Skip to content
Transcript తెలుగు
వచ్చినట్లయితే జన్మ ఎత్తినందుకు నేను కూడా మరొకరికి ఉపయోగపడగలిగాను. అనే సేవ మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. [కప్స్] సంద అహాన్ని పెంచుతుంది. దానం అహాన్ని పెంచుతుంది. బలి చక్రవర్తి కథ మనకు తెలియంది కాదు. దాన అహంకారంతో పాతాళానికి వెళ్ళిపోయినాడు ఆయన. అహంకారంతో చేయకూడదు. అనురాగంతో చేయాలి. ప్రేమతో చేయాలి. దివ్య భావనతో చేయాలి. నాలో ఉన్న ఆత్మను నేను ఎరగడం గొప్ప విషయం కాదు. అందరి యందు అదే ఆత్మ ఉన్నదని నేను గమనించగలిగితే నేను పూర్ణుడిని అవుతా. కదా. నా యందు మాత్రమే ఆత్మ ఉన్నదని దాని ఒక్కడినే నేను ఒక్కడినే పట్టుకున్నానని కాబట్టి నేను జీవన్ముక్తుడిని అయితే అది నీకు వ్యక్తిగతమైన లాభమే. కానీ అందరి యందు విపీలికాది బ్రహ్మ పర్యంతం అన్నది వేదాంతం. జీవ దగ్గర నుంచి శివుడి వరకు ఉన్నదంతా ఒకటే. శివుడు ఎట్లా నడుస్తున్నాడో జీవ అట్లాగే నడుస్తుంది. శివుడికి ఎట్లా మూడో కన్నుందో జీవకి మీకు నాకు అందరికీ అవే ఉన్నాయి. అనేటువంటి ఉదాత్త భావనలన్నీ కూడా మనకు వృద్ధాప్యంలో గనుక కలిగితే చాలా భ్రమలు తొలగిపోతాయి. తొలగిపోయి ఇక అతి వాస్తవికంగా absolute reality తో జీవించగలిగిన ఒక అవకాశం దక్కస్తుంది. ఇక మూడవ aspect కొస్తే మనవోటి వాళ్ళం ఇవాళ ఒక స్నేహితుడు మధ్య కలిసాడు. పాత రోజుల్లో ఏదో nominal గా pension వచ్చే రోజులు బాగుండేవండి. దాంట్లో అన్ని దొరికేవి. seventh pay commission వచ్చింది. జీతం కంటే ఎక్కువ. దాని వల్ల [కప్స్] డబ్బు మీద మమకారం పెరిగింది. మా వాళ్ళకి నా మీద గౌరవం పోయిందండి అన్నాడు. seventh అయిన తర్వాత eighth కూడా అందుకోవాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. దీన్ని shares లో ఎట్లా పెట్టాలి, ఇంకెక్కడ పెట్టాలి, real estate లో ఎక్కడ పెట్టాలి అంటే సంపదను వృద్ధి చేయాలి అన్నటువంటి ఆలోచన ఎప్పుడైతే వృద్ధాప్యంలో కలుగుతుందో జీవుడికి శాంతి ఉండదు. వృద్ధాప్యంలో మనిషికి రెండు కావాలి. డబ్బు కాదా ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, శాంతి కావాలి. మూడు ఎక్కడి నుంచి వస్తాయి. ఎవరైనా ఇస్తారా? ఆనందాన్ని ఒకడు ఇవ్వగలడా? ఇవ్వలేడు. శాంతిని ఇంకొకడు తెచ్చి మన ఒళ్ళో పడేయగలడా? వాడి వల్ల కాదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది అంటే తృప్తిలో నుంచి వస్తుంది. భగవంతుడు నాకు చక్కని జీవితాన్ని ఇచ్చి ఇంతవరకు ఎనభై ఏళ్ళు డెభై ఏళ్ళు touch wood అంటామే. రకమైన ఇబ్బంది లేకుండా అననుకూలం లేకుండా ప్రశాంతమైన ప్రసన్నమైనటువంటి