No transcript for this section.
Transcript begins at 0:00.
[సంగీతం] సాయిరాం! ప్రేమ, శాంతి, దయ, ధర్మం, అహింస ఈ భావనలే ముక్తి మార్గమని ఉద్బోధించి తానే స్వయంగా ఈ విలువలను పాటించడమే కాకుండా ఏ తరానికైనా వీటన్నిటినీ మార్గదర్శకాలుగా మలచిన భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి జీవితంలోని కొన్ని అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో మనం మాట్లాడబోతున్నది వారితో లౌకికంగా, ఆధ్యాత్మికంగా చాలా సన్నిహితంగా ప్రయాణం చేసిన సాహితీమూర్తి, ఆధ్యాత్మిక వేత్త Spiritual Scientist అని మనం ఆత్మీయంగా పిలుచుకునే Professor బి.ఎస్.ఆర్. మూర్తి గారితో ఈ series కొనసాగింపు. గురువు గారు Sai Ram. Sai Ram. ఇంతవరకు మాట్లాడిన మాటలన్నీ గురువుగారు, భగవాన్ ని స్వయంగా చూసిన భావన కలిగింది మా అందరికీ కూడా. చాలా సంతోషం. ఇప్పుడికి మీరు పన్నెండేళ్ల వయసులో బయలుదేరి ఒక, ఒక పిలుపు వచ్చినట్టుగా వెళ్లిపోయి వారితో ఆ ప్రయాణాన్ని కొనసాగించడం, ఎప్పటికప్పుడు వస్తున్న స్ఫూరణని గ్రహించడం, ఆయన మీకు ఏం చెప్తున్నారో తెలుసుకోవడం. ఇదంతా వారి గొప్పతనమా, మీ గొప్పతనమా అనే ఒక ప్రశ్న కలుగుతుంది. గురు శిష్యుల బంధం లేదు పేరు పెడితే అలా అనిపిస్తుంది గురువు గారు. దానిని కేవలం గురు శిష్య సంబంధంతో పరిమితం కాకుండా ఒక విదోక్తమైనటువంటి ఒక వైఖరి అంటాం. పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరి అని నాలుగు భావాలున్నాయమ్మా. పరా అంటే తత్వాన్ని, పశ్యంతి చూసి, మధ్యమా అనుభవించి, వైఖరి చెప్పటం. ఊ. చెప్తున్నాము అంటే ఇవన్నీ జరగాలి. ఊ. అవి ఏకకాలంలో జరగటానికి ఆ మజ్ జన్మాంతర పుణ్య పాక వశత్ ప్రాప్తం అంతేగా. అనేక జన్మలు గడిచి వచ్చిన తర్వాత ఆ పుణ్యం గనుక పరిపాకం చెందకపోతే ఆయన మాటలు మాటలుగా మిగిలిపోయి ఉండేవి. ఊ. కానీ ఆయన మాట మంత్రాలై, సందేశాలై, ఉపదేశాలై, ఆదేశాలై, మార్గోపదేశనం చేసినయ్. ఊ. కాబట్టి ఇది గురువు అనుగ్రహం ఒక్కటే చాలదమ్మా. గురువు అనుగ్రహం మన మీద ప్రసరించిన మనకి ఆ పాత్రత, ఆ పాత్ర రెండూ ఉండాలి. అవును. అది receive చేసుకోగలగాలి. అంటే ఈ ఉపాధికి అవకాశం భగవంతుడే ఇస్తాడు. అవును. కదా! కాబట్టి అవకాశం ఇవ్వబడింది ఆ శక్తి వలనే, గ్రహించగలిగింది ఆ శక్తి వలనే, ఆ చెప్పినది ఆ శక్తే కాబట్టి ఇందులో మనం నిమిత్తమాత్రులం అని నా భావన. గురువు గారు ఊ. ఆ మనం ఇప్పటివరకు మాట్లాడిన సంగతులు ఒకసారి కేవలం ప్రేక్షకుల కోసం ఆ క్లుప్తంగా చెప్పేస్తా. Yes, yes. ఒకటి వారికి సంగీతంతో ఉండే అనుబంధం గురించి చెప్పారు. అవును, అవును. అలాగే ప్రేమ, సేవ వారు చెప్పే విలువలు ఎటువంటివో అది చెప్పారు. అలాగే గురువు గారు మీ ప్రయాణం మొదలైన తర్వాత వారి తల్లి గారికి మిమ్మల్ని అప్పగించిన మూడు రోజుల అద్భుతం గురించి చెప్పారు. అద్భుతం, అవును. ఆ ఆ తర్వాత ఆ మనల్ని మనం ఎలా సంపూర్ణంగా purify అంటాం కదా ఆ అలా ఎలా చేసుకొని మనల్ని సంసిద్ధం చేసుకోవడం ఎలాగో, ఈ మార్గంలో వారు ఉద్బోధించిన అనేక మార్గాలు ఏమిటి? ధ్యానం కావచ్చు, సేవ కావచ్చు, ప్రేమ కావచ్చు, ధర్మం కావచ్చు ఇవన్నీ ఇవన్నీ ఇప్పటికే చెప్పారు గురువుగారు. ఊ ఊ. గురువు గారు ఆ స్వామి దర్శనం గురించి కొన్ని ప్రశ్నలు అడగాలని ఉంది. ఊ. స్వామిని దర్శించుకోవడం ఒక మహాద్భాగ్యంగా భావిస్తారు. అండ్ మీరు ఒక మాట అన్నారు గత episodes లో, వెనక కూర్చుండేవారికే వారు చాలా సన్నిహితులు. సన్నిహితులు. ముందర మరి చాలా