No transcript for this section.
Transcript begins at 0:00.
తో కనబడుతున్నది కష్టము సుఖము నిష్ఠూరము అన్ని ఒక చోట ఒరగూడి ఉన్నాయి గనుక వీటన్నింటిని సమన్వయం చేసుకోమని చెప్తూ మానవ జాతి వెనక పడకూడదని రాముడు రహీము అల్లా యేసు బోసు అంతా ఒక్కటే అని చెప్పినటువంటి ఏకైక గురువు ఎవరు అంటే సత్య సాయి భగవానుడు మాత్రమే ఇదే ఇది నిజం ఎందుకని అంటే ఆయన ప్రచారం చేయలేదు రాముడిని ఎట్లా గౌరవించారో రహీం ని ఎట్లా గౌరవించారు జొరాస్ట్రియన్స్ ని గౌరవించారు అగ్ని స్వరూపాన్ని చేశారు మీరు గాయత్రి కావాలి గాయత్రి చేయండి అన్నారు మతాలు ఎప్పుడూ చెడ్డవి కాదు ఏ మార్గంలో ఉన్నామో ఆ మార్గంలో ఉండండి మీరు హిందువు గనక అయినట్లయితే హిందువుగా ఎలా ఉండాలో నేర్చుకోండి హిందువుగా జీవించండి చాలు మీరు ఆ మతాన్ని ఉద్ధరించక్కర్లా ఆ మతం ఏం చెప్పిందో మతం అంటే మార్గం ఆ మార్గంలో ఎట్లా నడవాలని చెప్పిందో ఎట్లా నడిస్తే ఆ లక్ష్య గమ్యాల వైపు వెళ్తాం అని చెప్పిందో అట్లా ఉండండి అట్లాగే ఇస్లాం దానిలో ఎట్లా ఉందో దాని ప్రకారం వెళ్ళండి అని చెప్పి సర్వమత సమ్మతమైనటువంటి భావన జగత్తులోకి తెచ్చి బృహదారణ్యకోపనిషత్తు ప్రబోధించినటువంటి రెండు మాటలు ప్రేమ సేవ ఈ రెండూ లేకపోతే మనిషి ఒక మనిషికి దగ్గర కాలేడు ప్రేమ వలనన్నా కావాలి సేవ ద్వారా అన్న కావాలి అహం వల్ల అహంకారం వల్ల శాస్త్రాధికారం వలన కీర్తి వలన పదవి వలన స్థితిగతుల వలన మనం మనుషులకి దగ్గర కాలేం ఎప్పుడు కాగలం అంటే ప్రేమాస్పదులుగా ఉండాలి ప్రేమ అంటే కేవలం నా వారి యందు మాత్రమే ప్రేమను చూపిస్తే నాకు గౌరవం దక్కదు నా చుట్టూ ఉన్నవారికి దక్కదు ఆ ప్రేమ విశాలం కావాలి దీన్ని జిల్లెళ్ళమూడి అమ్మ ఒక గొప్ప మాట వాడింది జిల్లెళ్ళమూడి అమ్మ ఇన్ని మాటలు చెప్పకుండా ఒక అద్భుతమైనటువంటి ప్రేమ అనేదానికి నిర్వచనం ఏమిటో తెలుసునా విస్తృత మమకారమే ప్రేమ నాన్న అంది ప్రేమని విస్తారం చేయండి మీ యందు నా కొడుకు నా కూతురు నా బిడ్డ నా తమ్ముడు ఎంత కాలం ఇది కానీ ప్రపంచంలో అందరూ సమస్తమైనటువంటి జాతి అంతా కూడా ఒకే ఒక్క జాతి మానవజాతి అనేటువంటి భావనలో గనక మనం ఉండగలిగినట్లయితే విస్తృత మమకారం ఆ ఆ పదాన్ని తప్పకుండా మీరు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మన మమకారాలన్నీ మన మమతలన్నీ మనకి చాలా దగ్గరైన వాళ్ళతో మనం ముడిపడి ఉన్నాయి వాటిని కాస్త దాటాలి దాటితే విస్తృత మమకారంలో ఉన్న ఆనందం మనకు తెలుస్తుంది ఎందుకంటే ఒక గృహస్తు ఉన్నాడు కొడుకు ఉన్నాడు ఆ కొడుకుకి ఈ తండ్రి ఒక వంద కోట్ల డబ్బు ఇచ్చాడు ఆస్తి ఇచ్చేశాడు ఇచ్చేసి నాయనా నా జీవిత కాలంలో ఇంత సంపాదించాను