Skip to content
Transcript తెలుగు
[bell sounds] సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్పురతాం ని. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణంలో సాక్షాత్తు శ్రీరామచంద్ర సన్నిధానంలో పక్కనే పరమశివుడు ఉన్నటువంటి ప్రదేశం ఇది. శ్రీయన గౌరీనా పరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయిత మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయే నమశ్శివాయ అని కొలిచిడి భక్తజనంబు వైదిక జాయితకు ఇచ్ఛమెచ్చు పరతత్వము కొలిచెద ఇష్టసిద్ధికిన్ అంటూ తిక్కన గారు శివుడు గొప్పా విష్ణువు గొప్పా అని కలహించుకుంటున్నటువంటి సమయంలో మీరిద్దరూ తగాదా పడకండి ఇద్దరూ ఒకటే హరిహరాద్వైతమే శుద్ధాద్వైతం అని చెప్పి మనకి భారతాన్ని తెనిగించి మా అప్పజెప్పారు. అటువంటి క్షేత్రం ఇవాళ మన సాయంకాలం గురువులు అనుగ్రహించే తార్కా. కేవల రామాలయం మాత్రమే కాక ఇది శివాలయం కూడా. ఇటువంటి చోట భారతీయమైనటువంటి గురు పరంపరని ఒక్కసారి తడిమి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. [bell sounds] గురు శబ్దం అనేటువంటిది సృష్టిలో కేవల భారతదేశంలో మాత్రమే వినపడుతుంది. మిగతా అన్ని చోట్ల teacher, professor దగ్గర అయిపోయినాయి. భారతదేశంలో ఒక అధ్యాత్మ స్థితిలోకి వెళ్ళినటువంటి వ్యక్తి తాను పొందినటువంటి ఒక దివ్య అనుభూతిని వ్యక్తిగతంగా అనుభవించినటువంటి దానిని తన యందే దాచుకోకుండా ప్రపంచానికి దాన్ని అమ్మకుండా దైవం పట్ల నమ్మకం కలిగేట్లుగా చెప్పగలిగిన వాడు గురువు అవుతున్నాడు అంటూ ప్రారంభమైనటువంటి జాతి భారత జాతి. [bell sounds] ఇక్కడ గురు శబ్దం అంటే మామూలుగా రోజు వినపడే మాట గు అంటే అజ్ఞానం అంటే చీకటి రు అంటే పొగొట్టేవాడు వాడు గురువు అని. గురువు అంటే అచ్చ తెలుగులో అర్థం ఏంటంటే గుర్తు చూపించేవాడు, గురుతు చూపించేవాడు అని అర్థం. మార్గం చూపించేవాడు. ఆయన్ని చూడగానే మన మనస్సు ఆయన యందు గురి కలగాలి. గురికి మన మనసు గనక ఆయత్తం కాకపోతే గురువు ఎంతటి వాడైనా మన మనసుతో అనుసంధానం కాకపోతే ఆయన్ని మనం గురువుగా అంగీకరించం. కాబట్టి గురువు అంటే వింటున్నవాడు అంటున్నవాడు ఏకకాలంలో ఒకటి కావాలి. అందుకనే వేదకాలంలో ఉపనిషత్తులలో వేదముల చివరి భాగమైనటువంటి ఉపనిషత్తులలో వీళ్ళని ఏమన్నారంటే గురువు అనేటువంటి శబ్దం వాడకుండా ఆచార్యుడు పూర్వరూపము శిష్యుడు ఉత్తర రూపము అన్నారు. అంటే ముందు ఎవరు అంటే గురువే ముందు. గురువు తర్వాత అన్నీ ఉంటాయి. గురువు ఒక్కటైతే శిష్యుడు ఒక్-ఒక్కడు దానికి సున్నా గనక కలిస్తే పది అయి ఇంకో సున్నా కలిస్తే వంద అయి ఇంకోటి కలిస్తే వెయ్యి అయి అట్లా ఎట్లాగైతే పెరుగుతూ విలువ వస్తూ ఉంటుందో అట్లాగే ఒక సమర్ధుడు అయినటువంటి సద్గురువు యొక్క ఆవరణలోకి మనం వచ్చినప్పుడు గురువు మనల్ని ఏం చేస్తాడు అంటే మన మనస్సును దైవం వైపు మళ్లిస్తాడు. మరి ఆయనకి శక్తి ఎలా వచ్చింది? మా-మనలాగానే ఉన్నాడు కదా. ప్రత్యేక శక్తులు ఏమిటి అంటే ఆయన బోధించటం మాత్రమే కాదు ఆచరిస్తాడు. ఆచరించిన దాన్ని మళ్ళీ బోధిస్తాడు. కనుక ఆచరించి బోధించే అటువంటి వాడు మాత్రమే ఆచార్యుడు అవుతున్నాడు. ఆచార్యుడు అంటే professor అని కాదు. ఎవరైతే ఒక సిద్ధాంతాన్ని [bell sounds] ఒక జీవన విధానాన్ని గట్టిగా నమ్మాడో, దానిని ఆచరించాడో, అనుభవాన్ని పొందాడో, అనుభూతిని కైవసం చేసుకున్నాడో, దానిని విభూతి వైపు నడిపిస్తూ ఉన్నాడో అటువంటి వాడు గురువు అవుతున్నాడు. [bell sounds] గురు శబ్దం కృతయుగంలో రెండు వర్గాలు ఉన్నాయి. మానవ జాతిలో మంచివాడు చెడ్డవాడు ఎట్లాగో పురాణ కాలంలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గము దేవతలు, రెండవ వర్గము రాక్షసులు. [bell sounds] దేవతలకి గురువు ఎవరు అంటే బృహస్పతి. రాక్షసులకు గురువు ఎవరు అంటే ఇదిగో శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడి ఆలోచనను బట్టి రాక్షస జాతి తన గుణాన్ని పెంపొందించుకుంటూ వెళ్ళింది. బృహస్పతి గురువుగా ఉన్నప్పుడు దేవీదేవతలంతా కూడా వాళ్ళలో ఉన్నటువంటి positivityని, మంచితనాన్ని, సుగుణాన్ని వాళ్ళు పెంచుకుంటూ వాళ్ళు ముందుకెళ్లారు. కానీ రెండూ కలిసిన సందర్భాలు లేవు. అయితే కృతయుగంలో వామనావతార ఘట్టం ఒకటుంది. బలి చక్రవర్తి దగ్గరికి శ్రీ మహావిష్ణువు వచ్చి మూడు అడుగుల నేల అడిగినప్పుడు శుక్రాచార్యుడు రాక్షస గురువు గనుక ఆయన ఏమన్నాడంటే, "అయ్యా వచ్చిన వాడు విష్ణుమూర్తి నీ పదవిని, నీ సంపదని మొత్తం పట్టుకొని వెళ్ళిపోతాడు."కాబట్టి మీరు ఏం చేస్తారంటే దానం ఇవ్వకుండా ఏదో అడిగాడు మూడు అడుగులు దాని ప్రతిఫలంగా ఏదైనా ముట్ట చెప్పి పంపేయ్ అన్నాడు. బలి చక్రవర్తి రాక్షస సంతతికి చెందిన వాడు అయినప్పటికీ. దానాహంకారముంది దానగుణం ఉన్నది. దానగుణం విశేషంతో ఏం చేసాడంటే నిజంగా వచ్చిన వాడు హరి యజ్ఞం కైతే అంతకంటే కావాల్సింది ఏముంది. విశ్వజిత్ యాగం చేస్తున్నాను నేను యాగం దేని ఆశించి చేస్తున్నాను భగవంతునికి ఇవ్వాలి ఏం చేస్తున్నా భగవంతునికి ఇచ్చి ఇంద్ర పదవి పొందాలి ఏం చేస్తున్నా ఇచ్చేవాడే నా వాకిటలోకి వచ్చాడని నువ్వే చెప్తున్నావు మరి వచ్చిన వాడికి ఇవ్వకుండా ఎప్పుడో వస్తాడని ఎందుకు చూడాలి నేను దానం చేస్తాను అన్నాడు. ఇంద్ర పదవి పోతుంది వంశక్షయం అవుతుంది కుల విధ్వంసం జరుగుతుంది నీకు ఇంద్ర పదవి రాదు రాజ్యం మొత్తం పోతుంది అన్నాడు. అంటే అధ్యాత్మ లోకి వెళ్లేటువంటి మనసు ఏర్పడినప్పుడు గురువు ఎంత గొప్పవాడైనా ఎంత సన్నిహితుడైనా పక్కకి తొలగించమని చెప్తుంది వామనావతార ఖిండం ఆత్మోన్నతిలో మనం ఏదో మంచి మార్గంలో వెళ్తుంటాం ఇప్పుడు అక్కడికి ఎందుకండీ అంటాడు ఎవడో అవును వాడేదో అంటున్నాడు పోనీ మనం నిజంగా ఎందుకు అక్కడికి అని ఇంట్లో ఉన్నామా మనం పోగొట్టుకుంటాం అక్కడ కాదు కాదు గంట తర్వాత గంట తర్వాత మీరు రండి గురువు గారిని నేను మాట్లాడతాను అని వీడు పని మీద రావాలి అప్పుడు బలి చక్రవర్తి ఎంత చెప్పినా వినలే భార్యను పిలిచాడు పిలిచి ఆయన వచ్చిన ఆయన విష్ణుమూర్తి అని చెప్తున్నారు ఆయన పాదాలు కడిగి కదా దానం ఇవ్వాలి. ఆయన ఎముడికంట మూడు మూడడుగులు నేల ఇచ్చేద్దామని భార్యను పిలిస్తే ఆవిడ ఒక బంగారు బిందెలో నీళ్ళు తీసుకొని వచ్చింది. బలిదై చేంద్ర కరద్వయి కృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాచే యోగిస్సు మనస్సం ప్రార్థిత శ్రీదమున్ కలితా నమ్ర రమాలలాట పదవి కస్తూరికా శాదమున్ నలినామోదము రత్న రూపులిత నానా వేదమున్ పాదమున్ పోతనగారు రాశారు పాక్ పద్యం అంటే పాదాలు ఎలా ఉన్నాయి అంటే సమస్త వేదాలు ఆయన కాళ్ళకు అందెయ్యలుగా కనిపిస్తున్నాయట అటువంటి పాదాలకి నేను నమస్కరిస్తున్నాను అని పాదాలు కడిగాడు. మూడవసారి దానం ఇవ్వటానికి రెండు ఆవృత్తులు పూర్తయి మూడవది అయ్యేటువంటి వేళ శుక్రాచార్యుడికి రాక్షస జాతి యందున్న అభిమానం చేత. నీళ్ళు ధార పడకుండా జలధారకి అడ్డుపడ్డాడు సర్వవ్యాపకుడు జగద్రక్షకుడు జగన్నాయకుడు జగదీశ్వరుడు అయినటువంటి పరమాత్మ కన్ను ఎవరు కప్పగలరు ఆయన ఏం చేశాడు అటు వామనుడు దర్భ తీసుకుని నీళ్ళు అడ్డం పడుతున్నాయి అని పొడిచాడు దాంతో శుక్రాచార్యుడి యొక్క కన్ను పోయింది అది దానివలన