Skip to content
Transcript తెలుగు
మతానికి సంబంధం లేకుండా అందరూ కూడా సేవ చేయటం భజన చేయటం సేవ చేయటం ఇది ఒక్క వ్యక్తికి సాధ్యమేనా స్వామి భగవంతుడా మానవుడా ప్రశ్న కాదు భగవంతుడే అనేటువంటి ప్రమాణాన్ని స్వామి చెప్తూ తన కంటే ముందు వచ్చినటువంటి సిద్ధాంతాన్ని కాదనకుండా అహం సత్య బోధకః సత్యం ఏమిటో మీకందరికీ చెప్పాలని వచ్చానే తప్ప అది తప్పు ఇది తప్పు వాడు తప్పు అని చెప్పడానికి నేను రాలేదు నేను నిజం ఏమిటో చెప్పడానికి వచ్చానన్నారు కాబట్టి ధర్మోద్ధరణ చేశారు రెండింటితో పాటు చాలా మంది సంఘ సంస్కర్తల అనండి అహంకరించిన వాళ్ళ అనండి అస్పష్టంగా ఉన్న వాళ్ళ అనండి తెలియని వాళ్ళ అనండి మొయ్యలేకపోయినా మొయ్యగలమని అహంకరించినటువంటి వారు కానీ సమ సమాజ స్థాపన చేస్తామనే మాట మనం విన్నాం సమ సమాజం అంటూ ఉండదు అది అసహజం సమాజం యొక్క స్థితే అసహజం బాగా ఉన్నవాడు ఉంటాడు ఏమీ లేని వాడు పక్కనే ఉంటాడు బాగా ఉన్నవాడి బాధ్యత ఏమీ లేని వాడిని కాపాడుకోవటమే ఏమీ లేని వాడి బాధ్యత బాగా ఉన్నవాడితో కూడి వినయంగా ఉండటమే రెండూ కూడా పరస్పరము సాగించిన ట్లయితే ఒక సమతుల్యమైనటువంటి భావన ఏర్పడుతుంది గనుక వీటితో పాటుగా దీనజనులు ఉన్నారు ఎవరు దీనజనులు అంటే డబ్బులేని వాడు దీనజనుడు కాదు అవకాశాలు దొరకని వాడు దొరికిన అవకాశాన్ని వినియోగించుకోని వాడు దీనజనుడు కాదు తల్లిని తండ్రిని ఎరగకుండా అంటే వీళ్ళు పుడుతూ ఉండగానే వాళ్ళు కన్నుమూశారు వాళ్ళ కులం తెలియదు మతం తెలియదు జాతో తెలియదు రక్తమో తెలియదు మూలాలు తెలియవు అటువంటి వాళ్ళు దీనజనులు దీనజనుల అందరినీ కూడా ఉద్ధరిస్తాను అన్నందుకు స్వామి ఇవేళ మనకి స్వామి భక్తులుగా మనందరికీ తెలుసు డిజే ప్రోగ్రాం దీనజనోద్ధరణ పథకం అది ఇవేళ పిల్లలు నేను నిన్న ఒక పల్లెటూరుకు వెళ్ళాను స్వామి బర్త్ డే సంవత్సరం తెలంగాణ ప్రాంతంలో సిరిసిల్ల దగ్గర గొల్లపాలెం అనే ఊరు వెళ్ళాను గొల్లపాలెం అనే ఊర్లో మందిరం ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది నేను పొందిన ఆనందం మధ్యకాలంలో అనేక మందిరాలకు నేను వెళ్ళాను అక్కడ పొందిన ఆనందం నేను ఎక్కడా పొందలేదు ఇదే సత్యం ప్రశాంతి నిలయంలో ఎంత ఆనందాన్ని నేను అనుభవించానో కుగ్రామంలో చిన్న మందిరంలో వాళ్ళు ఎంత సమతుల్యంగా ఇగో ఇక్కడ మన కోకట్ పల్లి సమితిలో లాగానే ఎవరు పని చేస్తారో తెలియదు నాయకుడు ఎవరో తెలియదు కన్వీనర్ ఎవడో మనకు తెలియదు కానీ నిశ్శబ్దంగా జరిగిపోతూ ఉంటాయి పరమాద్భుతంగా అక్కడ కూడా రకమైన వైషమ్యం గాని భేదభావం గాని లేకుండా చేశారు అలాగే తొంభై ఎనిమిది పర్సెంట్ యువతీ యువకులు ఉన్నారు వాళ్ళు నడిపి-- తొంభై ఎనిమిది పర్సెంట్ రామకృష్ణ మీరు ఒకసారి ఊరు వెళ్ళాలి వెళ్లి మీరు చూడండి ఎంత బాగా చేశారు మందిరం ఎంత బాగా కట్టారు ఎంత డిసిప్లైన్డ్ గా చేశారు తర్వాత మూడు తరాల పిల్లలు ఇప్పుడు ఇరవై ఐదు, ఇరవై ఆరు ఏళ్ళ వయసున్న వాళ్ళు దీన్ని నడుపుతుంటే పద్దెనిమిది తెలంగాణా ప్రాంతంలో కాస్త ఎర్లీగా మ్యారేజెస్ అయిపోతాయి పదిహేడు ఏళ్ళకే తల్లులైన వాళ్ళు వచ్చి కూర్చున్నారు పదిహేడు ఏళ్ళ పిల్లల తల్లుల ఒడిలో మూడేళ్ళ రెండేళ్ళ పసిపిల్లలు ఉంటే స్వామి భజనలకు వాళ్ళు కేరింతలాడి పోయినారు చప్పట్లు కొట్టారు వీడియో తెప్పించుకోండి చూడండి ఎందుకంటే మనం అటువంటివి చూస్తే ఇంకా ఎంత బాగా చేయగలమో ప్రతి పెద్దవాళ్ళందరినీ కూడా వాళ్ళు హాయిగా పక్కన పెట్టారు గైడెన్స్ తీసుకున్నారు పెద్దవాళ్ళు కూడా వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అప్పజెప్పారు చాలా వైభవంగా అరవై ఐదు మంది బాల వికాస్ పిల్లలు చిన్న కుగ్రామం స్వామి పట్ల డివోషన్ ఉన్నటువంటి ఒక ఆవిడ ఒక స్కూల్ పెట్టింది M.Ed చేసింది ఆమె చేసి స్కూల్ విషయాలన్నీ నాకు చెప్పింది అంటే ఎవరికి చెప్తున్నది ఆమె అంటే దీనజనులకు చెప్తున్నది స్వామి చెప్పారండి దీనజనులకు చదువు