మందికి చాలా co-incidences అయ్యాయి. ఊ. నేను ఇలా అనుకుంటూ ఉండగా వారి పాద స్పర్శ ఇలా తగిలింది నాకు. ఇలాంటివన్నీ కూడా. అవన్నీ ఏమిటి గురువుగారు ఎలా మీరు ఎలా అర్థం చేసుకున్నారు వాటిని? వాటిని మనం co-incidence అని incident లని accident లని పదాలు వాడతాం. ఊ. నా దృష్టిలో providential. ఊ. ఇందులో choice లేదు chance తప్ప. ఊ. ఊ. ఆ chance కి అదృష్టం అని పేరు పెట్టండి, మళ్ళీ ఇందాక చెప్పిన పుణ్యం అని పేరు పెట్టండి. ఏ పేరు పెట్టినా అది అలా జరగవలసి ఉన్నప్పుడునే అలాగే జరుగుతుంది. ఊ. ఇందులో వారి సంకల్పం అంటే సంకల్పం వారిదైనా అర్హత మనకు ఉండాలి కదా. ఊ. So deserve first, desire next. ఊ. అది. Deserve first, desire next. Desire next. Deservedness వచ్చిన తర్వాత desire ఏం ఉండదు ఇంకా. ఊ. ఇంకేముంది అది రానంతవరకు కోరికలు గాని ఊ. వచ్చాక ఇంకేముంది. ఊ. కాబట్టి అవన్నీ ఎలా జరిగినయ్ వారి దర్శనం అంటే, నేను poetic గా ఒక మాట చెప్తా. నేను ఆయన్ని చాలా సార్లు దర్శనం చేశాక కాదు చిన్నప్పుడు చూశాను. ఊ. చిన్నప్పుడు నాకు పరదైవత్వం అనే భావన కలిగిందని చెప్పా కదా. ఊ. ఆయన్ని చూసినప్పుడు నాకు ఎప్పుడూ అనిపించే భావన ఏమిటంటే నవ్వులు పూచినట్లు, పసిపాపలు నవ్వినట్లు, ఊ. తల్లులు నడిపినట్లు, తలపులు చదివినట్లు, ఊ. హంసలు నడిచినట్లు, పరమహంసలు నడిపినట్లు, దండపాణిని మార్కున కోదండపాణియే శరణన్న సత్యసాయి వాక్కు సతతము రుకు. ఆహా! అది వేద ప్రమాణంగా నేను భావన చేశా. ఊ. ఒక పసిపాప ఆయన నవ్వు మనోహరం అంటా నేను ఎప్పుడూ. అంటే మనోహరం అంటే చూడటానికి physical level లో చాలా బాగుంటుంది అని. కానీ మనసును హరిస్తుంది. ఊ. మన మనసు ఆయన వశమైపోతుంది. అది. ఆయన దర్శనాన్ని ఒక సంక్షిప్త స్వరూపం ఇంతే. ఊ. అది. ఊ. తర్వాత ఆ రోజుల్లో ఆ ఎవరికీ ముందు కూర్చోబెట్టడం వెనక కూర్చోబెట్టడం అక్కర్లేదు అసలు. ఊ. ఒక చిన్న token ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఊ. ఆ token లో మనము ముందు front row లో కూర్చుంటాం అని అనుకుంటాం. We may be relegated to the background. అది. ఊ. కానీ ఎక్కడ ఉన్నా ఒకటమ్మా భగవంతుడు మానవ దేహం తీసుకొనే వచ్చాడు రాముడు వచ్చినా, కృష్ణుడు వచ్చినా. ఇంకో రూపంలో రాలేదుగా. ఏది రామకృష్ణ అవతారాలు వచ్చేదాకా.వారు కూడా అలా వచ్చినప్పుడు భక్తులందరు ఆయన దగ్గరికి చేరుకోలే, కానీ ఆయన ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి చేరుకున్నారు. That is the beauty of this particular phenomenon. ఉహు ఉహు ఉహు అది. నడిచి వచ్చేవారు. ఉమ్ పధ్నాలుగు ఇరవై నాలుగు వరసలు ఉండేవి. ఉమ్ వాళ్ళందరి మధ్యలో అలా నడుచుకుంటూ సుమారుగా ఒక half an hour దర్శన, స్పర్శన, సంభాషణ. మూడు. అందరితో మాట్లాడలా. ఎవరితో మాట్లాడాలో అవసరమైనప్పుడు I think thirty seconds. That is the maximum. అలాగే స్పర్శన. పాద స్పర్శన అనుకోండి, దగ్గర అనుకోండి. తరవాత దర్శనం అందరికీ. It is open. ఉహు And it is a priceless. అక్కడ ఏం ticket లేదు. అక్కడ ticket లేదు లేదు అస్సలు లేదు అండ్ చాలామంది చాలా ఉద్వేగానికి లోనవుతారు కదా భావోద్వేగం, అపురూపమైన భావోద్వేగం. ఆయన్ని చూడగానే నాక్కూడా అనిపిస్తుంది నేను వాడే పదము లోక లోకాంతర ప్రాణాలు కదిలిపోతాయి. అంటే మనకు తెలియని ఒక ఆ inner chord ఒక్కసారి ప్రకంపనం చెందుతుంది. Yes I am connected with him, I know him అనిపిస్తుంది. I know him at physical