No transcript for this section.
ఈ డెబ్బై రెండు సంవత్సరాలు స్వామి ఏం చేశారు? తొలి పదహారేళ్ళు, మళ్ళీ పదహారేళ్ళు అంటే ఆ దేహానికి ముప్పై రెండు సంవత్సరాలు వచ్చేప్పటికి సర్వ ప్రపంచానికి అర్థమైపోయింది. ఎక్కడో ఆంధ్రదేశంలో కుగ్రామమైనటువంటి పుట్టపర్తిలో ఎవరో ఒక బాబా మహా మహిమాన్విత స్వరూపులట. చింత చెట్టు నుంచి మామిడి పండు తీస్తారట. మామిడి చెట్టు నుంచి మరొకటి ఇస్తారట. ఆది వ్యాధులు పోగొడతారట. కనుచూపు యొక్క వీక్షణ దీక్ష తోనే లోపల ఉన్నటువంటి సందేహాలకు సమాధానం ఇస్తారట. బహు చమత్కారి అట. పరిపూర్ణమైనటువంటి లీలా వినోది అట. అనేటువంటిది వాడ వాడలా అణువణువునా పాకినటువంటిది ముప్పై రెండు సంవత్సరాలు. స్వామి శరీరానికి ముప్పై రెండు ఏళ్ళు వచ్చేప్పటికి స్వామిని గురించి ప్రపంచం వేసుకున్న అంచనా, అనుభవించిన రీతి, ఈయన మహిమలు చేయటానికి వచ్చాడు అంతే. ముప్పై రెండు నుంచి మళ్ళీ పదహారు నలభై ఎనిమిది అంటే సుమారుగా దేహానికి యాభై వ సంవత్సరం వచ్చేప్పటికి సర్వమత సమన్వయ స్థూప నిర్మాణం చేశారు స్వామి. ఏ వయస్సులో, ఏ సమయంలో, ఏ పని చేయాలో, ఎట్లా చేయాలో మన బోటి వారికి భగవాన్ దిక్సూచిగా చేశారు. సంపాదన అక్కరలేని రోజు చేయనక్కర్లేదు. చేయవలసిన రోజు చేసి తీరాలి అంతే. ఈ రెండు ఎట్లా భౌతిక స్థితిలో సత్యమో ఆధ్యాత్మిక స్థితిలో కూడా మనిషి తన గురించి తాను ఆలోచించుకుంటూ ఉండాలి. ఆలోచించుకుంటూ పక్కవాడి గురించి ఆలోచించాలి. తర్వాత కొందరి గురించి ఆలోచించాలి. ఆపై అందరి గురించి ఆలోచించాలి. చిట్టచివరకు ఎవరిని గురించిన ఆలోచన అక్కర్లేదు. అన్ని ఆలోచనలు తనవిగా, తన ఆలోచనలు అందరివిగా మారేటువంటి రోజు వస్తుంది. దానినే యోగశాస్త్రంలో మూలాధార స్వాధిష్ఠాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్ర ప్రయాణంగా దానిని యోగశాస్త్రం నిర్వచిస్తూ ఉంటుంది. అటువంటి స్థితిలో సత్యసాయి భగవానుడు ఆ యాభై వ సంవత్సరం నాడు అంటే సర్వమత స్థూప నిర్మాణం చేసిన నాడే ఇందాక ఉమేష్ చంద్ర గారు చెప్పినట్లు మీరు రాబోయే కాలంలో ఇంత దగ్గరగా ఉండగలను అని మాత్రం అనుకోకండి. అరుగో అక్కడెక్కడో ఒక ఎర్ర స్పాట్ కనిపిస్తున్నది, కాషాయం చుక్క కనిపిస్తున్నది బాబా వచ్చారు అనుకోవాలి మీరు. అంతే కాదు ఎక్కడో ఈ కురులు గాలికి అల్లలాడినప్పుడు బాబా వచ్చారు లోపలికి వెళ్లారు అనుకోవాలి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారంతా ఈ పుట్టపర్తికి ఇన్ని లక్షల మంది ఎలా వస్తారు? బాబా ఏం మాట్లాడుతున్నారు? అనేలోగా ఇంకోటి కూడా అన్నారు. హెలికాప్టర్ పైనుంచి ఇక్కడ పుష్పవృష్టి కురుస్తుంది. ఇక్కడ నుంచి భారతదేశము స్వర్ణయుగానికి బీటు-- బీజం పడి సర్వ ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారుతుంది అని అనేకమైనటువంటి దివ్య ప్రకటనలు చేసినటువంటిది స్వామి