No transcript for this section.
Transcript begins at 0:00.
ఓ హిందూ మేలుకో! ఇది ఒక అద్భుతమైనటువంటి పిలుపు. పిలుపే కాదు మేలుకొలుపు. ఎవరి కోసం ఈ పిలుపు? ఎవరిని ఉద్దేశించిన మేలుకొలుపు? ఒక హైందవ సమాజం స్తబ్ధంగా ఉన్నట్లయితే, నిశ్శబ్దంగా మౌనభూమికలో నెలకడి చెందినట్లయితే, తన మూలాలు నెమ్మదిగా బలహీనపడి, అస్తిత్వ వ్యక్తిత్వాలు నెమ్మదిగా సన్నగిల్లి, అనేకమైనటువంటి హైందవేతర మతాలన్నీ కూడా హైందవం మీద దాడి చేసి కడగా కబళించే ఒక పరిస్థితి వస్తుంది. ఈ హైందవ ధర్మము అనగానే మనస్సులో మెదిలే మరొక్క మాట సనాతన ధర్మం. సనాతన ధర్మం, వై-వైదిక ధర్మం, ఆర్ష ధర్మం, భారతీయ ధర్మం, హైందవ ధర్మం ఇవన్నీ కూడా పర్యాయ పదాలే తప్ప, దీని మూలాలు అన్నీ కూడా సనాతనమైనటువంటి ధర్మంలో ఇమిడి ఉన్నాయి. సనాతనము అంటే ఏ రెండు వందల ఏళ్ళో, ఆరు వందల ఏళ్ళకు పరిమితమైనటువంటిది కాదు. కాలాద్యవిచ్ఛిన్నమైనటువంటి, కాలాతీతమైనటువంటి, విశ్వజనీనమైనటువంటి, సార్వకాలికమైనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి భావనా భూమికే సనాతన ధర్మం. ఇవాళ సనాతన ధర్మం నుంచి అసంఖ్యాకులైనటువంటి హిందువులు గనక తమ ధర్మాన్ని తాము విస్మరించినట్లయితే ఏమవుతుంది? ముందే అనుకున్నాం. మూలాలు బలహీనపడతాయి. ఎప్పుడైతే మూలాలు బలహీనపడతాయో, జాతి నిర్వీర్యమైపోతుంది. ఇక్కడ ఒక చిన్న విచారణ. ప్రతి జాతి, ప్రతి దేశం ఒక ధర్మాన్ని ఆశ్రయించి నడుస్తాయి. భారతీయమైనటువంటి మన ఈ పుణ్యభూమి, ఈ తపోభూమి, ఈ కర్మభూమి, ఈ ధ్యానభూమి, ఈ యోగ భూమి, ఈ వేదభూమి అనేకమైనటువంటి వేలాది సంవత్సరాలుగా మానవ జాతిని పరిపూర్ణమైనటువంటి ఆనంద తారక స్థితి వైపు నడిపించే దిశగా అది నడుస్తూనే ఉన్నది. దానిలో అనేకమైనటువంటి ధర్మాలు ఇమిడి ఉన్నాయి. ఆ ఇమిడి ఉన్నటువంటి ధర్మాల అన్నింటినీ కూడా భారతీయులు కేవలం ఒక ఊహగా, ఒక కల్పనగా, ఒక భావనగా, ఒక తలపుగా, ఒక స్మృతిగా, ఒక స్పర్శగా కాక, ఒక ఆచరణాత్మకమైనటువంటి దివ్య విధానంగా భావన చేసి నిత్య నైమిత్తికమైనటువంటి అంటే ప్రతిరోజూ జీవించే విధానంలో దానిని భాగం చేసుకోవటం కాక, దానినే సంపూర్ణంగా భావన చేసి ధర్మాన్ని ఆచరించారు కనుకనే కృత, త్రేతా, ద్వాపర ఈ మూడు యుగాలు కూడా ధర్మాన్ని అతిక్రమించకుండా ధర్మాచరణతో సాగినాయి. అందువలన ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ అనేకమైనటువంటి స్థితులన్నీ కూడా ఒక పరిపూర్ణతని, ఒక శోభను సంతరించుకొని మానవతావాదాన్ని ప్రబలం చేస్తూ వెళ్ళినాయి. కనుకనే గతం మనకి ఎప్పుడూ కూడా స్ఫూర్తిప్రదాయకం అవుతూ వచ్చింది. ఏది చెప్పాలన్నా, ఏం మాట్లాడుకోవాలనుకున్నా, ఇదిగో ఈ నిద్ర నుంచి, స్తబ్ధత నుంచి, ఒక నిర్వీర్యమైనటువంటి ఒక స్థితి నుంచి, అలసత్వంలో నుంచి