level. కనుక మళ్ళీ ఈ నాళ్ళకు కలుసుకున్నామా? ఒక తల్లి ఒక బిడ్డను చూసినప్పుడు బిడ్డ కేరింతలు కొట్టి తల్లి ఒళ్ళోకి పరిగెత్తుకు వెళ్ళిపోతుంది, కౌగలించుకుంటుంది. Express చేస్తుంది. కానీ దానికి కన్నీళ్ళు రావు. ఉమ్ ఇంత ఆనందంలోనూ బిడ్డ దగ్గరకు రాగానే ఏడ్చేది తల్లే. ఉహు బిడ్డ ఏడవదు. ఇక్కడ తల్లి నిబ్బరంగా ఉంటుంది, బిడ్డ ఏడుస్తుంది. ఇది. ఎంత గొప్పగా ఉంది వర్ణిస్తూ ఉంటే. అండ్ మరొక విషయం గురువు గారు. ఆ అక్కడికి వచ్చే వాళ్ళకి చాలా అపారమైన, అంటే నమ్మకం ఎంత కలుగుతుందంటే, నిజంగా అనకూడదు, మనం compare చేయకూడదు గానీ just as a phenomenon చూస్తే భగవంతుడి రూపాలని మనం కొలుచుకున్నప్పుడు, ఆ ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కలిగే భావన కంటే ఎక్కువ ఒక attachment కలుగుతుంది. Correct అది వాస్తవమా గురువు గారు? వాస్తవం. ఎందుకంటే మనం ఉపాసించిన, దర్శించిన, పూజించిన, ఆరాధించిన, ఉత్సవం చేసుకునేటువంటివన్నీ కూడా మూర్తులు అంటే బొమ్మలు. ఆ మూర్తి సజీవమై బ్రహ్మమై మన యందు మన ముందు సంచారం చేస్తున్నప్పుడు ఆ భావోద్వేగం కలిగి తీరుతుంది. తర్వాత వాటన్నింటికంటే ఇప్పుడు రాముడున్నాడు. మన కథ. ఒక వర్ణన. అవును మనం ఎవరో బొమ్మ గీస్తే రాముడు ఇలా ఉంటాడనుకున్నాం. కృష్ణుడు ఇలా ఉంటాడని అనుకున్నాం. ఆ రెండింటిని accept చేశాం. అంతేనా? ఆ flute వేణువు తీసేస్తే రాముడికి కృష్ణుడికి తేడా ఏముంది? ఊ కృష్ణుడి చేతిలో కోదండం పెడితే ఆ రాముడికి కృష్ణుడికి తేడా ఏముంది? కానీ ఇక్కడ కోదండము లేదు, వేణువు లేదు. రెండూ చే-ఖాళీ చేతులుగా ఉన్నాయి. ఊ కానీ అనంత బాహువుల అనంత మహా శక్తి దాని యందు ఉన్నట్టు మనకి అనుభవం కలిగి బొమ్మే మనతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఊ అందువల్ల human emotions arose అవుతాయి. ఉంటాయి అది అత్యంత సహజంగా జరిగిపోతుంది. ఆయనతో అది ప్రథమ దర్శనం కావచ్చు, వంద సార్లు దర్శనం చేసుకున్నా వాడికి అది కలక్కపోవచ్చు. ఊ ఊ రెండూ ఉన్నాయి. ఊ. చుట్టంలో ఉంది. ఊ సృష్టిలో లోపం లేదుగా, లోపమంతా దృష్టిలోనేగా. అది. ఈ సందర్భంలో మీరన్న ఆ మాట మాత్రం నన్ను మళ్ళీ కదిలిస్తోంది నా గు-హృదయాన్ని. ఆ ఆ వారు దర్శనం ఇచ్చిన వారు, ఆ వారు పిలిచిన వారు, ఆ వారికి సన్నిహితులు. ఊ ఇతరుల దగ్గరికి వారే వెళ్తారన్నారు కదా. అవునమ్మా చాలా బలే మాట అన్నారు గురువు గారు. అవునమ్మా. అదే, అది నిజం కూడా. ఊ ఎందుకంటే వారు ఒక ఆ నైరోబి తప్ప ఏ దేశం వెళ్ళలే. ఒకే ఒక్కసారి వెళ్లారు. ఊ ఇది అమీన్ ని కలవటానికి. ఊ కలిస-కలవటానికి వెళ్తే అందరూ భయపడ్డారు. ఈశ్వరమ్మ గారితో సహా. ఊ అతను ఏడడుగులు. ఊ Cannibal. నరభక్షకుడు. ఊ కదా? అవును అటువంటి వాడి దగ్గరికి నేను వెళ్తే నిన్ను తినేస్తాడేమో, వాడు రాక్షసుడి దగ్గరికి పోతున్నావంటే, స్వామి నవ్వుతూ ఏం కాదు నేను వెళ్ళేస్తాను అని వెళ్లారు. ఆ ఇది చాలా గొప్ప సందేశం ఇది. ఆ సరే వెళ్ళేసరికి అక్కడున్న Indians communityకి ఏం చెప్పారంటే, మీరు మీ ఆస్తులని ప్రలోభానికి కావలించుకు కూర్చోకండి, మీ దేశానికి వెళ్ళిపోండి. ఇండియాకి వెని-వెనక్కి వెళ్ళిపోండి. మీ మాన, ధన, మాన, ప్రాణములు మూడు కాచుకోండి. జాగ్రత్త పెట్టుకోండి అన్నారు. విన్న వాళ్ళు వెనక్కి వచ్చేశారు. న-నమ్మకం ఉంటేగా వి-వినేది. అవును ఏదో చెప్పారులే another God man అనుకుని ఉండిపోయిన వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఊ కానీ స్వామి ఈ ఇది