Skip to content
Transcript తెలుగు
మన శరీరంలోని ఆత్మ ఉన్నదని, ఆత్మ హృదయ గుహలో ఉన్నదని, అది దేదీప్యమానంగా నిత్యమూ అఖండమై అనాహతమై వెలుగుతున్నదని, అది జ్యోతిర్మయమని, శ్రీమయమని, చరాచరమయమని, వాంగ్మయమని అనేక విధాల వర్ణనలు జరిగినా, చివరకు ఒక ప్రశ్న "నేనెవరు?" భగవాన్ రమణ మహర్షి తమకు కలిగినటువంటి ఒక ఆత్మానుభవాన్ని ఆధారం చేసుకుని, ఆత్మానుభవం కలిగిన తర్వాత ఐదున్నర దశాబ్దాలు సరిగ్గా యాభై నాలుగేళ్ళు అదే భూమికలో సంచారం చేసి అరుణాచలాన్ని రమాచలంగా మార్చినటువంటి పరమ కారుణ్యమూర్తి, జ్ఞానైకమూర్తి భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆత్మను గురించినటువంటి దాని స్వభావాలు, దాని ఉనికి, దాని మూలాలు, దాని అస్తిత్వము, దాని ప్రభావము, దాని గమనము, దాని చలనము, దాని కదలిక, దాని మెదలిక, ఇదంతా నిన్న విచారణ చేశాం. అయితే ఇవాళ మౌలికంగా అనేకమైనటువంటి ప్రశ్నలు, నిజంగా అధ్యాత్మ సాధకుడి మనస్సులో ప్రతిక్షణము ఒక ప్రశ్న పుట్టగానే సమాధానం దొరకటానికి కొంత కాలం పడుతుంది. సమాధానం దొరకగానే మరొక ప్రశ్న పుడుతూ ఉంటుంది. ఇది ఒక అనంతమైనటువంటి మహాప్రస్థానంలో మానవుడు నిరంతరము సాధక జీవుడై అనేక ప్రశ్నలు వేసుకుంటూ, అనేక విషయాలు తాను తెలుసుకుంటూ, తెలుసుకున్న విషయాలను మననం చేసుకుంటూ, మననం చేసుకున్న దానిని నిధిధ్యాసనం చేస్తూ, నిధిధ్యాసనం చేసిన దానిని ఆచరిస్తూ, ఆచరిస్తున్న దాన్ని అనుభవిస్తూ, అనుభవిస్తున్న దానిలో నుంచి అనుభూతిని చెంది, అనుభూతిని కడగా విభూతి స్థాయికి తీసుకుని వెళ్తాడు. ఇది నిజానికి మానవ జీవితానికి ఉన్న పరమార్థం ఇదే ఇంతే. కనుక ప్రస్థానంలో మనం ఎట్లా జీవిస్తున్నాం అని కాక భగవాన్ రమణులు అనేకమైనటువంటి తాత్వికమైనటువంటి విషయాల మీద ఎటువంటి వ్యాఖ్యానాలు చేశారు? ఐదున్నర దశాబ్దాలు ఎలా మనలాగానే జీవించారు? మనం ఉన్నటువంటి ప్రపంచంలోనే ఎలా ఉండగలిగారు? తనదైనటువంటి ఆత్మానుభూతిని కడదాకా ఎలా నిలబెట్టుకోగలిగారు? దేహాత్మ భావనను ఎలా పోగొట్టుకోగలిగారు? ఇవన్నీ కూడా మనం విచారణ చేయాలి. భాగవతాన్ని చదివితే భగవంతుడి కథ తక్కువ. ఉన్నదంతా భక్తుల కథే. దానిలో ఉన్నదంతా భక్తుల వ్యథే. కడగా వస్తాడు చివరికి భగవంతుడు. కనుక ప్రతి అధ్యాయం ప్రతి స్కంధం ఎక్కడ చూసినా భగవంతుడు చివరలో కనపడతాడు, భక్తుడు అశాంతమున నిలబడతాడు. పడుతుంటాడు, లేస్తుంటాడు, యాతన పడతాడు. "నువ్వున్నావా?" అంటాడు, "లేవ్" అంటాడు. "నువ్వు లేకపోతే ప్రపంచం ఎలా నడుస్తున్నది?" అంటాడు, మళ్ళీ మాయలో పడుతుంటాడు. మాయావరణ మాయామయ జగత్తులో జీవుడు ఎట్లా తనను తాను సంభాళించుకోవాలి? దేనికై నిరంతరము ఒక యాతన పడాలి? పోరాటం చేయాలి? ప్రస్థానం చేయాలి? అధ్యాత్మ ప్రయాణాన్ని నిత్య జీవితంతో ఎట్లా మిళితం చేయాలి? ఇవి ప్రాథమికమైనటువంటి ప్రశ్నలు. అయితే మొట్టమొదటగా విషయాల్లోకి వెళ్లే ముందు అధ్యాత్మ, అధ్యాత్మ జీవితం, అధ్యాత్మ జీవితం ఇచ్చేటువంటి అనుభవం, అది ఇచ్చేటువంటి ఫలితం మరణానంతరం మాత్రం కాదు. మానవుడు జీవించి ఉండగానే "ఇహ మేవా" ఇప్పుడే ఇక్కడే దానిని సాధించుకోవాలి. దానికే కర్మ, భక్తి, జ్ఞాన యోగ మార్గాలు ఉన్నాయి, అవన్నీ నిన్న విచారణ చేశాం. ఇక రమణుల ప్రస్తావనకు వస్తే వారు అరుణాచలాన్ని అంటే కొండని శివుడిగా భావించారు. మన వంటి వాళ్ళు ప్రశ్నించటానికి ఎప్పుడూ ఉంటారు. పాయలోనే ఆయన్ని అడిగారు, "కొండ దేవుడు ఎట్లా అవుతుంది?" అని అడిగారు. పరమ మహేశ్వరుడు తనకు రూపాన్ని కల్పించుకొని జగత్తులో తన సర్వశక్తిని కూడా ఇక్కడ నిలపాలని అనుకున్నాడు. కనుక అరుణాచలమై ఇక్కడ నిలకడ చెందింది అని సమాధానం ఇచ్చారు. "నీవు ఎట్లా వచ్చావో అరుణాచలం కూడా అట్లాగే వచ్చింది. సాధక జీవులకు ఆవాసమై, ఆశ్రమమై, ఆశ్రయమై, నిరంతరము సాధన తీవ్రతరం చేయడానికి వీలుగా వచ్చింది. అందుకనే 'స్మరణ మాత్రముననే పరముక్తి ఫలదా కరుణామృత జలధి అరుణాచలమిది' అని వారు కావ్యకంఠ గణపతి మునికి వ్రాసిచ్చారు. కనుక అరుణాచలం కొండ శివుడు గనుక అయినట్లయితే ఒక వెన్నెలలో అరుణాచలాన్ని గనుక దర్శనం చేస్తే ఒకచోట ప్రారంభించి ఆవృత్తం పూర్తయ్యే సమయానికి వెన్నెలలో అరుణాచల శిఖరాలన్నీ కూడా మనకి శివపార్వతుల యొక్క అర్ధనారీశ్వర తత్వాన్ని బోధిస్తాయి. అది ఎవరూ చెప్పనక్కర్లేదు, అది వర్ణించనక్కర్లేదు. అది హృదయేకవేద్యం. ఎవరికి వారు అనుభవించవలసింది. కనుక అరుణాచలం అంటే శివశక్తి స్వరూపమైనటువంటి అర్ధనారీశ్వర తత్వంలో ఉన్నటువంటి ఆది దంపతుల యొక్క స్థూలమైనటువంటి, స్థాణువైనటువంటి, జంగమమైనటువంటి అంటే కదలనటువంటి ఒక అద్భుతమైనటువంటి కొండ. కాబట్టి నిన్న మన ప్రస్తావనలో గణపతి వచ్చేశాడు అంటే నాయన వచ్చేశాడు. ఆయన కావ్యకంఠ గణపతి ముని. ఆయన భావించినట్లుగా రమణులు వచ్చారు. ఆయన స్కందుడు. అంటే ముందు కొడుకులు ఇద్దరూ వచ్చారు. ముందు వచ్చారంటే నిన్న వచ్చారు. వాళ్ళిద్దరికంటే ముందు వచ్చినటువంటి వారు ఎవరంటే ఆది దంపతులు. కనుక అరుణాచలం అంటేది ప్రపంచంలో కైలాసం.భూలోకంలో ఉన్నటువంటి కైలాసమే అరుణాచలం కాబట్టి అరుణాచలమే ముక్తికి దారి తీస్తుంది గనుక "న రుణాన చలా అరుణాచలా" ప్రాపంచికమైన బంధనాలన్నింటినీ తెంచి ఒక వైరాగ్యమైనటువంటి విభూతిలో మనస్సుని స్థిమితం చేసి మనస్సుని అటూ ఇటూ కదలనివ్వకుండా ప్రాపంచిక భావనల నుంచి వైదొలగించి దుఃఖానికి సుఖానికి ప్రమోదానికి ప్రమాదానికి అనంతమైనటువంటి ద్వందాతీత స్థితులన్నింటినీ కూడా దాటించేటువంటి మహోత్కృష్టమైనటువంటి సాధనా భూమిక అరుణాచలంగా రమణులు భావించారు. కనుకనే అధ్యాత్మ జీవితంలోకి రావాలి అనుకునేటువంటి వాడు తొట్ట తొలిగా మొట్టమొదటగా వదులుకోవాల్సింది ఏమిటి అంటే అహాన్ని వదులుకోవాలి. "అరుణాచల మనుచు స్మరియించు వారలహము నిర్మూలింపు అరుణాచలా" అది ఆయన మొట్టమొదటి ప్రార్థన. అహము అంటే దంభము, గర్వము, ప్రగల్భము మాత్రమే కాదు అతిశయం కాదు నేను అన్నటువంటి ఒక దేహాత్మ భావనే నిజమైనటువంటి అహం. కాబట్టి అహం నుంచి జీవుడు అహం స్పురణ వైపు నడక సాగించాలి. అహాన్ని గనక కాస్త వెనక్కి నెట్టి కర్తృత్వాన్ని గనక కాస్త వదిలిపెట్టి నెమ్మదిగా ముందుకు వెళుతూ ఉన్నట్లయితే అహం స్పురణ స్ఫూర్తి కలిగి దానిలో జీవుడు తనను తాను పరామర్శ చేసుకొని తాను జగత్తులోకి ఎందుకు వచ్చాడో, వచ్చి ఏం చేస్తున్నాడో, చేయవలసినట్లుగా జీవించవలసినట్లుగా జీవిస్తున్నాడో లేదో అసలు జీవించవలసిన దివ్య విధానం ఏమిటో, ఇవన్నీ కూడా వాటంతట అవే తెరచుకొని పరుచుకొని మనకు మార్గోపదేశం చేస్తే గనుక ఇది రమణ మార్గం అంటూ ప్రత్యేకంగా లేదు. కానీ ఆయన వేసిన పదం మాత్రం రమణ పదం. మార్గంలో కాస్త విచారణ చేసి వెళ్లినట్లయితే మనకి ఆత్మానుభవాలు కలుగుతుంటాయా? అంటే మనకి కలుగుతుంటాయి కానీ మనం వాటిని గమనించం. భగవాన్ రమణులు ఒక ప్రత్యేకమైన కారణం వలన దేహం తీసుకుని వచ్చారు గనుక వారు దానిని గ్రహించారు. అనుభవాన్ని విస్తృతం చేసుకుంటూ వెళ్లారు. స్థిమిత