బయటపడాలి అంటే పురాస్మృతులను ఒక్కసారి మనం నెమరువేసుకోవాలి. పురాస్మృతి స్ఫూర్తిని వరదానం చేస్తుంది. ఆ స్ఫూర్తిలో నుంచి వర్తమానాన్ని మనం జ్వజ్వల్యమానం చేయాలి. ప్రకాశమానం చేయాలి. జీవితము, సమాజము ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పుడు వీటన్నింటినీ కూడా ఒక సమన్వయ స్థితిలో, సంయమనంతో, సహనంతో, శౌర్యంతో, ధైర్యంతో, గాంభీర్యంతో, మర్యాదతో, ఉదాత్తమైనటువంటి భావనా స్థితిలో వీటిని ఎట్లా సంభాళించాలి అని ఆలోచన కలిగినప్పుడు ముందు దేశాన్ని గురించిన ఆలోచన మనస్సులో తట్టాలి. ఎందుకనంటే దేశం కోసం, ధర్మం కోసం అనేటువంటి ఒక నినాదంతో ఏర్పడినటువంటి ఈ ప్రజ్ఞాన వాహిక భారత్ టుడే ఇవాళ సంకల్పించటం కేవలం హైందవ జాతికి మాత్రమే కాదు, మానవ జాతికి ఇది దిక్సూచి. ఒక స్థితి చేరేదాకా మతం అవసరం. స్థితిగతులు అన్నీ దాటిన తర్వాత ఆచరించవలసింది మానవీయమైనటువంటి ధోరణి. మానవత్వం గనక పరిమళించినట్లయితే అది మాధవత్వమైనటువంటి ఒక భావన మన సంస్కృతి చెప్తూ ఉన్నది గనుక, ఈ సనాతన ధర్మంలో ఈ దేశాన్ని గురించి విచారణ చేస్తే ఒక్కసారి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అంటాడు, "janani janma bhoomischa swargadapi gariyasi" అంటే ఇంకా కంటికి కనిపించని స్వర్గం కంటే తల్లి, జన్మభూమి ఈ రెండూ కూడా చాలా గొప్పవి. స్వర్గంతో సమానమైనవి. నిజానికి స్వర్గాన్ని మించినవి అన్నారాయన. "api swarnamayee lanka" లంక ఎంత స్వర్ణమయమైనా, ఎంత బంగారంతో చేయబడినదైనా మనది కాదది. మన దేశం మన తల్లి అనేటువంటి ఒక భావనని శ్రీరామచంద్రమూర్తి ప్రపంచానికి మహత్తర సందేశంగా అందించాడు. ఆ భావన నుంచి మనం గనక ఒక్కసారి స్ఫూర్తిని పొందినట్లయితే మళ్ళీ మన కాలానికి వచ్చేసరికి అరవింద మహాయోగి అన్నారు, "దేశం అంటే...ఒట్టి మనుషులేనా? నదీనదాలు, పర్వతాలు, కొండలు, కోనలు, వాగులు, వంకలు, గుట్టలు, పిట్టలు, మిట్టలు అన్నీ ఇదంతా కూడా దేశమే. ఈ దేశానికి ఒక సాంస్కృతిక ధార ఉంది. సజీవమైనటువంటి సంస్కృతి, వైభవం. అది విలాసం మాత్రమే కాదు, ఒక అద్భుతమైనటువంటి క్రాంతి, అది ఒక విప్లవం, అది ఒక మార్పు, అది ఒక పరిణామం. ఈ పరిణామం నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఆనందానుభూతికి దారితీయాలి. అందుకై ఆసేతు సీతాచలంలో అంటే భారతావరిలో ఎవరు జన్మ ఎత్తుతారో వారు ముక్తులై ఉంటారు. అంతేకాదు, ఎవరైతే ఆంధ్రదేశంలో వింధ్య పర్వతాలకి ఇవతల పుడతారో వాళ్ళు పూర్ణముక్తులై ఉంటారు, జీవన్ముక్తులై ఉంటారు. ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాసంగంలో ఉన్నా, యోగరతోవా, భోగరతోవా, సంగరతోవా, విషయరతోవా, యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అంటారు శంకర భగవత్పాదులు. అట్లాగే వింధ్య పర్వతాలకు ఇవతల ఉన్నటువంటి దక్షిణాపథంలో ఆంధ్రుడు గనుక జన్మ ఎత్తినట్లయితే, ఆ ఆంధ్రుడు కూడా అంటే తెలుగువాడు జీవన్ముక్తుడై తన జీవితాన్ని సాగిస్తాడు అని ఒక ప్రమాణం. ఓంకార స్వరలీనమై నిగమనాదోపాసనాధీనమై కైంకర్య ప్రతిపాజ్యమై భువన రక్షాదక్షమై తాండవాహంకార స్థిరచంద్రయ శకల శైత్య ప్రాప్త శాంతత్వమై శంఖా సంకులమైన నీ ఉనికి అశాశక్తి కల్పించుతన్ అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అంటే ఒక జాతి తన సంస్కారాన్ని ఎట్లా అలదుకుంటుంది, అద్దుకుంటుంది, అందుకుంటుంది, అనుభవిస్తుంది, అనుభూతిని పొందుతుంది, ఒక విభూతి స్థాయికి చేరుతుంది. త్రిలింగ దేశంలో మూడు శైవ క్షేత్రాల నుంచి ఒక అనాహత నాదంగా వినిపించేటువంటి ఓంకార ప్రణవ శబ్దం ఏదైతే ఉన్నదో, ఈ తెలుగు నేలలో, తెలుగు మాగాణంలో ఒక గాలిలో కలిసిపోయి అది నిత్య స్మరణీయమైన, ప్రాతఃస్మరణీయమైనటువంటి నిత్య సంస్మరణమైనటువంటి ఒక దివ్య భావనతో ఈశ్వరార్చన జరుగుతూనే ఉంటుంది అని ఈ పద్యంలో భావం. దీనినే అరవిందల వారి భావానికి అనుగుణంగానే మరొక మహాకవి, తెలుగు మహాకవి నండూరి రామకృష్ణమాచార్యుల వారు ఈ ఆంధ్రదేశానికి, తెలుగు దేశానికి ఎట్లా నమస్కరించాలో చెప్పారు. పూర్వాంభోనిధి కాళహస్తినగరి శ్రీమన్ మహేంద్రాచల శ్రీశైల ప్రముఖ త్రిలింగ శిఖరి ప్రాతర్ణవోషస్విని కృష్ణా కంకణ కింకిణి జణజణత్ గోదావరి కాంచిక ద్రాక్షాపేశల వాంగ్మయీ విజయతాం త్రైలింగ పృధ్వీస్థలి. అంటే మాతృభాష, మాతృమూర్తి, మాతృదేశం. ఈ మూడు కూడా మనిషి యొక్క సంస్కారానికి మూడు కోణాలు. Three dimensions అని వాడతామే అది. అటువంటి సనాతనమైనటువంటి భారతమైనటువంటి ఈ నేలమీద అనేకమైనటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు మళ్ళీ మన కాలానికి వచ్చేసరికి గురజాడ అప్పారావు గారు ఈ భావాన్ని కొనసాగిస్తూ మామూలు భాషలో "దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్". ఎంత అందమైనటువంటి మాట! అంటే ఈ మనిషి గనుక తన వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దుకొని, తన మూలాలను పట్టుకొని, ఆ మూలం ద్వారా ఏర్పడిన ఫలాలను తాను అందుకుంటూ, తాను తర్వాత తరానికి అందిస్తూ వర్తమానాన్ని ప్రకాశమానం చేసుకోగలిగినట్లయితే అది సర్వోన్నతమైనటువంటి ఒక సంస్కార ధార. ఈ సనాతన ధర్మ వృక్షం ఏదైతే ఉన్నదో అది వేళ్ళూనుకొని ఉన్నది. సదాశివోక్తాని సపాదలక్షలయావధానాని వసన్తి లోకే నాదానుసంధాన సమాధిమేకం మన్యామహే మన్యతం లయానాం అంటారు శంకర భగవత్పాదులు. అంటే ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే ఈ దేశం యొక్క సమగ్రత. ఒక సాంఘికమైన, భౌతికమైన, ఆదిభౌతికమైన, ఆధ్యాత్మికమైన, చిరస్మరణీయమైనటువంటి ఒక జ్ఞాన సార్వభౌమత్వాన్ని ఈ దేశం