Skip to content
Transcript తెలుగు
ధర్మ మార్గం తప్పకుండా ఉండటానికి జంతు ప్రవృత్తి లోపల ఉంటుంది జంతువు కదా అది జంతువుగా ఉన్నది దానికి సహజమైన అటువంటి గుణాలు ఎప్పుడైనా రజోగుణ తమోగుణాలు దాని యందు గనుక ఉన్నట్లయితే ఏనుగు తోక ఆడించింది అంటే అహాన్ని చంపుకున్నది అని అర్థం మానవుడు తోక ఆడించాడు అంటే అహాన్ని ప్రదర్శించబోతున్నాడు అని అర్థం మన పెద్ద వాళ్ళు ఏమంటారు జాగ్రత్త తోక కత్తిరిస్తా అంటారు కదా తోక మనకెందుకు మనకి తోకే లేదు కానీ దాని కంటే బరమైన తోక ఉంది అది అహంకారం. నా అంతటి వాడు లేడని, నాకు తప్ప ఇంకెవరికీ ఏం రాదని, నన్ను మించిన వాడు ఉండకూడదని ఇటువంటి వ్యర్థమైన ఆలోచనలతో మానవుడు అజ్ఞాన భూమిక లోకి కూరుకుపోతూ ఉంటాడు గనుక ఇవన్నీ కూడా మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు. సరే, మళ్ళీ గణేషుడి దగ్గరికి వస్తే మనకి బొమ్మ కనపడుతూనే ఉంది ఇప్పుడు అనుకున్నవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి కానీ ఆయన పరంగా గనుక మనం విచారణ చేసినట్లయితే ఆయనకు కూడా నాలుగు చేతులు మన వాళ్ళు తయారు చేశారు శిల్పులు అనండి చిత్రకారులు అనండి శ్రీ మహావిష్ణువు కూడా నాలుగు చేతులు పెట్టేసాం. నిజానికి దాని అర్థం అది కాదు. చతురమైన బాహువులు కలిగాడు గనుక చతుర్భుజుడు అన్నారు. నాలుగు భుజాలు నాలుగు చేతులు ఉన్నాయి అని కాదు. సరే సంకేతార్థంగా చెప్పిన నాలుగింట్లలో వాళ్ళు ప్రయోజనకరమైనవి ధరించారు. మనం దేనిని ధరించాం ఇవాళ అంటే సెల్ ఫోన్ ధరించాం, చూశారా. సెల్ ఫోన్ అది ప్రా-- జీవితంలో శరీరంలో భాగమైపోయింది. దాన్ని కాసేపు పక్కన పారేసేటువంటి శక్తి కూడా మన దగ్గర లేదు. అది ఎప్పుడు మోగుతుందో ఎవరు చేస్తారో ఏమిటో ఒక ఆందోళన అది. అది లేకుండా బతికాను చూడండి బిపిలు లేవు షుగర్లు లేవు. అది వచ్చిన తర్వాతనే ఆలోచనలన్నీ కూడా చాలా వక్రగతికి వెళ్ళిపోతున్నాయి ఆందోళనలు పెరుగుతున్నాయి. కాబట్టి నాలుగింట్లలో ఒక దానిలో ఆయన ఏం చేస్తాడంటే, అంటే అనేకమైన-- గణపతికి అనేక ఆకృతులు ఉన్నాయి ప్రాంతాన్ని బట్టి, దేశాన్ని బట్టి, కథని బట్టి, చిత్రకారుడి ఊహాశక్తిని బట్టి ఆయన చేతుల్లో ఎవరికి తోచింది వాళ్ళు పెడుతూ వచ్చారు. కానీ ప్రధానంగా ఆయన ముందు పట్టుకున్నది ఏంటంటే మోదకాన్ని పట్టుకున్నాడు. మోదకం అంటే ఉండ్రాయి. ఇట్ ఇస్ స్టీమ్ కుక్డ్ ఇవాళ భాషలో అంతే కదా. స్టీమ్ కుక్డ్ గనుక ఉన్నట్లయితే జబ్బులే రావు. ఉమ్ ఇవాళ స్టీమ్ కుక్డ్ వద్దు అది జబ్బు వచ్చి డాక్టర్ గారు చెప్పేదాకా స్టీమ్ కుకింగ్ అనేది మనకు నచ్చదు. మనకంతా చాలా ఆయిల్ కుకింగ్ ఉండాలి కదా. అనారోవ్యాన్ని మనం invite చేస్తాం. దాన్ని తగ్గించుకోవటానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఆయన ఏం చేస్తాడంటే రోజు రెండు కుడుములు తినండి పొద్దున్నే అంటాడు సరిపోయింది అక్కడికి. ఆయనది అదే తింటాడు రోజు. దానికి మోదకము ప్రమోదకము అని రెండు పేర్లు ఉన్నాయి. మోదకము అంటే ఆనందము అని అర్థం. మన ఆనందం అంతా దేంట్లో ఉంది ఐశ్వర్యంలో ఉందా? లేదు. ఐశ్వర్యం బరువే తప్ప పెద్ద పరువు కాదు. ఐశ్వర్యానికి మనం కాపలాదారులమే తప్ప నిజానికి యజమానులం కాదు. మన డబ్బుకి మన ఆస్తులకి అన్నిటికీ మనం జస్ట్ కాపలా కాస్తున్నాం అంతే. అది ఎలా పెరుగుతోందో ఎలా multiply అవుతోందో చూసి ఆనందిస్తున్నాం. అది ఎందుకు అవుతోందో దాని ప్రయోజనం ఏంటో మనకేం తెలియదు. కాబట్టి ఇటువంటి దాంట్లో మనకి నిజానికి వేళ ఆనందాన్ని, ఆహ్ ఇక్కడున్న మనమే మీకు నిజంగా క్షణాన ఆనందం కలిగించేది ఏది అని అందరికీ ఒక తెల్ల కాగితం ఇచ్చేస్తే దానిలో ఏం రాస్తారంటే ఆరోగ్యం ఉంటే చాలు అని రాస్తారు. అంతే కదా health is wealth అది పాత మాట. ఇప్పుడు మారిపోయింది. ఇవాళ తరం no no no wealth is health అంటున్నారు అంతే. బాగా డబ్బుంటే బాగా ఆరోగ్యం ఉన్నట్టు అది పశు లక్షణం. ఎందుకంటే ఉన్నది మనిషికి తృప్తిని ఇస్తే తిన్నది మాత్రమే