No transcript for this section.
Transcript begins at 0:00.
ఒకటే అనే భావన చెప్పటానికి గాని మనకు కలగటానికి గాని మనకు ఒక గురువు కావాలి. ఆ గురువు ఎట్లా ఉండాలి అంటే ముందు సూచక గురువై ఉండాలి. ఉదాహరణకి మన ఇంటి పక్కనే ఒక పెద్దాయన ఉన్నారు. ఆయనకి తెలిసింది ఆయనకు ఎనభై ఏళ్లు వచ్చినాయి. రామాలయంలో ఎవరో వచ్చి సత్సంగం చేస్తారు కాసేపు మాట్లాడతారు అని ఆయనకు తెలుసు కానీ ఆయన రాలేడు వయసు రీత్యా. ఆయన ఏం చేస్తాడంటే ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళ అన్నింటికీ వెళ్తాడు. వెళ్ళి ఇవాళ నేను రాలేకపోతున్నాను మీరన్నా వెళ్ళండి అని చెప్తాడు. మంచి మాట వినండి అక్కడ మీరు ఏమి టికెట్లు కొనక్కర్ల రూపాయ్ బిళ్ళ పెట్టక్కర్ల హాయిగా వెళ్ళండి వినండి రండి నాలుగు మంచి మాటలు మూటగట్టుకొని రండి అని సూచించేవాడు సూచక గురువు. రెండవది ఈ మార్గం మంచి మార్గం. ఈ మార్గంలో కనుక నువ్వు వెళుతూ ఉన్నట్లయితే నీకు కావలసింది దొరుకుతుంది అని చెప్పేవాడు సూచక గురువు. [తుమ్ము] అయ్యా నాకు శాస్త్రాలు తెలియవు స్తోత్రాలు తెలియవు పద్యాలు నోటికి రావు నన్ను ఏం చేయమంటారంటే, అవన్నీ తర్వాత ముందు అంటు ప్రవేశించు అంటాడే వాడు సూచక గురువు. అవన్నీ వస్తాయి తప్ప ఇవన్నీ నీకు అర్థం కావు అంటే వాడు అక్కడే ఉంటాడు ఈ ఇరవై మంది ఇంటి దగ్గరే ఉంటారు. ఇక రెండవ వాడు వాచక గురువై ఉంటాడు. ఆ వాచక గురువు అంటే వచస్సు అంటే మాట. ఆ వచస్సును యజ్ఞంగా భావిస్తాడు. తనలో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట అగ్ని స్వరూపంగా భావిస్తాడు. తన మూలాధారంలోని జన్మాంతర సంస్కారంలో నుంచి వచ్చినటువంటి ప్రతి మాట ఈ జగత్తుకి ఉపయోగపడాలి అని ఆశించి కాంక్షించి ఆ మాటలలో ఒక శుద్ధత్వము, చైతన్యము, అర్థము, సమర్థత్వము అన్నీ కలబోసుకుని ఆ వాక్యాన్ని ఈ జగత్తుకు అందిస్తాడు వాడు వాచక గురువు. అంటే భారతంలో పద్యం చదువుతాడు భాగవతంలో పద్యం ఎదురుగా పెట్టుకుని చక్కగా చదువుతాడు శబ్దార్థం చెప్తాడు. ఇదిగో ఇట్లా రాశారయ్యా వ్యాసులవారు అంటాడు ఆయన వాచక గురువు. అది దాటి ఆయన వెళ్ళడు. ఇక మూడవవాడు మోచక గురువు. ఆ మోచక గు-గురువు అంటే బంధనాలతో ఉంటాడు జీవుడు, కష్టాల్లో ఉన్నాడు, ఇబ్బందులు చాలా ఉన్నాయి, ఎక్కడ దారి ఇతనో తెలియటలే, ఈ కష్టాలు ఎప్పటికైనా కడతేరాయినా, వెలుగు దొరికేనా అని అనుకుంటున్నటువంటి వేళ కట్లను నిప్పదీసి బంధ విముక్తుడిని చేసి వాడిని కూర్చోబెట్టి ఈ తాళ్లు, సంకెళ్లు నువ్వు తగిలించుకున్నావు తప్ప నీకు ఎవరు తగిలించలేదు నువ్వు తగిలించుకుని నువ్వే ఏడుస్తున్నావు ఏంటి? అవన్నీ లేవనుకో హాయిగా ఉండు అని మోచక గురువు అంటే మోక్షం వైపు మార్గాన్ని చూపించేవాడు మోచక గురువు అవుతున్నాడు. ఇక మరొక వ్యక్తి నిషిద్ధ గురువు అవుతున్నాడు. అంటే డూస్ అండ్ డోంట్س. జీవితంలో ఏం చేయాలి ఏం చేయకూడదు. సత్యం బ్రుయాత్ ప్రియం బ్రుయాత్ న బ్రుయాత్ సత్యం అప్రియం. సత్యమే చెప్పాలి అబద్ధం చెప్పకూడదు. ఒకవేళ అప్రియంగా చెప్పవలసి వచ్చింది ఏదన్నా ఒక మాట కానీ దాన్ని ప్రియంగా చెప్పు. వాడికి కష్టం కలిగించేట్లుగా చెప్పొద్దు. నువ్వు కుడి చేత్తో దీపం వెలిగించి వెలిగించడం మర్చిపోయి ఎడమ చేత్తో దీపం వెలిగిస్తే నీ ఎడమచేయి పడిపోతుందన్నాడు వాడిని వదిలిపెట్టేయండి. లేకపోతే మూడు ప్రదక్షిణాలు చేయలేక రెండే చేయగలిగితే మూడో చేయలేకపోతే నువ్వు నరకంలోకి వెళ్తావు అంటే వాడిని వదిలిపెట్టండి. అసలు నిన్ను ప్రదక్షిణ చేయమని అడిగిన వాడా ఎవడు? భగవంతుడు అడిగాడా? నువ్వు ఆత్మ ప్రదక్షిణం చేస్తూ లౌకికమైనటువంటి ఉపాసనా కాండ నుంచి బయట పడేసి నాయనా నీ వయస్సు ఉన్నంత కాలం ఒక తొంభై ఏళ్లు వచ్చినవాడు పరిగెత్తుకుని గుడికి రాలేడు. గుడికి వచ్చినా మెట్లు ఎక్కలేడు. మెట్లు ఎక్కినా గంట కొట్టలేడు. స్వామివారి చుట్టూ ఆయన తిరగలేడు. అక్కడే నుంచుని ఒక నమస్కారం పెట్టుకుని