No transcript for this section.
Transcript begins at 0:00.
[ఇంట్రో మ్యూజిక్] పునర్దర్శనం ఎప్పుడు కలిగింది అంటే మీరు మూడు రోజుల తర్వాత వెళ్లారు. అక్కడతో మీ ప్రయాణం తాలూకు కథ అక్కడ మనం ఆపాం. కనుక ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉత్సుకతగా ఉంది. ఆ మూడో రోజున నేను బయలుదేరే సమయంలో 1963 ఆ 62 చివర్లో అంటే నేను వెళ్ళింది June 9 October అంటే దసరాలు. దసరాకి మనం విద్వన్ మహాసభ పెడుతున్నాం. వరుణమ్మా ఇంకొకటి నేను అనే పదం వాడలా. ఉమ్ మీరు అనలే, మీరు ఆ దుఃఖంలో వెళ్లారు ఆయన దగ్గరికి. ఆయన "నీ దుఃఖం నీదు" అనలా. "ఏం పాపం చేసుకున్నావో అనుభవించు" అనలే. ఏం చేశారో తెలుసా? "జీవితం అంటే ఇంతే కలిసి ఉందాం, ఇబ్బంది వస్తే పడదాం". He was inclusive. ఉమ్ ఒక pedestal మీద తనను తాను నిలబెట్టుకోలా. మనల్ని ఎక్కడ పాతాళంలోకి దింపలా. సమ స్థాయిలో గౌరవించారు. అందుకనే ఆత్మ సంబంధంగానే అది సాగుతుంది. అరవై రెండులో విద్వన్ మహాసభకు నువ్వు రా. పది రోజులు ఉండు. నీకు దసరా సెలవులు వస్తాయి. ఉమ్ అని నేను వచ్చేటప్పుడు- వెళ్ళేటప్పుడు పదహారు రూపాయలతో వెళ్ళాను. మళ్ళీ రావటానికి నాకు పదహారు రూపాయలు ఇచ్చారు. ఆహా [నవ్వు] రావటానికి డబ్బులు కావాలి కదా. ఉమ్ నేనేమి earning member ని కాదు student ని నేను చిన్నవాడిని. ఇచ్చారు నన్ను నేను అప్పుడు దసరా మహోత్సవాలకు వెళ్ళటం, ఇలాగే కుర్చీలో బాబా గారు కూర్చుంటే నన్ను ఇక్కడ పక్కన కూర్చోబెట్టుకునేవారు. ఆ యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లన్నీ అవుతున్న ఆ పది రోజులు నేను ఆ proximity ని చాలా అనుభవించా. ఉమ్ ఇందాక మీకు చెప్పాను నాకు పోగులు ఉండేయని. ఉమ్ చెవిపోగులు, కెంపులు. ఇలా కూర్చుంటే నా ఎడమ చెవి ఆయన కుడి చేతికి దగ్గరగా ఉండేది. అంతే కదా? దానితో ఆడుకునేవారు. ఆ [నవ్వు] ఇలా ఇలా అంటూ instructions ఇచ్చేవారు. ఉమ్ "అన్నీ సరిపోయినాయా?" వాళ్ళని పిలిచి యాజకుల్ని. ఇక్కడ ఏమీ దొరకదు పుట్టపర్తిలో. ఏది కావాలన్నా మనం బెంగళూరుకు వెళ్ళాలి. లిస్టు రాసుకో. perfectionist. ఉమ్ అండ్ a great host. ఆ అవి నేను గమనించాను. ఆయనే చేయిస్తున్నది యజ్ఞం. అప్పుడు ఆ యాజకులు వచ్చి ఆయన్ని అడిగారు "బాబా మీరు యజ్ఞం ప్రారంభించండి" అంటే "యజ్ఞం మీరు చెయ్యాలి, స్వామి చేయిస్తారు" అన్నారు. ఉమ్ He never performed any యజ్ఞం. ఉమ్ కానీ అన్ని యజ్ఞాలు చేయించారు. అతిరుద్ర మహాయాగంతో సహా. ఆ దాని కథ తర్వాత చెప్తాను. ఉమ్ కాబట్టి అక్కడి నుంచి అంటే నేను ఆ ఒక ఆరు నెలల, నాలుగు నెలల gap లో మళ్ళీ స్వామి దర్శనం చేసుకున్నా. నాకు ఈసారి చాలా తేలిక అయిపోయింది. ఆ నాలుగు నెలల్లో ఏం జరిగి ఉంటుందో మీలో? నాలో అద్భుతమైన ప్రభావం, తీవ్ర ప్రభావం. అంటే ఏమిటి? నేను ఒక గొప్ప personality ని చూశానని కాదు. నాకు చివర మూడు మాటలు చెప్పారు ఇందాక అన్నాను. దేశానికి గౌరవం తీసుకురా, తల్లిదండ్రులకి గౌరవం తీసుకురా, బాగా చదువుకో, వృద్ధిలోకి రా. ఇదే కదా! వృద్ధిలోకి నేనే తెస్తున్నా అనలే. నువ్వు రా, నీ అంతట నువ్వే రా. దాని ద్వారా నీ తల్లిదండ్రుల గౌరవాన్ని తీసుకురా. ఫలానా వాళ్ళ అబ్బాయి అని అనిపించుకోవటం కాదు. వీళ్ళ తండ్రులు ఫలానా వాళ్ళని అనిపించుకోవాలి. ఉమ్ దేశం, ఈ దేశం గనక లేకపోతే నువ్వు లేవు. ఉమ్ నువ్వే కాదు నేను కూడా లేను. ఆ సేతు సీతాచలం మీరు ఆ జెండా గురించి ఒకసారి చెప్పారు. అదే సందర్భంలో. మీరు ఊరికే ఆ జెండాకి వందనం ఏదో సంవత్సరానికి ఒకసారి salute చేయటం కాదు. ఆ జెండా ఆకాశం నుంచి వచ్చేటువంటి అనేక ధార్మిక అణువులు ఏవైతే మన మీద ప్రభావం లేకుండా అలా పరుచుకొని మనల్ని కాపాడటానికి వచ్చినటువంటి వస్త్రం అది. ఆధార వస్త్రం. అటువంటి దానికి ప్రతిరోజూ నమస్కారం చేసుకోండి అన్నారు. స్కూల్లో ఉండేది మనకి ప్రార్థన. ఉమ్ ఇప్పుడు ప్రార్థన ఏం లేదు. అన్నీ పోయినయి. కదా? అవును కాబట్టి వాటన్నింటినీ ఆ కాలానికి చెందినవన్నీ కూడా చెప్తూ చెప్పినప్పుడు ఇక ఆ అది ఒక అలౌకికమైనటువంటి అనుభూతి. కానీ ఆయన్ని ఏదో కలిశాను, హల్వా తిన్నాను, మళ్ళీ రమ్మన్నారు, ఇవి కాదు. నేను ఎలాగైనా సరే the best గానే బతకాలి. ఉమ్ ఉమ్ ఏ రంగంలోకి వెళ్తానో నాకు పన్నెండో ఏట తెలియదు కదమ్మా. అవును అవును అవును అవును నేను రంగం ఎంచుకోలేను. ఒకవేళ ఎంచుకుందామన్నా పరిస్థితులు నాకు అనుకూలంగా ఉన్నాయో లేదో తెలియదు. ఎట్లా ఉంటుందో, రేపు ఎట్లా unfold అవుతుందో తెలియదు. ఉమ్ కనుక నేను ఒక్కటి మాత్రం నేర్చుకున్నా. రేపటి కోసం నేను జీవించలా. ఉమ్ నిన్న జరిగిపోయిన దాన్ని గురించి నేను ఏనాడూ చింత పడలేదు. ఆనాడు, ఈనాడు కూడా. ఉమ్ వర్తమానంలో జీవించాలి. ఇవాళ today is my life, today is my day అంతే. రేపు ఏమవుతుందో నాకు తెలియదు. తెలియని దాని గురించి రేపు అదవుతాను, ఇదవుతాను, ఇది చేస్తాను, అవన్నీ ఆ అంటే rational approach ఆ రోజుల్లో ఉన్నదన్నమాట. ఉహు కాబట్టి ఈ నాలుగు నెలలు నాలో కలిగినటువంటి ఒక తీవ్రమైన భావన ఏంటంటే ఒక మహావ్యక్తి ఈ మూడు సందేశాలు నాకు ఇచ్చారు. ఇలా చేయకపోతే నువ్వు చెడిపోతావ్, చేస్తే బాగుపడతావ్ ఇవి చెప్పలా. ఇది చెయ్యి అన్నారు. దాన్ని నేను ఉపదేశ సందేశ ఆదేశాలుగా- ఉమ్ భావన చేశా. నా వ్యక్తిత్వాన్ని నేను నిర్మాణం చేసుకోవటం మొదలు పెట్టా. ఉమ్ బట్ ఆ నాలుగు నెలలలో అతి వేగవంతమైనటువంటి మార్పులు, ఆలోచనల్లో మార్పులు వచ్చేసినాయి. అప్పుడు నేను చది- అప్పటిదాకా చదివిన రామాయణం వేరు, ఆ నాలుగు నెలల్లో రామాయణాన్ని నేను అర్థం చేసుకున్నది వేరు. ఉమ్ అలాగే భాగవతం, భగవద్గీత ఇవన్నీ అప్పటికి చదువుకున్నా నేను. అవన్నీ out of interest. ఉమ్ అంతే. గురువు గారు ఈ సందర్భంలో ఒక చాలా ఒక esoteric kind of a question. ఇలాగ ఒక connection కుదిరినప్పుడు- ఉమ్ కలిగినప్పుడు ఆ అందులో భౌతికంగా కలుసుకున్నప్పుడుతర్వాత వారు మనలో ఆ-ఆలోచనల రూపంలో, సంకల్పాల రూపంలో అనేక మార్లు communicate చేస్తారంట. ఉమ్ అటువంటి అనుభూతి మీకు కలిగిందా బాబా వారి తోటి? చాలా honest గా మూడు విషయాలు చెప్పాలమ్మా. ఆయన ఎన్నడూ నాకు స్వప్న దర్శనాలు ఇవ్వలే. ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఉమ్ నేను కోరుకోలేదు. ఉమ్ ఎందుకంటే ఇలలో చెప్పిందే నేను చేయలేకపోతే కలలో కనిపించి చెప్పింది ఏం ప్రమాణం నాకు? ఊ.. ఇలలో ఏం చెప్పారో అది చేస్తే చాలు అనుకున్నా. కలలో కూడా అది నా మానసికమైనటువంటి hallucination అవుతుందే తప్ప dream is drafted. ఉమ్ అంతే. అదే dream is not granted. అది మనం భక్తితో అనుకోవచ్చు. కాబట్టి నాకు అటువంటి స్వప్నిక అనుభూతులు అంటూ ఏమీ లేవు. number one. ఉమ్ ఈ క్షణం వరకు కూడా. ఉమ్ ఆ ఒకవేళ ఎప్పుడైనా లీలా మాత్రంగా అనిపించినా అవేమీ నాకు పెద్ద instructions ఇచ్చినవి కాదు. ఉమ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, రేపు ఇది ఇలా జరగబోతుంది. అసలు నాకు రేపు ఏం జరగబోతుందో తెలుసుకునే దాంట్లో ఉత్సాహం లేదు. ఊ.. నాకు ఆ mystery of life ని దాన్ని అట్లాగే ఉంచుదాం అనిపిస్తుంది. రేపు ఏం జరుగుతుందో నాకు తెలిస్తే నేను కోటీశ్వరుడిని అవుతాను అంటే ఆ కోటి రూపాయల కోసం ఎదురు చూస్తా. నేను రేపటితో ఉండను, ఇవాళే నాకు ఆఖరి రోజని గనక అనుక్-- నాకు తెలిస్తే నేను ఇవాళ కూడా ఉండలేను. కాబట్టి తెలుసుకున్నందు వల్ల నాకు ప్రయోజనం లేదు. కాబట్టి ఇటువంటి తలుపులన్నీ కూడా నాకేమీ ఆయన సందేశాలు ఇవ్వలేదమ్మా. ఉమ్ I lived a life on the most rational lines. ఉమ్ దాని వల్ల నాకు దివ్యత్వాన్ని తెలుసుకోవటం తేలిక అయింది. ఊ.. నా చుట్టూ నా దారిలో ముళ్ళ కంపలు ఏం లేవు అసలు. ఆ తొలగించే ప్రయత్నం చేయక్కర్లేదు. అక్కర్లేదు కదా. కాబట్టి ఎలా సాగింది అంటే ఒక రాచబాట అంటారే a royal path. ఆ ఆ royal path నేను ఇహంలోనే ఎక్కువ బతికా. ఉమ్ కానీ ఇహంలో బతుకుతూనే దివ్యత్వాన్ని తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్నా. దివ్యత్వం అంటే బ్రహ్మ పదార్థం కాదు అని కూడా తెలుసుకున్నారు బహుశా. అసలు ఈ కనిపిస్తున్నదంతా బ్రహ్మమే అనే భావన వేదాంతంలో చదువుకున్నా, వారు చెప్పిన ఒక పద్యం గుర్తొస్తుంది నాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి. చుక్కలన్నియు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, వాళ్ళభ్యమది బ్రహ్మ, జీవులన్నియు బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ. ఊ.. గిట్టించునది బ్రహ్మ, పుట్టించునది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, ప్రకృతి అంతయు బ్రహ్మ, శక్తి అంతయు బ్రహ్మ, కాలమంతయు బ్రహ్మ, సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ అన్నారు. ఆహా! ఆహాహాహా! నేను మీకంటే different అనలేదు ఆయన. ఊ.. ఈ కనిపిస్తున్న manifest world ఏ బ్రహ్మ ఇది. కానిది దేనికోసం వెతుకుతున్నారు? ఎక్కడుంది అది? అని అన్నప్పుడు ఇలాగే బ్రహ్మము బ్రహ్మము అంటారే స్వామి. ఊ.. దీన్ని ఎట్లా అసలు how to perceive and interpret అంటే ఒక interview. దానికి interview అని వాళ్ళు పేరు పెట్టారు ఆ interaction లో. ఊ.. ఏమన్నారంటే "దేనిని ఈ కనులు చూడలేవో.. కానీ దేని వలన ఈ కనులు చూడగలుగుతున్నాయో అది బ్రహ్మము" అన్నారు. ఆహా! దేని వలన ఈ కళ్ళు చూడగలుగుతున్నాయో.. చూడగలుగుతున్నాయో అదే బ్రహ్మము. అది మనకు అవసరం లేదు. doctor గారి దగ్గరికి వెళితే retina అంటాడు, pupil అంటాడు, కనుగుడ్డు అంటాడు, eyeball అంటాడు, దానిలో optic nerve అంటాడు. ఆయన చెప్తాడు అవన్నీ ఉన్నవే. కానీ అది భౌతిక అవస్థ. కానీ ఇవన్నీ కలిపి దీనిని coordinate చేస్తున్నది ఏది అని గనక ప్రశ్నిస్తే మన దగ్గర జవాబు లేదు. ఊ.. దానికి బ్రహ్మము