Skip to content
Transcript తెలుగు
తన ప్రాణాన్ని, తన జీవితాన్ని తాను పణం పెట్టాలి. రాముడు పణం పెట్టాడు. సీతమ్మ వారి జీవితానికి పుటం పెట్టాడు. చూశారా! ఇక్కడ పణం పెట్టాడు అక్కడ పుటం పెట్టాడు. ఇద్దరూ యాతనలు పడ్డారు. ఎందుకని పడ్డారు? ఆయన సంకల్పిస్తే రావణాసురుడ్ని చంపడం కష్టమా? రావణాసురుడ్ని చంపటం కోసమే అవతారం రాలే. తపస్సుని, స్వాధ్యాయాన్ని, యజ్ఞ స్వరూపాన్ని, వేద ధర్మాన్ని లోకోత్తరంగా నిలబెట్టాలి. మళ్ళీ రాబోయే తరానికి అందించాలి. అందించాలి అంటే ఇప్పుడు దాన్ని మిగల్చాలి. మిగల్చాలి అంటే దుష్కర్మ చేసే వాడి చేతుల నుంచి దాన్ని లాక్కొని బయట పడేసి మళ్ళీ దానికి ఒక మర్యాద పూర్వకమైన వేదిక నిర్మాణం చేయాలి గనుక రామ కథ అంతా కూడా అలా సాగితే కృష్ణ పరమాత్మకు తెలుసు రాబోయే యుగం ఎట్లా ఉంటుందో. ఇదిగో మన యుగం కలియుగం. మనం దేవుడు లేడంటూ ప్రారంభమైన యుగం అది. దేవుడే సాక్షాత్తు వచ్చినా ఈయన అయి ఉండడు అంటాం. ఆయన్ని నేనే దేవుణ్ణి అన్నాను కావడానికి వీల్లేదని మనం అనేక వాదాలు తెచ్చి ఏదో జీవితం అంతా చెల్లగొట్టుకుంటాం. అది ఒక విధానం. సరే కృష్ణ పరమాత్మ ఎన్ని చెప్పినా మాట వినటం లేదనుకున్నాం. కానీ ఒకానొక చోట అన్నాడు. శ్లోకం పందొమ్మిది వందల అరవై రెండు. ఇవాళ నేను స్మరించుకోవాలి స్వామిని. అంటే ఆయన్ని స్మరించని క్షణం లేదు అసలు. మళ్ళీ స్మరించుకోవాలి. ఏమిటి అంటే మేమందరం కూర్చొని నా ప్రథమ దర్శనంలో వరండాలో మాతో పాటు నేలమీద కూర్చున్నారు స్వామి. మేము నలభై మంది ఉన్నాం అందులో చిన్నవాడిని, పన్నెండేళ్ల వాడిని నేనే. భగవంతుడు ఎవరి యోగక్షేమాలు చూస్తాడు అన్నది ప్రశ్న. అక్కడ మొదలు పెట్టారు. వచ్చిన ప్రతి వాడి యోగక్షేమం చూస్తాడా? చూడాలి కదా! దేవుడైతే మరి అందరూ సమానం కదా. అంటే అందరూ సమానమే కానీ ఇక్కడ చిన్న పాయింట్ ఉంది. కృష్ణుడు ఇలా అన్నాడు <|diarize|>"అనన్యాశ్చింతయంతో మాం యే జనః పర్యుపాసతే, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం" ఇది చాలా critical శ్లోకం భగవద్గీతలో. అంటే కృష్ణుడు direct గా భగవాన్ ఉవాచ అనేదానికి అనన్య చింతన ఉండాలి. అన్య చింతన వదిలేయ్ అనటం లేదు ఆయన. ఏది ఉండాలో చెప్తున్నాడు do's and don'ts లో don't చెప్పటంలే do చెప్తున్నాడు. అనన్య చింతన ఉండాలి నాయందు మాత్రమే. 'నా' అంటే కృష్ణుని యందు కాదు, ఆత్మ యందు. "అనన్యాశ్చింతయంతో మాం యే జనాః" అటువంటి వాళ్ళు ఎవరైతేనా ఉన్నట్లయితే, అనన్య చింతన ఉన్నవాళ్ళు గనక ఉన్నట్లయితే చింతన ఉంటే ఏం ప్రయోజనం? ఏదో ఏడాదికి ఒకసారి, రోజులో నిమిషం ఒకసారి దేవుణ్ణి తలుచుకొని మిగతా అంతా మన పనులు మనం చేస్తే ప్రయోజనం లేదట. "యే జనాః పర్యుపాసతే" పరిహి ఉపా-ఉపాసన చేయాలి. పరి ప్రశ్న వెయ్యాలి. ప్రణిపాతం చేయాలి. రెండు రెండు చెప్తాడు విశేషంగా కృష్ణుడు. అంటే ఇక్కడ ఎవరైతే పర్యుపాసన చేస్తారో అది తప్ప ఇంకోటి చేయకుండా ఉంటారు. అది దాని అర్థం. అటువంటి వాళ్ళు అక్కడి దాకా వస్తే వాళ్ళు గనక "తేషాం నిత్యాభియుక్తానాం" అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాతో కూడి ఉంటారో, ఎంతసేపు అంటే "నిత్యాభియుక్తానాం" నిత్యమూ అభియుక్తమై ఉండాలి నాతో ఉండాలి. నాతో ఉండాలి, మనస్సు నాయందే ఉండాలి, అనన్య చింతన ఉండాలి, అది ఉపాసనా భావంగా ఉండాలి. ఉన్నట్లయితే "యోగక్షేమం వహామ్యహం" వాళ్ళ యోగము, క్షేమము అప్పుడు నేను తీసుకుంటా. అంతేగాని కొబ్బరికాయ కొట్టగానే యోగక్షేమం నువ్వు మోయి మూట అంటే ఆయన ఎందుకు మోస్తాడు? పూలమాల వేసినా మూటను మోయి అంటే మోస్తాడా? మోయడు. వ్రతాలు చేస్తాను మోయి అంటే మోస్తాడా? మోయడు. కాబట్టి శ్లోకం గుర్తు పెట్టుకోండి. "అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం" అహం నేను