No transcript for this section.
Transcript begins at 0:00.
ఓ హిందూ మేలుకో! చాలా అందమైనటువంటి పిలుపు ఇది. ఈ పిలుపులో అనేకమైనటువంటి విషయాలు మనస్సును తాకుతూ ఉంటాయి. హైందవ ధర్మాన్ని మనం ఆచరించటం ఎప్పుడైతే మానేస్తామో మళ్ళీ ధర్మం అంటే ఏమిటి? దేశం అంటే ఏమిటి? మళ్ళీ ఆలోచనలు మొదటికి వెళ్ళిపోతాయి. అయితే మహాత్ములైనటువంటి మన ఋషి సాంప్రదాయం మనకు ఒక్కమాట చెప్పింది. అనేక ఉపనిషత్తులు ఉన్నా కూడా ఏకాదశ ఉపనిషత్తులు చక్కగా అధ్యయనం గనుక చేసినట్లయితే ప్రతి ఉపనిషత్తు మానవుడు పూర్ణ మానవుడిగా జీవించటానికి సంపూర్ణత్వాన్ని అందుకోవటానికి వీలైనటువంటి ఒక భావన అవి కల్పించినాయి. వేదవ్యాసుల వారి నుంచి అంటే ద్వాపర యుగం నుంచి నిజానికి కాలాన్ని గనుక మనం ఒక్కసారి గణనలలోకి తీసుకున్నట్లయితే తైత్తరీయమైనటువంటి ఉపనిషత్తులో సత్యం వద ధర్మం చర ఈ మాట హైందవుడైన ప్రతి వాడికి తెలిసిన మాటే. సత్యం వద అంటే ఒక ప్రాథమిక స్థాయిలో అబద్ధం చెప్పకపోతే సత్యం చెప్పినట్లే అని అయిపోయినారు. ధర్మం చర ధర్మాన్ని ఆచరించు. ఇది మాత్రమే కాదు. అసలు ముందు సత్యము అంటే ఏమిటో తెలుసుకున్నట్లయితే మాహేశ్వర శబ్దానికి మాహేశ్వర స్వరూపానికి అంటే పరమశివుడు అనబడేటువంటి మాహేశ్వరమైన concept కి ఇవాళ భాష ఇట్లా చెప్పవలసి వస్తున్నది దురదృష్టం. ఆ పరమేశ్వరుడు అనేటువంటి ఒక భావనకి ముప్పై రెండు కోణాలున్నాయి. ముప్పై రెండు కోణాలలో సత్య అనేటువంటిది ఒక శబ్దం. అది పరమశివుడికి synonym ప్రతీకాత్మకం. ఏది పరమశివము? ఏది మంగళాత్మకము? ఏది శోభస్కరమో? ఏది జగదానంద కారకమో? ఏది జగత్ శోభకు కారణమవుతున్నదో అది శివం. అది మంగళం. అది సంపూర్ణం. దాని యందు రౌద్రమైన రుద్రుడున్నాడు, మనోహరుడున్నాడు, మహేశ్వరుడున్నాడు, లింగమున్నది. చల, అచల, జడ, అజడ, ప్రకృతి, పరాప్రకృతి సర్వమూ వ్యాపించి ఉన్నటువంటి ఆ శబ్దమే సత్య. సత్య అంటే సతతము ఉండేది which is eternal which is indestructible దానిని వినాశకారి కాని ఒక స్థితి ఏదైతే ఉన్నదో నిత్య సత్య శాశ్వత వైభోగ స్థితి ఏదైతే ఉన్నదో అది సత్యమై ఉన్నది. ఆత్మ నిత్యంము కాలాద్య విచ్ఛిన్నము అపరిణామ ప్రాప్తము అప్రమేయం అది అచ తెలివి. ఆత్మ అంటే సత్యమే. సత్యోన్నతుడైనటువంటి వ్యక్తి ఆత్మగతంగా జీవిస్తాడు. ఆత్మ మూడు వందల అరవై డిగ్రీలలో శోభాయమానమైనటువంటి స్థితిని అందుకొని తాను కదలక అన్నింటినీ కదిలిస్తూ ఉంటుంది గనుక ఆ పరిపూర్ణమైనటువంటి సత్యాన్ని వద. నేను సత్యమే, నేను ఆ సత్యమే, నేను ఆ ఆత్మనే అనేటువంటి భావనలో నిలకడ చెందాలి. అది సత్యం వద అంతే. వద అంటే చెప్పటం అనే మాట ఉన్నా చాలా సామాన్యమైన ప్రాథమికమైన అర్థం. పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తను సప్తకంబ యేని ఈ శరీరంబు నీదే. కన్ను విప్పుట, కన్ను మూయుట నీవు కలుగకెట్లు? ఏతత్ అధిష్టాత ఎవడో యజమానుడనిన అష్టన తనువు వాడు. కెరలి నన్నేమి మిగిల్చితిన్ ఆ సామి విట్టు నేనన్నది అభిజ్ఞ గాక. ఈ నేను నేను నేను గా కనిపిస్తున్నటువంటి నేనెవరో తెలుసునా? నువ్వు అనబడేటువంటి సత్యం ఏదైతే ఉన్నదో నిత్య సత్య శాశ్వతమైనటువంటి సద్వస్తువు ఏదైతే ఉన్నదో దానికి ప్రతీకాత్మకమైన భావనలో నేనుగా భౌతికంగా కనబడుతున్నాను. నేను అంటూ కనబడుతున్న ఇదంతా కూడా నేను కాదు నువ్వే. నువ్వు బింబం అయినట్లయితే నేను ప్రతిబింబాన్ని అవుతున్నాను అనేది సత్యం వద. ఇట్లా విజ్ఞాన భూమిక లో గనుక మనం వెళ్లినట్లయితే ఒక్కొక్క ఋషి ఒక్కొక దర్శనాన్ని మనకు అందించారు. దీన్ని మళ్ళీ మన శంకర భగవత్పాదుల సమయానికి వచ్చేప్పటికి అదే విషయాన్ని సర్వమూ బ్రహ్మమయమేనని అంటే సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నటువంటి ఒక అపౌరుషేయమైనటువంటి ఒక ఉదాత్తమైనటువంటి వేద ప్రమాణాన్ని విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటూ ముగించారు. లేదా ప్రారంభించారు. తత్వ విచారణ అంటే ఏమవుతున్నది? ఈ సత్యం అనేకమైనటువంటి పరిస్థితులలో తనను తానుగా నిలబెట్టుకోగలిగినటువంటి ధీమతి. ధీమంతమైనటువంటిది, శక్తిమంతమైనటువంటిది. అన్నింటినీ కదిల్చేది కానీ తాను కదలకుండా ఉండేది. ఒక్కసారి కేనోపనిషత్తును గనుక మనమేళ విచారణ చేసినట్లయితే ఉపనిషత్తుల్లో ఏం లేదు, వేదాల్లో ఏం లేదు అనేటువంటి వారికి జవాబులు అన్నీ అక్కడే ఉన్నాయి. చదవాలి. హృదయాన్ని విప్పి చదవాలి. మనస్సుని దానియందు లగ్నం చేసి చదవాలి. మనిషి తాను పొందినటువంటి ఒక వివేచన, విచక్షణ, విశ్లేషణ, విచారణ, అనుభవము, అనుభూతి, రసము వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటే ఉపనిషత్తు మనకు అర్థమవుతుంది.