అని పేరు పెట్టుకో. అది. గొప్పగా ఉంది. సో అయితే మీకు-మీకు అలాంటి అద్భుతాలు, స్వాప్నిక అనుభూతులు ఏమీ కలగలేదు. కలగలేదు. అయితే రెండోసారి మనకు మీకు పునర్దర్శనం కలిగినప్పుడు.. కలిగినప్పుడు ఆ యజ్ఞం చూశా. ఆ ఎలాంటి అనుభూతి కలిగింది అప్పుడు? బాబా వారిని చూడాలని ఆత్రుత ఉండిందా? అంటే అప్పటి వరకు సినిమాల్లో యజ్ఞం చేయటం చూశాను. ఆ ఆ యజ్ఞం వేరు, ఈ యజ్ఞం వేరు. అది వేరు, ఇది వేరు. ఊ.. That is make believe యజ్ఞం. ఇది సాక్షాత్తు ఒక పరబ్రహ్మ మూర్తి అక్కడ కూర్చొని ఊ.. తానే అంతా కారణం అయినప్పటికీ కూడా ఏమీ అంటించుకోకుండా ఎవరెవరు ఏ కార్యక్రమం ఎలా చేయాలో నిశ్శబ్దంగా చూస్తూ, చేయిస్తూ తనలో తాను స్థిమితం పొందినటువంటి ఆ బాబా వారి యొక్క విగ్రహం ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతుంది. ఎక్కడా దాన్ని అక్కడ ఒక president రానివ్వండి, ఒక prime minister రానివ్వండి వాళ్ళు ఆయన పనిలో ఆయన ఉండేవారు. ఊ.. మాట్లాడవలసిన time లో మాట్లాడేవారు. ఊ.. ఇవ్వవలసిన మర్యాదలన్నీ ఇచ్చేవారు. కానీ ఆయన ఎవరో వచ్చారు కదా అని గబుక్కున లేచి వెళ్ళిపోవటం, దీన్ని భగ్నం చేయటం, ఈ-ఈ serenity ని పాడు చేయటం అలాంటివి ఆయన చేయలే. ఊ.. He was unto himself. ఊ.. అది ఆ-ఆ మూర్తి నాకు ఇప్పటికీ చాలా గుండెల్లో నెలచిపోయింది. ఊ.. అంటే ఇంత స్థిమితంగా ఉండాలన్నమాట మనం. ఊ.. మహాయజ్ఞం జరుగుతోంది. ఋత్విక్కులు వేద ఘోష చేస్తున్నారు. స్వాహాకారాలు వినపడుతున్నాయి. But he was very very silent. మీరు చెప్తుంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది గురువు గారు. అవును. అది మా-మా అదృష్టం. అమ్మా. గురువు గారు స్వామికి సంగీతంతో ఉండే అనుబంధం గురించి చెప్పగలరు. ఎందుకంటే వారి భజన్స్ అంటేనే అదొక-అదొక-ఒక సంగీతం. ఒక సంగీతం. అది. Correct. కాబట్టి ఆ రాగాలు గానీ ఆ సాహిత్యాలు గానీ వారు కూడా పాడతారు. పా-పాడతారు, పాడారు, కొన్ని రాశారు. ఊ.. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి కే రాసిచ్చారు. ఊ.. ఓ పాట. సాయిరామా చిలుక ఆత్మ పంజరముపై ఆడుగా కా అని ఒక పాట రాసిచ్చారు. ఊ.. ఊ హంసధ్వని రాగంలో tune చేసిందారది. ఊ.. సరే మీకొక ఎవరికీ తెలియని కానీ చారిత్రాత్మకమైన ఒక సత్యము. ఊ గురువు గారు. మన ఉమ్ పినాకపాణి గారు ఊ.. In his early days ఊ.. When he was in Kurnool ఊ.. ప్రతి శనివారము పుట్టపర్తి వెళ్ళేవారు. ఊహూ మీకు ఆ ప్రమాణం నేను photo తీసి పంపిస్తా. ఊ.. ఇదేదో కాల్పనికమైన కట్టుకథ కాదు. అవును. వెళితే బాబా గారు, పినాకపాణి గారు కొన్ని గంటల తరబడి సంగీతం మీద మాట్లాడుకునేవారు. ఊహూఅలా మాట్లాడుకుంటూ ఉంటే కొన్ని వారాల కొన్ని నెలలు గడిచిపోయాయి. పినాకి పాణి గారికి అర్థమైపోయింది మనం శనివారం గానే పుట్టపర్తి వెళ్తాము బాబా గారితో కూర్చుంటాము ఇంకా మాట్లాడుకుంటాము అని ఉమ్ కానీ ఈయనకు ఆ తలపు వచ్చిన రోజున జరిగింది ఏంటంటే పినాకి పాణి ఇక వచ్చే నెల నుంచి మనం కలవలసిన పని లేదు ఆ ఉమ్ నీ సాధనలో నువ్వుండు అన్నారు. అదేంటి స్వామి ఇంకా నేర్చుకో ఇది మహారుణవం చాలు అంతవరకు చాలు అన్నారు. ఈయన అనుకున్నారు ఏదో ఆయన రావద్దని కలవక్కర్లేదు అన్నారు గానీ కలవటానికి