ఒక నిస్తంద మంద్ర ప్రవాహం లాగా జీవితాన్ని సాగించిన ఈశ్వరుడు ఎంత దయామయుడు అని ప్రతిరోజు అనుకోగలిగితే, దాన్ని మించిన పూజ ఉన్నదా? దాన్ని మించిన స్తోత్రాలు అవసరమా? కృతజ్ఞతా పూర్వకమైనటువంటి జీవి వాడు నిత్య తృప్తుడు అయి ఉంటాడు. గత కాలంలో తాను నడిచి వచ్చినటువంటి గడిచి వచ్చినటువంటి కాలాన్ని వ్యక్తురలి నిత్య స్మరణని చేస్తూ ఉన్నట్లయితే మనిషికి ఉజ్వలమైనటువంటి భావాలు కలుగుతాయి. ఫలానా వాడితో మనల్ని మనం compare చేసుకొని పోలికలో ఒక న్యూనత ఆత్మ న్యూనతని కలిగే కంటే పొందే కంటే పరమేశ్వరుడు నాకు ఏం రోడ్ చేశాడు, నాకు ఏం తక్కువ అన్న ఒక భావన మనల్ని చాలా బలవంతుల్ని చేస్తుంది. సర్వ ఈశ్వర్యాలు మనకు కలిగిన భావన ఉంటుంది. సర్వ ఈశ్వర్యాలు లోకంలో చెప్పే cash ఎంత ఉంటుందో సరి. స్వామి ఇద్దరు కూర్చుని ఉన్నారు వరండాలో రోజులు నాటి మాట. ఒకాయన వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారో ఆయనకి స్వామికి తెలుసు. ఏదో అవసరం ఉండి డబ్బు కావాలి స్వామి అనుగ్రహం ఉంటే కాస్త ఇంకాస్త ఎక్కువ డబ్బు వస్తే కావాలి అన్న వాళ్ళు ఏమన్నారంటే "నీకు cash వద్దులే ash పుచ్చుకో" అన్నారు. అది cash అది ఎప్పుడైనా పోయేది కరిగిపోయేది ash పుచ్చుకో అన్నారు విభూతి ఇచ్చారు. వాడికి తెలియదు దాని విలువ. షడైశ్వర్యాలకు మూలమైన విభూతిని అనుగ్రహించారు. నాకు స్వామి విభూతి ఇస్తే బాగుండు ఏదో కష్టం వచ్చింది తీరిపోతుందని కూర్చున్న వాడికి "నీకు అంతా సర్వం సుఖం. నీకు కావలసినవన్నీ సంపదలు ఏర్పడతాయి" అన్నారు. అంటే ash కావలసిన వారికి cash ఇచ్చారు. cash కావలసిన వారికి ash ఇచ్చారు. మరి మనకి cash కావాలా ఇప్పుడు ash కావాలా అని మనకి ash కావాలి. అది ఏది irrecoverable process అంటాం chemistry లో అంటే మరలి మరలిరాని మళ్ళీ అదే రూపం రానటువంటి పురాకృతమైనటువంటి పుణ్య విశేషం చేత ఏర్పడేటువంటి ఒక జన్మ రాహిత్యాన్ని, జన్మ రాహిత్యం అంటే మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండటం కాదు. ఇదే భావన మళ్ళీ పుట్టకుండా అని అర్థం. జన్మలు కలుగుతూనే ఉంటాయి. ఎప్పటిదాకా కలుగుతాయి అంటే జన్మ ఎత్తవలసిన అవసరం లేని పనులు చేయవలసిన time ఉన్నంత వరకు ఎత్తవలసిందే. ఇక అవసరం లేనప్పుడు మాత్రం ఇక మనకి జన్మ ఉండదు. అది ఒక జన్మ వెయ్యి జన్మలా కోటి జన్మలా అంటే ఎన్ని జన్మలో తెలీదు. దానికి లెక్క లేదు. అది ఒక అనంత ప్రవాహం. కాబట్టి జరిగిపోయినది మనది కాదు, జరగబోయేది మన చేతిలో లేదు కానీ వర్తమానం మాత్రం ఇవాళ మన చేతిలో ఉంది. గడుపుతున్న ఒక్క గంట అధ్యాత్మ ఇది. ఇది మనల్ని మళ్ళీ ఇరవై నాలుగు గంటలు బ్రతికిస్తుంది కదా. మాటలన్నీ మనం తలుచుకున్నప్పుడు జీవితాన్ని స్పష్టంగా చాలా systematic గా చాలా ధర్మబద్ధంగా కర్మబద్ధంగా మన వెనుక జీవించగలిగినట్లయితే అది పరమాద్భుతమైన అధ్యాత్మ భూమిక. అధ్యాత్మ అనంగానే అదేదో పెద్ద పండితులు వాడే పదమనిఅది మనకి ఇప్పట్లో వచ్చేది కాదని పెద్ద పెద్ద వాళ్ళంతా మాట్లాడుకునేదని అనుకుంటాం. జీవితాన్ని స్పష్టంగా జీవించగలగటమే అధ్యాత్మ. అనుకున్నది జరగదని, నాకున్నది తప్పదు అనే భావన ఎప్పుడైతే స్థిమిత పడుతుందో అది అధ్యాత్మ. నేను జన్మ ఎత్తినందుకు నా ఉనికి, నా అస్తిత్వము, నా వ్యక్తిత్వము, నా రూపము, నా దేహము, నా సంపద, నా కీర్తి, నా జ్ఞానము ప్రపంచానికి ఉపయోగపడుతున్నది అనేటువంటి ఒక తృప్తి లో నుంచి వచ్చేటువంటి ఆనందమే ఆనందం కాబట్టి సర్వానందమయమైనటువంటి జీవితాన్ని అరవై నాలుగు ప్లస్ వాళ్ళంతా కూడా వృద్ధాప్యాన్ని ఒక వరంగా మార్చుకోవాలి. దిగులు వదిలిపెట్టండి. ఎందుకంటే దిగులు తీరేది కాదు. కదా! పుట్టిన దాకా తెగులు వదిలేది కాదు. మరి ఏం కావాలి? భగవంతుని యందు ప్రేమ. భగవంతుణ్ణి పూజించటం, కీర్తించటం, ఊరేగించటం, ఆరాధించటం ఒక ప్రాథమిక స్థాయి. భగవంతుణ్ణి కూడా మనం ప్రేమించగలగాలి. అటువంటి హృదయాన్ని మనం గనక పొందగలిగినట్లైతే పరమేశ్వరుడ్ని ప్రేమించాలన్న భావన మనకు కలగాలి. పరమేశ్వరుడు మనల్ని ప్రేమించడం ఆయనకి ప్రేమ తప్ప ఇంకోటి తెలియదు. మనకన్నీ ఉన్నాయి. అవన్నీ దాటి భగవంతుడు అంటే కేవల నామరూపాలతో కూడిన ఒక రూపం కాదని, సహస్ర బాహులతో, సహస్ర నామాలతో అనేకమైన భావాలతో సర్వ ప్రకృతిని, చరాచరమైన జగత్తుని ఆవహించి, ఆవేశించి ఉన్నటువంటి, ఆవరించి ఉన్నటువంటి పరమాత్మ లేనిదెక్కడ? సర్వం ఖల్విదం బ్రహ్మ. ఉన్నదంతా బ్రహ్మమే అన్నటువంటి వేదాంత వాక్యాన్ని గనక మనం అర్థం చేసుకున్నట్లయితే, జీవలో, దెయ్యములో, శివకేశవులలో అన్నారు జాగరాజ పురంలో. అది practice చేయాలి. చెప్పటం వేరు. మంచి మాట చెప్పటం చాలా తేలిక. కానీ మంచి ఆచరించటం చాలా కష్టం. ఎన్నో ఎన్నో అన్నిటికంటే ముందు మన మనసు అడ్డం వస్తుంది. వృద్ధాప్యంలో మనకున్నటువంటి సంపదలు చందాయి పెట్టం, దానం ఇవ్వటం, ఎవరో ఒకరిని ఇట్టా డబ్బు ఇవ్వటం, వ్యక్తిగత త్యాగాలు వృథా. ప్రపంచంలో పనికి రావు. అవేమీ చేయకండి. ఎందుకనంటే సామూహికమైన సేవ చేయండి. వ్యక్తిగత త్యాగంలో మీ అహం ప్రదర్శించబడుతుంది. సామూహికమైన సేవలో అహం నశిస్తుంది. ఇవాళ అహం నశించాలి. సేవ ద్వారా అహం పోగొట్టుకోవాలి, ప్రేమను పెంచుకోవాలి. అలాగే చేయటం వేరు, చేయించటం వేరు, చేసుకోవటం వేరు. చూసారా! ఒక ఇల్లాలు చక్కగా అన్నం ఉండుతుంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికీ ఒక్కప్పుడు చెప్తుంది, "మీరు వడ్డించండి. తయారు చేయటంతోనే నా time, నాకు అలసట వచ్చేసింది. మీరెవరో ఒకళ్ళు వడ్డించండి" అంటుంది. లేదా ఎవరో భవతి భిక్షాందేహి అని వాకిట్లో అమ్మా ఆకలి అని ఎవరో వస్తారు. "అరే వాళ్ళకి కాస్త ముద్ద పెట్టురా" అంటుంది ఇల్లాలు. అనకండి. వెళ్ళి పెట్టండి. స్వయంగా చేయండి. ఏం చేసుకోవాలో చేసుకోవటం చాలా important. ఎందుకంటే శబరి కథ శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథవారు వర్ణించిన తీరు మనందరికీ కూడా ఒక ఉత్తేజాన్ని కలిగిస్తుంది. శ్రీరామచంద్ర దర్శనం కోసమే శబరి అనే గిరిజన స్త్రీ అరణ్యంలో ఉన్నది. మాతంగ మహామునిని సేవించిందమె. ఆయన కంట పడకుండా, అంటే ఆయన కుటీరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కుటీరమంతా శుభ్రపరచి, ఆయన బట్టలన్నీ ఉతికి, ఆరేసి, చలువ చేసి, మడత పెట్టి, ముగ్గులు వేసి, అలంకారం చేసి ఉంచింది. కానీ సేవ చేసినంత కాలం ఒక్కరోజు కూడా మాతంగ మహాముని ఎట్లా ఉంటాడో చూద్దామని ఆమెకు అనిపించలేదు. కానీ ఒకరోజున మాతంగ మహాముని శబరి దగ్గరకు వచ్చి, "శబరి! రేపు శ్రీరామచంద్రుడు వస్తున్నాడిక్కడ. నువ్వు ఆయన్ని దర్శనం చేసుకో" అని అన్నప్పుడు అంత చదువు లేని శబరి ఒక మాట అడిగింది, "స్వామి! శబరి నువ్వు దర్శనం చేసుకో అని నాతో అంటున్నావే, రామచంద్రుడిని నువ్వు దర్శనం చేసుకోవా? నీకు అక్కర్లేదా?" అని అడిగింది. "ఈ దేహంలో నాకా ప్రాప్తి లేదు. నాకు స్వర్ణరథం రాబోతున్నది. అది ఎక్కి నేను దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. రామచంద్రుడు నువ్వున్న చోటికి రావాలి అంటే ఏడు దారులున్నాయి. దారిన వస్తాడో తెలీదు. కానీ రేపు వస్తున్నాడు" అన్నాడాయన. వెళ్ళిపోయినాడు. శబరి ఏడు దారులు పూలతో నింపేసింది. రాముడు నడిచి వస్తే రాయి గుచ్చుకుంటుందో, ముల్లు గుచ్చుకుంటుందో, రాముడి పాదాలకు కష్టం కలుగుతుందో, ఏడు దారులు శుభ్రపరచి, ఏడు దారులన్నీ కూడా పూలదారులు చేసి అప్పుడే పండినటువంటి మగ్గిన పండ్లన్నీ కూడా తీసి రాముడి కోసం ఎదురు చూస్తే, రాముడు దేవుడే అయినా ఆయన ఒక మార్గంలో నుంచే రావాలి. మనలాగని. ఏడు దారుల్లో ఏడు రాముళ్ళు రారు కదా. ఏడుగురు రారు. రాముడు రానే వచ్చాడు. రాముడు కరుణాపూర్ణ సుతాప్తి. సంపూర్ణ మానవీయ ధర్మమే రాముడు. ప్రాయతి ఇతి రామః. రామ శబ్దంలో ఉన్నటువంటి సౌందర్యం, నిగూఢత, గాఢత, మర్యాద, లలిత మర్యాద నామంలోనూ లేదు. అటువంటి రాముడు శబరి ముందు