No transcript for this section.
Transcript begins at 0:00.
స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవిషత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయిశ్వరం ఆరంభేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మ స్పురతామే. పరమ మాహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ. సత్యసాయి భగవానుడి అవతార వైభవమే వైభవం. కారణం. వెంకటేశ్వరస్వామి వంటి అర్చా మూర్తి ఇంతకు ముందు రాలేదని ఇకపై రాడు అని ఎట్లాగైతే ఈ లోకం భావిస్తూ ఉంటుందో సత్యసాయి భగవానుడి వంటి అవతారం కూడా ఇంతకు ముందు రాలేదు ఇకపై రాదు అని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే స్వామే స్వయంగా ప్రేమసాయిగా నేను వస్తాను అని ప్రకటించారు గనుక మహత్తరమైనటువంటి ఒక అవతారాన్ని తాల్చి ఈ జగత్తులోకి వారు ఎంచుకున్నటువంటి సమయానికి తప్పకుండా వస్తారు రావాలి ఎందుకంటే భారతీయమైనటువంటి ఒక సంస్కృతి విధానంలో దేవతలు మానవ దేహం తీసుకుని ఇక్కడికి రావటం ఒక సాంప్రదాయం. యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని కృష్ణుడు చెప్పటానికి ముందే శ్రీ మత్స్య కూర్మ వరాహ వటు నరసింహ అవతారాలు వచ్చినయ్. వచ్చి అవి ఏం చేసినయ్ అంటే వేదాలను ఉద్ధరించినయ్. జగత్తుని ఉద్ధరించినయ్. మానవుడు భగవంతుడి యందు తన మనస్సును లగ్నం చేసుకొని నిరంతరము గూడా దివ్య నామ సంకీర్తనంతో దివ్య తత్వ భావనా వివేకంతో తన యాత్ర తాను కొనసాగించటానికి యజ్ఞ యాగాదులు తపస్స్వాధ్యాయాలు ధ్యానధారణ శక్తులు అనేకమైనటువంటి కార్యకలాపాలు ఈ ప్రపంచానికి సుబోధకంగా సరళంగా గంభీరంగా ఉదాత్తంగా సూటిగా హాయిగా బోధ చేసి ఆ బోధ చేయటానికి వారి అవతార కాలమంతా కూడా వారు ఆచరించి ఈ మార్గంలో గనుక మీరు వెళ్లినట్లయితే మీ యందున్న భగవంతుణ్ణి మీరు తెలుసుకుంటారు. దేవుడనగా వేరు దేశమున లేడు తాను చేయు పనుల యందు తగిలి ఉండు అన్నారు స్వామి. మనం భగవంతుడు అనగానే ఆకాశం వైపు చెయ్యి చూపిస్తాం అక్కడ ఉన్నాడు అని. భగవంతుడు అక్కడే అక్కడ మాత్రమే లేడు సర్వే సర్వత్రా అన్నిటా అంతటా అన్ని తానే వ్యాపించి ఉన్నాడు. వేద ప్రామాణికమైనటువంటి మాట సర్వం ఖల్విదం బ్రహ్మ. పదార్థంగా కనిపిస్తున్నది కూడా మార్పు చెందుతూ చెందుతూ అది యదార్థమే. యదార్థంగా కనిపించే పరమాత్మ అప్పుడప్పుడు మనకు పదార్థంగా కనిపించాలి. అంటే ఒక సగుణంగా రావాలి ఒక బొమ్మగా రావాలి మనలాగా రావాలి. మనలాగా మనవలె మనతో ఆయన గనక కూడి ఉండకపోయినట్లయితే అనేకమైన విషయాలు మనకు తెలియవు కాబట్టి ఆ తెలుసు తెలియజెప్పటానికి ఆచరణాత్మకమైన దివ్య జీవన విధానాన్ని మనకు పరిచయం చేయటానికి పరమాత్మ అనేక రూపాలు దాల్చి వస్తాడు. అసలు అవతరించటము అంటే దిగి రావటము అని అది అవరోహణ పై నుంచి కిందకి రావటం. జీవుడి యాత్రంతా కింద నుంచి పైకి వెళ్ళటం అది ఆరోహణ. కింద నుంచి పైకి వెళ్తున్నవేళ ఆ పై నుంచి కిందకు వస్తున్న ఆయన మనం కలుసుకున్నట్లయితే ఎక్కడో ఒక సందర్భంలో లేదా ఒక పాయింట్లో కలుసుకున్నట్లయితే దాని పేరు యోగము అని పేరు పెట్టారు. యోగించటము అంటే అది దాని అర్థం అది. జీవాత్మగా ఉన్నటువంటి జీవుడు జీవాత్మగా కనిపించే పరమాత్మను కలవగలిగితే దాని పేరు యోగం. ఇట్లా ఈ అవతారాలు ఒక్కొక్కటి అంశావతారాలుగా, అర్చావతారాలుగా, కళావతారాలుగా, ప్రభవావతారాలుగా, ప్రసవావతారాలుగా, అనుప్రవేశావతారాలుగా, ఆవేశావతారాలుగా, కారణావతారాలుగా, మహా