ఆ ఉపనిషత్ భావనా భూమికలోనే mental perception and realization of truth ఇంతే. ఏదైనా సత్యం వద అంటే అది. అంటే ఒక mind ద్వారా ఒక మనస్సు ద్వారా ఒక భావనని, ఒక ఊహని, ఒక దర్శనాన్ని, ఒక సంస్పర్శని, ఒక విమర్శను, ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని అనుభవమయం చేసుకోవాలి. అనుభవమయమైన తర్వాత అదే అనుభూతి విభూతిగా మారుతుంది. మరి ఎందుకు ఇదంతా చేయాలి? ఈ mind ని ఇంద్రియాతీతమైనటువంటి మనోభూమికలోకి ఎందుకని వెళ్ళాలి అంటే ఉన్నదంతా ఇంద్రియాలకు అతీతంగానే ఉన్నది గనుక. ఇంద్రియాలకు అతీతంగా ఏమున్నది? Realization of god కాదు realization of truth. god అంటే రమణ మహర్షి చెప్తారు "What is god?" భగవంతుడు అంటే ఏమున్నది? "It is nothing but a force and feeling within" మనలో ఉన్నటువంటి ఒక అద్భుత ఆంతరంగిక శక్తి, ఒక భావనా బలం. ఈ రెండూ కలిపితే దైవం అవుతున్నది. దైవాన్ని మించినటువంటిది సత్యం. ఎందుకంటే అన్నింటికీ ఆదిమూలమైనటువంటిది ఏది? ఆద్యంత రహితమైనటువంటిది ఏది? ఆది మధ్యాంత రహితమైనది ఏది? అనంతమైనది ఏది? అచ్యుతమైనది ఏది? అని గనుక విచారణ చేసినట్లయితే అది సత్యము అన్నటువంటి భావనలో నిలకడ చెందుతున్నది. అటువంటి సత్యమును నేను అన్న భావనలో ఉండమని చెప్తున్నది. అది సత్యం వద. అంటే మనం ప్రతిరోజూ నేను ఫలానా, నాకు ఇన్ని కీర్తులున్నాయి, నేను ఇన్ని మంచి పనులు చేశాను అని అనుకునే కంటే వాటిని చేస్తూనే మన ద్వారా అవి జరుగుతూ ఉన్నప్పుడు వాటిని సాక్షిభూతంగా చూడగలిగి, ఇదంతా నా యందు ఏదో ఒక శక్తి దానికి నేను ఆత్మ అని పేరు పెట్టుకున్నాను. అటువంటి ఆత్మ నా ద్వారా ఈ పనులు చేయిస్తున్నది అని మొ-తొలినాళ్లలో. ఆ తర్వాత నా ద్వారా ఏదో జరుగుతున్నది అనే భావనతో కొన్నాళ్ళు. ఆ పై ఏదో జరుగుతున్నది నేను ఉన్నాను అనే మరొక భావనతో కడగా ఆ జరుగుతున్నది ఏదో దాన్ని నేను చూస్తున్నాను అనే భావనతో అకర్తృత్వం doership లేకుండా గనుక ఉన్నట్లయితే అది నిజానికి సత్యం వద. నేను కేవల దేహాన్ని మాత్రమే కాదు దేహాతీతమైనటువంటి ఒక భావనా భూమిక నా యందున్నది. నా స్థితులు వేరు. అనేక అంశాలతో నేను వచ్చాను. నా యందు ఏకాదశ పుర విహారియై ఆత్మ సంచారం చేస్తున్నారు. ఇది సత్యం వద. రక్తము, ఎముకలు, మాంసము, మజ్జలతో కూడినటువంటి ఈ దేహము పతనం కాక తప్పదు. పుట్టినది ఖచ్చితంగా మరణిస్తుంది. మరణించింది అంటే మళ్ళీ అది పుడుతుంది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. భగవద్గీత చెప్పనిది ఏమున్నది. విచారణ చేయగలిగితే, ఆ కోణాన్ని తాకగలిగితే ఇది పరమ రమణీయమైనటువంటి ఒక హైందవ భావన. మిగతా ఏ మతం కూడా పునర్జన్మను గురించి మాట్లాడదు. కానీ హైందవ ధర్మం పునర్జన్మ ఉన్నది అని చెప్తుంది. ఎందుకని అంటే