No transcript for this section.
Transcript begins at 0:00.
ఓ హిందూ మేలుకో అనగానే ముందు పిలుపుగా ఆపై మేలుకొలుపుగా మరికొన్ని క్షణాల తర్వాత మేలిమి తలుపుగా భావన వస్తే, ఈవేళ ధర్మాన్ని గురించి కాసేపు మాట్లాడుకునేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి వేదికగా మనస్సు భావన చేస్తూ ఉన్నది. ధర్మాన్ని గురించి ఆలోచించినప్పుడు ధర్మాన్ని గురించి మనస్సు అనేకమైనటువంటి స్థితులు దాటి స్థిమితంగా విచారణ చేస్తూ ఉన్నప్పుడు "ధర్మో రక్షతి రక్షితః" అంటూ మనం రామాయణాన్ని ఎలా తాకి అంటే ఎలా స్పృశించి ఎలా సంభావన చేసి ఒక అనుభవాన్ని పొందాము మరొక్క వాక్యం ఉన్నది "యతో ధర్మస్థతో జయః" అద్భుతమైన మాట అది. "యతో ధర్మస్థతో జయః" ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడ జయము ఉన్నది. ఈ జయ శబ్దం అంతా కూడా వ్యాసుల వారి శబ్దం. మహాభారతానికి ఆయన పేరు పెట్టుకున్నది జయ. భువనేశ్వరీ మంత్రంలో ఆయన జయ అనేటువంటి మూలమంత్రంలో ఆ నామాన్ని వాడతారు. అంతా జయమే కావాలి ఎట్లా అవుతుంది అంటే ధర్మాచరణ ద్వారా జరగాలి. "యతో ధర్మః" ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం. మనం జీవితంలో ఏదన్నా అపజయం పాలైనా, అపఖ్యాతి పాలైనా, అపనిందలు పడ్డా మనమే ఎక్కడో ధర్మాచరణలో పొరపాటు చేశామని అర్థం. దీనికి ఎవరో కారణం కాదు. మనము సహజంగా మనకు ఏదన్నా జరగ్గానే వాడి వల్ల ఏదో ఇంకెవరి వలనో ఏదో జరిగిందని చెప్తాం. వాడి వలన అంటాం. ఆ వాడు ఎవడో కాదు మనమే. మనకి కీర్తి బాగా సంపాదించాలి అన్న కోరిక కలిగినప్పుడు భావోద్వేగాలకు లోనై అపకీర్తిని మూటగట్టుకుంటాం. అనేకమైనటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు మనల్ని వినహాయించుకొని అందరికీ చెప్పటం మొదలు పెడతాం. ఇది కాదు. "యతో ధర్మః" దీనికి "ధర్మో రక్షతి రక్షితః" కి రామాయణం ఎట్లాగో "యతో ధర్మస్థతో జయః" కి భారతం అంతా అదే. భారతంలో మీరు ఏ ఉపాఖ్యానం తీసుకోండి ధర్మమే జయించింది. ధర్మం ఎక్కడుంటే అక్కడ జయం సంభవించింది. నూరుగురు కౌరవులు, ఐదుగురు పాండవులు మధ్యలో యోగేశ్వర కృష్ణుడు. ఇది ధర్మాధర్మాల యొక్క ఒక ఆవృత్తం. ఒక పార్శ్వం ధర్మం, ఒక పార్శ్వం అధర్మం. అధర్మంలో అనేకమైనటువంటి విషయాలున్నాయి. ధర్మాశక్తులు, ధర్మాచరణాశక్తులు అయినటువంటి పాండవులు సుమారుగా తమ జీవితకాలం అంతా కూడా అననుకూలాలు ఎదుర్కొన్నారు. ఈ అననుకూలాలు పూర్తయ్యే సమయము అంటే అధర్మం అణచివేయబడేటువంటి సమయం. అంటే ధర్మాన్ని ఆచరించిన పాండవులు జీవితాంతము వ్యాతనా పడ్డారు. అధర్మాన్ని ప్రోత్సహించి ఆచరించినటువంటి కౌరవులందరూ కూడా చివరి వరకు భౌతిక అపేక్షతో జీవితాన్ని గడిపారు. అననుకూలాలు వారికి పెద్దగా లేవు, లేనట్టుగా కనిపించినాయి. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే, వారు తెలుసుకోలేని విషయం ఏమిటంటే ధర్మాకృతి అయినటువంటి కృష్ణ పరమాత్మని వాళ్ళు దరిచేరలేకపోయినారు. పాండవులకు ఎట్లా అవకాశం వచ్చిందో కౌరవులకు కూడా అవకాశం వచ్చింది. అయినా అందుకోలేకపోయినారు. భాగవతంలో తొలినాళ్లలో తొలి స్కంధాలలో కుంతీదేవి కృష్ణ పరమాత్మను సమీపించి, "కృష్ణా! నేను వచ్చిన పని పూర్తయింది. నా కన్న బిడ్డలు రాజులైనారు. ధర్మం నెలబడింది. ఇదంతా నీ వల్ల జరిగింది. కష్టాలు ఉన్నంత కాలం కృష్ణ పరమాత్మ నీవు మాకు సన్నిహితంగా ఉన్నావు. ఇప్పుడు మాకు భోగం చేతికందింది. నువ్వు మా యెందు మాతో ఉంటావో ఉండవో తెలియదు. కనుక మేం చేయగలిగింది, నేను చేయగలిగింది ఒక్కటే. రాజ్యమేలవలసినటువంటి కర్తవ్యం నా బిడ్డలదే గాని నాది కాదు. ఈ భౌతిక అపేక్ష నుంచి నన్ను బయట పడేసి పరమాత్మ స్వరూపుడవైన నీవు నాకు ముక్తిని అనుగ్రహించు." అని అడిగింది. ఇది కుంతీ స్తవం. కుంతీ చేసినటువంటి మాట. కృష్ణ పరమాత్మ ఒక చిన్న నాటకం లాంటిది ఆడి ఒక ఆశాపాశాన్ని రేకెత్తించే ప్రయత్నం చేసి, "నీ బిడ్డలంతా రాజులైనారు, సుఖంగా ఈ రాజభోగాలు కొన్నాళ్ళు అనుభవించవచ్చు కదా అత్తా!" అంటే, "నేను అన్నది దీనికోసం కాదు. నా బిడ్డలు ధర్మాచరణతో ఈ రాజ్యాన్ని పాలించేట్లుగా వారిని అనుగ్రహించు. ఆ తర్వాత ఏం జరుగుతుంది నాకేం సంబంధం కృష్ణా! నన్ను ఇక్కడి నుంచి విముక్తం చేయ్." అని అడిగింది. భీష్ముల వారి పరిస్థితి కూడా అంతే. చూడండి, ఆయన ఎంత ధర్మమూర్తి అయినా, ధర్మం ఎరిగిన వాడైనా ధర్మాచరణలో వెనుకబడ్డ వాడు ఆయన. అంతా అయిపోతే తప్ప ఆయనకి శ్రీ మహావిష్ణు దర్శనం కాలే. "మా విజయుం చేరడు వన్నె కాడు మదిని ఆవేశించు ఎల్లప్పుడున్" అన్నది ఎప్పుడు? అంపశయ్యాగతుడైన తర్వాత. మరి అంపశయ్యాగతుడు ఎందుకయినాడు?