No transcript for this section.
Transcript begins at 0:00.
ఓ హిందూ మేలుకో! ఇది మనకి మేలుకొలుపు. ఈ మేలుకొలుపు దేనికి అంటే మేలిమలుపు కోసం. నిజానికి ఇది మేలి తలపు కూడా. మేలు కలిగించేటువంటి ఒక దివ్యమైన తలపు. ఇది హైందవాన్ని మనం మతంగా కాక ధర్మంగా గనక స్వీకరించినట్లయితే, ఇది మతప్రచారం కాదు, ఇది మత పరిరక్షణ కాదు. హైందవమైనటువంటి ఒక ధర్మాన్ని మనం గనక కాపాడుకున్నట్లయితే, ధర్మో రక్షతి రక్షితః. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి ఉద్దీపన వాక్యం ఇది. మనల్ని ఉత్తేజపరుస్తుంది, ఉద్వేగపరచదు. ధర్మాన్ని గనక నువ్వు రక్షిస్తే ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ఇది అచ్చ తెలుగులో దీని అర్థం అదే. కానీ కాస్త ఆలోచించినట్లయితే ధర్మాన్ని మనం రక్షించగలమా అని. రక్షించాలి. రక్షించటం అంటే ముందు మనం ఆచరించటం మొదలు పెట్టాలి. అదొకటి ఉన్నది అని నమ్మాలి. ఆ విశ్వాసం పునాదిగా మన ఆచరణాత్మకమైన కార్యకలాపాలు సాగాలి. సాగినట్లయితే, చూడండి ప్రకృతిని గనక జాగ్రత్తగా గమనించినట్లయితే, It has a season and it has a reason. మనిషికి కూడా సీజన్ ఉంది, reason ఉంది. ప్రకృతి మాత్రం పాటిస్తున్నది, మనిషి మాత్రం మర్చిపోయినాడు. కనుకనే మనిషి ద్వారా ఏర్పడినటువంటి ఈ ప్రకృతి ఏదైతే ఉన్నదో అది నిత్య ఘర్షణకు లోనవుతున్నది, అతలాకుతలం అవుతున్నది, అశాంతిధామం అవుతున్నది. అస్పష్టత, అనాచారం, అవిద్య, అహంకారం, దంభం, అభిజాత్యం వంటి అనేకమైనటువంటి వ్యతిరేక భావాలు ప్రపంచం నిండా పరచుకుని ఆవరించి, ఆవహించి ఉండటానికి కారణం మనిషి తన ధర్మాన్ని తాను విస్మరించటమే. తాను చేయవలసినటువంటి పనిని తాను సకాలంలో సరైన రీతిలో సర్వజనామోద యోగ్యంగా సర్వజన మనోల్లాస పులకిత పుంభణంగా అంటాం. అంటే అందరికీ ఆనందం కలిగించే రీతిలో సర్వహితంగా, సర్వ సమ్మతంగా మనం గనక చేయకపోయినట్లయితే ఏమైపోతుంది ఈ జాతి అని అనుకున్నప్పుడు మనకి ప్రకృతి చూడండి వసంత కాలం రాబోతున్నది. శంభు జ్ఞాన వసంత సంగినీ హృదారామీయ ఖజీర్ణచ్ఛదా। స్రస్తా భక్తిలతాచ్ఛదా విలసతా పుణ్యప్రవాళ శ్రతాః। దీశ్యంతే గుణకోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనా। జ్ఞానా ఆనంద సుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. అంటే వసంత కాలం శంభువు అని పిలవగానే వసంత కాలం ఆగమిస్తూ ఉన్నది. ఆ వస్తూ ఉండగానే