Skip to content
Transcript తెలుగు
ఋషులు తాము దర్శించిన దానిని, అనుభవించిన దానిని, పొందవలసిన దానిని పొంది ప్రపంచానికి ఒక కాలాతీతమైన విశ్వజనీన వాంగ్మయాన్ని మనకు అందించారు. అది వేదాలలో చివరి భాగమైనటువంటి వేదాంత భూమిక. వేదాంతమే ఉపనిషత్తులైనప్పుడు శంకర భగవత్పాదుల దివ్యానుగ్రహ విశేషం చేత దశోపనిషత్తులు మనకి అక్కరకు వస్తున్నాయి. అందున కేనోపనిషత్ అత్యంత ప్రధానమైనది కీలకమైనది. ఆస్తికులు, నాస్తికులు, సనాతన వాదులు, సాంప్రదాయ వాదులు అట్లాగే హేతువాదులు చదవవలసి, చదివి అనుభవించవలసి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తే కేనోపనిషత్. కేనోపనిషత్ వర్తమానాన్ని రకంగా వ్యాఖ్యానిస్తున్నది. వర్తమానమే వాస్తవం అంటున్నది. తనువుతో కూడినవన్నీ ఏదో ఒకనాడు ఊడిపోయేవి, మన నుంచి విడిపోయేవి. తనువుతో ఏర్పడే బాంధవ్యాలన్నీ తెల్లవారేవి. ఇదంతా వేదాంతమే. కేనోపనిషత్ స్థూలంగా బోధించేది ఇదే. జరుగుతున్నదంతా తన వల్లనేనన్న అహంకారంతో మనిషి తన మూల శక్తిని విస్మరిస్తుంటాడు. జరగని దానికి ఎవరినో బాధ్యులను చేస్తూ ఆత్మవంచన చేసుకుంటాడు. ఇది జాతి బలహీనత. ఎదుగుతున్న కొద్దీ, ఎరుగుతున్న కొద్దీ జీవితానుభవాలు అంతరంగంలో తారాడుతున్నప్పుడల్లా తనను తాను విశ్లేషించుకునే దశలో తాను నిమిత్త మాత్రుడనని, తనను ఏదో ఒక శక్తి నడిపిస్తున్నదని గ్రహిస్తాడు. మనసుకు లొంగకుండా స్ప్రుహను విస్తృతం చేసుకుంటూ ఉంటే అభిజాత్యన్ని అధిగమించి అహం స్పురణను అనుభవ పరిధిలోకి తెచ్చుకోగలుగుతాడు. సందర్భంలోనే మనిషికి రెండు మార్గాలు ఏర్పడతాయి. నిజానికి ఎదురవుతాయి. ఒకటి తరించే మార్గం, మరొకటి అంతరించే మార్గం. తరించే మార్గం సులభమైనది. అంతరించే మార్గం సంఘర్షణాత్మకం. జీవిత సంగ్రామ రంగం వైరుధ్య సంభరితం. అన్ని వైవిధ్య వైరుధ్యాల మధ్య మనిషి తనను తాను సహజంగా నిలబెట్టుకోవాలి. భౌతిక, నైతిక, ఆధ్యాత్మిక శక్తులను సమన్వయంగా సమపాళ్లలో వినియోగించగల నేర్పును మనిషి అలవరచుకోవాలి. కర్తవ్య నిర్వహణా దక్షత, మనోలయం, ఆత్మ నిగ్రహం వంటి భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మికతలను వివరిస్తూ ఇవన్నీ జయప్రదం కావటానికి ఆధార భూమిక నైతికత, శీల సంపద అవశ్యమని కేనోపనిషత్తు మనకు బోధిస్తున్నది. విషయ వాంఛలను విష్ణు వాంఛలుగా, అరిషడ్వర్గాలను హరిషడ్వర్గాలుగా మార్చుకుంటూ మనిషి చిత్తశుద్ధిని తన సహజ శక్తిగా, లక్షణంగా వినియోగించుకోవాలి. తద్వారా మోహక్షయాన్ని సాధించుకోవాలి. మోహక్షయమే మోక్షం. ఏతావాతా మనిషి అన్నిటినీ అర్థం చేసుకుని ఆచరించవలసిన అధ్యాత్మ సాధనా రీతులను పునః పునః స్మరించుకుంటూ ఉండాలి. జరుగుతున్న ప్రతి సంఘటనను సాక్షిగా చూడగలగటం, జరుగుతున్న ప్రతి విషయం వెనుక బలీయమైన ఏదో ఒక శక్తి ఉన్నదని గ్రహించగలగటం, జీవితాన్ని అధ్యాత్మమయం చేసుకోగలగటం, జీవితాన్ని అతి వాస్తవికంగా జీవించగలగటం, ఆశాభంగాలకు వేరెవరో కారణం కాదని స్వీయ నిర్వహణా లోపమేనని గ్రహించి అలసత్వం వదులుకోవటం వంటి ఆచరణీయ మార్గదర్శకత్వాలను స్వీకరించగలిగితే ఆధునిక సమకాలీన సమాజం భవ్య నవ్య దివ్య భవిష్యత్తును నిర్మించుకోగలదు. జరిగిపోయినదంతా స్ఫూర్తిప్రదం కావాలి. జరుగుతున్నదంతా ఆనందమయం కావాలి. అప్పుడు జరగబోయేదంతా అశావహమై జీవితాన్ని పరమాద్భుతంగా నడిపిస్తుంది.
YouTube · audio

All India Radio Hyderabad | Bhavana | వర్తమానమే వాస్తవం

Home

All India Radio Hyderabad | Bhavana | వర్తమానమే వాస్తవం

Source: AIRTARANGAM on YouTube

0:00 / 3:54

More in this series

All India Radio Hyderabad — Bhavana

4 episodes · 15 min

  1. 4 min 1

    All India Radio Hyderabad | Bhavana | ఎవ్వనిచే జనియుంచు

  2. 3 min 2

    All India Radio Hyderabad | Bhavana | వర్తమానమే వాస్తవం

    Now playing
  3. 3 min 3

    All India Radio Hyderabad | Bhavana | సత్యాన్వేషణ

  4. 3 min 4

    All India Radio Hyderabad | Bhavana | లోచూపు