No transcript for this section.
Transcript begins at 0:00.
కుచ్చి వేయించిన తర్వాత స్వామిని ఆయన దగ్గరికి వచ్చి విభూతి సృష్టించి ఆయనకి ముట్టు పెట్టి కాస్త నోట్లో వేసి పక్కన ఎవరో కూర్చుని ఉంటూ ఒక పేపర్ తీసుకుని ఆ పేపర్లో ఈ విభూతి వేసి కొట్లం కట్టి ఆయన జేబులో పై జేబులో పెట్టి వెళ్లిపోయారు. ఇలా ఒకటి రెండు మూడు రోజులు గడిచింది. మూడు రోజులు గడిచిన తర్వాత నాలుగో రోజున స్వామి పలకరించారు. అంటే మాట్లాడారు. "ఏం చేస్తున్నావు?" అని అడిగారు. ఆయనకి కాస్త వెనక-వెనుకడి తగ్గింది. అప్పుడు స్వామి మళ్ళీ చెవి దాకా వెళ్లి "ఏం చేస్తున్నావు?" అని జెస్చర్ కూడా. అడిగితే ఆయన ఏమన్నాడు? "ఏదో స్వామి కాలం వెళ్లదీస్తున్నాను" అన్నాడు చాలా క్యాజువల్ గా. "కాదు కాదు కాలమే నిన్ను వెళ్లదీస్తున్నదేమో ఆలోచించుకోవా" అన్నారు స్వామి. ఇది ఒక అవతారమూర్తి భాష ఇట్లా ఉంది. ఆయన దాని మీద వ్యాఖ్యానం ఇదే చేశారు. ఇది మనందరికీ అప్లై అవుతుంది. కాలమే మనల్ని వెళ్లదీస్తుంది. మనం తిన్నా, ఉన్నా, తినకపోయినా, పడుకున్నా, పడుకోకపోయినా, పని చేసినా, చేయకపోయినా సూర్యుడు వస్తాడు. పగలు గడుస్తుంది, రాత్రి వస్తుంది, మళ్ళీ తెల్లవారుతుంది కదా. దీన్నొక దివ్య వనంగా ఈవేళ మార్చుకోవాల్సిన అవసరం ఎక్కడ ఉన్నది, ఎట్లా ఉన్నది, ఎలా గడపాలి అని అనుకున్నప్పుడు బహుశా అరవై నాలుగు ప్లస్ వాళ్లందరికీ వాళ్ళు చేస్తున్న పని ఇదే అనుకుంటూ అది కాకపోతే ఇట్లా ఉంటే బాగుండును అని కూడా అనుకుంటూ ఈ నాలుగు విషయాలు చెప్తాను. ఈవేళ నూటికి ఎనభై ఐదు పర్సెంట్ వృద్ధులు ఓ జాయింట్ ఫ్యామిలీ అనుకుందాం. కొడుకు దగ్గర ఉన్నాడు, కూతురు దగ్గర ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నారు. పెద్దాలె, పెద్దాయన. వాళ్ళకి నిద్ర పట్టటమే రాత్రి ఎప్పుడో ఒంటి గంట దాటితే అని పాపం పట్టదు. ఇందాక చెప్పిన ఆలోచనల వల్ల, భయం వల్ల. తెల్లవారబోయే టైంలో ఆ-జాము అంటామే తెల్లవారు జామున నిద్ర గాఢంగా పడ్డే ఒక అవకాశం వాళ్ళకుంది. శరీరం స్థితి అది. ఆ సమయంలో కొడుకు దగ్గర ఉంటే కొడుకేమన్నడు గాని కోడలు లోపల్నుంచి అరుస్తుంది. "మామయ్య గారిని లేపి పాల ప్యాకెట్ తెమ్మనండి" అని. [నవ్వు] భర్తకు చెప్పదు. భర్త చాలా అలసిపోయాడని. ఆ మామయ్యగారు అని ఆయనకేం పని లేదు. ఆయన్ని పంపించి పాల ప్యాకెట్ తెమ్మనుండి అని చెప్తుంది. ఆ మాట ముసలాయనకు వినపడుతుంది. పాపం చాలా హంబుల్ గా లేచి కాళ్ళు కీళ్ళు కూడా తీసుకుని కోడలు ఎక్కడ మాట తూలుతుందో