అమీన్ దరి-ని చూడ్డానికి వెళ్లారు. అతను రాజ మర్యాదలతో ఆహ్వానం చేశారు బాబాకి. ఊ ఆయన-అతను ఏడడుగులు, స్వామి ఐదడుగుల మూడంగుళాలు. ఊ ఊ అటు ఇటు ఆ పైన పై అంతస్తుకి స్వామిని నడిపించుకుంటూ తీసుకెళ్లాడు. ఊ తీసుకెళ్తే ఇటు డెబ్బై ఐదు మంది స్త్రీలు, అటు డెబ్బై ఐదు మంది స్త్రీలు ఉన్నారు. ఊ వాళ్ళందరూ స్వామికి నమస్కరిస్తున్నారు. ఇతను ఒక్కడే పురుషుడు. ఊ ఎవరు? అమీన్. ఊ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో మాటలు ఏం చెప్పాలో చెప్పారు. వాడు స్వామిని స్వామి దగ్గర ఇలా చేతులు కట్టుకొని తాకటానికి కూడా భయపడి ఏడవటం మొదలు పెట్టాడు. ఆ బుజ్జగించారు. వెనక్కి వచ్చేశారు. వచ్చిన తర్వాత మన బొట్టు వాళ్ళు ఉంటారు కదా. ఊ స్వామి మేం-మేమంతా భయపడిపోయాం. పైగా సత్య సాయిబాబా వారు ఇది అమీన్ ఇంటికి వెళ్లారు అంటే ఆ లోకం ఏమనుకుంటుందో అని భయపడుతున్నాం అని అంటే, ఒక మాట చెప్పనా? నేను వెళ్తున్నప్పుడు అటు డెబ్బై ఐదు మంది, ఇటు డెబ్బై ఐదు మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరూ అతని భార్యలు. ఊ నూట యాభై మంది భార్యలని ఒకే తాటి మీద నడిపించినటువంటి వాడు అతను. ఊ ఆ ఊ ఆ మా మీరేమో ఒక భార్యతోనే బతకలేకపోతున్నారు. చాలా నేర్చుకోండి. అబ్బబ్బబ్బబ్బా! ఎంత చమత్కారంగా! చమత్కారంగా. కాబట్టి అక్కడికి ఒక భగవత్ తత్వం ఒక మాలిన్యం ఉన్నటువంటి, మనం మాలిన్యం అంటాం. భగవంతుడికి మాలిన్యం ఏంటి? ఊహూ ఆ ఆవరణంలోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ మాలిన్యం ఉన్నా కానీ అదొక పవిత్రతను సంతరించుకుంటుంది. ఆ తర్వాత కాలంలోఆ ఇదీ అమీన్ ప్రవర్తనలో వచ్చిన మార్పు చూసి ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి చెందినియి ఉమ్ ఎంతకంటే ఏం కావాలి? అంతే అదే నిదర్శనం వారి అది నిదర్శనం వారి శక్తి ఎంతకంటే మిరకిలేం ఉంటుంది ఏం కావాలి ఇంకా మిరకిల్ అంటే ఉంగరం బొంగరం ఇవ్వటం కాదు కదా అవును ఉమ్ కానీ వెళ్లాలన్న స తలంపు ఎలా వచ్చిందో స్వామికి అంటే అంటే ఆయన విజు ఒక దర్శనం ఆయనకి ఒక thought వచ్చింది Indian communities sure to undergo a massive suffering అని ఉమ్ అది alleviate చేయటానికి వెళ్లారు ఉమ్ అదొక్కటే purpose. మళ్ళీ వెనక్కి వచ్చేశారు మళ్ళీ ఆయన ఏ country వెళ్ళలా విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ఉన్న నూట ఎనభై ఎనిమిది దేశాలు ప్రశాంతి నిలయానికి చేరుకున్నాయి ఉమ్ అది అది తాను కదలక సర్వాన్ని కదిలించేదే బ్రహ్మతత్వం ఇది నిరూపణ అయింది వారిని అర్థం చేసుకున్న మీకు సాదర నమస్కారాలు గురువు గారు ఆ అంటే ఉమ్ ఇంత విషయాన్ని మీరు process చేయాలంటే ఎంత పదునైన ఆలోచనే కాకుండా ఎంత మనసు ఎంత హృదయం ఉండాలి వీటన్నిటినీ చూ-చూడగలిగే ఆత్మతత్వం ఉండాలి గురువు గారు ఆ మీరు చూసినందుకు మీకు కోటి నమస్కారాలు మా శుభం గురువు గారు ఉమ్ ఎప్పుడైనా మీరు అంటే ఇంత సన్నిహితంగా ఒక భగవత్ స్వరూపులకి దగ్గరైన తర్వాత ఎప్పుడైనా ఒక visit లో వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినా కొంచెం తక్కువ చూసినా ఒక చిన్న అభద్రత లాంటిది తల్లిదండ్రుల దగ్గర అందరి దగ్గర వస్తుంది ఎక్కడో అక్కడ మీకెప్పుడైనా అలాంటి భావన కలిగిందా స్వామి దగ్గర లేక అటువంటి భావన కలిగిన భక్తులు ఉండి ఉంటారా అంటే మీరు భక్తులు కాకపోయినా వారితో సహ ప్రయాణికులు అని నేనంటాను అట్లా కలిగి ఆయన్ని వదిలిపెట్టి వెళ్లిపోయిన వాళ్ళున్నారు ఉమ్ అంటే identity crisis నీ మనసుకు ఏర్పడినప్పుడు అమ్మ తల్లిదండ్రుల దగ్గర కూడా ఏర్పడేది దాని వల్లే. నన్ను చూడలేదు అని కదా when-when I possess స్వామి నాకు ఇబ్బందులు ఉంటాయి ఉమ్ When Swami possesses me, I have nothing to worry about. అంతే కదా! నన్ను ఆయన own చేసుకున్నారనుకో ఇక నాకేంటి కావాలి? ఉమ్ నాకేది మంచిదో నాకేది చెడుపో నాకంటే బాగుగా నా స్వామి కెరుక. అతని చేరిన వారికి అతడాయే తల్లిదండ్రి అతని బిడ్డను నేను ఇతరము నాకేల ఉమ్ అంతే. అసలు అటువంటి సందర్భమే నాకు రాలేదు ఉమ్ ఆ సందర్భాన్ని అర్థం చేసుకోగలం ఉమ్ కానీ ఇదేదో అర్థం చేసుకున్నాం ఏదో ఐదు లక్షల మంది ఉన్నారు నన్ను పిలవలేదు నావైపు చూ-- ఈ ఆలోచనే రాకుండా ఎన్ని లక్షల మంది ఉన్నా ఆయన నాతో ఉన్నారు ఉమ్ నేను వారితోనే ఉన్నా ఉమ్ విచిత్రం ఏంటంటే చాలామంది చెప్తారు నేను అక్కడ కూర్చొని బాబా ఈ వేళ నన్ను పలకరించాలి అని ప్రార్థన చేశాను చేశానో లేదో వచ్చారు అంటారు. దాన్ని నేను ఏమి deny చేయును ఉమ్ కానీ ఆ ఈవేళ స్వామి గురించి అనే చెప్పాలనుకున్నాను కనుక చాలా honest గా చెప్తున్నాను స్వామిని నేను ఎన్నడూ ఇది నాకు కావాలి అని ప్రార్థన చేయలేదు ఉమ్ ఇదే నిజం. అంటే నావైపు రావాలి నాతో మాట్లాడాలి ఈ కోరికలు లేవు అసలు నాతో ఏం మాట్లాడాలి? మాట్లాడవలసి వస్తే ఆయనే మాట్లాడతారుగా. ఒకవేళ నేను మాట్లాడాను అనుకో how does it matter? నేనేం మాట్లాడతాను నా గురించి మాట్లాడుకుంటా it has nothing to do with the world. So ఇది clarity ఉన్నప్పుడమ్మా నన్ను అలక్ష్యం చేశారనో నన్ను పిలవలేదనో నాకేదో ఒక ప్రత్యేకత ఉందనో అనుకున్నానంటే నాకు అహం ఉన్నట్లేగా ఉమ్ మనం అనుకున్నట్లు అహంకారం ఉంటే గురువు దొరకడు. గురువు దొరికాక అహంకారం ఉండకూడదు it is a hallmark ఉమ్ అంతే hallmark అది అంతే ఆహా! ఉమ్ గురువు గారు ఉమ్ స్వామిని కలిసే సందర్భాలు మీకు ఎలా ఏర్పడేవి అంటే కార్యక్రమాల రూపంలో ఏర్పడేవా లేక వారి నుంచి భౌతిక పిలుపు వచ్చేదా లేకు మీకు-మీకు స్ఫురణ కలిగి మీరే వెళ్ళిపోయేవారా? అనేక ఉండేవా? ఏం లేదు. మీ అమ్మాయికి ఆ వాళ్ళ అమ్మని చూడాలనుకుంటేగా నీ దగ్గరికి వచ్చేస్తుంది ఉమ్ ఉమ్ అంతేగా అంతే. నేను ఇంకొక ప్రత్యేకమైన విశేషం చెప్తా ఉమ్ స్వామి birthdays ఎనభై ఆరు ఈ ప్రపంచంలో జరిగినాయి ఉమ్ దాన్లో వారికి ముప్పై ఆరు ఏట నేను వారి దర్శనం చేసుకున్నా అంతే కదా ఉమ్ ముప్పై ఆరు నుంచి ఎనభై ఆరు అంటే యాభై birthdays జరిగినాయి ఉమ్ నేను ఒక ఐదో ఆరో వెళ్ళి ఉంటా ఉమ్ ఎందుకని అంటే స్వామి birthday నాడు నాకు ఇక్కడ చాలా పని ఉండేది ఉహు నేను ఇక్కడ చేయవలసిన పని ఎక్కువుండేది. ఓ సత్సంగం అనొచ్చు, meeting అవ్వొచ్చు లేదా నా personal ఉండొచ్చు. వాటిని ఎప్పుడూ నా కర్తవ్యాన్ని నేను నిర్వ-- విస్మరించలేను. కాబట్టి birthday function అయ్యాకన్నా వెళ్ళేవాడిని. కుదరదు అనుకుంటే ముందే వెళ్లి వచ్చేసేవాడిని. ఆ వెళ్లి రావటానికి నేను కూడా వెళ్ళాలి కదా birthday కి. వెళ్ళకపోతే ఏమైపో-- ఏమీ కాదు. ఏమవుతుంది? నేను వెళ్ళినప్పుడు అట్లాగే ఉన్నాను, వెళ్ళనప్పుడు అలాగే ఉన్నాను. కార్యక్ర-- అంటే కార్యక్రమాల వలన నేను వెళ్ళలా ఇది సత్యం ఉమ్ ఒక పెద్ద stadium ఆవిష్కరణ లేదు పెద్ద స్థూపం ఆవిష్కరణ ఓ పెద్ద శాంతి వేదిక నిర్మాణం ఇటువంటి ప్రధాన ఘట్టాలలో నేను అక్కడ ఉండాలి అని నాకు ఏం పెద్ద కోరిక లేదు ఉమ్ ఉమ్ ఇక్కడ నేను లౌకిక ధర్మాన్ని నేను నిర్వర్తించాలి గనుక ఆ నేను దాని పట్ల అపేక్షతో