అతను రెండు కళ్ళు ఉన్నప్పటికీ కూడా కేవలం చెడునే చూసి చెడుని మాత్రమే బోధిస్తూ వచ్చాడు గనుక పరమాత్మ ఒక్క కన్ను మాత్రమే మిగిల్చాడు చూశారా అది. పరమేశ్వరుడు మనందరికీ రెండేసి కళ్ళు రెండు చెవులు రెండు ముక్కులు ఇట్లా ఇచ్చాడు స్వామి చెప్తారు తర్వాత తర్వాత కానీ తినటానికి మాత్రం ఒక్క నోరే ఇచ్చాడు ఒక్క నోరు ఇచ్చినా వాడికి ఇంకా తృప్తి లేదు రెండు ఇచ్చి ఉంటే ఏమయ్యేదో పొరపాటు అన్నాడు స్వామి చమత్కారంగా. కాబట్టి అక్కడ ప్రారంభమైనటువంటి గురు సాంప్రదాయంలో శుక్రాచార్యుడు ఇట్లా అయితే బృహస్పతి ఏం చేసాడంటే. దేవతల అందరికీ కూడా భావోద్దీపనం కలిగిస్తూ వాళ్ళు ఎక్కడైనా దురాశాపరులు గనుక అయినట్లయితే ఎవరి విషయాన్నైనా తాము పొందాలని కోరుకుంటూ ఉన్నట్లయితే అపరిగ్రహము అస్తేయము అస్మితము అని మూడు మాటలు చెప్పి వేదాంత పరమైన మాటలు అంటే ఏం లేదు ఇంకొడి వస్తువును దొంగిలించకూడదు. నీ వస్తువును నువ్వు భద్రంగా రక్షించుకోవాలి స్మితా నందుడివై ఉండాలి అన్ని వేళలా సుఖంలో కష్టంలో వచ్చినా పోయినా ఆనందంగా ఉండాలి ఇంకొకడి నొవ్వను నువ్వు హరించటానికి నీకు వీలు లేదు అని మూడు మాటలు చెప్పి దేవ జాతిని అంతా కూడా అటు నడిపించిన కారణంగా సద్గుణాలన్నీ ఒకవైపు మోహరించినాయి దుర్గుణాలన్నీ రెండోవైపు మోహరించినాయి చూశారా అది కృతయుగం నాటి సందర్భం. కృతయుగంలోనే చిట్టచివరి అంశము అంకము అయినటువంటి నృసింహ అవతారం రావటానికి ముందు హిరణ్యకశిపుడి కడుపున ప్రహ్లాదుడు పుట్టాడు. శాస్త్రాలు వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ నేర్పించాలి కొడుక్కి అని సంభ్రమ పడి గురుకులానికి పంపించాడు అంటే గురుకుల వ్యవస్థ లోకంలో అప్పటికి ఏర్పడింది. వెళితే కొన్నాళ్ళు అయిన తర్వాత తండ్రికి అనిపించింది నా పిల్లవాడు ఏం చదివాడో అడుగుదాం ఒక్కసారి అని. పిలిపించాడు గురువులు వచ్చారు గురువులతో పాటు ప్రహ్లాదుడు వచ్చాడు గురుకులం నుంచి. నాయనా ఏం నేర్చుకున్నావు అని అడిగారు. గురువులంతా నాకు శాస్త్రాలు చదివించారు. శాస్త్రానికి భాష్యం చెప్పారు అంతర్ బోధ చేశారు అవి ఎందుకు చదవాలో చెప్పారు ఎట్లా చదవాలో చెప్పారు చెప్పిన తర్వాత నేను ఎట్లా ఉండాలో చెప్పారు నా ద్వారా జగత్తుని ఎట్లా ఉంచాలో నాకు బోధించారు చదువులలో మర్మమెల్ల చదివితే తండ్రి అన్నాడు. అంటే లౌకికమైనటువంటి విద్యలన్నీ నేను నేర్చుకున్నాను అన్నాడు.చాలా ఆనందపడ్డాడు హిరణ్యకశిపుడు. మళ్ళీ ఒక ఆరు నెలలకి కొడుకును పిలిపించుకున్నాడు." నాయనా ఇప్పుడు అవన్నీ చేశానన్నావ్ చదివానన్నావ్ ఇప్పటికి నీ గురువులు ఏం చెప్పారు నీకేం అర్థమైంది నాకు చెప్పు నీ భాషలో" అంటే "ఒకటి అర్థమైంది తండ్రీ, అవన్నీ లోక విద్యలు చదువులన్నీ చదివి చావంగానేటికి చావు లేని చదువు చదువవలెయు, అవన్నీ శాస్త్రాలు వస్తున్నాయి పురాణాలు వస్తున్నాయి అది ఇట్లా అది ఇట్లా రాముడు ఇట్లా కృష్ణుడు ఇట్లా ఆ-ఒక ఉద్వేగం ఒక అద్భుతమైన భావావేశం కలుగుతున్నది. ఇది కాదు నా మనస్సు నెమ్మదించి నాలో ఇంద్రియ చలనాలన్నీ కూడా చక్కగా సంతృష్టి చెంది నేను ఒక దమంతో శాంతితో ప్రసన్నతతో పారమార్థికంగా జీవించగలిగినటువంటి ఒకానొక విద్య చదవాలని చెప్పారు చదువులన్నీ చదివి చావంగానేటికి ఎందుకంత strain పట్టం." అని అన్నమాట. "ఎందుకంత పెద్దగా శ్రమ పట్టం చావులేని చదువు చదువవలెయు, మనిషి మరణించినా మరణం లేని చదువు ఏదన్నా ఉన్నదా అది నేర్చుకోవాలని అనిపిస్తున్నది తండ్రీ" అన్నాడు. అది ఏమిటి అంటే ఆత్మవిద్య దాంతో తర్వాత నరసింహ అవతారం రావటం కృతయుగం పూర్తి కావటం