వహిస్తాను అన్నాడు. నేను అంటే ఆత్మే వహిస్తుంది. ఆత్మే వహించినప్పుడు దేహం దేవునిది ఉండేది పోయేది. కాసేపు ఉంటుంది ఇది ఎక్కువ రోజులు ఉండదు. ఉంటుంది పోతుంది. కానీ అన్ని కాలాలయందు ఉండేటువంటిది, నిత్య సత్య శాశ్వతమైనటువంటిది, నిత్య శుద్ధాత్మకమైనది, బుధ్యాత్మకమైనది ఏది అంటే అది ఆత్మ కాబట్టి ఆత్మ అనేటువంటి దాన్ని ఎరగాలి, అది నేను అని ఎరుగు అర్జునా అన్నాడు. అర్జునుడికి భయం. యుద్ధం అంటే, రాజ్యం అంటే రేపు పొద్దున గెలిస్తే రాజ్యం చేయాలి చూడండి. గెలవకపోతే దాస్యం చేయాలి. రెండు భయాలే చూడండి. అంటే ఆనంద్-సంపద వచ్చినా భయమే. మనకు కూడా అదే కదా! డబ్బు వస్తే ఒక భయం, డబ్బు లేకపోతే రెండో భయం. కాబట్టి రెండు వదిలిపెట్టమన్నాడు. మోసేవాడు ఎవడో ఒకడు కృష్ణుడు దొరికాడు అని "యోగక్షేమం వహామ్యహం" అనంగానే అప్పుడు మాత్రం అర్జునుడు అన్నాడు, నువ్వు ఏం చెప్తే అది చేస్తా అన్నాడు. "కరిష్యే వచనం తవా" ఇప్పుడు చెప్పు ఏం చేయాలి అని. ఏమనుకున్నాడు అర్జునుడు అంటే ఇంకేముంది చె-చేయటానికి యుద్ధం చేయటానికి వచ్చాం. యుద్ధం చెయ్ అంటాడు అనుకున్నాడు. కానీ అర్జునుడితో కృష్ణుడు ఏమన్నాడంటే "యోగీర్భవ అర్జున". మళ్ళీ మొదటికి వచ్చాడు అర్జునుడు. నేను యుద్ధం చెయ్యను అన్నంత సేపు చెయ్యమని చెప్పావు. నువ్వేం చెప్తే అది చేస్తాను, యుద్ధమే చేస్తానని మనసులో అంటుంటే యోగివికా అంటావేంటి? నేను మళ్ళీ గడ్డాలు, మీసాలు పెంచుకొని, కాషాయం కట్టుకొని స్వామివారు అయిపోతే ఇట్లా అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు "యోగీర్భవ" అంటే వేషం కాదు నాతో యోగించి ఉండు. నాతో కూడి ఉండు మిగతావన్నీ వదిలేసేయ్. నాకు వదిలేసి నువ్వు బాణం తీసుకో. వేసేది నేను.వేయించేది నేను, బాణము నేను, ధనుస్సు నేను, అసలు అర్జునుడినే నేను అన్నాడు. అదే నర నారాయణీయం అయింది. నరుడు నారాయణ స్వరూపం, నారాయణుడు నర స్వరూపంగా వచ్చి కృష్ణార్జునులుగా రెండుగా కనిపించిన ఒక అభేద అద్వైత స్వరూపం అది. కనుకనే లోకోత్తరమైనటువంటి భావన జరిగింది. సరే కథ అంతా అయిపోయింది. చివరికి చిట్టచివరికి "యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ" మనం చేసేటువంటి యోగం అంతా కూడా చివరికి ఏం చేయాలి? ద్వాపర యుగాంతంలో మహాభారత సంగ్రామపు తొలి క్షణాలలో ఏడు వందల శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఉపదేశించాడో, ఏం చేయాలన్నాడో, ఒక సమర్ధుడైనటువంటి యోగీశ్వరుడి స్థాయికి చెందిన కృష్ణుడు లేదా కృష్ణుడు వంటి ఒక ఆచార్య సత్తముడు, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడి వంటి ఒక సాధకుడు ఇద్దరూ కనుక కూడి ఉన్నట్లయితే లోకానికి శాంతి, సుఖము, ధర్మము, ఆనందము ఇవన్నీ లభిస్తాయి. "ధ్రువా నీతిర్ మతిర్మమ" జగత్తుకు లభిస్తాయి అని ద్వాపర యుగం అక్కడ ఆపాడు. అంటే కృష్ణ పరమాత్మ ఏడు వందల శ్లోకంలో ఏది చెప్పబడిందో అది జగత్తుకి అందించటానికి మళ్ళీ తానే అవతారం ఎత్తాలి. అటువంటి అవతారమే పందొమ్మిది వందల ఇరవై ఆరు నవంబరు ఇరవై మూడున ఆంధ్రదేశంలో జగత్తు, భూమండలి క్రిత పుణ్య విశేష అవతారంగా సత్యసాయి భగవానుడి అవతారం వచ్చింది. అవతారం వస్తూనే ఏం చేసింది? పద్నాలుగేళ్ళు వస్తుండగానే నేను సాయిబాబాను అని ప్రకటించింది. మే ఇరవై మూడు, పంతొమ్మిది వందల నలభైలో ఉరవకొండలో శేషమ్మరాజు గారు మిగతా వారంతా "నువ్వు ఎవరో మాకు నిజం చెప్పు, ఏమిటి ఇలా చేస్తున్నావ్? మామూలు వాడిలా లేవు, ఉన్మత్తుడి వలే ఉన్నావు. నువ్వు మామూలు సాధారణ బాలకుడి వలే లేవు" అని చాలా గట్టిగా అడిగినప్పుడు స్వామి మల్లెపూలలా విసిరాడు. దాంట్లో నుంచి "ఐ యామ్ సాయిబాబా" అని వచ్చింది. సాయిబాబా నామం అప్పుడు దక్షిణాపథంలో ఎవరికీ తెలియదు. సాయిబాబా ఎవరు? మనకు రాముడు