేదుగా. ఇక్కడ ఓ మాట చెప్పాలి. మామూలుగా సాంస్కృతిక కార్యక్రమాలు మనకు invitations పుంఖానుపుంఖంగా వస్తుంటాయి. జ్యోతి ప్రజ్వలనము అని రాస్తారు. జ్యోతి ప్రకాశనం ప్రకాశనం అనే పదం వాడాలన్నారు. ప్రజ్వలన అంటే మంచిది కాదు అది harsh. కాబట్టి ఇవన్నీ కూడా చాలా basic గా ఉన్నటువంటి ఆ వేద మూలాలు అన్నీ కూడా చాలా సునాయాసంగా- ఉమ్ అచ్చమైన తెలుగులో ఆయన చెప్పారు. ఉమ్ కాబట్టి భజన సంప్రదాయం గాని, వేద పఠనం గాని, వేద శ్రవణం గాని, గాయత్రీ విషయానికి వచ్చేప్పటికీ ఆయన అసలు నిర్-నిర్ద్వందంగా ఒక మాట చెప్పారు. "అసలు గాయత్రీయే అమ్మవారి స్వరూపం." ఆమె స్త్రీ స్వరూపం. స్త్రీ స్వరూపాన్ని స్త్రీ ఉపాసించకూడదని ఎవరు చెప్పారు? ఉమ్ గాయత్రి అంటే మీరు చెప్పుకునేటువంటి ఓం భూర్భువస్వః అదేనా? కాదు కదా. గాయత్రి, సావిత్రి, సరస్వతి మూడు ఉన్నాయి. గాయత్రి అంటే శరీరం. త్రికాలంలో ఉండేటువంటి జాగ్రదవస్థలో, నిద్రావస్థలో, సుషుప్తిలో ఉండే శరీరం ఒకటి. సరస్వతి వాక్కు గాయత్రి. నీ ఆయువు, నీ ప్రాణం ఏదైతే ఉన్నదో అది సావిత్రి. కాబట్టి ఈ మూడు కలిపితే అది గాయత్రి అయింది. ఆహా! ఈ మూడు పురుషుల్లో ఎంతున్నాయో స్త్రీలలో అంతే ఉన్నాయి. ఉమ్ వాళ్ళు పాడవలసిందే, వాళ్ళు అర్థం చేసుకోవలసిందే, చదవవలసిందే అన్నారు. అంటే పైకి కనిపించని ఒక అద్వ-- ఆయనకి జెండా పట్టుకోలేదు, రోడ్డు మీదకి వెళ్ళలా. కోటానుకోట్ల భక్తులు మీరందరూ వెళ్లి ఈ-ఈ ఈ ధర్మాన్ని మీరందరూ కూడా ప్రచారం చేయమన్నారు. ప్రబోధం చేస్తూ ప్రసారం చేయమన్నారు. ఉమ్ ఆహా You transmit through your own life. ఉమ్ అంతే. గురువు గారు చాలా ఒక, ఒక phenomenon విషయంలో దాన్ని-- ఆ phenomenon ని పరిధిల్లో మనం బంధించే ప్రయత్నం చేసినా అది విఫలం అవుతాం బహుశా. అంతే. correct కానీ ఇన్ని కోట్ల మంది అక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒక అప్-- ఏదో జరిగిపోతోంది, ఒక transformation అని experience చేసిన సందర్భాలున్నాయి. ఆ అది-అది ఎలా జరుగుంటుంది గురువు గారు? అంటే అది వారి భక్తా? ఆ బాబా వారి కటాక్షమా? మనం రెండూ అనుకోవద్దమ్మా. అనుకోవద్దు. ఉమ్ అదేంటంటే ఆవరణ ప్రభావం అని ఉంటుంది. ఆ మల, విక్షేప, ఆవరణ. మల అంటే మాలిన్యం. ఆవరణ, ఆవరణ ప్రభావం. మనం అంటాం అక్కడ vibrations బాగున్నాయండి. ఆ ప్రపంచము, ఈ ప్రపంచం కానిది, దేవుడు, దేవుడు కానిది, జడము, అజడము ఇవన్నీ వేదాంత భాషలో చాలా పదాలున్నాయి. వీటన్నింటిలలో మన బోటి వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి మీరో పాట పాడుతున్నారు అనుకోండి. పాట పాడుతున్న అనుభూతి మీదే. అనుభవంతో కూడిన అనుభూతి మీది. ఉమ్ అంతేనా? నాకు పాట రాదు. కానీ నేను ఆనందంగా ఒక తన్మయత్వాన్ని నేను పొందుతున్నా. ఉమ్ ఇక మీరు నాకు చెప్పారా? నేను ఇలా మీకు తన్మయత్వం కలిగేలా పాడబోతున్నాను. [నవ్వు] ఆ ఈ రాగం నేను ఎంచుకున్నాను. మీకు చాలా soothing గా ఉంది. ఏం మీరు చెప్పలా. మీరు పాడుతున్నారు, మేము విన్నాము. విన్నప్పుడు నాకొక ఆనందం కలిగింది. అది అనుభవాన్ని మించి, అనుభూతిని మించినటువంటి ఆనంద స్థితి. ఆ ఆనంద స్థితి మీరు నాకేమివ్వలా. ఉమ్ నేను మిమ్మల్ని అడగలా. ఒకవేళ మీరు గనక ఇవ్వాలని అనుకుంటే రాగం చెప్పాలి, స్వరం చెప్పాలి. ఆ ఉదాత్త అనుదాత్తాలు ఇలా ఉంటాయి, ఇలా పా-- text అంతా నాకు technical గా చెప్పాలి.ఆ బ్యూ-బ్యూటీ పోతుంది. నాకక్కర్లేదు దాంతో. ఉమ్ ఉమ్ అది ఆ ఫైనల్ గా నాకేమిచ్చింది? దాంతో నేను అట్యూన్ కాగలిగానా లేదా? ఉమ్ ఆ అట్యూన్మెంటు ఎలా జరుగుతుందంటే ముందు మనసుతో ప్రారంభమై బుద్ధి విశ్లేషించి ఆత్మ సంయోగం చెందుతుంది. ఆహా! ఆ ఆత్మ సంయోగం చెందిన మరుక్షణం నాకు ఆ పాట ఒక మహదానందాన్ని కలిగిస్తుంది. బాబా గారి యొక్క ఆవరణంగా నాకు ఒక అందమైన పాట అనుకున్నట్లయితే నా మైండ్ దానికి ట్యూన్ అయింది అని అర్థం. ఉమ్ అందులో వారు ఇచ్చింది లేదు, నేను పుచ్చుకున్నది లేదు. ఉమ్ యద్భావం తద్భవతి. అవును నేనేమనుకుంటానో అది జరుగుతుంది. అది జరుగుతుంది. ఏం జరగబోతున్నదో అదే నేను అనుకుంటా. చూశారా? రేషనల్ గా. అంతే. గురువు గారు ఈ-ఈ సందర్భంలో బాబా వారిని ఆ-అనేక రూపాల్లో కొలుచుకునేవారు. అంటే రాముడి అవతారం అని, కృష్ణుడి అవతారం అని, శివుడి అవతారం అని [పాట] అయోధ్య రాముడై అడవులలో తిరిగి అలసిపోతివో ఏమో ఆనంద సాయి అని పాడుకున్నారు. ఉమ్ ఇవన్నీ భక్తుల... మనోభావాలు మనోభావాలేనా? అంటే చాగరాజ స్వామి వారు ఒక రాముడి గురించి పాడుకున్నారు. అవునా? ఉమ్ అది ఆయన భక్తిభావమేగా? ఉమ్ ఆ రామదర్శనం అయిందా? ఎప్పుడయింది? తొమ్మిది వందల కోట్ల రామనామ జపం అయిపోయిన తర్వాత ఒక్క క్షణం రాముడు కనిపించాడు. ఉమ్ ఎట్లా కనిపించాడు? మొత్తం ఆయన పరివారంతో వచ్చి దర్శనం ఇచ్చాడు. అబ్బబ్బబ్బ! వింటుంటే... పరివారంతో. నా-నాకిది చెయ్ అది చెయ్ అని అడగలా. "నువ్వు ఇంతటి వాడివి, అంతటి వాడివి" అన్నాడు. ఉమ్ రామదాసు వలె నిందాస్తుతి కూడా చేయలే. ఉమ్ "ఏంటి నిన్ను నేను ఇలా పూజిస్తున్నాను, నాకీ అగర్వ దరిద్రం ఏమిటి?" అని ఆయన అడగలా. దాంతో సంబంధం లేదు. ఒక బియాండ్ ఒక లెవెల్, అందుకనే వారిని మనం చాగరాజ స్వామి అంటాం. స్వామి అంటే జ్ఞాని. ఉమ్ కాబట్టి ఆ జ్ఞానంలో రాముడికి ఇంకా తప్పలేదు. తప్పలేదు, దర్శనం ఇచ్చి తీరవలసిందే. అని నేను ఒక్కడినే వెళితే బాగుండదు, అమ్మవారిని కొలిచాడు కదా, హనుమంతుడిని కొలిచాడు కదా, కాబట్టి నా పరివారం మొత్తానికి నాతో పాటు గౌరవం ఇచ్చారు గనుక చాగరాజ స్వామికి దర్శనం ఇవ్వాలని ఆయన అనుకొని ఆయన వచ్చారు. ఉమ్ ఇక్కడ పాపా ఆయన అడగలా. దర్శనం ఇయ్యి, తరత్తీయగరాదా ఇవేం లేవక్కడ. ఉమ్ కనుక ఈ మనో-మనోభావాలు, భక్తుల మనోభావాలు ఎలా ఉండాలి అంటే, "నాకిది ఇవ్వు" అన్నావా అది కోరిక తీర్చుకోవటమే. అది వరం. ప్రార్థిస్తూ వెళ్ళు, అనుకుంటూ వెళ్ళు, భావిస్తూ వెళ్ళు, సంభావిస్తూ వెళ్ళు, ఆ జరిగే రోజున జరుగుతుంది. అది కరుణ. ఆహా! అడిగి పొందేవన్నీ వరాలే కదమ్మా. అవునవును మనం అడుగుతుంటే ఆయన ఇస్తుంటారు. మనమేం అడగం. మన దారిలో మనం వెళుతుంటాం. ఆ రాముడున్నాడు, ఆ కృష్ణుడున్నాడు, ఆ దేవుడున్నాడు అనుకోండి. అది అనుగ్రహం. అనుగ్రహం. ఆ అనుగ్రహం మ్యానిఫెస్ట్ అయినప్పుడు ఆ కరుణను మనం అనుభవిస్తాం. అది ఒక అనుభూతి. చాగరాజ స్వామి వారు నిమేష మాత్రమే, అంటే కనురెప్ప వాలి ఎత్తే లోగా రామదర్శనం అయిపోయింది ఆయనకి. [నిశబ్దం] గురువు గారు మొదటిసారి పన్నెండు సంవత్సరాల వయసులో మీకు పిలుపు వచ్చింది. ఉమ్ ఆ తర్వాత మీరు అక్కడ ఉండి వెళ్ళిపోయ- వెళ్ళాను ఇంటికి తిరిగి మీ చదువును కొనసాగించారు. వెళ్ళాను. అవును ఆ ఆ తర్వాత పునర్దర్శనం వారి పిలుపుతోనే అయిందా? మంచి ప్రశ్న మళ్ళీ. ఆ ఆ రోజున వీడ్కోలు, అంటే నన్ను పంపిస్తూ ఉమ్ ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలి. ఉమ్ ఇది చరిత్రలో చాలా అవసరమైంది. మూడు రోజులు అరవై రెండులో ఎక్కడున్నాను అని కదా. పన్నెండేళ్ళ పిల్లవాడు పుట్టపర్తిలో ఏమైనా హోటల్స్ ఉన్నాయా? పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయా? ఏం లేవు. చెట్లున్నాయి. చెట్ల కింద పడుకునే వాళ్ళు భక్తులు. కానీ నా అదృష్టం ఆ ఈ మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు నాకు చెప్పిన మొట్టమొదటి శ్లోకాన్ని కూడా వెళ్ళా గుర్తు చేసుకోవాలి. అది ఎంత relevant ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. అనన్యాశ్చింతయంతో మాం యే జనః పరియుపాసతే, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని ఇలా అనలే ఆయన. చదివారు. భగవద్గీతలో ఈ శ్లోకం భక్తి ఉండాలి, అది అనన్య భక్తి ఉండాలి. ఉమ్ భక్తి కంటే అనన్య చింతన ఉండాలి. భక్తి ఆ మన schedule లో పావుగంట. అంతే కదా. ఇరవై నాలుగు గంటల్లో ఈ This is my పూజ time అంటుంటాం, వింటుంటాం ఈ మాటలు. [నవ్వు] ఆ ఈ పూజ time పన్నెండు నిమిషాల్లో అయిపోయింది. నా ధ్యానం time ఒక రెండు గంటలు అయిపోయింది. ఉమ్ ఆ లేకపోతే నేను నా working hours అన్నీ మనం పెట్టుకున్నవే. ఇక్కడ ఈ చింతన ఇది నిరంతర చింతన. ఇదొక అనాహత నాదం. లోపల కనిపిస్తుంది, బయట ఉండేది కాదు. అటువంటి దాన్లో బాబా గారు అనన్యాశ్చింతయంతో మాం యే జనః పరియుపాసతే ఉమ్ ఇటువంటి భావనతో నన్ను ఎవరు ఉపాసన చేస్తారో, చేస్తూ ఏదో నిన్న చేసి ఇవాళ ఏకాదశి, భీష్మ ఏకాదశో, తొలి ఏకాదశో మనం పెట్టుకుంటాం. ఉమ్ ఏకాదశి ఉత్తమమైన రోజు అంటే ద్వాదశి కానట్టు. త్రయోదశి అసలే కానట్టు. కదా. ఇవన్నీ మనం మనసు సృష్టించుకున్నవి. తేషాం నిత్యాభియుక్తానాం ఎవరైతే ఈ అనన్య చింతనతో అన్ని వేళలా అన్ని క్షణాల్లో నాతో కూడి ఉంటారో వారి యోగక్షేమాలు నేను వహిస్తాను అన్నారు. ఉమ్ అటువంటి వాళ్ళకే యోగక్షేమాలు లభిస్తాయి. ఉమ్ యోగము అంటే భగవంతునితో కూడి ఉండటం యోగం. ఉమ్ క్షేమము అంటే మర్యాదగా బతకటం, నా దృష్టిలో. ఉమ్ అంతే ఈ రెండే. క్షేమం అంటే Not amassing wealth ఉమ్ ఆర్ knowledge. అవన్నీ చాలా చిన్న విషయాలు. క్షేమం అంటే నేను క్షేమంగా ఉండటం అంటే ప్రపంచ క్షేమంలో నేను భాగం కావటమే. ఉమ్ ఊ కాబట్టి ఇవన్నీ జరిగినప్పుడు బాబా గారు ఏం చేశారంటే మరి వెళ్లాన 11:30 అయిందన్నాను. ఊ చేతిలో హల్వా, కాస్త వెనక్కి వెళితే తినాలి. తినటానికి లేదు. ఆ ఇచ్చిందేదో తిన్నాం. అదేం ఆకలి తీర్చేది కాదు.రా చూశారు. ఒక ఆమె కడవ పట్టుకుని నీళ్ళు తీసుకుని వెళుతుంది. ఉమ్ ఆమె అప్పటికే బాబాని పొద్దున నుంచి ఇరవై సార్లు చూసి ఉంటుంది. ఉమ్ మళ్ళీ అలా క్రీగంట బాబా వారిని అలా భక్తితో చూస్తూ వెళ్తుంటే స్వామి పిలిచారు. "ఈశ్వరమ్మ ఎక్కడుంది?" అని అడిగారు. ఈశ్వరమ్మ అంటే బాబా గారి mother. ఉమ్ "ఇంట్లో" అంటే పుటపర్తి లో ఇది ప్రశాంతి నిలయం. ఉమ్ ప్రశాంతి నిలయం is different from పుటపర్తి. పుటపర్తి అవును "గ్రామంలో ఇంట్లో ఉంది" "పిలుచుకొని రా" అన్నారు. కడవ అక్కడ పడేసింది. నీళ్ళ కడవ. దింపి ఊర్లోకి ఆమె పరిగెత్తుకుని వెళ్ళటం నేను చూశాను. ఉమ్ అంటే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదన్నట్టు వెళ్ళింది. ఆమె నెమ్మదిగా తీసుకువచ్చింది. బాబా గారు అప్పుడు ఆమెతో ఏం చెప్పారంటే, "ఈ అబ్బాయి, ఈ అబ్బాయిని నీకు అప్పగిస్తున్నా. మూడు రోజులు నీ దగ్గరే ఉంటాడు. నువ్వేం చేయాలంటే, నువ్వు వండుకునేటువంటి పాత్రలు ఏవి వాడవద్దు. కొత్త పాత్ర తెప్పించుకో. కొద్దిగా అన్నం, కొద్దిగా ముద్ద పప్పు, కొద్దిగా నెయ్యి, గడ్డ పెరుగు, ఇవన్నీ మన దగ్గర ఉంటాయి కదా." ఉమ్ "వీటితో మూడు రోజులు నువ్వు చూసుకో. నీకు అప్పజెప్తున్నా." ఆమె నన్ను ఒక ప్రసాదంగా భావించి తీసుకెళుతున్నది. చాలా beautiful సన్నివేశం ఇది. వెళుతుంటే గ్రామంలో కొత్త వాళ్ళు పిల్లవాడో పెద్దవాడో ఎవరు వచ్చినా "ఎవరు ఈయన?" అనేది ఒక ప్రశ్న ఉంటుంది. ఈ గోడ మీద నుంచి ఈమెని అడుగుతున్నారు ఊళ్లో ప్రవేశించami వెళుతుంటే. "ఈశ్వరమ్మ ఎవరీ బాబు? ఎవరీ అబ్బాయి? ఎవరిట్--" నాకు చెవిపోగులు ఉండేవి అప్పుడు. ఎర్ర-ఎర్ర రాళ్ళు కెంపులు. సరే వెళుతున్నాం. ఆమె అసలు సమాధానం చెప్పటంలా. ఒక గాలిలో తేలిపోతూ నన్ను తీసుకెళుతున్నారు. కానీ ఆమె ఇంటి పక్క అంటే immediate neighbor "ఏం ఈశ్వరమ్మ? అందరూ అడుగుతున్నారు కదా. ఏమీ నోరు విప్పి చెప్పటం లేదు. ఎవరీ అబ్బాయి?" అని అడిగింది. అప్పుడు ఆమె స్పృహలోకి వచ్చింది. ఏమో నాకు మాత్రమే ఏం తెలుసు. ఈ వయసులోనేగా నీకూ నాకూ సంబంధం లేదని తెంచుకుపోయినాడు స్వామి. ఆ అనుభవం నాకు పోయింది గనుక ఇవ్వటానికి ఇచ్చాడేమో అన్నది. అంటే బాబా పద్నాలుగు ఏట వెళ్ళిపోయారు. సరే వెళ్ళాం. ఆ మూడు రోజులు నాకు అంతా ఆ స్వామి ఏం చెప్పారో అది చేసారు ఆవిడ. చేసిన తర్వాత మూడవ రోజు నా-- నువ్వు బయలుదేరాలి, కా-- స్కూల్ కి వెళ్ళాలి, చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలి, దేశానికి