త్రేతాయుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరవైనాలుగవ ఇక్ష్వాకురాజుగా వచ్చే సమయానికి అల్లకల్లోలంగా ఉన్నది త్రేతాయుగం. ఏమిటా అల్లకల్లోలం అంటే లంకానగరంలో రావణబ్రహ్మ అనేటువంటి వాడు ఒకడు బ్రహ్మవంశంలో పుట్టి కూడా సకల శాస్త్రాలు చదివి కూడా వీణావాదనలో యాజ్ఞవల్కున్ని మించిన వాడై కూడా వ్యాకరణ పండితుడై ఉండి కూడా అష్టదిక్పాలకుల్ని నవగ్రహాలని కైవసం చేసుకున్నవాడై ఉండి కూడా కుబేరుడి అలకాపురిని జయించిన వాడై ఉండి పరమేశ్వరుని సాక్షాత్తు దర్శనం చేసిన వాడై ఆత్మలింగం కావాలి అని కోరుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సౌందర్యరాశి ఎవరు అంటే రావణబ్రహ్మ. అటువంటి వాడు మరి వాడి మనసులో ఏమి పుట్టిందో ఏమన్నాడంటే "శివుడు తప్ప ఇంకో దైవం లేదు విష్ణు నామం ఎవరు నా వెనక అన్నట్లైతే వాళ్ళని చెరసాలలో వేయమన్నాడు హర నామమే కానీ హరి నామం వినపడటానికి వీలు లేదు" అన్నాడు. "కైలాసం ఉండాలి తప్ప వైష్ణవ జాతి ఉండకూడదు" అన్నాడు. అందువలన లోకమంతా అతలాకుతలం అయిపోయినటువంటి వేళ నారదాది మహర్షులందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి శ్రీమహావిష్ణువుని ప్రార్థన చేశారు. వైకల్యం ఏర్పడింది జాతి రెండుగా చీలిపోతున్నది. శివుణ్ణి నమ్మిన వాళ్ళు ప్రస్ఫుర అవుతున్నారు. యజ్ఞయాగాదులన్నీ పోయినయ్ యజ్ఞగుండాలన్నీ బూడిద అయిపోయినయ్. రాక్షసులు రక్తాన్ని చిందిస్తున్నారు దాంట్లో. దీనికి నువ్వే రావాలి మళ్ళీ వచ్చి ధర్మ రక్షణ చేయాలి అన్నప్పుడు శ్రీమహావిష్ణువు శేషశయనుడై వాళ్ళకి ఒక అభయమిచ్చాడు. దశరథుడి ఇంట పుడతా దశకంధరుడి కుత్తుకలు ఉత్తరిస్తా దశకంధరుడు అంటే రావణబ్రహ్మ. వాడి పది తలలు నేను ఉత్తరిస్తా మూడవది దశయుగాల వరకు నిలబడేట్లుగా శ్రీరామచంద్ర నామంతో నేను జగత్తులోకి వస్తా. మూడు ప్రమాణాలు చేశాడు ఆయన. అట్లా తర్వాత పుత్రకామేష్టి యాగం జరగటం పాయస ప్రవేశం చేయటం మహావిష్ణువు యొక్క అంశ కౌసల్యానందనుడైనటువంటి రామచంద్రుడు రావటం రాముడితో పాటు ఆదిశేషువైనటువంటి లక్ష్మణస్వామిగా రావటం భరత శతృఘ్నులు ఇద్దరూ కూడా శ్రద్ధాభక్తులుగా రావటం ఇది ఒక రామాయణ చరిత్ర రామాయణ కథ లేదా రామాయణ గాథ ఇది కావ్య విశేషం. అయితే మరి సాక్షాత్తు నారాయణ మూర్తే రాముడై వచ్చాడు కదా ఆయనకి ఏం విద్య నేర్చుకోవాలి అన్నీ తెలిసి ఉండాలి కదా దేవుడు కదా అంటే పంచభౌతిక దేహాన్ని ధరించిన అవతార మూర్తికి కూడా గురువు కావాలి. చూశారా రామచంద్రుడికి ఎనిమిదో ఏడు రాగానే రథం ఇచ్చి పంపించారు ఊళ్ళోకి అయోధ్యా నగరం ఎట్లా ఉందో చూసిరా అని పంపితే పిల్లవాడు అంతా తిరిగొచ్చి మామూలుగా ఇవాళ పిల్లవాడు లాంటి వాడు కాదు త్రేతాయుగంలో అయిన రామచంద్రుడు. ఆయనన్నాడు "ఏమిటీ ప్రపంచం అంతా దుఃఖారామంగా ఉంది ఇక్కడ ఆనందం లేదు ఎందుకు వచ్చానీ లోకంలోకి" అన్నాడు అని దిగులుగా కూర్చున్నాడు. వశిష్టులవారు వచ్చారు. రాముడు ఎందుకిట్లా ఉన్నాడు అని ఆలోచించి "ఏమి రామా ఎందుకిట్లా ఉన్నావ్ ఊళ్లన్నీ తిరిగి వచ్చావు కదా ఏమేం విశేషాలున్నాయి" అంటే "గురుదేవా ప్రపంచంలో దుఃఖం తప్ప నాకు ఆనందం కనపడలేదు పిల్లలు లేని వాళ్ళు కొందరు ఉండి చెడ్డ వాళ్ళని కన్నవాళ్ళు కొందరు వివాహం కాని వారు కొందరు వివాహాలు భగ్నమైన వాళ్ళు కొందరు ఇది బాగా లేదిది ప్రపంచం దీన్ని నేనేం చేయును" అని అంటే ఆయనకి వశిష్టుల వారు తన జ్ఞాన దృష్టితో చూసి ఎనిమిదేళ్ళకే రాముడు ఇట్ల అయిపోతే ఈయన పెరిగి పెద్దవాడై ఇంకా రావణ బ్రహ్మని చంపేది ఎప్పుడు అవతారం ఏమైపోతుందని భయపడి రోజున అన్నీ పనులు మానుకొని రామచంద్రుడితో ఎదురుగా కూర్చొని "నువ్వు అడగవలసినవన్నీ అడుగుతూ ఉండు రామచంద్రా నాకు తోచినవన్నీ నీకు చెప్తాన"న్నాడు. రాముడు మనస్సును గురించి బుద్ధిని గురించి లోకాన్ని గురించి లోకాతీతమైన భావనను గురించి అనేకమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటే వశిష్టుల వారు ఒకానొక సందర్భంలో అనుకున్నాడు.