తెలుసు, కృష్ణుడు తెలుసు సాయిబాబా తెలియదు. కాబట్టి ఎవరు సాయిబాబా అనుకున్నప్పుడు మే ఇరవై మూడు, పంతొమ్మిది వందల నలభై నేను సాయిబాబాను అని ప్రకటించినటువంటి రోజు. మళ్ళీ అక్టోబర్ ఇరవై, పంతొమ్మిది వందల నలభై స్వామి తన అవతార declaration మొన్న మొన్న జరుపుకున్నాం. అవతార ప్రకటన చేసినటువంటి ఒకే ఒక్క అవతారం ఇప్పటివరకు జరిగిన భారతీయ చరిత్రలో సత్యసాయి భగవానుడి అవతారం మాత్రమే. రాముడు తన అవతారాన్ని ప్రకటించలే, మహావిష్ణువుగా ప్రకటించాడు. రాముడై వచ్చి ఏం ప్రకటించలా. కృష్ణ పరమాత్మ నర్మగర్భంగా చెప్పాడు. పరిత్రాణాయ అంటే ఎందుకు వచ్చానో చెప్పాడు, ఎప్పుడు వస్తానో చెప్పాడు, ఎప్పుడెప్పుడు వస్తానో చెప్పాడు, వచ్చి ఏం చేస్తానో చెప్పలే. తన కార్యక్రమం, ముందున్న కార్యక్రమం ఏమిటో చెప్పలే. కానీ ఇది కూడా ఎప్పుడు చెప్పాడు? యుద్ధరంగంలో చెప్పాడు. జీవితమంతా మర్మంగా, గుప్తంగా ఉంచేశాడు. కానీ పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవయ్యవ తారీఖున ఈశ్వరమ్మ తదితర కుటుంబ సభ్యులందరి ముందు నుంచొని "మీకూ నాకూ సంబంధాలు తెగిపోయాయి. ఇకపై ఎట్టి బంధనాలు లేవు. నాకోసం నా భక్తులు కాచుకొని వేచి ఉన్నారు. వారి కోసం నేను గృహాన్ని వదిలి పెడుతున్నాను. ఇకపై ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన బాంధవ్యాలు నీకు-మీకూ నాకూ అటువంటివి ఎట్టివి లేవు" అన్నారు. పదహారు ఏళ్ళ పిల్లవాడు. సాయంకాలం అయితే ఆకలి ఏస్తే అన్నం ఎక్కడ దొరుకుతుందని అలమటించేటువంటి వయస్సది. ఎవరు నన్ను చూస్తారు అనేటువంటి వయస్సది. జగత్తునే చుట్టానికొచ్చినటువంటి స్వామి అవతార declaration చేసి మళ్ళీ ఇంట్లో ప్రవేశించలే. ఈశ్వరమ్మ చాలా కాళ్ళావేళ్ళా పడింది. పడినా సరే ఆయన నిర్ణయం. అవతార ప్రకటన బంధం తెగటం మాత్రమే కాదు, తర్వాత ఏం చేయబోయేది చెప్పారు. ప్రధానంగా మూడు అంశాలు వేదోద్ధరణ, ధర్మోద్ధరణ, దీనజనోద్ధరణ. ఇవి ప్రధాన అంశాలుగా నా అవతారం సాగుతుంది అని it is on record. అది ఎవరో కల్పించి రాసినవి కాదు, యథార్థంగా స్వామి నోటి నుంచి వచ్చినటువంటి మాటలు. వేదోద్ధరణ అంటే వేదాలను ఉద్ధరించటం అంటే వేదాలను రక్షిస్తే, వేదాలను పోషిస్తే, వేదాలను భాషిస్తే, వేదాలను గనుక గౌరవిస్తే, వేదాధ్యయనం చేస్తే వేదాలే జాతిని రక్షిస్తాయి. కనుక స్వామి అన్నింటికంటే దేనికి పెద్ద పీట వేశారు? వారి అవతార వైభవంలో ప్రకాశమానమైనటువంటిది ఏది అంటే మొట్టమొదటిది వేదమే. అందుకనే మీరు ఇవాళ రెండు వందల దేశాలు. దేశాల్లో ఉన్న అనేక ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు. మేము చాలా ఆధ్యాత్మికంగా చాలా గట్టి వాళ్ళం, మా గురువుగారే అసలు అవతారమూర్తి అనుకున్న వాళ్ళ దగ్గర కూడా ఎక్కడా వేదం వినపడనివే తప్ప వేదం వినపడేవి లేవు. కానీ ఇవాళ స్వామి పంతొమ్మిది వందల నలభై నుంచి ఇప్పటి క్షణం వరకు కూడా ప్రశాంతి నిలయం స్వామి దివ్య సన్నిధి నుంచి పొద్దున కాలుడే సమయాన్ని ఇట్లా సరిదిద్దుకోవాలి. అంతగా వేదం వినపడుతుంది. ఇంకెక్కడా మీకు వేదం వినపడదు.వేదం వినిపించేది ఎక్కడ అంటే సత్యసాయి భగవానుడి దివ్య ఆవరణ నుంచి మాత్రమే. ఇది వేదోద్ధరణ. అందుకనే స్వామి వేద పరిషత్తు పెట్టి వేదాల మీద అధ్యయనం చేయించి కోనసీమ ప్రాంతం నుంచి కర్ణాటక ప్రాంతం నుంచి తమిళనాడు నుంచి వేదాలు చదువుకున్నటువంటి వాళ్ళని, చతుర్వేదులని, త్రివేదులని, ద్వివేదులని వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఇటు దక్షిణాత్య పదంలో దక్షిణా పదంలో దక్షిణాత్య విధానంలో వేదం ఎలా ఉచ్చరించబడుతుంది, హిందూస్థానంలో ఎట్లా విచారించబడుతుంది, రెండింటి మధ్య ఉన్నటువంటి పాఠ్య అంతరాలు ఏమిటి? దాని లోతులు ఏమిటి? స్వామి అధిష్టాత పరదైవతమై వేదం మీద స్వామి చెప్పినటువంటి ఉపన్యాసాలు వింటే ఒళ్ళు పులకరించి పోతుంది. ఏమిటి పరమాత్మ వేదమే మళ్ళీ సత్యసాయి అయి వచ్చిందా? వేదమే మళ్ళీ రూపం తీసుకుని వచ్చిందా? అనేటిది అది దాన్ని అనుభవించగలిగిన wave length కావాలి. జ్ఞానం కావాలి. లేకపోతే మామూలు ఉపన్యాసం లాగా అనిపిస్తుంది. ఏదో ఏదో మాట్లాడాలి కదా స్వామి కూడా మాట్లాడారు అనుకుంటాం. అట్లా మాట్లాడలేదు. స్వామి ఏది చెప్పినా వేద ప్రమాణంగా చెప్పారు. కానీ ఇవ్వాళ కాలానికి అనుగుణమైన భాషని ఎంచుకున్నారు. ఎంచుకొని ఎడనెడా చక్కగా English లో కూడా చెప్పారు. చెప్పవలసిన వాళ్ళకి భాషలో చెప్పాలో చెప్పారు. ఏమీ తెలియని వాడికి హృదయ భాషలో చెప్పారు. కానీ సత్యాన్ని చెప్పాలో సత్యం చెప్పడానికి వచ్చారు. వేదము వేదకాలం నుంచి అని వింటాం TV లో. వేదం కాలాతీతమైనది. వేదకాలం అంటూ లేదు అసలు. కాలాతీతమైనటువంటి ఒక వేదమే ఒక పురుష రూపంలో ఒక శివశక్త్యాత్మక స్వరూపంగా సత్యసాయి భగవానుడు వచ్చి నాలుగు వేదాలుగా చెప్తూ ఉన్నారు. నాలుగు వేదాలు వేదవ్యాసులవారు మనకు అందించారు. కానీ వేదాలు అనంతోవై వేదః అనంతమైనటువంటి జ్ఞానమే వేదం. దానిలో లేనిది ఎమరనిదంటూ లేదు. అసలు ప్రపంచం యొక్క ఉనికి అస్తిత్వం వ్యక్తిత్వం దీని చలనం ఇది ఆగిపోవటం ఇది కలగనటం ఇది ఇంకోటేదో పొందటం సమస్తము కూడా వేద స్వరూపమే కాబట్టి వేదము కానిది లేదు అంటూ స్వామి వేదాలమీద సత్యసాయి వేదవాణి వేదవాణి నిండా అసలు వేదాలమీద స్వామి చేసిన వ్యాఖ్యానాలు ఇవాళ నిజానికి పండితులంతా చదువుకోవాలి. ఊరికే వల వేసి నోటికొచ్చిన నాలుగు మంత్రాలు చదివి మాకు వేదం వచ్చు వచ్చును అనేటువంటి ఆత్మద్రోహం చేసుకునే కంటే వేదంలో ఉన్నటువంటి ప్రతి మాటని ప్రతి syllable ప్రతి స్వరాన్ని స్వామి ప్రపంచానికి చాటారు. కాబట్టి వేదోద్ధరణ స్వామికి పరమ ఆనందం ఏది కలిగిస్తుంది అంటే ఒక వేదపండిత పురుష సత్కారం. వేదపండిత సత్కారం అంటే డబ్బు ఇవ్వమని కాదు, పెద్ద కనకాభిషేకం చేయమని కాదు. పురుష స్వరూపం మన దగ్గర మన ముందుంటే చేతులు జోడించి నమస్కరిస్తే చాలు. వేదానికి నమస్కరించినట్లే. వ్యక్తికి నమస్కరించినట్లు కాదు. కాబట్టి వేదాన్ని ఎన్ని సంస్థలు వేదం మొదలు పెట్టాలి వేద పాఠశాలలు ప్రారంభిస్తాయి. కానీ వాటిని పోషించే శక్తి లేదు వాటికి. సత్యసాయి భగవానుడు జాతి, మత, వర్గ, వర్ణాలకు అతీతంగా కేవల బ్రాహ్మణులు మాత్రమే కాదు వేదం అందరూ చదవాలు చదవాలి, అందరూ నేర్చుకోవాలి. ఇక్కడ నిమ్న జాతులు, దళిత జాతులు మీరు సృష్టించుకున్నారు. వేదము పరమాత్మ యొక్క స్వరం అది. పరమాత్మ యొక్క స్వరం, పరమాత్మ యొక్క భావన, పరమాత్మ యొక్క ప్రతిధ్వని. re sound, reflection and reaction that's called వేద. కాబట్టి పరమాత్మ భావాన్ని మీరందరూ చదవండి అన్నప్పుడు ఒక దృశ్యం నేను చూశాను ప్రశాంతి నిలయంలో. వేదపండితులంతా ఎడమవైపు మోహరించి ఉన్నారు. స్త్రీలంతా ఒకవైపు ఉన్నారు. మధ్యలో రోజున సుమారు రెండువేల మంది పిల్లలు స్వామి దగ్గర వేదం నేర్చుకున్న పిల్లలు కూర్చుని ఉన్నారు. వేదపండితులు ఒక్కసారి ఉచ్ఛైశ్వరంలో వేదం వేదపఠనం ప్రారంభించారు. రెండు నిమిషాలు దాటగానే స్వామి పిల్లల వైపు చూశారు మీరు చదవండి అన్నట్టు. ఆరోజు రెండువేల మంది పిల్లలు వేదం స్వామి ముందు చదువుతుంటే రెండువేల మంది శుకావధూతలు అక్కడ చదివారా? వేదమే తనను తాను అనుకుంటున్నదా? loud thinking loud speaking అంటామే వేదమే తనంతట తాను ప్రవహిస్తున్నదా? అన్నటువంటి ఒక దివ్య భావన. తర్వాత ఒక్కసారి స్త్రీల వైపు చూశారు. స్త్రీలు వేదం అందుకున్నారు. స్త్రీలతో, పసిబాలురతో, ఘనాపాఠీలతో ఏకకాలంలో స్వామి సుమారు గంటన్నర సేపు వేద ఘోష్టి చేయించారు. వేద ఘోష్టి జరుగుతున్నంత సేపు అది వింటూ స్వామిని చూట్టం ఒక దివ్యానుభవం. స్వామి