Skip to content
Transcript తెలుగు
అనేకమైన గ్రంథాలున్నాయి. వాటన్నింటినిండా జీవితానికి కావలసిన చాలా చాలా రహస్యాలు, సూచనలు, జీవితాన్ని ఎంత ఆ-ఆనందమయం చేసుకోవచ్చో అవన్నీ ఉన్నాయి గనుక, అవన్నీ కొన్ని నోట్ డౌన్ చేసుకొని తద్వారా మన ఆలోచనలను గనుక పవిత్రీకరించుకోగలిగినట్లయితే. సాయంకాలం దాకా గడిచిపోయింది. సాయంకాలం అయ్యాక మళ్ళీ పునః అందరూ వచ్చేస్తారు. సాయంకాలం పూట కనీసం ఇదిగో ఇట్లా, ఈవేళ ఎంత ఆనందంగా నాకున్నదంటే, మీరందరూ సమయానికి కరెక్ట్ గా వచ్చి కూర్చున్నందుకు, నేను కూడా చేరుకోగలిగినందుకు, అంటే అనేవాడికి వినే వాడికి ఎంత సాధనో అనేవాడికి కూడా సాధనే. రెండూ వనకూడాలి. వనగూడినప్పుడు పరస్పరం లాభం పొందుతాం కాబట్టి. ఇట్లా ప్రతిరోజూ నిత్య సత్సంగంని కోరుకోవాలి. సత్సంగం అంటే డడ డడ డడ డడ జలపాతంకు ఉపన్యాసం కాదు. మనల్ని ఆలోచింప చేయించాలి. మన జీవితాన్ని మనం తడుముకోగలిగిన స్పేస్ మనకివ్వాలి. అలాగే మనం వెళుతున్న దారి సక్రమంగా ఉందా? మంచి దారిలోనైనా మనం సక్రమంగా ఉన్నామా లేదా? మనం సక్రమంగా ఉండాలి, మనం వెళ్ళే దారి కూడా సక్రమంగా ఉండాలి. అప్పుడే ప్రయాణం సుఖవంతమవుతుంది గనుక, సాయంకాలం అయ్యేపటికి మనకు మూడు విషయాలు చెప్పారు. ఒకటి పొద్దున పూట స్త్రీ పురుష అనే లింగ భేదం లేకుండా ప్రతి వ్యక్తి లలితా సహస్ర నామాన్ని చదువుకోవాలి. ఒక్కసారైనా, ఒక్క అభూతం. అది పొద్దున పూట. మధ్యాహ్నం పూట వృద్ధులకు అవకాశం ఉంది గనుక వాళ్ళు రామాయణాన్ని చదువుకోవాలి. రామాయణం అంటే రాముడిది. అధ్యాత్మ రామాయణం విన్నాం, అద్వైత రామాయణం విన్నాం, అనేక కవుల పేర్ల మీద రామాయణం విన్నాం. అసలు రామాయణం అంటే అది ఆధ్యాత్మ రామాయణం. అంటే అనుకున్నది అనుకున్నట్లుగా జరగని జీవితాన్ని గర్పణం పట్టినటువంటి మహాకావ్యం రామాయణం. శ్రీరాముడి జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని చూడండి, ఆయన అనుకున్నట్లుగా జరగలా. అనుకున్నది అనుకున్నట్లుగా జరగనప్పుడు కూడా రాముడు రాముడిగా ఎలా ఉండగలిగాడు? దశరథ రాముడిగా ఎలా ఉండగలిగాడు? జానకి ఉన్నా, జానకి లేకపోయినా జానకీరాముడిగా ఎలా ఉండగలిగాడు? కోదండం ధరించి ఉన్నప్పటికీ కూడా అది వాడవలసినప్పుడు మాత్రమే వాడి తాను కోదండరాముడు ఎట్లా అయినాడు? ఒక రఘువంశంలో పుట్టినటువంటి రాముడు వంశం అనుగ్రహించినటువంటి లేదా పరిపాలిస్తూ వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ధర్మాన్ని రాముడు