Skip to content
Transcript తెలుగు
ఉపా అంటే దగ్గరగా నిషత్ అంటే కూర్చొని ఎంత దగ్గరగా తల్లి చూడండి తన బిడ్డని గుండెలకు పొదువుకొని ప్రేమించి లాలించి పాలించి పోషిస్తుంది తనకు చాలా అతి సన్నిహితంగా ఉండేది ఎవరు అంటే తన కడుపున పుట్టినటువంటి బిడ్డే తాను పెంచిన బిడ్డే మరొకరు కాదు అట్లాగే సర్వ బ్రహ్మాండ పాండేశ్వరి అయినటువంటి అమ్మవారు జిల్లెళ్ళమూడి అమ్మ ఒక కుక్కని ఒక పందిని ఒక మనిషిని ఒక పాకి పిల్లని ఒక జ్ఞానిని ఇంత సమత్వంగా ఎలా చూడగలిగింది అంటే కేవలం అనుకుంటే వచ్చేది కాదు ఇది చూపించటానికి ఆమె జగత్తులోకి వచ్చింది గనుక అమ్మ ప్రాతఃస్మరణీయమైనటువంటి ఒక మహా మహా మణిమాన్విత మూర్తిగా మనం భావన చేయాలి అందుకే సత్యసాయిబాబా వారు ఒక ఉపదేశం ఇచ్చారు ఒక మార్గం చెప్పారు ప్రతి గృహిణి ప్రతిరోజు ఒక పిడికెడు బియ్యం మీరు వండుకుంటున్న దాంట్లో పోయండి అన్నం వండి అలా ఉంచండి బియ్యం క్యారీది బాగా అయిపోయింది మన వల్ల కాదు మనకే సక్రమంగా లేదు మన వరకు పెట్టగలం కాకుండా ఒక్క పిడికెడు బియ్యం గనక గింజలు గనక మనం వేయగలిగినట్లైతే మనకసలు గింజ అవసరమే లేని జన్మే ఉండదు దాని కోసం ప్రయత్నించాలి ఒక్కటి మనం గనక చేయగలిగినట్లైతే నువ్వు ఎన్ని వస్తువులు ఇవ్వు వస్తువులు కూడా మాసిపోయేవే కూలిపోయేవే కాలిపోయేవే కానీ ఒక జీవుడు ఐదు కోశాలు నిలబడటానికి మూల హేతువైనటువంటి అన్నాన్ని గనక మనం దానం చేసుకోగలిగినట్లయితే అంటే పెట్టగలిగినట్లయితే నీ చేతే నువ్వు పెట్టుకో అన్న అమ్మ మాట మనం గుర్తు పెట్టుకోవాలి అలాగే భగవాన్ రమణ మహర్షి అన్నట్లుగా అమ్మ కూడా ఒక మాట అనేది మీరు అనుకున్నది ఏదీ జరగదు రా ఏది ఎట్లా ఎప్పుడు జరగాలో అది అట్లాగే జరుగుతుంది ఒక్క విషయం గనక నువ్వు గట్టిగా నమ్మినట్లయితే నువ్వు ఎవ్వడి మీద ఆధారపడి ఇది అవుతుందా కాదా నాక్షేత్రం ఎప్పుడు పోతాడు కుజుడు ఎప్పుడు తప్పుకుంటాడు వాళ్ళు ఏం తప్పుకోరు వాళ్ళ దారి వాళ్ళదే మన దారి మనదే అందుకే బాబా ఒక మాట అన్నారు ఏమి నవగ్రహాలు వాటి దారిన వాటిని పోనివ్వండి వాటి గమనాన్ని మీరెందుకు నిరోధిస్తారు పరమేశ్వరుడి అనుగ్రహం గనక మీ దగ్గర ఉన్నట్లయితే నవగ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఉండదు అని నిర్వివాందంగా సత్యసాయిబాబా అన్నారు అమ్మ కూడా అదే అన్నది కావలసినంత భగవంతుడి అనుగ్రహం రా అది ఉంటే ఏముంది అంతా బాగుంటుంది అది ఇది వదులుకొని గ్రహం గ్రహం అని వెంబడి పడతామే అన్నీ ఉన్నా ఆగ్రహాన్ని మాత్రం వదులుకోలేకపోతున్నావేంది గ్రహాల మీద కూడా మనకు ఆగ్రహం వస్తుంది శని ఎప్పుడు వదులుతుందో చూశారా ఇప్పుడే నాకే రావాలి అందరికీ వస్తాడు ఆయన రాడు ఆయన వెళుతుంటే దారిలో మనం కూడా ఉన్నాం ఇద్దరం కలుసుకున్నాం ఒక వాడి దారికి మనవడ్డు అనుకుంటా మీకు ఒక చిన్న కథ చెప్తాను లాయర్ గారి కథ లాయర్లని అఫెండ్ చేయడం కాదు లాయర్ కి పాత్ర అటువంటిది ఏం చేస్తాం పాపం ఆయన రోజూ చక్కగా కేసు గెలవటానికి వెళ్ళేవాడు కోర్టు కోర్టు వేసుకొని ఎందుకు వెళ్తాడు తన వాదన గెలవాలని తన క్లయింటు గెలవాలని తద్వారా కాస్త ఫీజు బాగా వస్తుందని ఈయన నల్ల కోటు వేసుకొని మెట్లు దిగి కిందకి రాగానే కారు దగ్గర ఒక నల్ల పిల్లి కూర్చొని ఉండేది చూసేవాడు పిల్లి ఏదైతే ఈయన ప్రయాణం లేదుగా అయిపోయేది ఇట్లా నాలుగు రోజులు ఐదు రోజులు అయిపోయిన తర్వాత వాచ్ మాన్ ని పిలిచాడు పిలిచి ఏంట్రా నేను కోర్టుకి ప్రతిరోజు వెళ్లే టైము పిల్లి వచ్చే టైం ఒకటే అవుతుంది నేను ఎప్పుడు వెళ్తానో నీకు తెలుసు కదా పిల్లిని బయటకు పంపు కొట్టు రేపటి నుంచి రాకుండా చూడు అంటే వాడు లాయర్ గారి లాగా చదువుకున్నవాడు కాదు వాడన్నాడు బాబయ్యా అంతా బానే ఉంది పిల్లి కూడా అనుకుంటుందేమో సరిగ్గా నేను వచ్చేటపటికి లాయర్ గారు దిగుతాడు ఏమిటి రోజూ ఈయన దర్శనం తప్ప నాకింకో దర్శనమే లేదా అని అది కూడా ఆరోచిద్దామా అని వాచ్ మాన్ అన్నాడు అంటే ఇక్కడ ఎవరికీ ఎవరూ అడ్డు కాదు అందరం co current గా ప్రపంచంలో ప్రయాణం చేయాలి there is no scope for counter current అందుకనే అమ్మ అందరినీ తన దగ్గరకు తీసుకోగలిగింది మనం కొందరిని మాత్రమే దగ్గర చేసుకోగలం మనకు ఎవరన్నా ఒక మాట అంటే వాడిని శత్రువుగా పరిగణిస్తాం declare చేస్తాం వాడు మన పనికి రాడు remove delete అంటాం అయిపోయింది ఇప్పుడు delete command ద్వారా వాడు బయటడేయటం మన జీవితం నుంచి పోతుంది పోగొట్టుకోవటం కష్టం కాదు రాబట్టుకోవటమే కష్టం రాబట్టుకోవటం కష్టం కాదు నిలబెట్టుకోవటం కష్టం నిలబెట్టుకోవటం ప్రపంచాన్ని నిలబెట్టుకోవాలి మన స్థితిని మనం నిలబెట్టుకోవాలి రెండింటి మధ్య సమతుల్యాన్ని పాటించాలి అమ్మ చేసింది అదే తన గృహస్థాశ్రమ జీవితానికి తన అధ్యాత్మ సాధనకి లేదా ప్రపంచానికి సాధనా మార్గాన్ని ఉపదేశించేటువంటి బోధాకృతిగా ఉన్న స్థాయికి మధ్య ఎక్కడా వైరుధ్యం లేకుండా పరస్పర విరుద్ధమైన భావన లేకుండా ఘర్షణ లేకుండా అంత సమన్వయంగా సాగించింది మామూలుగా మనలాగా చదువు లేని అసలు చదువు లేత అన్నమాట జీవితాన్ని సంఘర్షణ నుంచి సమన్వయం వైపు సమన్వయం నుంచి సంతృప్తి వైపు సంతృప్తి నుంచి ఒక ఆత్మతృప్తి వైపు జీవుడు తన నడక సాగించాలి అలా సాగించకపోయినట్లయితే ఒక జీవితం వృధా అయిపోతుంది గనుక ఇవాళ జిల్లెళ్ళమూడి అమ్మ ఇచ్చే మహత్తర సందేశం ఒకటే ఇవాళ మనం పేపర్లలో చూస్తున్నాం మన ఇళ్లల్లో చూస్తున్నాం మన చుట్టూ ఉన్న సమాజంలో చూస్తున్నాం ఆకలికి అన్నం లేక రోడ్డు మీద మరణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది పెట్టేవాడు లేడు పట్టించుకునేవాడు లేడు పట్టించుకొని పెట్టి ఆదరించే వాడు లేడు అమ్మ వీళ్లందరినీ ఏదో ఒక చోట కూర్చి అన్నం పెట్టమనలా ఎక్కడికక్కడ రోజుకొకడికి ఒక పూట ఒకసారి కనీసం ఒక్కసారైనా అన్నం పెడుతూ ఉంటే ఎప్పుడైతే వాడి డొక్క నిండుతుందో కడుపు నిండుతుందో ఆలోచనలు పాజిటివ్ గా వస్తాయి.