నేను రామచంద్రుని మనస్సును గెలుచుకుంటున్నా, ఎంత బాగా చెప్తున్నాను అనుకున్నాడు ఆయన. ఆయన అనుకున్నాడో లేదో మళ్ళీ ఆయన జ్ఞాని కదా, ఏమిటి పొరపాటు పడుతున్నాను, నేనేమిటి రాముడికి చెప్పడం ఏమిటి? రాముడు సాక్షాత్తు నారాయణ మూర్తి. కానీ ఏమీ తెలియనట్లుగా, నా నుంచి వింటున్న రాముడి ముఖమండలంలో నుంచే నాకు భావాలు కలుగుతున్నాయి అని ఒక ప్రమాణం చేస్తే ముప్పై మూడు వేల శ్లోకాలతో వచ్చినటువంటిదే అది వశిష్ట గీత లేదా యోగవాసిష్టం. దాన్ని నిండా మన మనస్సు, మన జీవితం, మన జీవితాన్ని ఎలా చూడాలి, ఏం చేయాలి, కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి, వియోగం జరిగినప్పుడు ఏం చేయాలి, మహానందం వచ్చినప్పుడు మన మనస్సును ఎట్లా నిబ్బరించుకోవాలి, అనుకోని విజయాలు మన ఒళ్ళో పడిపోతున్నప్పుడు మనం ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా యోగవాసిష్టాన్ని అనేక ప్రకరణాలుగా, కథలుగా రామచంద్రమూర్తికి చెప్తే ఆయన జ్ఞాన గురువైనాడు రాముడికి. భగవంతుడు మనలాంటి ఒక దేహాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఆయనకు ఏర్పడినటువంటి జ్ఞాన గురువు ఒకడైతే ఒట్టి జ్ఞానమే కుదరదు కదా. లోక గురువు కూడా కావాలి. లోకాన్ని గురించి చెప్పాలి. శస్త్రాలు, అస్త్రాలు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ విన్నటువంటి రాముడికి పన్నెండు సంవత్సరాలు రాగానే రావలసిన గురువు రానే వచ్చాడు. ఆయన పేరు విశ్వామిత్రుడు. యుద్ధానికి, అరణ్యంలోకి, యజ్ఞయాగ సంరక్షణకి దశరథా! నీ కుమారుడిని పంపమన్నాడు విశ్వామిత్రుడు. వాడికి యుద్ధమే తెలీదు, బాణాలు వేయటమే తెలీదు, చిన్నవాడు వాడు వాడేం చేస్తాడు, నేను సశేన్యం గా వస్తానన్నాడు. రావలసింది రాముడు, బాణం వేయవలసింది రాముడు, నేను మళ్ళీ భద్రంగా నీకు అప్పజెప్తాను, నా మీద నమ్మకం ఉంచి పంపమన్నాడు. అప్పటికే విశ్వామిత్రుల వారు బ్రహ్మర్షి అయినాడు. వశిష్ఠుల వారు ఎట్లాగూ బ్రహ్మర్షే. అంటే పరమాత్మకి త్రేతాయుగంలో ఇద్దరు గురువులు దొరికితే ఒకడు లోక గురువు విశ్వామిత్రుడు, రెండవవాడు జ్ఞాన గురువు వశిష్ఠులవారైతే, ఇద్దరూ స్థాయి వాళ్ళంటే బ్రహ్మర్షులు వాళ్ళిద్దరూ. బ్రహ్మమును ఎరిగినటువంటి వారు. కనుక శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం అయ్యేదాకా విశ్వామిత్రుడు కాచుకొని భద్రంగా అప్పజెప్తాను అన్నటువంటి మాట సీతారామ కళ్యాణ ఘట్టం తర్వాత విశ్వామిత్రుడు మళ్ళీ ప్రపంచం నుంచి నిష్క్రమించాడు. ఇక ఆపై విశ్వామిత్రుడి యొక్క కథ మనకు రామాయణంలో కనపడదు. అంటే ఒక జీవిని, మన బోటి వాడిని ఒక సమర్ధుడైనటువంటి ఉన్నతోన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాలి అంటే గురువులు కావాలి అని త్రేతాయుగం మనకు చెప్తున్నది. త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగం రాగానే, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మకి సాందీప మహర్షి గురువైనాడు. చాలా స్వల్ప కాలం, అతి చిన్న వయస్సులో అయినాడు. ఎందుకంటే ఆయన వ్రజభూమి వదిలేశాడు. ఎనిమిదవ యేటనే మధురా నగరానికి రావటం, మేనమామని వధించటం, కంసవధ చేయటం, ఇక్కడి నుంచి అట్లా అట్లా అల్లుకుంటూ అల్లుకుంటూ ఆయన పాపం దేశదేశాలన్నీ తిరిగి హస్తినాపురి చేరి మళ్ళీ అక్కడ ఆయనకి రెండు వైరి వర్గాలు దొరికినాయి. రెండు వైరి వర్గాలు ఏమంటే నూరుగురు కౌరవులు, ఐదుగురు పాండవులు. మధ్యలో ఏకమైనటువంటి కృష్ణ పరమాత్మ. మరి కృష్ణ పరమాత్మకు ఒక గురువు సాందీపుడు ఉన్నాడు కదా, మరి కృష్ణుడితో పాటు లోకానికి కావలసిన ఒక గురువు కావలసి వచ్చింది. ద్వాపర యుగం నుంచి ప్రారంభమైన గురువు ఎవరంటే వేదవ్యాసుల వారే తొట్ట తొలి లోక గురువు. వ్యాస నామంతో పదిహేడు మంది గురువులు వచ్చారు. వాళ్ళు ఏం చేశారో చరిత్ర లేదు. కానీ పద్దెనిమిదవ వ్యాసుల వారు, ఆయన పేరు కృష్ణ. ద్వీపంలో పుట్టాడు గనుక కృష్ణ ద్వైపాయనుడు అయినాడు. భాగవతం చెరుకు మన రేగు పళ్ళ తోటలో రాశాడు. సరస్వతీ నదీ తీరంలో గనుక బాదరాయణుడు అయినాడు. వేదాలు ఉభజించాడు గనుక వేదవ్యాసుడు అయినాడు. అష్టాదశ పురాణాలు, విష్ణు సహస్ర నామము, భగవద్గీత ఇదంతా గ్రంథస్తం చేసి ఇవాళ తొట్ట తొలి లోక గురువైనటువంటి వారు ఎవరు అంటే వ్యాసుల వారు గనుక. గురుపూర్ణిమ నిజానికి ఇది వ్యాస పూర్ణిమ. పద్దెనిమిది పురాణాల రచన రోజున పూర్తి చేశాడు ఆయన. ఐదు వందల యాభై ఐదు బ్రహ్మసూత్రాలు ఉన్నాయి లోకంలో అని చెప్పాడు. కానీ దాని పరిష్కారము, భాష్యము చేయవలసిన గురువు ఇంకొకళ్ళు రావాలి. ఉన్నాయి అని చెప్పాడు. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి వ్యాసుల వారు ఎక్కడిదాకా ఉన్నారంటే మహాభారత యుద్ధం అయ్యేదాకా ఉన్నాడాయన. మహాభారత యుద్ధం అయ్యేవేళ అప్పటిదాకా బయటపడని కృష్ణ పరమాత్మ భారత సంగ్రామం ఇంకా రెండు మూడు నిమిషాల్లో ప్రారంభం అవుతుందనంగా బాణాలు విసిరివేసినటువంటి అర్జునుడి దగ్గరకు, అర్జునుడిని దగ్గర తీసుకొని, ఇ-ఇదంతా ఎందుకు చేస్తున్నావు, యుద్ధం చేయాలి కదా అన్నప్పుడు నా వాళ్ళని నేను చంపలేను అన్నాడు. అక్కడ కృష్ణుడు చెలికాడుగా, బంధువుగా, సఖుడుగా, హితుడుగా, సన్నిహితుడుగా ఒక లీలా వినోదాన్ని సాగించినటువంటి కృష్ణ పరమాత్మ జగద్గురు స్వరూపాన్ని స్వీకరించాడు. చేసి కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మూడింటిని కూడా అర్జునుడికి ఉపదేశించి నువ్వు జగత్తులోకి వచ్చినందుకు నీ కర్తవ్యాన్ని నువ్వు చేయవలసిందే. ఇదేమిటీ ఇవి, ఇవన్నీ నాకే ఎందుకు ఏర్పడ్డాయి, నా వాళ్ళ మీదే యుద్ధానికి వెళ్తున్నాను అని అనుకోకు. అంటే పాపం మధ్యలో అర్జునుడు చోట అడిగాడు. ఇటువంటి పరిస్థితి నీకే ఏర్పడితే నువ్వేం చేసేవాడివి అని అడిగాడు. అంటే మన బోటి వాడన్నమాట.ఆయనన్నాడు నాకు ఏర్పడింది పన్నెండేళ్ళకే నేను నా మేనమామని చంపవలసి వచ్చింది చంపానా లేదా చెప్పమన్నాడు. కంసుడిని చంపాడుగా. కాబట్టి పరమాత్మ చెప్పే ముందే చేస్తాడు ఏం చేయగలడో చెప్తాడు మనం ఏం చేయాలో చెప్తాడు అది గురువు యొక్క విశిష్టత అటువంటి జగద్గురువు ఎవరు లోకంలో మొట్టమొదటి వారు అంటే కృష్ణ పరమాత్మ జగద్గురువు ప్రప్రథమ లోక గురువు సరస్వతి స్వరూపం ఏది అంటే వ్యాసులవారు ఇద్దరు గురు స్వరూపాలు ఇటు భారతాన్ని అటు భాగవతాన్ని నడిపించారు భారతంలో కృష్ణ పరమాత్మ జీవితాలను నడిపించే లౌకిక కృష్ణుడుగా కనిపిస్తే భాగవతం నిండా పరమాత్మ కృష్ణుడు కనిపిస్తాడు మనకి. రెండింటిని ఏకకాలంలో సమన్వయం చేసిన అటువంటి మహాద్భుత వాంగ్మయ స్వరూపం ఏంటంటే వ్యాసులవారు గనుక వారి పేరు మీదుగా మనం చేసుకునేటువంటిదే వ్యాస పూర్ణిమ. ఇవాళ ఒక రోజు తేడా అంతే ఇరవై ఏడును రావాలి ఇరవై తొమ్మిదిని వచ్చాను ఇంతలోకే గురుపూర్ణిమ అయిపోలే కదా ఇంకా పదిహేను రోజులు ఉంటుంది ఇబ్బంది ఏం లేదు కాబట్టి వేదవ్యాసుల వారికి ఇవాళ మనం సభాముఖంగా వారికి మనం నమస్కారం చేయాలి. ఆయనే గనక రాసి