రా మరి ఎవరికి ఇవ్వను నువ్వు తప్ప నాకు ఎవరు దొరకలేదు మరి ఎవరు నిన్ను కాదని ఎవరికి ఇస్తాను వంద కోట్లు ఇస్తాను ఇస్తున్నాను అన్నాడు కొడుకు ఏమనాలి నాన్నగారు నా కోసం ఇంత కష్టపడ్డారా ఆ కాలం చెల్లిపోయింది వాడన్నాడు ఒకప్పుడు గనక ఆ రోజున మీరు వెళ్ళి ఉంటే ఇంకో పాతిక కోట్లు నాకు వచ్చే ఆ రోజు ఎందుకు పడుకున్నారు ఇంట్లో అన్నాడు వాడు చూశారా ఎంత ఇచ్చినా సంతృప్తి చెందని వాడు ఎవరంటే కొడుకు ఏమి ఇచ్చిన అమితానందాన్ని పొందేది ఎవరు అంటే కూతురు చూడండి పుట్టింటికి వెళ్తుంది వాళ్ళు నూట యాభై రూపాయల చీర పెడతారు ఎంత ఆనందంతో వస్తుందో హస్బెండ్ కి చూపిస్తుంది మా తల్లిదండ్రులు పెట్టిన చీర కట్టుకుంటుంది అందరికీ చూపిస్తుంది భర్త పదివేల రూపాయల చీర తెచ్చి ఇస్తాడు ఆనందం ఏం లేదు దాంట్లో చూశారా కారణం ఏంటంటే భర్త తెచ్చిన దాంట్లో బాధ్యత ఉన్నది తల్లి ఇచ్చిన దాంట్లో ప్రేమ ఉన్నది అది ప్రేమ అట్లాగే సేవలో చూడండి మనం ఎప్పుడూ అనుకునే మాట చాకిరీ చేస్తే కూలి డబ్బులు వస్తాయి మన ఉద్యోగాలన్నీ అలాంటివే కదా సేవ చేశాం అనుకోండి డబ్బు రాదు గాని డబ్బు ఇవ్వలేని ఆనందం మాత్రం మనకు లభిస్తుంది చిన్న సేవ ఎవరో పెద్దాయన వెళ్తున్నాడు కింద నేల మీద పడిపోయాడు ఒక్క నిమిషం మనం ఆగి ఆయన్ని లేపి నిలబడితే కాస్త ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి ఆయన దారిలో ఆయన్ని పంపిస్తే ఆరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ భావ పరిమళం మనల్ని ఆహ్లాదపరుస్తూ ఉంటుంది పరమేశ్వరుడిని అడగాలి నిద్ర లేవగానే ఏమని ఒక్క సేవ చిన్న సేవ నాకు ఇవ్వమని అడగాలి ఆంజనేయస్వామి ఏమడిగాడు ఆయన ఏమడిగాడు నీ దగ్గర ఉండేటట్టుగా నన్ను చూసుకోమన్నాడు త్రేతా యుగంలో అడిగితే ఇవాళ మన రామాలయంలో కూడా ఆంజనేయస్వామి ఎదురుగా కూర్చున్నాడు రాముడిని రోజూ చూస్తుంటాడు మనమైనా ముందు ఆంజనేయస్వామికి దండం పెట్టి లోపలికి పోవలసిందే లేకపోతే రాముడు కూడా ఉలకడు పలకడు ఇక్కడికి వచ్చిన దండం పెట్టుకొని మనం అక్కడికి వెళ్ళాలి కాబట్టి శాస్త్రార్థం తెలియాలి లోకం తెలియాలి లోకాన్ని మించినటువంటి రసవత్తర భూమిక లేదు ఇక్కడ మనమంతా పుట్టినప్పటి నుంచి గిట్టే దాకా జరిగేదంతా హనుమాచార్యుల వారు అన్నట్టుగా నడి నడి జీవితం అంతా కూడా నాటకమే ఇందులో యాక్షన్ తక్కువ రియాక్షన్ తక్కువ అంతే అంతా నటనే అంత కపటమే అంతా మోసమే ఎటువంటి జీవితం కావాలా ఒక సద్భక్తులతో భాగవతులతో కూడి ప్రతిరోజూ కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుంటూ ఈ అనుకున్న విన్న మాటలన్నీ నెమరువేసుకుంటూ మళ్ళీ తలవారేసరికి