నాకేం అవరోధం ఉంది నేను వెళ్లిపోవచ్చుగా కారు ఏసుకొని అనుకున్నారు believe me he could never visit ప్రశాంతి నిలయం again అబ్బా మళ్లీ వెళ్లలే అందుకనే ఆయన ఏమంటారంటే సరస్వతీ స్వరూపానికి రెండే పార్శ్వాలు ఒకటి సాహిత్యం రెండవది సంగీతం సాహిత్యంలో నేను ఒకాయతం తీసుకొని ఒకేయం రాస్తా ఓ కీర్తన రాస్తా life ఉందా దానికి సంగీతం జోడించాం ఓ రాగం భావం దానికో తాళం అంతా tune చేశాం అద్భుతం అవుతుంది అలౌకికమైన ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి సంగీత సాహిత్యాలు రెండు సమన్వయం చేసుకోవాలి. ఆ సాహిత్యం ఎప్పుడూ కూడా ఒక ఆనందదాయకమైన ఆరోగ్యకరమైనటువంటి సాహిత్య సృష్టి జరిగినప్పుడు ఈ సంగీతం ద్వారా ప్రపంచానికి మానసిక శాంతి లభిస్తుంది. ఇప్పుడు మనమే ఉన్నాం ఇందాక మీరు స్వామి గురించి మంచి పాట పాడారు చక్కగా పాడారు ఒక క్షణం ఆనందం కలిగిందిగా ఆ కలిగిందిగా అవును అది మీరు పాడలే మీరు గనుక నాకు ఒక script చదివి వినిపించారు. కనుక ఆయన ఏం చేశారంటే కొన్ని రాశారు కొన్ని రాయించారు ఉమ్ పాడించారు ఎక్కువ అందుకనే ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రశ్రేణికి చెందినటువంటి కళాకారులంతా కూడా వచ్చి స్వామి దగ్గర పాడారు అవును ఎక్కడా జరగల అది ఎక్కడా జరగల ఇవ్వాల జరగటం వేరు. వాళ్ళంతా ఎలా వచ్చేవారంటే సభక్తికంగా వచ్చేవారు తర్వాత DL, TL లేవు. వాళ్ళంతట వాళ్ళు వచ్చేవారు పాడేవారు వెళ్ళేవారు మరి ఏమిటి లాభం అంటే నేను పండిట్ శివ కుమార్ సర్ మన ఒక ప్రశ్న వేశా ఆ సంతూర్. ప్రశాంతి నిలయం లో మేము కలుసుకున్నప్పుడు ఆయన నాతో కొంత time గడిపారు "what made you come this far from Kashmir శ్రీనగర్" అని అడిగితే నేను ఏ సాధన ద్వారా భగవత్ తత్వాన్ని అనుగ్రహిం-ఆ అనుభవంలోకి తెచ్చుకోవాలని అనుకున్నానో ఆ ప్రశాంతి నిలయంలో అడుగుపెట్టి వారిని చూడగానే నేను వాయించకుండానే నాకు అనుభూతి కలిగింది అబ్బబ్బా అందువల్ల వచ్చానన్నారు. చెప్పారు అందరి అనుభవం అదే. కాబట్టి సంగీతంలో ఉన్నటువంటి అంటే భగవంతున్ని అతి చేరువలో భావనాభూమిక లో అనుభవించటానికి సంగీతం చాలా గొప్ప వాహిక its a great bridge between the soul and the supreme self ఉమ్ ఈ రెండిటికి మధ్య అక్కడ ఎవరు లేరు మీరే ఉన్నారు మీ భావమే ఉంది మిమ్మల్ని మించి ఇంకొకటి లేదు మీరు అనుభవిస్తున్నారు అక్కడ అనుభవం మీది ఆచరణ మీది అనుభూతి మీది కైంకర్యం మీది తాదాత్మ్యం మీది ఆ పాట మీరు ఆహా అప్పుడే అది రాణిస్తుంది. అది రాణించటం కూడా spiritual సాధన అది భగవత్పరం అయినటువంటి పాట గనక ఏంటైతే దానికి భజన అని పేరు పెడదాం అది దానికి structure చేసి ఓ రాగము దానికి ఓ తాళం ఇవన్నీ పెట్టుకుంటే దాన్ని కీర్తన అన్-అందాం. ఇవన్నీ కూడా చక్కగా సమకూర్చి కేవలం భగవంతుడి పట్లే పాడితే సమ్యక్ కీర్తనే సంకీర్తన. ప్రతిపాట సంకీర్తన కాదుగా కాదు భజన వేరు కీర్తన వేరు సంకీర్తన వేరు అవును కాబట్టి ఈ మూడింటికి ఆయన పెద్ద పీట వేసి ఆ ప్రదేశంలో నుంచి పరమాద్భుతమైనటువంటి vibration అన్నాడు ఒకాయన తరంగాలు నేను eme-emanation అన్నాను ఆహా ఆహా అంతే తేడా vibration అంటే వస్తువులలో నుంచి పుట్టేది vibration అవును ఇలా అంటే కదులుతుంది అది