ఆనందం వేరు, తేజస్సు వేరు, ఆయన పొందిన ఆనందం వేరు, ఆనంద సుస్వర సస్వరమైనటువంటి ధ్వనిలో నుంచి శబ్ద బ్రహ్మమే సత్యసాయి భగవానుడై మళ్ళీ జగత్తులోకి వచ్చిందా? అన్నప్పుడు అసలు స్వరూపాన్ని చూశాం ఇక్కడే ప్రాణం పోతే చాలదా? అన్న భావన కలుగుతుంది మనకి. అంటే సాయుజ్యం ఏదో మన ఆయుష్షు ఉన్నంత కాలం బతికి చెల్లగొట్టుకుని వెళ్ళటం కాదు. ఒక పరమాద్భుతమైన భావన కలిగినప్పుడు, ఒక తీవ్రమైనటువంటి స్పందన కలిగినప్పుడు, కనిపిస్తున్న ఎదురుగా కనిపిస్తున్నటువంటి వస్తువులోనే పరమాత్మను గనక మనం తేజోమయంగా దర్శనం చేయగలిగితే తర్వాత ఉన్నా ఒకటే, ఉంటే మంచిదే, లేకపోతే నష్టం లేదు. దానిని మించిన సాయుజ్యం మరొకటి లేదు. రోజు కలిగినటువంటి అనుభూతి మాత్రం అది. రోజున స్వామి ఎప్పుడూ ఎన్నడూ నాకు తెలిసిఏనాడు రెండు చేతులు చరచి చప్పట్లు కొట్టిన సందర్భం అంతవరకు లేదు. కానీ రోజు వేద గోష్టి అయిపోయిన తర్వాత స్వామి స్వయంగా మైక్ ముందు చప్పట్లు కొడుతూ మహానందాన్ని ప్రకటించారు. అంటే పరమాత్మని మూడు భావాలు ఎంత స్త్రీలు వాళ్ళు చదివినటువంటి వేద సద్గోష్టి పరమాద్భుతం. అనిర్వచనీయమైన అనుభూతి అది. అది ఇవాళ అవతార వైభవంలో, అవతార వైభవం అంటే మహిమలు కాదు, అవతార వైభవం అంటే మనకి ఆయన చేసిన ఉపకారాల లిస్టు కాదు, ఆయన చేసిన ప్రాజెక్టులు కాదు, ఇది అవతార వైభవం. వేదోద్ధరణ అంటే వారి కాలంలోనే మన గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని అధిష్టాతగా పెట్టారు. "నువ్వు నడిపించు, వేదాధ్యయనం చేయించు, మార్గం చూపించు" అని అడిగారు. "నేనుంటాను, నీ వెనక నేనున్నా" అన్నారు. అది ఇవాల్టికి కూడా స్వామి student అంటే boys అంటాం మనం. వాళ్ళు వాళ్ళే వేదం చదువుతారు. వాళ్ళ సుస్వరంలో నుంచే స్వామి అనుగ్రహం వేద ప్రవాహమై మనకు వినిపిస్తూ ఉంటుంది. ఇది ఒకటి. ఇక ధర్మోద్ధరణ. ధర్మోద్ధరణ అంటే ప్రవచనం కాదు. ధర్మోద్ధరణ అంటే నినాదం కాదు. ధర్మోద్ధరణ అంటే ism కాదు. ధర్మోద్ధరణ అంటే "ఇంతకు ముందున్నదంతా తప్పు, ఇంతకు ముందు వాళ్ళంతా తప్పులు చెప్పారు, మేమే right చేస్తున్నాం" అనే వాడిని మనం పక్కకి నెట్టేసేయాలి. వాళ్ళందరూ ఎంతో చేయబట్టి మాత్రమైనా మనం ఉండగలిగాం. మనం ఎప్పుడూ వాళ్ళకు కృతజ్ఞులై ఉండాలి. మనకంటే ముందు వాళ్ళు. మనకంటే ముందు వాళ్ళు ఎంతో చేయకపోతే మనం ఇవాళ ఏం నేర్చుకునే వాళ్ళం? ఏమి సంపాదించుకునే వాళ్ళం? ఆనందాన్ని మనం కైవసం చేసుకునే వాళ్ళం? కనుక కృతజ్ఞతాంజలి వారి యందు మనం ప్రకటిస్తూనే, కుటుంబ ధర్మాన్ని, దానికంటే ముందు వ్యక్తి ధర్మాన్ని, మనమందరం వ్యక్తులం, మనకో ధర్మం ఉంది. సమాజం యొక్క పురోగమనంలో మన పాత్ర మనం నిర్దుష్టంగా నిర్వహించాలి. రెండవది మరొకరి వస్తువుని మన వస్తువు చేసుకోకూడదు. చేసుకున్న రావణుడు ఏమైపోయినాడో మనం అట్లా అయిపోతాం. అట్లాగే ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు, దానిని తీసుకున్నప్పుడు, మళ్ళీ జగద్ధితాయ స్వామే చెప్పారు, "When something is given to you, it is not to you alone, it is through you to the world." "నీ ద్వారా ప్రపంచానికి ఇస్తున్నానే తప్ప నీకు ఇవ్వటం లేదు" అన్నారు. కాబట్టి ఇవన్నీ మనం మననం చేసుకుంటూ ఉంటే వ్యక్తి ధర్మం. మనం చదువుకునే సమయంలో చదివే చదవాలి. ఉద్యోగం [ఏవో శబ్దాలు] చేసినప్పుడు ఉద్యోగాన్నే కర్తవ్యంగా చేయాలి. అలాగే మనకి ఒక విధి అంటే మనకు ఒక కర్తవ్యాన్ని జగత్తు ఇచ్చినప్పుడు, "అయ్యా మీరు పని చేయండి" అన్నప్పుడు పనిని నిస్వార్థంగా చేయాలి. రకమైన అపేక్ష లేకుండా చేయాలి. ఏదీ ఆశించకుండా చేయాలి. మమేకమై చేయాలి. తాదాత్మ్యం చెంది చేయాలి. ఇట్లా గనక చేయగలిగితే వ్యక్తి ధర్మంలో ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబంలో ఒక