పరమాత్మ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏం చేయాలి అని నిరంతర చింతనా భూమికలో ఉండి దాని వలన కలిగే ఆనందం ఎంత అని బేరీజు వేసుకుంటే ఈ ఆనందం చాలా గొప్ప ఆనందం అందుకనే సేవని ఈ ప్రపంచంలోకి పరమాత్మ పరిచయం చేశారు మిగతా మతాలు పేరు చెప్పను గాని సేవ పేరు మీద జరిగే సేవలు అవి సేవలు కావు దాని వెనుక చాలా మనం ఊహించలేనటువంటి స్కీమింగ్ ఉంటుంది మానిపులేషన్స్ ఉంటాయి.ప్రలోభాలు ఉంటాయి కానీ అక్షమైన సనాతనమైనటువంటి సేవలో అవేమీ లేవు. మీ అందరూ నా వారు నేను ఒక్కడిని మీ అందరికీ చెందిన వాడిని అదే సహనాభవతు సహనవు పునక్తు సహవీర్యం కరవావహై అందరం కలిసి ఉందాం కలిసి మెలుగుదాం కలిసి వెలుగుదాం కలివిని పెంచుదాం కలివిని పంచుదాం తద్వారా జీవితాన్ని భక్తిమయము రసమయము ఆనందమయము ప్రేమమయము సేవామయము చేసుకుంటూ ఇదిగో ఈ మహత్తరమైనటువంటి శరీరాన్ని పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని మానవ జన్మను పొందినటువంటి మనం అనంతకోటి గురు స్వరూపాల యొక్క దివ్య దర్శనంతో మార్గోపదేశంతో మనల్ని మనం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ మన లోపాలు సరిదిద్దుకుంటూ సద్గురువులకు వా దగ్గరకు మాత్రమే వెళ్లి అందుకే సత్యసాయిబాబా వారు ఒక హెచ్చరిక చేశారు ఆ హెచ్చరిక మనందరం కూడా డైరీలో రాసుకోవాలి All gurus are one అందరు గురువులు ఒక్కటే కానీ అందరూ గురువులు కాదు అది. ఆ రెండోది caution చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి సద్గురువు దగ్గరకు వెళ్ళాలి మన డబ్బుని ఆశించని గురువు దగ్గర మనం వదిలిపెట్టకూడదు డబ్బు ఆశించే గురువుని మన దగ్గరకు రానివ్వకూడదు అందుకే చిత్తాపహారి అయిన గురువు దక్కాలని కోరుకోవాలి గాని విత్తాపహారి అయిన గురువుని మనం దక్కించుకోకూడదు విత్తాపహారులు బోలెడు మంది ఉన్నారు మన డబ్బు కావలసిన వాళ్ళు బోలెడు మంది ఈ లోకంలో కానీ నీ చిత్తాన్ని నాకివ్వు నీ మనస్సును నాకిచ్చేసేయ్. 1968లో ఇంకా ప్రశాంతి నిలయం అంటూ ఒక పూర్ణంగా రూపుదిద్దుకోక ప్రశాంతి నిలయం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అయిన సమయంలో స్వామి ఒక ఉపన్యాసం చెప్పారు అది గుర్తుకు వస్తున్నది ఏమన్నారో తెలుసా ఇక్కడికి రండి కాసు ఖర్చు లేదు మీ డబ్బు నాకు అక్కరలేదు నా దృష్టిలో అది తుచ్ఛమైనది అల్పమైనది దానితో మనకెట్టి ప్రమేయం లేదు మీ కష్టము నిష్ఠూరము మీ ఇబ్బందులు మీరు తెచ్చుకున్నటువంటి ప్రారబ్ధాల మూటలన్నీ ఇక్కడ పారేయ్యండి ఇక్కడ నుంచి శాంతిని ప్రేమను తీసుకుని వెళ్లి మహదానందంగా మీ జీవితాన్ని సమాజంతో ముడిపెట్టుకుని గడపండి స్వామి కోరుకునేది ఇంతే మీ నుంచి నాకు