చెప్పమన్నారు దీనజనులకు పలక, బలపం కొనమన్నారు దీనజనులకు పుస్తకాలు ఇవ్వమన్నారు నేను పాత్ లో వెళ్తున్నాను అని ఆమె వయస్సు ఎంత ముప్పై రెండు ఏళ్ళు ఉంటాయి అంతే కాబట్టి స్వామి ప్రభావం అవతార వైభవం ఏమిటంటే ఆయన వెలిగిపోవటం కాదు ప్రపంచాన్ని ఆయన వెలిగించారు అది నిజమైన వైభవం వైభవంలో మనం ఉన్నాం మన కాలానికి మనం చేయగలిగింది మనకు తోచింది మనం స్వామి నుంచి ఎంత అనుభవించామో దానిని మళ్ళీ ప్రపంచానికి ఇచ్చేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం చేయటం లేదని కాదు కానీ యువకులు చూడండి నాగరిక ప్రపంచం చాలా నాలెడ్జ్ సొసైటీ అనుకునే హైదరాబాద్ లో యువకులకు వీటి పట్ల ఆసక్తి లేదు చూడండి అక్కడ రోజున వాళ్ళు IT లు చేసిన వాళ్ళే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సెలవులు పెట్టుకొని మూడు రోజుల ముందు వెళ్లారు మర్నాడు మళ్ళీ అంతా చేయడానికి వెళ్లారు అసలు మందిరం కూడా చాలా అద్భుతం చిన్న మందిరం క్యూట్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మందిరం చాలా జాగ్రత్తగా అక్కడ వాళ్ళు ఉండటానికి ఇస్తే తెల్లవారుజామున నాలుగు గంటల కల్లా ఆవిడ లేచి ప్రతిరోజూ స్వామికి అలంకారం చేస్తుంది పూలతో ప్లాస్టిక్ పూలు కాదు ఒరిజినల్ పూలతో ఆమెకు ఏమిటి నీకు కలిగిన లాభం అంటే ఆమె వచ్చి నాకు చెప్పింది నా భర్త సరిగ్గా ఉండేవాడు కాదు తాగి తందనాలేడేవాడు మందిరానికి వచ్చిన తర్వాత మేము అన్నీ మానేసాం మాకు స్వామి తప్ప ఎవరు లేరు నా పిల్లవాడు ఇవాళ అమెరికా వెళ్ళిపోయాడు హాయిగా మంచి ఉద్యోగంలో వెళ్ళాడు వాడు అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నాడు అంటే అమ్మా మందిరానికి ఏం కావాలో చెప్పు స్వామికి నేను ఏం చేయాలో చెప్పు నేను పలానా చోట ఉన్నాను అని అడుగుతున్నాడు ఇవన్నీ కూడా స్వామి అవతార వైభవంలో అన్ని మహిమల కంటేస్వామి చేసిన చమత్కారాల కంటే స్వామి బోధించిన అనేక బోధనల కంటే ఇవాళ అనుష్ఠాన వేదాంతాన్ని స్వామి ప్రపంచానికి వైభవోపేతంగా అంది-అందిస్తున్నారు. నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక ఆనందం ఏం కలిగింది అంటే సత్యసాయి భగవానుడి యొక్క వైభవం కనీసం కలియుగాంతం వరకు రోజు ప్రవర్ధమానం అవుతుందే తప్ప ఒక్క మిల్లీమీటర్ కూడా అది కిందికి దిగదు పెరుగుతూనే ఉంటుంది ఒకటి. రెండవది వాళ్ళందరికీ ప్రశాంతి నిలయమే ప్రధానమైనటువంటి మూలం మనం కూడా ప్రశాంతి నిలయమే మనకు పుట్టిళ్ళు చాలా ఉంటాయి. ఉంటాయా? పుట్టిల్లు అంటే ఒకటే. మనకు పుట్టిల్లు ఏది అంటే కేవల ప్రశాంతి నిలయం మాత్రమే. ప్రశాంతి నిలయం లాంటి ఇంకో మందిరం ఇంకోటి కట్టినా అది కాదు కాదు కాదు. ఎందుకంటే ఇక్కడ స్వామి తన జన్మ తీసుకున్నారు. పుట్టపర్తి లో అది మన మూల స్థానం అది జ్ఞాన స్థానం అది. అదే స్వామి యొక్క దివ్య వైభవానికి సంకేతం వీటిని మనం గ్రహించుకోకపోయినట్లయితే ఒక్క ప్రమాదం జరుగుతుంది. కృష్ణ పరమాత్మ ఉన్న కాలంలోనే వాసుదేవుడి కాలంలోనే అదే వేషంలో పౌండ్రక వాసుదేవుడు వచ్చాడు. కృష్ణుడి వేషం వేసుకుని కృష్ణుడు ఎలాంటి కుర్చీలో కూర్చుంటాడో వాడు కూర్చునేవాడు నెమలీకలు పెట్టుకునేవాడు కృష్ణుడు ఎలా ఉంటే అలా ఉండేవాడు అంతే. కానీ కృష్ణుడు కాలేకపోయినాడు ఎలా అవుతాడు కృష్ణుడు కృష్ణుడే. కాబట్టి ప్రశాంతి నిలయం వైభవమే వైభవం వేరు. నిన్న ఇరవై మూడవ తారీఖు నేను అక్కడ ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ Chief Minister చంద్రబాబు నాయుడు ఎంత మంచి మాటలు మాట్లాడాడు ఎంత హాయిగా మాట్లాడాడు ఆయన. ఏమన్నాడో తెలుసా? "స్వామి దేహంలో లేరు అని ఎవ్వరూ భావించకండి. వారు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నదో అంతే వైభవంగా ఇక్కడ కనిపిస్తున్నది. Discipline ఇది ఎక్కడా ప్రపంచంలో లేదు" అని ఆయన అన్నప్పుడు నిజమే మనకు తెలుస్తున్నది నలభై వేలు, యాభై వేలు, అరవై