ఇంట్లో నుంచి ఆ గుడి గోపురం కనిపించినా దండం పెట్టుకుంటాడే వాడు నిజమైనటువంటి వాడు అవుతాడు. ఎందుకని? ప్రతి వ్యక్తి జీవితంలో ఇటువంటి పరిస్థితులు వస్తాయి. వయసు రీత్యా, శరీరానికి ఉన్నటువంటి అనేక పరిమితుల రీత్యా కానీ మనకి కళ్ళు, కాళ్ళు, కీళ్ళు అన్నీ హాయిగా పనిచేస్తున్నన్నాళ్ళు మన మనసేమో రామాలయం వైపు రానే రాదు. అందుకే స్వామి చెప్పారు, పరమేశ్వరుడు నీకు రెండు కాళ్ళు ఇచ్చాడు ఎందుకో తెలుసునా? సందులు గొందులు తిరుగుటకా. సందులు గొందులు పందుల వలే తిరుగుటకా అన్నారాయన. అది చాలా కఠినంగా చెప్పారు. ఆ రెండు కాళ్ళు ఒక్కసారి ఇట్లా రామాలయంలోకి రండి, ఐదు నిమిషాలు లోపలికి రండి. వాడు అక్కడే స్కూటర్ ఆపేస్తాడు రోడ్డు మీద. స్కూటర్ దిగినా కూడా దిగడు. కాళ్ళకి చెప్పులు ఉంటాయి. ఆ రాముడి వైపు చూసి ఇట్లా ఇట్లా అనుకో ఏం చేసాడో తెలీదు ఏం పొందాడో తెలీదు. ఆయన కూడా అనుకుంటాడు కానీ అది పట్టించుకోడు. ఆయన వీడు-వాడికంటే ఆయన తెలివిగలవాడు కదా. కాబట్టి దేవాలయానికి రావటం దేనికి అంటే ఒక నిగ్రహం కోసం. మనస్సును ప్రశాంతం చేసుకోవటం కోసం. ప్రాపంచికమైన ఈతి బాధల నుండి కనీసం కొంత సేపు ఉపశమనం పొందటం కోసం. మన శక్తి చాలటం లేదు గనుక దైవ శక్తిని, సమాజ శక్తిని మన వైపు తీసుకోవటం కోసం, ఆ కష్టాన్ని దాటటం కోసం. అందుకే దేవాలయానికి రావాలి. ఆ దేవాలయానికి రా-- అంటే అట్లా వెళ్ళు అని చెప్పేవాడు మోచక గురువై, నిషిద్ధ గురువు కూడా ఏమంటున్నాడంటే తప్పకుండా నువ్వు దేవాలయానికి వెళ్ళాలి. ఇదివరకు ఏం చెప్పేవాళ్ళు? కనీసం ప్రతి పండగకన్నా గుడికి వెళ్ళు అనేవాళ్ళు. ఆ తరం అయిపోయింది. ఏడాదికి ఒకసారన్నా ఏదో ఒక పండగకి వెళ్ళు అన్నారు. ఆ తరం అయిపోయింది. వారానికొకసారి వెళ్ళు అన్నారు. అది అయిపోయింది. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే వాడి ఎదురుగ్గా ఉన్న లాప్టాప్ ఓపెన్ చేసి నువ్వు చెప్పే రాముడిని చూడాలంటే రెండు గంటలు వేస్ట్ అవుతున్నామని నేను నీకు చూపిస్తారా అంటున్నాడు. ఆమె కూడా వాడికి చెంపలేసుకుని దండం పెట్టేస్తాడు. చూశారా?అంటే శరీరాన్ని కష్ట పెట్టాలి శరీరాన్ని భగవంతుడి వైపు నడిపించాలి మనలో ఉన్నటువంటి అనేక మనకు తెలియని రుగ్మతలు మనకు ఉంటాయి లోపల మనకేం తెలియదు ఇక్కడ భగవంతుడి ఆవరణలోకి మనం గనక రావటం మొదలు పెడితే శరీరానికి శ్రమ మనసుకి శాంతి హృదయానికి ఆనందము కలుగుతుంది గనుక దేవాలయ ప్రవేశం చేయమని చెప్పేటువంటి ఆ నిషిద్ధ గురువు అంటే లోకం వైపు ఎక్కువ నీ సమయాన్ని గడపకుండా పరమాత్మ భావన వైపు నీ మనసును నడుపు అనేవాడు నిషిద్ధ గురువు ఇక మరొకడున్నాడు దీక్షా గురువు ఆ దీక్షా గురువు మనకి చెప్తాడు నువ్వు నలభై రోజులు చక్కగా వరుసగా దేవాలయానికి వెళ్ళు లేకపోతే రామాయణం చదువు హనుమాన్ చాలీసా చదువు భాగవత్ పారాయణం చేయి పారాయణ గ్రంథం చేయి ఇవాళ దురదృష్టం ఏంటంటే పారాయణ గ్రంథాలు ఎవరైనా రాయగలిగేస్తున్నారు ఎవడు రాసినా దాన్ని పారాయణ గ్రంథం అంటున్నారు పారాయణార్హమైనటువంటి గ్రంథాలు కొన్ని మాత్రమే ఉన్నాయి అందులో రామాయణంలో ఆదిత్య హృదయం పారాయణార్హం సుందరకాండ పారాయణార్హం భారతంలో విష్ణు సహస్రనామం పారాయణార్హం లలితా సహస్రనామం పారాయణార్హం ఎందుకంటే హయగ్రీవుల వారు అగస్త్యుల వారు కూర్చొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారు ఎట్లా ఉంటుందో ఆమె ఎన్నెన్ని కళలతో విరాజిల్లుతూ ఉంటుందో అవన్నీ చెప్పారు అంటే ఋషి ప్రోక్తమైనటువంటివన్నీ పారాయణాలు అవుతాయి మనం నాకు బాబా గారు బాగా తెలుసు కదా అని ఆయన చుట్టూ యాభై కథలల్లి ఇది పారాయణం చేసుకోండి అంటే అది చెల్లదు పారాయణార్హం కాదది అది చేయకూడదు కూడా అట్లాగే భగవద్గీత పారాయణార్హం రామచరితమానస్ పారాయణార్హం అంటే ఇట్లా కొన్ని కొన్ని మనకి ఆ విహితంగా చెప్పబడి ఉన్నాయి గనుక ఇవన్నీ హాయిగా చదువుకో నలభై రోజులో ఇరవై రోజులో పది రోజులో మూడు రోజులో