ఒక్క రూపాయి అక్కరలేదు అన్నారు స్వామి. ఇటువంటి సద్గురువు గనుక దొరికితే జీవితం ఎంత ఆనందం. ఇవాళ మన చేతిలో రూపాయి బిళ్ళ లేకపోయినా హాయిగా నిద్రపోతాం ఎక్కడన్నా పది కోట్ల రూపాయలు మన దిండు కింద ఉన్నా అంతే ఆనందం ఎందుకంటే అది కూడా ఇంకో దిండు అంతే. అటువంటి ఆ వైరాగ్య భూమిక లోకి సత్యసాయి భగవానుడు నడిపించినందుకు స్వామితో 1962 నుంచి బహుశా ఈ జన్మ పూర్తయ్యే దాక విడవక వదలక స్వామి యందు మనస్సును లగ్నం చేసి ఏకోన్ముఖమైనటువంటి భావనతో స్వామి చెప్పిన ఒక మాట మరొక్కటి ఈ క్షణంలో గుర్తు చేసుకుందాం "అందరిలో నన్ను చూడండి నాలో అందరినీ చూడండి మనసుకు భేదభావం పెట్టుకోకండి ఆ రూపం ఇట్లా ఉన్నదే ఈ రూపం ఇట్లా ఉన్నదే ఆ పేరు ఇట్లా ఉన్నదే అని అనుకోకండి" అని చెప్తూ ఆ గురువు సారు అన్నంటే ఆ స్థాయికి చెందిన ఇవాళ మనం మాట్లాడుకున్న గురువులంతా మామూలు వాళ్ళు కాదు. అసామాన్యమైనటువంటి గురువులు అటువంటి ఆ గురుపూర్ణిమ సందర్భంగా సత్యసాయి సేవా సమితి Organization కొకట్ పల్లి సమితి సంకల్పించుకొని స్వామి అనుగ్రహంతో సాగిస్తున్న ఈ ఇది ఏడవది ఇది ఏడవ సత్సంగం మరి శ్రీరామచంద్రుడి యొక్క నక్షత్రం ఏడవది దశావతారాల్లో రాముడి అవతారం ఏడవది కాబట్టి ఏడు సంఖ్య సప్తజ్ఞాన భూమికలకి సంకేతం కాబట్టి ఏడవది రామాలయంలో జరగాలని రాముడి నిర్ణయం సాయి రాముడి నిర్ణయం కాబట్టి అది ఇక్కడే జరిగిందని భావన చేస్తూ మీ అందరికీ కోదండరాముడు సాకేత రాముడు అయోధ్య రాముడు జానకి రాముడు దశరథ రాముడు అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు ఆయన ఒక్కడు ఉండడు అమ్మవారితో ఉంటాడు సీతమ్మ తల్లితో ఉంటాడు దాసాత్మకుడైనటువంటి ఆంజనేయుడితో ఉంటాడు ఇరువైపులా తన అన్నదమ్ములతో ఉంటారు ఒక విశిష్ట వరిష్టమైనటువంటి ఒక గృహ వ్యవస్థకి ఒక పెద్ద దిక్కుగా పెద్ద అన్నగా పెద్ద కొడుకుగా ఒక రాజుగా ఒక ధీమంతుడిగా ఒక సౌశీల్యమైనటువంటి విష్ణు స్వరూపంగా రాముడున్నాడు గనుక అటువంటి ఆ దివ్య ప్రాంగణంలో మనం ఇవాళ నాలుగు మాటలు గురుతత్వాన్ని గురించి రామచంద్రుని గురించి మాట్లాడుకున్నందుకు ఆ రామచంద్రుడు మీ ఈ ఒక్క తరాన్ని మాత్రమే కాకుండా మీ రాబోయే ఇరవై యొక్క తరాలని కూడా సాకేత రాముడు సాయి రాముడు ఒక్కటై చల్లగా కాచుగాక మ్రోచుగాక అని మంగళాశాసనం చేస్తూ నా గురువైనటువంటి తల్లి తండ్రి గురువు దైవమైనటువంటి సత్యసాయి భగవానుడికి మనసా వచసా శిరసా మరొక్కసారి ప్రణమిల్లుతూ సాయి రామ్. [అందరూ ఒకేసారి] Jai Sai Ram
YouTube · audio
Guruparampara — Part 3
Guruparampara — Part 3
Source: SathyaSai Seva Sadan on YouTube
0:00 / 11:24
More in this series