వేలు, ఎనభై డెభై వేలు వాళ్ళకి అన్నం లేక రాలే ప్రసాదం కోసం వస్తారు. వాళ్ళ పట్ల మనం చూపే ఆదరణ వాళ్ళని గౌరవించే విధానం వాళ్ళతో స్వామిని గురించి మనం Share చేసుకునే మన అనుభవ వాహిని ఇదంతా కూడా సత్య సాయి అవతార వైభవంలో ఒక వెలుగుగా నేను భావన చేస్తూ అధ్యాత్మ అంటే మరణానంతర సుఖం కాదని ఇక్కడ భూమండలం మీద ఉండగానే ఆనందం యొక్క అంచులు ఏమిటి భౌతికానందాన్ని దాటి మానసికానందాన్ని దాటి జ్ఞాన వైరాగ్యాలు దాటి ఏదైనా ఒక ఆనంద రేఖ ఉంటే ఆనంద రేఖను స్పృశించగలిగితే కలిగిన తర్వాత దానిని మళ్ళీ మార్గం ప్రపంచానికి చెప్పగలిగితే అది కదా సఫల జీవితం. అందుకు కదా పన్నెండవ ఏట స్వామి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? నాకు పన్నెండవ ఏట నుంచి స్వామి తెలుసు అనేది ఏదన్నా Guinness world record అది కాదు. వెళ్ళటమే ఒక యోగం. వెళ్ళామా అంటే స్వామి రప్పించుకున్నారు. స్వామి అవకాశం ఇచ్చారు. నేను మందిరంలోనూ చెప్పాను ఇవాళ నేను మన-మన మందిరంలో కూడా కుక్కట్ పల్లి లో కూడా చెప్తున్నాను మనం ఏమీ కష్టపడి ఇక్కడికి రాలా చాలా ఇష్టపడే రావాలని అనుకున్నాం. ఇష్టపడి రావాలని నిస్వార్థంగా నిర్మలంగా అనుకున్నాం కనుకనే స్వామి రకమైన తేడా తొట్రుపాటు లేకుండా చాలా చక్కగా దీన్ని నడిపించింది స్వామి. కాబట్టి సాయి అవతార వైభవం Splendor ఏదైతే ఉందో అది ప్రపంచాన్ని నడిపిస్తూనే ఉంటుంది. సర్వ మతాలు స్వామి భావనలో నుంచి తీసుకుంటున్నారు ఎందుకంటే స్వామి చెప్పినదంతా వేద ప్రామాణికము శాస్త్ర ప్రమాణం కాబట్టి అటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా సాగాలి. స్వామి జన్మదినం అంటే మనకి అంకితోత్సవ సభ లాంటిది. మళ్ళీ ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు అది నిన్నటితో అయిపోయింది లేదు మధ్యాహ్నంతో అయిపోయింది లేదు మందిరంలో అడుగు పెట్టడానికి క్షణాల ముందు అక్కడికి అది అయిపోయింది. కానీ ఇప్పుడు వర్తమానంలో మళ్ళీ ఇవాళ నుంచి కనీసం మనం పదేళ్ల ప్రణాళిక వేయలేము గనుక కనీసం ఒక సంవత్సరానికి ప్రణాళిక. ఏమిటి ప్రణాళిక? అంటే మనం నిరంతరము కూడా సత్య సాయి భగవానుడు ప్రపంచానికి ఏం బోధ చేశారో, ప్రేమను ప్రపంచానికి ఇవ్వమని మనకు చెప్పారో, వారు ఎటువంటి ప్రేమను మనకిచ్చారో అటువంటి ప్రేమను మనం సంపాదించాలి అది మన Fixed deposit. Fixed deposits మీద బోలెడంత వడ్డీ వస్తుంది. వీడు బ్యాంకు వాడేమీ ఇవ్వడు స్వామిస్తారు. పుణ్యం అనే రూపాయి బిళ్ళ వేస్తే దాన్ని లక్ష కోటి చేయగలరు. ఎందుకు చేయగలరు అంటే నీవు లక్షని లక్ష్యంగా పెట్టుకున్నావు కోటి ఇస్తే ఇంకా భద్రంగా చేస్తావు కనుక నీకు సంపదని ఇస్తాడు. సంపద చెడ్డవాడికి ఆయన ఇవ్వడు. ఊరికే చెడ్డవాడి చేతిలో ఉంటే ఏమవుతుంది అని మనం మళ్ళీ ప్రశ్న వేయకుండా ఒకళ్ళిద్దరికి ఇస్తాడు చూపిస్తాడు Demonstrate చేస్తాడు. కానీ మన వంటి వాళ్ళకి గర్వంగా సగర్వంగా ధైర్యంగా చెప్పగలం పరమాత్మ మనకి జ్ఞాన సంపదని ఇస్తాడు భౌతిక సంపదని ఇస్తాడు ఎవరి ముందు మనం చెయ్యి చాపన అవసరం లేదు. స్వామి దివ్యోపన్యాసంలో కూడా చెప్పారు "ఈ స్వామి దేహంలో ఎవరి ముందు చెయ్యి ఇంతవరకు చాపలేదు చాపరు" స్వామి Always he is a giver never a taker. మీది మీరు ఉంచుకోండి మీ గృహాలు మీ ఇల్లు మీ ఇబ్బందులు మీవి మీరు Manage చేసుకోండి నాకు మీ సొమ్ము నాకు అవసరం లేదు. ఎంత ఉదాత్తమైన భావన. అటువంటి గురువులు మళ్ళీ వస్తారా? కాలం మళ్ళీ తిరిగి వస్తుందా? మీరందరూ పరస్పరం కలహించుకోకుండా ఉండండి కలిసి ఉండండి. నేను నిజంగా గ్రామంలో Unity, Purity, Divinity, Demonstrate కావటాన్ని నేను చూశా.