మంచి పేరు తేవాలి, తల్లిదండ్రులకు ప్రేమ తేవాలి, ఆ ప్రేమా, ఆ గౌరవం తేవాలి, ఇవన్నీ చెప్తున్నారు. చెప్తూ "నువ్వు భోజనం చేసి వచ్చేటప్పుడు నీ సంచి పట్టుకొని వచ్చేసి" చిన్న bag అది. సరే వస్తూ ఉంటే ఈశ్వరమ్మకి నేను, నేను అవ్వ అని పిలిచా ఆవిడని. ఉమ్ పెద్దావిడ. ఉమ్ "అవ్వ మరి నేను వస్తాను. మా చదువుకోవడానికి వెళ్ళాలి కదా" అని నేను చెప్తుంటే, "నేను కూడా వస్తాను" అంది. ఆ "ఎందుకు?" అని "ఎందుకు? నేను వెళ్తాను. నాకు తెలుసు కదా స్వామి దగ్గరికి వెళ్లి అటు నుంచి అటు వెళ్లిపోతాన" అంటే, "నీకు స్వామి సంగతి తెలీదు. నువ్వేమో రైలు ఎక్కి వెళ్ళిపోతావు. ఇంతలోకి ఏమవుతుందంటే నన్ను పిలుస్తారు. 'నీకు ఆ అబ్బాయిని అప్పజెప్పాను. ఏమైనా అడు నాకు ఎందుకు అప్పజెప్పలేదు?' అంటారు. జవాబు ఉండదు. భద్రంగా ఆయన చేతిలో పెట్టి నేను మళ్ళీ మా ఇంటికి వెళ్తా." అబ్బా! అద్భుత సన్నివేశం ఇది. అప్పుడు అది, అదే అమ్మ ప్రేమ అంటే, దివ్య ప్రేమ అంటే. ఇప్పుడు నాకూ బాబా గారికి blood relation లేదు. ఏ, ఆ క్షణాన నేను చాలా చిన్న పిల్లవాడిని. ఎందుకు ఇంతగా, ఇంత జాగ్రత్తగా ఎందుకు చూశారంటే, దానికి ఏ పేరు పెట్టుకున్నా అది నేను అనుభవించినటువంటి ఒక యోగం. ఉమ్ నేను అనుభవించిన ఒక క్షేమం. అప్పుడే ఇక అది ఎక్కడికి చెదిరిపోతుంది? అది. అంటే ఇంతటి గొప్ప అనుభవాలు చవిచూసిన మీతో మాట్లాడుతున్నామా అని చాలా మాటలు రావట్లేదు గురువు గారు. అవును అంటే direct మనం అనుకుంటాం కదా భగవత్ దర్శనం జరుగుతుందా అని. ఈ అనుభవాలన్నీ కూడా భగవద్ దర్శనం. భగవద్ దర్శనమే. చాగీరాజ స్వామి వారు ఏమడిగారమ్మా? "నీకు తెలియంది కాదు. రామా! నీ సామ్రాజ్యంలోకి వచ్చే అర్హత నాకు ఉందో లేదో నాకు తెలియదు. కానీ, నీ భక్తుల సామ్రాజ్యంలోకి నేను వెళ్ళొచ్చుగా. నాకు ఆ సామ్రాజ్యంలో ఒక చోటు ఇవ్వవా?" అని అడిగారుగా ఆయన. అది. కాబట్టి భగవంతుడు, భక్తి, ఆయన సృష్టించిన సామ్రాజ్యము, మూడు అంతా కలిపితే ఒకటి. దానికే త్రిపుటి అని పేరు వేదాంతాల్లో. అంతే. గురువు గారు, భగవాన్ సత్య సాయిబాబా గారు వారు, "నా-నాలో cosmic energy ఉంది. cosmic energy అందరిలో ఉంది. నేను భగవంతుడిని, మీరు కూడా భగవంతుడే. కానీ మీరు తెలుసుకోవట్లేదు, నేను తెలుసుకున్నా" అన్నారు. అవును కానీ మీరు తెలుసుకోవడానికి మార్గం ఏమిటి అని స్పష్టంగా చెప్పారు ఒక మార్గంగా. అంటే ప్రేమ, సేవ ఇవన్నీ కాకుండా అతీతంగా కొన్ని ప్రక్రియలు గానీ, ధ్యానం గానీ, భజన గానీ. చెప్పారు. అని చెప్పకుండా ఏం లేదు. ప్రేమ, సేవ translation of our all thoughts into action. ఉమ్ అది వేరే. అది చివర. ఉమ్ అదే మొదలు కూడా. ఆ కానీ మధ్యలో ఏం చేయాలి? ఉమ్ ప్రేమ అంటే utopian. మామూలు వాడికి. సేవ అందరికీ అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. అవును లేదు మనకి చాకిరీకి సేవకి పెద్దగా తేడా తెలీదు. [laughing] చాకిరీ బాగా చేసి "నేను సేవ చేశాను" అంటాం. సేవ వలన అహంకారం, మమకారాలు తగ్గి ఉంటాయి. ఉమ్ "నేను చేస్తున్నాను" అని ఉండదు. ప్రేమతో కూడిన సేవ, అది కూడా. అప్పుడు ఏమవుతుందంటే నేను ఏం చేసినా ప్రేమతో, అభిమానంతో, ఇష్టంతో చేస్తున్నా. అంతే కదా? ఇది పక్కన పెడితే మనకు కొన్ని ప్రక్రియలు ఉన్నాయిగా. ధ్యానం అని, యోగం అని, ఇవన్నీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఆయన చాలా practical. ఎట్లా practical అంటే, ముందు స్వాధ్యాయం చేయండి అన్నారు. ఉమ్ స్వాధ్యాయం అంటే ముందు రాముడి కథ ఒక ఉదాహరణ రామాయణం లేదా భాగవతం. మనకు అవే కదా ప్రమాణాలు. ఉమ్ మూడవది భగవద్గీత. ఉమ్ రామాయణం నువ్వు చదువు ముందు. కథగా చదువు.