వెళ్ళా. రెండోది, ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కేవలం చూసి వచ్చేద్దాం అని వెళ్ళిపోయేవాడిని. దానికి పెద్ద అంత ప్రేరణ అదేదో ఒక భావోద్వేగం కలగటం అట్లా కాదు. నెలకొకసారి వెళ్ళేవాడిని మిమ్మల్ని ఏమని పిలిచేవారు ఆ స్వామి? నన్నా? [laughing] చాలా మంచి ప్రశ్న వేశారు. అందరినీ బంగారు అని పిలుస్తారు కదా నన్నెన్నడూ బంగారు అని పిలవలే ఆ ఆహా! పేరు పెట్టి పిలిచేవారు. కానీ నా ప్రస్తావన మూడో మనిషి దగ్గర వచ్చినప్పుడు అంటే హైదరాబాద్ నుంచి very senior devotees ఒక నలుగురు, ఐదుగురు group వెళితే "ప్రసాద్ ఎలా ఉన్నాడు?" అనేవాళ్ళు. ఎవరా ప్రసాద్? ఎంతమంది ప్రసాద్ లు ఉన్నారు ఈ ప్రపంచంలో? అంటే వీళ్ళకి తికమక పడిపోయేవారు. కష్టం కదా how to identify whom he is referring to question. ఓ సారి ఒక పెద్దాయన, పెద్దాయన అంటే ఎవరో మా బి.వి. రమణ రావు గారుస్వామి మీరు వచ్చినప్పుడల్లా హైదరాబాద్ ప్రసాద్ అంటున్నారు. మన మూర్తి ఆయన ప్రసాద మూర్తి కాదు కదా ఆయన శ్రీరామచంద్రమూర్తి. మీరు మూర్తి అంటే మాకు అర్థం అవుతుంది కదా. లేదు లేదు ఒక జన్మలో ఆ పేరు నేనే పెట్టాలి. ఆహా! కాబట్టి అలా నన్ను మూర్తి అని చక్కగా పిలిచేవారు. గురువు గారు. ఉమ్. ఇక్కడ ఆ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను అనుకోకండి. అవును. కానీ మన ఓషో రజనీష్ ఒక మాట అన్నారు ఒక సందర్భంలో మనం ఎక్కువగా స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఉంటాం. ఉమ్. మన విచక్షణ, వివేకం, మనసు, స్పందన ఇవి రెండూ విడిపోయి ఉంటాయి అని. అంటే ఈ విడిపోవడం వల్లే మనకి అప్పుడప్పుడు డౌట్ కలుగుతుంది. అవును. ఏంటి మనం ఏం చేస్తున్నాం మనం అసలు మన జీవితంలో అని మనమేంటి అసలు భగవంతుడు ఉన్నప్పుడు మనం ఒక మానవ రూపాన్ని నమ్మడం ఏంటి అని అటువంటి ఆ సంఘర్షణ ఏ రోజైనా మీకు కలిగిందా? స్వామి పట్లనే కాదు అసలు మానవ రూపం ఉండడం ఏంటి భగవంతుడికి అని. ఇది ఈ ప్రపంచానికి చాలా విలువైన తెలుసుకోవలసినటువంటి ప్రశ్న. గురువు గారు. అంటే మీరు నన్ను చాలా మర్యాదగా అడిగారు. ఎట్లా అంటే మీరు ఆయన్ని ఎలా దర్శనం చేశారు అని అడగబోయి ఇలా అడిగారు అంతే కదా. అంతే కదా గురువు గారు. నేను ఆ అత్యంత నిజాయితీతో చెప్పే మాట భగవంతుడిగా నమ్మి గనుక ఉంటే. ఉమ్. అనుకొని ఉండటం వేరు, చూడటం వేరు. నేను ఆయన్ని ఒక ఉదాత్తమైన మర్యాద పురుషుడిగా చూశాను. దైవం కంటే కూడా. దైవం అంటే ఒక మనోభావన అది నేను అనుకునేది. కానీ నా కట్టెదుట కనిపిస్తుంటే ఒక ఈశ్వరుడు గురువై కనిపిస్తున్నప్పుడు ఒక దేహంలో మానవ మాత్ర దేహంతో కనిపిస్తున్నప్పుడు నేను ఆ పరిధి దాటి అసలు ఎందుకు ఆలోచించాలి. ఉమ్. అది. భాగవత ప్రమాణంలో దైవీ లక్షణాలు చాలా ఉన్నాయి. పద్దెనిమిది లక్షణాలు ఉన్నాయి. ఆ పద్దెనిమిది లక్షణాలు ఒక దైవానికి ఉన్న లక్షణాలు ఈ మూర్తిమత్వం ఉన్నటువంటి స్వామి లో నేను అనుభవించాను. ఉమ్. కనుక మానసికంగా నాకు ఆయన దైవం, పరదైవతం. లౌకికంగా మర్యాద పురుషోత్తముడు. కాబట్టి నేను దేన్ని ఫాలో అవ్వాలి? ఆ పద్దెనిమిది గుణాలలో కొంతైనా నేను కూడా పొందాలనే ఒక సాధన. అది ఒకటి. అది వైయక్తికం. నాది individualistic. బట్ ఆయన్ని ఒక ఉదాత్త మానవుడిగా గనుక చూసినట్లయితే నా జీవితం బాగుపడుతుంది, నా చుట్టూ ఉన్నవారిని నేను ప్రభావితం చేయగలుగుతాను. ఎందుకంటే నేను ఎన్నటికీ దైవాన్ని కాలేను. ఉమ్. అంటే నేను సత్య సాయిని కాలేను, కాకూడదు. ఎందుకంటే "let there be only one