fiftyeth birthday. చాలా ఉదాత్తమైనటువంటిది. కనుక మూడు పదహార్లు అయిపోయినాయి. ఈ నలభై ఎనిమిది నుంచి పదహారు అరవై నాలుగు. ఈ అరవై నాలుగులో స్వామి ఎంచుకున్నటువంటి కార్యక్షేత్రం విద్యారంగం. ఈ దేశంలో కడుపున తొమ్మిది పది మంది బిడ్డలను కన్నటువంటి దేశం అది ఒకనాటి జాతి. పదిమంది పిల్లలు కన్న తల్లి కూడా పదకొండవ వారాల అబ్బాయి మన ఇంటికి ఎవరు వస్తారు? నేను ఏమీ లేని వాడికి నేను ఒక ముద్ద ఎట్లా పెట్టగలను అన్నటువంటి ఒక దివ్యమైనటువంటి ఆలోచనతో సాగినటువంటి ఒక కుటుంబ వ్యవస్థ, ఒక జాతి, దాని సంస్కారం ఉంటే చివరికి బిడ్డలే మనకు అక్కరలేదు లేకపోతే హాయి అనేటువంటి రోజు వచ్చిందే. ఆ స్థితిలో స్వామి గమనించారు. ఏమనంటే విద్య గనక లేకపోయినట్లయితే ఈ ప్రపంచం అనర్థహేతువైపోతుంది. చివరికి ఏమీ కాకుండా అయిపోతుంది. విద్యను గనక మానవుడికి ఇవ్వక పోయినట్లయితే ఎట్లా? అని మళ్ళీ ఒక సనాతనమైనటువంటి ధర్మాన్ని బయటకు తీసుకొచ్చి విద్యను నమ్ముకోండి కానీ విద్యని అమ్ముకోకండి. విద్యను నేను ఫ్రీగా ఎలా ఇవ్వగలనో నేను రోల్ మోడల్ గానే చూపిస్తానని స్వామి విశ్వవిద్యాలయ స్థాపన చేశారు. ఆ అరవై నాలుగు ఏటకి విద్యారంగం మీద స్వామి దృష్టి సారింపబడ్డప్పుడు పరమాద్భుతమైనటువంటి దృశ్యం అది. స్వామి యూనివర్సిటీ ప్రారంభిస్తారు అన్నప్పుడు పుట్టపర్తి ఏమిటి? కుగ్రామంలో యూనివర్సిటీ ఏమిటి? అని నవ్విన వారికి ఆరోజు సాయంకాలం ఆ V K గోకాక్ బాం-- బెంగళూరు నుంచి వచ్చారు సాయంకాలం పూట. వచ్చి స్వామి దర్శనం ఇవ్వటానికి వచ్చి అక్కడ నుంచుంటే ఏమీ? అని అడిగితే, బాబా మన యూనివర్సిటీకి డీమ్డ్ యూనివర్సిటీ ప్రతిపత్తి వస్తూ ఇప్పుడే UGC నుంచి మాధురి షా లెటర్ పంపించారు అన్నప్పుడు, అవును బంగారు ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ డూమ్డ్ యూనివర్సిటీస్ అయిపోయినాయి. ఇది ఒక్కటే డీమ్డ్ యూనివర్సిటీ అన్నారు స్వామి. అంటే ఏ విద్య అయినా సంపాదన వైపు అది ఎలాగూ దారి తీస్తుంది. సంసారాన్ని నడపటానికి అది అవసరమే కానీ ఆత్మని ఎరగటానికి డిగ్రీ పనికిరాదు. ఆత్మని ఎరగటానికి కెమిస్ట్రీ పనికిరాదు. మ్యాథమెటిక్స్ జీనియస్ వాడు ఆత్మని ఎరగలేడు. కానీ ఆత్మను ఎరిగిన వాడికి మ్యాథమెటిక్స్ వస్తాయి, భాషలు వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి ఎరగవలసినటువంటిది ఏమిటంటే ఆత్మను ఎరగాలి. చదువులన్నీ చదివి చావంగానేటికి చావు లేని చదువు చదువవలయు. ఆ చావు లేని చదువు దేనికి సంబంధించింది అంటే దేనికి చావు లేదో దానికి సంబంధించినది. ఈ శరీరమా నశించిపోతుంది. ఇవ్వాళో, రేపో, మరనాడో ఎప్పుడో పోతుంది అది. ఈ పోయేదాని విద్య పొట్టను మాత్రం నింపుతుంది. పోనిది ఏదైతే ఆత్మ ఉన్నదో ఆ విద్య అజరము, అఖండము, అనంతము, నిత్యము, సత్యము, శాశ్వతము, నిరంతరము, నిరంజనము, నికేతనమైనటువంటి స్థాయిలో జీవుణ్ణి పరమోత్కృష్ట స్థాయికి తీసుకు వెళుతుంది గనుక ఈ ఆత్మవిద్య విశారదత్వాన్ని బోధించాలి. ఆత్మవిద్యని ఎలా పట్టుకోవాలి? నేలమీద ఉండి కొమ్మను పట్టుకోవాలి. కొమ్మను పట్టుకున్న తర్వాత నేల వదిలిపెట్టాలి. అంతే కదా! కనుక భౌతికమైనటువంటి విద్యతో పాటుగా ఆత్మవిద్యని అంటే శాస్త్రగతమైనప్రామాణికమైన ఋషి ప్రోక్తమైన వేద సంభావ్యమైనటువంటి దివ్య భావననంతా కూడా ఒక మానవీయమైనటువంటి మానవతా స్ఫూర్తిని గనక ఆ విద్యకి అద్దకపోయినట్లయితే, మానవత్వం లేకపోయినట్లయితే ఒక doctor గా ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళి మానవత్వం లేకపోయినట్లయితే ఆ doctor ఉండేమి పోయేమి. అందుకనే స్వామి అన్నారు ఒక surgeon butcher గా ఉండకూడదు surgeon గానే ఉండాలి. దేనిని కొయ్యాలో దానిని కొయ్యాలి, ఏదోటి కోసేయాలి అనేది కొయ్యకూడదు. అది ప్ర-- స్వామి ప్రత్యేకమైనటువంటిది. అలాగే ఒక engineer మానవతా కోణం లేని engineer ఒక corrupt engineer ఈ ప్రపంచానికి లేకపోవటమే మంచిది. అలాగే విద్యని communicate చేయలేని teacher తనను తాను సమర్థవంతంగా equip కాని teacher ఈ ప్రపంచానికి బరువు. వీటన్నింటికీ మూలం ఏమిటంటే అవిద్యే, అజ్ఞానమే, అనాచారమే, అస్పష్టతే, ఆత్మవిద్యా విధానం తెలియకనే. కనుక స్వామి మానవతా విలువలతో కూడిన బోధ ఏమిటి ఒక syllabus తయారు చేశారు. మామూలుగా లోకంలో తిండి తినటానికి కావలసిన degree వస్తూనే దానికి అసలు దాన్ని కనుగొనవలసినటువంటి ఆత్మవిద్యని పట్టుకునేటువంటి దారి కూడా చూపించారు. అవన్నీ కూడా సత్యసాయి educational system లో ప్రధాన భూమిక. అందుకనే స్వామి student ని ప్రపంచంలో ఏ గొప్ప university నుంచి వచ్చినటువంటి student ని వాళ్ళిద్దరినీ పక్కనబెట్టి గనక ఒక రెండు గంటలు వాళ్ళిద్దరితో మాట్లాడినట్లయితే స్వామి student కి అన్నీ తెలుసు. గొప్ప university లో చదువుకున్న వాడికి తాను ఏం చదువుకున్నాడో అంతవరకూ బాగా తెలుసు అంతే. ఏం చదివాడో తెలుసు, ఇతనికి అన్నీ తెలుసు ఆడుతాడు, పాడుతాడు, రాస్తాడు, గీస్తాడు, కూస్తాడు అన్నీ చేస్తాడు. ఎట్లా చేస్తాడంటే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి శక్తితో అనునిత్యము కూడి ఉన్నాడు గనుక తాను పరమాత్మ శక్తిలో ఒక భాగమైనాడు గనుక ఒక ఉత్తమ విద్యార్థిగా జీవితాన్ని గడుపుతాడు. ఉత్తమ విద్యార్థి అయినటువంటి వాడే ఉత్తమ వ్యక్తిగా మారుతాడు. ఉత్తమ వ్యక్తిగా మారిన వాడు మాత్రమే సమాజానికి సేవ చేయాలి అనుకుంటాడు. ఆ సమాజానికి ఎవరు సేవ చేస్తారో వాడు మాత్రమే మాధవ స్థానానికి మాధవుడికి సన్నిహితంగా వెళ్ళేటువంటి ఒకానొక స్థితికి వెళతాడు. అరవైనాలుగు అయిపోయింది. అరవైనాలుగు plus పదహారు ఎనభై. ఎనభై ఏళ్ళ శరీరానికి ఆ వచ్చే పదహారు ఏళ్ళలో స్వామి సారించిన దృష్టి వైద్యరంగం మీద. "వైద్యో నారాయణో