emanation నేను కదలకుండా నాలో నుంచి రావాలి ఈ అద్భుత తరంగాలు బయటికి రావాలి అవి ప్రపంచానికి శాంతిప్రదాయి కావాలి అది వారు సాధించి చూపించారు మనందరం నచ్చేయమన్నారు. ఉయ్యాలలూగుమా శ్రీ సత్య సాయి ఆత్మ డోలికలోన ఆనందదాయి ఆనందదాయి. గురువుగారు ఆ ఈ సందర్భంలో ఇది చాలా ఇష్టమైన ఆ విషయం నాకు సంగీతం అంటే ఆ అదే మీరు బాబా వారి సమక్షంలో గాని వారితో కలిసి ఆ సందర్భంలో పాడిన ఒక రెండు లైన్లు మీ నోట వినొచ్చా లేదు మీరు రాసిన రెండు లైన్లు నేను రాశాను గాని ఉమ్ పాడలే ఉమ్ నిజానికి ఉమ్ నేను చిన్నప్పుడు చాలా బాగా పాడేవాడిని ఆ టా కాదు పాడేవాడిని ఉమ్ కొంతకాలం అయిపోయిన తర్వాత ప్రాపంచికమైన లౌకిక విద్యలోకి వచ్చిన తర్వాత ఉమ్ పాటకి సాధన చేయటానికి నాకు అవకాశం లేకపోయింది ఉహు కాబట్టి సాధన లేని శృతి లేని పాట పాడకూడదు ఉమ్ అని నిర్ణయించుకున్నాను అందువల్ల ఇవ్వాళ ఒక ఉత్తమ శ్రోతని నేను ఉమ్ సర్వోత్తమమైన శ్రోతని. నా compliments ఇవన్నీ కూడా కానీ కొన్ని పద్యాలు పాడాను ఆయన దగ్గర పద్యాలు రాగయుక్తంగా కూడా పాడాను ఉమ్ అది ఎట్లాగంటే ఓసారి పాదుకా ఉత్సవం అని జరిగింది ఉమ్ అంటే వెండి పాదుకలు భక్తులు చేసుకొని రెండు కిలోమీటర్ల దూరంఅటో కిలోమీటరు ఇటో కిలోమీటరు పెట్టుకొని ఆ పాదుకలు పెట్టుకు కూర్చున్నారు. ఆ పాదుకా మహోత్సవం అని పేరు పెట్టారు దానికి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బాబా గారు వాటన్నింటిని కూడా తాకి మనకిస్తే మనం పూజ రూమ్ లో మరి పాదుకలకు పూజ చేసుకోవచ్చు. అంటే గురు పాదుకా పూజ సనాతన ధర్మంలో ఉంది కాబట్టి దాన్ని allow చేశారు అది పెట్టారు. కానీ ఆయన ప్రతి పా-- ప్రతి పాదుకలోకి కాళ్ళు పెట్టి వెళ్ళలా. కానీ అంతా అయిపోయింది. అది అయిపోయిన ఐదు రోజులకి నేను ప్రశాంతి నిలయానికి వెళ్ళా. ఉమ్ నేను ఉత్సవాలకి చాలా తక్కువ వెళ్ళేవాడిని. ఉత్సవాల అయిన తర్వాతో ముందో వెళ్తుండేవాడిని నాకు కుదిరేది అట్లా. ఉమ్ సరే బాబా ఆ రోజు మాట్లాడుతుండగా "ఏ నువ్వు కనపడలేదే" అంటే ఓ ముప్పై నలభై వేల మంది ఉన్నారు అందులో నేను ఎందుకు కనపడలేదు? నేను లేను కాబట్టి. కదా. అయినా గుర్తుపెట్టుకుని అడిగారే అనని అది అది one of the interactions లో. నేను ఏమనాలి, "స్వామి నాకు కుదరలేదు" ఆ లేదు ఏదో ఇవాళ్టికి అయినా రాగలిగాను" ఇటువంటి మాటలు నా నుంచి రాలే. పాదుక లిమ్ము పావన నామా పరమ పదమిమ్ము. ఉమ్ ఆ పాదుక లిమ్ము అంటే నాకా ఎవరో ఒక స్వర్ణకారుడు చేసిన పాదుకలు కాదు నాకు కావలసింది. పాదుక లిమ్ము పావన నామా పరమ పదమిమ్ము. ఎట్లా ఇస్తావు నువ్వు అంటే నెమ్మది నా హృదిని పాదాల పాదుకొన నిమ్ము అన్నా. ఉమ్ అంటే నా హృదయం ఎప్పుడైతే నీ పాదాలలో పాదుకుంటుందో అదే పరమపదం. నాకు I have nothing to do with that physical పాదం. ఆ పాదుకలతో నాకు సంబంధం లేదు. స్వామి చాలా ఆనంద పడిపోయారు. ఉమ్ ఇంకో గురువు ఇంకో గురువు అయితే "లేదు నా దగ్గర ఇంకో స్పేర్ ఉంది [నవ్వు] నీకు ఇప్పుడే తొడిగి ఇచ్చేస్తాను. ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదు నీకే ఇస్తున్నాను" ఇటువంటి భ్రమలు ఆయన పెట్టలేదమ్మా. మనల్ని మనం ఆలోచించుకునేట్టు చేశారు. మీరు ఏం చేయదలుచుకున్నారో చేసుకోండి కానీ ధర్మాన్ని మాత్రం అతిక్రమించకండి. సనాతనమైన ధర్మమే ఈ ప్రపంచానికి భారతదేశానికి గురుస్థానం ఇస్తుంది. అది దాని నుంచి వైదొలిగిననాడు మనం కూడా గురుస్థానం నుంచి పడిపోతాం. సో ఇట్లా అవి కాకుండా ఇంకా వేరే పద్యాలు పాడాను గాని ఆ పద్యాలన్నీ కూడా చాలా స్వామి సమక్షంలో పాడా. ఉమ్ ఆ కీర్తన నాకు భజనలు రావు నన్నెవరూ భజన పాడమని అడగరు. ఎందుకంటే ముందే చెప్పాను భజనలు రావు అని చెప్పా. భజన రాకుండా బాబా భక్తులు ఎలా అవుతారు అంటే, రా నందు వల్లే నిజ భక్తుడిగా ఉన్నానేమో. ఉమ్ అవన్నీ ఉంటే mechanical గా పాడుతూ ఉండేవాడిని అరవై ఏళ్లుగా. అంతే కదా. దానికి దీనికి సంబంధం లేదు. ఒక ఆంతరంగికమైనటువంటి భావ స్పర్శ కోసం భజన చేయాలి. ఉమ్ ఆత్మావిష్కరణ కోసం సంకీర్తన చేయాలి. అనుభవ రససిద్ధి కోసం మాట్లాడాలి. ఏమ్మా, ఇవన్నీ అయిన తర్వాత మౌన భూమిక లోకి వెళ్ళాలి. ఎంత గొప్పగా ఉంది అసలి- క్రమం ఈ క్రమం చాలా గొప్పగా ఉంది. అమ్మా ఆ ఒక్క ప్రశ్న అడిగి ఇవాళ్టి ఈ episode కి మనం స్వస్తి పలుకుదాం. తప్పకుండా తప్పకుండా బాబా వారు ఎలాంటి సంగీతాన్ని బాగా భక్తి అంటే భక్తే ప్రధానం అంటాం అది చెప్పినా కూడా మాటల్లో బాబా వారు ఇష్టపడి వినే సంగీతం ఏది? అన్నీ గురువు గారు Even fusion he liked. ఆ మీకు ఇక్కడ అంటే మిగతా వాళ్ళు ఏంటి ఆయనకు ఇష్టం లేదని అలా పెడార్థం కాకుండా ఉమ్ ఎప్పుడూ వీళ్ళది వినాలి అని అనిపించుకున్న వ్యక్తులు ముగ్గురే ముగ్గురమ్మా. ముగ్గురే. ఉమ్ ఏ నాలుగో వాళ్ళు వచ్చారు గనుక పాడించారు. అది వేరే సంగతి. ఉమ్ వాళ్ళంతట వాళ్ళు వచ్చి పాడారు. కానీ ఆ ముగ్గురు ఉంటే ఆయనకు ఆనందం కలిగింది. వాళ్లలో మొట్టమొదట ఘంటసాల. ఆ సాల. ఆయన పిల్లలకు కూడా పాడితే ఇలా పాడాలి, ఇలా నేర్చుకోవాలి, ఇలా పాడాలి, హృదయంతో పాడాలి ఘంటసాల. వారు శరీరంలో ఉన్నంత కాలము ప్రతి కబురు వెళ్ళేది. ఆయన వచ్చేసేవారు automatic గా. ఉమ్ రెండవది ఎం.ఎస్. సుబ్బలక్ష్మి. ఉమ్ ఎం.ఎస్. సుబ్బలక్ష్మిలో ఆయన అన్న మాట "సంగీతము అవన్నీ పక్కన ప్రజ్ఞ పక్కన పెట్టండి తాదాత్మ్యం, ఒక devotion, ఒక భక్తి పారవ్యం, అపేక్ష లేని ఒక ప్రతిభ" ఆది అది. అపేక్ష ఆవిడ వెనుక అన్నీ రావచ్చు గాక. ఇది రెండు. ఇక మూడవది చాలా మనం ఆశ్చర్యపోతాం. మ్యాండలిన్ శ్రీనివాస్. ఆహా చాలా ఇష్టం స్వామికి. ఆ list లో ఆ పేరు లేకపోతే ఎందుకని శ్రీనివాసుని పిలవండి? మ్యాండలిన్ అద్భుతంగా వాయిస్తాడు. అదేం పలికేదా? పలకని దాని చేత పలికించాడు. పిలిపించేవారు. ఈ ముగ్గురు అంటే మిగతా వాళ్ళంతా వచ్చారు పెద్ద పెద్ద చాలా పెద్దవాళ్ళు- అవును stars అసలు ఒక్కళ్ళు కాదు అందరూ వచ్చారు. అవును కానీ ఈ ముగ్గురు ఆయన హృదయంలో తిష్ట వేశారు. ఎంత గొప్పగా ఉంది గురువు గారు. నిజంగా మా మా అందరి అనుభూతిని నేను మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. బాబా వారి దర్శనం చేసుకొని వచ్చినంత అంత మనసు నిండిపోయింది ఇవాళ మీతో మాట్లాడ్డం. కానీ ఇంకా ఎన్ని విషయాలు ఉన్నాయో ఆవిష్కృతం కావడానికి ప్రపంచానికి తెలియడానికి ఎందుకంటే అంత దగ్గరగా అన్ని సంవత్సరాల పాటు ప్రయాణించిన కొద్ది మందిలో మీరున్నారు. అవును అదృష్టవంతులు. ఒక్క ప్రశ్నని నేను సంధించి ఇవాళ ఆ ప్రశ్నకి సమాధానం