పితామహుడే కురుకుల పితామహుడే ధర్మవేదియే ధర్మరాజుకి వేదం ధర్మాన్ని బోధించినటువంటి ఆచార్య సత్తముడే. ప్రతిజ్ఞా పాలనలో అద్భుతమైన స్థాయిని అందుకున్నటువంటి వాడే. ఒక్క మాట ఇచ్చినందుకు నిలబెట్టుకోవటానికి జీవితాంతము కూడా నిలబడినటువంటి వాడే. కారణం ఏమిటంటే అధర్మం పెచ్చరిల్లినంత కాలం దుర్యోధనుడితో మొదలై దౌష్ట్యం అంతా కూడా పాండవులను హింసిస్తున్నంత కాలం కులసతి అవమానం పాలవుతున్నప్పుడు కూడా మౌనం వహించి చూస్తూ ఉండిపోయిన కారణంగా కౌరవ అన్నాన్ని తిన్న కారణంగా అది రక్తంగా శక్తిగా మారిన కారణంగా అంపశయ్య మీద పడుకున్న తర్వాత ఆ రక్తమంతా కారిపోయింది. ఎప్పుడైతే కలుషిత రక్తము అధర్మ రక్తము అంటే అధర్మాన్నంలో నుంచి వచ్చినటువంటి రక్తం అది శక్తి కూడా అక్కడి నుంచి వచ్చింది అదంతా పోతే గాని భగవద్దర్శనం భీష్ముల వారికి కూడా కాలే. ఆయనకు జయం సిద్ధించలే భీష్ములవారికి జయం ఏమిటి రాజ్యం పొందటం కాదు కీర్తిని పొందటం కాదు మోక్షాన్ని పొందటం ఆయనకి జయం. ఆ మోక్షాన్ని ఎప్పుడు పొందగలిగాడంటే తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్ళిన తర్వాత. అధర్మాన్ని ఆశ్రయించిన ఆవరణ విక్షేప మల దోషాలతో ఉన్నటువంటి భీష్ములవారు అంపశయ్యాగతులై రణరంగంలో సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత హాహాకారాల మధ్య నక్కల కూతల మధ్య కటిక చీకటి మధ్య ఏకాంతంగా ఒక్కడై ఉండవలసినటువంటి దురవస్థ వచ్చింది. దీనికి కారణం దక్షుల వారలు ఉపేక్ష చేసినది వారల చేటకు గాక భారతమే చెప్తున్నది. దక్షుడైనటువంటి వాడు సమర్ధుడు అయినటువంటి వడు ఉపేక్షా భావంతో గనక ఉన్నట్లయితే అది వారికే చేటు అవుతుంది. వాళ్లనే సమూలంగా నాశనం చేస్తుందని ఒక భారత ప్రమాణం. భీష్ములవారు అంపశయ్య మీద పడుకున్నంత వరకు జరిగింది నిజానికి లేదా పడుకోవటానికి ఇది కారణం అయింది. సరే అంతా అయిపోయింది ఆ రక్తమంతా పోయింది మామూలు రక్తం ఉంది ఉందో లేదో ఆ సమయంలో ఒక సుషుమ్నా గీతంగా అంటే ఒక ఆత్మ గీతాలాపనగా తన కట్టెదుట ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ విష్ణు స్వరూపంగా భాషించాడు కనపడ్డాడు దర్శనం ఇచ్చాడు అక్కడ విష్ణు సహస్రనామం చెప్పాడు ఆయన. అదివేళ మనకు పారాయణార్హమైన నిల-నిలకడ చెందింది. అంటే దేహ భావన, దేహాత్మ భావన, కలుషిత భావన ఒక ఉదాసీన్యము, ఒక అలసత్వము మనకెందుకులే అన్నటువంటి ఒక మౌనం గనక వహించినట్లయితే భీష్ముడు అంతటి వాడికి ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో మనకు కూడా అంతే. ఇదే మాట పదే పదే మనం చెప్పుకోవాలి దక్షుల వారలు ఉపేక్ష చేసిన అది వారల చేటకు గాక. ఆ భీష్ముడే గనక గురు స్వరూపాలన్నీ కూడా ధర్మం వైపు కాసేపు నిలబడి ఉన్నట్లయితే చరిత్ర భిన్నంగా ఉండేది. కానీ వాళ్ళు లేరు లేని కారణంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతి హతమైనారు. వీటన్నింటి మధ్య నిగ్గుతేలి బయటకు వచ్చిన వారు ఎవరు పాండవులు. ద్రౌపది దేవి నన్నోడి తన్నోడనా తన్నోడి నన్నోడనా అని సభాముఖంగా ప్రశ్నించినప్పుడు వీళ్ళ-వీళ్ళలో ఏ ఒక్కరూ కూడా నోరు మెదపలేదు ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేదు. ఆవిడ మానాన్ని కాపాడేటువంటి ఆవిడ గౌరవాన్ని కాపాడేటువంటి పని వాళ్ళు చేయలేదు అంటే అధర్మం వైపు ఉన్నారు అపజయాన్ని కడగా ఎదుర్కొన్నారు. అపజయం గెలుస్తున్నట్టుగా ఉంటుంది కానీ కడగా సత్యమేవ జయతే సత్యం మాత్రమే జయిస్తుంది. సత్యమన్నా ధర్మమన్నా మనం అనుకున్నాం ఒక నాణానికి బొమ్మా బొరుసు వంటివి. ఏది సత్యమో ఏది ధర్మమో అది సార్వకాలికమై నిలబడుతుంది గనుక అటువంటి మహాద్భుతమైన అటువంటి స్థితిని భారతం మనకు ఆవిష్కరిస్తుంది. యుద్ధం అయిపోయింది. కుంతీదేవి నిజానికి రాజ్యాన్ని పొందటానికి అన్ని అర్హతలు ఉన్న కొడుకుల్ని కని ఉండి కూడా ఉదాత్తమైనటువంటి స్త్రీమూర్తి అయినటువంటి ద్రౌపది తన కోడలై ఉన్నప్పటికీ కూడా కోడలు కొడుకులతో కలిసి వాళ్ళ కష్టాల్లో ఆవిడ పాలు పంచుకుని తన మాతృ ధర్మాన్ని నిలబెట్టుకుంది. ఇంకొక పారిశ్రామిక్ చూద్దాం. యుద్ధం అయిపోయింది కృష్ణ పరమాత్మ పంచ పాండవులని కుంతిని ద్రౌపదిని వెంబడి పెట్టుకుని వెళ్ళాడు దృతరాష్ట్రుడు అంతఃపురం లోకి. దృతరాష్ట్రుడిని పలకరించాడు. ఇదిగో యుద్ధం అయిపోయింది మీ వాళ్ళంతా పోయినారు ఇదిగో నీ తమ్ముడి కొడుకులు తర్వాత ద్రౌపది ఇదిగో నా వెంట వచ్చారు వాళ్ళను ఆశీర్వదించు ఇక వాళ్ళు రాజ్యం వెళ్తారు అని అన్నప్పుడు దృతరాష్ట్రుడు ఏం చేశాడు మనందరికీ తెలుసు ఆయన గాంధారి మాత్రం, "కృష్ణా! నూరుగురు కొడుకులను నేను కన్నాను ఒకరిద్దరు కాదు నూరుగురిని కన్నానయ్యా అందులో ఏ ఒక్కడినన్నా బతికించాలి అనేటువంటిది నీ మనసుకి కనిపించలేదా? నీ అత్తనే అయినందుకు నాకు గర్భశోకాన్ని మిగిల్చావే! నిన్ను అందరూ ధర్మమూర్తివని, దైవానివని భావిస్తున్నారే ఏం దైవానివి నువ్వు? నీ ప్రేమకి నా బిడ్డలు నోచుకోలేదా? పంచ పాండవుల్ని వెంబడి తీస్తివి ద్రౌపదిని వెంబడి పెట్టుకొస్తివికుంతీదేవిని వెంబడి పెట్టుకొస్తివి, మేమేం చేసామయ్యా అని నిష్ఠురమాడితే, కృష్ణ పరమాత్మ మందహాస వదనంతో ఒక్కమాటన్నాడు."