హరిహి" అన్నటువంటి ఒక భావన. ఒక వాణిజ్యపరమైనటువంటి కోణమే ప్రధానమైనటువంటి స్థితి ఏర్పడినప్పుడు, వృత్తి విద్యలో వైద్య వృత్తిలో నిపుణత్వాన్ని సాధించిన ప్రతివాడు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు స్వామి ఒక్కమాట అన్నారు "నూకలకి రూకలకి అమ్ముడుపోయే వాడికి అవే దొరుకుతాయి. అది అందరికీ పంచాలన్న వాడికి పరమాత్మ దొరుకుతాడు. వాడికేం లోటు ఉంటుంది" అన్నారు స్వామి. సత్యం అది. దానికి ఉదాహరణ మన ముందు కూర్చున్న ఉమేష్ చంద్ర గారే. మరొకళ్ళు ఎక్కడో వెతకక్కర్ల. చరిత్రలో వీళ్ళు భాగం కావాలి. ఎందుకంటే ఇది నువ్వు చేయొద్దు అంటే చే-చేస్తే ఏమవుతుంది అనుకోల, చెయ్యను అంతే. యువకుడు. అనేక aspirations ఉంటాయి. ఏమో ఈ స్వామి వాళ్ళు అన్నారు గానీ ఏమవుతుందో భయం లేదు. అటువంటి ఆ స్థితి ఉన్నందువల్లనే ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి cardiologist లో number one స్థానానికి ఉమేష్ చంద్ర గారు ఎలా వెళ్లగలిగారు? అంటే పరమేశ్వరుని యందు ఉన్న నమ్మకం, ఆ ఆజ్ఞను పాటించటం, ఆ పాటించిన దాని వలన తన జీవితం ఎంత ఆనందమయం అయిందో అనుభవించటం, అటు తన వృత్తికి, ఇటు కుటుంబానికి సేవ చేయటం, ప్రేమించగలగటం అలాగే ఇక చాలు అనుకున్నప్పుడు సమాజం వైపు వెళ్లగలగటం, ఇదంతా ఎవరి అనుగ్రహం? సత్యసాయి భగవానుడి అనుగ్రహం. ఎక్కడో foreign లో ఉన్న పదిహేను పేర్లు చెప్పకండి. మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో దివ్యత్వాన్ని కూడా మనం గమనించాలి. ఆ గమనించినట్లయితే మనకు అనేక విషయాలు అర్థమవుతాయి. కాకపోతే మనం స్వామి గురించినటువంటి ఈ వైద్య వృత్తిలో ఒక్కళ్ళో ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు చెప్పారు, ఎక్కడో మనకు తెలియని వాళ్ళు వాళ్ళ పేర్లు యాభై ఘనపడుతూ ఉంటాయి. అది మాత్రమే కాకుండా ఒక్కొక్క ఉదాహరణ తీసుకున్నట్లయితే స్వామి super speciality hospital కట్టినప్పుడు మీ దగ్గర స్వామికి సంబంధించిన literature చదివిన వాళ్ళకి తెలుసు, చదవని వాళ్ళ కోసం చెప్తున్నాను. స్వామి hospital ఒక birthday నాడు announce చేశారు. next birthday కి super speciality hospital వస్తుంది అని. చిన్న కుగ్రామానికి అసలు super speciality hospital బాబా ఎందుకు తలపెట్టారు? అసలు super speciality hospital కి ఎంత డబ్బు కావాలో బాబాకు తెలుసునా? ఇట్లా మన ఆలోచనలు సాగినాయి. ఒకరోజున బాబా trust account లో కేవలం ఒక వెయ్యి రూపాయలే ఉన్నాయి. మరునాడు ఒక మేస్త్రీ తాపీ మేస్త్రీకి కూడా కూలి ఇవ్వటానికి చాలని పరిస్థితి అది. ఆ సమయంలో కల్నల్ జోగా రావు గారు నెమ్మదిగా స్వామి దగ్గరికి వెళ్ళి, "స్వామి ఏమనుకోవద్దు bank account లో డబ్బేం లేదు. రేపటి నుంచి పనేం చేయలేం అని మీకు విన్నవించుకుంటున్నాం." "అవును ఎంత కావాలి?" అన్నారు. "చాలా