ఈ వర్తమానాన్ని గనుక మనం జాగ్రత్త పెట్టుకున్నట్లయితే మళ్ళీ ఒక జన్మ వస్తే ఇంతకంటే ఉత్తమమైన జన్మ కలిగి, ఆ జన్మ ద్వారా, ఆ అస్తిత్వం ద్వారా, ఆనాటి ఉనికి ద్వారా, ఆనాటి ప్రతిభ ద్వారా, ఆనాటి వ్యుత్పత్తి ద్వారా, ప్రజ్ఞ ద్వారా, ఆత్మ ప్రజ్ఞ ద్వారా ఈ ప్రపంచానికి శరీరం ఆజం ఖలు కర్మ సాధనం శరీరం ఆజం ఖలు ధర్మ సాధనం. నా శరీరాన్ని ధర్మ మార్గంలో, ధర్మాచరణలో, ధర్మబద్ధమైనటువంటి కర్మలను ఆచరించే దిశగా నేను వినియోగిస్తాను. దానికి మూలమైనటువంటి ఈ శరీరము ఆరోగ్యవంతము, ఆయుష్మంతము, ఆనందమయము కావాలి. దానికై నేను మార్గాన్వేషణ చేయాలి. దానికి ఒకటే ఒకటి నేను సత్యము అనేటువంటి భావనలో నన్ను నేను నిలబెట్టుకోవాలి. నేను నిలకడ చెందాలి. ఆ విధంగా ప్రవర్తించాలి. ఆ విధంగా జీవించాలి. సోదాహరణ ప్రాయంగా అని చెప్పగలిగితే అది నిజానికి ఆ నానానికి అటు ఇటు సత్యం వద ఒకటైతే ధర్మం చర. సత్యం ఒక భావనా భూమిక అయినట్లయితే, అది ఒక concept అయినట్లయితే ధర్మం ఏమిటి అని It is action. నా intention వేరు, నా action వేరు కాకూడదు. నా లోపల ఉన్నటువంటి ఏ భావన ఉన్నదో అది ఆచరణాత్మకమైనట్లయితే, దేనిని నేను నమ్మానో, ఏ సత్యమని నన్ను నేను భావించుకున్నానో, ఏ ఆత్మ స్వరూపుడిగా నన్ను నేను తీర్చిదిద్దుకున్నానో, ఏ రకంగా నన్ను నేను దివ్యాత్మ స్వరూపుడినని, ప్రేమాత్మ స్వరూపుడినని సంభావించుకున్నానో ఆ రకంగా గనుక నా నిత్య నైమిత్తిక జీవితంలో నేను జీవించగలిగితే, తద్వారా నా నుంచి ధర్మబద్ధమైనటువంటి అద్భుత తరంగాలు ఈ ప్రపంచానికి గనుక అందించగలిగితే అది ధర్మం చర. ఈ ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపటం కోసమే బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే భగవద్గీతలో. యోగేశ్వర కృష్ణుడు ఎన్ని జన్మలు ఎత్తావో ఇప్పటికి ఇదిగో ఈ మానవ జన్మ ఎత్తావ్. బహూనాం జన్మనాం అంతే. ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటంటున్నావ్, దేశం అంటే ఏమిటంటున్నావ్, మనిషి అంటే ఏమిటంటున్నావ్, మతం అంటే ఏమిటన్నావ్, మార్గం ఏమిటంటున్నావ్, లక్ష్య గమ్యాన్ని నిర్దేశించుకుంటున్నావ్ ఇది ఇంతకు ముందు నీకు దొరకలా. కనుక అపురూపమైనటువంటి మానవ జన్మని, ఈ అద్భుతమైనటువంటి, మానవీయమైనటువంటి భావనని పరమోదారంగా, పరమోదాత్తంగా, రమణీయంగా, గంభీరంగా, ఉదాత్తంగా, సమగ్రంగా, సమ్యక్ స్వరూపంగా, ధర్మ విగ్రహంగా దీనిని గనుక నువ్వు భావించగలిగినట్లయితే హైందవమైనటువంటి ఒక భావనకి నీవు సాకార స్వరూపుడువి అవుతావు. నీ యందు స్వార్థము, కీర్తి కాంక్ష, నీ యందు ధనాపేక్ష, ప్రాపంచికమైనటువంటి భోగముల యందు ఆసక్తి, ఆకర్షణావలయానికి లోబడేటువంటి ఒక బలహీనత ఉన్నట్లయితే నీవు హైందవుడవు కావు.