గాంధారి! నిజమే నూరుగురు బిడ్డలను కన్నావు. కానీ ఒక్కడినైనా కంటితో కన్నావా? నువ్వు కూడా కళ్ళకు గంతలు కట్టుకున్నావు, ఉపేక్షాభావంతో ఉన్నావు. నా కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఎలా పెరుగుతున్నారో చూశావా? వీళ్ళు సమాజహితంగా ఉన్నారా, సమాజానికి వ్యతిరేకంగా ఉన్నారా ఎప్పుడన్నా ఆలోచించావా? బిడ్డల ఎదుగుదల, పెరుగుదల చూపించావా? నీ మాతృప్రేమని వాళ్ళ వైపు ఎప్పుడన్నా ప్రకటించావా? మాతృప్రేమకే నొచ్చని నీ నూరుగురు బిడ్డలు దైవ ప్రేమకి ఎందుకు నొచ్చుకుంటారు? అధర్మం వైపు ఉన్నారు, అధర్మమే వారిని నశింపజేసింది" అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే, 'యతో ధర్మస్థతో జయః' అంటే, ఇవ్వాళ మనం కూడా ఒక్కసారి కొంతకాలం జీవితం గడిపి వచ్చిన తర్వాత, గడచిపోయిన కాలాన్ని గనక మనం నెమరువేసుకున్నట్లయితే, మన వైఫల్యాలన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే, మనం ధర్మం వైపు నిలబడని నాడు మనం అపజయం పాలైనాం. ధర్మం వైపే నిలబడిననాడు విజయాలన్నీ మనవైపు పరిగెత్తుకొని వచ్చినయి. ఇందులో మన ప్రమేయం తక్కువ. మనం చేసింది ఒక్కటే ధర్మంతో కూడి ఉన్నాం. ధర్మంతో కూడి గనక ఉన్నట్లయితే జయం తధ్యం. దీనిని కృష్ణ పరమాత్మ భగవద్గీత నిండా అర్జునుడికి నూరిపోసాడు. ఆ అర్జునుడు ఎవరో కాదు మన బోటి వాళ్ళు. మన బోటి వాళ్ళకి 'వ్యాసేన గ్రథితా పురాణముని నామ జయే మహాభారతం' జీవన సంగ్రామంలో మన జీవితం అంతా ఒక రణరంగమైనట్లయితే, బోధకుడైనటువంటి కృష్ణ పరమాత్మ అంతరాత్మ అయినట్లయితే, అది చెప్తూనే ఉన్నది. చెడు భావన కలగగానే నీకు ఈ ఆలోచన మంచిది కాదు అని లోపల హెచ్చరిస్తున్నది. మంచి ఆలోచన కలగగానే పుణ్యాత్ముడివి, మంచి పని చెయ్యి, నీకు జయం సిద్ధిస్తుంది అని ఎవడో మనల్ని చెయ్యెత్తి ఆశీర్వదించనక్కర్ల. మన యందున్నటువంటి ఆంతరంగిక శక్తి లేదా ఆత్మ ప్రజ్ఞే మనకు మహదాశీర్వచనాన్ని అందిస్తూ ఉన్నది. దీనిని మనం సమన్వయం చేసుకుంటూ, ఈ ధర్మం అంటే ఏమిటో విచారణ చేశాం. అది సాంఘిక ధర్మం, కుటుంబ ధర్మం, స్నేహ ధర్మం, సేవా ధర్మం, ఆచరణాత్మకమైనటువంటి ఈ ధర్మ స్వరూపాన్ని గనక మనది సొంతం చేసుకోగలిగినట్లయితే, దానితో కూడి ఉన్నట్లయితే మనకు జయమే సిద్ధిస్తుంది, అపజయానికి తావు లేదు. ఎప్పుడైతే ధర్మబద్ధమైనటువంటి ఆలోచన ఉంటుందో ధర్మబద్ధమైనటువంటి వాక్కు వస్తుంది. ఈ రెండూ ఎప్పుడు ఏర్పడతాయో ధర్మబద్ధమైనటువంటి ఆచరణ కార్యక్రమం కూడా చేస్తాం. అంటే మన కర్మలు దేనితో మిళితమై ఉన్నాయంటే ధర్మంతో. ధర్మంతో కూడి చేసి ఉన్నట్లయితే ధర్మమే వస్తుంది. ధర్మమే ఆవిష్కృతమవుతుంది. అది జయాన్ని సిద్ధింపజేస్తుంది గనుక నిజానికి భగవద్గీతలో అనేక పారుశ్వాలలో కృష్ణ పరమాత్మ ఈ జయాన్ని గురించి, కీర్తిని గురించి, ఈ పూర్ణత్వాన్ని గురించి చెప్పిన ఖడగా ఒక్క శ్లోకం చెప్పాడు. 'యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ' ఆరు వందల తొంబై తొమ్మిది శ్లోకాలు కాసేపు పక్కన పెడదాం. అవి కర్మ, భక్తి, జ్ఞాన యోగాలకు సంబంధించినటువంటి, అదొక విచారణ, ఒక విశ్లేషణ, అదొక అద్భుతమైన బోధ. ఈ శ్లోకంలో ఆయన ఫలశ్రుతి చెప్పాడు. ఒక జ్ఞానాన్ని పరిపూర్ణమైనటువంటి యోగీశ్వర స్థాయిలో అందించటానికి సంసిద్ధుడైనటువంటి, సదా సిద్ధుడైనటువంటి ఒక యోగేశ్వరుడు వంటి కృష్ణుడు ఒకచోట ధనుర్ధారియై, అప్రమత్తుడై, పూర్ణమైనటువంటి ఎరుకతో, స్పృహతో, తలపుతో, భావనతో, శుద్ధం-శుద్ధితో, సంసిద్ధితో నిలకడ చెందినటువంటి అర్జునుడు వంటి వాడు ఎక్కడైతే కూడి ఉంటారో, అంటే బోధకుడు, సాధకుడు ఇద్దరూ ఎంత పవిత్రమైనటువంటి భావనతో ధర్మబద్ధులై ఉంటారో, ఆ సన్నివేశం వలన ప్రపంచానికి 'విజయోర్భూతిః' విజయము సిద్ధిస్తుంది, విజయమే లభిస్తుంది. నిలకడ చెందినటువంటి ఒక ధర్మానుభూతి ప్రపంచానికి కలుగుతుంది. ఇది భగవద్గీత ఇచ్చేటువంటి ఒక మంగళాశాసనం. ఇవ్వాళ మన బోధకులు అలాగే ఉండాలి. యోగీశ్వర స్థాయిలో ఉండాలి. సాధకుడు సమర్పణ చేసి ఉండాలి, శరణాగతి పొంది ఉండాలి, వినమ్రుడై ఉండాలి, వినయశీలియై ఉండాలి, నిశ్శేషుడై ఉండాలి. తనను తాను ఏమీ మిగుల్చుకోని ఒక పూర్ణమైన స్థాయిలో తాను గనక ఉన్నట్లయితే, ఆ స్థాయిలో గురువు నుంచి తాను పొందినటువంటి ఈ ధర్మ విచారణ వలన ధర్మాసక్తి కలిగి, ధర్మాసక్తిని పట్టి ధర్మాచరణ చేసి, ధర్మాచరణలో నుంచి ఒక ధర్మానుభవాన్ని పొంది, ధర్మానుభూతిని చిందిన్చుకొని ఖడగా ధర్మ విభూతిగా జీవుడు మిగిలిపోవాలి. కనుక 'యతో ధర్మస్థతో జయః' అంటే, ఎక్కడైతే ధర్మం వైపు మనం నిలబడి ఉంటామో, ఎప్పుడైతే అన్నివేళలా ధర్మంతో మనం కూడి ఉంటామో మనకు విజయమే తధ్యం. ఆ విజయము లౌకిక విజయం కావచ్చు, పారలౌకిక విజయం కావచ్చు, మోహక్షయమై మోక్షం కావచ్చు. జీవితంలో జీవనంగా శరీరంలో ఉన్నప్పటికీ కూడా జీవన్ముక్త స్థాయిలో నిలకడ చెందటం కూడా ఒక