కావాలి స్వామి." "చాలా అంటే ఎంత?" "ముందు పని జరగాలంటే ఒక యాభై కోట్లు కావాలి స్వామి." "ఓ అట్లాగే" అన్నారు. మరునాడు పొద్దున బ్యాంకుకు వెళ్ళమన్నారు స్వామి. బ్యాంకులో సుమారు రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఆ రోజు రాత్రికి వచ్చి చేరినాయి. ఎట్లా చేరినాయి అంటే సత్యసాయి భగవానుని యందు ఉన్నటువంటి trust అది. trust, విశ్వాసం. స్వామి దగ్గరకు ఒక సంకల్పం చేశారు, దాంట్లోకి వచ్చింది. తర్వాత నవంబర్ ఇరవై మూడున ప్రారంభం చేయాలి. Prime Minister వస్తాడని కూర్చున్నారు. సరే ముహూర్తం time కి స్వామి అందరికంటే ముందు వెళ్ళటం స్వామి అలవాటు. ఎప్పుడైనా సరే. He is one Guru who never wasted somebody's time.అలాగే మనం వెళ్లి స్వామితో మాట్లాడటం స్వామి పలకరించినా సరే మూడు నాలుగు నిమిషాల తర్వాత తొలినాళ్లలో గంట గంటన్నర మాట్లాడేవారు ఆ కాలం చెల్లిపోయింది. కానీ ఆ గంటన్నర కూడా వ్యర్థమైన ఒక్క పొల్లు మాట ఉండదు అన్నీ నేర్చుకోవలసినవే. అటువంటిది స్వామి ఆ ముహూర్త సమయానికి అక్కడ ప్రచారలు చేస్తున్నారు ఇంతలోకే message వచ్చింది flight దిగటం ఆలస్యమైంది అని అట్లానా స్వామి పనులకు ఆలస్యం కావటానికి వీల్లేదే నేనే ప్రారంభిస్తా అన్నారు కొబ్బరికాయ కొట్టారు ప్రవేశించారు. ఒకే రోజు నాలుగు open heart surgeries చేశారు. అంటే పరమేశ్వరుడి యొక్క సంకల్పం ఎందుకు నెరవేరుతుంది? మానవుడి సంకల్పం ఎందుకు నెరవేరదు? అంటే పరమేశ్వరుడి సంకల్పంలో స్వార్థం లేదు. మానవుడి సంకల్పంలో స్వార్థం ఉండకుండా లేదు. ప్రతిదీ నాకేం లాభం నాకేం దొరుకుతుందనే భావన తప్ప మరొకటి లేదు గనుకనే మనకు వచ్చే ఫలితాలు కూడా అట్లాగే ఉంటాయి. అలా ఒక వైద్య వృత్తిని ఒక ఉదాత్త స్థాయికి మళ్లీ తీసుకువెళ్లి స్వామి దగ్గర పనిచేస్తే చాలు స్వామి పేరు మీద పనిచేస్తే చాలు చేస్తే ప్రేమతో చేయాలనేటువంటి ఆ ప్రాచీనమైనటువంటి వైద్య శాస్త్రానికి మళ్లీ స్వామి పరమాద్భుతమైన స్థాయిని కల్పించారు. ప-అక్కడికి ఎనభై ఏళ్లు పూర్తైపోయింది. అంటే ఐదు షోడశులు పూర్తయినాయి ఐదు పదహార్లు పూర్తయినాయి. ఇక మిగిలింది పదహారు. ఆ పదహారులో రెండు వేల మూడవ సంవత్సరంలో స్వామి ఒక fall అయినప్పుడు hip joint ముక్కలు ముక్కలైపోయినప్పుడు పొడిపొడి అయినప్పుడు అయినా తన కార్యక్రమాన్ని తాను ఆపలేదు. నిజానికి 2003 నుంచి సత్యసాయి organisation పరమైన కార్యక్రమాలు చాలా ఎక్కువగా కొనసాగుతూ వచ్చినాయి. అప్పటికీ నూట డెబ్బై రెండు దేశాలలో స్వామి తన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి అక్కడ ఎవరెవరికి ఏ ఏ శక్తి ఎట్లా కావాలో, ఏ వనరులు కావాలో వాటిని కేవల సంకల్ప మాత్రంతో పుట్టపర్తి నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వేయకుండా సర్వ ప్రపంచాన్ని తన దగ్గరకు తెచ్చుకున్నటువంటి