ఎలా జీవితంలో కష్టంలో, సుఖంలో, ఎత్తు పల్లాలలో, అరణ్యంలో, కారడవిలో, కీకారణ్యంలో, భీకారణ్యంలో అన్నింటి మధ్య రాముడు రాముడై ఎట్లా విదిగాడో చూసినప్పుడు, రాముడి కష్టంతో మనకు ఏర్పడే కష్టాన్ని పోల్చుకోగలిగిన మనసు మనకున్నట్లయితే మన కష్టం కష్టమే కాదు. చాలా-చాలా చిన్న వాటికి గెబ్బెలు పడిపోతాం. చిన్నదానిని భూతద్దంలో చూస్తాం. భయం మనల్ని నడిపించినంత కాలం మనకు ఆనందం మిగలదు కాబట్టి, వృద్ధాప్యాన్ని కేవల జీవన వ్యాపారంగా కాక, జీవన వ్యాసంగంగా మార్చుకోగలిగినట్లయితే, ఇది ఒక అద్భుతమైన శక్తి. రామాయణంలో సంఘటన ఉంది. చాలాకాలం దశరథ మహారాజుకి పిల్లలు పుట్టలేదు. మనకా రామాయణ కథ అంతా తెలుసు. సరే పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దవాళ్ళైనారు, వివాహం కూడా అయిపోయింది రాములవారికి. ఒకరోజు దశరథ మహారాజు రాత్రిపూట, ఆయన ఆలోచనలో పడ్డాడు. నా తర్వాత రాముడికి పట్టాభిషేకం ఎప్పుడవుతుంది? పట్టాభిషేకం చూసేదాకా నేను ఉంటానా ఉండనా? ఇవన్నీ మనకు తెలిగినట్టే ఆయన రాజైనా మనిషే కదా! [కాష్] ఆయన ఏం చేశాడంటే పక్కనే ఉన్నటువంటి మంచి నీళ్ళ గ్లాసు అందుకోవటానికి గ్లాసు పట్టుకున్నాడు. పట్టుకుంటే నీళ్ళతో ఉన్నటువంటి గ్లాసు ఇట్లా ఒడికింది ఒక్కసారి. రాజు, ధర్మబద్ధుడైన, నీతిబద్ధుడైనటువంటి రాజుకి నా శరీరం పెస్సిపోయింది. ఇక ఇంద్రియాలు నేను చెప్పినట్లు వినే అవకాశం లేదు. రేపు తెల్లవారగానే వశిష్టుల వారిని పిలిచి శ్రీరామ పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టుకోవాలి. ఇకపై నేను రాజ్యాన్ని పాలించడానికి నాకు అర్హత లేదు అని నిర్ణయించుకున్నాడు. అది ఆనాటి పరిస్థితి. కాస్త ద్వాపర యుగంలోకి వచ్చేసరికి మహాభారత సంగ్రామం జరిగింది. కాలంలో వచ్చినటువంటి ఒకానొక మార్పు, పరిణామశీలమైనటువంటి మానవ జీవన విధానంలో వచ్చినటువంటి మార్పు. ఆనాడు మహాభారతంలో సర్వసైన్యాధ్యక్షుడుగా వెళ్ళవలసిన భీష్ముల వారి వయస్సు నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలు. ధనుస్సు పట్టుకొని యుద్ధానికి వెళ్ళాడాయన. అంటే వృద్ధాప్యాన్ని ఒక అద్భుతమైనటువంటి వీరుడిగా తన క్షాత్ర ధర్మాన్ని ప్రదర్శించినటువంటి ఒక అవసరం ఏర్పడినప్పుడు భీష్ములవారు అడుగు వెనక్కి వేయలేదు. అలాగే యోగీశ్వర కృష్ణుడి వయస్సు సుమారుగా ఎనభై తొమ్మిది సంవత్సరాలు. ఆయన రథాన్ని వెలిపాడు. యుద్ధం చేస్తున్నటువంటి అర్జునుడి వయస్సు డెబ్బై ఆరు సంవత్సరాలు. అవన్నీ ఇవాళ మనం చెప్పుకునే డెబ్బై ఆరు, ఎనభై తొమ్మిది ఆహ్ దానికి ఆహ్ సమానమైనటువంటి వయస్సు అది.ఇక భీష్ముడు ఆయనతో పాటు ద్రోణుడు, కృపాచార్యుడు, శల్యుడు, శకుని వీళ్ళందరూ కూడా వయోధికులైనటువంటి వాళ్ళు యుద్ధానికి వెళ్లారు. అది మహాభారతం. కలియుగానికి వచ్చేప్పటికి శ్రీని మహాస్వామి తన దేహాన్ని వదిలిపెట్టినప్పుడు ఆయన వయస్సు ఎనభై తొమ్మిది సంవత్సరాలు. కట్టకడపటి క్షణం వరకు కూడా అధ్యాత్మ దివ్య బోధన తన చుట్టూ ఉన్న వారందరికీ చేస్తూనే ఉన్నారాయన. జీవితాన్ని ఎంత హాయిగా చూడాలో, ఎంత భగవంతుడు ఒక్కడు ఉన్నాడని నమ్మండి నమ్మండి, దేవుడున్నాడు ఉన్నాడు, ఆయన సర్వశక్తివంతుడు అనేటువంటి ఒక భారతీయ సిద్ధాంతాన్ని తనదైనటువంటి బాణిలో ఆయన శివ రామా మారుతి గంటోబా విఠోబా నాథ సంప్రదాయాలకు అనుగుణంగా బోధ సాగించి, ఆయన కూడా చెప్పారు లలితా సహస్రనామం చదవండి, విష్ణు సహస్రనామం చదవండి నిద్ర మేల్కొన్న తర్వాత జాగ్రదవస్థలో అంటే సుమారు పదహారు గంటలు మనం మేల్కొని ఉంటాం దైనందిన కార్యకలాపాల్లో భగవద్గీత అక్కడ అది ఒక్క శ్లోకమన్నా చదవండి. ఒక్క-ఒక్క ఏకనాథ భాగవతంలో ఒక్కటన్నా చదవండి, భగవద్గీతలో ఒక్కటన్నా ధ్యానేశ్వరుడు ఒక్క శ్లోకం చదవండి, అర్థం చేసుకోండి. అదంతా బట్టీ పట్టక్కర్లేదు. దానివల్ల ప్రయోజనం లేదు. ఒక్కటి ఏం చెప్పిందో తెలుసుకోండి. అని సనాతన ధర్మాన్ని ఒక వైదిక ధర్మాన్ని శ్రీని మహాస్వామి అద్భుతంగా ఆయన సాగించారు. తర్వాత పందొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత ఎనిమిదేళ్ళకి ఆంధ్రదేశంలో నవంబర్ ఇరవై మూడు పందొమ్మిది వందల ఇరవై ఆరున, ఇదిగో దేశం, జాతి కేవలం భారత జాతి మాత్రమే కాదు అప్పటికి వచ్చినటువంటి అవతారాలన్నీ కూడా భారత జాతికి సంబంధించిన అవతారాలు. ఒక మహా పరిపూర్ణ అవతారం సర్వ ప్రపంచాన్ని కూడా సనాతన ధర్మం వైపు ఒక్కసారి కన్ను విప్పి చూసేట్లుగా, విప్పార్చి చూసేట్లుగా ఏముంది భారతీయమైన ఆత్మలో అన్న ప్రశ్న పటమరించేటువంటి దిశగా అనేకమైనటువంటి కోణాలు బహుముఖీనంగా ఆవిష్కరిస్తూ సత్యసాయి భగవానుడి అవతారం ఏర్పడింది. ఇది ఒక దివ్యమైన మహత్తరమైన అవతారం. అవతారం కూడా నిజానికి శరీరానికి అరవై సంవత్సరాలు వచ్చే వరకు మామూలుగా సాగించారు. ఏది అరవై ఏళ్లు. అంటే మనం అనుకునే సీనియర్ సిటిజన్ షిప్ దేహానికి వచ్చినప్పుడు ఆయన ఇండోర్ స్టేడియం కట్టించారు. ఇంటర్నేషనల్ శాంతి క్రికెట్ అక్కడ పునఃప్రతిష్ఠ చేయించారు. తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి అనేక చోట్ల కట్టి విద్యా, వైద్య రంగాలు అన్నిటినీ కూడా సుప్రసిద్ధం చేశారు. అంటే సత్యసాయి భగవానునికి ఆయన మామూలు ఒక మనిషి అనుకున్నట్లయితే శరీరానికి అరవై ఏళ్లు వచ్చిన తర్వాత మాత్రమే లోకోత్తరమైన పనులు చేశారాయన. అతిరుద్ర మహాయజ్ఞం కూర్చోవటం ఎంత కష్టం. ఎన్ని గంటలు కూర్చోవాలి, ఎన్ని రోజులు కూర్చోవాలి, కూర్చున్నారు. యజ్ఞాలు చేయించారు, యాగాలు చేయించారు. ధర్మ ప్రబోధం చేశారు. అప్పటికే తను వచ్చినటువంటి అవతార కాలం మొత్తం కూడా జాతిని అంటే మానవ జాతిని ప్రపంచం మొత్తం మీద సర్వసన్నద్ధం చేశారు. ఏం చేశారు? వీళ్లందరినీ తీసుకెళ్లి నా చుట్టూ తిరగండి అని ఆయన చెప్పలా. మీరున్న చోట, మీరున్న ప్రదేశాన్ని మీరు దాన్ని పరమాద్భుతంగా తీర్చిదిద్దుకోండి, ఎక్కడికక్కడ దాన్ని spiritualize చేస్తూ వెళ్ళండి. దానివలన ప్రశాంతి నిలయంలో నుంచి మీరు దేనిని తీసుకుని వెళుతున్నారో అన్ని చోట్ల దీన్ని నాటండి అని నూట ఎనభై ఎనిమిది దేశాల్లో సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని పరమాద్భుతంగా ఆవిష్కరించారు. ఇవ్వాళ ఇస్లాం మతాన్ని అనుసరించేటటువంటి వారు కూడా రుద్రం నేర్చుకోగలిగారు అంటే అది సత్యసాయి భగవానుని యొక్క దివ్య అనుగ్రహం. [అందరూ చప్పట్లు] అట్లాగే స్వామి దగ్గర ప్రశాంతి నిలయంలో పరిచయం ఉన్న వాళ్ళకి కొత్త విషయం కాదు గాని అసలు ప్రశాంతి నిలయంలో సేవ చేసేవారి వయస్సులు మీరు గనక గమనించినట్లయితే retirement అయిన తర్వాత సేవలోకి శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని, ప్రజ్ఞని, శక్తిని, భావాన్ని, తలతుని, ఆచరాత్మక దివ్య విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అరవై ఏళ్లు జాతకం ప్రకారం వాడు బతికి డెభై ఏట దేహం వదిలిపెట్టే వాడు కూడా సుమారు hundred years బతికాడు. అంటే అరవై ఏళ్లు లోకం కోసం బతికిన లోకాతీతమైనటువంటి భావనలు ఈశ్వర భావనలో పెడితే మనకి bonus years ఎన్ని వస్తాయి అంటే సుమారుగా నలభై సంవత్సరాలు వస్తాయి. అరవై వరకు ఏం చేశామో, ఏమి సంపాదించామో, ఏమి పొందాము balance sheet అయిపోయింది. కానీ అరవై తర్వాత సేవా యోగంలో ఉన్నటువంటి వారంతా కూడా నూరు సంవత్సరాలు దాటని వారు ఎవ్వరూ లేరు, అందరూ దాటారు hundred years. అందుకని స్వామి సేవని ఒక అద్భుతమైనటువంటి spiritual సాధన దానిని వివేకానంద స్వామి అనుష్ఠాన వేదాంతం