సెమినార్లు పెట్టి ప్రయోజనం ఏం లేదు భోజనాలు చేసి ఇంటికి వెళ్ళటం తప్ప ఏం లేదు అక్కడ in action మందిరం అక్కడ ఎదురుగ్గా ఒకాయన ఉన్నాడు. స్వామి devotee కాదా ఎవరికీ తెలియదు ఆయన ఒకటే చెప్పారు మందిరానికి ఎవరు వచ్చినా మా ఇంట్లో ఆతిథ్యం ఉంటుంది స్వామి కోసం ఎవరు వచ్చినా మేము వారికి సేవకులుగా ఉంటాం మేము బయట పడుకుంటాం వారికి గది ఇస్తాం మా ఇల్లు స్వామికి attachment గా భావించి నా service అనుగ్రహించండి అని అడిగాడు కాబట్టి ఇది ఇది నిజమైనటువంటి సేవ ఏనకేనా ప్రకారేణైష్య కశ్యాపి దేహినా సంతోషం జనయేత్ ప్రాజ్ఞ్యః తదేవ ఈశ్వర పూజనం ప్రతి సారి తలుచుకోవలసిన శ్లోకం ఇది నీకు ఉన్నటువంటి సంపద నీ ప్రజ్ఞ నీ ఆలోచన నీ బుద్ధి కుశలత నీ మనోస్థితి నీ దైహిక సౌందర్యం నీ దైహికమైనటువంటి శక్తి అన్నీ కూడా నీ చుట్టూ ఉన్నవారికి ఆనందంగా కలిగించగలిగితే దానిని మించినటువంటి శివ పూజ లేదు లేదు లేదు అయితే స్వామి జన్మ ఎత్తి వచ్చారు గనుక స్వామి కాబట్టి పరమాత్మ ఒక ప్రణాళికాబద్ధంగా అందరినీ బంధనాలు తెంచుకోమన్నారు మధ్యనే నేను శ్రీవాణి లో నా నాకు special article కావాలి అని అడిగాడు శ్యామ్ అడిగితే ఎక్కడో పనిలో ఉన్నాను అప్పుడు phone చేశాడు ఎలా మరువను అని రాశాను. ఎలా మరువను అంటే అది మనందరం చదువుకోవాలి ఎందుకు చదువుకోవాలి అంటే స్వామి అన్నారు అన్నీ మర్చిపోండి మర్చిపోండి అంటున్నారు స్వామి అసలు మిమ్మల్ని ఎలా మర్చిపోగలను దాని మార్గం ఏమైనా ఉంటే చెప్పండి అని అది మరపు రాదు మరపు తరవు జీవుడికి తప్ప పరమాత్మకి లేదు స్వామి ఏం చెప్పారో దానిని యధాతథంగా జీవించగలిగితే He is indeed a true devotee of భగవాన్ అలాగే స్వామి కి ఏం చేసిన ప్రచారం కోసం ఆడంబరం కోసం వ్యక్తిగత లాభం కోసం చేసేట్లయితే పనులు మనం చేయవద్దు స్వామికి కీర్తి తేవాలి స్వామి మనకు తండ్రి తండ్రి ఒక అత్యద్భుతమైన ప్రపంచంలో ఆధ్యాత్మిక సామ్రాజ్యం నిర్మాణం చేశారాయన చాలా కష్టపడ్డారు మనం చాలా సుఖపడ్డాం నన్ను ఒకాయన ఒక journalist మధ్యనే అడిగాడు బాబా గారికి అన్ని building లు ఎందుకండీ అన్నాడు చాలా తెలివిగా అంటే బాబా గారికి అసలు ఏం అక్కర్లేదండి అవన్నీ మన కోసమేనని చెప్పా అవి గనక లేకపోతే ఆయన ఏమంటాడు ఆయన హాయిగా గదిలో పడుకున్నారండి మనల్నేమో చెట్టు కింద పడుకోమన్నారు మళ్ళీ మీరే రాస్తారని చెప్పా చాలా ప్రముఖుడు ఆయన మాట ఆయన పడదలుచుకోలేదు అందుకే నీకు room కావాలో తిండి అక్కడికి వెళ్ళినా తిండేగా South Indian canteen North Indian canteen western canteen ఇంక మీకేం కావాలో ముంద తినండి తిన్న తర్వాత మాట్లాడండి అంటే అనుష్ఠాన వేదాంతానికి స్వామి బాట వేశారు మనం అల్ప స్వల్ప భావాల నుంచి బయటపడాలి ఎందుకంటే భూమండలం మీద మనం గడిపిన సమయం ఎక్కువ గడవబోయేది తక్కువ యువకుడికైనా సరే ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు యువకుడికొస్తే ఇరవై ఆరు ఏళ్ళు పోయాయి కదా పోయిన దానికి మనం birthday చేయక్కర్ల వచ్చేదానికి birthday చేయొచ్చు వచ్చింది వచ్చిందని birthday చేయాలి స్వామిది స్వామికి ఆరాధన లేదు జయంతులు లేవు కానీ ఇది సందర్భం మనం పెట్టుకోవాలి సందర్భంలో మనందరం మనల్ని సమీక్షించుకోవాలి మనం ఇంతవరకు దివ్యమైనటువంటి ఒక ప్రదేశం కుక్కట్ పల్లి లాంటిది center లో ఎవరైనా ఎప్పుడైనా మన పక్కనే ఇట్లా మెట్లు దిగ్గానే బెంగుళూరులో పందొమ్మిది వందల డెబ్బై రెండు ప్రాంతంలో ఒక ఇంటికి వెళ్లారు స్వామి వెళ్లి ఇంటి ఇల్లాలికి స్వామి వస్తున్నారని తెలియదు గృహస్తుకి స్వామి వెళ్లారు కారు దిగారు తలుపు తీసుకుని వెళ్లిపోయారు వెళ్లిపోయి ఇటువంటివి రోజుల్లో ఈ-ఈ chairs లేవు ఇనప కుర్చీ ఒకటి ఇలా బర్రం లాక్కొని కూర్చున్నారు sound కి ఎవరొచ్చారని ఆవిడ వస్తే స్వామి కూర్చుని ఉన్నారు తన కుర్చీ తాను వేసుకుని కూర్చున్నారు స్వామి వచ్చారు అండి అది బెల్లం ముక్క అందరూ వచ్చేశారు రోజున స్వామి చెప్పారు ఇప్పుడు మీరంతా చిన్నపిల్లలుగా కనిపిస్తున్నారు యువకులుగా యువతులుగా యవ్వనంలో ఉన్నారు నలభై ఏళ్ళ తర్వాత మీరు పెద్దవారు అవుతారు పెద్దవారైన తర్వాత కాళ్ళు కళ్ళు