మూడు గంటలో చదువుకోమని చెప్పేటువంటి వాడు దీక్షా గురువు అవుతున్నాడు ఇవాళ ఈ వ్యాస పౌర్ణమి నాడు గురు పౌర్ణమి నాడు యత్ అవధూతలంతా కూడా చాతుర్మాస్య దీక్షను తీసుకోవటం వెనుక ఈ అర్థం ఉంది అంటే వాళ్ళు కూడా దీక్ష వహించాలి వాళ్ళు కూడా తమను తాము Redefine చేసుకోవాలి తమ శక్తిని మౌనం ద్వారా మళ్ళీ సాయంకాలం అయ్యేటప్పటికి ప్రవచనం ద్వారా రాత్రి అయ్యేప్పటికి ఏకభుక్తం ద్వారా అంటే ఒక పూట భోజనం చేసి రాత్రిపూట మాత్రమే భిక్ష స్వీకరించి మళ్ళీ లౌకిక బంధాల నుంచి బయటపడి సర్వ జగత్తుని కూడా యజ్ఞం వైపు యాగం వైపు యోగం వైపు నడిపించటానికి చాతుర్మాస్య దీక్ష తీసుకునేటువంటి మహత్తరమైనటువంటి రోజు ఇది మరి యతులు అవధూతలు నాలుగు నెలలు దీక్ష చేస్తే మరి గృహస్తు ఏం చేయాలి అని సత్యవాక్కుని పాటించాలి నాలుగు నెలలు సత్య దర్శనానికి ప్రయత్నం చేయాలి సత్యాన్ని అన్వేషించాలి సత్యం అంటే ఏమిటో తెలుసుకోవాలి ప్రశ్నించుకోవాలి సమాధానం పొందాలి ఉపనిషత్ భావనను పెంచుకోవాలి ఉపనిషత్తులలో నచికేతసుడు యముడు ఏం మాట్లాడుకున్నాడు అనుకోవాలి అవన్నీ చదువుకున్నట్లయితే ఈ నాలుగు నెలలు నిజానికి చాతుర్మాస్య దీక్ష ఇవాళ లోకంలో చూడండి శివ దీక్షలైన యా దీక్షలైన ఎన్నో రకరకాలు ఉన్నాయి మంచిదే కానీ అది వెర్రితనం వైపు చాదస్తం వైపు భోగం వైపు ప్రచారం వైపు కాకుండా ఆత్మోన్నతి గనక చేసుకోగలిగితే అది చాతుర్మాస్య దీక్ష అవుతుంది ఈ నిత్య కర్మలో ఉండేటువంటి వ్యక్తి గృహస్తు మనందరం కూడా సంసారాలు ఉన్నటువంటి వాళ్ళం బంధువులున్నారు బాంధవ్యాలున్నాయి సమాజం ఉంది పరిచయిస్తులున్నారు స్నేహితులున్నారు మరి వాళ్ళందరినీ కూడా ధర్మ మార్గంలో గనక ప్రవేశపెట్టేట్లుగా దీక్ష వహించినట్లయితే అది అక్షమైనటువంటి చాతుర్మాస్య దీక్ష మన ఇంటికి కూడా ఎవరైనా వస్తే వాడి చేతిలో పండు పెట్టాలి ఒక్క పండు నాలుగు కొనుక్కున్నాం మనం మూడు మనమే ఒకటి ఎవరికన్నా ఉంచాలి నాలుగు ముద్దలు మనం తిన్నాం ఒక్క ముద్ద ఎవరైనా వస్తారేమోనని దాచి పెట్టాలి ప్రార్ధన చేయాలి ఎవరైనా వచ్చి మా ఇంట్లో తినాలి అని కోరుకోవాలి ఇదంతా కూడా చాతుర్మాస్యంలో శరీరాన్ని మనస్సుని బుద్ధిని చిత్తాన్ని అహంకారాన్ని అన్నింటినీ కూడా పరిపూర్ణమైన వినిర్మలమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళేటువంటి గురువులంతా కూడా ఇక్కడ ఉంటారు కనుక నిషిద్ధ గురువులై అయిపోయిన తర్వాత సూచక వాచక మోచక నిషిద్ధ దీక్షా గురువులైపోయిన తర్వాత మరొక్కడున్నాడు మంత్ర గురువు ఇవాళ మీరు చూస్తున్నారు అపహాస్యం పాలైనటువంటి జాతి అయిపోయింది మనది టీవీ మీద మంత్రాలు ఇచ్చేస్తున్నారు కదా మంత్రాలు కొనుక్కుంటున్నారు అవుననుకుంటున్నారు కానే కాదు మంత్ర దీక్ష మంత్రం తీసుకోవాలి అంటే గురు సన్నిధిలోకి వెళ్ళాలి ఆ గురువు దైవం యందు విశ్వాసం కలిగిన వాడై ఉండాలి ఆ మంత్రాన్ని ఆయన అప్పటికే పఠించి ఉండాలి మంత్రాలకున్న బీజాక్షరాలు తెలిసుండాలి బీజాక్షరాలకు అధిష్టాన దేవతలైనటువంటి వారిని అందరినీ దర్శనం చేసి ఉండాలి అటువంటి వాడు మాత్రమే మంత్ర దీక్ష ఇవ్వాలి తప్ప ప్రతి వాడు మంత్ర దీక్ష ఇవ్వటానికి వీలు లేదు వాడు ఒకవేళ ఇచ్చినా అది ప్రయోజనం లేదు కాబట్టి మనం అటువంటివి రాగానే ఆ ప్రలోభానికి లోను కాకుండా ఏదో మంత్రం కావాలి నమో నారాయణాయ మంత్రం సాయిరామ ఒక మంత్రం ఇంకో మంత్రం ఆంజ Hari మర్కట మర్కటాయ స్వాహా ఆంజనేయ మంత్రం ఇట్లా ఇవన్నీ తీసుకుని ఎవరి దగ్గర తీసుకోవాలంటే దీక్షా మంత్ర గురువు దగ్గరికి వెళ్ళాలి మంత్ర గురువు ఒక తపస్వి కావాలి తపస్వి అయిన వాడే మంత్ర గురువు కావాలి మంత్ర గురువు అయినంత మాత్రాన దీక్ష ఇవ్వటానికి ఆయనకు హక్కు లేదు ఆ దీక్ష ఇవ్వటానికి ఆయన పరమగురువు ఒకాయన ఆయనకి permission ఇవ్వాలి నాయనా ఇక నువ్వు ఇవ్వచ్చు నువ్వు మంత్రం ఇవ్వచ్చు అంటే ఆయన మనసుకి అంగీకారంకలిగితే అప్పుడు మన బోటి వాడు ఎవడన్నా వెళితే అది