వీటన్నింటినీ నీవు జయించగలిగి, వీటన్నింటినీ అధిగమించి, నీ జీవితం ద్వారా ఇవి ఎంత అద్భుతమైనటువంటి శక్తులో నీవు గనక నిరూపించగలిగినట్లయితే, ప్రభావితం చేయగలిగినట్లయితే అది సంపూర్ణమైనటువంటి హైందవత్వానికి గుర్తు. హైందవము అంటే కేవలం వేషభాష కాదది. ఒక భాష, ఒక భావం అన్నీ కూడా కలబోసుకుని వచ్చేటువంటి ఒక దివ్యమైనటువంటి ఆచరణాత్మక ఆధ్యాత్మిక యోగమే హైందవం. ఈ మార్గాన్ని మనం అనుసరించవలసినటువంటి ఒక విషయం ఉన్నది గనక ఈ సత్యము ఎట్లా ఉన్నది అంటే వాక్ స్వరూపంగా ఉన్నది. వాక్ ఎట్లా ఉన్నది? అగ్ని స్వరూపమై ఉన్నది. ఈ అగ్ని ఎక్కడ పుడుతున్నది? మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ వచ్చి అంటే కంఠస్థానం వరకు వచ్చేప్పటికి అప్పటికే జరగవలసిన యోగ ప్రక్రియలన్నీ లోపల జరిగి అంటే ఒక చిన్న భావనగా మొలకెత్తి అది ఆలోచనై, ఆ ఆలోచన నెమ్మదిగా కోరికై, ఆ కోరిక బలీయమైన కోరికై అది నెమ్మది నెమ్మదిగా ఒక ప్రబలమైనటువంటి భావంగా ఏర్పడి, ఇదంతా కొన్ని నిమిషాలలో, కొన్ని క్షణాలలో జరిగిపోయేటువంటి విషయం. మూలాధారంలో భావన మొదలు కాగానే అది యోగ ప్రక్రియకి లోపడుతుంది. ఇందాక చెప్పుకున్న అనేక చక్రాలది దాటుతూ, దాటుతూ వచ్చి విశుద్ధమైనటువంటి కంఠస్థానానికి దగ్గరకు రాగానే అది ఆవిష్కృతం కావాలి. పరా చూడవలసిన దానిని పశ్యంతి చూసి, మధ్యమా అనుభవించి, వైఖరి వాక్కుగా బయటికి వస్తున్నది. మాట రెండు పెదవుల మధ్య నుంచి వచ్చేటువంటి తాలుమాట కాదది. ఒక యోగ ప్రక్రియల నుంచి, ఒక ఆత్మానుభూతిలో నుంచి, ఒక సమర్పణా శరణాగతి వినయము అన్న భావనలో నుంచి ఈ ప్రపంచానికి నేను ఏమివ్వాలి? నా వాక్కు ద్వారా ఏమివ్వాలి? అన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని అంతరంగంగా సాగిస్తూ, సాగిస్తూ విశుద్ధ చక్రం దగ్గరకు వచ్చి ఆ భావమే భాషను సంతరించుకొని బలమైనటువంటి వాక్కుగా ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఆ వాక్కు సత్యం అవుతున్నది. అందుకనే సత్యవాక్యం బెవండుల్లంఘింపడో వాడేపో నరుడు ధన్యుండి ధరా మండలిన్ అంటారు. సత్య వాక్యాన్ని, సత్యవాక్కు అంటే ఏమిటి? ఏది సత్యమో, ఏది నిత్యమో అది నేనై ఉన్నాను