కీళ్ళు సహకరించవు అయ్యో అక్కడెక్కడో స్వామి భజనట వెళ్ళలేకపోతివే అనుకుంటారు మీరు ఏమీ దిగులు పడవలసిన పని లేదు మీరు ఎక్కడ ఉంటారో అక్కడ నుంచి కేవలం పది నిమిషాల లోపే ఒక సత్యసాయి మందిరం ఏర్పడుతుంది మందిరంలో భజనలు జరుగుతాయి మీరు శ్రమ పడకుండా అక్కడికి వెళ్ళవచ్చున అన్నారు ఇవాళ అదే జరిగింది metro design లో ఇక్కడే station రావాలని వీళ్ళేమన్నా అడిగితే చేశారా అన్నీ వస్తాయి అంతే రాజు దీన్నంతా మీరు మనం వాడేసుకుందాం స్వామి కోసం అని ఆయనకెవరన్నా కల్లో చెప్పారా చెప్పక్కర్ల భగవంతుని యందు కృతజ్ఞత ఉన్నవాడు భగవంతుని నుంచి ఏం ప్రేమని పొందాడో ప్రేమని మళ్ళీ త్యాగం ప్రపంచం కోసం ఇవ్వగలిగితే అదే త్యాగేనైక అమృతత్వమానశుః మనం ఉంటాం కొన్నాళ్ళ తర్వాత ఉండం కానీ మనం ఉండని తనం తర్వాత కూడా ఎప్పుడూ ఉంటాం మరణించిన తర్వాతే ఎక్కువ కాలం జీవిస్తాం దానికి పునః సమీక్ష చేసుకొని ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ రోజుకారోజు అందరియందు సమతాభావంతో ప్రేమభావంతో మనవళ్లతో ఆడుకోవాలి మనవరాళ్ళతో ఆడుకోవాలి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పాలి వాళ్ళ మంచి మార్గంలో పెట్టాలి మన బంధువులంతా బాగుండాలని కోరుకోవాలి మన స్నేహితులంతా ఉన్నత స్థితిలో ఉండాలి ప్రశాంత జీవితం వాళ్ళకు ఉండాలని కోరుకోవాలి ఇవన్నీ ఉండవలసిందే భగవంతుడు కూడా కోరుకుంటున్నాడుగా కాబట్టి భగవంతుని యొక్క అంశగా మమైవాంశో అన్నాడు కృష్ణుడు.మీరందరూ నా అంశలే అన్నారు స్వామి కూడా అదే అన్నారు మీకు నాకు ఏం తేడా లేదు you are me, I am you అన్నారు కాబట్టి అవినాభావం అయినటువంటి సనాతనమైన అటువంటి ఒక ఆధ్యాత్మిక బంధాన్ని అనుభూతి మయం చేసుకునే స్థాయిలో స్వామి దివ్య అవతార వైభవం సాగిపోతూనే ఉంటుంది. ఇది మొదటి స్వామి దేహం వదిలి పెట్టినప్పుడు పుట్టపర్తి ఇక ఏమీ ఉండదని అక్కడ ఏం జరగదని ఏవో రకరకాలు అనుకున్నారు కానీ స్వామి సంకల్పాలు స్వామి దివ్యత్వం ఇవాళ ప్రశాంతి నిలయంలో ఇసుక వేస్తే రానంత జనం కుళ్ళంత హాలు overflow అయిపోయి బయట నిల్చుంటున్నారు. నిన్న మందిరంలో చిన్న మందిరం కావచ్చు గ్రామగ్రామం కదిలి వచ్చింది. వాళ్ళల్లో అందరూ స్వామి భక్తులు అంటే మొన్నటి ఆయన చెప్పారు ఊరు సర్పంచ్. నిన్నటి వరకు మేము నియమంగా నిజాయితీగా చెప్తున్నాం మేము కామేమో కానీ ఈరోజు మీ దగ్గర మందిరంలో పిల్లలు చేసిన పనులు మీతో పాటు గడిపిన క్షణాల తర్వాత మా ఊరు మొత్తం స్వామి భక్తులుగా మారుతున్నాం. మేము యాభై మూడు మంది సేవా దళ్ మేము ప్రశాంతి నిలయానికి వెళ్తున్నాం యాభై మూడు మంది మమ్మల్ని మా పేర్లు రాసుకోండి అన్నారు ఆయన. అంటే నేను చెప్పాను ప్రశాంతి నిలయం మందిరం నన్ను ఎందుకు ఇంత ఆకర్షించి ఇంతగా ఆనందాన్ని ఇచ్చింది అంటే రెండు కారణాలు వాళ్ళకి తెలియదు పాపం అదే ఊర్లో అదే ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నారు. ప్రపంచంలో ఎన్ని మందిరాలు ఉన్నా ప్రశాంతి నిలయం అంటే పుట్టపర్తి అసలు పేరు గొల్లపల్లి మీ ఊరు పేరు కూడా గొల్లపల్లి ఒకటి number one అలాగే స్వామిది మందిరం పాత మందిరం కొత్త మందిరం మీది పాత మందిరం కొత్త మందిరం అన్నింటితో పాటుగా ఎక్కడా లేనట్లుగా వేణుగోపాలస్వామి గుడి ఉంది అక్కడి నుంచి రథోత్సవం చేసుకొని వచ్చారు వాళ్ళు పల్లకి సేవ చేసుకొని వచ్చారు కాబట్టి స్వామి లేనిది ఎక్కడ? స్వరూపం అక్కడ సూర్యుడు ఒక్కడే కుండలు కొన్ని వేలు లక్షలు పెట్టి నీళ్లతో నింపేస్తే సూర్యుడు రాగానే కోటి సూర్యులు కనిపిస్తారు మనకి కోటి సూర్యుడు ఉన్నారంటే ఉన్నది ఒక్కడే సత్యసాయి భగవానుడు ఒక్కడే. ఆయన అంతటి వారు గాని ఆయన లాంటి వారు గాని ఆయన వలే ఉండగలిగిన వారు గాని మరొకరు రారు రారు రారు. ఇది ఒక unique అవతారం అవతారంలో మనం చాలా భాగం జీవితమంతా స్వామితో గడిపాం అది మహా తపస్సు తపస్సు ఎప్పుడో రాముడి కాలంలో కృష్ణుడి