అప్పటివరకూ ఆ చెట్టులో ఉన్న పండిన, ఎండినటువంటి ఆకులన్నీ కూడా రాలిపోయి ఆ ప్రదేశంలో నెమ్మదిగా చిగుళ్లు మోసులెత్తుతున్నాయి. ఆ మోసులెత్తుతున్నటువంటి చిగుళ్ల మధ్యలో గుణకోరకాలు, మూడు గుణాలు అనబడేటువంటి మొగ్గలు పుడుతున్నాయి. కాలక్రమంలో, పరిణామ క్రమంలో ఆ మొగ్గలన్నీ వికాసమానం చెందుతున్నాయి. ఎట్లా వికాసమానం చెందుతున్నాయి? జప వచః పుష్పాచ్ఛ సద్వాసనాహ। వాటి యందు దాగి ఉన్నటువంటి సొబగులు, సౌందర్యాలు, పరిమళాలు తెల్లవారేసరికి ఆవిష్కృతమవుతున్నాయి. వగరుగా ఉన్నటువంటి మొగ్గ పువ్వై ఆ పువ్వు ఇంత ఆనందాలని మధుశ్చ మాధవశ్చ వసంతీకావృతమ్ అన్నది వేద ప్రమాణమైన మాట. అంటే ఇవన్నీ కూడా వసంత కాలంలో ఒక మధువుని చుమ్ముతూ వస్తున్నాయి. అంతే కాదు ఈ పూలే నెమ్మదిగా కాయలై, పండ్లై నెమ్మదిగా జ్ఞాన ఆనంద సుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి. జ్ఞానము అనేటువంటి ఆనందం అనేటువంటి సెలయేరులో ఏదో ఒక పండు అలా వెళుతూ ఉన్నది. ఆ పండు ఏమిటంటే సంవిత్ అనేటువంటి ఫలం. సమగ్రమైనటువంటి విద్య. The all knowing all pervading ఆత్మ అంటామే దానిని ఆ ఎరుకలోకి వెళ్లగలిగినటువంటి ఒక దివ్య భావనా గరిమ. వీటన్నింటిని కూడా గమనించినట్లయితే శంకర భగవత్పాదులు వారికంటే ముందు వచ్చినటువంటి మహాఋషులు, వేదమూర్తులు వీరంతా కూడా ప్రకృతిని, పరమాత్మని, జీవుడిని అంటే జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు మూడు ఒకటే అనేటువంటి ఒక భావనలో నిలకడ చెందించారు. మనకి జీవుడు వేరు, జగత్తు వేరు, జగదీశ్వరుడు వేరు. జగదీశ్వరుడు ఎక్కడో ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆకాశంలో చూపిస్తాం ఇంకెక్కడా లేనట్లు. మనల్ని మనం మన ఎస్టీమ్ నుంచి పడగొట్టుకుంటాం, కించపరచుకుంటాం, నే పాపిని అంటాం. హైందవ ధర్మంలో నేను పాపినన్న భావన లేదు. నువ్వు దివ్యాత్మవి, నువ్వు ప్రేమాత్మవి, నీవు పూర్ణమైనటువంటి మాధవుడివి ఎరుక కలిగితే. ఆ ఎరుకలోకి వెళ్ళటానికి ఇవిగో సాధనా మార్గాలు. అందులో ప్రధానమైనటువంటి ధర్మాన్ని గనక ఆచరించినట్లయితే, ధర్మాన్ని గనక నువ్వు అనుక్షణము స్పురణలో ఉంచుకోగలిగినట్లయితే, ధర్మబద్ధమైనటువంటి కర్మలు గనక నువ్వు చేయగలిగినట్లయితే అప్పుడు నీకేం కలుగుతుందో తెలుసునా? ఒక రక్షణ. ఒక బలమైనటువంటి ఆంతరంగిక శిక్షణ. ఇవన్నీ కూడా ఏర్పడతాయి. చూడండి ధర్మం ఎటువంటిది అంటే అది ఒక ఆతపత్రం అంటే