ఆలోచనలు ఎప్పుడైతే positive గా వస్తాయో కర్మలు మనం చేసే పనులన్నీ కూడా మంచితనంతో కూడి ఉంటాయి. అన్నం లేని వాడికి వేదాంతం చెప్పండి వాడు తిరగబడతాడు అన్నాడు వివేకానంద స్వామి. ముందు కడుపు నింపండి పుట్టపర్తిలో సత్యసాయిబాబా వారు canteen ప్రారంభం చేసి ఉన్నాడన్న మూడు మాటలు అన్నివేళలా గుర్తు పెట్టుకోవాలి. ఇది ఎందుకు పెట్టానో తెలుసునా? హాయిగా భోంచేసి విశ్రమించి తపస్సులోకి వెళ్ళమని చెప్పటానికి కాదు. నా దర్శనానికి రావటానికి ముందే మీ కడుపు నింపుకొని వచ్చి అక్కడ కూర్చుని భగవంతుడి యొక్క తలపుతో కాసేపు ఉండండి. అందుకోసమే ఏర్పాటు జరిగింది. శరీరం పోషణార్థం సాత్వికమైనటువంటి ఆహారం తినాలి గనుక అటువంటిది మాత్రమే ఇక్కడ ఇవ్వబడుతుంది గనుక నీ సాధనకి నీ తపస్సుకి నీ అంతర్ముఖత్వానికి అనుగుణమైనటువంటి ఆహారము ఇక్కడ ఇవ్వబడుతుంది గనుక దీన్ని ఇక్కడ స్వీకరించి తర్వాత దర్శనానికి రమ్మన్నారు. ఎందుకనంటే స్వీకరించకుండా దర్శనానికి వెళితే మన మనస్సంతా తినని అన్నం మీద పొందవలసిన ఆకలి తీరటం మీద ఉంటుంది తప్ప సాక్షాత్తు భగవంతుడు ఎదురుగా కూర్చున్నా ఈయన వాళ్ళ కుర్చీలో కూర్చోకుండా హాయిగా ముందు లోపలికి వెళ్లిపోతే బాగుండు అనుకుంటాం. కడుపు నిండిన తర్వాత హాయిగా నాలుగైదు గంటలు మన మనస్థితిలో మనతో మనం ఉండగలం గనుక మహాపురుషులందరూ కూడా అన్నానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అరుణాచలం వెళ్ళని వారి కోసం, తెలియని వారి కోసం ఒక్కమాట చెప్తాను. అరుణాచలం లో పదకొండు గంటలకి పొద్దున గంట కొడతారు. పదకొండు గంట కంటే ముందు పొద్దున ఏడు గంటలకల్లా ఆశ్రమంలో ఉన్నవారికి వారు breakfast సర్వ్ చేస్తారు. ఎందుకని అంటే అప్పటికే వారు గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకొని వస్తారు గనుక వెంటనే కడుపు నింపుతారు. పదకొండు గంటలకి అన్నం తిన్న తర్వాత ఇక నీ స్వాధ్యాయం చేసుకో, నీ భజన చేసుకో, నీ మాటలు మాట్లాడుకో, మౌనంగా ఉండు, నువ్వేం చేయాలో చేసుకో. మళ్ళీ సాయంకాలం నాలుగు గంటలకు ఒక glass పాలോ కాఫీయో ఇస్తారు. మళ్ళీ శరీరాన్ని కాసేపు నిలబెట్టి ఏడు గంటలకల్లా అన్నం పెడతారు. ఇది ఒక ఎత్తయితే ఇది లోపల ఉన్న ఆశ్రమ inmates, inmates కి. భగవాన్ ఒకసారి ఒక మాట వారు ఉండగా అన్న మాట ఏమిటంటే "మనమంతా తిన్న తర్వాత మిగిలిన అన్నం నారాయణ సేవ చేయకండి. మనకంటే ముందు వారు నారాయణుడిని తృప్తి పరచిన తర్వాతనే ఇక్కడ విస్తర్ట్లో వడ్డించమన్నారు." అది గత యాభై ఐదు సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ఒక పరమాద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమం. అరుణాచలం లో మనందరికంటే, శివుడి కంటే ముందు ఎవరు అన్నం తింటారంటే నారాయణ స్వరూపమైనటువంటి వీళ్ళు మాత్రమే అన్నం తింటారు. తర్వాతనే పదకొండు గంటలకి గంట