అని చెప్పారాయన. వేదాంతం అనుకునేది సేవ చేసేది అది. సేవ అనుకుంటే సేవ కాదు. కుర్చీ తీసి అక్కడ పెట్టాలి, అవతల పెట్టాలి అంటే పెడితే పెట్టబడుతుంది లేకపోతే పెట్టబడదు. అనుష్ఠానంవిచారణకి ఆలోచనలు విస్తృతం చేసుకోవడానికి ధీర గంభీరమైన ఉదాత్త భావనా భూమికలను మనం సంపాదించుకోవటానికి స్పష్టా స్పష్టంగా ఉన్న మన ఆలోచనలన్నింటినీ కూడా చాలా సుస్పష్టం చేసుకోవటానికి నిర్దుష్టంగా పనులు చేయడానికి వేదాంత బోధను ఉపయోగిస్తే సేవ ఆచరణ ద్వారా జీవుడు ముక్తుడవుతాడు. మనం నా బిడ్డకి నేను ఆస్తి ఇచ్చాను అంటే సంతోషం కలుగుతుంది. నా బిడ్డకి ఇంకేదో సుఖం ఇచ్చాను అంటే నాకు సుఖం కలుగుతుంది. నా కడుపున పుట్టినటువంటి బిడ్డని భగవంతుడి వైపు నడిపించగలిగాను, నా తర్వాత నన్ను ఎట్లా భగవంతుడు కాచుకున్నాడో, నా తరాలు తరాలు తరాలు కూడా భగవంతుడు కాచుకుంటాడు భద్రంగా నా బిడ్డని భగవంతుడి చేతిలో పెడుతున్నాను అంటూ ఎవరైతే జీవుడు తన ప్రాణాన్ని శరీరం నుంచి నిష్క్రమింపజేసుకుంటాడో వాడు నిజమైనటువంటి మిత్రుడు. వాడు ఇక్కడ ఉండగానే వైకుంఠాన్ని కైలాసాన్ని అనుభవిస్తాడు గనుక అటువంటి స్థాయికి చేరుకోవాలి అంటే మార్గం ఏమిటి అని ఆలోచించినప్పుడు సత్య సాయి భగవానుడు ఉపదేశించిన సేవా మార్గమే సర్వోన్నతమైనటువంటి మార్గం. దానిలో చూడండి అహం నశించిపోతుంది. మమకారాలు మన వారి పట్ల మమకారాలు సమస్థితికి వస్తాయి తగ్గవు. మనవాళ్ళంటే ఇష్టం ఎప్పుడూ ఉంటుంది అది రాగ బంధం. అనురాగ బంధం అది ఉంటుంది అది రక్తసంబంధం. కానీ ప్రేమ బంధాలు ఏర్పడినప్పుడు జాతి, మత, కుల, వర్గ, వర్ణ భేదాలన్నీ దాటి సర్వోన్నతమైనటువంటి మానవతా పరిమళం మన యందు ప్రకాశమానమవుతుంది, విరాజమానం అవుతుంది. దానివలన ఒకడి ఎవరి కష్టం కానిది మన కష్టంగా భావన చేస్తాం. అటువంటి వృద్ధాప్యం దివ్యమైనటువంటి వరం. అట్లా చేసుకోగలిగితే అరవై వచ్చేసాయి నేను ఇంక ఎంజాయ్ చేస్తాను అంటే స్వామి చెప్పారు "end of joy" దానికి enjoy అని పేరు. Don't end your joy continue. జీవితం ఒక ఆనంద సమాహారం. జీవితాన్ని చక్కగా జీవించగలిగినటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే మనకి రాముడున్నాడు, కృష్ణుడున్నాడు, భగవద్గీత ఉంది, జ్ఞానయోగాలున్నాయి అనేకమైన విషయాలు ఒకటి రెండు కావు. మంత్రాలున్నాయి, తంత్రాలున్నాయి, యంత్రాలున్నాయి, శక్తులున్నాయి. సమాజం విస్తృత సమాజం ఉన్నది. ఇది ఎంత పరిగెత్తుతున్నదో మనల్ని అంతగా