పరమాత్మ కాగలుగుతాడు. స్వామి కోరుకున్నది అదే. వ్యక్తులందరూ కూడా కలిసి సమూహంగా ఉన్నట్లయితే వ్యక్తి ధర్మం తర్వాత కుటుంబ ధర్మం ఉంది. కుటుంబ ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి ధర్మం భార్య తన భర్త యొక్క అవసరాలని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయనకు సంతో-- ఏం చేస్తే సంతోషం కలుగుతుందో, ఏమి పెడితే ఆయనకు తృప్తిగా భోజనం దొరుకుతుందో, పని చేస్తే ఆయన మనస్సు శాంతిగా ఉంటుందో అది భార్యే చేయాలి. ఎట్లా జీవిస్తే, ఎట్లా తన గౌరవాన్ని, మర్యాదను నిలబెడితే, రకంగా తన గౌరవాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకువెళితే, తన దైహిక, మానసిక, సాంఘిక అవసరాలని తీరిస్తే, తీర్చబడినప్పుడు ఆనందం కలుగుతుందో అటువంటి ఆనందాన్ని భర్త భార్యకు ఇవ్వాలి. ఇది ఇద్దరూ కలిసి చేయవలసినటువంటి పని. అందుకనే 1971లో స్వామి అవతార వైభవంలో ఒక జ్వాల్యంగా బయటకు వచ్చినటువంటిది అనంతపూర్ మహిళా కళాశాల. స్వామి women education, women empowerment ఆనాడు ప్రారంభం చేశారు. మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఏం రాశారు? ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఆడపిల్ల, ప్రతి బాలిక సంపూర్ణమైనటువంటి స్త్రీత్వాన్ని సమగ్రంగా సంతరించుకోవాలి. ఇక్కడ నేర్చినటువంటి విద్య అంతా బ్రహ్మవిద్యగా భావించాలి. తాము గృహలక్ష్ములుగా ఉండాలి. గృహస్థాశ్రమంలోకి వెళ్ళి తీరాలి. గృహాలను నిర్వహించాలి. అత్తమామల ఇంటిని దేవాలయంగా భావించాలి. తమ అత్తని తల్లిగా భావించాలి, ఎక్కువ కాలం ఇక అక్కడే గడుపుతుంది గనుక. అతిథులందరినీ కూడా తల్లి వలె ఆదరించాలి. ఇది భారతీయమైనటువంటి ఒక సంస్కృతి. ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రతి ఆడపిల్ల అటువంటి స్థితిలో భారతీయమైనటువంటి సంస్కృతికి పతాక ఎత్తేటువంటి రీతిలో ఇక్కడ విద్యావిధానం జరుగుతుంది అని అన్నారు. 1971లో స్వామి ప్రారంభించిన అనంతపూర్ మహిళా కళాశాల నుంచి బయటకు వచ్చినటువంటి స్త్రీమూర్తులందరూ కూడా జీవితంలో మహోన్నతమైన స్థాయికి వెళ్ళి వారి వారి కుటుంబాలను నడిపించడం మాత్రమే కాక వారి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని కూడా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సృష్టించారు. మన దగ్గర data అక్కర్లేదు. ఎంతమందిని మార్చాం, ఎంతమందిని influence, మనకెందుకది? మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. రైతు ఏం చేస్తాడు? పొలంలో విత్తనాలు జల్లుతూ వెళ్ళిపోతాడు. దాని వెనక పంట వస్తుంది. అంతే కదా. ఇక్కడ ఇన్ని విత్తనాలు వేస్తే ఎంత పంట వస్తుంది కొలిచేస్తాడా? వీడు వేసుకుంటూ వెళ్ళిపోతాడు. జీవుడు కూడా అలాగే చేయాలి. కుటుంబ ధర్మం అయిపోయిన తర్వాత మన గడపకి, ప్రపంచానికిసంబంధం ఏంటంటే గడప లోపల ప్రపంచం మనది గడప దాటితే ప్రపంచంలో మనం ఒక భాగం ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే మన ఇంటి నుంచి మనం అడుగు బయట పెట్టగానే ప్రపంచానికి ఏం కావాలి? ప్రపంచానికి నేను ఏం చేయగలడు నా దగ్గర జ్ఞానం ఉంది నా దగ్గర సంపద ఉంది నా దగ్గర అనేకమైన ప్రజ్ఞలున్నాయి నేను ఏదైనా చేయగలను కానీ నేను ప్రపంచానికి ఏం చేయాలి దాని అవసరాలు ఏమిటి? అని ఎవరో వచ్చి మన వాకిలి తట్టి మీ సహాయం కావాలి అని అడిగే కంటే సమాజాన్ని మనం అధ్యయనం చేస్తూ సమాజానికి ఏం కావాలో గనక చేయగలిగితే అది సమాజం పట్ల మన బాధ్యత నిర్వర్తించినట్లవుతుంది అది సాంఘికమైనటువంటి ధర్మం. ఇక విద్యా ధర్మం అనేకమైనటువంటి ధర్మాలు రాజధర్మం ఉంది రాజనీతి ధర్మం ఉంది రాజనీతి ధర్మం ఎప్పుడో చరిత్ర పుటల్లో వెనక్కి ఎళ్ళిపోతున్నది. రాజకీయ అధర్మం మాత్రమే ఇవాళ వెలిగిపోతున్నది. ఇక్కడ చదువుకున్న