కొడతారు. లోపల ఏం పెట్టబడుతుందో బయట వారు అదే తింటారు. ఏం తేడా లేదు. ఇవన్నీ ఉదాత్తమైనవన్నీ, అవన్నీ మహర్షి గనుక చేశారు, అవన్నీ బాబాగారు గనుక చేశారు, అవన్నీ జిల్లెళ్ళమూడి అమ్మ గనుక చేసింది అంటే, ఒకాయన అన్నాడు మహిమలు చేసి చేసి బాబాయ్య గారు దేవుడైపోయినారు అని. నా సమాధానం ఒక్కటే. దేవుడు గనుక మహిమలు చేయగలిగాడు. మనం చేయగలిగామా? మనంతట మనం ఉన్నదే ఇవ్వలేమే, వస్తువే ఇవ్వలేమే, ఎక్కడినుంచి సృష్టిస్తాం, ఏమిస్తాం, ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతాం? ఇది పరిమిత ఆవరణంలో జరిగేటువంటి ఒక కలాపం మాత్రమే. అపరిమితమైన అనంత మహిమా శక్తి స్వరూపిణి అయినటువంటి జగజ్జాని అయినటువంటి జిల్లెళ్ళమూడి అమ్మ మనకు నేర్పిన ఒకే ఒక్క పాఠం కడుపు నింపండి, జీవితాన్ని పండించుకోండి. మానవజాతిని ఎత్తినందుకు దీనిని మించిన వ్రతం గాని, దీనిని మించిన దీక్ష గాని, దీనిని మించిన ఆధ్యాత్మిక కార్యక్రమం గాని, అసలు దీనిని మించినటువంటి మహత్వపూర్ణ కార్యక్రమమే లేదని జగత్తుకు ఉపదేశం చేసినటువంటి అమ్మ ఇవాళ భారతీయ గురుతత్వంలో ఆమె అన్నది "గురువు గురువు" అనేటువంటి ఒక మాటతో నలుగురిని చేర్చుకొని చుట్టూ తిరిగేకంటే అమ్మగా ఉండటమే నాకు ఇష్టం రా అన్నది. ఎందుకంటే గురువు దగ్గరకు చేర్-చేరాలి అంటే అనేక qualifications కావాలి. అమ్మ దగ్గరకు చేరాలి అంటే వాడు బిడ్డ అయితే చాలు అన్నది. ఎంత గొప్ప మాట! [అందరూ ఒకేసారి చప్పట్లు వాక్యం] గురువు దగ్గరికి వెళ్లాలంటే నువ్వు చదువుకున్నావా? కనీసం ప్రాథమిక చదువుకున్నావా? నువ్వు ఎప్పుడన్నా అసలు గురువు దగ్గరికి వెళ్ళావా? [ఒకరు దగ్గరగా జలుబు చేయడం] నీ మెడలో గంజి ఉందా? నువ్వు పొద్దున స్నానం చేశావా? ఇవన్నీ వర్ణానికి లోబడిన మాటలివి. అతివర్ణాశ్రమీచ ఇతి క్రమాత్ శ్రేష్ఠా విచక్షణ. అది. వరుసలో ఆమె బ్రహ్మచారిణి. ఎట్లా? పెళ్లయిందన్నారు, పిల్లలున్నారు, భర్తన్నారు, ఆయన కరణం గారు అన్నారు. ఎవరి మనస్సు ఎవరి చిత్తము అను-అనునిచ్చము కూడా బ్రహ్మము నందు మాత్రమే భ్రమిస్తుంటుందో, సంచారం చేస్తూ ఉంటుందో వారే బ్రహ్మచారులు, వారే బ్రహ్మచారిణులు. కనుక ఆమె బ్రహ్మచారిణి. [అందరూ ఒకేసారి చప్పట్లు] గృహస్తస్య, గృహస్తు ఇల్లుంది. అమ్మ పండగ, రేపు సంక్రాంతి. వాళ్ళ అమ్మ గనుక సంక్రాంతి నాడు ఉంటే, రేపు భోగి పండగ అనుకోండి. అమ్మ శరీరంలో ఉంటే ఆమె చేసే మొట్టమొదటి కార్యక్రమం ఏమిటంటే తమ పతిదేవుడి పాదాలకు నమస్కరించుకొని, తాళిబొట్టుని కళ్ళకు అద్దుకొని, "ఈ రెండూ ఎట్లాగైతే సమన్వయంగా ఒక్కటిగా ఇక్కడ హృదయ స్థానం దాకా నిలబడి ఉన్నాయో, అట్లేనా నా మనస్సు మీ యందు నిలకడ చెంది ఉండు గాక. శరీరం కాదు, పతి శరీరం కాదు, పతిలో ఉన్న బ్రహ్మము నందు స్థిరపడు గాక." కనుక పని ఆమె చేసి ఉండేది, చేసింది. ఎక్కడా తన భర్తను నిర్లక్ష్యం చేయటం గాని, దూరం- ఎంతోమంది మహాత్ములయంట