వైనం మన కళ్ల ముందు మనం చూశాం. ఇది ఒక స్థితి అయితే ఆధ్యాత్మిక పరంగా స్వామి ఏం చెప్పారు? ఆ తత్వం ఏమిటి? "ఏను దైవంబు తద్భిన్నమేమి కాను" ఇంత అద్భుతంగా declare చేసిన వాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కలియుగంలో సత్యసాయి భగవానుడు మాత్రమే. "ఏను దైవంబు తద్భిన్నమేమి కాను" సచ్చిదానందుడా నేను సత్యసాయి విభుడా సచ్చిత్ ఆనంద స్వరూపన్నాది పాంచభౌతికమైన ఐదంగుళా-ఐదడుగుల మూడంగుళాల శరీరానికి నన్ను పరిమితి చేసి చూడకండి అని కొన్ని వందల సార్లు స్వామి చెప్పారు. కానీ జీవుడు ఆ రూపం చేత సమోహనం చెంది రూపమే స్వామి అనుకున్నారు. రూపం కూడా అరూపం అవుతుంది అది పరిణామ దశ. నామం మిగులుతుంది రూపం ఉండదు. ఉండేది రూపం కాదు. ఏది కనబడుతున్నదో అది పోవటానికి వచ్చింది. ఏది పోవలసి ఉన్నదో అది కనబడుతున్నది. ఇది బ్రహ్మసూత్ర విచారణ. తదనుగుణంగానే ఈ ప్రపంచంలోకి వచ్చిన అన్ని అవతారాలు దేహమెత్తి వచ్చినటువంటి అవతారాలన్నీ ఆ దేహాన్ని వదిలిపెట్టవలసిందే. కనుక స్వామి తనలో ఉన్న దివ్యత్వాన్ని గమనించమన్నారు ఒ-ఒకటి. రెండవది బాబా మీరు దేవుడేనా అని ప్రశ్నించినప్పుడు నేను దేవుడ్నే నా-నాది ఎరుకే నీవు కూడా దేవుడివే నీలో ఉన్న దివ్యత్వాన్ని నీవు గమనించుకో బంగారు నీవు వచ్చింది కేవలము అందుకోసమే అన్నారు. అంతే కాదు ప్రాచీనమైనటువంటి గతించినటువంటి కాలంలో నుంచి ఒక స్ఫూర్తిని తీసుకోవాలి వర్తమానాన్ని ఉజ్వలం చేయాలి ప్రజ్వలనం చేయాలి ప్రచోదితం చేయాలి పరమోత్కృష్టమైన భవిష్యత్తులోకి వెళ్ళాలి. వర్తమానంలో పరిపూర్ణంగా జీవించని వాడికి భవిష్యత్తు లేదు. గతము అంటే ఇవాళ సాయంకాలం ఇక్కడ ఆరు గంటల ఇరవై నిమిషాలకి ఇక్కడ అడుగు పెట్టామే అది ఈ జీవితంలో మనం పోగొట్టుకున్నటువంటిది. మళ్లీ తిరిగి దానిని మాత్రం ఎలా రప్పించుకోలేమో కాలము పరబ్రహ్మ స్వరూపం గనుక కాలము అన్నివేళలా మనల్ని నడిపిస్తుంది గనుక కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై జీవుడు ఎట్లా వస్తాడో అవతారమూర్తి కూడా అట్లాగే వస్తాడు. స్వామి ఎన్నెన్ని బోధలు కొన్నివి సుమారు ఏడు ఎనిమిది గంటలు స్వామి గురించి చెప్పవచ్చు కానీ నాలుగు మాటలు మాత్రం ఈ ప్రపంచం గుర్తు పెట్టుకునేవి చెప్పారు. Help ever hurt never, love all serve all. ఈ Help ever hurt never అనేది ధర్మక్షేత్రంలో స్వామి చెప్పారు. ఎందుకని అంటే పద్దెనిమిది పురాణాలున్నాయి ప్రతి పురాణంలో ఒక కథ ఉంది. పురాణంలో ఒక కథ రెండో పురాణంలో అదే కథ ఇంకో రకంగా ఉన్నది బాబా ఇదంతా పరస్పర విరుద్ధం కదా అని ఒక foreigner అడిగిన దానికి స్వామి ఇచ్చిన సమాధానం అసలు ఈ పురాణాలు పద్దెనిమిది పురాణాల essence ఒకటే బంగారు Help ever hurt never. నీకు చేతనైనంత సాయం ఎప్పుడూ చేస్తూనే ఉండు ఎవరినీ ఎప్పుడూ బాధించకు అం-అది మాత్రమే కాదు