అనే భయంతో, ప్రేమతో కాదు భయంతో అక్కడికి వెళ్ళేప్పటికి ఒక్కోరోజు పాలు ఉంటాయి పాలైపోతాయి కదా. అది ఈన చేతిలో లేదు. కానీ కోడలో కొడుకో మాత్రం "ఇంకాస్త ముందు లేస్తే ఏమయ్యేది నాన్న" అంటాడు. చూసారా It hurts. ఈన చాలా నిజాయితీగా జీవితమంతా గడిపి పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వకపోయినా కొడుకు వాడికేదో అవసరం ఏర్పడినప్పుడు తండ్రి అప్పటికే ఇవ్వవలసింది ఇచ్చి అన్ని చేతులు కడుక్కున్నప్పటికీ కూడా "మా నాన్న ఆరోజు ఇంకాస్త కష్టపడి ఉంటే ఇంకో యాభై లక్షలు ఉండేది. మంచి అవకాశం వచ్చినా మా నాన్న పని చేయలేదు. అంటే దొంగతనం చేయలేదు, అవినీతికి పాల్పడలేదు" అని తండ్రిని చిన్న చూపు చూస్తారు. ఇక సరే ఏదో పాల ప్యాకెట్ దగ్గర కథ మొదలు కదా వస్తాం. జీవితంలో జరుగుతుంది ఇది అందరికీ జరిగేదే. అది లేని వాళ్ళు ఆ five percent వాళ్ళు అదృష్టవంతులు. అదన్నమాట. సరే వస్తే ముందు husbandకి భర్తకు కాఫీ ఇచ్చి తను హల్ లోకి వెళ్ళాలి గనుక తాను కూడా తాగేసి ఆ పెద్దాయన నెమ్మదిగా వచ్చేప్పటికి వారికోకప్పు కాఫీ ఆయనకు కూడా ఇచ్చి అనమాట. అయిపోతుంది తర్వాత ఎవరి పని వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళాకే ఈ ముసలాయన ఏం చేయాలి? walkingకి వెళదాము అంటే, ఇవాళ seventy five years తర్వాత మీరు జాగింగ్ చేయండి, walking చేయండి. హెల్త్ బాగా జాగ్రత్తగా చూసుకోండి. ఎన్ని insuranceలు ఉన్నా insurance డబ్బు వచ్చేదాకా సేవ చేయాలి కదా. కాబట్టి ఉద్ధరేత్ ఆత్మనాత్మానం అని కృష్ణుడు ఎప్పుడో చెప్పాడు. నీ సంగతి నువ్వే చూసుకో అని కొడుకు కాదు, కోడలు కాదు, కూతురు కాదు, మనవడు కాదు ఎవడు చేసేవాడు లేడు ఉండడు. ఇది సత్యం. కాబట్టి మనం ఏం చేయాలి? హెల్త్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది జాగింగ్ చేసే వయస్సు కాదు, walking చేసే వయస్సు కాదు. మరి ఏం చేయాలి? ఏం చేయాలి అంటే జీవితాన్ని అది ఎట్లా వస్తే దాన్ని అట్లా accept చేయడం మొదలు పెట్టండి. రెండోది కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే ఇల్లంతా ఖాళీ గనుక ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎన్ని లక్షలు పెట్టి మీ ఇంట్లో TV పెట్టినా మీ ముందున్నా ఉంచినా ఆ TV on చేయకండి. ఎందుకంటే మన మనశ్శాంతి హరించివేయడానికి వచ్చిన భూతం అది ఇంట్లో. Technologyకి వ్యతిరేకం కాదు. దాన్ని ఎంతవరకు చూడాలో, ఎంతవరకు వాడాలో అంతవరకు దాని వాడాన్ని. ఎందుకంటే అది generate చేసే rubbish ఏముందో అది మన జీవితాన్ని మన ఆలోచనల్ని విషమయం చేస్తుంది. దాన్ని విష్ణుమయం చేసుకునే ఆలోచన చేయాలి.