Sathya Sai Bai another one" కదా. ఉమ్. కాబట్టి నేను నేనుగా నేను ఒక జన్మ తీసుకుని వచ్చాను కాబట్టి ఒక ఈశ్వర సన్నిధానంలోకి వెళ్ళాను కాబట్టి నా భావాలను humanize చేసుకుని spiritualize చేసుకుంటూ divine చేస్కుంటూ గనుక ప్రయాణం చేయగలిగితే చాలు. కాబట్టి నాకు ఆయన దైవం కంటే కూడా సర్వోత్తమమైనటువంటి మానవుడు. రాముడు ఏమన్నాడు? లోకం మొత్తం రామాను నారాయణ మూర్తివే ఆయన స్పురణ తెచ్చినప్పుడల్లా కాదు కాదు నేను మానవుడిగా వచ్చాను, మానవుడిగా ఉంటాను అన్నాడు ఆయన. ఉమ్. తప్పేం లేదు దాంట్లో. అసలు ఒకసారి పురాణ వాంగ్మయం అంతా చదివితే మన పురాణ పురుషోత్తములంతా మానవ దేహం తీసుకుని వచ్చారు. లేకపోతే ఎలా connect అవుతారు మనతో. అవును. ఇప్పుడు శ్రీ, మత్స్య, కూర్మ, వరాహ, వటు, నారసింహ ఇలా వచ్చినాయి కదా. అవును. ప్రమాణం. అవి మనం చేపతో మాట్లాడలేం. చేప మనతో మాట్లాడితే దానికి శక్తి ఉండొచ్చు గాక. కానీ మన భాష దానికి తెలుసు, దాని భాష మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఈశ్వర భావనలోకి వెళ్లాలంటే నేను కూడా ఆయనలో ఉన్నటువంటి మానవతా కోణాన్ని నేను గనుక అర్థం చేసుకోగలిగితే దానికి నేను acclimatize కాగలిగితే నాకు సత్య సాయి యొక్క స్వరూపం తెలుస్తుంది. లేకపోతే తెలియదు. ఉమ్. లేకపోతే నేను చైత్య పురుషుడు, మహాపురుషుడు, పురాణ పురుషుడు, కలియుగకే అవతార ఇవన్నీ నా భావోద్వేగంతో నేను మాట్లాడొచ్చు గాక. కానీ మానవ జన్మ ఎత్తినటువంటి ఒక వ్యక్తి అంటే వ్యక్తమైనదే వ్యక్తి కదా. ఉమ్. పురుషుడా స్త్రీయా పక్కన పెడదాం. అవును, అవును. ఆ వ్యక్తి తనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఎలా radiate చేస్తున్నారు ఈ ప్రపంచానికి అనేటువంటి ఆ భావన వైపే నా మనస్సు సాగింది గనుక దర్శనం లేదు. గురువు గారు but మనకి చెప్పబడింది చాలా intense inner experiences అవుతాయి. అంటే outward గా మనం ఊగిపోవడం అలాంటివి కాదు నేను చెప్పేది. inner connection చాలా deep గా ఒక consciousness ఇంకో consciousness కి ఇలా ముడిపడి ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయని చెప్పబడింది. అవన్నీ కేవలం ఒక మానసిక స్థితి అంటారా గురువు గారు చాలామందికి ఏర్పడేవి. మానసికంగా మనకు అనేక layers ఉన్నాయి కదమ్మా. మనసుకు అది ఒక్క పొర కాదుగా అనేక పొరలు ఉన్నాయి. ఆ. ఒక్కొక్క పొరలో ఒక్కొక్క చోట మనం react అవుతూ వెళ్తాం. ఇప్పుడు దీనిలో నా వరకు నన్ను అడిగినట్లయితే స్వామి ఆ దేహం వదిలిపెట్టినప్పుడు. ఉమ్. వారి క్రియలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రశాంత నిలయంలో నాకు ఇవ్వబడిన డ్యూటీ ఏమిటో తెలుసా? దూరదర్శన్ లో కూర్చొని బాబా గురించి మాట్లాడటం. మాట్లాడగలుగుతామా యాభై నాలుగేళ్ళ సుదీర్ఘమైనటువంటి ఒక ప్రయాణంలో భావోద్వేగం కలగాలి కదా. నాక్కూడా కళ్ళెమ్మట మళ్ళీ ఆయన్ని చూడలేనని ఒక విషాదం కమ్ముకోవాలి కదా. అవును. లేదు. ఆ క్షణంలో కూడా గండ శిల వలే ఉండగలిగా. అది ఆధ్యాత్మికమైన training. అది మనం కావాలంటే రాదమ్మా. భావోద్వేగాన్ని అణచుకోగలిగిన వాడు ఎవడో చూపించండి. లేదు. అందునా సచివుడు, బాంధవుడు, మిత్రుడు, దైవతం, తండ్రి, తల్లి, గురువు, దైవం అని ఇన్ని భావనలున్న ఒక వ్యక్తి శరీరాన్ని వదిలిపెట్టి ఈ ప్రపంచంలో ఆయన కనపడరు అన్నప్పుడు నేను ఆ visuals అన్నీ చూస్తూ నేను మాట్లాడా దూరదర్శన్ లో. ఇక్కడే ఉన్నా నేను. నేను అనుకున్నా నా పని ఇక్కడే ఉంది అక్కడ కాదు. అక్కడ నేను చేసేది ఏం లేదు. అబ్బా! అసలు-- కానీ గురువు గారు భావోద్వేగాలని అలా సమన్వయ పరచుకోవాలి లేకపోతే సమాధాన పరచుకోవాలి దాన్ని అలా మితంగా అని ఒక ఎత్తయితే ప్రేమ కూడా భావోద్వేగమే కదా గురువు గారు కాదా?