పడ్డారు. మనస్సుని దాటినటువంటి స్థితిలో సంచారం చేశారు. ఏం చేసినా సమస్త జగత్తుని నడిపించే ఒక అదృశ్య శక్తి ఏదో ఉన్నదని, అదృశ్య శక్తిని మనం దైవమని భావిస్తామని ఒక నిశ్చితమైనటువంటి భావనలో దానినే మనం మనీషాయత్త చిత్తము అంటాం. అంటే స్థిమితమైన ఆలోచన, స్థిరమైనటువంటి బుద్ధి, స్థితప్రజ్ఞ మూడు కలిపితే అది మనీష. భావనలోనే రమణ మహర్షి వారి జీవితంలో జరిగిన అనేక సంఘటనలు గనుక మనం గమనించినట్లయితే అదే నిజానికి శ్రీ రమణుల యొక్క వైభవం. రమణులకేమన్నది వైరాగ్యమే ఆయనకు వైభవం. మనకి వైభవాలన్నీ కూడా బరువులు. చేతి కంకణాలు అన్నింటికీ కాళ్ళకి సంకెళ్ళు, కన్నీళ్ళకు సంకెళ్ళు లేనిదంటూ లేదు. ఇదంతా కూడా జీవన వ్యాపారంలో జీవుడు తన ప్రస్థానాన్ని సుగమం చేసుకోవాలి. ఆరాధనీయమైన భావనలోకి వెళ్ళాలి. ఆయన ఎదుర్కొన్న కొన్ని ప్రశ్నలే రమణ వైభవాన్ని ఆవిష్కరిస్తాయి గనుక ఆయనని మొట్టమొదట వేసిన ప్రశ్న ఏమిటంటే, "భగవాన్! దేవుడు ఉన్నాడా?" అని ప్రశ్నించారు. మామూలు వాడైతే ఉన్నాడు అని దాని మీద వ్యాఖ్యానం చేస్తాడు. దేవుడు అంటే వేరే ప్రత్యేకంగా ఉన్నాడా? God is nothing but a force and feeling within. నీలో ఉన్న అనంత శాంతి, అద్భుత శక్తి ఏదైతే ఉన్నదో దాని పేరే దైవము అని పేరు అన్నారు. దైవత్వం వేరే లేదు ఉన్నదంతా "సర్వం ఖల్విదం బ్రహ్మ" బ్రహ్మ అన్నా, బ్రహ్మము అన్నా, దైవమన్నా, ఆత్మ అన్నా ఇవన్నీ పర్యాయపదాలు గనుక ప్రపంచంలో మన లోపల ఉన్నటువంటి శాంతి ఉన్నదో, శక్తి ఉన్నదో అదంతా కూడా దైవమే అని గనక నీవు భావించగలిగినట్లయితే అది ఒక అద్భుతమైన స్థితి కదా అని అంటూ దైవము అనేక రూపాలలో వస్తుంది. రాముడై వస్తాడు, కృష్ణుడై వస్తాడు, చిరంజీవి బాబాగా వస్తారు, రమణ మహర్షిగా వస్తారు, సత్య సాయిబాబాగా వస్తారు, అనేక రూపాల్లో వస్తారు. రూపాలన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా సమాజం వక్రమార్గానా, అపమార్గానా, అధర్మ మార్గానా, అనాచార మార్గానా వెళుతూ ఉన్నప్పుడు మళ్ళీ మానవుణ్ణి సరిదిద్ది వక్రించిన బుద్ధిని సక్రమం చేసి సమున్నతమైనటువంటి అధ్యాత్మ స్థితిలో నడిపించటానికి మహత్పూర్ణమైనటువంటి అవతార మూర్తులు వస్తారు. వాళ్ళు కూడా దేహం తీసుకునే వస్తారు. మానవ జన్మ ఎత్తే వస్తారు. ఇదే సందర్భంలో భగవాన్ ని ఒక ప్రశ్న వేశారు. "భగవాన్! జ్ఞానికి ప్రారబ్ధాలు ఉంటాయా?" ఇది రెండవ ప్రశ్న. ఎందుకుండవ్? తనకు మాత్రం అక్కరలేని ఒక దేహాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చి దేహంతో పాటు కొన్ని ఏళ్ళు కూడి ఉండటమే నిజమైన ప్రారబ్ధం. జ్ఞాని మాత్రం ఎక్కడ తప్పించుకున్నాడు అన్నారు. కనుక కర్మ ప్రారబ్ధాలు శరీర ధారణ చేసిన సాధారణమైన మన బోటి జీవులకు మాత్రమే కాక అవతార మూర్తులకి రాముడికి, కృష్ణుడికి, రాముడు రామాయణం అంతా చదివితే ఆయనకి జీవితంలో Separation, a chain of separations is Rama life, Rama's life. ఆయన వియోగంలో సంయోగాన్ని, సంయోగంలో వియోగాన్ని పరమాద్భుత స్థాయిలో అనుభవించాడు. కారణం గురువుల యొక్క, గురువులు బోధించినటువంటి అనేకా అనేకమైనటువంటి సూత్రాల కారణంగా. ఇక శ్రీకృష్ణ పరమాత్మ జీవితాన్ని తీసుకున్నట్లయితే అది మధుర విషాద గాథ. మనం ఆయన్ని ఎన్ని రకాలుగానో కీర్తించవచ్చు, రాసలీలలు వర్ణించవచ్చు, కవితాత్మకంగా ఆయన రూపాన్ని వర్ణించవచ్చు. కానీ ఆయన మాత్రం ప్రపంచంలో అవతారంలో కృష్ణుడిగా వచ్చి ఆయన పొందినది ఏమిటి? ఏం లేదు. వాళ్ళు నిజానికి పొందటానికి రారు, ఇవ్వటానికి వస్తారు.