కూర్చొని ఒక్క ప్రశ్న వేశాడు. "శబరి! ఎందుకు ఇంత కష్టపడ్డావు? పూలు తేవాలా? పూలు అవసరమా? నా దారి అంతా పూలదారిగానే ఉందనుకున్నావా? రాత్రయ్యేప్పటికి నా దగ్గర సీత ఉన్నప్పుడు సీత ప్రతిరోజూ రాత్రి ముళ్ళన్నీ కూడా పాదాల నుంచి తీసి పాదాలు కడిగేది. తర్వాత ఇదిగో మా తమ్ముడు లక్ష్మణుడు చేస్తున్నాడు. నాకు బాటలో నడవటం నాకలవాటే. మరి పూలదారి నువ్వెందుకు చేశావో గానీ, నీ వయస్సు ఎంతో పెద్దది నాకంటే. కళ్ళు, కనుగుడ్లన్నీ కూడా కాజు పింకులవలే ఉన్నాయి. శరీరం అంతా కూడాభూమి నుంచి పైదాకా ఒక సన్నజాజి తీగ ఎట్లాగైతే పూర్తిగా ఎండిపోయిందో, నీ దేహం అట్లా ఎండిపోయినదే. ఇంత కష్టపడవలసిన అవసరం ఉన్నదా? అని అడిగితే, చేతులు నురికి పోని పులు తెచ్చితిరి స్వామి. సతనువగుటను పండ్లు తెచ్చితిరి స్వామి. ఇది శబరి సమాధానం. ఆవిడ senior most citizen. ఏమన్నదో తెలుసా? చేతులు నురికి పోని ఇంకా నా చేతులు ఆడుతున్నాయి. ఇవి ఆడుతున్నాయి గనుక రాము-- నా రాముడికి ఎవరో మీరందరూ నాలుగు గంపలు పళ్ళు తెండని నేను చెప్పలేదు. నేను వెళ్లి కోసుకొచ్చానమ్మా. సతనువగుటను ఇంకా నా దేహం పతనం కాలే. వృద్ధాప్యం వచ్చి ఉండొచ్చు గానీ, కానీ పళ్ళు నేను తీసుకొచ్చాను. నేను కోసుకొచ్చాను. సతనువగుటను పండ్లు తెచ్చితిని స్వామి. అంటే, వయస్సు వచ్చేసింది మనం సేవ చేయక్కర్లేదని అనుకోవద్దు అని. వయస్సు వస్తున్న కొద్ది సేవ చేస్తున్న కొద్ది ఆయుష్షు ఆరోగ్యం పెరుగుతుందని. ఒక సద్భావంతో పాటుగా lighter vein లో పొద్దున్నే మీరు దేవాలయానికి వెళ్లే ఒక అలవాటు, దగ్గరలో ఉన్న దేవాలయానికి. మరీ దూరంగా ఎక్కడున్నా శ్రమ పడకుండా వెళ్ళటం గనక ఒక నియమం గనక పెట్టుకున్నట్లయితే, కోడలు మిమ్మల్ని పాల ప్యాకెట్ తెమ్మన్నప్పుడు ఆయన గుడికి వెళ్తాం అని భయ-- దేవుని అంటే భయం కదా. మామగారంటే భయం లేదు గానీ. కాబట్టి పా-పాల ప్యాకెట్ డ్యూటీ నుంచి ముందు బయట పడిపోతారు. అలాగే ప్రతి సాయంకాలం, ఇగో ఇటువంటి ఇది ఎవరి కోసం ఏర్పాటు చేశారు? గది ఎవరి కోసం పెట్టారు? పెద్దలందరూ రండి. ఇవాళ ఎలా వచ్చారో అలా దగ్గరున్న వాళ్ళందరూ రండి. మీరంతా చదువుకున్న వారు కాబట్టి ఒక రామాయణం తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, లేదు స్వామి వాక్యములు తీసుకోండి. మీకు ఏది ఇష్టమో. మనకి జీవితానికి పనికొచ్చేది చక్కగా స్పష్టంగా చదవగలిగిన వాడు, అనగలిగిన వాడు, విశ్లేషించగలిగిన వాడు. మీరందరూ ఒక గ్రూప్ గా చక్కగా form అవ్వండి. వస్తే మీలో మీరు ఆలోచనలు పంచుకోండి, విశ్లేషించుకోండి. ఇది ఇట్లా కాదేమో, అట్లా ఏమో అని