పరిగెత్తిస్తున్నదో దాని అవసరాలు మారిపోతూ ఉన్నప్పుడు విలువలు నెమ్మదిగా మన నుంచి జారిపోతున్నప్పుడు మూలాలు మనం వదిలిపెట్టకుండా మనం గనక సేవా మార్గంలోకి వెళ్లగలిగినట్లయితే సేవను మించినటువంటి అధ్యాత్మ ఆచరణ మరొకటి లేదు. ఎందుకంటే ఏనకైనా ప్రకారైన యస్య తస్యాపి దేహినః సంతోషం జనయేత్ ప్రాజ్ఞా తదేవ ఈశ్వర పూజనం అంటే ఏమిటి? నేను ఎందుకు వచ్చాను? నేను ఎట్లా ఉన్నాను? నా చదువు, నా సంస్కారం, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఒక జీవధార, సమాజం నాకు ఇచ్చినటువంటి సమున్నతమైనటువంటి గౌరవనీయ స్థాయి వీటన్నింటి ద్వారా వీటన్నింటితో పాటు భగవంతుడు నాకు ఒక ప్రజ్ఞ ఇచ్చాడే ఆడగలిగిన, పాడగలిగిన, అనగలిగిన, వినగలిగిన, కూడగలిగిన అన్ని ప్రజ్ఞలలో ప్రజ్ఞను గనక నా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి ఇవ్వగలిగితే నిరపేక్షంగా నిస్వార్థంగా ఇవ్వగలిగితే తదేవ ఈశ్వర పూజనం. అది మాత్రమే ఈశ్వర పూజ. ఆరాధన, అర్చన, అభిషేకం ఇవన్నీ కూడా అసలు విషయానికి దారి చూపిస్తాయి. మనస్సుని శుభ్రపరుస్తాయి. దేహాన్ని శక్తివంతం చేస్తాయి. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక శక్తిని మనం కూడగట్టుకొని వస్తాం. అక్కడ అనేకమంది భక్తుల యొక్క positive thoughts ఏవైతే ఉన్నాయో అవి మనలో vibrations గా ఏర్పడతాయి. మళ్ళీ మనం దాన్ని ప్రపంచానికి ఇవ్వటానికి వస్తాం గనుక సమగ్రమైనటువంటి ఒక ఆధ్యాత్మిక విధానం అంతా కూడా దీని ముగింపు ఎక్కడ లేదా దీని కొనసాగింపు ఎక్కడ అని ఆలోచించినట్లయితే అది సేవలో ఉన్నది గనుక సేవ బినా నిర్వహణహి అన్నాడు స్వామి. నిర్వహణం అంటే ముక్తి. సేవే నీకు నిర్మాణ-నిర్వహణం. సేవలో ఎవరు ఎవరికీ సేవ చేస్తున్నారో ఎక్కడ కూడా documentation ఉండదు. సత్యసాయి Organisation పరంగా నేను చెప్తున్నాను కొన్ని వేల.
YouTube · audio

Vrudhapayam - oka divya varam PART-3

Home

Vrudhapayam - oka divya varam PART-3

Source: SathyaSai Seva Sadan on YouTube

0:00 / 16:40

More in this series

Vrudhapayam - oka divya varam

4 episodes · 58 min

  1. 16 min 1

    Vrudhapayam - oka divya varam PART-1

  2. 8 min 2

    Vrudhapayam - oka divya varam PART-2

  3. 16 min 3

    Vrudhapayam - oka divya varam PART-3

    Now playing
  4. 16 min 4

    Vrudhapayam - oka divya varam PART-4