కాలంలో ఉండే ఉంటాం లేకపోతే continuity వచ్చి ఉండేది కాదు. ఇది వచ్చింది కనుక దీనిని సౌభాగ్య సీమలో దీనిని సుసంపన్నం చేసుకునే దిశగా మనందరం వెళ్ళాలి. ఇది కేవలం మందిరంలో కలిసి ఉన్న క్షణాల వరకు మాత్రమే గాక మైదానంలోకి వెళ్ళినా మనం ఇట్లాగే ఉండాలి. ప్రపంచం అంతా మనల్ని ఆకర్షణావలియంలో నెట్టినా దాంట్లో నుంచి నెగ్గుకొని బయటకు రావాలి. మాకివి అక్కర్లేదని అనగలగాలి. ఎందుకంటే స్వామే మన వారైన తర్వాత ఇంకా ఏం కావాలి? స్వామి కంటే ఉన్నతమైన వస్తువు ఏదన్నా ఉంటే పోనీ కోరుకుందాం. నా దృష్టిలో ఇంకోటి ఉందని నేను అనుకోను అది అవసరం కూడా లేదు. నువ్వు స్వామే చెప్పారు శిరులకేముంది? అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. వైభవాలకేముంది కాస్త వెలిగిపోతూ ఉంటాయి మలగిపోతూ ఉంటాయి. ఇంకా ఏవో జరుగుతూ ఉంటాయి. కోరిన కోరికలు పెరుగుతూ ఉంటాయి. పెరిగిన కోరికలు తరుగుతూ ఉంటాయి కానీ భగవంతుడా! నీవు నా సద్భక్తుడివి అని నీ చేత అనిపించుకోవాలి నేను. అటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించవయ్యా అది చాలు తండ్రి అంటారు స్వామి. శిరులకేమి ప్రసన్న చిత్తుడవైనచో చాలు అది నాకంతియా పదివేలు. పదివేలు ఏంటంటే స్వామి మనల్నన్నాలి నువ్వంటే నాకు ఇష్టం నువ్వు నా నిజ భక్తుడివి నువ్వు చాలా చక్కగా ఉన్నావ్ బాగా మంచి పనులు చేస్తూ ఉన్నావ్ అని అంటే అది స్వామి నుంచి మనం పొందేటువంటి మహాధైశ్వర్యంగా నేను భావన చేస్తూ కొకట్ పల్లి సమితి సంకల్పించుకున్నటువంటి మహాయజ్ఞం నేను మీ గురించి కూడా అక్కడే చెప్పాను. మీ గురించి చెప్పకుండా నేను రాలే. రామకృష్ణ, టీము, రాజు వీళ్ళంతా స్వామి student స్వామి నుంచి ఏమి పొందారో మళ్ళీ ప్రపంచానికి ఇవ్వటానికి కంకణం కట్టుకున్నారు. వాళ్ళు ఏదోలే ప్రవచనం చెప్పి వెళ్ళిపోతారని వాళ్ళు అనుకోవటం లేదు. దానిని ఒక బాధ్యతగా నియమంగా నిబద్ధతతో కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి రండి అని వాళ్ళనికి మీ తరఫున నేను ఆహ్వానం చేశాను. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు రావాలి ఇది స్వామి కోరుతున్నది. వాళ్ళు ఇక్కడికి రావాలి మనం అక్కడికి వెళ్ళాలి వెళుతూ ఉండాలి. వాళ్ళు పెద్ద కార్యక్రమం తల పెట్టినప్పుడు మనం ఇక్కడి నుంచి ఊరు వెళ్లి మనం సేవ చేసి రావాలి. మనము ఇక్కడ ఏదన్నా తల పెడితే వాళ్ళు అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి మన మందిరంలో కూడా సేవ చేయాలి. పదకొండు నెలల సౌభాగ్యానికి స్వామి అనుగ్రహం తప్ప మరొకటి కారణం కాదు. అది కాదు ఇంకా ఏదీ కాదు స్వామి ఆశీర్వచనం మహాదాశీర్వచనం. నేను ఇక్కడ జరిగిన-- అంటే నేను ఎవరినీ ఫోటోలు అడగను, నా దగ్గర ఏం వీడియోలు లేవు, నా దగ్గర CD లు లేవు. కానీ రామకృష్ణ ఇలా జరుగుతున్నది అని అన్నప్పుడు ప్రశాంతి నిలయంలో అట్లాగా అని ఆశ్చర్యపోయారు. వెంకటేశ్వర స్వామి temple లో వెంకటేశ్వర స్వామి విగ్రహం పక్కన స్వామికి కుర్చీ వేసి కుర్చీలో పట్టు పట్టు వేసి దానిలో స్వామి పటం పెట్టి వైష్ణవ స్వాములు వచ్చి స్వామికి హారతి ఇచ్చారు. అంటే వాళ్ళు నమ్మలేకపోయారు అప్పుడు మాత్రమే నా రామకృష్ణకి ఏదన్నా ఫోటోలు ఉంటే పంపండి అన్నా. mail చేస్తాను WhatsApp ఉందా అంటే నాకు WhatsApp లేదు. లేదు కానీ రెండు ఫోటోల కోసం WhatsApp పెట్టుకున్నా చూశారా?