అద్భుతమైనటువంటి విజయ సాధనే కాబట్టి దీనికన్నింటికీ కూడా మన మనస్సుని పవిత్రీకరణం చేసుకోవాలి. ధర్మబద్ధమైన ఆలోచనలు చేయాలి. వ్యక్తిగా, కుటుంబంగా, వ్యవస్థగా, వ్యష్టిగా, సమష్టిగా, సృష్టిగా మనం గనక ధర్మాన్ని ఆచరిస్తూ వెళ్ళినట్లయితే మనకు నిర్దేశింపబడిన కర్మలనిధర్మబద్ధంగా ఆచరించగలిగినట్లయితే ఆ ధర్మము మనకు ఒక విజయాన్ని విజయం ద్వారా శాశ్వతమైన అమృతత్వాన్ని మనకు కలిగిస్తుంది. అటువంటి విజయంలో నుంచి ఒక త్యాగం ఏర్పడుతుంది. నా కర్మణాన ప్రజాయాన ధనేన త్యాగేన ఇక అమృతత్వమానశు. మనం అమృత పురుషులం కావాలి అమృత పుత్రులం కావాలి అమృతత్వాన్ని పొందాలి అమరత్వాన్ని పొందాలి. దీనికి మూలం ఏమిటంటే త్యాగం అవుతున్నది. ఆ త్యాగము ధర్మమూలం గనుక అయినట్లయితే ఆ ధర్మం వలన ఏర్పడినటువంటి ఆ కీర్తి అవ్యోమపేశల చంద్రీ మృదు కీర్తి. ఆకాశాన్ని అంటుకున్నటువంటి వెన్నెల వలె అమలినమైనటువంటి గంభీరమైనటువంటి నిండు పండు వెన్నెల వలె మానవుని మరణానంతరం కూడా కలకాలం జీవించేట్లుగా చేస్తుంది. ఇవాళ మనం చేసుకునే ఈ సాధనలు కానీ ఈ జయాలు కానీ ఈ పొందేటువంటి సౌభాగ్యాలు గానీ ఈ పొందేటువంటి విజయ పరంపర గానీ దేనికయి? ఇవాళ జీవించటం కోసం కాదు. మరణించిన తర్వాత కూడా మనం జీవించాలి. అమృతత్వ మానశు. మృతి లేని స్మృతిగా కాక ఒక పరిపూర్ణమైనటువంటి చైతన్యంగా మనం విలసితం చెందాలి అంటే ఇదిగో ఇది కారణం అవుతున్నది గనుక ధర్మాన్ని అనుసరిద్దాం. ధర్మం అంటే ఏమిటో తెలుసుకుందాం. అందునా ఓ హిందువు మేలుకో అని మనకు ఒక ప్రబోధం. ఎప్పుడైతే ప్రతిరోజూ మన మనసులో మనలో ఉన్నటువంటి హైందవ ధర్మాన్ని అంటే ఒక విశాలమైన భావనే హైందవ ధర్మం. It's a way of living way of life. దాన్ని ఎట్లా విశ్లేషణ చేసినా అది ఒక మతానికో లేకపోతే ఒక చిన్న పరిధికో ఒక చిన్న epicenter కో ఒక పరిమితమైనటువంటి భావనా భూమికకు చెందినటువంటి ధార్మిక వివేచన కాదది. ఒక విశాలమైన విస్తృతమైనటువంటి వసుధైక కుటుంబ నిర్మాణంలో పాత్ర వహించేటువంటిది ఈ హైందవం. అంటే వసుధైక కుటుంబ నిర్మాణం అంటే జాతి మత వర్గ వర్ణములను దాటి అందరినీ తరలో చేర్చుకోగలిగినటువంటి ఒక గంభీర మహాసాగరం వలె అంటే inclusive. ఇవాళ ఇలా చెప్తే అర్థం అవుతుంది గనుక మనది exclusive కాదు inclusive. పరమత సహనం ఔదార్యం ఒక చక్కని ప్రేమ వీటన్నింటినీ కూడా బోధించేటువంటి ఒక ఉదాత్త భావనా భూమిక హైందవ ధర్మం గనుక ఆ హిందువు తనలో