ఇంకా చూపు బాగా ఉన్నది కాబట్టి స్వాధ్యాయం చేయాలి మంచి books చదువుకోవాలి మంచి ఆలోచనలు చేయాలి. అంతా బాగుండాలి అని కోరుకోవాలి. ఈ ప్రపంచం అంతా నేను బతికున్నంత వరకు ఆనందమయంగా ఉండాలి ఒక ఆనంద ధామంగా ఉండాలని మనం సంకల్పిస్తూ ఉండాలి. దానికేం మంత్రాలేమీ లేవు ఇప్పుడు అనుకున్నదే అనుకుంటూ ఉండడమే. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఒక ఆనందమయ ప్రపంచం అవుతుందో మన భాగం మనకు దక్కుతుంది. ఒక వ్యక్తి యొక్క ఆనందం ప్రపంచానికి అక్కర్లేదు కానీ ప్రపంచం యొక్క ఆనందం వ్యక్తికి చాలా అవసరం. మన చుట్టూ వాతావరణం గనుక బాగా లేకపోయినట్లయితే మన దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత పరిజనం ఉన్నా, ఎంత కుటుంబం పెద్దదైనా మనకది ఆనందాన్ని ఇవ్వదు కాబట్టి ఈ సమయాన్నంతా కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మితాహారం చాలా ప్రధానం. వయస్సును బట్టి యుక్తాహార విహారస్య. భగవద్గీతలో చెప్పనిది లేదు భగవద్గీతలో మోక్షం మరణానంతర సుఖం, అది సరే పక్కన పెడదాం ఎందుకంటే మరణానంతరం నువ్వు విష్ణులోకానికి పోతావని ఎవడన్నా ప్రవచనకారులు చెప్తే దానికి ముందు discount ఇచ్చేయండి. ఎందుకంటే ఇంతవరకు ఇటునుంచి అటు వెళ్లిన వాడే తప్ప అటు నుంచి ఇటు వచ్చి చెప్పిన వాడు లేడు. విష్ణులోకాన్ని కవులు పురాణాలు వర్ణించినాయి ఉన్నాయా లేదా అది debate కాదు. మన చేతికి ఇంకా అందనిది అనుభవంలోకి రానిదాని గనుకే జీవితాన్ని మనం స్పష్టంగా అనుభవించగలిగిన, ఎదుర్కో గలిగినటువంటి ఒక ఆంతరికమైన మానసికమైనటువంటి బలాన్ని మనం సంతరించుకోవాలి అంటే పాతకాలం ఒక స్ఫూర్తినివ్వాలి వర్తమానాన్ని విజ్వలం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తు అంటారా? ఎనభైఏడు ఏళ్ళు బతికాక ఇంకా భవిష్యత్తు ఏంటో నేను చూస్తుంటాను. ఎనభైఏడు ఏళ్ళ వాడి జాతక చక్రం తీసుకుని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాడు. ఏమవుతుందో చెప్పండి అని. ఏమవుతుందో చెప్పాలా? ఎనభైఏడు ఏళ్ళ తర్వాత. కాబట్టి వ్యర్థమైనటువంటి కార్యకలాపాల నుంచి మనస్సుని వైదొలగించాలి. తర్వాత మంచి విషయాలు మనకి ఈ దేశం మాత్రమే
YouTube · audio
Vrudhapayam - oka divya varam PART-2
Vrudhapayam - oka divya varam PART-2
Source: SathyaSai Seva Sadan on YouTube
0:00 / 8:27
More in this series