కనుకనే వాళ్ళు మనకంటే భిన్నంగా ఉంటారు. మనము పొందటానికే వస్తాము ఇవ్వటానికి మాత్రం రాము. కనుక మనం మానవులుగా ఉంటాం వాళ్ళు దైవతాలుగా మా-- అవతార పరిసమాప్తి అయిన తర్వాత కూడా వారి జీవితం కొనసాగుతూ ఉంటుంది. అది దైహికంగా కాకుండా చైతన్యంగా సాగుతుంది గనుక జ్ఞానికి ప్రారబ్ధాలు ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పారు. ఇక మూడవది, జ్ఞాని ఇదే లోకంలో ఉంటాడు కదా భక్తులను అండి, శిష్యులనండి, బిడ్డలనండి పేరు పెట్టండి ఎవరో ఒకళ్ళతో సంపర్కం ఏర్పడి ఉంటుంది కదా వీరి ప్రభావం గురువు మీద ఉంటుందా? అని ప్రశ్న వేస్తే, వారి ప్రభావం గురువు మీద ఉంటే వాడు గురువు ఎట్లా అవుతాడు అన్నారు. గురువు ప్రభావం వీధి మీద ఉండాలి గాని వీడి ప్రభావం గురువు మీద ఉంటే గురువు అనటానికి అర్హతే లేదు గనుక ఇంతకీ గురువు ఎవరు? ఆత్మే గురువు అన్నారు. ఆత్మే గురువు, దైవమే గురువు. దైవం ఒక సారూప్యమైన భావన. ఆత్మ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వానికి సంకేతమైనటువంటిది గనుక ఆత్మే నిజమైనటువంటి గురువు. నిజానికి కొన్ని సందర్భాలలో అనుగ్రహమే గురువు అన్నారాయన. గురువు వచ్చి రోజూ నుంచోడు, రోజూ కూర్చోడు, రోజూ ప్రబోధం చేయడు. కానీ ప్రబోధం చేసిన దానిని సాధకుడు అర్థం చేసుకుని జీవితంలో తను వెళుతున్నటువంటి మార్గాన్ని చక్కగా నిర్మాణం చేసుకుని అపమార్గంలో కాకుండా సవ్యమార్గంలో శ్రేయోమార్గంలో సమున్నతమైనటువంటి స్థాయికి వెళతాడు గనుక అటువంటి స్థితి గురువు నుంచి మనం పొందాలి అని చెప్తూ భగవాన్ ని అడిగారు మీకు గురువు ఎవరు? అని అడిగారాయన్ని. నిజానికి మనకు తెలిసినంతవరకు రమణ మహర్షికి గురువు లేడు. కానీ భగవాన్ అత్యంత వినయభూమికలో వైభోగం అంటే splendor అంటాం చూడండి అదే ఇది. ఆయన ఏమన్నారంటే, ఎందుకు లేరు అరుణాచలానికి వచ్చిన కొత్తల్లో అరుణాచలాన్ని నేను కొండని దేవుడని అనుకోలేదా? గురువు అని అనుకో లేదా? తర్వాత తర్వాత ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిణి. ఈశ్వరుడన్నా, గురువు అన్నా, ఆత్మ అన్నా ఒక్కటేని తర్వాత కలిగింది గాని వచ్చినప్పుడు అరుణాచలానికి నమస్కరించాను కదా. అసలు వెళ్ళటం వెళ్ళటమే అరుణాచలేశ్వర దేవాలయంలోకి వెళ్ళాను కదా. శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాను కదా. నన్ను నేను సమర్పించుకున్నాను కదా. నాకంటే అధికమైన, ఉన్నతమైన, ఉత్కృష్టమైన, మహోన్నతమైనటువంటి శక్తి అది అని గ్రహించాను గనుక దానిని ఆలింగనం చేసుకున్నాను ఏం నాకు మాత్రం గురువు ఎందుకు లేరు అన్నారు. అయితే అక్కడే ఆగిపోకుండా దేవాలయ ప్రాంగణకే పరిమితం కాకుండా అరుణాచల దేవాలయానికి మాత్రమే పరిమితం కాకుండా తన లోపల ఉన్నటువంటి ఆత్మని విధంగా వారు అనుభవంలోకి తెచ్చుకున్నారో అనుభవ పూర్వకమైనటువంటి స్థాయిలో తన ఆత్మను గురువుగా భావించారు ఆయన. కనుకనే తర్వాత తర్వాత వారు అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తే వ్యాఖ్యానాల నిండా ఎటు నుంచి ఎటు ఎన్ని మాటలు చెప్పినా మళ్ళీ ఆయన ఆత్మ వైపే తీసుకొని వెళతారు. దానికి ఆయన పెట్టిన పేరు బ్రహ్మాస్త్రము. అంటే ఎవరో వినేవాడు ఉంటాడు, సాధకుడు ఉంటాడు. లేదు వినేవాడికి గురువుగారు ఇలా మాట్లాడితే బాగుండు అనుకుంటాడు, ఇట్లా చేస్తే బాగుండు అనుకుంటాడు తప్పేం లేదు. కానీ ఆయన వితండవాదంలోకి గనక దిగుతూ ఉంటే ఆయన అనేవారు, అయితే బ్రహ్మాస్త్రం బయటకు తీయనా? అనేవారు. అంటే వృధా ప్రయాస, వ్యధాభరితమైనటువంటి ఆలోచన, వితండవాదన అధ్యాత్మలో దానికి తావు లేదు. విషయాన్ని చక్కగా తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి, మరి భగవాన్ ఏదైనా పుస్తకాలు చదివారా అని ఒకానొక సాయంకాలం ఒక భక్తుడు మనలాంటి వాడే భగవాన్ మీరన్నీ వదిలిపెట్టారు మీరు ఆత్మను తెలుసుకున్నానని అన్నారు గానీ మీ కోసం నేను ఒక పుస్తకం పట్టుకొచ్చాను చాలా పెద్ద గ్రంథం అది. ఇది మీరు చదివితే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఏవో ప్రశ్నలు వేసి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి జవాబు చెప్పడానికి కాస్త మాత్రం నాలెడ్జ్ ఉండాలి, మీరు పెద్దగా చదువుకోలేదు కదా అని ఇన్ని మాటలు చెప్పి పుస్తకం చేతిలో పెట్టాడు. పుస్తకం సుమారు ఐదు, ఆరు వందల పేజీలు ఉన్న పుస్తకం. పుస్తకం పేరు పెరియపురాణం. భగవాన్ ఏం చేశారు? పుస్తకం నాకొద్దు, నాకివన్నీ అక్కర్లేదు అని అనలా. వినయంగా పుస్తకం ఆయన నుంచి తీసుకున్నారు. తీసుకుని ఇటు నుంచి అటు ఒక్కసారి browse చేశామంటామే ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి తిప్పి, ఇదంతా ఎప్పుడో చదివినట్లే ఉందప్పా అని చేతికిచ్చేశారు. అంటే మన లౌకిక విద్యలు, ఇవాళ మన చుట్టూ ఏర్పడేటువంటి గ్రంథరాజాలు ఇవి కాదు. ఆత్మానుభూతికి లోనైనటువంటి వాడు, ఆత్మానుభవాన్ని పొందినవాడు, ఆత్మే తానుగా జీవించేవాడు, నేనుని దాటి నేనులో సంచారం చేసేవాడు, నేను నేనుగా నిలకడ చెందినటువంటి వాడికి ధ్యానం లేదు, యోగం లేదు, ఇంకేమీ లేదు, లేదు, లేదు. మరి ఏమున్నది అంటే భగవాన్ దగ్గరికి ఒకాయన వచ్చి భగవాన్ మాకేదన్నా ఒక మంత్రం ఇవ్వండి హాయిగా జపం చేసుకుంటాం ఏదన్నా మంత్రం చెప్పండి అని అడిగారు. ఆయన ఏం మాట్లాడలా. మళ్ళీ పది నిమిషాలు అయిన తర్వాత మీరు మాకు ఒక మంత్రం ఇవ్వండి అని అడిగారు. అప్పుడు ఇచ్చారు. ఏమిటా మంత్రం అంటే, ఏమీ లేదు ఊరకే ఉండండి అన్నారు. చూశారా? ప్రశ్న ఇవాళ మనల్ని మనం వేసుకుంటే ఏమీ లేదు అనుకుంటే ఏమీ లేకపోవడం ఏంటి? ముందు నా శరీరం ఉంది, నా డబ్బుంది, నా సంసారం ఉంది, నా పిల్లలున్నారు, నా వైభవాలున్నాయి, నా కీర్తి ఉంది, నా సంపద ఉంది, నా విజ్ఞానం ఉంది, అనేకమైనటువంటి ప్రజ్ఞలున్నాయి, ఇవన్నీ లేకుండా ఎలా ఉండటం అని మనకు అనిపిస్తుంది. అవి ఏవీ ఉండేవి కావు. నువ్వున్నంత కాలం ఉన్నట్లుగా నీకు అనిపిస్తాయి. తర్వాత నీతో ఒక్కటి రాదు. కనుక ఏమీ లేదు రెండోది. నేను అది చేస్తా, ఇది చేస్తా, దీనిని మరమ్మత్తు చేస్తా, దీనిని సంస్కరిస్తా అని బయలుదేరుతున్నా అని బయలుదేరుతారు.జెండాలతో ఎజెండాలతో బయలుదేరే వాళ్ళకి ప్రపంచం ప్రకృతి అని ఎవరు చెప్పారు? కర్త జీవుడి ప్రారబ్ధాన్ని బట్టి ఆడిస్తూ ఉంటాడు. ఇది జరగకూడదు అని ఎంత ప్రయత్నించినా జరగక మానదు, ఇది జరగాలి అని ఎంత ప్రయత్నించినా అది జరగదు అనేటువంటి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానానికి అనుగుణంగా ఏమీ లేదు అన్నట్లుగా ఉండండి. రెండవది ఊరకే ఉండండి. ఊరకే ఎలా ఉంటాం? ఏదో మాట్లాడాలి కదా, ఏదో రాయాలి కదా, ఎవరి దగ్గరికో వెళ్ళాలి కదా, ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఎనిమిది గంటలు మినహాయించిన పదహారు గంటలు ప్రాపంచికమైనటువంటి వ్యాసంగాలలో వ్యాపకాలలో మనం అలసిపోవాలి కదా. కనుక వారు ఇచ్చినటువంటి ఒక