No transcript for this section.
Transcript begins at 0:00.
మందస్మత మనోహర వందాలు జనమందారం వందే సాయి మహేశ్వర తుర్యాతీత పదస్థితం సకరుణం జ్ఞానాగ్ని శేషస్థితం మజ్జమాంతర పుణ్యపాక విశత్రాప్తం సదురుం సచ సాయిశ్వర అలంబేన విహీనం యోమాహం పరిపూర్ణం నిశ్యత్తమ గురురూపం తత్ బ్రహ్మ స్వరూపా పరమమహేశ్వర స్వరూపుడు సచ్చినానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య శ్రీ చరణాల విందాలను ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఈ సాయంకాలం వేళ ఒక రెండు నెలల క్రితం నవంబర్ ఇరవై ఒకటి కుకట్ పల్లి సమితి ఒక సంకల్పం చేసుకున్నప్పుడు ఏదో ఒక వక్త కాసేపు తనకు తోచిన నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు అని ఒక భావన కలిగినప్పుడు ఈ ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలని, విశేషాలని, రహస్యాలని, మర్మాలని, లోతులని, గాఢతని వీటన్నింటినీ కూడా మనం పదే పదే పంచుకోవటం ద్వారా భారతీయమైన సనాతనమైన ఆర్షమైనటువంటి ఒక ధర్మం మనందరికీ కూడా జీవితంలో అక్కరకు వస్తుందని అందులో ప్రధానంగా కాస్త అరవై ప్లస్ సీనియర్ సిటిజన్లు అనే మాట అనగానే అరవై ప్లసా డెబ్బై ప్లసా ప్రశ్నే కదా [నవ్వు] అరవై ప్లస్ younger old డెబ్బై ప్లస్ just old ఎయిటీ ప్లస్ elderly నైంటీ ప్లస్ అయితే అప్పుడు అందాం senior citizen సార్ కదా concessions పక్కన పెడితే కాబట్టి మనసుకు వయస్సు లేదు వయస్సుకు మనస్సు లేదు ఇది విచిత్రం young man ఉంటాడు వాడికి ఇరవై రెండు ఏళ్ళు ఉంటాయి ఈ సత్సంగాలకు లాగెందుకంటాడు తొంభై ఏళ్ళు వస్తాయి జీన్స్ ప్యాంటు వేసుకుని రోడ్ మీద పరిగెత్తుతుంటాడు ఎందుకు తిరుగుతుంటాడో తెలీదు అంటే వయస్సు మనస్సును నియంత్రించని ఒక దౌర్బల్యం ఈ జాతి ఏర్పరచుకుంది ఇది సాంప్రదాయకమైనటువంటి వ్యవహారంగా కాక మనం ఒక తరం అంతా ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిన కారణంగా తాతగారికి ఒక జీన్స్ ప్యాంటు టీ షర్టు తెచ్చి ఇస్తే ఆయన వేసుకుని తిరుగుతుంటే పిల్లవాడికి ఆనందం వాడికి ఆనందం కలిగించాలని ఈయన బెర్ముడా లు వేసుకుని పార్కుల్లో చుట్టూ తిరగడం కదా ఇది భారతీయమైనటువంటి పరిణామ దేశ కాదు నాగరికతలో దీన్ని కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే అధ్యాత్మ వేరు జీవితం వేరా అనే ప్రశ్న మన మనసులో కలిగినట్లయితే జవాబు ఒక్కటే అధ్యాత్మతో కూడిన జీవితమే సంపూర్ణ జీవితం అది వేరు ఇది వేరు కాదు అధ్యాత్మ లేకుండా కేవలం materialistic భౌతిక వాదంతో గనుక జీవితం గడిపినట్లయితే అది మోయలేని భారము అది తీరని బాధ కాబట్టి ఈ senior citizens కి ఈ వృద్ధాప్యం ఎలా గడుస్తుందో అనేటువంటి ఒక బెంగ ఉంది భజగోవిందంలోనూ వివేక చూడామణి లోనూ శంకర భగవత్పాదులు ఈ వయస్సు మళ్ళినటువంటి ఒక వ్యక్తి రాత్రిపూట ఏం చేస్తాడు అని పరిప్రాజకులు అయినటువంటి శంకర భగవత్పాదుల మదిలో ఒక భావన కలిగినప్పుడు ఆయన దాన్ని వర్ణించారు ఎలా వర్ణించారు అంటే చుట్టూ ఉన్నటువంటి పరిజనము పరివారము బంధువులు కుటుంబ సభ్యులంతా నిద్రపోతూ ఉంటే ఈ వృద్ధుడు లేచి కూర్చున్నాడట నిద్ర పట్టక కాదు నిద్రపడితే ఏమన్నా అయిపోతాయా ఎట్లా అని ఒకటి రెండవది తన మోకాళ్ళ మీద కుడి మోచేతిని ఆనించి పిడికిలి గుంచి దానిని గడ్డం కింద ఆనించి చూపులు ఎక్కడో దేనివైపో లగ్నం చేసి తెల్లవారుతుందా మళ్ళీ సూర్యుడిని చూస్తానా నా బంధువులంతా ఉంటారా అవును రేపు ఏమైపోతుంది ఈ ఆలోచనలతో ఉండిపోతాడట చూశారా మన ఉత్పాతాలు ఎప్పుడు చూశారు వాళ్ళని ఇళ్ళల్లో పెంచి చూడక్కర్లే సర్వ ప్రపంచము వాళ్ళ మమో యవనిక మీద తెరమీద అట్లా నడుస్తూ ఉంటుంది కనుక మరి ఈ చింతాక్రాంతమై ప్రతిరోజూ ఇట్లాగే గడిపినట్లయితే కాలం ఏమన్నా ఆగుతుందా ఆగాదు మరి దీనికి పరిష్కారం ఏమిటి ఇది ఒక ప్రశ్న రెండవది మనిషికి ఆరు దశలు ఉంటాయి జీవితంలో ఒక్కొక్క దశ పదహారు కళలతో విరాజిల్లుతుంటుంది పదహారు ఏళ్ళు దాని వయస్సు ఆరు పదహారులు తొంభై ఆరు అధిక మాసాలు కలిపితే వంద వంద పక్కన పెడదాం ఆ నాలుగు సంవత్సరాలు మనమే కాస్త discount ఇస్తే తొంభై ఆరు అనుకున్నట్లయితే ఇది ఎట్లా ఎక్కడ సాగుతుంది అంటే తొలి పదహారు సామాన్య మానవుడి జీవితం ఎట్లా సాగుతుంది అంటే బాల్యంలో గడిచిపోతుంది అప్పుడే యవ్వనారంభ వేళలు వస్తాయి adolescent innocence adolescent arrogance adolescent ignorance యవ్వన ప్రారంభ వేళ కలిగేటువంటి మూడు పారిశ్రామికులుఇది దాటి రెండో దాంట్లో ఇంకో పదహారు ఏళ్ళు గడుపుతారు, ముప్పై రెండు ఏళ్ళు వస్తాయి. వచ్చేప్పటికి అప్పటికే కాల ప్రవాహంలో సంసార సాగరంలో కాళ్ళు గట్టిగా నేలకు ముంచి నిలబడే ప్రయత్నం చేసే వేళ అది. ముప్పై రెండుకు పదహారు కలిపితే నలభై ఎనిమిది యాభై ఏడు వచ్చేస్తాయి. సముద్ర మధ్యలో నావ చేరుతుందన్నమాట, గట్టు అటు కాదు ఇటు కాదు. ఆ కెరణ శరత్ పూర్ణిమా వ్రత శశాంక లిలిత వచపితానం, ఈ కెరణ భైరవందకార చటాత్రంత భూమి, అందు నన్నేర స్పారిభవన్నవీర శపాల తాతుతి పూనివుండి, ఎందు సగమందు సగముంటియౌ రా నేను, ఎక్కడున్నా నేను? సగం వయస్సు ఎక్కువైంది. మిగిలిన సగం ఎట్లా గడుస్తుందో తెలియదు. కాబట్టి పుట్టుమిట్టాడుతూ ఉంటారు. అది నమ్మి నా మనస్థితి. యాభై అంటే నలభై ఎనిమిది ప్లస్ పదహారు అరవై నాలుగు వచ్చేప్పటికీ ఉద్యోగంలో నుంచి మనం విరమించుకుంటాం, కార్యకలాపాలు అయిపోతాయి. అయిపోయి కూడా నాలుగేళ్ళు అయిపోతుంటాయి. ఉద్యోగము ఉన్నంత కాలం ఏమనుకున్నాం అంటే భగవంతుని గురించి