మనం దివ్య ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం కదా దివ్య ప్రేమ భావోద్వేగ- భావోద్వేగానికి అతీతమైంది. భావాతీతం త్రిగుణ రహితం తత్వమస్యాది లక్ష్యం కదా. అవును అది గురువు బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి అది. అక్కడ ఆ స్థాయికి వెళ్ళినప్పుడు అమ్మా ఈ విషాదం ఉండదు వాస్తవం అననే ఇది వాస్తవం అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఇంక ఇది వాస్తవం అవునో కాదో అన్నప్పుడు దుఃఖమో ఆనందమో కలుగుతుంది. ఎదురుచూపు ఉంటుంది. ఇది వాస్తవం అని అది వాస్తవిక స్థితిలో మనసు నిర్ణయించుకున్నప్పుడు ఆ మనసును దాటారుగా మీరు. అప్పుడు ఏం లేదుగా. స్వామి మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం అనిపిస్తోంది. ఒక అత్యంత తేజోమయమైన ఒక స్వరూపం గాని కాంతిని సూర్యున్ని చూడాలంటే మనకు కళ్ళు స- చాలు అది తట్టుకోగలిగిన శక్తి ఉన్న వాళ్లే రాగలుగుతారు ఆ పరిధిలోకి. అది తట్టుకోగలిగిన ఆత్మ పరిణితి మీకు ఉంది కాబట్టి మిమ్మల్ని వారక్కడ కాస్త సేద తీరి హాయిగా ఉండొచ్చేమో అని మిమ్మల్ని పిలిచారేమో అని అనిపిస్తుంది. దీన్-దీన్ని నేనేం ఖండించటంలే. చాలామంది మన బాలమురళి కృష్ణ వాళ్ళ లాంటి మహాత్ములు చాలా చాలా పెద్ద వాళ్ళు జీవితంలో అలాగే పుష్పగిరి పీఠాధిపతి ఆ విజయాంధ్ర సుమ్మ భారతీ స్వామి వారు. వీళ్ళందరూ కూడా స్వామి వాళ్ళంతా పీఠాధిపతులు స్వామి యొక్క స్పర్శ వాళ్ళకు అక్కర్లేదు మాట్లాడరు general గా కానీ వాళ్ళు నన్ను చూడగానే స్వామి గురించి అడిగేవారు. అంటే నేను ఆ సత్యాన్ని చెప్తాను నేను సత్యాన్నే చెప్తాను. ఆయన చుట్టూ నేను ఒక myth చెప్పను. ఆయన చుట్టూ ఒక మాయ మహిమ కల్పనాత్మకమైన ఒక భావం అవేమీ ఉండవు. ఏముంటాయి అంటే what I felt what I experienced within that alone I express. బహుశా స్వామి నాకు ఆ అవకాశం ఇచ్చి ఉంటారు అంతే. అంతే Very beautiful గురువుగారు అంతేనమ్మా. సైరాం స్వామి
YouTube · audio
ఆ ఉపాధికి అవకాశం భగవంతుడే ఇస్తాడు - Full Interview | Sathya Sai Baba Spl | Epi 5
ఆ ఉపాధికి అవకాశం భగవంతుడే ఇస్తాడు - Full Interview | Sathya Sai Baba Spl | Epi 5
Source: iDream Media on YouTube
0:00 / 27:04
More in this series
Remembering Sri Sathya Sai Baba — Aaraadhanaa Mahotsavam interviews
-
26 min 2 Remembering Sri Sathya Sai Baba on his 11th Aaraadhanaa Mahotsavam- Full interview- Epi-2
-
38 min 3 సమస్తలోక సుఖినోభవంతు..ఇదొక్కటే ప్రార్ధన | Full Interview- Sathya Sai Baba Special | Epi 3
-
25 min 4 యజ్ఞం చేయాల్సింది మీరు..చేయించేది ఆ స్వామి - Full Interview | Sathya Sai Baba Spl | Epi 4
-
26 min 5 ఆ ఉపాధికి అవకాశం భగవంతుడే ఇస్తాడు - Full Interview | Sathya Sai Baba Spl | Epi 5
Now playing -
20 min 6 భగవాన్ చెప్పిన18 పురాణాల సారం ఇదే..- Full Interview | Sathya Sai Baba Spl | Epi 6
-
25 min 7 ఘంటసాల పాదాలను ఒత్తుతూ భగవాన్ కనిపించారు- Full Interview | Sathya Sai Baba Spl | Ep7
-
20 min 8 సత్యసాయి బాబా లాగా జీవించగలిగితే..అంతా ఆనందమే - Full Interview | Sathya Sai Baba Spl Ep8