ఆయన్ని దర్శనం చేసుకున్నారు. ఆయన్ని ఎవరూ దర్శనం చేసుకోలేరు. కానీ ఎన్నడూ ఆమె ఎవరిని ప్రథమ దర్శనం అంటే వాడినే దర్శనం చేసుకుంది. అమ్మా మంచి వ్రతం ఒకటి చెప్పంటే "పతివ్రతలకు వ్రతాలేం అక్కర్లేదు, పతికి చేసే సేవే వ్రతం" అందామె. మిగతా వ్రతాలన్నీ పైపైన భోజనాలు చేయటానికేనంది. అంటే అంత rational గా, అంత radical గా, అంత హేతుబద్ధంగా, అంత సాంప్రదాయకంగాఅంత వైశిష్ట్యంగా అంత గుంభనగా అంత గుప్తంగా అంత మర్మంగా బోధ చేసేవాళ్ళు అతి తక్కువ మంది ఆచరించి బోధించారు అమ్మ తాను ఆచరించకుండా ఏం చెప్పలేరు అలాగే అమ్మ తన జీవిత కాలంలో ఎదుర్కొన్నటువంటి అంటే మన దృష్టిలో ఎదుర్కొన్నది తన కూతురు మరణం హైమ మరణం దాన్ని ఎంత గంభీరంగా ఆమె తీసుకున్నది అని చూసినప్పుడు మామూలు స్త్రీమూర్తి మాత్రం అట్లా చేయలేదు అది అసంభవం తర్వాత తాను గురుస్థానంలో అమ్మ అయి కూడా గురుస్థానంలో ఉండి కూడా ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటే ఆమె చుట్టూ అమ్మా నీ గురించేదో రాస్తాము నీ గురించేదో చెప్తాము అంటే ప్రపంచం తెలుసుకోవలసి ఉంటే అదే తెలుసుకుంటుంది రా నువ్వు రాస్తేనో నువ్వు అంటేనో ఇక్కడ జరిగినవి తెలుస్తాయా ఎక్కడైనా నువ్వు ఒక పరిమళాన్ని దాచి పెట్టగలవా మూటగట్టగలవా లోపల పెట్టగలవా పరిమళం అంటూ ఉండాలే కానీ గాలి దాన్ని మోసుకుని వెళ్లి ఎక్కడెక్కడ కావాలో చేరుకుంటుంది పని నేను చేయొద్దు అనేది జిల్లెళ్ళ మూడమ్మ. ఇవాళ గురువులు అట్లా లేరు కాస్త నిన్న మొన్న జరిగిన రెండు మూడు ఘటనలు చెప్పు అందరికీ ఆనందం పంచు మొన్న ఏం జరిగిందో చెప్పు మా వల్ల ఏం జరిగిందో చెప్పు మాకు attribution ఇవ్వు అనే గురువులు చాలా ఎక్కువైపోయినారు అది దేశానికి ప్రమాదం గురువుల గురించి గురువు తనను గురించి తాను చెప్పమని అడగటం కంటే ఒక దౌర్భాగ్య స్థితి దేశంలో ఇది ఎన్నడూ లేదు ఇది రాకూడదు కూడా. జిల్లెళ్ళమూడి అమ్మ ఆమెకి ప్రచారం అవసరం ఉంది వాళ్ళు జిల్లెళ్ళమూడి వెళ్లాలంటేనే నిజంగా కష్టం మొన్న కారులో వెళ్తేనే అరవై ఏడులో ఎట్లా ఉందో ఇవాళ కూడా అట్లాగే ఉంది ఏం మార్పు ఎందుకు చెందలేదు అంటే అక్కడ వాళ్ళు ఏమన్నారో తెలుసా అందరూ ఏదో చేద్దామని వచ్చిన అమ్మ దీన్ని ఇలాగే ఉంచమంది అందుకని ఇలాగే ఉంచామన్నారు అది అంటే ఇల్లు ఇల్లులా ఉండాలి ఇల్లు హోటల్ అయిపోతే ఎట్లా ఇవాళ మనం మనం కోటి రూపాయలు పెట్టి ఇల్లుని హోటల్ గా చేసుకుని బ్రతుకుతున్నాం ఒక కృత్రక జీవనం అట్లా కాదు అందరం హాయిగా ఉండగలిగినటువంటి అందరి ఇల్లుగా అంటే కుల మత వర్గ వర్ణములు లేనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి సాధనా స్థితిగా ఒక సాధనాలయంగా అనుగ్రహాలయంగా పరిపూర్ణమైనటువంటి మానవతాలయంగా ఏర్పడినటువంటి జిల్లెళ్ళమూడి అమ్మ వలన అది నిజంగా పుణ్యక్షేత్రం అయింది అక్కడి వాళ్ళు అనేక గుళ్ళు రెండు మూడు గుళ్ళు ఏర్పడ్డాయి చుట్టూ అవి ఎందుకు