ఉన్నటువంటి ముందే అనుకున్నాం మనం హిం అంటే హింస అది ఒక violence. దానిని దూరం చేసేటువంటి శక్తి భావన కాబట్టి ఆ భావనే హైందవం గనుక ఆ హైందవాన్ని ఆచరించే ప్రతివాడు కుల మత వర్గ వర్ణాతీతమైనటువంటి భావనలో హిందువు అవుతున్నాడు గనుక ఆ హిందు హైందవ ధర్మం ద్వారా వసుధైక కుటుంబ నిర్మాణం జరిగి తీరుతుంది. జరగాలి. ఎందుకంటే వేదోఖిలో ధర్మమూలం. అసలు వేదాల నిండా ఏమున్నది అంటే చదవని వాడు అయితే ఏమీ లేదంటున్నాడు. చదివిన వాడు మాత్రం మూలాలు అన్నీ అక్కడ ఉన్నాయి అని శాస్త్రీయంగా విజ్ఞానపరంగా దానిని ముందు అనుభవించేసుకుంటున్నాడు. ముందు చదవాలి. వేద మంత్రాలలో ఆనాటి భాషలో ఉన్నాయి decode చేసుకుందాం అర్థం చేసుకుందాం. హైందవమైనటువంటి ఈ భాషని హైందవమైనటువంటి ఒక ధర్మాన్ని మన నిత్య జీవితంలో గనుక ఆచరణాత్మకం చేసుకుంటూ వెళితే ప్రబోధాన్ని దాటి ప్రబోధం ఏముంది కాసేపు ఉద్వేగం కలిగించడానికి పనికొస్తుంది. లేదు ఆలోచన రేకెత్తిస్తుంది. ఇక ప్రచారమా అది వ్యక్తిగత ప్రచారమై అసలు విషయం మరుగున పడిపోతుంది. ప్రసారం కావాలి. We have to transmit what we think inside what we believe in వీటన్నింటినీ కూడా ఒక సమగ్రమైనటువంటి విచారధారగా కొనసాగిస్తూ మనం ప్రతిరోజూ కూడా మనలో ఉన్నటువంటి ఆ హైందవమైనటువంటి ధర్మ భావాన్ని కర్మాచరణని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. అటువంటి ఆ శక్తిని ఆ యుక్తిని ఆ రక్తిని ఆ భక్తిని సమస్తాన్ని కూడా అనంతకోటి గురు ప్రవాహాలు మనందరికీ కూడా మంగళాశాసనం చేయు గాక అని భావిస్తూ ఓ హిందూ మేలుకో అన్నప్పుడు ఎవరికి వారే వారి యందున్నటువంటి ఆ భావనని ఒక పతాక స్థాయికి తీసుకు వెళ్ళాలి ఆచరణ ద్వారా. కేవలం ప్రబోధం ద్వారా సమాజం మారదు. అందుకనే ఋగ్వేదం చెప్పింది అది భరత సావిత్రి అంటే ఇదంతా ఋగ్వేదం. ఆ ఋగ్వేదం వ్యక్తి లో నుంచి ఉదాత్త భావనలు ఈ జగత్తుకు అందు గాక అట్లాగే సర్వ జగత్తు నుంచి ఉదాత్త భావనలు నా యందు ప్రవేశించు గాక అని ప్రతిరోజూ మనకు మనం అనుకోవాలి. అటువంటి ధీశక్తిని యుక్తిని సమస్తమైనటువంటి ఆ విశాల భావనా వేదికని భూమికని పరమేశ్వరుడు మనకు అనుగ్రహించు గాక అని మంగళాశాసనం చేస్తూ స్వస్తి.
YouTube · audio
O Hindu Meluko | Sreepeetam | ఓ హిందూ మేలుకో
O Hindu Meluko | Sreepeetam | ఓ హిందూ మేలుకో
Source: Sreepeetam on YouTube
0:00 / 23:23
More in this series