గొడుగు. ఎండాకాలము ఆ గొడుగే ఒకే గొడుగు ఎండాకాలంలో ఎండ నుంచి కాపాడుతుంది, వర్షాకాలంలో వర్షం నుంచి కాపాడుతుంది. గొడుగు మారటంలా. ధర్మం మారటంలా. అవసరాలు మారుతున్నాయి. సమాజం ఒక పరిణామక్రమంగా వెళుతూ ఉంటుంది. దాని ప్రవాహం వేరు, దాని మలుపులు వేరు, దాని విలువలు వేరు, అది ధరించే ఒలువలు వేరు, దాని సొబగులు వేరు.అది అనేకమైనటువంటి పల్లం వైపు ప్రవహిస్తూ ఉన్నప్పటికీ కూడా అనేక ఇబ్బందులకు గురవుతుంటుంది. అనేక దురాచారాలు అనుభవంలోకి తెచ్చుకుంటుంది. కానీ ముందుకు సాగుతూ ఉంటుంది. కానీ ఒక అంతర్వాహినిగా ఒక అంతర్గతమైనటువంటి ఒక వేగధారగా ధర్మం మాత్రం మారదు. మారేది ధర్మం కాదు. ధర్మం యొక్క స్వరూపం అనేకమైనటువంటి విలువలై, విలువలు అవసరాలై, అవసరాలు సాంప్రదాయాలై, సాంప్రదాయాలు ఆచారాలై, ఆచారాలు మౌఢ్యాలై జీవితాన్ని వెనక్కి నడపతే ఏమోగానీ ధర్మం మాత్రం మూలమైనటువంటి వస్తువు తాను అక్కడే అట్లాగే ఉండి అన్నింటి యందు కూడా తాను ప్రవహిస్తూ అన్నింటినీ సరిచేస్తూ సమన్వయం చేస్తూ ప్రతి మలుపులోనూ ఎంత వేగం ఉండాలో అంత వేగాన్ని ఇస్తూ జీవన ప్రవాహాన్ని నడిపిస్తూ ఉంటుంది. కనుక ధర్మో రక్షతి రక్షితః. ధర్మము అనగానే మన మనస్సులో మన హృదయంలో మన కట్టెదుట కళ్ళముందు ఒక్క వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తిని మనం దైవంగా భావన చేశాం. సమస్త జాతి భావన చేసింది. ఆయన ఎవరో కాదు. రఘువంశ స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయాలి. వెళ్ళబోతున్నాడు. వెళ్లి తన తల్లి అయినటువంటి కౌసల్య దేవి దగ్గరకు వెళ్ళి, "అమ్మా! తండ్రి ఆజ్ఞ ప్రకారం నేను వనవాసానికి వెళుతున్నాను. ఈ కాంతార వాసంలో నా ప్రయాణము, నా యజ్ఞము, నా తండ్రి ఆజ్ఞ పరిపూర్ణంగా ఏ రకమైనటువంటి అడ్డంకి లేకుండా దిగ్విజయంగా పూర్తయి మళ్ళీ నేను అయోధ్యకి రావాలి. అట్లా జరుగుతుందని ఆశీర్వదించమ్మా" అని గాడు-- అని అడిగాడు కౌసల్యను. కౌసల్యను రాముడు అలా అడగ్గానే కౌసల్య ఒక్క క్షణం తన మాతృ హృదయాన్ని ఆవిష్కరిస్తూ "రామా పద్నాలుగు సంవత్సరాల కాంతార వాసంలో నాయనా, నువ్వు వెళ్ళబోతున్నటువంటి ఈ వేళ ఒక తల్లిగా నీ ఆకలి తీర్చటానికి ఒక ముద్ద ఇస్తే అది ఒక పూటతో, ఒక్క క్షణంతో అయిపోతుంది అది. తినే పదార్థాలు ఏవన్నా ఇస్తే కాలగమనంలో చెడిపోతాయి. ఎప్పుడూ నువ్వు తింటూ ఉండే, ఎప్పుడూ నువ్వు అనుకుంటూ ఉండే, ఎప్పటికీ చెడని ఒక