అంటే ఎవరి ఎవరి సాధన ఒకడు మౌనంలో ఒకడు జపంలో ఒకడు తపంలో ఒకడు యోగంలో ఒకడు యాగంలో అనేకమందికి ఏర్పాట్లు జరగాలి గనుక అవి జరిగినాయి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పొందవలసింది ఒక్కటే జిల్లెళ్ళమూడి అమ్మ అందరి ఇళ్ళలో మనం ఒక పూట భోజనం చేయటం శరీరానికి చాలా అవసరం దానివలన శరీరంలో ఏర్పడిన అనేకానేక రోగాలు పోతాయి ఒకవేళ రోగాలు ఉన్నా దాని వలన ఏర్పడే భయం పోతుంది అమ్మే అన్నదిగా గడ్డలన్నీ బిడ్డ లేరని ఆమె అన్నప్పుడు మనం అనుకోలేమా మనకో చిన్న గడ్డ లాగానే దాన్ని ఏం చేద్దాం తట్టుకోలేము కానీ స్థితికి వెళ్ళాలి అందుకే యోగ తారావళి విచారణ జరిగినప్పుడు కేవల కుంభక యోగాన్ని గురించి కేవలం అతి కొద్ది మహాత్ములు మాత్రమే భారతదేశంలో ఉన్నారు ఒకరు శ్యామాచరణ లాహిరి రెండు సదాశివ బ్రహ్మేంద్రుడు మూడవది భగవాన్ రమణ మహర్షి భగవాన్ సత్య సాయిబాబా జిల్లెళ్ళ మూడి అమ్మ వీళ్ళే వీళ్ళ తర్వాత కేవల కుంభకాన్ని సాధన చేసి ప్రపంచానికి బోధించిన వాళ్ళు లేరు ఎట్లాగో ఒక రెండు నిమిషాలు చెప్తాను సదాశివ బ్రహ్మేంద్రులు ఒక్కరూ పొలంలో వెళుతుండగా వారొక గడ్డి వాము పక్క నుంచి వెళుతుంటే అక్కడ ఒక యువతి ఉన్న-ఉంటే దూరం నుంచి యువతి భర్త చూసి సాధువు ఎవడో అటు వెళుతున్నాడు అనుకొని కత్తి విసిరాడు కొడలి-కొడవలి విసిరితే ఆయన కుడి భుజం తెగిపోయింది తెగిపోతే ఇంక ఆయన పడిపోతాడు అనుకున్నాడు ఆయన కుడి భుజం తెగిపోయినా సరే నడుచుకుంటూ వెళుతున్నారు వీడు ఆశ్చర్యపోయినాడు దేనికంటే ఆయన నడిచి వెళుతున్నందుకు కాదు తెగినటువంటి చేయి నేల మీద పడకుండా గాలిలో వారితో పాటు వెళ్ళటం మొదలు పెట్టింది పరుగు పరుగున వెళ్లి కాళ్ళ మీద పడి నీ చెయ్యి నేను నరికానూ అంటే అప్పుడు చూసుకున్నారు ఓహో ఇదా అని ఇట్లా అనుకున్నారు అతుక్కున మళ్ళీ ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయినారు ఆయన అట్లాగే కావేరి నది ఒడ్డున కావేరి నది మధ్యలో ఇసుక తిన్నె మీద కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయినారు ఆయనకు తెలియదు ట్రాన్స్ లోకి వెళ్లారు వరదలు వచ్చినాయి వచ్చి మళ్ళీ కొత్తగా ఇసుక వచ్చి ఆయన్ని కప్పేసింది దానిలో ఆయన ఉండిపోయినారు చాలా నెలలు మళ్ళీ వరద తీవ్రత తగ్గిన తర్వాత ఇసుక మేట బయట పడ్డప్పుడు ఇసుక తవ్వుకుందామని ఎవరో వస్తే గడ్డపార వేయగానే రక్తం చిందితే ఎవరో ఉన్నారని చూస్తే అందులో సమాధిలో ఉన్నటువంటి సదాశివ బ్రహ్మేంద్ర స్వామిని క్షణాన మనం తలుచుకోవాలి కేవల కుంభక యోగంలో పరమ చర్మమైనటువంటి ఉత్కృష్ట స్థాయి అది అలాగే శ్యామాచరణ లాహిరి ఒక సాయంకాలం పూట తన భక్తుడైన శిష్యుడు అయినటువంటి ఒక డాక్టర్ వస్తే తన చేయి చాపారు పల్స్ చూసి నేను ఉన్నానో పోయానో చెప్పమన్నారు పల్స్ చూసి మీరిప్పుడే కదా ఉన్నాను అన్నారు గనుకే అడుగుతున్నారు కదా అంటే కాదు చూడు అని పల్స్ అందలేదు మరి ఏమైనాటు నేను