కారణావతారాలుగా ఎన్నో రకాలుగా ఈ జగత్తులో జగత్తు అంటే భూమండలం మొత్తం మీద అవతార మూర్తులు ఈ జగత్తులోకి ప్రవేశించాలి అని నిర్ణయించుకున్నప్పుడు వారు ఎంచుకున్నటువంటి దేశం మాత్రం భారతదేశం. దేవుడు ఎక్కడా ఇంకో చోట జన్మ ఎత్తలే అవతారం తీసుకోలే. ఇరవై యొక్క నారాయణావతారాలు నిజానికి ఇరవై రెండు అందులో ఇరవై ఒకటి అయిపోయినయ్. ఆ ఇరవై యొక్క అవతారాలు కూడా ఇక్కడే ఏర్పడ్డాయి. ఇక్కడే ఎందుకు ఏర్పడ్డాయి మిగతా పీఠాలలో మిగతా ప్రదేశాలలో ఎందుకు ఏర్పడలేదు అంటే ఇక్కడ అశేతు సీతాచలము జన్మ ఎత్తినటువంటి జీవుడు భద్ర స్వరూపుడై ఉంటాడు. భక్తి, రక్తి, ముక్తి, తత్వం అన్నీ పెరవేసుకుని సాగేటువంటి జీవయాత్ర మంది. ఏదో ఒక చోట పుట్టి కొన్నాళ్ళు ఇంకెక్కడో పెరిగి కాల గర్భంలో కలిసిపోవటానికి మనం రాలే. ఎక్కడ పుట్టినా, ఏ ప్రదేశం మెట్టినా, దేహం నించి గిట్టినా, అమరులమై, నిత్యమై, సత్యమై, శాశ్వతమై, నవ్యమై, దివ్యమై, భవ్యమై, అనంత కాలాలు జీవించటానికి మనం ఇక్కడికి వచ్చాం.శరీరంలో మనం జీవించే కాలం ఆ ప్రమాణం చాలా తక్కువ కానీ మరణానంతరం జీవించే కాలం బహు ఎక్కువ. అది రామకృష్ణాది అవతారాల నుంచి షిరిడి మహాస్వామి వంటి అవతారాల నుంచి ఇదిగో మనకి సమకాలీనంగా సత్య సాయి భగవానుడి అవతారం వరకు తీసుకున్నట్లయితే ఈ సత్యం ఈ తత్వం మనకు బోధపడుతుంది గనుక ఒక పరిపూర్ణమైనటువంటి అవతారం ఆయా దేశ కాల పరిస్థితులను బట్టి ఏర్పడి జాతిని భద్రతమైనటువంటి రీతిలో సమున్నతమైనటువంటి మార్గంలో అది నడిపిస్తుంది. ఎట్లా నడిపిస్తుంది? తల్లిగా నడిపిస్తుంది, తండ్రిగా నడిపిస్తుంది, గురువుగా నడిపిస్తుంది, ఆచార్యుడిగా నడిపిస్తుంది. ఈ నాలుగు కలిపితేనే దివ్యత్వం. దైవము అంటే తల్లి ఒక భాగం, తండ్రి ఒక భాగం, గురువు ఒక భాగం, ఆచార్య సత్తముడు నాల్గవ భాగం. ఈ నాలుగు కలిపినటువంటి వాడు మాత్రమే అవతారమూర్తి అవుతాడు. ఉదాహరణకి శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మ ఎత్తి వచ్చే వరకు వచ్చినటువంటి అవతారాలన్నీ కూడా పాక్షికంగా పశు దేహాలు ధరించి వచ్చినాయి. మత్స్యావతారం, వరాహ మనకు అవన్నీ తెలుసు. మత్స్యావతారం, వరాహావతారం కానీ వటువు వచ్చేప్పటికి వటువు అంటే వామనావతారం. దానికంటే ముందు నరసింహావతారం ఇవల్యూషన్ ఇదంతా కూడా పరిణామ క్రమం. అంటే మనకి రెండు బోధలు జరుగుతున్నాయి భగవంతుడు మనకు ఏదైనా బోధించాలి అంటే మానవ జన్మే ఎత్తవలసిన పని లేదు అది. ఎట్లాగైనా రావచ్చు, ఏ రూపంలోనైనా రావచ్చు, ఏ రకంగానైనా మనకు బోధ చేయవచ్చు కానీ బోధ చేయటం, ప్రబోధన చేయటం, మనిషిని ఆయత్తం చేయటం, సమాయత్తం చేయటం మళ్ళీ జీవితాన్ని దాని విలువని, దాని డైనమిక్స్ ని అర్థం చేసుకుని జీవితాన్ని పరిపూర్ణంగా, సర్వానందమయంగా, భద్రతోముఖంగా గడపటానికి గల అన్ని మార్గాలనీ కూడా తెరచి పరచి ఉంచటానికి ఈ అవతారాలు వస్తాయి. రాముడు తన ఎనిమిదవ ఏట అయోధ్యా నగరి దర్శనానికి వెళ్ళాడు, రథమెక్కి వెళ్ళాడు. వెళ్లి కొద్ది రోజులు తిరిగి వచ్చాడు అంతఃపురంలో కూర్చున్నాడు. వశిష్ఠులవారు వచ్చారు. రాముడి ముఖ మండలం వాడిపోయింది. ఎందుకిట్లా ఉన్నాడు? ఒక పసివాడు రథమెక్కి ఊరంతా తిరిగి వస్తే ఆనందంగా ఎన్నో కథలు చెప్పాలి. అది బాగుంది, ఇది బాగుంది, ఇది చూశాను, అది చూశాను అని. కానీ జ్ఞానమూర్తి అయినటువంటి వశిష్ఠుల వారు రాముడిని అడిగాడు "ఎందుకు ఇంత వైక్లవ్యానికి