పదార్థాన్ని నీకిస్తాను. ఆ పదార్థం పేరు ధర్మం. ఆ ధర్మాన్ని ఇదిగో నాయనా, రాఘవా! నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. దీనిని ఆలంబన చేసుకో. పద్నాలుగు సంవత్సరాలు నీ అరణ్యవాసాన్ని పూర్తి చేసుకో నాయనా." అని ఇచ్చింది. ఇది రామాయణాంతర్గతమైనటువంటి ఒక భావన. మామూలుగా తల్లులు కొడుకులం, మనబోటి వాళ్ళం ఏదన్నా ఊరు వెళుతుంటే ఆ దారిలో తినటానికో, వెళ్ళిన తర్వాత తినటానికో కొంత పదార్థం తయారుచేసి "నీ దగ్గర ఉంచుకో"మని ఇస్తుంది. కౌసల్య దేవి చెడిపోయే పదార్థం ఇవ్వలేదు. చెడని పదార్థం అయినటువంటి ధర్మాన్ని రాముడికి అప్పజెప్పింది. కనుక నువ్వు ధర్మాచరణ చెయ్. అధర్మాన్ని అణచివేసేయ్. ధర్మాన్ని గనుక నువ్వు ప్రతిష్ఠాపన చేస్తూ ఎక్కడ ధర్మం నిలబెట్టవలసి ఉన్నదో దానిని నువ్వు నిలబెడుతూ, నీ క్షాత్ర ధర్మంతో, నీ మనోధర్మంతో, నీ మానవీయ భయం-- మానవీయమైనటువంటి భావనతో, నీ ఆంతరంగికమైనటువంటి శక్తితో, ఒక పవిత్రతతో నువ్వు గనుక ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది రామా! అన్నది. రామా! అంటూ నువ్వు రాఘవుడవు అన్నది. ఆ రాఘవుడు రఘువంశానికి చెందిన రామచంద్రుడికి తల్లి మార్గోపదేశనం చేసింది. ఒక ఉదాత్తమైన భూమిక. తండ్రి ఆజ్ఞను పాలించి భౌతిక సంచారం చేసిన రామచంద్రుడు తల్లి ఆజ్ఞను పరిపాలించి మానసిక సంచారం చేశాడు పద్నాలుగు ఏళ్ళు. ధర్మబద్ధమైనటువంటి కర్మలే ఆచరించాడు. తాను ఎన్ని అననుకూలాలు ఎదుర్కొన్నా, ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్నెన్ని అవరోధాలు ఏర్పడినా అన్నింటినీ కూడా అధిగమిస్తూ వెళ్ళాడు. రాక్షస సంహారం జరిగిన ప్రతి రాత్రి ఒక ముని ఆశ్రమంలో రాముడు విశ్రాంతి చెందాడు. ఎందుకని? సంహార క్రీడలో, విధ్వంస క్రీడలో, వినాశ క్రీడలో, విలయ క్రీడలో తాను పోగొట్టుకున్నటువంటి ఒక ఎనర్జీని, శక్తిని మళ్ళీ తాను సంపాదించుకోవాలి అంటే ఆరుష ధర్మంలోనేది ఇమిడి ఉన్నది గనుక శ్రీరామచంద్రమూర్తి "రామో విగ్రహవాన్ ధర్మః" అయినాడాయన. ధర్మాన్ని గురించి మాట్లాడటం అంటే రాముడు తప్ప అన్యమైనటువంటి వ్యక్తే మనకు కనపడడు. ఎందుకని? అది ధర్మ స్వరూపం. తల్లి ఎడ, తండ్రి ఎడ, భార్య ఎడ, తమ్ముని ఎడ, శత్రువు ఎడ, నరవానరుల యందు, సమస్తమైనటువంటి జీవరాశుల యందు, కడగా ఒక ఉడత యందు అన్నింటియందు కూడా ఒక సంపూర్ణమైనటువంటి మానవత్వాన్ని ఆవిష్కరిస్తూ, మానవీయమైనటువంటి ఒక సాంఘిక