కథగా ఎందుకు చదవాలి? దేవుడిది కదా అని భయపడకు. ఇది రామాయణ కథ అని వాల్మీకి అన్నాడుగా. ఉమ్ సీతాయాశ్చరితం మహత్ సీతాదేవి యొక్క చరిత్ర అన్నాడుగా. ఉమ్ పౌలస్త్య వధ అన్నాడుగా. కాబట్టి ముగ్గురు ప్రధానమైన పాత్రలు ఎవరంటే రాముడు, సీత, రావణుడు. ఉమ్ అంతే కదా! కథగా మీరు చదువుకోండి. కథని ముందు అర్థం చేసుకోండి. ఉమ్ Have that imprint in your mind. ఉమ్ Then you start applying why Rama behaved like that? ఉమ్ రేపు పట్టాభిషేకం అంటే కాదు వనవాసం అన్నారు. అయిపోయింది వెనక్కి వచ్చాడు, తర్వాత అరణ్యవాసం అంతా చేశాడు. పధ్నాలుగు ఏళ్ళు జీవితం ఎలా గడపాలో గడిపాడు, ఇవన్నీ అయిపోయినాయి. మళ్ళీ వెనక్కి వచ్చేప్పటికి మళ్ళీ భార్య అడవులకు పోయింది. పిల్లలు ఎక్కడ పుట్టారో, ఎక్కడ ఎలా పుట్టారో ఆయనకి తెలియదు. ఉమ్ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ కలుసుకున్నారు. కలుసుకునేప్పటికి పిల్లలు యుక్త వయస్కులు అయినారు. ఆయన టైం ముగిసింది పోయింది, రామాయణం అయిపోయింది. ఉమ్ దీన్లో ఏమిటి ఎసెన్స్ ఏమిటి? అది స్వాధ్యాయం అంటే. ఆ నాకు ఎన్ని పద్యాలు వచ్చు, ఎన్ని శ్లోకాలు వచ్చు కాదు. ఓ మాట అన్నారు, శోకంలో నుంచి పుట్టింది శ్లోకం, శ్లోకం అర్థం కాకపోతే అదే శోకం అన్నారు. [నవ్వు] ఆ కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటూ ఈ శబ్ద జాలంలో పడకండి. Quintessence of that epic ఏమిటి? ఉమ్ రాముడు భగవంతుడుగా ప్రపంచం మొత్తం ఆయన్ని అంగీకరిస్తే, కాదు నేను విధి ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తా అన్నాడు. నేను కేవలం దశరథ రాజు కుమారుడిగా ఉండాలని వచ్చాను కాబట్టి అందరికీ సామాన్యుడికి కలిగే ఇబ్బందులన్నీ నాకు ఉంటాయి. I will face them అన్నాడు. అది రాముడు. పాతివ్రత్యం ఇవన్నీ పక్కన పెట్టండి. ఉమ్ రాముడి యొక్క అనంత శక్తి, రాముడికి సత్ సత్వ పురుషుడు కదా! అంటే మంచి బాలుడు. మంచి బాలుడు యుద్ధం ఎలా చేస్తాడు? మంచి బాలుడు తాటకుని ఎందుకు చంపుతాడు? అవును కదా చంపకూడదు కదా! కానీ చంపటానికి రాముడి శక్తి చాలదు. శక్తి ఎందుకు చాలదంటే ఆ మనస్సుని ఆ శక్తిగా ఆయన మార్చుకోలే. అమ్మో స్త్రీని చంపటమా? నేను క్షత్రియుడినై అనుకుంటున్నాడు ఇంకా. కానీ ఆ రాముడి యందు ఉన్న శక్తి ఎవరంటే- ఉమ్ రాముడి కంటే ముందు వచ్చినటువంటి సీత. ఉమ్ లేకపోతే ఏముంది ఒక సుదర్శన చక్రం వైకుంఠం నుంచి ఇలా గిరగిరా తిప్పి లంకలో పడేస్తే వాడి పది తలలు తెగిపోయేవి. అవును కానీ ఇంత కథ ఎందుకు అంటే మానవుడికి ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితము, లౌకిక జీవితము భిన్నం కాదని, సుఖదుఃఖాలు రెండూ పడుగు పేకలే జీవితంలో ఉంటాయని, సుఖానికి పొంగద్దని, దుఃఖానికి కుంగద్దని రామకథ చెబుతుంది, అది గ్రహించండి. ఇక సీతాదేవి తాను శక్తి స్వరూపిణి గనుక తనకంటే ముందు మామూలుగా ప్రవచనకారులు, హరికథకులు ఏం చెప్తారు? రావణుడు ఎత్తుకుపోయినాడు, ఎత్తుకుపోయినాడు, ఎత్తుకుపో-- అట్లా వింటూనే ఉన్నాం. కానీ ఎత్తుకుపోలే. సీతా రావణ వధ జరగటానికి ముందే ఆ శక్తి లంకలో ప్రవేశించింది. ఆ రాముడికి కావలసిన శక్తి ఎక్కడున్నదంటే శోకము ఎరుగని అశోకవనంలో ఉన్నది. ఉహు అశోకవనంలో ఉన్న అమ్మవారిని అంటే సీతాదేవిని ఎవరైనా సరే కళా స్వరూపాల్లో ఏడుస్తున్నట్టు చూపించారు తప్ప స్థిమిత రూపంలో చూపించారా? అంటే రాముడి కంటే ముందు ఆవిడ అవతారం ఎత్తొచ్చింది. అవును, ఎంత గొప్పగా ఉందండి! రాముడి కంటే ముందు ఆవిడ అశోకవనానికి చేరుకుంది. రాముడి కంటే ముందు వెళ్లి రావణుడికి రాముడి సంగతి చెప్పింది. ప్రతిరోజూ రావణుడు వచ్చి ఆ రాముడిని దూషించాడు. ఉమ్ చాలా భయంకరంగా. దూషిస్తే దాని అన్నింటికీ ఆవిడ సమాధానం ఇచ్చింది. ఇస్తే ఏం చేయలేడు, ఆ రాముడు నన్ను ఏం చేయలేడు అన్నప్పుడు ఆ శక్తి ఏమన్నదో తెలుసా? నీకు తెలియదేమో కాకాసురుడు అనేటువంటి వాడు నా మీద దాడి చేశాడు చిత్రకూటంలో. ఒక చిన్న గడ్డి పరక తీసి అభిమంత్రించి నీ మీద వదిలితే రావణా! నువ్వు మిగలవు. కానీ అది నా పని కాదు. అది రాముడే చేయాలి. కనుక నేను వహిస్తున్నాను, భరిస్తున్నాను అన్నది. అంటే జీవితంలో కూడా ఒక స్త్రీ అలా ఉండాలి. తనంతట తాను చేయవలసిన పని లేదు, చేయించగలిగిందే శక్తి. శక్తి ఏవి చేదు కదా? ఉమ్ శక్తి ఒక ఉపాధి ద్వారా చేయబడుతుంది. ఉమ్ సీతా శక్తి అనబడే సీత అనబడే శక్తి రాముడు అనేటువంటి ఉపాధిలో ప్రవేశించి రావణ వధకి తీసుకొని వెళ్ళింది. ఉమ్ ఇది రెండు. మీరందరూ రావణాసురుడు చెడ్డవాడని చెప్తున్నారే కానే కాదు. వాడు ఒక బ్రహ్మలలో ఒకడు, రావణ బ్రహ్మ అంటాం. పౌలస్త్య వంశంలో పుట్టాడు. వీణావాదనలో యాజ్ఞవల్కుణ్ణి మించినవాడు. అష్టదిక్పాలకుల్ని జయించినవాడు. నవగ్రహాలను కైవసం చేసుకున్నవాడు. ఉమ్ తర్వాత నవకోటి శివాలయాలలో అంటే తొమ్మిది శివాలయాలలో ప్రతిరోజూ శివాభిషేకం చేసుకున్నవాడు. ఉమ్ తల్లి అడిగితే బొందితో కైలాసానికి వెళ్లి ఈశ్వరుడితో మాట్లాడి ఆత్మలింగాన్ని తెచ్చినవాడు. ఉమ్ వేదాధ్యయనం చేసినవాడు. యజ్ఞోపవీతం ధరించినవాడు. కానీ ఆతడికి ఉన్నది వైర భక్తి. ఆ ఆ వైరం తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే వాడు evolve కాలేడు. అవును salvation లేదు. ఉమ్ ఎవరి యందు? తనకు మూలమైన శక్తి అయిన రాముడి యందే వైరం పెట్టుకోవాలి. ఉమ్ కదా? అవును మీరంతా అతను సీతమ్మవారిని ఎత్తుకెళ్ళిపోయాడని మీరు ఏడుస్తూ చెప్తున్నారు, వింటున్న వాళ్ళు ఏడుస్తున్నారు. గ్రహించండి. వాల్మీకి రామాయణం చదవండి. ఎక్కడైనా ఆతడు అమ్మవారిని తాకాడా? ఉమ్ ఎంత మర్యాదగా వాడు దూరంగా ఉండి మాట్లాడి, నిందించాడు provoke చేశాడు అంతే. కనుక వైర భక్తి, మధుర భక్తి రెండు ఉన్నాయి. మధుర భక్తితో విమానం ఎక్కెళ్ళచ్చు, వైర భక్తితో ఆతడి చేతి మీదిగా విమానం ఎక్కి వెళ్ళవచ్చు. ఆహా! ఇది- ఆ ఈ అంతరార్థం ఇవన్నీ స్వాధ్యాయం అంటే అదమ్మా. అంతేగా నాకు ఆ సుందర కాండ మొత్తం నోటికొచ్చు, ప్రయోజనం ఏమిటి? [నవ్వు] What is that you got out of it? స్వాధ్యాయం ఒక మార్గం చెప్పారు. ఉమ్ తర్వాత ధ్యానం.చేయమన్నారు. అయితే నిత్య ప్రార్థన ఒకటి చేయమన్నారు. నిద్ర లేవగానే ఆ ఏదో మనం కరాగ్రే వసతే లక్ష్మి అవన్నీ మామూలు. ఏదైనా ఇవాళ బాగా జరిగేట్టు చూడు, లాభం వచ్చేట్టు చూడు, నష్టం రాకుండా చూడు ఇది కాదు. సమస్త లోకాః సుఖినో భవంతు అదే ప్రార్థన ఇంకేం లేదు అన్నారాయన. పద్నాలుగు కనబడుతున్న ఈ లోకము కనబడని పదమూడు లోకాలు ఉన్నాయి. అవన్నీ కూడా సుఖంగా ఉండుగాక. ఉమ్ ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఆనందం ప్రపంచపు యొక్క ఆనందం కాదు. ప్రపంచం అంతా ఆనందంగా ఉంటే ఒక వ్యక్తికి ఆ ఆనందం భాగం అవుతుంది. అంతే కదా? అంతే. కనుక మీరు ప్రార్థన చేయండి, స్వాధ్యాయం చేయండి, ధ్యానంలో ఉండండి. ధ్యానంలో ఎంతసేపు ఉండాలి? దానికి మాత్రలు తన్మాత్రలు లెక్క వేసి ఇరవై ఎనిమిది నిమిషాలు నలభై నాలుగు సెకన్లు మించి మీ ధ్యానము చేయలేరు. ఉమ్ చేయలేరు. గంటలు గంటలు ఆ జరిగేది కాదు అని చమత్కారంగా ఏమన్నారంటే ఇరవై ఎనిమిది నిమిషాలు నలభై నాలుగు సెకన్లు సే ఫార్ అన్ అవర్. అప్పటి వరకు జరిగేదంతా ధ్యానమే నీ లోపల. అది ఎరుకకి దారితీయాలి. ఆ అరగంట దాటితే నువ్వు కంటిన్యూ చేస్తున్నావు కదా అంటే జీవితంలో కూడా ఏమ్మా ప్రేమించటం వేరు ఉమ్ ప్రేమించవలసి రావడం దురదృష్టం. కదా? ఆ [నవ్వు] అది చాలా బలవంతం. ఉమ్ ఈ ధ్యానం కూడా అంతే. అవును ధ్యానంలో ఉండటం వేరు ధ్యానం చేయవలసి రావడం ధ్యానంలో రావటం వేరు. ఈ రెండోది వద్దు. ఎందుకనంటే ఈ ఇరవై ఎనిమిది నిమిషాలు నలభై నాలుగు సెకన్ల తర్వాత ఎరుక రాకపోగా గురక మిగులుతుంది అని చమత్కారం చేశారు. [నవ్వు] గురకను మనం ధ్యానం అనుకుంటున్నాం. అవును దాన్ని సమాధి అంటున్నాం. మనం మోసం చేసుకుంటున్నాం. ఉమ్ అయితే ఆయన ఈ మాట అనకుండా అంతవరకు చాలు. ఉమ్ మీరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. కుటుంబం ఉంది, పిల్లలున్నారు, పెద్దలున్నారు, సమాజం ఉంది, బాధ్యతలున్నాయి. అవన్నీ మీరు ధ్యానంలోనే గడిపేస్తే ఎట్లా? ఆ ఒక అరగంట. అది మీతో మీరు ఉండండి. మీ లోపల మీరు ఉండండి. అక్కడ ఏ ఆలోచనా లేకుండా పెట్టుకోండి. ఉమ్ బ్రహ్మ ముహూర్తంలో బెస్ట్ పార్ట్ ఆఫ్ టైం అని మనందరం చెప్తూ ఉంటాం. ఆయన నేను అర్థం చేసుకున్నది నేను ఈ క్షణానికి పాటించేది కూడా ఒక్కటే. ఆ వీ అవర్స్ అంటాను చూడండి. అవును దాన్ని ఆ బ్రహ్మ ముహూర్తంలో నేను లేచాను. ప్రాక్టీస్ ప్రకారం లేచా. అప్పుడు నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు. నేను ఏదన్నా సంబంధం పెట్టుకుందామన్నా ఆ ప్రపంచం సిద్ధంగా లేదు. ఆ తెల్లవారేక మాట్లాడనంటారు. అంతేనా? ప్రపంచం కూడా నా జోలికి రాదు. ఎందుకంటే అది ఇంకా మేలుకోలేదు గనుక. కాబట్టి ప్రపంచానికి నేను అక్కర్లేదు, నాకీ ప్రపంచం అక్కర్లేదు. ఈ సమయమే నాతో నేను నాలో నేను ఉండగలిగిన సమయం కాబట్టి నేను ధ్యానం ఆ అరగంట నేను చే-- ఉంటా దాంట్లో. ఆహా ఇది రెండోది. ఇక యోగ. యోగ అంటే ఏరోబిక్స్, జిమ్నాస్టిక్స్ కావు. నాలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక భావన నాలో నెలకొనే చెందినప్పుడు లేదా అందరూ చెప్తున్నారు నీలోనే దేవుడున్నాడు అని కదా. ఆ నాలోనే దేవుడున్నాడని పెద్దవాళ్ళందరూ చెప్తున్నారు గనుక ఆ దేవుడో ఆత్మో ఏమిటో చూద్దాం అని అనుకోవాలంటే నన్ను ముందు నేను వదుల్చుకోవాలి, విదుల్చుకోవాలి. ఉమ్ ఈ రెండు అయిన తర్వాత నాలో ఉన్నటువంటి ఆ ఆ జ్యోతి దర్శనాలను నేను చేయగలగాలి. ఉమ్ అది ఈ రెండు కళ్ళు తోలు కళ్ళతో చూసేది కాదది. దాటి చేయాలి. ఉమ్ ఆ చేయటానికి నువ్వు ఇదొక ప్రాక్టీస్ చేయాలి. ఇది దీనికి నువ్వు కేవలం ఎనిమిది నిమిషాల టైమే పెట్టుకోమన్నారు. ఇచ్చేయమన్నారు. కానీ నేను యోగాలో ఉన్నాను, నేను ధ్యానంలో ఉన్నాను, నేను పుస్తకం చదువుతున్నాను స్వాధ్యాయం. ఆ తెల్లవారుజామున లేచినప్పుడే స్వాధ్యాయం చేసుకో, అప్పుడే పుస్తకం చదువుకో, దాని పక్కనే ధ్యానంలో ఉండు, దాని పక్కనే యోగం చెయ్. మళ్ళీ ఐదున్నర అవగానే నీ పనిలోకి నువ్వు వచ్చేసేయ్. ఎందుకని? కర్మానుబందీ మనుష్య లోకే. అవును మనందరం ఒక కర్మకి లోబడి పని చేయాలి కదమ్మా. ఉమ్ అలాగే ఏ పనైనా సరే అది ఎంత బాగున్నా ఒక సమయానికి ఒక పరిమితికి లోబడి మనం పనులు చేయాలి. అంతేగా? ఉమ్ అవును ఇదే చేద్దాం అంటే ఇంకా చాలా పనులున్నాయి చేయవలసినవి. ఉమ్ ఇది ప్రాక్టికల్ ఫిలాసఫీ అంటే నాకు అర్థమైంది, నేను ఆచరించింది, నేను లాభపడింది దీని వల్ల. ఉమ్ అది. కాబట్టి ఈ మార్గాలన్నీ చెప్పారు. భజన చేయమన్నారు. భజన హాయిగా చేసుకోండి అన్నారు. ఏం భజన చేయాలి? నువ్వు భజన చేస్తున్నప్పుడు నామరూప భావాలు మూడు కలిస్తే అది భజన. అంతే కదా? ఉమ్ రాగ భావ తాళాలు కలిస్తే అది భజన. ఇది కాకుండా ఏం లేదు. అవును ఆ మూడు అయినప్పుడు నేను ఒక శివుడి మీద భజన పాడుతున్నా. ఉమ్ ఆ చంద్రశేఖర అంటూ మొదలు పెట్టా. నేను ఆ భజన మూడో స్థాయికి వెళ్ళేప్పటికీ నాకు ఆ శివుడు కనిపించినట్టు నాకు ఒక అనుభూతి కలుగుతుంది. ఉమ్ చాలు కీప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే పూర్తిగా లీనమైపోవడం వల్ల అయిపోవటం. అంటే రాగం ఉంది ఉమ్ ఆ రాగానికి తాళం ఉంది. అంటే ఒక సరైనటువంటి గమకం ఉంది. ఆ భావం భావనే భగవంతుడే ఉంది. ఏది మన బృహదారణ్యకోపనిషత్. ఉమ్ కాబట్టి ఆ భావన నీకేం కలిగిందంటే శివుడు వచ్చాడు అని. ఉమ్ కనిపించాడు అని. కనిపించాడో కనిపించలేడో నీ మనసుకు అనుకో. కనిపించలేదు అనుకో నీదే, కనిపించాడు అనుకో నీదే. నేను ఈ భజన చేశాను నాకు శివుడు కనిపించాడు అనొద్దు. ఉమ్ అది మోసం చేసుకోకు. ఉమ్ కాబట్టి భజన మాత్రం చెయ్. ఉమ్ చేస్తే నీకు ఆ మనస్సు, వాక్కు, కర్మ ఏకమవుతాయి. తర్వాత చేతులు చరుస్తూనూ గనక నువ్వు భజన చేయగలిగితే నీకున్నటువంటి అనేక నాడులు నాడులు ఆ నాడులన్నీ ఉద్దీపనం చెందుతాయి. అవును చేసి నీలో ఈ నవనాడులు కాదు రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులున్నాయి ఈ శరీరంలో. అవి ఆధ్యాత్మిక నాడులు. మెడిసిన్ పట్టుకున్నది డెబ్బై రెండు వేల నాడులే. ఇంకా రెండు లక్షలున్నాయి. అవన్నీ ఉద్దీపనం చెందుతాయి. అవి ఓపెన్ అప్ అవుతాయి. అంటే ఓపెన్ మైండ్ క్రియేట్ అవుతుంది. ఉమ్ అంతే కదా. ఏదైనా ఓపెన్ మైండ్ తో విన్నప్పుడు అర్థమవుతుందమ్మా. క్లోజ్డ్ మైండ్ తో ఉన్నప్పుడు స్పర్ధ మొదలవుతుంది.