లోనైనావు?" అని అడిగాడు. "ఆచార్య దేవా ఏం చెప్పను నాకు ఈ ప్రపంచం అంతా దుఃఖారామమై తోస్తున్నది" అన్నాడు. ఇది రాముడి మాట. దుఃఖారామం ఈ దుఃఖం తప్ప నాకెక్కడా ఆనందం, సంతోషం మీరు చెప్పేవి నాకెక్కడా కనపడలేదు. అదిగో బయటికెళ్లి చూసి వచ్చానన్నాడు. మరి నారాయణ మూర్తి రాముడై ఈ జగత్తు లోకి వచ్చి జగత్తును ఉద్ధరించవలసిన వాడు, ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు ఇంత వైక్లవ్యానికి ఈ ఎనిమిదో ఏటే లోనైతే ఇక కథ సాగేది ఎట్లా అనుకున్నారు వశిష్ఠులవారు. ఈ ఆనందం యొక్క స్వరూపం ఏమిటి? అది ఎక్కడ ఉన్నది? ఈయనకు గనక చెప్పేస్తే రాముడు మళ్ళీ మనసు తిప్పుకొని ఆహో ఈ ప్రపంచం బానే ఉందిలే అంటాడేమో అని నెమ్మదిగా మాటల్లోకి దింపాడు. మాటల్లోకి దింపితే వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్న ముప్పై మూడు వేల శ్లోకాలే ఇవాళ వశిష్ఠ గీత లేదా యోగవాసిష్ఠ. రామ వశిష్ఠ సంవాదం, సంవాదం అంటే భిన్నాభిప్రాయాలుగా చెప్పబడిన విషయాలకి ఒక ఏకాభిప్రాయాన్ని సంపాదించుకొని జగత్తుకు ఒక వాంగ్మయ రూపంలో ఇవ్వాలి గనుక అది వశిష్ఠ గీత అని యోగవాసిష్ఠ అని చెప్పబడింది. అంతా అయిపోయిన తర్వాత "రామా నీవు ఆనంద స్వరూపుడివి కదా" అన్నాడు వశిష్ఠులవారు. "అదేమో నాకు ఇంకా అనుభవం కాలేదు కానీ నేను మనస్సంన్యాసిని" అన్నాడు. ఎనిమిదేళ్ళ బాలుడు మనస్సంన్యాసిని అనటం అనేది ఒక ఉదాత్తమైన భావన. మనస్సును గనక సంన్యసించగలిగితే దాని పేరు నిజానికి ఆనందమే. భగవంతుడు అంటాడా అవును నేను ఆనంద స్వరూపుడిని అని అంటాడా? అనడు. రాముడు ప్రధానంగా ఎందుకని అంటే ఆయన జీవితం అంతా కూడా ఆనందమయం కాబోవటం లేదు గనుక, అది ఆయనకు కూడా తెలుసు గనుక, సుఖం రాని, దుఃఖం రాని, అనుకూలం ఏర్పడని, అననుకూలం ఏర్పడని, కీర్తి రాని, ఏదీ జరగని, ఆ మనసు నుంచి దాటి సంచారం చేస్తాడు గనుక ఆయన ఒక యదార్థమైనటువంటి ప్రకటన నేను మనస్సంన్యాసిని అన్నాడు. వశిష్ఠుల వారికి అర్థమైపోయింది. రాముడు నేను మనస్సంన్యాసిని అన్నాడు అంటే ఆనందం వైపు అడుగు వేయబోతున్నాడు, వేయించబోతున్నాడు కారణం రాముడు ఆనంద స్వరూపుడే. ఆయన జానకిరాముడు, జగదభిరాముడు, కళ్యాణరాముడు, పట్టాభిరాముడు, సాకేతరాముడు, దశరథరాముడు, రఘురాముడు ఎన్ని రకాల ఆ రామత్వమనే ఆ రామ శబ్దంలోనే రమయతీ ఇతి రామః. రామ అనగానే ఆనందం కలుగుతుంది, రామ అనంగానే హాయి కలుగుతుంది, రామ అనగానే బలం వస్తుంది, రామ అనగానే తేజస్సు పెరుగుతుంది, రామ అనగానే ఓజస్సు పెరుగుతుంది, రామ అనగానే రజస్సు అణిగిపోతుంది, రామ అనగానే అంతస్సు మహస్సు ఒక్కసారి అనుభవం అవుతుంది గనుక ఆ రామ శబ్దాన్నిఆ రమణీయ ప్రతిపాదన చేస్తూ వాల్మీకి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రాముడి గాథని, ఆయన ఏమన్నాడు రామాయణ కథ అన్నాడు. రాముడి కథ కాదది, రాముడి ప్రయాణానికి సంబంధించిన ట్రావెలోగ్ ఇవాళ భాషలో. ఆ రాముడి అయనానికి సంబంధించిన కథ రామాయణం. రాముడి కథ రామాయణానికి ముందు ఉన్నది, రామాయణానికి తర్వాత ఉన్నది, రామ కాలంలోనూ సాగింది, రామ కాల అనంతరం ఈరోజు కూడా సాగింది. ఇదిగో ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం కదా. [చంటం] చెట్లు, గిరులు, నదులు, సముద్రాలు, ఈ భూమండలం, ఈ ప్రకృతి, ఈ సృష్టి ఉన్నంత కాలం రాముడి కథ అనబడుతుంది, రాముడి కథ వినపడుతుంది. ఆ రాముడు ఆదర్శ మానవుడిగా జీవించటానికి వచ్చాడు. మనం కూడా జన్మ ఎత్తినందుకు అందురా బృహత్తరమైన మహత్తరమైన మానవ శరీరాన్ని ధరించి ఇక్కడికి వచ్చినందుకు ఆ రాముడు వలె సా నందరాముడు వలె ఎలా జీవించాలి అంటే రాజ్యాన్ని వదిలిపెట్టిన, రమణిని పోగొట్టుకున్న, అన్ని సుఖాలకి, భౌతిక సుఖాలకి దూరమైన, అంతస్సులో జ్వజ్వల్యంగా ప్రకాశమానం చెందేటువంటి అఖండ చిద్ఘనమైనటువంటి రస స్వరూపమైనటువంటి ఆనందాన్ని గనక మన సహజ గుణంగా మార్చుకోగలిగితే ప్రాపంచికమైనటువంటి సుఖాలు అవి ఇచ్చే ఆనందాలు చాలా తాత్కాలికమైనవి. చాలా చాలా Transient and impermanent అంటాం. అంత అల్పమైనవి, స్వల్పమైనవి. కానీ ఎప్పుడైతే ఆత్మానంద స్థితిని మనదైనటువంటి సహజ గుణంతో, స్వాధ్యాయంతో, సద్గోష్టితో, సత్సంగంతో, సత్సాంగత్యంతో, సదాచారంతో, సమ్యక్ సంకీర్తనతో దాన్ని గనక కైవసం చేసుకోగలిగినట్లైతే మనము కూడా ఆనంద స్వరూపులంకా-- అవుతాం. ఈ ఆనంద స్వరూపం ఏమిటి చెప్పటానికే శ్రీరామచంద్రుడు ఈ జగత్తులోకి వచ్చాడు. అందువల్లనే లోకమంతా రాముడిని దైవంగా భావన చేసింది. దైవతంగా పూజించింది. ధర్మాన్ని ఆశ్రయించాలనుకున్న వాడు, ధర్మాచరణ చేయాలనుకున్నటువంటి వాడు, తాము ఎన్నుకునేటువంటి Role model ఆదర్శ మానవుడు లేదా ఆదర్శ పురుషుడు ఎవరు అంటే ఎవరినైనా అడగండి అతడు రాముడే అయి ఉంటాడు, అంతే. ఇది అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ అవతారం వచ్చింది. కృష్ణావతారం వచ్చినప్పటి కాలం వేరు, దేశం వేరు, ప్రదేశం వేరు, ఆనాడు ఉన్నటువంటి సమస్యలు వేరు. మనుషులలో అనేకమైనటువంటి జాడ్యాలు ఏర్పడిన కారణంగా శ్రీకృష్ణ పరమాత్మ మాయావరణంలో పుట్టాడు. అమావాస్య నాడు పుట్టాడు. అష్టమి ఘడియల్లో పుట్టాడు. అర్ధరాత్రి పుట్టాడు. చూశారా, ఇది ఏ రకంగానూ శుభలగ్నం కాదు మన పరంగా చూసినట్లయితే. కానీ ఆయన ఆ సమయం ఎంచుకున్నాడు. ఆ సమయం ఎంచుకొని అవతారమూర్తిగా జగత్తులోకి వచ్చి, వచ్చిన కొద్ది క్షణాలకే తల్లితో కాసేపు మాట్లాడాడు. అప్పుడే పుట్టిన, అప్పుడే అవతరించిన పసికూన తల్లితో మాట్లాడగలడా? పరమాత్మ మాట్లాడగలడు. ఆయన పరమాత్మ గనుక "అమ్మా! నేను మూడు జన్మలుగా మీ గర్భంలోనే ప్రవేశిస్తూ వచ్చాను. ఒకప్పుడు కృష్ణ గర్భుడు కారణంగా నేను వచ్చాను. అప్పుడు నన్ను మీరు నారాయణ అని పిలిచేవారు అది నా మొదటి నామం. తర్వాత అదితి కశ్యపునిగా అదితి దేవి నన్ను అడిగింది, ఏం కావాలమ్మా? అని అడిగినప్పుడు, నీవంటి బిడ్డ కావాలి నాకు అని అడిగింది. మనసులో అనుకున్నాను, అడగటం కూడా చేతకాదేమిటి? నీవంటి బిడ్డ అంటుందేమిటి? నావంటి వాడు మరొకడు ఉన్నాడా? లేడు కదా. కనుక నేనే నీ బిడ్డనై వస్తాను అని నేను వచ్చా. అప్పుడు భూమిని కొలిచాను, భూమిని తలచాను, భూమిని తాకాను, భూమిని తడిమాను. మూడడుగుల నేల చాలు అన్నాను. కనుక ఎందుకు అడిగాను అంటే, నేను మాధవుడిని గనుక అడిగాను. మా-ధవుడు, మా అంటే భూమి, ధవుడు అంటే భర్త. ఆ భూమికి భర్తగా అంటే భరించేవాడిగా, భూలోకాన్ని భరించేవాడిగా వచ్చాను గనుక నన్ను నువ్వు ఆ రోజుల్లో మాధవ అని పిలిచేదానివి. ఇప్పుడు ఇదిగో దేవకి వసుదేవులు మీ ఇద్దరి గర్భంలో నేను జన్మించా. ఇప్పుడు నేను కృష్ణ నామంతో వస్తాను, వచ్చాను." ఆయనకేం నామకరణం చేసిన వాడు లేడు. ఏ ఫంక్షను జరగలేదు. ఆయన పేరు ఆయనే పెట్టుకున్నాడు. కృష్ణ నామము కర్షతి ఇతి కృష్ణః, కృషతి ఇతి కృష్ణః, కర్షతి ఇతి కృష్ణః. కర్ష అంటే తీవ్రమైనటువంటి ఆకర్షణ ఉంటుంది. కృష్ణుడి సౌందర్యం గాని, వేషభాషలు గాని, కృష్ణుడి లీలలు గాని, కృష్ణుడి మహిమలు గాని, కృష్ణుడి శక్తులు గాని, కృష్ణుడి విలాసం గాని, కృష్ణుడు పంచే వినోదం గాని, సుమధుర నాదం గాని, వేదం గాని...