మర్యాదని కాపాడుతూ, అధర్మాన్ని అణచివేస్తూ, అవసరమైనప్పుడల్లా ధర్మాన్ని ఆచరిస్తూ అన్నివేళలా శ్రీరామచంద్రుడి యొక్క అయనము, ప్రయాణం సాగింది గనుకనే అది శ్రీరామ అయనమై, శ్రీరామాయణమై ఇవాళకు మనకి పారాయణార్హమై భాసిస్తూ ఉన్నది. అందుకనే శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాలు తాను మనస్సులో దేనిని మోస్తూ వెళ్ళాడు?దేని రుచిని అనుభవించాడు? దేనిని స్మృతిగా జ్ఞాపకం పెట్టుకున్నాడు? దేనిని మాతృ ఆజ్ఞగా పాలించాడు అంటే కౌసల్యాదేవి ఇచ్చినటువంటి చిన్న ఉపదేశమే "ధర్మో రక్షతి రక్షితః". ఈ మాట అన్నది కౌసల్యాదేవి. విన్నవాడు రామచంద్రమూర్తి. అన్-అనుకున్న వాడు అన్న-- అని విని ఆచరించిన వాడు రామచంద్రమూర్తి. కనుకనే రాఘవుడుగా బయలుదేరాడు, పధ్నాలుగు ఏళ్ల తర్వాత విజయరాఘవుడై వెనక్కి వచ్చాడు. అది ఆయన యొక్క పరిపూర్ణత. అందుకే ఇవాళ ఆయన్ని మనం దైవంగా భావిస్తున్నాం. మనం చెయ్యలేము. మనకు అటువంటి చడని పదార్థం ఇచ్చేటువంటి తల్లులు లేరు. ఎవరున్నారు? కౌసల్య వంటి తల్లులు కావాలి అని హైందవ ధర్మం చెప్తున్నది. రామచంద్రుడు వంటి పుత్రులు ఉండాలి అని హైందవ ధర్మం చెప్తున్నది. పురాణంలో అది కథగా మనకు కనిపించినా, ఒక్కసారి గనుక మనం దాన్ని ఆచరించినట్లయితే, అనుభవించినట్లయితే అది మనకు మహత్తరమైనటువంటి సందేశాన్నిస్తుంది. చూడండి! శ్రీరామచంద్రుడి అరణ్యవాసం ప్రారంభమైన తర్వాత దశరథుడు మరణించాడు. దశరథుడు మరణించినప్పుడు భరత శత్రుఘ్నులు మేనమామల దగ్గర ఉన్నారు. రామలక్ష్మణులిద్దరూ అరణ్యంలో ఉన్నారు. అంటే నలుగురు కుమారులను ఆయన కన్నా, మరణ సమయంలో ఒక్కరూ ఆయన దగ్గర లేరు. రెండవది, పుత్రుడు ఉంటే పున్నావ నరకం తప్పిస్తాడు, దాటిస్తాడు అని ఒక ధర్మం చెప్పిన కారణంగా ఇక్ష్వాకు వంశాన్ని, రఘువంశాన్ని ముందుకు నడిపించవలసినటువంటి పుత్రుడు కావాలని కోరుకొని, పుత్రకామేష్టి చేసుకొని, ఆ యజ్ఞ ఫలితంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తే రామచంద్రుడై వస్తే, ఆయన కౌసల్యానంద నందనుడై రాముడై వస్తే-- వచ్చినా దశరథ మహారాజుకి ఆ పరిస్థితి ఏర్పడలేదు. కుమారులు నలుగురూ నాలుగు దిక్కులా ఉన్నారు. లేదా రెండు దిక్కులా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విశేషం ఉన్నది. "ఆత్మవై పుత్ర నామాసి" అని కదా! ఆ భావనతో ఆలోచించినట్లయితే శ్రీరామచంద్రుడి యొక్క సేవలో తన రెండు రెక్కలు