Love all serve all అది అధ్యాత్మ సీమలో ఒక గరిష్టమైనటువంటి అందుకోవలసినటువంటి స్థితి. మనిషి అందరినీ ప్రేమించలేడు. ప్రేమించటానికి కొన్ని conditions ఉంటాయి కొన్ని అవసరాలు ఉంటాయి కొన్ని అవకాశాలు ఉంటాయి కొన్ని కామనలు ఉంటాయి కొన్ని వికారాలు ఉంటాయి కొన్ని మూలవాసనలు ఉంటాయి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. అనేక కారణాల వలన మాత్రమే ఒక మనిషి మరొక మనిషిని ప్రేమిస్తాడు. unconditional గా ప్రేమించగలిగినటువంటి ఆ దివ్య ప్రేమ ఏదైతే ఉన్నదో అది నీ-నీ భార్యని, నీ భర్తని, నీ పిల్లలని, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో సర్వ ప్రపంచం వైపు అదే దివ్య ప్రేమను గనుక అనుసంధానం చేయగలిగితే That is called love all. అలాగే serve all. ఈ serve all అంటే అందరినీ సేవించు అంటే.Serving own is mundane. Serving known is humane. Serving the unknown is divine. ఎవరు మనకు తెలియరో వారికి సేవ చేస్తా అని చూడండి అది divine. నా భార్యకి నేను పండగకి చీర కొని పెడితే ఏమి సేవ అది? చేయాలి అంతే. అది serving own. అది mundane. చాలా ప్రాథమిక స్థాయి. Serving the known. మీరెవరో నాకు తెలుసు, నేనెవరో మీకు తెలుసు. మీ అవసరం నాకు, నా అవసరం మీకు వచ్చింది. పరస్పరం చేసుకున్నాం. That is humane. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కానీ మీ వలన నేనో, నా వలన మీరో ఎప్పుడో ఎక్కడో లాభం పొందారు. పొందిన మీరు గుర్తు పెట్టుకున్నారు, చేసిన నేను మర్చిపోయినాను. అది divine. అది. అటువంటి ఆ సేవాభావాన్ని సర్వాల్ అనేటువంటి స్థితిలో స్వామి చాలా ఉదాత్త రీతిలో తాను కొనసాగించారు. ఈ అవతారానికి శ్రీకృష్ణ పరమాత్మ లీలా అవతారం. శ్రీరామావతారం మాయా మానుష వేషం. మాయకు లోబడిన వేషం, మాయను లోబరుచుకున్న వేషం. రెండు వేషాలు అవి. రామకృష్ణులు. సత్యసాయి భగవానుడు లీలా మాయా మానుష వేషం ఇది. లీలలు చేస్తూనే మాయను లోబరుచుకొనే, మాయకు అతీతంగా సంచారం చేసినటువంటి ఒక పుంజీభూతమైనటువంటి బ్రహ్మ పదార్థమే భగవాన్ సత్యసాయి. అంతే కాదు, తన చుట్టూ ఉన్నటువంటి వారిని మాత్రమే కాక సర్వ ప్రపంచంలో జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరిని కూడా ధర్మ మార్గం వైపు నడిపించినటువంటి పరమాత్మ స్థితి వారిది. దేనితోనూ బంధం లేదు తల్లిని పిలిచి "నీకు నాకు మాయ విడిపోయింది. నువ్వెవరో, నేనెవరో నా భక్తుల కోసం నేనున్నాను" అన్నప్పుడు బాబా వారికి అరవై ఏళ్ళు లేవు, పదహారు ఏళ్ళ పిల్లవాడు. పదహారు ఏళ్ళ వాడు వాళ్ళ అమ్మని వదిలిపెట్టి ఉండగలడా? "నీకు నాకు ఇంతటితో తీరిపోయింది, తెగిపోయింది" అన్నది పరమహంస యొక్క స్థాయి. పరమాత్మ యొక్క స్థాయి. అందుకనే దేవకీ నందనుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెరసాలలో దేవకికి