అన్నటువంటి భావన. ఏది మాట్లాడినా, ఏది అనుకున్నా, ఏది తలపోసినా, ఏది తలపుకు వచ్చినా అది సత్యము నిష్టగా ఉండాలి. సత్యము రసముయన్ నిష్ఠః అనేది అలంకార శాస్త్రం. ఇక్కడ సత్యము నిష్ట కావాలి. ఈ సత్యము నిష్ట అన్నా, సత్యనిష్ఠ అన్నా, ఆత్మనిష్ఠ అన్నా ఒకటే. రమణ మహర్షి హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యః మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి పృథివిశ మనసాస్వం చిన్వతా మజ్జతావా పవన చలన రోధాత్ ఆత్మనిష్ఠో భవత్వం. నేను ఆత్మను అన్నటువంటి ఒక నిత్య స్ఫురణలో నిలకడ చెందరాదా అని ప్రబోధం. అంటే నేను ఆత్మని, నేను సత్యాన్ని, ఈ సత్యము ఇదిగో వాక్కుగా వస్తున్నది. అందుకనే మన మంగళాశాసనాలన్నీ కూడా లోకాః సమస్తాః సుఖినో భవంతు సమస్త లోకాః సుఖినో భవంతు సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై వంటి అనేకమైన శాంతి మంత్రాలతో మన మాట పూర్తి చేస్తాం. దీనికి కారణం ఏమిటి అంటే ఈ ప్రపంచాన్ని భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి మూడు స్థాయిలలో హైందవ ధర్మం, హైందవ విధానం ఏం బోధిస్తున్నది అంటే మూడు స్థాయిలలోనూ నువ్వు ఆనందాన్ని పొందవలసింది. భౌతికంగా సమృద్ధమైన సంపద సంపాదించాలి. ఆదిభౌతికంగా ఈ సంపదని ఎట్లా వినియోగించాలి అని ఆలోచించాలి. ఆధ్యాత్మికంగా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మలన్నీ ఆచరించాలి, ఫలితాన్ని ఆశించకుండా చేయటం మాత్రం కాదు ఆ కర్మ ఫలాలను కూడా మహా పరిత్యాగం చేయగలిగిన స్థాయికి వెళ్లాలని మన మంగళాశాసనాలు చెప్తూ ఉన్నాయి. వీటిని అర్థం చేసుకోగలిగినట్లయితే నిజానికి వేళ ప్రపంచంలో మహోన్నతుడు ఎవరు అనంటే ఆత్మను ఎరిగినవాడని మాత్రమే కాదు. మహాత్ముడు అంటే మనసేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనః. మనసులో ఆలోచన పుట్టింది. ఇందాక అన్నట్లుగా అది వాక్కుగా మారింది. మాట ఇచ్చాం, మాట అన్నాం. మాట తప్పకూడదు. మళ్ళీ ఆ మాటను ఆచరణాత్మకమైనది చేయాలి. దీన్ని ఆధునిక కాలంలో సత్యసాయిబాబా వారు చెప్పిందే చెయ్యి, చేయగలిగిందే చెప్పు, ఘర్షణ ఉండదు అన్నారు. ఘర్షణ మూలం ఎక్కడ అంటే చెప్పింది చేయకపోవటంలోనూ, చేయలేనిది కూడా చేయగలను అని అనుకోవటంలోనూ ఘర్షణ మొదలు. ఏది చెప్తున్నామో అది చేయాలి, ఏమి చేయగలమో అది మాత్రమే చెప్పాలి. ఈ భావన ఇవన్నీ కూడా సనాతనమైనటువంటి మాటలే. ఆనాడు సంస్కృతంలో ఉన్నాయి, తర్వాత అనేక భాషల్లోకి