లోకానికి ఉపయోగపడే పని గనక అయితే వాడికి మంత్రం ఇవ్వాలి. అంతే తప్ప నాకు లాటరీలో డబ్బు కావాలి, ఏ కష్టము లేకుండా అవతల వాడి సొమ్ము మా ఇంట్లోకి వచ్చేయాలి లేదు అవతల వాడు చెడిపోవాలి ఈ మంత్రాల నుంచి అవి మంత్రాలు కావు అవి, అవన్నీ కూడా వామాచారం కాబట్టి ఇటువంటి ఈ గురువులంతా కూడా ఇవన్నీ ప్రక్షాళన చేసి మనస్సుని జ్ఞానం వైపు సుజ్ఞానం వైపు వాడిదైనటువంటి ఒక ప్రజ్ఞానం వైపు నడిపించగలిగినటువంటి గురు సమూహాలు కావాలి. ఆ గురువులు ఎంతమంది ఉన్నా ఈ లోకానికి తక్కువే అవుతారు. సాధారణమైనటువంటి అల్పమైనటువంటి గురువులు ఈ ప్రపంచానికి పెద్ద బరువు-- పరువు కాదు వాళ్ళు బరువే. వాళ్ళని మనం మోయాలి కదా. మనల్ని గురువుగారు మోస్తారు అనుకుంటే, "గురువుగారేంటున్నాడు నన్ను రక్షించమని" శిష్యుడిని అడుగుతున్నాడు ఈ వేళ. అటువంటి ఆ దుస్థితి ఈ దేశంలో రాకూడదు గనుక వీటన్నింటిని దాటి ఎవరున్నారంటే కారణ గురువు ఉన్నాడు. ఆ కారణ గురువు ఏమిటి అంటే మన బోటి వాడు వెళ్ళినప్పుడు మనం ఏదో కష్టం నిష్ఠూరం అని చెప్పినప్పుడు, "అవన్నీ కాసేపు పక్కన పెట్టు, నువ్వసలు ఎందుకు వచ్చావో తెలుసా? నువ్వింత మహత్తరమైన మానవ జన్మ ఎందుకు పొందావో తెలుసా? పొంది నువ్వు చేస్తున్నది ఏమిటో తెలుసునా? నువ్వు చేయవలసినది ఏమిటో నీకు అర్థమయ్యిందా? అర్థమైనదే చేస్తున్నావా? స్వార్థం కోసం చేస్తున్నావా? పరార్థం కోసం చేస్తున్నావా?" ఇన్ని ప్రశ్నలు వేసి మనల్ని ఆత్మజ్ఞానం వైపు నడిపించాలి. అటువంటి వాడు సర్వోన్నతమైనటువంటి కారణ గురువు అవుతున్నాడు. ఇక రెండు ఇద్దరు-- రెండు నామాలు వినపడతాయి. ఒకడు జగద్గురువు, రెండవ వాడు సద్గురువు. ఏమిటి తేడా? ఈ జగద్గురువు అంటే జగద్గురువులంతా కలియుగంలోనే వచ్చారు. ఎందుకు వచ్చారంటే దత్తాత్రేయుడు ప్రప్రథమ జగద్గురువు. ఆయన జగత్తుని గురువుగా భావించాడు. ఇరవై నాలుగు రూపాలలో నేను వారి నుంచి బోధ తీసుకున్నాను. నాకు ఇరవై నాలుగు aspects లో గురువు కనబడుతున్నాడు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము గురు స్వరూపమే అనుకున్నాడు. అట్లాగే ఈ జగత్తుని తాను adopt చేసుకున్నాడు, తాను దత్తం చేసుకున్నాడు. దత్తత చేసుకున్నటువంటి వాడు తాను దత్తమైనటువంటి వాడు జగద్గురువు గనుక జగత్తుతో జనంతో మమేకమై ఉంటాడు ఆతను జగద్గురువు. జగద్గురువు అంటే ఓ పీఠానికి అధిపతి అని మాత్రమే కాదు, ఆయన పీఠానికి అంకితం అవుతాడు, పీఠ సంప్రదాయాలకు లోబడి ఉంటాడు, పీఠాన్ని నడిపిస్తూ లోకాన్ని నడిపిస్తాడు, తనను తాను అర్పించుకుంటాడు ఈ లోకానికి. కంచి మహాస్వామి వారు, శృంగేరి భారతీ స్వామి వారు దక్షిణ ఆమ్నాయ పీఠాలకి లేదా శంకరాంనాయ పీఠాలకి వారు ఏర్పరచిన నాలుగు పీఠాధిపతులు కూడా నలుగురు కూడా వాళ్ళు జగద్గురు స్థానీయులు అంతే. వాళ్ళకి సంప్రదాయాలున్నాయి, దాని ప్రకారమే వారు వెళతారు. వాళ్ళు టీవీల మీదకు వచ్చి పోట్లాడరు. జగత్తులో ఏదో జరుగుతుంటే మంత్రం వేసేసి దాన్ని ఆప్యారు. మరి ఇంక వాళ్ళెందుకండీ అన్న వాడికి సమాధానం ఏమిటంటే దానికోసమే వాళ్ళు రాలేదు. మానవుణ్ణి సమున్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళి మానవుడిలో ఆధ్యాత్మిక శక్తిని, సంపదని పెంపొందించి మానవుడు మానవుడిగా జీవించగలిగినటువంటి ఒక ఉదాత్త వైఖరిని ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఆచార్య స్థానంలో ఉంటారు. అటువంటి వారిలో మన-మన కాలంలో మనం జన్మ ఎత్తిన తర్వాత మనం చూసినటువంటి పరశివావతారం ఎవరు అంటే కంచి మహాస్వామి, పెద్దస్వామి వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు అలాగే శృంగేరి చంద్రశేఖర భారతీ స్వామి వారు. అది భారతీ సాంప్రదాయము, ఇది ఇంద్ర సరస్వతీ సాంప్రదాయం. దక్షిణాపథంలో ఈ రెండూ పరమ పవిత్రమైన బలమైనటువంటి పీఠాలు. ఈ పీఠాలు సాంప్రదాయకమైన, సనాతనమైన, ఆరుషమైన, భారతీయమైనటువంటి మూలతత్వాలని, ఆ దేవీదేవతల ఉపాసనా