అవును అంతే కాబట్టి అది చేయమన్నారు చేసిన తర్వాత నీ కర్తవ్యాన్ని కర్తవ్యం దైవమాన్హికం నీవు నీ కుటుంబం నీ బా ఇళ్ల ఇల్లు ఇల్లాలు పిల్లలు చదువులు నీ తోటి వాళ్ళు పక్క వాళ్ళు వాళ్ళకి నీ అవసరం ఎప్పుడు వస్తుందో కదా కింకరుడే శంకరుడు అవుతాడు శంకరుడు ప్రత్యేకంగా లేడు శంకరుడు అంటే శం అంటే శుభం శుభం కలిగించేవాడు మ్ ఆ శుభం ఎవరు కలిగించగలరు అంటే కింకరుడు అంటే బానిసో బంట్రోతో కాదు కింకరో నిద్ర లేవగానే ఇవ్వాళ నేను ఏం చేయాలి మ్ నా ఈ శరీరం నాకున్న ఆస్తులు లేదు నాకున్న శక్తి ఈ ప్రపంచానికి నేను ఎలా చ వినియోగించాలి అన్నవాడే కింకరుడు అవుతాడు ఆహా కింకరః కింకరో శంకరః అది కింకరుడే శంకరుడు సేవకుడే నాయకుడు సేవకుడు కానివాడు నాయకుడు కాలేడు కాబట్టి ఇవన్నీ ఒక సమన్వయ సంయక్ దృష్టి comprehensive approach మ్ towards life ఇవన్నీ ప్రక్రియలన్నీ చెప్పారు సనాతనమైన వైదిక ధర్మంలో ఏవైతే ఉన్నాయో అయితే వాటికి హెవీ dose ఇవ్వలేదు మ్ మీరు ప్రశాంత నగరానికి వచ్చారు ఏదో ఇంటికి తాళం పెట్టి ఈ వారం రోజులు మీరు ధ్యానంలో twenty four by seven ఉండమని చెప్పలే ఆయన అస్సలు చెప్పలే ఇంట్లో ఎలా ఉన్నారో ఇక్కడ అలాగే ఉండండి చక్కగా ఆ గొప్పగా ఉందది హాయిగా ఉండండి ఈ వాతావరణంలో ఉండండి మంచి భజనలు వినండి వేదం వినండి ఆ మ్ ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా అర్థం చేసుకోండి మ్ ఇవే చెప్తూ వచ్చారు మ్ కాబట్టి ఆయన చెప్పనిదంటూ ఏం లేదమ్మా Hi this is Esha Jagarlamude This is Manara Chopra Hi this is Karthikeya నేను director తేజ అని Press the bell icon [bell sound] for more updates For more such videos please subscribe to iDream For more videos please subscribe to iDream For more videos please subscribe to iDream And you are watching iDream Media Please like, share and subscribe to the channel And don't forget to subscribe to iDream Please subscribe iDream Media Do subscribe to iDream Subscribe to iDream Media Do subscribe to iDream Media Don't forget to subscribe, click on the button below Don't forget to subscribe to iDream [outro jingle]
YouTube · audio
సమస్తలోక సుఖినోభవంతు..ఇదొక్కటే ప్రార్ధన | Full Interview- Sathya Sai Baba Special | Epi 3
సమస్తలోక సుఖినోభవంతు..ఇదొక్కటే ప్రార్ధన | Full Interview- Sathya Sai Baba Special | Epi 3
Source: iDream Media on YouTube
0:00 / 38:41
More in this series
Remembering Sri Sathya Sai Baba — Aaraadhanaa Mahotsavam interviews
-
26 min 2 Remembering Sri Sathya Sai Baba on his 11th Aaraadhanaa Mahotsavam- Full interview- Epi-2
-
38 min 3 సమస్తలోక సుఖినోభవంతు..ఇదొక్కటే ప్రార్ధన | Full Interview- Sathya Sai Baba Special | Epi 3
Now playing -
25 min 4 యజ్ఞం చేయాల్సింది మీరు..చేయించేది ఆ స్వామి - Full Interview | Sathya Sai Baba Spl | Epi 4
-
26 min 5 ఆ ఉపాధికి అవకాశం భగవంతుడే ఇస్తాడు - Full Interview | Sathya Sai Baba Spl | Epi 5
-
20 min 6 భగవాన్ చెప్పిన18 పురాణాల సారం ఇదే..- Full Interview | Sathya Sai Baba Spl | Epi 6
-
25 min 7 ఘంటసాల పాదాలను ఒత్తుతూ భగవాన్ కనిపించారు- Full Interview | Sathya Sai Baba Spl | Ep7
-
20 min 8 సత్యసాయి బాబా లాగా జీవించగలిగితే..అంతా ఆనందమే - Full Interview | Sathya Sai Baba Spl Ep8