కాసేపు మాట్లాడు అని అనుకుంటే, రిటైర్ అయ్యాక అన్నాడు. ఆ రిటైర్ అయ్యే ముందు నలభై ఏట ఎవరో వచ్చారు పెద్దవారు నాలుగు మంచి మాటలు విందాం రా అంటే, ఇప్పుడు కాదు రిటైర్ అయ్యాక అనుకుంటూ ప్రతిదీ రిటైర్ అయ్యాక అంటే మనకు మనమే ఒక గ్యారెంటీ వారంటీ కార్డు రాసుకుని జేబులో పెట్టుకుని అరవై ఏళ్ళు ఖచ్చితంగా ఉంటామని పెద్ద నమ్మకంతో పోస్ట్ రిటైర్మెంట్ ఆక్టివిటీ ఏమిటంటే ఏమీ చేయలేం కాబట్టి అప్పుడు భగవద్గీత బయటకు తీద్దాం అనుకున్నాం కదా! సరే తీసేప్పటికి కృష్ణుడు ఎవడో తెలియదు అర్జునుడు ఎవడో తెలియదు వాళ్ళిద్దరి రిలేషన్ తెలియదు. ఆయన సంస్కృతంలో శ్లోకాలు చెబుతున్నాడు అవి ఏమీ అర్థం కావు. ఇదంతా గందరగోళంగా ఉంది మొదటి పాఠానికి రెండో పాఠానికి దర్శనం. అంతా నేనే చేస్తున్నానని అనుకోవద్దంటాడు, చేస్తున్నదే నేను అనుకో అంటాడు. ఫలితం ఆశించకుండా కర్మలు చేయండి అంటాడు. ఒకవేళ నీకేదైనా ఫలితం వస్తే అదంతా వదిలిపెట్టేయమంటున్నాడు. ఇది చాలా బాలేదు ఇది. దీని కంటే ఇంకే మార్గం ఏంటి? దొరకదు. చూశారా? ఆ అరవై నాలుగు వచ్చేప్పటికి ఈ మీమాంసలో పడిపోతాం. మళ్ళీ ఇంకో పదహారు నుంచి కలుస్తాయి దానికి ఎనభై. ఎనభై వచ్చేప్పటికీ ఈ కుమ్మడి పాద సంసారం పెరిగిపోయింది ముని మనవళ్ళు వచ్చేశారు. కొడుకులైనారు, పుత్రులైనారు, మనవళ్లైనారు, ముని మనవళ్ళు వచ్చారు. ఇక వాడికి బంగారం పొంగరం చేయించామా? ఉగ్గు గిండ కొందామా? మళ్ళీ అది కొత్త ప్రసంగం అంటే బంగారం సంకెళ్ళు మొదలవుతాయి. ముందు కొన్ని సంకెళ్ళు, తర్వాత ఇనప సంకెళ్ళు, తర్వాత వెండి సంకెళ్ళు, తర్వాత బంగారం సంకెళ్ళు. పదార్థం మారుతున్నదే కానీ సంకెలు మాత్రం బంధనం మాత్రం మారటం లేదు. ఆ బంధనం బాంధవ్యంలో నుంచి పుట్టింది గనుక అది నెమ్మదిగా అనురాగాన్ని దాటి, మోహంలోకి దింపి, ఆ మోహం వ్యామోహమై, వ్యామోహం వ్యసనమై కడగా మిగిలిన సమయమంతా ఏం చేయాలి? అన్నటువంటి ఒక వైరాగ్య విషాద భూమికలో జీవుడు అయిపోతాడు. అయితే చాలామంది అధ్యాత్మ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే, అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఇవాళ పోస్ట్ రిటైర్మెంట్ లో డబల్ సాలరీతో ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి భయం లేదు. ఉద్యోగానికి ఢోకా లేదు. డబ్బుకి ఢోకా లేదు. కానీ శాంతి మాత్రం ఎవరిస్తారు? చిత్ర శాంతి ఎవరిస్తారు? మనిషికి రెండు ఒక భయం ఒక కోరిక జమిలిగా ఏకకాలంలో జీవుడిని పీడిస్తూ ఉంటాయి. ఒకటి ఇక్కడ చాలా ఎక్కువ కాలం ఉండాలి అనే కోరిక ఒకటి, అది చాలా బలీయమైన కోరిక. రెండవది ఎప్పుడు మృత్యువు పంజా విసురుతుందో అనే రెండో. మొదటిది ఆలోచించేలోగా రెండోది, రెండో దాని గురించి ఆలోచించేలోగా మొదటిది, పరస్పర ఘర్షణ ప్రారంభమై జీవుడిలో ఆ శాంతి హరించిపోతుంది గనుక దీనికి రాజమార్గం ఏదన్నా ఉన్నదా అని ముందు వెతకడు. ఎస్కేప్ రూట్ ఏదన్నా ఉందా వెతుకుతాడు. ఈ బాధ నుంచి తప్పించుకోవటానికి ఏమిటి? వాడికి అప్పుడు గుర్తొచ్చేది గుడి. చూశారా? అక్కడుంటే ఎవ్వరు మనల్ని వాళ్ళు, ఏదో ఆ దేవుడి దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడుకుని వెళ్ళిపోతే బాగుంటుంది హాయిగా, కొంత శాంతిని పొందినట్టుగా భ్రాంతి చెంది వెళ్తాడు గనుక ఈ వయోధికులైనటువంటి వారు జీవితాన్ని ఎట్లా గడపాలి? అనే ప్రశ్న ప్రతి వ్యక్తికి కూడా కలుగుతుంది గనుక కాస్త ముందు వెరకగా అందరమూ వృద్ధాప్యంలోకి వెళ్ళవలసిన వాళ్ళమే గనుక ఆ నిరంతర చింతనా భూమికని గనుక ముందే మనం ప్రారంభించుకున్నట్లయితే బాగుంటుంది అనేది ధూర్జటి మహా కవి ఒక గద్యం చెప్పాడు. దంతంబుల్ పడనప్పుడే, తనువునందారోఢియున్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, కురుల్ బెల్బెల్లకానప్పుడే, చింతింపన్ వలె నీ పదాబ్జములను శ్రీ కాళహస్తీశ్వరా! ఇదిగో నీ వయస్సులో ఈ చిన్న పిల్లలు గనుక బాల వికాస్ అని స్వామి పేరు పెట్టారే, ఆ వయస్సులో గనుక ఇటువంటి సత్సంగనికి, ఇటువంటి సంకీర్తనకి, ఇటువంటి భావన ఉన్నటువంటి చోటికి ఆ పిల్లలు గనుక వెళ్ళినట్టయితే వాడి జీవితం ఎందుకంటే ఓ ఎనిమిదేళ్ళో తొమ్మిదేళ్ళో వచ్చి ఇక్కడికి వస్తాడు, తొంభై ఒక్క సంవత్సరాలు ఇంకా వాడు ఇక్కడ జీవించగలడు.జీవించటానికి కావలసిన సంపత్తి, విజ్ఞాన సంపత్తి, భావనా సంపత్తి సమృద్ధిగా వాడికి లభించి జీవితంలో ఏ కష్టం రానివ్వండి, ఏ సుఖం రానివ్వండి, ఎన్ని ఒత్తిళ్లు రానివ్వండి, ఎదుర్కోగలిగినటువంటి స్థితి వాడికి కలుగుతుంది. ఇది కానీ వాడు వృద్ధుడైనప్పుడు వెతుక్కుంటాడు. ఆ వెతుక్కున్నప్పుడు ఏమీ అర్థం కాదు. ఫ్యూజన్ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువుంటుంది. విజన్ కంటే డివిజన్ ఎక్కువుంటుంది. అంతర్గతమైన మానసిక ఘర్షణ ఉంటుంది. మరి వీటన్నింటినీ వరంగా భావించాలా? శాపంగా భావించాలా? ఆశావహ దృక్పథంతో ప్రతికూలంగా కనుక కాక అనుకూలంగా ఆలోచించినట్లయితే నా దృష్టిలో వృద్ధాప్యం అనేది ఒక దివ్యవరం. [దగ్గిన శబ్దం] దీనిని మించిన కాలం ఈ పదహారేళ్లు అరవైనాలుగు తర్వాత అరవైనాలుగు మించి ఎనభై వరకు ఖచ్చితం. ఎందుకంటే చివరి ఇరవై ఏమో అది ఎట్లా గడుస్తుందో ఎవరి చేతుల్లోనూ లేదు. పనికొచ్చేట్లుగా ఉంటుందో, పనికిరాకుండా ఉంటుందో, ఏ ఇంద్రియాలు ఈ ప్రపంచాన్ని చూట్టానికి అలవాటు పడి ప్రాపంచిక, భౌతిక, లౌకిక ఆనందంలో అది కొట్టుమిట్టాడుతూ ఇంతకాలం గడిపిందో, అది దీనిని దాటి అతీంద్రియమైనటువంటి అద్వైత భావనా భూమికలోకి వెళ్లి నెలకొన