బ్రహ్మాస్త్రము అద్భుతమైనటువంటి మంత్రం ఏది అంటే ఒకే ఒక్క మంత్రం ఏమీ లేదు ఊరకే ఉండండి. ఇది నాది అనుకుంటాం, నీది అనుకున్న మరుక్షణం నీది కాకుండా పోతుంది. ఇది నాది కాదేమో అనుకుంటాం వచ్చి ఒళ్ళో పడిపోతుంది. కనుక బంధన నుంచి నీవు తప్పించుకోలేవు గనుక మూల వాసనలకి కారణమైనటువంటి మనస్సుని కాస్త నిగ్రహించుకోగలిగితే దానిని నిరోధించుకోగలిగితే, ఆపై నిర్మూలించగలిగినట్లయితే మనస్సుని దాటినటువంటి అనేక శరీరాలు ఉన్నాయి. మామూలుగా మూడు శరీరాలు చెప్తారు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఒకసారి అరుణాచలం మీద చల్లటి గాలులు వీస్తున్నటువంటి హేమంత ఋతువులో వారొక్కరే కౌపీనం మాత్రమే ధరించి ఉన్నారు. ఒంటిమీద ఇంకేమీ లేవు. అందరూ కోట్లు, సూట్లు, బూట్లు అన్నీ వేసుకుని వచ్చారు. అయినా చలికి అందరూ వణికిపోతున్నారు. అందులో ఒక ఆయనకి భగవాన్ ని చూడగానే జాలి వేసింది. భగవాన్ దగ్గరికి వెళ్లి "భగవాన్ నాకెవరో చెప్పారు సమయంలో చాలా చలి ఉంటుందని, నేను రెండు కోట్లు పట్టుకొని వచ్చాను. రెండు కోట్లల్లో ఇప్పుడు ఒకటి తొడుక్కుకొని వచ్చాను. ఇంకోటి మీకు కూడా సరిపోతుంది. కిందకెళ్లి నేను పట్టుకొస్తాను" అన్నాడు. "ఆగప్ప ఒక్క నిమిషం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం మూడు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము నాలుగు. మూడు ప్లస్ నాలుగు ఏడు కలిస్తే ఇప్పటికే దేహి ఏడు శరీరాల కింద ఉన్నాడయ్యా. లోపల ఉన్న సామికి చ-ఏ రకమైన చలి లేదు. బయట ఉన్నటువంటి స్వామికే చదివి-- చలి ఉన్న తప్ప లోపలేమీ లేదు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చెయ్యి. నీవు ఆత్మగా గనుక నీవు ఆలోచన చేయగలిగినట్లయితే, ఆలోచనారాహిత్యాన్ని, భావ శూన్యతను నీవు పొందగలిగినట్లయితే అక్కడ చలి లేదు, ప్రాపంచికమైన గిలి లేదు. రెండూ లేవు. రెండూ దేహాత్మ భావనలో పుట్టేటువంటి సర్వ వికార భూయిష్టమైనటువంటి స్థితి గనుక దీని నుంచి బయటపడమని చెప్తూ శరీరాలు ఉంటాయి, పోతాయి. ఇదిగో ఇరవై-- ఇరవై నాలుగు గంటల్లో పదహారు గంటలు స్థూల శరీరంతో ఉంటాం. జాగ్రదవస్థలో ఉంటాం. తర్వాత సుమారు ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు స్వప్నావస్థలో ఉంటాం. దాన్ని ఆహ్ సూక్ష్మ శరీరం అన్నాం. ఇలా కలా కానీ మెలకువ వచ్చే టైంలో కేవలం ఫ్యూ సెకండ్స్ కొన్ని నిమిషములు మాత్రమే, క్షణాలు మాత్రమే ఉండేటువంటి కారణ శరీరం ఉంది. అది ఏదో ఒక చిన్న అనుభూతిని పొందుతుంది. అటు ప్రపంచానికి చెందక, ఇటు ఇంద్రియాలకు చెందక, మనో, బుద్ధి, చిత్, అహంకారాలను దాటినటువంటి స్థాయిలో ఆనంద పడ్డప్పుడు మనం నిద్ర లేచి ఏమంటున్నాం? రాత్రికన్న కలలన్నీ మనకు ఆనందాన్నివ్వలా. మెలకువ వచ్చేటువంటి కొన్ని క్షణాల ముందు మాత్రమే ఏదో ఒక తెలియని హాయి. దేనితోనూ సంబంధం లేని ఒక నిరామమైనటువంటి, ఒక నికామమైనటువంటి, నిర్వికల్పమైనటువంటి స్థితి. అది అత్యంత సహజంగా మనకు ఏర్పడుతుంది. కానీ మనం సహజంగా ఏర్పడే దాన్ని వదిలిపెట్టి అత్యంత అసహజంగా ఉండే దానివైపు మనం ప్రయాణం చేస్తాం. ప్రయాణం, ప్రస్థానంలోనే నిద్రలేచి రాత్రి ఎంత హాయిగా నిద్రపోయాను అంటాం. హాయిగా నిద్రపోయాను అనటానికి నీ మనస్సు లేదే, ఇంద్రియాలు ముడుచుకుపోయి ఉన్నాయే, నిద్ర లేస్తూనే హాయిగా ఉన్నానంటున్నావ్ మరి పదహారు గంటలు పని చేసావ్, బాగా డబ్బు సంపాదించావ్, విందు వినోదాలకు వెళ్ళావ్, ప్రాపంచికమైన అనేక