రాబోయే వారం మీ ద్వారా తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ, బాబా వారి పిలుపుతోనే భక్తులందరూ వెళ్తారు, అందరూ వారి వద్దకు వెళ్తారు. మరి వారు పిలవని వారు బాబా వారితో ఏ అనుబంధం ఉన్నట్టో అనే ఒక తాత్విక ప్రశ్న నాలో ఇప్పుడు కలుగుతోంది. ఎందుకంటే ఎన్నిసార్లో నేను వెళ్లాలనుకున్నాను వెళ్లలేకపోయాను పుట్టపర్తి. ప్రశాంతి నిలయం వెళ్లలేకపోయాను. ఇప్పుడే ఒక సమాధానం చెప్తాను next ది అప్పటికప్పుడు వేసుకుందాం. అలాగే గురువు గారు. బాబా గారు పిలిచినందువలన నేను వెళ్లాను అనుకోవటం ఒక ఆత్మ తృప్తి. ఉమ్ మరి పిలవని వారి సంగతి ఏమిటంటే పిలవని వారి దగ్గరికి ఆయన వెళ్లారు. ఆహా [నవ్వు] అబ్బబ్బా ఎంత! అంతే. ఉమ్ పిలవబడిన వాళ్ళేమో ఆయన దగ్గరికి వెళ్లారు. పిలవని చేరుకోలేని వాళ్ళ దగ్గరికి వారే వెళ్లారు. ఇంతే తేడా. ఇందులో మళ్ళీ ఎవరు గొప్ప ఎవరు తక్కువ ఏం లేదు. ఇక్కడేమో కనిపించారు అక్కడేమో వాళ్ళతో కూడా ఉన్నారు. భేదం ఏం లేదు. మీకు శతకోటి నమస్కారాలు గురువు గారు. శుభం శుభం చాలా ఆ సత్సంగం అనే విషయం ఎందుకు పెద్దలు చెప్తారో ఇప్పుడు అర్థమవుతుంది గురువు గారు. అవునమ్మా ఇలాంటి విషయాలు వినడం వల్ల తెలుసుకోవడం వల్ల అసలు ఎంత ఉత్తేజితం అయ్యాం అంటే మేము. మళ్ళీ మీతో ఈ సంభాషణను కొనసాగించాలని చెప్పి- తప్పకుండా మేము వేయి చెవులతో- శుభం ఎదురు చూస్తూ ఉంటాం. శుభం నమస్కారం. శాయి రామ్. శాయి రామ్. Hi, this is Esha Deol. This is Manara Chopra. Hi, this is Karthikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos please subscribe to iDream. For more videos please subscribe to iDream. For more videos please subscribe to iDream. And you are watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe click on the button below. Don't forget to subscribe to iDream. [అవుట్ర్tro మ్యూజిక్]
YouTube · audio
యజ్ఞం చేయాల్సింది మీరు..చేయించేది ఆ స్వామి - Full Interview | Sathya Sai Baba Spl | Epi 4
యజ్ఞం చేయాల్సింది మీరు..చేయించేది ఆ స్వామి - Full Interview | Sathya Sai Baba Spl | Epi 4
Source: iDream Media on YouTube
0:00 / 25:49
More in this series
Remembering Sri Sathya Sai Baba — Aaraadhanaa Mahotsavam interviews
-
26 min 2 Remembering Sri Sathya Sai Baba on his 11th Aaraadhanaa Mahotsavam- Full interview- Epi-2
-
38 min 3 సమస్తలోక సుఖినోభవంతు..ఇదొక్కటే ప్రార్ధన | Full Interview- Sathya Sai Baba Special | Epi 3
-
25 min 4 యజ్ఞం చేయాల్సింది మీరు..చేయించేది ఆ స్వామి - Full Interview | Sathya Sai Baba Spl | Epi 4
Now playing -
26 min 5 ఆ ఉపాధికి అవకాశం భగవంతుడే ఇస్తాడు - Full Interview | Sathya Sai Baba Spl | Epi 5
-
20 min 6 భగవాన్ చెప్పిన18 పురాణాల సారం ఇదే..- Full Interview | Sathya Sai Baba Spl | Epi 6
-
25 min 7 ఘంటసాల పాదాలను ఒత్తుతూ భగవాన్ కనిపించారు- Full Interview | Sathya Sai Baba Spl | Ep7
-
20 min 8 సత్యసాయి బాబా లాగా జీవించగలిగితే..అంతా ఆనందమే - Full Interview | Sathya Sai Baba Spl Ep8