మనిషికి-- పశువుకి తృప్తిని ఇస్తుంది. మనిషి ఎంత తినగలడు కొంత అయ్యాక చాలు అంటాడు. అమ్మో అంటాడు. ఇంకా పెట్టకండి అంటాడు. అది ఒక్కటే కదా. ఆహారం విషయంలో, డబ్బు విషయంలో ఇంకా తీసుకురండి అంటాడు. ఇంకా, ఇంకా కావాలి. ఇదిగో ఇక్కడికి ఒక వంద కోట్లు, దీన్ని రెండు వందల కోట్లు ఎలా చేయాలో చెప్పు. ఇట్లా రకరకాల వ్యామోహాలు, రకరకాల భావాలు వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకోవటానికి మనకి ఏది ఆనందం కలిగిస్తున్నదో దానిని ఇవ్వగలిగిన వాడు ఎవరు అంటే వినాయకుడు. అందుకనే ఆయన ప్రమోదాన్ని మోదకాన్ని పట్టుకొని ఉంటాడు. మనం ఆయనకి ఇష్టముండి సత్యసాయి బాబా వారు మాటన్నారు. చాలా అందంగా రాయలసీమ భాషలో, రోజూ నైవేద్యం పెడతారు, రోజూ బ్రహ్మార్పణం చేస్తారు, ఆహ్ బ్రహ్మార్పణం చెప్పేటప్పుడండి నా వైపు ఇలా తోస్తూ ఉంటారు, నా వైపే చూపిస్తూ ఉంటారు, నాకు మిగిలేవి చూపులు మీకు మిగిలేవి మేపులు అన్నారు. అది, అవన్నీ ఆయనకి చూపించి మనం తినేస్తాం. అంతే కదా. ఆయన పాపం తిన్నారో లేదో మనకేం తెలియదు. మనం మంత్రం చదివాం కాబట్టి ఆయన తిన్నారని అనే-- అనేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రమోదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆరోగ్యాన్ని మనం కోరుకోవాలి. ఆరోగ్యం ఎందుకు ఉండాలంటే రెండొందల ఏళ్ళు బతకటానికి కాదు శరీరం ఆజ్యం ఖలు కర్మ సాధనం, శరీరం ఆజ్యం ఖలు కర్మ సాధనం. ధర్మంతో కూడిన సత్కర్మలు చేయాలి, యజ్ఞం చేయాలి, యాగం చేయాలి, సేవ చేయాలి, ఇంకెక్కడో హాస్పిటల్ కి వెళ్లి ఇంకేదో సేవ చేయాలంటే శరీరానికి శక్తి కావాలి ఆరోగ్యం కావాలి. అనారోగ్యంతో ఉన్నవాడు హాస్పిటల్ కి వెళ్లి సేవ చేయలేడు. కాబట్టి వీటన్నింటికీ ఆనందం ఏది కలిగిస్తుందో దాన్ని మనం పట్టుకోవాలి. దాన్ని ఆయన ఇవ్వగలడు. ఒక చేత పాశం పట్టుకొని ఉన్నాడు. పాశం ఏమిటంటే ప్రాపంచికమైనటువంటి మనం, మనందరం కూడా మనకంటే ముందు పశువులు. పొలం నుంచి మనం బండి కట్టి దాన్ని తీసుకొని వస్తున్నప్పుడు దారి దానికి తెలుసు. మన ఇంటి దాకా మనం ఏం చెప్పక్కర్ల తీసుకొచ్చి దింపేస్తుంది. కానీ దాని పశు ప్రవృత్తి చేత భావన చేత.వెళ్ళవలసినంత speed వెళ్ళకుండా sudden గా speed తగ్గిస్తుంది. ఎందుకు తగ్గిస్తుందో మనకు తెలియదు. అప్పుడు వాడి చేతిలో ఉన్నటువంటి రైతు లేదా మనం చర్మాకోలు పెట్టి దాన్ని కొట్టం, దాన్ని తడతం. కొట్టటం వేరు, తట్టటం వేరు. తట్టటం అంటే మామూలు స్పృహలోకి తేవటం. "ఎందుకు బద్దకిస్తున్నావ్? కొంచెం వడివడిగా అడుగులు వెయ్యి" అని చెప్పటం అనమాట. భాష పశువుకి అర్థమైపోతుంది. మనకి ఏదన్నా ఇవ్వాళ పని చేయాలి అంటే రేపు చేద్దాం అనేవాడే తప్ప ఇప్పుడే చేస్తాననే వాళ్ళు లేరు. మీరు పని చెప్పండి, రేపు చేద్దాం అంటారు. వీడికి రేపు మీద అంత గట్టి నమ్మకం. రేపు ఉంటుందని, రేపులో మనం ఉండబోతున్నామని. చూసారా అహంకారంలో నుంచి వచ్చింది ఇది. కాబట్టి రేపుకి రూపం లేదు కాబట్టి, ఏదన్నా మంచి పని చేయాలి అంటే ఇవ్వాళే, ఇప్పుడే, క్షణమే చేసేసేయాలి. చెడ్డ పని తలపు వచ్చింది, చేయకూడదు. దానిని రేపు ఆలోచించాలి. ఎల్లుండి, "అరే ఏంటి చెడు ఆలోచన నా నుంచి పోవటం లేదే?" అని ఎలాగైనా దాన్ని పాశం నుంచి మనల్ని విడగొడుతుంది. అట్లాగే ప్రాపంచికమైనటువంటి బంధవ్యాలు, బంధనాలు, ఇవన్నీ కూడా మనని ఒకచోట కట్టిపడేస్తాయి. ధర్మాన్ని ఆచరించే సమయంలో కూడా ఇది మన వాళ్ళకి దక్కితే ముందు బాగుండు ఉమ్ ఆ.. సమారాధన చేస్తాం. సమారాధన ఎవడైనా చేసేటువంటి వాడు, వాడు ఏం చెప్తాడంటే, చివరికి అన్నీ ఉంటాయో లేదో మొదటి పంక్తిలోనే, మొదటి batch లోనే, మొదటి table దగ్గరే మన వాళ్ళందరూ కూర్చో. [గాలి వీస్తుంది] మీరందరూ ముందే వచ్చి కూర్చోండి ఆ.. లేకపోతే చివరికి ఏమీ దక్కవేమో అని మనం ముందే వాడిని prepare చేసి తెస్తాం. కానీ మనం చేయవలసింది ఏంటంటే మన వాళ్ళు last కి ఉండాలి. బయట నుంచి వచ్చిన అతిథులు ముందు రావాలి. అందునా