మార్గాలని, ఆవాహనని, ఆవేశాన్ని, వారు ఈ జగత్తుకు చేయవలసిన పనిని ప్రతిక్షణము శాసించగలిగినటువంటి లేదా మనబోటి వారందరి ఇబ్బందిని ఆ అమ్మణికి నివేదించగలిగినటువంటి శక్తిమంతులు ఆ పీఠాధిపతులు. కనుక వారి దర్శనం గానీ, వారి స్పర్శన గానీ, వారి సంభాషణ గానీ మనకి ముక్తి వైపు మనల్ని నడిపిస్తుంది గనుక అటువంటి ఆచార్య సత్తములకి మనం నమస్కరించాలి. ఇవాళ గురుపూర్ణిమ. ఎక్కడ కూర్చుంటే అక్కడి నుంచి వారికి నమస్కరిస్తే వారి అనుగ్రహం మన మీద లభిస్తుంది. మన మీద కలిగి ప్రసరించి మనకి కావలసినటువంటి ఒక అనుభూతిని, దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఇదంతా ఓ గురు పరంపర అయితే సూఫీ సాంప్రదాయంలో గురువులొచ్చారు, అనేకమైనటువంటి మతాల్లో గురువులొచ్చారు. ఆ గురువులందరూ ఏమి చెప్పారు అంటే సత్యసాయి భగవానుడు రెండు లైన్లలో దాన్ని పూర్తి చేశారు. "మతాలు ఎప్పుడు చెడ్డవయినాయి?" అని ప్రశ్నించారాయన. మతం ఎప్పుడూ చెడు చెప్పలేదు, ఏ మతం తీసుకోండి మంచే చెప్పింది. ఎక్కడన్నా చెడు జరిగింది అంటే మన మతులు చెడినాయి తప్ప మతం చెడలేదు అన్నారు. కాబట్టి సర్వ మతాలని ఏకం చేయండి. సర్వ మతాలలో ఉన్న positivity ని తీసుకోండి. ఒకటి ప్రేమను నేర్పుతుంది, ఒకటి సత్యాన్ని నేర్పుతుంది, ఒకటి ధర్మం వైపు నడిపిస్తుంది, ఒకటి శాంతిని ఉపాసన చేస్తుంది. ఓ గురునానక్ ని తీసుకోండి, ఓ కబీరుని తీసుకోండి, రామనామం చేసుకున్న ఓ ధర్మవ్యాధుడ్ని తీసుకోండి. వీళ్లంతా కూడా పరమోత్కృష్టమైనటువంటి అవధూత సాంప్రదాయానికి చెందినటువంటి గురు సాంప్రదాయం కనుక ఈ గురువులు బహుముఖీనంగా ఉంటారు. అటువంటి ఆ గురువులందరికీ కూడా నమస్కరించదగినటువంటి రోజు గురుపూర్ణిమ అవుతున్నది. వీటి అన్నింటితో పాటుగా ఈ కలియుగం ఏర్పడినప్పుడు, కలియుగానికి అధిష్టాత ఎవరు అని అనిపించుకున్నప్పుడు, కావలసి వచ్చినప్పుడుకోటి సూర్యమండల మధ్యస్త అయినటువంటి మహా త్రిపురసుందరి దేవి ఈ కలియుగాన్ని నేను నడిపిస్తాను అన్నది. దేవతలంతా అడిగారు అమ్మా సూర్య మండలంలో ఉన్న నువ్వైతే ఉండగలవు మేమైతే ఉండలేము మరి నువ్వు ఈ లోకంలోకి వస్తాను అంటున్నావు ఈ లోకం నిలబడుతుందా నీ వేడికి నీ తేజస్సుకి అంటే, నేను వస్తాను కానీ లలితాదేవిగా నేను ఈ లోకంలోకి వస్తా. ఆ శ్రీ లలితాదేవిగా నేను వచ్చి జగజ్జనానంద కరీం జయాక్షం యశస్విని యంత్ర సుయజ్ఞ యోనిం జితా మితా మిత్ర కృత ప్రపంచం భజామహే శ్రీ భువనేశ్వరీం తాం. భువనేశ్వరీ స్వరూపంగా నేను ఈ లోకంలోకి వచ్చి ఈ జగత్తును నేను రక్షిస్తాను కానీ నేను ఎంత స్త్రీమూర్తిగా ఎంత తల్లిగా నేను వచ్చినప్పటికీ కూడా నాకు పురుష సహాయం కావాలి గనుక నాతో పాటుగా అనేకమైనటువంటి దత్త అంశలతో అనేకమంది అంశావతారాలని, అర్చావతారాలని, కళావతారాలని, ప్రసవావతారాలని, ప్రభవావతారాలని, అనుప్రవేశావతారాలని, ఆవేశావతారాలని, పూర్ణావతారాలని నేను వెంటబెట్టుకొని వస్తా. ఆయా దేశ కాల పరిస్థితులకి అనుగుణంగా ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ రకంగా వచ్చి ఈ జాతిని ధర్మమార్గం వైపు నడిపించాలో వారందరినీ నేను వెంబడి పెట్టుకొని వస్తానని వచ్చినటువంటి ఆ లలితా పరాంబిక ఎవరు అంటే అదిగో అమ్మవారు శ్రీ లలితాదేవి ఈ జగత్తులోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఇదిగో పురుష రూపం కావాలి అన్నది అట్లా వచ్చినటువంటి దత్త సంప్రదాయంలో ఏర్పడినటువంటి తొట్ట తొలి దత్తావతారం ఆంధ్రదేశంలో పిఠాపురంలో వచ్చింది. ఆ పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడిగా వచ్చారు ఆయన. కానీ కొన్ని నియమాలు పెట్టుకొని వచ్చాడు ఆయన. ఆ నియమం ఉల్లంఘన జరిగితే నేను ఇక్కడ ఉండనని తల్లిదండ్రులకు చెప్పాడు. ఆ ఉల్లంఘన జరిగిన మరుక్షణం ఆంధ్రదేశాన్ని ఆయన వదిలిపెట్టి రాయచూరు వైపు వెళ్ళిపోయినారు ఆయన. ఆ కథ వేరే. ఆ తర్వాత నృసింహ సరస్వతి ఇట్లా అంశావతారాలు చాలా వచ్చినాయి. అయితే