అనుకోండి. రకంగా ఒక స్వాధ్యాయం గనక చేసుకున్నట్లయితే, అదే కోడలు కొడుకు, ఆహ్ ఆహ్ ఎందుకని ప్రస్తావన తెస్తున్నానంటే మనం ప్రపంచంలో సంసారంలో తెలిసి తెలిసి అంత కురుకు పోనక్కర్లేదు. చేయవలసిన బాధ్యతలు చేసాం. తర్వాత వాళ్ళకు వదిలిపెట్టాలి మనం హాయిగా ఉండగలగాలి. హాయి ఎక్కడ ఉన్నదంటే బంధన నుంచి విడిపడితే హాయి. బంధనం లోపల ఉండిపోయినట్లయితే అన్నీ నశించిపోతాయి. మనసే ఒక బానిసత్వానికి అలవాటు అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే ప్రతి సాయంకాలం ప్రతి ఉదయం గుడికి వెళ్తున్నాం అన్నామో వాళ్ళకి మన యందు గౌరవం పెరుగుతుంది. రెండవది మిమ్మల్ని చూసి మీ తర్వాత తరంలో కొడుకు వెంబడి వచ్చినా రాకపోయినా మనవడు వెంబడి వస్తాడు. తాతా నన్ను తీసుకెళ్ళు అంటాడు. నువ్వు రోజూ ఎందుకెళ్తున్నావ్ అంటాడు. ప్రసాదం ఎవరిచ్చారు అంటాడు. గుళ్లో ఇచ్చారురా అంటాడు తాత. మనవడు అంటాడు అయితే నాక్కూడా కావాలి అంటాడు. వాడిని ముందు ప్రసాదం కోసమన్నా రానివ్వండి, తీసుకెళ్ళండి. వెళితే వాడు నెమ్మది నెమ్మదిగా వాడు మనలాగా పెరుగుతాడు. ప్రసాదం నుంచి నెమ్మది నెమ్మదిగా భగవంతుడి వైపు వాడి ఆలోచన మళ్ళుతుంది. రకంగా indirect education ఇస్తాం మన పిల్లలకి. మన తర్వాత తరానికి ఏమివ్వగలం? అదే కదా! అట్లాగే సాయంకాలం ఎప్పుడైతే ప్రతిరోజూ మీరు సత్సంగానికి వెళ్తారో, అది సత్యసాయి organization లో మాత్రమే సాధ్యం. మిగతావన్నీ ఆరు నెలలకోసారి, ఎనిమిది నెలలకోసారి, ఏడాదికోసారి జరిగేది చూస్తా. కానీ స్వామి దాంట్లో నా diary మీకు ఇప్పుడు గనక ఇస్తే సుమారుగా అక్టోబర్ వరకు నిండిపోయి ఉంది. అక్టోబర్ వరకు ప్రతిరోజూ. ఇది ఎట్లా సాధ్యం అంటే ఎక్కడ ఒకటైనా సత్యసాయి organization లో ఇటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులంతా అక్కడికి వస్తారు. అనేక విషయాలు వింటారు, విన్నవాటిని confirm చేసి ఉంటారు. చిన్న doubt ఏదన్నా ఉంటే clear చేసుకుంటారు. అయిపోయి. ఎప్పుడైతే ఇది అలవాటు అవుతుందో
YouTube · audio

Vrudhapayam - oka divya varam PART-4

Home

Vrudhapayam - oka divya varam PART-4

Source: SathyaSai Seva Sadan on YouTube

0:00 / 16:40

More in this series

Vrudhapayam - oka divya varam

4 episodes · 58 min

  1. 16 min 1

    Vrudhapayam - oka divya varam PART-1

  2. 8 min 2

    Vrudhapayam - oka divya varam PART-2

  3. 16 min 3

    Vrudhapayam - oka divya varam PART-3

  4. 16 min 4

    Vrudhapayam - oka divya varam PART-4

    Now playing