స్త్రీలు ముందు రావాలి. పిల్లవాళ్ళు ముందు రావాలి. పురుషుల్లో వయోధిఖ్యులు, వయస్సులో పెద్దవాళ్ళు ముందు వచ్చి అన్నం తినాలి. ఇవన్నీ కూడా మనకి సాంప్రదాయకంగా ఉన్నాయి గనుక ఇటువంటి జాగరూక స్థితిని కల్పించటానికి లాలస, ప్రాపంచికమైన భౌతిక ఆనందంలో నుంచి మన మనస్సుని చక్కగా భగవంతుని వైపు తిప్పేట్టుగా పాశ అంకుశ ధరం. అంకుశం కూడా ఆయన ధరించి ఉంటాడు. ఇక నాల్గవది ఒక పుష్పం ధరించి ఉంటాడు. పుష్పం ధరించి ఉన్నటువంటి వినాయకుడిని కొనుక్కోవాలి మనం. ఎందుకు కొనుక్కోవాలి అంటే అదేం చాదస్తంగా దానికేం పెద్ద శాస్త్రం లేదు. చివరికి పరమాత్మకి మనం ఏమివ్వగలము అంటే మనకు భగవంతుడు ఒక పుష్పం ఇచ్చాడు. దాని పేరు హృదయం. దాన్ని ఆయనకి ఇచ్చేస్తే ఇక ఆయన చూసుకుంటాడు. మనం అది ఇవ్వం. మనసు ఇవ్వం. మన ఆలోచన ఇవ్వం. "ఏమిటి ఎలా ఉన్నారు?" "నేనన్నీ సత్యసాయిబాబా వారికి అప్పజెప్పేశా, ఇక ఆయనే చూసుకుంటున్నా" అన్నాం గానీ ఆయనకి ఏమీ వదిలిపెట్టలే. అన్నీ మన దగ్గరే. ఎట్లా ఉంటుందంటే ఒక పెద్ద మైదానంలో గొర్రెలు కాచుకునేటువంటి వాడు గొర్రె మెడలో ఒక తాడు కడతాడు. కడతా-- కట్టి తాడు చాలా పెద్దది ఉంటుంది. రెండు వందల మీటర్లు ఉంటుంది. అది అనుకుంటుంది, "అమ్మయ్య నన్ను యజమాని హాయిగా, స్వేచ్ఛగా తిరగనిస్తున్నాడు. నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాను. ఏమీ మాట్లాడటం లేదని." కానీ పాపం దానికి తెలియంది ఏంటంటే దాని రెండో కొస యజమాని చేతిలో, చెట్టు కింద వాడు నీడలో కూర్చున్నాడు. అది అటూ ఇటూ పరిగెత్తిందా, లాక్కొని దగ్గర తీసి కట్టేస్తాడు. కాబట్టి పాశము అనేటువంటిది కూడా మన మనస్సు-- మనస్సహి చంచలః. కాసేపు ఇక్కడ ఉంటుంది, కాసేపు అటు వెళ్తుంది, కాసేపు బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది, విందామని ఉంటుంది, వింటున్నట్లుగా అనిపిస్తుంది, వినకపోతే ఏమవుతుందిలే అనిపిస్తుంది. చూశారా ఒక్క క్షణంలో ఎన్ని, మనసు ఎటో పరిగెత్తుతుంది. అటువంటి మనస్సుని అచంచలం చెయ్, అచలం చెయ్, ఒకచోట స్థిమితం చెయ్. చిత్తైకాగ్ర స్థితిలో నిలబెట్టుకో. తద్వారా మహదానందాన్ని నువ్వు పొందాలి. చిత్తైకాగ్ర స్థితిలో దేనియందు నిలబెట్టాలి అంటే పరబ్రహ్మమున యందు మాత్రమే మనం నిలబెట్టాలి. కనీసం రోజుకి ఇరవై నాలుగు గంటలు మనకిస్తే ఒక్క గంట, ఒక్క అరగంట, ఇంకోమాట చెప్పండంటే ఒక పావుగంట, ఇంకా తగ్గించండి పది నిమిషాలు మనతో మనం ఉండగలుగుతున్నామా? లేదు. కాబట్టి పుష్పం, హృదయం అనేటువంటి పుష్పాన్ని పరమాత్మకి మనం సమర్పించిన తర్వాత మనకు వచ్చే కష్టనిష్టూరాలు, అననుకూలాలు, ఇబ్బందులు, సుఖదుఃఖాలు, ద్వంద్వాలు, ఇవన్నీ కూడా ఆయన సరిచేస్తాడు. చూస్తాడు. చూస్తాడు, సరిచేస్తాడు అంటే వాటిని ఎదుర్కోగలిగినటువంటి ఒక ఆంతరంగిక శక్తిని మన యందు ప్రవేశపెడతాడు. ఏది రాని, ఏది పోని మనం మనంగా నిలబడగలిగినటువంటి ఒక స్థాయిని ఆయన అనుగ్రహించేస్తాడు. ఇది ఒక భావన. తర్వాత వినాయకుడి పొట్ట మీద పాముతో అంటే వడ్డాణం లాంటిది. It's like a belt. వడ్డాణము దాన్ని నాగాభరణము అన్నారు. నాగాభరణం అంటే వాళ్ళ నాన్నగారి ఒంటి నిండా పాములే కదా. లేలిహానము అంటే పాము. శివుడి మెడలో ఉన్నవన్నీ పాములే. అంటే కుండలినీ మహాశక్తి ఏదైతే ఉన్నదో దాన్ని తండ్రిగారు ధరించి ఉన్నారు. ఆయన control లో పెట్టుకున్నారు. ఈయన కూడా తండ్రిగారి బాటలోనే ఒక నాగాభరణాన్ని పొట్టచుట్టూ పెట్టి, మెలిపెట్టి అక్కడ బొడ్డు దగ్గర ఆపేశాడు. ఎందుకని ఆపాడు అంటే నాభిస్థానం నుంచి కింద భాగమంతా పురుష దేహంలో కానీ, స్త్రీ దేహంలో కానీ అది పృథ్వీ తత్వానికి, ప్రపంచానికి చెందింది. బొడ్డు పైన ఉన్నటువంటిదంతా ఉదాత్తమైనటువంటి స్థాయి. అక్కడ కరుణారస ప్రవాహం చిప్పిల్లుతూ ఉంటుంది.