వచ్చినాయి. ఇవాళ ఆధునికమైనటువంటి కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ దేనిలో చెప్తే ఇది సామాన్యుడికి అర్థమవుతుందో దానిని సత్యం వద, ధర్మం చర. ధర్మాత్మకమైన నేనొక వ్యక్తిగా నాకు కొన్ని ధర్మాలున్నాయి. పాపభీతి, సంఘనీతి, దైవ ప్రీతి ఈ మూడు నాకు నియమాలు. అంటే పాపం చేస్తున్నానన్న భావన నన్ను ధర్మం వైపు నడిపిస్తుంది. అక్కడ నన్ను ధర్మం చేబట్టుకొని ఒక తల్లి ఎట్లా బిడ్డను నడిపిస్తుందో అక్కడ నువ్వు పాపం చేయటానికి వీల్లేదు. మహోన్నతమైన మానవ జన్మ ఎత్తావ్. పాపతాప శాపాలకు అతీతమైనటువంటి భావనలో పుణ్యాత్మవలె నీవు సంచారం చేయాలి. అది ధర్మం. చర అంటే, చర అంటే సంచారం. సంచారం అంటే నడక, నడక అంటే నడత, నడత అంటే శీలం, శీలం అంటే సౌభాగ్యం, సౌభాగ్యం అంటే ఉదాత్తమైనటువంటి దైవీభావన. ఒక దైవీ సంపద, ఒక దైవీ లక్షణం. ఇవన్నీ కూడా సమన్వయం చేసుకోవాలి.కనుక ఎప్పుడైతే నేను ప్రాపంచికమైనటువంటి ఒక ధర్మాన్ని ఒక సంఘాన్ని, సంఘం నా చుట్టూ ఏర్పడి ఉంది. నా ఇంట్లో నా గడప లోపల ఉన్నంతవరకు నేను వ్యక్తిని. గడప లించి దాటి ఒక అడుగు బయటకు వేయగానే సమాజంలో నేను ఒక భాగాన్ని. ఆ సమాజం ఒక ఉన్నతమైన సమున్నతమైన ఉదాత్తమైన ఉత్కృష్టమైన స్థితిలో గనుక అది నడుస్తూ ఉంటే దాని యందు నేను ప్రవేశించాలి. ఒకవేళ అది అట్లా ఉండి ఉండకపోతే దానిని ఎట్లా నడిపించాలో నన్ను నేను ఉదాత్తమైనటువంటి పరికరంగా నన్ను తయారు చేసుకోవాలి. అది ఉత్కృష్టమైనటువంటి ఉపకరణంగా గనక మనల్ని మనం define చేసుకోకపోతే redefine చేసుకోకపోతే refine గనక చేసుకోకపోతే ఒట్టి ముడికత్తితో పని జరగదు. దానికి జ్ఞానము, వేగము, ధృతి, అదృతి, వేగము, గాంభీర్యము, ఉదాత్తత, ఇవన్నీ కూడా సంతరించుకోవాలి. ఇదంతా ఎక్కడ ప్రతిఫలించాలి అంటే వాక్కు నందు ముందు ప్రతిఫలించాలి. అది మనస్సు దాకా వచ్చినప్పుడు మనస్యేకమ్ తరువాత వచస్యేకమ్ మనస్సు ఆలోచన మాట ఒకటైపోయినాయి. మరి ఇక మిగిలింది ఏమిటి అని కార్యాచరణ చేయాలి. హిందూ మేలుకో అనేటువంటి ఒక పిలుపులోనే ఒక ఉదాత్తమైనటువంటి ఒక వైప్లవ్యం ఉంది. అంటే పరిణామం ఉంది. ఒక మార్పు ఉంది. మనం నిద్ర పోతున్నాము అని అర్థం. స్తబ్ధంగా ఉన్నాము అని అర్థం. మనం చేయవలసినటువంటి మన కర్మల నుంచి మనం వైదొలిగాము అని అర్థం. ధర్మాకృతులుగా ఉండవలసినటువంటి మనం కేవలం వినోదాన్ని చూస్తున్నట్లుగా సాక్షిభూతులుగా గనక ఉన్నట్లయితే ఈ మౌనం నిరర్థక మౌనం. దీనిని పరుషన్-పారుష్యం