కార్యకలాపాల్లో మనస్సును నిమగ్నం చేసావ్. అవన్నీ చేసినప్పుడు అలసట కలిగింది. ఏమీ చెయ్యని కొన్ని క్షణాలు మాత్రం హాయిని ఇచ్చినాయి. ఇది కదా నిజమైన హాయి. అంటే జాగ్రదవస్థలో కూడా మనం ఎన్ని కార్యకలాపాలు చేస్తున్నా నిర్వికారంగా, నిర్మోహంగా, నిర్మమంగా, నికేతనంగా, హాయిగా కర్మ యోగాన్ని సాగిస్తూ వెళ్ళాలి. దీని వలన లాభం ఏమిటి? దీని వలన నష్టం ఏమిటి? దీని వలన నాకే కీర్తి వస్తుంది? ఇవన్నీ కూడా దాటమని చెప్తూ లోపల ఉన్నటువంటి నేనుని పట్టుకోవటమే అత్యంత ప్రధానమైనటువంటిది అని ఒక బోధ చేశారు. అలాగే ఒకసారి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో అరుణాచలానికి ఆయన చాలా తరచుగా వెళ్ళేవారు. భగవాన్ కౌచ్ మీద కూర్చున్నారు. రాధాకృష్ణ పండితులు కింద కూర్చున్నారు. మూడు రోజులు గడిచిపోయినాయి. భగవాన్ ఆయన వైపు చూడలేదు, పలకరించలేదు. ఆయన కూడా భగవాన్ నాతో మాట్లాడాలని కోరుకోలేదు. ఆయన్ని చూస్తూ ఉండిపోయారు. ఇంతలోకే ఒక ప్రశ్న ఆయన దగ్గరికి వచ్చింది భగవాన్ దగ్గరికి. "మాయ అంటారే అది ఏమిటి భగవాన్ కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి" అని అడిగారు. ఏం మాట్లాడలే, విన్నకున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత మూడు రోజులు అయిపోయింది కాబట్టి రాధాకృష్ణ పండితులు భగవాన్ కి నమస్కారం చేసుకొని అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్లిపోయారు. ఇదిగో ఇట్లాగే ఇటువంటి హాల్లోనే మనందరం ఎట్లా ఉన్నామో అందరూ అక్కడ ఉన్నారు. రాధాకృష్ణన్ ఎప్పుడైతే లేచి గేటు వైపు వెళ్తున్నారో వీళ్ళందరూ కూడా ఆయన్ని సాగనంపడానికి వెళ్లారు.ఈ ప్రశ్న వేసిన మాయ అంటే ఏమిటి అని ప్రశ్న వేసిన వాడు మాత్రం హాల్లో భగవాన్ దగ్గరే ఉన్నాడు. భగవాన్ ఒక చిరునవ్వు నవ్వుతూ ఒక మాటన్నారు, "మాయ అంటే ఇదే. అసలును వదిలిపెట్టి అసలుది కాని వైపు వెళుతూ ఉంటారే, పని మీద వచ్చారో పని చేయకుండా మాయ అంటే ఏమిటో ప్రశ్నించడంతో మాయ తెలుస్తుందా? మాయని అనుభవించాలి. మాయ నిజానికి చైతన్యానికి ఛాయ. చైతన్యం లేకపోతే మాయ పుట్టదు. పరా ప్రకృతి అంతా కూడా మాయావరణంతో ఉన్నది గనుక, మాయావరణంలో ఉన్నప్పటికీ చైతన్యంగా ఉన్నది గనుక, ఇదిగో మనం మాట్లాడుతున్నాం మాయావరణంలోనే మాట్లాడుతున్నాం. ఆవరణం అదే కానీ మాటలు వినపడుతున్నాయి, అనబడుతున్నాయి. అనేక వస్తువులు కనబడుతున్నాయి. ఇదంతా కూడా జగత్తులో తెరమీద బొమ్మలాగా సాగిపోయేటువంటి అనేకానేక సంఘటనలు. అలాగే ఒక సినిమా హాల్లో తెరమీద బొమ్మలు ఎట్లాగైతే తరణు అంటుకోలేవో, తెర వాటిని ఎట్లా అంటించుకోదో, ప్రొజెక్టర్ ఆపగానే బొమ్మ ఎట్లా మాయమైపోతుందో, నీవు అనుకునేటువంటి ప్రపంచం యొక్క అస్తిత్వం, ప్రపంచం యొక్క వైభవం, ఇది కనిపించేటువంటి గ్రాండ్ జ్యూర్ అంటామే, ఇదంతా కూడా ఒక్క కారణం లో ప్రొజెక్షన్ ఆపగానే అన్నీ మటుమాయమై తెల్లటి తెర మాత్రం కనిపిస్తుంది. తెరే సత్య భూమిక. భూమిక వైపు మనం వెళ్ళాలి. మిగతావన్నీ చూడండి మనకి తెలియందేం కాదు. మన ముందు ఎంతమంది ఇక్కడ ప్రపంచం నుంచి మన కళ్ళ ముందు జారిపోయినారో, వెళ్ళిపోయినారో, వారంతా కూడా అంతా నాదే అనుకున్నారు కదా! అందరూ నా వాళ్ళే అనుకున్నారు కదా! కానీ వారు వెళ్ళిన నాడు వారి వెంట ఏమీ రాలేదే. వారితో ఒక్కడూ వెళ్ళలేదే. ఇటువంటి భూమికని మనం గనక అర్థం చేసుకున్నట్లయితే రమణులు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతారు. ఇక