మన ఆలోచనలు మన హృదయాలు మన స్పందనలు మన సంస్కారాలు మన సంస్కృతులు మన భాష మన భావం మన దర్శనాలు మనం చూసే చూపులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే నాభి పైన ఉన్నాయి. కనుక నాభి మూలంలో ఏమున్నది అంటే అజ్ఞానం అనేటువంటి కుండలిని అక్కడ కూర్చొని ఉన్నది. అందుకనే "ఓం గం గణపతి నమః" అంటాం. గం అనేటువంటిది బీజాక్షరం. మూలాధారం నుంచి స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశిష్ట లేదా విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం దాకా చక్రాలు ఉన్నాయి. ఆరు చక్రాలలో మనలో ఉన్నటువంటి ఆయువు అదే వాయువు గాలి దానినే హంస అన్నారు పక్షి అన్నారు ప్రాణం అన్నారు చైతన్యం అన్నారు fluid అన్నారు అనేక రకాలుగా flow అన్నారు అనేక రకాలుగా చెప్పిన ఉన్నది. ప్రాణైక శక్తి ఏదైతే ఉన్నదో దానిని నాభిస్థానం దగ్గర దాన్ని ఆపుతారు. ఆపి ఉంచాడాయన. ఉంచి బీజాక్షరం మూల గం వెళ్లి దేనితో కలవాలి అంటే అనేటువంటి జ్ఞానంతో కలవాలి. గం వెళ్లి తో కలిస్తే దాని పేరు గంగ. పైనుంచి కిందకి చదివిన గంగని తిప్పి చదివిన మళ్ళీ గంగే కదా. కాబట్టి పైనుంచి కిందకు వచ్చినా కింద నుంచి పైకి వెళ్ళినా మూలాధారం నుంచి సహస్రారం వరకు కలిపి ఉన్నటువంటి యోగశాస్త్రము యోగ భావన యోగాత్మ ఏదైతే ఉన్నదో అది గణపతి యందు గానాపత్యంలో ఉన్నది గనుక గణపతి ఉపాసన గనుక అంటే గణపతిని తలచుకున్నంత వలన ఏమవుతుంది అంటే మనకి శుద్ధి బుద్ధితో కూడినటువంటి ఒక సిద్ధి ఏర్పడి ఒక జ్ఞానం ఏర్పడి దాని వలన ప్రపంచాన్ని ప్రపంచాతీతమైన భావాన్ని అనేక వాంగ్మయాలని చక్కగా స్పష్టంగా యదార్థంగా అర్థవంతంగా అర్థం చేసుకునేటువంటి ఒక బుద్ధి కుశలత మనకు ఏర్పడుతుంది గనుక వినాయక చవితి నాడు మన పిల్లలతో పుస్తకాలకు పూజ చేయిస్తాం. పుస్తకాలకు పూజ చేయటం అంటే hundred కి hundred marks రావాలని కాదు. మళ్ళీ బాబా గారే గొప్ప మాట చెప్పారు marks దేముంది బంగారు remark రాని జీవితం ఎక్కడైనా ఉన్నదేమో దాన్ని వెతుక్కోండి అది పిల్లలకి నేర్పండి marks దేముంది. తొంభై ఎనిమిది వంద వచ్చి వాడు ప్రయోజనం లేని లోక కంటకుడైన జీవిగా ఏర్పడితే తల్లికి ఆనందం ఎక్కడ ఉన్నది తండ్రికి ఆమోదం ఎక్కడ ఉన్నది. వాడికి యాభై marks అరవై marks వచ్చిన వాడి యందు సేవాభావం ప్రేమభావం కరుణ దయ మానవత్వం గనక ఉంటే కంటే ఇటువంటి బిడ్డని కదా నేను కనవలసింది కన్నాను గదా అనేటువంటి మాతృభావన ప్రచోదితం అవుతుందన్నారు స్వామి. కాబట్టి ప్రతి దాని వెనుక ఇంత అంతరార్థం ఉన్నది. నాగాభరణం అనేటువంటిది జాలంధరోజ్జానన మూల బంధాన్ అంటారు భగవత్పాదులు యోగశాస్త్రంలో. జాలంధరము శరీరం చుట్టూ నాగాభరణాన్ని ధరించి ఉన్నప్పుడు మనకి ఆలోచనలు అటూ ఇటూ పోవు. ఎప్పుడైనా అంతే కదా. ఒక ప్రవాహానికి రైతు గట్టు వేస్తాడు. నీళ్లు ఎక్కువైనాయి అన్నప్పుడు గట్టు వేస్తాడు. నీళ్లు తక్కువైనాయి అన్నప్పుడు గట్టు తగ్గిగొడతాడు. అంటే రెండూ మన చేతిలో ఉన్నాయి. belt tight గానూ మనకు వాడు అనేక చిల్లులు పెట్టిస్తాడు tight గా ఒక్కోసారి పెట్టుకోవాలి loose గా ఒక్కోసారి పెట్టుకోవాలి. అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి అంటే అది గురువు చేతిలో దైవం చేతిలో belt మన చేతిలోనే ఉంది మనమే చాలా పనులు చేయాలి అని చెప్పటానికి ఆయన శరీరంలో అది చాలా ప్రధానమైన యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి విషయం. ఇక తర్వాత కురచ కాళ్ళున్నాయి. ఆయనకి సౌందర్యం ఉంది అందం లేదు ఆయనకి. అందం ఎక్కడుంది సౌందర్యం అద్భుత సౌందర్యం. మీరు శివపార్వతుల బొమ్మను ఒక్కసారి మనసులోకి తెచ్చుకోండి. ఎన్నో వేలసార్లు చూసుంటారు. అమ్మవారు చక్కగా రెండు కాళ్ళు నేలమీద ఆనించి కూర్చుంటుంది కదా రెండు పాదాలు. శివయ్య అలా చేయడు. కాలు కింద కాలు మడత వేసి కూర్చుంటాడు. కుడి కాలిని ఎడమ కాలు కింద దోపి కూర్చుంటాడు. ఎందుకు అనంటే ఇదిగో ఇటువంటి సంధ్యా సమయంలో కైలాసంలో అమ్మవారు అయ్యవారు అర్ధనారీశ్వర తత్వంలో లాస్యం చేస్తారు. అంటే నాట్యం చేస్తారు. మృత్తం చేస్తారు. తాండవం చేయరు. తాండవం ఒక ప్రణయ కాలంలోనే ప్రళయ కాలంలోనే చేస్తారు. లాస్యం అంతా ప్రణయ కాలంలో చేస్తారు. అమ్మవారికి అయ్యవారికి ఉన్న ప్రణయం ఏమిటి ప్రేమ ఏమిటి అంటే లోకం ఉద్ధరింపబడాలి. ఇక్కడ శృంగేరి చంద్రశేఖర భారతి స్వామి వారు. ఇప్పుడున్న స్వామివార్ల కంటే చాలా ముందు స్వామివారు. 