పొందింది. అందుకనే ఒకపక్కన అంటే ఉత్తర దిశగా హిమాలయాలు సమున్నతంగా ఉంటే దక్షిణం లోకొచ్చేప్పటికి నిశ్చలమైనటువంటి, గంభీరమైనటువంటి సముద్రాల కలయికగా ఈ దేశం ఏర్పడి ఉన్నది. ఇది భౌగోళికమైనటువంటి ఒక భావన. కేవలం మనిషిగా పుట్టి, మనిషిగా మెట్టి, మనిషిగా గిట్టినట్లయితే ఆ మానవ జన్మకు సార్థకత లేదని, పరిపూర్ణత లేదని, మానవుడు మానవుడిగా జీవించగలిగిన అధ్యాత్మ శక్తిని తాను పొందాలి అని, దేశం అంటే కేవలం మనుషులే కాదు, కేవలం మట్టే కాదు, మట్టి, మట్టి మనుషులు, మనిషితో కూడినటువంటి అనేక భావనలు అన్నీ గనక కలబోసుకున్నట్లయితే ఒక సంస్కృతి, ఒక శృతి, ఒక స్మృతి, ఒక పురాణం, ఒక వేదం, ఒక వాంగ్మయం, ఒక అనాహత నాదం ఇవన్నీ కలబోసుకున్నట్లయితే అది దేశం అవుతుంది గనుక ఇవాళ మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినట్లయితే ఈ దేశం కోసం ఇవాళ ఎందుకు ఆలోచించవలసి వచ్చింది? అంటే ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఈ గంభీరమైనటువంటి తాత్విక విచార ధారని మన ఋషులు, మహాత్ములు, విజ్ఞులు, తత్వజ్ఞులు, ముముక్షువులు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, భౌగోళికులు, ఖగోళ శాస్త్రాన్ని మధనం చేసినటువంటి వారంతా కూడా ప్రపంచం మొత్తానికి దిశానిర్దేశం చేసినటువంటి ఒక అద్భుత ఆహ్ భవిష్యత్తు కానీ, భూతకాలం మనది. అంటే...వారి వారి దర్శనాలు అన్నీ వారి తపశ్శక్తి ద్వారా మనోభూమిక లో నుంచి ఏర్పడినటువంటి అనేకమైనటువంటి విషయాలను వారు సంగ్రహించి, గ్రహించి, కోడీకరించి ప్రపంచానికి అందించారు. అది విజ్ఞాన పరమైనటువంటి ఒక భావన. వేద సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్నటువంటి భావాలతో మానవ జాతిని ఒక పైశాచికమైనటువంటి స్థాయికి నడిపించేటువంటి స్థాయిలో నడుస్తూ ఉన్నప్పుడు, వాటిని నిరోధించవలసిన బాధ్యత అట్లాగే వేదగతమైనటువంటి భారతీయమైనటువంటి మూలాలను పరిరక్షించుకోవటం మరొక బాధ్యత కనుక దేశాన్ని గురించిన ఆలోచన ఇవాళ చేయవలసి వచ్చింది. దేశం కేవలం ఆర్థిక పరమైనటువంటి పునాదుల మీద మాత్రమే సౌభాగ్యవంతమవుతున్నదని భావించినట్లయితే మరి తాత్విక చింతనా భూమికలు ఏం కావాలి? దీని వలన మనోవికాసం ఎక్కడికి పోతుంది? ఏమైపోతుంది? దీనిని సంస్కరించగలిగిన వారు, సవరించగలిగిన అటువంటి వారు ఎవరున్నారు? ఎక్కడున్నారు? ఇది ఎవరు చేయవలసినటువంటి పని? అంటే ఇది కేవల బోధకుల పని మాత్రమే కాదు. బోధకుడు విషయాన్ని స్పష్టంగా చెప్తాడు సాధకుడు వినాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సాధకులు వెయ్యి మంది ఉంటే బోధకుడు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడు చెప్తున్న దానిని ఆలకించాలి, ఆలపించాలి, మననం చేయాలి, ఆచరించాలి. ఆచరణాత్మకమైనటువంటి