మన బోటి వాళ్ళం ఇవాళ ఏం చేయాలి అంటే సర్వోన్నతుడు అయినటువంటి వ్యక్తికి మన ఓటు వేయాలి మనం అటువంటి వాడికి నాయకత్వాన్ని అప్పచెప్పాలి వాడు పార్టీ మనకి పార్టీతో మనకి పార్టీ అంటే గ్రూప్ కాదు వ్యక్తి ప్రధానం వ్యక్తి సమాజానికి పనికొచ్చేట్లయితే అతడు ఎటువంటి వాడైనా ఎక్కడి వాడైనా ఎవరికి చెందిన వైనా వెయ్యాలి. అంటే వెయ్యటం అంటే ఇది ఇవాళ ఒకరోజు వేస్తాం ఐదేళ్ళకు అట్లా కాదు ప్రతిరోజూ మన చుట్టూనే మనం ఉన్న చిన్న ప్రపంచం ఒక చిన్న కాలనీలో ఉంటాం కాలనీలో చిన్న వీధిలో ఉంటాం వీధిలో పది ఇళ్ళు అటు పది ఇళ్ళు ఇటు ఉంటాయి అది ప్రపంచం కాదా? అక్కడున్న వారికి కష్టాలు రావా లేవా? వాళ్ళ ఇళ్ళల్లో దుఃఖాలు కలగటం లేదా? అనారోగ్యాలు లేవా? అననుకూలతలు లేవా? ఎక్కడో వెళ్ళి దూరం వెళ్ళి జీపులు వేసుకుని వెళ్లి సేవ చేయవలసిన పని ఉన్నదా? అని గనక అనుకున్నట్లయితే కుటుంబానికి వ్యక్తికి సమాజానికి ఒక బంధం ఏర్పడుతుంది గనుక బంధాన్ని నిత్య సత్య ఆత్మానుబంధంగా చేసినట్లయితే ఇక్కడ ధర్మం విరాజిల్లుతుంది ఇది సత్యం. ఇది ఇటువంటి దానినే స్వామి కోరుకున్నారు కాబట్టి వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం, రాజనీతి ధర్మం అన్నింటినీ మించి ఆర్థిక ధర్మం ఇది స్వామి చాలా హెచ్చరిక చేశారు ఎందుకంటే రాబోయే రోజులు మాట ఎప్పుడు నలభై ఏళ్ళ క్రితం చెప్పారు ఆదాయాలు తగ్గుతాయి ఆశలు పెరుగుతాయి ఒక వర్గంలో ఆదాయాలు పెరుగుతాయి దురాశలు పెరుగుతాయి దురాశలలో నుంచి దుర్దశలు పెరుగుతాయి సమాజాన్ని రక్షించుకోండి జాగ్రత్త పెట్టుకోండి సీలింగ్ ఆన్ డిజైర్స్ ని మీరు జీవితంలో ఆచరించండి మీ కోరికల మీద మీరు అదుపు పెట్టుకోండి ఎన్ని కావాలో ఎంత కావాలో అంతా పొందండి కానీ ఉన్నదంతా కావాలని మాత్రం అనుకోకండి చూశారా కనిపించినదన్నా కావాలని అనుకోకండి తోచినదల్లా కొందాం అని అనుకోకండి. ఏది కావాలో, ఎంత కావాలో, దేనికి కావాలో దానికి మాత్రమే మీ డబ్బుని జాగ్రత్త పెట్టండి డబ్బు పాపిష్టిది కాదు కానీ పాపిష్టి వాడి చేతిలో డబ్బు ఉండకూడదు ఇది ఒక ఆర్థిక ధర్మం. దీన్ని గనక మనం గమనించగలిగినట్లయితే ప్రపంచంలో ఇవాళ సత్యం చెప్పాలి అంటే డబ్బు బాగా ఎవరి దగ్గర ఉన్నది అంటే ఎవరు సత్కర్మలు చేయరో వాళ్ళ దగ్గర ఉంది అది ఎవరు సత్కర్మలు చేద్దామన్నా పాపం ఆయన అరచేయి ఇలా పట్టుకొని మీరు ఇస్తారా? మీరు ఇస్తారా? మీరు ఒక పది రూపాయలు ఇస్తారా? వీళ్ళకి అన్నం పెడదాం అండి పది రూపాయలు ఇస్తారా ఎవరికో బట్ట కొని పెడదాం అండి ఇది కాబట్టి సమాజం ఎప్పుడూ కూడా మనల్ని అడగదు. సమాజం తల్లి మనల్ని అడుగుతుందా? అడక్కుండా అన్నం పెడుతుంది కదా. అడిగితే ఇంకా బాగా పెడుతుంది అది అంతే తేడా పెట్టకుండా ఉండదు కానీ సమాజం మాత్రం మనల్ని అడగదు మనం సమాజంలోకి వెళ్ళాలి స్వామి తన అవతార కార్యక్రమంలో సమయ పాలన ఒక ధర్మం. నలభై మందితో ఉన్న స్వామిని నేను చూశా అది నాకు కలిగిన ఒక యోగం. నాలుగు వందల మందితో చూశా, నాలుగు లక్షల మందితో చూశా, పది లక్షల మందితో చూశా శాంతి స్టేడియం చుట్టూ. స్వామి ఫలానా టైం కి వస్తారు అని వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ప్రోగ్రాం ప్రకారం రెండు నిమిషాల ముందు అందరికంటే ముందు భక్తులంతా సీటు కోసం ముందు వచ్చి కూర్చుంటారు స్వామి తాము ఇచ్చిన సమయానికి రెండు నిమిషాల ముందే వచ్చారు తప్ప ఒక్క రోజు కూడా వారు ఆలస్యంగా రాలే. [చప్పట్లు] ఆయన అన్నారు ఇక్కడ కూర్చున్నటువంటి కొన్ని లక్షల మంది ఒక గంట సేపు కూర్చుంటే లక్ష గంటల హ్యూమన్ ఎనర్జీ ఇక్కడ కూర్చుని ఉన్నది దానిని దర్శనం చేయటానికి మీరంతా స్వామి మాకు దర్శనం ఇవ్వటానికి వస్తున్నారని మీరు అనుకుంటున్నారు కానీ నేను అట్లా అనుకోవటం లేదు ఇంతమందిని దర్శనం చేయటానికి నేను