1950 ప్రాంతంలో శృంగేరి పీఠానికి వారు పీఠాధిపతిగా ఉన్నారు. చంద్రశేఖర భారతి స్వామివారు. భారతీ సాంప్రదాయం అంతా శృంగేరిది అయితే ఇంద్ర సరస్వతీ సాంప్రదాయం కంచిది. అందుకనే చంద్రశేఖర ఇంద్ర సరస్వతీ స్వామి పెద్ద స్వామివారు వారి పేరు. ఇద్దరూ ఏకకాలంలో ఉన్నారు. అదే కాలంలో తిరువణ్ణామలైలో రమణ మహర్షి ఉన్నారు. పాండిచ్చేరిలో అరవింద యోగి ఉన్నారు. బెంగాల్ లో రమణ మహర్షి మన రామకృష్ణ గురుదేవులున్నారు నరేంద్రుడు వివేకానందుడున్నారు. అది ఒక అత్యద్భుతమైనటువంటి స్వర్ణయుగం ఆధ్యాత్మిక స్వర్ణయుగం. దానిలో ఇదిగో ఈయన ఏం చేశారంటే ఒకరోజున అమ్మణికి పూజ చేస్తున్నారు శృంగేరిలో జరిగిన యదార్థ సంఘటన ఇది. వారికి ప్రతిరోజూ పూజకి కావలసిన సామాగ్రి పరిచారకులు పెడతారు. పెడితే ఆయన రోజు కుంకుమ పూజ చేస్తున్నారు శుక్రవారం సాయంత్రం. వారు ఎంత సేపు చేస్తారో తెలుసు ఎన్ని మంత్రాలో తెలుసు దానికి కావలసిన quantity ఎంతో కూడా పరిచారకులకు తెలుసు గనుక ఒక bag నిండా కుంకుమను పెట్టారు. ఆయన పూజ చేస్తూ చేస్తూ ధ్యానంలోకి వెళ్లిపోయారు. ఒక సమాధి స్థితిని ఆయన attain చేశారు.చేసి పూజ ఆగటంలా పూజ జరుగుతున్నది వారు బాహ్య స్మృతి లో లేరు పరిచారకులు అంతా చూస్తున్నారు ఇక నిండుకుంటున్నది చివరి రెండు మూడు గ్రాములుకు వచ్చింది ఈసారి గురువుగారు గనుక సంచిలో చేయి పెడితే కుంకుమ ఉండదు ఎట్లా వారిని తట్టి లేపగలిగిన శక్తి లేదు కుంకుమ నిండుకుంటున్నదని చెప్పే మాట ధైర్యం లేదు వాళ్ళు కూడా అలా చూస్తూ ఉండిపోయారు ఏం జరుగుతుందో అని వారు అంత trance ఉండి కూడా వారు ఏం చేశారంటే చేతిని సంచి వైపు ఇట్లా తిప్పి చేతిని ఇట్లా ఇట్లా ఇట్లా అన్నారు అనగానే అప్పటివరకూ ఎంత కుంకుమ ఖర్చు అయ్యిందో అంత కుంకుమ వచ్చి అక్కడ కూర్చుంది అద్భుతం అన్నారు అయిపోయింది భారతీస్వామి వారు నెమ్మదిగా ఇది అయిపోయిన తర్వాత తను ఉన్నటువంటి ప్రదేశం నుంచి తన కుటీరానికి వెళ్ళటానికి తుంగ నది దాటి వెళ్ళాలి పక్కనే ఉంటుంది తుంగ నది దాటి వెళ్తున్నప్పుడు ఒక పరిచారకుడు సందర్భం అంతా గుర్తు చేసి "మాకు చాలా భయం వేసింది మీరేమో సమాధి స్థితికి వెళ్ళిపోయారు బాహ్య స్మృతిలో లేరు కుంకుమ నిండుకుంటున్నది కానీ గురుదేవా ఇవాళ ఆశ్చర్యం కలిగింది మాకు మీ చేతి వేళ్ళ కదలికలో నుంచి మళ్ళీ అంత కుంకుమ వచ్చింది ఇది ఎట్లా సాధ్యం" అని అడిగాడు. వారు దానికి జవాబు ఇవ్వకుండా "దీనికి ఆశ్చర్యపోతున్నారా? తెల తెల వారుతున్నటువంటి తొలిజాము వేళలో లలితా దేవి దగ్గరికి ముప్పై ముక్కోటి దేవతలు త్రిమూర్తులు త్రిమూర్తుల భార్యలు అగస్త్యుడు లోపాముద్ర అష్టదిపాలకు నవగ్రహాలు అన్ని బారులు తీరి అమ్మవారి ముందు నుంచోని మళ్ళీ జగత్తుని ఇంకొక రోజు నడపటానికి నిన్న కొంత ఖర్చు అయ్యింది మాకు మళ్ళీ శక్తిని ఇవ్వమని అడగటం లేదా? అట్లాగే ప్రపంచంలో నిన్న అంటే ఇవాళ అంత జరగటానికి కొంత శక్తి ఖర్చు అయ్యింది దానిని మనకు తెలియకుండానే మనం పడుకుంటాం నిద్రపోతాం లేచేప్పటికి మళ్ళీ అంతా సమృద్ధంగా ఉండటం లేదా? దానిని గురించి ఆలోచించి ఆశ్చర్యపోండి కుంకుమ రావటంలో ఏమున్నది" అన్నారాయన అది ఇది భారతీయమైనటువంటి సిద్ధాంతం చాలా గంభీరమైనది ఉదాత్తమైనటువంటిది కనుక అయ్యవారు నేల మీద ఒక కాలు ఉంచు ఉంచారని అమ్మవారు రెండు కాళ్ళు ఉంచిందని నిజానికి అర్ధనారీశ్వర తత్వంలో గనుక చేసినట్లయితే దానిలో అమ్మవారు వామ భాగం ఒక పాదమే అయ్యవారు దక్షిణామూర్తి ఆయనది కుడి పాదం కుడి పాదం balance energy balancing అంటాం physics చదువుకున్న వాళ్ళకి అది చాలా తేలికగా అర్థమైపోతుంది. అంటే ఎంత ఖర్చు అయిపోతుందో మళ్ళీ తూకం అంత వస్తుంది చూడండి. ఒకవైపు రాయి పెట్టి రెండోవైపు కూరగాయలు పెట్టినప్పుడు చదువు రానటువంటి కూరలమ్మీ అమ్ అమ్మి ఏమంటుంది అంటే "బాబు తూకం వెయ్యిపోతున్న తూకం సరిగ్గా చూసుకో" అని ఏం పెడుతుంది తూకం వేసి చెప్పదు ఖాళీ చేసి చూపిస్తుంది. రెండు తక్కెట్లు correct గా ఉన్నాయి అన్నప్పుడు సరే తూయి అంటాం మనం చూశారా అంటే మనల్ని మోసం చేయలేదు అని కాబట్టి energy balancing లాస్యంలో జరుగుతుంది గనుక దానిని పుణికి పుచ్చుకున్నటువంటి వాడు ఎవరంటే మళ్ళీ గణేషుడే ఆయన కూడా రెండు పాదాలు నేల మీద ఉంచి ఉంచడు ఒకటి పైన ఒకటి కింద పెట్టుకొని ఉంటాడు. ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆయన ప్రపంచంలో balance బుద్ధి అటూ ఇటూ వెళ్ళినా శుద్ధి కాస్త తగ్గినా percentage పడిపోతున్నా ఆయన జీవుడి యందు ప్రవేశించి రెండింటినీ కూడా మనకి బుద్ధి ఉండాలి శుద్ధి ఉండాలి సిద్ధి ఉండాలి three dynamics అవి. three dimensions లో శుద్ధి లేకపోతే బుద్ధే రాదు బుద్ధి లేకపోతే శుద్ధి కలిగిందో లేదో తెలియదు రెండూ ఏర్పడితే సిద్ధి automatic గా ఏర్పడుతుంది. సిద్ధి సంపద సృష్టి కావచ్చు వాగ్విభూతి కావచ్చు అనేకమైనటువంటి విషయాల మీద మనకు ఉండే అవగాహన పెరగటం కావచ్చు ఇంకేది కానివ్వండి ఏదో ఒక రకమైన సిద్ధి ఏర్పడుతుంది సిద్ధి కార్యరూపం ధరించినప్పుడు అది మళ్ళీ ప్రజ్ఞా స్వరూపం అవుతుంది గనుక ప్రజ్ఞని లోకం కోసం లోకహితం కోసం వాడాలి ఏది నిజమైనటువంటి శివ పూజ అన్నప్పుడు ఏనకేనా ప్రకారేణ యస్య కశ్యాపి దేహినా సంతోషం జనయేత్ ప్రాజ్ఞ్యః తదేవ ఈశ్వర పూజనం. ఇది వేద ప్రమాణం ఎవడో కవి రాసిన మాట కాదు భగవంతుడు మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తికి ఒక ప్రజ్ఞ ఇచ్చాడు ప్రజ్ఞ అందరి యందు ఒకటే ఉండదు ఒకడి యందే అన్నీ ఉండవు కనుక సమష్టిగా ఉండాలి అందరూ కలిసి ప్రపంచానికి లోకహితం కోసం ప్రపంచానికి అందించాలి గనుక ఎవరైతే తమ ప్రజ్ఞ ద్వారా తమ చుట్టూ ఉన్నటువంటి వారికి ఆనందాన్ని కలిగిస్తారో అది మాత్రమే శివపూజ ఈశ్వర పూజ తదేవ ఈశ్వర పూజనం ఇది భావన. పూజ అంటే మనకి తంతు పూజ అంటే అలంకారం పూజ అంటే అర్చన పూజ అంటే అభిషేకం అక్కడ ఆగిపోయినాం అది కాదు మన ప్రజ్ఞ ద్వారా ఇంకొకడికి ఆనందాన్ని కలిగించాలి మన ప్రజ్ఞ ద్వారా ఇంకొకడి కన్నీళ్లు తుడవాలి మన ప్రజ్ఞ ద్వారా ఇంకొకడికి ధైర్యాన్ని ఇవ్వాలి మన ప్రజ్ఞ ద్వారా ఇంకొకడికి ప్రేమను కలిగించాలి. మానవత్వం పట్ల అపేక్షని దైవ ప్రీతిని కలిగించే విధంగా మన జీవితాలు సాగాలి గనుక వినాయకుడు కూడా రెండింటినీ కూడా సమన్వయం చేస్తూ తన యందున్నటువంటి మహా శక్తిని దాని యందు నిలిపి ఉంచుతాడు ఇక ఆపై హేతువాదులు భగవంతుడు లేడనేటువంటి నిరీశ్వరవాదులు హైందవ ధర్మాన్ని అపహసించేవారు వాళ్ళు ప్రధానంగా మన దేవతా మూర్తుల మీద వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు అయితే వాళ్ళని నేను తప్పు పట్టటంలే వాడు వ్యాఖ్యానం చేశాడు గనుక జవాబు ఎలా చెప్పాలి అని కనీసం ఆలోచించాం.వాడు వ్యాఖ్యానం చేసి ఉండకపోతే మనం ఆలోచించేవాళ్ళం కాదు కాబట్టి రకంగా we are ever thankful to them అంతే కదా. వాడు ఒక ప్రశ్న వదిలాడు జవాబు చెప్పవలసిన బాధ్యత మనది సమాధాన పడకూడదు సమాధానాన్ని ఇవ్వాలి. ఏమంటాడంటే ఎక్కడన్నా ప్రపంచంలో animal world లో మీరు ఎక్కడన్నా చూశారా ఒక ఏనుగు వెళ్ళి ఎలుక మీద కూర్చుంటే అసలు ఎలుక ఉంటుందా పోతుందా మీరు దీన్ని ఎట్లా అంగీకరిస్తున్నారు అని ఎవడో అడుగుతాడు మనల్ని. ఎలుక దేనికి సంకేతం అంటే అజ్ఞానానికి ఆశకి సంకేతం. అది ఒక పెద్ద గోడౌన్ మన ధాన్యం బస్తాలు, బియ్యం బస్తాలు వేసిన గోడౌన్ లోకి ఎలుక పిల్ల ప్రవేశించింది అనుకుందాం దానికి సహజంగా sweet shop లోకి వెళ్ళగానే మనకు కూడా sweet తినాలని అనిపిస్తుంది sweet shop తినాలని మనకు అనిపించదుగా తినలేం కూడా కానీ స్పృహ ఎలుకకు ఉండదు. తింటూ తింటూ తింటూ ఉంటుంది ఎంత తింటున్నదో దానికి తెలియదు ఎందుకు తింటున్నదో తెలియదు దాని పొట్ట