ఉండకపోతే ఆయనే గనక చెప్పి ఉండకపోతే యాసేన గ్రథిత పురాణమునినా మధ్యే మహాభారతం మహాభారత సంగ్రామం మధ్యలో నుంచొని అటువైపు ఇటువైపు సైనికులు కత్తులు దూసి యుద్ధం ఎప్పుడా అని ఆయత్తమైనటువంటి మనస్సులలో పరమ ప్రశాంతమైన గంభీరమైన ఉదాత్తమైన ఉన్నతమైనటువంటి ఒక మనస్సుని ఆవిష్కరించి ఆవిష్కరణలో నుంచి జగత్తుకి బోధ చేసి ఇవాళ కలియుగంలో మనబోటి వాళ్ళందరికీ కూడా పరమోన్నతమైనటువంటి ఒక గ్రంథ రాజాన్ని ఒక యోగ శాస్త్రాన్ని మనకి అనుగ్రహ వరదానం చేశాడు. గ్రంథం ఏది అంటే అది భగవద్గీత. భగవద్గీతని ఇచ్చినటువంటి వ్యాసులవారికి మనం నమస్కరించాలి. సరే కలియుగం వచ్చింది దేవుడు లేడు గురువు లేదు అంటూ ప్రారంభమైంది. కాదండి దేవుడు ఉన్నాడని మనబోటి వాడెవడైనా చెప్తే మీరు చూశారా అని అడిగారు. నేను చూశాను అంటే నాకు చూపిస్తావా అని అడిగారు. చూపించగలిగిన వాడు చూపించాడు చూపించలేని వాడు నా వరకు నేను చూశాను గానీ నీకు చూపించలేను అన్నాడు. కాబట్టి చూపించగలిగిన గురువులు వచ్చారు చూపించటం ఇష్టం లేని గురువులు వచ్చారు ఉద్ధరేదాత్మ ఆత్మానం నీ అంతట నువ్వు వెళ్లి చదువుకొని తెలుసుకొని అర్థం చేసుకొని అనుభవించి గురువుని మనసులో పెట్టుకోమని చెప్పిన వారు ఉన్నారు కాబట్టి నిజానికి గురువులు అనేకమైనటువంటి గురువులు ఏర్పడిన కాలము ఏది అంటే ఇదిగో కలియుగం. ఇందాకట్నుంచి చెప్తున్నాం కృతయుగంలో ఇద్దరే పేర్లు చెప్పేసాం కదా ద్వాపర యుగంలో ఇద్దరే త్రేతాయుగంలో ఇద్దరే వాళ్ళిద్దరి పేర్లు చెప్పేసాం. ద్వాపర యుగంలో కృష్ణుడికి ఒక్కడే అది చెప్పేసాం. సత్యసాయి భగవానుడిని పందొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో తుప్ప వైరాగ్య శాస్త్రి గారిని పంచాంగ కర్త అక్కడ ఉండేవారు. ఆయన అడిగారు స్వామి ఏమిటిది ఎక్కడ చూసినా గురువులు ఎక్కువైపోయినారు అంటే ఏం లేదు బంగారు పాపులేషన్ ని బట్టి పరమాత్మ అట్లా వస్తూ ఉంటాడు నీ పని నువ్వు చేసుకో అన్నాడు. అప్పుడు ఇంత population లేదు ఎవరన్నా మంచి వాడు ఒక మాట చెప్తే వినే వాళ్ళున్నారు ఇప్పుడు వినేదంతా వింటారు స్వామి అన్నట్లే చేసేదంతా చేస్తారు అంటే అనటం ఎంత వృధా అయిపోతున్నదో వినటం కూడా అంతే వృధా అయిపోతున్నది. ప్రాంగణం దాటిన తర్వాతంతా హాయిగా గెలుపుకొని లోకంలో ఉన్న వస్తువుల వెంబడి మనం పరిగెత్తుకొని వెళుతున్నాం ఇటువంటి గురు శబ్దానికి ఇవాళ గురువు అనే శబ్దం ఎంత పతనమై పల్చనై దిగజారిందంటే గురు అనేదాకా వచ్చేసాం మనం కదా. అనేది కూడా లేదు గురువు అనే అనాలి లఘువు అనే అనాలి గురువు అంటే నా గురువు గనుక అధికం గురువు కంటే గొప్పది లేదు పెద్దది లేదు విస్తృతమైనది లేదు విశాలమైనది లేదు లోతైనది లేదు దాన్ని మించి మనకు వస్తువు లేదు అది గురువు. లఘువు అంటే సూక్ష్మ సూక్ష్మేతరమైనది అల్పమైనదని కాదు అంటే అణువు నుంచి అణువు లఘువు గనుక అయితే బ్రహ్మాండం అంతా గురువు గనుక అయినట్లయితే బ్రహ్మాండ స్వరూపమే గురుతత్వం కాబట్టి అది మూడు వందల అరవై డిగ్రీలలో ఉంటుంది కాబట్టి అది జాతిని నడిపించటానికి ఏర్పడినటువంటి ఒక మహత్తరమైనటువంటి విజ్ఞాన భూమిక అది. తనకు తాను ఎరిగిన జ్ఞానాన్ని తాను పొందినటువంటి విజ్ఞానాన్ని తాను అర్థం చేసుకున్నటువంటి దానిని తాను ఆచరించినటువంటి దానిని తాను అనుభవించినటువంటి దానిని మళ్లీ ఏం చేయాలి లోకానికి ఇచ్చేయాలి అంతే. అట్లా ఇవ్వగలిగిన వాడు మాత్రమే గురువు అవుతున్నాడు నేను కాసేపు మాట్లాడాను ఏదన్నా డబ్బు సంభవాన్ని చేతిలో పెట్టండి అన్నాడా? చెప్పిన మాటకు విలువ లేదు లేదు లేదు పైగా రాదు అంతే. అమ్మటానికి వీలు లేదు భగవంతుడి యొక్క