ఇవ్వవలసిన దర్శనాలన్నీ ఇచ్చి "మళ్ళీ మనం జీవితంలో కలుసుకోలేదని అనుకోవద్దు. ఇక్కడికి కథ ఇంతే" అన్నాడు. అలాగే వ్రజభూమికి వెళ్ళినప్పుడు యశోదా దేవితో ఇదే శ్రీకృష్ణ పరమాత్మ మరొక మాట అన్నాడు. "ఇక్కడితో నీ ముద్దుముచ్చట్లు తీరింది. నేను ఇప్పుడు లోక కల్యాణార్థమై బయటకు వెళ్తున్నాను". మళ్ళీ వ్రజభూమికి ఆయన తిరిగి వెళ్ళింది కూడా లేదు. అంటే తిరిగిరాని, మరలిరాని, unwind చేయటానికి వీలు లేనటువంటి ఒక ప్రస్థానము ఏకోన్ముఖమై ఊర్ధ్వ స్థాయిలో, పరమోత్కృష్ట స్థాయిలో ఏది సాగుతుందో అది మాత్రమే పరమాత్మ యొక్క సంచారం. ఆ సంచారానికి పు-పుట్టపర్తి అనేటువంటి దాన్ని ఒక కార్యక్షేత్రం చేసుకున్నారు. పుట్టపర్తి అనేటువంటి దాన్ని పుట్టు apart అయి అని అనుకుంటే అది దాని పేరు పుట్టపర్తి. "ఐ" నేను-నేను అన్న భావన పక్కనబెట్టు, నాది-నాది అన్న భావన పక్కనబెట్టి మనము, మనది అన్నటువంటి ఒక విశాల విస్తృతమైనటువంటి సార్వజనీనమైన, విశ్వజనీనమైనటువంటి భావనలో నిలకడ చెందమన్నారు స్వామి. అలాగే "సర్వ శాస్త్రాలు అధ్యయనం చేసినా, సర్వ శ్లోకాలు కంఠం పట్టినా, కంఠతా చేసినా, సర్వ విద్యల మీద అధికారం సంపాదించినా, నీ మీద నీవు గనక అధికారం సంపాదించుకోకపోతే, నిన్ను నడుపుతున్న ఇంద్రియాలకు నీవు లోబడి ఉన్నట్లయితే నీకూ పశువుకి తేడా లేదు. పశుత్వం నుంచి పశుపతి తత్వం వైపు వెళ్ళటానికే మానవ జన్మ, మానవ దేహము, ఈ అవకాశము ఇవ్వబడింది" అని చెప్తూ స్వామిని అవతార ప్రకటన చేసిన తొలినాళ్లలో మేధావులందరూ కలిసి వేసిన ప్రశ్న "స్వామి అధ్యాత్మికము అంటే ఏమిటి?" అని. అంటే స్వామి ఇచ్చిన సమాధానం "ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళటమే అధ్యాత్మ". వాళ్ళకి అర్థమైంది. మళ్ళీ పదేళ్ళకి అదే ప్రశ్న మరొక తరం స్వామిని వేస్తే "ఏం లేదు, ప్రభావంలో నుంచి స్వభావంలోకి వెళ్ళటమే అధ్యాత్మ". వాళ్ళకి ఆ భాష అర్థమైంది. మన వరకు వచ్చేప్పటికి అధ్యాత్మ-అధ్యాత్మ అంటారే పూజలు, దానాలు, జపాలు, యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు కావా ఇంకేదన్నా ఉన్నదా అంటే "ఏం లేదు బంగారు. మానవుడు మానవుడిగా జీవించటమే అధ్యాత్మ". కనీసం మానవుడు తన మానవ ప్రవృత్తిని కూడా పోగొట్టుకొని ఒక పశు ప్రవృత్తితో జీవిస్తున్నాడు కనుక దానిని దాటి మహోన్నతమైన స్థాయికి వెళ్ళాలి. ఇది దివ్యమైనటువంటి స్వామి యొక్క ప్రబోధం. దీని తత్వంలో రామత్వం ఉన్నది, కృష్ణత్వం ఉన్నది, దత్తత్వం ఉన్నది. కనుకనే స్వామి సాలోక్యంగా ఉన్నారు, మనతో ఉన్నారు. సామీప్యంగా ఉన్నారు, మనకు సమీపంగా వచ్చారు. సాన్నిధ్యంగా ఉన్నారు, ఉంచారు, మనల్ని దగ్గర తీసుకున్నారు.
SSSMC · audio
Talk on Sri Sathya Sai - Part 03
Talk on Sri Sathya Sai - Part 03
Source: Sri Sathya Sai Media Centre
0:00 / 22:52
More in this series