చిన్న పొట్ట తింటూ తింటూ తింటూ పొట్ట పగిలి మరణిస్తుంది ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది. అంటే ఆశయా బద్ధతే లోకే కర్మణా బహు చింతయా ఆశలు ఉండాలి రేపు ఉంటాము అనే ఆశ మనకు ఉండాలి ఉంటేనే ఇప్పుడు ఆనందంగా ఉండగలం కదా. ఎవడో జ్యోతిష్కుడు వచ్చి రేపు ఏం లేదండి ఇవాళ మీది ఆఖరి రోజు అని చెప్పాడనుకోండి ఇప్ప-ఇప్పటి నుంచే నిద్రపోము ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం తెల్లవారి జ్యోతిష్కుడికి రాదు అని చెప్పి మనం వెళ్ళిపోతాం అది వేరే సంగతి. కాబట్టి ఆశ ఉండాలి రేపు అనేది ఉన్నదని దాంట్లో మనం ఉంటామని మనకు ఉండాలి రేపు లేకపోతే వేళ పని చేయం రేపు కోసం పని చేస్తాం రేపు కోసం దాచి పెడతాం రేపును ఊహించుకుంటూ వేళ జీవితాన్ని గడుపుతాం కాబట్టి ఆశ ఉండాలి ఆశయం ఉండాలి ఆదర్శం ఉండాలి ఆచరణ ఉండాలి నాలుగు ఉండాలి. కానీ ఆశ ఉండటంతో పాటు నిరాశ ఉండకూడదు అంటే depression ఉండకూడదు దురాశ ఉండకూడదు పేరాశ ఉండకూడదు అవన్నీ ఉన్నాయా దుర్దశ ఏర్పడక తప్పదు. పురాణాలు పద్దెనిమిది పురాణాలు చదవండి భాగవతం చదవండి ఆశ పోతులైనటువంటి వాళ్ళు ఆశోపహతులైనారు ఆశ లేని వాడు భగవంతుని యందు మనస్సు లగ్నం చేసిన వాడు ప్రహ్లాదుడు గాని అంబరీష్డు గాని ఇంకోడు గాని భక్త బృందాలు అన్నీ కూడా కడకు భగవంతుణ్ణి తమ దగ్గరికి అవి రప్పించుకున్నాయి. గజేంద్ర మోక్షం ఏమిటి? పరమేశ్వరుడు పరిగెత్తుకొనే వాళ్ళ దగ్గరికి ఆయన దగ్గరికి వచ్చాడు అట్లా మానవ జీవన నిర్మాణంలో ఆశ అనేటువంటిది అజ్ఞాన భూమిక లో చాలా ప్రాతిపదిక that is a base. అందుకనే వినాయకుడి బొమ్మ కొనుక్కునేటప్పుడు మొన్న-మొన్ననే నేను మా lift లో వెళ్తున్నాను చిన్న పాప ఐదేళ్ల పాప తండ్రి ఇద్దరూ వినాయకుడి బొమ్మ కొనుక్కొని వస్తున్నారు. అమ్మాయి ఏంటుంది నేను వినాయకుడిని మోస్తాను నాన్నగారు నా చేతికి ఇవ్వండి అంటుంది. ఇంట్లోకి వెళ్ళి పూజ అయ్యేదాకా నువ్వు మోయకూడదమ్మా ఆయన భయం ఏంటంటే పడేస్తే పగిలిపోతే మళ్ళీ బజారు వెళ్లాలని. సరే అమ్మాయికి అది మోయాలి అని కన్నంతా దాని మీద ఉంది ఆయనకు కన్నేం లేదు డబ్బు ఇచ్చాడు సంచిలో పెట్టుకున్నాడు తెస్తున్నాడు చూస్తున్నది. తన lift పైకి వచ్చేలోగా ఏమన్నదంటే నాన్నగారు ఈ-ఈ బొమ్మలో ఎలుక లేని వినాయకుడు వచ్చాడు వినాయ-- ఎలుక లేదు నేను పూజ చేయనంది పిల్ల. ఎందుకు అనంటే మా teacher చెప్పింది వినాయకుడు కొనేటప్పుడు ఎలుక లేకుండా కొనుక్కోకూడదు అని నిన్న పొద్దున్నే చెప్పి వాళ్ళు సెలవిచ్చారు. అనేప్పటికి ఆయన గుండె గుభేలుమంది మళ్ళీ బయట కిందకి దిగాడు. అంటే ఎలుకకి వినాయకుడి జీవితంలో ఎంత ప్రాధాన్యత ఉన్నదో అది ఆశకి ఆశపోతు తనానికి అజ్ఞానానికి ఎంత, చూడండి అది ఎందుకు ప్రవేశిస్తుందో ఒక ఇంట్లో ప్రవేశిస్తుంది ఎలుకని పట్టుకోవటం కష్టం పామును పట్టుకోవడం చాలా తేలిక. ఇంట్లోకి పాము పిల్ల వస్తే ఎక్కడో ఒక చోట దొరుకుతుంది ఎలుక పిల్ల దొరకదు. మనం చాలా హై-హైరాణ పడిపోయి ఇంట్లో ఉన్న వస్తువులు మనకు పగిలిపోతాయి తప్ప ఎలుక మాత్రం దొరకదు చివరికి బోను పెట్టేదాకా అంతే కదా. అజ్ఞానం కూడా అంత తేలికగా పోయేది కాదు కాబట్టి అజ్ఞానం మీద స్వారీ ఎవరు చేయగలరు అంటే ఈయన చేయగలడు. ఇంకొక అద్భుతమైన పార్శ్వం ఉంది అది వేళ మన పిల్లలకి చెప్పాలి. అదేమిటంటే కథ మనకు తెలిసిందే వినాయకుడి కథ మనం చదివిందే. కుమారస్వామి కి గణేషుడికి పోటీ పెట్టినప్పుడు ఎవరు ముందు నది స్నానం చేసి వస్తే వాళ్ళకి ఆధిపత్యం ఇస్తాం అన్నప్పుడు. కుమారస్వామి కాస్త ఆయన stylish గా ఉంటాడు light body మామూలుగా ఉంటాడు పైగా ఆరు తలకాయలు పన్నెండు కళ్ళు అండ్ ఎటునుంచైనా navigate చేసుకొని వెళ్లిపోగలడు. తర్వాత వాహనం ఏమో మయూర వాహనం నెమలి బ్రహ్మాండంగా fast గా వెళ్ళిపోతుంది అది. ఇన్ని ఉన్నటువంటి తమ్ముడితో అడుగు వేస్తే అడుగు వేయటానికి భయపడేటువంటి అన్నగారు పోటీ పడాల్సి వచ్చింది. మరి ఏం చేశాడు ఆయన? కానీ ఆయనకి సునిశ్చితమైన