దానికి కూడా ఒక పరిపూర్ణ అవతారం ఒకటి రావాలి. ఆ పరిపూర్ణ అవతారం సాయి నామంతో ప్రారంభం కావాలి. ఈ సాయి నామం ఎవరు పెట్టారు? ఎవరన్నా ప్రత్యేకంగా పెట్టారా? రామనామం విన్నాం, కృష్ణ నామం విన్నాం, ఈ సాయి నామం ఎక్కడ? అందరూ ఆశ్చర్యపోయినారు. ఆశ్చర్యపోతే సంత దేశమైనటువంటి మహారాష్ట్ర దేశంలో శివ రామ మారుతి ఖండోబా విఠోబా సాంప్రదాయాలు తీవ్రమైనటువంటి హైందవ జాతిని నడిపిస్తుంటే ఒకవైపు ఇస్లాం మతస్తులు ఘర్షణ పడుతూ ఉంటే, ఈ భిన్న సాంప్రదాయాలను అన్నింటినీ ఏకం చేసి దానిని ఇస్లాం హిందూ ఈ రెండింటినీ సమన్వయం చేసి ఈ రెండు మతాల యొక్క ఐక్యతను నిలబెట్టి జాతిని భద్ర జాతిగా నడిపించడానికి వచ్చినటువంటి ప్రప్రథమ పూర్ణావతారం ఏది అంటే సాయి అవతారాలలో అది షిరిడి సాయి అవతారం గనుక షిరిడి మహాస్వామి ప్రప్రథమ పూర్ణ దత్తావతారం షిరిడి సాయి. అందుకనే అది నాథ సంప్రదాయం గనుక అది సాయినాథుడు అని పిలుస్తాం. ఆ స-షిరిడి సాయినాథుడు వచ్చి ఏం చేశాడు? నువ్వు ఉన్నతమైనటువంటి మార్గంలోకి వెళ్ళాలి అంటే కేవలం జ్ఞానం మాత్రమే కాదు, అజ్ఞానం అంటే ఏమిటో కూడా నువ్వు తెలుసుకోవాలి. ఆ అజ్ఞానం అంటే ఏమిటో నీకు క్షుణ్ణంగా తెలిస్తే మిగిలేదంతా జ్ఞానమే నని చెప్పినటువంటి అజ్ఞానాన్ని గురించి పూర్ణ ప్రబోధం చేసినటువంటి మహాత్ముడు ఎవరు అంటే షిరిడి సాయినాథుడు అయినాడు. ఆ షిరిడి సాయినాథుడు పందొమ్మిది వందల పద్దెనిమిది విజయదశమి నాడు ఆ దేహాంతం అయ్యేటువంటి వేళ లక్ష్మి అనేటువంటి ఒక ఆమెకి ఓ మాట ఇచ్చి కొన్ని నాణాలు చేతిలో పెట్టి నిదర్శనగా నేను ఈ మాట చెప్పాను అని నువ్వు గనక లోకంలో చెప్తే నిదర్శనం అడుగుతారు. ఇదిగో నాకు షిరిడి బాబా ఇచ్చిన నాణాలు నా చేతిలో ఉన్నాయి అవి నువ్వు చూపించు. నువ్వు నా-నా కాలంలో నాతో ఉన్నావని చెప్పాలి గనుక అని చెప్తూ ఆ గురు స్థానంలో సద్గురు స్థానంలో అందుకనే ఆయన్ని సద్గురు సాయినాథ మహారాజ్. ఆ మహారాజ్ దేనికంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి ఆయన మహారాజ్. సాయినాథ సాంప్రదాయంలో ఉన్నాడు గనుక సాయినాథుడు. సద్గురువు అంటే అశక్తుని గురించి బోధించాడు గనుక సత్వు అంటే ఏమిటో తెలియజెప్పాడు గనుక ఆయన సద్గురువు అయినారు. ఆయన ఆ రోజున ఆ విజయదశమికి రెండు రోజుల ముందు ఈ లక్ష్మిని పిలిచి నాణాలు చేతిలో పెట్టి మళ్లీ ఖచ్చితంగా ఎనిమిది సంవత్సరాలకి ఆంధ్రదేశంలో నేను మరొక అవతారం తీసుకొని వస్తాను అని ప్రమాణం చేశారాయన. దానికి అనుగుణంగానే నవంబర్ ఇరవై మూడు పందొమ్మిది వందల ఇరవై ఆరున పుట్టపర్తి గ్రామంలో వెలిసినటువంటి, ప్రభవించినటువంటి రెండవ అంటే సాయి త్రయి షిరిడి సాయి, సత్య సాయి, ప్రేమ సాయి. ఎట్లాగైతే విష్ణుమూర్తి యొక్క దశావతారాలు ఉన్నాయో సాయి అవతారాలు మూడే నాల్గవ అవతారం రాదని స్వామి స్పష్టం చేశారు. కాబట్టి రెండవ అవతారం ఏది అంటే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. కృతయుగన్నాటి సత్యం, త్రేతాయుగన్నాటి ధర్మం, ద్వాపరయుగన్నాటి శాంతి ప్రేమలు అంటే సత్య ధర్మ శాంతి ప్రేమలు ఈ నాలుగింటిని కూడా చతుర్భుజాలుగా ధరించి వచ్చినటువంటి మహా పరిపూర్ణ దత్తావతారం ఏదంటే సత్యసాయి భగవానుడే. కనుక రెండు మతాలు కాదు అసలు ఉన్న అన్ని మతాలని ఒక్కటి చేయాలి అని సంకల్పించుకున్నటువంటి స్వామి వారి జీవిత కాలంలోనే వారు ఎక్కడికి వెళ్ళకుండా వారు ఉన్న ప్రదేశానికి సమస్త ప్రపంచాన్ని దగ్గరకు తీసుకు రాగలిగారు. తీసుకొచ్చి సర్వ మతాల సారాన్ని ఒక్కటి చేసి ఏ మతంలో అది జోరాస్ట్రియన్ కానివ్వండి స్వామి జోరాస్ట్రియన్ మతస్తులకిఆ మతాన్ని అగ్ని పూజ చేసేటువంటి వారికి వారికి ఉపనయనం ఉంది స జంఝం వేయాలి వారు ఆ దంపతులు వచ్చిన రోజున అదృష్టవశాత్తు ఆ నేను ఆ రోజున స్వామి ఆ room లో నేను ఉండటం స్వామి యజ్ఞోపవీతాన్ని సృష్టించి యజ్ఞోపవీతాన్ని ఆ తండ్రి చేత వేయించటం జోరాస్ట్రియన్ మతంలో ఉన్నటువంటి