రమణులు జ్ఞాన యోగంలో ఉన్నారు గనుక కర్త్రుత్వ భావం వద్దు అని మనందరికీ చెప్పారు. మరి వారు కూడా ఆయన అట్లాగే ఉన్నారా? అంటే ఖచ్చితంగా ఉన్నారు. దేనిని పట్టించుకోలేదు. కానీ, ఇవాళ మనందరం కూడా పని చేయకుండా, పెద్దగా కష్టపడకుండా సంపదలు మన ఇంట్లోకి రావాలని కోరుకునేటువంటి సంఖ్య ఎక్కువగా ఉన్న సమాజం ఇవాళ. దానికి త్యాగం చేయటం మర్చిపోయింది. దానం చేయటం, చందా ఇవ్వటం వరకు బానే ఉంది. కానీ త్యాగం మాత్రం లేదు. ఏది త్యాగం? కర్మణాన ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః మనం అమృత పురుషులం కావాలి, అమృత పుత్రులం కావాలి అంటే త్యాగం చేయాలి. అది త్యాగం చేయాలి? అహంకార మమకారాలు వదిలిపెట్టాలి. అహంకారాన్ని వదిలిపెట్టలేము, మమకారాన్ని వదిలిపెట్టలేము, మమతా భావాన్ని వదిలిపెట్టలేము, సమతా భావాన్ని కూడా అలవాటు పరుచుకోలేము. కనుక అధ్-అధ్యాత్మ సాధనలో మనం నిజంగా ఎటు వెళుతున్నాం అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, ఎవరో నడుపుతున్నారు గనుక, ఏదో చేయాలి గనుక చేస్తూ ఉన్నాం అట్లా కాదన్నారు. కనుక ఒకసారి భగవాన్ కి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అప్పటికి వారు రమణ మహర్షి గా చాలా పాపులర్ అయ్యారు. పాపులర్ అయితే ఏముంది, జనం బాగా వస్తారు కదా! వచ్చారు. సరే ధర్మాధికారి వచ్చి మరునాడు ఏమేం చేయాలో, ఆశ్రమం ఏమేం చేయబోతున్నదో, దానికి వచ్చి ఎవరెవరు మాట్లాడబోతున్నారో, కార్యక్రమం అంతా కూడా నుంచొని చదవటం మొదలు పెట్టారు. భగవాన్ అన్నీ కూడా ప్రశాంతంగా విన్నారు. సరే ఆయన చెప్పటం అయిపోయి కాగితం మడతపెట్టి లోపలికి వెళ్లిపోయారు. భగవాన్ అందరివైపు చూస్తూ ఒక్క మాట అన్నారు, "అమ్మయ్య! ఇందులో నా ప్రమేయం అంటూ ఏం లేదు. నేను ఏమీ చెయ్యనక్కరలేదు, అది కదా!" అన్నారు. అదాయన ఎంత మర్చిపోయారంటే, అది ఆయన బర్త్ డే అనే సంగతి ఆయన మర్చిపోయినారు. ఇవి మనం కూడా నిత్య జీవితంలో మనం చారిటీ నుంచి వానిటీకి వెళ్ళిపోతున్నాం. వానిటీని తగ్గించుకోవాలి, చారిటీని పెంచుకోవాలి. మనం ప్రదర్శించేటువంటి ఆడంబరంలో నుంచి ఒక ఆభిజాత్యం, మనకు తెలియని ఒక అహంకారం, ఇవన్నీ ఏర్పడతాయి. చారిటీ ఎప్పుడైతే ఏర్పడుతుందో అది డబ్బుతో సంబంధం లేదు. ఒక ఆప్త వాక్యంతో, ఒక వాత్సల్య స్పర్శతో, ఒక పరామర్శతో, ఒక అద్భుతమైన విమర్శతో, విమర్శ అంటే నాట్ క్రిటిసిజం, క్రిటికల్ ఇవాల్యుయేషన్. దేనినైనా తులనాత్మకంగా ఆలోచన చేయాలి. ఇవన్నీ గనక మనం చేసుకోగలిగినట్లయితే మానవ సంబంధాలు చక్కగా ఉంటాయి అని చెప్తూ భగవాన్ అందరితో, పండితులు, పామరులు అందరితో ఎలా ఉన్నారో కొన్ని విచారణలు చేద్దాం. సరే కావ్యకంఠులు ఒక మహా శృంగం అది. మామూలు వాడు కాదాయన. సాక్షాత్తు గణపతి స్వరూపమే. గణపతి స్వరూపానికి స్కందులు వారు ఇద్దరూ కలిసిన కారణంగా జగత్తు ఒక మౌని, ఒక మహర్షి-- అంటే ముని మహర్షి కూర్చుంటే ఏమవుతుందో ప్రపంచం కొన్ని దశాబ్దాలు అనుభవించింది.
YouTube · audio

Sri Ramana Maharshi Vybhavam

Home

Sri Ramana Maharshi Vybhavam

Source: P V S on YouTube

0:00 / 30:50

More in this series

Sri Ramana Maharshi Vybhavam (Feb 2020)

3 episodes · 1 hr 21 min

  1. 29 min 1

    Sri Ramana Maharshi Vybhavam

    Now playing
  2. 27 min 2

    Sri Ramana Maharshi Vybhavam Part II

  3. 22 min 3

    Sri Ramana Maharshi Vybhavam Part III