బుద్ధి ఉన్నది, వినయం ఉన్నది, సమర్పణ ఉన్నది, శరణాగతి ఉన్నది. ఎవరిని శరణాగతి పొందాలి అంటే తనువుకి కారణమైన తన తనువుకి కారణమైన తల్లిదండ్రులను మించి మరొక దైవం ఉన్నదన్న స్పృహ ఆయనకు లేనే లేదు. కనుక కట్టెదుట శివపార్వతులు ఇద్దరూ కూర్చొని ఉండగా వినయంగా నమస్కరించి నా పరిమితులు, నా బలహీనతలు, నాకున్నటువంటి అశక్తులు మీకు తెలియనివి కావు తెలిసి మీరు ఇటువంటి పరీక్ష పెట్టారే మరి అయినా నేను చేయాలి పరీక్షలో పాల్గొనాలి కదా నాకు తోస్తున్నది ఒకటే మీ ఇద్దరి పాదాలు సర్వ తీర్థాలకి మించినటువంటివి. ప్రపంచంలో పారుతున్నటువంటి నదీనదాలు అన్నీ కూడా మీ పాద చలనంలో నుంచి పుట్టినవే గనుక నదులు బయా--బయట కనిపించే బాహ్యమైన నదులు మీ ఇద్దరి రెండు పాదాలు సర్వనదీ తీర్థాలు వీటికే నేను నమస్కరించుకుంటా అని దండం పెట్టి మూడు ప్రదక్షిణలు చేశాడు. చేస్తే ఏమైంది అంటే కుమారస్వామి ఎక్కడ స్నానం చేసి బయటికి వచ్చాడో అప్పటికే గణేషుడు స్నానం చేసి వెళ్లిపోవడం మొదలు పెట్టాడు. ఆయనకు అర్థం కాలే, మయూర వాహనంలో ఉన్న మయూరం యొక్క వేగం తగ్గిందా? ఎలుక వేగం పెరిగిందా? ఆయన ఆలోచనలో పడిపోయాడు. లోగా ఇక్కడ పని అయిపోయింది. మళ్ళీ తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేప్పటికీ అమ్మగారు అక్కడ నుంచుని ఉన్నారు. ఓటమిని అంగీకరించవలసి వచ్చింది. ఇవాళ ఇది మన పిల్లలకు గాని మనకి గాని మనం కూడా దాన్ని నుంచి నేర్చుకోవాల్సింది. కథ ఏమిటి పక్కన పెట్టండి, ఏదో నీతి చెప్పాలి గనుక కథ చెప్పారు. తల్లిదండ్రులను మించినటువంటి దైవం లేదని. తల్లిదండ్రులకి ఇద్దరికీ గనక నమస్కరిస్తే మనం అనుకుంటాం వంగటానికి బద్ధకిస్తాం. మళ్ళీ పాదాలు దొరుకుతాయా? మళ్ళీ బొమ్మలు దొరుకుతాయా? శరీరానికి, జన్మకి, ఇటువంటి ఉత్తమమైన జన్మకి కారణమైన తల్లిదండ్రులను మించినటువంటి దైవతం మరొకటి ఉన్నదా అని ప్రశ్నించినప్పుడు లేదు అన్నదే సమాధానం. కాబట్టి ఇవాళ మన పిల్లలకి పెద్దలకి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు పిల్లలకి నేర్పండి. వంగి చక్కగా నమస్కారం చేసేటువంటి ఒక సంస్కారాన్ని వాళ్ళకి నేర్పండి. దానివలన వాళ్ళు రాబోయేటువంటి కాలంలో ఎక్కడైనా సరే కష్టం వచ్చినప్పుడు వంగగలిగి దేనికి లొంగని, పొంగని, కుంగని ఒక అద్భుతమైనటువంటి స్థితిని వాళ్ళు సంపాదించగలుగుతారు. దానిలో సంస్కారం ఉంది, సంస్కృతి ఉంది, ఒక జాతి యొక్క ఆత్మ ఉన్నది, ఆత్మకు ఉన్నటువంటి ఒక ప్రాణం ఉన్నది, అన్ని చలనాలు ఉన్నాయి కాబట్టి ఇది పరమాద్భుతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి గాథ. అంటే చూడండి ఇటు ఏనుగుని, నక్షత్ర మండలాలని, భూగోళాన్ని, ప్రకృతిని, భాద్రపద మాసంలో మనం ప్రకృతికి నమస్కారం చేస్తున్నాం. ప్రకృతిని తీసుకు వచ్చి పరమాత్మతో కలుపుతున్నాం. రెండింటిని సమన్వయం చేస్తున్నాం. సత్యం సమృద్ధిగా ఉండాలి, నదీనదాలు పల్లవించాలి, ప్రవహించాలి, పారాలి, ఏరులై పారాలి, ముక్కారు పంటలు పండాలి. అనేకం పండితే అన్నం బహు కురువీత అన్నది తైత్తిరీయోపనిషత్. అన్నం బహు కురువీత, అన్నం ఉంటే అన్నమయ కోశం ఏర్పడుతుంది. దానిలో నుంచి మనోమయ కోశం, దానిలో నుంచి ప్రాణమయ కోశం, దానిలో నుంచి విజ్ఞానమయ కోశం, దానిలో నుంచి ఆనందమయ కోశం ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి ఒక్క ఒక్క మెతుకుని కూడా మనం కింద పడేయకూడదు. మెతుకుని కింద పడే
YouTube · audio

Sri Ganapathi tatva vaibhavamu — Part 2

Home

Sri Ganapathi tatva vaibhavamu — Part 2

Source: SathyaSai Seva Sadan on YouTube

0:00 / 33:11

More in this series

Sri Ganapathi Tatva Vaibhavam

3 episodes · 1 hr 24 min

  1. 33 min 1

    Sri Ganapathi tatva vaibhavamu — Part 1

  2. 33 min 2

    Sri Ganapathi tatva vaibhavamu — Part 2

    Now playing
  3. 18 min 3

    Sri Ganapathi tatva vaibhavamu — Part 3