ఒక్కడినే వెళ్తున్నాను అన్నారు స్వామి అది వినయం భగవంతుడి యొక్క లక్షణం అది. భగవంతుణ్ణి మనం యాంగిల్ లో చూడాలి మనకు భయం వేస్తుంది స్వామి మనల్ని దర్శనం చేయడం ఏంటని మరి ఆయనకీ చూడాలని ఉంటుంది కదా చూడాలని ఉన్నప్పుడు అలాగే వస్తారు అలాగే సమయపాలన చేస్తారు సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకున్నందువలనే అన్ని పనులు-- వారు ఉన్నది ఎంత ఎనభై ఆరు ఏళ్ళు, ఎనభై ఆరు ఏళ్ళలో పధ్నాలుగు ఏళ్ళు బాల్యంలో గడిచిపోయింది ఉన్నది డెభై రెండు ఏళ్ళు, డెభై రెండు ఏళ్ళలో ఆయన ప్రపంచం మొత్తాన్ని తన చేసుకున్నారు. ప్రపంచం మొత్తంలో తానే నిలబడ్డారు ఎలా నిలబడగలిగారు? ఆయన వెనుక పురాణం లేదు ఆయన తర్వాత పురాణం లేదు వారు ఉన్నదే పురాణం వారి కాలమే పురాణం అయింది పౌరాణికం అయింది అది భవ్యమైంది ధర్మాత్మకం అయింది కాబట్టి అది ధర్మ ప్రభావం స్వామి కలియుగంలో కూడా ఇవాళ దేశాలలో చూడండి జాతులకి తెలుగు రాజు.సంస్కృతం correct గా ఉచ్చరించలేరు కానీ దేశానికి వచ్చి లేదా దేశంలో ఉన్న మన బోటి వాళ్ళ దగ్గరికి వచ్చి భజనలు నేర్చుకొని వేదం నేర్చుకొని సాయి గాయత్రి నేర్చుకొని రుద్రం నేర్చుకొని సూక్తాలు నేర్చుకొని వాటన్నింటిని కూడా వాళ్ళు తమదిగా భావన చేసి సనాతనమైన వైదికమైన భారతీయమైన ధర్మాన్ని ఎవరు నిజంగా పరిపోషిస్తున్నారు ఇవేళ అంటే సత్యసాయి భగవానుడిని నమ్మినటువంటి దేశం కాని విదేశీయులు అది. దేశంలో వాళ్ళకి స్వామి చెప్తున్నారు మనం వింటున్నాం స్వామి చెప్తున్నారు మనం వింటున్నాం అట్లా కాదు. వాళ్ళకి స్వామి ఒకసారి sixty eighth birthday కి స్వామి అడిగారు "మీ నుంచి నాకు ఒకటి కావాలి" అని అడిగారు. అందరూ ready అయ్యారు ఇవ్వటానికి. "మద మాంసములు రెండు వదిలిపెట్టండి. అలాగే మీ దేశ ఆచారం ప్రకారం మీకున్న భౌగోళిక పరిస్థితుల ప్రకారం మీరు తీసుకునేటువంటి మత్తు పదార్థాలు మీరు స్వీకరించకండి. దాని కంటే మీలో ఉన్నటువంటి animated heat దాన్ని జ్వజ్వల్యం చేసుకోండి" అని స్వామి చెప్పినప్పుడు నూటికి తొంభై ఐదు percent పాశ్చాత్య దేశీయులు అంతా కూడా మద్యము మాంసము వదిలిపెట్టారు. భారతీయులు విన్నారు బయటకు వచ్చి రెండూ చక్కగా సేవించారు అంతే. ఇది జాతి దౌర్భాగ్యం అది. అది మనం చాలా స్పష్టంగా చాలా ధైర్యంగా నేను మాట ఎందుకు అంటున్నానంటే గురు ఆజ్ఞని కోరకండి. గురువుని మీకేం కావాలని అడగకండి. లేదు గురువు ఏదన్నా చెప్పమని అడగకండి. చెప్పినప్పుడు దానిని పాటించకపోతే మహా పాతకం. గురు ఆజ్ఞ గురువు చెప్పాడంటే అది మహా మంత్రం అది మంత్ర రూపంలో ఉండదు ఒక సూచన ఒక చిన్న చూపు ఒక ఆదేశం ఒక సందేశం ఇచ్చి గురువు ఉరుకుంటాడు. ఇక ఆయనకు దాంతో పని లేదు. అది జరిగిపోతూ ఉండాల్సిందే అంతే. కాబట్టి స్వామి దానిని చాలా నిర్దుష్టంగా foreigners అందరితో స్వామి వాళ్ళందరికీ ఎంత ఆనందాన్ని ఇవ్వగలిగారు. ఎందుకని ఇన్ని కోట్ల మంది ఇవాళ నవంబరు ఇరవై మూడవ తారీఖున ప్రపంచం మొత్తం ఇప్పుడు శ్రీరామ నవమి హిందువులు చేసుకుంటారు. కృష్ణాష్టమిని శ్రీ వైష్ణవులు కృష్ణ భక్తులు విపరీతంగా చేసుకుంటారు. కానీ సత్యసాయి జన్మదినాన్ని సర్వ మతాల వాళ్ళు చేసుకుంటారు Muslims తో సహా Zoroastrians తో సహా.
YouTube · audio

Sri Sathya Sai Avatara Vybhavam — Part 2

Home

Sri Sathya Sai Avatara Vybhavam — Part 2

Source: SathyaSai Seva Sadan on YouTube

0:00 / 33:11

More in this series

Sri Sathya Sai Avatara Vybhavam

3 episodes · 1 hr 38 min

  1. 33 min 1

    Sri Sathya Sai Avatara Vybhavam — Part 1

  2. 33 min 2

    Sri Sathya Sai Avatara Vybhavam — Part 2

    Now playing
  3. 32 min 3

    Sri Sathya Sai Avatara Vybhavam — Part 3