భావాలన్నింటినీ కూడా స్వామి పదిహేను నిమిషాలు అగ్ని స్వరూపము మీరు వేదం చదవండి ఉపనిషత్తులు చదవండి అన్ని అగ్నిలో నుంచే పుడుతున్నాయి అన్ని అగ్నిలో నుంచే పోతున్నాయి మనం కూడా అంతే ఒక కామాగ్ని త్రేతాగ్ని అనేకమైనటువంటి ఆ రకరకాలైనటువంటి అగ్నులలో నుంచి దేహం వస్తోంది పోయిన నాడు మళ్లీ ఇది అగ్నిమయం కావలసిందే అగ్ని పరం కావలసిందే అంటే విభూతి నుంచి వచ్చి అనుభూతిని పొంది మళ్ళీ విభూతిలోకి వెళ్తావ్ అని స్వామి చెప్పిన మాట ఈ క్షణాన గుర్తొస్తున్నది నాకు ఎప్పటి మాట nineteen seventies లో చెప్పిన మాట కాబట్టి అగ్నికి నమస్కారం చేయాలి మనం కూడా చూడండి ఇవాళ ఏం చేస్తున్నారో తెలియదు గాని మన తల్లులు మన అమ్మమ్మలు మన నాయనమ్మలు పొద్దున్నే పొయ్యి మీద గిన్నె పెట్టగానే ఆ గిన్నెకు కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసి వంట మొదలు పెట్టేవాళ్ళు గుర్తుతెచ్చుకుంటే ఇవాళ మనం అసలు నమస్కారమే లేదు అగ్నికి లేదు gas stove కి లేదు దేనికి లేదు అసలు మనిషికే నమస్కారం పెట్టడం మర్చిపోయాం మనం కాబట్టి అగ్ని స్వరూపమైనటువంటి జ్ఞానానికి నమస్కారం చేస్తూ అటువంటి స్వరూపాన్ని తెచ్చినటువంటి ఒక మహా పరిపూర్ణమైనటువంటి అవతారం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. వారు పందొమ్మిది వందల ఇరవై ఆరు ఇందాక చెప్పినట్టు నవంబర్ ఇరవై మూడున వారు ఇక్కడ ప్రభావం అయినారో లేదో అయిన మరుక్షణమే పాండిచ్చేరి లో అరవింద మహా యోగి ఒక ప్రకటన చేశారు "శరీరంలో నేను ఉండగా కృష్ణ చైతన్యం ఈ భూమి మీదకి దిగాలి అని నేను ప్రార్థన చేశాను నా ప్రార్థనలకు అనుగుణంగా కొన్ని గంటల క్రితమే కృష్ణ చైతన్యం ఈ ప్రపంచంలోకి వచ్చేసింది ఇక నా ధ్యానం నుంచి నేను విరమిస్తున్నాను" అన్నారు. ఆ తర్వాత స్వామి nineteen twenty six లో జన్మ ఎత్తి ఒక అవతారమూర్తిగా వస్తే పందొమ్మిది వందల యాబై డిసెంబర్ ఐదు వరకు అరవింద మహా యోగి మౌన ధ్యానంలోనే ఉన్నారు ఆయన శ్రీ మాతకి అప్పజెప్పేశారు అంటే గురు స్థానంలో ఉన్నటువంటి వాడు మరొక గురువుని సర్వసంమద్ధమైన అటువంటి ఆత్మను పట్టుకోవాలి అటువంటి వాణ్ణి తయారు చేయాలి ఆ చేసి చేసినటువంటి మహిమాన్వితమైనటువంటి మూర్తి ఎవరు అంటే సత్యసాయి భగవానుడు. ఇవాళ ప్రపంచంలో నిన్న గాక మొన్న ఇంకా నడుస్తున్నాయి గురుపూర్ణిమ జరిగింది అంటే నూట ఎనభై ఎనిమిది దేశాలలో ద్వీపాలలో మారుమూల ప్రాంతాలలో గ్రామాలలో అవకాశం లేనివారు ఇళ్లల్లో అరణ్యాలలో అనేకమైనటువంటి కొండల మీద గుహల లోపల గురుపూర్ణిమ celebrate చేశారు అంటే ఇది అంటే భగవంతుని యొక్క శక్తి ఎంత గొప్పదో తాను కదలక సమస్తాన్ని కదిలించగలిగిన శక్తి ఏది అంటే అది పరబ్రహ్మ మూర్తికి మాత్రమే సాధ్యం ఆ పరబ్రహ్మ స్వరూపం స్వామిగా వచ్చారు గనుక ఇవాళ అనేకమంది గురువులను గురించి మనం మాట్లాడుకున్నాం రమణ మహర్షి జ్ఞానబోధ చేయడానికి జగత్తులోకి వచ్చారు "నిన్ను నీవు ఎరుగకపోతే ఈ ప్రపంచం అంతా ఎరిగినా దండగే" అన్నారు. నువ్వు ఎన్ని పుస్తకాలు రాయి ఎన్ని ఉపన్యాసాలు చెప్పు ప్రపంచంలో నీకు ఎంతమంది పరిచయస్తులు ఉండని నువ్వు ఎంత కీర్తిని సంపాదించు అదంతా ఒక ఎత్తు అదేదీ ఉండేది కాదు ఏది ఉంటుందయ్యా అంటే నిన్ను నీవు ఎరిగిన నాడు నీకు కలిగే ఆత్మానందం ఉన్నదే అదే నిత్యమై సత్యమై శాశ్వతమై నిరతమై నిరంతరమై చింతనై అనాహతమై ఒక ప్రవాహంగా యుగయుగాల వరకు నెలబడి పోతుంది గనుక మౌనంగా ఉండమని చెప్పినటువంటి మళ్ళీ ఒక దక్షిణామూర్తి స్వరూపంగా వచ్చినటువంటి భగవాన్ శ్రీ రమణులకి మనం నమస్కరించాలి. అట్లాగే ఈ జాతి ఒకానొక సమయంలో నాస్తికవాదానికి గురై నిరీశ్వర వాదం ప్రబలి ఈ దేశమంతా ముక్కలై చెక్కలైనటువంటి ఒక సమయంలో సాంస్కృతిక విధ్వంసం జరిగినటువంటి సమయంలో దేవాలయాలన్నీ మూతపడినటువంటి సమయంలో శంభోమూర్తి చరతి భువనే శంకరాచార్య రూప శంకర భగవత్పాదులు వచ్చారు వారు ఇక్కడ సంచారం చేసింది ముప్పై రెండు ఏళ్ళు