అది అది వచ్చినందువల్ల technology వల్ల వాళ్ళకి చూపించగలిగాం. వాళ్ళు చాలా ఆనందపడ్డారు. నేను చూపించ-- cell లో అలా చూపించగానే కుర్చీలో కూర్చున్న వాళ్ళు లేచి cell లో ఉన్న కనిపిస్తున్న స్వామికి నమస్కరించుకున్నారు. అది కూకట్పల్లి సమితి సాధించింది. అది మనం ఇక్కడే ఏదో గుప్తంగా ఎవరికీ కనపడకుండా ఎవరికీ వినపడకుండా మనం గనక చేస్తే జరిగుండేది కాదు. అందుకని మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఇది వేడుక దినం ఇది అద్భుతమైనటువంటి రోజది. పరమేశ్వరుడు మనకి ఇచ్చిన ఆయుష్షు ఎంత ఉన్నా సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయం అంతా కూడా ఇటువంటి శక్తితో, ఇటువంటి స్పష్టతతో, ఇటువంటి నిబద్ధతతో అంటే ఇదే commitment తో మనందరం దీన్ని కొనసాగించాలి. అలాగే నేను కూకట్పల్లి సమితిని కోరుకునేది కూడా ఒకటే. యువకులని చాలా మందిని రప్పించండి. ఎందుకంటే యువకులు వస్తే ఏదో జరుగుతుందని కాదు మన తర్వాత తరానికి దాన్ని అందించటం ఎట్లా? YouTube చూడచ్చు బాగుంటుంది. నిన్ననే ఎవరో [గొంతు సవరించిన శబ్దం] "మీకు SMS చేస్తాను" అన్నారు. "చేయకండి" అన్నా. mail పెడతా అన్నారు "పెట్టద్దు" అన్నా. ఎందుకంటే SMS కి మనసు లేదు mail కి హృదయం లేదు. కాసేపు మాట్లాడండి. ఒక నిమిషం మాట్లాడండి. ఏమవుతుంది? నేను మాట్లాడని వాడిని కాదు కదా. మాట్లాడండి చక్కగా పరస్పర భావాయంతి మాట్లాడుకోవాలి share చేసుకోవాలి ఆనందంగా ఉండాలి. తర్వాత వృద్ధాప్యాన్ని చాలా గౌరవం మనం మాట్లాడుకున్నది. వృద్ధాప్యం ఒక వరం. subject మీద అనేకమైనటువంటి senior citizen forums అన్నీ YouTube ని play చేసుకుంటున్నాయి. ఇది ఇక్కడి నుంచి technology ద్వారా మనకి ప్రపంచానికి ఇచ్చింది. ఇది ఇచ్చింది కూడా స్వామి. ఒక రేడియో సాయి వస్తుందని గాని, రేడియో సాయి తెలుగు ప్రసారాలు ఉంటాయి అని గాని, దానిలో మనం అనేక మాటలు మాట్లాడతామని మనకు ఏం తెలియదు. స్వామి అలా సృష్టించారు. మనల్ని పిలిచారు. ఇగో రామకృష్ణ పెట్టినట్లు ఒక mic పెట్టారు. ఒక camera పెట్టారు. పని నడిచిపోతుంది. కాబట్టి అన్నీ నిశ్శబ్దంగా జరగాలి, చక్కగా జరగాలి, హాయిగా జరగాలి. అలాగే మనం ఎన్నాళ్ళు చెప్పుకున్నా, ఎన్నేళ్ళు చెప్పుకున్నా యువకులంతా కూడా వచ్చేట్లుగా అదొక ప్రయత్నం మీరు చేయండి. లేదా యువకులు ఎక్కడ ఉన్నారో మన సమితి అక్కడికి వెళ్ళేట్లుగా ఏర్పాటు చేసుకోండి. మన దగ్గరికి వాళ్ళు రాలేకపోవచ్చు. నేను వెళ్తూ ఉంటాను Infosys, అదే IT companies, colleges అక్కడికి మీరు రావచ్చు. వాళ్ళతో మేము ఏం మాట్లాడుతున్నామో record చేసుకోవచ్చు. అటువంటి అనేక కార్యక్రమాలు ఇవన్నీ, ఇవన్నీ mic లో ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవన్నీ స్వామి దగ్గరికి వెళ్తాయి. వెళ్తే ఆయన ప్రతి దానికి "ఎస్" ఏ. దాని "నో" లేదు. "నీ మాట వినను" అంటే "నో" అంటారు. కదా. "నువ్వు చెప్పింది చేయను" "నో". "స్వామి మీరు ఏం చెప్తే," "ఎస్ ఎస్ ఎస్" ఆయనే చెప్పారు. "ఎస్" అను వారికి నేను "ఎస్ ఎస్ ఎస్" అంటే శ్రీ సత్య సాయి అది ఒక అర్థం. నేను మూడు అవస్థలలోనూ "ఎస్" ఏ. "నో" అనుకున్న వాడికి "నో నో నో" అదే. కానీ "నో నో నో" అంటూ వాడు "ఎస్" లోకి వస్తాడు అది విచిత్రం. కాబట్టి శుభ సందర్భంలో, దివ్యమైనటువంటి క్షణాలలో, తీవ్రమైనటువంటి అధ్యాత్మ భావనలోకి వెళ్ళకుండా స్వామి వైభవం అంటే స్వామి మహిమలు కాదని, స్వామి మహిమా స్వరూపుడు, పూర్ణ స్వరూపుడు ఆయన. వేద స్వరూపం అది. సకల దేవతల యొక్క నిక్కమైనటువంటి రూపం అది. దాని వెనుక ఉన్నటువంటి స్వస్వరూపం ఏది అంటే అది తేజోమయమైనటువంటి రూపం. తేజస్సుగానే ఉంటారు స్వామి. మన అందరి యందు అది ప్రతిఫలిస్తూ ప్రపంచానికి మన వలన హాని జరగదు. ఖచ్చితంగా జరగదు. కానీ మన నుంచి లాభం కూడా ప్రపంచం పొందాలి. పొందే దిశగా మనందరినీ కూడా చక్కగా, భద్రంగా, ప్రశాంతంగా, ప్రసన్నంగా స్వామి ధర్మ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో నడిపించు గాక అని స్వామిని మనసా, వచసా, శిరసా కోరుకుంటూ అలాగే కూకట్పల్లి సమితి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీరు చేస్తున్నాయి. ఇది ఒక్కటే కాదు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు మధ్యనే తెలిసింది థలసేమియాకి మీరు కూడా చేస్తున్నారు అని. థలసేమియా కథ మీకు తెలుసో తెలియదో, చెప్పానో లేదో