ఒక దివ్య భావనా భూమికని ప్రతి సాధకుడు, ప్రతి వ్యక్తి గనుక ఏర్పరచుకున్నట్లయితే, ఈ దేశం యొక్క మూలాలు ఎక్కడున్నాయి? ఈ దేశ ఔన్నత్యం ఎంతగా ప్రబలంగా నిలకడ చెందింది? ఏ రకంగా యుగాలను శాసిస్తూ వచ్చింది? ఇటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవితంలో నుంచి మానవుడు సంపూర్ణ ఆనందాన్ని ఎట్లా పొందాడు? ఇవన్నీ కూడా గమనించుకోవటానికి ఒక అశావహ దృక్పథం మనకు ఏర్పడాలి కనుకనే భారతదేశాన్ని గురించి ఇవాళ మనం ఆలోచించవలసి వచ్చింది. ప్రధానంగా రెండు అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఓ హిందూ మేలుకో అన్నప్పుడు, ఓ హిందూ అంటే ఒక మతానికి చెందిన వ్యక్తిని గురించిన నినాదం కాదిది. మానవుడు హిం అంటే హింస. హింసను దూరం చేయగలిగినటువంటి శక్తి దేనికి ఉన్నదు అంటే హైందవానికి ఉన్నది గనుక, అహింస భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక అనేకమైనటువంటి రకాలుగా అది మనకి ఆవిష్కృతమవుతూ ఉంటుంది గనుక, అహింసా ప్రవృత్తి ఏ దశలో, ఏ స్థితిలో ఉన్నా దానిని మనం ఖండిస్తూ ప్రపంచాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. అలాగే హైందవ ధర్మానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇవాళ English లో కాస్త చెప్పాలి అది. అంటే Inclusive way of living అది. అంటే అందరినీ కలుపుకోగలిగినటువంటి ఒక అద్భుతమైన శక్తి ఏ ధర్మానికి ఉన్నదంటే ఇదిగో హైందవ ధర్మానికి ఉన్నది. మిగతావన్నీ ఏ పాయా అపాయా, ఏ చీలిక అచీలిక, ఏ పారుదల దానిది కానీ హైందవం అనేది ఒక గంభీరమైనటువంటి మహాసముద్రం ఇది. ఈ సముద్రంలోకి ఎవరైనా రావచ్చును. ధర్మబద్ధమైన జీవితాన్ని తాము ఆశించిన, అనుకున్నటువంటి రీతిలో దాన్ని కొనసాగించవచ్చును. అలాగే పరమత సహనాన్ని ప్రబలంగా సంభావించినటువంటి ఒక జాతి ఏదన్నా ఉన్నదా? ఒక ధర్మం ఏదైనా ఉన్నదా? అంటే అది హైందవ ధర్మమే అవుతున్నది. ఇది ఇవాళ మనం కనిపెట్టిన విషయం కాదు. హైందవుడైనటువంటి వాడు మరొకరి మీద దండయాత్ర చేయలే. మరొకరి మనోభావాలను విధ్వంసం చేసేటువంటి పని ఏనాడూ చేయలే. తనను తాను పణంగా పెట్టి పరిత్యాగం చేసి తన మూలమైనటువంటి ధర్మాన్ని నిలబెట్టుకోవటంలో ఎదురు ఉడ్డి నిలిచాడు. తలవంచకుండా ధీరోదాత్తుడై ముందుకు సాగుతూనే ఉన్నాడు. అటువంటి ఒక జాతి ఇవాళ పాశ్చాత్య భావ పరిణామం చేత ఆంతరంగికమైనటువంటి అనేక శక్తులు, ప్రతీప శక్తులు అంటాం, వ్యతిరిక్త శక్తులు అంటాం. వీటన్నింటికీ గనక లోబడినట్లయితే విధ్వంసకరమైనటువంటి భావనా జరిని గనక మనం అంగీకరించి దాని దారిన అదే వెళుతున్నదిలే అనుకున్నట్లయితే మొత్తం సముద్రమే కలుషితం అయిపోతుంది. ఎండటం ఎరగనటువంటి సముద్రమే ఎండిపోతే ఇక ఈ నదులన్నీ కూడా వాటి గమ్యాలు ఎక్కడ? వాటి