లేకుండా పూర్ణత్వాన్ని సంతరించుకొని సత్వగుణ ప్రధాన సంపన్నమైనటువంటి భావనా భూమికలో ఒక వ్యక్తిగా ఒక సమాజాన్ని నేను నడిపించగలిగిన స్థాయికి లేదా అద్భుతంగా నడుస్తున్నటువంటి సమాజానికి నేను బలాన్ని శక్తిని ఒక ధీర గంభీర స్థితిని ఇవ్వగలిగినట్లయితే అప్పుడు నా జన్మ సార్థకమవుతుంది గనుక హిందువుని మేలుకొలపవలసినటువంటి వాడు ఈ పిలుపుని ఇచ్చేటువంటి వాడు తాను ముందు మేల్కొని ఉండాలి. తాను మేల్కోకుండా అందరినీ మేల్కొలపలేడు. ఎందుకంటే ఈ ప్రపంచం యద్యదాచరతి శ్రేష్ఠః ఎవడు ఆచరణలో పరమోన్నతమైనటువంటి స్థాయిలో ఆచరిస్తూ ఉన్నాడో అటువంటి వాడిని మాత్రమే ఈ ప్రపంచం అంగీకరించి వాడి వెనుక నడుస్తుంది. మళ్ళీ ఇది కృష్ణ పరమాత్మ చెప్పిందే. దీనికి మూలం భగవద్గీతే. కాబట్టి ప్రమాణమైనటువంటి ప్రాజ్ఞులైనటువంటి వారు విశేషమైనటువంటి భావనా స్థితి కలిగిన వారు ఎవరైతే నడుస్తూ ఉంటారో, ఎవరు కర్మిష్టులై ఉంటారో, ఎవరు ఆత్మనిష్టోప-వుతులై ఉంటారో, ఎవరు జ్ఞాననిష్ఠలో కూరుకొని ఉంటారో, ఎవరు జ్ఞాన స్వరూపమై వెలుగొందుతూ ఉంటారో అటువంటి వారిని ఈ సమాజం అనుసరిస్తుంది అనేటువంటి ఈ భావనను గనక మనం గమనించినట్లయితే సత్యం వద ధర్మం చర లో ఒక ప్రమాణం ఉన్నది. సర్వ తీర్థాలలో చేసేటువంటి వేలాది పుణ్యస్నానాల కంటే సత్యాన్వేషణ గనక ప్రారంభం చేసి సత్యాన్ని అర్థం చేసుకొని ఉన్నదంతా సత్యమేనని ఉన్నదంతా బ్రహ్మమేనని పరా అపరా ప్రకృతిలు ఇవన్నీ కూడా మనం ఎకడమిక్ గా మాట్లాడుకునే విషయాలేనని కానీ నిజానికి ఉన్నది ఒక్కటే అది అఖండము, అది అచ్యుతము, అది అనర్ఘము, అది చిద్ఘనము, అది పూర్ణము, అది ధవళము, తరళము, సరళము అనేటువంటి ఒక భావన మన మనసులో నెలకొలిపించగలిగినట్లయితే అది సత్యం వదై ధర్మం చర ఐ మనందరినీ కూడా నిత్యమూ ఆత్మ ఆ స్వరూపులుగా మనల్ని భావించుకొని ధర్మాశక్తులుగా ధర్మాచరణ యందు ఆసక్తి కలిగిన వారులుగా ఒక హైందవమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఒక జాతి నిర్మాణం జరుగుతుందని భావన చేస్తూ ఓ హిందూ మేలుకో అన్నది కేవలం ఒక స్లోగన్ కా కాకుండా ఒక ప్రచార భాష కాకుండా ఒక ప్రసార వాఙ్మయంగా రూపుదిద్దుకోవటానికి ప్రతి వ్యక్తి తన వంతు కృషి తాను చేయాలి.
YouTube · audio
ిందువులు ఇలా మాత్రం ఉండకండి | ఓ హిందూ మేలుకో | Sreepeetam
ిందువులు ఇలా మాత్రం ఉండకండి | ఓ హిందూ మేలుకో | Sreepeetam
Source: Sreepeetam on YouTube
0:00 / 22:41
More in this series