తెలియదు. కాబట్టి థలసేమియా అనేది ఇవాళ పది కోట్ల రూపాయలతో building ఏర్పడింది. మూడేళ్ల నాడు ముప్పై వేలు లేవు వాళ్ళ దగ్గర, మూడు వేలు లేవు blood కొనటానికి. ఇవాళ పది కోట్ల రూపాయలతో National Police Academy ఎదురుగా నేనే శంకుస్థాపన చేశాను. మొన్న గృహప్రవేశం చేశాం. అది నాలుగు వేల మంది పిల్లలకి ప్రతిరోజూ కూడా వైద్య సేవ జరుగుతున్నది. అన్నీ జరుగుతాయి. మనం కోరుకోవాల్సింది "నాకు ఇల్లు ఇవ్వు, two bedroom ని three bedroom చెయ్, three bedroom ని five bedroom చెయ్" చేయడు. అది ఆయన పని కాదు. "స్వామి నేను ప్రపంచానికి రకంగా ఉపయోగపడగలను" అన్నప్పుడు అనేకమైన పనులు మన ద్వారా లేదా జరుగుతున్నప్పుడు వాటి యందు మనల్ని ఉంచుతారు గనుక కూకట్పల్లి సమితి థలసేమియాకి చేస్తున్నందుకు నాకు చాలా చాలా ఆనందం కలిగింది. దానిని మించిన సేవ ఇంకొకటి లేదండి. మీరు ఎన్ని అన్నదానాలు చేయండి, రోజు లక్ష మందికి అన్నం పెట్టండి, అది కాసేపే. మళ్ళీ సాయంకాలానికి ఆకలి అక్కడే. కానీ blood ఎక్కించండి. స్వామి ఇవాళ కాదు 1965 లో చెప్పారు. blood, దుడ్డు, food జాగ్రత్తగా వినియోగించేయండి. blood ఇవ్వాలి life line అది. అంతే కదా blood, food ఆకలి అయిన వాడికి అన్నం పెట్టండి. కడుపు నిండ ఉన్న వాడికి తెచ్చి అరిటాకు నిండా పెట్టిన వాడు ఏమంటాడంటే "నాకు చాలండి" అంటాడు. చాలని వాడు, దొరకని వాడు, వాడిని వెతికి పట్టుకొని అన్నం పెట్టాలి. అలాగే దుడ్డు అంటే money. దాన్ని చాలా చాలా సద్వినియోగం చేయాలి. చాలా సద్-- vanity వైపు వెళ్ళకూడదు. మనకి స్వామి charity నేర్పారు. అతిశయం ఉండదు, ఉండకూడదు. అహంకారం ఉండకూడదు. స్వామి ఎంత నిశ్శబ్దంగా, ఎంత నిరాడంబరంగా వారి జీవితాన్ని గడిపారో. సాధారణ మానవుడి కంటే కూడా తక్కువ కోరికలతో ఆయన జీవించారు. ఎవరినీ నుంచి ఏదీ ఆయన ఆశించలే. "ఇది నాకు కావాలి" అని అడగలే. "మీకేం కావాలి" అని అడుగుతూనే ఎనభై ఆరు ఏళ్ళు ప్రపంచంలో ఉన్నారు. "నాకిది తీసుకురండి" అని గాని, "నా birthday కి మీరందరూ రండి" అని గాని, "నేను పిలిచానా ఎప్పుడైనా? మీరందరూ ఎందుకని ఇంత కష్టపడి, మిమ్మల్ని కష్టపెట్టానా?" అనేవారు ప్రతి birthday కి. అంటే మనం ఎన్నో కష్ట నిష్ఠూరాలు ఓర్చుకొని వెళ్తామని ఆయన సర్వజ్ఞుడు గనుక ఒక తల్లి వలె స్వామి మనకి అవన్నీ చెప్పేవారు. మనం కూడా స్వామి చెప్పినవన్నీ పునః స్మరించుకుంటూ మన జీవితాన్ని ధన్యవంతము, ఆదర్శవంతము, సంపూర్ణము, పవిత్రము చేసుకోవాలని, దిశగా స్వామి మనందరినీ చల్లగా నడిపించాలని ప్రార్థన చేస్తూ కూకట్పల్లి సమితి ఇంకా చక్కగా దిన దిన ప్రవర్ధమానమై క్షేత్రాలలో ఎవరెవరి అవసరాలు ఉన్నాయో కొంత గుర్తించుకొని మొయ్యగలిగినంత మాత్రమే భుజాన వేసుకొని మొయ్యలేని దానిని మరొకరికి అప్పజెప్పి సంఘీభావంతో సమస్తమైన ప్రపంచాన్ని కలుపుకుంటూ ముందుకు సాగాలని మనం అన్నీ చేయలేం, అంతా చేయలేం. కానీ కొంత చేయగలం, కొన్ని చేయగలం. చేయగలిగిన వాటిని, చేసేటువంటి శక్తిని స్వామి మనందరికీ అనుగ్రహించు గాక అని మరొక్కసారి స్వామిని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పదకొండు నెలల నిరంతరమైనటువంటి సత్సంగ ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉంటుందని, ఉండాలి అని స్వామిని ప్రార్థిస్తూ మంగళాశాసనం చేస్తూ సాయిరాం.
YouTube · audio

Sri Sathya Sai Avatara Vybhavam — Part 3

Home

Sri Sathya Sai Avatara Vybhavam — Part 3

Source: SathyaSai Seva Sadan on YouTube

0:00 / 32:22

More in this series

Sri Sathya Sai Avatara Vybhavam

3 episodes · 1 hr 38 min

  1. 33 min 1

    Sri Sathya Sai Avatara Vybhavam — Part 1

  2. 33 min 2

    Sri Sathya Sai Avatara Vybhavam — Part 2

  3. 32 min 3

    Sri Sathya Sai Avatara Vybhavam — Part 3

    Now playing