లక్ష్యాలు ఎక్కడ? అన్నింటినీ పారనివ్వండి హైందవ ధర్మం చెప్తున్నది. అన్నింటినీ పారనివ్వండి అంటే live and let live. ఇక్కడ మేమేం ఉంటామని చెప్పేది కాదు. హైందవం ఒక విశాలమైన భావన. హైందవ ధర్మం ఒక విశాలమైనటువంటి ధర్మాకృతి కూడినటువంటి ఒక ఆచరణాత్మకమైన అనుష్ఠాన వేదాంత భూమిక. వీటన్నింటినీ మనం గమనించుకోవాలి. మన ఋషుల జీవితాలు, మన మునుల జీవితాలు, మన తాత్వికుల జీవితాలు, మన ప్రబోధకారుల జీవితాలు. ప్రసార మాధ్యమంలో ఆనాడు transmission అనే మాట లేదు గాని, మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం అన్నటువంటి దక్షిణామూర్తి దగ్గర నుంచి ఒక పరంపరగా, గురు పరంపరగా, గురు శిష్య భూమికగా ఆచార్యుల అంతేవాసిత్వంలో నుంచి ఏర్పడినటువంటి ఈ విజ్ఞాన భూమిక గనక నెమ్మదిగా బలహీనపడినట్లయితే ఏమవుతుంది? దానంతట అది బలహీనపడుతున్నదా? కాదే. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నప్పుడు ధర్మానికి హాని, గ్లాని అని మనం చెప్తూ ఉంటాం. ధర్మానికి హాని లేదు, గ్లాని లేదు. మరి దేని, దేనికి జరుగుతున్నది ఈ గ్లాని అని అనుకున్నప్పుడుధర్మాన్ని ఆచరించవలసిన వ్యక్తి. ఆ ధర్మ మార్గం నుంచి వైదొలగటమే ధర్మానికి మానవుడు చేసేటువంటి అపచారం. కాబట్టి ధర్మగ్లాని జరగకుండా ఎవరు చూడాలి అంటే వ్యక్తిగా ప్రతి వ్యక్తి కూడా దానిని సమాదరించాలి, ముందు అర్థం చేసుకోవాలి. ఒక మనిషి, ఒక సంస్కృతి, ఒక సంస్కారము, ఒక ధర్మము ఇవన్నీ గనక కలిపిన ట్లయితే అదిగో అది దేశం అవుతున్నది. ప్రకృతి భరితమైనటువంటి అఖండ భారతావని, ఋతువు వెంట ఋతువు వెంట ఋతువు వెంట తనను తాను పరిణామం చెందించుకుంటూ, తాను నడుస్తున్నటువంటి తన మార్గంలోకి అనేకమందిని ఆహ్వానిస్తూ, సహజీవన సౌందర్యాన్ని ప్రబోధాత్మకం చేస్తూ, ఆచరణీయమైనటువంటి స్థాయిలో దాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, వక్ర రేఖలు, వక్ర భాష్యాలు ఏర్పడినప్పుడు, ఈ దేశం పట్ల ప్రేమ, గౌరవం, అభిమానం ఇవి గనక లేకపోయినట్లయితే ఈ దేశం అంతర్గత శత్రువుల చేతిలోనే హతమయ్యే ప్రమాదం ఉన్నది. భారతీయమైనటువంటి ఒక భావన అంటే హైందవ ధర్మమే ప్రధానమైనటువంటి కూడలి ఇది. అన్ని గాలులను, అన్ని పరిణా-- పరిమళాలను, అన్ని భావనలని తన యందు విముర్చుకో గలిగినటువంటి ఒక మహోదాత్తమైనటువంటి శక్తి స్వరూపిణిగా దీన్ని మనం భావన చేస్తాం. అందుకనే ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులు మూడు ఒక చోట ఎక్కడ ఉన్నాయి, ఇచ్ఛా ఫౌ-ఫౌండేషన్ అది, ప్రాతిపదిక. క్రియా దానిని పనిచేయటం. జ్ఞాన. ఈ మూడు శక్తుల యొక్క ఈ త్రిపుటీకరణం అంతా కూడా ఈ దేశంలోనే విడిది ఉన్నది గనుక ఈ దేశం ధర్మాత్మకమైనటువంటి దేశం. అందుకనే దేశం కోసం, ధర్మం కోసం. పైగా అది