ఉన్నట్టా లేనట్టా అన్నారు నాకు అర్థం కావట్లేదు అన్నారు ఇది నీ సైన్స్ కందేది కాదు ఇది కేవల కుంభక యోగం అన్నారు అంటే ప్రాణము మనస్సు రెండూ ఏకాగ్రం చేసి బ్రహ్మముతో అనుసంధానం చేసినప్పుడు శరీర భ్రాంతి పోతుంది శరీరం అనే స్పృహ కూడా పడిపోతుంది మామూలు అనస్థీషియా కాదది శరీరాన్ని ముంచెత్తేటువంటి అనస్థీషియా కనుక వాళ్ళకేం ఉండదు అలాగే నిన్న చెప్పుకున్న భగవాన్ రమణ మహర్షి సార్కోమా అలాగే ఇవాళ జిల్లెళ్ళమూడి అమ్మ చెప్పినటువంటి కడుపులో ఉన్నటువంటి క్యాన్సర్ గడ్డలు వీటితో పాటు 2003లో భగవాన్ సత్య సాయిబాబా వారు when he had a fall hip joint విరిగిపోయిందివెంటనే doctorలు operation చేశారు. చేసిన తర్వాత బాబా మీరు ఒక ఇరవై ఒక్క రోజులు నడవకూడదు అన్నారు. చూసి వచ్చిన doctorలకే ఆశ్చర్యం కలిగేలాగా అది అయిపోయిన మరుక్షణం బాబా గదిలో హాయిగా నడుస్తున్నారు, మామూలుగా నడుస్తున్నారు. మీరు ఇది చాలా జాగ్రత్త పడాలి అన్నారు doctorలు. దేని జాగ్రత్తకి దానికి ఉంటుంది అన్నలా వదిలేసేయండి అన్నారు. సుమారు నాలుగైదు నెలల తర్వాత కులువంత్ హాల్లో స్వామి చెప్పారు. వాళ్ళు రంపం పెట్టి తుంటిని కోస్తున్నప్పుడు, సుత్తులతో దెబ్బలు కొడుతున్నప్పుడు, వినటానికి మామూలు వాడైతే తట్టుకోగలిగేటువంటిది కాదు. ఇటువంటిది ఎవరికీ జరక్కుండా ఉండాలి అని అంటూ కానీ స్వామికి ఏమీ స్పృహే లేదు. అన్నీ తెలుస్తూనే ఉన్నాయి, ఏమీ కాలేదు అన్నారు. అది కేవలం కుంభకో యోగం. అది మనం కూడా సాధన చేయాలి. వినటం, మహాత్ముల్ని కాసేపు అనుకోవటం ఎందుకంటే మనకి చిన్న అననుకూలత ఏర్పడగానే గందరగోళ పడిపోతాం. రోజే paperలో ఏదో ఇట్లా గనక కుడి కన్ను అగిరిపోతే కుడి కన్ను cancer వచ్చినట్టున్న article రాయగానే వెంటనే cancer వాడి దగ్గరికి వెళ్ళటం. లేకపోతే ఇంకేదో తలనొప్పి వచ్చింది అనగానే ఇంకేదో brain tumor వచ్చింది అనుకోవటం. భయమే మనిషికి రోగం, భీతే మనిషికి బలహీనత. బలం ఏమిటి అంటే ఆత్మవిశ్వాసం. తాను ఎన్ని ఉన్నా, ఎన్ని ఊపులు ఊపినా, ఎన్ని ఋతువులు మారినా, ఎన్ని జంజామారుతాలు వీచినా మనకు ఇక్కడ ఇవ్వబడిన కాలం కంటే ఒక్క నిమిషం ముందు యమభటులు రారు. మరణం ఒక్కసారే, రెండు సార్లు జరగదు. మరణం జరగాలి, జరిగి తీరుతుంది. ఎవడున్నాడు ఇక్కడ? ఇటువంటి శరీరం తీసుకొచ్చాం గనుక ఏదో ఒకరోజు పోవలసిందే. కాబట్టి దీనిని గురించి విచారణ చేస్తూ, దీనిని గురించి విచారిస్తూ చితి భావనలోనే గనక ఉన్నట్లయితే చింతన ఎప్పుడు ఏర్పడుతుంది అన్నారు భగవాన్ బాబా. చితిని దాటండి, చింత దాటండి, చింతనలోకి వెళ్ళండి. నిత్య తత్వ చింతన విచార ధారే జల్లెల్లమూడి అమ్మ యొక్క సమగ్ర జీవితం. జీవితాన్ని మహోదధిలో అమ్మ జీవిత మహోదధి అని ఒక పుస్తకం ఉంది. దొరుకుతున్నది, అనుకుంటున్నా. దొరికితే own that book. హాయిగా చదవండి, కూర్చోండి. ఏముంది ఒక రెండొందలు, మూడొందలు pagesలు. అమ్మ జీవితం ఎలా గడిపింది. మనం ఉరికే పైపైన చెప్పుకున్నాం, లోలోతులకు వెళ్ళాలి. అతి బాల్యంలోనే అతిమానుషమైనటువంటి ఒక మహిమా ప్రదర్శనం కానీ, కారుణ్యం కానీ, వాత్సల్యం కానీ, క్షమా కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దేవతా మూర్తులంతా కూడా కాలగమనంలో ఒక జాతికి మార్గోపదేశం చేయడం కోసమే వారు వస్తారు గనుక అటువంటి మహా మహిమాన్విత మూర్తి అయినటువంటి జల్లెల్లమూడి అమ్మ యొక్క స్మరణ ఇవాళ నాకు ప్రత్యేకంగా ఆనందం కలిగిస్తున్నది. దేనిని నేను సంకల్పించుకున్నానో కొన్ని ఏళ్ల క్రితం, మా స్వామి అంటే బాబా వారు "సర్వ గురువుల మధ్య సమన్వయాన్ని సాధించుకోండి బంగారు. గురువు ఇట్లా, గురువు ఇట్లా అని చెల్లాచెదురు కాకండి. అందరిలో నన్ను చూడండి, నాలో అందరినీ చూడండి" అన్నటువంటి భావనకి ఇవాళ సత్యసాయి మహా పరినిర్వాణం తర్వాత కోటి సమితిలో జరుగుతున్నటువంటి గురు సమన్వయ ధార స్వామి యొక్క అనుగ్రహం తప్ప మరొకటి కాదు. [చప్పట్లు] మనం అనుకుంటే కాదది, స్వామే అనుకున్నారది. కనుకనే ఇది జరిగింది. ఊహించగలమా? సత్యసాయి కార్యకలాపాలలో ఒక జల్లెల్లమూడి అమ్మ గురించి, ఒక రమణ మహర్షి గురించి, ఒక శంకర భగవత్పాదుల గురించి, రాబోయే కాలాలలో ఇంకా ఇంకా ఎందరో మహిమాన్విత యోగులు ఉన్నారు. తాడేపల్లి రాజమహారణ్య శాస్త్రి గురి-- వారి గురించి ఎన్నిసార్లు మనం చెప్పుకున్నామో తనివి తీరలేదు. కాబట్టి గురు సమన్వయం చేయాలి, భావ సమన్వయం చేసుకోవాలి, జీవితాన్ని సమన్వయంగా అనుభవించాలి, సమగ్రంగా జీవించాలి, సంపూర్ణంగా ఆనందించాలి, పరితృప్తంగా ఉండాలి. దీనిని మించినటువంటి మానవ జీవితం మరొకటి కాదని, అటువంటి స్థితిలోకి పరాస్వరూపులైనటువంటి సత్యసాయి భగవానుడు మనందరినీ కూడా చల్లగా నడిపించు గాక. అటువంటి ఆనంద రేఖలు మనందరి యందు వికసించు గాక. రాబోయే తరాలకు స్ఫూర్తిమంతమైనటువంటి మహాత్ముల జీవితాలు, వారు నడయాడినటువంటి ప్రదేశాలకు వెళ్ళాలి. వెళితే వారు శరీరంలో లేకపోయినా వారు ఉన్నందున ఏర్పడిన అనుభవ తరంగాలు, అద్వైత తరంగాలు, అమృత తరంగాలు మానవుడికి ఇవ్వవలసినటువంటి energyని, ఇచ్ఛాశక్తిని, క్రియాశక్తిని, జ్ఞానశక్తిని ఏకకాలంలో అనుగ్రహ వర్దానం చేయగలవు గనుక అటువంటి ఆనంద తారక స్థితిలోకి స్వామి మనలను చల్లగా నడుపు గాక అని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
SSSMC · audio

Talk on Jillellamudiamma - 04

Home

Talk on Jillellamudiamma - 04

Source: Sri Sathya Sai Media Centre

0:00 / 23:01

More in this series

Talks on Jillellamudiamma

4 episodes · 1 hr 48 min

  1. 27 min 1

    Talk on Jillellamudiamma - 01

  2. 31 min 2

    Talk on Jillellamudiamma - 02

  3. 26 min 3

    Talk on Jillellamudiamma - 03

  4. 23 min 4

    Talk on Jillellamudiamma - 04

    Now playing