కానీ సమస్తమైనటువంటి శాస్త్రాలకి వారు భాష్యం రాశారు భగవద్గీతతో సహా ఉపనిషత్తులతో సహా అన్నింటికీ భాష్యం రాశారు లలితా సహస్ర నామానికి రాయలేదు ఆయన కూడా ఆలోచన చేశారు అవును ఇన్ని రాశాను లలితా సహస్ర నామానికి నేను ఎందుకు రాయలేదు అనుకున్నారు ఆయన సరస్వతీ స్వరూపం కవితా భావావేశంతో సంస్కృత భాషని పరవళ్ళు తొక్కిస్తూ మంత్ర తంత్ర యంత్రాత్మకమైనటువంటి సౌందర్యలహరి రాసి మన వంటి వాళ్ళకి అప్పజెప్పారు అవన్నీ మనం చదవాలి అధ్యయనం చేయాలి చేస్తే ఎన్నెన్నో మార్మికతలు ఎంతో భాష ఎంతో భావ సంపద మిగతా సంపద అంతా రా వస్తుంది కొట్టుకుపోతుంది మన జేబులో ఉన్న వంద రూపాయల నోటు ఇప్పటికి ఎన్ని జేబుల్లోకి వెళ్ళిందో అక్కడి నుంచి ఇంకెన్ని చోట్లకు వెళ్ళబోతున్నదో తెలియదు కానీ స్థిరమైన చిరమైన శాశ్వతమైన నిత్యమైన సత్యమైనటువంటి ఒక ప్రజ్ఞానం మనకు కావాలి ఆ కావాలి అంటే శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి ఆ పరమ యోగ భూమికలన్నీ మనం పట్టుకునే ప్రయత్నం చేయాలి అన్నీ అంతా చేయలేం కానీ చాలా వినగలం చాలా విని చాలా అర్థం చేసుకోగలం అర్థం చేసుకున్న దాన్ని జీవితంలో సన్నివేశం ఏర్పడినప్పుడు ఆచరించగలగాలి ఇటువంటి సమయంలోనే ఇప్పుడు నిజానికి ఈ సంవత్సరం అంతా గురుపూర్ణిమలో రామానుజాచార్యుల వారు.ఇవాళ సహస్రాబ్ది వెయ్యి సంవత్సరాల క్రితం ఇవాళ మనం ఇంకా కులం మతం నువ్వు నేను నువ్వు గొప్ప నేను గొప్ప అని కొట్టుకుంటున్నాం ఆ రోజుల్లో నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని ఈ సర్వ జగత్తుకి హాయిగా open గా ఆయన ఇచ్చేశారు ఇస్తే నాటి సమాజం ఒప్పుకోలేదు ఆయన్ని క్షమించలేదు ఏమిటి నీకు తోచినట్టుగా నారాయణ మంత్రం అందరికీ ఇస్తావా వాళ్ళు ఫలానా కులం వీడిది ఫలానా మతం వివచ్ఛన అంటే నారాయణుడు అందరికీ చెందిన వాడు గనుక ఆయన నామం కూడా అందరికీ చెందవలసిందే అని చెప్పినటువంటి వారు శ్రీమద్ భగవత్ రామానుజులు అటువంటి వారిని అందుకనే మనం శంకర రామానుజ మధ్వ ఈ ముగ్గురిని కూడా ఆచార్య త్రయంగా నమస్కరిస్తాం వాళ్లకు మనం ఇవాళ ఈ సభా పూర్వకంగా ఆచార్య త్రయానికి నమస్కరించాలి రామానుజుల వారు నూట ఇరవై ఒక్క సంవత్సరాలు పంచభౌతిక దేహంలో నిలకడ చెందారు నూట ఇరవై ఒక్క ఏళ్ళు బోధ చేశారు ఆయన ఆ మనం ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు లెక్కలు పెడుతున్నాం నూట ఇరవై ఏళ్ళు మాట్లాడారు ఆయన నూట ఇరవై ఏళ్ళు ఈ జాతిని సన్మార్గంలో నడిపించారు హరి సర్వోత్తముడు హరి అంటే గాలి హరి అంటే చైతన్యం హరి అంటే ప్రాణం హరి అంటే ఆయువు హరి అంటే ఆరోగ్యం హరి తప్ప ఇంకొకటి లేదని చెప్పినటువంటిది మధ్వ మతం ఆ మాధ్వికమైన మాధ్వికము అంటే తేనె ఆ మాధ్వికమైనటువంటి భావన మనం అందరం ఇవాళ మాట్లాడుతున్నాం ఎవరు మాట్లాడుతున్నారు వాయువు మాట్లాడుతున్నది మాట్లాడలేకపోతున్నాం వాయువు లేకుండా పోతున్నది శవాత్మకంగా ఉన్న మనం శవాత్మకంగా మారుతున్నాం ఎందుకని మారుతున్నాం ఆ వాయువు మన నుంచి నిష్క్రమించగానే మన నుంచి ఏం లేకుండా పోతున్నది ఇన్ని అనుకున్న నేను ఇంత చేశానని అనుకున్న నేను నా అంతటి వాడు లేడనుకున్న నేను ప్రాణం పోయిన మరుక్షణం ఏమీ చేయలేని నిస్సత్తువతో నిర్వీర్యంగా ఒట్టి కట్టెవలె నేల మీద పడి ఉన్నామే మరి మన పరిమితులు మనం ఎరగాలి కదా కనుక ఈ గురువులంతా కూడా జ్ఞానబోధ చేస్తారు జీవితాన్ని స్పష్టంగా చెప్తారు ఈ మరణానంతర సుఖాన్ని గురించి ఎవరు ఎక్కువ చెప్తారో వాళ్ళు నిజానికి పెద్ద అనుభూతి చెందినవారు కాదు ఎందుకంటే మరణానంతర సుఖాన్ని గురించి చెప్పిన వాడు లేడు అంతా ఇటు నుంచి వెళ్ళిన వాళ్ళే గాని వెనక్కి వచ్చిన వాళ్ళు లేరు వచ్చి ఇట్లా ఉందని ఎవరూ చెప్పలేరు ఊహాత్మకమైన ప్రపంచం కానీ ఈ జగత్తు సత్యం.
YouTube · audio
Guruparampara — Part 2
Guruparampara — Part 2
Source: SathyaSai Seva Sadan on YouTube
0:00 / 33:11
More in this series