భారత్ టుడే. ఎంత అందమైనటువంటి పేరు, అది ఎప్పుడు తలుచుకున్నా ఒక సంతోషం కలుగుతుంది. కారణం ఏంటంటే భారత్ యెస్టర్డే కాదు భారత్ టుడే. ఇవాళ ఈ కాలంలో సనాతనమైనటువంటి గతించిన కాలంలో నుంచి, పురా వైభవంలో నుంచి స్ఫూర్తిని పొంది వర్తమానాన్ని ప్రకాశమానం చేసుకోవలసినటువంటి అవసరాన్ని ప్రతిక్షణము గుర్తు చేసేటువంటిది కనుకనే, ఇవాళ మనం దేశం అంటే అసలు ఏమిటి? ఈ ధర్మం ఎన్ని రకాలుగా ఉన్నది? అది ఎన్నెన్ని రూపాలు సంతరించుకున్నది? వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం, ఆర్థిక ధర్మం, సామాజికమైనటువంటి ధర్మం, విశాలమైనటువంటి అఖండ భారతావనికి సంబంధించినటువంటి ఈ ధర్మం. వీటన్నింటినీ మనం చూస్తున్నప్పుడు దీనిని భరత సావిత్రి అన్నారు. ఆ సావిత్రి అంటే ఇందాక అనుకున్న ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులు మూడు ఒక్కచోట ఉన్నటువంటి దేశం ఏది అన్నప్పుడు, ఇదిగో ఈ భారత సావిత్రి స్వరూపంగా ఉన్నది గనుకనే దీన్ని మనం ఆ-గౌరవించాలి. అలాగే ఇక్కడ ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం లో మొట్టమొదటగా మన స్పురణకి, మన అంతరంగంలోకి ఒక మెరుపులాగా వచ్చేటువంటి వ్యక్తి ఎవరు అంటే తొట్టతలి లోకగురువు అయినటువంటి భగవాన్ వేదవ్యాసులవారు. ఆ వేదవ్యాసులవారు అంటారు, ధర్మం నుంచే అర్థం పుట్టాలి, అర్థంలో నుంచే కామం పుట్టాలి. ఋగ్వేద వాక్యాన్ని గుర్తు చేసుకోండి. ఆనాడు ఇన్ని మతాలు లేవు ఉన్నది ఒక్కటే హైందవం, ఉన్నది ఒక్కటే సనాతనం. కనుక వారు ఏమన్నారంటే, ఒక్కసారి ఆకాశంలోకి చూస్తూ రెండు చేతులు ఎత్తి ఈ అఖండ భారతావని యొక్క మూలాలు ఏమిటి అని ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశాన్ని గురించి ఆలోచించండి. ఈ దేశం ఏది అంటే, This is India of Vedas ఇవాళ మనం చెప్పుకున్నాం. అంటే వేదాత్మకమైనటువంటి భూమి, పవిత్రమైనటువంటి భూమి. దీనిని ఇటువంటి దేశం కోసం, ఇటువంటి ధర్మం కోసం వ్యక్తి తనను తాను సంస్కరించుకోవాలి. సంస్కరింపనేల సంఘమంతటినీవు సజ్జనుండవగును స్వార్థముడిగి ఒక్క నీచుడప్పుడు ఉర్విలో తగ్గును. ఇది ఒక పరిణామశీలమైనటువంటి ఒక భావన. వ్యక్తి స్థాయి నుంచి వ్యవస్థ వైపు, వ్యవస్థ నుంచి ఒక దేశం వైపు మనం వడివడిగా స్ఫూర్తితో అడుగులు వేయవలసినటువంటి ఈ సమయంలో ప్రతి హిందువు హైందవ ధర్మాన్ని ఆచరించటం ప్రారంభించాలి, అనుభవించటం ప్రారంభించాలి. తద్వారా ఈ దేశాన్ని మేల్కొల్పేటువంటి స్థాయికి అది చేరుకోవాలి.
YouTube · audio
హిందూ జాతిని అంతం చేయడానికి జరుగుతున్న కుట్రలు ఏమిటి | ఓ హిందూ మేలుకో
హిందూ జాతిని అంతం చేయడానికి జరుగుతున్న కుట్రలు ఏమిటి | ఓ హిందూ మేలుకో
Source: Sreepeetam on YouTube
0:00 / 23:03
More in this series