వేదనాదం కానీ, వేదార్థం కానీ, పరమార్థ యదార్థాలు కానీ, ఏది చెప్పినా బహుసుందరంగా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది గనుక కర్షతి ఇతి కృష్ణః. కృషతి ఇతి కృష్ణః ఇదిగో నీ గర్భాలయం నుంచి బయటకు వచ్చాను నేను మళ్ళీ నా అవతార పరిసమాప్తి వరకు ఒక్క క్షణం కూడా నేను వృధా చేయను ఈ అవతార లక్ష్యము లక్షణము అది అన్నాడు కృష్ణ పరమాత్మ. అట్లాగే మూడవది కృషతి అయింది, కుషితి ఇతి కృష్ణః కృషి అంటే ఆనందం. నాకు దుఃఖం అంటే తెలియదు. లోకుల దుఃఖాన్ని చూసి నేను నవ్వుకుంటా ఆనంద పడతాన, ఆనంద పడను. కానీ నాకు దుఃఖమే తెలియదు లోకానికి ఆనందమే తెలియదు కాబట్టి దానికి ఆనందాన్ని పరిచయం చేయాలి. అందుకని నేను కుషితి ఇతి కృష్ణః. వాళ్ళు గోపికలా? చదువులేని వాళ్ళా? పశువుల కాపరులా? గొల్లపిల్లలా? లేకపోతే కౌరవులా? పాండవులా? కుంతేя? ఎవరు? ఎవరైతే నాకేమి ఎవరికి ఎవరు దుఃఖంలో మానసికంగా కూరుకుని పోయి ఉన్నారో వారికి ఆనంద స్వరూపాన్ని చెప్పటానికి నేను ఈ జన్మ ఎత్తాను గనుక అమ్మా! నా పేరు కృష్ణ అన్నాడు. ఒంటి నిండా ఆభరణాలతో పుట్టాడు కృష్ణుడు సర్వాభరణాలు వంకీలతో. నాసిక అంటే ముక్కు చివర ముత్యంతో పుట్టాడు. చెవులకు లోలాకులతో పుట్టాడు. దేవకి భయపడిపోయింది. ఇంతకు ముందు వచ్చినటువంటి బిడ్డలంతా కూడా ఏ రకమైన అలంకారం లేకుండా పుట్టారు. వాళ్ళనే భయపడి మీ మామ చంపేసాడు. ఇట్లా అసాధారణమైన వ్యక్తిగా గనుక నువ్వు వచ్చినట్లయితే నిన్ను కొన్ని క్షణాలు కూడా వదిలిపెట్టడు. వెంటనే చంపుతాడు. మామూలుగా నువ్వు నీ అవతారం మామూలు బాలుడిగా ఉండి ఉపసంహరించుకో అన్నది. సరేనన్నాడు. మాతృ వాక్యాన్ని కృష్ణ పరమాత్మ ఒక ఆదేశంగా భావన చేశాడు. అయితే తాను తెచ్చినటువంటి యోగ మాయని ఎక్కడ పెట్టాడంటే దేవకి దేవి దగ్గర పెట్టాడు. లోకంలో నడవాలి లోకాన్ని నడపాలి అంటే కాస్త లోకమాయ కావాలి కదా. లోకం మాయలోనే ఉంటుంది. ఆ మాయలో నుంచి లోకాన్ని బయట పడేయాలి గనుక పెనుమాయై తాను రావాలి. కనుక లోక మాయని వెంబడి పెట్టుకొని ఇదిగో నేను బ్రజ భూమికి వెళుతున్నాను అన్నాడు ఆ రాత్రి పూట. భయంకరమైన వర్షం. నది దాటాలి యమునా నది దాటాలి పరవళ్ళు దొక్కుతున్నది ఎందుకు? అమావాస్య అయినా ఆ పరవళ్ళు దొక్కటానికి కారణం కృష్ణుడు వచ్చాడు కాబట్టి నది కూడా ఆనందంగా తరంగితం అయిపోతున్నది. దానిలో నుంచి వసుదేవుడు ఈ బిడ్డను తీసుకుని వెళ్ళాలి. ఎట్లా అనుకున్నాడు వసుదేవుడు? అనుకున్నాడా? అనుకోలే. నన్ను బ్రజ భూమికి తీసుకు వెళ్లి అని కృష్ణుడు దేవకితో అడిగినప్పుడే తీసుకు వెళ్ళు అన్నవాడు నన్ను వెంబడి పెట్టుకుని వెళ్తాడు తప్ప నేను కృష్ణుని వెంబడి పెట్టుకు వెళ్ళటం ఏమిటి అనుకున్నాడు. ఆ రకంగా నది పాయ చీలింది. బ్రజభూమికి వెళ్ళాడు. పూతన సంహార కాండతో ఆయన లీలా కాండ ప్రారంభమైంది. భాగవతం అంతా పరుచుకున్నది. భారతమంతా పరుచుకున్నది. భారత భాగవతాలు రెండు పూర్ణమైపోయినటువంటి సందర్భంలో ఇక మహాభారత సంగ్రామం ఆవిష్కరణ జరిగింది. ఐదువేల నాలుగు వందల ఎనభై ఒక్క సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయనకు తెలుసు యుగం అయిపోతున్నది. ద్వాపర యుగం అంతరించి పోతున్నది. కలియుగం రాబోతున్నది. అది యుద్ధ ప్రకటన చేసినప్పుడే కలి ప్రవేశించాడు. అర్జునుడి రథాంగణం ఏదైతే ప్రాంగణంలోకి వచ్చిందో, అర్జునుడు రథం ఎక్కి వచ్చాడో, కృష్ణుడు దానికి సారథి అయి ఉన్నాడో, ఆ రథ చక్రాల మధ్య కింద కలిపురుషుడు కూర్చొని ఉన్నాడు. ఇక అది ఎవరు? అనాహతమైనటువంటి కాల నేమి? కాలచక్రాన్ని ఎవ్వరూ ఆపలేరు. కృష్ణుడు కూడా ఆపలేడు. అయినా అది తన పని కాదు. అది విధి పని. కాల ప్రవాహము అదే మనం దానిని కాలము అంటాం. అటువంటిది ఆయనకు తెలుసు గనుక రథం దిగమన్నాడు. దింపాడు. ఎలా దింపాడు అంటే "న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం చ రాజ్" అన్నాడు. నాకసలు ఈ రాజ్యము రాజ్య కాంక్ష వద్దనే వద్దు. అసలు యుద్ధమే వద్దు. అంటే యుద్ధం చేయటానికి వచ్చిన వాడు యుద్ధం చేయకపోతే ఎట్లా? కాబట్టి వాడి మనస్సుని ఇక్కడ కూడా యోగ వాశిష్టంలో వశిష్టులవారు ఎట్లాగైతే శ్రీరామచంద్రుడి యొక్క మనస్సుని కర్తవ్యం వైపు నడిపించి నిమగ్నం చేయవలసి వచ్చిందో, ఇక్కడ పరమాత్మ జీవుడు అంటే అర్జునుడి యొక్క మనస్సుని యుద్ధోన్ముఖం చేయాలి, రణోన్ముఖం చేయాలి, కర్తవ్యోన్ముఖం చేయాలి. ఆ వైక్లభ్య విషాదమయమైనటువంటి ఆ భావనా భూమికి నుంచి "యుద్ధాయ కృతనిశ్చయః" యుద్ధం చేయటానికి నువ్వు కృతనిశ్చయుడివి కా అనే దాకా. అంటే చేస్తాడా జీవుడు? చెప్పగానే గురువుగారు చెప్పగానే ఆజ్ఞ పాలిస్తాడా? పాలించడు. కాస్త ప్రారబ్ధాలు అయ్యేదాకా ఎదురు చూస్తాడు. చూసి చూసి ఇక ఇక మన వల్ల కాదు అనుకున్నప్పుడు గురువు గారి మాట గుర్తు తెచ్చుకుంటాడు. అది ముందే గనుక చేస్తే యాతనలు తప్పుతాయి. కానీ జీవుడు తప్పించుకోలేని మాయావరణం కర్మానుబందీ మనుష్య లోకే ఆ కర్మ పరిపాకం చెందే దాకా జీవుడు ఎదుట ఉన్న అరచేతి మాణిక్యాన్ని రాయి అనుకుంటాడు. ఎదురుగా ఉన్నటువంటి గురు స్వరూపాన్ని మామూలుగా మన బోటి వాడు అనుకుంటాడు.సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి మన పక్కన కుర్చీ ఏసి కూర్చున్న ఏదో మనతో పాటు మాట్లాడటానికి వచ్చాడనుకుంటాం. మాయలో వేసేస్తాడు ఆయన. మాయలో మనం కూడా పడిపోతాం. మనకు మాయలో పడటం ఇష్టం బయటకు రావటం మాత్రం ఆ కష్టం మనం భరించలేక మళ్ళీ ఆ మాయావరణం లో ఉన్న పరమాత్మనే అడుగుతాం. ఇది పడుగు పేక్కగా సాగేటువంటి మానవ జీవన దివ్య విధానం. దీనిని గమనించి కృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీత చెప్పాడు. ఆ భగవద్గీత లోనే అనేక రహస్యాలు బయట పెట్టాడు. కర్మ యోగం తప్పదు జీవుడికి కర్మ చేయవలసిందే. యుద్ధాయ కృతనిశ్చయః అంటే కౌరవుల్ని చంపమని మాత్రమే కాదు యుద్ధం మన జీవితం ఒక రణాంగణం. ఈ యుద్ధాన్ని మనం సాగించాలి. ఇక్కడే ఉండాలి గృహస్తాశ్రమంలో ఉండాలి ఆటుపోట్లు తట్టుకోవాలి కష్టసుఖాలు ఆనందాలు దుఃఖాలు ఎన్నెన్ని అనుభవాలు ఎన్ని భావాలు ఎన్ని పరస్పర విరుద్ధ భావజాలాలు వాటి ప మధ్యలో మనస్తత్వ విభానాల మధ్య జీవుడు తనను తాను సంస్కరించుకుంటూ నిగ్గుతేలి బయటకు రావాలి గనుక కర్మని తప్పించుకోగలిగిన వాడు లేడు. అది పరమాత్మకే తప్పినప్పుడు జీవాత్మలమైనటువంటి మన బోటి వాళ్ళకి కర్మ తప్పక ఎట్లా ఉంటే ఉండి తీరుతుంది చేయాలి. కానీ ఎట్లా చేయాలి? భక్తితో చేయాలి. కనుక భక్తి యోగం చెప్పబడింది. ఎవరి యందు భక్తి ఉండాలి? సగుణోపాసనతో అయినట్టయితే రాముడి యందు, కృష్ణుడి యందు, స్వామి యందు మరొకరి యందు ఉండాలి. అయితే అది దాటిన తర్వాత కూడా ఉండాలి. అంటే బొమ్మతోనూ భక్తి ఉండాలి బ్రహ్మతోనూ భక్తి ఉండాలి. అది బ్రహ్మతో భక్తి దాని పేరు నిర్గుణ ఉపాసన. ఆ నిర్గుణ అంటే formless అంటున్నాం. ఆ formless అనే మాట వాడొద్దు అని మొన్ననే ప్రశాంతి నిలయంలో చెప్పాను నేను. దిక్సీమాంత నిబిడ జ్యోతి అంటారు విశ్వనాథం వారు రామాయణ కల్పవృక్షంలో రాముడి గురించి. దిక్సీమలకి అంతంగా ఉన్నటువంటి ఒక జ్యోతి ఏదైతే ఉన్నదో రామా! నీవు అది. మా కోసం ఈ వేషం వేసుకుని వచ్చావా? అంటారు విశ్వనాథం వారు. ఆ దిక్సీమాంత నిబిడ జ్యోతిగా ఆ దిక్కులు ఎక్కడ ఉన్నాయంటే అష్టదిక్కులు మన దేహంలో ఉన్నాయి. ఆ సీమాంతం ఎక్కడ ఉన్నదంటే హృదయ స్థానంలో ఉన్నది. ఆ హృదయ స్థానంలో నిబిడ దాని యందు దాగిన, దాని యందు నెలచిన, దాని యందు సంస్థితమైన, దాని యందు స్థిరమైన ఒక దీప కళిక ఏదైతే ఉన్నదో అది జ్యోతిర్మయంగా, చరాచర మయంగా, ఆత్మ స్వరూపంగా, ఆత్మగా, ఆత్మ భావనగా, ఆత్మనిష్టగా మన యందే ఉన్నది కాబట్టి అటువంటి ఆత్మని మనం అనుభవించటమే అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక సాధనా భూమిక. దానినే కృష్ణ పరమాత్మ కర్మ చేయండి భక్తితో చేయండి. ఇవాళ చెప్పాలంటే పనులు హాయిగా చేయండి, ఏకాగ్రంగా చేయండి, చాలా స్పష్టంగా చేయండి, అర్థం ఎరిగి చేయండి, ఏది చేసినా ఆనందంగా చేయండి. ఆ ఇది బరువు అని అనుకోకుండా చేయకండి, చేయండి. ఇది ఇష్టంగా చేయండి. ఎంత కష్టమైనా భరించండి. ఇవన్నీ మామూలు మాటలు. కానీ కర్మ నుంచి భక్తి యోగంలోకి వెళ్ళినప్పుడు జీవుడి యొక్క మనస్సు మన కంటే సమున్నతమైనటువంటి ఏ శక్తి ఉన్నదో ఆ శక్తితో మన మనస్సు మమేకమై ఉంటుంది కాబట్టి ఆ అనంత మహాశక్తి మన యందు కూడా అంశగా ప్రవేశించి మన చేత మంచి కర్మలు చేయిస్తుంది. మనం ఈ సత్సంగం చేసుకుంటున్నాం అంటే దీని ప్రణాళిక ఎవరు వేశారు అంటే పరమాత్మ సాయి వేశారు. ఒకరు వేస్తే అయ్యేది కాదు. నేను వస్తాను అంటే రారు. పదకొండు నెలలు అవిచ్ఛిన్నంగా అనుకున్న సమయానికి, అనుకున్న చోట, అనుకున్న విషయం, అనుకున్నంత సమయంలో ఇంత నిర్దుష్టంగా ఎలా జరుగుతుంది? ఎక్కడో ఒకచోట అవాంతరం రావచ్చు కదా! రాలేదే. దీనికి కారణం ఏమిటంటే దీని రచన, దీని యొక్క scheme, దీని design ఎవరు చేశారంటే సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి అయినటువంటి సత్య సాయి భగవానుడు. దానికి మనం చేసేటువంటి కర్మ, ఇగో ఈ arrangements, వీళ్ళందర్నీ పిలవటం, అందర్నీ కూర్చోటం, వాళ్ళందరికీ అనుకూలాలు ఏర్పాటు చేయటం, చేయవలసినటువంటి కర్తవ్యాలు నిర్వహించటం ఇదంతా సత్కర్మానుభూతి. దీన్ని భక్తితో చేయాలి, వినయంతో చేయాలి, సమర్పణతో చేయాలి, శరణాగతితో చేయాలి. పరమేశ్వరుడి ఈశ్వర ప్రీతి కోసమే మనం ఈ పనులన్నీ కూడా చేయాలి గనుక అప్పుడు మనకు ఒక వివేకము, ఒక విజ్ఞానము, ఒక విచక్షణ ఏర్పడుతుంది. దాని పేరు జ్ఞానం. శాస్త్రాల ద్వారా వచ్చే జ్ఞానం అది జ్ఞానం కాదు. అది విజ్ఞానం. అంటే మనకి చాలా information వస్తుంది. ఆ శ్లోకంలో ఇలా ఉంది, పుస్తకంలో ఇలా ఉంది, భాగవతం ఇవన్నీ విజ్ఞానం. మరి జ్ఞానం అంటే ఏమిటి ఏమి? తనను తాను ఎరుగు ఎరుకయే జ్ఞానం. మిగతావన్నీ బయటవి తెలుసుకుంటున్నాం. అసలు లోపల ఉన్న ఆ అఖండమైన జ్యోతిని మనం తెలుసుకోవాలి. అందుకై ఈ జన్మ ఇవ్వబడింది గనుక జ్ఞానం కావాలి. కర్మ, భక్తి, జ్ఞాన అనబడేటువంటి మూడు యోగాలు మన యందే ఒక త్రివేణిగా ప్రవహిస్తున్నాయి గనుక కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇదంతా బోధించాడు. ఏడు వందల శ్లోకాల సారము ఏమిటి అంటే మొదటి ఆరు అధ్యాయాలు కర్మ యోగం, మధ్యలో ఆరు భక్తి యోగం, చివరి ఆరు జ్ఞాన యోగం. అయిన తర్వాత చిట్టచివరి ఏడు వందల శ్లోకంలో ఈ మధ్యలో కృష్ణ పరమాత్మ ఏమి చెప్పినా అర్జునుడు వినటంలే. చెప్పే కొద్ది ప్రశ్నలు వేస్తున్నాడు. చెప్పే కొద్ది వాదిస్తున్నాడు. నిజంగా నువ్వు ఆదిత్యుడికి చెప్పావా? మనువుకి చెప్పావా? ఇంతకు ముందే తెలుసుంటావేంటి? మనం ఇప్పుడే కదా కలుసుకున్నది. నువ్వు అక్కడ పుట్టావు కదా, ఇక్కడ పుట్టావు, నేను ఇక్కడ పుట్టా కదా అన్నీ తన పరంగా చెప్తున్నాడు. కృష్ణుడు వాటికి జవాబు ఇవ్వటంలే. నేను ఆదిత్యుడికి చెప్పాను, ముందు మనువుకి చెప్పాను.తర్వాత ఇంకోటికి చెప్పాను ఇదిగో ఇప్పుడు నీకు చెప్తున్నాను ఇలా నేను చెప్తూనే వచ్చాను అంటే ఆ నేను ఎవరు అంటే పరమాత్మ అనబడేటువంటి నేను. అందుకనే మీరు భగవద్గీత మొత్తం ఏడు వందల శ్లోకాలు మీరు చదివినప్పుడు ఎక్కడా ఏ ఒక్క చోట కూడా కృష్ణ ఉవాచ అని ఉండదు భగవాన్ ఉవాచ అని ఉంటుంది. అందులో ఒకే ఒక్క చోట మధుసూదన ఉవాచ అని ఒకే ఒక్క చోట వాడితాడు మిగతాదంతా భగవాన్ ఉవాచ కృష్ణ ఉవాచ ఎక్కడుంది లేదుగా. కానీ ఆ భగవాన్ ఎవరంటే ఇదిగో ఈ కృష్ణుడే కృష్ణుడునే భగవాన్ అని చెప్తాడా? చెప్పడు ఎవరికి చెప్తాడు అంటే నువ్వు భగవాన్ కాదు అన్న వాడికి మాత్రం నేనే భగవాన్ అని చెప్తాడు. నువ్వు భగవాన్ అని మనం ఆయన దగ్గరికి వెళ్తే తెలుసుకున్నావుగా సరే అంటాడు. నువ్వు భగవాన్ కాదు నువ్వు కృష్ణుడివి నువ్వు యశోద దగ్గర పెరిగావు నువ్వు దేవకి కొడుకు అంటే కాదు కాదు నేను భగవాన్ భగవాన్ అనేవాడు ఒకడు అంటూ ఉంటే అది నేనే అని అంటాడు. మాసములలో మార్గశిర మాసం నేనే వేదాలలో సామవేదాన్ని నేనే ఇట్లా పక్షులలో గరుడ పక్షిని నేనే అసలు ఈ ప్రపంచం మొత్తం ఒకడిని ఎవరినన్నా select చేసి తెచ్చి ఇంతటి ఉత్తమ మానవుడు ఎవడని నాకు చెప్తే ఆ ఉత్తమ మానవుడు నేనే అది. ఆ నేనే అంటే అఖండమైనటువంటి ఆత్మే దానిని ఎరిగిన వాడికి ఈ సర్వ ప్రపంచము ఒకటిగా కనిపిస్తుంది గనుక సత్య సాయి అవతారానికి ముందు వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ జ్ఞానబోధ చేశాడు. అంటే జ్ఞానం గురించి చెప్పాడు. శ్రీరామచంద్రుడు జ్ఞానాన్ని గురించి విన్నాడు. ఒకడు విన్నాడు రెండో వాడు అన్నాడు. ఈ అన్నాడు విన్నాడు తర్వాత మళ్ళీ అవతారం రావాలి అట్లా వచ్చినటువంటి అవతారమే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా. అయితే స్వామి అవతార వైభవం అంటే ఖచ్చితంగా మిగిలినటువంటి అవతారాలతో కాస్త పోల్చి మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకున్నాం చాలా సార్లు శ్రీరామచంద్రుడి అవతారం సీతాన్వేషణ కారణంగా అది ఒక మిషగా ప్రారంభమై అయోధ్య నగరి నుంచి ప్రారంభమై ఇవాళ మనం చెప్పుకునే శ్రీలంక దాకా సాగి అఖండ భారతావరణి కూడా తన దివ్యమైనటువంటి పద ముద్రలతో పవిత్రీకరణం చేశాడు రాముడు. రాముడి ప్రయాణం అంతా అయనము అంటే ప్రయాణం ఆ ప్రయాణం అంతా కూడా ధర్మ మార్గోపదేశం అధర్మాన్ని అణచాలి ధర్మాన్ని నిలబెట్టాలి ధర్మాన్ని ఆచరణాత్మకం చేయాలి. కేవలం ఉపన్యాసం ఇస్తే ప్రయోజనం లేదు.
YouTube · audio
Sri Sathya Sai Avatara Vybhavam — Part 1
Sri Sathya Sai Avatara Vybhavam — Part 1
Source: SathyaSai Seva Sadan on YouTube
0:00 / 33:11
More in this series