మాటలు నమ్మకానికి దాన్ని లంకె పెట్టాలి. నమ్మకంతో మనం ఒక ఉత్తీర్ణత పొందాలి ఉన్న స్థితి నుంచి మహోన్నతమైనటువంటి స్థాయికి మనం వెళ్లగలగాలి. అందుకై మనం సత్సంగంలో సత్సాంగత్యంలో ఉండాలి అయితే ఇదివరకే ఒకసారి చెప్పుకున్నట్లుగా మళ్ళీ ప్రస్తావన వచ్చింది గనుక గురువులు అనేకమైనటువంటి గురువులుగా వస్తారు. అందరి గురువుల కంటే బృహస్పతి కంటే శుక్రాచార్యుడి కంటే మనకి తొట్ట తొలి గురువు ఒకాయన ఉన్నారు. ఆయన ఎవరో తెలుసునా? బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి హయగ్రీవుల వారు ఒక గురువు. మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం అని చెప్పినటువంటి దక్షిణామూర్తి రెండవ గురువు. అంటే గురు స్వరూపాలు ఎట్లా ఉంటాయి అంటే అవి లోపల ఉంటాయి బయట ఉంటాయి.కొన్ని విడమరచి చెప్తాయి కొన్ని చోట్ల కొంతే చెప్తాయి మిగతాదంతా నువ్వు అల్లుకుని వెళ్ళు అంటుంది కొన్ని గుప్తంగా చెప్తాయి మర్మంగా చెప్తాయి దాన్ని మనం కాస్త వెతికి పట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే గురువు ఇట్లా ఉండాలి అని define చేయటానికి లేదు గురువు సర్వవ్యాపకుడై ఉంటాడు అందుకనే మనం ఇందాక స్వామిని గురించి మన సత్సంగానికి ముందు ఒక శ్లోకం చదువుకున్నాం ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాన్వి అంటే ఆకాశము వలె విశాలమైన వాడు శూన్యుడు అయినవాడు కానీ ఆకాశము వలె పూర్ణమైన అటువంటి వాడు ఖగోళ మండలాన్ని ఆవిష్కరించేది ఆకాశం కాబట్టి ఏమీ లేనట్లు కనపడుతుంది కానీ అన్నీ దాని యందు ఉన్నాయి ఆకాశంలో నుంచి శబ్దోత్పత్తి శబ్ద శబ్దోత్పత్తి లో నుంచి శబ్ద బ్రహ్మోత్పత్తి దానిలో నుంచి వర్షం దానిలో నుంచి బిందువు బిందువు లో నుంచి ధాన్యం సస్యం సస్యం లో నుంచి అన్నం అన్నంలో నుంచి ప్రాణం ఇలా సమస్తమైనటువంటి ప్రాణాలు శూన్యంలో నుంచి పుడుతున్నాయి అందాకా ఎందుకు ఒక శబ్దం పుట్టాలి అంటే దాని మూలం ఏమిటంటే నిశ్శబ్దమే నిశ్శబ్దం చీల్చుకుంటే తప్ప శబ్దం బయటికి రాదు కనుక శబ్ద వ్యాప్చుడు అయినటువంటి వ్యక్తికి గురువు ఎవరు అంటే నిశ్శబ్దమే గురువు అవుతున్నాడు కనుక మౌన గురువులంతా కూడా మునులు అవుతున్నారు అందుకనే వ్యాసేన గ్రథిత పురాణ మునినా ముని అంటే మౌనం వహించిన వాడు ఎందుకని కృష్ణుడు చెప్తుండంగా మధ్యలో మాట్లాడటానికి వీలు లేదు అవన్నీ ధారణ చేయాలి మళ్లీ రాయాలి శ్లోకాలు కాబట్టి వ్యాసులవారు సూక్ష్మ శరీరంలో ఉండి భగవద్గీత ని అంతా కూడా ఎట్లా రాశారో అట్లా వేళ గురువులంతా కూడా పరిపూర్ణంగా ఉంటారు అంతే కాదు నిశ్శబ్ద స్వరూపంలో ఉన్నటువంటి గురువు ఎవరు అంటే తత్ బ్రహ్మ స్పురతాన్వి తత్ అనబడేటువంటి అది అంటాం చూడండి అది వాడు అది వాడు వాడుతుంటాం అది వాడు కనపడడు కనపడని అవాంగ్మానస గోచరమైనటువంటి మనసుకి బుద్ధికి చిత్ అహంకారములకు అతీతమైనటువంటి పూర్ణ జ్ఞానానికి సంకేతమైనటువంటి సమస్త విజ్ఞానాలకి ఒక స్వరూపమైనటువంటి స్థితి ఏదైనా ఉన్నదా అంటే ఇదిగో గురువై ఉన్నాడు గురువు ఎట్లా ఉంటాడు అంటే ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిణి ఈశ్వరుడన్నా గురువన్నా పరబ్రహ్మమన్నా లోకమన్నా ఆత్మన్నా అంతా ఒక్కటే
YouTube · audio

Guruparampara — Part 1

Home

Guruparampara — Part 1

Source: SathyaSai Seva Sadan on YouTube

0:00 / 33:11

More in this series

Guruparampara

3 episodes · 1 hr 17 min

  1. 33 min 1

    Guruparampara — Part 1

    Now playing
  2. 33 min 2

    Guruparampara — Part 2

  3. 11 min 3

    Guruparampara — Part 3