పోగొట్టుకున్నటువంటి జటాయువు. ఎవరు ఈ జటాయువు? దశరథ మహారాజు పట్ల స్నేహ ధర్మాన్ని సాటి, దానిని నిలబెట్టుకున్నటువంటి వాడు జటాయువు. నా స్నేహితుడైనటువంటి దశరథుడి కుమారుడు, అతని భార్యను ఎవరో తీసుకుని వెళ్లిపోతున్నారు, రావణ బ్రహ్మ, అని గమనించినప్పుడు, తన జీవనాధారమైనటువంటి తన రెండు రెక్కలను కోల్పోయినప్పుడు, కరుణాపూర్ణ సుదాబ్ధి అయినటువంటి, పరిపూర్ణ మానవతా మూర్తి అయినటువంటి రామచంద్రుడు ఎవరికి అగ్నిసంస్కారం చేశాడు? దశరథుడికా? దగ్గర లేడే. తండ్రి స్నేహితుడు, తండ్రి వంటి వాడు గనుక, తండ్రితో సమానమైనటువంటి వాడు గనుక ఆ ధర్మాన్ని జటాయువు పట్ల ఆవిష్కరించాడు. ఆచరించాడు ఆయన. కనుకనే రాముణ్ణి "రామో విగ్రహ్వాన్ ధర్మః" దశరథ మహారాజుకే గనుక ఆయన చేసి ఉన్నట్లయితే, అది ఏ కొడుకైనా చేసే పనే. కానీ తాను తండ్రి ఆజ్ఞను ఆ కారణంగా వెనక్కి తిరిగి రాకుండా, పాటించటం నిలిపివేయకుండా, తన మార్గంలో తాను వెళ్లిపోతూ, సేవా ధర్మంలో, స్నేహ ధర్మంలో, సేవా ధర్మం తన పట్ల, స్నేహ ధర్మం తన తండ్రి పట్ల. ఈ రెండింటినీ కూడా సమన్వయం చేసినటువంటి జటాయువుకి అగ్నిసంస్కారం చేసి రామచంద్రుడు ధర్మసంస్థాపన చేశాడు. ధర్మాచరణ అంటే ఏంటో మనకు చూపించాడు. అట్లాగే ఆంజనేయస్వామి దాస ధర్మం ఉంది. ఆ దాస ధర్మం అంటే, దాసత్వం అంటే బానిసత్వం కాదు. దాసః అంటే సోహం. రామ నామాన్ని రోమరోమంలో నిలుపుకున్నటువంటి ఆంజనేయస్వామి శ్రీరామ కార్యంలో తన-- తను, మన, ధనమును అంటే శక్తిని, ఆయన-ఆయనకున్న ధనం ఏమిటి? బ్రహ్మచర్యం. ఆ శక్తిని రాముడి కార్యక్రమంలో వినియోగించినప్పుడు శ్రీరామచంద్రుడు ఎటువంటి ధర్మాన్ని ఆచరించాడంటే, అంతా అయిపోయింది, పట్టాభిషేకం అయిపోతున్నది, తన హనుమ ఎక్కడ ఆయనకు కనపట్టలా. "కృతం హనుమతా కార్య సమవిద్ధుః దుష్కరం మనసాప్యదన్యేన న శక్యం ధరణీతలే" అని ప్రకటించాడు. రెండు సింహాసనాల వెనక కూర్చున్నటువంటి ఆంజనేయస్వామి దగ్గరకు రాముడు శాలంకృతుడై వెళ్లాడు. కిరీటధారణ అయిపోయింది, వెళ్లాడు. వెళ్లి "హనుమా, లే నేను వచ్చాను" అన్నాడు. "నీ నామస్మరణతో నా కళ్ల నిండా నీళ్లు నిండిపోయినయి, అవి తప్పించు రామా! నేను లేస్తాను" అన్నాడు. చిటికెన వేలు ఎందించాడు రామచంద్ర ప్రభువు. తీసుకొని వెళ్లాడు. అందరికీ పరిచయం చేశాడు. ఇందాక మనం అనుకున్న శ్లోకం "కృతం హనుమతా కార్య సమవిద్ధుః దుష్కరం మనసాప్యదన్యేన న శక్యం ధరణీతలే". హనుమ వంటి వాడు ఉంటాడా? ఉండడు అని అర్థం. ఒకవేళ ఉన్నా మా హనుమ చేసినట్లుగా రామ కార్యాన్ని నిర్వర్తించగలడా? అన్నాడు. అంటే శ్రీరాముడు సేవా ధర్మాన్ని, స్నేహ ధర్మాన్ని, ఇదిగో ఇక్కడ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఒక వాత్సల్యాన్ని చిటికెన వేలు అమ్మవారికి అందించాడు, ఆపై ఆంజనేయుడికి అందించాడు. కనుకనే రామచంద్రుడు ధర్మమూర్తి అయినాడు. రామాయణాన్ని ఒక ధర్మశాస్త్రంగా, ధర్మభావనాభూమికగా మనం చదివితే, కథగా చదువుదాం అది కేవలం కాషె-- కాలక్షేపానికి, కాశ్యపు పురాణం. ఆహ్ చెప్పేవాడికి, వినే వాడికి బోలెడు సమయం ఉంటుంది, వినోదంగా వినొచ్చు. కాదు, రామాయణాన్ని ధర్మంగా, ఒక ధర్మ ప్రబంధంగా గనుక మనం చదివినట్లయితే, ఆ ఆది మహాకావ్యంలో ఉన్నటువంటి ధర్మ సూత్రాలు ఒక్కొక్క వాక్యం మీద మనం కొన్ని గంటలు మాట్లాడుకునేటువంటి విషయాలున్నాయి.ఇవన్నీ ఒక ప్రతి హిందువు కూడా రామాయణ, భారత, భాగవత, భగవద్గీత నాలుగు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి పిల్లలకి దంతంబుల్ పడనప్పుడే తనువునందారూఢి ఉన్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే కురుల్ వెల్వెల్లా కానప్పుడే చింతింపన్ బలని పదాబ్జములన్ శ్రీ కాళహస్తీశ్వరా తడు దుర్జటి. ఇవేళ హైందవ ధర్మాన్ని ఆచరించవలసిన మనం కూడా ఏ ఫర్ ఆపిల్, బి ఫర్ బాటిల్, సి ఫర్ క్యాటిల్ అనేటువంటి విద్యా విధానంలోకి మన పిల్లల్ని గనక నెట్టినట్లయితే మేలుకునేదెప్పుడు? అర్థం చేసుకునేదెప్పుడు? ముందు స్వాధ్యాయం చేసేదెప్పుడు? ఆచరించేదెప్పుడు? అనుభవంలోకి తెచ్చుకునే దెప్పుడు? ఇవన్నీ ప్రశ్నలుగా మిగిలిపోతాయి. జీవితకాలం గడిచిపోతుంది గనక ఇదిగో ఇవేళ మన కడుపున పుట్టినటువంటి బిడ్డలనికి-- బిడ్డలకి ప్రతి హైందవుడైనటువంటి వాడు హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వాడు తన పిల్లలకు రామాయణం చెప్పాలి. తన పిల్లలకి భారతం చెప్పాలి, భాగవతం చెప్పాలి, భగవద్గీత చెప్పాలి. దీని యందు దాటి ఉన్న దాగి ఉన్నటువంటి అనేకమైనటువంటి మార్మికతలు వాటన్నింటినీ కూడా వాళ్లకు అర్థం అయ్యేట్లుగా చెప్పాలి. అందుకనే రాముడి చుట్టూ ఎవరు చేరారో తెలుసునా? ధర్మకాములు, సత్యకాములు చేరారు. ఇది అధర్మము అన్నటువంటి విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చాడు. లంకను వదిలిపెట్టాడు, అన్నదమ్ములను వదిలిపెట్టాడు, కుటుంబాన్ని వదిలిపెట్టాడు. ధర్మం ఎక్కడ ఉన్నదో అక్కడికి వచ్చాడాయన. ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రుడు ఎందరు చెప్తున్నా వాళ్లందరినీ వారించి విభీషణుడు శరణాగతుడై వచ్చాడు. శరణాగతి పొందిన వానిని రక్షించటం నా ధర్మం అన్నాడు. అంటే రాముడి ప్రతి కదలికలో, ప్రతి మెదలికలో, ప్రతి ఆలోచనలో, ప్రతి చర్యలో ఏమున్నది అంటే ధర్మమే ఇమిడి ఉన్నది. ఆ ధర్మం ఎటువంటిది? వైదిక ధర్మం, వేదగతమైన ధర్మం. తన కంటే ముందు ఉన్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాశీభూతమై పుంజీభూతమైనటువంటి మహా కారుణ్యమూర్తి రామచంద్రుడు. రామాయణం "ఈ ధర్మో రక్షతి రక్షితః" అన్న మాట పుట్టిందే రామాయణంలో. అందునా కౌసల్యాదేవి మాతృవాక్యంగా రాముడు భావించినటువంటి ఆ మహదాశీర్వచనాన్ని తాను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు గనుకనే శ్రీరామచంద్రుడు ఇప్పటికీ మనకి దైవమై, పరదైవతమై, కళ్యాణరాముడై, జానకీరాముడై, కోదండరాముడై, అయోధ్యా రాముడై, ఆధ్యాత్మిక రాముడై, ఆనంద రాముడై వశిల్లుతున్నాడు గనుక రామాయణం అంతా కూడా "ధర్మో రక్షతి రక్షితః" ఎక్కడైనా ఏ కథ మీరు వినండి, ఏ సంఘటనని తాకండి దాని వెనుక ధర్మ నిబద్ధత ఉన్నది, ధర్మాచరణ ఉన్నది, ధర్మసంస్థాపన ఉన్నది, ధర్మం పట్ల ఒక ఆసక్తి ఉన్నది. ధర్మం యొక్క విరాట్ స్వరూపాన్ని దర్శనం చేయించినటువంటి ఈ సంసారం మీద ఎన్ని జన్మలకు నే నేను మౌని భాషా సంక్రాంత ఋణము తీర్పగలదా? వాల్మీకి రామాయణం రాయకపోతే అంత ఉదాత్తమైన ధర్మశాస్త్రం మనకు అంది ఉండేది కాదు. దానిని కేవలం ఒక మానవీయ కోణంలో గాక, ఒక కథగా గాక, ఏదో రాముడికి జరిగిందని గాక, మనల్ని మనం రాముడిగా ఆ స్థానంలో నిలబెట్టుకొని ధర్మబద్ధమైనటువంటి కర్మాచరణ గనక మనం చేసినట్లయితే "ధర్మో రక్షతి రక్షితః" అనేటువంటి మాట మనకు అనుభవంలోకి రావాలి. అది దాన్ని కేవలం నినాదపూర్వకమైనటువంటి భాషగా గాక, మా-- అది నినదించేటువంటి నాదాత్మకమైనటువంటి ఒక ఆంతరంగికమైన మేలుకొలుపుగా భావించమని "ఓ హిందు మేలుకో" అనేటువంటి ఈ కార్యక్రమం మళ్ళీ మనల్ని వెన్నుతట్టి లేపుతున్నది. ఇకపై మనం సాగించవలసిన మరికొన్ని విషయాలున్నాయి. వాటిని చక్కగా విచారణ చేద్దాం.
YouTube · audio
O Hindu Meluko | Sreepeetam | ఓ హిందుమేలుకో
O Hindu Meluko | Sreepeetam | ఓ హిందుమేలుకో
Source: Sreepeetam on YouTube
0:00 / 22:00
More in this series