చెందుతుందో లేదో, ఆనాటి కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఎవ్వరికీ ఎరుక లేదు గనుక అరవైనాలుగువ సంవత్సరం నుంచి సీనియర్ సిటిజన్ అని గనక అనుకున్నట్లయితే ఈ వరాన్ని దివ్యవరంగా ఎలా మార్చుకోవాలిరా ఒక ఆలోచన మనం చేయాలి. ఏం చేస్తే బావుంటుంది? [దగ్గిన శబ్దం] కనీసం పోస్ట్ రిటైర్మెంట్ అయిన మరుక్షణం ఎవరైతే ఇక ఉద్యోగాలు నేను చేయను, నా పిల్లల బా-బాధ్యతలన్నీ నేను పూర్తి చేసేశాను. వాళ్ల సంసారాన్ని వాళ్లే మోయాలి, వాళ్లే నడపాలి. నేను ఊరికే సాక్షిభూతుడిగా ఉంటాను. దేంట్లో ఇంటర్ఫియర్ కాను, ఇంటర్వీన్ కాను అని గనుక మొట్టమొదట కుటుంబపరునిగా మనం నిర్ణయించుకున్నట్లయితే ముందు కుటుంబంలో గౌరవం లభిస్తుంది. కుటుంబంలో ఒక వృద్ధుడికి గౌరవం ఎందుకు పోతుంది అంటే తన తర్వాత తన తన కంటే పర్ఫెక్ట్ గా లేదని, అది చాలా తప్పులు చేస్తుందని, దానికి జీవించడం తెలియదని, ప్రతి చిన్న విషయంలో ఇంటర్ఫియర్ అవుతాడు, ఇంటర్వీన్ అవుతాడు, కకావికలం చేస్తాడు. వాడి బతుకుని వాడు బతకనివ్వడు. ఇది యదార్థం. దానివల్ల ఈ ముసలాయన కనపడకపోతే బావుండునని కొన్నాళ్లు, ఈయన నుంచి తప్పించుకు పోతే బావుండునని కొన్నాళ్లు, ఇక వాడికి తీసుకెస్తే వీడు ఎప్పుడు పోతాడో అని ఆ తర్వాత ఫైనల్ గా కదా. ఇది ఈ దుస్థితి మనకి రాకూడదు. వృద్ధులకు రాకూడదు. అంటే ఆధ్యాత్మికత అంటే అతివాస్తవికంగా మాట్లాడటమే ఆధ్యాత్మికం. ఓ కవిత్వం, ఒక భావన, ఒక కల్పన, ఒక ఊహ, ఇది ఆధ్యాత్మికం కాదు. Absolute priority ఏంటంటే జీవితాన్ని స్పష్టంగా జీవించగలగటం. జీవితం మనకు ఎట్లా వస్తే దాన్ని అట్లా అంగీకరిస్తూ వెళ్ళి, మనకు కలిగినటువంటి వృద్ధాప్యంలో అప్పటికి కొడుకులకు పెళ్లిళ్లు అవుతాయి, కూతుళ్లకు పెళ్లిళ్లు అవుతాయి. మనవళ్లు, మనవరాళ్లు ఏర్పడాలి, ఏర్పడిత్తారు, ఏర్పడి తీరుతాయి. వాళ్లందరితో ఆ సంబంధ బాంధవ్యాలు ఎంత జాగ్రత్తగా తామరాకు మీద నీటి బొట్టు వలె పద్మపత్రం లోంభసా. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. జీవితమంతా అలా గడపలేకపోయినా వృద్ధాప్యంలో జరుగుతున్నటువంటి అనేక సందర్భాలని, సన్నివేశాలని గౌరవప్రదంగా చూస్తూ గనుక దాన్ని వదిలిపెట్టి వాళ్ళు అడిగినప్పుడు సముచిత సలహా ఇవ్వాలి. ఉచిత సలహా అగౌరవంగా తెలుస్తుంది. సముచితం, ఔచిత్యంతో కూడిన సలహా. మన జీవితానుభవం మన వెనక ఉన్నది FDలు, ఆస్తులు కాదు. జీవితానుభవం మన దగ్గర ఉన్నటువంటి కార్పస్ ఫండ్ అన్నమాట. ఆ-ఆ అనుభవంతో గనక వాటిని మనం నడిపించగలిగినట్లయితే
YouTube · audio
Vrudhapayam - oka divya varam PART-1
Vrudhapayam - oka divya varam PART-1
Source: SathyaSai Seva Sadan on YouTube
0:00 / 16:40
More in this series